Top Stories
ప్రధాన వార్తలు

'అణు'మాత్రం బెదరం!.. దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ‘‘ఉగ్రవాద చర్యలకు ఇకపై ఆపరేషన్ సిందూర్‌తోనే బదులిస్తాం. ఇదే భారత ప్రభుత్వ నీతి. ఇదే మన నూతన విధానం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘దాయాది అణు బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఉగ్రవాదాన్నీ, దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వాన్నీ ఇకనుంచి వేర్వేరుగా చూడబోం. పాక్ చర్యలన్నింటినీ ఇకపై ‘సిందూర్’ గీటురాయితోనే పరిశీలిస్తాం. మనపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డా ‘సిందూర్’ తరహాలో ఆ దేశంపై నిర్ణాయక రీతిలో దాడులు చేస్తాం. జన్మలో మర్చిపోలేని రీతిలో గుణపాఠం నేర్పుతాం’’ అని కుండబద్దలు కొట్టారు. పాక్ ‘అణు’ ఆటలు మనముందు సాగవని ఆ దేశ సైనిక స్థావరాలపై జరిపిన దాడులతో ప్రపంచానికి ఇప్పటికే నిరూపించామన్నారు. ‘‘కశ్మీర్ మంచుకొండల నుంచి రాజస్తాన్ ఎడారుల దాకా పాక్ దాడులన్నింటినీ తిప్పికొట్టాం. కేవలం మన సరిహద్దులపై దాడికి ప్రయత్నించినందుకే దాయాది ఆయువుపట్లను తూట్లు చేశాం. అది గొప్పగా చెప్పుకునే వైమానిక స్థావరాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చాం. భారత్‌తో యుద్ధానికి దిగిన ప్రతిసారీ పాక్‌ను మట్టి కరిపించాం’’ అని గుర్తు చేశారు. ఆ విజయ పరంపరలో ఆపరేషన్ సిందూర్‌ను కలికితురాయిగా అభివర్ణించారు. పాక్ ప్రభుత్వం, సైన్యం కలసికట్టుగా దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద భూతం చివరికి ఆ దేశాన్నే కబళిస్తుందని మోదీ హెచ్చరించారు. ‘‘ఆ దేశం మనుగడ సాగించాలంటే ఉగ్రవాదాన్ని దాని గడ్డపై నుంచి కూకటివేళ్లతో పెకిలించాల్సిందే. దానికి మరో మార్గం లేదు’’ అంటూ హితవు పలికారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సిందూర్... దేశ భావనకు ప్రతిరూపం ‘‘సిందూరం కేవలం పేరు కాదు. సరైన న్యాయానికి అఖండ ప్రతిజ్ఞ. కోట్లాది భారతీయుల భావనలకు ప్రతిరూపం. ఉగ్రవాదం తాలూకు వికృత రూపమే పహల్గాం దాడి! అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నన్నెంతగానో కలచివేసింది. భార్యాపిల్లల కళ్లముందే ఒక్కొక్కరిని కాల్చి పొట్టన పెట్టుకున్న వికృతత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అందుకు ప్రతీకారం కోసం దేశమంతా ఒక్కటైంది. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వారు కలలో కూడా ఊహించని విధంగా పాక్, పీఓకేలోని బహావల్పూర్, మురిద్కే తదితర ఉగ్రవాద కేంద్రాలు, శిక్షణ శిబిరాలపై మన సైన్యం విరుచుకుపడి నేలమట్టం చేసింది. అవన్నీ నిజానికి ప్రపంచ ఉగ్రవాద యూనివర్సిటీలు. అమెరికాపై 9/11, లండన్ మెట్రో తదితర దాడులన్నింటికీ అక్కడినుంచే పథకరచన జరిగింది. అలాంటి కేంద్రాలతో పాటు ఉగ్రవాదుల స్థైర్యాన్ని కూడా మన ధ్వంసం చేసింది. దశాబ్దాలుగా పాక్ గడ్డపై బాహాటంగా రొమ్ములు విరుచుకుని సంచరిస్తున్న 100 మందికి పైగా అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చింది. మన మహిళల నుదుటి సిందూరం తుడిపేస్తే ఏమవుతుందో ప్రతి ఉగ్ర ముఠాకూ తెలిసొచ్చేలా చేశాం. ఉగ్రతండాలనే సమూలంగా తుడిచిపెట్టేశాం. కాల్పులకు కేవలం విరామమే ఉగ్ర కేంద్రాలపై మన దాడితో పాక్ బిక్కచచ్చిపోయింది. మన దాడుల్లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. వాటిలో పాక్ సైనిక ఉన్నతాధికారులు బాహాటంగా పాల్గొన్నారు. పాక్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారనేందుకు ఇది తిరుగులేని రుజువు. తన గడ్డ మీది ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయనే నిరాశతో పాక్ దుస్సాహసానికి దిగింది. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుంది. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి. దాంతో బెంబేలెత్తిపోయి దాయాది కాళ్లబేరానికొచ్చింది. ఎలాగోలా పరువు కాపాడుకునే ప్రయత్నాలకు దిగింది. కాపాడండంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. మే 10న మన పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓకు కాల్ చేశారు. ‘‘ఇకపై మా గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలూ, సైనిక దుస్సాహాసాలూ జరగబోవు’’ అని స్పష్టంగా హామీ ఇచ్చారు. అప్పటికే పాక్ గుండెలపై పుట్టుకొచ్చిన ఉగ్ర తండాలన్నింటినీ మనం నేలమట్టం చేయడమే గాక దాని పీచమణచాం. కనుక వారి అభ్యర్థనపై ఆలోచించాం. అయినా కాల్పులకు కేవలం విరామం మాత్రమే ఇచ్చాం. ఎలాంటి కవి్వంపులకు దిగినా పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పేందుకు మన సైన్యం, వైమానిక, నావికా దళాలు, బీఎస్ఎఫ్ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఐక్యతే మన శక్తి ఉగ్రవాదాన్ని ఇకముందు ఏమాత్రమూ సహించేది లేదు. మన ఐక్యతే దానికి మరణశాసనం. అదే మన అతిపెద్ద శక్తి. ఇది యుద్ధాల యుగం కాదు. నిజమే. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదని ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి స్పష్టమైన సందేశమివ్వాలి. 21వ శతాబ్దపు అధునాతన యుద్ధ రీతులతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే మెరుగైన సమాజానికి బాటలు పరిచిన వాళ్లమవుతాం.’’ పీఓకేను అప్పగించాల్సిందే ఏ చర్చలైనా ఆ అంశంపైనే ఉగ్రవాదంపై భారత వైఖరి సుస్పష్టమని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు ఏకకాలంలో కొనసాగలేవు. నీళ్లు, రక్తం కలసికట్టుగా పారడం జరగని పని’’ అని స్పష్టం చేశారు. తద్వారా ఉగ్రవాదానికి పాక్ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేదాకా ఆ దేశంపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తదితర చర్యలు కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. ‘‘ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించి తీరాల్సిందే. పాక్‌తో ఏ చర్చలైనా కేవలం ఈ రెండు అంశాలపైనే జరుగుతాయి. పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నా’’ అంటూ ప్రధాని కుండబద్దలు కొట్టారు. శక్తితోనే శాంతి ‘‘నేను బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి బుద్ధుడు చూపిన శాంతిమార్గం కూడా శక్తి గుండానే సాగుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘ప్రతి భారతీయుడూ శాంతియుతంగా జీవించాలి. వికసిత భారత స్వప్నం సాకారం కావాలి. అందుకు భారత్ శక్తిమంతమైన దేశంగా మారడం తప్పనిసరి. ఆ శక్తిని అవసరమైనప్పుడు ప్రదర్శించి చూపాలి. గత కొద్ది రోజులుగా మనం చేసింది సరిగ్గా అదే. ఆ యజ్ఞంలో భాగస్వాములైన సైనిక బలగాలకు, నిఘా వర్గాలకు, శాస్త్రవేత్తలకు అందరికీ ప్రతి భారతీయుని తరఫునా నా సెల్యూట్.

మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్, పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో దూసుకొచ్చిన పాకిస్థాన్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు.ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్ రెచ్చిపోయింది. వాస్తవాధీన రేఖ వెంట పాక్ కాల్పులకు తెగబడింది. డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగాయి. సాంబా, ఆర్నియాలో డ్రోన్ కదలికలను గుర్తించారు. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Samba.(Visuals deferred by unspecified time) pic.twitter.com/EyiBfKg6hs— ANI (@ANI) May 12, 2025

ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే...
ఈ ఏడాది ఉగాది నుంచి ‘స్వర్ణాంధ్ర–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగ స్వామ్యం’ (పీ4). మరింత వివరంగా చెప్పాలంటే, అత్యంత పేదరికం (జీరో పావర్టీ)తో మగ్గిపోతున్న 20 శాతం కుటుంబాలను అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న 10 శాతం మంది మార్గదర్శకులు పేదరికం నుండి విముక్తి చేసే బాధ్యతను చేపట్టాలని చంద్రబాబు నిర్దేశి స్తున్నారు. ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యమేనా? 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయి? ఈ విధానాలు ఆశ్రిత పెట్టు బడిదారీ వర్గం పెరగడానికి తోడ్పడ్డాయి. కనుకనే జాతీయ ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లు కనిపిస్తోంది కానీ పేదరికం తగ్గలేదు. ఫలితంగా భారత దేశం ఆకలి సూచీలో 150వ స్థానానికి దిగజారింది. ఈ అసలు వాస్తవా లను మరుగుపరిచి చంద్రబాబు ‘పీ4’ పథకంతో పేదరికాన్ని నిర్మూలి స్తానని చెప్పటం వృథా ప్రయాస.వాస్తవానికి ఈ పీ4 విధానం చంద్ర బాబు కొత్తగా కనిపెట్టినది ఏమీ కాదు! ఏనాడో గాంధీ ప్రబోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంలో భాగంగా వచ్చినదే. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే నూతన ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సి బిలిటీ (సీఎస్ఆర్) పథకాన్ని చట్టం రూపంలోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా, పెట్టు బడులు పెట్టినా ఓ ప్రాంతాన్ని లేదా మండలాన్ని లేదా గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అభివృద్ధి చేయడమే కాదు, ప్రజలను కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలి. సింపుల్‌గా ఇదే పీ4 కాన్సెప్ట్. టాటాలు మొదలుకొని మైక్రోసాఫ్ట్ అధినేతల వరకు అనేక ట్రస్టుల పేరులతో కొన్ని వేల కోట్ల రూపాయల వరకు వివిధ రూపాలలో సామా జిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అయినా దేశ సామాజిక చిత్రంలో మౌలిక మార్పులు జరిగాయా! లేకపోగా దేశ సామాజిక చిత్రపటం మరింతగా మసకబారి పోయింది. ఈ వాస్తవాల నేపథ్యంలో చూసిన ప్పుడు పీ4 పథకంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా? అసలు పీ4 పథకంలో ప్రకటించిన మార్గదర్శకులు ఎవరు? నూతన ఆర్థిక విధానాలలో భాగమైన ప్రైవేటీకరణకు పుట్టిన బిడ్డలే కదా! సహ జంగా ఈ సమాజంలో నెలకొన్న జీవ కారుణ్య సిద్ధాంతాలలో భాగంగా ధనవంతులు పేదవారికి సహాయం చేస్తున్నారు. కానీ చంద్రబాబు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా లాభం పొందిన పెట్టుబడిదారులకు ‘మార్గదర్శకులు’ అని పేరు పెట్టడం అన్యాయం. వివిధ రాయితీల రూపంలో ప్రజల ఆస్తులను చౌకగా కట్టబెట్టిన పెట్టు బడిదారుల చేత సహాయం చేయించి, పేదరికాన్ని నిర్మూలించాలను కోవడం ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం? సామాజిక వ్యవస్థలో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతల ఫలితంగా ఉద్య మాలవైపు ఆకర్షితులవుతున్న ప్రజల్ని పేదరిక నిర్మూలన జరుగుతుందనే ఊహాజనిత భ్రమల్లో ముంచడానికి ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పథకాల్లో ఒకటైన పీ4 పథకాన్ని ప్రజలపై ప్రయోగించటానికి పూనుకున్నారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ పథకాన్ని కొత్తరూపంలో ప్రవేశపెట్టిందే పీ4 పథకం! ఉత్పత్తి సాధనాలపై ప్రజల యాజమాన్యంలో భాగంగా ‘దున్నే వానికే భూమి’, అటవీ ప్రాంతాల్లో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై ఆదివాసులకు పూర్తి హక్కులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పటం, ప్రైవేటీకరణ విధానా లను విడనాడి ప్రభుత్వ రంగంలో అన్ని రంగాల పరిశ్రమలనూ నెలకొల్పడం లాంటి విధానపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల బాట పడుతున్న ప్రజల్ని ఉద్య మాల బాట వైపు వెళ్లకుండా నిరోధించటా నికి, అంతిమంగా ప్రజలు తమ పట్ల విధేయ తాభావంతో ఉండి తమను నాలుగు కాలాల పాటు అధికారంలో కొనసాగేలా, తమను ప్రజల పాలిట ధర్మ ప్రభువులుగా పొగిడేలా చేసుకోవడానికి ఈ పథకం ప్రవేశపెట్టారన్నది అసలు రహస్యం. ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి, ప్రజల ఓట్లను కొల్ల గొట్టడానికి ఆచరణ సాధ్యం కానీ ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చి, ఆ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటంలో తమ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై విసురుతున్న ‘పీ4’ లాంటి మాయా పథకాలను ఈ దృక్కోణంతోనే చూడాలి. ప్రజలను ఆ భ్రమల్లో పడనీయకుండా చైతన్య పరుస్తూ, ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి! – ముప్పాళ్ళ భార్గవ శ్రీసీపీఐ ఎంఎల్ నాయకులు ‘ 98481 20105

ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్‌ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్‌లు (డబుల్ హెడర్) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్‌తో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు.

ముక్కలు చేయడమే మార్గం!
క్రమం తప్పకుండా జరుగుతున్న భారీ ఉగ్ర వాద దాడులు భారత్, పాకిస్తాన్ సంబంధాలను ఘోరంగా దెబ్బతీశాయి. సాధారణంగా, ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎక్కువకాలం సైనిక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, పౌర అధికారంపై మరింతగా నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు లేదా అతని బలగాలు దేశంలో గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటాయి. భారతదేశం నుండి సైనిక ముప్పు ఉందన్న ప్రచారం కంటే పాకిస్తాన్ ప్రజలను మరేదీ కలిపి ఉంచదు. పైగా వరదలు, కరవులు, ఉగ్రవాద ఘటనలతో సహా పాకిస్తాన్ లో జరిగే ప్రతిదానికీ భారతదేశంపైనే నిందలు మోపుతూ వస్తారు.భారతదేశం మన పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేయాలని చూస్తోందనీ, దాన్ని రక్షించే ఏౖకైక శక్తి పాక్ సైన్యమే అనీ పాక్ ప్రజలకు తొలి నుంచీ నేర్పించారు. భారత్ సహన పరిమితిని దాటిన ప్రతి ఉగ్రవాద ఘటన తర్వాత, పాకిస్తాన్ సాధారణ వ్యాఖ్యలను పునరావృతం చేస్తుంటుంది. వారి మంత్రులు దీనిని భారతదేశం ప్రారంభించిన ‘తప్పుడు’ ఆపరేషన్ అని, లేదంటే ఇది కశ్మీర్ ‘స్వాతంత్య్ర సమరయోధుల’ పని అని గావుకేకలు పెడతారు. తమ గడ్డపైనే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణను వారు నిరంతరం తిరస్కరిస్తారు. పైగా ఉగ్రవాదానికి అత్యంత ప్రభావి తమైన దేశం తమదే అని వాపోతుంటారు. అయితే దాదాపు ప్రతి ప్రపంచ స్థాయి ఉగ్రవాద ఘటనకూ పాకిస్తాన్‌తో సంబంధం ఉందనీ, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులలో అత్యధికులు పాక్‌లోనే ఆశ్రయం పొందారనీ ప్రపంచానికి తెలుసు.ఎన్నని సహిస్తాం?కథ పునరావృతమవుతుంది. పైగా విసుగు పుట్టిస్తుంది. బహిరంగ అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్ వైపు నుంచి ఎప్పుడూ హామీ ఉంటుంది, కానీ ఈ ప్రతిపాదనను ఎవరూ నమ్మరు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్ రానాను అమెరికా ఇటీవలే భారతదేశానికి అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ముంబై ఉగ్రవాద దాడులపై ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తోంది. ఉగ్రవాద నాయకులపై పాకిస్తాన్ ఎప్పటికీ చర్య తీసు కోదు. ఎందుకంటే వారే పాక్ ప్రధాన ఆస్తులు. పహల్గామ్ ఉగ్ర దాడిపై దర్యాప్తు కూడా దశాబ్దాలుగా నిగూఢంగా ఉండిపోతుంది. దావూద్ ఇబ్రహీమ్ ఉనికిని అది ఎల్లప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రపంచ సంస్థకూ పాకిస్తాన్ లో అతని బహుళ నివాసాల గురించి తెలుసు. దీనికి విరుద్ధంగా, ప్రతీకారం తీర్చు కుంటామని ఇండియా బెదిరిస్తే, వారు అకస్మాత్తుగా తమ భూ భాగంపై ఉగ్రవాద కార్యకలాపాలలో భారతదేశ ప్రమేయం ఉందని ఇష్టారాజ్యంగా అబద్ధాలాడతారు.ప్రజల మద్దతు పొందాలనే ఆశతో, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంపై భారతదేశాన్ని పాక్ బెదిరించడం ప్రారంభించింది. దాని ఆనకట్టలు భారతీయ రక్తంతో నిండిపోతా యని రెచ్చ గొట్టేంత వరకు వెళ్ళింది. చరిత్ర గమనిస్తే, భారత ప్రభు త్వాలు రావల్పిండిని నియంత్రించడంపై ప్రపంచ మద్దతు కోరుతూ పాకిస్తాన్ ఉగ్రవాద దాడులపై తీవ్ర విమర్శ చేస్తూ వచ్చాయి. కానీ అది ఎప్పుడూ పని చేయలేదు. దీనికి విరుద్ధంగా, తరచుగా విరామాలతో కూడిన ఉగ్రవాద దాడులకు పాక్ తలుపులు తీసింది. 2001 అక్టోబర్‌లో జమ్మూ–కశ్మీర్ శాసనసభపై దాడి, ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో పార్లమెంటుపై దాడి, 2002 సెప్టెంబర్‌లో అక్షరధామ్‌పై దాడి, 2003 ఆగస్టులో ముంబై బాంబు దాడులు, ఆ తర్వాత 2005 అక్టోబర్‌లో ఢిల్లీలో బహుళ బాంబు దాడులు, 2006 జూలైలో ముంబై రైలు దాడులు, 2008 నవంబర్‌లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కొన్ని ఉదాహరణలు. బాలాకోట్‌పై జరిగిన దాడి తర్వాత మాత్రమే భారత్ సందేశం అంతటా వినిపించింది. కానీ సరిహద్దులు దాటి భారత్ చేసిన బాలాకోట్ సర్జికల్ దాడి కూడా పాకిస్తాన్‌ను నిరోధించడంలో విఫలమైంది. ఎందుకంటే భారత్ దాడిలో సంభవించిన ప్రాణనష్టాన్ని పాక్ దాచగలిగింది. కారణం... హతమార్చబడిన వారు ఉగ్రవాదులు!పెద్ద మార్పు ఉండదు!సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన ప్రభావం ఇస్లామాబాద్‌కు బాగా తెలుసు. వారి నాయకత్వాన్ని అది భయ పెట్టింది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని చెప్పడం తప్ప వారికి వేరే పరిష్కారం లేదు. భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని వారు ఇక ఒప్పించలేరు. రెండు దేశాల మధ్య సంబంధాలు శాంతియుతంగా ఉండాలనే ముందస్తు షరతు పైనే ఈ ఒప్పందంపై సంతకం చేశారనేది వాస్తవం. మరోవైపున అఫ్గానిస్తాన్‌కు భారతదేశం సన్నిహితం కావడం పాకిస్తాన్లో ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా పాకిస్తాన్ తన బలగాలను భారత సరిహద్దుకు తరలించినప్పుడల్లా బలోచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ఈ అంతరాన్ని బాగా ఉపయోగించు కుంటాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పాకి స్తాన్ తన సైన్యాన్ని మోహరించి ఉంచినంత కాలం, వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, అది ఏ సైనిక చర్య తీసుకున్నా, పెద్దగా మార్పు ఉండదు. పాక్‌లో కొత్త ఆర్మీ చీఫ్ వచ్చి తనవంతుగా ఏదైనా చేయాలని భావించే వరకు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తక్కువ స్థాయిలో మద్దతు ఇస్తూనే ఉంటుంది. తర్వాత, మరొక ఘటన జరుగుతుంది. కథ పునరావృతమవుతూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం దాని బాల్కనైజేషన్ మాత్రమే (అంటే ఒక దేశం లేదా ప్రాంతాన్ని బహుళ చిన్న, శత్రు యూనిట్లుగా విభజించే ప్రక్రియ). దీని కోసం, పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమూహాలకు భారతదేశం తన మద్దతును ఇవ్వాలి.హర్ష కక్కడ్ వ్యాసకర్త భారత సైన్యంలో రిటైర్డ్ మేజర్ జనరల్(‘ద స్టేట్స్‌మన్’ సౌజన్యంతో)

దృఢనిశ్చయం
ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వాణిజ్యం అంటే కుదరదని, ఉగ్రవాదానికి ఊతమిస్తూ నీళ్లు కావాలంటే చెల్లదని, ఉగ్రవాదానికి అండదండలందిస్తూ చర్చలంటే అంగీకరించబోమని, అణు బెదిరింపులు తమను భయపెట్టలేవని మోదీ పంపిన సందేశంతోనైనా పాకిస్తాన్ ఇకపై బుద్ధెరిగి ప్రవర్తించాలి. జాతినుద్దేశించి సోమవారం ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతమూ కశ్మీర్ విషయంలో పాక్ తీరుతెన్నులపై భారత్ వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పట్టింది. ఒక కొత్త క్రమం బయల్దేరిందన్న సంకేతాన్నిచ్చింది. ఇకపై ఉగ్రవాదులనూ, వారికి సాయం చేసే ప్రభుత్వాన్నీ వేర్వేరుగా పరిగణించబోమని ఆయన ప్రకటించటం ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు...ప్రపంచ దేశాలన్నీ గమనించాల్సిన అత్యంత కీలక అంశం. కాల్పుల విరమణ తాత్కాలిక దశేనని, ఉగ్రవాదం శిరసెత్తినప్పుడల్లా ‘ఆపరే షన్ సిందూర్’ కొనసాగుతూనే వుంటుందని మోదీ చెప్పటం గమనార్హం. ఉగ్రవాదం విషయంలో అమెరికా నిర్లిప్తంగా ఉంటున్నది. 2001లో తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ‘ఉగ్ర వాదంపై యుద్ధం’ పేరిట ప్రపంచంలో ఎక్కడున్నా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ప్రక టించిన అమెరికా... కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను ఎప్పటికప్పుడు వెనకేసు కొస్తోంది. మొన్నటికి మొన్న పాక్‌కు ఐఎంఎఫ్ అప్పు పుట్టడంలో యథోచితంగా సహకరించింది. దాని చీకటి వ్యవహారాలు తెలియనట్టే ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడు నిధులూ, ఆయుధాలూ ఉదారంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతుందని మోదీ ప్రకటించాల్సి వచ్చింది. దారుణ ఉదంతాలు జరిగినప్పుడల్లా ఏదో కారణం చూపి పాకిస్తాన్‌ను గట్టెక్కి స్తున్న దేశాలు ఇకముందు దీన్ని గమనించుకోక తప్పదు. ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా పట్టువిడుపులు ప్రదర్శించటంలోనే పరిణతి వ్యక్తమవుతుంది. ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయటంలోనూ, అక్కడి సైన్యం ప్రతిఘటనను తిప్పికొట్టడంలోనూ తెగువనూ, సాహసాన్నీ చూపిన భారత్... లక్ష్యసాధన పూర్తికాగానే కాల్పుల విరమణకు కూడా సిద్ధపడి తన పరిణతిని తెలియజెప్పింది. కానీ విఫల రాజ్యం అనే పేరును సార్థకం చేసుకుంటూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ వెంటనే ఉల్లంఘించి పాక్ తన నైజాన్ని చాటుకుంది. ఆ దేశంలో రాజకీయ నాయకత్వానికీ, సైన్యానికీ ఎప్పుడూ సరైన సంబంధాలు ఉండవన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. కానీ సైనిక దళాలు సైతం ముఠాలుగా చీలివున్నాయని, వాటిపై ఎవరికీ అదుపులేదని తాజా పరిణామాలు నిరూపించాయి. ఈ నిజాన్ని గ్రహించకుండా, పాకిస్తాన్‌కు చీవాట్లు పెట్టకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణు యుద్ధాన్ని నివారించామని స్వోత్కర్షకు పోవటం... భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టడం ఆశ్చర్య కరం. పాకిస్తాన్ చర్యల పర్యవసానం తమ వరకూ రానేరాదన్న భ్రమేదో ఆయనకున్నట్టుంది. కానీ ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేయకపోతే అది ఏ దేశాన్నీ విడవకుండా మింగేస్తుందని ట్రంప్ గ్రహించటం అవసరం. ఉగ్రముఠాలను ప్రోత్సహించి ఊచకోతలను సాగిస్తున్న దేశాన్ని ఎవరైనా ఎలా ఉపేక్షించగలరు? దాని దగ్గర అణ్వాయుధాలున్నాయనీ, అది ముప్పు కలిగిస్తుందనీ... కనుక నోర్మూసుకు పడివుండాలనీ ట్రంప్ చెప్పదల్చుకున్నారా? వాణిజ్యాన్ని ఆపేస్తానని బెదిరించటంవల్ల రెండు దేశాలూ దారికొచ్చి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ఆయన అనటం కూడా అత్యంత అభ్యంతరకరమైంది. ఇలాంటి తర్కంతో ప్రోత్సహిస్తున్నదెవరినో గమనించుకుంటున్నారా? తాను ప్రపంచ దేశాలతో అధిక సుంకాల పేరిట యుద్ధం సాగిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ను నియంత్రించటం లేదు. అక్కడి మారణకాండను ఆపటం లేదు. మరి భారత్–పాక్ విషయంలో ఇంత ఆత్రుత దేనికో? ఎవరూ కోరకుండానే కశ్మీర్ సమస్యలో వేలెడతానని ఆయన తనకు తానుగా ఎలా చెప్పుకుంటారు? 2019లో సైతం ట్రంప్ ఇవే తరహా మాటలు మాట్లాడారు. ఆ తర్వాత జ్ఞానో దయమై ఆ సమస్యను రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకుంటాయని స్వరం మార్చారు. మళ్లీ ఇప్పుడేమైంది? తాజా ఘర్షణలకు మూలం ఎక్కడున్నదో ఆయన గ్రహించలేకపోయారని ట్రంప్ మాటలు గమనిస్తే తెలుస్తుంది. పహల్గామ్లో 26మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ని ప్రారంభించింది. పాక్‌లోని 24చోట్ల ఉగ్రముఠాల స్థావ రాలను ధ్వంసం చేసింది. వందమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. కశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడికిది ప్రతీకారమే తప్ప కశ్మీర్ సమస్య పరిష్కారాన్ని ఉద్దేశించి మొదలెట్టిన దాడులు కాదు. అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాదులకు ప్రోత్సాహం అందించినంతకాలమూ తమ వైపుగా ఎలాంటి సాయమూ అందబోదని పాకిస్తాన్‌కు చెప్పాలి. ఆ దేశంతో సంబంధ బాంధవ్యాలు కొన సాగించే దేశాలపై కూడా ఆంక్షలుంటాయని ప్రకటించాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆ దేశం కారణంగా నష్టపోతున్న భారత్‌నూ, దాన్నీ ఒకే గాటన కట్టడం ఎలాంటి సందేశం పంపుతుంది? ఇరు దేశాల మధ్యా చర్చలంటూ ఉంటే అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనా, ఉగ్రవాదుల అప్పగింతపైనా మాత్రమే ఉంటాయని తన సందేశంలో మోదీ చెప్పటం ప్రశంసించదగ్గది. అమెరికా పోకడలు గమనిస్తే వర్తమాన ప్రపంచంలో ఎలాంటి న్యాయం అమలవుతున్నదో స్పష్టంగానే అర్థమవుతుంది. దశాబ్దాలుగా చీకాకు పెడుతున్న ఉగ్రవాద సమస్యపై మోదీ దృఢ నిశ్చయాన్ని ప్రకటించటం ఈ తరహా న్యాయాన్ని ప్రశ్నించటమే!

భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్-పాక్‌లపై ఒత్తిడి తెచ్చా. యుద్ధం కొనసాగిస్తామంటే మీతో వ్యాపారం చేయనని చెప్పా. దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్ నాదే’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం విషయంలో ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. త్వరలో పాక్‌తో కూడా మాట్లాడుతానని వివరించారు. #WATCH | US President Donald Trump says, "...I'm very proud to let you know that the leadership of Indian and Pakistan was unwavering and powerful, but unwavering in both cases - they really were from the standpoint of having the strength and the wisdom and fortitude to fully… pic.twitter.com/rFbznHMJDF— ANI (@ANI) May 12, 2025

72nd Miss World: మీకూ మాకూ సామ్యం.. బౌద్ధం!
దాదాపు 120 దేశాల సుందరీమణులు. రకరకాల దేశాల శీతోష్ణస్థితులు... రకరకాల స్కిన్టోన్లు. వివిధ రకాల ఆకృతులు. వారందరికీ ఒక్కొక్కరిది ఒక్కో కథ! ఆత్మవిశ్వాసమే ఆభరణంగా.. ప్రతిభ, బ్యూటీ విత్ పర్సస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆ సుందరీమణుల్లో రొజుకొకరి పరిచయం ఇక్కడ. ఈరోజు మిస్ జపాన్ కియానా తుమీత గురించి ఆమె మాటల్లోనే..నేను ప్రకృతి వైపరీత్యాల మీద పీహెచ్డీ చేస్తున్నాను. అంతకుముందు కేంబ్రిడ్జ్, ఎడింబరో యూనివర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేశాను. ఒక బిజినెస్ చానల్లోఎకనమిక్ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నాను. నా టాలెంట్ విషయాలకు వస్తే నేను జపనీస్ కాలిగ్రాఫర్ని. అందులో నాకు మంచి పేరుంది. ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఈ పోటీల్లో టాలెంట్ రౌండ్లో ఎలక్ట్రిక్ ఫ్లూట్నే పెర్ఫార్మ్ చేయబోతున్నాను. ప్రకృతి గౌరవిస్తూ వైపరీత్యాలు రాకుండా జాగ్రత్తపడటం, ఒకవేళ ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. నా అందంతో ఈ ప్రయోజనాన్ని సాధించాలనుకుంటున్నా! ప్రకృతి వైపరీత్యాల పట్ల పిల్లలకు అవేర్నెస్ కల్పించడం! స్త్రీ, పురుష వివక్ష విషయానికి వస్తే.. దానికి జపాన్ కూడా అతీతమేమీ కాదు. చదువుకు సంబంధించి అమ్మాయి, అబ్బాయిలకు సమాన అవకాశాలున్నప్పటికీ.. లీడర్షిప్ విషయంలో మాత్రం పురుషులదే ఆధిపత్యం. ఆ అంతరం చాలా ఎక్కువ. వేతనాల్లో కూడా ఆ గ్యాప్ కనపడుతుంది. సమానమైన పనికి మహిళలకన్నా పురుషులకే వేతనాలు ఎక్కువ. డిసిప్లిన్, పని విషయాల్లో ప్రపంచంలోని ప్రతిదేశం జపాన్ వైపు చూస్తుందేమో కానీ.. టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం మేము ఇండియాను అప్రిషియేట్ చేస్తాం. కొత్తగా వచ్చిన ఏ టెక్నికల్ చేంజ్‌ను అయినా ఇట్టే గ్రహించి, అడాప్ట్ చేసుకుని రాణిస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న క్రైమ్ గురించి వార్తల్లో విన్నప్పుడు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఈ పోటీల కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యి, ఇక్కడి మనుషులు, వాళ్లిచ్చే మర్యాద అవన్నీ చూశాక ఆ నెర్వస్నెస్, భయాలు అన్నీ పటాపంచలయ్యాయి. ఇక్కడికి రావడానికి నాకు దుబాయ్‌లో కనెక్టింగ్ ఫ్లయిట్ ఉండింది. అక్కడ బోర్డింగ్‌లో నా లగేజ్‌తో అవస్థపడుతుంటే ఒక ఇండియన్ జెంటిల్మన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడే నాకు ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. ఈ దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన మరోవిషయం.. ఎర్రటి బొట్టు. ఈ పాజెంట్‌లో ఒకరోజు నేను చీర కట్టుకుని, ఎర్రటి బిందీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇండియాకు, జపాన్‌కున్న మరో సామ్యం.. బౌద్ధం. మేము ఫాలో అవుతున్న బౌద్ధానికి, ఇక్కడికి వ్యత్యాసమున్నప్పటికీ బౌద్ధం ఈ దేశంతో మాకో కనెక్టివిటీని పెంచింది. ఇక్కడి ఆధ్యాత్మికతకు నేను ఫిదా అయ్యాను. బ్యూటీ పాజెంట్ విషయానికి వస్తే చాలా దేశాల్లో ఉన్నట్టే జపాన్‌లోనూ.. అందాల పోటీలు అంటే స్కిన్ షో తప్ప మరోటి కాదనే అభిప్రాయం, అపోహా ఉన్నాయి. కానీ బ్యూటీ విత్ పర్పస్ అనే ఐడియా నాకు నచ్చి.. పోటీల్లో పాల్గొంటున్నాను. సిస్టర్హుడ్ క్రియేట్ చేయడానికి ఇదొక వేదిక. సన్నగా ఉన్నామా.. లావుగా ఉన్నామా.. తెల్లగా ఉన్నామా.. నల్లగా ఉన్నామా అని కాదు.. అదసలు విషయమే కాదు. డజంట్ మ్యాటర్. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నదే మ్యాటర్. అందుకే నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం! జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది..నాటు నాటు పాట జపాన్‌లో చాలా ఫేమస్. ఆ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్‌కి వీర ఫ్యాన్‌ని. ఇండియాది రిచ్ కల్చర్. ఇక్కడి రైతా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. – కియానా తుమీత– సరస్వతి రమ

అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
అమెరికా ప్రతీకగా సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి, బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దేశంలో గోల్డ్ రేటు ఏకంగా లక్ష మార్కును దాటేసింది. అయితే తాజాగా జరిగిన అమెరికా - చైనా దేశాలను టారిఫ్స్ కొంత తగ్గిస్తున్నట్లు.. ఇవి 90 రోజులు అమల్లో ఉంటాయని ప్రకటించాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లో 3400 డాలర్ల కంటే ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర.. ఏకంగా 3218 డాలర్లకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే భారతదేశంలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. వెండి ధరలు కూడా బంగారం బాటలో పయనించిందా అన్నట్లు.. తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం మొత్తం మీద బంగారం, వెండి ధరలు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.అమెరికా దిగుమతులపైన చైనా విధించిన 125 శాతం సుంకాలలో 10 శాతం తగ్గించింది. అదే సమయంలో అమెరికా కూడా చైనా దిగుమతుల మీద విధించిన 145 శాతం సుంకాలలో 30 శాతం తగ్గించించింది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?ఇరు దేశాలు (చైనా, అమెరికా) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సుంకాల తగ్గింపు 90 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలుస్తోంది. కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ తరువాత తగ్గింపు సుంకాలే కొనసాగుతాయా?, ముందుకు విధించిన సుంకాలు కొనసాగుతాయా?, అనే విషయం తెలియాల్సి ఉంది.

కోహ్లి రిటైర్మెంట్పై ఢిల్లీ రంజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు ఇవాళ (మే 12) ఉదయం రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ నుంచి వచ్చిన ఈ అనూహ్య ప్రకటనపై క్రికెట్ ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విరాట్ ఫిట్నెస్, ఫామ్ చూసి టెస్ట్‌ల్లో మరో రెండు మూడేళ్లు కొనసాగుతాడని చాలా మంది అనుకున్నారు. అయితే విరాట్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టెస్ట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.విరాట్ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనపై అందరిలాగే ఢిల్లీ రంజీ జట్టు కోచ్ శరణ్‌దీప్ సింగ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. విరాట్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ శరణ్‌దీప్ సింగ్ ఇలా అన్నాడు. కొద్ది రోజుల కిందట (ఈ ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీ సమయంలో) విరాట్ టెస్ట్ భవిష్యత్తుపై నాతో చర్చించాడు. ఇంగ్లండ్‌తో జరుగబోయే సిరీస్ కోసం ఆతృతగా ఎదరుచూస్తున్నానని చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కౌంటీలు ఆడతావా అని విరాట్‌ను అడిగాను.అయితే విరాట్ లేదని చెప్పాడు. కౌంటీలకు బదులుగా ఇండియా-ఏ తరఫున రెండు మ్యాచ్‌లు (ఇంగ్లండ్-ఏతో) ఆడతానని అన్నాడు. 2018 తరహాలో ఈసారి కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఈసారి ఇంగ్లండ్ సిరీస్‌లో నాలుగైదు సెంచరీలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఏం జరిగిందో ఏమో తేలీదు కానీ, విరాట్ మూడు నెలల్లో మనసు మార్చకున్నాడు. విరాట్ రిటైర్మెంట్ వార్త వినగానే షాకయ్యానని తెలిపాడు.శరణ్‌దీప్ సింగ్ చెప్పిన ఈ విషయాలను బట్టి చూస్తే విరాట్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన వెనుక ఏదో జరిగినట్లు తెలుస్తుంది. విరాట్‌కు గత కొన్నేళ్లుగా బీసీసీఐ పెద్దలతో పొసగడం లేదు. అందుకే అతను చాలా సిరీస్‌లకు ఏదో ఒక కారణం చెప్పి దూరంగా ఉంటూ వస్తున్నాడు. గత రెండు మూడేళ్ల కాలంలో విరాట్ కేవలం మెగా టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్న సమయం నుంచి విరాట్‌కు బోర్డుతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కూడా విరాట్‌కు సత్సంబంధాలు లేవు. పైకి ఇద్దరూ ఏమీ లేదని నటిస్తున్నప్పటికీ.. ఏదో మూలన ఏదో రగులుతూ ఉంది. ఇటీవలికాలంలో సీనియర్ ఆటగాళ్ల పట్ల బోర్డు తీరు కూడా సరిగా లేదని విమర్శలు వస్తున్నాయి. అందుకే సీనియర్లు చెప్పాపెట్టకుండా రిటైర్మెంట్ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటనే ఇందుకు ఉదాహరణ.టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్, జడేజా, కోహ్లి ఒకేసారి పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటన చేసిన వారం రోజుల్లోపే విరాట్ కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు.
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
72nd Miss World: మీకూ మాకూ సామ్యం.. బౌద్ధం!
'అణు'మాత్రం బెదరం!.. దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక
విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులకు యూనిఫాం
టీజీసీఎస్బీ అంతర్రాష్ట్ర ఆపరేషన్.. 20 మంది అరెస్టు
మల్కన్‌గిరి కేంద్రంగా గంజాయి ప్రాసెసింగ్
ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే...
దృఢనిశ్చయం
బుద్ధవనంలో సౌందర్య ధ్యానం..
ముక్కలు చేయడమే మార్గం!
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
ముందుగానే నైరుతి రుతుపవనాలు
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
భార్య ప్రసవం కోసం వచ్చి
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
భారీ ప్రాజెక్ట్.. 'మహావతార్: నరసింహ' గ్లింప్స్ విడుదల
డాక్టర్ బాబు నిరుపమ్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఆల్రెడీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి హామీలు అమలు చేయకుండా చాలా ‘స్మార్ట్’గానే వ్యవహరిస్తున్నాం కదా సార్!
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
2040 నాటికి చంద్రుడిపై మన ముద్ర - మోదీ
భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
72nd Miss World: మీకూ మాకూ సామ్యం.. బౌద్ధం!
'అణు'మాత్రం బెదరం!.. దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక
విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులకు యూనిఫాం
టీజీసీఎస్బీ అంతర్రాష్ట్ర ఆపరేషన్.. 20 మంది అరెస్టు
మల్కన్‌గిరి కేంద్రంగా గంజాయి ప్రాసెసింగ్
ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే...
దృఢనిశ్చయం
బుద్ధవనంలో సౌందర్య ధ్యానం..
ముక్కలు చేయడమే మార్గం!
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
ముందుగానే నైరుతి రుతుపవనాలు
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
భార్య ప్రసవం కోసం వచ్చి
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
భారీ ప్రాజెక్ట్.. 'మహావతార్: నరసింహ' గ్లింప్స్ విడుదల
ఆల్రెడీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి హామీలు అమలు చేయకుండా చాలా ‘స్మార్ట్’గానే వ్యవహరిస్తున్నాం కదా సార్!
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
2040 నాటికి చంద్రుడిపై మన ముద్ర - మోదీ
భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
సినిమా

విష్ణుప్రియ గ్లామర్ డోస్.. కొత్త కారుతో సోనియా
భర్త రామ్ చరణ్ మైనపు విగ్రహంతో ఉపాసనకొత్త కారుకి పూజలు చేయించిన సోనియా సింగ్నాభి అందాలతో రచ్చ లేపుతున్న విష్ణుప్రియథాయ్ లాండ్ కి షికారుకెళ్లిన బిగ్ బాస్ స్రవంతినభా నటేశ్ గ్లామర్ విషయంలో తగ్గట్లేదుగాఅనసూయ అందాల జాతర.. ఫొటోలు వైరల్మేకప్ లేకుండా కనిపించిన బిగ్ బాస్ దివి View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__)

ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు.. మోస్ట్ అవైటేడ్ ఇవే!
ఓటీటీలు వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కొదవే లేదు. థియేటర్లలో రిలీజైన నెలలోపే కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇకపోతే వెబ్ సిరీస్‌లు సైతం ఓటీటీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. మిస్టరీ, క్రైమ్ సిరీస్‌లతో పాటు కామెడీ వెబ్ సిరీస్‌లు సైతం వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతేడాది మెప్పించిన సిరీస్‌లు.. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న వాటిపై మనం ఓ లుక్కేద్దాం పదండి.రానా నాయుడు సీజన్-2..విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. రానా నాయుడు సీజన్-2 త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.పంచాయత్ సీజన్-4..పంచాయత్ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే మూడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ ఏడాది పంచాయత్ సీజన్ 4 కూడా స్ట్రీమింగ్కు వస్తోంది. జూలై 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3బాలీవుడ్లో అభిమానుల క్రేజ్ దక్కించుకున్న మరో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ భాజ్‌పేయి కీలక పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే మూడో సీజన్ కూడా అలరించేందుకు వస్తోంది. ఈ సంవత్సరం నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.అసుర్ సీజన్-3..మరో బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అసుర్ మూడవ సీజన్ కూడా వస్తోంది. అర్షద్ వార్సీ, బరున్ సోబ్తి, అనుప్రియ గోయెంకా నటించిన ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.మిర్జాపూర్ సీజన్- 4..మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే మూడు సీజన్స్ హిట్‌కాగా.. మీర్జాపూర్ సీజన్-4 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త సీజన్ రిలీజ్ ఎప్పడనేది ఇప్పటివరకు ప్రకటించలేదు.ఫర్జీ సీజన్-2..విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ఫర్జీ. సీజన్ -1 హిట్ కావడంతో అభిమానులు రెండవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది.

మైనపు విగ్రహంతో రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ జరగ్గా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కొన్నిరోజుల క్రితమే కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లిన చరణ్.. మే 10న విగ్రహాన్ని ఆవిష్కరించాడు.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్) కొన్నాళ్ల క్రితం మ్యూజియం నిర్వహకులు స్వయంగా హైదరాబాద్ వచ్చి చరణ్ కొలతలు తీసుకుని వెళ్లారు. మైనపు విగ్రహంలో చరణ్ తోపాటు అతడి పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. అలానే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం. తద్వారా చరణ్ అరుదైన ఘనత సాధించాడు.గతంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ లో, అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని.. మేడమ్ టుస్సాడ్స్ దుబాయి మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా ఈ గౌరవం దక్కింది. చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో ఇది థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఇన్ స్టా బ్యూటీకి పూరీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్?) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కాంతార నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు రాకేష్ పూజారి కన్నుమూశారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుండె పోటు రావడంతోనే రాకేశ్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం దక్కలేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉడిపిలో జరిగిన ఓ మెహందీ వేడుకలో ఈ విషాదం చోటు చేసుకుంది.కాగా.. కన్నడలో ప్రముఖ రియాలిటీ షో కామెడీ కిలాడిగలు ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ షోలో సీజన్-3 విన్నర్‌గా రాకేశ్ నిలిచారు. మరోవైపు రాకేశ్ ప్రస్తుతం కాంతారాకు ప్రీక్వెల్‌గా వస్తోన్న కాంతారా చాప్టర్-1లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేశ్ మృతి పట్ల పలువురు కన్నడ సినీతారలు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.Always with a pure sweet hearted smile , ever loving , and extremely talented artist , you will always remain in our heart , deeply saddened , Rakesh we miss you! pic.twitter.com/Qx9Tx0bOOT— Pruthvi Ambaar (@AmbarPruthvi) May 12, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

నిన్ను నిందించం.. విరాట్ రిటైర్మెంట్పై వ్యంగ్యంగా స్పందించిన కౌంటీ ఛాంపియన్షిప్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై కౌంటీ ఛాంపియన్షిప్ (ఇంగ్లండ్) వ్యంగ్యంగా స్పందించింది. ఇంగ్లండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ దేశవాలీ టోర్నీలో చెలరేగి వికెట్లు తీస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. నిన్ను నిందించం విరాట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. కౌంటీ ఛాంపియన్షిప్ విరాట్‌ను తక్కువ చేస్తూ పెట్టిన ఈ పోస్ట్‌పై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విరాట్‌ను అడ్డుకునేంత శక్తి ఇంగ్లండ్ పేసర్లకు లేదని కామెంట్లు చేస్తున్నారు.కౌంటీ ఛాంపియన్షిప్ ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే.. భారత క్రికెట్ జట్టు జూన్ 20 నుండి ఇంగ్లండ్‌లో (తో) ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో విరాట్ అట్కిన్సన్, టంగ్‌ను ఎదుర్కోవాల్సి ఉండింది. ఇవాళ ఉదయం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో విరాట్ అట్కిన్సన్, టంగ్ నుంచి ఎదురయ్యే సవాళ్లను తప్పించుకున్నాడన్న అర్దంతో కౌంటీ ఛాంపియన్షిప్ ఈ పోస్ట్‌ను చేసింది.వాస్తవానికి అట్కిన్సన్కు కానీ టంగ్‌కు కానీ విరాట్‌కు అడ్డుకట్ట వేసేంత సీన్ లేదు. విరాట్ ముందు వాళ్లిదరూ సాధారణ పేసర్లు. ఒకవేళ విరాట్ రిటైర్ కాకుండా వారిని ఎదుర్కోవాల్సి వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో వరుస పెట్టి హాఫ్ సెంచరీలు చేస్తూ.. తన జట్టును (ఆర్సీబీ) తొలి టైటిల్ దిశగా తీసుకెళ్తున్నాడు.విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాడు. అనుభవజ్ఞులైన రోహిత్, విరాట్ ఇంగ్లండ్ లాంటి కఠినమైన సిరీస్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు ప్రతికూలతే అవుతుంది. ఈ సిరీస్ కోసం కొత్త జట్టును, అలాగే టీమిండియా నూతన టెస్ట్ సారధిని మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ వాయిదా పడటంతో ఖాళీగా ఉన్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడింది. ఐపీఎల్ పూర్తయ్యాక జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది.ఇంగ్లండ్ పర్యటనలో భారత షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్, లండన్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31- ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్ట్న్ ఓవల్, లండన్)

కోహ్లి రిటైర్మెంట్పై స్పందించిన వైఎస్ జగన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. విరాట్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరని ప్రశంసించారు. విరాట్ ఆట చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.క్రికెట్ పట్ల విరాట్‌కు ఉన్న అభిరుచి, ఆటలో అతని స్థిరత్వం, అత్యుత్తమ ప్రదర్శన కోసం అతని దాహం సాటిలేనివని కొనియాడారు. విరాట్ రికార్డులు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు. విరాట్ వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. విరాట్ తన భవిష్యత్ ప్రయత్నాల్లో విజయవంతకావాలని ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంపారు.One of the greatest Indian cricketer of all time, @imVKohli, bids adieu to Test cricket.It has always been fascinating to watch him play - his passion, consistency and hunger in pursuit of excellence have been unmatched. His records speak louder than words, and his legacy will… pic.twitter.com/wBHNVEwKgY— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2025కాగా, 36 ఏళ్ల విరాట్ కోహ్లి ఇవాళ (మే 12) ఉదయం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్‌లు (210 ఇన్నింగ్స్‌లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గానూ కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో 40 మ్యాచ్‌లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంత విజయవంతమైన కెప్టెన్ ఎవరూ లేరు.

ఆటగాడిగా, కెప్టెన్‌గా కోహ్లి సాధించిన ఘనతలు..!
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 12) ప్రకటించాడు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సాధించాడు. కెప్టెన్‌గా చెరగని ముద్ర వేశాడు. విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని రికార్డులపై ఓ లుక్కేద్దాం.2011 వెస్టిండీస్ (జూన్‌లో) పర్యటన సందర్భంగా టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లి.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్‌లు (210 ఇన్నింగ్స్‌లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.కోహ్లి టెస్ట్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేయాలని కలలు కాన్నాడు. అయితే అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన కారణంగా అతను అనుకున్న టార్గెట్‌ను రీచ్ కాలేకపోయాడు. కోహ్లి తన టార్గెట్‌కు 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.టీమిండియా టెస్ట్‌ల్లో కనీసం ఐదేళ్లు డామినేట్ చేయడం చూడాలని కోహ్లి కలలుగన్నాడు. దీన్ని అతను కెప్టెన్‌గా ఉన్న కాలంలో (2015-2022) నెరవేర్చుకున్నాడు. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న కాలం టీమిండియాకు స్వర్ణ యుగం లాంటిది. కోహ్లి కెప్టెన్సీలో భారత్ 68 మ్యాచ్‌ల్లో ఏకంగా 40 మ్యాచ్‌లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి రికార్డుల్లో నిలిచిపోయాడు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా చేరింది.భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే సమయంలో కోహ్లి వ్యక్తిగతంగానూ రాణించాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి ఏ భారత ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఏకంగా ఏడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.2016-18 కోహ్లి ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా చెలరేగిపోయాడు. ఈ మధ్యకాలంలో కోహ్లి 35 టెస్టుల్లో 66.59 సగటున 3,596 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ సాధించిన పలు ఘనతలు - కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ విజయాలు: 40 - విరాట్ కోహ్లీ (68 మ్యాచ్‌లు) (ఆసియా ఆటగాళ్లలో)- స్వదేశం వెలుపల అత్యధిక టెస్ట్ విజయాలు: 16 - విరాట్ కోహ్లీ (37 మ్యాచ్‌లు) (భారత కెప్టెన్లలో)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాలు: 7 - విరాట్ కోహ్లీ (24 మ్యాచ్‌లు)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు (భారత ఆటగాళ్లలో): 12 విరాట్ కోహ్లి (93 ఇన్నింగ్స్‌లు)- కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ పరుగులు: 5864 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్‌లు) (ఆసియా ఆటగాళ్లలో)- కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు: 20 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్‌లు)- ఆసియా ఖండం అవతల అత్యధిక సెంచరీలు: 14 విరాట్ కోహ్లి (108 ఇన్నింగ్స్‌లు)- అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం- కోహ్లి సారథ్యంలో టీమిండియా 49 నెలలు నంబర్ వన్‌గా ఉండింది.

