Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Metro Train In Hyderabad Charges Increased1
Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్‌..!

హైదరాబాద్‌: ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో షాకిచ్చింది. మెట్రో ట్రైన్‌ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర రూ. 10 నుంచి రూ. 12కు పెంచగా, గరిష్ట ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. తాజాగా పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎల్‌ అండ్‌ టీ స్సష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..ప్రస్తుతం కనిష్ట ధర ₹10.. గరిష్ట ధర 60 రూపాయలురెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలునాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం

Drone Footage Shows Terrorists Hiding In Shed2
డ్రోన్ ఫుటేజ్.. ఉగ్రవాదుల్ని ఎంత క్లియర్‌గా రికార్డు చేసిందో..!

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మరో ఉగ్రదాడికి విఫలయత్నం జరిగింది. రెండు రోజుల క్రితం పలువురు ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లో మరో కిరాతకానికి పాల్పడే ప్రయత్నంలో దాన్ని మన నిఘా వర్గాలు పసిగట్టి వారిని హతమార్చాయి. మంగళవారం జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు.. మన భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. వారిని ల‌ష్క‌రే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.జమ్మూ కశ్మీర్ లోని అవంతిపోరాలో ఉగ్రవాదులు తమ పన్నాగానికి సిద్ధమైన సమయంలో దాన్ని భారత భద్రతా బలగాలు తిప్పికొట్టి వారిపై కాల్పులు జరిపి హతమార్చాయి. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదిగా భావించినా దానిపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంచితే, ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ డ్రోన్ ఫుటేజ్ ఒకటి బయటకొచ్చింది.तो ऐसे अपने वीर जवानों ने आतंकी को जहन्नुम पहुंचाया ।#TralEncounter pic.twitter.com/FCkDRqeYe3— Manish Yadav (@itsmanish80) May 15, 2025ఒక కాంక్రీట్ పిల్లర్ కింద ఉగ్రవాదులు తమ రైఫిల్స్ ను సరిచేసుకుంటున్న సమయంలో డ్రోన్ దానిని రికార్డు చేసింది. మరొక వీడియోలో విరిగిన షెడ్ లో గుమిగూడి ఉన్న మరి కొందరు కనిపించారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక గడిచిన రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులు.. భారత బలగాల చేతిలో హతమయ్యారు.అయితే వీరంతా పోలీసులు, సైన్యం సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్ తర్వాత తప్పించుకునే క్రమంలో ఓ ఇంట్లో ఆశ్రయం పొంది ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇలా 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు బయటకొచ్చి భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు.

Bengaluru Techie Exposes Wife Secret Marriage via Zoom Call, Wins in Court3
జూమ్‌ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం

సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్‌ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్‌ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్‌ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది.

Operation Sindoor: Kommineni Analysis Of Manoj Naravane Comments4
మిలటరీ చేతలకు.. నేతల మాటలకు పొంతనేది?

యుద్ధమంటే బాలీవుడ్‌ సినిమా కాదు.. సరదా అంతకంటే కాదు. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ మనోజ్‌ నరవణే చేసిన అర్థవంతమైన వ్యాఖ్య ఇది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. యుద్ధం ఎల్లప్పుడు ఆఖరి ఆస్త్రం మాత్రమే కావాలని అన్నారు. అయితే.. ఇక విశ్రాంత మిలటరీ అధికారిగా ఆయన వ్యాఖ్యలకు ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నేతల మాటలకు మధ్య తేడా ఉండటమే సమస్య అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో పాక్‌కు గట్టి హెచ్చరికలే చేసినప్పటికీ వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు మాత్రం బదులిచ్చినట్లు కనిపించదు.👉ఆపరేషన్‌ సింధూర్‌ను హఠాత్తుగా ఎందుకు ఆపేశారు అన్నది వీటిల్లో ఒకటి. మిలటరీ అధికారుల స్థాయిలో పాక్‌ శరణు కోరినంత మాత్రాన అంగీకరించడం సబబేనా అన్నది కొందరి అనుమానం. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారం జరగాల్సిందేనని దేశ ప్రజలు వాంఛించిన మాట వాస్తవం. అలాగే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం సాగించిన అపరేషన్‌ సింధూర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిసింది. కానీ యుద్ధం ఆకస్మిక నిలిపివేత.. పహల్గామ్‌ దాడికి దారితీసిన నిఘా వైఫల్యాల వంటివి మాత్రం ప్రశ్నలుగా మిగిలిపోయాయి.👉కశ్మీర్‌లో కాల్పులు కొత్త కాకపోవచ్చు. పాక్‌ సైన్యం జరిపే కవ్వింపు కాల్పులు, చొరబాట్ల కోసం ఉగ్రవాదులు అప్పుడప్పుడూ భారత సైన్యంపైకి కాల్పులు జరుపుతూనే ఉంటారు. అయితే పహల్గామ్‌ మాత్రం రాక్షస కృత్యం. అమాయకులైన టూరిస్టులను, అది కూడా పేర్లు అడిగి మరీ హిందువులను హత్య చేయడంపై దేశం యావత్తు ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను ఆకస్మికంగా విరమించుకుని వెనక్కు రావడం, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడం వరకూ బాగానే ఉంది. కానీ.. ఆ వెంటనే బీహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం మాత్రం చాలామందికి ముఖ్యంగా ప్రతిపక్షాలకు రుచించలేదు. అయినా సరే.. పాక్‌పై మోడీ తీసుకునే చర్యలకు మద్దతిస్తామని స్పష్టం చేశాయి.👉ఈ తరుణంలో మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పిమ్మట భారత సైన్యం ఉగ్ర శిబిరాలను విజయవంతగా ధ్వంసం చేసి వచ్చింది. సుమారు వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులలో కాల్పులకు, ఇతరత్రా దాడులకు పాల్పడడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. అంతేకాక రావల్పిండి, తదితర పాక్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. నిజానికి భారత్ సైనిక శక్తి ముందు పాక్ ఎందుకు కొరగాదన్నది వాస్తవం. ఈ సమయంలో కేంద్రంలోని పెద్దలు కాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కాని యుద్దం చేయబోతున్న సంకేతాలు ఇచ్చారు. మనం తలచుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం కష్టం కాదని, అసలు పాక్ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని ప్రకటనలు చేశారు.👉వీటి ఆధారంగా చాలా మంది యుద్దం ఆరంభమైనట్లే భావించారు. సాంకేతికంగా భారత్ యుద్ధ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇకపై పాక్ నుంచి ఎలాంటి చికాకు ఎదురుకాకుండా పీఓకే మన ఆధీనంలోకి వస్తుందని భావించారు. పాక్ నాలుగుగా చీలిపోయే అవకాశం ఉందని కొంతమంది జోస్యం కూడా చెప్పారు. కానీ అలా జరగలేదు. కానీ ఆకస్మాత్తుగా పాక్ మిలటరీ శరణు కోరడంతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించామని మోదీ చెప్పడంతో అప్పటివరకూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు, జరిగిన పరిణామాలకు మధ్య తేడా రావడంతో కేంద్రంపై విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణతో మోదీ ప్రభుత్వం సాధించంది ఏమిటి? అని విపక్షాలు ప్రశ్నించాయి.👉ఈ లోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలు పెట్టి ఇదంతా తన ఘనత అని చెప్పుకోవడం మరింత చికాకైంది. దానిని విదేశాంగ శాఖ ఖండించినప్పటికీ, ప్రధాని బహుశా దౌత్యనీతి లేదా మరే కారణం వల్లనో తన ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయలేదు. కశ్మీర్ విషయంలో మూడో పక్ష రాయబారానికి అంగీకరించబోమని భారత్ చెబుతుండగా, ట్రంప్ తాను మధ్యవర్తిత్వం చేస్తానని అనడం బాగోలేదు. అంతేకాక, అమెరికా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి భారత్, పాక్‌లను ఒకే దృష్టితో చూడడం ఆశ్చర్యపరిచింది. భారత్ విదేశాంగ విధానంలో ఏమైనా లోపం ఉందా అన్న ప్రశ్నకు తావిచ్చింది. మరో వైపు పాకిస్తాన్ పహల్గామ్‌ దుశ్చర్యతో తమకు సంబంధం లేదని అబద్ధాలు చెప్పింది.👉ఆ ఉగ్ర ముష్కరులను భారత భద్రత దళాలు పట్టుకుని, వారి మూలాలు అన్నిటిని చెప్పగలిగి ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరై ఉండేది. వారికి పరోక్ష మద్దతు ఇస్తున్న చైనా కూడా బహిరంగంగా పాక్‌ను తప్పు పట్టవలసి వచ్చేది. అయితే పాకిస్తాన్ భారతదేశం వద్ద ఉన్న ఎస్.4 సుదర్శన రక్షణ కవచాన్ని ఏమీ చేయలేక పోయిందన్న విషయాన్ని మోదీ అన్ని దేశాలకు తెలిసేలా అదంపూర్ వెళ్లి ఆ బేస్ నుంచి ప్రసంగించడం బాగుందని చెప్పాలి. అలాగే భారత్‌కు ఉన్న స్వదేశీ పరిజ్ఞాన ఆయుధ సంపత్తి శక్తి సామర్థ్యాలు కూడా దేశ ప్రతిష్టను పెంచాయి. అయినప్పటికీ యుద్దం ఎందుకు ఆగిందన్నది సగటు భారతీయుడికి ఎదురయ్యే ప్రశ్న.👉దానికే మాజీ ఆర్మీ ఛీప్ నరవణే ఇచ్చిన ప్రకటన అర్థవంతమైన జవాబు అవుతుంది. యుద్ధం అంటే సినిమా కాదు..అది చివరి అస్త్రం కావాలన్న ఆయన మాటలు అక్షర సత్యం. పాక్‌కు భారీ నష్టం జరిగినా, మనకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. భారత సైన్యం సాధించిన విజయానికి సెల్యూట్ చేద్దాం. యుద్ధం జరగాలని కోరుకునేవారు కొంత అసంతృప్తికి గురై ఉండవచ్చు.. మిలటరీ ఆపరేషన్స్ వరకు ప్రామాణికంగా తీసుకుంటే భారత్ గొప్ప విజయం సాదించిందని ఒక రిటైర్డ్ మేజర్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పార్టీలు భావోద్వేగ అంశాలపై బాధ్యతతో మాట్లాడకపోతే అవి ఆత్మరక్షణలో పడతాయని కూడా ఈ అనుభవం తెలుపుతోందని అనుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Ap Ecet 2025 Results Release5
AP ECET 2025: ఏపీ ఈసెట్‌ ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి.. sakshieducation.com ద్వారా ఫలితాలను పొందవచ్చు.ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా మరియు బీఎస్సీ (గణిత శాస్త్రం) విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి BE / BTech / B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరంలో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు, త్వరలో ప్రారంభమయ్యే AP ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తగిన సీట్లను పొందవచ్చు.మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.AP ECET Results Direct Linkక్లిక్‌👉 ఏపీ ఈసెట్‌ రిజల్ట్‌

Lord Chitragupta significane and importance temple in Hyderabad6
పాప ప్రక్షాళన కోసం.. అద్భుతమైన ఆలయం

పురాణ పరిచయం పెద్దగా లేని ఈ యువతరంలో కూడా చలనచిత్రాల పుణ్యమా అని బాగా తెలిసిన ΄ పౌరాణిక పాత్ర చిత్రగుప్తుడు. యముడికి ధర్మనిర్వహణలో సహాయకుడిగా, భూలోకవాసుల మరణానంతరం వారి పాప పుణ్యాలకు పద్దులు రాసే వ్యక్తిగా చిత్రగుప్తుడు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించిన కథనం మీ కోసం.ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి. ఇలా వెళ్లిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు. ఎందుకంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగా నిర్ణయించలేక పోయేవాడు. దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు సృష్టికర్త అయిన అయిన బ్రహ్మకు విన్నవించాడు. సమస్య పరిష్కారం కోసం బ్రహ్మ యోగనిద్రలోకి వెళ్లాడు. కళ్లుతెరిచిన తర్వాత ఆయనకు ఎదురుగా ఓ ఆజానుబాహుడు కనిపించాడు. చేతిలో పుస్తకం, ఘటం ( కలం), నడుముకు కత్తి ఉన్నాయి. తర్వాత తన దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకొంటాడు. ఆ వ్యక్తి తన చిత్తం (శరీరం)లో గుప్తంగా (గుప్తంగా) నివాసమున్నవాడని అర్థమవుతుంది. అతనికి చిత్రగుప్తుడని పేరుపెడతాడు. అటుపై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకొంటూ ఉంటావు.ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్ములకు శిక్షలు పడేవిధంగా సహాయపడతావు. అదేవిధంగా ఏక కాలంలో కొన్ని కోట్ల రూ΄ాలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుందని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు. అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయపడటానికి కొంతమంది సహాయకులుగా కూడా ఉంటారు. వారిలో బ్రహ్మమానసపుత్రులైన శ్రవణులు. శ్రవణులు ఈ భూలోకం పైనే కాకుండాపాతాళ, మత్స్య, స్వర్గ లోకాల్లో కూడా వివహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియ జేస్తూ ఉంటారు. అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణం చెబుతోంది.చిత్రగుప్తుడికి కూడా గుడులున్నాయంటే ఆశ్చర్యమే. మనదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ, తమిళనాడులోని కంచిలోనూ చిత్రగుప్తుడికి గుడులు ఉన్నాయి. తెలంగాణలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్‌ పాతబస్తీ కందికల్‌ గేట్‌ ప్రాంతంలో ఉంది.చిత్రగుప్తుని సంస్కృతంలో కాయస్త్‌ అంటారు. చిత్రగుప్తుడు హిందువులలోని కాయస్త్‌ కులానికి చెందినవాడిగా అందరూ భావిస్తుంటారు. కాయస్తుల కులదైవం కూడా చిత్రగుప్తుడే. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు ΄ పొందదడానికి చిత్రగుప్తుడిని పూజిస్తారు. చిత్రగుప్తుడి పూజలో ఉపయోగించే వస్తువులు కలం, కాగితం, సిరా, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చక్కెర, గంధం చెక్క. ఆవాలు, నువ్వులు, తమల పాకులు. హైదరాబాద్‌లోని చిత్రగుప్తుని ఆలయంలో దీపావళి రెండో రోజు ఘనంగా ఉత్సవం జరుగుతుంది. మామూలు రోజుల్లో పెద్దగా పూజలు జరగవు. దీపావళి రెండో రోజు యమద్వితీయ సందర్భంగా, ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టినరోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది. ఆయనకు విశేషపూజలను చేస్తారు. దీన్నే భాయ్‌ దూజ్‌ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం ఇక్కడ అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్ళి, సంతానం ఇలా అనేక సమస్యలకు పరిష్కారం కోసం భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. కేతుగ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు చేస్తారు. స్త్రీల వ్రతాలలో చిత్రగుప్తుడి నోము కూడా ఉంది. (నిద్ర.. గురక.. గుండెపోటు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?)మనుషుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మనకు తెలిసిందే. యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్కగట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించేది చిత్రగుప్తుడు. మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకుపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరనుకుంటారు, కానీ మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేసేది చిత్రగుప్తుడేనని గరుడ పురాణం చెబుతుంది. (Gayatri Mantra : విశిష్టత ఏంటి? తెలుసుకుందాం!)

Tamil Nadu GDP is Now Greater Than The GDP of Pakistan7
ఇదీ పాకిస్తాన్‌ పరిస్థితి..!

పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను చూసి.. ప్రపంచ దేశాలే జాలిపడుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర వంటి భారతీయ రాష్ట్రాల కంటే ముందున్న దాయాది దేశం (పాకిస్తాన్) ఆర్థిక స్థితి గత రెండు దశాబ్దాలుగా గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. తమిళనాడు జీడీపీ ఇప్పుడు పాకిస్తాన్ జీడీపీని దాటేసినట్లు కొత్త డేటా ద్వారా తెలుస్తోంది.పాకిస్తాన్ జీడీపీ కంటే తమిళనాడు జీడీపీ ఇప్పుడు ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ జనాభా తమిళనాడు జనాభా కంటే మూడు రెట్లు ఎక్కువ. అంతే కాకుండా తమిళనాడులోని ఒక వ్యక్తి సంపాదన.. పాకిస్థాన్‌లోని ఒక వ్యక్తి సంపాదన కంటే మూడు రెట్లు ఎక్కువ. ఉగ్రవాదాన్ని, కాశ్మీర్ వివాదాన్ని మానుకుని.. ఆర్ధిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య వంటి వాటిపై ద్రుష్టి పెట్టాలి. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలి. అప్పడే మీ దేశం బాగుపడుతుందని నౌక్రీ.కామ్ ఫౌండర్ సంజీవ్ బిఖ్‌చందానీ వెల్లడించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. 1995లో తమిళనాడు జీడీపీ 15.7 బిలియన్ డాలర్ల వద్ద, పాకిస్తాన్ జీడీపీ 57.9 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. కాగా 2025 నాటివి తమిళనాడు జీడీపీ 419.5 బిలియన్ డాలర్లు (రూ. 35.8 లక్షల కోట్లు) కాగా.. పాకిస్తాన్ జీడీపీ 397.5 బిలియన్ డాలర్లు (రూ. 33.9 లక్షల కోట్లు).ఇదీ చదవండి: అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలుసోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు తమ గర్వాన్ని చాటుకుంటూ.. పాకిస్థాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు అని యూజర్ వెల్లడించగా.. ఒక్క కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్ సమస్య తీరితే.. ఆ ప్రాంతం ఒక్కటే పాకిస్తాన్ జీడీపీ దాటేస్తుందని మరో యూజర్ అన్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఎప్పుడో పాకిస్తాన్ జీడీపీని దాటేశాయని ఇంకో యూజర్ అన్నారు.TN GDP is now greater than the GDP of Pakistan. And the population of Pakistan is more than thrice that of Tamil Nadu. In other words the average resident of TN is more than 3X better off than the average resident of Pakistan. To the govt and military of Pakistan - focus on… https://t.co/2AbOw3LAE1— Sanjeev Bikhchandani (@sbikh) May 15, 2025

ICC Announces Record-Breaking Prize Money For WTC Finalists8
డ‌బ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేత‌కు ఎన్ని కోట్లంటే?

