లాస్ ఏంజిల్స్ : రైల్వే ట్రాక్ దాటుతున్న కారును రైలు వేగంగా వచ్చి ఈడ్చుకెళ్లిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో కారును రైలు ఈడ్చుకెళ్లిన దృశ్యం చూస్తే ఎవరికైనా భయం కలగాల్సిందే... అయితే ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయినా డ్రైవర్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడటం విశేషం. ఈ ఘటన లాస్ ఏంజిల్స్‌లో చోటుచేసుకుంది. కాగా ఈ సన్నివేశం మొత్తం అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్ వద్ద గేటు లేకపోతే జరిగే ప్రమాదం ఎలా ఉంటుందనడానికి ఇదే ఉదాహరణ. దీనిని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తమ అధికారిక ట్విటర్‌లో షేర్ చేశారు.