నువ్వు దాచుకున్న కన్నీళ్లే గుర్తుండి పోతాయి: అనుష్క భావోద్వేగం
‘‘అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడవచ్చు.. కానీ నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు.. బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. ఈ ఫార్మాట్ పట్ల నీకున్న అమితమైన ప్రేమ గురించి నాకు తెలుసు.నీ నుంచి ఈ ఫార్మాట్ ఎంత లాగేసుకుందో నాకు తెలుసు. ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు మరింత రాటుదేలడంతో పాటు మరింత నిరాడంబరంగా తయారయ్యేవాడివి. నీ ఈ ప్రయాణానికి సాక్షిగా ఉండటం నాకు దక్కిన విశేష గౌరవం. నువ్వు టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కాబోతున్నావని చాలాసార్లు ఊహించాను.అయితే, నువ్వు మాత్రం మీ మనసు చెప్పిన మాట విన్నావు. నువ్వు ఇప్పుడు ఇలా వీడ్కోలు పలకడం సరైన నిర్ణయం మై లవ్’’ అంటూ భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ భావోద్వేగానికి లోనైంది.తన భర్త, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రేమపూర్వక నోట్ షేర్ చేసింది అనుష్క. కాగా పద్నాలుగేళ్ల టెస్టు కెరీర్‌కు కోహ్లి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు అతడు ఈ మేరకు తన నిర్ణయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు.కొనసాగాల్సిందిఈ నేపథ్యంలో భారత, విదేశీ మాజీ క్రికెటర్లు.. 36 ఏళ్ల కోహ్లి మరికొన్నాళ్ల పాటు సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగాల్సిందని అభిప్రాయపడుతున్నారు. టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడి రికార్డులను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో అనుష్క పైవిధంగా స్పందించడం గమనార్హం.మూడు ముళ్ల బంధం.. ముచ్చటైన పిల్లలుకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో ఉన్న కోహ్లి.. 2017 డిసెంబరు 11న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2021, జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఆ తర్వాత మూడేళ్లకు అంటే.. ఫిబ్రవరి 15, 2024లో కుమారుడు అకాయ్‌కు విరుష్క జన్మనిచ్చారు.తమ పిల్లలిద్దరిని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుకున్న ఈ స్టార్ జోడీ.. ఇంత వరకు వారి ముఖాలు రివీల్ చేయలేదు. అంతేకాదు.. పిల్లల గోప్యత, భవిష్యత్తు దృష్ట్యా ఎక్కువగా లండన్‌లోనే కాలం గడుపుతున్నారు.శతకాల ధీరుడుఇక టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టులకూ గుడ్‌బై చెప్పిన ఈ రన్‌మెషీన్.. వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. కాగా కోహ్లి అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా 82 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో 30, వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 51 శతకాలు బాదిన కోహ్లి.. టీమిండియా తరఫున టీ20లలోనూ సెంచరీ నమోదు చేశాడు.ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న కోహ్లి.. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును విజేతగా నిలపాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి ఐపీఎల్లో ఇప్పటికి 263 మ్యాచ్‌లు ఆడి.. 8 శతకాల సాయంతో 8509 పరుగులు సాధించాడు.చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
బిజినెస్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,950.34 పాయింట్లు లేదా 3.71 శాతం లాభంతో 82,404.81 వద్ద, నిఫ్టీ 912.80 పాయింట్లు లేదా 3.80 శాతం లాభంతో 24,920.80 వద్ద నిలిచాయి. చాల రోజుల తరువాత భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లో క్లోజ్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి.ఎన్డీఆర్ ఆటో కాంపోనెంట్స్, ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, బిర్లా కార్పొరేషన్, మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కేపీఆర్ మిల్, జిందాల్ వరల్డ్‌వైడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

అప్పుల్లో టాప్ రాష్ట్రం ఇదే..
దేశంలోని రాష్ట్రాల్లో ఏటికేడు అప్పులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు భవిష్యత్తులో తమకు ఉపయోగపడేలా స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు అప్పులను వాడుతున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు వేతనాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికోసం వీటిని వినియోగిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని ఇటీవల ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య మొత్తం తమిళనాడు రుణాలు రూ.1.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి.బలమైన ఆర్థిక వ్యూహం, వృద్ధి ఆధారిత పెట్టుబడుల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తూ తమిళనాడు రాష్ట్రం పెట్టుబడులను సమీకరిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా అప్పుల్లో తమిళనాడు నిలకడగా ముందంజలో ఉంది. సంవత్సరాలవారీగా అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి.2021 ఆర్థిక సంవత్సరంలో రూ.87,977 కోట్లు2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో రూ.87,000 కోట్లు2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1.13 లక్షల కోట్లు2025 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2024 నుంచి 2025 ఫిబ్రవరి వరకు రూ.1.01 లక్షల కోట్లుతమిళనాడు తర్వాత 2025 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర రూ.99,000 కోట్ల అప్పుతో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..అప్పులకు వెనుక కారణాలు2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయంలో 22% పెరుగుదలను రాష్ట్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి బలమైన నిబద్ధతను సూచిస్తుంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 28.7% లోపు దాని డెట్-జీఎస్డీపీ నిష్పత్తి 26.43%గా ఉంది. ఇది ఆర్థిక స్థిరత్వం, సుస్థిరతను నిర్ధారిస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమిళనాడు రూ.20,000 కోట్ల రుణాలు తీసుకోవాలని యోచిస్తోంది. దాంతో మొత్తం రుణాలు రూ.1.62 లక్షల కోట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఇది రాష్ట్రం దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.

10 వారాల్లో రూ.16,700 కోట్లు తెచ్చారు..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కెనరా బ్యాంక్ ఉద్యోగులు అద్భుతమైన ఘనత సాధించారు. బ్యాంక్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో పది వారాల్లో రూ.16,700 కోట్లు సమీకరించారు. డిపాజిట్ల వృద్ధి లేమితో సతమతమవుతున్న కెనరా బ్యాంకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్యాంకులో పనిచేసే 82,000 మంది సిబ్బందిని నిధుల సమీకరణకు వెళ్లాలని కోరింది.పీటీఐ నివేదిక ప్రకారం.. ఇటీవల పెరిగిన డిపాజిట్ల ఉపసంహరణతో బ్యాంకింగ్ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులందరికీ డిపాజిట్ల సేకరణకు పిలుపునిచ్చింది. 2024 జనవరి 26న ప్రారంభమైన ఈ డ్రైవ్‌కు సిబ్బంది మనస్ఫూర్తిగా సహకరించారు.‘బ్యాంక్ డిపాజిట్లను పెంచడానికి సహకరించాలని మొత్తం 82,000 మంది సిబ్బందిలో ప్రతిఒక్కరికీ పిలుపునిచ్చాం. కాసా (కరెంట్, సేవింగ్స్ అకౌంట్) లేదా రిటైల్ టర్మ్ డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరూ రూ.10 లక్షలు తీసుకురావాలని కోరాం' అని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె సత్యనారాయణ రాజు తెలిపారు.సీడీ నిష్పత్తి విషయంలో కెనరా బ్యాంక్ 80 శాతం పరిమితిని చేరుకునే అంచున ఉందని ఆయన తెలిపారు. పీరియడ్ ఎండ్ లో అధిక సంఖ్యలో డిపాజిట్లు పెట్టడం ఈ డ్రైవ్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. కాసా బ్యాలెన్స్ లలో కూడా స్థిరత్వం ఉన్నందున ఈ డ్రైవ్ మొత్తం వ్యాపారానికి సహాయపడిందని పేర్కొన్నారు. ఈ డ్రైవ్ కారణంగా కెనరా బ్యాంక్ బల్క్ డిపాజిట్లపై ఆధారపడటం కూడా తగ్గిందని ఆయన అన్నారు. అధిక వ్యయ రుణాల వాటా 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని వివరించారు.

భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
భారత్-పాకిస్థాన్ యుద్ధంలో విరోచితంగా పోరాడుతున్న భారత సైన్యం వేతన వివరాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేశాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసే త్యాగధనులకు ఎప్పటికీ ఈ వేతనాలు ప్రాధాన్యం కావు. పుట్టిన భూమి రక్షణ కోసం, తమ వంతు సాకారం చేస్తూ రణరంగంలో ప్రాణాలు వదిలిన సైనికుల కఠోర దీక్ష ముందు ఇవి ఏ మూలకూ సరిపోవు. చట్టపరంగా వారి సేవలకు గౌరవంగా ఇచ్చుకునే ఈ కొద్దిపాటి వేతన వివరాలు (2024 లెక్కల ప్రకారం సుమారుగా) కింది విధంగా ఉన్నాయి.హోదానెల వారీ వేతనంసిపాయిరూ.25,000ల్యాన్స్ నాయక్రూ.30,000నాయక్రూ.35,000హవల్దార్రూ.40,000నాయబ్ సుబేదార్‌రూ.45,000సుబేదార్‌రూ.50,000సుబేదార్ మేజర్‌రూ.65,000లెఫ్ట్నెంట్రూ.68,000కెప్టెన్రూ.75,000మేజర్‌రూ.1,00,000లెఫ్టెనెంట్ కల్నల్‌రూ.1,12,000కల్నల్‌రూ.1,30,000బ్రిగేడియర్రూ.1,39,000 నుంచి రూ.2,27,000 వరకుమేజర్ జనరల్రూ.1,44,000 నుంచి రూ.2,18,200లెఫ్టెనెంట్ జనరల్రూ.1,82,200 నుంచి రూ.2,24,100చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్రూ.2,50,000ఇదీ చదవండి: ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..అదనపు ప్రయోజనాలు, అలవెన్సులుడియర్నెస్ అలవెన్స్ (డీఏ)మిలిటరీ సర్వీస్ పే (ఎంఎస్పీ)ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)రవాణా భత్యంఫీల్డ్ ఏరియా అలవెన్స్హై ఆల్టిట్యూడ్ అలవెన్స్స్పెషల్ డ్యూటీ అలవెన్స్వైద్య సౌకర్యాలుపెన్షన్ & రిటైర్మెంట్ బెనిఫిట్స్
ఫ్యామిలీ

‘అరుణోదయా’నికి అర్థ శతాబ్దం
మే 12, 2025న ‘అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’ (ఏసీఎఫ్) 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభలు హైదరా బాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయి. ఇందులో ‘అరుణోదయం’ సావనీర్ ఆవిష్కృతమవుతుంది. 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో ఏసీఎఫ్ ఏర్పడింది. ఏసీఎఫ్ చరిత్రను అంతా అవలోకనం చేసుకోవడానికి ఇంతకు మించిన తరుణం మరొకటి ఉండదు. కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఎమర్జెన్సీలో హత్యగావించబడగానే...ఎమర్జెన్సీ డిటెన్యూగా ఉన్న విప్లవ కవి వై.కాశీపతి జైల్లోనే ‘ఉయ్యాలో /జంపాల/ఈ దోపిడీ కూల దొయ్యాల’ అనీ... ‘నీ బార సాల జరిపేము/చెరసాలలో మేము’ అనీ పాటలు రాశారు. అలాగే ‘అరుణోదయం – ఉషోదయం – నూతన క్రాంతి యుగోదయం’ అంటూ అరుణోదయ బ్యానరు గీతం రచించారు. అరుణోదయ కళాకారులు వీటిని ఆలపించారు. అప్పటి నుంచి ప్రజా కవుల, ప్రజా ఉద్యమకారుల త్యాగా లన్నీ కీర్తిస్తూ పాడుతోంది ఏసీఎఫ్.పాత సాంప్రదాయిక కళారూపాలలోని వస్తువు సారాన్ని మార్చుకొంటూ కొత్త సారంతో తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి వరకు డజన్ల కొలది కళా రూపాలను అరుణోదయ అందిపుచ్చుకుంది. శ్రీకాకుళం, గోదావరి లోయ, కరీంనగర్ లాంటి సాయుధ రైతాంగ పోరా టాలను గానం చేసింది. సింగరేణి, బీడీ కార్మికుల లాంటి శ్రమజీవుల సమస్యలపై కళారూపాలు రూపొందించింది. ఆదివాసుల స్వయంపాలనను ఎలుగెత్తి పాడింది. స్త్రీ విముక్తిని చాటింది. మైనార్టీల ఆత్మరక్షణా హక్కులను లేవనెత్తింది. పీడిత కులాల సమస్యలను, వర్గ–కుల పోరాటాల ఆవశ్యకతను గానం చేసింది. తెలంగాణ, రాయల సీమ, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా ప్రజల ఆకాంక్షలను ఎలుగెత్తింది. అందుకే అరుణోదయ ఒక సంస్థగా కంటే ఒక సాంస్కృతికోద్యమంగానే ప్రజల్లో శ్వాసిస్తూ ఉంది. – అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ,తెలంగాణ రాష్ట్రాల కార్యవర్గాలు(నేడు అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ)

ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!
ఒక గ్రామంలోని రచ్చబండ వద్ద ఓ ఆధ్యాత్మికవేత్త ప్రవచనం చెబుతూ ఉన్నాడు. అందులో భాగంగా ‘‘ఈ సృష్టిలోని విషయాలు మనకి అంత సులభంగా అర్థం కావు. ఈ సృష్టిలో అన్నీ విలువైనవే. ప్రతి ఒక్కటీ ఏదో ఒక కారణంగా సృష్టింపబడుతుంది. మనకి ఉపయోగపడదని, మనకి తెలియదని దేన్నీ వృథాగా భావించ కూడదు’’ అని చెప్పాడు.అప్పుడే ఒక పశువుల కాపరి అడవినుంచి జీవాలను ఇంటికి తోలుకుని వెళ్తున్నాడు. ఆధ్యాత్మికవేత్త ఉపన్యాసం విని కొద్దిసేపు ఆగి ‘‘ఈ మేక మెడ దగ్గర రెండు లింగాలు ఉన్నాయి. ఇవి దేనికి పనికి వస్తాయి. తోలుకూ మాంసానికీ రెండిటికీ పనికి రానివి కదా ఇవి’’ అని నిష్టూరంగా అడిగాడు.చిరునవ్వు నవ్విన ఆధ్యాత్మికవేత్త ‘‘సృష్టి రహస్యాలు కనుక్కోవడం కష్టం. అవి ఎందుకు సృష్టింప బడ్డాయో మనకు తెలియకపోవచ్చు. నీకు బాగా అర్థమయ్యేట్లు నేను విన్న ఒక పాత కథ చెబుతాను విను.పూర్వం ఒక ఋషి ఉండేవాడు. అతడి తపశ్శక్తి వల్ల అతడికి కొన్ని శక్తులు వచ్చాయి. తను ఏది కోరుకుంటే అది జరిగేది. ఆ ఋషి ఒకరోజున నదీ స్నానం చేసి లేస్తున్నప్పుడు తన ముక్కు వెంట్రుకలు దట్టంగా పెరగడం గమనించాడు. కొంచెం అసౌకర్యంగా భావించాడు. ‘దేనికి పనికివస్తాయి ఇవి? ఇవి లేకుంటే మాత్రం నేను జీవించలేనా’ అని భావించి అవన్నీ రాలిపోయేట్లు కోరుకున్నాడు. అతడు కోరినట్లే జరిగింది. అది జరిగిన కొద్దిసేపటికే ఉచ్చ్వాసనిశ్వాసలు తీసుకోవడం కష్టమయ్యింది. రోజురోజుకీ ఆ ఋషి ఆరోగ్యం క్షీణించి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. చిన్న వెంట్రుకలైనా దాని విలువ దానికి ఉందని గుర్తించకపోవడం వల్ల జరిగిన అనర్థం అది.కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదీ ఏదో ఒక కార్య నిమిత్తం సృష్టింపబడిందే. కాకుంటే మనం వాటి ప్రయోజ నాలన్నిటినీ గుర్తించలేము. మనకు, మన ఆలోచనలకూ పరిమితులు ఉన్నాయి. కాబట్టి సృష్టి మర్మాలను మనం గౌరవించక తప్పదు’’ అని వివరించాడు.‘అది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు అలా ఉండకూడదు అని ఆలోచించి లాభం లేదు. ఉన్నది ఉన్నట్లు స్వీకరించడం ఉత్తమం’ అని గ్రహించిన పశువుల కాపరి జీవాలను తోలుకుని ఇంటివైపు నడిచాడు. – ఆర్.సి.కృష్ణస్వామి రాజు

సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్!
తెనాలి: చల్లా లక్ష్మీనారాయణ– ‘ ఏదో ఒక రోజు పెద్ద చెఫ్‌ని అవుతాను’ అంటూ చిన్నప్పుడు అన్నప్పుడు, అందరూ నవ్వుకున్నారు. అయితే, అమ్మను తొలి గురువుగా తీసుకున్న ఆయన, పాకశాస్త్రంలో అపూర్వ శిఖరాలను అధిరోహించారు. ఆధునిక నలభీమునిగా, ప్రత్యేకమైన రెసిపీల సృష్టిలో తన ప్రతిభను చాటారు. ఆయన వంటల ప్రయాణం.. ‘శ్రమ’కు ‘రుచి’ని మేళవించి, ఆహారప్రియులను ‘ఔరా..’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఆయన ప్రస్థానం, నిజంగా ఈ రంగంలో యువతకు ప్రేరణ. ప్రస్తుతం వీసా రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చిన ఆయన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం మీ కోసం.. అదృష్టానికి తొలి మెట్లు.. లక్ష్మీనారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలానికి చెందిన అంగలకుదురు. తెనాలిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ఐఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పొందారు. ఒక హోటల్లో ఉద్యోగంతోపాటు హోటల్ మేనేజ్మెంట్, టూరిజంలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఆపై సింగపూర్‌లో ఫుడ్ హైజీన్ కోర్సు అభ్యసించి, ముంబయిలోని బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీలో దూరవిద్య ద్వారా కోర్సు పూర్తి చేశారు. 1997లో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రముఖ హోటళ్లలో చెఫ్‌గా సేవలందించారు. 2007–09 కాలంలో సింగపూర్‌లోని నయూమి హోటల్స్‌లో చెఫ్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం మైసూరు, కూర్గ్ ప్రాంతాల్లోని రిసార్ట్స్, తిరుపతిలోని ఐసీటీ హోటల్లో సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు కాకినాడ, చెన్నై నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో పనిచేశారు. శ్రమతోపాటు ప్రతిభకు గుర్తింపుగా అదృష్టం తలుపు తట్టినట్లు 2023లో అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. అక్కడి కాలిఫోర్నియాలో ప్రసిద్ధ హోటల్లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఎండినా... నిమ్మ అమ్మే! వరించిన అవార్డులు సింగపూర్‌లోని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెఫ్స్ సొసైటీ, సౌత్ ఇండియన్ చెఫ్స్ అసోసియేషన్ (ఎస్ఐసీఏ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కలినరీ అసోసియేషన్ (ఐఎఫ్‌సీఏ), అమెరికన్ కలినరీ ఫెడరేషన్ (ఏసీఎఫ్) సభ్యత్వాలు లక్ష్మీనారాయణకు లభించాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ తిరుపతి, విశాఖపట్నం వేదికగా నిర్వహించిన వంటకాల పోటీలతో పాటు అనేక సోలో, గ్రూపు విభాగాల్లో పాల్గొని పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఎన్నో దేశాల వంటకాల్లో మేటిగా.. పలు దేశాల వంటకాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. దక్షిణ భారతీయ వంటకాలకే పరిమితం కాకుండా థాయ్, ఇటాలియన్, మెక్సికన్ వంటి అంతర్జాతీయ వంటకాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీటిపై పెరిగే మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యేకమైన ‘హనీ చిల్లీ చెస్ట్ నట్స్’ రెసిపీలో లక్ష్మీనారాయణ సిద్ధహస్తులు. ఆయన తయారు చేసే మరో ప్రసిద్ధ వంటకం ‘చిల్లీ తోఫు’ కూడా ఎంతో ఆదరణ పొందింది. నాన్వెజిటేరియన్ వంటకాల విషయంలో, మటన్ కర్రీతో దోసెలా స్ట్రీమ్ చేసి వడ్డించే ప్రత్యేకమైన ‘మటన్ మొప్పాస్’, మంగళూరు శైలిలో ‘ఘీ రోస్ట్ ప్రాన్స్’, ఆంధ్ర ప్రత్యేకత అయిన ‘నాటుకోడి–రాగిముద్ద’, అరుదైన ‘జాక్‌ఫ్రూట్ బిర్యానీ’, మసాలా రుచులతో నిండిన ‘గుంటూరు మటన్ ఫ్రై బిట్ బిర్యానీ’లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.‘సాఫ్ట్వేర్’ ఒక్కటే మార్గం కాదునేటి యువతకు ‘సాఫ్ట్వేర్ ఉద్యోగం’ ఒక్కటే మార్గం కాదు. హోటల్, టూరిజం వంటి రంగాలలోనూ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నా వృత్తి విషయానికి వస్తే, ప్రతి దేశం నాకు ఒక కొత్త పాఠం, ప్రతి వంటకం ఒక కొత్త సవాలు. ఇన్నేళ్ల ప్రయాణంలో అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, సుదీర్ఘమైన పనిగంటలు– ఇవన్నీ నా ఎదుగుదలకు బలమైన మూల స్తంభాలయ్యాయి. వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిలో మనసు కలపాలి. పదార్థాలకు భావాలను మేళవించినప్పుడే వంటకానికి ప్రాణం వస్తుంది. – చల్లా లక్ష్మీనారాయణ

సుందర సౌరాష్ట్ర.. సమైక్య యాత్ర
వడోదరలో పూల గడియారం... అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమం. గాంధీనగర్‌లో అక్షరధామ్... పోర్బందర్లో కీర్తిమందిర్. ద్వారకలో కృష్ణుడి జగత్మందిర్... కేలాడియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. జామ్‌నగర్ లఖోటా కోట... సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం. 1 రోజుసికింద్రాబాద్– పోర్బందర్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఇది ఎనిమిది రోజుల టూర్. ఇందులో వడోదర, అహ్మదాబాద్, ద్వారక, సోమనాథ్, పోర్బందర్ కవర్ అవుతాయి. 2వ రోజుఉదయం పదకొండు గంటలకు రైలు వడోదర (Vadodara) స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్ అవాలి. మధ్యాహ్నం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని చూడడానికి తీసుకెళ్తారు (ఎంట్రీ టికెట్ ప్యాకేజ్‌లో వర్తించదు, పర్యాటకులు కొనుక్కోవాలి). రాత్రికి వడోదర హోటల్ గదిలో బస. రాజ్యాలన్నింటికీ ఒకటే జెండా: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ... స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం. దీని ఎత్తు 597 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. గుజరాత్ రాష్ట్రం, కెవాడియా ప్రదేశంలో ఉంది. నర్మదానది మీద నిలబడి సర్దార్ సరోవర్ డ్యామ్‌ను చూస్తున్నట్లు ఉంటుంది. వడోదరకు వందకిలోమీటర్ల దూరం. దేశంలోని రాజ్యాల మధ్య ఐక్యత కోసం, జమీందారాలన్నింటినీ భారత్ రిపబ్లిక్లో విలీనం చేసి ఒక పతాకం కిందకు తీసుకురావడానికి పటేల్ చేసిన కృషిని గౌరవిస్తూ ఆయన విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరు పెట్టారు.3వరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వడోదరలో హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. నగరంలో లక్ష్మీవిలాస్ ప్యాలెస్ తదితరాలను చూసిన తర్వాత అహ్మదాబాద్‌కు ప్రయాణం. అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమం, అక్షరధామ్ టెంపుల్ (akshardham temple) చూసిన తర్వాత హోటల్ చెక్ ఇన్. రాత్రి బస.ప్యాలెస్‌లో స్టెప్‌వెల్: వడోదర... చారిత్రక ప్రాధాన్యత ఉన్న నగరం. ఈ నగరం విశ్వమిత్రి నది తీరాన ఉంది. నగరంలో మహరాజా షాయాజీరావు యూనివర్శిటీ... సిటీ హాల్... ఇలా ప్రముఖమైన కట్టడాలన్నీ రాజా పేరుతోనే ఉంటాయి. ప్యాలెస్‌ల ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. గైక్వాడ్ రాజకుటుంబం నివసించిన మహారాజా ప్యాలెస్‌లో సర్కార్వాడా, లక్ష్మీవిలాస్ ప్యాలెస్, ప్రతాప్ ప్యాలెస్, మోతీబాగ్ ప్యాలెస్, మోతీబాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం, జూ, నవలాక్షి స్టెప్ వెల్ ఉన్నాయి. ఇది తొమ్మిది మిలియన్ల గ్యాలన్ల నీటిని స్టోర్ చేయగలిగిన బావి. ఇక లక్ష్మీ ప్యాలెస్ అయితే ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, గోడలకు మొజాయిక్ డెకరేషన్, టెర్రకోట శిల్పాలు... ఇలా ప్రతిదీ ఒక కళాఖండమే. ఫతే సింగ్ మ్యూజియం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇందులో గ్రీకు, రోమన్, యూరప్ శిల్పాలు, ఫ్రెంచ్ ఫర్నిచర్ ఉంది. రాజారవివర్మ చిత్రలేఖనాలు కూడా ఉన్నాయి. షాయాజీ రావు గైక్వాడ్ ఆధునిక వాది. నగరాన్ని శాస్త్రసాంకేతికంగా వృద్ధి చేశాడు. అంబేద్కర్ విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందించాడు.4వరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి ద్వారక వైపు సాగి΄ోవాలి. దారిలో జామ్ నగర్‌లోని లఖోటా ప్యాలెస్, మ్యూజియం విజిట్. సాయంత్రానికి ద్వారక చేరి హోటల్ చెక్ ఇన్, రాత్రి బస.సరస్సులో కోట: కోటల చుట్టూ కందకాలుంటాయి. కానీ ఇక్కడ నీటి మధ్యలో దీవి మీద కోట ఉంటుంది. లఖోటా సరస్సు మధ్యలో ఉన్న కోట కావడంతో దీనిని లఖోటా కోట అనే పిలుస్తారు. జామ్‌నగర్ పాలకులు ఉపయోగించిన వస్తువులతోపాటు నాటి కళాకృతులతో కోటలోపల మ్యూజియం ఉంది.ఐదవ రోజుఉదయం ద్వారకాధీశుని దర్శనం, బేట్ ద్వారక, నాగేశ్వర్ టెంపుల్ దర్శనం. ఆ తర్వాత ద్వారకకు తిరుగు ప్రయాణం. రాత్రి బస ద్వారకలోనే.బీసీ కాలపు జగత్మందిర్: కృష్ణుడు పూజలందుకునే ఈ ఆలయాన్ని ద్వారకాధీశ్ మందిర్ అంటారు. ఐదంతస్థుల ఆలయం మనకు విచిత్రంగా అనిపిస్తుంది. క్రీ.పూ రెండు వందల ఏళ్ల నాటిదని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. మనకు ఇప్పుడు కనిపిస్తున్నది క్రీ.శ 15–16 శతాబ్దాల నాటి పునర్నిర్మాణం. ఆలయాలు పశ్చిమముఖంగా ఉండడం కూడా అరుదైన విషయం. ఆలయంఅరేబియా సముద్రాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రం చిత్తూరు జిల్లా, నాగులాపురంలోని వేదనారాయణస్వామి ఆలయంలో విష్ణుమూర్తి పశ్చిమముఖంగా ఉంటాడు.6వరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి సోమనాథ్ వైపు సాగిపోవాలి. దారిలో పోర్బందర్లోని కీర్తిమందిర్, సుధామ టెంపుల్ విజిట్. సోమనాథ్ చేరిన తర్వాత సోమనాథ జ్యోతిర్లింగ దర్శనంతోపాటు ఆలయం చుట్టు పక్కల ఉన్నవాటిని తిరిగి చూడడం, సాయంత్రం తర్వాత పోర్బందర్కు ప్రయాణం. రాత్రికి పోర్ బందర్ రైల్వే స్టేషన్‌కి చేరడంతో యాత్ర పూర్తవుతుంది. 145 ఏళ్లుగా ఆగని గడియారం: ఫ్లోరల్ క్లాక్... వడోదర సిటీసెంటర్లోని షాయాజీ బాగ్‌లో ఉంది. క్రీ.శ 1879లో మూడవ మహారాజా షాయాజీరావు నిర్మించాడు. 13 ఎకరాల ఉద్యానవనంలో బరోడా మ్యూజియం అండ్ పిక్చర్ గ్యాలరీ, ఒక జూ, సర్దార్‌పటేల్ ప్లానిటోరియం... గార్డెన్ మొత్తం చూడడానికి టాయ్‌ట్రైన్ ఉన్నాయి. ప్లానిటోరియం పక్కనే ఆస్ట్రానమీ పార్క్ ఉంది. పురాతన కాలంలో వాడిన ఆస్ట్రనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. బరోడా మ్యూజియంలో పిక్చర్ గ్యాలరీలో మినియేచర్ కళాఖండాల నిలయం. హజీరా మఖ్బారా, న్యాయమందిర్, దభోయి ఫోర్ట్, మకాయ్ కోట, జమామసీదు, కీర్తి మందిర్, అరబిందో సొసైటీ చూడవచ్చు. స్థానికులు గుజరాతీతోపాటు సింధీ భాష కూడా మాట్లాడతారు.అహ్మదాబాద్: అహ్మదాబాద్ గురించి మాట్లాడాలంటే సబర్మతి నది గురించి మాట్లాడాలి. నదికి రెండువైపులా విస్తరించిన నగరం ఇది. ఒక వైపు వాళ్లు మరో వైపుకు రావడానికి నగరంలో ఈ నది మీద పదకొండు వంతెనలున్నాయి. ఎల్లిస్, గాంధీ, నెహ్రూ, సుభాష్, వాదాజ్ దూధేశ్వర్, సర్దార్, చంద్రభాగా, అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, ఫెర్నాండెజ్, దండి బ్రిడ్జిలు. బ్రిటిష్ పాలకుల తోపాటు జాతీయనాయకులను గౌరవిస్తూ నామకరణం చేయడం గొప్పగా అనిపిస్తుంది. మీరు నగరంలో ఏ వంతెన మీద ప్రయాణించారో సరదాగా గమనించండి. సబర్మతి రివర్ ఫ్రంట్ సూర్యోదయాలు, సాయంత్రాలను ఆస్వాదించడానికి మంచి ప్రదేశం. ఇక మనకు చిన్నప్పటి నుంచి చిరపరిచితమైన సబర్మతి ఆశ్రమం గాంధీజీ నివసించిన ప్రదేశం. ఇక్కడ జాతీయోద్యమ చర్చలు జరిగేవి. గాంధీజీ దండి సత్యాగ్రహాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇప్పుడు ఆశ్రమంలో గాంధీజీ ఉపయోగించిన వస్తువులను చూడవచ్చు. నగరంలో సయ్యద్ సిద్ధిఖీ జాలీలో రాతిలో సునిశితంగా చెక్కిన డిజైన్ని తప్పకుండా చూడాలి. జైన్ మందిరం, కాలికో మ్యూజియం, సర్దార్ పటేల్ మ్యూజియం కూడా చూడాల్సిన ప్రదేశాలు.ప్రశాంత ధామం: అక్షరధామ్ టెంపుల్ గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉంది. అహ్మదాబాద్‌కు 40 కిమీల దూరం. నగరంలో రాజధాని హడావుడి, ట్రాఫిక్ జామ్‌లు ఉండవు. అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వ ఆఫీసులు, వాటి అనుబంధ భవనాలు తప్ప ఇతర వర్తక వాణిజ్యాలు ఉండవు. నగరం ప్రశాంతంగా ఉంటుంది.గాంధీజీ ఇక్కడే పుట్టాడు: పోర్బందర్.... గాంధీజీ పుట్టిన నేల. ఇక్కడ గాంధీజీ పుట్టిన ఇల్లు బాపూ మహల్ ఉంది. దాని పక్కనే స్మారక మందిరం కీర్తిమందిర్, బాపూ మహల్ వెనుకగా కస్తూర్బా గాంధీ ఇల్లు ఉన్నాయి. గాంధీజీ ఇంటిలో అటకల నిర్మాణాన్ని గమనించాలి. పోర్బందర్లో శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడికి మందిరం, వాళ్ల గురువు సాందీపుడి మందిరం ఉన్నాయి. సుధాముడి మందిరం విశాలంగా ఉంటుంది. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా అటుకుల ప్యాకెట్ ఇస్తారు. ఈ ఐటెనరీ ప్రకారం సోమనాథ్ నుంచి తిరుగు ప్రయాణంలో పోర్బందర్కు చేరే ప్రయాణం అరేబియా తీరం వెంబడే సాగుతుంది. కాబట్టి జర్నీలో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు. సోమనాథ జ్యోతిర్లింగం: సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఓ గొప్ప ఆధ్యాత్మిక అనుబూతి. సోమనాథుడిని దర్శనం తర్వాత ఆలయం ఆవరణలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనాలను చూడవచ్చు. ఆలయం బేస్ మెంట్ ఎత్తుగా ఉంటుంది. ఆలయం వెనుక సముద్రపు అలలు ఆలయాన్ని అలవోకగా తాకుతూ ఉంటాయి. ఆయలం ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం నమూనాలోనే ఉంటుంది. నర్మద (Narmada) తీరాన పెద్ద విగ్రహస్థాపనకు ముందు నుంచే సోమనాథ్ ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహం ఉంది.7వ రోజు00.50 నిమిషాలకు (అర్ధరాత్రి 12.50 నిమిషాలు) ట్రైన్ నంబరు 20968 పోర్ బందర్– సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ పోర్బందర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. 8వ రోజు... ట్రైన్ ఉదయం 8.20 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుతుంది. బుధవారం మొదలైన పర్యటన బుధవారంతో పూర్తవుతుంది. ఈ ట్రైన్ అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఇదే రైలు తిరిగి సికింద్రాబాద్ నుంచి పోర్బందర్కు బయలుదేరుతుంది. ఇది వీక్లీ ట్రైన్. ప్యాకేజ్ ధరల వివరాలు..సుందర సౌరాష్ట్ర (ఎస్హెచ్ఆర్066) టూర్లో భాగంగా... ట్రైన్ నంబర్ 20967 సికింద్రాబాద్– పోర్బందర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. కంఫర్ట్ కేటగిరీ అంటే థర్డ్ ఏసీలో ప్రయాణం. ఇందులో ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 30 వేలు, ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 29 వేలవుతాయి. స్టాండర్డ్ కేటగిరీలో ట్విన్ షేరింగ్‌కి దాదాపు 27 వేలు, ట్రిపుల్ షేరింగ్‌కి దాదాపు 26 వేలవుతుంది. ఇందులో సింగిల్ ఆక్యుపెన్సీకి అవకాశం లేదు. ప్యాకేజ్‌లో నాలుగు బ్రేక్‌ఫాస్ట్‌లు, నాలుగు రాత్రి భోజనాలు ఇస్తారు.
ఫొటోలు
అంతర్జాతీయం

ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
న్యూఢిల్లీ: -అగ్రరాజ్యం అమెరికా సాక్షిగా భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడారు జేడీ వాన్స్. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జేడీ వాన్స్. అయితే పాక్ దాడి చేస్తే తాము దాడికి దిగుతామంటూ జేడీ వాన్స్‌కు మోదీ స్పష్టం చేశారు. తమ సంయమనం బలహీనత కాదని, దేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పారు నరేంద్ర మోదీ. రేపు(సోమవారం) పాకిస్తాన్ తో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ నేతృత్వంలో భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అంశంపై చర్చలు జరుగునున్న తరుణంలో జేడీ వాన్స్ ముందగా పోన్ చేసి మోదీతో మాట్లాడారు. అయితే అంతకమునుపే కశ్మీర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పీవోకే విషయంలో భారత్ రాజీపడే ప్రసక్తే ఉండదన్నారు. దీనికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అమెరికాకు పరోక్షంగా చెప్పేశారు మోదీ. పీవోకే తమదేనని, ఇందులో ఎవరు జోక్యం అవసరం లేదన్నారు. పీవోకేను తమకు అప్పగించడం ఒక్కటే పాకిస్తాన్ కు ఉన్న ఆప్షన్ అని మోదీ తెగేసి చెప్పేశారు. కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి. పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలు పంపింది భారత ప్రభుత్వం.

ఘోరం..లోయలో పడిన బస్సు.. 21 మంది ప్రయాణికులు దుర్మరణం
కొలంబో: శ్రీలంకలో (Sri Lanka) పెను విషాదం చోటు చేసుకుంది. కోట్మాలేలోని కరండీ ఎల్లా ప్రాంతం నుంచి 78 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారు. Over 20 people have been killed after a bus fell down a precipice in Kotmale in the Gerandi Ella area on Sunday.Deputy Minister of Transport Dr. Prasanna Gunasena said that at least 77 people were in the bus at the time of the accident.#Srilanka #lka #accident pic.twitter.com/8V6jEBKByD— Easwaran Christian Rutnam (@easwaranrutnam) May 11, 2025ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.మరోవైపు,పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించ వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడం, కోట్మాలే ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు సమాచారం. దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.

భారత్, పాక్‌పై ట్రంప్ ఆసక్తికర కామెంట్స్.. ఈసారి కశ్మీర్ అంటూ..
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అమెరికా మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. అయితే, భారత్-పాక్ అంశంపై తాజాగా ట్రంప్ మరోసారి స్పందించారు. ఈసారి కశ్మీర్ అంశం ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ట్రుత్‌తో స్పందిస్తూ..‘కశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్-పాక్‌తో కలిసి పనిచేస్తాం. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెయ్యి సంవత్సరాల కశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అలాగే, భారత్, పాకిస్తాన్‌ను చూసి నేను గర్వపడుతున్నాను. ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని రెండు దేశాలు కలిగి ఉన్నాయి. అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం రెండు దేశాలకు ఉందని కితాబిచ్చారు.యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది!. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉంది. ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - May 10, 2025, 11:48 PM ET )I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan for having the strength, wisdom, and fortitude to fully know and understand that it was time to stop… pic.twitter.com/RKDtlex2Yz— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) May 11, 2025ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్తాన్.. భారత్‌పై సైనిక చర్యకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది.

పాకిస్తాన్‌కు మద్దతుపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు.ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్తోనూ ఇషాఖ్ దార్ ఫోన్లో మాట్లాడారు.
జాతీయం

పాక్‌కు చెక్ పెట్టిన భారత్.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఉన్నది వీరే..
ఢిల్లీ: ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర స్థావరాలపై దాడులే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. అయితే, ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది.వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు.. పాక్ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. అయితే, తొలుత తాము అంత్యక్రియల్లో పాల్గొనలేదని పాక్ బుకాయించినా భారత్ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది.ఇక, తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత్ విదేశాంగశాఖ వెల్లడించడం గమనార్హం. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొన్నది వీరే.. లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, లాహోర్ 11వ ఇన్ఫ్రాంట్రీ డివిజన్, బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్, మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ ఉన్నారు. Video showing Pakistani Army officials attending the funerals of slain Lashkar-e-Taiba (LeT) terrorists yesterday. The man leading the Janaza is Hafiz Abdul Rauf - a US designated terrorist.Once again blurring the lines between state and terror - the world is watching you 🇵🇰 pic.twitter.com/MjsJXcyDMl— Vinayak Tripathi (@belikevinayak) May 8, 2025

అన్ని విధాలా భారత్‌దే పైచేయి.. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు చావుదెబ్బ
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే.లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేలి్చచెప్పింది.

రాజ్యాంగమే అత్యున్నతం
న్యూఢిల్లీ: దేశంలో అన్నింటి కంటే అత్యున్నతం పార్లమెంట్ లేదా న్యాయ వ్యవస్థ కాదని.. రాజ్యాంగమే అత్యున్నతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తేల్చిచెప్పారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఇతర పదవులు చేపట్టాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. జస్టిస్ గవాయ్ ఈ నెల 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తొలి బౌద్ధ మతస్తుడైన సీజేఐగా ఆయన రికార్డుకెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయ్ ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడి గురించి తెలిసి తాము దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ఈ దాడిలో మృతిచెందిన వారికి సుప్రీంకోర్టు తరఫున నివాళులర్పించామమని, ముష్కరుల దుశ్చర్యను ఖండించామని అన్నారు. దేశం మొత్తం ఆందోళన, సంక్షోభంలో ఉన్న సమయంలో తాము మౌనంగా ఉండలేమని పేర్కొ న్నారు. దేశంలో తాము కూడా భాగమేనని వ్యాఖ్యానించారు. ఎవరు అత్యున్నతం అనేదానిపై రాజకీయ నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలపై జసిŠట్స్ గవాయ్ స్పందించారు. రాజ్యాంగమే అత్యున్నతం అని కేశవానంద భారతి కేసులో 13 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. తనకు ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవని, రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ వంటి పదవులు తీసుకోనని స్పష్టంచేశారు. న్యాయమూర్తులు రాజకీయ నాయకులను, ఇతర రంగాల ప్రముఖులను కలిసి మాట్లాడ డంలో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు. ఇతరులను కలవకపోతే ప్రజల సమస్యలు, కొత్త విషయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. భారత్–పాకిస్తాన్ మధ్య దాడులు ఆగిపోవడం మంచి పరిణామం అని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకు నష్టమే తప్ప ప్రయోజనం చేకూరలేదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తులు ఉండగా, వీరిలో ఇప్పటిదాకా 21 మంది తమ ఆస్తుల వివరాలు ప్రకటించారని జస్టిస్ గవాయ్ తెలిపారు. మిగిలినవారు కూడా త్వరలో ఆస్తుల వివరాలు వెల్లడిస్తారని స్పష్టంచేశారు. ఆస్తుల సమాచారం బహిర్గతం చేసే సంప్రదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు కూడా పాటిస్తే బాగుంటుందని సూచించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించే విషయంలో కొలీజియం చేసిన కొన్ని సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలకపోవడంపై మాట్లాడేందుకు జస్టిస్ గవాయ్ నిరాకరించారు. న్యాయ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం తగినంతగా ఎందుకు లేదని ప్రశ్నించగా... రాజ్యాంగబద్ధమైన పదవుల్లో నియామకాలకు రిజర్వేషన్లు లేవని బదులిచ్చారు.

అండమాన్ సమీపంలో కూలిన ‘కాస్మోస్’
న్యూఢిల్లీ: సోవియట్ యూనియన్ హయాంలో 53 ఏళ్ల క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక తన ప్రస్థానాన్ని ముగించుకుంది. విఫలమైన ‘కాస్మోస్ 482’శనివారం ఉద యం భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అండమాన్ దీవికి పశ్చిమాన 560 కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రంలో పడిపోయింది. కాస్మోస్ కారణంగా ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదని రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ప్రకటించింది. దీని గమనాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈయూ స్పేస్ సర్వైలెన్స్ ట్రాకింగ్ నెట్వర్క్ సహా పలు అంతరిక్ష సంస్థలు దగ్గర్నుంచి పరిశీలిస్తూ వస్తున్నాయి. ఇటీవల ఇది భూ వాతావరణంలో ప్రవేశించినట్లు జర్మన్ రాడార్ స్టేషన్ గుర్తించిన విషయాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అత్యంత వేడి వాతావరణంతో ఉండే శుక్రగ్రహం లక్ష్యంగా ప్రయోగించిన గోళా కార 500 కిలోల ‘కాస్మోస్’కు టైటానియంతో కూడిన రక్షణ కవచం ఉంది. అందుకే ఇది భూవాతావరణంలో ప్రవేశించాక మండిపోకుండా యథాతథంగా పడిపోయింది. అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనల ప్రకారం.. కాస్మోస్ శకలాలు రష్యాకే చెందుతాయి. ఒక వేళ భూమిపై పడినా దీనితో ప్రమాదం కలిగే అవకాశాలు చాలా తక్కువని నిపు ణులు తెలిపారు. కాస్మోస్తో భూమ్మీదున్న ప్రతి 10 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ప్రమాదం సంభవిస్తుందని ఏరోస్పేస్ కార్పొరేషన్ అంచనా వేసింది.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

హైదరాబాద్‌లో భారీగా రద్దయిన పాత నోట్ల స్వాదీనం
సనత్‌నగర్(హైదరాబాద్): రద్దయిన కరెన్సీ నోట్లను మార్చేందుకు యత్నిస్తున్న నలుగురు వ్యక్తులను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.99 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఎస్ఐ జయచందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.టీవోలీ ఎక్స్ట్రీమ్ థియేటర్ వద్ద రద్దయిన పాత నోట్ల మార్పిడికి యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం మధ్యాహ్నం ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా వేపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్వర్, బుర్రా శివకుమార్, పుట్టపల్లి రవీందర్‌రెడ్డి, గొల్లమందల రవిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన రద్దయిన రూ.1000, రూ.500ల కరెన్సీ నోట్లతో పాటు కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. 20 శాతం కమీషన్ ప్రాతిపదికన వీరు మరికొందరితో కలిసి పాత నోట్ల మారి్పడికి యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఉచ్చులోకి దించి.. మాట మార్చి!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, గూఢచర్యం, వీరికి సహాయ సహకారాలు అందించడం కోసం పాకిస్థాన్ తన దేశీయుల్ని భారత్‌లోకి పంపిస్తూనే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ పట్టుబడితే వారిని తమ దేశీయుడని అంగీకరించడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. కొందరిని మాత్రమే తమ జాతీయులని అంగీకరిస్తూ.. మిగిలిన వారితో తమకు సంబంధం లేనట్లు చేతులు దులుపుకొంటోంది. ఈ కారణంగానే 2004లో నమోదైన కేసులో 2013లో అరెస్టు అయి, 2015లో ఆ కేసు వీగిపోయినా 76 ఏళ్ల వయసున్న పాకిస్థానీ షేర్ అలీ కేశ్వానీ ఇప్పటికీ చర్లపల్లి కేంద్రం కారాగారంలో మగ్గుతున్నాడు. ఐఎస్ఐ ఆదేశాలతో వచ్చిన అర్షద్... పాకిస్థాన్‌లోని రహీమైఖర్‌ఖాన్ జిల్లా ఖాన్పూర్కు చెందిన అర్షద్ మహమూద్ అలియాస్ అర్షద్ మాలిక్‌ను 2002 నవంబరులో పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అధికారులు ఫీర్జీ, లియాఖత్ సంప్రదించారు. మూడు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి, భారత ఆర్మీ యూనిట్ల సమాచారం అందించడానికి సిద్ధం చేశారు. అర్షద్‌కు పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ఇచ్చి బంగ్లాదేశ్ పంపారు. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లు అర్షద్ పేరుతో బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ ఇచ్చి 2003 మార్చిలో బెహ్‌రామ్‌పూర్ మీదుగా కోల్‌కతా పంపారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని 2003 జూలైలో పాస్‌పోర్ట్ అందుకున్నాడు. దీంతో సిటీకి వచ్చిన అర్షద్ ముత్యాల్‌బాగ్‌లో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారితో తాను వైద్య పరికరాలు అమ్మే చిన్న వ్యాపారినంటూ, కోల్‌కతా నుంచి వచ్చినట్లు చెప్పుకొన్నాడు. 2004లో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. నగరంలోని భద్రతా బలగాలకు చెందిన సున్నిత ప్రాంతాల్లో తిరిగి, వివరాలు సేకరించే అర్షద్ మాలిక్ రాత్రి వేళల్లో వాటిని ఐఎస్ఐకి పంపేవాడు. కింగ్‌కోఠి అగర్వాల్ చాంబర్స్‌లో ఉండే హైదరాబాద్ సైబర్ కేఫ్ నుంచి ఈ–మెయిల్స్ ద్వారా షేర్ చేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్ నుంచి ఫీర్జీ హవాలా ద్వారా ఎప్పటికప్పుడు ఇతనికి సొమ్ము పంపేవాడు. 2004 మార్చి 9న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ పోలీసులు సైబర్ కేఫ్‌లో ఉన్న అర్షద్‌ను పట్టుకున్నారు. ఇతడి నుంచి ఆర్మీ లొకేషన్స్ ఫొటోలు, సికింద్రాబాద్–హైదరాబాద్‌ల్లో ఉన్న ఆర్మీ లొకేషన్స్ స్కెచ్‌లు, ఆర్మీ అధికారుల టెలిఫోన్ డైరెక్టరీలు స్వా«దీనం చేసుకున్నారు. తొలుత అబిడ్స్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసుల ఆ తర్వాత సిట్‌కు బదిలీ అయింది. ఇతడి విచారణలో వెలుగులోకి .. అర్షద్ విచారణ నేపథ్యంలోనే ఇతడికి షేర్ అలీ కేశ్వానీ అనే పాకిస్థానీ సహకరించినట్లు వెలుగులోకి వచి్చంది. ఇతడిని ఉగ్ర ఫైనాన్షియర్‌గా మార్చిన పాకిస్థాన్.. భారత్‌కు పంపింది. ఇక్కడ ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు ఆర్థిక సాయం చేస్తున్న కేశ్వానీని ఆగ్రా పోలీసులు 2004 జనవరిలోనే అరెస్టు చేశారు. అక్కడ కేసు విచారణ పూర్తికావడం, జైలు శిక్ష సైతం విధించడంతో సుదీర్ఘకాలం సిటీకి తీసుకురాలేకపోయారు. అర్షద్‌కు నాంపల్లి కోర్టు 2009లో జీవితఖైదు విధించింది. కేశ్వానీని నగర పోలీసులు 2013లో ఇక్కడికి తీసుకువచ్చారు. 2015 మార్చి 9న ఇతడిపై ఉన్న కేసు వీగిపోయింది. ఇలాంటి వాళ్ల శిక్షాకాలం పూర్తయినా, కేసు వీగిపోయినా జైలు నుంచి బయటకు పంపాలంటే పాకిస్థాన్ సదరు వ్యక్తి తమ పౌరుడే అని అంగీకరించాలి. అర్షద్ తమ జాతీయుడేనని అంగీకరించడంతో 2017లో అతడిని పాక్‌కు పంపేశారు. కేశ్వానీ విషయంలో ఇలా జరగకపోవడంతో ఇప్పటికీ చర్లపల్లి జైలులోనే ఉన్నాడు.

పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన సిద్దిక్ మేడ్చల్‌లో నివాసం ఉంటూ వారాంతపు మార్కెట్లో బ్యాటరీ లైట్లు సప్లై చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొంపల్లి మున్సిపల్ పరిధిలోని సెంట్రల్ పార్క్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మార్కెట్లో బ్యాటరీ లైట్లు సాయంత్రం ఇచ్చి.. తిరిగి రాత్రి తీసుకునే క్రమంలో ముగ్గురు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. గతంలో సిద్దిక్ బొల్లారం ప్రాంతంలో బ్యాటరీ లైట్లు ఏర్పాటు విషయంలో మరో వర్గంతో గొడవ పడ్డాడని... అది మనసులో పెట్టుకొని కక్షగట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాట్లాడుకుందాం.. అంటూ పిలిచి విచక్షణారహితంగా పొట్ట, ఛాతీ భాగాల్లో కత్తులతో పొడిచారు. ఇంతటితో ఆగకుండా నిందితుల్లో ఒకరు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సిద్దిక్ మెడను కోసేసినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించారు. సిద్దిక్‌తో ఇటీవల జరిగిన గొడవలపై ఆరాతీశారు. ముగ్గురు నిందితులు వచి్చనట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాములు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ విజయ్‌వర్ధన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజయ్ పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని...
సాక్షి, హైదరాబాద్:: చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, యాపర్ల గ్రామానికి చెందిన తిమ్మరాజు రవి(25) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి, శంషీగూడలో నివాసముంటోంది. రవి కూకట్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు నీలవేణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం వారు పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. గత 8 నెలలుగా వారు బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. రవి కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా నీలవేణి ఇంటి వద్దనే ఉంటుంది. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నెల 10న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు మధ్యాహ్నం తన ఇంటికి వచి్చన తల్లితో కలిసి నీలవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవి తన తల్లికి ఫోన్ చేసి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తనకు బతకాలని లేదని చెప్పి విలపించాడు. దీంతో ఇంటికి రావాలని కోరగా ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లి, సోదరుడు బౌరంపేటకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.