వ‌రల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2023-25 ఫైన‌ల్‌కు స‌మ‌యం అస‌న్న‌మ‌వుతోంది. జూన్ 11 నుంచి 15 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న తుది పోరులో ద‌క్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ క్ర‌మంలో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ప్రైజ్ మ‌నీని అంత‌ర్జాతీయ కౌన్సిల్ గురువారం ప్ర‌క‌టించింది. గ‌త రెండు ఎడిష‌న్‌ల‌తో పోలిస్తే.. ప్రైజ్ మ‌నీనీ ఈసారి రెండింత‌లు ఐసీసీ పెంచింది.ఈ మెగా మ్యాచ్‌లో విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు 3.6 మిలియ‌న్ల డాల‌ర్లు( భార‌త కరెన్సీలో సుమారు రూ. 31 కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌నున్న‌ది. అదేవిధంగా ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జ‌ట్టుకు 2.1 మిలియ‌న్ల డాల‌ర్ల ( సుమారు రూ. 18 కోట్లు) న‌గ‌దు బ‌హుమ‌తి ల‌భించ‌నుంది. కాగా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ 2021-23 ఫైన‌ల్లో భార‌త జ‌ట్టుపై గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియ‌న్ల డాల‌ర్ల (రూ. 13.68 కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. అలాగే ర‌న్న‌ర‌ప్ టీమిండియాకు 8 ల‌క్ష‌ల డాల‌ర్లు (రూ. 6.84 కోట్లు) ఇచ్చారు. అయితే టెస్టు క్రికెట్‌కు ప్రాముఖ్య‌త‌ను మ‌రింత పెంచేందుకు ప్రైజ్‌మ‌నీని డబుల్ చేసిన‌ట్లు ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అదేవిధంగా డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో భాగ‌మైన ఇత‌ర జ‌ట్ల‌కు కూడా న‌గ‌దు బ‌హుమ‌తి ల‌భించ‌నుంది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న భారత్‌కు 1.44 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12 కోట్లు), నాల్గవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 1.2 మిలియన్ డాలర్లు ప్రైజ్‌మ‌నీ అంద‌నుంది. ఇక డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో ద‌క్షిణాఫ్రికా 69.44 శాతం పాయింట్ల‌తో అగ్ర‌స్ధానంలో నిలిచింది. ఆ త‌ర్వాత డిఫెండింగ్ చాంపియ‌న్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్ల‌తో రెండో స్థానంలో నిల‌వ‌గా.. 50.00 పాయింట్ల‌తో ఇండియా మూడ‌వ స్థానంతో స‌రిపెట్టుకుంది. బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భార‌త్ ఓట‌మి పాల‌వ్వ‌డంతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మ్యాట్‌ కునెమన్, మార్నస్ లబుషేన్‌, నాథన్ లైయన్‌, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డగెట్డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ద‌క్షిణాఫ్రికా జట్టు: టెంబా బ‌వుమా (కెప్టెన్‌), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో యన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనురన్ ముత్తుసామీ, డేన్ పాటర్సన్చదవండి: IPL 2025: హ్యాండ్ ఇచ్చిన జోస్ బ‌ట్ల‌ర్‌.. గుజ‌రాత్ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర వీరుడు?

Kollywood Actor Ravi Mohan Responds On wife Aarti claims On him9
'పంజరం నుంచి బయటపడ్డా'.., భార్య ఆర్తికి జయం రవి కౌంటర్

కోలీవుడ్ స్టార్‌ హీరో జయం రవి పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల పంచాయితీ కోర్టులో ఉంది. అయితే జయం రవి కుటుంబానికి దూరంగా సింగిల్‌గానే ఉంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో జయం రవి సందడి చేశారు. అదే పెళ్లికి ఆయన గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా కూడా హాజరైంది. దీంతో మరోసారి వీరిద్దరి పంచాయతీ హాట్‌టాపిక్‌గా మారింది. ఇది చూసిన జయం రవి భార్య ఓ రేంజ్‌లో విమర్శలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని.. పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. దీనిపై తాజాగా నటుడు జయం రవి స్పందించారు. దీనిపై దాదాపు నాలుగు పేజీల లేఖ రిలీజ్ చేశాడు. భార్య ఆర్తిని వేధించానన్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మౌనంగా ఉండడం తన మనుగడ కోసం ఒక వ్యూహమని పేర్కొన్నాడు.రవి తన లేఖలో రాస్తూ.. "నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అనుమతించను. ఇదేం ఆట కాదు.. నా జీవితం. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. సరైన సమయంలో సత్యం గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంలో నేను గౌరవంగా ముందుకు వెళ్తా. ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్లు అనిపించింది. చివరకు బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్నా. నేను శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపుల నుంచి బయటపడ్డాను. గతంలో నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయా. అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. కానీ చివరికీ దూరంగా వెళ్లాలనేది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా బరువైన హృదయంతోనే ఇది రాస్తున్నా" అని ప్రస్తావించారు.(ఇది చదవండి: కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్)జయం రవి లేఖలో రాస్తూ..' నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. ఇలాంటి కల్పిత వాదనలను నేను ఖండిస్తున్నా. నేను ఎప్పటిలాగే నా మాటపై నిలబడతా. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. ఆర్తి తన పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకుంటోంది. ఆర్థిక లాభం కోసం, ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి నా పిల్లలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం చాలా బాధగా ఉంది. అయితే మేము విడిపోయినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా పిల్లలకు నన్ను దూరం చేసింది. ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఏకంగా ఛాతిలో కత్తితో పొడిచినందుకు సంతోషంగా ఉంది. నా నుంచి ఇదే మొదటిది.. చివరిదీ కూడా. ప్రేమతో జీవించండి.. జయం రవిని జీవించనివ్వండి' అని వివరించారు.కాగా.. జయం రవి గతేడాది సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఆర్తితో తన బంధానికి ముగింపు పలకనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ‍అయితే ఆ తర్వాత తన అనుమతి లేకుండా ఎలా ప్రకటిస్తారని ఆర్తి ఖండించింది. తాజాగా సింగర్‌ కెనిషాతో రవి రిలేషన్‌ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కోలీవుడ్‌లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan)

President Droupadi Murmu Sensational Question to supreme court10
రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ ఏంటి?.. సంచలనంగా ద్రౌపది ముర్ము ప్రశ్నలు!

ఢిల్లీ: ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో, రాష్ట్ర బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించడంపై తాజాగా ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) స్పందించారు.ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్‌ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు పశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 గవర్నర్ అధికారాలను, బిల్లులకు ఆమోదం తెలపడం లేదా నిలిపివేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడం వంటి విధానాలను వివరిస్తుందని రాష్ట్రపతి హైలైట్ చేశారు. అయితే, ఈ రాజ్యాంగ ఎంపికలను ఉపయోగించుకోవడానికి గవర్నర్‌కు ఎలాంటి గడువును ఆర్టికల్ 200లో పేర్కొనలేదని అన్నారు.సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలివే..రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు నిర్దేశిస్తాయా?.రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి?.రాజ్యాంగంలోని 361వ అధికరణం, 200వ అధికరణం కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా?రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ వినియోగం న్యాయ సమ్మతమైనదా?రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?.సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?.ఆర్టికల్‌ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?.రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్, రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా? అని ప్రశ్నించారు. Big showdown brews between Rashtrapati Bhavan & Supreme CourtPresident Droupadi Murmu invokes Article 143, seeking clarity on SC's ruling that set deadlines for Tamil Nadu Governor RN Ravi to act on bills—without Centre's nod. CJI Gavai to form a Constitution BenchKey… pic.twitter.com/1DShRAn21P— Nabila Jamal (@nabilajamal_) May 15, 2025సుప్రీంకోర్టు తీర్పు ఇదే..తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్‌ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి!. ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. తమిళనాడుకు చెందిన 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్‌ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్‌ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్‌ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్‌ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్‌ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్‌ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్‌ వర్సిటీ, వైస్‌ చాన్స్‌లర్ల బిల్లులు తదితరాలున్నాయి.రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్‌ ఆమోదం పొందాలి. గవర్నర్‌ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్‌ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్‌ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్‌ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది.దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్‌ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్‌ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్‌ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్‌ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్‌ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement