సాకర్ సమరంలో ఆతిథ్య జట్టు రష్యా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లుజ్నికి స్టేడియంలో గురువారం సౌదీ అరేబియాతో జరిగిన పోరులో అద్భుత రీతిలో ఆడిన ఆతిథ్య జట్టు 5–0 తేడాతో జయభేరి మోగించింది. ఈ ఆరంభోత్సవానికి హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇవాంటినోతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించారు. వీఐపీ గ్యాలరీ నుంచి మ్యాచ్ తిలకించిన వీరి సంభాషణపై ప్రస్తుతం నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు.