Top Stories
ప్రధాన వార్తలు

హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో ఏదో ఒక బటన్ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్ అన్నారు.

లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. స్పీకర్ హెచ్చరిక
Waqf Bill In Lok sabha Updates..మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు: గౌరవ్ గొగొయ్దేశ ప్రజల్లోని సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నమిదిరాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని నియమాలను సృష్టించుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉందిదానిని పూర్తిగా తొలగించాలని చూస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ#WATCH | Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi, speaks on the Waqf Amendment Bill He says, "Did the Minority Affairs Ministry make this bill, or did some other department make it? Where did this Bill come from?... Today, the condition of minorities in the country… pic.twitter.com/QJPNnwcpyI— ANI (@ANI) April 2, 2025 వక్ప్ భూములపై కిరణ్ రిజుజు కీలక వ్యాఖ్యలు..వక్ఫ్ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరిస్తున్న కిరణ్ రిజుజుఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఇది తెలుసుకోవాలి.మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదు.వక్ఫ్ చట్టం లోపాలతో అనేక ఉల్లంఘనలకు అవకాశం ఏర్పడింది.పార్లమెంట్ భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్ బోర్డు అన్నది.వక్ప్ వాదనను ప్రధాని మోదీ అడ్డుకున్నారు.యూపీఏ అధికారంలో ఉండి ఉంటే ఢిల్లీలో 23 కీలక స్థలాలు వక్ఫ్ సొంతం అయ్యేవి.123 విలువైన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ వక్ఫ్‌కు కట్టబెట్టింది.2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌కు ఆస్తులు కట్టబెట్టారు.దేశంలో మూడో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ దగ్గర ఉంది.భారతీయ రైల్వే దగ్గర అత్యధికంగా ల్యాండ్ ఉంది.ఆ భూమిని భారతీయులుంతా వినియోగించుకుంటున్నారు.రెండో స్థానం రక్షణ శాఖ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది.మూడో స్థానంలో ఉన్న వక్ఫ్ భూములను భారతీయులంతా వినియోగించుకోలేరు.ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది.మసీదుల నిర్వహణపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు.కిరణ్ రిజుజు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం.కేంద్రమంత్రి మాట్లాడేటప్పుడు అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను హెచ్చరించిన స్పీకర్ ఓం బిర్లా..#WATCH | After introducing the Waqf Amendment Bill in Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says "A case ongoing since 1970 in Delhi involved several properties, including the CGO Complex and the Parliament building. The Delhi Waqf Board had claimed these as Waqf… pic.twitter.com/qVXtDo2gK7— ANI (@ANI) April 2, 2025 అమిత్ షా కామెంట్స్..జేపీసీ నివేదికలో ఇచ్చిన సవరణలతో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టాం.జేపీసీ వేయాలని కాంగ్రెస్ సహా విఫక్షాలు కోరాయి.విపక్షాల డిమాండ్ మేరకే జేపీసీ వేశాం.ప్రభుత్వం తెచ్చిన బిల్లులో జేపీసీ సవరణలు సూచించింది.మేము కాంగ్రెస్ లాగా జేపీసీ సవరణలను పట్టించుకోకువడా బిల్లును యథాతథంగా తీసుకురాలేదు. #WATCH | Waqf (Amendment) Bill taken up for consideration and passing in Lok SabhaUnion Home Minister Amit Shah says, "...It was your (opposition) insistence that a Joint Parliamentary Committee should be formed. We do not have a committee like the Congress. We have a… pic.twitter.com/bbKRTuheft— ANI (@ANI) April 2, 2025 కిరణ్ రిజుజు కామెంట్స్..ఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.అన్ని వర్గాల సలహాలను తీసుకున్నాం.మైనార్టీల్లో అనవసర భయాలను సృష్టిస్తున్నారు.బిల్లుపై విస్తృత చర్చ జరిపాం.గతేడాది వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.జేపీసీ నివేదిక తర్వాత వక్ఫ్ బిల్లులో సవరణలు చేసిన ప్రభుత్వం లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో ప్రారంభమైన చర్చలోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజుచర్చ అనంతరం ఓటింగ్ చేపట్టే అవకాశం #WATCH | Parliamentary Affairs Minister Kiren Rijiju introduces Waqf Amendment Bill in Lok Sabha. pic.twitter.com/BukG8RSqBT— ANI (@ANI) April 2, 2025వక్ఫ్ బిల్లుకు ఢిల్లీ మహిళల మద్దతు..ఢిల్లీలో పలువురు ముస్లిం మహిళలు బయటకు వచ్చి బీజేపీకి మద్దతు.వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ ప్రకటన.మోదీకి మద్దతు తెలుపుతూ ఫ్లకార్డుల ప్రదర్శన #WATCH | Women in Delhi come out in support of Waqf (Amendment) Bill to be presented today in Lok Sabha https://t.co/Eo2X9nBo9s pic.twitter.com/HGWKHnRwLD— ANI (@ANI) April 2, 2025కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కామెంట్స్..కొంతమంది మత పెద్దలు సహా కొందరు నాయకులు అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారు. అలాంటి కొందరు వ్యక్తులే సీఏఏ.. ముస్లింల పౌరసత్వ హోదాను తొలగిస్తుందని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు అవసరమని వ్యక్తిగతంగా చెబుతున్నారు. కానీ, వారి ఓటు బ్యాంకు కోసం దానిని వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha today Union Minister of Minority Affairs, Kiren Rijiju says, "Union Minority Affairs Minister Kiren Rijiju says, "Some leaders, including some religious leaders, are misleading innocent Muslims... The same… pic.twitter.com/EfzC86vrAC— ANI (@ANI) April 2, 2025రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కామెంట్స్..దేశంలో లౌకిక పార్టీ ఎవరో ఈరోజే నిర్ణయించబడుతుంది.బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి.జేడీయూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, వారు ఎన్నికల్లో ఓడిపోతారు.బీజేపీ దానిని ఆమోదించే అవకాశం పొందడానికి వారు వాకౌట్ చేసే అవకాశం ఉంది.చిరాగ్ పాస్వాన్ కూడా అదే చేయగలరు.ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఎవరు ఓటు వేస్తారో చూడాలి#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayRajya Sabha MP Kapil Sibal says "...It will be decided today who is a secular party in this country. There are elections in Bihar, if JDU votes in favour of the Bill, they will lose the elections. It is… pic.twitter.com/F5YnPRmzYh— ANI (@ANI) April 2, 2025కాంగ్రెస్ ఎంపీ నిరసన.. లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు.Congress MP Imran Pratapgarhi arrives at the Parliament wearing black attire to protest against the Waqf Amendment Bill, which will be introduced in Lok Sabha today pic.twitter.com/5UdDhZedtH— ANI (@ANI) April 2, 2025 వైఎస్సార్సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్..ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాంలోక్‌సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాంమైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించారుముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారుఅన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలిముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరంవక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందిఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది 👉నేడు లోక్‌సభలో కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్‌గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayCongress MP and JPC member Imran Masood says, "We are ready for discussion. But I want to tell you the truth. The government is repeatedly saying that nothing will happen to Muslims, but they have made a… pic.twitter.com/ZULzEi1RzT— ANI (@ANI) April 2, 2025👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి. ఏమిటీ వివాదం? 👉వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి.👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి.

స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ బుధవారం వాదనలు వినిపించారు. స్పీకర్‌కు కోర్టులు గడువు విధించడం సరికాదని ఆయన వాదించారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే జ్యుడీషియల్ సమీక్షకు అవకాశముంటుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌కు గడువు విధించడం సరికాదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందే. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు’’ అని ముకుల్ రోహత్గీ వాదించారు.ముకుల్ రోహత్గీ వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవద్దా?. రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీం కోర్టు కూడా చేతులు కట్టుకుని చూస్తుండాలా?. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా?. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయం మరిచిపోవద్దు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అయితే అది ప్రత్యేక సందర్భమన్న రోహత్గి.. సుప్రీం కోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉందని, నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయొచ్చని తెలియజేశారు.. ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని వాదించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని.. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని కోర్టుకు తెలియజేశారు.2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ఇవాళ ముకుల్ రోహత్గీ వాదనలు ముగిశాయి. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు(గురువారం) వాదనలు వినిపిస్తానన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బెంచ్ సమ్మతి తెలిపి విచారణ వాయిదా వేసింది. తెలంగాణలో కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతరులు పిటిషన్లు వేశారు. అయితే మొదటి నుంచి ఈ కేసు విచారణలో తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తూనే వస్తోంది. గత విచారణలో.. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు పూర్తి చేశారు. ఆ వాదనల సమయంలో.. సుప్రీం కోర్టు ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలే చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది.

లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు.. చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్‌కు ఉందా? అని సవాల్ విసిరారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశారు. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారు. మూడు లక్షల మందికి పెన్షన్లను తొలగించి వారిని ఇబ్బంది పెడుతున్నారు. జనాన్ని ఫూల్స్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వలంటీర్లు, నిరుద్యోగులను ఫూల్స్ చేసి రోడ్డున పడేశారు. అమ్మ ఒడి ఇవ్వకుండా తల్లులు, పిల్లలను ఫూల్స్ చేశారు. ఉచిత బస్సు పేరుతో మహిళలను ఫూల్స్ చేశారు. సూపర్ సిక్స్ ఇవ్వటం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబుకు సూపర్ సిక్స్ ఇవ్వటం చేతకాకపోతే పదవిలో నుండి దిగిపోవాలిలక్షా 52 వేల కోట్ల అప్పులు చేసి విజనరీగా చెప్పుకుంటున్నారు. చెత్త సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. రూ.15లక్షల కోట్ల అప్పులు చేశారంటూ వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేశారు. చివరికి తాను చేసింది తప్పుడు ఆరోపణలని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. హామీలు ఇచ్చి జనాలను ఫూల్స్ చేశారు. రైతులకు భరోసా లేదు, గిట్టుబాటు ధర అసలే లేదు. మీరు అబద్దాలు మాట్లాడి, ఎల్లో మీడియాతో అబద్దాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే గంజాయి పండిస్తున్నారు.ఈవీఎంలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారు. కరువుతో జిల్లాలకు జిల్లాలు అల్లాడిపోతున్నాయి. మంత్రి నారా లోకేష్ కామెడీ పాదయాత్ర చేశారు. పెట్రోలు బంకులు, షాపుల దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము ఉందా?. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎక్కడపడితే అక్కడ గంజాయి సాగు జరుగుతోంది. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే లిక్కర్ బెల్టుషాపులు ఉన్నాయిరాజమండ్రిలో యువతి ఆత్మహత్యాయత్నం విషయంలో టీడీపీ కుట్రలు చేసింది. దీపక్ అనే నిందితుడు టీడీపీ లీడర్లకు ముఖ్య అనుచరుడు. ఆస్పత్రి కూడా టీడీపీ నేతలదే. అక్కడ సీసీ పుటేజీని ఎవరు మాయం చేశారో ఎందుకు తేల్చలేదు?. యువతి చావు బతుకుల మధ్య ఉంటే ఏజీఎం మీద చర్యలేవీ?. సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఏజీఎం అసలు గుట్టు బయటపడింది. బాధిత యువతికి మెడిసిన్ ఎవరు ఎక్కించారు?. ఆ అమ్మాయి జీవితంతో దీపక్ అనేవాడు ఆడుకున్నాడు.త్రిపురాంతకంలో ఎంపీటీసీ సృజనను కిడ్నాప్ చేశారు. మూడు రోజుల పాటు ఆమెను గదిలో బంధించారు. మొన్నటి జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్‌కు నిజమైన సైనికులుగా నిలబడి మావారు పని చేశారు. రెడ్ బుక్కు భయపడలేదు. పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లాగా తయారు అయ్యారు. రూల్స్‌కు విరుద్ధంగా పనిచేస్తే పోలీసులు పర్యావసానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్యాయం చేసిన వారికి పోలీసులు అండగా ఉండొద్దు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామంటే ఊరుకోం. పీ-4 కార్యక్రమం వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుందే తప్ప ప్రజలు కాదు. తిరుమలలో మద్యం, గంజాయి దొరుకుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లాడు?. తిరుపతి మెట్లు కడిగి ఎందుకు పాశ్చాత్య పడలేదు?. రాజమండ్రి ఘటనపై ఎందుకు స్పందించటం లేదు?. వెకిలి నవ్వులు నవ్వుతూ పవన్ ఎక్కడ దాక్కున్నారు?. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపి ముస్లిం సమాజాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారు. వారిద్దరికీ సరైన సమయంలో ముస్లింలు గుణపాఠం చెబుతారు. వైఎస్సార్సీపీలోని స్ట్రాంగ్ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నన్ను అరెస్టు చేసి సంబరాలు చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు.

శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2025 (IPL 2025)లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సారథ్యంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచిన పంజాబ్.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. పంత్ సేనను సొంత మైదానంలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండో గెలుపు నమోదు చేసిందిఇక ఈ రెండు విజయాల్లోనూ పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. గుజరాత్‌పై 42 బంతుల్లోనే 97 పరుగులతో చెలరేగిన అయ్యర్.. లక్నోతో మ్యాచ్‌లో 30 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధనాధన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.బ్యాటింగ్ నైపుణ్యాలు అద్భుతంఈ నేపథ్యంలో ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌పై టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. శ్రేయస్ బ్యాటింగ్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. అదే విధంగా.. అయ్యర్ పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యవహరించిన తీరును గావస్కర్ ఈ సందర్భంగా విమర్శించాడు.శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు‘‘2024లో కేకేఆర్‌ను గెలిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. కానీ అతడికి దక్కాల్సిన, రావాల్సిన గుర్తింపు రాలేదు. కేకేఆర్ విజయంలో అతడికి క్రెడిట్ దక్కలేదు. ఏదేమైనా అతడి కెప్టెన్సీ రికార్డు ఎంతో గొప్పగా, ఆకట్టుకునే విధంగా ఉంది’’ అని గావస్కర్ ప్రశంసలు కురిపించాడు.కాగా ఐపీఎల్-2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కోల్‌కతా జట్టు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల విరామం తర్వాత కేకేఆర్‌కు మరోసారి టైటిల్ దక్కడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు. అయితే, ఈ విజయం మెంటార్ గౌతం గంభీర్ ఖాతాలో పడింది. శ్రేయస్ అయ్యర్ కంటే ఎక్కువగా గౌతీకే క్రెడిట్ దక్కింది.రూ. 26.75 కోట్లు ఖర్చు చేసిఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందే కేకేఆర్ ఫ్రాంఛైజీతో శ్రేయస్ అయ్యర్ తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2025 వేలంపాటలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంఛైజీలన్నీ ఎగబడ్డాయి. అయితే, ఎంత ధరకైనా వెనుకాడని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసి ఆఖరికి అతడిని దక్కించుకుంది. కెప్టెన్‌గా అతడికి పగ్గాలు అప్పగించింది.ఈ క్రమంలో పైసా వసూల్ ప్రదర్శనతో శ్రేయస్ అయ్యర్ రాణిస్తుండటంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం సంతోషంలో మునిగిపోయింది. ఇదే జోరులో వరుస విజయాలు సాధించి.. తొలి టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తోంది. కాగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 117 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 3276 పరుగులు సాధించాడు. ఇందులో 23 అర్ధ శతకాలు ఉన్నాయి.ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).చదవండి: లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ

ఆల్‌టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కొంత శాంతించినట్లు కనిపించినా తిరిగి జీవితకాల గరిష్టాలను చేరుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.85,100 (22 క్యారెట్స్), రూ.92,840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.85,250కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.92,990గా ఉంది. బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులు చెందలేదు. స్థిరంగా ఉన్నాయి.ఇదీ చదవండి: దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండావెండి ధరలుబంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లే వెండి ధరల్లోనూ బుధవారం ఎలాంటి మార్పులు రాలేదు. కేజీ వెండి రేటు(Silver Price) ప్రస్తుతం రూ.1,14,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు కథలు చెబుతున్నారా? ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారా? వీరికన్నా ఐపీఎస్‌లే మెరుగ్గా ఉన్నారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్యల్లో అర్థమేమిటి? ప్రతిగా కలెక్టర్లు అద్భుతాలు సృష్టిస్తామని అనడం పరోక్షంగా ఎద్దేవా చేసినట్లా?. ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించడం కొత్త కాదు. కానీ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే అందులో ఆయన సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుంటారు. తనకు అన్ని అంశాలపై అపారమైన పట్టు ఉందని అనిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అయితే ఎక్కువ సార్లు ఇవి కాలక్షేపం సమావేశాలుగా మిగిలిపోతున్నాయన్న భావన అధికార వర్గాలలో ఉంది. .. కొద్ది రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో చంద్రబాబు అధికారులను ఉద్దేశించి ఉపన్యాసాలు చెప్పవద్దని అనడం. ప్రజెంటేషన్స్ ఇవ్వద్దని సూచించడం విశేషం. నిజానికి ఇలాంటి వాటిల్లో చంద్రబాబు ఒక ప్రత్యేకత సాధించారని అంటారు. ఉపయోగం ఉన్నా.. లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా ఆయన ఇచ్చినన్ని అంకెల ప్రజెంటేషన్లు మరెవ్వరూ ఇచ్చి ఉండకపోవచ్చు. వాటిలో ఎక్కువ భాగం కాకి లెక్కలే. పొంతన లేకుండా అంకెలు చెప్పేస్తూంటారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందని కాదు కానీ ప్రజలను గందరగోళపరిచి తను రాజకీయంగా లబ్ది పొందడం లక్ష్యంగా ఉంటుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన ధోరణి అలాగే ఉంటుంది. 👉మంచి జరిగితే తన ఖాతాలోకి, తప్పు జరిగితే అధికారుల అకౌంట్లలోకి జమ చేయడం ఆయన వైఖరి. కావచ్చు. కొన్ని జిల్లాల తలసరి ఆదాయం బాగోలేదని అంటూ కోనసీమ గురించి ప్రస్తావించారు. ఏలూరు జిల్లా తలసరి ఆదాయం బాగుందట. నిజంగానే అక్కడ అభివృద్ది జరిగి ఆదాయం పెరిగిందా? లేదంటే చంద్రబాబుకు నచ్చుతుంది కనుక ఆ విధంగా అంకెలు తయారు చేశారా? అనేది చెప్పలేం. చంద్రబాబు మాట్లాడితే వృద్ది రేటు అని అంటారు. అదేమిటో మామూలు ప్రజలకు అర్థం కాదు. కానీ పదే, పదే వాడడం ద్వారా ఏదో జరుగుతోందన్న భావన కలిగించడం ఆయన లక్ష్యం. పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తేనే సంక్షేమం, అభివృద్ది చేయగలుగుతామని చంద్రబాబు చెప్పారు. అది నిజమే అనుకుందాం. కానీ ఇంత సీనియర్ అయిన చంద్రబాబుకు ఎన్నికల ముందు ఆ విషయం తెలియదా? ఇష్టం వచ్చిన రీతిలో హామీలు అడ్డగోలుగా ఎలా ఇచ్చారు? అనే ప్రశ్నకు ఏనాడైనా జవాబు ఇచ్చారా? కలెక్టర్లకు ఆ విషయం తెలియదా? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు ఎన్ని కథలు చెప్పింది వారు కూడా వినే ఉంటారు కదా? ఇప్పుడు దాన్నంతా కలెక్టర్ల మీద తోసేసి తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదా?.👉ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కనుక, వండర్ పుల్ సర్, మిరాకిల్ సర్ అని వారు చెప్పవచ్చు. అనవచ్చు. కాని అర్థం చూస్తే అవేవో జరగడం సాధ్యం కాని అద్భుతాలు అన్నమాట. వాటిపై సీఎం కథలు చెబుతూ తమను అలా అంటారేమిటని కలెక్టర్లు అనుకోకుండా ఉంటారా! కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సైతం గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం, తోచినన్ని అబద్దాలు చెప్పడం, చివరికి వివేక హత్య కేసు వంటివాటిని కూడా అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన యత్నించారు. కలెక్టర్లు మెదడుకు పదును పెట్టాలని అంటున్నారు. ఎక్కువ సందర్భాలలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికే టైమ్ చాలదు. అందులోను మారిన రాజకీయ వాతావరణంలో కూటమి నేతల పైరవీలను తట్టుకోవడమే కలెక్టర్లకు ఇతర అధికారులకు పెద్ద సవాల్ అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 👉ఆయా చోట్ల అధికారులపై దురుసుగా వ్యవహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు. వాటిపై స్పందించలేని నిస్సహాయ స్థితిలో కలెక్టర్లు ఉంటున్నారు. లేకుంటే ఒక తెలుగుదేశం పత్రిక కొందరు ఐఎఎస్‌ల భార్యలు స్టార్ హోటళ్లలో కౌంటర్లు ఓపెన్ చేశారని, ఆయా పనులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక కథనాన్ని ఇస్తే.. ఐఎఎస్ అధికారుల సంఘం కనీసం ఖండించినట్లు లేదు. చంద్రబాబు కార్యాలయం దానిపై స్పందించలేదు. దీన్ని బట్టే ఐఎఎస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్(Red Book) పిచ్చిగోలకు భయపడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే కొందరు ఐఎఎస్, ఐపిఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా, ఎదురు కేసులు పెడుతూ, సస్పెన్షన్లు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న తీరు ఎదురుగా కనిపిస్తున్నప్పడు వారు మాత్రం ఏమి చేస్తారు?. ప్రజా ప్రతినిధులను కలుపుకుని వెళ్లండి, సొంతంగా ఆలోచించండి, సమస్యలు పరిష్కరించి క్రెడిట్ రాజకీయ నేతలకు ఇవ్వండని చంద్రబాబు అంటున్నారు. అంటే గతంలో చెప్పిన రాజకీయ పాలనను పరోక్షంగా మరోసారి చెప్పడమే కదా! కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కలెక్టర్లను సొంతంగా పని చేసుకోనివ్వడం లేదని ఎల్లో మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. 👉ఉదాహరణకు.. నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఎక్సైజ్ కార్యాలయంలో తిష్టవేసి నిరసన చెబితే అధికారులు ఏమీ చేయలేకపోయారు. అసెంబ్లీలో సీఎం ఆఫీస్ వద్దే విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దూషణలకు దిగినా అదేమిటని ప్రశ్నించ లేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఐఏఎస్‌లకన్నా ఐపీఎస్‌లు నచ్చారట. అవును..నిజమే.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను సంతోషపెడుతున్నందున బహుశా వారే బాగా నచ్చారేమో!. 👉ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అప్పుల విషయంలో ఎన్ని అసత్యాలు చెప్పారో అందరికి తెలుసు. అధికారంలోకి వచ్చాక సైతం అవే అబద్దాలను కొనసాగిస్తున్నారు. సంపద సృష్టిస్తానని, అప్పులు చేయనని చెప్పేవారు. కాని ఇప్పుడు ఏమంటున్నారు?. సూపర్ సిక్స్ హామీల అమలుకు కొంతమేర అప్పులు చేస్తామని చెబుతున్నారు. కలెక్టర్లు, ఐఏఎస్‌లు దీనిని గమనించలేనంత అమాయకులా?. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తిడుతుంటే దానికి కలెక్టర్లు ఎలా జవాబుదారి అవుతారు?. ఎన్నికల సమయంలో చెప్పిన హామీల అమలుకు నిధులు కేటాయించి, వాటిని విడుదల చేస్తే, అప్పుడు అమలు చేయకపోతే కలెక్టర్లు బాధ్యులవుతారు తప్ప, నిధులు ఇవ్వకుండా సీఎం అది చేయండి.. ఇది చేయండి అని చెబితే వారు కూడా ఎస్ సార్ అంటూ వినయం నటించక తప్పదు కదా!. గతంలో జగన్ టైమ్‌లో హామీలు, స్కీమ్‌ల వారీగా సమీక్షలు చేసేవారు ఎన్నికల మానిఫెస్టోని వారి ముందు పెట్టి ఏ మేరకు అమలు చేయగలిగాం.. ఎంత ఖర్చు అయింది? ఎంత డబ్బు అవసరం అన్నదానిపై చర్చించి విడుదల చేసేవారు. అలా సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికను అధికారులకు ఇచ్చి అమలు చేయాలని చెప్పే సాహసం చంద్రబాబు చేయగలరా?. మాట్లాడితే అధికారుల ఆలోచన తీరు మారాలని చెబుతారు?. అదేమిటో చెప్పరు! పడికట్టు పదాలు వాడి ప్రసంగం చేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. తల్లికి వందనం కింద మే నెలలో డబ్బులు ఇస్తామని అంటున్నారు. అది ఇప్పుడు గడచిపోయిన సంవత్సరానికా? లేక వచ్చే సంవత్సరానికా అని జనం అడిగితే అధికారులు ఏమి చెప్పాలి? పైగా స్కూళ్లు తెరవక ముందే పిల్లలందరికి డబ్బులు ఇస్తామని అనడంలో మతలబు ఏమిటి? జూన్ లో కొత్తగా నమోదయ్యే పిల్లలకు కూడా ఇస్తారా? ఇవ్వరా? ఇలాంటి వాటిపై కలెక్టర్ల సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఇదే సమస్య అన్నదాత సుఖీభవ స్కీముకు కూడా వస్తుంది కదా?. 👉అమరావతి నిర్మాణంపై కూడా పాత అసత్యాలే మళ్లీ చెప్పినట్లు అనిపిస్తుంది. ఒకపక్క బడ్జెట్ లో రూ.ఆరు వేల కోట్లు పెట్టి, రూ.31 వేల కోట్ల వరకు అప్పు తెచ్చి వ్యయం చేస్తున్నా, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నామని చెబుతున్నట్లుగా ఉంది. కలెక్టర్లు.. అధికార దర్పం వద్దని చంద్రబాబు అన్నారట. అంటే ఏమిటి? మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకుని వచ్చినా, టీడీపీ ఐడీ కార్డులు పెట్టుకుని వచ్చినా, వారికి ఎదురేగి స్వాగతం పలకాలని సూచించడమా? లేక వైఎస్సార్సీపీ అభిమానులు ఎవరైనా తమ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారికి ఏమీ చేయవద్దని చెప్పడమా? ఆయన మనసులోని మాటను గుర్తెరిగి అధికారులు వ్యవహరిస్తే సరిపోతుందా? ఏపీలో మాట ఇచ్చినట్లే మంచి పాలన జరుగుతోందని చంద్రబాబు అన్నట్లుగా ఎల్లో మీడియా బానర్ కథనాలు ఇచ్చినంత మాత్రాన వాస్తవాలు అధికారులకు తెలియకుండా ఉంటాయా? నిజమే..అధికారులు క్షేత్ర స్థాయిలో బాధ్యతగా ఉండాలి. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీర్చాలి. అంతవరకు చంద్రబాబు అయినా, మరెవరైనా చెప్పడం తప్పు కాదు. కాని తాము ఇచ్చిన హామీలన్నిటికి ఐఏఎస్ అధికారులు జవాబుదారులు అయినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను వారిపైకి నెట్టివేస్తే, అర్థం చేసుకోలేని అమాయకులుగా అధికారులు ఉండరు కదా! కాకపోతే ఇప్పటికైతే ప్రభుత్వ పెద్దలు చేసే అవమానాలను మౌనంగా భరించక తప్పదేమో!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
ఆదిత్య 369 (Aditya 369 Movie).. 1991లో వచ్చిన టైం ట్రావెల్ సినిమా. ది టైం మెషీన్ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన మూవీ ఇది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 4న రీరిలీజ్ అవుతోంది.విజయశాంతిని అనుకున్నాం..ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఆదిత్య 369 సినిమా మొదటగా విజయశాంతిని అనుకున్నాం. తను కూడా సరేనంది. కానీ అప్పటికే ఆమె సినిమాలతో బిజీగా ఉంది. మీరు వేరే హీరోయిన్ను తీసుకోండి, నాకు విజయశాంతి కావాలని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. సరేలే అనుకుని రాధను సెలక్ట్ చేయాలనుకున్నాం. కానీ, ఆమె కాస్త బొద్దుగా మారటంతో మళ్లీ వేరే కథానాయికను వెతికే పనిలో పడ్డాం.నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైసినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. తమిళంలో 'ఈరమాన రోజావే' సినిమా చేస్తున్న అమ్మాయి బాగుందని సూచించాడు. అలా ఆమెను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేస్తే అందరికీ నచ్చింది. అలా మోహిని ఈ సినిమా చేసింది. తర్వాత రెండు మూడు సినిమాలు చేసిందనుకుంటాను. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు ముగింపు పలికింది అని తెలిపాడు. ఇకపోతే ఆదిత్య 369 వచ్చిన 34 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కథ రెడీ అయిందని, త్వరలోనే పార్ట్ 2 ఉంటుందని బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు.చదవండి: నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా

HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్(వీడియో)
సాక్షి, గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో, ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.మరోవైపు.. హెచ్‌సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ విద్యార్థులు నాలుగో రోజు ఆందోళనలు తెలుపుతున్నారు. అక్కడున్న 400 ఎకరాలను యూనివర్సిటీకి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల వద్ద పోలీసులు మోహరించారు. LathiCharge on Students of University of Hyderabad who have protesting to stop cutting down the 400 acres Trees in the campus pic.twitter.com/1iQC52779t— Dr.Krishank (@Krishank_BRS) April 2, 2025అనంతరం, ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. డ్రోన్లు ఎగురవేసి వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి యూనివర్సిటీకి బీజేపీ మహిళా మోర్చా నాయకులు వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు.#HCU విద్యార్థులపై రేవంత్ సర్కార్ దౌర్జన్యం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను గొడ్లను కొట్టినట్టు కొడుతున్న పోలీసులు 😡#ShameOnRahulGandhi#SaveHCU#SaveHCUBioDiversity pic.twitter.com/SKlUxibKEq— BRS News (@BRSParty_News) April 2, 2025

35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
అంబానీ ఫ్యామిలీకి చెందిన 'చోటి బహు' రాధిక మర్చంట్ అందంలోనూ, ష్యాషన్ స్టైల్లోనూ ఎప్పుడూ స్పెషల్‌గా నిలుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధిక తన ట్రెండీ ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా చందేరీ చీరతో తన డ్రెస్‌ను వినూత్నంగా తీర్చి దిద్దిన వైనం ఆకర్షణీయంగా నిలిచింది. 35 ఏళ్ల వింటేజ్ కార్సెట్‌ను చందేరి చీరతో అందంగా స్టైల్ చేయడం హైలైట్‌గా నిలిచింది.అనంత్ అంబానీతో పెళ్లి సందర్భంగా రాధిక మర్చంట్ తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు, అత్యంత ఘనంగా జరిగిన వెడ్డింగ్‌లో ఆమె ధరించిన ఒక్కో డ్రెస్ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. హల్దీ వేడుకలు, మెహిందీ మొదలు సాంప్రదాయ దుస్తుల్లో కొత్త వధువుగా ఆమె లుక్స్ వరకు ప్రతీ వస్త్రాలంకరణలో అందరి హృదయాలను గెలుచు కుంది. తాజాగా రాధిక తనకు ఇష్టమైన స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేసిన వింటేజ్ కార్సెట్నురీ మోడల్ చేసి కార్సెట్-సారీ ట్రెండ్ సృష్టించింది. సల్వార్-కమీజ్‌కు కూడా స్టైల్‌తో కనిపించేలా చందేరీ చీరతో 35 ఏళ్ల కార్సెట్‌ను రీ స్టైల్ చేసి ధరించడం ద్వారా మరోసారి ఫ్యాషన్ ముద్రను చాటుకుంది.ఏప్రిల్ 1న జరిగిన వివియన్నే వెస్ట్ వుడ్ షోకు హాజరైనప్పటి రాధిక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేశాయి. వివియన్నే వెస్ట్ వుడ్ తయారు చేసిన పోర్ట్రెయిట్ కలెక్షన్ నుండి పురాతన కార్సెట్, స్కార్ఫ్ ధరించి కనిపించింది. ఇందులో ఫ్రెంచ్ కళాకారుడు ఫ్రాంకోయిస్ బౌచర్ రాసిన 'డాఫ్నిస్ అండ్ క్లో' (1743-174) పెయింటింగ్ కూడా ఉండటం విశేషం. వివియన్నే ఒక దుస్తులపై పెయింటింగ్‌ను పునరుత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఈ డ్రెస్ పద్దెనిమిదవ శతాబ్దపు ఆయిల్ పెయింటింగ్ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!ఈ లుక్కు ముత్యాల చోకర్, మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులతో స్టైల్ చేయడం మరో హైలైట్. ఈ గతంలో తన మంగళసూత్రాన్ని స్టైల్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెడలో ధరించాల్సిన మంగళసూత్రాన్ని బ్రాస్లెట్గా ధరించిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన వివియన్ వెస్ట్‌వుడ్ ష్యాషన్ ఈవెంట్‌కు రాధికా మర్చంట్ అక్క అంజలి మర్చంట్ మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టార్-స్టడెడ్ ఈవెంట్లో ఎమరాల్డ్ గ్రీన్ గౌనులో ఆమె అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s)
తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
రష్యాను టెన్షన్ పెడుతున్న కొత్త వైరస్.. భయాందోళనలో రష్యన్లు!
ఎవరి పార్టీ ఆఫీసుల్లో వాళ్ల జాతకాలు గొప్పగా చెప్పించుకున్నారు!
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
ఊర్వశి మరో ఐటమ్ సాంగ్.. ఈసారి 'జాట్' కోసం
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం
హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్ జగన్
లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. స్పీకర్ హెచ్చరిక
స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్(వీడియో)
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
సింధు తర్వాత ఎవరు?
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
పోలీసుపై రెడ్ బుక్ రూల్
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ
జీబ్లీ ఇమేజ్.. పర్సనల్ డ్యామేజ్?
బంగారం ఇచ్చి నీ భార్యను తీసుకుపో..!
beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్
జీఎస్టీ వసూళ్ల రికార్డు
ఆల్‌టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా
హాలీవుడ్లో విషాదం.. ‘బాట్‌మ్యాన్’ ఇక లేరు!
Best Places to Visit వేసవి విహారం
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండా
రేవంత్.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్
జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
పంజాబ్ ఫటాఫట్
కౌంట్‌డౌన్ స్టార్ట్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
అసత్య ప్రచారం గట్టిగా తిప్పి కొట్టాలి
వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమంటే మాకు ద్రోహం చేయడమే
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
గ్యాసు వేస్టు ఎందుకని!
క్రాష్ మార్కెట్
కలిసి నడుద్దాం...
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
ఎవరి పార్టీ ఆఫీసుల్లో వాళ్ల జాతకాలు గొప్పగా చెప్పించుకున్నారు!
లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన
శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం
ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
ట్రైలర్ చాలా బాగుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
'బోల్ బేబీ బోల్'తో సెన్సేషన్.. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్‌తో మరోసారి వైరల్
మహిళలకు డిజిటల్ స్కిల్స్
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
సాక్షి కార్టూన్ 30-03-2025
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ.. శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటుడు
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
మాకూ 'మంత్రి' ఇవ్వండి
యూపీఐ లావాదేవీలు @ రూ.24.77 లక్షల కోట్లు
ఫార్మాకు చేదు మందు?
అంతర్జాతీయ హాకీకి వందన గుడ్‌బై
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమ్మకాల్లో అదరగొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్
తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
ఊర్వశి మరో ఐటమ్ సాంగ్.. ఈసారి 'జాట్' కోసం
రిజ్వాన్, బాబర్ విఫలం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
బూతులు తిడుతూ.. విద్యార్థినులను కొడుతూ..
భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
అడ్డుకోవాలంటే కూడా ఎంతో కొంత ఇచ్చుకోవాలటసార్!
భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
అట్టుడికిన హెచ్‌సీయూ
తప్పులను సరిదిద్దుకోకపోతే సంకటమే!
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
తక్కువ కాలుష్య నగరం కడప
లింగమయ్య హత్య కేసులో ‘పరిటాల’ ఒత్తిళ్లు
ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
రష్యాను టెన్షన్ పెడుతున్న కొత్త వైరస్.. భయాందోళనలో రష్యన్లు!
ఎవరి పార్టీ ఆఫీసుల్లో వాళ్ల జాతకాలు గొప్పగా చెప్పించుకున్నారు!
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
ఊర్వశి మరో ఐటమ్ సాంగ్.. ఈసారి 'జాట్' కోసం
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం
హ్యాట్సాఫ్.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్ జగన్
లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. స్పీకర్ హెచ్చరిక
స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
HCU వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్(వీడియో)
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. చిన్నారి మృతి
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
సింధు తర్వాత ఎవరు?
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
ఆదిత్య 369.. విజయశాంతి చేస్తానంది.. కానీ..: నిర్మాత
పోలీసుపై రెడ్ బుక్ రూల్
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ
జీబ్లీ ఇమేజ్.. పర్సనల్ డ్యామేజ్?
బంగారం ఇచ్చి నీ భార్యను తీసుకుపో..!
beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్
జీఎస్టీ వసూళ్ల రికార్డు
ఆల్‌టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలా
హాలీవుడ్లో విషాదం.. ‘బాట్‌మ్యాన్’ ఇక లేరు!
Best Places to Visit వేసవి విహారం
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
నారా లోకేష్ పీఏ దందా.. తిరుమల దర్శనాల టికెట్స్..
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత
వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్
దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండా
రేవంత్.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్
జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
పంజాబ్ ఫటాఫట్
కౌంట్‌డౌన్ స్టార్ట్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
అసత్య ప్రచారం గట్టిగా తిప్పి కొట్టాలి
వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమంటే మాకు ద్రోహం చేయడమే
నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ భేటీ
గ్యాసు వేస్టు ఎందుకని!
క్రాష్ మార్కెట్
కలిసి నడుద్దాం...
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
ఎవరి పార్టీ ఆఫీసుల్లో వాళ్ల జాతకాలు గొప్పగా చెప్పించుకున్నారు!
లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన
శ్రేయస్ అయ్యర్‌కు ఆ క్రెడిట్ దక్కలేదు: టీమిండియా దిగ్గజం
ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి
నేనూ విన్నా.. కానీ, అది నిజం కాదు: రష్మిక మందన్నా
ట్రైలర్ చాలా బాగుంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
'బోల్ బేబీ బోల్'తో సెన్సేషన్.. ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్‌తో మరోసారి వైరల్
మహిళలకు డిజిటల్ స్కిల్స్
అదే పిచ్చిగోల.. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు!
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
సాక్షి కార్టూన్ 30-03-2025
హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ.. శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
విదేశీ యువతిపై లైంగికదాడి బాధాకరం
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటుడు
బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
మాకూ 'మంత్రి' ఇవ్వండి
యూపీఐ లావాదేవీలు @ రూ.24.77 లక్షల కోట్లు
ఫార్మాకు చేదు మందు?
అంతర్జాతీయ హాకీకి వందన గుడ్‌బై
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమ్మకాల్లో అదరగొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్
తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
ఊర్వశి మరో ఐటమ్ సాంగ్.. ఈసారి 'జాట్' కోసం
రిజ్వాన్, బాబర్ విఫలం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
బూతులు తిడుతూ.. విద్యార్థినులను కొడుతూ..
భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
అడ్డుకోవాలంటే కూడా ఎంతో కొంత ఇచ్చుకోవాలటసార్!
భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
అట్టుడికిన హెచ్‌సీయూ
తప్పులను సరిదిద్దుకోకపోతే సంకటమే!
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
తక్కువ కాలుష్య నగరం కడప
లింగమయ్య హత్య కేసులో ‘పరిటాల’ ఒత్తిళ్లు
ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
సినిమా

హాలీవుడ్లో విషాదం.. ‘బాట్‌మ్యాన్’ ఇక లేరు!
హాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. టాప్ గన్, బ్యాట్‌మ్యాన్ ఫరెవర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో యావత్ సినీ ప్రపంచాన్ని అలరించిన హాలీవుడ్ హీరో వాల్ కిల్మర్ (Val Kilmer)(65) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 1న లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1980, 90 దశకాల్లో తన నటనతో కిల్మర్ అందర్నీ ఆకట్టుకున్నాడు. 1986లో రిలీజైన టాప్ గన్ చిత్రం వాల్ కిల్మర్కి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చిపెట్టింది. తన కెరీర్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'టాప్ గన్'లో ఐస్‌మ్యాన్, 'బాట్మన్ ఫరెవర్'లో బాట్‌మ్యాన్, 'ది డోర్స్'లో జిమ్ మారిసన్ వంటి పాత్రలు ఆయనకు విశేష గుర్తింపు తెచ్చాయి. టోంబ్‌స్టోన్(1993), ట్రూ రొమాన్స్(1993), హీట్(1995), ద గోస్ట్ అండ్ ద డార్క్నెస్(1996) చిత్రాల్లోనూ కిల్మర్ నటించాడు. అతను నటించిన చివరి చిత్రం టాప్ గన్ మావరిక్ 2022లో రిలీజై మంచి విజయం సాధించింది.ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ లాంటి యానిమేషన్ చిత్రాలకు అతను వాయిస్ ఓవర్ ఇచ్చాడు.కిల్మర్ వ్యక్తిగత విషయాలకొస్తే....అతని పూర్తి పేరు వాల్ ఎడ్వర్డ్ కిల్మర్. లాస్ ఏంజిల్స్‌లో డిసెంబర్ 31, 1959లో జన్మించాడు. చాట్స్వర్త్లో అతని బాల్యం గడిచింది. 1988లో తోటి నటి జోవాన్ వాలీతో ప్రేమ వివాహం జరిగింది. వీరికి కూతురు మెర్సిడీస్, కుమారుడు జాక్ ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 1996లో విడాకులు తీసుకున్నారు.

హెచ్‌సీయూ వివాదం.. రేణూ దేశాయ్ విన్నపం.. ప్రభుత్వానికి ఉపాసన సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని మాయం చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ భూములు మావంటూ వాటిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు (#HCU Protest). వందలాది జేసీబీలు అర్ధరాత్రి అడవిని ధ్వంసం చేయడానికి వెళ్తే నెమళ్ల ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీస్తున్న దుప్పిల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. అడవిని కాపాడుకుందాంఅవి చూసిన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలుష్యంతో నిండిపోతున్న నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న భూముల్ని అమ్మడం అన్యాయమని మండిపడుతున్నారు. అడవి నరికివేత ఆపేయాలని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినదిస్తున్నారు. హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇదే గనక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరింది.దయచేసి వేడుకుంటున్నా..పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. రెండు రోజుల క్రితమే నాకు విషయం తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాకే వీడియో చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డిగారూ.. ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నాకు 44 ఏళ్లు. రేపోమాపో ఎలాగైనా పోతాను. కానీ పిల్లలు.. మన రేపటితరానికి ఆక్సిజన్, నీళ్లు అవసరం. వదిలేయండి..అభివృద్ధి అవసరం.. కాదనను. ఐటీ పార్కులు, బహుళ అంతస్తుల భవనాలు.. అన్నీ అవసరమే! కానీ ఈ 400 ఎకరాలను మాత్రం వదిలేయండి. నిర్మానుష్యంగా ఉన్న భూముల్ని వెతకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏదో ఒకటి చేయండి. మీరు చాలా సీనియర్. ఒక తల్లిగా అడుక్కుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి అని వీడియో రిలీజ్ చేసింది. మూగజీవాల్ని అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మీ గౌతమ్ సైతం వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam)చదవండి: లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు

హైదరాబాద్‌లో నాకు నచ్చేవి ఇవే: జూనియర్ ఎన్టీఆర్
అంతర్జాతీయ స్థాయి సక్సెస్‌లు అందుకుంటున్న టాలీవుడ్ (Tollywood)కు కేంద్ర బిందువు హైదరాబాద్. అలాంటి పరిశ్రమలో గ్లోబల్స్టార్స్గా పేరున్న అనేకమంది నటీనటులకు మన నగరం నిలయం. అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న టాలీవుడ్ స్టార్స్ కూడా నగరంలోని కొన్ని రుచులకు దాసులే. వారు తమ అభి‘రుచుల్ని’ సంతృప్తి పరుచుకోడానికి నగరంలోని కొన్ని రెస్టారెంట్స్‌కి తరచూ రౌండ్స్ వేస్తుంటారు. అభిమానులకు చిక్కకుండా రహస్యంగా తమ టేస్ట్ బడ్స్‌ను శాంతింపజేస్తుంటారు. అదే విధంగా మన టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కి సైతం నగరంలో తనకు నచ్చిన, ఇష్టమైన వంటకాలు వడ్డించే రెస్టారెంట్స్ ఉన్నాయి.గత నెల్లో దేవర చిత్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం అక్కడి థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు తారక్ తిరిగి నగరానికి వచ్చేశారు. అయితే తారక్ జపాన్ టూరుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆ ఇంటర్వ్యూలో నగరంలో తాను ఇష్టపడే రెస్టారెంట్స్ రుచుల వివరాలు ఆయన వెల్లడించడమే ఇందుకు కారణం.ఫ్రెండ్.. జపనీస్ ట్రెండ్.. నగరంలోని నాగ చైతన్య అక్కినేనికి చెందిన షోయు రెస్టారెంట్ ఎన్టీఆర్ ఎంచుకున్న మొదటి ఎంపిక. ‘ఈ అద్భుతమైన కళాత్మక ప్లేస్ నా స్నేహితుడు నాగ చైతన్య సొంతం. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన జపనీస్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా జపనీస్ వంటకమైన సుషీ అక్కడ సూపర్బ్. హైదరాబాద్‌లో జపనీస్ వంటకాలకు నేను జై కొట్టే ప్లేస్ అది. ఇది నిజంగా అంతర్జాతీయ వంటకాలకు కేరాఫ్’ అంటూ ఎన్టీఆర్ కొనియాడారు. మరికొన్ని ప్రదేశాలు.. జపనీస్ వంటకాలకు సంబంధించి తన ఫేవరెట్‌ను తెలియజేయడంతో పాటు అచ్చమైన హైదరాబాదీ వంటకాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ కొన్నింటిని పేర్కొన్నారు. తాను ఆస్వాదించే మరికొన్ని రుచుల కోసం.. పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్‌లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్‌పేట్‌లోని కాకతీయ డీలక్స్ మెస్ కూడా ఆయన ఎంచుకున్న నచ్చే రుచుల జాబితాలో ఉన్నాయి.చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం

లాల్ సింగ్ చద్దా.. ఆ స్టార్ హీరోకంటే అతడి కొడుకే బెటర్: దర్శకుడు
మన్సూర్ ఖాన్ (Mansoor Khan).. ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వోహి సికందర్ వంట కల్ట్ క్లాసిక్స్ అందించిన గొప్ప డైరెక్టర్. 2000వ సంవత్సరంలో వచ్చిన జోష్ తర్వాత మళ్లీ మళ్లీ ఇండస్ట్రీలో కనిపించనేలేదు. కూనూర్ వెళ్లి అక్కడే పొలం పని చేసుకుంటున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లిన ఈయనను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు చూద్దాం..డైరెక్షన్‌పై ఆసక్తి లేదునేను సినీ ప్రేమికుడిని కాదు. కథలు చెప్పడం ఇష్టమే కానీ దర్శకుడిగా రాణించడం మాత్రం అస్సలు ఇష్టం లేదు. 99శాతం సినిమాలు నేను చూడనేలేదు. కథలు రాయడం ఇష్టం కాబట్టి రెండు పుస్తకాలు కూడా రాశాను. మూడోది రాస్తున్నాను. అయితే రెండో పుస్తకాన్ని సినిమాగా తీయాలన్న ఆలోచన ఉంది. ఆమిర్ ఖాన్ (Aamir Khan)కు ఆ బుక్ చాలా నచ్చింది. దాన్ని సినిమాగా తీసుకురావాలన్న తపన నాకంటే అతడికే ఎక్కువగా ఉంది. అన్నీ కుదిరితే ఆ మూవీలో ఆమిర్ ఖానే హీరోగా నటిస్తాడు.ఫెయిల్యూర్ పార్టీ..అతడి ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు దగ్గరివాళ్లని పిలిచి స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాడు. అందులో నేనూ ఉంటాను. లాల్ సింగ్ చద్దా సినిమా చూసినప్పుడు నాకంతగా నచ్చలేదు. తన హావభావాలు కాస్త ఎక్కువైనట్లుగా అనిపించింది. పీకే మేనరిజానికి దగ్గరగా అతడి యాక్టింగ్ ఉంది. అది ఆమిర్ కూడా పసిగట్టాడు. ఆ సినిమాకు నేనే డైరెక్టర్ అయ్యుంటే అతడిని అలా చేయనిచ్చేవాడినే కాదు! సాధారణంగా అందరూ సినిమా సక్సెస్ అయ్యాక పార్టీ చేసుకుంటారు. కానీ ఆమిర్ ఫ్లాప్ అయ్యాక పార్టీ ఇస్తాడు. ఫెయిల్యూర్‌కు తనే బాధ్యత వహిస్తాడు. తండ్రి కంటే కొడుకే బాగా..నిజానికి లాల్ సింగ్ చద్దాలో మొదట ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ (Junaid Khan)ను తీసుకుందామనుకున్నారు. అది మంచి ఛాయిస్ అని చెప్పాను. ఎందుకంటే అతడి వయసు 28. ఆ వయసులో వారి ముఖంలో ఒకరకమైన అమాయకత్వం కనిపిస్తుంది. గొప్ప గొప్ప నటుల్లో కూడా అది గోచరించదు. ఈ సినిమాకు అతడే మంచి ఛాయిస్ అని చెప్పాను. అలాగైతే సినిమాకు ఓపెనింగ్స్ కూడా రావని దర్శకనిర్మాతలు వెనకడుగు వేశారట. ఇంత చెత్తగా ఆలోచిస్తున్నారేంటనుకున్నాను. వారి వల్ల చివరకు ఆమిర్ చేయక తప్పలేదు అని మన్సూర్ చెప్పుకొచ్చాడు.చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం
న్యూస్ పాడ్‌కాస్ట్

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...
క్రీడలు

రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant). ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ పంత్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించింది.అయితే, లక్నో సారథిగా తొలి మ్యాచ్‌లోనే పంత్ విఫలమయ్యాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేక.. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం పంత్‌కు ఊరట దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో గెలుపొందడంతో అతడు తొలి విజయం అందుకున్నాడు. అయితే, సొంత మైదానంలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది.పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమిష్టి వైఫల్యం కారణంగా హోం గ్రౌండ్లో తొలి మ్యాచ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇప్పటి వరకు లక్నో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పంత్ బ్యాటర్‌గా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.బ్యాటర్‌గా విఫలంతొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో పోరులో పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు చేయగలిగాడు. ఇక తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండే పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రూ. 27 కోట్లు దండుగ!‘‘పంత్‌కు ఏమైంది? హ్యాట్రిక్ అట్టర్‌ఫ్లాప్‌లు.. రూ. 27 కోట్లు.. లక్నో బూడిదలో పోసినట్లే..’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పంత్‌పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు.. ప్రతి మ్యాచ్ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌తో సంభాషిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకాతాజాగా పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత కూడా గోయెంకా పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్ చేతులు కట్టుకుని నిలబడగా.. అతడి వైపు వేలు చూపిస్తూ మరీ గోయెంకా సీరియస్ అయిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయెంకా తీరుపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో కేఎల్ రాహుల్‌తో ఇలాగే వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.‘‘విజయాల కంటే కూడా ఇలాంటి వివాదాలతోనే హైలైట్ కావాలని చూసే ఓనర్ ఈయన ఒక్కడేనేమో! ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా కెప్టెన్‌తో అందరి ముందే సంభాషిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడం ద్వారా ఏం నిరూపించాలనుకుంటున్నారు? డబ్బులు పెట్టి కొన్నంత మాత్రాన వారిని తక్కువ చేసి చూపడం సరికాదు’’ అంటూ హితవు పలుకుతున్నారు.ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు👉వేదిక: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025

పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను: పంత్
సొంత మైదానంలో తొలి మ్యాచ్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. కనీసం మరో 20- 25 పరుగులు చేసి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.హోం గ్రౌండ్లో పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యామని.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని పంత్ అన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో బ్యాటింగ్‌కు దిగింది.పంత్ ఫెయిల్టాపార్డర్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28) తొలిసారి రాణించగా.. ఇన్ ఫామ్ ఓపెనర్ మిచెల్ మార్ష్ మాత్రం డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ పంత్ (5 బంతుల్లో 2) మాత్రం మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో ఆయుష్ బదోని (33 బంతుల్లో 41) మెరుగ్గా బ్యాటింగ్ చేయగా.. డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 19) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 27) ఆడటంతో లక్నో 170 పరుగుల మార్కు దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.పంజాబ్ ఫటాఫట్‌ఇక లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలోనే ప్రియాన్ష్ ఆర్య(8) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు సాధించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. నేహాల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025 ఈ నేపథ్యంలో 16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. లక్నోపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌లలో పంజాబ్ గెలుపొందింది. మరోవైపు.. మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నోకు ఇది రెండో ఓటమి.పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనుఈ క్రమంలో ఓటమి అనంతరం లక్నో సారథి రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ‘‘మేము మరిన్ని పరుగులు సాధించాల్సింది. కనీసం మరో 20- 25 రన్స్ చేయాల్సింది. అయితే, ఆటలో ఇవన్నీ సహజమే. మా సొంత మైదానంలో వికెట్‌ను అంచనా వేసేందుకు ఇంకా సమయం పడుతోంది.ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే భారీ స్కోర్లు సాధించడం చాలా కష్టం. అయితే, జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. స్లో వికెట్ ఉంటుందని భావించాం. ఈ మ్యాచ్ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇందులో మాకు కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?

‘ఒలింపిక్ పతకం గెలిచుంటే బాగుండేది’
న్యూఢిల్లీ: ఏ ఆటలోనైనా... ఏ స్థాయి ప్లేయర్‌కైనా... అంతిమ లక్ష్యం ఒలింపిక్ పతకం సాధించడమే... అయితే అందరికీ ఒలింపిక్ పతకాన్ని అందుకునే భాగ్యం ఉండదు. ఎంత సత్తా ఉన్నా... జట్టు క్రీడలో సమన్వయం కొరవడితే ఫలితాలు తారుమారు అవుతాయి... లక్ష్యానికి చేరువై దూరమైపోతారు. భారత సీనియర్ హాకీ స్టార్ వందన కటారియా కెరీర్లోనూ ఇలాగే జరిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో వందన సభ్యురాలిగా ఉన్న భారత జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. బ్రిటన్ జట్టుతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ కీలక మ్యాచ్‌లో వందన ఒక గోల్ కూడా చేసింది. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వందన ‘హ్యాట్రిక్’ కూడా సాధించింది. మంగళవారం అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పిన వందన తన కెరీర్లో ఒలింపిక్ పతకం లేకపోవడం లోటుగా ఉండిపోతుందని, టోక్యోలో కాంస్యం సాధించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. ‘నేను హరిద్వార్‌లో హాకీ స్టిక్ పట్టుకునే సమయానికి ఆడపిల్లలు ఇంటి గడప దాటకూడదనే అభిప్రాయం ఉండేది. వందనను హాకీ ఆడేందుకు ఇంటి బయటకు ఎందుకు పంపిస్తున్నావని మా నాన్నను ఇంటి చుట్టుపక్కల వాళ్లు చాలాసార్లు ప్రశ్నించారు. కానీ వారి మాటలను ఆయన పట్టించుకోలేదు. నాకంటే ముందుగానే మా ఇద్దరు అక్కలు రీనా, అంజలి హాకీ ఆడేవారు. నేను ఖోఖోను ఎక్కువ ఇష్టపడేదాన్ని. కొన్ని రోజులు గడిచాక నేను కూడా హాకీవైపు మళ్లాను. మాకెంతో మద్దతు ఇచ్చిన నాన్న టోక్యో ఒలింపిక్స్‌కు కొన్ని రోజుల ముందు కన్ను మూశారు. నాన్న మరణం నన్ను కుంగదీసినా కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతో టోక్యోకు వెళ్లాను. కుటుంబసభ్యుల మద్దతు ఉంటే ఏ రంగంలోనైనా అనుకున్నది సాధించడం సాధ్యమే’ అని 32 ఏళ్ల వందన తెలిపింది. ‘అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలకాలన్న నిర్ణయం హఠాత్తుగా తీసుకోలేదు. చాలా మంది జూనియర్ ప్లేయర్లు తెరపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 ఏళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నాను. జూనియర్లకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నాను’ అని వందన వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించలేదని... అయితే తనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన హాకీకి తప్పకుండా సేవలు అందిస్తానని వందన తెలిపింది.

సింధు తర్వాత ఎవరు?
సాక్షి క్రీడా విభాగం : భారత బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే దిగ్గజం. తదనంతరం ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగుతేజం పుల్లెల గోపీచంద్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. వీళ్లిద్దరు పురుషుల కేటగిరీలో లెజెండ్స్! కానీ అమ్మాయిల విభాగంలో మాత్రం స్టార్లు, విజేతలంటూ ఎవరూ లేరు. మళ్లీ గోపీచంద్ తనకెంతో పేరు ప్రఖ్యాతలు తెచి్చన ‘ఆట’కు తిరిగివ్వాలనే లక్ష్యంతో కోచ్‌గా మారాక భారత బ్యాడ్మింటన్ ‘కోర్టు’లో రాణులు వెలుగులోకి వచ్చారు. అతను సానబెట్టిన సైనా నెహ్వల్ ఓ వెలుగు వెలిగింది. ఎన్నో ఏళ్లుగా మహిళల సింగిల్స్‌లో ఉనికి లేని భారత్‌కు ఘనవిజయాలు, ఒలింపిక్ పతకం తెచ్చి పెట్టింది. ఆమె ఆడుతుండగానే పీవీ సింధు దూసుకొచ్చింది. సింధుది గోపీచంద్ స్కూలే (కోచింగ్). ఆమె అచిరకాలంలోనే సైనాను మరిపించింది. బ్యాడ్మింటన్‌లో మురిపించింది. దేశాన్ని గర్వపడేలా చేసింది. ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్, ఒలింపిక్స్ క్రీడల్లో రజతం, కాంస్యం ఇలా ఒకటేమిటి అన్నింటా సింధు మార్కు కనబడింది. అయితే కొంతకాలంగా సింధు ఆటతీరు గాడి తప్పింది. గాయాలు వెన్నంటే వైఫల్యాలతో గత రెండు సీజన్లు సింధుకు కలిసి రాలేదు. సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. కానీ తర్వాతే భారత బ్యాడ్మింటన్‌లో సింధు వారసురాలు కనబడటం లేదు. దీంతో సమీప భవిష్యత్తులో మహిళల సింగిల్స్‌లో ఆశాకిరణం ఫలానా అనే వారు లేక ప్రభ కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ ప్రమాద ఘంటికలు 2025 సీజన్ ప్రారంభంలోనే మోగాయి. ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీ (కింగ్డావో–చైనా)లో చివరి నిమిషంలో గాయంతో సింధు వైదొలగగా... బరిలోకి దిగిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌తోనే సరిపెట్టుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్‌లలో నిలకడలేని ప్రదర్శనతో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. ఒక్క పురుషుల డబుల్స్‌లోనే ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్ షెట్టితో కలిసి స్థిరంగా రాణిస్తున్నాడు. వీలైతే విజయం (పతకం) లేదంటే రన్నరప్... ఇదీ కుదరకపోతే కనీసం సెమీఫైనల్ వరకైనా భారత ఆశల పల్లకిని మోసుకెళ్తున్నాడు. ఎంతో ఎత్తుకు ఎదిగినట్లే ఎదిగి... క్రికెట్ మతమైన భారత్‌లో, ఘనచరిత్ర కలిగిన హాకీ, పతకాలపై గురి పెట్టే షూటింగ్‌లతో పాటు బ్యాడ్మింటన్ కూడా పతకాలు తెచ్చే ప్రముఖ క్రీడాంశమైంది. 2012 నుంచి భారత షట్లర్లు వరుసగా మూడు ఒలింపిక్ పతకాలు సాధించారు. లండన్ (2012)లో సైనా... ‘రియో’లో (2016)... ‘టోక్యో’లో (2020) సింధు పతకాలు పట్టుకొచ్చారు. దీంతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ, రజత, కాంస్యాలకు లెక్కేలేదు. ఒలింపిక్ నుంచి ఒలింపిక్ కాలచక్రంలో మిన్నంటే ప్రదర్శనతో షట్లర్లు వెలుగులీనారు. కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ ఇలా వచ్చిన వారే. పతకం తేలేకపోయినా పురుషుల్లో లక్ష్య సేన్, మహిళల్లో సింధు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కానీ తదుపరి ఒలింపిక్స్‌లో ఈ అర్హత ముచ్చట కూడా దక్కేలా కనబడటం లేదు. ఎందుకంటే శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లలో పదును తగ్గింది. మ్యాచ్‌లు గెలిచే సత్తా కరువైంది. మహిళల సింగిల్స్‌లో సింధుకు ఇటు ఆటతీరులో నిలకడ లేదు! అటు ఫిట్‌నెస్‌లో స్థిరత్వం లేదు. దీంతో కొత్త ఒలింపిక్ సైకిల్లో వీళ్లెవరూ ముందుకెళ్లే షట్లర్లు కానేకారని స్పష్టంగా అర్థమవుతోంది. ఏమిటీ పరిస్థితి... ఎందుకీ దుస్థితి! శ్రీకాంత్, ప్రణయ్‌లు వెటరన్ ప్లేయర్లు కావడంతో సహజంగా వయసు పైబడిన ఛాయలు వారిని వెనక్కి లాగుతున్నాయి. కానీ లక్ష్యసేన్ తన కెరీర్ ఆరంభంలోనే సంచలన విజయాలతో ఔరా అనిపించాడు. కానీ కొన్నాళ్లుగా అలసత్వమో... అనాసక్తినో తెలియదు కానీ ఆశించిన స్థాయి ఆటతీరే కనబరచడం లేదు. ఇది భారత పతకాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. మహిళల సింగిల్స్‌లో సింధు ఎన్నో సాధించింది. దేశానికి ఎంతో పేరు తెచ్చింది. కానీ ఆమె తర్వాత కోర్ గ్రూపులో ఉండే కొదమ సింహాలను మాత్రం భారత బ్యాడ్మింటన్ రంగం తయారు చేయలేకపోయింది. నిజం చెప్పాలంటే డబుల్స్ ప్రాధాన్యం వల్ల సింగిల్స్ స్టార్లు కరువైనట్లు ర్యాంకింగ్స్ ద్వారా స్పష్టమవుతోంది. పురుషుల డబుల్స్‌లో పదో ర్యాంక్‌తో సాత్విక్–చిరాగ్ జోడీ, మహిళల డబుల్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌తో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ టాప్–10లో ఉన్నాయి. కానీ సింగిల్స్‌లో సింధు (17), మాళవిక బన్సోద్ (23), అనుపమ ఉపాధ్యాయ్ (44), రక్షిత శ్రీ (45), ఆకర్షి కశ్యప్ (48), ఉన్నతి హుడా (55), తస్నిమ్ మీర్ (63), అన్మోల్ ఖరబ్ (67)... లక్ష్య సేన్ (18), ప్రణయ్ (29), కిరణ్ జార్జి (36), ప్రియాన్షు రజావత్ (38), ఆయుశ్ శెట్టి (44), సతీశ్ కుమార్ కరుణాకరన్ (47), తరుణ్ మన్నేపల్లి (53), కిడాంబి శ్రీకాంత్ (54), శంకర్ ముత్తుస్వామి (59)ల ర్యాంక్‌లు సమీప భవిష్యత్తులో భారత బ్యాడ్మింటన్‌కు ఎదురయ్యే సవాళ్లను కళ్లకు కడుతున్నాయి. నంబర్‌వన్ ర్యాంక్ దేవుడెరుగు... అసలు టాప్–10లో నిలువగలిగే ప్లేయరే కనిపించడం లేదు. కానీ... కాంపిటీటివ్ బెంచ్ (పోటీల్లో సత్తాచాటే బెంచ్)ను ముందుచూపుతో తయారు చేయడంలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్లక్ష్యం కనబడుతోంది. కిం కర్తవ్యం? తదుపరి లాస్ ఎంజెలిస్ (2028) ఒలింపిక్స్ సైకిల్ మొదలైంది. తాజా పరిణామాలు, నిరాశాజనక ప్రదర్శనలు, వస్తోన్న ఫలితాలపై ‘బాయ్’ వెంటనే దృష్టి పెట్టాలి. అంటే విశ్వక్రీడలకు ఇంకా మూడేళ్ల సమయం వుంది. ఈ లోపు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ తదితర ఈవెంట్లెన్నో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ‘బాయ్’ గానీ, ‘సాయ్’గానీ ఇప్పుడే మేల్కొవాలి. ఒలింపిక్స్ మిషన్‌కు ఓ విజన్‌తో పని చేయాలి. బాగా ఆడే షట్లర్లు ఎందుకిలా అయ్యారో సమీక్షించాలి. వర్ధమాన షట్లర్లను గుర్తించి ఆర్థిక అండదండలు అందించాలి. కేంద్ర క్రీడా శాఖ ‘టాప్స్’లా ‘బాయ్’ కూడా సానుకూల దృక్పథంతో తమ ప్లేయర్లకు ఇంటా బయటా కోచింగ్‌కు, కోచ్‌లకు పెద్ద ఎత్తున వెచ్చించాలి. ఓ క్రమపద్ధతిలో లక్ష్యాలను పెట్టుకొని ఫలితాల కోసం కష్టపడితే పరిస్థితిలో మార్పు రావొచ్చు.
బిజినెస్

భారత్ విదేశీ రుణాల లెక్కలివే..
భారత్ విదేశీ రుణాలు (అంతర్జాతీయ మార్కెట్ నుంచి రుణాలు, ఇతర రూపాల్లో సమీకరించినవి) 2024 డిసెంబర్ చివరికి 717.9 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.61.74 లక్షల కోట్లు) చేరాయి. 2023 డిసెంబర్ చివరికి ఇవి 648.7 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ‘క్వార్టర్లీ ఎక్స్టర్నల్ డెట్’ నివేదికలోని గణాంకాలు కింది విధంగా ఉన్నాయి.2024 సెప్టెంబర్ చివరికి ఇవి 712.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 0.7 శాతం.. ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చి చూస్తే 10 శాతం అధికమయ్యాయి. జీడీపీలో విదేశీ రుణాలు డిసెంబర్ చివరికి 19.1 శాతానికి చేరాయి. 2024 సెప్టెంబర్ చివరికి 19 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా రూపాయితోపాటు ఇతర ప్రధాన కరెన్సీలతో డాలర్ బలపడడం విదేశీ రుణ భారం విలువ పెరిగేందుకు దారితీసింది.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..డాలర్ మారకంలో 54.8 శాతం..యూఎస్ డాలర్ మారకంలోని బకాయిలు మొత్తం విదేశీ రుణాల్లో 54.8 శాతంగా ఉన్నాయి. ఆ తర్వాత రూపాయి మారకంలో విదేశీ రుణాలు 30.6 శాతంగా ఉంటే, జపాన్ యెన్ మారకంలో 6.1 శాతం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) రూపంలో 4.7 శాతం, యూరో మారకంలో 3 శాతం చొప్పున ఉన్నాయి. మొత్తం విదేశీ రుణాల్లో నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్‌కు సంబంధించి 36.5 శాతం మేర ఉన్నాయి. ఆ తర్వాత డిపాజిట్ స్వీకరించే కార్పొరేషన్లకు సంబంధించి 27.8 శాతం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 22.1 శాతం, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి 8.7 శాతం చొప్పున ఉన్నాయి. విదేశీ మారకంలో చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో రుణాల రూపంలో 33.6 శాతం ఉంటే, కరెన్సీ, డిపాజిట్ల రూపంలో 23.1 శాతం, ట్రేడ్ క్రెడిట్, అడ్వాన్స్‌ల రూపంలో 18.8 శాతం, డెట్ సెక్యూరిటీల రూపంలో 16.8 శాతం చొప్పున ఉన్నాయి.

మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..
స్వల్ప డిమాండ్, నిల్వల సర్దుబాటులో భాగంగా డీలర్లకు సరఫరా తగ్గడంతో మార్చిలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ దేశీయ వాహన విక్రయాలు క్షీణించాయి. మరోవైపు ఎస్యూవీ మోడళ్లకు డిమాండ్ కొనసాగడంతో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది.మారుతీ సుజుకీ దేశీయంగా క్రితం నెలలో 1,50,743 వాహనాలు విక్రయించింది. గత ఏడాది మార్చిలో అమ్ముడైన 1,52,718 వాహనాలతో పోలిస్తే 1% తక్కువ. కాగా ఆర్థిక సంవత్సరం 2024–25(ఎఫ్వై 25)లో దేశీయంగా మొత్తం 17,60,767 ప్యాసింజర్ వాహనాలు అమ్మింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 17,59,881 యూనిట్లుగా ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ వాహన విక్రయాలు 53,001 యూనిట్ల నుంచి 2% క్షీణించి 51,820కు వచ్చి చేరాయి. ఇక ఎఫ్వై 25లో దేశీయంగా 5,98,666 వాహనాలు అమ్మింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 6,14,721 యూనిట్లుగా ఉంది. ఎస్‌యూవీలకు డిమాండ్ లభించడంతో ఎంఅండ్ఎం మార్చి దేశీయ అమ్మకాల్లో 18% వృద్ధి నమోదై 48,048 యూనిట్లకు చేరాయి. ఎఫ్వై25లో దేశీయంగా 5,51,487 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. ఎఫ్వై 2024లో అమ్ముడైన 4,59,877 వాహనాలతో పోలిస్తే ఇవి 20% అధికం.టాటా మోటార్స్ మొత్తం వాహన విక్రయాలు 3% పెరిగి 51,872 యూనిట్లకు చేరుకున్నాయి. ఎఫ్వై 25లో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో 3% క్షీణత నమోదై 5,56,263 యూనిట్లకు దిగివచ్చాయి.ఇదీ చదవండి: లిస్టింగ్‌కు కంపెనీల క్యూప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మార్చి నెలలో 23,430 వాహనాలను విక్రయించినట్లు వాహన్ డేటాలో వెల్లడైంది. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల నుంచి మంచి డిమాండ్ కారణంగా విక్రయాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. తన జెన్3 వాహనాల డెలివరీలను మార్చి నుంచి ప్రారంభించింది. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచి ఏప్రిల్ నుంచి వేగవంతమైన డెలివరీలు అందిచనున్నట్లు ఓలా తెలిపింది.

లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
గతేడాది చివర్లో మందగించిన ప్రైమరీ మార్కెట్ మళ్లీ జోరందుకుంటోంది. కొద్ది రోజులుగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి వరుసగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి. తాజాగా 5 కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: ఇటీవల పలు కంపెనీలు లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ మళ్లీ ఊపందుకుంటోంది. తాజాగా ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకరేజీ సంస్థ ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఈ బాటలో ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, రన్వాల్ ఎంటర్ప్రైజెస్, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, ప్రోజీల్ గ్రీన్ ఎనర్జీ సైతం ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. రూ.745 కోట్లుగతేడాది డిసెంబర్లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ జనవరిలో తిప్పి పంపిన నేపథ్యంలో ఆనంద్ రాఠీ షేర్ మరోసారి సవరించిన ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. వీటి ప్రకారం తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ.745 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. నిధుల్లో రూ.550 కోట్లు దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఆనంద్ రాఠీ బ్రాండుతో బ్రోకింగ్, మార్జిన్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్టుల పంపిణీ తదితర ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తోంది. 2024 సెపె్టంబర్30కల్లా ఆరు నెలల్లో రూ.442 కోట్ల ఆదాయం, రూ.64 కోట్ల నికర లాభం సాధించింది.రూ.2,000 కోట్లుఐపీవో ద్వారా నాన్‌ఫెర్రస్ మెటల్ ప్రొడక్టుల తయారీ సంస్థ జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ రూ.2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇష్యూకింద రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ.1,500 కోట్ల విలువైన వాటాలను ప్రస్తుత ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. నాన్‌ఫెర్రస్ మెటల్ రద్దు రీసైక్లింగ్ ద్వారా కంపెనీ అలాయ్, కాపర్ ఇన్గాట్స్, అల్యూమినియం అలాయ్స్ తదితర ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఐకాన్ స్క్వేర్తో భాగస్వామ్యంతో షార్జాలో గోల్డ్ రిఫైనింగ్ యూనిట్‌ను నెలకొల్పుతోంది.రూ.1,000 కోట్లుఐపీవోలో భాగంగా రియల్టీ రంగ సంస్థ రన్వాల్ ఎంటర్ప్రైజెస్ తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. నిధుల్లో రూ.200 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ.450 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టుల కొనుగోలుకి వెచి్చంచనుంది. 2024 సెపె్టంబర్ 30 కల్లా ఆరు నెలల్లో దాదాపు రూ.271 కోట్ల ఆదాయం, రూ.25 కోట్లకుపైగా నికర లాభం సాధించింది.రూ.600 కోట్లుక్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ సర్వీసులందించే ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిమిటెడ్ మళ్లీ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. కంపెనీ ఇంతక్రితం 2021 సెప్టెంబర్‌లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ లిస్టింగ్‌కు వెళ్లలేదు. ఈక్విటీ నిధుల్లో రూ.481 కోట్లు క్లౌడ్ కంప్యూటింగ్ ఇనస్టలేషన్సహా, డేటా సెంటర్ల కోసం పరికరాల కొనుగోళ్లకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. నెక్స్డిగ్ నివేదిక ప్రకారం దేశీయంగా కమ్యూనిటీ క్లౌడ్ సరీ్వసులను ప్రవేశపెట్టిన తొలి కంపెనీ ఈఎస్డీఎస్కాగా.. 2024 సెప్టెంబర్30కల్లా ఆరు నెలల్లో దాదాపు రూ.172 కోట్ల ఆదాయం, రూ.24 కోట్ల నికర లాభం సాధించింది.రూ.700 కోట్లుపునరుత్పాదక ఇంధన సొల్యూషన్స్ ప్రొవైడర్ ప్రోజీల్ గ్రీన్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ.700 కోట్ల సమీకరించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ.350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత షేర్హోల్డర్లు మరో రూ.350 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.250 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ.19.53 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. ఇండిక్యూబ్ ఐపీవోకు ఓకేసెబీ గ్రీన్ సిగ్నల్క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఐపీవో చేపట్టేందుకు మేనేజ్డ్ వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ కంపెనీ ఇండిక్యూబ్ అనుమతి పొందింది. ఈ బాటలో ఆగ్రోకెమికల్ సంస్థ జీఎస్పీ క్రాప్ సైన్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీ గణేశ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ నిధుల సమీకరణకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్లో దరఖాస్తు చేసిన ఈ 3 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,260 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు తెలుస్తోంది. అయితే ఎడిల్వీజ్ అనుబంధ సంస్థ ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్ లిమిటెడ్, నీల్కాంత్ రియల్టర్స్ ప్రాస్పెక్టస్‌లను సెబీ తిప్పి పంపింది. మరోపక్క జీఎన్జీ ఎల్రక్టానిక్స్, అన్లాన్ హెల్త్‌కేర్ దరఖాస్తులను వెనక్కి తీసుకుంది.రూ.850 కోట్లుఐపీవోలో భాగంగా ఇండిక్యూబ్ రూ.750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.100 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ నిధుల్లో రూ.427 కోట్లు పెట్టుబడి వ్యయాలకు, రూ.100 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. జీఎస్పీ క్రాప్ సైన్స్ ఐపీవోలో భాగంగా రూ.280 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జత గా మరో 60 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ నిధుల్లో రూ.200 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. ఐపీవోలో భాగంగా గణేశ్ కన్జూమర్ రూ.130 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.24 కోట్ల షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు ఆఫర్ చేయనున్నారు.ఇదీ చదవండి: జీఎస్టీ వసూళ్ల రికార్డు

జీఎస్టీ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: మార్చి నెలకు జీఎస్టీ వసూళ్లు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ మొదలైన తర్వాత రెండో నెలవారీ గరిష్ట ఆదాయం ఇదే కావడం గమనార్హం. 2024 ఏప్రిల్ నెలలో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు ఇప్పటి వరకు నెలవారీ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిగా ఉంది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్న్యూస్దేశీ విక్రయ లావాదేవీల రూపంలో ఆదాయం 8.8 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లుగా ఉంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై జీఎస్టీ 13.56 శాతం వృద్థితో రూ.46,919 కోట్లకు చేరింది. స్థూలంగా చూస్తే సెంట్రల్ జీఎస్టీ కింద రూ.38,145 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.49,891 కోట్లు, ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.95,853 కోట్లు, సెస్సు రూపంలో రూ.12,253 కోట్లు చొప్పన మార్చిలో వసూలైంది. ఇక మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.22.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24తో గణాంకాలతో పోల్చి చూస్తే 9.4 శాతం పెరిగింది.
ఫ్యామిలీ

విద్యుత్తు లేకుండా ఆకుకూరలను 36 గంటలు నిల్వ ఉంచే బాక్స్!
దైనందిన ఆహారంలో ఆకుకూరలకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అయితే, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు, చిల్లర వర్తకులు ఆకుకూరలను రెండో రోజు వరకు నిల్వ ఉంచడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే, బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) శాస్త్రవేత్తలు ఈ సమస్యకో పరిష్కారం కనుగొన్నారు. దాని పేరే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్. సాధారణంగా 24 గంటల్లోనే ఆకుకూరలు వాడి పోయి పాడైపోతుంటాయి. అయితే, అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో పెడితే 36 గంటలపాటు తాజాగా ఉంటాయి. ఈ బాక్స్‌ను గది ఉష్ణోగ్రత(26–28 డిగ్రీల సెల్షియస్, 52% గాలిలో తేమ)లో ఉంచి, అందులో ఆకు కూరలు పెట్టి మూత వేస్తే చాలు. విద్యుత్తు అవసరం లేదు. రిఫ్రిజరేషన్ చేయనవసరం లేకుండానే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో ఉంచితే చాలు.. ఆకుకూరలు 36 గంటలు తాజాగా ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు విక్రయించే రిటైల్ షాపులకు, సూపర్ మార్కెట్లకు, తోపుడు బండ్లు/ ఆటోలపై కూరగాయలు అమ్మే వ్యాపారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో పరిశుభ్రమైన స్థితిలో ఆకుకూరలను తాజాదనం కోల్పోకుండా నిల్వ ఉంచుకోవ్చు. ఇతర వివరాలకు... 77608 83948చదవండి: పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!

భాషలోనూ వివక్ష ఎందుకు?
భాషకు రెండువైపులా పదును ఉంటుంది! అందుకే దాన్ని జెండర్ ఈక్వాలిటీతో న్యూట్రల్ చేద్దాం! చాలారోజుల కిందట ... ‘అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డుపాత్రలతో కుస్తీ పడుతున్నారు’ అంటూ తన ప్రొడక్ట్ అయిన అంట్లు తోమే సబ్బు గురించి ఒక యాడ్ ఇచ్చింది ప్రాక్టర్ అండ్ గాంబుల్ సంస్థ. వెంటనే ఆ కంపెనీకి ఓ పదకొండేళ్ల అమ్మాయి నుంచి ఉత్తరం వచ్చింది.. ‘భోజనం అందరికీ కావాలి, అంట్లతో కుస్తీ మాత్రం ఆడవాళ్లే పట్టాలి. మగవాళ్లెందుకు అంట్లు తోమకూడదు? దయచేసి మీ యాడ్‌లో అమెరికాలోని ఆడవాళ్లు అని తీసేసి అమెరికా ప్రజలు అని మార్చండి?’ అని! ప్రాక్టర్ అండ్ గాంబుల్ తన తప్పు తెలుసుకుని ‘అమెరికా ప్రజలు’ అని మార్చుకుంది. ఆ ఉత్తరం రాసిన అమ్మాయెవరో కాదు.. మీడియా పర్సనాలిటీ, బ్రిటిష్ రాచకుటుంబం కోడలు మెఘన్ మార్కల్. ఈ మధ్య.. ‘మా సోషల్ బుక్‌లో ఒకచోట ‘మ్యాన్ మేడ్ ఆర్ నేచురల్?’ అని ఉంది. విమెన్ అని ఎందుకు లేదు? వాళ్లకు చేతకాదనా? మ్యాన్ లేదా ఉమన్ అనే బదులు ప్రజలు అనొచ్చు కదా? అబ్రహం లింకన్ కూడా ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అన్నాడు. ప్రజలంతా సమానమే అనుంటే బాగుండేది కదమ్మా!’ నిండా పదేళ్లు లేని ఓ చిన్నారి ఆలోచన! సవరించుకోవాలి.. పై రెండు ఉదాహరణల్లోని విషయం.. భాషకూ జెండర్ ఈక్వాలిటీ ఉండాలనే! కొడుకు, కూతురు ఇద్దరూ సమానమనే ఎరుక పెంపకంతోనే మొదలవ్వాలని ఎలా అనుకుంటున్నామో.. భాష విషయంలోనూ అలాగే అనుకోవాలి. పనికి సామర్థ్యం, నిర్దేశిత అర్హతలు ప్రామాణికమవుతాయి కానీ స్త్రీ, పురుష జెండర్లు కావు కదా! ఆడవాళ్లు అల్లికలకే పరిమితమై పొవట్లేదు.. అంతరిక్షానికీ వెళ్తున్నారు. అందుకే తదనుగుణంగా భాషను సవరించుకోవాలి. వాళ్లూ మినహాయింపు కారు.. జెండర్ స్పృహ ఉన్న రచయితలు, దర్శకులూ వాస్తవికత, రానెస్ పేరుతో స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరచే తిట్లన్నిటినీ రచనల్లో, సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. అదేమంటే ‘దాన్నెందుకు జెండర్ కోణంలోంచి చూస్తారు? కోపానికో.. ఆవేశానికో ఎక్స్‌ప్రెషన్‌గా చూడాలి కానీ’ అంటూ బదులిస్తున్నారు. అలా స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే మాటలను భావోద్వేగ వ్యక్తీకరణగా భాషలో సర్దేసి.. దాన్నో సాధారణ విషయంగా మన మెదళ్లకు తర్ఫీదునిచ్చిందీ పితృస్వామ్యమే! కానీ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆలోచనను మార్చుకోవలసిన .. ఆ భాషను సరిదిద్దుకోవలసిన అవసరాన్ని గ్రహించాలి. పనులు, వృత్తులకున్న పేర్ల నుంచే ఇది మొదలవ్వాలి. ఈ కసరత్తు వల్ల లైంగిక పరిభాష, స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే భావోద్వేగ వ్యక్తీకరణలూ నెమ్మదిగా మెదళ్ల నుంచి డిలీట్ అవుతాయి.దస్తావేజులు.. పాఠ్యపుస్తకాల్లోనూ.. ఈ విషయంలో పాశ్చాత్యదేశాల్లో కృషి జరుగుతోంది. ముఖ్యంగా ఇంగ్లిష్‌లో! ఎయిర్ హోస్టెస్‌ని ఫ్లయిట్ అటెండెంట్‌గా, మ్యాన్.. ఉమన్ అనే పదాలను పర్సన్‌గా, బాలుడు.. బాలికను చైల్డ్‌గా, వెయిటర్.. వెయిట్రస్‌ను సర్వర్‌గా, యాక్టర్.. యాక్ట్రెస్‌ను పెర్ఫార్మర్గా.. ఇంకా ఫైర్‌ఫైటర్, పోలీస్ ఆఫీసర్ వంటి ఎన్నో జెండర్ న్యూట్రల్ పదాలను ఉపయోగిస్తున్నారు.ఇంకో అడుగుముందుకేసి జెండర్‌ను కేవలం స్త్రీ, పురుషులకే పరిమితం చేయకుండా మిగిలిన ఐడెంటీలనూ కలుపుకుంటూ అతడు, ఆమెకు బదులు They అనే పదాన్ని వాడుకలోకి తెచ్చుకున్నారు. స్కాండినేవియన్ దేశాలు సహా జర్మనీ, పోర్చుగల్, నెదర్లండ్స్ లాంటి యూరోపియన్ దేశాలైతే అధికారిక వ్యవహారాలు, దస్తావేజులు, పాఠ్యపుస్తకాల్లోనూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. చట్టాలు కూడా ప్రగతిశీల దేశాలు కొన్ని లింగ వివక్షను రూపుమాపేందుకు థర్డ్ జెండర్నీ కలుపుకుంటూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్‌ను ్ర΄ోత్సహించే చట్టాలనూ తెచ్చుకున్నాయి. ఆ జాబితాలో అమెరికా (ట్రంప్ వచ్చాక మార్పు వచ్చి ఉండొచ్చు), కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాలున్నాయి. ఇదివరకు స్త్రీకి చదువు లేదు. ఇంటిపట్టునే ఉండేది కాబట్టి ఆ పనులు ఆడవాళ్లకే పరిమితమై వాటి పరిభాష అంతా స్త్రీ లింగంలోనే స్థిరపడింది. ఇప్పుడు మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమంగా రాణిస్తున్నారు. వాళ్ల పనికి గుర్తింపు, గౌరవ మర్యాదలు కావాలి. ఆ ప్రయత్నంలో తొలి అడుగు భాషదే. స్త్రీ, పురుష సమానత్వ ప్రయాణంలోని ప్రతి మార్పునూ గమనిస్తూ తదనుగుణంగా భాషను దిద్దుకోవాలి. భాషకూ జెండర్‌కూ సంబంధం ఉంది భాషకు, జెండర్‌కు ఉన్న సంబంధాన్ని సామాజిక శాస్త్రం, సాంస్కృతిక సిద్ధాంతాలు, భాషాశాస్త్రం, స్త్రీవాద కోణాల నుంచి చూడవచ్చు. విశ్లేషించవచ్చు. దీనిపై 1970ల నుంచే పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. నిత్యజీవితంలో భాషను జెండర్‌ను నిర్దేశిస్తూ కాక, జెండర్ న్యూట్రల్‌గా వాడడానికి అవకాశం ఉందా అన్నది ఇటీవల మనదేశంలోనూ జరుగుతున్న చర్చ. పనిగట్టుకుని స్త్రీ అని చెప్పాలా లేక ఆ హోదా, ఆ పదవి, ఆ స్థానం మాత్రమే చెప్పి, అందులో ఉన్నది స్త్రీ అయినా, పురుషుడైనా సమానమేనని ధ్వనించేలా పదప్రయోగం ఉండాలా అన్నది దీని సారాంశం. ఫలితంగా తెలుగులో అధ్యక్షుడు, అధ్యక్షురాలు అనకుండా ‘అధ్యక్షులు’ అని, మేనేజింగ్ డైరెక్టర్ని కార్యనిర్వహణాధికారి అంటే చాలనే అవగాహనకు వచ్చేశాం. మంత్రి, ఆచార్య, గురువు అనే పదాలనూ ఇద్దరికీ వాడుతున్నాం. చెప్పొచ్చేదేంటంటే భాషకూ జెండర్‌కూ సంబంధం ఉంది. స్త్రీలు మొరటుగా మాట్లాడినా, బూతులు వాడినా వెంటనే గగ్గోలవుతుంది. పురుషుడి దుర్భాషలను సహజంగా తీసుకునే అలవాటు ఇంకా పోలేదు. ఇవన్నీ స్త్రీవాద విమర్శలో చర్చించాల్సిన విషయాలు. – సి. మృణాళిని, రచయిత అనాగరికులుగా పరిగణిస్తారు.. మా ఫినిష్ భాష స్వతహాగా జెండర్ న్యూట్రల్ భాష. స్త్రీ, పురుషులిద్దరికీ ఒకే సర్వనామం ఉంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా కూడా లేకుండా అందరికీ ఒకేరకమైన సంబోధన ఉంటుంది. తెలుగులో స్త్రీకి ఇది, అది అనే పదాలున్నట్టు మా భాషలో లేవు. అందుకే స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరచే మాటలు ఉండవు. ఎప్పుడైనా ఎవరినోటి నుంచైనా అలాంటి ఇంగ్లిష్ మాటలు వినిపిస్తే వాళ్లను అనాగరికులుగా పరిగణిస్తారు. – ముచ్చర్ల రైతా ప్రదీప్, ఆంట్రప్రెన్యూర్ (తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్న ఫిన్లండ్ వనిత)– సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: కాంతివంతమైన కళ్లకోసం...)

కాంతివంతమైన కళ్లకోసం...
అందాన్ని ఇనుమడింప చేసేది ముఖంలోని కలువరేకుల్లాంటి కళ్లే. ఆ కళ్లే అకర్షణీయంగా కనిపిస్తే ఆ అందమే వేరు. అందుకోసం చాలమంది మగువలు తపిస్తుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికి ప్రతి క్రీమ్‌లు, ఐ డ్రాప్స్ వాడుతుంటారు. వాటన్నింటికి మన ఇంట్లో దొరికే సహజమైన వాటితో కళ్లను కాంతిమంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దామా..!.కీరా, బంగాళదుంప రెండిటినీ జ్యూస్ చేసి, కాటన్‌ను గుండ్రంగా చేసుకుని ఆ జ్యూస్లోవుుంచి కళ్లపై పెట్టుకోవాలి. 15–20 నిమిషాల తర్వాత కాటన్ తీసేసి నీటితో కడిగేయాలి. తర్వాత బేబీ ఆయిల్‌ని కంటి చుట్టూ అప్లై చేయాలి. ఇలా చేస్తే అలసిన కళ్ళు తిరిగి కాంతివంతంగా వూరతాయి.కనురెప్పలు పొడవుగా ఒత్తుగా పెరగాలంటే... ప్రతిరోజూ రాత్రి పడుకునే వుుందు క్యాస్టర్ ఆయిల్‌ని అప్లై చేయాలి. రెప్పలు రాలి΄ోకుండా దృఢంగా అవుతాయి. కొబ్బరినూనెను వుధ్యవేలితో తీసుకుని కంటి చుట్టూ గుండ్రంగా వుసాజ్ చేయాలి. ఇలా క్రవుం తప్పకుండా చేస్తే కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు ΄ోతాయి. కంటి కింద చర్మం ఉబ్బెత్తుగా అవ#తుంటే... బంగాళదుంపను గుండ్రంగా కోసి ఒక క్లాత్‌లో చుట్టి 15 నివుుషాల పాటు కళ్ళపైన పెట్టుకోవాలి. నీటిలో కొంచె ఉప్పు కలిపి ఆ నీటితో కళ్ళను కడిగితే కళ్ళు నిర్మలంగా వూరి, మెరుస్తాయి. టొమాటో రసం, నివ్మురసం రెండిటినీ సమపాళల్లో కలిపి కంటి చుట్టూ అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చన్నీటితో ఓసారి, వేడినీటితో ఒకసారి కళ్ళను కడగాలి. (చదవండి: జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!)

ఆటిజం.. అర్థం చేసుకుందాం
సుధ (పేరు మార్చాం) ఇద్దరు పిల్లల తల్లి. పిల్లలకు ఏడాదిన్నర వయసు నుంచి మారాం చేసినా, అన్నం తినకపోయినా సెల్ఫోన్లో వీడియోలు పెట్టి చూపించడం అలవాటు చేసింది. ఐదేళ్ల వయసుకు వచ్చినా ఇద్దరు పిల్లలకు మాటలు సరిగా రాలేదు. ఎవరు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వైద్యులను సంప్రదిస్తే ఆటిజం అని చెప్పారు.రాజ్యలక్ష్మికి నెలలు నిండకుండానే ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు కుమారుల్లో ఒకరికి రెండేళ్లు వచ్చే వరకు నడక రాలేదు. వైద్యుల వద్దకు వెళ్లగా ఆటిజం ఉన్నట్టు తేల్చారు. రెండో బాబుకు సమస్య పాక్షికంగా ఉన్నట్టు చెప్పారు.ఇదో జబ్బు అని చెప్పలేం. బుద్ధి మాంద్యతా అంటే అదీ కాదు. మానసిక వైకల్యం అనీ అనలేం. ఏదో పెద్ద లోపంగా పరిగణించలేం. ప్రత్యేకంగా మందులంటూ ఏమీ లేవు. ఎందువల్ల దీని బారిన పడతారనే దానికి స్పష్టమైన కారణాలూ ఇప్పటివరకు తెలియవు. థెరపీలు, తల్లిదండ్రులకు అవసరమైన కౌన్సెలింగ్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం. అదే ఆటిజం (సాధారణ పిల్లల్లా లేకపోవడం). ఇది చిన్న పిల్లల్ని పీడించే ఓ రుగ్మత..ఓ సమస్య అని మాత్రమే చెప్పగలమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆటిజంతో బాధ పడుతున్న కొందరిలో తెలివితేటలు (ఇంటెలిజెన్స్ కోషియంట్– ఐక్యూ) ఒకింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కాగా ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం కానీ వేరుగా చూడడం కానీ చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో ఉండాల్సిన సహజ చురుకుదనం లేమి కారణంగా తల్లిదండ్రులను ఎంతో వేదనకు గురిచేసే ఆటిజంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం మీ కోసం..ఏంటీ ఆటిజం.. ?ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మత. అంటే న్యూరలాజికల్ డిజార్డర్‌గా భావించవచ్చు. అంతేగానీ ఓ జబ్బుగా పరిగణించడానికి వీల్లేదు. ఒకే రకమైన/నిర్దిష్ట లక్షణాలుండవు. ఏ ఇద్దరు పిల్లల్లోనూ ఒకేలా ఉండవు. లక్షణాల విస్తృతి చాలా ఎక్కువ. అందుకే దీనిని స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన రుగ్మత) లేదా ఆటిజమ్ స్పెక్ట్రమ్ అని చెబుతుంటారు. ఎలాంటి లక్షణాలుంటాయి?» చూడటానికి సాధారణ పిల్లల్లాగే కన్పిస్తుంటారు. కానీ.. » వయసుకు తగిన వికాసం లోపించిందా? అన్పించవచ్చు. » సాధారణ చిన్నారుల్లా ప్రతిస్పందించకపోవచ్చు. పేరు పెట్టి పిలుస్తున్నా పలుకకపోవచ్చు. » ఇతరులతో సమాచారం పంచుకోవడం (కమ్యూనికేషన్లో ఇబ్బంది), సంభాషిoచడంలో ఇబ్బంది పడుతుండొచ్చు. ఎదుటివారి కళ్లలో కళ్లు కలిపి చూస్తూ మాట్లాడలేరు. ఎంత పిలిచినా పలకకుండా వినికిడి లోపం ఏదైనా ఉందేమో అనిపించేలా ప్రవర్తిస్తారు. » దాదాపు 25 శాతం మంది చిన్నారులు మాటల్ని సరిగా పలుకలేరు. మాటలు రావడంలో ఆలస్యం అవుతుంది. » ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటుండొచ్చు లేదా పలికిన మాటే పదే పదే పలుకుతూ ఉండవచ్చు. » యాస్పర్జస్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో తెలివితేటలు ఒకింత ఎక్కువగా ఉండి, కొన్ని పనుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. » కుదురుగా ఉండకుండా ఎప్పుడూ పరుగెడుతూ, గెంతుతూ ఉంటారు.» నీట్‌గా ఉండకపోవడం. చక్కగా డ్రస్ చేసుకోడానికి,సమయానికి హెయిర్ కట్ చేయించుకోడానికి నిరాకరించడం.» చేసిన పనులే పదే పదే చేస్తుండటం (రిపిటేటివ్ బిహేవియర్). కొత్త పనులపై ఆసక్తి చూపకపోవడం. ఎప్పుడూ తమకు ఇష్టమైన ఆట వస్తువునో మరొకటో పట్టుకుని ఉండటం. » గోడలపై ఉన్న సున్నం నాకడం లేదా తినడానికి యోగ్యం కాని పదార్థాలను తినడానికి యత్నించడం (పేపర్లు, షర్ట్ కాలర్ వంటి వాటిని నోట్లో పెట్టుకుని తినడానికి ప్రయత్నించడం లాంటి డిజార్డర్లు). » పిల్లలు సాధారణంగా చేసే గీతలు గీయడం, రాయడం, కత్తెర వంటి పనిముట్లను ఉపయోగించడం, నమలడం కూడా సరిగా చేయకపోవడం » సంతోషం, బాధ వంటి భావనలను త్వరగా అర్థం చేసుకోలేరు. వాటిని అర్థమయ్యేలా చెప్పలేరు. » తలను గోడకు లేదా నేలకేసి బాదుకోవడం, ఇతరులను బలంగా ఢీకొట్టడం,వస్తువులను విసిరేయడం వంటి దురుసు ప్రవర్తనలు కనబరచడం.రకరకాల థెరపీలతోనే చికిత్సచిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. చదవండి: టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
ఫొటోలు


బాంధవి శ్రీధర్ వాటే గ్లామర్... మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ (ఫోటోలు)


'శారీ' మూవీ ప్రీరిజ్లో మెరిసిన నటి ఆరాధ్య దేవి (ఫొటోలు)


వయ్యారాల నడకలతో కనువిందు చేసిన బ్యూటిఫుల్ ఉమెన్స్ (ఫొటోలు)


#IPL2025 : ముంబై మ్యాచ్‌లో ఆమె ఎవరు.. పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్? (ఫోటోలు వైరల్)


ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


రామ్ గోపాల్ వర్మ 'శారీ'మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)


'కోర్ట్' బ్యూటీ జర్నీ.. కాకినాడ నుంచి మెగాస్టార్ ఇంటివరకు (ఫొటోలు)


గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు (ఫోటోలు)


పాలరాతి శిల్పంలా మిల మిల మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ (ఫోటోలు)


ఏపీలో ఈ కోదండరామాలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
International

Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫెక్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన.

మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు
నేపిడా: ప్రకృతి ప్రకోపానికి మయన్మార్.. మరుభూమిగా మారింది. గత శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేసింది. భూకంపం దరిమిలా ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. భూకంప మృతుల సంఖ్య 2,056 కు చేరింది. దాదాపు 3,900 మంది గాయపడ్డారు. 270 మంది గల్లంతయ్యారు.మరింత దిగజారిన పరిస్థితులు మయన్మార్(Myanmar)లోని ప్రధాన పట్టణాలైన మండలే, నేపిడాలలో భూకంప బాధితులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. దీంతో అందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వారికి చికిత్స అందించేందుకు స్థలం, వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ రెండు నగరాల్లోని వైద్య సిబ్బంది బాధితులను ఆదుకునేందుకు నిరంతరం తమ సేవలు అందిస్తున్నారు.సైనిక పాలనలో..పలు నివేదికల ప్రకారం గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక పాలన(Military rule) మయన్మార్‌లో ఆరోగ్య సేవలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. భూకంపానికి ముందు నుంచి పలు ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మండలేలో పరిస్థితి దారుణంగా ఉంది. 80 శాతానికిపైగా వైద్య సిబ్బంది సైనిక పాలనకు వ్యతిరేకిస్తున్నారు. గడచిన నెలలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశారు. భూకంపానికి ముందే మండలేలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేశారు.ఆస్పత్రులు ధ్వంసంభూకంపం కారణంగా కొన్ని ఆస్పత్రులు ధ్వంసం కావడంతో బాధితులందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా ఉన్న ఆస్పత్రులలో పడకల కొరత అధికంగా ఉంది. రోగులను నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. కాగా మయన్మార్ వాతావరణ, జలశాస్త్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం భారీ భూకంపం తరువాత 36 భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 2.8- 7.5 మధ్య ఉంది. శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది.ఇది కూడా చదవండి: చిరాగ్ పాశ్వాన్ తల్లి గదికి తాళం.. రోడ్డునపడ్డ కుటుంబ కలహాలు

అమెరికాలోనే చనిపోతా: ఎలాన్ మస్క్
విస్కాన్సిన్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికా పట్ల తన తిరుగులేని నిబద్ధతను ప్రకటించారు. ‘నేను ఎక్కడికీ వెళ్లను. అమెరికాలోనే ఉంటా. ఇక్కడే చచ్చిపోతా. అంగారక గ్రహం మీదికి నేను వెళ్లినా అది కూడా అమెరికాలో భాగంగానే ఉండిపోతుంది’అంటూ ఆదివారం విస్కాన్సిన్ టౌన్హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మస్క్ ఇద్దరు విస్కాన్సిన్ ఓటర్లకు పది లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తన రాజకీయ గ్రూపునకు వీరిద్దరినీ ప్రతినిధులుగా ప్రకటించారు. త్వరలో జరగనున్న విస్కాన్సిన్ సుప్రీంకోర్టు ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాకు, నాగరికత భవిష్యత్తుకు కీలకమైనవని పేర్కొన్నార

సుంకాల మోత వేళ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విధింపు వేళ(reciprocal tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక ప్రకటన చేసే సమయంలో వాణిజ్య భాగస్వాముల పట్ల తాను మరింత దయతో వ్యవహరిస్తానని ప్రకటించారాయన. అయితే కచ్చితంగా ఎలాంటి పరస్పర సుంకాలు విధించబడతాయనేది మాత్రం మంగళవారం రాత్రికల్లా లేదంటే బుధవారం పొద్దునే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తన అధికారాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు(Tariffs) తప్పదని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటించిన ఆ ప్రతీకార టారిఫ్‌ల డెడ్‌లైన్ ఏప్రిల్ 2 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొన్నాయి. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై చర్చ నడుస్తోంది. అయితే..తాజాగా.. ‘‘మీరు రెండు రోజుల్లో చూడబోతున్నారు.. మేం చాలా దయతో ఉంటాం’’ అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. కొన్ని దేశాలకు ఊరట దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు టారిఫ్‌లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని భారత్ ఇంతకాలం భావిస్తూ వచ్చింది. కానీ, సుంకాల ప్రకటన అనుకున్న తేదీకే ఉంటుందని ట్రంప్ చెప్పడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. అయితే.. భారత్‌ను ఆయన ప్రత్యేక మిత్రపక్షంగా భావిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు ప్రత్యేక ఊరట ఏమైనా దక్కుతుందేమో చూడాలి. అయితే.. ఇదీ చదవండి: భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..పరస్పర సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని వైట్‌హౌజ్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ అంటున్నారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాలను ప్రస్తావిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు నిలిపివేయాల్సిన అవసరం ఉందని లీవిట్ అభిప్రాయపడ్డారు.సుంకాల మోత ఎందుకంటే.. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన. అందుకే ప్రతీకార సుంకాల విధింపు తప్పదని అంటున్నారు.ట్రంప్ ప్రకటన కంటే ముందే..మరోవైపు ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చైనా, కెనడా, యూరోపియన్ యూనియన్ నుంచి ప్రతిఘటన తప్పదని అంటున్నారు. మరోవైపు.. ట్రంప్ సుంకాల ప్రకటన చేయకముందే ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. టారిఫ్ వార్‌ను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఒక అడుగు ముందుకు వేశాయి. దక్షిణ కొరియా-జపాన్-చైనా దేశాలు ప్రాంతీయ వాణిజ్యం ప్రొత్సాహం దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆదివారం చర్చలు జరిపాయి.
National

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
న్యూఢిల్లీ: కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయేలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన తెలుగుదేశం, జేడీ(యూ) తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆదేశించాయి. బిల్లుకు మద్దతు పలకాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు సైతం తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు. బీఏసీ సమావేశం నుంచి విపక్షాల వాకౌట్ వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. విపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలన్న ప్రతిపాదనకు వారు అంగీకరించారు. అయితే, ఈ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం తమ గొంతును అణచివేస్తోందని ఆరోపిస్తూ బీఏసీ సమావేశం నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే బుధవారం లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ‘ఇండియా’ కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాందీ, కేసీ వేణుగోపాల్, రాంగోపాల్ యాదవ్, సుప్రియా సూలే, కల్యాణ్ బెనర్జీ, సంజయ్ సింగ్. టి.ఆర్.బాలు, తిరుచ్చి శివ, కనిమొళి, మనోజ్‌కుమార్ ఝా తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను అణచివేయడానికే వక్ఫ్(సవరణ) బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.బిల్లుకు మద్దతు పలుకున్న తెలుగుదేశం, జేడీ(యూ)లకు ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగవిరుద్ధమైన బిల్లును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ బీఏసీ సమావేశం జరిగింది. గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి.ఏమిటీ వివాదం? వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి. ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్

‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. 2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి. ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం (Yogi Adityanath) పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో (Bulldozer justice) కూల్చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.రూ.10లక్షల నష్టపరిహారం ఆ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బూల్డోజర్ చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌తో పాటు ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సూచించింది.అది మా పొరపాటేఅంతకుముందు అడ్వకేట్, ప్రొఫెసర్ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్ అతిక్ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదుకూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి. పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్ ఎస్.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయిఈ కేసులు మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి. పిటిషనర్ల ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది. అందరూ కలత చెందుతున్నారుఅదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో బుల్డోజర్ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. బెయిల్ కోసం హైకోర్టుకు రన్యారావు
బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు (Ranya Rao) బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో ఆమెకు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ వారం లేదా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆమె డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) కస్టడీలో ఉన్నారు.కాగా, రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది.2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది.

రేపు లోక్‌సభకు వక్ఫ్ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్
ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును రేపు(బుధవారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన తరుణంలో బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది ఆ పార్టీ అధిష్టానం. రేపు తప్పనిసరిగి బీజేపీ ఎంపీలంతా లోక్ సభలో ఉండాలంటూ విప్ జారీ చేసింది. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కిరణ్ రిజిజువక్ఫ్ సవరణ బిల్లును మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం మధ్యాహ్నం గం. 12.15 ని.లకు వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. దీనిపై ఎనిమిది గంటలపాటు చర్చ జరపనున్నారు ఎంపీలు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్ సభకు హాజరుకావాలని విప్ జారీ చేశారు. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి.
NRI

Garimella Balakrishna Prasad అస్తమయంపై నాట్స్ సంతాపం
అన్నమయ్య కీర్తనల గానం ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇకలేరు. వారి కుటుంబ సభ్యులకు మనసారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మహానుభావుడైన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. వారి గానం యుగయుగాల పాటు మనలో జీవించే ఉంటుందంటూ నాట్స్ నివాళులర్పించింది. గరిమెళ్ల గళంలో అన్నమయ్య అమృతంఆచార్య తాడేపల్లి పతంజలికొందరు జీవించి ఉన్నప్పుడే తాము ఎంచుకున్న క్షేత్రంలో అంకితభావంతో కృషిచేసి ప్రసిద్ధులవుతారు. శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఈ లోకానికి సిద్ధ పురుషులుగా మిగిలిపోతారు. అటువంటి వారిలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఒకరు.‘పుడమి నిందరి బట్టె భూతము కడుబొడవైన నల్లని భూతము‘ అని అన్నమయ్య వేంకటేశుని గురించి వర్ణిస్తాడు. ఆ అన్నమయ్య కీర్తనల భూతం ఎప్పటినుంచో సంగీత సాహిత్య ప్రపంచంలో చాలా మందిని పట్టుకొని వదలటం లేదు.అటువంటి అన్నమయ్య వేంకటేశుని భూతము పట్టినవారిలో గరిమెళ్ళ ఒకరు. తన మనసుని పట్టుకున్న అన్నమయ్య కీర్తనకి అద్భుతమైన తన గాత్ర రాగ చందనాన్ని అద్ది సంగీత సాహిత్య ప్రియుల హృదయాలలో పట్టుకునేటట్లు కలకాలం నిలిచి ఉండేటట్లు చేసారు. ఒకటా రెండా... వందల కొలది అన్నమయ్య కీర్తనలు గరిమెళ్ళ వారి స్వరరచనలో విరబూసిన వాడిపోని కమలాలుగా, సౌగంధికా పుష్పాలుగా నేటికీ విరబూస్తున్నాయి. భావ పరిమళాలు వెదజల్లుతున్నాయి.NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఒక గొప్ప రహస్యంఎందరు గాయకులు పాడుతున్నప్పటికీ ప్రత్యేకంగా శ్రీ గరిమెళ్ళ అన్నమయ్య కీర్తన ఇంతగా ప్రచారం కావడం వెనుక ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, అన్నమయ్య మానసిక స్థాయికి తాను వెళ్లి, రసానుభూతితో పాడారు కనుకనే గరిమెళ్ళ వారి అన్నమయ్య కీర్తన సప్తగిరులలోను, లోకంలోను ప్రతిధ్వనిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నడుస్తూనే ఈ లోకం నుంచి సెలవు తీసుకొన్నారు. బహుశా ఆ సమయంలో కూడా అన్నమయ్య కీర్తన ఏదో ఆయన మనస్సులో ప్రస్థానం సాగించే ఉంటుంది. అనుమానం లేదు.సంగీత ప్రస్థానంశ్రీ గరిమెళ్ళ సంగీత ప్రస్థానం చాలా విచిత్రంగా సాగింది. మొదట్లో సినిమా పాటలు పాడేవారు. తర్వాత లలిత సంగీతం, ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం ఆయనను తన అక్కున చేర్చుకుంది. తన పినతల్లి అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయని ఎస్. జానకి గారి ఇంట్లో ఆరు నెలల పాటు ఉండి ఆమెతో కలిసి రికార్డింగ్లకి వెళ్లేవారు. జానకి గారు గరిమెళ్ళ వారిని ఎంతోప్రోత్సహించారు. బాలకృష్ణ ప్రసాద్ మొదట్లో చిన్న చిన్న కచేరీల్లో మృదంగం వాయించేవారు. తన 16వ ఏట చలనచిత్ర గీతాలతో పాటు భక్తి పాటలు కలిపి మొదటి కచేరీ చేసారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చేసిన కచేరీలు, శబ్దముద్రణలు (రికార్డింగ్‌లు లెక్కకు అందనివి.కొత్త పద్ధతిసాధారణంగా ఎవరైనా ఒకే వేదిక నుంచి ఒకరోజు సంకీర్తన యజ్ఞం చేస్తారు కానీ బాలకృష్ణ ప్రసాద్ ఒక వారం రోజులపాటు ఒకేవేదిక నుంచి సంకీర్తన యజ్ఞం చేసి ఒక కొత్త పద్ధతినిప్రారంభించారు. టెలివిజన్ మాధ్యమాల ద్వారా అనేక మందికి సంగీతపు పాఠాలు నేర్పించారు.నేదునూరి నోట – అన్నమయ్య మాటఅప్పట్లో ప్రసిద్ధమయిన ఆకాశవాణి భక్తి రంజనిలో బాలకృష్ణ ప్రసాద్ ని పాడటానికి సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆహ్వానించారు. పోంగిపోయారు బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ గానానికి సంతోషించిన నేదునూరి తిరుపతి అన్నమాచార్యప్రాజెక్టులో చేరమని సలహా ఇచ్చారు. అలా అన్నమయ్య కు వేంకటేశునికి బాలకృష్ణ ప్రసాద్ దగ్గరయ్యారు. అన్నమాచార్యప్రాజెక్టుకు బాలకృష్ణప్రసాద్ అందించిన సేవలు సాటిలేనివి.పురస్కారాలురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు, శ్రీపోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు ఇలా కోకొల్లలు. అన్నమాచార్య సంకీర్తన సంపుటి, అన్నమయ్య నృసింహ సంకీర్తనం వంటి పుస్తకాలు తెలుగు, తమిళ భాషల్లో ఆయన ప్రచురించారు. గరిమెళ్ళపై ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన గ్రంథాలు సమర్పించారు.శివపదం కూడా...గరిమెళ్ళ ఎంతటి అన్నమయ్య వేంకటేశ భక్తులో అంతగా శివభక్తులు కూడా. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శివునిపై రచించిన సాహిత్యానికి, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ మృదుమధురంగా స్వరపరిచి పాడారు. ‘‘అడుగు కలిపెను’’,’’ఐదు మోములతోడ’’, ‘‘అమృతేశ్వరాయ’’ వంటి కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పోందాయి. ‘చూపు లోపల త్రిప్పి చూచినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు‘ అంటూ ఒక శివ పద కీర్తనలో బాల కృష్ణప్రసాద్ ఆర్తి మరిచిపోలేనిది. ఆంజనేయుడు మొదలయిన ఇతర దేవతలపై కూడా గరిమెళ్ళ పాడిన పాటలు ప్రసిద్ధాలు.అన్నమయ్య స్వరసేవ‘అన్నమయ్యకు స్వరసేవ చేయడం తప్ప మరో ప్రపంచం తెలీదు. అన్నమయ్య పాటలే ప్రపంచంగా బతికారు. ఆ పాటలు వినని వాళ్లకు కూడా బలవంతంగా వినిపించేవారు. ప్రతి ఇంట్లో అన్నమయ్య పాట ఉండాలి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తపన పడేవారు. అన్నమయ్య కీర్తనలు స్వరం, రాగం, తాళం తూకం వేసినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టేవారు.’’ అని బాలకృష్ణ ప్రసాద్ సతీమణి రాధ చెప్పారు. అన్నమయ్య చెప్పినట్లు ‘‘ఇదిగాక వైభవంబిక నొకటి కలదా?’’చిరస్మరణీయంతెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి నెల 6న నిర్వహించిన అన్నమాచార్య సంకీ ర్తన విభావరియే ఆయన చివరి కచేరీ. నాలుగు నెలలుగా గొంతు సరిగా లేకపోవడంతో ఎక్కడా కచేరీ చేయలేదని, నీదే భారమంటూ స్వామికి మొక్కి వచ్చినట్లు ఆయన ఆర్ద్రంగా యాదగిరి గుట్టలో చెప్పిన విషయం చిరస్మరణీయం.అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20కొత్త రాగాలు కూడా సృష్టించారు.ప్రసూన బాలాంత్రపుమంద్రస్థాయిలోని మధుర స్వరం భక్తి, ప్రేమ రంగరించి రూపం దాలిస్తే అది బాలకృష్ణ ప్రసాద్ అవుతుంది. ఈ తరం వారికి అన్నమయ్య పాటలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది బాలకృష్ణ ప్రసాద్. లలిత సంగీత ధోరణిలో అన్నమయ్యను అందరికి దగ్గర చేసిన ఘనత ఆయనది.1948 నవంబర్ 9న రాజమండ్రిలో కృష్ణవేణి, గరిమెళ్ళ నరసింహరావులకు జన్మించారు బాలకృష్ణ. ఇంటిలో అందరూ సంగీత కళాకారులే కావడం వల్ల ఆయన పాటతోనే పెరిగారు. ప్రముఖ నేపథ్యగాయని జానకి వారి పినతల్లి. సంగీతం ఎంతో సహజంగా వారికి అబ్బింది కనుకే ఒక పాట రాసినా, సంగీతం కూర్చినా, పాట పాడినా అది అందరి మనస్సులను ఆకర్షించింది. 1980లో మాట. టి.టి.డి వాళ్ళు అన్నమాచార్యప్రాజెక్ట్ మొదలు పెట్టి రాగి రేకులలో దొరికిన అన్నమయ్య పాటలను ప్రజలకు చేర్చాలని నిశ్చయించారు. అప్పటికే కొన్ని పాటలు జనంలో వున్నా అవి అన్నమయ్య పాటలు అని తెలియదు.ఉదాహరణకు ‘జో అచ్యుతానంద’. ఒక ఉద్యమంగా ఈ పాటలు ప్రచారం చెయ్యాలని ప్రతిపాదన. ప్రముఖ విద్వాంసులు రాళ్ళపల్లి అనంత కృష్ణ్ణశర్మ, నేదునూరి కృష్ణమూర్తి, బాలాంత్రపు రజనీకాంతరావు, మల్లిక్ ఈ పాటలకు సంగీతం కూర్చారు. ఆ తరువాత తరం కళాకారులు బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు. నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర బాలకృష్ణ ప్రసాద్ స్కాలర్‌షిప్‌తో శిష్యులుగా చేరి శాస్త్రీయ సంగీతం, అన్నమయ్య పాటలు నేర్చుకున్నారు. నేదునూరి గారు ముందుగా స్వరపరచినది ‘ఏమొకో చిగురుటధరమున’ అనే పాట. ఇది కీర్తన అనేందుకు లేదు. మాములుగా శాస్త్రీయ సంగీతంలో కనిపించే ధోరణులు ఇందులో ఉండవు. మరో పాట ‘నానాటి బ్రతుకు’ కూడా ఇటువంటిదే. ఆ పాటలలో భావం, కవి హృదయం వినే మనస్సుకు అందాలి.అది ఆ సంగీతంలోని భావనా శక్తి. అదే బాలకృష్ణ ప్రసాద్ గారికి స్ఫూర్తి. ఇక అన్నమయ్య పాట పుట్టింది. ప్రచారంలో ఉన్న త్యాగరాజ కీర్తనలకు భిన్నంగా నడిచింది ఈ సంగీతం. నిజానికి అన్నమయ్య త్యాగరాజ ముందు తరం వాడు. అదే బాటలో మొదటి అడుగుగా ‘వినరో భాగ్యం విష్ణు కథ’ పాటలా మన ముందుకు వచ్చింది. నేదునూరి రాగభావన అందిపుచ్చుకుని బాలకృష్ణ ప్రసాద్ ముందుకు నడిచారు. ‘చూడరమ్మ సతులాలా’ అన్నా, ‘జాజర పాట’ పాడినా, ‘కులుకుతూ నడవరో కొమ్మల్లాలా’ అన్నా బాలకృష్ణ ప్రసాద్ గొంతులో భావం, తెలుగు నుడి అందంగా ఒదిగిపోతాయి.అలాప్రారంభం అయిన బాలకృష్ణ ప్రసాద్ సంగీత ప్రస్థానం 150 రాగాలతో 800 పైగా సంకీర్తనలకు సంగీతం కూర్చడం దాకా సాగింది. అన్నమయ్య కీర్తనలకు రాగి రేకులలో ప్రతిపాదించిన రాగాలతో కొన్ని సంగీత పరచినా, కొన్ని పాట అర్థానికి, అందానికి తగినట్లుగా సుందర రంజని, వాణిప్రియ వంటి దాదాపు 20 కొత్త రాగాలు కూడా సృష్టించారు. అన్నమయ్యవి అచ్చ తెలుగు పాటలు. బాలకృష్ణ ప్రసాద్ గొంతులో ఆ తెలుగు సొబగు మృదుమధురంగా వినిపిస్తుంది. ఆయన సంగీతంలో అనవసరమైన సంగతులు ఉండవు. పాట స్పష్టంగా, హృదయానికి తాకేటట్లు పాడడమే ఉద్దేశం. విన్న ప్రతివారు మళ్ళీ ఆ పాట పాడుకోగలగాలి. దీనికై వారు అన్నమయ్య సంగీత శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రచారం చేశారు.400 పైగా కృతులను తెలుగు, సంస్కృత భాషల్లో రచించారు బాలకృష్ణ. అనేక వర్ణాలు, తిల్లానాలు, జావళీలు రచించారు. 400కు పైగా లలిత గీతాలు రచించారు. 16 నవంబర్ 2012లో టి.టి.డి ఆస్థాన గాయకులుగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన గాయకులుగా నియమించబడ్డారు. ఆయన లలిత గీతాలు కూడా రచించారు. ఆంజనేయ కృతి మణిమాల, వినాయక కృతులు, నవగ్రహ కృతులు, సర్వదేవతాస్తుతి రచించి క్యాసెట్టు రూపంలో అందించి తెలుగు వారి పూజాగృహంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాట ఒక అనుభూతి, ఒక స్వర ప్రవాహం, ఒక భావ సంపద. కొందరికి మరణం ఉండదు. వారి పాట, మాట నిత్యం మనతోనే ఉంటాయి. బాలకృష్ణ ప్రసాద్ అటువంటి మహనీయుడు.

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది
క్రైమ్

అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
సంగారెడ్డి, సాక్షి: అమీన్పూర్ చిన్నారుల మృతి కేసు(Ameenpur Children Death Case)లో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే కడతేర్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్యపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Rajitha) కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం.రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూయగా.. భర్త చెన్నయ్యకు అనుమానం రావొద్దని కడుపు నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరిందామె.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా, ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అడ్డగుట్ట సొసైటీలోని హాస్టల్లో ఉంటున్నాడు.సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో హాస్టల్ నిర్వాహకుడు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమలో ఓడిపోవడమే తన మరణానికి కారణమని రాసి ఉన్న లెటర్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పై పడిన సెల్‌ఫోన్ తీసుకుంటుండగా...శామీర్‌పేట్: రోడ్డు పడిన సెల్ ఫోన్ తీసుకుంటుండగా కారు ఢీ కొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట్ జిల్లా, మామిడ్యాల గ్రామానికి చెందిన పొట్ట ప్రవీణ్ (23), హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై రాజీవ్ రహదారి మీదుగా వెళుతుండగా తుర్కపల్లి గ్రామ సమీపంలో తన జేబులోంచి సెల్‌ఫోన్ రోడ్డుపై పడింది. దీంతో కిందపడిన సెల్‌ఫోన్‌ను తీసుకుంటుండగా అదే సమయంలో నగరం నుంచి వేగంగా వచి్చన ఎర్టిగా కారు వెనక నుంచి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
కృష్ణరాజపురం/ బనశంకరి: బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్ చేసి ముప్పుతిప్పలు పెట్టి దోచుకున్న ముఠా ఉదంతమిది. కిలాడీ మహిళ ఒక ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం. ముఠా బెదిరింపులను తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిలాడీ శ్రీదేవి రుడగి (25), ఆమె ప్రియుడు సాగర్ మోరే (28), రౌడీషీటర్ గణేష్ కాలే (38) లను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మహాలక్ష్మి లేఔట్లో ప్రీ స్కూల్ నిర్వహిస్తున్న శ్రీదేవి అసలు నిందితురాలు. ఆమె ప్రీస్కూల్‌కు రాకేష్ వైష్ణవ్ (34) అనే వ్యాపారవేత్త తన పిల్లలను పంపించేవాడు. అలా అతనితో పరిచయం పెంచుకుని స్కూలు నిర్వహణ కోసమని రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. డబ్బు వాపసు ఇవ్వాలని అడగగా ప్రీ స్కూల్ పార్టనర్ కావాలని కోరింది. చనువు పెంచుకుని కలిసి తిరిగేవారు. కొత్త ఫోను, సిమ్ శ్రీదేవితో మాట్లాడేందుకు కొత్త సిమ్, ఫోన్‌ను రాకేష్ కొనిచ్చాడు. శ్రీదేవి అతనికి ముద్దు పెట్టి రూ.50 వేలు చొప్పున తీసుకుంది. నీతోనే రిలేషన్షిప్లో ఉంటానని చెప్పి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో రాకేష్‌కు విసుగొచ్చి ఆమె సిమ్‌ను విరగ్గొట్టి పారేశాడు. టీసీ ఇస్తామని పిలిచి కిడ్నాప్ రాకేష్ ఆమె సూచన మేరకు మార్చి 12న పిల్లలకు టీసీని తీసుకునేందుకు ప్రీ స్కూల్‌కు వచ్చాడు. అప్పుడు శ్రీదేవితో పాటు నిందితులు సాగర్ మోరే, గణేష్ కాలే ఉన్నారు. వారు రాకేష్ పై దాడి చేసి, సాగర్‌తో శ్రీదేవికి నిశ్చితార్థం అయ్యింది. నువ్వు ఆమెతో మజా చేస్తున్నావా? ఈ సంగతిని శ్రీదేవి తండ్రికి, నీ భార్యకు చెబుతానంటూ రాకేష్‌ను బ్లాక్మెయిల్ చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్దాం పద అంటూ రాకే‹Ùను ఎక్స్‌యూవీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంతటితో వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని రాకే‹Ùను ఒత్తిడి చేశారు. చివర రూ.20 లక్షలు ఇస్తే చాలని డిమాండ్ చేశారు. ఆఖరికి రూ.1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. నిందితులు బిజాపురవాసులు శ్రీదేవి విద్యార్థుల తండ్రులను తీయని మాటలతో మోసపుచ్చి వలలో వేసుకునేదని, ముద్దు ఇస్తే రూ.50 వేలు ఇవ్వాలనే షరతుతో సల్లాపాలు నడిపేదని వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురూ విజయపుర (బిజాపుర) జిల్లా నివాసులు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చి చాతుర్యాన్ని ప్రదర్శించారు. రౌడీ గణేశ్ కాలేపై బెదిరింపులు, దోపిడీ, హత్యాయత్నం వంటి 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కిలాడీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి పోలీస్‌కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దర్యాప్తులో మరిన్ని హనీట్రాప్ బాగోతాలు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో ఈ హనీట్రాప్ దందా సంచలనం కలిగిస్తోంది. ఈమె బారిన మరికొందరు పడి ఉంటారని అనుమానాలున్నాయి.మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ మార్చి 17న మళ్లీ రాకేష్ కు శ్రీదేవి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని, అప్పుడే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు, చాటింగ్‌ను డిలిట్ చేస్తాను, లేకుంటే నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో విసిగిపోయిన రాకేష్ చివరకు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీదేవి, గణేష్, సాగర్లను అరెస్టు చేసి మరింత విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు.

లింగమయ్య హత్య కేసులో ‘పరిటాల’ ఒత్తిళ్లు
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్య కేసులో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం ఒత్తిళ్ల మేరకే వ్యవహరిస్తున్నారని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో 20 మందికి పైగా పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా, కేవలం ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. హత్య ఘటనకు సంబంధించి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు ధర్మవరపు ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడుపై మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పూర్తిగా ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో నడుస్తూ.. టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా పని చేస్తున్నారనేందుకు ఈ సంఘటన తాజా ఉదాహరణ అని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎస్ఐ.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ రామగిరి మండలంలో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. గత వారం జరిగిన రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీరు తీవ్ర వివాదాస్పదమైంది.అదే సమయంలో పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శనాయుడు, మనోజ్ నాయుడు తదితరులు వరుసగా రెండు రోజుల పాటు రాళ్ల దాడికి పాల్పడినా ఎస్ఐ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీనికితోడు కురుబ లింగమయ్య హత్య కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. 20 మంది ఆ ఘటనలో పాల్గొంటే కేవలం ఇద్దరిపై మాత్రమే కేసు పెట్టి.. రెండు రోజులుగా వారికి రాజ¿ోగాలు కల్పించి, మంగళవారం అరెస్ట్ చూపించారు. ఇద్దరు నిందితుల అరెస్టు కురుబ మజ్జిగ లింగమయ్య (లింగన్న) హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, రామగిరి సీఐ శ్రీధర్ తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. లింగమయ్య కుమారుడు మనోహర్ మార్చి 30న అత్తగారింటికి వెళుతుండగా.. గ్రామానికి చెందిన ఆదర్శ్, అతని అనుచరులు అభ్యంతరకరంగా హేళన చేయగా, తండ్రి లింగమయ్యకు ఫోన్ చేసి తెలిపాడన్నారు. ఈ విషయంపై లింగమయ్య తన ఇంటి ముందు కూర్చుని.. అదే గ్రామానికి చెందిన ధర్మవరపు రమేష్ కుమారుడు ధర్మవరపు ఆదర్శ్, ధర్మవరపు మహేష్ కుమారుడు ధర్మవరపు మనోజ్ నాయుడులను ప్రశి్నంచారని చెప్పారు. ఇది జీర్ణించుకోలేని ఆదర్శ్ నాయుడు, మనోజ్నాయుడులు లింగమయ్యపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. అనంతరం లింగమయ్యను అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చేరి్పంచగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై హతుడి భార్య ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఆదర్శ్ నాయుడు, మనోజ్నాయుడులను మంగళవారం రామగిరి శివారులోని 11కేవీ సబ్‌స్టేషన్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు.
వీడియోలు


ఎంపీటీసీ, జడ్పీటీసీలతో వైఎస్ జగన్ భేటీ


LIVE: ఆర్కే రోజా ప్రెస్ మీట్


మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు వసూళ్ల దందా


లోక్ సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు


HCU విద్యార్థులపై లాఠీ ఛార్జ్


ఒవైసీతో కూడా చర్చించాం వక్ఫ్ సవరణ బిల్లుపై మా స్టాండ్ అదే


రీ రిలీజ్ ప్రభాస్ సలార్ సంచలనం.. మొత్తం వసూళ్లు ఎంతంటే..!


జూనియర్ జక్కన్న: Anil Ravipudi


ఆంధ్రప్రదేశ్ లో తొలి బర్డ్ ఫ్లూ మరణం


KSR Live Show: సూపర్ సిక్స్ బిస్కెట్.. HCU భూములపై ఆగని రగడ