Cooking
-
వంట మనిషి ఇంట్లోనే బడి
కేసముద్రం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే వంట మనిషి ఇల్లే ప్రభుత్వ పాఠశాలగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిధిలోని బ్రహ్మంగారి తండాలో 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సొంత భవ నం లేక నాటి నుంచి తండాలోని పలువురి ఇళ్లను అద్దెకు తీసుకుంటూ ఉపాధ్యా యులు బడి నడిపిస్తూ వచ్చారు. మొదట్లో స్కూల్లో 60 మంది విద్యార్థులు ఉండగా.. అద్దె ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది.ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తి స్తున్నారు. గత ఏడాది బడి నడిపించడానికి తండాలో అద్దెకు ఇల్లు దొరకలేదు. దీంతో పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో మధ్యాహ్నం భోజ నం వండిపెట్టే వంటమనిషి వినోద తన ఇంట్లో పాఠశాల నడిపించడానికి అంగీకరించింది. ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డుకు చుట్టూరా పరదా కట్టి పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారు. ఎండతీవ్రతకు రేకుల షెడ్డు కింద కూర్చున్న పిల్లలు అల్లాడి పోతున్నారు. టాయిలెట్లు కూడా లేకపోవ డంతో ఇబ్బందులు పడుతు న్నారు. ఇదిలా ఉండగా ‘మన ఊరు– మన బడి’ కింద పాఠశాలకు భవనం మంజూరైనా పిల్లర్ల వరకే నిర్మాణం జరిగింది. -
'వంట చేయడం గొప్ప టాలెంట్'..!: థైరోకేర్ వ్యవస్థాపకుడు
వంట చేయడం లేదా వంట వృత్తిని తక్కువగా లేదా తేలిగ్గా చూస్తారు చాలామంది. పైగా గబగబ ఏదో ఒకటి టైంకి వండిపెట్టేవాళ్లు లేకపోతే అల్లాడిపోతాం. అలాంటిది ఆ వృత్తిని మాత్రం చీప్‌గా చూస్తాం. ఇప్పుడు నెట్టింట థైరోకేర్ వ్యవస్థాపకుడు షేర్ చేసిన ట్వీట్ చూసి కచ్చితంగా మనసు మార్చుకుంటారు. ఎందుకుంటే వంట ప్రాముఖ్యతను హైలెట్ చేస్తూ వివరించిన విధానం నెటిజన్ల మనసును హత్తుకుంది. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ వేలుమణి ఇటీవల రెండు రకాల వ్యక్తులపై తన దృక్పథాన్ని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో వంట ప్రాముఖ్యతను ఆయన హైలెట్ చేయడంతో ఒక్కసారిగా నెట్టింట ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. వేలుమణి వంట చేయడం నేర్చుకునేవారు, వంట చేయడాన్ని టైం వేస్ట్ పనిగా భావించే వారు అంటూ రెండు విరుద్ధ అభిప్రాయల గల వ్యక్తుల గురించి పోస్ట్‌లో రాశారు. వంటను రుచికరంగా చేసేవారు వైవాహిక జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారని, అత్యంత సంపన్న కుటుంబ నేపథ్యం ఉండి, వంట చేయడాన్ని టైం వేస్ట్‌గా భావించేవారికి వైవాహిక జీవితంలో సత్సంబంధాలు సవ్యంగా ఉండవని అన్నారు. అంటే ధనవంతుడైనా భాగస్వామి దొరికినా.. ఆమెకు వంట చేయడం పట్ల సరైన ఆసక్తి లేకపోతే ఇరువురి మధ్య సరైన సత్సంబంధాలు లేక ఇబ్బంది పడతారని అన్నారు వేలుమణి. అంతేగాదు తన పోస్ట్‌లో థైరోకేర్ వ్యవస్థాపకుడు వేలుమణి తన భార్య సుమతి వేలుమణి ఇరు కుటుంబాలను చక్కగా చూసుకునేదని అన్నారు. ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగం చేస్తూ కూడా కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహించేదని, వంట చక్కగా చేసేదంటూ తన దివంగత భార్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆహారమే ఓ వ్యక్తి ప్రేమను మరింత హృదయానికి హత్తుకునేలా చేస్తుందని అన్నారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిలల్లకు వంట నేర్పించండి. ఆ విషయంలో పేరెంట్స్‌గా విఫలమై ఆ తర్వాత పశ్చాత్తాపం పడినా ప్రయోజనం లేదంటూ రాసుకొచ్చారు వేలుమణి ఆ పోస్ట్‌లో.There are two kinds. 1. Intelligent enough to Learn a good deal of cooking. They enjoy a happy married life by building bilateral relationships. 2. Lazy enough to think that cooking is waste of time. Even if they find a rich spouse, they struggle in generating or sustaining… pic.twitter.com/rVHR6jM3fu— Dr. A. Velumani.PhD. (@velumania) March 5, 2025 (చదవండి: ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..! కుటుంబమే..) -
36.6 శాతం గృహాలు... స్వచ్ఛ ఇంధనానికి దూరం
సాక్షి, అమరావతి: దేశంలో ఇంకా 36.6 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనానికి (గ్యాస్) దూరంగా ఉన్నాయి. పట్టణాల్లో 92.9 శాతం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సగానికిపైగా కుటుంబాలు స్వచ్ఛ ఇంధనానికి నోచుకోలేదని సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే 2022–23 వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 49.3 శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి.మిగతా 50.7 శాతం కుటుంబాలు కట్టెలు, బొగ్గులనే వాడుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కలిపి దేశంలో 63.4శాతం గృహాలు మాత్రమే వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. మిగతా 36.6 శాతం కట్టెలు, బొగ్గు వంటి వాటిపైనే ఆధారపడుతున్నాయి. అయితే ఏపీలో జాతీయ స్థాయికి మించి గ్రామీణ, పట్టణాల్లో కలిపి 88.0 శాతం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయని సర్వే వెల్లడించింది.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 84.1 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తుండగా, పట్టణాల్లో 96.7 శాతం గృహాలు స్వచ్ఛ ఇంధనం వినియోగిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు కూడా వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, బిహార్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సగం గృహాలు వంట కోసం స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం లేదని సర్వే తెలిపింది. స్వచ్ఛ ఇంధనం అంటే.. వంట కోసం ఎల్పీజీ, ఇతర సహజ వాయువులు, గోబర్ గ్యాస్, ఇతర బయోగ్యాస్ విద్యుత్, సోలార్ కుక్కర్ వంటివి వినియోగించడం -
క్యాన్సర్ కేర్ వంటిల్లూ పుట్టిల్లే!
క్యాన్సర్ రావడానికి కొన్ని పద్ధతుల్లో వంట కూడా కారణమవుతుంది. ఉదాహరణకు ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ వాడకూడదనేది అందరికీ తెలిసిన విషయం. అలా మాటిమాటికీ నూనెను వేడి చేయడం వల్ల అందులో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఏర్పడతాయి. అందుకే అలా వాడకూడదని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఇది మాత్రమే కాకుండా వంట విషయంలో క్యాన్సర్‌కు కారణమయ్యే అంశాలేమిటీ... వంటలో చేయకూడనివేమిటీ, చేయాల్సినవేమిటో తెలుసుకుందాం. 7 వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడకూడదు. 7 కొవ్వులు ఎక్కువ ఉన్న ఆహారం క్యాన్సర్ కారకమయ్యే అవకాశముంది. అందుకే వేట మాంసం (రెడ్ మీట్) వద్దని నిపుణుల సలహా. రెడ్ మీట్ ఎక్కువగా తినే దేశాల్లో కొలోన్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువ. రెడ్ మీట్‌తో ΄్యాంక్రియాటిక్, ్ర΄ోస్టేట్, ΄÷ట్ట క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. మామూలు కూరగాయలు, ఆకుకూరల ఆహారం తినేవారితో ΄ోలిస్తే ప్రతిరోజూ ప్రతి 100 గ్రాముల రెడ్‌మీట్ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17 శాతం పెరగడం కొందరు అధ్యయనవేత్తల పరిశీలనలో తేలిన విషయం. అయితే మాంసాహార ప్రియులకు న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు ఇచ్చే సలహా ఏమిటంటే... మాంసాహార ప్రియులు రెడ్‌మీట్‌కు బదులు వైట్ మీట్ అంటే కొవ్వులు తక్కువగా ఉండే చికెన్, చేపలు తినడం మంచిది. చేపలైతే ΄ోషకాహారపరంగా కూడా మంచివి. అందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్‌ను నివారిస్తాయి కూడా. 7 క్యాన్సర్ నివారణలో ఏం వండారన్నది కాదు... ఎలా వండామన్నది కూడా కీలకమే. ముఖ్యమే. ఒక వంటకాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో వండటం కొన్నిసార్లు క్యాన్సర్ కారకాలైన రసాయనాలు వెలువడేందుకు అవకాశమివ్వవచ్చు. ఉదా: మాంసాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తున్నా... అంటే గ్రిల్డ్ ఐటమ్స్, ఫ్రైడ్ (వేపుడు) ఐటమ్స్‌గా చేస్తుంటే అందులోని కొన్ని పదార్థాలు హెటెరో సైక్లిక్ అరోమాటిక్ అమైన్స్ అనే రసాయనాలుగా మారవచ్చు. అవి క్యాన్సర్ కారకాలు. 7 విదేశీ తరహాలో ఇప్పుడు మనదేశంలోనూ స్మోక్డ్ ఫుడ్ తినడం మామూలుగా మారింది. స్మోకింగ్ ప్రక్రియకు గురైనా, నేరుగా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత తగిలేలా మంట మీద వండిన ఆహారపదార్థాల్లోంచి వెలువడే ‘΄ాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ అనే (పీఏహెచ్‌స్) అనే రసాయనాలు క్యాన్సర్ కారకాలు. అందుకే ఈ పద్ధతుల్లో వడటం సరికాదు.7 ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోడానికి వాడే కొన్ని రకాల పదార్థాల వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఉదాహరణకు ఆహారాల నిల్వకు ఉప్పు వాడటం అనాదిగా వస్తున్న పద్ధతి. అయితే ఉప్పులో చాలాకాలం పాటు ఊరిన పదార్థాల వల్ల పోట్ట లోపలి లైనింగ్ దెబ్బతిని, అది ఇన్ఫ్లమేషన్కు గురికావచ్చు. అలా కడుపు లోపలి రకాలు (లైనింగ్) దీర్ఘకాలం ఒరుసుకుపోవడంతో కడుపులో ఒరుసుకు΄ోయిన లైనింగ్ రకాలు నైట్రేట్ల వంటి క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావానికి గురయ్యే అవకాశముంది. అలాంటప్పుడు కడుపులో ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే సూక్ష్మజీవి ఉంటే అది ఆ ్రపాంతాల్లో పుండ్లు (స్టమక్ అల్సర్స్) వచ్చేలా చేస్తుంది. ఈ స్టమక్ అలర్స్ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, సాల్టెట్ పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌ను చాలా పరిమితంగా తీసుకోవాలన్నది వైద్యనిపుణుల సలహా. ఆహారంలో ఉప్పు పెరుగుతున్నకొద్దీ్ద హైబీపీ కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు గ్రాములకు మించి ఉప్పు వాడటం సరికాదు. -
కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు
వంట చేయం అనుకున్నంత ఈజీకాదు. భయపడినంత కష్టమూ కాదు. కాస్త స్మార్ట్‌గా ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. అన్నం వండాలా,చపాతీ చేయాలి అనేక ముందు నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ఎలాంటి కూరలు చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. చపాతీ అయితే, పప్పు, లేదా మసాలా కూర చేసుకుంటే సరిపోతుంది. అదే అన్నం అయితే, పప్పు, కూర, పచ్చడి, సాంబారు లేదా చారు, ఇంకా వడియాలు అప్పడాలు ఇలా బోలెడంత తతంగం ఉంటుంది. అంతేకాదు వీటికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు కట్ చేయడం ఒక పెద్ద పని. అయితే ఎలాంటి పని అయినా, ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలతో సులువుగా చేసుకోవచ్చు. అలాంటివి మచ్చుకు కొన్ని చూద్దాం.చిట్కాలుపచ్చిమిర్చి కట్ చేసినపుడు చేతులు మండకుండా ఉండాలంటే కత్తెరతో కట్ చేసు కోవాలి. చాకుతో కోసినపుడు చేతుల మండుతోంటే పంచదారతో చేతులను రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే, వాటిని ముందు కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాలి.ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన పోతుంది.చపాతీగాని, పరోటాగాని, మెత్తగా ఉండాలంటే 1 స్పూన్ మైదా, ఒక స్పూన్ పెరుగుని గోధుమ పిండిలో వేసి తడిపితే మెత్తగా వస్తాయి.చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది. పచ్చకూరలు వండేటప్పుడు చిటికెడు సోడా వేసి వండితే చూడ్డానికి కంటికి మంచి ఇంపుగా కనబడ్డమే కాకుండా రుచిగా ఉంటాయి.పంచదార జార్లో రెండు లవంగాలు వేస్తే చీమల దరి చేరవు.కోడిగుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే వాటిని చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది టమోటా ఫ్రెష్‌గా ఉండాలంటే ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితేచాలు.ఒక్కోసారి గ్లాస్లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి భలే ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో కంగారుపడి, కిందికి మీదికి కొట్టకుండా, పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది. శుభ్రమైన వాతావరణంలో శుభ్రం చేసుకున్న చేతులతో వంటను పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇదీ చదవండి : విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా? -
ఆకుపచ్చ కూరగాయలు వండేటప్పుడూ రంగు కోల్పోకూడదంటే ..!
ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారాల్లో కీలకమైనవి. ముఖ్యంగా ఆకుకూరలు, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయాలు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను ఉంటాయి. ఈ కూరగాయలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. కానీ వీటిని వండేటప్పుడు వాటి రంగు విషయమే సమస్య ఉంటుంది. అదేంటంటే..వండేటప్పుడు వాటి శక్తివంతమైన ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. ఇది రెసిపీని తక్కువ ఆకర్షణీయంగా ఉండేలా చేస్తుంది. అయితే సరైన వంటపద్ధతులతో ఆకుకూరలు రంగును కోల్పోకుండా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఆకుపచ్చ కూరగాయలలో రంగు మార్పుకి కారణం..బచ్చలికూర, బ్రోకలీ వంటి కూరగాయలలో శక్తివంతమైన ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్ నుంచి వస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియకు కీలకమైన వర్ణద్రవ్యం. క్లోరోఫిల్ అణువులు ఉష్ణోగ్రత, పీహెచ్ మార్పులకు సున్నితంగా ఉంటాయి. అందువల్లే కూరగాయలు వండినప్పుడు రంగు క్షీణతకు దారితీస్తుందని చెబుతున్నారు. ఎప్పుడైతే ఈ ఆకుపచ్చ కూరగాయాలు ఉష్ణోగ్రతకు గురవ్వుతాయో అప్పుడు దానిలోని క్లోరోఫిల్ అణువు, మెగ్నీషియం అయాన్‌ను కోల్పోయి, ఫియోఫైటిన్గా మారుతుంది. ఫలితంగా మనకు వండిన తర్వాత ఆకుపచ్చ కూరగాయాలు మందమైన ఆలివ్ ఆకుపచ్చ రంగును పోలి ఉంటాయి. అలాగే ఆమ్ల వాతావరణంలో కూడా మరింత వేగవంతంగా రంగును కోల్పోతాయి. రంగు మారకుండా నిరోధించే పద్ధతులు..బ్లాంచింగ్: కూరగాయలు ఆకుపచ్చ రంగును కాపాడుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి బ్లాంచింగ్. ఈ పద్ధతిలో కూరగాయాలను ఉప్పునీటిలో కొద్దిసేపు ఉడకబెట్టడం జరుగుతంది. ఇక్కడ కేవలం క్లోరోఫిల్ క్షీణతను ప్రేరేపించి, మృదువుగా చేసేలా తగినంతగా ఉడికించాలి. ఈ మొత్తం ప్రక్రియకి రెండు నుంచి మూడు నిమిషాల వ్యవధి పడుతుంది. ఆ తర్వాత షాకింగ్షాకింగ్: బ్లాంచింగ్ చేసిన వెంటనే, కూరగాయలను ఐస్-వాటర్ బాత్కు బదిలీ చేయాలి.. షాకింగ్‌గా పిలిచే ఈ ప్రక్రియలో వంట ప్రక్రియను నిలిపివేసి, శక్తిమంతమైన రంగును లాక్ చేయడంలో సహాయపడుతుంది. ఆకస్మిక ఉష్ణోగ్రత తగ్గుదల కూరగాయలను ఉడికించడం కొనసాగించకుండా వేడిని నిలిపివేస్తుంది. అలాగే వాటి ఆకృతిని, రంగును సంరక్షిస్తుంది.ఆల్కలీన్ నీటితో..వంట నీటిలో కొద్ది మొత్తంలో బేకింగ్ సోడా (ఆల్కలీన్ పదార్ధం) కలపడం వల్ల కూరగాయలు ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవచ్చు. ఆల్కలీన్ వాతావరణం క్లోరోఫిల్‌ను ఫియోఫైటిన్గా మార్చకుండా నిరోధిస్తుంది, తద్వారా ఆకుపచ్చ రంగును కోల్పోకుండా సంరక్షించొచ్చు. ఐతే ఈ పద్ధతిని బహు జాగ్రత్తగా ఉపయోగించాలి.వంట సమయాన్ని తగ్గించడంఆకుపచ్చ కూరగాయలలో రంగు కోల్పోవడానికి ప్రధాన కారణాలలో అతిగా ఉడికించడం ఒకటి. దీనిని నివారించడానికి అవసమైనంత వరకు ఉడికించాలి. అందుకోసం స్టీమింగ్ ప్రక్రియ అద్భుతమైన పద్ధతి. ఈ పద్ధతిలో కూరగాయలు వాటి రంగు, పోషకాలను కోల్పోవు. తక్కువ వ్యవధిలో కూరగాయలను అధిక వేడికి బహిర్గతం చేసి, రంగు, ఆకృతిని కోల్పోకుండా సంరక్షిస్తుంది.ఉప్పునీరు ఉపయోగించడంకూరగాయలను ఉడకబెట్టేటప్పుడు, నీటిలో ఉప్పు కలపడం వల్ల వాటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఉప్పు నీటి మరిగే బిందువును పెంచుతుంది మరియు రంగు మార్పులకు కారణమయ్యే ఆమ్లత్వానికి వ్యతిరేకంగా కొంచెం బఫర్‌ను సృష్టిస్తుంది. ఇది కూరగాయల రుచిని కూడా పెంచుతుంది.వంటల్లో ఆమ్ల పదార్థాలను నివారించడంనిమ్మరసం, వెనిగర్ లేదా టొమాటోలు వంటి పదార్థాల కారణంగా వాటి ఆమ్ల స్వభావం రీత్యా ఆకుపచ్చ కూరగాయల రంగును కోల్పోతాయి. అలాంటప్పుడు వీటిని కూర చివరిలో జోడించడం మంచిది. అలాగే ఆకుపచ్చ కూరగాయలను ఉడకబెట్టేటప్పుడు కుండను మూత పెట్టకుండా వదిలివేయడం వల్ల అస్థిర ఆమ్లాలకు గురవ్వవు.త్వరిత వంట పద్ధతులుమైక్రోవేవ్ లేదా స్టైర్-ఫ్రైయింగ్ వండితే.. తక్కువ నీరు, తక్కువ టైంలోనే అయిపోతాయి. ఇవి ఆకుపచ్చ కూరగాయల రంగును సంరక్షించడానికి అద్భుతమైనవి. ఈ పద్ధతుల్లో పరిమితంగా వేడి నీటికి గురి అయ్యేలా చేసి రంగు కోల్పోకుండా చేయొచ్చు.(చదవండి: వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..) -
బాదంతో.. ఒక మసాలా కర్రీ... ఓ సీఖా... మరో టిక్కా!
బాదం ఆరోగ్యానికి మంచిది. నిజమే... రోజూ పది బాదం పప్పులు తినాలి. అదీ నిజమే... కానీ మర్చిపోతుంటాం. బాదం ఖీర్... బాదం మిల్క్ తాగడమూ మంచిదే. రోజూ తియ్యగా తాగలేం. మరేం చేద్దాం? బాదం రుచిని కొంచెం కారంగా ఎంజాయ్ చేస్తే! చాలా బాగుంటుంది. ఒక మసాలా కర్రీ... ఓ సీఖా...మరో టిక్కా! మన వంటింట్లో ఈ వారం ఇలా ట్రై చేద్దాం. ‘బాదం ధర తెలుసా’ అని అడక్కండి. మటన్ ధర కంటే తక్కువే. పైగా మనం వీటికోసం వాడేది కిలోల్లో కాదు... గ్రాముల్లోనే.చనా మసాలా ఆల్మండ్..కావలసినవి..బాదం పప్పులు– 50 గ్రాములు (నానబెట్టి పొట్టు తీయాలి);ఉల్లిపాయ –1 (తరగాలి);అల్లం – అంగుళం ముక్క (సన్నగా తరగాలి);పచ్చిమిర్చి తరుగు – టీ స్పూన్;ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్;దాల్చిన చెక్క – అర అంగుళం ముక్క;చనా మసాలా – టేబుల్ స్పూన్ ;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.తయారీ..బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేయాలి.అవి వేగేటప్పుడు దాల్చిన చెక్క, చనా మసాలా, ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి.చివరగా బాదంపప్పులు వేసి కలిపి వేడెక్కి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి.ఇది రోటీలోకి రుచిగా ఉంటుంది. గ్రేవీ కావాలంటే చివరగా అర కప్పు నీటిని పోసి, చిటికెడు ఉప్పు కలపాలి.కూర ఉడకడం మొదలైన తర్వాత చిక్కదనం చూసుకుని దించేయాలి.నద్రు ఔర్ బాదం కీ సీఖా, పనీర్ బాదమ్ టిక్కీనద్రు ఔర్ బాదం కీ సీఖా..కావలసినవి..బాదం పప్పులు– 80 గ్రాములు (పలుచగా తరగాలి);తామర తూడు – 300 గ్రాములు;పచ్చిమిర్చి – 4;అల్లం – 5 గ్రాములు;వెల్లుల్లి – 10 గ్రాములు;శనగపిండి – 30 గ్రాములు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;బంగాళదుంప– 1 (మీడియం సైజు);చీజ్ – 50 గ్రాములు (తురమాలి);యాలకుల పొడి – పావు టీ స్పూన్;జాపత్రి – పావు టీ స్పూన్ ;ఉల్లిపాయలు – 2 (తరగాలి) ;కోవా – టేబుల్ స్పూన్ ;కుంకుమ పువ్వు – ఆరు రేకలు;నూనె – 2 టేబుల్ స్పూన్లుతయారీ..తామర తూడును శుభ్రంగా కడిగి తరిగి మరుగుతున్న నీటిలో వేసి నాలుగైదు నిమిషాల తర్వాత తీసి నీరు కారిపోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి పక్కన పెట్టాలిబంగాళదుంపను ఉడికించి పొట్టు వలిచి, చిదిమి పక్కన పెట్టాలికుంకుమ పువ్వును పావు కప్పు గోరువెచ్చటి నీటిలో నానబెట్టాలిఅల్లం, వెల్లుల్లిని సన్నగా తరిగి పక్కన పెట్టాలిశనగపిండి నూనె లేని బాణలిలో పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టాలిఇప్పుడు బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి తామర తూడులను గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలిఒక పాత్రలో చీజ్ తురుము, ఉడికించిన బంగాళదుంప, ఉప్పు, యాలకుల పొడి, జాపత్రి పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, శనగపిండి, కుంకుమ పువ్వు కలిపిన నీటిని వేయాలి. బంగాళదుంప, కోవా, ఉల్లిపాయ ముక్కలు వేయాలితామర తూడు ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పై దినుసులున్న పాత్రలో వేసి అన్నీ సమంగా కలిసేటట్లు ముద్దగా కలపాలిఈ మిశ్రమాన్ని పెద్ద గోళీలుగా చేసుకుని అరచేతిలో వేసి పొడవుగా చేయాలి. మనకు కావల్సిన సైజులో కబాబ్‌లుగా కట్ చేసుకోవాలిబాదం పలుకులను ఒక ప్లేట్లో వేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక్కో కబాబ్‌ని బాదం పలుకులలో అద్ది పక్కన పెట్టాలి.ఇలా అంతటినీ చేసుకోవాలి.. పైన తామర తూడు వేయించిన బాణలిలోనే మరో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఒక్కో కబాబ్‌ని పెట్టి మీడియం కంటే తక్కువ మంట మీద ఉంచాలి.కొంతసేపటికి కబాబ్ ఒకవైపు కాలి గోధుమరంగులోకి మారుతుంది.అప్పుడు జాగ్రత్తగా తిప్పుతూ అన్నివైపులా దోరగా కాలేవరకు ఉంచాలి. ఇలాగే అన్నింటినీ కాల్చుకోవాలి. వీటికి పుదీన చట్నీ మంచి కాంబినేషన్.పనీర్ బాదమ్ టిక్కీ..కావలసినవి..పనీర్– 2 కప్పులు;బాదం పలుకులు – అర కప్పు;ఉడికించిన బంగాళదుంప – అర కప్పు;నూనె– 2 టేబుల్ స్పూన్లు;జీలకర్ర– టీ స్పూన్;పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు;అల్లం తరుగు – 2 టీ స్పూన్లు;పసుపు – అర టీ స్పూన్;మిరపొ్పడి– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూన్;ఉప్పు – టీ స్పూన్‌తయారీ..పనీర్‌ను ఒక పాత్రలో వేసి పొడిపొడిగా చిదమాలి. ఇందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి సమంగా కలిసేటట్లు చిదమాలిబాణలిలో టీ స్పూన్ నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి వేగిన తర్వాత పైన పనీర్, బంగాళదుంప మిశ్రమంలో వేయాలి.అదే బాణలిలో మిగిలిన నూనెలో మిరపొ్పడి, ఉప్పు వేసి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత అందులో మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు వేయాలి.ఇందులో పనీర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పెద్ద గోళీలుగా చేసుకుని అరచేతిలో వేసి ఫొటోలో కనిపిస్తున్నట్లు ప్యాటీలుగా వత్తాలి.వత్తిన ప్యాటీలను బాదం పలుకులున్న ప్లేట్లో అద్దాలిఅడుగు వెడల్పుగా ఉన్న బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఒక్కో ప్యాటీని ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి.ఒకవైపు కాలిన తర్వాత జాగ్రత్తగా తిరగేసి రెండవ వైపు కూడా కాలనివ్వాలి.లోపల చక్కగా ఉడికి పైన కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.వీటిని వేడిగా ఉండగానే కెచప్ లేదా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా! -
బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!!
రోడ్డు పక్కనే కదా హోటల్ అనుకొని తీసిపారేయకండి. ఈమె వద్ద ఒక్కసారి బోటికూర, తలకాయ మాంసం రుచి చూశారంటే ఇక రోజూ ఇటువైపు రావాల్సిందే.. అవును మరి.. బోటికూర లక్ష్మమ్మ పెట్టే తలకాయ మాంసం, మటన్ లివర్, బోటి కూర, చికెన్ కర్రీ కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బడా వ్యాపారులు సైతం వచ్చి లొట్టలేసుకొని తింటుంటారు. సమపాళ్లలో మసాలా దినుసులు, ఇంట్లోనే తయారు చేసే కారంపొడి, కొబ్బరిపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ప్రత్యేకంగా బోటీ వండుతుంటానని, రుచికి అదే కారణమని అంటుంటారు బోటికూర లక్ష్మమ్మ. – బంజారాహిల్స్బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని షేక్‌పేట మండల కార్యాలయం వద్ద ఫుట్‌పాత్‌ను ఆనుకొని రోడ్డు పక్కనే రెండు దశాబ్ధాలుగా ఆమె నిర్వహిస్తున్న మొబైల్ మెస్‌లో టేస్ట్ చేస్తున్న ఎంతో మంది ప్రముఖులు శెభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు. ప్రతిరోజూ 12 కిలోల బోటీ వండి వంద మందికి పైగానే ఆహారప్రియులకు అందిస్తున్నారు. అందుకే వరంగల్ జిల్లా ఉల్లిగడ్డ దామెర గ్రామానికి చెందిన గన్నారం లక్ష్మమ్మ(73) ఏకంగా బోటీకూర లక్ష్మమ్మగా పేరు తెచ్చుకుంది.ఈమె బోటీ కూర గురించి ఇప్పటికే సుమారు 100 మంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బోటీ కోసమే వారంలో ఒకటి, రెండుసార్లు ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వస్తుంటారు. తలకాయ మాంసం, మటన్ లివర్, మటన్ కూర, చికెన్ లివర్, చికెన్ కూర, ఇవన్నీ ఈమె వద్ద ప్రత్యేక రుచుల్లో లభిస్తుంటాయి. మరో నలుగురికి ఉపాధి బోటీ కూరను తానే స్వయంగా వండుతానని, ఇందులో వాడే ప్రతి మసాలా దినుసు తానే తయారు చేస్తుంటానని తెలిపారు.రాహుల్ సిప్లిగంజ్‌కు వడ్డిస్తూ..తాను సంపాదించడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. లక్ష్మమ్మను చూసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో ఎంతోమంది మహిళలు స్ఫూర్తి పొంది ఇలాంటి మొబైల్ మెస్‌లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఈమె టేస్ట్‌కు ఎవరూ సాటిరారంటూ చాలామంది యూట్యూబర్లు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించడమే కాకుండా సోషల్ మీడియాలో లక్ష్మమ్మ బోటి కూర టేస్టే సెపరేట్ అంటూ పోస్టులు పెడుతుంటారు. అంతేకాదు స్విగ్గి, జొమాటో ఆర్డర్లు కూడా వస్తుండగా ఇప్పుడున్న గిరాకీ తట్టుకోలేక ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎంతో ఆనందం..బోటీ వండటానికి నాకు 3 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ భోజనాలు ప్రారంభిస్తాను. మొదటి గంటలోనే వందకుపైగా బోటి కూర భోజనాలు అమ్మడవుతుంటాయి. కూర అయిపోగానే చాలా మంది వస్తుంటారు. లేదని చెప్పగానే నిరాశతో వెళ్తుంటారు. డబ్బులు సంపాదించడానికి వండటం లేదు.ఉన్నంతలోనే మంచి రుచితో అందిస్తున్నాను. రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మరో సింగర్ బిట్టు, లేడీ సింగర్ లక్ష్మీతో పాటు చాలా మంది వస్తుంటారు. బాగుంది అని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. నాతో పాటు నా కూతురు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లు ఏడు చోట్ల మెస్‌లు నిర్వహిస్తున్నారు. అన్ని చోట్లకు నేను వండిన బోటి కూర వెళ్తుంది. – లక్ష్మమ్మఇవి చదవండి: 'సిగ్నోరా సర్వీస్ సెంటర్'! ఈ ముగ్గురు మహిళలు.. -
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్‌మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
యాపిల్ లో ఉద్యోగం కావాలా..?
-
పాత పాత్రలతో వంటకాలకు కొత్త రుచులు!
సంప్రదాయంగా వస్తున్న అనేక రకాల వంట పాత్రలతో వంటకాలకు కొత్త రుచులను అద్దవచ్చునని పాకశాస్త్ర నిపుణులు అంటున్నారు. సంప్రదాయ వంట పాత్రలపై నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ విభిన్న రుచులు, సువాసనల సమ్మేళనమైన తెలంగాణ వంటకాలు సంప్రదాయ వంటపాత్రల్లో వండడం ద్వారా మరింత సువాసనను, రుచులను జోడించవచ్చని వివరించారు.సాధారణంగా రుచికి, వంటకు ఉపయోగించే పాత్రలకి ఉన్న సంబంధాన్ని తక్కువగా పరిగణనలోకి తీసుకుంటారని, అయితే వారసత్వంగా మనకు అందివచ్చిన పాత్రలను మాత్రం ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే రూపొందించారన్నారు. ఈ సందర్భంగా గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ, ‘మట్టి సువాసనలను నింపే మట్టి కుండల నుంచి, ఇనుప పాత్రల వరకు సాంప్రదాయ తెలంగాణ వంట పాత్రలు ప్రతి వంటకానికి తమదైన ప్రత్యేకతను అద్దడం ద్వారా వాటికి ప్రామాణికతను జోడిస్తాయి‘ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సంప్రదాయ వంట పాత్రల విశిష్టతలను వివరించారు.రాతి చిప్ప: ఇదొక రాతితో తయారు చేసిన పాత్ర. దీనిని కల్ చట్టి అని కూడా పిలుస్తారు. తెలంగాణ వంటశాలలలో ఓ రకంగా మల్టీ టాస్కర్ ఇది. సన్నటి మంటపై వండితే రుచి బాగుంటుందనుకునే వంటకాలు అయిన పప్పు, సాంబార్లకు ఇది అనువైనదిగా ఉంటుంది. మరింత రుచిని కల్పిస్తుంది. చేతితో చెక్కిన ఈ పాత్రలను ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.ఉరులి: ఒక గుండ్రని వంట పాత్ర ఇది. వివిధ రకాల వంటకాలకు అనువైనది ఈ ఉరులి. కేరళకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారుల చేతుల మీదుగా ఫుడ్–గ్రేడ్ ఇత్తడితో రూపొందింది. ఈ పాత్ర కడాయి తరహాలో ఉపయోగపడుతుంది. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలతో వండిన బెండకాయ వేపుడు (వేయించిన ఓక్రా)తో సహా తెలంగాణలో పలు వంటకాలకు రుచికరమైన ప్రామాణికతను జోడిస్తుంది.మురుకు అచ్చు: ఇది కరకరలాడే మురుకులు లేదా జంతికలు కోసం తప్పనిసరిగా ఉండవలసిన సర్వ సాధారణ సాధనం.అట్టుకల్: సిల్ బత్తా, కల్ బత్తా వంటి విభిన్న పేర్లతో పిలిచే ఈ గ్రైండింగ్ రాయి మొత్తం మసాలాలు, ధాన్యాలు, పప్పులను సువాసనగల పేస్ట్‌లు పౌడర్లుగా మారుస్తుంది. దీనిలో చట్నీలను రుబ్బడం వల్ల అది ఒక కొత్త ఆకర్షణను అందిస్తుంది. ఇంటి వంటల మధురమైన జ్ఞాపకాలను సమున్నతం చేస్తుంది.మట్టి పాత్రసహజమైన మట్టితో రూపొందించిన ఈ సంప్రదాయ కుండ, కోడి కూర (ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ) చేయడానికి సరైన పాత్ర. మట్టికి మాత్రమే కలిగిన ప్రత్యేక లక్షణాలు తేమను నిలుపుకోవడంలో దీనికి సహాయపడతాయి. ఈ కుండలు అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.ది మ్యాజిక్ ఆఫ్ కాస్ట్ ఐరన్: కాస్ట్ ఐరన్ తో చేసిన వంటసామాను తో కూడా తెలంగాణ వంటకాలు వండుతారు. ఈ దఢమైన కుండలు సన్నగా దోసెలు, నోటిలో కరిగిపోయే హల్వా, గుంట పొంగనాలు వంటి వాటికి బాగా అనుకూలం. -
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్ మరెంతో స్పెషల్.., సోయా అంజీరా హల్వాలు నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!కోకోనట్ ఆమ్లెట్..కావలసినవి..గుడ్లు – 5కొబ్బరి కోరు – పావు కప్పుఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)హెవీ క్రీమ్ – అర టేబుల్ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది)పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లుబటర్ – 2 టేబుల్ స్పూన్లు (కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)ఉప్పు – కొద్దిగాతయారీ..– ముందుగా ఒక బౌల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం పాన్ లో బటర్ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్‌లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్.బాదం క్రిస్పీ చికెన్..కావలసినవి..బోన్ లెస్ చికెన్ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి)మొక్కజొన్న పిండి – 6 టేబుల్ స్పూన్లుగోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్బాదం – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)గుడ్లు – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లుమిరియాల పొడి – కొద్దిగాఉప్పు – తగినంతనూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.– మరో బౌల్లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని.. దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్ చేసుకోవాలి.సోయా అంజీరా హల్వా..కావలసినవి..డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)కిస్మిస్ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)సోయా పాలు – అర కప్పుఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)నెయ్యి, పంచదార – సరిపడాగసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్కితయారీ..– ముందుగా అంజీరా, కిస్మిస్ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.– ఈలోపు కళాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్ కలర్ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్‌లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకోవాలి.ఇవి చదవండి: ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్ సమస్యలకు చెక్! -
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
వంట చేయడం వల్ల వచ్చే పొగ నుంచి గాలి కాలుష్యమవుతుంది. ఇటీవల కార్లలో వాసన చూస్తే కేన్సర్ వస్తుందని పలు నివేదికలు హల్ చల్ చేశాయి. తాజాగా మరో అధ్యయనం దిగ్భ్రాంతి రేపుతోంది. అదేంటో తెలియాలంటే మీరీ కథనం చదవాల్సిందే!పప్పు పోపు, పులిహోర తాలింపు, చికెన్, మటన్ మసాలా ఘుమ ఘుమలు లాంటివి రాగానే గాలి ఒకసారి అలా గట్టిగాపైకి ఎగ పీల్చి.. భలే వాసన అంటాం కదా. కానీ ఇలా వంట చేసేటపుడు వచ్చే వాసన గాలిని కలుషితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో తినుబండారాలను కలిగి ఉన్న లాస్ వెగాస్‌లో గాలి నాణ్యత సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చేసిన ఈ పరిశోధనలో రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు , వీధి వ్యాపారుల వద్ద వంట చేసే రుచికరమైన వాసన గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కనుగొంది. పట్టణ వాయు కాలుష్యం ప్రభావంపై కెమికల్ సైన్సెస్ లాబొరేటరీ (CSL) పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను విడుదల చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్ ,కొలరాడోలోని బౌల్డర్ మూడు నగరాలపై దృష్టి సారించారు. ఈ నగరాల్లో వంటకు సంబంధించిన మానవ-కారణమైన అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) కొలుస్తారు. మీకు వాసన వచ్చిందంటే, అది గాలి నాణ్యతను ప్రభావితం చేసే మంచి అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వెగాస్ బహిరంగ గాలిలో ఉన్న మొత్తం కర్బన సమ్మేళనాల్లో 21 శాతం వంటలనుంచి వచ్చినవేనని అధ్యయన రచయిత మాట్ కాగన్ చెప్పారు. వాహనాలు, అడవి మంటల పొగ, వ్యవసాయం, వినియోగదారు ఉత్పత్తులు వంటి విభిన్న వనరుల ఉద్గారాలను పరిశోధకులు అంచనా వేశారు. పట్టణాల్లో వీటిని లాంగ్-చైన్ ఆల్డిహైడ్లు అని పిలుస్తామని వెల్లడించారు. అయితే వంట చేయడం వల్ల వచ్చే వాయు కాలుష్యం చాలా తక్కవే అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్గారాలకు వంట వాసన కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాదు ఇంటి లోపల ,ఇళ్ల లోపల సమస్య మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరించారు. -
సరికొత్త వంటకాలను కోరుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి!
ప్రతీరోజూ తిన్న వంటకాలని మళ్లీ మళ్లీ తినాలంటే.. చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. కొంచెం కారంగానో, తీయగానో కావాలని కోరుకుంటారు. విశ్రాంతి సమయంలో ఏదో ఒకటి నమిలేవరకూ వారికి పొద్దేపోదు. మరి అలాంటి వారి కోసం ఈ వెరైటీ వంటలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. పుట్టగొడుగు లాలీపాప్స్.. కావలసినవి: పుట్టగొడుగులు – 15 లేదా 20 (వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని పక్కనపెట్టుకోవాలి), మైదాపిండి – 1 కప్పు, ధనియాల పొడి, పసుపు – పావు టేబుల్ స్పూన్, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి – అర టేబుల్ స్పూన్ చొప్పున, కార్న్‌ఫ్లేక్ మిక్సర్ – 1 కప్పు (కవర్లో వేసి.. చపాతీ కర్రతో అటు ఇటు నొక్కి పొడిపొడిగా చేసుకోవాలి), బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ – అర కప్పు చొప్పున, అల్లం పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ.. ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ధనియాల పొడి, పసుపు, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, అల్లం పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం మరో బౌల్ తీసుకుని కార్న్‌ఫ్లేక్ మిక్సర్, బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ప్రతి పుట్టగొడుగుకు పుల్ల గుచ్చి.. ఒక్కోదాన్ని మొదట మైదా మిశ్రమంలో తర్వాత బ్రెడ్ పౌడర్ మిశ్రమంలో ముంచి.. మిశ్రమాన్ని బాగా పట్టించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీల్మేకర్ – టొమాటో గారెలు.. కావలసినవి: మీల్మేకర్ – 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), టొమాటో – 3 (మెత్తగా మిక్సీ పట్టుకుని.. జ్యూస్‌లా చేసుకోవాలి), ఉల్లిపాయ తరుగు – పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్ పౌడర్ – 1 కప్పు చొప్పున, మినుముల పిండి – 2 కప్పులు (మినుములు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి), జీలకర్ర – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మినుముల పిండి, మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసుకుని టొమాటో జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి. అనంతరం కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని.. గారెల్లా ఒత్తుకుని, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిపై మజ్జిగ ఆవడ వేసుకుని, నానబెట్టి తింటే భలే బాగుంటాయి. మీల్మేకర్ – టొమాటో, గారెలు చెర్రీ హల్వా.. చెర్రీ హల్వా.. కావలసినవి: చెర్రీస్ – రెండున్నర కప్పులు (గింజలు తీసి శుభ్రం చేసుకోవాలి) యాలకుల పొడి – పావు టీ స్పూన్ మొక్కజొన్న పిండి – రెండుంపావు కప్పులు పంచదార – 1 కప్పు, నట్స్ – కావాల్సినన్ని నెయ్యి – అర కప్పు, నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ – అభిరుచిని బట్టి తయారీ.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చెర్రీస్ వేసుకుని గరిటెతో తిప్పుతూ మగ్గేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అనంతరం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత.. మొక్కజొన్న పిండిలో నీళ్లు పోసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చెర్రీస్ మిశ్రమంలో వేసుకోవాలి. కాసేపటికి మరోసారి కొద్దిగా నెయ్యి వేసుకుని తిప్పాలి. దగ్గరపడుతున్న సమయంలో జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి చల్లారాక.. మరిన్ని డ్రైఫ్రూట్స్ తురుముతో సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా! -
వినియోగదారుల డిమాండ్‌లో.. మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్!
ఎక్కువ పరిమాణంలో ఎక్కువ రకాలను వండిపెట్టే ఇలాంటి మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్కి.. వినియోగదారుల నుంచి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. చిత్రంలోని ఈ బేర్ మల్టీఫంక్షనల్ ఎలక్ట్రిక్ పాట్.. 6లీటర్ల సామర్థ్యంతో, పలు ప్రత్యేకమైన ఆప్షన్స్‌తో రూపొందింది. ఫుడ్‌గ్రేడ్ నాన్–స్టిక్ కోటింగ్‌తో తయారైన ఈ పాత్రలో.. సులువుగా వంట చేసుకోవచ్చు. బేస్ మెషిన్‌కి సరిపడా ఈ పెద్ద పాత్ర.. 2 పార్ట్స్‌గా విడిపోయి ఉంటుంది. దాంతో ఒకేసారి రెండు వెరైటీలను వండుకోవచ్చు. దీనికి అనువైన మూత ఉండటంతో.. వంట వేగంగా పూర్తవుతుంది. క్లీనింగ్ కూడా చాలా తేలిక. డివైస్‌కి ముందువైపున్న రెగ్యులేటర్, ఆప్షన్ బటన్స్‌తో వినియోగం అంత కన్నా తేలిక. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు దీనిపై వంట యమఈజీ. దీని ధర 132 డాలర్లు (రూ.10,942) ఇవి చదవండి: Chugurova: ఆహా...పోహ వైరల్ -
మీరెప్పుడైనా బొప్పాయి బన్స్ ట్రై చేసారా..!
కావలసినవి: బొప్పాయి గుజ్జు, బాదం పౌడర్ – 1 కప్పు చొప్పున పీనట్ బటర్, అవిసెగింజల పొడి – అర కప్పు చొప్పున, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – అర టీ స్పూ¯Œ , బాదం – జీడిపప్పు ముక్కలు, మినీ చాక్లెట్ చిప్స్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున కొబ్బరి తురుము – కొద్దిగా (గార్నిష్‌కి) తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో బొప్పాయి గుజ్జు, అవిసెగింజల పొడి, బాదం పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వెనీలా ఎక్స్ట్రాక్ట్, పీనట్స్ బటర్, బాదం – జీడిపప్పు ముక్కలు వేసుకుని.. మరోసారి బాగా కలుపుకోవాలి. అనంతరం చాక్లెట్ చిప్స్ వేసుకుని ఒకసారి కలుపుకుని.. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని.. ఆ మొత్తం మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని కొబ్బరి కోరులో వేసి, దొర్లించి.. సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: స్వీట్ పొటాటో బన్స్.. క్షణాలలో ఇలా రెడీ చెయొచ్చు! -
హాస్టల్ పిల్లల చేత వంట పనులు...ప్రిన్సిపాల్ పై మండిపడుతున్న తల్లిదండ్రులు
-
పూలను పూజల్లోనే కాదు వంటల్లో కూడా వాడేయొచ్చట..!
పూలను సాధారణంగా పూజ కోసం, ఇంటి డెకరేషన్ కోసం వాడుతుంటాం. మగువలలు తలలో అలంకరించుకోవడానికి తప్పనసరిగి వివిధ రకాల పువ్వులను ఉపయోగిస్తుంటారు. అంతవరకే మనకు తెలుసు. కానీ పూలను వంట్లో ఉపయోగించొచ్చా అనే విషయం గురించి విన్నారా?. ఔను వాటిని వంటల్లో హ్యాపీగా ఉపయోగించి వండేయొచ్చంటున్నారు. పైగా ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. ఎలాగో తెలుసా..! వంటల్లో వినియోగించే తినదగిన పువ్వులు సరైన విధంగా ఎంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిల్లో పురుగులు, పాడైనవి లేకుండా మంచిగా ఉండేవి తీసుకోవాలి. ముఖ్యంగా రసాయనాలు చల్లనివి తినడానికి వినియోగించడం ముఖ్యం. లేదంటే మనం చేసిన రెసిపీ రుచిలో తేడాలు వచ్చి టేస్ట్ బాగుండదని హెచ్చరిస్తున్నారు. అందువల్ల వండే ముందే తినదగిన పువ్వులను మంచిగా ఎంపిక చేసుకుని ఉంచుకోవడం బెటర్ అని చెబుతున్నారు. ఇక వాటితో ఎలాంటి రెసీపీలు చేసుకోవచ్చంటే.. ఎరుపు, తెలుపు, ఆరెంజ్, పసుపు.. ఇలా విభిన్న రంగుల్లో దొరికే కార్నేషన్ పూలను ఇంటి అలంకరణ, వేడుకల్లో వేదిక అలంకరణ కోసం ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిని కేక్ డెకరేషన్ కోసమూ వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. వీటి పూరేకల్లో ఉండే తియ్యదనం కేక్ రుచిని మరింతగా పెంచుతుందంటున్నారు. అయితే ఈ పూరేకల కింది భాగం కాస్త వగరుగా ఉంటుంది కాబట్టి దాన్ని కత్తిరించి పైభాగాన్ని కేక్ డెకరేషన్ కోసం ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండే మందార పూరేకలు నోటికి పుల్లటి రుచిని అందిస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో, గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారట! గులాబీ పూరేకల్ని తినేవారు చాలామందే ఉంటారు. అయితే వీటిని ఐస్‌క్రీమ్, ఇతర డిజర్ట్స్పై గార్నిష్ చేయడానికి ఉపయోగించచ్చు. కాస్త పెద్దగా ఉన్న గులాబీ రేకలైతే సలాడ్స్‌పై చల్లుకోవచ్చు. అంతేకాదు.. జెల్లీస్, షుగర్ సిరప్స్ తయారీలోనూ వీటిని వాడచ్చట!.ఆయుర్వేద పరంగా మందార రేకులతో చేసిన టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రుతుక్రమ సమస్యతో బాధపడే వాళ్లు ఎర్రటి మందారాన్ని చెరుకురసంతో కలిపి తీసుకుంటే ఇర్రెగ్యులర్ పిరియడ్ సమస్య నుంచి ఉపశమంన పొందగలరని చెబుతున్నారు. ఇంట్లో గార్డెన్లో పెంచుకునే చిట్టి చామంతుల (చామొమైల్ పువ్వులు)తో స్ట్రాంగ్‌గా ఓ టీ పెట్టుకొని తాగితే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కూమా మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు! డైట్, ఫిట్నెస్ పాటించేవారు ఈ టీని ఆశ్రయించడం మంచిదని చెబుతున్నారు ఆకట్టుకునే రంగులో ఉండే లావెండర్ పూలను కేక్స్, కుకీస్ తయారీలోనూ వాడచ్చంటున్నారు నిపుణులు. అలాగే బయట మార్కెట్లో ఈ పూలను తేనె, సిరప్స్, వెనిగర్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారట! ఫలితంగా వాటికి అదనపు రుచి, వాసనను జోడించచ్చు. పుల్లటి రుచిలో ఉండే బంతి పూరేకల్ని సలాడ్స్ డ్రస్సింగ్ కోసం, కూరల్లో గార్నిష్ కోసం వాడుకోవచ్చట!. అంతేగాదు కేక్ డెకరేషన్లో కూడా అందంగా కనిపించేలా అలంకరించొచ్చు. ఉపయోగించేటప్పుడు గుర్తించుకోవాల్సివి.. ఈ పూలను ఆహారంలో భాగం చేసుకునే క్రమంలో వాటి రుచిలో తేడా రాకుండా జాగత్త పడేల వినయోగించాలని చెబుతున్నారు చెఫ్‌లు. వాడిపోయినవి కాకుండా.. తాజా పూలు, పూరేకలు తీసుకున్నప్పుడే వాటి రుచి ఇనుమడిస్తుంది. అలాగే రసాయన ఎరువులు వాడకుండా పెంచినవే ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే వాడే ముందు వాటిని దుమ్ముధూళి లేకుండా చక్కగా శుభ్రం చేయాలి. కొన్ని పూరేకల కింది భాగం వగరుగానూ, చేదుగానూ ఉంటాయి. కాబట్టి ఆ భాగాన్ని తొలగించి కూరల్లో, ఇతర వంటకాల్లో వాడితే వాటి రుచి తగ్గకుండా జాగ్రత్తపడచ్చు. వంటకాల్లో, గార్నిష్ కోసం వివిధ రకాల పూలను ఒకేసారి వాడచ్చు. ఫలితంగా వాటి రుచి పెరుగుతుంది. అలాగే చూడ్డానికి ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల పూలు కొంతమందికి పడకపోవచ్చు. కాబట్టి వీటిని తీసుకున్నప్పుడు అలర్జీ వంటి సమస్యలేవైనా ఎదురైతే.. వాటికి దూరంగా ఉండడమే మంచిది. అవసరమైతే నిపుణుల సలహాలూ తీసుకుని ఉపయోగించడం మంచింది. (చదవండి: తేనెను నేరుగా వేడిచేస్తున్నారా? పాయిజన్‌గా మారి..) -
ప్రేమతో... జామ్
న్యూఢిల్లీ: ఎప్పుడూ రాజకీయాలతో బిజీ బిజీగా గడిపే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు గరిటె పట్టారు. తల్లి సోనియాగాంధీతో కలిసి బత్తాయి జామ్ తయారు చేశారు. పెరట్లో పండిన బుల్లి బత్తాయిలతో తయారు చేసిన ఆ జామ్ తనకెంతో ఇష్టమని సోనియా చెప్పారు. ఈ ఆసక్తికర వీడియోను నూతన సంవత్సరం సందర్భంగా రాహుల్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి తోటలోని బత్తాయిలను తెంపుకొచ్చి జామ్ తయారు చేస్తూ తమ ఆహార ఇష్టాయిష్టాలను సరదాగా పంచుకున్నారు. కావాలంటే బీజేపీ వాళ్లకు కూడా జామ్ ఇద్దామని రాహుల్ అంటే, ‘మనకే తిరిగిచ్చేస్తా’రని సోనియా బదులిచ్చారు. జామ్ రెసిపీ తన చెల్లెలు ప్రియాంకదని రాహుల్ వెల్లడించారు. తల్లికి ఒకప్పుడు పచ్చళ్లు నచ్చేవి కావని, ఇప్పుడవి ఎంతో ఇష్టమని రాహుల్ అన్నారు. బ్రిటన్‌లో ఉండగా వంట నేర్చుకున్నానన్నారు. తానెప్పుడు విదేశాల నుంచి తిరిగొచ్చినా ముందుగా పప్పన్నం తినాల్సిందేనని సోనియా చెప్పారు. మాటల మధ్యే తయారైన జామ్‌ను ఇద్దరూ కలిసి చిన్న గాజు సీసాల్లో నింపారు. ‘ప్రేమతో.. సోనియా, రాహుల్’ అని రాసి స్నేహితులు, బంధువులకు పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. -
వంట అయిపోగానే దానంతట అదే ఆఫ్ అయిపోతుంది
వండివార్చేవాళ్లకు ఈ ఎలక్ట్రిక్ పోర్టబుల్ స్టవ్ దొరికితే పండుగే! ఎందుకంటే దీనిపై ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పాత్రతోనైనా సులభంగా వండుకోవచ్చు. ఏ వంటకాన్నయినా నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఈ మినీ ఎలక్ట్రిక్ స్టవ్‌ని పవర్‌తో కనెక్ట్ చేసుకుని.. కుడివైపు ముందు భాగంలో ఉన్న రెగ్యులేటర్‌ను సెట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన.. రైస్ ఐటమ్స్ దగ్గర నుంచి కూరలు, సూప్స్, టీ, కాఫీలన్నిటినీ తయారు చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ క్లోజింగ్ ఫంక్షన్‌తో రూపొందటంతో ఔట్ డోర్ క్యాంపింగ్ బర్నర్‌గా యూజ్ అవుతుంది. స్టీల్, గ్లాస్, అల్యూమినియం.. ఇలా అన్నిపాత్రలూ దీనికి సెట్ అవుతాయి. ఇలాంటి మోడల్స్.. అనేక రంగుల్లో అమ్ముడుపోతున్నాయి. పవర్ వాట్స్ లేదా సెట్టింగ్స్‌లో చిన్న చిన్న మార్పులతో లభించే ఇలాంటి స్టవ్‌లకు మంచి గిరాకే ఉంది. ధర కూడా తక్కువే. కేవలం15 డాలర్లు (రూ.1,251) మాత్రమే. -
ట్రావెలింగ్‌లో బెస్ట్.. ఈ కెటిల్‌ని మడిచి బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు
డ్రై బర్న్ ప్రొటెక్షన్, ఆటోమేటిక్ షట్ ఆఫ్ వంటి ఆప్షన్స్‌తో రూపొందిన ఈ ఫోల్డబుల్ కెటిల్.. టూరిస్ట్‌లకు ఎంతో ఉపయుక్తం. హై క్వాలిటీ 304 స్టెయిన్ లెస్ స్టీల్, ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్‌తో తయారైన ఈ పరికరం చాలా తేలికగా.. ట్రావెలింగ్ బ్యాగ్స్‌లో పెట్టుకునేందుకు అనువుగా ఉంటుంది. స్టీమింగ్ అండ్ ఇన్సులేషన్ ఫంక్షన్ తో ఉన్న ఈ కెటిల్లో ఆన్ ఆఫ్ బటన్‌తో పాటు టెంపరేచర్ బటన్ కూడా కలసి ఉంటుంది. ఇందులో కాఫీ, టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, వేడినీళ్లతో పాటు.. సూప్స్ వంటివీ చేసుకోవచ్చు. అలాగే గుడ్లు, జొన్న కండెలను ఉడికించుకోవచ్చు. అవసరాన్ని బట్టి కెటిల్‌ని మడిచి, హ్యాండిల్‌ని ఎడమవైపు 90 డిగ్రీస్ తిప్పి ప్యాక్ చేసుకోవచ్చు. లేదంటే చిత్రంలో చూపించిన విధంగా హ్యాండిల్‌ని పెద్దగా చేసుకుని కెటిల్‌ని పట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.ధర 33డాలర్లు (రూ.2,752) -
భారత రెస్టారెంట్‌కి బ్యాంకాక్ మిచెలిన్ స్టార్ అవార్డు!
మనదేశంలో పలు విభాగాల్లో అవార్డులు ఇస్తారు గానీ కుకింగ్(వంటకాల) విభాగంలో ఇవ్వరు. పోనీ బాగా వెరైటీ వంటకాలతో రుచులను అందించే రెస్టారెంట్లకు కూడా కనీసం అవార్డు ఇవ్వడం గానీ ఆ చెఫ్‌లను గుర్తించడం వంటివి జరగవు. జస్ట్ టీవీ షోలతోనో లేక ఆ రెస్టారెంట్ అడ్వర్టైస్మెంట్ వల్ల పేరు వస్తుంది అంతే. కానీ బ్యాంకాక్ వంటి విదేశాల్లో అలా ఉండదు. మంచి రుచులతో కూడిన విభిన్న వంటకాలు అందించే రెస్టారెంట్లను గుర్తించి అవార్డులిస్తాయి. ఆ చెఫ్‌లను కూడా ప్రశంసిస్తారు. ఈ ఏడాది అవార్డుని ఓ భారతీయ రెస్టారెంట్ దక్కించుకోవడమే గాక ఆ ఘనతను దక్కించుకున్న తొలి భారతీయ మహిళా చెఫ్‌గా గరిమా అరోరా నిలవడం మరింత విశేషం. బ్యాంకాక్‌లో పలు రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే విభిన్న వంటకాలతో మంచి రుచులను అందిస్తున్న 'గా(Gaa)' అనే భారతీయ రెస్టారెంట్ మిచెలిన్ స్టార్ అవార్డు అందుకుంది. పైగా ఇది రెండోసారి ఆ అవార్డును గెలుచుకోవడం. ఈ రెస్టారెంట్‌ని ముంబైకి చెందిన గరిమా అరోరా ప్రారంభించింది. బ్యాకాంక్లోని కుకింగ్‌కి సంబంధించిన అత్యున్నత అవార్డు మిచెలిన్ స్టార్‌ని రెండు సార్లు కైవసం చేసుకోవడంతో ఈ ఘనతను పొందిన తొలి భారతీయ మహిళగా ఈ 37 ఏళ్ల అరోరా నిలిచింది. అరోరా థాయ్‌లాండ్‌లో కోపెన్‌హెగెన్‌లో నివశిస్తుంది. భారత్‌తో థాయిలాండ్‌కి ఉన్న సంబంధాల రీత్యా బ్యాంకాక్‌లో రెస్టారెంట్ పెట్టే సాహసం చేశానని చెప్పుకొచ్చింది అరోరా. అవార్డుల కోసం వివిధ రకాల వంటకాలు చేయలేదని అంటోంది. బ్యాంకాక్‌లో ఇన్ని వేల రెస్టారెంట్లు ఉండగా వాటన్నింటిని కాదని తన రెస్టారెంట్‌కే రెండు సార్టు మిచెలిన్ స్టార్ అవార్డులు రావడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పింది. ప్రతి కస్టమర్‌కి కొత్తగా అనిపించేలా విభ్ని రుచులను అందించడంపైనే మా సిబ్బంది ఫోకస్ చేస్తుంది. ఎప్పటికప్పుడూ సాంకేతికతో కూడిన ఆలోచనలతో విభిన్నవంటకాలను తీసుకొస్తుంటాం. ఆ అభిరుచే ఈ అవార్డులను తెచ్చిపెట్టిందని వివరించింది అరోరా. ఐతే ఇలాంటి అవార్డులే భారత్‌లో కూడా ఉంటే కనీసం ముగ్గురు మిచెలిన్ స్టార్ చెఫ్‌లు ఉండేవారని అంటోంది. ఇలాంటి అవార్డులను భారత ప్రభుత్వం కూడా ఇస్తే బాగుండనని ఆమె చెబుతోంది. ఆహారం కూడా అద్భుతమైన ఆకర్షణ శక్తే. దీన్ని విభ్నింగా అందించే మార్గాల గురించి అన్వేషించే ఆలోచన వైపుకి వెళ్లకపోవడంతోనే దీన్ని భారత్ గుర్తించలేదు. ముఖ్యంగా పర్యాటక శాఖ దీనిపై దృష్టిసారిస్తే బాగుండనని అరోరా అభిప్రాయపడింది. భారత్‌లో ముఖ్యంగా సంప్రదాయ వంటకాలు, దేశీయ ఆహార పదార్థాలపైనే చెఫ్‌లు దృష్టిసారించారని, విభిన్న రుచికర వంటాకాలు వెరైటీగా అందించే ఆలోచన చేయకపోడమే ఇలాంటి అవార్డు లేకపోవడటాని ప్రధాన కారణమని అరోరా చెబుతోంది. ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారంటేట.. అత్యుత్తమ వంటలను అందించే రెస్టారెంట్లకు మిచెలిన్ స్టార్ ఇవ్వడం జరుగుతుంది. ఐదు సార్వత్రిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు: పదార్థాల నాణ్యత, రుచుల ప్రాధాన్యత, అందించడంలో సాంకేతికతతో కూడిన విధానం, వంటకాలను రుచిగా తయారు చేసే చెఫ్ నైపుణ్యం, మెనులోని అర్థమయ్యేల ఆహార పదార్థాల లిస్టు తదితరాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులను బ్యాకాంక్ అధికారులు ఇస్తారు. (చదవండి: ఆధ్యాత్మిక బలానికి అత్యాధునిక చిహ్నం.. దీని ప్రత్యేకతలు తెలుసా?) -
కుమారులకి వంట నేర్పిస్తే.. ఏం జరుగుతుందో ఈ అమ్మ చూపించింది!
బహుశా ‘మాస్టర్ చెఫ్‘ విజేతగా 25 లక్షలు ఇంటికి తీసుకొస్తాడు. అబ్బాయిలు వంట గదిలోకి వస్తే ‘ఏంట్రా ఆడపిల్లలాగా‘ అని మందలిస్తారు. కాని వంట స్త్రీలకూ, పురుషులకూ రావాలి. పిల్లలు ఎంత బాగా చదువుకున్నా వారికి కొద్దో గొప్పో వంట తెలిసుండాలి. ‘మాస్టర్ చెఫ్’ తాజా విజేత ఆషిక్ మా అమ్మ నేర్పిన వంట వల్లే గెలిచాను అన్నాడు. మంగళూరులో చిన్న జ్యూస్ షాప్ నడుపుకునే ఆషిక్ ఇంత పెద్ద గెలుపుతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. ‘సోనీ లివ్’ చానల్ వారి ప్రఖ్యాత రియాలిటీ షో ‘మాస్టర్ షెఫ్’ సీజన్ 8 ఆడిషన్స్ రౌండ్లో ఆషిక్ చేసిన మంగళూరు స్టయిల్ ఫిష్ ఫ్రైను జడ్జీలు వెంటనే ఓకే చేయలేదు. ‘కొంత బాగుంది కొంత బాగలేదు. మళ్లీ చెప్తాం’ అన్నారు. కాని ఆ తర్వాత ఆషిక్‌కు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 8 ఫైనల్స్ వరకూ ఆషిక్ చేసిన వంటకాల ప్రయాణం ఉద్వేగభరితంగానే సాగింది. ఎందుకంటే అతడు వంటను శాస్త్రోక్తంగా నేర్చుకోలేదు. అమ్మ దగ్గర ఇంట్లో వంటగదిలో నేర్చుకున్నాడు. 24 ఏళ్ల కుర్రాడు మంగళూరుకు చెందిన ఆషిక్ వయసు 24 ఏళ్లు. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేద్దామనుకున్నాడు. కాని ఫీజు కట్టే పరిస్థితి లేక కట్టలేదు. ఏం చేయాలి. వంట బాగా వచ్చు. యూ ట్యూబ్‌లో చూసి రకరకాల వంటకాలు చేయడం నేర్చుకున్నాడు. దానికి కారణం చిన్నప్పటి నుంచి అతని ఆటలన్నీ వంట గదిలోనే సాగేవి. నానమ్మ వంట చేస్తుంటే అక్కడే కూచుని చెంబులు తప్పేళాలతో ఆడుకునేవాడు. అమ్మ హయాం వచ్చేసరికి వంటలో సాయం పట్టడం మొదలెట్టాడు. తల్లి – ‘ఏమిటీ ఆడంగి పనులు’ అని తిట్టకుండా కొడుకును ప్రోత్సహించింది. ఇంటికి ఎవరొచ్చినా ఆషిక్ వంట చేసే పద్ధతి చూసి ఆశ్చర్యపోయేవారు. ఆ ఆత్మవిశ్వాసంతో మంగళూరులో ‘కులుక్కి’ పేరుతో చిన్న జ్యూస్ షాప్ పెట్టాడు ఆషిక్. అయితే అది సగటు జ్యూస్షాప్ కాదు. ఆషిక్ కనిపెట్టిన రకరకాల ఫ్లేవర్లు, మిక్స్డ్ కాంబినేషన్లు అందులో దొరుకుతాయి. జనం బాగా కనెక్ట్ అయ్యారు. అతని జ్యూస్ షాప్ మంచి హిట్. కాని ఇంకా జీవితంలో సాధించాలి అంటే ఏదైనా పెద్దగా చేయాలనుకున్నాడు ఆషిక్. ‘మాస్టర్ షెఫ్’ అందుకు వేదికగా నిలిచింది. విఫలమైనా ముందుకే 2022 మాస్టర్ షెఫ్ ఆడిషన్స్‌కు వచ్చిన ఆషిక్ రిజెక్ట్ అయ్యాడు. ‘చాలా డిప్రెషన్లోకి వెళ్లాను. మళ్లీ ఏమీ వండలేననే అనుకున్నాను. కాని సాధించాలి... మనసుపెట్టి పోరాడాలి అని నిశ్చయించుకున్నాను. 2023 ఆడిషన్స్ వచ్చేవేళకు చాలా కష్టపడి తర్ఫీదు అయ్యాను సొంతగా. షో ముందుకు వెళ్లేకొద్దీ సవాళ్లు ఎదురైనా ఛేదిస్తూ విజేతగా నిలిచాను’ అన్నాడు ఆషిక్. ఫైనల్స్ ఎపిసోడ్లో ఆషిక్ తల్లిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమె సమక్షంలోనే ఆషిక్‌ను విజేతగా ప్రకటించారు. కొడుకు విజేత అవుతాడో లేదోనని ఆమె ఉత్కంఠగా ఎదురు చూసింది. ఆపై కొడుకు విజయానికి పులకించిపోయింది. కాగా ఈ సీజన్లో మేఘాలయాకు చెందిన స్కూల్ ప్రిన్సిపల్ నంబి మొదటి రన్నర్ అప్‌గా, జమ్ము–కశ్మీర్‌కు చెందిన రుక్సర్ అనే ఫుడ్ టెక్నిషియన్ సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచారు. ప్రసిద్ధ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, గరిమా అరోర జడ్జీలుగా వ్యవహరించారు. రొయ్యలతో ఆషిక్ చేసిన ‘క్రిస్పీ ప్యారడైజ్’ అనే వంటకాన్ని రుచి చూసిన జడ్జ్ రణ్వీర్ బ్రార్ తన సంతకం కలిగిన కిచెన్ నైఫ్ బహూకరించడం విశేషం. హోటల్ రంగంలోగాని, స్వయం ఉపాధికిగాని పాకశాస్త్రం నేడు చాలా అవసరంగా ఉంది. మంచి షెఫ్‌లకు చాలా డిమాండ్ ఉంది. అదెలా ఉన్నా తెల్లారి లేస్తే మూడుపూట్లా తినాలి కనుక, వంట కేవలం ఆడవారి వ్యవహారం అనే భావన పోయి, ఇకమీదైనా అబ్బాయిలకు తల్లులు కనీసం అవసరమైనంత వంట నేర్పడం మంచింది. ఏమో... వారు ఇంకా బాగా నేర్చుకుంటే మరో మాస్టర్ షెఫ్ అవుతారేమో. ఏ ప్లేట్‌కు ఏ పదార్థం రాసి పెట్టుందో ఎవరు (రుచి) చూసొచ్చారు కనుక. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
పిల్లలు ఆడుతూ పాడుతూ ఇంటి పనులు చేసేలా నేర్పించండిలా!
‘కోటి విద్యలు కూటి కోసమే’ అని లోకోక్తి. కానీ, ‘కూటి విద్యను నేర్చుకున్నాకే కోటి విద్యలూ’ అనేది ఈతరం సూక్తి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. అందుకు స్వయంపాకమైతే దీ బెస్ట్ అనే సలహా ఇస్తారు ఆరోగ్య స్పృహ కలిగినవాళ్లెవరైనా! చదువు, కొలువుల కోసం ఉన్న ఊరును వదిలి.. పరాయి చోటుకు పయనమయిన.. అవుతున్న వారంతా ఆ సలహాకే పోపేస్తున్నారు. ఎసట్లో నాలుగు గింజలు ఉడికించుకుంటున్నారు. వర్కింగ్ పేరెంట్స్ ఉన్న పిల్లలకూ ఇది అవసరంగా మారుతోంది. పిల్లల చేతికి గరిటెనందిస్తోంది. రకరకాల వంటకాలను నేర్చుకునేందుకు ప్రేరేపిస్తోంది. అలా పిల్లలు ఆడుతూ పాడుతూ వండుకునే మెనూస్నీ.. వంటింటి చిట్కాలనూ తెలుసుకుందాం! వంట చేయడం ఓ కళైతే.. దాన్ని వారసత్వంగా పిల్లలకు అందించడం అంతకు మించిన కళ. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను యుక్తవయస్సు దాటేవరకు వంట గదివైపే రానివ్వరు. కానీ.. ఏ విద్యలోనైనా అనుభవజ్ఞులు నేర్పించే పాఠం కంటే అనుభవం నేర్పించే పాఠం ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే చిన్న వయసు నుంచి పిల్లల్ని వంట పనుల్లో, ఇంటిపనుల్లో భాగం చేయడం అవసరం. సలాడ్స్ చేయడం.. రెసిపీలు కలపడం వంటి చిన్న చిన్న పనులతో పాటు.. ఏ కూరగాయ ఎలా ఉడుకుతుంది? ఏ బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టాలి? ఏ వంటకానికి ఎలా పోపు పెట్టాలి? వంటి వాటిపై అవగాహన కల్పించాలి. సాధారణంగా వంటింట.. పదునైన కత్తులు, బ్లేడ్లు, ఫ్లేమ్స్.. వేడి నూనెలు, నెయ్యి ఇలా చాలానే ఉంటాయి. అందుకే పిల్లల్ని ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటారు పేరెంట్స్. నిజానికి వంటగదిలోకి రానివ్వకుండా ఆపడం కంటే.. పర్యవేక్షణలో అన్నీ నేర్పించడమే మేలు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతివాళ్లకూ ఏదో ఒకరోజు తమ వంట తామే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కత్తి తెగుతుందని, నిప్పు కాలుతుందనే విషయం తెలిసే వయసులోనే పిల్లలు ఉప్పుకారాల మోతాదులు అర్థంచేసుకుంటే మంచిది అంటున్నారు కొందరు పెద్దలు. దీనివల్ల సెల్ఫ్డింపెడెన్సే కాదు.. జెండర్ స్పృహా కలుగుతుందని అది అత్యంత అవసరమనీ పెద్దల అభిప్రాయం. అందుకే పాఠ్యాంశాలతోపాటు పాకశాస్త్రాన్నీ సిలబస్‌లో చేర్చాలని.. ఒకవేళ సిలబస్‌లో చేర్చలేకపోయినా హోమ్‌వర్క్‌లో మస్ట్‌గా భాగం చెయ్యాలని అనుభవజ్ఞుల సూచన. ఎందుకంటే..? ► వంట పనుల్లో భాగం అయినప్పుడు పిల్లలకు అది ఒక ప్రాక్టికల్ శిక్షణలా ఉపయోగపడుతుంది. గణితం, సైన్స్ నేర్చుకోవడానికి.. ఒక మార్గం అవుతుంది. ఎలా అంటే.. కొలతలు, వినియోగం వంటి విషయాల్లో ఓ లెక్క తెలుస్తుంది. అలాగే నూనె, నీళ్లు ఇలా ఏ రెండు పదార్థాలను కలపకూడదు? ఏ రెండు పదార్థాలు కలపాలి? అనే విషయం వారికి అర్థమవుతూంటుంది. ► చిన్న వయసులోనే వంట నేర్చుకోవడంతో.. ఓర్పు నేర్పు అలవడుతాయి. శుచీశుభ్రత తెలిసొస్తుంది. అలాగే ప్రిపరేషన్, ప్రికాషన్స్ వంటివాటిపై క్లారిటీ వస్తుంది ► బాల్యంలోనే రెసిపీల మీద ఓ ఐడియా ఉండటంతో.. ఒక వయసు వచ్చేసరికి వంట మీద పూర్తి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ► తక్కువ సమయంలో ఏ వంట చేసుకోవచ్చు.. ఎక్కువ సమయంలో ఏ కూర వండుకోవచ్చు వంటివే కాదు.. కడుపు నొప్పి, పంటినొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు చిట్కాలూ తెలుస్తాయి. ► రెసిపీలు విఫలమైతే పిల్లలు.. విమర్శలను సైతం ఎదుర్కోవడం నేర్చుకుంటారు. వైఫల్యం జీవితంలో సర్వసాధారణమని బోధపడుతుంది. గెలుపోటములను సమంగా తీసుకునే మనోనిబ్బరాన్ని అలవరుస్తుంది. ► స్కూల్లో, బంధువుల ఇళ్లల్లో.. ఇతరులతో కలిసేందుకు ఈ ప్రయోగాలన్నీ పిల్లలకు ప్రోత్సాహకాలవుతాయి. అలాగే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వంట నేర్చుకోబోయే పిల్లల్ని.. వయసు ఆధారంగా చేసుకుని.. నాలుగు రకాలుగా విభజించుకుంటే.. వంట నేర్పించడం చాలా తేలిక అంటున్నారు నిపుణులు. 3 – 5 ఏళ్ల లోపున్న పిల్లలు మొదటి కేటగిరీకి చెందితే.. 5 – 7 ఏళ్లలోపు పిల్లలు రెండో కేటగిరీలోకి వస్తారు. ఇక 8 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు మూడో కేటగిరీలోకి, 13 ఏళ్ల తర్వాత పిల్లలంతా నాలుగో కేటగిరీలోకి వస్తారు. మొదటి రెండు కేటగిరీల్లో పిల్లలకు చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే.. ఎదిగే కొద్దీ వాళ్లలో నైపుణ్యం పెరుగుతుంది. సాధారణంగా మూడు నుంచి ఐదు ఏళ్లలోపు పిల్లల్లో.. పెద్దలు చేసే ప్రతి పనినీ తామూ చేయాలని.. పెద్దల మెప్పు పొందాలనే కుతూహలం కనిపిస్తూంటుంది. వంటగదిలో కొత్త పనిని ప్రయత్నించడానికి ఉత్సాహంగా ఉంటారు. అయితే వారికి చేతుల్లో ఇంకా పట్టు.. పూర్తి అవగాహన ఉండవు కాబట్టి.. అలాంటి పిల్లలకు చిన్నచిన్న పనులను మాత్రమే చెప్పాలి. వారికి నెమ్మదిగా అలవాటు చేయడానికి వీలుండే పనులను, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేని వాటిని వారి చేతుల్లో పెట్టొచ్చు. ఎక్కువగా కూర్చుని చేసే పనులను వారికి అప్పగించాలి. చేయించదగిన పనులు.. - పండ్లు, కూరగాయలు కడిగించడం, చపాతీ పిండి కలపడంలో సాయం తీసుకోవడం. - పాలకూర వంటివి కడిగి.. తురుములా తెంపించడం. - బనానా వంటివి గుజ్జులా చేయించడం.(ఆ గుజ్జు బ్రెడ్, ఐస్‌క్రీమ్ వంటివి తయారుచేసుకోవడానికి యూజ్ అవుతుంది) ఐదేళ్లు దాటేసరికి.. పిల్లల్లో మోటార్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. అంటే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఏ పనిలోనైనా ఫర్ఫెక్ట్‌నెస్ పెరుగుతూంటుంది. అలాంటివారికి ఆహారాన్ని సిద్ధం చేయడంలో మెలకువలు నేర్పించొచ్చు. అప్పుడప్పుడే చదవడం, రాయడం ప్రారంభిస్తుంటారు కాబట్టి.. వారికి వంటకాలను పరిచయం చేయడానికి ఈ వయసే మంచి సమయం. వంటలో వాళ్లు మనకు సహాయపడగలిగే సులభమైన రెసిపీలను చెబుతుండాలి. వారు ఉపయోగించగలిగే చాప్ బోర్డ్స్, ఇతరత్రా చిన్నచిన్న కిచెన్ గాడ్జెట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. చేయించదగిన పనులు.. - పొడి పదార్థాలను నీళ్లు పోసి కలపడం - ఇన్‌గ్రీడియెంట్స్‌ని కొలవడం, లేదా లెక్కించడం ∙డైనింగ్ టేబుల్ని సర్దించడం - గుడ్లు పగలగొట్టించడం (పెంకుల విషయంలో కాస్త దగ్గరుండాలి) - పిండి వంటల్లో కానీ.. స్నాక్స్‌లో కానీ ఉండలు చేసే పనిని వారికి అప్పగించడం - మృదువైన పండ్లు, కూరగాయలను కట్ చేయించడం - రెసిపీని పెద్దగా రెండు మూడు సార్లు చెప్పించడం.. ఖాళీ సమయాల్లో ఒకటికి రెండు సార్లు ఆ వివరాలను గుర్తుచేయడం - చిన్న చిన్న చపాతీలు చేయించడం ఎనిమిదేళ్ల నుంచి పన్నెండేళ్ల లోపు పిల్లల్లో స్వతంత్ర ఆలోచనలు పెరుగుతుంటాయి. తమ పనులను తాము చేసుకుంటూంటారు. ఈ వయసు వచ్చేసరికి వంట గదిలో వారికి ఎక్కువ పర్యవేక్షణ అవసరం ఉండదు. సొంతంగా ఎవరి సాయం లేకుండానే వీరు చిన్నచిన్న ఫుడ్ ఐటమ్స్ సిద్ధం చేయగలరు. తిన్న ప్లేట్ లేదా బౌల్ కడిగిపెట్టడం, లంచ్ బాక్స్ సర్దుకోవడం, కిరాణా సామాన్లు జాగ్రత్త చేయడం వంటివన్నీ వాళ్లకు అలవాటు చేస్తూండాలి. చేయదగిన పనులు.. - కూరగాయలు లేదా పండ్ల తొక్క తీసుకుని, కట్ చేసుకుని సలాడ్స్ చేసుకోవడం - శాండ్విచెస్, బ్రెడ్ టోస్ట్‌లు చేసుకోవడం, ఆమ్లెట్స్ వేసుకోవడం - జ్యూసులు తీసుకోవడం ∙మరమరాలు, అటుకులతో పిడత కింద పప్పు, పోహా వంటివి చేసుకోవడం, ఇన్‌స్టంట్‌గా తీపి లేదా కారం రెసిపీలు చేసుకోవడం చిన్నప్పటి నుంచి కుకింగ్ మీద అవగాహన ఉన్నవారికి.. సుమారు 13 ఏళ్లు వచ్చేసరికి కిచెన్‌లోని ప్రతి వస్తువును ఎలా వాడాలి? ఏది ఎప్పుడు వాడాలి? అనేది తెలుస్తూంటుంది. వీరిలో తగు జాగ్రత్తే కాదు చక్కటి నైపుణ్యమూ ఉంటుంది. ఇప్పటి తరానికి స్మార్ట్ గాడ్జెట్స్ పైన బీభత్సమైన కమాండ్ ఉంది. కాబట్టి ఓవెన్‌ని ఉపయోగించడం, ఇండక్షన్ స్టవ్ వాడటం వంటివి వీరికి ఈజీ అవుతాయి. చేయదగిన పనులు.. - గ్యాస్ స్టవ్‌పై ఆమ్లెట్స్ వేసుకోవడం - ఎలక్ట్రిక్ కుకర్‌లో జొన్నకండెలు, చిలగడ దుంపలు, గుడ్లు వంటివి ఉడికించుకోవడం - పదునైన కత్తులు జాగ్రత్తగా వాడటం - పెద్దల సమక్షంలో బ్లెండర్, ఫుడ్ ప్రాసెసర్, గార్లిక్ ప్రెస్, కాఫీ మేకర్, వాఫిల్ మేకర్ వంటి వివిధ కిచెన్ గాడ్జెట్ల వాడకాన్ని నేర్చుకోవడం, మైక్రోవేవ్‌పై పూర్తి అవగాహన తెచ్చుకోవడం, ఐస్‌క్రీమ్ వంటివి సిద్ధం చేసుకోవడం - కిచెన్ క్లీనింగ్ నేర్చుకోవడం వంటి విషయాలపై శ్రద్ధ కల్పించాలి. (చదవండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
నోరూరించే.. ఈ గరం గరం సమోసాల తయారీ ఎలాగో తెలుసా?
స్వీట్ కోవా సమోసా.. కావలసినవి: మైదా – రెండు టీస్పూన్లు; సమోసా పట్టి షీట్లు – పన్నెండు(రెడీమేడ్); వేరు శనగ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా; పిస్తా – గార్నిష్‌కు సరిపడా. స్టఫింగ్: నెయ్యి – టీస్పూను; జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పిస్తా పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పంచదార – పావు కప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; ఉప్పు – ముప్పావు టీస్పూను; కోవా తురుము – కప్పు. సిరప్: పంచదార – అరకప్పు; యాలకుల పొడి – పావు టీస్పూను; నీళ్లు – అరకప్పు; కుంకుమ పువ్వు– చిటికెడు. తయారీ: జీడిపప్పుని నెయ్యిలో వేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించాలి. జీడిపప్పు వేగిన తరువాత పిస్తా, కొబ్బరి తరుము, పంచదార, కోవా తురుము వేయాలి. ఇవన్నీ దోరగా వేగిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, యాలకులపొడి వేసి కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత అరగంట రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ∙బాణలిలో కుంకుమ పువ్వును దోరగా వేయించాలి. ఇది వేగిన తరువాత పంచదార, అరకప్పు నీళ్లు, యాలకుల పొడి వేసి, సిరప్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లుపోసి గమ్‌లా తయార చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మిశ్రమాన్ని.. సమోసా పట్టి షీట్‌పైన టేబుల్ స్పూను వేసి సమోసాలా చుట్టుకోవాలి. లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఉండేలా మైదా గమ్‌ను రాసుకుంటూ సమోసాను చుట్టుకోవాలి. సమోసాలన్నీ రెడీ అయ్యాక బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వేడివేడి సమోసాలను సుగర్ సిరప్‌లో అరనిమిషం ఉంచాలి. సుగర్ సిరప్ నుంచి తీసిన సమోసాపై పిస్తా పప్పు తురుము వేస్తే స్వీట్ సమోసా రెడీ. చికెన్ సమోసా.. కావలసినవి: మైదా – కప్పు; వాము – చిటికెడు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు. ఖీమా ఫిల్లింగ్: నెయ్యి – టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – టీస్పూను; క్యారట్ ముక్కలు – అరకప్పు (చిన్నముక్కలు); వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం – అంగుళం ముక్క; చికెన్ ఖీమా – పావు కేజీ; కారం – అర టీస్పూను; ధనియాల పొడి – టీస్పూను; గరం మసాలా – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; పచ్చిబఠాణి – అరకప్పు; స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: మైదాలో వాము, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలిపాక, నీళ్లు పోసి ముద్ద చేయాలి. ఈ పిండి ముద్దపైన తడి వస్త్రాన్ని కప్పి అరగంట నానబెట్టుకోవాలి. టేబుల్ స్పూను నెయ్యిలో జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తరువాత అల్లం, వెల్లుల్లిని సన్నగా తరగి వేయాలి. వీటితోపాటే క్యారట్ ముక్కలు వేసి వేయించాలి. క్యారట్ వేగిన తరువాత చికెన్ ఖీమా వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి గరిటతో కలిపి, మూతపెట్టి మగ్గనివ్వాలి. ఆరు నిమిషాల తరువాత స్ప్రింగ్ ఆనియన్ తరుగు, పచ్చిబఠాణి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు వేయించి దించేయాలి. మైదాముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీలా వత్తుకోవాలి. చపాతీని కోన్ ఆకారంలో మడిచి, మధ్యలో చికెన్ ఖీమా మిశ్రమంతో నింపాలి. మిశ్రమం బయటకు రాకుండా కోన్‌ను మూసివేయాలి. ఇలా అన్ని సమోసాలు రెడీ అయిన తరువాత బేకింగ్ ట్రేలో పెట్టాలి. ఈ ట్రేను అవెన్‌లో పెట్టి 350 ఫారిన్ హీట్స్ వద్ద ఇరవై నిమిషాల పాటు బేక్ చేస్తే చికెన్ సమోసా రెడీ. ఎగ్ సమోసా.. కావలసినవి: గుడ్లు – ఆరు; పచ్చి బంగాళ దుంపల తురుము – కప్పు; క్యారట్ ముక్కలు – అరకప్పు; ఉల్లిపాయలు – నాలుగు; పచ్చిమిర్చి – మూడు; నూనె – ఐదు టేబుల్æస్పూన్లు; వంటసోడా – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; వాము – అరటీస్పూను; కొత్తి మీర – చిన్న కట్ట; మైదా – రెండున్నర కప్పులు; రిఫైన్డ్ నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి ∙మైదాలో వంటసోడా, వాము, అరటీస్పూను ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. నీళ్లుపోసి ముద్దచేసి గంటపాటు నానపెట్టుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత క్యారట్ ముక్కలు, బంగాళ దుంప తురుము వేసి వేయించాలి. నిమిషం తరువాత కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. మిశ్రమం మెత్తబడిన తరువాత గుడ్ల సొన వేసి వేయించాలి. గుడ్ల సొన వేగిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. మైదా ముద్దను చిన్న ఉండలుగా చేసి, చపాతీల్లా వత్తుకోవాలి. ఈ చపాతీలను త్రికోణాకృతిలో మడతపెట్టి మధ్యలో ఒక టీ స్పూన్ గుడ్డు మిశ్రమాన్ని పెట్టి మిశ్రమం బయటకు రాకుండా అంచులకు కొద్దిగా తడిచేసి అతుక్కునేటట్లు వేళ్లతో మెల్లగా నొక్కాలి ఇలా అన్ని తయారయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేస్తే ఎగ్ సమోసా రెడీ. ఇవి కూడా చదవండి: క్యాబేజ్‌తో ఎగ్ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది -
లవ్ యూ బామ్మా
85 సంవత్సరాల వయసులో కంటెంట్ క్రియేటర్‌గా మారింది విజయ నిశ్చల్. ఫ్రెంచ్ ఫ్రై, సమోస. గులాబ్ జామూన్, పొటాటో బాల్స్...ఒక్కటా రెండా ఎన్నెన్నో పసందైన వంటలను ఎలా చేయాలో తన చానల్ ద్వారా నేర్పుతుంది నిశ్చల్. వంటలు చేస్తూ ఆ వంటకు తగినట్లుగా హుషారుగా పాటలు పాడుతుంటుంది. ఈ బామ్మ చానల్‌కు 8.41 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా నిశ్చల్ బామ్మ చేసిన ‘ఎగ్‌లెస్ కేక్’ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో 1.1 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ‘ఎగ్‌లెస్ కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను. మీ వీడియో చూసిన తరువాత నేను స్వయంగా చేశాను. ఇదంతా మీ చలవే. లవ్ యూ బామ్మా’ ‘వంటల్లో ఓనమాలు కూడా తెలియని నేను మీ వల్ల ఇప్పుడు ఎన్నో వంటలు చేయగలుగుతున్నాను. నా టాలెంట్‌ను చూసి ఫ్రెండ్స్ ప్రశంసిస్తున్నారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనబడుతున్నాయి. -
ఆటోమేటిక్ దోసె మేకర్.. నిమిషంలో ఆకలి తీరుస్తుంది
దోసె ఇష్టపడని వాళ్లు అరుదు. ఈ చిత్రంలోని మేకర్ ఒకే ఒక్క నిమిషంలో దోసెలేసి ఆకలి తీరుస్తుంది. దీనిలోని 360 డిగ్రీస్ ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్.. దోరగా వేగిన దోసెలను ట్రేలో అందిస్తుంది. అందుకు వీలుగా వెనుకవైపున్న ట్యాంకర్లో దోసెల పిండి వేసి.. పక్కనే ఉండే బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఈ డివైస్.. కంపాక్ట్ అండ్ పోర్టబుల్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీనిలోని ఆటోమేటిక్ సేఫ్టీ కట్ ఆఫ్ ఫీచర్‌తో.. దోసెకు దోసెకు మధ్య 3 నిమిషాల గ్యాప్ ఇస్తుంది. ఈ మోడల్ మేకర్స్‌లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం? ఈసారి దోసెలు వేసే పనిని ఈ మేకర్‌కి అప్పగించేయండి! -
ఏపీ ఇంట.. ఈ–వంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్‌పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది. కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్‌స్టవ్‌లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఈ–కుక్కర్‌తో ఆరోగ్యం.. ‘ఎన్‌ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్‌లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు. ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా.. ‘ఈఈఎఫ్‌పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీపై అందించనున్నారు. రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఏపీ ముందుకు రావడం అభినందనీయం వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్‌లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్ఎల్ -
మినీ మిక్సర్: మిల్క్‌షేక్‌ల నుంచి చిన్న పిల్లల ఆహారం వరకు ఏదైనా..!
చిత్రంలోని 4 ఇన్ 1 ఎలక్ట్రిక్ మినీ గార్లిక్ చాపర్ మిక్సర్.. పిల్లలకు, పెద్దలకు భలే ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో ఐస్ క్రీమ్, సోయా మిల్క్, ఫ్రెష్ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్, మిల్క్ షేక్స్ వంటివే కాదు.. పసిపిల్లలకు మెత్తటి ఆహారం, ఫేస్ మాస్క్ కోసం మెత్తటి మిశ్రమాన్నీ తయారు చేసుకోవచ్చు. దీనిలో 3 పదునైన బ్లేడ్స్ ఉంటాయి. సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది పండ్లు, కూరగాయలతో పాటు మాంసాన్నీ కచ్చాబిచ్చాగా చేయగలదు. స్కూల్లో, ఆఫీసుల్లో, జిమ్‌లో, క్యాంపింగ్‌లో ఇలా ప్రతిచోటా.. చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని 3 నుంచి 4 గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు. కావాల్సిన విధంగా వాడుకోవచ్చు. ఈ బాటిల్ రెండువైపులా ఓపెన్ అవుతుంది. దాంతో క్లీనింగ్ సులభమవుతుంది. బాటిల్ కింద వైపు ఉన్న బటన్ని ప్రెస్ చేసుకుంటే... ఇది ఆన్ ఆఫ్ అవుతుంది. (చదవండి: హెల్తీగా రాగి డోనట్స్ చేసుకోండిలా..!) -
ఖర్చు తక్కువ, ఇంధనం ఆదా అయ్యే సరికొత్త కుకింగ్ స్టవ్‌లు, ఫ్యాన్లు!
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ)ని ప్రారంభించారు. అందులో భాగంగా ఈఈఎస్ఎల్ దేశవ్యాప్తంగా ఒక కోటి సమర్ధవంతమైన బీఎల్డీసీ ఫ్యాన్లు, 20 లక్షల సమర్థవంతమైన ఇండక్షన్ కుకిగ్ స్టవ్‌లను పంపిణీ చేస్తోంది. వంట పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడం, శక్తి సామర్థ్యం వినియోగంపై ప్రాముఖ్యత, ఆవశ్యకతలను తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈఈఎస్ఎల్. ఇంతకీ ఈ ఇండక్షన్ స్టవ్‌లు, బీఎల్డీసీ ఫ్యాన్ల ఉపయోగం, ప్రయోజనాలు ఏమిటి? ఇవి సాధారణ ప్రజలకు ఉపయోగపడతాయా? ఈ కుకింగ్ స్టవ్ ప్రత్యేకత.. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ) తీసుకువచ్చిన ఈ ఇండక్షన్ ఆధారిత కుకింగ్ స్టవ్ సాంప్రదాయ వంట పద్ధతులకు మించి సుమారు 25 నుంచి 30 శాతం ఖర్చు ప్రయోజనాలను అందిస్తాయి. వీటితో ఇంధనం ఆదా అవ్వడమే గాక తక్కువ ఖర్చుతో మంచి వంటను అందించగలుగుతాం. భారతదేశం అంతట ఈ ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించడం వల్ల ముఖ్యంగా పర్యావరణం హితకరంగా ఉంటుంది. అంతేగాదు వాతావరణంలో గాలి స్వచ్ఛంగా ఉండటమే గాక పౌరులకు మెరుగైన ఆరోగ్యం అందుతుంది. ఈ స్టవ్‌లను ఈఈఎస్ఎల్, మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్(ఎంఈసీఎస్)ల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున దేశంలో పంపిణీ చేస్తోంది. దీంతో వంటశాలల్లో ఈ ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాల హవా వేగవంతంగా విస్తరించడమే గాకుండా వంట పద్ధతుల్లో వేగవంతంమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. తక్కువ ఆదాయ కుటుంబాలకు ఈ స్టవ్ చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. సీలింగ్ ఫ్యాన్ ప్రత్యేకత ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ) ఎల్సీడీ బల్బులు మాదిరిగా విద్యుత్ ఖర్చు తక్కువ, పర్యావరణానికి మేలు కలిగించేలా ఈ సీలింగ్ ఫ్యాన్లను అభివృద్ధి చేశారు. ఈ ఫ్యాన్ వల్ల విద్యుత్ బిల్లు కూడా తక్కువగానే ఉంటుంది. విద్యుత్ వినియోగంలో 35% తగ్గించే లక్ష్యంతో ఈ ఆధునాత ఫ్యాన్లను తీసుకొచ్చింది ఈఈఎస్ఎల్. ఇంతకమునుపు ఎల్ఈడీ బల్బులను తీసుకొచ్చి ప్రతి ఇంట్లో అవి ఉండేలా విజయవంతమైంది. మళ్లీ అదేవిధమైన విజయం పునరావృత్తమయ్యేలా ఈ ఆధునాత ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లు, ఇండక్షన్ స్టవ్‌లను తీసుకొచ్చింది. ప్రయోజనం ఈ రెండు ఆధునాత ఎలక్రిక్ పరికరాల వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా త్గగుతాయి అలాగే 12 జీడబ్ల్యూ గరిష్ట విద్యుత్ డిమాండ్‌ని నిరోధించగలం వినియోగదారులకు విద్యుత్ బిల్లు కూడా తక్కువగానే వస్తుంది. ఈ నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్ ప్రోగ్రామ్‌లు భారతీయ గృహాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడం తోపాటు కార్బన్ ఉద్గారాల పాదముద్రలను తగ్గించేలా సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అంతకమునుపు ఉజ్వలా కింద జాతీయ వీధిలైట్ల కార్యక్రమంలో మిలియన్ల కొద్దీ ఎల్ఈడీ బల్బుల పంపిణీని తీసుకొచ్చి క్షేత్ర స్థాయిలో శక్తి వినియోగాన్ని, గరిష్ట విద్యుత్ డిమాండ్‌ని తగ్గించి గణనీయమైన ఫలితాన్ని పొందేలా చేసింది ఈఈఎస్ఎల్ . అదేవిధంగా ఈ ఇండక్షన్ కుకింగ్ స్టవ్‌లు, సీలింగ్ ఫ్యాన్లు శక్తి వినియోగాన్ని, కార్గన్ ఉద్గారాలను తగ్గించి పూర్తి స్థాయిలో విజయవంతమవుతాయని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆ కాంక్షిస్తున్నారు. (చదవండి: చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్! రెండు పతకాలతో ప్రపంచాన్నే..) -
బ్రెడ్ తో రుచికరమైన స్నాక్స్..
కావలసినవి: బ్రెడ్ ముక్కలు – 1 కప్పు, ధనియాలు, జీలకర్ర – 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మెంతులు, మిరియాలు – పావు టీ స్పూన్ చొప్పున ఎండుమిర్చి – 3 లేదా 4. వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు గుజ్జు – 1 టీ స్పూన్, పెరుగు – 5 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా కట్ చేసుకోవాలి) కరివేపాకు – కొద్దిగా, నిమ్మకాయ రసం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి.. అందులో ధనియాలు, జీలకర్ర , ఆవాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా వేయించి.. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.. అందులో బ్రెడ్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం, పసుపు, పెరుగు, నిమ్మరసం వేసుకుని ముక్కలకు ఆ మిశ్రమం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత ధనియాలు–వెల్లుల్లి మిశ్రమం పట్టించిన బ్రెడ్ ముక్కలను వేసుకుని 2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి చివరిలో తాలింపు వేసుకుని కలియ తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. (చదవండి: ఈ శాండ్విచ్ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! ) -
ఈ మల్టీ స్పెషాలిటీ కుక్కర్ గురించి విన్నరా..
మల్టీ – ఫంక్షనల్ మేకర్స్ ఇప్పుడు సర్వసాధారణం. వినియోగించడమూ తేలికే! అలాంటి ఈ పరికరం కుకర్లానే కాదు.. స్టీమర్గానూ పని చేస్తుంది. పైగా ఎక్కువ మోతాదులో వండిపెట్టగలదు. ఇందులో రకరకాల రైస్ ఐటమ్స్‌తో పాటు.. సూప్స్, చికెన్ కర్రీస్, మటన్ కుర్మా ఇలా చాలానే చేసుకోవచ్చు. గుడ్లు, కూరగాయలు, కండెలు, దుంపలు వంటివీ ఉడికించుకోవచ్చు. ఇది సుమారుగా మూడులీటర్ల సామర్థ్యంతో దాదాపు 5 కేజీలపైనే బియ్యాన్ని ఉడికించగలదు. ఈ కుకర్ ఆపరేటింగ్ ప్యానెల్లో లేటెస్ట్ మైక్రో స్విచ్ అమర్చి ఉండటంతో కుకింగ్ చాలా ఈజీ. వంట పూర్తయిన తర్వాత 6 గంటల పాటు వేడిగా ఉంచే.. ఆటోమేటిక్ వార్నింగ్ ఆప్షన్ ఉంటుంది. (చదవండి: రైస్ దగ్గర నుంచి సూప్స్, న్యూడిల్స్ వరకు అన్నీ ఈ కుకర్‌లోనే..!) -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
సాయంత్రం స్నాక్స్ గా చిలకడదుంప బజ్జీలు
కావలసినవి: చిలగడదుంప గుజ్జు – ఒకటిన్నర కప్పులు పచ్చిమిర్చి ముక్కలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు – అర టీ స్పూన్ చొప్పున ఉల్లిపాయముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నగా కట్ చేసుకోవాలి) బఠాణీలు – పావు కప్పు (నానబెట్టినవి) ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు గరం మసాలా – 1 టీ స్పూన్ కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగా శనగపిండి – పావు కప్పు బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా, కారం – 1 టీ స్పూన్ చొప్పున నీళ్లు – సరిపడా, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని.. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బఠాణీలు, చిలగడదుంప గుజ్జు, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, కారం వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని పలుచగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. చిలగడదుంప–గరం మసాలా మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్‌లో బాల్స్‌లా చేసుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి, బజ్జీల్లా.. కాగుతున్న నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. (చదవండి: కొత్త టెక్నిక్ తో రుచికరమైన వంటలు.. ) -
కుకింగ్ చేస్తే రైస్‘పుల్లింగ్’!
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్–3 పేరుతో హైదరాబాద్‌లో ఒకరిని బురిడీ కొట్టించి రూ. 3 కోట్లు కొల్లగొట్టిన రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ కేటుగాళ్ల మోడస్ ఆపరెండీని సీసీఎస్ పోలీసులు వివరించారు. సాధారణ చెంబు, బిందెలకు అతీంద్రియశక్తులు ఉన్నాయంటూ నమ్మించి నిండా ముంచడం వారి శైలి అని... సాధారణ చెంబు/బిందెను ‘రైస్‌పుల్లర్’గా మార్చడానికి ‘కుకింగ్’ చేస్తుంటారని పేర్కొన్నారు. అమోఘ శక్తులంటూ... రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్లు అందినకాడికి దండుకుంటుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటికి చేజిక్కించుకుంటే అమోఘ మైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. సాధారణంగా కేటుగాళ్లు కస్టమర్లకు రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలనే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న పాత్రలను చూసే అవకాశం కొనే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించాలని కోరితే మాత్రం చూపిస్తారు. ఇలాంటి ముఠాలు బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్లీ బియ్యంలా కనిపించేలాగా చేస్తారు. అనంతరం రైస్‌పుల్లర్‌గా పేర్కొనే పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచంకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో కూడిన బియాన్ని ఉంచితే అది దానికి అతుక్కుంటుంది. ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకుంటుంటారని పోలీసులు వివరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారేనని పోలీసులు చెబుతున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటకతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్, డబుల్ ఇంజిన్‌గా పిలిచే రెండు తలల పాములతో మోసాలు చేసే ముఠాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దొంగ సర్టిఫికేషన్లు రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. వాటి కేంద్రంగానే కొన్ని ఉపకరణాలను కలిగి ఉండి ఆయా రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్లు నటిస్తూ ఆయా ఉపకరణాలు నిజమైనవనేలా సర్టిఫికేషన్ ఇచ్చేస్తుంటారు. ఇదంతా దాన్ని కొనే వారి ఎదురుగానే జరుగుతుంది. ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇకపై ఇంకెవరూ మోసపోకుండా అప్రమత్తం చేసిన వాళ్లవుతారని చెబుతున్నారు. కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం పోలీసులు అరెస్టు చేసిన విజయ్‌కుమార్, సాయి భరద్వాజ్, సంతోష్, సురేందర్‌లను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులు నిర్ణయించారు. -
పాన్ కేక్స్ నుంచి చికెన్ వరకు.. నిమిషాల్లో కుక్ అవుతాయ్
సౌకర్యవంతమైన మల్టీ కుక్వేర్ల సరసన చేరింది ఈ హార్డ్–బాయిల్డ్ స్టీమర్. ఇందులో వండివార్చుకోవడం భలే తేలిక. ఈ మెషిన్ లో గుడ్లు, జొన్నకండెలు, దుంపలు, కుడుములు వంటివన్నీ ఆవిరిపై ఉడికించుకోవచ్చు. ఆమ్లెట్స్, పాన్ కేక్స్ వంటివీ వేసుకోవచ్చు. అలాగే చికెన్ వింగ్స్, చిల్లీ చికెన్, గ్రిల్డ్ ఫిష్, క్రిస్పీ ప్రాన్స్ ఇలా చాలానే చేసుకోవచ్చు. కేక్స్, కట్లెట్స్ వంటివాటికీ పర్ఫెక్ట్ ఈ కుక్వేర్. దీని అడుగున, స్టీమింగ్ బౌల్‌లోనూ వాటర్ పోసుకుని.. ఎగ్ ట్రే మీద ఆహారాన్ని లేదా గుడ్లను పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ మేకర్ని.. అడుగున నీళ్లు పోసుకుంటే స్టీమర్‌గా వాడుకోవచ్చు. నూనె వేసుకుంటే గ్రిల్‌గానూ మార్చుకోవచ్చు. వేగంగా, మంచిగా కుక్ అవ్వడానికి వీలుగా పెద్ద బౌల్ లాంటి మూత ఉంటుంది. దాంతో హోల్ చికెన్ వంటివీ కుక్ అవుతాయి. ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైమర్ స్విచ్ ఉంటుంది. కుకింగ్ పూర్తి అయిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది. -
మల్టీ ఫంక్షనల్ పాట్.. వెరైటీ వంటలన్నీ వండేయొచ్చు
క్వాలిటీ ప్లస్ కంఫర్టబుల్ ఫీచర్స్‌తో రూపొందిన ఈ మల్టీఫంక్షనల్ పాట్.. చాలా వంటకాలను రెడీ చేస్తుంది. ఇందులో అన్ని రకాల రైస్ ఐటమ్స్, కర్రీస్, నూడుల్స్, సూప్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. సుమారుగా రెండు లీటర్ల సామర్థ్యం గల ఒక ప్రత్యేకమైన పాట్తో పాటు.. నాన్ స్టిక్ ప్లేట్, పాన్ కేక్ ప్లేట్, గ్రిల్ పాన్ వంటివి అదనంగా లభిస్తాయి. అవసరాన్ని బట్టి వాటిని మార్చుకోవచ్చు. వాటితో ఆహారాన్ని గ్రిల్, ఫ్రైలతో పాటు స్టీమ్ కూడా చేసుకోవచ్చు. స్లో కుకర్‌లా మార్చి చాలా వెరైటీలను వండుకోవచ్చు. ఆన్ లేదా ఆఫ్ బటన్ తో పాటు టెంపరేచర్ కంట్రోలర్ కూడా డివైస్ ముందువైపు ఉంటుంది. -
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు
చేర్యాల(సిద్దిపేట): వసతి గృహంలో హాయిగా చదువుకోవలసిన విద్యార్థులు వంట పనివారిగా మారి చపాతీలు తయారు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాలలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారంలో చపాతీలు అందించాల్సి ఉంటుంది. కానీ వాటి తయారీకి సరిపడా మనుషులు లేకపోవడంతో విద్యార్థులతో చేయించారు. ప్రిన్సిపాల్ సహకారంతోనే కాంట్రాక్టర్ ఇలా పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గురుకుల ప్రిన్సిపాల్ అశోక్‌బాబు వద్ద ప్రస్తావించగా.. తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి ఉందని స్పష్టం చేశారు. అందువల్లే విద్యార్థులతో వంట పని చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
వండటానికి ముందే చికెన్‌ని కడగొద్దు! శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా చికెన్‌ని వండటానికి ముందే శుభ్రంగా కడుతాం. ఇది సర్వసాధారణం. అలా అస్సలు చేయొద్దంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ అలవాటును తక్షణమే మానుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్టితుల్లోను కడగొద్దని తేల్చి చెప్పారు. పైగా కడగకుండానే వండేయాలంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఏంటిది కడగకుండా నేరుగా వండేయడమా? ఇది నిజమా..! అని నోరెళ్లబెట్టకండి. ఔను! మీరు వింటుంది నిజమే! చికెన్‌ని కడగకుండా వండేయడమే మంచిదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. వారి జరిపిన తాజా అధ్యయనంలో దీని గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ పరిశోధనల్లో చాలామంది చికెన్‌ని వండటానికి ముందే కడుతున్నట్లు తేలిందట. దాదాపు 25% మంది చికెన్‌ని ముందే కడిగేస్తున్నారని గుర్తించామని అన్నారు. అధ్యయంనంలో ఇలా చేస్తే కలిగే నష్టాలు గురించి.. విస్తుపోయే నిజాలు వెల్లడించారు. ఆహారం వల్ల కలిగే అనారోగ్యానికి సంబంధించి.. క్యాంపిలో బాక్టర్, సాల్మోనెల్లా అనే రెండు ప్రధాన బ్యాక్టీరియాలు కారణమని తెలిపారు. ఔ అవి సాధారణంగా పౌల్ట్రీ మాంసంలో కనిపిస్తాయని అన్నారు. అందువల్ల మాంసాన్ని పచ్చిగా ఉన్నప్పుడే కడగడం వల్ల ప్రతిచోట ఆ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని, దీని కారణంగా వ్యాధుల ప్రబలే ప్రమాదం ఎక్కువవుతుందని పరిశోధనల్లో తెలిపారు. ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన కేసులు ఆస్ట్రేలియాలో గత రెండు దశాబ్దాల్లో రెట్టింపు అయ్యినట్లు వెల్లడించారు. ఏడాదికి ఈ బ్యాక్టీరియాకు సంబంధించి సుమారు 2 లక్షల కేసుల్లో.. దాదాపు 50 వేల కేసుల దాక కోడి మాంసంకి సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తున్నాయని చెప్పారు. కడిగిన చికెన్ కారణంగా ఉపరితల నీటి బిందువుల నుంచి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే కుళాయిల నీటితో ఫాస్ట్ ఫోర్స్‌తో చికెన్‌ని కడగడంతో ఆ బ్యాక్టీరియా ఆ చెందిన నీటి బిందువల నుంచి మరింతగా వ్యాపిస్తాయని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అధ్యయనంలో నీటి ప్రవాహ రేటు తోపాటు బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే శాతం కూడా పెరగడం గుర్తించినట్లు వెల్లడించారు. అందువల్ల చికెన్‌ని పూర్తిగా ఉడికించి కడగడం లేదా వేడినీళ్లతో కడిగి వండటం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. (చదవండి: మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..షాక్‌లో కూతురు) -
బ్రేక్‌ఫాస్ట్ నుంచి స్నాక్స్ వరకు అన్ని ఈజీగా ఇందులోనే!
పూరీలు, పునుగులు వంటి బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌తో పాటు.. గవ్వలు, గోరుమిటీలు, మురుకులు వంటి పిండి వంటకాలు.. ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వింగ్స్ వంటి వెరైటీలనూ తయారు చేసుకోవాలంటే శ్రమ తప్పదు అనుకుంటున్నారా? అలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఈ మినీ డీప్ ఫ్రైయర్. నూనె తక్కువ పీల్చుకుంటూ.. హెల్దీ రుచులను అందిస్తుంది.1.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్ బేస్ పాత్రకు లోపల.. ఆయిల్ ఇండికేటర్ ఉంటుంది. దాని ప్రకారం ఆయిల్ పోసుకుని.. నెట్ బాస్కెట్లో పిండి వంటకాలు, ఫ్రైలు, డీప్ ఫ్రైలు చేసుకోవచ్చు. బాస్కెట్‌కి పొడవైన హ్యాండిల్ ఉంటుంది. దాంతో ఈ డివైస్‌ని వినియోగించడం చాలా తేలిక. ఇందులో 140 డిగ్రీల సెల్సియస్ నుంచి 190 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. సుమారు 4 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపు ఇందులో ఎలాంటి ఆహారాన్నైనా సిద్ధం చేసుకోవచ్చు. యాంటీ స్కాల్డింగ్ డిజైన్‌తో రూపొందిన ఈ గాడ్జెట్‌ను క్లీన్ చేయడం, ఇతర ప్రదేశాలకు మూవ్ చేసుకోవడం చాలా సులభం. (చదవండి: గుండె పదిలంగా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!) -
Dhruvi Panchal: వన్స్‌మోర్ వంటలు
అహ్మదాబాద్‌లోని ఒక హెల్త్‌కేర్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్న ధృవీ పాంచల్‌కు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ పాషన్ తనను ఎక్కడిదాకా తీసుకెళ్లిందంటే వీధి పక్కన ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసేంత వరకు! అలా అని ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు ఫుడ్ స్టాల్ నడుపుతోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన పాంచల్ వీడియో వైరల్ అయింది. ‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకమ్మా ఈ కష్టం’ అన్న వాళ్లు అతి కొద్దిమంది అయితే... ‘ఈ వీడియో మమ్మల్ని ఎంతో ఇన్స్పైరింగ్ చేసింది’ అన్నవాళ్లు ఎక్కువ. -
మొక్కజొన్న పిండితో బిస్కెట్లు.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
కార్న్ – చాక్లెట్ కుకీస్ తయారీకి కావల్సినవి: బటర్ – 125 గ్రాములు, పంచదార – 150 గ్రాములు, నూనె – 80 మిల్లీ లీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత, వనిలిన్ పౌడర్ – పావు టీ స్పూన్(మార్కెట్లో దొరుకుతుంది), మొక్కజొన్న పిండి – 80 గ్రాములు శనగపిండి – 350 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 6 గ్రాములు తయారీ విధానమిలా: ►ముందుగా బటర్, పంచదార, నూనె వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా కలుపుకోవాలి. ► అందులో గుడ్లు, ఉప్పు, మొక్కజొన్న పిండి వేసుకుని మళ్లీ కలుపుకోవాలి. ► అనంతరం వనిలిన్ పౌడర్, శనగపిండి, బేకింగ్ పౌడర్ వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ► తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్‌లో ఉండ చేసుకుని.. దాన్ని బిస్కట్లా ఒత్తుకుని.. పైభాగంలో నచ్చిన షేప్‌ని ప్రింట్ చేసి.. బేక్ చేసుకోవాలి. ► అభిరుచిని బట్టి రెండేసి కుకీస్ తీసుకుని.. మధ్యలో చాక్లెట్ క్రీమ్ పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..
కొంతమంది ఆకలితో అలమటిస్తుంటే, మరోపక్క టన్నులకొద్దీ ఆహారం వివిధ రకాలుగా వ్యర్థాల రూపంలో మట్టిపాలవుతోంది. ఈ మధ్య కాస్త అవగాహన రావడంతో ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని ఆశ్రమాలకు దానంగా ఇస్తున్నారు. అయితే వండిన ఆహారమే కాకుండా, కొన్నిరకాల పదార్థాలు, పానీయాలు తయారయ్యాక ఎన్నో పోషకాలున్న పదార్థాలు చెత్తలోకి వెళ్లి పోతున్నాయి. వీటిని మనం చక్కగా వినియోగించుకుంటే...బిస్కెట్లు, బ్రెడ్, రోటీలు చేసుకోవచ్చని చెబుతోంది ఎలిజబెత్ యార్క్. బీర్ తయారవగా మిగిలి పోయిన వ్యర్థాలతో చిక్కి, లడ్డు, నూడుల్స్ తయారు చేసి మరీ రుచి చూపెడుతోంది ఎలిజబెత్. బెంగళూరుకు చెందిన ఎలిజబెత్ యార్క్ ఒక చెఫ్. మణిపాల్‌లో డిగ్రీ చేసిన ఎలిజబెత్ తరువాత మైసూర్‌లోని సెంట్రల్‌ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేసింది. అందులో భాగంగా దేశంలో ఎన్నో రకాలుగా భారీ ఎత్తున ఆహార వృథా జరుగుతోందని గ్రహించింది. ఆహారం వ్యర్థం కాకుండా ఎలా ఆపాలా... అని ఆలోచించింది. ఈ క్రమంలోనే 2016లో కాలిఫోర్నియాలోని బ్రెడ్ స్పెషలిస్ట్, ఫుడ్ హిస్టోరియన్ విలియం రెబెల్ దగ్గర ఇంటర్న్‌గా చేరింది. రుబెల్ ద్వారా... ‘‘వందల ఏళ్ల నాడే పానీయాల తయారీ దారు, (బ్రీవర్స్), రొట్టె, బ్రెడ్స్ తయారీదార్లు (బేకర్స్) కలిసి పనిచేసే వారని తెలిసింది. కొన్నిసార్లు ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మిగిలిపోయిన బ్రెడ్‌ను బ్రీవర్స్, గింజలు, ఈస్ట్‌ను బ్రీవర్స్ బేకర్స్ ఇచ్చి పుచ్చుకునేవాళ్లు. అలా వాళ్లు పదార్థాలు వృథా కాకుండా, తక్కువ ఖర్చులో ఆహారాన్ని తయారు చేసేవారు’’ అని ఎలిజబెత్ తెలుసుకుంది. భారత్‌లో కూడా ఇలా చేసి ఫుడ్ వేస్ట్ కాకుండా చూడవచ్చు అనుకుంది. సేవింగ్ గ్రెయిన్స్ లాక్డౌన్ సమయంలో కాస్త ఎక్కువ సమయం దొరకడంతో ఎలిజబెత్ వ్యర్థాల నుంచి ఫుడ్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. బీర్ తయారైన తరువాత పడేసే వ్యర్థాలను రుచికరమైన ఆహారంగా మార్చాలనుకుని 2021లో ‘సేవింగ్∙గ్రెయిన్స్’ ప్రారంభించింది. బీర్ తయారవగా మిగిలిన పిప్పిని పిండిగా మార్చి, తరువాత ఆ పిండితో బ్రెడ్, రోటీలు, గ్రనోలా, కుకీస్, టీ బిస్కెట్స్, లడ్డులు, చిక్కీలు తయారు చేసి విక్రయిస్తోంది. పిప్పినుంచి తయారు చేసినవే అయినా ఇవి ఎంతో రుచిగా ఉండడం విశేషం. సేవింగ్ గ్రెయిన్స్ ఉత్పత్తులు ఆఫ్‌లైన్‌లోనేగాక, ఆన్‌లైన్‌లోకూడా లభ్యమవుతున్నాయి. స్థానిక బేకరీ భాగస్వామ్యంతో సేవింగ్ గ్రెయిన్స్ను విస్తరిస్తోంది ఎలిజబెత్. రోజుకి పన్నెండు వేల కేజీలు.. ‘‘రకరకాలుగా ఫుడ్ వేస్ట్ అవడం చాలా బాధగా అనిపించేది. రుబెల్‌ను కలిసాక ఈ సమస్యకు చక్కటి పరిష్కారం దొరికింది. దాంతోనే ‘సేవింగ్ గ్రెయిన్స్’ను ప్రారంభించాను. బీర్, ఆల్కహాల్‌ను తయారు చేసేందుకు గోధుమలు, ఓట్స్, బార్లీలను నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత, చక్కెరతో ఉడికి స్తారు. తరువాత మెత్తగా రుబ్బి రసాన్ని వేరు చేసి బీర్, ఆల్కహాల్స్‌ను తయారు చేస్తారు. పానీయం వేరు చెయ్యగా మిగిలిన పిప్పిని పశువులకు దాణాగా వేస్తుంటారు. పశువులు తిన్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో వ్యర్థంగా పోతుంది. ఒక్క బెంగళూరులోనే రోజుకి పన్నెండు వేలకేజీల ధాన్యాలను పానీయాల తయారీలో వాడుతున్నారు. రోజుకి ఇంత అంటే ఇక ఏడాదికి చాలా ఎక్కువ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రీవరీలు లక్షల కేజీల ధాన్యాలను ఉపయోగిస్తున్నాయి. ఇలా ఉత్పన్నమయ్యే పిప్పిని ఫుడ్‌గా మార్చడం వల్ల ధాన్యాలు వ్యర్థంగా పోవు. సేవింగ్ గ్రెయిన్స్ ద్వారా ఎంతోమంది ఆకలి కూడా తీర్చవచ్చు’’ అని ఎలిజబెత్ చెబుతోంది. (చదవండి: బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్, విటమిన్ బి) -
ప్రాన్స్ కార్న్ ఫ్రిటర్స్
కావలసినవి: చిక్కటి పాలు – పావుకప్పు, గుడ్లు – 4, మొక్కజొన్న పిండి – అర కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు, రొయ్యలు – 20 లేదా 25 (ఉప్పు, కారం, మసాలా కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి), స్వీట్ కార్న్ – రెండున్నర కప్పులు (ఉడికించి మిక్సీ పట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు –2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాలు, మూడు గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో స్వీట్ కార్న్ గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని, ఉడికించిన ఒక్కో రొయ్యతో కలిపి.. చేత్తో చిన్నగా ఒత్తి, వడలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. (చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు) -
ఒకే కుకర్‌లో రెండు రకాల వంటలు వండేయొచ్చు
మంచి భోజన ప్రియులకు పసందైన వంటకాలను అందించడంలో ఈ కుకర్కి సాటి లేదు. 3 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కుకర్‌లో అవసరాన్ని బట్టి ఒకేసారి రెండు ఐటమ్స్‌ని రెడీ చేసుకోవచ్చు. గ్రిల్, బేక్, స్లో కుకింగ్ వంటి ఆప్షన్స్‌తో.. ఫిష్ ఫ్రై, చికెన్ గ్రిల్లతో పాటు పాన్ కేక్స్, బ్రెడ్ ఆమ్లెట్, సూప్స్ వంటివెన్నో వండుకోవచ్చు. మేకర్ ముందు స్మాల్, మీడియం, బిగ్ అనే ఆప్షన్స్‌తో టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు డివైస్‌లోని బౌల్స్ రెండు రకాలు ఉంటాయి. బేస్ కుకర్కి సరిపడా పెద్ద బౌల్‌తో పాటు.. రెండుభాగాలుగా ఉన్న పెద్ద పాత్ర కూడా డివైస్‌తో పాటు లభిస్తుంది. ఆ పాత్రలను మార్చుకుంటూ దీనిలో చాలా వంటకాలను వండివార్చుకోవచ్చు. అదనపు సౌకర్యాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ధర 43 డాలర్లు (రూ.3,572) -
ఈ కెటిల్‌ను.. వండుకున్నాక మడతెయ్యొచ్చు..
గ్రేడ్ సిలికాన్ బాడీతో స్టెయిన్ లెస్ స్టీల్ బాటమ్తో రూపొందిన ఈ ఫోల్డబుల్ కెటిల్.. గ్యాస్ స్టవ్ మీదైనా, ఇండక్షన్ స్టవ్ మీదైనా చక్కగా పని చేస్తుంది. దీని సామర్థ్యం సుమారుగా రెండు లీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ఫోల్డ్ చేస్తే చిత్రంలో ఉన్న విధంగా చాలా చిన్నగా మారిపోతుంది. ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. అలాగే.. హీట్ ఇన్సులేషన్ హ్యాండిల్, యాంటీ–స్కాల్డ్ లిడ్‌తో క్యాంపింగ్‌కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో 3 నుంచి 5 నిమిషాలలో ఓట్ మీల్ లేదా కాఫీ లేదా టీ వంటివి తయారు చేసుకోవచ్చు. గుడ్లు, జొన్నకండెలు, చికెన్, మటన్, కూరగాయలు ఇలా వెజ్, నాన్‌వెజ్ అని తేడా లేకుండా అన్నింటినీ ఇందులో కుక్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ కెటిల్ ధర 194 డాలర్లు (రూ.15,972). -
టమాట వల్ల భర్తను వదిలేసిన భార్య
-
ఈ రెస్టారెంట్లో నూనె లేకుండానే ఘుమఘుమలాడే వంటలు..
పొయ్యి వెలిగించకుండా వంట చేయడం సాధ్యమేనా? కర్రీస్‌లో కాస్త నూనె తక్కువైతేనే టేస్ట్ సరిగా లేదని చిర్రుబుర్రులాడుతుంటాం. ఈమధ్య ఇంటా,బయట రెస్టారెంట్లలోనూ లీటర్ల కొద్దీ నూనెను వాడేస్తున్నారు. మరిగించిన నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. అలాంటిది నూనె లేకుండా, ఉడికించకుండానే వంటలు టేస్టీగా వండేయొచ్చని మీకు తెలుసా? ఇలా ఏదో అర, ఒకటో కాదు.. నూనె లేకుండా, పొయ్యి వెలగించకుండా 2 వేలకు పైగా వంటలు వండటమే కాకుండా, తన రెస్టారెంట్లోనూ నో ఆయల్-నో బాయల్ కాన్సెప్ట్‌తో రుచికరమైన వంటలను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ వంట చేయాలన్నా నూనె తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడే వంటలు కూడా రుచికరంగా ఉంటాయి. కానీ కోయంబత్తూరుకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి మాత్రం నూనె లేకుండా, పొయ్యి వెలగకుండా అద్భుతంగా వంట వండేయొచ్చని నిరూపించాడు. చిన్నప్పటి నుంచే శివకుమార్‌కు వంటలు చేయడం అంటే మహాపిచ్చి. ఎప్పుడూ ఏవేవో వెరైటీ వంటలు వండి అందరికీ రుచి చూపించేవాడు. ఈయనకు ఆధ్యాత్మికత ఎక్కువ. అందుకే చిన్నప్పటినుంచి శాఖాహారం మాత్రమే తినేవాడు. అదే సమయంలో నూనె లేకుండా సహజసిద్ద పద్ధతుల్లో వంట చేయడం ఎలాగో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని సుమారు రెండువేల కొత్త వంటలను కనిపెట్టి సొంతంగా కోయంబత్తూర్‌లో ఓ రెస్టారెంట్‌ను కూడా ఓపెన్ చేశాడు. ఆహారమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు మనం ఏది తినాలన్నా కల్తీనే. ముఖ్యంగా రెస్టారెంట్స్‌లో అయితే ఆర్టిఫిషిల్ ఫుడ్ కలర్స్ కలిపి, అవసరం లేని మసాలాలను దట్టించేసి వంటలు వండేస్తున్నారు. ఇక వాళ్లు వాడే ఆయిల్ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆధునిక ప్రపంచంలో అనేక అనారోగ్య సమస్యలకు ఆహారం ప్రధాన కారణం. ఊబకాయం, గుండెజబ్బులు, అలర్జీలు మొదలైన చాలా రకాల జబ్బులు ఫుడ్ వల్లే వస్తాయి. అందుకే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఫుడ్ తినాలనే ఉద్దేశంతో ఈ నేచురల్ ఫుడ్ పద్ధతిని తీసుకొచ్చా” అంటున్నాడు పడయాళ్ శివ. పోపు పెట్టకుండా సాంబార్‌నే మనం ఊహించుకోలేం.. అలాంటిది నూనె లేకుండా,పొయ్యి వెలిగించకుండా వంటలు ఎలా చేయడం అనే కదా మీ సందేహం.. ఈ రెస్టారెంట్లో కొబ్బరి పాలు, టొమాటాలు, జీడిపప్పు, తెల్లమిరియాలను మిక్సీపడితే చాలు రుచికరమైన సాంబార్ రెడీ అవుతుంది. బియ్యానికి బదులు అటుకుల్నే నానబెట్టి వాటికి కొబ్బరితురుమునీ, జీలకర్రనీ చేర్చి రుచికరంగా మన ముందు ఉంచుతారు. చింతపండు, పచ్చి పసుపు పచ్చళ్లు,12 గంటలు నానబెట్టిన కొబ్బరి పాలు లాంటి వెరైటీ ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతాయి. రుచికి ఏమాతం తీసిపోకుండా ఘుమఘుమలాడే వంటలను వండేస్తున్నారు. కోయంబత్తూరులో ఈ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేసి మూడేళ్లుగా విజయవంతంగా నడుపుతున్నాడు. ఇలా ఏదో ఒక రోజు, ఒక పూట కాదు, మూడు పూటలా నో ఆయిల్-నో బాయిల్ పేరుతో చక్కటి సహజసిద్దమైన భోజనాన్ని అందిస్తున్నారు. #PadayalEnergeticWellnessCare#NaturalHealthyBuffetLunch#Just@Rs249 Healthy Buffet Lunch Menu#Welcome u All#For Taste The Healthy Lunch Padayal Energetik Wellness Care Coimbatore singanallur For Prebooking Contact :8754689434#CoimbatoreFoodGuideTheGroup pic.twitter.com/NS4mROFJp7 — Padayal Energetik Wellness Care (@PadayalC) January 24, 2021 The World's First South Indian cuisine No Oil No Boil Restaurant in Coimbatore presents Buffet Lunch Saturday Padayal Natural Restaurant Buffet Lunch is open 1PM and 3:00Pm Party Orders Undertaken. Door Delivary Available.. Padayal Energetik Wellness Care 8754689434 8637410022 pic.twitter.com/Qy7HRzNKsI — Padayal Energetik Wellness Care (@PadayalC) February 20, 2021 -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్‌పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్‌కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్‌పూర్ వస్తుంటారు. -
వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్
మిలియనీర్, బిలియనీర్ కావాలంటే అంతే స్థాయిలో పెట్టుబడులు కావాలి..బడా పారిశ్రామిక వేత్తో కావాలి అని అనుకుంటాం సాధారణంగా. కనీసం ఏ ఐఐటీ లేదా ఐఐఎం డిగ్రీ సాధించి పెద్ద కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌గా ఉండాలి అనుకుంటాం. కానీ ఇవేమీ లేకుండానే రూ. 750 కోట్ల సంస్థకు అధిపతి అయ్యాడు. ఆయన మరెవ్వరో కాదు ఇండియన్ టాప్ రిచెస్ట్ చెఫ్ సంజీవ్ కపూర్. ఆయన సక్సెస్ స్టోరీ ఒకసారి చూద్దాం. ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత ధనిక చెఫ్‌లలో ఒకడిగా మరతానని బహుశా సంజీవ్ కపూర్ ఊహించి ఉండరు. పలు రకాల రెసిపీలతో మొదలు పెట్టి, టాప్ చెఫ్‌గా, హోస్ట్‌గా, రైటర్‌గా చివరికి వ్యాపారవేత్తగా గ్లోబల్‌గా పాపులర్ అయ్యాడు.1992లో ఒక టీవీ షో హోస్ట్ చేయడం ప్రారంభించి 18 సంవత్సరాలు నడిపించిన ఘనత ఆయకే సొంతం. సోషల్‌మీడియాలో మిలియన్ల కొద్దీ ఫోలోవర్లున్నారు. Bahut logon ne mujhe poocha ki millets ki quality kaise check karte hai, store kaise karte hai? Isiliye the next stop on our #MilletKhazana journey is easy tips and tricks to store millets. Do let me know how you store them at home?#MilletKhazana #MilletToMeals #India #Millets pic.twitter.com/rE7NhrCckE — Sanjeev Kapoor (@SanjeevKapoor) June 3, 2023 అంతేకాదు 120 దేశాలలో ప్రసారమై 2010లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. జనవరి 2011లో ఫుడ్ ఫుడ్ అనే 24 గంటల ఫుడ్ అండ్ లైఫ్ స్టయిల్ ఛానెల్‌ని ప్రారంభించిన ప్రపంచంలోనే తొలి చెఫ్. సంజీవ్ కపూర్ హోస్ట్ చేసిన ఖానాఖజానా ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) ఇండియన్ టెలీ అవార్డ్స్ నుండి బెస్ట్ కుకరీ షో బహుమతిని పలుమార్లు అందుకుంది. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు) పంజాబ్, అంబాలాలో 1964 ఏప్రిల్ 10, సంజీవ్ కపూర్ పుట్టారు. న్యూ ఢిల్లీలోని పూసాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్ నుండి హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేశాడు. అలియోనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. 1984లో తన వృత్తిని ప్రారంభించి అద్భుతమైన రెసిపీలు, చక్కటి వాచకం, అంతకుమించిన యాంకరింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. వండర్‌చెఫ్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ సంస్థ ఆదాయం గత ఏడాది రూ. 700 కోట్లు. అంతకుముందు ఏడాది కంపెనీ రూ.560 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ విస్తరణ ప్లాన్‌లో భాగంగా మార్కెటింగ్‌ను పెంచడానికి కంపెనీ 100 కోట్ల రూపాయలపెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 40 శాతం విదేశీ పెట్టుబడిదారులున్నారు. సంజీవ్ కపూర్ ఇండియాతోపాటు, ఇతర పలు దేశాల్లో రెస్టారెంట్స్ చెయిన్స్‌ను నిర్వహిస్తున్నారు. సోడెక్సో మాజీ సీఈవోతో కలిసి 1998లో దుబాయ్‌లో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ద్వారా వ్యాపారవేత్తగా అవతరించాడు. ఈ కంపెనీ విలువ రూ.750 కోట్లు. వంటగది ఉపకరణాలు, ఇతర వంటగది సామాగ్రిని 14 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) వార్షిక సంపాదన 2022లోనే సంజీవ్ కపూర్ నికర విలువ రూ. 1000 కోట్లుగా ఉంది. వార్షిక సంపాదన రూ. రూ. 25 కోట్లు. వండర్ చెఫ్‌లో అతని పెట్టుబడి, ఎల్లో చిల్లీ వంటి రెస్టారెంట్ చెయిన్ల నుండి, టీవీ షోలు బ్రాండ్ స్పాన్సర్షిప్లతోపాటు, స్వయంగా అతనురాసిన అతని పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చిన రాయల్టీలు ఇవన్నీ ఇందులో భాగం. బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్లలో ఏరియల్, డెట్టాల్, దావత్ బాస్మతి రైస్, స్లీక్ కిచెన్ లాంటివి ఉన్నాయి. ప్రతి బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం రూ. 30 రూ. 40 లక్షలు చార్జ్ చేస్తాడు. దీనితోపాటు సంజీవ్ కపూర్ ముంబైలోని జుహు ప్రాంతంలో ఒక సంపన్నమైన ఇంటిలో నివసిస్తున్నారు. 1500 చదరపు అడుగులు డ్యూప్లెక్స్‌లో ఉంటారు. స్టాటిస్కా రిపోర్ట్ ప్రకారం 2019లో 24.8 కోట్ల ఆదాయంతో కపూర్ భారతదేశంలో అత్యంత ధనిక చెఫ్‌గా నిలిచారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) ప్రేమ వివాహం 1992లో సంజీవ్ కపూర్ తన ప్రేయసి అలియోనాను వివాహమాడాడు. సంజీవ్, వందన కలిసి ఢిల్లీ ఐటీడీసీ హోటల్లో పనిచేసేవారు. కానీ ఎపుడూ కలుసుకోలేదు. అయితే అనుకోకుండా ఒకసారి రైలులో జరిగిన వీరి పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకున్న జంటకు ఇద్దరు కుమార్తెలు న్నారు. పెద్ద కూతురు రచిత. చిన్న కూతురు కృతి. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) అవార్డులు 2017లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు న్యూ ఢిల్లీలోని వరల్డ్ ఫుడ్ ఇండియాలో 918 కిలోల ఖిచ్డీని వండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (2017) హార్వర్డ్ అసోసియేషన్ ప్రచురించిన సంజీవ్ కపూర్‌పై కేస్ స్టడీ ఐటీఏ అవార్డు - పాపులర్ చెఫ్ & ఎంటర్ప్రెన్యూర్ (జైకా-ఇ-హింద్) (2015) ఐటీఏ అవార్డు ఉత్తమ వంట (ఖానా ఖజానా) (2010, 2004, 2002) భారత ప్రభుత్వ 'బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా' జాతీయ అవార్డు ఇండియా అత్యంత విశ్వసనీయ వ్యక్తులలో 100 మంది రీడర్స్ డైజెస్ట్ జాబితాలో 31వ స్థానం ఫోర్బ్స్ 'టాప్ 100 భారతీయ ప్రముఖుల జాబితాలో 34వ స్థానం -
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 వంటకాలు ఇవే!
-
నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?
నైజీరియా దేశానికి చెందిన ఒక చెఫ్ చేపట్టిన కుక్-ఏ-థాన్ విశేషంగా నిలుస్తోంది. లాంగెస్ట్ కుక్ఏథాన్లో హిల్డా బాసీ వరుసగా 100 గంటలు వంట చేసి రికార్డ్ బద్దలు కొట్టింది. మే 11-15 వరకు ఏకథాటిగా కుక్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల కెక్కింది. దీని ప్రధాన ఉద్దేశ్యం తమ నైజీరియన్ వంటకాల గురించి ప్రచారం చేయడమేనని ఆమె వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో నైజీరియన్ వంటకాలు కూడా ఒకటని, వీటి గురించిన విశేషాలు మరింతమందికి చేరాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. హిల్డా బాసిగా ప్రసిద్ధి చెందిన హిల్డా ఎఫియాంగ్ బస్సే ఈ 100 గంటల్లో 100 కంటే ఎక్కువ మీల్స్ , దాదాపు 55 ఇతర వంటకాలను ప్రిపేర్ చేసింది. ఈ కుక్-ఎ-థాన్ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. హిల్డా బాసికంటే ముందు సుదీర్ఘమైన వంట చేసిన రికార్డు భారతీయ చెఫ్ లతా టొండన్ పేరుతో ఉంది. దాదాపు 88 గంటల పాటు వంట చేసి రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Hilda Baci’s Cookathon (@hildabacicookathon) View this post on Instagram A post shared by Myfood By Hilda Baci (@myfoodbyhilda) -
వారేవా... వంటల రోబో!
వంట చేయడం కొందరికి ఎంతో హాయి. కొందరికి మాత్రం అయ్ బాబోయ్! ఇలాంటి వారి కోసం వచ్చిందే వంటలు వండే రోబో! నటి, బ్లాగర్ షెహనాజ్ ట్రెజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఏఐ–పవర్డ్ నోష్ రోబోట్ వీడియో వైరల్ అయింది. రోబోట్‌కు షెహనాజ్ ఆర్డర్ ఇవ్వగానే చకచకమని పెస్టో పనీర్ చేసి పెట్టింది. ఈ రోబోట్‌లో ఇన్‌గ్రేడియెంట్స్ యాడ్ చేయడానికి స్లాట్స్ ఉంటాయి. ‘ఏఐ రోబోట్స్ ఇప్పుడు ఇండియన్ కిచెన్లలోకి వచ్చేశాయి’ అని ప్రకటించింది షెషనాజ్. ‘ఈ రోబోట్ చేసే వంట అమ్మ చేసే వంట కంటే బాగుంటుంది’ అనే మాటపై మాత్రం చాలామంది భగ్గుమన్నారు. ‘అవసరమే ఆవిష్కరణకు తల్లిలాంటిది’ అంటారు. ఒక యువకుడు తన ఊరికి దూరంగా వృత్తిరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు అమ్మ చేసే వంటకాలను బాగా మిస్ అయ్యాడు. ఆ లోటు నుంచే ఈ ఏఐ రోబోట్‌ను సృష్టించాడు! -
వంటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ..ఏకంగా వంద గంటల పాటు..
ఇంతవరకు ఎన్నో రకాలు వరల్డ్ రికార్డులను చూశాం. విభిన్నంగా ఉండటం లేదా ఎవరూ చేయలేని సాహసానికి యత్నించడం వంటివి చూశాం. వాటన్నింటికంటే ఇంకాస్త విభిన్నంగా ఓ మహిళ వంటలతో కూడా రికార్డు సృష్టించొచ్చని నిరూపించింది. పైగా ఇంతకమునుపు అదే ఫీట్‌ని చేసిన మహిళ వరల్ఢ్ రికార్డుని సైతం బ్రేక్ చేసి ఔరా! అనినిపించుకుంది. వివరాల్లోకెళ్తే..నైజీరియాకి చెందిన చెఫ్ హిల్డా బాసి నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆమె గత గురువారం నుంచి నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ గతంలో భారతీయ చెఫ్ లతా టాండన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. గతంలో లతా సుమారు 87 గంటల 45 నిమిషాల పాటు వంట చేసి రికార్డు సృష్టిస్తే..హిల్డా సుమారు 100 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వంటలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉండగా, గిన్నిస్ వరల్డ్ రికార్డు సదరు చెఫ్ హిల్డా బేక్ చేసిన రికార్డు గురించి తెలిసిందని, ఐతే ఆ రికార్డును అధికారికంగా ధృవీకరించే ముందు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో సదరు నైజీరియన్ చెఫ్ హిల్డా మాట్లాడుతూ..నైజీరియన్ యువత ఎంతలా కష్టపడి పనిచేస్తారో ప్రపంచానికి తెలియజేప్పేందుకు ఇలా చేశానని చెప్పుకొచ్చింది. సమాజానికి దూరంగా ఉంటున్న ఆఫ్రికన్ యువతులు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె.. మీరు ఏ పనిచేయాలనుకుంటున్నా.. దాన్ని సీరియస్‌గా తీసుకుని అందరికంటే మెరుగ్గా చేయలన్నారు. అందుకోసం అదనపు మైళ్లు దాటి రావల్సిందేననిఝ(కష్టాలను అధిగమించి) నైజీరియన్ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు. అంతేగాదు నైజీరియన్ వంటకాలు గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా హిల్డా తన వంటకాల్లో సూప్ దగ్గర నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని ప్రసిద్ధ వంటకాలన్ని హిల్డా తయారు చేసింది. అంతేగాదు ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున విరామం తీసుకుంటూ..తన వ్యక్తిగత విషయాల కోసం 12 గంటల కొకసారి ఒక గంట చొప్పున తీసుకుని ఈ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ నైజీరియాకు ఈ రోజు చాలా గొప్ప రోజు అంటూ హిల్డాను ప్రశంసించాడు. ఆమె ఆశయం చాలా గొప్పదని అభినందించాడు. నైజీరియన్ వంటకాలు తోపాటు ఇక్కడి వ్యక్తులు గురించి తెలుసుకునేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా వంద గంటల పాటు చేయడమనేది అసామాన్య విషయమని అన్నాడు. ఆ మహిళ ఇక్కడ శక్తి చాలా ఎక్కువ ఉందని అనుమానించాల్సిన పని లేదని బల్లగుద్దినట్లు చెప్పింది అంటూ ట్విట్టర్లో హిల్డాని ప్రశంసలతో ముంచెత్తారు అధ్యక్షుడు బుహారీ. View this post on Instagram A post shared by Hilda Baci (@hildabaci) (చదవండి: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం) -
Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్లో దోసెలు వేసిన ప్రియాంక
బెంగళూరు: కర్ణాటకలో మే 10 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మైసూర్‌లోని ఓ హోటల్లో దోసెలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ మేరకు మైసూర్ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు డీకే శివ కుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాలలతో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మైసూర్‌లోని ప్రముఖమై పురాతన రెస్టారెంట్ అయిన హైలారీ హోటల్ని సందర్శించారు ఆమె. అనంతరం అక్కడ హోటల్ యజమానులతో కలసి ఉత్సాహంగా దోసెలు వేశారు. అంతేగాక వారితో కాసేపు ముచ్చటిస్తూ మీ వ్యాపారం నిజాయితీకి, కృషికి, మంచి ఆతిథ్యానికి మారు పేరు అంటూ ప్రశంసించారు. హోటల్ సిబ్బందితో సెల్ఫీ కూడా దిగారు. ఇక్కడ దోసెలు రుచిగా ఉన్నాయని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కూతురిని తీసుకుని అక్కడకు తీసుకువెళ్తానంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, మైసూరులో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. బీజేపీ కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. రాష్ట్రంలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో ప్రతిపక్ష నేతల సమాధులు తవ్వాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఏ నాయకుడి మాటలు విని ఓటు వేయకూడదని, మనస్సాక్షిని అనుసరించి ఓటు వేయాలని సూచించారు. కాగా, 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. Perfect dosas are just the beginning; with such skillful hands, there's no limit to the power they can bring to the world. pic.twitter.com/qsgUw6IBeJ — Congress (@INCIndia) April 26, 2023 (చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన అన్నామలై) -
జై శ్రీ అన్నా
గతంతో పోల్చితే చిరుధాన్యాల పెద్ద ఉపయోగాల గురించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విస్తృత అవగాహన పెరిగింది. దీనికి సాక్ష్యంగా నిలిచే వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ షేర్ చేశారు. ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక గ్రామంలోకి వెళ్లారు. ఆ గ్రామంలోని ఒక మహిళ మంత్రిగారికి చిరుధాన్యాలతో చేసిన సంప్రదాయ వంటల రుచి చూపించడమే కాదు... జొన్నె రొట్టె నుంచి రాగి లడ్డు వరకు చిరుధాన్యాలు చేసే మంచి గురించి మంచిగా మాట్లాడింది. ప్రధాని ప్రశంస అందుకొంది. ‘ప్రతి పల్లెలో ఇలాంటి దృశ్యం కనిపించాలి’... ‘క్షేత్రస్థాయి నుంచి మొదలైన స్పృహ, చైతన్యం వేగంగా విస్తరిస్తుంది’... ‘కనుల విందు చేసే వీడియో’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. -
36 శాతం ‘వంట’ చెరకే! తొలి స్థానంలో మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే..
సాక్షి, అమరావతి: దేశంలో 62 శాతం మంది వంట కోసం ఎల్పీజీ (గ్యాస్)ని వినియోగిస్తుండగా 36 శాతం ప్రజలు మాత్రం వంట చెరకునే వాడుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక వెల్లడించింది. 33.8 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధారపడుతుండగా 2.2 శాతం మంది వంట కోసం పిడకలను వినియోగిస్తున్నారు. 1.3 శాతం మంది కిరోసిన్, గోబర్ గ్యాస్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిపై వంట చేస్తున్నారు. ఇక ఎల్పీజీ వినియోగంలో గ్రామాలకు, పట్టణ ప్రాంతాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కట్టెలు, పొట్టు, పంట అవశేషాలు ఉచితంగా లభిస్తుండటంతోపాటు బూడిదను పంట పొలాలకు ఎరువుగా వాడుతున్నందున వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇక భగ్గుమంటున్న గ్యాస్ ధరలు కూడా కారణమే. ఈమేరకు కేంద్ర పర్యావరణ నివేదిక 2023ని గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో 49.4 శాతం మంది ఎల్పీజీ వాడుతుండగా 46.7 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధార పడుతున్నారు. మూడు శాతం మంది పిడకలు, 0.7 శాతం మంది గోబర్ గ్యాస్, కిరోసిన్, ఎలక్ట్రికల్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు. ♦ పట్టణ ప్రాంతాల్లో 89 శాతం మంది వంట కోసం ఎల్పీజీ వాడుతుండగా 6.5 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలను వినియోగిస్తున్నారు. 0.3 శాతం మంది పిడకలు, 2.5 శాతం గోబర్ గ్యాస్, ఎలక్ట్రికల్, కిరోసిన్, బొగ్గుల పొయ్యిలను వాడుతున్నారు. ♦ ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 84.2 శాతం మంది వంట కోసం కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపైనే ఆధారపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 16.3 శాతం మంది కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై వంట చేస్తుండగా 81.7 శాతం మంది ఎల్పీజీ వినియోగిస్తున్నారు. -
ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను!
రెస్టారెంట్ల వ్యాపారంలోకి దిగుతున్నవారు.. భోజన ప్రియుల్ని, ఇంట్లో వంటకు విరామం ఇచ్చి వెరైటీగా హోటల్లో తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించేవారు కొందరైతే, వినూత్నమైన ఆలోచనలతో థీమ్ బేస్డ్ రెస్టారెంటుల ఏర్పాటు వైపు మరికొందరు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం..తమ రెస్టారెంట్లు, టేక్ అవేలు, కర్రీ, బిరియానీ పాయింట్లకు..ప్రత్యేక ప్రాంతం, వంటకం, రుచి, అంకెలు, అక్షరాలు ఆధారంగా పేర్లు పెట్టేస్తున్నారు. మనం రోజువారీ ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు కూడా రెస్టారెంట్ల పేర్లుగా మారిపోతున్నాయి. వీటిల్లో కొన్ని సరదాగా ధ్వనించే, నవ్వు పుట్టించే పేర్లు కూడా ఉంటుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ తరహా ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది. – సాక్షి, సిటీడెస్క్ ఉడిపి, విలాస్, మిలటరీ స్థానంలో.. ► గతంలో చాలా హోటళ్లకు అన్నపూర్ణ, అజంతా లాంటి సాధారణ పేర్ల తర్వాత ఉడిపి అనో, విలాస్ అనో, మిలటరీ హోటల్ అనో ఉండేది. దేవుళ్లు, కుటుంబసభ్యులు, పిల్ల లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు కలిసొచ్చేలా పెట్టేవారు. ఇప్పుడ లాంటి పేర్లకు చాలావరకు కాలం చెల్లింది. కొత్త, వింతైన, సరదా పేర్లదే హవా. గ్రేటర్ హైదరాబాద్‌లో అలాంటి పేర్ల మీద ఓ లుక్కేద్దామా.. అన్ని రుచులూ ఇక్కడే.. ఉప్పు కారం (కొండాపూర్), పెప్పర్ అండ్ సాల్ట్ (షేక్‌పేట్), సిల్వర్ సాల్ట్ (బంరాహిల్స్), సాల్ట్ అండ్ పెప్పర్ (లక్డీకాపూల్), టామరిండ్ ట్రీ (చింతచెట్టు (సికింద్రాబాద్), టామరిండ్ (మణికొండ), రాయలసీమ రుచులు (చాలాచోట్ల ఉంది), తెలు గింటి రుచులు (కూకట్పల్లి), రాజుగారి రుచులు (కొత్తగూడ), గోదావరి రు చులు (జూబ్లీహిల్స్), నెల్లూరు రుచులు (మోతీనగర్), రాయలవారి రుచులు (యూసుఫ్‌గూడ), కోనసీమ వంటిల్లు (కూకట్పల్లి), కృష్ణపట్నం (బంజారాహిల్స్), సింప్లీ సౌత్ (జూబ్లీహిల్స్), సింప్లీ తెలంగాణ (కొత్తపేట్), మా పల్లె వంటకాలు (గచ్చిబౌలి). వంటకాలనూ వదలకుండా.. కోడికూర–చిట్టిగారె (జూబ్లీహిల్స్, కొండాపూర్), దిబ్బరొట్టి (మణికొండ), రాజుగారి పులావ్, పొట్లం పులావ్ (శ్రీనగర్ కాలనీ), పకోడా పాపారావు (కేపీహెచ్‌బీ ఫేజ్–1), ఉలవచారు (జూబ్లీహిల్స్), ముద్దపప్పు ఆవకాయ అండ్ మోర్ (గచ్చిబౌలి), నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు (కేపీహెచ్‌బీ, మణికొండ), పంచెకట్టు దోశ (ప్రగతినగర్), పులిహోరాస్ (మణికొండ), బిరియానీ వాలా, బిర్యానీ హౌస్ (బంజారాహిల్స్), కిచిడీ ఎక్స్‌ప్రెస్ (మాదాపూర్). ఆహా.. ఏమి పేర్లు.. ► వివాహ భోజనంబు (సికింద్రాబాద్, బంజారాహిల్స్), వియ్యాలవారి విందు (కొత్త పేట్), అద్భుత: (దిల్సుఖ్నగర్), తినే సిపో (కొంపల్లి), తిన్నంత భోజనం (ఉప్ప ల్, సికింద్రాబాద్), దా–తిను (హఫీజ్‌పేట), పొట్ట నింపు (గుండ్ల పోచంపల్లి), కడుపు నిండా (ఉప్పల్), భలే బంతి భోజనం (మియాపూర్), రా బావా తిని చూడు (కూకట్పల్లి), సెకండ్ వైఫ్, పందెం కోడి (వెంగళరావునగర్), అంతేరా (జూబ్లీహిల్స్), ఆకలైతుందా?.. పంచభక్ష్య (కూకట్పల్లి), మాయా బజార్ (కార్ఖానా), పందెం కోడి (వెంగళరావునగర్), విలేజ్ వంటకాలు, ఆహా (షేక్‌పేట), పాకశాల (కూకట్పల్లి), విస్తరాకు, అరిటాకు భోజనం (అమీర్‌పేట), లలితమ్మగారి భోజనం (బంజారాహిల్స్), బాబాయ్ భోజనం (నేరేడ్మెట్), తాళింపు (అమీర్‌పేట), గోంగూర (బంజారాహిల్స్), ఘుమఘుమలు (మాదాపూర్). ప్రాంతీయతకు ప్రతిరూపం..‘అంతేరా’ రెస్టారెంట్ ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రాంతీయత ప్రతిబింబించేలా పేరు పెట్టాలనుకున్నాం. ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ’ఆంధ్రా తెలంగాణ రాయలసీమ’ సమ్మేళనంతో ఆ పేర్ల లోని మొదటి అక్షరాలతో ‘అంతేరా’పేరును ఎంచుకున్నాం. ఈ మూడు ప్రాంతాల రుచులను అందిస్తున్నాం. – నిర్వాహకులు,అంతేరా రెస్టారెంట్ థీమ్‌తో ఫామ్‌లోకి.. ► కొందరు నిర్వాహకులు థీమ్/కాన్సెప్ట్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తూ భోజనప్రియుల్ని ఆకర్షిస్తున్నారు. రైలు, గుహలు, అడవులు, పల్లె వాతావరణం, జైళ్లు, బీచ్ ఆధారంగా చేసుకుని రెస్టారెంట్లు వెలుస్తుండటం గమనార్హం. గుహను తలపించేలా ఏర్పాటు చేసిన గుఫా ఓహ్రీస్ (బషీర్‌బాగ్), అడవి వాతావరణాన్ని తలపించేలా ఏర్పా టు చేసిన మారేడుమిల్లి (గచ్చి బౌలి), జైలును గుర్తుకు తెచ్చే జైల్ మండి (చాలాచోట్ల ఉంది).. ఖైదీ కిచెన్ (బంజారాహిల్స్), రైల్లో ఉన్నట్టుగా ఉండే జర్నీ 1853 (బంజారాహిల్స్) ఈ కోవలోనివే. ఇక బొమ్మ రైలు మీద భోజనం రావడం (ప్లాట్‌ఫామ్ 65), రోబో ఆహారం సర్వ్ చేయడం (రోబో కిచెన్, జూబ్లీహిల్స్) లాంటి ప్రత్యేకతలతో కూడిన రెస్టారెంట్లు కూడా నగరంలో వెలిసి కస్టమర్లను అలరిస్తున్నాయి. వియ్యాలవారి విందు. బహు పసందు మా హోటల్లో అన్నీ ప్రత్యేక వంటకాలే. తెలుగు రుచులు మా సొంతం. వెరైటీగా ఉంటుందని వియ్యాలవారి విందు పేరు పెట్టాం. అందరూ వియ్యాల వారిని ఏ లోటు లేకుండా ఎలా చూసుకుంటారో అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నాం. – సీహెచ్ఆర్వీ నర్సింహారెడ్డి, వియ్యాల వారి విందు నిర్వాహకుడు బావలకు ఇచ్చే మర్యాదే ఇస్తాం ఇంటికి వచ్చిన బావకి ఏ విధంగా మర్యాద చేస్తారో అదే విధంగా మా హోటల్‌కు వచ్చినవారికి ఇస్తాం. ఈ ఆలోచనతోనే ‘రా బావా.. తిని చూడు’అని మా హోటల్‌కి పేరు పెట్టాం. – రామకృష్ణారెడ్డి, ‘రా బావ తిని చూడు’యజమాని అక్షరాలు, నంబర్లు.. ► మండీ 36 (జూబ్లీహిల్స్), 1980 మిలటరీ హోటల్ (మణికొండ, సైనిక్‌పురి),అంగారా 5 (బంజారాహిల్స్), శ్యాల 95ఏ (మాదా పూర్), వై2కే (పంజగుట్ట), ఎన్ గ్రాండ్ (కార్ఖానా), ఎం గ్రాండ్ (వనస్థలిపురం), బీ ప్లేస్ (అయ్యప్ప సొసైటీ), డీ కార్పెంటర్ (మాసబ్‌ట్యాంక్), ఏ2జెడ్ (జీడిమెట్ల). కడుపారా ’తిన్నంత భోజనం’.. ‘తిన్నంత భోజనం’లో ఆత్మీయత, అనుబంధం కనిపిస్తుంది. మా వద్దకు వచ్చే కస్టమర్ మాకు బంధువుతో సమానం. చుట్టాల ఇంటికి వెళితే కడుపు నిండా అన్నం పెట్టి తమ ప్రేమను చాటుకుంటారు. మా రెస్టారెంట్‌కు వచ్చినా అంతే. – గాంధీ మిర్యాల, తిన్నంత భోజనం వ్యవస్థాపకులు -
మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఈ మధ్య భారతీయ వంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రోటీలు తయారు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దగ్గర కిచిడీకి పోపు (తడ్కా) ఎలా పెట్టాలో నేర్చుకున్నారు. ఆ వీడియోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్లో షేర్ చేశారు. అత్యంత పోషక విలువలు ఉన్న భారతీయ సూపర్ ఫుడ్ కిచిడీకి బిల్‌గేట్స్ పోపు(తడ్కా) పెట్టారు అంటూ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిల్‌గేట్స్ పాల్గొన్నారు. ఈ వీడియోలో కిచిడీకి పోపు(తడ్కా) ఎలా పెట్టాలో బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ నేర్పించారు. బిల్ గేట్స్ కూడా స్వయంగా దినుసులు వేసి గరిటెతో కలియపెట్టారు. అంతా పూర్తయ్యాక కిచిడీని రుచి చూశారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఒక రోజులో దాదాపు నాలుగు లక్షల మంది వీక్షించారు. దాదాపు 10 వేల లైక్‌లు, అనేక కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ కిచిడీని మైక్రోసాఫ్ట్ కిచిడీ అని పిలుస్తామంటూ పలువులు యూజర్లు చమత్కరించారు. -
బండకు టాటా.. కట్టెల వేట
రామన్నపేట: గ్యాస్ ధర భారీగా పెరిగిపోవడంతో పల్లెల్లో కట్టెలపొయ్యిలపై వంట మొదలైంది.. పొయ్యిల నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి హానికరంగా మారింది. గ్యాస్ ధర అమాంతం రూ.1,100 దాటడంతో గ్రామీణులు కట్టెల పొయ్యిల వాడకం మొదలుపెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం కొందరు మహిళలు అడవి నుంచి తలపై కట్టెలమోపులు తీసుకొస్తుండడం కనిపించింది. వారిని వాకబు చేయగా గ్యాస్ ధర పెరగడంతో వంట చేయడానికి అడవి నుంచి కట్టెలను తీసుకొస్తున్నట్లు వాపోయారు. వారిలో కొందరు స్థానికులు కాగా.. మరికొందరు సంచార జాతులున్నారు. -
గ్యాస్ ధర 2012లో రూ.410.. ఇప్పుడేమో 1100.. కట్టెలపొయ్యివైపే జనం మొగ్గు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా కర్బన ఉద్గారాల విడుదల కారణంగా రోజురోజుకూ భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజల ఆలోచనా తీరు మాత్రం మారడంలేదు. అధిక కర్బన ఉద్గారాల విడుదల కారకాల్లో ఒకటైన వంట చెరకు వినియోగం నేటికీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎల్పీజీ, సోలార్, విద్యుత్ వాడకం ఆశించిన స్థాయిలో పెరగకపోగా పాతకాలం తరహాలో కట్టెలు, పంట వ్యర్థాలు, పిడకల వినియోగం ఇంకా కొనసాగుతోంది. తద్వారా అడవుల నరికివేత కూడా ఎక్కువవుతోంది. దేశంలో ఇంకా దాదాపు 44 శాతం మంది అడవుల నుంచి కలప, పంటల వ్యర్థాలు, పిడకలను వినియోగించి ఆహారం తయారు చేసుకుంటున్నారు. ఇటుకల తయారీకి కూడా కలప, పంటల వ్యర్థాలు వినియోగిస్తున్నారు. చిన్నచిన్న పరిశ్రమలు సైతం కట్టెలనే వాడుతున్నాయి. చివరకు బయోమాస్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సైతం పంట వ్యర్థాలు కాకుండా ఏకంగా అటవీ కలపను వినియోగిస్తున్నాయి. మరోవైపు కలపతో బొగ్గు తయారీ కూడా చేస్తున్నారు. ఫలితంగా వెలువడుతున్న వాయు కాలుష్యంతో ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో ఈ తరహా మరణాలు చైనా తరువాత భారత్‌లోనే ఎక్కువని అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఎల్పీజీ వినియోగం పెరిగినా.. దేశంలో దశాబ్దకాలంగా ఇళ్లలో ఎల్పీజీ వినియోగం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30.5 కోట్ల ఎల్పీజీ గృహ వినియోగదారులున్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. 2012లో రూ. 410 ఉన్న 14.5 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1,100కు చేరుకోవడంతో వినియోగదారుల సంఖ్య పడిపోతోందని డీలర్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఉచితంగా దాదాపు 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారిన నేపథ్యంలో చాలావరకు రీఫిల్లింగ్‌కు రావడం లేదని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లోనూ సిలిండర్ల పంపిణీ కేంద్రాలు తగిన స్థాయి లో అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాల నుంచి సిలిండర్లను తెచ్చుకోవాల్సి రావడం వల్ల సిలిండర్ ధరతోపాటు రవాణా చార్జీలు కూడా తడిసిమోపెడవుతున్నాయి. సిలిండర్ అయిపోయిన వెంటనే రీఫిల్ దొరుకుతుందన్న గ్యారంటీ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం వల్ల కలపతో ఆహార తయారీకి మొగ్గుతున్నా రు. స్నానాలకు అవసరమైన వేడినీటి కోసం కలపనే వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఎల్పీజీ వినియోగం దాదాపు 88.6 శాతం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అది 42 శాతం మాత్రమే ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని గృహిణులు ఇంకా అడవుల నుంచి తెచ్చిన కలప, పంట పొలాల్లోని వ్యర్థాలు, పిడకలను వాడుతున్నారు. కలప కాలడం వల్ల వచ్చే.. కలప, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడుతున్న వాయు కాలుష్యం వల్ల దేశంలో ఏటా 3.3 లక్షల మంది మరణిస్తున్నారని ‘లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్’అధ్యయనం వెల్లడించింది. అదే చైనాలో 3.8 లక్షల మంది, యూరప్‌లో 1.17 లక్షల మంది, యూఎస్‌లో 32 వేల మంది మరణిస్తున్నారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు దాదాపు 28 కోట్ల మంది ఇంకా కలప, పంట వ్యర్థాలను వినియోగించి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నారని సమాచారం. వంట చెరకు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది మరణిస్తున్నారని పలు అంతర్జాతీయ సంస్థలు తమ సర్వేల్లో పేర్కొంటున్నాయి. ఎల్పీజీ వినియోగిస్తున్న వారిలోనూ 12 శాతం మంది రెండో ఇంధనంగా ఈ కలపను వినియోగిస్తున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. బొగ్గు డిమాండ్‌ను తగ్గించాలి... చెట్లను కొట్టేయడం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతాయి. కొట్టేసిన చెట్టును బొగ్గుగా మార్చడానికి విద్యుత్ లేదా ఇతర రూపాల్లో ఇంధనం అవసరమవుతుంది. మళ్లీ బొగ్గును కాల్చినా అది కూడా కాలుష్యమే. ఈ రకంగా మూడు దశల్లోనూ కాలుష్యం ఉంటుంది. నల్లగొండ జిల్లాలో ఈ తరహా కలప కాల్చివేత ఎక్కువగా జరుగుతోంది. ఇదొక పాత విధానమైనా ఇంకా ఎందుకు అనుసరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ బొగ్గును అధికంగా చిన్నతరహా పరిశ్రమలు, ఇటుక బట్టీలు, హోటల్స్, దాబాల వంటి వాటిలో వాడుతున్నారు. వీటికి బొగ్గు సరఫరా పెంచితే ఇలాంటి బొగ్గు ఉపయోగించరు. అసలు బొగ్గే వద్దనుకుంటే సబ్సిడీపై విద్యుత్ ఇవ్వాలి. బాయిలర్ వంటివి ఎలక్ట్రిక్‌పై నడిచేవి అందుబాటులోకి తేవాలి. ముందుగా ఈ రకమైన బొగ్గుకు ఉన్న డిమాండ్‌ను తగ్గించాలి. చెట్లు కొట్టేయకుండా చట్టాన్ని తీసుకురావాలి.పచ్చదనానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన డిమాండ్, సప్లయ్‌ను తగ్గించడం ద్వారా అనుకున్న ప్రయోజనాలు పొందొచ్చు. ప్రస్తుతానికైతే చెట్లకు, పర్యావరణానికి నష్టం కలగజేసే వాటిపై ప్రభుత్వపరంగా ఎలాంటి నియంత్రణలు, పర్యవేక్షణలు లేవు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త, పాలసీ అనలిస్ట్ -
తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్
కావలసినవి: చికెన్ – అర కిలో ; నిమ్మకాయ– ఒకటి ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; ఉప్పు – రెండు టీ స్పూన్లు లేదా రుచికి తగినట్లు. మసాలా కోసం: బాదం – పది ; పిస్తా – పది ; చిరోంజి– 2 టీ స్పూన్లు ; పచ్చిమిర్చి– 3 ; దాల్చిన చెక్క– అర అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; ఏలకులు –4 ; మిరియాలు – అర టీ స్పూన్. గ్రేవీ కోసం: నూనె– 3 టేబుల్ స్పూన్లు ; నెయ్యి – 2 టీ స్పూన్లు ; పెరుగు– పావు కప్పు ; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (వేయించాలి) ; టొమాటో పేస్ట్ – అర కప్పు ; రెడ్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్లు ; గ్రీన్ చిల్లీ సాస్ – టేబుల్ స్పూన్; షాజీరా– టీ స్పూన్ ; ధనియాల పొడి– టీ స్పూన్ ; వేయించిన జీలకర్ర పొడి – టీ స్పూన్ ; కశ్మీర్మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; మిరప్పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్ ; కొత్తిమీర తరుగు – కప్పు ; తాజా మీగడ– 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ► చికెన్‌ను శుభ్రం చేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలపాలి. ► మందపాటి బాణలిలో మసాలా దినుసులన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీలో తగినంత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. ► ఈ మసాలా పేస్టును చికెన్‌కు పట్టించాలి. అందులో నూనె, నెయ్యి, మీగడ మినహా గ్రేవీ కోసం తీసుకున్న అన్నింటినీ వేసి కలిపి రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ► బాణలిలో నూనె, నెయ్యి వేడి చేసి అందులో ఫ్రిజ్‌లో నుంచి తీసిన చికెన్‌ను వేసి మీడియం మంట మీద అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఇరవై నిమిషాల సేపు ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత మీగడ వేసి దించేయాలి. గ్రేవీ చిక్కదనం చూసుకుని అవసరమనిపిస్తే మరిగించిన నీటిని తగినన్ని పోసి కలుపుకోవాలి. నోరూరించే తెలంగాణ రెడ్ చికెన్ కర్రీ రెడీ. ఇది చపాతీ, రోటీ, బగారా రైస్లకు మంచి కాంబినేషన్. (క్లిక్ చేయండి: తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా..) -
Cristiano Ronaldo: 'మంచి వంటవాడు కావాలి.. జీతం రూ. 4.5 లక్షలు'
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానులు ఎక్కువ. గతేడాది ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ నిరాశజనక ప్రదర్శన చేసినప్పటికి రొనాల్డోకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆటగాడిగా, వ్యక్తిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. అలాంటి రొనాల్డో ఇప్పుడు ఒక మంచి వంటవాడి కోసం ఎదురుచూస్తున్నాడు. భారీగా జీతం ఇస్తానని చెప్పినా ఎవరూ దొరకడం లేదని రొనాల్డో తెగ బాధపడుతున్నాడు. పోర్చుగల్ లోని క్వింటా డాలో రొనాల్డో రూ.170 కోట్లతో ఓ కళ్లు చెదిరే భవంతిని కట్టిస్తున్నాడు.ఈ ఏడాది జూన్ వరకూ ఆ ఇల్లు నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత భార్య జార్జినా రోడ్రిగెజ్, పిల్లలతో కలిసి రొనాల్డో ఆ కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. తమ కుటుంబానికి ఓ పర్సనల్ కుక్ కావాలని రొనాల్డో భావించాడు. నోరూరించే పోర్చుగీస్ ఫుడ్ తోపాటు ప్రపంచంలోని రకరకాల వంటలను చేసి పెట్టే మాస్టర్ చెఫ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. వంట పని చేసే వ్యక్తికి నెలకు సుమారు 4500 పౌండ్లు(సుమారు రూ.4.5 లక్షలు) జీతం ఇస్తానని ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఎవరు ముందుకు రాలేదు. ఈ మధ్యనే రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ క్లబ్‌తో రెండేళ్ల పాటు భారీ డీల్‌కు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా గురువారం అర్థరాత్రి సౌదీ అరేబియాలో పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్జీ)తో రొనాల్డో జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పీఎస్జీ 5-4 తేడాతో గెలుపొందింది. పీఎస్జీ జట్టులో మెస్సీ సహా బ్రెజిల్ స్టార్ నెయమర్, ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా మ్యాచ్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న రొనాల్డో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్ ఫుట్‌బాలర్ -
3.30 నిమిషాల్లో పాస్తా ఉడకలేదని రూ.40 కోట్లు దావా..
వాషింగ్టన్: ‘రెండు నిమిషాల్లో రెడీ.. 3 నిమిషాల్లో రెడీ..’ అని ఇన్స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్‌పై వివరాలు ఇస్తుంటాయి కంపెనీలు. వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువే తీసుకుంటాయి. అది మామూలేలే.. అని మనం పట్టించుకోం. కానీ.. ఫ్లోరిడాకు చెందిన ఈ మహిళ ఊరుకోలేదు. చెప్పిన టైమ్‌లో పాస్తా ఉడకలేదని ఫుడ్ కంపెనీపై రూ.40కోట్లు దావా వేసింది. ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీరేజ్... క్రాఫ్ట్ హీంజ్ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్‌ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్‌లో ఉడికిస్తే.. మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్‌పై రాసి ఉంది. కానీ అందులో వివరించినట్టుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదని, ప్యాక్‌పై ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమాండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన నష్టానికి రూ.80 లక్షలు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది. చదవండి: మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా! -
అమ్మ చేతి ఆఖరి వంట.. కంటతడి పెట్టిస్తున్న పోస్ట్
అమ్మ ప్రేమకు కొలమానం ఉంటుందా?.. అంతులేని మమకారాన్ని ప్రదర్శించిన ఓ అమ్మ వీడియో కోట్ల మందితో కంటతడి పెట్టిస్తోంది. ఎందుకంటే ఆమె ఆఖరి గడియలు ఉంది కాబట్టి. అయినా ఆ ఇబ్బందికర క్షణాల్లోనూ ఆమె కొడుకు కోసమే ఆలోచించింది. ప్రేమగా అతనికి వండిపెట్టింది. చైనాలో ఓ వీడియో.. సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇప్పటిదాకా కోట్ల మంది ఆ వీడియోను తిలకించడంతో రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఈ వారం మోస్ట్ సెర్చ్డ్ న్యూస్‌గా అక్కడి నిలిచింది ఆ వీడియో. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ మహిళ.. ఆఖరి క్షణాల్లో తన కొడుకు కోసం ప్రేమగా వండిపెడితే.. వ్లోగర్ అయిన ఆ కుర్రాడు కన్నీళ్లతో తీసిన వీడియో అది. దలైయాన్కు చెందిన ఓ 20 ఏళ్ల టీనేజర్.. డెంగ్ అనే మారుపేరుతో గత వారం చైనా షార్ట్‌వీడియో యాప్ డౌయిన్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. చైనా జానపద సంగీతం ఫేర్వెల్ సంగీతాన్ని ఆ వీడియోకు జత చేశాడు. ‘‘అమ్మా.. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. ఇకపై ఏదీ నన్ను ఓడించదు’’ కన్నీళ్లతో ఆమెకు నివాళి ఇస్తూ క్యాప్షన్ ఉంచాడు. ‘‘మా అమ్మకి మనోధైర్యం ఎక్కువ. స్వతంత్రంగా బతకాలనుకునే మనిషి. ఈ ఫిబ్రవరిలో ఆమె(49) క్యాన్సర్ బారిన పడింది. కానీ, ఇంట్లోవాళ్లకు ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే.. ఆ విషయం తెలిస్తే మేం ఏమైపోతామో అని ఆమె భయం. ఆమెకి ఉన్న జబ్బు మాకు తెలిసేసరికి.. పరిస్థితి చేజారిపోయింది. అయినా అమ్మను బతికించుకునేందుకు ప్రయత్నించాం. మూడో సెషన్ కీమోథెరపీ పూర్తైన కొన్నాళ్లకు.. ఆమె ఒకరోజు హఠాత్తుగా ‘ఏం తినాలని ఉంది’ అని నన్ను అడిగింది. మార్కెట్‌కు తాను కూడా వచ్చింది. కావాల్సిన సరుకులన్నీ ఆమె ఎంచుకుంది. స్వయంగా వంట గదిలో దగ్గరుండి వండింది. మా అమ్మను అలా చూసేసరికి నా కన్నీళ్లు ఆగలేదు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతూనే ఆమె వంట చేసింది. కనీసం నన్ను దగ్గరికి కూడా రావొద్దని వారించింది. దగ్గరుండి ఆమె వడ్డించింది. ఆమె వండిన వంట.. ఎప్పటిలాగే రుచికరంగా ఉంది. దురదృష్టవశాత్తూ అదే మా అమ్మ చేతి ఆఖరి వంట అయ్యింది. ఆ మరుసటిరోజే ఆమె నిద్రలో కన్నుమూశారు. ఆమె జ్ఞాపకాలను, చివరి క్షణాలను ఇక నేను జీవితాంతం మోయక తప్పదు అంటూ భావోద్వేగంగా ఆ వీడియోను ఉంచాడు. కేవలం ఆ షార్ట్ వీడియో డౌయిన్‌లో రెండు లక్షల దాకా లైకులు తెచ్చుకుంది. చావు.. ఎల్లప్పుడూ బతికి ఉండే ప్రేమకు ముగింపు కాదు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. తన అమ్మ చనిపోయిన తర్వాత ఆమె వండిన వంటకాలు ఫ్రిజ్‌లో ఉండిపోయాయని, వాటిని చాలాకాలం ఆమెను తల్చుకుంటూ తిన్నానని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక ఏ లోకంలో ఉన్నా ఆ అమ్మ నిన్ను చూస్తూనే ఉంటుందని ఓ మహిళ కామెంట్ చేసింది. -
బిజీ లైఫ్‌కి బెస్ట్ ఛాయిస్.. ఏ వంటైనా నిమిషాల్లో రెడీ!
బీజీ లైఫ్‌లో వేళకు వంట కావాలన్నా.. వండిన వంటకం రుచికరంగా ఉండాలన్నా.. ఈ మల్టీఫంక్షనల్ డివైజ్‌ని వంటింట్లో పెట్టుకోవాల్సిందే. ఇందులో చాలా వెరైటీలను నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఒక వైపు శాండ్విచ్, ఆమ్లెట్స్, వాఫిల్స్, చికెన్ ఫ్రై.. మరోవైపు గుడ్లు ఉడికించుకోవడంతో పాటు తక్కువ మోతాదులో నూడుల్స్, రైస్ ఐటమ్స్, కర్రీస్, సూప్స్ వంటివీ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా బౌల్స్, ట్రేస్, గ్రిల్ ప్లేట్స్ ఇలా చాలానే డివైజ్‌తో పాటు లభిస్తాయి. ఇందులో పాలు కూడా కాగబెట్టుకోవచ్చు. స్వీట్స్, కేక్స్ వంటి ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు. ఇంకా ఈ డివైజ్ పింక్, మిల్కీ వైట్ రంగుల్లో కూడా లభిస్తున్నాయి. ఇది చూడటానికి కూడా.. మీ వంటగదికి ప్రత్యేకమైన లుక్‌ని తెచ్చిపెడుతుంది. ఇందులో ఫ్రైడ్ ఎగ్ ఒకే ఒక్క నిమిషంలో, కుడుములు 8 నిమిషాల్లో, శాండ్విచ్ 3 నిమిషాల్లో.. ఇలా ఒక్కో ఐటమ్ చాలా వేగంగా సిద్ధమవుతుంది. చదవండి: ‘ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు భారీ షాక్’ -
3 నెలల పాటు వండారు.. 8 నెలలు తిన్నారు
వాషింగ్టన్: ఉద్యోగాలు చేసే మహిళలకు ఇంటి పనులతోపాటు వంట చేయడం పెద్ద ప్రయాసే. దానికోసం చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కొన్ని నెలలకు సరిపడా ఆహారాన్ని ముందుగానే వండేసి, నిల్వ చేసి పెట్టుకుంటే. మంచి ఆలోచన కదా! ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీ షా (30) అనే గృహిణికి ఇలాంటి ఆలోచనే వచ్చింది. ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాలోని ఇండియానాలో స్థిరపడింది. కుటుంబ సభ్యులకు వండి పెట్టడానికి ఆమెకు చాలా సమయం పట్టేది. దీంతో ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులపై దృష్టి పెట్టారు. ఇంటర్నెట్తోపాటు పుస్తకాల ద్వారా సమాచారం సేకరించారు. ఇందుకోసం రోజుకు 2 గంటలు కేటాయించారు. 3 నెలల పాటు 426 మీల్స్ సిద్ధం చేసి, నిల్వచేశారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఈ నిల్వ ఆహారమే వారికి దాదాపు 8 నెలలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉపయోగపడింది. డీహైడ్రేషన్, వాటర్ క్యానింగ్ పద్ధతుల్లో ఆహారాన్ని చాలారోజులు నిల్వ చేయొచ్చని, తాజాగా ఉంటుందని కెల్సీ షా చెప్పారు. -
Kavitha Naga Vlogs: ఆమె మనసుకు రుచి తెలుసు
ఆమెకు చూపు సరిగా లేదు. కాని అద్భుతంగా వండుతుంది. ఇలా వండమని యూ ట్యూబ్‌లో వంటలు చేస్తూ అందరినీ అభిమానులుగా మార్చుకుంది. ఒకరు కాదు... ఇద్దరు కాదు రెండున్నర లక్షల మంది సబ్స్క్రయిబర్లతో స్టార్‌గా వెలుగుతున్న తెలుగు చెఫ్ బొడ్డు నాగలక్ష్మి. ఈమె వీడియోలు చూశారా మీరు? ‘అందరికీ నమస్తే. నేను నాగలక్ష్మి, ఈమె కవిత. మేమిద్దరం వదిన మరదళ్ళం’ అని మొదలవుతుంది నాగలక్ష్మి చేసే వీడియో. నిజానికి ఆమె చేసేది జంట వీడియో. ప్రతి వీడియోలోనూ వదిన కవిత ఉంటుంది. ఇద్దరి పేరు మీద ‘కవిత నాగ వ్లోగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ఉంది. 2020 వ సంవత్సరం సెప్టెంబర్‌లో మొదలైన చానల్ రెండేళ్ల లోపే రెండున్నర లక్షల సబ్స్క్రయిబర్లను సాధించింది. నాగలక్ష్మికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తోంది. ఇంతచేసి నాగలక్ష్మికి చూపు లేదు. కాని అది ఆమె విజయానికి అడ్డంకి కాలేదు. బతికిన పసిగుడ్డు నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన రైతు కృష్ణారెడ్డి ఆఖరు కూతురు నాగలక్ష్మి. పుట్టుకతోనే చూపు లేదు. పురిట్లో చూసిన బంధువులు ‘ఎందుకు కృష్ణారెడ్డి అవస్థ పడతావు. వడ్లగింజ వేసెయ్’ అని సలహా ఇచ్చారు. కాని నాగలక్ష్మి తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుంది. ‘చూపులేకపోతే నా బిడ్డ కాకుండా పోతుందా’ అంది. వయసు పెరిగాక అర్థమైన విషయం ఏమిటంటే నాగలక్ష్మికి ఎడమ కన్ను పూర్తిగా కనిపించదు. కుడికన్ను ఏదైనా వస్తువు దగ్గరగా పెట్టుకుంటే 5 శాతం కనిపిస్తుంది. అంటే ఆమె కుడికన్ను చాలా కొద్దిగా అతి దగ్గరి వస్తువులు (రెండు అంగుళాల దూరంలో) ఉంటే చూస్తుంది. అయినా సరే నాగలక్ష్మి బెదరలేదు. ఐదు వరకు బడికి వెళ్లింది. ఆ తర్వాత ఇంట్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండిపోయింది. నీళ్లు మోయడం మామూలు పనులు చేయడం చూపు లేకపోయినా అడుగుల అంచనాను బట్టి అలవాటు చేసుకుంది. కాని సమస్యలు ఆమెను వదల్లేదు. తల్లి వియోగం 18 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. అప్పటికి అక్కకు పెళ్లయి వెళ్లిపోవడంతో ఇంటిలో వంట పని నాగలక్ష్మి బాధ్యత అయ్యింది. తండ్రికి, అన్నయ్యకు ఆమే వండి పెట్టాల్సి వచ్చింది. కాని అన్నం వండటం తప్ప నాగలక్ష్మికి ఏమీ రాదు. అప్పుడు పక్కనే ఉండే ఒక అవ్వ ఆమెకు సాయం చేసింది. ‘నువ్వు వండుతూ ఉండు. నేను పక్కన ఉండి సలహా ఇస్తుంటాను’ అని పక్కన ఉండి వంట నేర్పించింది. ఆ అవ్వకు బాగా వండటం వచ్చు. అది నాగలక్ష్మికి కూడా వచ్చేసింది. అయినప్పటికీ ఇంట్లో ఆడతోడు లేకపోవడం వల్ల శారీరకంగా మానసికంగా వచ్చే ఇబ్బందులకు తోడు కోసం నాగలక్ష్మి బాధలు పడింది. అయితే ఆమె అన్న ఆదిరెడ్డి వివాహం చేసుకుని ప్రకాశం జిల్లాకు చెందిన బోండాల కవితను కోడలిగా తేవడంతో ఆమె జీవితానికి పెద్ద ఆసరా దొరికింది. యూట్యూబ్ ప్రయోగాలు 2018లో నాగలక్ష్మి అన్న ఆదిరెడ్డి యూట్యూబ్ చానల్ ప్రారంభించి ‘బిగ్‌బాస్’ షో మీద కామెంటరీ చెప్పేవాడు. ఆ వీడియోలు హిట్ అయ్యి అతనికి పేరు వచ్చింది. ఆ సందర్భంలో ఒకరోజు నాగలక్ష్మి చేత సరదాగా కామెంటరీ చెప్పిస్తే ఆ వీడియో అందరూ బాగుందన్నారు. అప్పటికి నాగలక్ష్మికి సీరియల్స్ పిచ్చి బాగా ఉండేది. టీవీలో సీరియల్స్‌ను చూసేది (వినేది). ఫోన్లో అయితే కంటికి దగ్గరగా పెట్టుకుంటే సీరియల్ బూజరగా కనిపిస్తుంది. అందువల్ల ఆదిరెడ్డి ఆమె చేత ‘సీరియల్ పిచ్చి’ అనే షో చేయించాడు. కాని దానికి పెద్ద స్పందన రాలేదు. కాని 2020లో లాక్డౌన్ సమయంలో నాగలక్ష్మి, కవిత కలిసి వంట వీడియోలు మొదలెట్టారు. ఇద్దరూ మంచి మాటకారులు కావడంతో రెండు రోజుల్లోనే 10 వేల మంది సబ్స్క్రయిబర్లు వచ్చారు. ‘కవిత నాగ వ్లోగ్స్’ అలా మొదలైంది. జామకాయ రోటి పచ్చడి నెల్లూరు పప్పుచారు తనకు చూపు లేదని ఈసురోమనడం నాగలక్ష్మి స్వభావంలో లేదు. ప్రతి వీడియోలో వదినతో కలిసి హుషారుగా కబుర్లు చేస్తుంది. చూపున్నట్టే వంటగదిలో కదలుతూ వంట చేస్తుంది. వదిన మరదలు కలిసి స్థానిక వంటలు రకరకాలుగా చేస్తూ భారీగా అభిమానులను కూడగట్టుకున్నారు. నాగలక్ష్మి చేసే పప్పుచారుకు పెద్ద గిరాకీ ఉంది. అలాగే చుక్కకూర పచ్చడి వీడియో పెద్ద హిట్ అయ్యింది. పచ్చి జామకాయ రోటి పచ్చడి కూడా ఈమె రుచి చూపించింది. చపాతీ లడ్డు మరో వెరైటీ. నెల్లూరు చేపల పులుసును అథెంటిక్‌గా చేసి చూపిస్తుంది. ‘నేను నూనె ఎక్కువ వేశానని ఒక్కరు కూడా అనరు. అంత సరిగ్గా వేస్తాను’ అంటుంది నాగలక్ష్మి. రకరకాల కామెంట్లు నాగలక్ష్మి వీడియోలకు 40 ఏళ్లు దాటిన అభిమానులు ఎక్కువ. అయితే ఈ వదిన మరదళ్ల మధ్య కూడా తంపులు పెట్టడానికి అన్నట్టు వీడియోల కింద కొందరు కామెంట్లు పెట్టారు. వీరు విడిపోయారని కూడా అన్నారు. కాని వదిన మరదళ్లు కలిసి వీడియోలు చేస్తూనే ఉన్నారు. తమ ఇంట్లో జరిగే ప్రతి విశేషాన్ని దాపరికం, శషభిషలు లేకుండా వ్యూయెర్స్తో పంచుకోవడమే వీరి వీడియోలలో విశేషం. ‘చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునేవారి వార్తలు వింటుంటాను. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవాలనేదే నా సలహా’ అని నాగలక్ష్మి అంటుంది. తన సంపాదన నుంచి సోనూసూద్ ఫౌండేషన్‌కు, సిఎం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేసింది నాగలక్ష్మి. అపజయం ఆమె కంట పడలేదు. ఆమె తన ప్రతి అడుగులోనూ వినేది గెలుపు పిలుపునే. -
వెండితెర మీద వంటల రాణి
తర్లా దలాల్ 2013లో మరణించింది. కాని వంట అనేసరికి టీవీ చెఫ్‌గా ఇప్పటికీ ఆమె పేరే గుర్తుకు వస్తుంది. వంటల మీద తర్లా దలాల్ రాసిన 100 పుస్తకాలు దాదాపుకోటి కాపీలు అమ్ముడుపోయాయి. భారతదేశంలో కోటి ఇళ్లల్లో ఆమె రెసిపీలు ఉపయోగించారని అంచనా. వీరుల, ధీరుల బయోపిక్‌లు తయారవుతున్న రోజుల్లో ఒక గొప్ప వంటగత్తె కథ బయోపిక్‌గా రావడం చాలా పెద్ద విషయం. తర్లాగా తెర మీద హ్యూమా ఖురేషి కనిపించనుంది. ఈ సందర్భంగా తర్లా దలాల్ ఘన గతం గురించి కథనం. జీవితంలో ‘రుచి’ కనిపెట్టడం ఒక అదృష్టమే. డబ్బున్నా లేకపోయినా ‘ఆ... ఏదో ఒకటి వండుకుంటే సరిపోదా’ అనుకునేవారికి ఈ కథనం పనికి రాదు. ‘ఏదైనా ఒకటి వండి చూద్దాం’ అనుకునేవారు తర్లా దలాల్‌తో ఇన్‌స్పయిర్ అవుతారు. మన దేశంలో స్త్రీలు కట్టెల పొయ్యిలతో, ఊదుడు గొట్టాలతో ఆ పూట వంటతో సతమతమవుతూ ఉన్న రోజుల్లో అమెరికాలో కొత్త కొత్త వంటలు నేర్చుకుంది తర్లా దలాల్. ఆ తర్వాత ఇండియాకు వచ్చి ఏకంగా వంట పాఠాలే చెప్పింది. అందరూ వంట చేస్తారు. కాని ‘సరిగ్గా’ చేయడం ఎలాగో చెప్పడం ద్వారా ఆమె దేశాన్నే జయించగలిగింది. అందుకే ఆమె కథ ఇప్పుడు సినిమాగా వస్తోంది. చిన్నారి వంట మాస్టర్ తర్లా దలాల్‌కు చిన్నప్పటి నుంచి వంటంటే ఇష్టం. పూణెలో చదువుకునేటప్పుడు 12 ఏళ్ల వయసు నుంచి తల్లికి రోజూ వంటలో సాయం చేసేది. 1956లో ఆమె బిఏ పూర్తి చేసి నళిన్ దలాల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లే ఆమె భవిష్యత్తును నిర్దేశించింది. నళిన్ అమెరికాలో ఎం.ఎస్. చేస్తుండటం వల్ల కాపురం అక్కడే పెట్టాల్సి వచ్చింది. కొత్త దేశం. కావలసినంత సమయం. నళిన్ భోజనప్రియుడు కనుక ఏవైనా కొత్త వంటకాలు ట్రై చేయరాదా అని ఆమెను ఎంకరేజ్ చేశాడు. దాంతో తర్లా రోజుకు రెండు మూడు కొత్త వంటకాలు చేసి భర్తకు పెట్టేది. అతడు పర్ఫెక్షనిస్ట్. అంత సరిగా రాలేదు అని చెప్తే తర్లా మళ్లీ అదే వంటను చేసేది. అనుకున్నది అనుకున్నట్టుగా వండటమే వంట ప్రావీణ్యం అని ఆమె గ్రహించింది. కాని నళిన్ ఆమెను పూర్తిగా మెచ్చుకోవడానికి 9 ఏళ్లు పట్టింది. 9 ఏళ్ల తర్వాత ‘మాస్టర్ ఆఫ్ ఆల్ కూజిన్స్’ అని బిరుదు ఇచ్చాడు. ముంబైలో వంట క్లాసులు ఇండియాకు తిరిగి వచ్చాక 1966లో ముంబైలో వంట క్లాసులు మొదలెట్టింది తర్లా. ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లి కావాలంటే వంట వచ్చి ఉండటం ఒక అవసరంగా భావించేవారు. అందుకని తర్లా క్లాసులకు డిమాండ్ పెరిగింది. ఒక దశలో ‘తర్లా దగ్గర వంట నేర్చుకున్న అమ్మాయికి వెంటనే పెళ్లి జరిగిపోతుంది’ అన్నంత పేరు ఆమెకు వచ్చింది. అదే సమయంలో వంటల పుస్తకాల మీద భర్త దృష్టి మళ్లించాడు. 1974లో ‘ప్లెజెర్స్ వెజిటేరియన్ కుకింగ్’ పేరుతో తర్లా తెచ్చిన పుస్తకం పెద్ద హిట్ అయ్యింది. 1987 నాటికి దేశంలో తర్లా అతి పెద్ద వంటల రచయితగా ఎదిగింది. ఆమె తన పుస్తకాల రాబడి మీద పెద్ద ఆఫీస్ కొనుక్కుంది. ఆ పుస్తకాలు అనేక భాషల్లో ట్రాన్స్‌లేట్ చేసి పబ్లిష్ చేయడానికి సిబ్బందిని పెట్టుకుంది. తర్లా వంటల పుస్తకాలు డచ్, రష్యన్ వంటి విదేశీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. 100 పుస్తకాలు రాసి చరిత్ర సృష్టించింది తర్లా. టీవీ చెఫ్‌గా దేశానికి ఎక్కువగా తెలిసిన పేరు కూడా ఆమెదే. శాకాహారానికి ప్రచారకర్త తర్లా రాసిన పుస్తకాలన్నీ శాకాహారానికి సంబంధించినవే. ఒక రకంగా ఆమె శాకాహారాన్ని ప్రచారం చేసిందని చెప్పాలి. దేశంలో ఎన్నో కుటుంబాలు తర్లా చేసిన శాకాహార వంటకాలను ట్రై చేసి రుచిని పొందాయి. 1988లోనే ఆమె ‘తర్లాదలాల్డాట్కామ్’ వెబ్‌సైట్‌ను తెరిస్తే నెలకు మూడు లక్షల మంది ఆ సైట్‌ను చూడటం రికార్డ్. ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న భారతీయులు ఆ వెబ్సైట్ ద్వారా తర్లా రెసిపీలు చూసి వంటలు చేసుకునేవారు. ఈ మొత్తం కృషికి తర్లాకు 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారం దక్కింది. మన దేశీయులకు స్వాదిష్టకరమైన భోజనాన్ని ప్రచారం చేస్తూ 2013లో మరణించింది తర్లా. సినిమా రిలీజప్పుడు మరోసారి తర్లాను తలుచుకుందాం. బాలీవుడ్ సినిమా ఇంటింటికీ తెలిసిన ఈ వంటగత్తెను ఇప్పుడు సినిమాగా ఇంటింటికీ తేనున్నారు బాలీవుడ్లో. హుమా ఖురేషీ తర్లా దలాల్‌గా ‘తర్లా’ అనే సినిమా తర్లా దలాల్ బయోపిక్‌గా మొదలైంది. రోనీ స్క్రూవాలా నిర్మాత. దంగల్, చిచోరే సినిమాలకు రచయితగా పని చేసిన పీయుష్ గుప్తా దర్శకుడు. ‘చిన్నప్పుడు మా ఇంట్లో వంట గదిలో తర్లా దలాల్ పుస్తకం ఉండేది. ఆమె పుస్తకంలో ఉండే మాంగో ఐస్‌క్రీమ్ రెసెపీని చూసి అమ్మ మాకు తయారు చేసి ఇచ్చేది. ఈ సినిమా చేయమని నాకు ఆఫర్ వచ్చినప్పుడు అది గుర్తుకు వచ్చింది. తర్లా పాత్ర చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అంది నటి హుమా ఖురేషీ. -
‘రసోయి కీ రహస్య’: కాకి అరుపుతో ఆశలు చిగురించాయి.. ఆమెకు హాట్సాఫ్
డిగ్రీ అయిపోయిన వెంటనే ఉద్యోగం చేయాలి. నెల నెలా వచ్చే జీతంతో ఇవి చేద్దాం అవిచేద్దాం అని ఎన్నో కలలు. కానీ అనుకోకుండా ఎదురైన అనారోగ్యం మొత్తం జీవితాన్నే చీకటి మయం చేసింది. అయినా ఏమాత్రం భయపడలేదు పాయల్. అప్పటిదాకా తన కళ్లతో అందమైన ప్రపంచాన్ని చూసిన కళ్లు ఇక మీదట చూడలేవన్న కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేకపోయింది. తరువాత మెల్లగా కోలుకుని తన కాళ్ల మీద తను నిలబడి, చూపులేని వారెందరికో కుకింగ్ పాటాలు నేర్పిస్తోంది. పంజాబీ కుటుంబంలో పుట్టిన పాయల్ కపూర్ చిన్నప్పటి నుంచి చాలా చురుకు. అది 1992 ఆగస్టు..అప్పుడే పాయల్ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీలో మంచి మార్కులు రావడంతో హైదరాబాద్‌లోని ఒబేరాయ్ హోటల్లో ఉద్యోగం దొరికింది. రోజూ ఉద్యోగానికి వెళ్లడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం పాయల్ దినచర్య. అనుకోకుండా ఒకరోజు హోటల్లో పనిచేస్తోన్న సమయంలో అనారోగ్యంగా అనిపించింది. డాక్టర్‌ను కలవగా.. సాధారణ జ్వరమని అన్నారు. కానీ మూడు రోజులైనా తగ్గకపోగా మరింత తీవ్రం అయ్యింది. ఉదయం అద్దంలో తన ముఖాన్ని తనే సరిగా చూడలేకపోయింది. దీంతో వెంటనే కళ్ల డాక్టర్‌ను, నరాల డాక్టర్లను కలిసింది. ఒక నెలరోజులపాటు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఉంది. అయినా ఆరోగ్యం మెరుగు పడలేదు. దీంతో పాయల్‌ను ముంబై తీసుకెళ్లారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనుపాపను అటు ఇటు తిప్పలేకపోయింది. వినలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి సమస్యలు కూడా వాటికి తోడయ్యాయి. కాకి అరుపుతో.. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా పాయల్ జీవితం అంధకారమైంది. పాయల్‌కు ఏదైనా చెప్పాలంటే కుటుంబ సభ్యులు ఆమె చెయ్యి మీద వేళ్లతో రాసేవారు. రోజులు అతికష్టంగా గడుస్తోన్న సమయంలో ఏడునెలల పాటు జరిగిన చికిత్సల మూలంగా ఆరోగ్యంలో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఓ రోజు పాయల్‌కు కాకి అరుపు వినిపించింది. ఈ శబ్దం మోడుబారిన జీవితంలో ఆశలు చిగురించేలా చేసింది. దీంతో హైదరాబాద్ తిరిగొచ్చింది పాయల్. క్రమంగా వినికిడి, వాసనలు తెలిసినప్పటికీ చూపు మాత్రం రాలేదు. ఆరేళ్ల తరువాత.. పాయల్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని తెలిసిన ఆమె స్నేహితులు తనని సినిమాలకు తీసుకెళ్లడం, ఆమెతోపాటు బైక్ రైడ్స్ చేసేవారు. దీంతో తన పరిస్థితి మరింత మెరుగుపడింది. ఇదే సమయంలో అంధులను చూసుకునే ఓ ఎన్జీవో గురించి స్నేహితులు చెప్పారు. పాయల్ ఆ ఎన్జీవోని సంప్రదించడంతో వాళ్లు ఆమెకు తన పనులు తాను చేసుకోవడం నేర్పారు. వీటితోపాటు బ్రెయిలీ కూడా నేర్చుకుంది. తరువాత తనలా చూపులేక బాధపడుతోన్న వారికి పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పాయల్‌ను ఇష్టపడడంతో పెళ్లిచేసుకుంది. కానీ కొంత కాలం తర్వాత మనఃస్పర్ధలు రావడంతో విడిపోయారు. భర్తతో విడిపోయాక పాయల్ ఒంటరిగా జీవించడం మొదలు పెట్టింది. హోటల్లో ఉద్యోగం చేస్తూనే వైకల్యంతో ఎదురయ్యే సమస్యలు మీద మాట్లాడడం, వంటల తయారీ గురించి చెబుతుండేది. కరోనా కారణంగా అన్నీ మూతపడడంతో వంటరాని వాళ్ల పరిస్థితి ఏంటీ? అని అనిపించింది పాయల్‌కు. దీంతో 2020లో ‘రసోయి కీ రహస్య’ పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. వంటరాని వాళ్లకు వంటలు చేయడం ఎలా? చూపులేనివాళ్లు ఆహారాన్ని ఎలా వండుకోవచ్చో ట్యుటోరియల్స్ చెబుతోంది. అంతేగాక బ్రెయిలీలో వంటల తయారీ గురించి రాసి షేర్‌కూడా చేస్తుంది. 52 ఏళ్ల వయసులో ఎంతోయాక్టివ్గా యూ ట్యూబ్ చానల్‌ను నడుపుతూ పాయల్ యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. -
అక్షయపాత్ర సిద్ధం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట వేడి వేడిగా నాణ్యమైన భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన అధునాతన వంటశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు గంటల్లో 50,000 మందికి భోజనం అందించేలా ఈ వంటశాలను నిర్మించారు. ఈ కేంద్రీకృత వంటశాలను ఆసాంతం పరిశీలించిన సీఎం జగన్.. బటన్ నొక్కి ప్రారంభించారు. హరేకృష్ణ హరేరామ మూమెంట్ నేషనల్ ప్రెసిడెంట్ (బెంగళూరు) మధు పండిట్ దాస్, ఆంధ్రా తెలంగాణా అధ్యక్షుడు సత్యగౌరి చందన దాస్‌లు ఈ వంటశాల పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం అక్కడ ఉన్న పాఠశాల విద్యార్థులను సీఎం ఆప్యాయంగా పలకరిస్తూ.. వారితో గ్రూపు ఫొటో దిగారు. ఈ విద్యార్థులకు ఆయన స్వయంగా వడ్డించడమే కాకుండా, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు అందించే చిక్కీలను రుచి చూశారు. ఈ వంటశాలలో తయారైన ఆహార పదార్థాలు వేడి తగ్గకుండా, నాణ్యత దెబ్బతినకుండా వేగంగా పాఠశాలలకు అందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా ఎయిర్ ఇండియా సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ఈ కేంద్రీకృత వంటశాలను (సెంట్రలైజ్డ్ కిచెన్) అభివృద్ధి చేసింది. తిరునామంతో పార, పలుగు పట్టి.. తాడేపల్లి మండలం కొలనుకొండలో ఇస్కాన్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలోనే అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. సుమారు ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన రూ.70 కోట్ల వ్యయంతో ఈ గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్షేత్రం కోసం కొలనుకొండలో దేవదాయ శాఖ భూమిని లీజుకు ఇచ్చారు. ఇందులో రాధాకృష్ణ, వెంకటేశ్వరస్వామి ఆలయాలు, కల్చరల్ ఎక్స్పో, సంస్కార హాల్, కృష్ణ లీలాస్, గోశాల, అన్నదానం హాల్, యోగా, ధ్యాన మందిరాలు, ఆశ్రమం, భగవద్గీత మ్యూజియం, యువత కోసం శిక్షణ కేంద్రం నిర్మించనున్నారు. ఈ క్షేత్ర భూమి పూజ కార్యక్రమం కోసం వచ్చిన ముఖ్యమంత్రికి ఇస్కాన్ ప్రతినిధులు నుదుటిపై తిరునామం దిద్ది స్వాగతం పలికారు. భూమి పూజ సందర్భంగా నిర్వహించిన భూ వరాహ స్వామి యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం గోపాలకృష్ణ ఆలయం నిర్మించే చోట గునపంతో మట్టిని తవ్వడం ద్వారా నిర్మాణ పనులను వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన బాల గోపాలకృష్ణుడు, రాధాకృష్ణులకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ హరేరామ మూమెంట్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఆధ్యాత్మిక గ్రంథాలను కానుకగా అందజేశారు. గుడి నిర్మాణ ఆకృతులు, ఇక్కడ ఏర్పాటు చేసే సౌకర్యాల గురించి వివరించారు. హరేకృష్ణ గోకుల క్షేతం నమూనా చిత్రాలను, శంకుస్థాపన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం దేవదాయ శాఖ రూపొందించిన క్యాలండర్‌ను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
మష్రూమ్స్ మంచూరియా, మష్రూమ్స్ మటన్ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఎప్పుడూ ఒకేలా కాకుండా వంటకాలకు ఏదైనా ప్రత్యేకతను జోడించాలని ఆలోచన వస్తే ఎంపికలో మొదటి స్థానంలో ఉండేవి పుట్టగొడుగులు. వెజ్ అయినా.. నాన్ వెజ్ అయినా విందు పసందుగా మార్చేయాలంటే అన్నింటికీ అండగా నేనన్నానంటూ వచ్చి చేరుతాయి. రుచితో పాటు పోషకాలనూ సమృద్ధిగా అందిస్తాయి. మష్రూమ్స్ మటన్ కావలసినవి: ► మటన్– 500 గ్రాములు; టొమాటో – 250 గ్రాములు; ఉల్లిపాయ – 2 (సన్నగా తరగాలి); బటన్ పుట్టగొడుగులు – 200 గ్రాములు; కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు; ► నూనె – 6 టేబుల్ స్పూన్లు; లవంగాలు – 2; ఏలకులు – 2; సాజీర – అర టీ స్పూన్; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ► గరం మసాలా – పావు టీ స్పూన్; బిర్యానీ ఆకులు – 2; మెంతిపొడి – అర టీ స్పూన్; అల్లం పేస్ట్ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు; ► కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి– టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత తయారీ: ప్రెజర్ పాన్‌లో నూనె వేసి, వేడి చేయాలి. ►లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, సాజీర వేసి, కొన్ని సెకన్ల తర్వాత, ఉల్లిపాయ తరుగు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ► అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ∙దీంట్లో టమోటా ముక్కలు వేసి, గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి. ► దీంట్లో మటన్ ముక్కలను వేసి, గోధుమ రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి. ► తర్వాత పుట్టగొడుగులు, కొబ్బరి పొడి, ఉప్పు వేసి, కప్పు నీళ్లను కలిపి, ప్రెజర్ కుకర్ మూత పెట్టి, 15 నిమిషాలు ఉడికించాలి. ► 10 నిమిషాలు చల్లారేవరకు ఉంచి, ఆ పైన కుక్కర్ మూత తీయాలి. ► ధనియాల పొడి, మసాలా వేసి, 5 నిమిషాలు ఉడికించి, దించాలి. ► కొత్తిమీర తరుగు వేసి, సర్వ్ చేయాలి. చదవండి: (మాంసాహారం డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేస్తే.. ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ వల్ల) మష్రూమ్స్ మంచూరియా కావలసినవి: ►మైదా – అర కప్పు; మష్రూమ్స్ – 250 గ్రాములు; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ►నీళ్లు – కప్పు; ఉప్పు – తగినంత; పంచదార – అర టీ స్పూన్; పచ్చి మిర్చి – 3 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; ►కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉల్లికాడల తరుగు – టేబుల్ స్పూన్; బెల్ పెప్పర్ – 1 (సన్నగా తరగాలి) సాస్ కోసం: నల్ల మిరియాల పొడి – చిటికెడు; పంచదార – చిటికెడు; సోయా సాస్ – టీస్పూన్ తయారీ: ►పుట్టగొడుగులను కడిగి, తుడిచి, సగానికి కట్ చేయాలి. ఒక గిన్నెలో సాస్ మినహా పై పదార్థాలన్నీ తీసుకోవాలి. ► తగినన్ని నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి.స్టౌ పై బాణలి పెట్టి, తగినంత నూనె పోసి, వేడి చేయాలి. ► పుట్టగొడుగులను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, తీసి, పక్కన పెట్టుకోవాలి. ►అదే నూనెలో, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలను వేసి, నిమిషం సేపు వేయించి, తీసి పక్కనుంచాలి. ►నల్ల మిరియాలు, ఉప్పు, చక్కెర, సోయా సాస్ కలిపి పక్కనుంచాలి. ఈ సాస్‌లో వేయించిన పుట్టగొడుగులను వేసి, అన్నింటికీ సాస్ పట్టేలా బాగా కదిలించాలి. ► తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో అలంకరించి, సర్వ్ చేయాలి. చదవండి: (30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..) -
సార్.. ఫోజులు తర్వాత.. ముందు గ్యాస్ వెలిగించు
లక్నో: సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా శ్రమించిన వారు విన్ అవుతుంటే.. ఏం లేకపోయినా.. హడావుడి చేసే బాపతు బ్యాచ్ మాత్రం తుస్సుమంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. సార్ చాలా శ్రమ పడి ఫోజులిచ్చారు కానీ.. మీ ప్రయత్నం వృథా అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు.. కాన్పూర్ కమిషనర్, ఐఏఎస్ అధికారి రాజ్ శేఖర్ ఆదివారం వంటింట్లో గరిటె పట్టిన ఫోటోని ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి.. వంటలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను.. ఉదయం టిఫిన్ కోసం పోహా తయారు చేస్తున్నాను.. అది కూడా హోం మినిస్టర్ అధ్వర్యంలో’’ అనే క్యాప్షన్‌తో ఫోటోని షేర్ చేశారు. (చదవండి: ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!) Please wish me Good Luck. Trying my luck in Cooking…😊 Preparing the Poha for the Breakfast under guidance of Home Minister…😊 pic.twitter.com/y607j5Yzr1 — Raj Shekhar IAS (@rajiasup) December 19, 2021 ఇక దీనిలో రాజ్ శేఖర్.. నీటుగా సూటు బూటు వేసుకుని తయారయి ఉన్నారు. అన్నింటికంటే.. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. వంట చేస్తున్నానని చెప్పారు.. కానీ గ్యాస్ వెలిగించి లేదు. ఇది గమనించుకోకుండా.. ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ నెటిజనులు ఎంత జాగ్రత్తగా గమనిస్తారో తెలుసు కదా.. దాంతో కమిషనర్ పరువు పొగొట్టుకునే పరిస్థితి తలెత్తింది. (చదవండి: వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి) ఈ ఫోటో చూసిన నెటిజనులు.. ‘‘సార్.. వంట బాగా చేశావ్.. స్టవ్ వెలిగిస్తే.. ఇంకా బాగుండేదేమో’’.. ‘‘సూటు బూటు వేసుకుని వంట చేస్తారా ఎవరైనా’’.. ‘‘గ్యాస్ ధర చుక్కలనంటుతుంది.. మీరేమో మంటతో పని లేకుండా వంట చేశారు.. ఆ టెక్నిక్ మాకు కూడా చెప్పండి’’.. ‘‘ఈ ఫోటోని గనక ఐక్యరాజ్యసమితి చూస్తే.. దెబ్బకు మూర్ఛపోతుంది.. మీ ఐడియాను తెగ ప్రశంసిస్తుంది.. గ్లోబల్ వార్మింగ్ కూడా సగానికి సగం తగ్గుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. Cooking without fire while dressed in a suit ...yeah you do need help. Help in staging social media pics https://t.co/XQsfY2RpvQ — Lady Andolan Jeevi 🏳️🌈 (@LadyDramadragon) December 20, 2021 చదవండి: మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా? -
రుచులూరే.. సాగ్‌వాల చికెన్, గార్లిక్ మ్యాష్డ్ పొటాటోస్ తయారీ ఇలా..
ఎప్పుడూ ఒకేలాంటి వంటకాలకు బదులు కాస్త వెరైటీగా ఇవి ట్రై చేయండి. సాగ్‌వాల చికెన్ కావల్సిన పధార్థాలు బోన్ లెస్ చికెన్ – కేజీ నానబెట్టడానికి: పెరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను పసుపు – అరటేబుల్ స్పూను, ఉప్పు – టేబుల్ స్పూను. సగా చికెన్ సాస్: నెయ్యి – టేబుల్ స్పూను ఉల్లిపాయలు – రెండు జీలకర్ర – టేబుల్ స్పూను దాల్చిన చెక్క పొడి – టేబుల్ స్పూను బిర్యానీ ఆకులు – మూడు ధనియాల పొడి – టేబుల్ స్పూను ఎండు మిర్చి – మూడు కసూరీ మేథీ – టేబుల్ స్పూను పాలకూర తరుగు – పావు కేజీ తయారీ విధానం ►చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నానబెట్టడానికి తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ►స్టవ్‌మీద బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత ఎండు మిర్చి, ధనియాలపొడి, గరంమసాలా, దాల్చిన చెక్కపొడి, బిర్యానీ ఆకులు వేసి టేబుల్ స్పూను నీళ్లు పోసి వేగనివ్వాలి. ►ఇవన్నీ వేగిన తరువాత నానబెట్టిన చికెన్ వేసి కలుపుకోవాలి. తరువాత మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. ►ఇప్పుడు పాలకూర తరుగును మిక్సీజార్‌లో వేసి పెస్టులా చేసుకోవాలి. ►చికెన్ ముక్కలు ఉడికిన తరువాత పాలకూర పేస్టువేసి సన్నని మంట మీద ఉడికించాలి. ►ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించి, రుచికిసరిపడా ఉప్పు వేసుకుని దించేస్తే సాగ్‌వాల చికెన్ రెడీ. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! గార్లిక్ మ్యాష్డ్ పొటాటోస్ కావల్సిన పధార్థాలు వెల్లుల్లి పాయలు – రెండు ఆయిల్ – టేబుల్ స్పూను బంగాళ దుంపలు – కేజీంబావు బటర్ – కప్పు, పాలు – కప్పు బిర్యానీ ఆకులు – మూడు ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా వెల్లుల్లి పాయల తొడిమను కట్ చేసి కొద్దిగా నూనె చల్లి, సిల్వర్ ఫాయిల్‌లో చుట్టిపెట్టి అవెన్ లో పది నిమిషాలపాటు వేగనివ్వాలి. ►ఇప్పుడు బంగాళ దుంపల తొక్కతీసి రెండు అంగుళాల సైజు ముక్కలుగా కట్ చేయాలి. ►ముక్కలన్నింటిని ఒక పెద్దగిన్నెలో వేసి చల్లటి నీళ్లుపోయాలి. దీనిలో బిర్యానీ ఆకులు వేసి దుంపలను ఉడికించాలి. ►దుంపలు ఉడికాక నీళ్లను వంపేసి మరోసారి గిన్నెను స్టవ్ మీద పెట్టి దుంప ముక్కలు పొడిగా మారేంత వరకు వేగనివ్వాలి. ►ఇప్పుడు ఈ బంగాళ దుంప ముక్కలు, వేయించిన వెల్లుల్లిలను కలిపి మెత్తగా రుబ్బాలి. ►స్టవ్ మీద పాన్ వేడెక్కాక బటర్ వేసి రుబ్బుకున్న దుంపల మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ►తరువాత పాలు పోయాలి. పాలన్నీ ఇగిరాక రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేస్తే రోస్టెడ్ గార్లిక్ మ్యాష్డ్ పొటాటోస్ రెడీ. చపాతీలు, బ్రెడ్‌లోకి ఇది చాలా బావుంటుంది. చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
వైరల్: పెళ్లంటే ఇదేరా.. వంట పాత్రలో వెడ్డింగ్ హాల్‌కి వచ్చిన కొత్త జంట
అలప్పజ( కొచ్చి): కేరళను వరదలు ముంచెత్తడంతో అక్కడి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల రవాణా కూడా పూర్తిగా స్తంభించడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఓ జంట పెద్దలు నిశ్చయించిన ముహుర్తానికే తమ పెళ్లి చేసుకోవాలనే నిశ్చయించుకుని, ఆటంకాలను దాటుకుంటూ వివాహ తంతుని పూర్తి చేశారు. అయితే ఇందులో ఏముందనుకుంటున్నారా.. వానలు కాబట్టి పడవ మీద వచ్చుంటారు అనుకుంటే పొరపాటే. పెండ్లి మంటపానికి వారిద్దరు అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని వచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో స్థానిక టీవీ చానెల్లో ప్రసారమవడంతో పాటు ఆ జంట సెలబ్రిటీగా మారంది. వివరాల్లోకి వెళితే.. ఆరోగ్య కార్యకర్తలుగా పని చేస్తున్న ఆకాష్, ఐశ్వర్యల వివాహం సోమవారం జరపాలని పెద్దలు నిశ్చయించారు. అయితే ప్రస్తుతం కేరళలోని వరదల కారణంగా అది వీలుపడదని అనుకున్నారంతా. కానీ తమ జీవితంలో ముఖ్యమైన రోజుని వాయిదా వేయడం ఇష్టంలేని ఆ వధూవరులు మాత్రం ధైర్యంతో ముందుకు కదిలారు. చుట్టూ ఎటు చూసిన నీళ్లు ఉండడంతో వారు ఏకంగా ఓ భారీ అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని తలవడిలోని ఫంక్షన్ హాల్‌కు అతి కష్టం మీద చేరుకున్నారు. అఖరికి పెండ్లి మంటపం సైతం నీటితో నిండిపోయింది అయినా అవేవి వారి నిర్ణయాన్ని ఆపలేకపోయింది. ఈ పెళ్లికి పరిమిత అతిధులు, బంధువులను ఆహ్వానించి వారి సమక్షంలోనే తమ వివాహ తంతు ముగించేశారు. ఇక నవ దంపతులు ఇద్దరూ చెంగనూర్‌లోని దవాఖానలో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. #Kerala couple uses a huge cooking vessel as a makeshift boat to reach their wedding venue amidst #heavyrains #KeralaFloods #KeralaRains pic.twitter.com/NiIUpRcrnc — Diksha Yadav (@DikshaY62646349) October 18, 2021 చదవండి: లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది -
స్పైసీ మ్యాగీ మిర్చి గురూ
న్యూఢిల్లీ: కొంత కాలం నుంచి చిత్ర విచిత్రమైన వంటకాలతో ప్రముఖ పాకశాస్త్ర నిపుణులు వాళ్ల కళా నైపుణ్యాలను ప్రదర్శించడమే కాక చాలామంది భోజన ప్రియుల మనస్సులను గెలుచుకున్నారు. అలాగే ఇటీవల కాలంలో మ్యాగీ మిల్క్ షేక్, చాకోలెట్ మ్యాగీ వంటి రకరకాల వంటకాలు చాలానే వచ్చాయి. (చదవండి: "ఆధార్ తప్పనిసరి కాదు") ప్రస్తుతం ఆ జాబితాలోకి స్పైసీ మ్యాగీ మిర్చి బజ్జీ అనే ఒక సరికొత్త వంటకం చేరనుంది. దీనికి సంబంధించిన ఇమేజ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మిర్చి బజ్జీ అనగానే దానిలోకి నంజుకునే ఉల్లిపాయలు, బఠాణి కూర, కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసి ఉంటుంది. ఇక ఈ బజ్జీని చూసే వాళ్లకి ఎప్పుడేప్పుడు తినేద్దాం అని తహతహ లాడుతుంటుంది. అలాంటిది మ్యాగీ ప్రియుల కోసం వచ్చిన ఈ సరికొత్త స్పైసీ వంటకం నెటిజన్లను నోరూరిస్తూ ఫిదా చేస్తోంది. ఇది కూడా మిర్చి బజ్జీలానే కాకపోతే సెనగపిండితో కాకుండా కేవలం వేయించిన మిర్చిలోనే న్యూడిల్స్‌ని స్టవ్ చేసి సర్వ్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వాట్ ఏ స్పైసీ మ్యాగీ మిర్చి అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. (చదవండి: పెట్రోల్ సంక్షోభానికి చక్కటి పరిష్కారం!) -
తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు
మహిళా హక్కులు, స్త్రీ స్వేచ్ఛపై తాలిబన్ల హామీలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. అఫ్గాన్‌కు చెందిన నజ్లా ఆయూబీ అనే మాజీ జడ్జి వారి దారుణాలను వెల్లడించారు. అమెరికాలో నివాసముంటున్న నజ్లా ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గాన్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను బయటపెట్టారు. తమకు వండిన వంట బాగాలేదన్న కారణంగా ఉత్తర అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి ఆమెకు నిప్పు పెట్టారని ఆయూబీ తెలిపారు. చదవండి : Afghanistan: మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు తమకు ఆహారాన్ని అందించాలని అక్కడి ప్రజలను తాలిబన్లు ఒత్తిడి చేస్తున్నారని, స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్ బానిసలుగా మార్చేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ అధీనంలోని ప్రాంతాల్లోని యువతులను తమ ఫైటర్లకిచ్చి వివాహం చేయాలంటూ స్థానిక కుటుంబీకులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఒకపక్క ఇన్ని దారుణాలకు పాల్పడుతూ మరోపక్క మహిళలు స్వేచ్ఛగా పని చేసుకోవచ్చని బూటకపు హామీలు ఇస్తున్నారని ఆయూబీ మండిపడ్డారు. మహిళల హక్కుల కోసం పోరాడే తనలాంటి వారు తాలిబన్ల పాలనలో జీవించడం కష్టమన్న ఉద్దేశంతోనే తాను పారిపోయి వచ్చినట్లు చెప్పారు. మరోవైపు తమను కార్యాలయాలకు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారంటూ ఇప్పటికే పలువురు మహిళా జర్నలిస్టులు తమ గోడును ప్రపంచానికి వెళ్లబోసుకున్నారు. అఫ్గాన్ జాతీయ జండా పట్టుకున్న వ్యక్తిని చావబాదడం, పోలీసు అధికారి ఒకరిని కాల్చిచంపడం, మైనార్టీ వర్గాలను చిత్రహింసలు పెట్టడం వంటి చర్యలతో తాలిబన్లు తమ క్రూరత్వాన్ని చాటుకుంటున్నారు. -
బీరకాయతో నాన్‌వెజ్ ట్రై చేశారా.. ఇలా చేస్తే అదిరిపోవాల్సిందే!
కూరగాయలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. బీరకాయలో పీచుపదార్థం, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, జింక్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీర తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా రక్తహీనత, చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గుతారు. రుచిలో కాస్త చప్పగా ఉండే బీరకాయను వివిధ రకాల కాంబినేషన్లలో వండితే మరిన్ని పోషకాలతో పాటు రుచి కూడా పెరుగుతుంది. ఎండురొయ్యలు బీర కుర్మా కావలసినవి: ఎండు రొయ్యలు – పావు కేజి; బీరకాయ – ఒకటి; ఆయిల్ – మూడు టీస్పూన్లు; ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరుక్కోవాలి); ఉప్పు – రుచికి సరిపడా; అల్లం వెల్లుల్లి పేస్టు – అరటీస్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; చింతపండు – పావు టీస్పూను; ధనియాల పొడి – పావు టీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; కారం – రెండు టీస్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను. తయారీ..ముందుగా ఎండు రొయ్యల తల, తోక తీసి ఇసుకలేకుండా శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. ►బీరకాయ తొక్కతీసి సన్నని ముక్కలు చేయాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పువేసి వేగనివ్వాలి. ►మరో పాన్‌లో కప్పు నీళ్లు పోసి ఎండు రొయ్యలు వేసి నాలుగు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు బీరకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలపాటు మూత పెట్టి ఉడకనిచ్చి, ఉడికించి పెట్టుకున్న ►ఎండు రొయ్యలు వేసి మరో ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలి ►తరువాత గరం మసాలా వేసి తిప్పి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే ఎండురొయ్యలు బీరకాయ కుర్మా రెడీ. బీరకాయ చికెన్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – అరకేజి; ఆయిల్ – నాలుగు టీ స్పూన్లు; పచ్చిమిరపకాయలు – మూడు (నిలువుగా కట్ చేయాలి); ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా కట్ చేయాలి); అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీ స్పూను; పసుపు – అర టీస్పూను; బీరకాయ ముక్కలు – ఒక కప్పు; కారం – రెండు టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; తరిగిన కొత్తిమీర – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. చికెన్‌ను శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ►ఉల్లిపాయలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి. ►అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక చికెన్ ముక్కలు వేసి మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. ►తరువాత బీరకాయ ముక్కలు వేసి మూతపెట్టి ఐదు నిమిషాలయ్యాక, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. ►తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలాక, కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తే బీరకాయ చికెన్ రెడీ. బీర ఖీబా కావలసినవి: మటన్ ఖీమా – పావు కేజి; బీరకాయ ముక్కలు – అరకేజి(తొక్కతీసినవి); తరిగిన పచ్చిమిర్చి – రెండు; వెల్లుల్లి తురుము – టీస్పూను; ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు; మిరియాల పొడి – టీ స్పూను; పసుపు – టీస్పూను; కారం – రెండు టీ స్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను; జీలకర్ర – టీస్పూను; ఆవ నూనె – నాలుగు టీ స్పూన్లు; ఉప్పు– రుచికి సరిపడా. తయారీ.. మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక జీలకర్ర వేసి వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ►ఇవన్నీ వేగాక పసుపు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►బీరకాయ ముక్కలు సగం ఉడికిన తరువాత కొద్దిగా ఉప్పు, మటన్ ఖీమా వేసి మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించాలి. ►ఖీమాలో వచ్చిన నీళ్లన్నీ ఇగిరిపోయాక, కారం, మిగిలిన మసాలా పొడులు వేసి వేగనివ్వాలి. ►చివరిగా ఉప్పు చూసి సరిపోకపోతే కొద్దిగా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనిస్తే బీర ఖీమా రెడీ. -
గోంగూరతో చికెన్, మటన్.. అద్భుతః అనాల్సిందే
ఆవకాయ తరువాత తెలుగువారు అధికంగా ఇష్టపడే గోంగూరను ఏ కూరలో వేసి వండినారుచి అమోఘంగా ఉంటుంది. ఘాటు మసాలాలతో ఘుమఘుమలాడే మాంసాహారాన్ని పుల్లని గోంగూరతో వండితే అద్భుతః అనాల్సిందే. గోంగూర చికెన్ ఫ్రై కావలసినవి: గోంగూర – రెండు కట్టలు. పెద్ద ఉల్లిపాయ – ఒకటి సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిరపకాయలు – ఐదు, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర – అరటీస్పూను, గరం మసాలా – అర టీస్పూను, ఆయిల్ – నాలుగు టీస్పూన్లు, నెయ్యి – టేబుల్ స్పూను. మ్యారినేషన్ కోసం.. చికెన్ – అరకేజీ, నిమ్మరసం – అర టీస్పూను, కారం – టీ స్పూను, ధనియాల పొడి – అర టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు – టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ. ► ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ కలిపి అరగంటపాటు నానబెట్టాలి. ► స్టవ్ మీద పాన్ పెట్టి టీ స్పూను ఆయిల్ వేసి గోంగూరను వేసి వేయించి, చల్లారనివ్వాలి. ► తరువాత వేయించిన గోంగూర, పచ్చిమిరపకాయలను మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ► నానబెట్టిన చికెన్ మిశ్రమాన్ని మూతపెట్టి మీడియం మంట మీద పదినిమిషాలు ఉడకనివ్వాలి. ► మధ్యలో కలుపుతూ చికెన్‌లో వచ్చిన నీళ్లు మొత్తం ఇగిరిపోయేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి నెయ్యి, మూడు స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లి తరుగు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. ► ఇవి వేగాక ఉడికిన చికెన్, గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ► ఇప్పుడు గోంగూర పేస్టు వేసి చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అవసరమైతే మరికాస్త వేసుకుని, ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్‌ను వేయిస్తే గోంగూర చికెన్‌ఫ్రై రెడీ. గోంగూర మటన్ కర్రీ కావలసినవి: మటన్ – అరకేజి, పసుపు – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్టు – టీ స్పూను, పెద్ద ఉల్లిపాయ – ఒకటి, ఆయిల్ – ఆరు టీ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, కారం – మూడు టీ స్పూన్లు, ధనియాల పొడి – టీ స్పూను, జీలకర్ర పొడి – అర టీ స్పూను, పచ్చిమిరపకాయలు – ఐదు, గోంగూర – మీడియం సైజు ఐదు కట్టలు, కొత్తిమీర – చిన్న కట్ట ఒకటి, గరం మసాలా పొడి – టీ స్పూను, షాజీరా – టీ స్పూను, యాలకులు – రెండు, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క. తయారీ: ► మటన్‌ను శుభ్రంగా కడిగి కుకర్‌లో వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అరకప్పు నీళ్లు పోసి ఒకసారి అన్నీ కలిపి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ► స్టవ్ మీద పాన్ పెట్టి ఆరు టీస్పూన్ల ఆయిల్ వేసి దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ► కొద్దిగా ఉప్పువేసి గోల్డెన్ బ్రౌన్ రంగు మారేంత వరకు వేయించాలి. ► తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మంచి వాసన వచ్చేంతరకు వేయించాక, పసుపు, పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ► ఇప్పుడు ఉడికిన మటన్ వేసి ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని గరం మసాలా, తరిగిన కొత్తి మీర వేసి 10 నిమిషాలు ఉడికిస్తే గోంగూర మటన్ కర్రీ రెడీ. గోంగూర పచ్చి రొయ్యల ఇగురు కావలసినవి: పచ్చిరొయ్యలు – అరకేజి, గోంగూర – మూడు కట్టలు, పెద్ద ఉల్లిపాయలు – రెండు, ఎండు మిరపకాయలు – పన్నెండు, పచ్చిమిరపకాయలు – మూడు, వెల్లుల్లి తరుగు – రెండు టీ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, జీలకర్ర – టీస్పూను, పసుపు – అర టీస్పూను, ఆయిల్ – నాలుగు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ► ముందుగా గోంగూరను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి దోరగా వేయించి పేస్టులా చేసి పక్కన బెట్టుకోవాలి. ► రెండు పెద్ద ఉల్లిపాయలు, జీలకర్ర, పది ఎండు మిరపకాయలను మిక్సీజార్‌లో వేసి పేస్టు చేసి పెట్టుకోవాలి. ► స్టవ్ మీద పాన్ పెట్టుకుని నాలుగు టీస్పూన్ల ఆయిల్ వేసి కాగాక ఆవాలు వేయాలి. ► ఆవాలు వేగాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. ► ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు వేసి ఐదు నిమిషాలు వేగనిచ్చి, తరువాత కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేయాలి. ► రొయ్యలు వేసిన ఐదు నిమిషాల తరువాత రుచికి సరిపడా ఉప్పువేసి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తరువాత గోంగూర పేస్టు వేసి బాగా కలపాలి. ► అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే గోంగూర పచ్చిరొయ్యల ఇగురు రెడీ. -
2 యూట్యూబ్ చానెళ్లు.. 2 కోట్ల మంది అభిమానులు
నిరుపేద కుటుంబం.. పెద్దగా చదువుకోలేదు. పెళ్లై పిల్లలతో గృహిణిగా స్థిరపడిపోయింది. మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించాలనుకుంది. కానీ పిల్లల చదువులు గుర్తొచ్చాయి. దీంతో తనకు వచ్చిన వంటలను వంట రాని వారికి నేర్పిస్తూ రెండు కోట్లమందికి పైగా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది పూనమ్ దేవనాని. రెండు యూ ట్యూబ్ చానళ్లతో చిన్నచిన్న చిట్కాలతో వంటలు ఎలా చేయాలో కోట్ల మందికి నేర్పిస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పర్చుకుంది పూనమ్. మధ్యప్రదేశ్‌లోని నిరుపేద కుటుంబంలో పుట్టిన పూనమ్ దేవనానికి అమ్మన్నా... ఆమె చేసే వంటకాలన్నా ఎంతో ఇష్టం. దీంతో చిన్నప్పటి నుంచి అమ్మతోనే ఎక్కువ సమయాన్ని గడిపేది. పూనమ్‌కి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. దీంతో అమ్మ చెప్పినట్లు వింటూ బుద్ధిగా చదువుకునేది. ఏ మాత్రం ఖాళీ దొరికినా వంటింట్లో అమ్మ చేసే వంటలను గమనించేది. ఆమె వంటలను ఎలా చేస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి పూనమ్‌కు బాగా ఉండేది. ఈ క్రమంలోనే ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకరోజు న్యూస్ పేపర్లో వచ్చిన వంటకం చూసి దానిలో ఉన్నట్లుగానే చేసింది. ఆ వంటకం బాగా రావడంతో ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క కిచెన్‌లో రకరకాల వంటల ప్రయోగాలు చేస్తుండేది. కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడం, దానికితోడు మంచి సంబంధం రావడంతో బిఏ చదువుతుండగానే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సి వచ్చింది. అందరు గృహిణుల్లాగే సంసారాన్ని చూసుకునేది. తొలి ఆదాయం... పూనమ్‌కి ఇంటి పనులన్నీ అయ్యాక చదువుకోవాలనిపించేది. కానీ పిల్లల చదువులకే ఆదాయం సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చదువుకోగలనా అనిపించింది తనకు. ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంది. కానీ చేతిలో కనీసం డిగ్రీ సర్టిఫికెట్ కూడా లేదు! ఎలా సంపాదిస్తాను? అనుకుంది. అప్పుడే పూనమ్‌కు ‘నాకు వంట చేయడం వచ్చు కదా దానిని నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు..?’ అనే ఆలోచన వచ్చింది. దాంతో 2004లో కాలనీలో ఖాళీగా ఉన్న కొందరు అమ్మాయిలకు వంటలు ఎలా చేయాలో నేర్పించడం మొదలు పెట్టింది. ఆమె వంటలు నేర్పించే విధానం నచ్చడంతో పూనమ్ దగ్గర వంట చేయడం నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. తన స్టూడెంట్స్‌కు వంటల గురించి మరింతగా వివరించేందుకు వివిధ రకాల పుస్తకాలు చదివి మరీ వారడిగే సందేహాలకు సమాధానాలు చెప్పేది. ఇలా రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వంటల క్లాసులు చెబుతూ.. సాయంత్రం పెళ్లిళ్లు, పార్టీలలో ఇచ్చే గిఫ్టులను ప్యాకింగ్ చేసేది. అవి అందరికీ నచ్చడంతో ఆమె ఆ పనిని మరింత క్రియేటివ్‌గా చేసేది. పూనమ్ వంటల క్లాసులు బాగా పాపులర్ అవడంతో ఆమెని వంటల కార్యక్రమాల్లో జడ్జిగా పిలిచేవారు. తన డిగ్రీ సగంలో ఆగిపోయిన కాలేజీకి వంటల క్లాసులు చెప్పడానికి వెళ్లడం విశేషం. అక్కడ కాలేజీ యాజమాన్యం ఇచ్చిన పారితోషికాన్నే పూనమ్ తొలి ఆదాయంగా అందుకొంది. మసాలా కిచెన్... 2004లో ప్రారంభమైన పూనమ్ వంటల జర్నీ సాఫీగా సాగుతూ వచ్చినా, గంటల తరబడి నిలబడి క్లాసులు చెబుతుండడంతో కాళ్లు వాచి, నొప్పులు రావడం మొదలైంది. దీనికితోడు జార్ఖండ్, ముంబై, నోయిడా, ఢిల్లీ, భోపాల్ వంటి ప్రాంతాల నుంచి కూడా తమకు క్లాసులు చెప్పమని అడిగేవారి సంఖ్య పెరుగుతుండడంతో ఇలా లాభం లేదని ‘మసాలా కిచెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఆన్లైన్ క్లాసులు చెప్పడం మొదలు పెట్టింది. అయితే చాలా కాలం పాటు ఆ చానల్‌కు ఆదాయం ఏమీ రాలేదు. అయినా నిరాశ చెందలేదు. వీడియోలు చేయడం మానలేదు. ఓసారి పూనమ్ అప్లోడ్ చేసిన ‘బ్రెడ్‌తో కేక్ తయారీ’ వీడియో బాగా పాపులర్ అవడంతో అప్పటి నుంచి యూ ట్యూబ్ ఆదాయం రావడం మొదలైంది. ప్రస్తుతం మసాలా కిచెన్‌కు దాదాపు మూడు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మా ఏ కైసే కర్నా? చాలామందికి బయట తినే అలవాటు కావడం లాక్డౌన్ సమయంలో బయట ఏమీ దొరకకపోవడంతో.. చాలామంది ఇంట్లోనే రకరకాల వంటకాలు చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ఈ క్రమంలో వంటరాని బ్యాచిలర్స్, కొత్తగా పెళ్లయిన వారు... ‘అమ్మా ఇది ఎలా చేయాలి? అది ఎలా చేయాలి?’ అని అడిగే ప్రశ్నలు ఎక్కువగా వినిపించేవి పూనమ్‌కు. దీంతో వీళ్లందరి ప్రశ్నలకు జవాబులు చెప్పేలా ‘మా ఏ కైసే కర్నా’ పేరుతో వంటలకు సంబంధించి మరో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి.. సులభమైన కిచెన్ టిప్స్ చెప్పడం మొదలు పెట్టింది.. ఈ చానల్‌కు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ చానల్‌కు కోటీ ముప్ఫై లక్షలకుపైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. -
వంటల్లో వాడే ఈ పూల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
అరటిపువ్వు, కాలీఫ్లవర్ వంటి వాటిని మనం ఎప్పటి నుంచో వంటల్లో ఉపయోగిస్తున్నాం. కుంకుమపువ్వునూ అనాదిగా పాలతో గర్భిణులచే తాగించడమూ మన సంస్కృతిలో భాగమే. ఇప్పుడు బ్రోకలీ వంటి విదేశీ పూలూ మన వంటల్లో భాగమయ్యాయి. ఇటీవల తామరపూలనూ ఆరోగ్యం కోసం మనం ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. ఇక మందారపూలతో టీ తాగడమూ చూస్తున్నాం. ఆయా పూలతో మనకు సమకూరే పోషకాలూ, ఒనగూరే (ఆరోగ్య) ప్రయోజనాలను తెలుసుకుందాం. కాలీఫ్లవర్ గోబీ పువ్వు అని తెలుగులో, ఫూల్ గోబీ అని హిందీలో పిలిచే ఈ పువ్వును మనం ఎప్పటినుంచో వంటలో కూరగానూ, కాలీఫ్లవర్ పకోడీ రూపంలో శ్నాక్స్గానూ తింటూనే ఉన్నాం. ఇది క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. ముఖ్యంగా కాలీఫ్లవర్‌లో సల్ఫోరఫేన్ అనే ఫైటో కెమికల్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. కాలీఫ్లవర్‌లోని ఇండోల్–3–కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కాలిఫ్లవర్ తినేవారిలో అది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఇక ముందు చెప్పుకున్న సల్ఫోరఫేన్ పోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కొంతమేర తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తెలిసివచ్చింది. అప్పటినుంచి ఈ విషయమై మరికొన్ని పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అరటిపువ్వు ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిపువ్వుతో ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూరలను వండి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఉదాహరణకు... అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులోని ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వులోని పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్... క్యాన్సర్ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్‌ని నివారిస్తాయి. రక్తంలోని చెక్కెరను నియంత్రించడం ద్వారా డయాబెటిస్‌ను నివారిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనత అనీమియాను అరికడుతుంది. అరటిపువ్వుల కూర తినడం మహిళల ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. ఉదాహరణకు రుతు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, కడుపునొప్పి వంటి అనేక సమస్యలు కనిపించే పీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) తగ్గిపోతుంది. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల యాంగై్జటీ తగ్గి, మంచి మూడ్స్ సమకూరుతాయి. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో (బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌లో) పాలు బాగా ఊరేలా తోడ్పడుతుంది. కుంకుమపువ్వు మనమెంతోకాలంగా కుంకుమపువ్వును ఓ సుగంధద్రవ్యంగా వాడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషమయే. జఫ్రానీ బిర్యానీ అంటూ బిర్యానీ తయారీలోనూ, కశ్మీరీ పులావ్ వంటి వంటకాల్లోనూ కుంకుమపువ్వును ఉపయోగిస్తుంటాం. మంచి మేనిఛాయతో పండండి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఆ మాటలో ఎంత వాస్తవం ఉందన్న సంగతి పక్కన పెడితే అనాదిగా అదో సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఇందులో బీ–కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. అయితే ఎక్కువ మోతాదులో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఎందుకంటే ఇదో నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశమూ ఉంది. అందుకే చిటికెడంటే చిటికెడే వాడాలి. తామరపువ్వులు(కమలం పువ్వులు) తామరపూలతో చాలా మంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే తూర్పు ఆసియా ఖండంలో అనేక మంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. తామరపూలలో విటమిన్ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి అన్నది స్వాభావికమైన యాంటీ ఆక్సిడెంట్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఇది క్యాన్సర్లతో పోరాడుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్–సి రోగనిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా పనిచేస్తాయి. గులాబీ మనదేశంలో గులాబీరేకులతో స్వీట్పాన్లోని తీపినిచ్చే గుల్ఖండ్ తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. ఇది మినహా మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులో ఫీనాలిక్స్ అనే పోషకాలు ఉన్నాయి. అవి గాయపు మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం చాలా మంచిది. ఇది గుండెజబ్బు ముప్పునూ, క్యాన్సర్, డయాబెటిస్‌నూ రిస్క్‌ను తగ్గిస్తుంది. దీన్ని చాలా పరిమితంగా టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్‌గా ఉపయోగించడమే మంచిది. బ్రకోలీ / బ్రోకలీ బ్రకోలీ అనేది ఓ ఇటాలియన్ పేరు. ఇటాలియన్ భాషలో ‘బ్రొకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్ క్రెస్ట్ ఆఫ్ క్యాబేజీ) అని అర్థం. గతంలో క్యాలీఫ్లవర్లా అంత విస్తృతంగా దొరకకపోయినా... ఇప్పుడు మన భారతీయ నగర మార్కెట్లలోనూ విరివిగానే దొరుకుతోంది. ఇందులో విటమిన్ ఏ పాళ్లు చాలా ఎక్కువ. మేని నిగారింపుకూ, మంచి దృష్టికి ‘విటమిన్–ఏ’ దోహదపడుతుంది. ఇందులోని పోషకాలు దేహంలో పేరుకుపోయిన విషాలను తొలగించే ‘డీ–టాక్సిఫైయర్స్’గా ఉపయోగపడతాయి. మందారపువ్వు చాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగుతారు. మందారపువ్వు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. శరీర జీవక్రియలను క్రమబద్ధం చేస్తుంది. ఇందులో విటమిన్–సితో పాటు అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి కాలేయ క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి. మందారపూలతో కాచిన టీ వల్ల రక్తపోటు, యాంగై్జటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ చాయ్‌ను పరిమితంగా తాగితేనే మేలు. ఇదే కాదు అన్ని రకాల టీలనూ పరిమితంగా తాగడమే మంచిది. -
బిహారీ ఫిష్ కర్రీ.. రుచి మాములుగా ఉండదు
కావలసినవి: రవ్వ చేపముక్కలు–ఆరు; పసుపు–మూడు టేబుల్ స్పూన్లు; కారం–రెండు టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు–పది; పచ్చిమిరపకాయలు–రెండు; ఆవాలు– టీ స్పూను; మిరియాలు–టీ స్పూను; మెంతులు–టీ స్పూను; జీలకర్ర– టీ స్పూను; టమోటా తరుగు–అరకప్పు; ఆవ నూనె–రెండు టేబుల్ స్పూన్లు; బిర్యానీ ఆకులు–రెండు; గరం మసాల–టీ స్పూను; ధనియాలు–రెండు టీ స్పూన్లు; ఎండు మిరపకాయలు–నాలుగు; ఆయిల్ –మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు–గార్నిష్‌కు సరిపడా. తయారీ: ►ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి దానిలో రెండు టీ స్పూన్ల ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి ►వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయలు, పసుపు, టమోటా తరుగు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్టు చేయాలి ►స్టవ్‌పై ప్యాన్ పెట్టి ఆవనూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగాక నానబెట్టిన చేపముక్కలను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టాలి ► చేపముక్కలు వేగిన ప్యాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక.. బిర్యానీ ఆకులు వేసి వేగనిచ్చి, తరువాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాల పేస్టు రుచికి సరపడా ఉప్పువేసి వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలాక వేయించి పెట్టుకున్న చేపముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి పదినిమిషాలపాటు ఉడికించాలి ►పదినిమిషాల తరువాత గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే బిహారీ ఫిష్ కర్రీ రెడీ. వేడివేడి కూర మీద కాస్త కొత్తిమీర తరుగు చల్లి వడ్డిస్తే బిహారీ ఫిష్ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. -
కోటి మంది సబ్స్క్రైబర్లతో రికార్డు సృష్టించిన కుకింగ్ చానెల్
యూట్యూబ్.. వినోదానికే కాక ఉపాధికి నయా అడ్డాగా నిలుస్తుంది. పేరుతో పాటు డబ్బులు సంపాదించుకోవాలనుకునే వారి మొదటి ప్రాధాన్యం యూట్యూబ్‌గా మారింది. ఒక్కసారి క్లిక్ అయితే చాలు.. సబ్స్క్రైబర్లు.. వ్యూస్.. ఆదాయం వాటంతట అవే వస్తాయి. ఇక యూట్యూబ్‌లో చానెల్ ప్రారంభించడానికి గొప్ప గొప్ప డిగ్రీలు అక్కర్లేదు.. మనలో టాలెంట్ చాలు. ఈ వ్యాఖ్యలను నిజం చేశారు తమిళనాడుకు చెందిన రైతులు. వారు ప్రారంభించిన కుకింగ్ వీడియో చానెల్ నేడు కోటి మంది సబ్స్క్రైబర్లతో రికార్డు సృష్టించింది. ఆ వివరాలు.. చెన్నై: తమిళనాడుకు చెందిన విలేజ్ కుకింగ్ చానెల్ గత మూడేళ్లుగా తెగ ఫేమస్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా సదరు చానెల్ ఓ రికార్డు సృష్టించింది. తమిళనాడులో మొదటి సారి కోటి మంది సబ్స్క్రైబర్లను సంపాదించిన చానెల్‌గా గుర్తింపు పొందింది. ఆ వివరాలు.. తమిళనాడు పుడుక్కొట్టై జిల్లా చిన్న వీరమంగళం గ్రామానికి చెందిన ఎం పెరియతంబి అనే వృద్ధుడు గతంలో వంట మాస్టర్‌గా పని చేసేవారు. ఈ క్రమంలో పెరియతంబి, ఆయన మనవలు కలిసి కొన్నెళ్ల క్రితం యూట్యూబ్‌లో ‘‘విలేజ్ కుకింగ్’’ పేరిట ఓ చానెల్ ప్రారంభించారు. పెరియతంబి చేత సంప్రదాయ వంటలు చేయించి.. ఆ వీడియోలని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. ఇక వీరు చేసే వంట కూడా మాములగా ఉండదు. 200-300 వందల మందికి సరిపడేలా భారీ వంట చేస్తారు. వీడియో పోస్ట్ చేసిన తర్వాత తాము వండిన పదార్థాలను సమీపంలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రామల్లో వారికి పెడతారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వీరిని కలిశారు. వీరితో పాటు వంట చేసి.. అక్కడే కూర్చోని భోజనం కూడా చేశారు. దాంతో ఈ చానెల్ పేరు దేశవ్యాప్తంగా అందరికి తెలిసింది. అప్పటివరకు వారానికి 10 వేలుగా ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య రాహుల్ గాంధీ వీరి వీడియోలో కనిపించిన తర్వాత 40-50 వేలకు పెరిగింది. ఇక రాహుల్ గాంధీ కనిపించిన వీడియో ఏకంగా 26 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. తాజాగా సబ్స్క్రైబర్ల సంఖ్య కోటికి చేరడంతో యూట్యూబ్ నుంచి వీరికి డైమండ్ ప్లే బటన్ లభించింది. దీని అన్బాక్సింగ్ సందర్భంగా ఈ యూట్యూబర్స్ మాట్లాడుతూ.. ‘‘మాకు కేవలం ఆరు నెలలు మాత్రమే వ్యవసాయ పని ఉండేది. మిగతా ఆరు నెలలు ఖాళీగా ఉండే వాళ్లం. దాంతో ఇలా కుకింగ్ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాలని భావించాం. కానీ మా చానెల్ ఇంత పాపులర్ అవుతుందని మేం కలలో కూడా అనుకోలేదు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక వీరు యూట్యూబ్ వ్యూస్ ద్వారా నెలకు 7 లక్షల రూపాయల యాడ్ రెవిన్యూ సంపాదిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వీరు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ని సీఎంపీఆర్ఎఫ్ నిధికి 10 లక్షల రూపాయల చెక్ అందచేశారు. -
బ్యాంగ్ బ్యాంగ్.. ఎలా తయారు చేయాలంటే?
కావలసినవి: బేబీ పొటాటోస్ – పావు కేజీ; ఉప్పు – తగినంత; పంచదార – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); పసుపు – అర టీ స్పూను; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – మూడు; వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ: ► బేబీ పొటాటోస్‌ను శుభ్రంగా కడిగి ఉడికించి, చల్లారాక తొక్క తీయాలి ► ఒక పాత్రలో ఉప్పు, పంచదార, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ► బంగాళ దుంపలను అందులో వేసి దొర్లించాలి ► స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పచ్చి మిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి ► బేబీ పొటాటోలు జత చేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ► బేబీ పొటాటోస్ బంగారు రంగులోకి మారగానే దింపేయాలి. -
భార్య కోసం వంట చేసిన నిహారిక భర్త
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం నిహారిక-చైతన్య తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. భర్తతో గడిపిన ప్రత్యేక క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. అలాగే ఫన్నీ వీడియోలు, కొత్తరకం వంటకాల వీడియోaను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. అయితే ఈసారి నిహారిక కోసం ఆమె భర్త చైతన్య వంటగదిలోకి దూరిపోయాడు. భార్య కోసం చోరిజో స్పానిష్ రైస్ అనే డిష్‌ను స్వయంగా తన చేత్తో వండి తినిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక తేడాది డిసెంబర్9న నిహారిక-చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఇక పెళ్లి తర్వాత వృత్తిపరంగానూ ఫోకస్ పెట్టిన నిహారిక ఇప్పటికే ఓ వెబ్‌సిరీస్‌కు సైన్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి :నిహారిక పోస్ట్‌పై భర్త షాకింగ్ కామెంట్స్ ! నిహారిక కాలికి గాయం..సేవలు చేస్తున్న చైతన్య -
కుకింగ్ క్వీన్ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్..
పిల్లల చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో స్థిరపడగానే పెళ్లి చేసి కోడళ్లకు కిచెన్ బాధ్యత లు అప్పజెప్పి మనవళ్లు మనవరాండ్రతో ఆడుకోవాలనుకుంటారు మన భారతీయ సంప్రదాయ మహిళలు. కానీ నిషా మధులిక మాత్రం అలా అనుకోలేదు. జీవితంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్‌ను ప్రారంభించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించారు. దాంతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గానే గాక ..‘‘పాపులర్ ఇండియన్ వెజిటేరియన్, యూట్యూబ్ చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్, ఫుడ్ బ్లాగర్, టెలివిజన్ పర్సనాలిటీ’’ వంటి అనేక సెలబ్రిటీ హోదాలను సొంతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన నిషాకి ఢిల్లీకి చెందిన ఎంఎస్ గుప్తాతో వివాహం జరిగింది. ఢిల్లీకి వచ్చేసిన నిషాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల పెంపకంలోనూ, మరోపక్క భర్త వ్యాపారంలో సాయం చేస్తూ బిజీగా ఉండేవారు. పిల్లలు చదువులు పూరై తమ ఉద్యోగాలతో బిజీ అయిపోయారు. దీంతో అప్పటిదాకా తీరిక లేకుండా గడిపిన నిషాకి ఒక్కసారిగా తీరిక ఏర్పడడంతో తనని తాను బిజీగా ఉంచుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తన కొడుకు బ్లాగ్‌కు రాస్తుండడం చూసి.. తనకు బాగా అనుభవమున్న కుకింగ్‌ను బ్లాగ్స్లో రాయాలనుకున్నారు. కొడుకు సాయంతో.. భర్త, కొడుకు సాయంతో.. నిషా 2007లో కుకింగ్ బ్లాగ్‌ను ప్రారంభించి దానిలో వంటల తయారీ గురించి రాసేవారు. తర్వాత తనే సొంత వెబ్సైట్ https:/nishamadhulika.com లో తన తల్లి దగ్గర నేర్చుకున్న విభిన్న వంటకాలు వండుతూ అవి ఎలా వండాలో రాసి పోస్టులు పెట్టేవారు. నిషా వంటలను ఇష్టపడిన అభిమానులు ‘‘వీడియోలు పెట్టండి మేడం’’ అని అడగడంతో.. వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటిదాకా 1300 కుపైగా వంటల వీడియోలను అప్లోడ్ చేశారు. సిసలైన శాకాహార వంటలు మధులిక కుటుంబం 2009 లో నోయిడాకు మకాం మార్చింది. అప్పుడే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. శాకాహార వంటకాలకు ప్రాధాన్యత నిచ్చిన నిషా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాల వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వీడియోలు మిలియన్ల మందిని ఆకర్షించేవి. ప్రస్తుతం నిషా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోటీ పదిహేను లక్షలకు పైనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఐదుగురితో టీం .. యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయం వస్తుండడంతో.. మంచి కిచెన్‌ను సెటప్ చేసి, ఐదుగురితో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్ రెండుమూడు వంటల వీడియోలు తీసి.. తరువాత ఛానల్లో అప్లోడ్ అయిన వంటకాలకు వచ్చే కామెంట్లు, అభిప్రాయాలను సమీక్షిస్తూ లోపాలను ఎలా సరిదిద్దాలో చూసుకునేది. టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబర్.. మొదట్లో బ్లాగ్స్, వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు ఇది వ్యాపారంగా చూడని నిషా.. తనకు తెలిసిన అనేక వంటకాలను హిందీలో అప్లోడ్ చేసేవారు. తరువాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో ఉన్న తన ఫాలోవర్స్ తమ భాషల్లో వీడియోలు అప్లోడ్ చేయమని అడగగా వాళ్ల భాషల్లో వంటల వీడియోలు, సబ్‌టైటిల్స్‌తో పోస్టు చేసేవారు. అంతేగాక పలు వెబ్సైట్లకు వంటల ఆర్టికల్స్ రాసిచ్చేవారు. దీంతో సబ్స్క్రైబర్స్తోపాటు, ఆదాయం పెరిగింది. ఈ క్రమంలో ఆమె 2014లో యూట్యూబ్ చెఫ్స్ టైటిల్, 2017లో టాప్ యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ అవార్డులు అందుకున్నారు. ఇండియన్ టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబ్ స్టార్స్ జాబితాలో.. రెండుసార్లు నిషా స్థానం దక్కించుకున్నారు. అంతేగాక ప్రముఖ మ్యాగజీన్లు బ్లూమ్‌బర్గ్, ఎకనామిస్ట్, ఇండియా టుడే వంటివి ఆమె సక్సెస్ స్టోరీని ప్రచురిస్తూ ‘కుకింగ్ క్వీన్’గా అభివర్ణించాయి. లోక్‌సభ టీవీ ఆమె ఇంటర్వ్యూనూ టెలికాస్ట్ చేయడం విశేషం. -
Helping Hands: మానవసేవే మాధవ సేవ!
ఒక్కసారి రిపోర్టులో.. ‘కరోనా పాజిటివ్’ వచ్చిందంటే ఆ వ్యక్తి హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి. వీరి దగ్గరకు వెళ్లాలన్న భయపడే రోజులివి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పాజిటివ్ పేషంట్లకు స్వయంగా వంటచేసి అందిస్తున్నారు పాట్నాకు చెందిన తల్లీకూతుళ్లు. పాట్నాలోని రాజేంద్రనగర్‌లో నివసిస్తోన్న కుందన్ దేవి తన కూతుర్లతో కలిసి కోవిడ్ పాజిటివ్ పేషంట్ల ఆకలి తీరుస్తున్నారు. కుందన్ దేవి పెద్దకూతురు 32 ఏళ్ల అనుపమ సింగ్ తల్లికి ఫుడ్ తయారీలో సాయం చేస్తుంటే.. చిన్నకూతురు 26 ఏళ్ల నీలిమ సింగ్ ఫుడ్ ప్యాకెట్లను కరోనా పేషంట్ల వద్దకు చేరుస్తోంది. ఇటీవలే కుందన్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ ఇబ్బందిని దగ్గర నుంచి గమనించిన తల్లీ కూతుళ్లు.. పాజిటివ్ వచ్చి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న పేషంట్లకు స్వయంగా వండి ఫుడ్ అందించాలనుకున్నారు. ఈ క్రమంలోనే నందన్ దేవి, అనుపమలు వంటచేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి నీలిమ సింగ్‌కు ఇస్తారు. నీలిమ రోజూ 15 కిలోమీటర్ల పరిధిలోని కోవిడ్ పేషంట్లకు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తోంది. దీని కోసం వీరు వివిధ అవసరాలకోసం దాచుకున్న డబ్బులను వాడుతుండడం విశేషం. ఎవరి సాయం లేకుండా వీరు ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. అయితే నందన్ దేవీ కూతుళ్ల సాయం గురించి తెలుసుకున్న చాలామంది వారికి సాయం చేయాలని ముందుకొచ్చినప్పటికీ వారు డబ్బు విరాళంగా ఇవ్వొద్దు! మీరు మాకు ఇవ్వాలనుకుంటున్న డబ్బులతో మీరే దగ్గర్లోని కరోనా పేషంట్లకు ఫుడ్ వండిపెట్టండి అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ‘‘మానవ సేవే మాధవ సేవ అన్నారు. సేవ చేయడం అంటే దేవుణ్ణి ఆరాధించడంతో సమానం. అందుకే కష్టాల్లో ఉన్నవారికి కాస్త మానవత్వంతో మేము చేయగలిగిన సాయం చేస్తున్నాం. కొన్నిసార్లు నా స్నేహితులు ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ చేయడంలో నాకు సాయం చేసేందుకు వస్తున్నారు. ఒకపక్క నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఫుడ్ ప్యాకెట్స్‌ను పేషంట్లకు అందిస్తున్నాను’’ అని నీలిమ చెప్పింది. -
క్యాన్సర్ల బారినపడకుండా ఇలా చేయండి!
మనం వంట వండే పద్ధతులతోనూ, వండే విధానంతోనూ క్యాన్సర్లను నివారించవచ్చు. నిజానికి మన జీవనశైలిలో మార్పులతో భాగంగా వండే పద్ధతుల్లోనూ మార్పుల వల్ల క్రమంగా క్యాన్సర్‌కు దారితీసే వంట ప్రక్రియలకు దగ్గరవుతున్నాం. ఉదాహరణకు మనం ఇటీవల మసాలాలు, వేపుళ్లు, బేకరీ ఐటమ్స్‌తో క్యాన్సర్లను ఆహ్వానిస్తున్నాం. మనం గుర్తుంచు కోవాల్సిన విషయం ఏమిటంటే... వంట విధానంలో... ప్రధానంగా వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, స్మోక్డ్ ఫుడ్, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు క్యాన్సర్‌కు దోహదం చేసే అంశాలని గుర్తించాలి. దీనికి భిన్నంగా చప్పిడిగా ఉండే ఆహారం (బ్లాండ్ డైట్), ఉడికించే ప్రక్రియతో వండేవి (బాయిల్డ్ డైట్), మసాలలు, ఉప్పు తగ్గించిన ఆహారం (నాన్ స్పైసీ) సాధారణ ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు క్యాన్సర్లనుంచి దూరంగా ఉంచుతాయని గ్రహించాలి. అందుకే మనం ఏం తింటున్నామన్నదే కాకుండా... ఎలా (వండి) తింటున్నామన్న అంశం కూడా క్యాన్సర్ నివారణకు దోహదపడుతుందని తెలుసుకోవాలి. -
నిమిషాల్లో వంటలు చేసే రోబో మెషిన్
ఎంతటి టెక్నాలజీ అయినా, ఎలాంటి సౌకర్యమైనా.. అందరికీ సులభంగా, సౌలభ్యంగా ఉండే మెషిన్స్‌కి ఓ రేంజ్లో డిమాండ్ ఉంటుంది. అలాంటి సత్తా ఉన్న మేకరే ఈ రోబో మెషిన్(ఆటోమెటిక్ డ్రమ్ కుకింగ్ మెషిన్). ఇది 360 డిగ్రీస్ గిర్రున తిరుగుతూ ఎలాంటి వంటకాన్నైనా నిమిషాల్లో చేసేస్తుంది. ఈ నాన్ స్టిక్ పాట్ రోబో కమర్షియల్ ఫ్రైయింగ్ కుకర్.. అడుగు భాగంలో రెండు కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. చిత్రాన్ని గమనించినట్లైతే.. ఇరువైపులా స్టాండ్‌కి పైభాగంలో అటాచ్ అయ్యి ఉంటుంది. నాన్ వెజ్, వెజ్ అని తేడా లేకుండా అన్నింటినీ చాలా టేస్టీగా వండేస్తుంది ఈ గాడ్జెట్. 85 డిగ్రీల నుంచి 230 డిగ్రీల వరకూ 7 లెవల్స్‌లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. ఈ ఇంటెలిజెంట్ రోలింగ్ మెషిన్ ప్రత్యేకమైన పాత్ర(నాన్ స్టిక్ డ్రమ్) కలిగి ఉంటుంది. దాన్ని మేకర్ నుంచి సులభంగా వేరు చేసుకుని.. క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన మూత ఉంటుంది. దాంతో 360 డిగ్రీస్ తిరిగినా దీనిలోని ఆహారం సురక్షితంగా ఉంటుంది. మూతకు పైభాగంలో యాంటీ-స్కాల్డింగ్ హ్యాండిల్ ఉంటుంది. దాని పక్కనే ఎయిర్ వాల్వ్ ఉండటం వల్ల ఇందులో వంట వేగంగా కుక్ అవుతుంది. చదవండి: ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా -
బాయ్‌ఫ్రెండ్ కోసం వంట చేసిన హీరోయిన్ శ్రుతీహాసన్
-
బాయ్‌ఫ్రెండ్ కోసం వంట చేసిన శ్రుతీహాసన్.. పాపం
గత కొద్ది రోజులుగా హీరోయిన్ శ్రుతీ హాసన్, డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే శ్రుతీ, శంతనుతో కలిసి డేట్‌కు వెళ్లడం.. సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు పోస్టులు పెడుతూ.. తమ లవ్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రపంచానికి వెల్లడించడం వంటివి చేస్నుత్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రుతీ హాసన్ బాయ్‌ఫ్రెండ్ కోసం స్వయంగా వంట చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక బాయ్‌ఫ్రెండ్ కోసం శ్రుతి హాసన్ పైనాపిల్‌తో ఓ ప్రత్యేక వంటకాన్ని తయారు చేయాలని భావించింది. కానీ వంట చేసే సమయంలో ఏమరపాటుగా ఉండటంతో అవి కాస్త మాడిపోయాయి. ఇక శ్రుతీ చేసిన వంట చూసి ఆమె బాయ్‌ఫ్రెండ్ ‘‘ఇది వెస్టెడ్ పైనాపిలా లేక రోస్టెడ్ పైనాపిలా’’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. శంతను హజారికా గువహతికి చెందిన వ్యక్తి. అతను రాపర్, ఇలస్ట్రేటర్, డూడుల్ ఆర్టిస్ట్. త్వరలో విడుదల కానున్న మ్యూజిక్ వీడియో కోసం శ్రుతి హాసన్‌తో కలిసి పని చేసినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో శంతను వెల్లడించాడు. అంతేకాక కొద్ది రోజుల క్రితం శ్రుతి హాసన్, శంతను హజారికా చెన్నైని సందర్శించారు. అక్కడ ఆమె స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ జంట శ్రుతి తండ్రి కమల్ హాసన్‌ను కూడా అతని ఇంట్లో కలుసుకున్నారు. చదవండి: మళ్లీ ప్రేమలో శృతి.. అతడే బాయ్‌ఫ్రెండ్! -
వంటల డాక్టర్.. యోగమ్బాళ్ సుందర్
లంచ్ బాక్సులో రోజుకో రకం పెట్టాలి. ఎన్ని రకాలని వండను? ఈ గృహిణికి పరిష్కారం యోగమ్బాళ్ చానెల్లో దొరుకుతుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఏమేమి తినాలి? ఏం తినాలో డాక్టర్ చెబుతుంది... ఎలా వండాలో యోగమ్బాళ్ చెబుతుంది. యోగమ్బాళ్ సుందర్... సెలబ్రిటీ షెఫ్. అంటే ఆమె సెలబ్రిటీల షెఫ్ కాదు, చక్కగా వండుతూ సెలబ్రిటీ అయ్యారు. రెండేళ్ల కిందట మొదలైన ఆమె సొంత యూ ట్యూబ్ చానెల్‌కు ఈ రోజు మూడు లక్షల ఎనభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్లున్నారు. వాళ్లు ఆమె కొత్తగా విడుదల చేసే వంట కోసం ఎదురు చూస్తుంటారు. మరికొందరు కామెంట్ బాక్సులో తమ ఆరోగ్య సమస్యను తెలియచేస్తూ ఏం తినాలో, ఎలా వండాలో చెప్పమని అడుగుతుంటారు. గర్భిణిగా ఉన్నప్పుడు ఏం తినాలో, ఎలా వండాలో చేసి చూపిస్తారామె. అలాగే పాలిచ్చే తల్లి తినాల్సిన ఆహారాన్ని కూడా చెప్తారు, చేసి చూపిస్తారు. సాధారణంగా పాలిచ్చే తల్లి అనగానే పాలు సమృద్ధిగా ఉండడానికి తగిన ఆహారం మీదనే దృష్టి పెడతారు. కానీ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ దేహం తిరిగి శక్తి పుంజుకోవడం మీద ఇంట్లో వాళ్లు కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. యోగమ్బాళ్ అందుకు కూడా వంటలను సూచిచస్తారు. దీంతో ఒకప్పుడు ఆమెను తమిళ టీవీలో వంటల ప్రోగ్రామ్‌లో చూసి ‘తెర నిండుగా’ అని పరిహసించిన వాళ్లు కూడా ఆమె వంటల చానెల్‌కు అభిమానులయ్యారు. బాడీ షేమింగ్‌ను తట్టుకుని నిలబడడం కష్టమైనందని, అందుకు తగిన మానసిక స్థిరత్వాన్ని సాధించడానికి ఎంతగానో ప్రయాసపడినట్లు చెప్పారు యోగమ్బాళ్. తననీ రోజు సెలబ్రిటీగా నిలబెట్టింది నాలుగు వందల రకాలు వండగలిగిన పాకనైపుణ్యం కంటే షేమింగ్‌ను తట్టుకోగలిగిన మానసిక స్థయిర్యమేనన్నారామె. యాభై ఐదేళ్లకు కొత్త మలుపు యోగమ్బాళ్ సొంతూరు తమిళనాడులోని తిరువన్మియూర్. తండ్రి న్యూస్ పేపర్ ఏజెంట్, తల్లి గృహిణి. స్కూలు, సంగీతం ఈ రెండే ఆమె బాల్యంలో ఉన్నవి. సంగీత ప్రముఖుల దగ్గర వీణాగానంలో శిక్షణ తీసుకున్నది. ఆ శిక్షణ అలాగే కొనసాగి ఉంటే ఆమె సంగీతంలో సెలబ్రిటీ అయ్యేవారేమో. పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేశారు, భర్త ఉద్యోగం ముంబయిలో కావడంతో ఆమె జీవితం గొప్ప మలుపు తీసుకోవడంలో తడబడింది. భర్త భోజన ప్రియుడు కావడంతో రకరకాల ప్రయోగాలతో ఆమె జీవితం వంటగది కే అంకితమైపోయింది. దక్షిణాది, ఉత్తరాది వంటల్లో చెయ్యి తిరిగింది. ఒంటిచేత్తో అరవై మందికి వండగలిగే నైపుణ్యం సాధించింది యోగమ్బాళ్. భర్తకు ఇష్టమైన వంటను, తనకు ఇష్టమైన వీణసాధననూ కొనసాగిస్తూ వచ్చింది. హటాత్తుగా భర్త కాలం చేశాడు. జీవితం ఊహించని స్తబ్ధత. విపరీతమైన శూన్యత. ఆ శూన్యతను ఏదో ఒక వ్యాపకంతో భర్తీ చేయడానికి యోగమ్బాళ్ చెల్లెలు ఓ ప్రయత్నం చేసింది. అలా యోగమ్బాళ్ 2017లో టీవీలో వంటల ప్రోగ్రామ్‌లో కనిపించింది. రుచి రాగం ‘‘నా దేహాకృతిని చూసి హేళన చేసినప్పుడు కలిగిన ఆవేదనను మాటల్లో చెప్పలేను. సంగీత సాధనతో బాధను మరిచిపోదామన్నా కూడా సాధ్యమయ్యేది కాదు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. నా పిల్లలు ఓ సలహా ఇచ్చారు. టీవీలో వండడానికి కొన్ని పరిమితులుంటాయి. ఆ ప్రోగ్రామ్ రూపకర్తలు నిర్దేశించినట్లు వండాల్సి ఉంటుంది. ఆ టీవీ వీక్షకులు మాత్రమే నీ వంటల ప్రోగ్రామ్‌ను చూస్తారు. అలా కాకుండా నువ్వే సొంత వంటల చానెల్లో వంటల కాన్సెప్ట్‌ను నీకు నచ్చినట్లు, వీక్షకులకు ప్రయోజనం ఉండేటట్లు రూపొందించుకోవచ్చు. నీ వంటలను ఇష్టపడే వాళ్లే నీ చానెల్ చూస్తారు. కాబట్టి కాలక్షేపంగా టీవీ ముందు కూర్చుని నోటి దురుసుతో మాటలు తూలే వాళ్ల బాధ నీకు ఉండదు... అని చెప్పారు. అదే జరిగింది. నా చానెల్‌ను చూసే వాళ్లు నన్ను అభిమానిస్తున్నారు. నాలో మేనత్తను, పిన్నిని చూసుకుంటున్నారు. సంగీత సాధనలో కూడా సాధించలేని ఆత్మీయత ను ఇందులో పొందగలుగుతున్నాను’’ అన్నారు యోగమ్బాళ్ సంతోషంగా. -
రికార్డుల చిన్నోడు.. 60 నిముషాల్లో 150 వంటలు
ఒక పూట ఇంట్లో వండుకుని తినాలంటే బద్దకిస్తాం. అటువంటిది మూడో తరగతి చదువుతున్న బుడ్డోడు మాత్రం గంటలో 150 కుపైగా వంటకాలు చేసి ఔరా అనిపించాడు. కేరళకు చెందిన తొమ్మిదేళ్ల హయాన్ అబ్దుల్లా ఇలా వంటలు చేసి రికార్డు సృష్టించాడు. బిరియానీలు, జ్యూస్‌లు, పాన్కేక్లు, దోశలు, సలాడ్లు, మిల్క్ షేక్స్, చాక్లెట్స్ వంటి వంటలను కేవలం అరవై నిమిషాల్లోనే వండడం ద్వారా ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ద ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ‘‘హయాన్‌కు నాలుగేళ్లున్నప్పుడే కుకింగ్ ఒక అలవాటుగా ఉండేదని, వంటచేయాలన్న ఆసక్తితోనే కిచెన్‌లో నాకు సాయపడేవాడని’’ హయాన్ తల్లి రశా అబ్దుల్లా చెప్పారు. ‘‘వంటలు చేయాలన్న నా అభిరుచి గురించి తెలిసినప్పుడు మా ఇంట్లో వాళ్లకు కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే అమ్మనాన్న కేరళలో పుట్టిపెరిగినప్పటకీ చెన్నైలో అనేక రెస్టారెంట్లను నడుపుతున్నారు. అందుకే వారు నా ఆసక్తిని మొదట్లో పట్టించుకోక పోయినప్పటికీ.. తరువాత నేను వేగంగా వంటచేయడాన్ని గమనించి.. స్పీడ్‌గా వంటచేయడంతోపాటు ఇంకేదైనా కొత్తగా ట్రై చేయమని ప్రోత్సహించారు. దీంతో నేను మరింత వేగంగా వంట చేయడం మొదలు పెట్టానని’’ హయాన్ చెప్పాడు. అయితే నేను ఒక్కో డిష్ వండడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడానికి టైమ్‌ను రికార్డు చేసేవాడిని. అలా చేయడం వల్లే వంటల పోటీలో ఎటువంటి ప్రిపరేషన్ లేకపోయినప్పటికీ గెలవగలిగానని చెప్పాడు. ప్రస్తుతం హయాన్ చెన్నైలోని షేర్వుడ్ హాల్ సీనియర్ సెకండరీ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతనికి సొంత యూ ట్యూబ్ చానల్ కూడా ఉంది. ‘హయాన్ డెలీకసీ’ పేరుతో ఉన్న చానల్లో వివిధ రకాల వంటకాలను ఎలా తయారు చేయాలో ఇంగ్లీష్, మలయాళం, తమిళ భాషల్లో వివరంగా చూపిస్తుంటాడు హయాన్. ఇంత స్పీడ్‌గా వంటలు చేస్తున్న హయాన్ భవిష్యత్తులో పైలట్ కావాలనుకుంటున్నాడు. అంతేగాక మంచి రెస్టారెంట్స్, పాస్తా బార్‌ను ఏర్పాటు చేయడం తన కల అని కూడా హయాన్ చెప్పాడు. చదవండి: ముగ్గురూ ముగ్గురే -
వంటలూ వడ్డింపులతో క్యాన్సర్ నివారణ
క్యాన్సర్ ఎందుకు, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కారణాలేమిటో ఎవరూ చెప్పలేరు. కానీ కొన్ని ఆహార అంశాల్లోనూ, వండటంలోనూ కొన్ని అంశాలు క్యాన్సర్ వచ్చేందుకు దోహదం చేస్తాయని తెలుసు. ఆ అంశాలేమిటో తెలుసుకుని వాటిని చేయకుండా ఉంటే క్యాన్సర్‌ను నివారించినట్లే. ఆహారం వంటల పరంగా క్యాన్సర్‌కు దోహదం చేసే అంశాలేమిటో తెలుసుకోండి. వాటినుంచి వీలైనంత దూరంగా ఉండండి. వీటిని అనుసరించండి ► ఆహారంలో పీచు ఉంటే అది పేగుల లోపలి భాగాన్ని శుభ్రంగా చేస్తుంది. పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఇలాంటి పీచులేని పదార్థాలు గతంలో పాశ్చాత్యులు విస్తృతంగా తీసుకునేవారు. దాంతో వారిలో పెద్దపేగు, కోలోరెక్టల్, రెక్టల్ క్యానర్లు ఎక్కువ. ఇటీవల మనం కూడా మారిన మన జీవనశైలి అలవాట్లలో పీచు ఎక్కువగా లేని ఆహారాలవైపు మళ్లాం. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు, పొట్టు పుష్కలంగా ఉండే అన్ని రకాల ముడిధాన్యాల (హోల్ గ్రెయిన్స్)లో పీచు పుష్కలంగా ఉంటుంది. కేవలం పెద్ద పేగు క్యాన్సర్‌నే గాక... అనేక పెద్ద పెద్ద క్యాన్సర్లూ పీచుతో నివారితమవుతాయి. అందుకే వడ్డించే పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉందా లేదా అని చూసుకోవడం క్షేమదాయకం. ► విటమిన్–సి, ఫోలేట్, నియాసిన్ వంటి విటమిన్లు నీళ్లలో కరుగుతాయి. అలా విటమిన్లు ఊరిన నీటితో వంట చేస్తున్నప్పుడు... ఆ నీటిని చాలాసేపు వేడిచేస్తే... అందులోని విటమిన్లు ఇగిరిపోతాయి. మనం ఆకుకూరలతో వంట చేసే సమయంలో ఎక్కువ సేపు వండుతూ ఉంటే మొక్కల నుంచి లభ్యమయ్యే పోషకాలు, ఫైటోకెమికల్స్ తరిగిపోతాయి. ఈ ఫైటోకెమికల్స్ క్యాన్సర్లతో ఫైట్ చేస్తాయి. అందుకే వంట ప్రక్రియలో విటమిన్లూ, పోషకాలు ఆవిరయ్యేలా కాకుండా అవి ఉండిపోయేంతగానే ఉడికించాలి. ఆకుపచ్చ, ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగుల్లో ఉండే కూరగాయలను ఆలివ్ నూనెలో వండటం మేలు. దీనివల్ల నూనెలో కరిగే విటమిన్లు ఒంటికి సమర్థంగా అందుతాయి. ► ఘాటుగా ఉండే ఉల్లి, వెల్లుల్లి క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తాయి. వాటిని నేరుగా అలాగే వంటల్లో వేసేయడం కంటే... కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా కొద్దిగా నలగ్గొట్టి వేస్తే... రుచికి రుచీ పెరుగుతుంది. క్యాన్సర్ తో ఫైట్ చేసే పోషకమైన అలిసిన్ వెలువడేందుకూ ఇది దోహదపడుతుంది. ఎర్రగా ఉండే టొమాటోలలో, ఎర్రటి రంగులో ఉండే ద్రాక్షల్లో... ఇలా ఎరుపు రంగులో ఉండే అనేక పండ్లలో లైకోపిన్ అనే క్యాన్సర్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. నేరుగా టొమాటోను తినడం కంటే కాస్తంత ఉడికించాక దాన్ని తింటే... అలా ఉడికించడం ద్వారా వెలువడ్డ లైకోపిన్‌ను మన జీర్ణకణాలు చాలా తేలిగ్గా స్వీకరిస్తాయి. ఇదీ ఆరోగ్యకరంగా వండటానికీ, వడ్డించడానికి ఓ మంచి ఉదాహరణ. ► తాజాపండ్లు క్యాన్సర్‌ను సమర్థంగా నివారించే వాటిల్లో ఒకటి. వీటిల్లోనూ తొక్కతో తినగలిగే జామ, ఆపిల్ వంటి పండ్లను కాస్త కడుక్కుని తొక్కతోనే తినడం మేలు. ఉదాహరణకు ఒక ఆపిల్‌ను తొక్కతో తింటే... మొత్తం పండులో లభ్యమయ్యే దానికంటే... కేవలం ఆ తొక్కలోనే 75% క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడే ఒక అమృతప్రాయమైన జీవరసాయనం. మనం వంటల్లోనూ, వడ్డింపుల్లోనూ ఆహారాల్లో పైన పేర్కొన్న సూచనలు పాటిస్తే అవి క్యాన్సర్ ముప్పునుంచి మనల్ని కాపాడతాయి. ఇవి చేయకండి... ► ఒకసారి వాడిన నూనెను మరోసారి వేడి చేసి ఉపయోగిస్తే క్యాన్సర్‌కు దోహదం చేసే అవకాశం ఉంది. ► కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉండే ఆహార పదార్థాలు క్యాన్సర్ వచ్చేందుకు దోహదం చేసేవే. ► సాధారణంగా రెడ్‌మీట్ కూడా క్యాన్సర్ కారకమే. రెడ్ మీట్ ఎక్కువ గా తినే దేశాల్లో కొలోన్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువగా రావడం డాక్టర్లు చూస్తుంటారు. మామూలు కూరగాయలు, ఆకుకూరల ఆహారం తినేవారితో పోలిస్తే ప్రతిరోజూ ప్రతి 100 గ్రాముల రెడ్‌మీట్ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17 శాతం పెరగడం నిపుణుల పరిశీలనతో తేలింది. అంతేకాదు... రెడ్ మీట్‌తో ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, పొట్ట క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. అయితే కొంతమంది మాంసాహార ప్రియులు మటన్ తినకుండా తమాయించుకోలేరు. ఇలాంటివాళ్లు కేవలం రుచికోసం కొద్దిగా అంటే ఉదాహరణకు... రోజుకు 90 గ్రాములకు బదులు మీ రెడ్మీట్ను 70 గ్రాములకే పరిమితం చేసుకోవడం మంచిది. దీనివల్ల పూర్తిగా కాకపోయినా... కొంతలో కొంత క్యాన్సర్ ముప్పు తప్పుతుంది. ► క్యాన్సర్ నివారణలో ఏం వండారన్నది కాదు... ఎలా వండామన్నది కూడా ముఖ్యమే. మనం ఏదైనా పదార్థాన్ని వండుతుంటే దాన్ని ఎంత ఉష్ణోగ్రత వద్ద ఉడికేలా చేస్తున్నారన్నదీ క్యాన్సర్ నివారణలో చాలా కీలకమైన అంశం. ఒక వంటకాన్ని (రెసిపీని) చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండుతుంటే కొన్నిసార్లు క్యాన్సర్ కారకమైన రసాయనాలు వెలువడేందుకు అవకాశమిస్తున్నామా అని కూడా చూసుకోవాలి. మాంసాన్ని మితిమీరిన ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తున్నా... అంటే గ్రిల్డ్ మాంసంగా వేపుడుగానూ చేస్తున్నామంటే, ఆ మాంసాహారంలోని కొన్ని పదార్థాలు హెటెరో సైక్లిక్ అరోమాటిక్ అమైన్స్ (హెచ్ఏఏ) అనే రసాయన రూపాలుగా మారిపోవచ్చు. అవి క్యాన్సర్ కారకాలు. ఇటీవల విదేశాల్లోలాగా మన దగ్గర కూడా స్మోక్డ్ ఫుడ్ తినడం పెరిగింది. ఇలా స్మోకింగ్ ప్రక్రియకు గురైనా, నేరుగా అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న మంట తగిలేలా చేసినా... అప్పుడా ఆహారపదార్థాల్లోంచి ‘పాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ అనే (పీఏహెచ్‌స్) అనే రసాయనాలు ఏర్పడతాయి. అవి కూడా క్యాన్సర్‌ను తెచ్చిపెట్టగల అవకాశం ఉన్నవే. ► క్యాన్సర్ నివారణలో ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోవడం కూడా కీలక భూమిక వహిస్తుంది. ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోకపోవడం లేదా నిల్వ చేసుకోవడంలో ఉపయోగించే పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. చాలామంది ఆహారపదార్థాలను పాడైపోకుండా ఉంచడానికి ‘ఉప్పు’లో చాలాకాలం పాటు ఊరబెడుతుంటారు. ఇలా ఉప్పులో దీర్ఘకాలం ఊరిన పదార్థాల వల్ల పొట్ట లోపలి పొరలు (లైనింగ్) దెబ్బతిని అది ఇన్ఫ్లమేషన్కు (వాపు, నొప్పి, ఎర్రబారడం) గురయ్యే అవకాశం ఉంది. అలా పొట్ట లోపలి పొరలు (లైనింగ్) దీర్ఘకాలం ఒరుసుకుపోతూనే ఉండటం జరుగుతుంటే అక్కడ అలా ఒరుసుకు పోయిన లైనింగ్‌లలో నైట్రేట్ల వంటి క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావానికి గురయ్యే అవకాశముంది. అలాంటి చోట్ల హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి నివసిస్తూ ఉంటే... ఆ ప్రాంతాల్లో పుండ్లు పడేలా చేస్తుంది. వీటినే స్టమక్ అల్సర్స్ అంటారు. ఈ స్టమక్ అలర్స్ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అది కేవలం ఉప్పు వాడే పచ్చళ్లకు మాత్రమే కాదు... చిప్స్, సాల్టెడ్ పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌లో కూడా ఉప్పు ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి వాటిని చాలా చాలా పరిమితంగా తీసుకోవాలి. క్యాన్సర్ మాట అటుంచి... మనం తినే ఆహారంలో ఉప్పు పరిమాణం పెరుగుతున్న కొద్దీ హైబీపీ కూడా పెరుగుతూ పోతుంది. అందుకే ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ 6 గ్రాములకు మించి ఉప్పు వాడకూడదు. శ్వేత బిరలి సీనియర్ డైటీషియన్ -
గరిటె పట్టిన రాహుల్.. వీడియో వైరల్
చెన్నై: ప్రస్తుతం యూట్యూబ్‌లో బాగా పాపులర్ చానెల్స్ ఏంటి అంటే వంటల వీడియోలకు సంబంధించిన చానెల్స్. సరదాగా మొదలు పెట్టిన వారు ఇప్పుడు తమ పాక శాస్త్ర ప్రావీణ్యంతో జనాలను ఆకట్టుకుని.. లక్షల్లో సంపాదిస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ఇలాంటి వీడియోలో ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే.. ఇంకేముంది.. వారి చానెల్ ఎక్కడికో వెళ్లి పోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ యూట్యూట్ కుకింగ్ చానెల్లో కనిపించడమే కాక స్వయంగా గరిటె తిప్పి.. సదరు యూట్యూబ్ చానెల్ మెంబర్స్‌తో కలిసి వారు చేసిన వంటను ఆరగించారు. ఇక వంట చేసే సమయంలో రాహుల్ ఆయా పదార్థాల పేర్లను తమిళంలో పలికేందుకు ట్రై చేయడం.. చాలా బాగా కుదిరింది అంటూ సరదాగా కామెంట్ చేస్తూ.. ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ.. అక్కడ బాగా ఫేమస్ అయిన ఓ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ పెరియతంబీ బృందాన్ని కలిశారు. సడెన్‌గా వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. వారు చేస్తోన్న మష్రూమ్ (పుట్టగొడుగులు) బిర్యానీ తయారీ విధానం చూశారు. ఆ బృందంతో పాటు తాను గరిటె తిప్పారు. (చదవండి: లెక్కల ‘అంతు’ తేల్చినవాడు) బిర్యానీ సైడ్ డిష్ కోసం రాహుల్ రైతా తయారు చేశారు. ఇక దానికి వాడే పదార్థాలైన ఉల్లిపాయలు, పెరుగు, కల్లుప్పును తమిళంలో ఏం అంటారో తెలుసుకుని.. తిరిగి పలకడానికి ప్రయత్నించారు. ఇక బిర్యానీ వంటడం పూర్తయిన తర్వాత వారంతా అక్కడే కూర్చుని దాన్ని తిన్నారు. అనంతరం బిర్యానీ సూపర్ అంటూ వారిని తమిళంలో ప్రశంసించారు. రాహుల్‌కి, పెరియతంబీ బృందానికి మధ్య జరిగిన ఆ సంభాషణ ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది. స్థానిక మహిళ ఒకరు రాహుల్‌కు, పెరియతంబి టీమ్‌కు మధ్య ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించారు. రాహుల్ ఆంగ్లంలో చెప్పింది వారికి తమిళంలో చెప్పి, వాళ్లు తమిళంలో మాట్లాడింది రాహుల్‌కు ఆంగ్లంలో వివరించి సంభాషణ కొనసాగించారు. ఈ క్రమంలో ఒకసారి ఆమె రాహుల్ ఇంగ్లిష్‌లో చెప్పిన మాటలను వారికి మళ్లీ అదే భాషలో చెప్పడం వీడియోలో నవ్వులు పూయిస్తుంది. (చదవండి: తమిళులపై మోదీ సవతి ప్రేమ ) తమ వంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని ఈ బృందానికి చెందిన సుబ్రహ్మణ్యం రాహుల్ గాంధీకి తెలిపాడు. తమిళనాడు మాత్రమే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా వెళ్లి వంటలు చేయాలనేది తమ కోరిక అని చెప్పాడు. అంతేకాక తమ చానెల్ ద్వారా తాము డబ్బు సంపాదించడమే కాక మరో నలుగురికి ఉపాధి కల్పించడమే తమ ధ్యేయం అన్నారు. అది విన్ని రాహుల్.. అమెరికాలో తనకొక మిత్రుడు ఉన్నాడని, ఆయనకు చెప్పి షికాగోలో వంట కార్యక్రమం పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ మిత్రుడు ఎవరో కాదు.. శ్యామ్ పిట్రోడా. 14 నిమిషాల నిడివి గల ఈ వీడియో చివరివరకూ ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ వీడియోపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మా ఆయన బాగా వండుతాడు: మాధురీ
బాలీవుడ్ నటి, డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ కిచెన్‌లో దూరారు. ఆమె వెంట భర్త శ్రీరామ్ నేనే కూడా ఉన్నారు. ఆయన భార్య చేసే వంటకాన్ని దగ్గరుండి చూస్తూ మరాఠీ పదాలను నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు గరిటె తిప్పడం ఎంత బాగా వచ్చనే విషయాన్ని ఆమె బయటపెట్టారు. "చిన్నప్పటి నుంచే నాకు కాస్తో కూస్తో వండటం నేర్చుకున్నా. ఆమ్లెట్ వేయడం, పులిహోర చేయడం లాంటివి వచ్చు. కానీ వర్క్ బిజీలో పడి వంట చేసే అవకాశం రాలేదు. అయితే పెళ్లయ్యాక మాత్రం ఈ వంటల గురించి బాగా నేర్చుకున్నాను. ఇక నా భర్త రామ్‌కు అమెరికాలో ఫ్రెంచ్ వంటగాడు ఉన్నాడు. అలా అతడు అక్కడి డిషెస్ నేర్చుకున్నాడు. (చదవండి: అనుకోని అతిథి.. షాక్ అయిన సూపర్ స్టార్) ఇక నా విషయానికొస్తే.. భారతీయ వంటకాలను నేను అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా అమ్మ వంటకాలే! నావల్ల రామ్ కూడా ఇక్కడి రెసిపీలను ఎంతో కొంత నేర్చుకుంటున్నాడు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, రామ్ నాకంటే బాగా వండుతాడు, అలా అని నేనేమీ చెత్తగా వండనులెండి" అని మాధురీ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ‘యాక్ట్రెస్’ (నటి)అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్లో కనిపిస్తారు. ఒకప్పుడు బాగా వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా స్టార్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశేషమేంటంటే.. 23 ఏళ్ల గ్యాప్ తర్వాత సంజయ్ కపూర్, మాధురీ దీక్షిత్ ఈ సిరీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. (చదవండి: కథ రొమాంటిక్‌గా ఉందని ఒప్పుకున్నా: మాధురీ) -
మనవరాళ్లతో కలిసి వంట చేసిన మెగాస్టార్
లాక్డౌన్.. అందరికి ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్తా విశ్రాంతి అందించింది. సెలబ్రిటీల నుంచి సాధారణ పౌరుని వరకు ఇంట్లో తమ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు అవకాశం లభించింది. ఖాళీ సమయం దొరకడంతో తమకు నచ్చిన వ్యాపకాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో లాక్డౌన్లో మెగాస్టార్ చిరంజీవి వంటింట్లోకి చేరి తనలోని నలభీముడిని ప్రదర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. నోరూరించే ఉప్మా పెసరెట్టు వేసిన ఆయన అనంతరం మరి కొన్ని వంటకాలను చేసి కుటుంబానికి రుచి చూపించారు. తాజాగా మరోసారి కిచెన్‌లోకి వెళ్లిన మెగాస్టార్ తన మనవరాళ్లతో కలిసి ఓ స్పెషల్ వంటకాన్ని తయారు చేశారు. దాని పేరు ఫేమస్ కేఎఫ్‌సీ చికెన్. చదవండి: నాగబాబు బర్త్‌డేకు చిరంజీవి భావోద్వేగ ట్వీట్ కూతుళ్ల పిల్లలు సంహిత, నివ్రితితో కలిసి కేఎఫ్‌సీ చికెన్ వంటకాన్ని చేసిన చిరంజీవి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి ‘వంట చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ముఖ్యంగా పక్కన ఇలాంటి అల్లరి పిల్లలు ఉంటే అది మరింత ఆనందంగా ఉంటుంది. ఇక ఈ వంటకం ఎలా ఉందో చుద్దాం..’ అనే క్యాషన్‌తో షేర్ చేశారు. ఈ వీడియోలో ముందుగా పిల్లలను ఈ రోజు బోర్ కొడుతుంది ఏం చేద్దాం అని అడుగుతారు. దీంతో సంహిత తనకు కేఎఫ్‌సీ చికెన్ తినాలని ఉందని చెప్పింది. దీంతో కోవిడ్ సమయంలో బయట నుంచి తీసుకురావడం అంత సురక్షితం కాదని, ఇంట్లనే తయారు చేద్దాం అంటూ తనకు పిల్లలు ఇద్దరు సహాయం చేయాలని కోరారు. దీనికి వాళ్లు ఒకే చెప్పడంతో మెగాస్టార్ వెంటనే చెఫ్‌గా మారి అద్భుతమైన ఫ్రైడ్ చికెన్ చేసి పెట్టారు. చదవండి: ‘కరోనా’ నేర్పిన పాఠం ఇదే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిరంజీవి వంటకాన్ని పొగడ్తలతో ముంచెత్తిస్తున్నారు. అటు యాక్టింగ్‌లోనే కాకుండా ఇటు వంటింట్లోనూ చిరంజీవి మెగాస్టార్ అని ప్రశంసిస్తున్నారు. ‘మా అన్నయ్య వంట చేస్తే నోరూరాల్సిందే’నని కామెంట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను చేస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమాను వివి వినాయక్ తెరకెక్కిస్తున్నారు. -
ఫ్యామిలీ మ్యాన్గారూ ఇది వినండి
ఆఫీసుకు వెళ్లి టైముకు ఇల్లు చేరుకుని భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ కూచునే వారిని ‘ఫ్యామిలీ మ్యాన్’ అని కితాబిస్తారు. కాని స్త్రీ ఉద్యోగానికి వెళ్లి కష్టపడితే ‘కెరీర్ ఓరియెంటెడ్ ఉమన్’ అంటారు. మగవారు ‘డబ్బు సంపాదించని పని’ చేయరని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) తాజా నివేదిక తెలిపింది. అంటే డబ్బు రాని ఇంటి పని వారు చేయరు. దాంతో భారతదేశంలో స్త్రీలు రోజుకు ‘విలువ లేని’ 5 గంటల ఇంటి చాకిరీ చేస్తున్నారు. దేశంలో కేవలం 27 శాతం స్త్రీలనే ఉద్యోగాలు చేయనిస్తున్నారు. ఈ అసమానతపై గొంతెత్తే హక్కు స్త్రీలకు ఉంది. ‘ఆడవాళ్లకు పనేం ఉంటుందండీ. చాడీలు చెప్పుకోవడం తప్ప. టీవీ సీరియల్స్ చూడటం తప్ప’ అని అంటూ ఉంటారు మగవారు. పూర్వం అనేవారు. రోజులు మారాయి అనుకుంటున్నారా? ఇప్పుడూ అంటున్నారు. భవిష్యత్తులోనూ అనకుండా అడ్డుకోవాలి. ‘స్త్రీలకు పనేముంటుందండీ.. ఒక అన్నం ఒక కూర వండేసి హాయిగా కూచోవడమే కదా’ అని కూడా అంటూ ఉంటారు. ఆ ఒక అన్నం, ఒక కూర ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఒకరోజు చేయమనాలి ఈ మగవారిని. వారంలోని ఏడురోజులు, నెలలోని ఐదు వారాలు, సంవత్సరంలోని పన్నెండు నెలలు వంట చేయడం... చేసి చూపించడం ఇలా అనేవారికి సాధ్యమా? స్త్రీలు చేస్తున్నారు. చేయలేకపోయినా చేస్తున్నారు. కుటుంబం మీద ప్రేమతో చేస్తున్నారు. వారు దానిని తప్పించుకోవాలని నిలదీస్తే పురుషుడి కాళ్ల కింద భూకంపం వస్తుందని వారికి తెలుసు. అంతమాత్రాన చేస్తూ పోనివ్వడమేనా? వంటగది భారతం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఓ) దేశంలోని స్త్రీ పురుషుల ఉపాధి, ఇంటిపనికి సంబంధించి 2109 జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్వహించిన సర్వేలో స్త్రీలు ఎదుర్కొంటున్న అసమానత మరోసారి తేటతెల్లం అయ్యింది. దేశవ్యాప్తంగా లక్షా ముప్పైతొమ్మిది వేల ఇళ్లని, నాలుగున్నర లక్షల మంది వ్యక్తులను సర్వే చేసి ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం దేశంలో 70 శాతం మంది పురుషులు ఉద్యోగ, ఉపాధుల్లో తమ వాటా ఆక్రమించుకున్నారు. 21 శాతం మంది మహిళలే ఉద్యోగ, ఉపాధుల్లో చోటు సంపాదించుకుంటున్నారు. ఇక దేశంలో 90 శాతం మంది స్త్రీలు ఇంటి పనిలో తలమునకలుగా ఉన్నారు. కాని పురుషులు మాత్రం 27 శాతం మంది మాత్రమే ఇంటి పనులు చేస్తున్నారు. ఈ సర్వేలో ఎక్కువ మంది పురుషులు (15–59 వయసు మధ్యవారు) తాము ‘డబ్బు రాని పని’ చేయము అని చెప్పారు. ఇలా చెప్పే వీరంతా ‘డబ్బు రాని’ ఇంటి పని గురించి తమకు ఎటువంటి బాధ్యత లేదని చెప్పినట్టే అయ్యింది. దాంతో స్త్రీలు ఉద్యోగం చేసినా చేయకపోయినా రోజుకు ఐదు గంటల పాటు ఇంటి పనికి నడుము విరుచుకోవాల్సి వస్తోందని ఈ నివేదిక తెలియచేసింది. పురుషుడు ఉద్యోగం కోసం 8 గంటలు పని చేసి 30 వేలు సంపాదిస్తే స్త్రీ ఇంట్లో అందులోని అరవై శాతం జీతానికి సమానమైన శ్రమ చేస్తోంది. ఇది కాకుండా భర్తకు సేవ, పిల్లలకు సేవ అదనం. ఈ నివేదిక ప్రకారం దేశంలో పురుషులు ఇంటి పని కోసం రోజుకు 97 నిమిషాలు, పిల్లల కోసం 1 గంట 16 నిమిషాలు కేటాయిస్తున్నారు. మిగిలిన సమయమంతా తల్లులదే అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. గౌరవం అవసరం నలుగురుకి అవసరమైన పప్పుచారు శ్రద్ధగా వండాలంటే అందుకోసం కనీసం పదిహేను రకాల పనులను సమన్వయం చేసుకోవాలి. కాని అది పని కాదు మగవారి దృష్టిలో. ఒక రోజులో సరుకుల షెల్ఫ్‌ను స్త్రీలు ఎన్నిసార్లు తెరిచి మూస్తారో అన్నిసార్లు ఒక వ్యాయామం కోసం పురుషులను తెరిచి మూయమంటే వారికి అందులోని శ్రమ అర్థమవుతుంది. విచారించాల్సిన విషయం ఏమిటంటే తమ మేధను, చదువును, భిన్నమైన అభిరుచులను, సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని స్త్రీ భావిస్తే కనుక బయట ఎంత పని చేయాలో అంత పని చేసి ఇంటి పనిని కూడా’ తప్పించుకోవడానికి వీల్లేకుండా’ చేస్తేనే పురుషుడు సంతృప్తి చెందుతాడు. ఆమె వాటి నుంచి తప్పించుకుంటే కొద్దిగా ఇంటికి దూరమైతే ‘కెరీర్ ఓరియెంటెడ్’ అని ముద్ర వేస్తాడు. తాను మాత్రం ఆఫీసులో చేసిన శ్రమ చాలు అని ఇంటికి చేరుకుని పైజమా, టీషర్ట్ వేసుకుని టీవీ ముందు కూచుంటే ‘ఫ్యామిలీ మ్యాన్’ అనిపించుకుంటాడు. అతను ఇంటికి దూరమై కష్టపడినా ప్రశంసే, ఇంట్లో కూచున్నా ప్రశంసే. స్త్రీకి ప్రత్యేకంగా ఇవి దక్కవు. పని చేయని పురుషుణ్ణి ఏ ఆఫీసూ ఉంచుకోదు. పని చేయకపోయినా పురుషుడు హాయిగా ఇంట్లో ఉండొచ్చు. పని చేస్తున్నవారి శ్రమపై ఆధారపడొచ్చు. దీని గురించి ఆలోచించండి ఫ్యామిలీ మ్యాన్ గారు. దీనిని న్యాయంగా, ప్రజాస్వామికంగా ఎలా మార్చవచ్చో చూడండి. అప్పుడే మీరు నిజమైన ఫ్యామిలీ మ్యాన్ అవుతారు. – సాక్షి ఫ్యామిలీ -
వీకెండ్ స్పెషల్
‘‘చేపల కూరలో ఉప్పు సరిపోయిందో లేదో తెలియాలంటే రుచి చూడక్కర్లేదు. వాసన బట్టి కూడా చెప్పేయొచ్చు’’ అంటున్నారు సీనియర్ నటులు కృష్ణంరాజు. ఆయన మంచి భోజన ప్రియులు. ఇష్టంగా తినడమే కాదు, వండుతారు కూడా. చేపల పులుసు వండటంలో స్పెషలిస్ట్ ఆయన. వీకెండ్ స్పెషల్‌గా శుక్రవారం సరదాగా కుటుంబ సభ్యుల కోసం చేపల కూర వండారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కృష్ణంరాజు. ‘‘మా నాన్న ప్రపంచంలోనే బెస్ట్ చేపల పులుసు వండుతారు. ఎంత ఎక్స్పర్ట్ అంటే కేవలం వాసన చూసి కూరలో అన్నీ సరిపోయాయో లేదో చెప్పేసేంత’’ అని కృష్ణంరాజు కుమార్తె ప్రసీద పేర్కొన్నారు. -
ఆలుమగల గొడవ: యూట్యూబ్‌లో వీడియోలు డిలీట్
కౌలాలంపూర్: భార్యాభర్తలన్నాక సవాలక్ష గొడవలుంటాయి. పరిస్థితులను బట్టి ఎవరో ఒకరు సర్దుకుపోవాల్సిందే. అయితే మలేషియాలో మాత్రం ఓ జంట గొడవ యూట్యూబ్ అభిమానులకు కోపం తెప్పించింది. అది ఎలాగో చదివేయండి.. మలేషియాకు చెందిన ఎం.సుగు, ఎస్.పవిత్ర భార్యాభర్తలు. వీరిద్దరూ కలిసి ఇద్దరి పేరు వచ్చేలా "సుగు పవిత్ర" అనే యూట్యూబ్ చానల్ పెట్టారు. అందులో రుచికరమైన వంటకాల వీడియోలను అప్లోడ్ చేసేవారు. వీరు చేసే వంటలు నచ్చి, తయారీ విధానం మెచ్చి 7.8 లక్షల మంది ఈ ఛానల్‌ను ఫాలో అవుతున్నారు. గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 98 వీడియోలను చేశారు. అయితే జూలై 20న ఈ ఆలుమగల మధ్య గొడవ జరిగింది. (అనుకోని అతిధి రాకతో అద్భుతం..) ఈ క్రమంలో తర్వాతి రోజు పూటుగా తాగిన సుగు తన భార్యపై కొడవలితో దాడి చేశాడు. ఆమె గృహ హింస కింద భర్తపై కేసు పెట్టింది. దీంతో సుగు భార్యపై కోపంతో యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోలను డిలీట్ చేశాడు. దీంతో వారికి ఉన్న ఏకైక ఆదాయం పోయినట్లైంది. మరోవైపు మీరు మీరూ తగవులాడుకుని మధ్యలో వీడియోలు ఎందుకు డిలీట్ చేశారని ఆ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు ప్రశ్నిస్తున్నారు. ఏదైతేనేం.. ప్రస్తుతం అక్కడ సుగు పవిత్ర ఛానల్ పేరు మార్మోగిపోతోంది. అయితే పవిత్ర తన భర్తను క్షమించివేసినట్లు, తన కేసు ఉపసంహరించుకున్నట్లు మలేషియా మీడియా పేర్కొంది. త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి మళ్లీ కొత్త వీడియో కూడా చేయనున్నారట. (వెనకాలే ఎలుగుబంటి.. ఆమె ఏం చేసిందంటే!) -
నాలో మంచి కుక్ ఉందని తెలుసుకున్నా!
లాక్‌డౌన్‌తో దొరికిన ఖాళీ సమయం తమన్నాను వంటగదికి దగ్గర చేసింది. తనలో ఓ మంచి కుక్ దాగి ఉందని తమన్నా తెలుసుకునేలా చేసింది. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్స్‌తో ఫుల్æబిజీగా ఉండేదాన్ని. మా ఇల్లు నాకు హోటల్లానే అనిపించేది. సినిమాల షూటింగ్స్ మధ్యలో కాస్త విరామం దొరికినా నేను మా ఇంట్లో ఉండేది మూడు రోజులే. అసలు మా ఇంట్లో ఏయే వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో? అవి నాకు ఎంత ఉపయోగపడతాయో? అని కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఈ లాక్డౌన్లో అవన్నీ తెలుసుకున్నాను. అవసరానికి మించిన వస్తువులు ఉన్నాయని గ్రహించాను. ఇదివరకు నేను ఎప్పుడూ వంట చేయలేదు. లాక్డౌన్ వల్ల చాలా సమయం దొరకడంతో వంటలు చేశాను. నాలో ఓ మంచి కుక్ ఉందని నాకు తెలిసింది ఈ సమయంలోనే. అయితే నేను వంట స్టార్ట్ చేసిన మొదట్లో కిచెన్ రూమ్‌లో టీ పొడి ఎక్కడుంది? పంచదార ఏ డబ్బాలో ఉంది? అనే విషయాలు తెలియక మొత్తం అల్మరా అంతా వెతికేదాన్ని. ఫస్ట్ టైమ్ వంట చేసినప్పుడు చాలా గందరగోళంగా అనిపించింది. ఆ తర్వాత మెల్లిగా అన్నీ తెలుసుకున్నాను. వంట చేయడం అంటే వంటకాలను రుచిగా చేయడమే కాదు. ఆ వంటలు వండిన పాత్రలను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. వంట రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి’’ అన్నారు తమన్నా. -
వంట మాస్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌కు పెళ్లి బృందం
సాక్షి, తుమకూరు: పెళ్లిలో వంట చేసిన వంట మాస్టర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో పెళ్లి జంటతో పాటు కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించిన ఘటన జిల్లాలోని గుబ్బి తాలూకాలోని హెరూరిలో జరిగింది. వివరాలు... కొద్ది రోజుల క్రితం పెళ్లి కుమారుడు ఇంటి వద్దనే నిరాడంబరంగా వివాహం జరిగింది. పెళ్లికి వంట చేయడానికి వచ్చిన వంట మాస్టర్ (55)కు ఈనెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ ప్రాంతం మొత్తం సీల్‌డౌన్ చేసి రసాయనాలు స్ప్రే చేశారు. చదవండి: భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువే సీల్‌డౌన్ దృశ్యం -
లాక్డౌన్: పోలీసు వంట
పోలీసులు అనగానే మనకు ఖాకీ డ్రెస్‌తో పాటు వారి కాఠిన్యమే గుర్తుకు వస్తుంది. కానీ, గుజరాత్‌లోని వడోదరా మహిళా పోలీసులు మాత్రం ప్రతి రోజూ 1200 మంది పేదలకు ఆహారం స్వయంగా వండిపెడుతూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇంత పెద్ద సంకల్పానికి శ్రీకారం చుట్టింది అక్కడి ఐపిఎస్ అధికారి సరోజ్ కుమారి. దేశమంతా లాక్డౌన్ ప్రకటించిన మూడు రోజులకే సరోజ్కి పేదల ఆహారం గురించిన ఆలోచన వచ్చింది. పనులు లేక, డబ్బుల్లేక పేదలు పస్తులుండకూడదని భావించిన సరోజ్ మార్చి 25న పోలీస్ స్టేషన్‌కు దగ్గరలోనే ఓ వంటశాలను ఏర్పాటు చేసింది. అందుకు కావల్సిన రేషన్ కోసం పై అధికారులతో మాట్లాడింది. కొంత సరంజామా పోలీసు బృందమే సమకూర్చింది. ఈ అధికారి చొరవతో 50 మంది మహిళా పోలీసులు తమ విధులు పూర్తయ్యాక మూడు గంటల సమయాన్ని వంట చేయడానికి కేటాయించారు. దీంతో మొదట 550 మందికి వంట చేయడంతో ప్రారంభించారు. ఇప్పుడు ప్రతీరోజు 1200 మందికి వండి వార్చుతున్నారు. ఇక్కడి పోలీసు బృందమంతా కలిసి ఆహారాన్ని పంపిణీ చేస్తుంది. పోలీసాఫీసర్ సరోజ్ తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రమంతా ఆమెకు అభినందలు తెలుపుతోంది. ఈ సేవ కారణంగా సరోజ్‌కు ఉమెన్ ఐకాన్ అవార్డు కూడా లభించింది. -
ఆటలు.. వంటలు
లాక్డౌన్ వేళ పాకశాస్త్రంలో ప్రావీణ్యతను సంపాదించినందుకు తెగ సంబరపడిపోతున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. లాక్డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నకు కియారా సమాధానం చెబుతూ – ‘‘నాకు ఇంట్లో కుటుంబసభ్యులతో ఉండటం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ లాక్డౌన్ నాకు పెద్ద ఇబ్బందిగా అనిపించడం లేదు. కానీ షూటింగ్స్‌ను బాగా మిస్ అవుతున్నాననిపిస్తోంది. ఇప్పుడు నా డైలీ లైఫ్ ఉందంటే... వర్కవుట్స్ మిస్ కావడంలేదు. లూడో వంటి ఇండోర్ గేమ్స్ ఆడుతున్నాను. నా స్కూల్ టైమ్ వీడియోలు చూస్తున్నాను. ఇటీవలే మా స్కూల్ టీచర్స్‌తో కూడా మాట్లాడాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది నా వంటల గురించి. నాకు ఇంటి వంట అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కేక్, బిస్కెట్లు, హల్వా చేసేదాన్ని. ఇప్పుడు వేరే వంటకాలు కూడా నేర్చుకుంటున్నాను. కొన్ని వంటకాలను ఆన్లైన్ రెసిపీలను ఫాలో అవుతూ చేశాను. ఇప్పుడు ఎవరైనా ఏ భారతీయ వంటకం పేరు చెప్పినా నేను చేయగలను’’ అని పేర్కొన్నారు. -
పెయింటింగ్... కుకింగ్.. డ్యాన్సింగ్
‘హిప్పీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు హీరోయిన్ దిగంగనా సూర్యవన్షీ. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న ‘సీటీమార్’లో నటిస్తున్నారుఆమె. ఇంకా ‘వలయం’ అనే సినిమాతో పాటు వేరే భాషల్లో సినిమాలు కమిట్ అయ్యారు. జోరుగా షూటింగ్స్ చేస్తున్న తనకు అనుకోకుండా వచ్చిన ఈ లాక్‌డౌన్‌తో బ్రేకులు వేసినట్లయింది అంటున్నారామె. లాక్‌డౌన్‌ని ఎలా స్పెండ్ చేస్తున్నారో దిగంగనా చెబుతూ – ‘‘చదువుకునే రోజుల్లో పెయింటింగ్స్ వేసేదాన్ని. నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు పెయింటింగ్స్ వేయడానికి టైమ్ దొరకడంలేదు. ఈ లాక్డౌన్ వల్ల నా పెయింటింగ్ స్కిల్స్‌కు మళ్లీ పదును పెడుతున్నాను. రాధాకృష్ణుల పెయింటింగ్ వేశాను. ఎక్కువగా టీవీ చూస్తే హోమ్ అరెస్ట్ అన్న ఫీలింగ్ వస్తుందేమోనని చూడడం లేదు. కానీ నేను చూడలేకపోయిన సినిమాలను ఈ సమయంలో చూస్తున్నాను. ఇంకా నాకు ఇష్టమైన వంటకాలను నేర్చుకున్నాను. పుస్తకాలు చదవడం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, ఆటలు ఆడటం (ఎయిర్ ఫుట్‌బాల్, బోర్డ్ గేమ్స్) వంటివి చేస్తున్నాను. నాన్న, నేను కలిసి డ్యాన్స్ చేస్తాం. బోర్డ్ గేమ్స్, ఎయిర్ ఫుట్‌బాల్ ఇలా అన్ని ఆటలు ఆడుకుంటాము. ఇవన్నీ చేస్తూ మనం హ్యాపీగా ఉంటే ఈ ఖాళీ సమయంలో అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోం. అంతేకాకుండా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒకేసారి ఎక్కువ పని చేయాలన్నా వెంటనే అలసిపోం. అందుకే ఖాళీ సమయంలో కూడా బిజీగా ఉంటున్నాను’’ అన్నారు. ఇంకా దిగంగనా మాట్లాడుతూ – ‘‘షూటింగ్స్ ఉండటం వల్ల నా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకుంటున్నాను. రాజకీయాల నుంచి కుటుంబ విషయాల వరకు అన్నీ చర్చించుకుంటాం. చివరిగా ఒక మాట... ఇది వైరస్ (కరోనాను ఉద్దేశిస్తూ).. యుద్ధం కాదు. యుద్ధం అంటే సైనికులు ఉంటారు. కానీ ఈ వైరస్‌తో మనమే పోరాడాలి. మనమే జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని అన్నారు. -
నోరూరిస్తున్న రకుల్ కుకీస్ రెసిపీ..
ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సెలబ్రటీలకు లాక్డౌన్ కారణంగా బెలడంత సమయం మిగిలింది. దీంతో తమ విలువైన సమయాన్ని కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ గ్యాప్‌లో కొత్త వంట ప్రయోగాలు చేస్తూ అభిమానులకు నోరూరిస్తున్నారు. ఎప్పుడూ వర్కవుట్లతో బిజీగా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కిచెన్‌లో సందడి చేసింది. హెల్తీ బనానా చాక్లెట్ ఓట్మీల్ కుకీస్ తయారు చేశారు. దీనికి సంబంధించిన రెసిపీ వీడియోను షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. మరి రకుల్ చేసిన రెసిపీకి కావల్సిన పదార్థాలు 1. రెండు పండిన అరటి పండ్లు 2. 50 గ్రాముల ఓట్మీల్ 3. 2 స్ఫూన్ల చాకో పౌడర్ 4. మ్యూసిల్ (ఆప్షనల్ ) 5. తురిమిన చాక్లెట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో హెల్తీ బనానా చాక్లెట్ ఓట్మీల్ కుకీస్.. చెప్తుంటేనే నోరూరుతుంది కదా మరి తయారీ విధానం ఎలాగో తెలియాలంటే వీడియో చూసేయండి మరి. -
మంచు వారి మసాలా వడలు
ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్స్ ఒకరికొకరు సరదా ఛాలెంజ్ విసురుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మోహన్ బాబుకి ‘కుకింగ్ ఛాలెంజ్’ విసిరారు ‘కళాబంధు’ సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి. ఆమె ఛాలెంజ్‌ను స్వీకరించిన మోహన్ బాబు.. మనవరాలు విద్యా నిర్వాణ (మంచు లక్ష్మి కుమార్తె) తో కలసి స్పెషల్ మసాలా వడలు తయారు చేశారు. ‘‘నా ఆత్మీయుడు డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి గారి కుమార్తె నేను వంట చేసి చూపించాలని నాకు సవాల్ విసిరింది, స్పెషల్ వడలు చేస్తా’’ అంటూ వంట చేస్తున్న వీడియోను షేర్ చేశారు మోహన్ బాబు. తాతయ్య వంట చేస్తుంటే విద్యా నిర్వాణ సహాయం చేస్తూ కనిపించింది. -
పుస్తకాలు.. సినిమాలు.. వంటలు
‘‘లక్ష్యసాధన కోసం నిత్య జీవితంలో మనమందరం పరుగులు పెడుతూనే ఉంటాం. కానీ ప్రకృతి విపత్తు వస్తే మనం ఎంతవరకు ఎదుర్కోగలమో ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనే అర్థం అవుతుంది. మన ఆరోగ్యం, కుటుంబం, మనల్ని ప్రేమించేవారు, వారితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి. మిగతావన్నీ తర్వాతే అనిపిస్తోంది’’ అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. లాక్డౌన్ సమయం ఎలా గడుస్తుందో రకుల్ చెబుతూ – ‘‘ఈ ఏడాది మార్చి 18 నా చివరి వర్కింగ్ డే. అప్పట్నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఎప్పటిలానే ఉదయం యెగాతో నా రోజు మొదలవుతుంది. పుస్తకాలు బాగా చదువుతున్నాను. ప్రస్తుతం నేను ‘వై వియ్ స్లీప్’ అనే పుస్తకం చదువుతున్నాను. ‘ఛారియట్స్ ఆఫ్ గాడ్స్’, ‘కాస్మిక్ కాన్షియస్నెస్’ అనే పుస్తకాలను చదవడం పూర్తి చేశాను. మార్నింగ్ టైమ్‌లో బుక్స్ చదువుతున్నాను. మధ్యాహ్నం ఏదైనా సోషల్ మీడియా లైవ్స్ చూస్తాను. సాయంత్రం ఒక సినిమా చూస్తాను. అలాగే ఒక షోకు సంబంధించిన రెండు, మూడు ఎపిసోడ్స్ ఫాలో అవుతాను. ఆస్కార్ అవార్డు సాధించిన అన్ని సినిమాలను చూడాలనుకుంటున్నాను. ఆస్కార్ సినిమాలను రెండేళ్లుగా చూస్తున్నాను. వీలైనప్పుడు వంట కూడా చేస్తున్నాను. దీనిపై ఓ యాట్యూబ్ చానెల్‌ను కూడా స్టార్ట్ చేశాం. ఆత్మపరిశీలన చేసుకోవడానికి, వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ అవ్వడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నాను. కానీ ఇంత లాంగ్ బ్రేక్ నా లైఫ్‌లో రాలేదు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత సినిమాలతో మళ్లీ బిజీ అవుతాను’’ అన్నారు. -
వంటిల్లు.. వర్ధిల్లే..
పానీపూరీ నుంచి పావుబాజీ దాకా.. ఇడ్లీ నుంచి చపాతీ, వడ దాకా.. మిర్చీ నుంచి ఆలూబజ్జీ.. జిలేబీ దాకా.. కేక్‌లు.. ఐస్‌క్రీమ్‌లు.. స్వీట్లు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నో వైవిధ్యభరితమైన వంటలు. చవులూరించే నలభీమపాకాలు.. జిహ్వ.. వాహ్వా అనే రుచులు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనాల దాకా రకరకాల వెరైటీలు ఇంటి మెనూలో స్థానం సంపాదించుకుంటున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లు, టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్‌ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. ఏం తినాలన్నా.. ఏం తాగాలన్నా ఇంట్లోనే తయారు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇల్లూ ఓ వంటిల్లే అయ్యింది. ప్రతి చేయీ గరిటె పట్టింది. కిచెన్‌లో చికెన్ వండుతోంది. మటన్‌లో మసాలా దట్టిస్తోంది. విభిన్న రకాల రుచులకు శ్రీకారం చుడుతోంది. ఏనాడూ వంటింట్లోకి వెళ్లని మగవాళ్లూ నలభీములే అవుతున్నారు. గృహిణులు సైతం రుచులకు మరింత సాన పెడుతున్నారు. మొత్తంగా నగరంలోని ఇల్లిల్లూ మధురమైన వంటకాలతో వర్ధిల్లుతోంది. టేస్టీ ఫుడ్‌కు దోస్తానాగా మారుతోంది. వంటగ్యాస్ సైతం విరివిగా వినియోగమవుతోంది. రోజూరెండు పాల పాకెట్లు తెస్తే ఉదయం, సాయంత్రం టీ, కాఫీలతో పాటు కొద్దిగా పెరుగు కూడా చేసుకొనేవాళ్లం. ఇప్పుడలా కాదు. రోజుకు 4 పాకెట్లు ఖర్చవుతున్నాయని చెప్పారు సికింద్రాబాద్‌కు చెందిన కల్పన. గతంలో నాన్‌వెజ్ వారానికిరెండుసార్లు వండుకొనేవాళ్లం. ఇప్పుడు నాన్‌వెజ్ వినియోగం పెరిగింది. పిల్లల కోసం చికెన్ పకోడా, చికెన్ మలాయికోస్త,పీస్ మసాలా వంటి వెరైటీలు చేసుకుంటున్నామంటున్నారు కేపీహెచ్‌బీకి చెందిన కమలాదేవి సాక్షి, సిటీబ్యూరో: లాడ్‌డౌన్. హోటళ్లు.. రెస్టారెంట్లు బంద్, మెస్సులు లేవు. టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు కనిపించవు. బయట చాయ్ తాగాలన్నా చిక్కులే. కారణం కరోనా. ఏంతినాలన్నా ఇంట్లో తయారు చేసుకోవలసిందే. ఉదయం టీ, కాఫీ మొదలుకొని సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాల వరకు అన్నీ ఇంట్లో వండుకోవలసిందే. దీంతో నగరంలో ఇంటిఫుడ్ వినియోగం బాగా పెరిగింది. గతంలో ఉదయం టిఫిన్ చేసి లంచ్ బాక్సులు సర్దుకొని పిల్లలు స్కూళ్లకు, పెద్దవాళ్లు ఆఫీసులకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకొనేవారు. ఇక రాత్రి భోజనాల కోసం ఏదో ఒకటి వండుకొని తినేస్తే ఆ రోజు గడిచిపోయేది. పైగా వీకెండ్ సెలవులు, ఆదివారాలు, ఏ హోటలుకో, రెస్టారెంటుకో వెళ్లి ఇంటిల్లిపాది చక్కగా హాయిగా భోంచేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు లాక్డౌన్.. అన్నింటికీ బ్రేక్‌లు వేసింది. పానీ పూరీ మొదలుకొని పావ్‌బాజీ వరకు, ఇడ్లీ, వడ, చపాతి వంటి ఉదయపు అల్ఫాహారం నుంచి సాయంత్రం పూట ఆరగించే మిర్చీలు, ఆలూబజ్జీలు, జిలేబీలు, పిల్లలకు ఇష్టమైన కేకులు, ఐస్‌క్రీములు, స్వీట్లు...ఒకటేమిటి ఏం కావాలన్నా ఇంట్లో చేసుకోవలసిందే. దీంతో వంటింటిపైన భారం భారీగా పెరిగింది. ఉమ్మడి కుటుంబాల్లో వంటింటి పని భారం రెండు రెట్లు పెరిగింది. అందుకు తగినట్లుగానే గ్యాస్ వినియోగం కూడా బాగా ఎక్కువైంది. నలుగురు కుటుంబసభ్యులు ఉన్న ఇంట్లో గతంలో సిలిండర్ 35 రోజుల నుంచి 40 రోజుల వరకు వినియోగించుకొనేవాళ్లు. ఇప్పుడు 20 నుంచి 25 రోజులకే ఒక సిలిండర్ ఖర్చవుతుందని మౌలాలీ హౌసింగ్ బోర్డుకు చెందిన అన్నపూర్ణ తెలిపారు. ‘‘ పొద్దున పిల్లలకు టిఫిన్లు తినిపించేసి లంచ్ బాక్సులు పెట్టేస్తే సరిపోయేది. డబ్బులిస్తే స్కూళ్లలోనే ఏదో ఒకటి కొనుక్కొని తినేవాళ్లు, ఇప్పుడు అలాకాదు. పిల్లలతో సహా ఇంటిల్లిపాదికి టిఫిన్లు, స్నాక్స్ తప్పనిసరయ్యాయి. పని భారం పెరిగింది. వంటగ్యాస్వినియోగం కూడా ఎక్కువైంది.’’ అని చెప్పారు. వెరైటీల కోసం వెదుకులాట... నిత్యం ఉరుకులు పరుగులతోనిత్యం బిజీగా ఉండే నగరజీవి సాధారణంగా అయితే ఏదో ఒకటి తినేసి ఆకలితీర్చుకుంటాడు. తిరిగి పనిలో పడిపోతాడు. కానీ ఇప్పుడలా కాదు. పిల్లలు, పెద్దలు అంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఇంట్లో అందరి చూపులూ వంటింటిపైనే పడుతున్నాయి. ఏదో ఒక వెరైటీ కోసం వెదుకులాడుతున్నారు. గతంలో ఉదయం, సాయంత్రం మాత్రమే టీ,కాఫీ తాగేవాళ్లు ఇప్పుడు రోజుకు నాలుగైదుసార్లు తాగేస్తున్నారు. ‘‘ రెండు పాలపాకెట్లు తెస్తే ఉదయం, సాయంత్రం టీ,కాఫీలతో పాటు కొద్దిగా పెరుగు కూడా చేసుకొనేవాళ్లం. ఇప్పుడలా కాదు.రోజుకు 4 పాకెట్లు ఖర్చవుతున్నాయి. టీకాఫీలు ఎక్కువే తాగేస్తున్నాం.’’ అని చెప్పారు సికింద్రాబాదుకు చెందిన కల్పన. కాలక్షేపం కోసం టీలు తాగాల్సి వస్తోందంటూ విన్మయం వ్యక్తం చేశారు. మరోవైపు గతంలో వారానికి ఒకసారి మటన్, చికెన్ వండుకొనేవాళ్లు ఇప్పుడు వారంలో కనీసం రెండు, మూడుసార్లు తినేస్తున్నారు.పైగా వాటిలోనూ రకరకాల వెరైటీలు ఆరగించేస్తున్నారు. బిరియానీలు, పులావ్‌లు, ఫ్రైలు వంటి రకరకాల వెరైటీలు ఇళ్లల్లోనే వండుకుంటున్నారు. ‘‘ పిల్లల కోసం స్నాక్స్ చేస్తే వాళ్లు మాత్రమే తినరు కదా. ఇంట్లో అందరి కోసం ఎక్కువే చేయవలసి వస్తుంది. దీంతో వంటగ్యాస్ బాగా ఖర్చవుతుంది. గతంలో ఒక డబ్బా నిండా గారెలు చేస్తే కనీసం వారం, పది రోజులు వచ్చేవి. ఇప్పుడు నాలుగు రోజుల్లో డబ్బా ఖాళీ. ఇక స్వీట్లు కూడా అంతే. పెరిగిన వంట గ్యాస్ వినియోగం లాక్డౌన్లో ఇంటి వంటలు పెరగడంతో మహానగరంలో పది నుంచి ఇరవై శాతం వరకు వంట గ్యాస్ వినియోగం పెరిగింది. వంట గ్యాస్‌కు డిమాండ్ పెరిగినా.. బుకింగ్– బుకింగ్ కు మధ్య 14 రోజుల వ్యవధి నిబంధనతో సరఫరా మాత్రం సాధారణ రోజుల కంటే అదనంగా రెండు శాతానికి మించడం లేనట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో ప్రధాన చుమురు సంస్థలకు చెందిన సుమారు 26.21 లక్షల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో 60 శాతం వరకు సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, మిగతా 40 శాతం డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ఒక కుటుంబానికి ఏడు నుంచి 8 సిలిండర్లు, ఉమ్మడి కుటుంబానికి 11 నుంచి 12 సిలిండర్లు మించవు. సాధారణంగా మూడు ప్రధాన కంపెనీలకు చెందిన సుమారు 120కు పైగా డీలర్ల గోదాములకు కలిపి ప్రతి రోజు 80 వేల సిలిండర్లు వరకు దిగుమతి అవుతుండగా.. గృహ వినియోగదారులకు సుమారు 52 వేల 62 వేల వరకు సిలిండర్లు డోర్ డెలివరీ జరిగేది. తాజాగా మరో రెండు శాతం డెలివరీ పెరిగినట్లు గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. వాస్తవంగా గత నెల చివరి వారం లాక్డౌన్ విధించిన ఆరంభంలో వంటగ్యాస్ వినియోగదారుల ఆందోళన, ముందు జాగ్రత్త చర్యలతో ఒకే సారి చమురు సంస్థలకు గ్యాస్‌బుకింగ్ పెరిగింది. దీంతో ఆయిల్ కంపెనీలు అనవసర బుకింగ్‌ను కట్టడి చేసేందుకు 14 రోజుల వ్యవధికి నిబంధన అమలు వర్తింపజేయడంతో ఆ తర్వాత బుకింగ్ అదుపులోకి వచ్చింది. అప్పటికే బుకింగ్ జరిగిన కనెక్షన్లకు దశలవారిగా సిలిండరు డోర్‌డెలివరీ జరగడంతో వినియోగం పెరిగినా గ్యాస్ కొరత లేనట్లు కనిపిస్తోంది. వంట గ్యాస్ కొరత లేదు లాక్డౌన్లో వంట గ్యాస్ వినియోగం పెరిగింది వాస్తవమే. అయినా గ్యాస్ కొరత లేదు. ఎమర్జెన్సీ సర్వీసుల కింద సరఫరాయథావిధిగా ఉంటుంది. ఆందోళన చెందవద్దు. సిలిండర్ డోర్‌డెలివరీ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలి. కంటోన్మేంట్ జోన్‌ల్లోని గృహాలకు బారికేడ్ల వరకు మాత్రమే సిలిండర్ రీఫిల్ డెలివరీ చేస్తాం. సిలిండర్లను శుభ్రంగా డెటాల్స్‌తో శుభ్రపర్చుకోవాలి. – అశోక్, అధ్యక్షుడు,వంట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్, హైదరాబాద్ అందరి కోసం ఏదో ఒకటి చేయాల్సిందే లాక్డౌన్ వల్ల ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉంటున్నాం. కాబట్టి వంటలు ఎక్కువే చేయవలసి వస్తోంది. గతంలో నాన్‌వెజ్ వారానికి రెండుసార్లు వండుకొనేవాళ్లం. ఇప్పుడు నాన్‌వెజ్ వినియోగం పెరిగింది. అలాగే పిల్లల కోసం చికెన్ పకోడ, చికెన్మలాయీకోస్తా, పీస్ మసాలా వంటి వెరైటీలు చేస్తున్నాను. టీవీల్లో ఏ వెరైటీ వంటకం కనిపిస్తే ఇంట్లో అది చేసేయ్యాలని పిల్లలు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల కోసం వంట చేయడం కంటే టీ, కాఫీలు,స్నాక్స్ కోసం వంటింట్లో ఎక్కువగా గడపాల్సివస్తోంది. – కమలాదేవి, కూకట్పల్లి, హౌసింగ్ బోర్డు -
లాక్డౌన్ చెఫ్‌లు
లాక్డౌన్ సమయాల్లో ఇంట్లోనే ఉండిపోవడంతో ఇంటి పనుల్లో తమ వంతు సహాయం చేస్తున్నారు స్టార్స్. తమ ప్రతిభను బయటకు తీసుకొస్తున్నారు. ఈ మధ్యే రామ్‌చరణ్, మంచు విష్ణు చెఫ్‌లుగా మారారు. తన మిసెస్ కోసం రామ్‌చరణ్ డిన్నర్ తయారు చేస్తే, ఫ్యామిలీ కోసం సరదాగా కోకోనట్ చికెన్ తయారు చేశారు మంచు విష్ణు. ‘‘భర్తలందరూ వినండి, మిస్టర్ సి. (చరణ్‌ని ఉపాసన అలానే పిలుస్తారు) నాకోసం డిన్నర్ తయారు చేశారు. డిన్నర్ పూర్తయిన తర్వాత అవి శుభ్రం కూడా చేశారు. ఇలాంటి చిన్న చిన్న పనులే అతన్ని నా హీరోని చేస్తాయి’’ అని ట్వీట్ చేయడంతో పాటు చరణ్ వంట చేస్తున్న వీడియోను ఉపాసన షేర్ చేశారు. లాక్డౌన్ పూర్తయ్యేలోగా వంటలో మాస్టర్ అవుతానేమో? అంటున్నారు విష్ణు. వంట చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ‘‘కొబ్బరి బోండం లోపల చికెన్ రైస్‌ని బేక్ చేశాను. లాక్డౌన్ పూర్తయ్యేసరికి కొత్త కొత్త వంటకాల రెసిపీల పేటెంట్ హక్కులు తీసుకోవాల్సి ఉంటుందేమో?’’ అన్నారు విష్ణు. తనయుడు వంట చేస్తుంటే మోహన్‌బాబు పక్కనే ఉండి చూస్తున్నారు. -
సమోసా రెడీ
లాక్ డౌన్ కారణంగా అందరికీ వీలైనంత ఖాళీ సమయం దొరుకుతోంది. షూటింగ్‌లు, ప్రమోషన్లు లేకపోవడంతో సినిమా స్టార్స్ కూడా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాజల్ కూడా వంట గదిలోకి వెళ్లి సమోసాలు తయారు చేశారు. బాగా రావడంతో శబాష్ అనేసుకున్నారు కూడా. ‘‘తొలిసారి సమోసా చేశాను. చాలా బాగా కుదిరింది. మా అమ్మ ఆధ్వర్యంలో చాలా శుభ్రతను, క్వాలిటీని పాటిస్తూ తయారు చేశాను’’ అని పేర్కొన్నారు కాజల్. -
విల్లు వదిలి వంట గదిలో...
కోల్‌కతా: టోక్యో ఒలింపిక్స్ తర్వాత పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ఆ జంటకు కరోనా ‘శరా’ఘాతంలా తగిలింది. మెగా ఈవెంట్ ఏకంగా ఏడాదిపాటు వాయిదా పడటంతో వారి ప్రణాళిక మారిపోయింది. ఒలింపిక్స్‌కు సమయముంది కాబట్టి ఇక ముందుగా పెళ్ళికే వీరిద్దరు సిద్ధమైపోతున్నారు. భారత అగ్రశ్రేణి ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్ గురించే ఇదంతా. వీరిద్దరి నిశ్చితార్థం జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు వీరిద్దరు ఇప్పటికే అర్హత సాధించారు. రాంచీకి చెందిన దీపిక, ప్రస్తుతం కోల్‌కతాలో దాస్‌తో కలిసే ఉంటోంది. ఇప్పుడు లభించిన విరామంలో ఆమె దృష్టి ప్రస్తుతం విల్లంబులకంటే వంటగదిపైనే ఉంది. ఇదే విషయాన్ని తాను చెప్పుకుంది. ‘ఇప్పటివరకు నాకు అన్నం, కొంత వరకు పప్పు వండటం మాత్రమే వచ్చు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. ముఖ్యంగా చికెన్ వంటకాలంటే ఇష్టం. రాంచీ నుంచి మా అమ్మ ఆన్లైన్లో ఇవన్నీ నాకు నేర్పిస్తోంది. ప్రాణాయామంతో రోజు మొదలు పెడితే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నా పని వంట నేర్చుకోవడమే’ అని దీపిక చెప్పింది. దీపిక, అతాను దాస్ కలిసి ప్రస్తుతం తమ ఇంట్లోనే ఐదు మీటర్ల తాత్కాలిక రేంజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి అసలు లక్ష్యంతో పోలిస్తే ఇది ఏమాత్రం లెక్కలోనికి రాదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే ఏమీ చేయలేం. ఒక రకంగా ఇది కంప్యూటర్ గేమ్లాంటిదే. కానీ కనీసం ఆర్చరీని మరచిపోకుండా ఇది గుర్తు చేస్తున్నట్లు, క్యాంప్ మొదలయ్యే సమయానికి ఆటపై ఆసక్తి పోకుండా ఉంచుతుందనేది మా నమ్మకం. కనీసం రెండు గంటల పాటు ఇలా సాధన చేస్తున్నాం’ అని దీపిక వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్ ముగియగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా... ఇప్పుడు కరోనా నుంచి అంతా సాధారణ స్థితికి మారగానే వివాహ ఏర్పాట్లు మొదలుపెడతామని వీరిద్దరు చెప్పారు. దీపిక 2012, 2016 ఒలింపిక్స్‌లలో, అతాను 2016 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో జనం చస్తుంటే... చాలా మంది ఆకలితో అలమటిస్తుంటే సెలబ్రిటీలు వంటావార్పుల వీడియోలతో లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లు షేర్ చేయడాన్ని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్రంగా తప్పుబట్టింది. ట్విట్టర్ వేదికగా ఆమె ‘మన వంట వీడియోలు, రుచుల ఫొటోల పోస్టింగ్ పూర్తయ్యిందా లేదా’ అని ఘాటుగా స్పందించింది. ‘ఒక్కసారి ఆలోచిం చండి... మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న జనంలో వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది మంది ఒక పూట తిండి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో అలాంటి వీడియోలు షేర్ చేయడమేంటి’ అని సానియా అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం ప్రధాని మోదీ 49 మంది భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాను జయించేందుకు వారి సూచనలు, సలహాలు కోరిన సంగతి తెలిసిందే. -
కుకింగ్.. క్లీనింగ్
కోవిడ్ 19 (కరోనావైరస్)తో దేశవ్యాప్తంగా థియేటర్స్, షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా తారలందరూ హోమ్ క్యారంటైన్లో ఉన్నారు. షూటింగ్స్, ప్రమోషన్స్ ఎప్పుడూ బిజీగా ఉండే వీరికి కాస్త ఖాళీ సమయం దొరకడంతో రోటిన్‌కి భిన్నంగా ఎవరికి వారు తమకు తోచిన పనిలో నిమగ్నమైపోయారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే గరిటె తిప్పే పనిలో పడిపోయారు. బెండాకాయ వేపుడు చేశారు ఇలియానా. హౌస్ క్లీనింగ్ పనిలో పడిపోయారు తాప్సీ. ఓ చైనీస్ వంటకం చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ తన తండ్రి (అజయ్ శర్మ) కోసం స్వయంగా కేక్ చేశారు. వర్కౌట్‌కి సై అన్నారు సన్నీ లియోన్. చీపురు పట్టుకుని గార్డెను క్లీన్ చేశారు బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్. షూటింగ్‌కి బదులుగా కుకింగ్.. క్లీనింగ్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు తారలు. అనుష్కాశర్మ చేసిన కేక్, ఆదిత్యారాయ్ కపూర్, ఇల్లు క్లీన్ చేస్తున్న తాప్సీ ఇలియానా చేసిన కూర, సన్నీలియోన్, వరలక్ష్మీ చేసిన చైనీస్ డిష్ -
భయానకం : మనిషి మాంసంతో కూర వండాడు
లక్నో : తాగిన మైకంలో ఓ వ్యక్తి దెయ్యంలా ప్రవర్తించాడు. స్మశానవాటికకు వెళ్లి ఓ మృతదేహం చేయిని తీసుకువచ్చి కూర వండాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ టిక్కోపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. సంజయ్(32) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను హింసించేవాడు. పిచ్చిగా ప్రవర్తించేవాడు. తండ్రిపై కూడా ఇటీవలే దాడి చేశాడు. అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న స్మశానవాటికకు వెళ్లాడు. అక్కడ ఓ మృతదేహం చేయిని ఇంటికి తీసుకొచ్చాడు. చేతి వేళ్లను సెపరేట్ చేసి.. కూర వండాడు. ఈ విషయాన్ని గమనించిన అతని భార్య తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే పక్కింటివారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జీవితాన్ని వండి వడ్డించుకోండి
అరవై ఏడేళ్ల వయసులో ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. నిజానికి మలుపు తీసుకున్నది ఆమె జీవితం కాదు. ఆమే.. తనంతట తానుగా తన జీవితానికి కొత్త టర్నింగ్ ఇచ్చుకున్నారు. ఇప్పటి వరకు గృహిణిగా గరిట తిప్పడమే ఆమెకు తెలిసింది. ఆమె చేతి వంట రుచి చూసిన వాళ్లు ప్రశంసలు కురిపిస్తుంటే మురిసిపోవడమే ఆమెకు అందమైన అనుభవం. అలా.. వంట చేయడంలోని సంతోషాన్ని దశాబ్దాల పాటు ఆస్వాదించిన ఆమె.. ఇప్పుడు తన వంటల్ని అక్షరబద్ధం చేశారు. ‘అథెంటిక్ గోదావరి నాన్ వెజ్ రెసిపీస్’ అనే ఆ పుస్తకం నిన్న మహిళా దినోత్సవం రోజు విడుదలైంది. ఈ సందర్భంగా తనను కలిసిన సాక్షితో విజయ మాట్లాడారు. ‘‘టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చేతిలో ఉన్న పుస్తకాన్ని మించినది మరొకటి ఉండదు’’ అంటారు విజయామూర్తి. ‘‘నేను ఒక యూ ట్యూబ్ చానెల్ వాళ్ల కోసం వంటల వీడియోలు చేశాను. కానీ మా అబ్బాయి.. ‘పుస్తకమే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. పుస్తకం రాయకూడదా అమ్మా..’ అని అడిగాడు. అందుకే మా గోదావరి మాంసాహార వంటలను అక్షరబద్ధం చేశాను. ‘ఉమెన్స్ డే’ రోజు పుస్తకాన్ని ఆవిష్కరించాలనే ఆలోచనతో గత డిసెంబర్లో నా ప్రయత్నం మొదలు పెట్టాను. నేను తెలుగులో రాసిన తర్వాత మా కోడలు ఇంగ్లిష్‌లోకి అనువదించింది. ఇందుకోసం ఫొటో గ్రాఫర్‌ను పెట్టించి మరీ ప్రతి వంటనూ ఫొటో తీశాం. ఈ తరం అమ్మాయిలకు కందిపప్పుకి, పెసరపప్పుకి తేడా తెలియడం లేదు. అందుకే వంటలో ఉపయోగించే దినుసులను కూడా ఫొటో తీయించాం. వీడియోలు 150 వంటలు చేశాను. కానీ పుస్తకంలో తొలి ప్రయత్నంగా యాభై వంటలను మాత్రమే రాశాను. ఇదీ నేపథ్యం మాది రాజమండ్రి. నా చిన్నప్పుడే మా కుటుంబం హైదరాబాద్‌కి వచ్చేసింది. నాకు బీఎస్సీ పూర్తయిన తర్వాత పెళ్లయింది. అత్తగారిల్లు కాకినాడ. నాన్నగారు, మామగారు కూడా న్యాయమూర్తులే. మా వారికి నచ్చినట్లు వండడం కోసం ఆయనకు ఇష్టమైన వంటలను మా అత్తగారు, పిన్నత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మా పుట్టింట్లో, అత్తగారింట్లో బంధువుల రాకపోకలు ఎక్కువ. ఇంటికి వచ్చిన అతిథులు నా వంటలను మెచ్చుకుంటూ ఉంటే... ఎక్కడ లేని సంతోషం కలిగేది. తర్వాత పిల్లల స్నేహితుల నుంచి కూడా ప్రశంసలు వెల్లువలా వచ్చి పడేవి. అలా వండడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేసేదాన్ని. తనకు నలభై ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికీ మా అబ్బాయి నా వెంట తిరుగుతూ ‘‘అమ్మా ఏం వండుతున్నావు’’ అని అడుగుతాడు. తినేటప్పుడు కూడా ‘‘అమ్మా! వచ్చే తరానికి ఈ వంటలు గుర్తుండవు. ఒక తరం గ్యాప్ వస్తే చాలు... ఆ తర్వాత పిల్లలు కూడా పూర్తిగా మర్చిపోతారు. ఏదో ఒకటి చేద్దాం’’ అనేవాడు. ‘‘రాయడానికి ప్రయత్నించు, రాయగలుగుతావు’’ అని కూడా చెప్పేవాడు. ఇంతగా చెప్తున్నాడు కదా... అని రాయడం మొదలు పెట్టాను. ఒక్కొక్క వంట తయారీని రాస్తుంటే ఎంత ఆనందంగా ఉండేదో మాటల్లో చెప్పలేను. అయితే నేను రాయడాన్ని ఇంతటితో ఆపాలనుకోవడం లేదు. ఈ పుస్తకం ఆవిష్కరణ పూర్తయింది. ఇక పచ్చళ్ల తయారీ, పొడుల తయారీ పుస్తకాలు రాస్తాను’’ అని చెప్పారు విజయామూర్తి. పుస్తక రచయిత అనే హోదా తనకు కొత్త ఉత్సాహాన్నిస్తోందన్నారు. ఇద్దరూ నేర్చుకోవాలి‘‘ వినడానికి ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ... ఈ తరంలో చాలా జంటలు విడిపోవడానికి కారణం వంటే. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇంటికి వచ్చి ఏదో ఒకటి వండుకోవడానికి ప్రయత్నిస్తారు. వంట సరిగ్గా రాకపోవడం వల్ల డైనింగ్ టేబుల్ దగ్గర చిరాకులు మొదలవుతాయి. ఆ చిరాకులు బంధాలను బలహీన పరిచే వరకు కూడా కొనసాగుతాయి. ఆహారం అనుబంధాలను పెంచుతుంది. ఈ తరం అబ్బాయిలు–అమ్మాయిలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వండడం కూడా ఇద్దరూ నేర్చుకోవాలి. వైవాహిక జీవితాలను అందంగా అల్లుకోవాలి’’ అన్నారామె. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: జి. అమర్ -
చారెడేసి చానెల్
ఒక అన్నా.. చెల్లి. చెల్లి వచ్చి ‘అన్నా.. ఈ రోజు కొత్త వంటకం నేర్చుకున్నాను’ అని చెప్పింది. ‘ఓహ్.. నాకూ నేర్పించు’ అన్నాడు అన్న. అలా రోజూ రకరకాల కొత్త వంటకాల గురించి ఈ అన్నాచెల్లెళ్లిద్దరూ తెలుసుకొని..నేర్చుకొని.. పదిమందికీ నేర్పించే పని పెట్టుకున్నారు ‘ది టైనీ ఫుడ్’ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా. టైనీ పేరుకు తగ్గట్టే ఆ చానెల్ వీడియోల్లో కనిపించే వంట సామాగ్రి అంతా బొమ్మలాటలో ఉండే బొమ్మల్లాగే చిన్నగా ఉంటాయి. చిన్న మట్టిపొయ్యి. దానికి సరిపోయే చిన్న చిన్న మట్టి పాత్రలు.. అంతే చిన్న మట్టి బాండీ.. బుజ్జి పెనం.. బుల్లి అప్పడాల కర్ర, అట్ల కాడ, చిన్న చిన్న చెంచాలు.. అన్నీ మట్టివే. అచ్చంగా బొమ్మలాట చూస్తున్నట్టే ఉంటుంది. ఈ యూట్యూబ్ చానెల్‌కు జపాన్ కుకింగ్ చానెల్సే స్ఫూర్తి. స్థానిక సంప్రదాయ వంటకాల నుంచి ప్రపంచ నలుమూలలకు చెందిన వంటకాల వరకు అన్నిటినీ చేసి చూపిస్తూంటారు ఈ చానెల్లో. ఆట వస్తువుల్లాంటి పాత్రలతో వంటలు చేయడం సరే.. ఆ వంటలను ఎలా చేయాలో వివరించే ఈ అన్నాచెల్లెళ్లూ బొమ్మలే. తోలు బొమ్మలు! మరి ఈ చానెల్ నిర్వహిస్తున్నదెవరంటారా? తమిళనాడుకు చెందిన వాలర్మతి, రామ్‌కుమార్ అనే దంపతులు. వాలర్మతి ఉద్యోగిని. రామ్‌కుమార్‌ది గోల్డ్‌లోన్ బిజినెస్. వారంతంలో ఈ యూట్యూబ్ వంటల చానెల్ పని పెట్టుకుంటారు. ‘కుకింగ్ అంటే మా ఇద్దరికీ ఆసక్తే. అయితే యూట్యూబ్ చానెల్ ఆలోచన వచ్చింతర్వాత.. కాస్త వెనకడుగు వేశాం. ఇప్పటికే బోలెడు వంటల చానెళ్లున్నాయి. వాళ్లందరికన్నా కొత్తగా ఉండాలి అనుకున్నాం. అప్పుడే జపాన్‌కు చెందిన ఈ టైనీ చానెల్స్ కంటపడ్డాయి. రెండు పప్పెట్స్‌ను తయారు చేసి.. షెఫ్స్గా అవి వివరిస్తుంటే నేను వంట చేయడం.. అన్నట్టుగా ప్లాన్ చేశాం. సక్సెస్ అయింది. కాని ఎంత కష్టమో తెలుసాండీ.. చిన్న చిన్న వంట పాత్రలతో వంట చేయడం?ఎన్నిసార్లు చేయి కాల్చుకున్నానో! ’అంటుంది వాలర్మతి. ఈ చానెల్‌కు ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారట. ఇదీ ‘ది టైనీ ఫుడ్’ యూట్యూబ్ కుకింగ్ చానెల్ టేల్. -
గరిటె పట్టేందుకు సమయం ఏదీ?
ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చూపుల సమయంలో.. ఇంటి పనులు వచ్చా..? వంట చేస్తుందా..? సంగీతం నేర్చుకుందా?.. ఇలా అడిగేవారు. ఇప్పుడు తరం మారింది. అమ్మాయి ఏం చదువుతోంది?.. ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?.. జీతం ఎంత?.. అని అడుగుతున్నారు. ఇంటి, వంటకు పని మనుషులు.. ఇష్టమైనవి తినాలంటే హోటల్ నుంచి పార్సిల్స్.. వీలైతే రెస్టారెంట్లో భోజనం.. ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో ఇదే పరిస్థితి. కారణం నేటి తరం ఆడ పిల్లలు వంట గది వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పుస్తకాలు పట్టిన చేతులు గరిటె పట్టడానికి రావడం లేదు. ‘ చదువులో పడి వండినవి కూడా తినేందుకు సమయం ఉండటం లేదు. ఇంకా వంటెప్పుడు నేర్చుకుంటారు’ అని తల్లిదండ్రులే తమ పిల్లల గురించి చెబుతున్నారు. –కర్నూలు(హాస్పిటల్) ‘ఆమె చేతి వంట అద్భుతం’.. ఇలాంటి అభినందన అందు కోవాలంటే సామాన్య విషయం కాదు. నలుగురు మెచ్చేలా వంటలు చేయడం ఓ కళ. అయితే గరిటె తిప్పడంలో నేటితరం ఆడపిల్లల్లో ఇవన్నీ నేర్చుకోవడానికి సమయం ఉండటం లేదు. ఎదిగే వయస్సులో వారి సమయమంతా చదువుకే సరిపోతోంది. ఫలితంగా వంటా వార్పు నేర్చుకునేందుకు వారికి వీలులేకుండా పోతోంది. ఈ విషయాలన్నీ గమనించి ఇప్పుడు పెళ్లి చూపుల్లో సైతం వంట పనులకు మినహాయింపులిస్తున్నారు. పెళ్లయ్యాక భార్యకు వంట పనుల్లో భర్తలూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇద్దరూ యూట్యూబ్‌లు చూసి వంటలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆధునిక యువతికి అర్హతలు మారుతున్నాయి. ఒకప్పటి కొలమానాలు కాలక్రమేణా ఇప్పుడు తొలగుతున్నాయి. చదువుల ధ్యాసలో పడి అమ్మాయిలు వంటనేర్చే సమయం ఉండటం లేదు. దీంతో ఇప్పుడు వారిని చేసుకునే వారు సైతం అప్పటిలా కండిషన్లు పెట్టకుండా సర్దుకుపోతున్నారు. జిల్లాలో 44 లక్షల జనాభా ఉంది. అందులో 23 లక్షల మందికి పైగా మహిళలు ఉన్నారు. ఇందులో వివాహ వయస్సున్న యువతుల సంఖ్య 8 లక్షల దాకా ఉన్నట్లు అంచనా. వీరిలో 60 శాతం దాకా కాస్త మంచి చదువులు చదివిన వారే ఉన్నారు. వీరు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత చదువుల వరకు చదువుకోవడం కోసమే అధిక సమయం వెచ్చిస్తున్నారు. పాతికేళ్ల క్రితం నాటికి ఇప్పటికీ చదువుకునే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. నగరాలు, పట్టణాల్లో కూలీ పనిచేసుకునే వారు సైతం తమ ఇంట్లో మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. గతంలో ఒకవర్గం వారు అమ్మాయిలను చదువుకు దూరంగా ఉంచేవారు. ఇప్పుడు వారు కూడా అందరితో సమానంగా చదివిస్తున్నారు. స్థానికంగా ఇంటికి కాస్త దూరంగా ఉండే పాఠశాలకు పంపి చదివించడానికి వెనుకాడే వారు సైతం ఇతర నగరాలకు తమ ఇంటి ఆడపిల్లలను పంపి చదివిస్తున్నారు. దీనికితోడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు ఈరియంబర్స్మెంట్ పథకంతో ఉన్నత చదువులు చదివే వారి సంఖ్య పెరిగింది. దీనికితోడు క్యాంపస్ సెలెక్షన్లలో ఉద్యోగాలు రావడంతో ఒకరిని చూసి మరొకరు ఆడపిల్లలను చదివిస్తున్నారు. నెట్టింటి సాయం.. కొంత మంది అమ్మాయిలు ఒకవైపు చదువుతూనే ఖాళీ సమయాల్లో ఇంట్లో వంటావార్పు కూడా నేర్చుకుంటున్నారు. కాఫీ, టీతో మొదలు పెట్టి టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి భోజనం వండటం అభ్యసిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆన్లైన్ వంటలను ఫాలో అవుతున్నారు. యూ ట్యూబ్‌లు, టీవీ ఛానళ్లల్లో వచ్చే కొత్తరకం వంటలను ఇంట్లో ప్రయత్నిస్తూ ఇంట్లో వారికి కొత్త రుచులు చూపిస్తున్నారు. అయితే చదివే సమయంలో వంట నేర్చుకోని వారు సైతం ఇప్పుడు యూ ట్యూబ్ ద్వారా వంటలను నేర్చుకుంటున్నారు. చదువుకే టైమ్ సరిపోవడం లేదు ఇప్పటి కాలం పిల్లలు ఎక్కువగా చదువుతున్నందున వారికి వంట నేర్చుకునే టైమ్ ఉండటం లేదు. చదువు తర్వాత క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ తర్వాత వెంటనే పెళ్లి చేస్తున్నారు. ఇక వారు వంట నేర్చుకునే సమయం ఉండటం లేదు. అధిక శాతం మందికి కేవలం తెల్ల అన్నం మాత్రమే వండటం వచ్చు. టిఫిన్లు, కూరలు, పప్పు, పెరుగు అన్నింటికీ కర్రీపాయింట్లు, హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు హోటళ్లల్లో పార్సిల్ కట్టించుకుని వచ్చి తింటున్నారు. అత్తారింట్లో వంటావార్పు రావడం లేదని కోడళ్లను తిడుతున్న సంఘటనలు, దీనివల్ల రెండు కుటుంబాలకు గొడవలు అక్కడక్కడా జరుగుతున్నాయి. – చిన్నయ్య, వివాహాల మధ్యవర్తి, కర్నూలు మధ్యతరగతి ఇళ్లల్లో నేర్చుకుంటున్నారు గతంలో అక్షరాస్యత తక్కువ. ఇంట్లో ప్రతి పని మనమే చేసుకునే పరిధి ఉండేది. ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది. చదువులో పడి ఇతర పనులను మరిచిపోతున్నారు. సెల్ఫోన్లు, టీవీల వల్ల కూడా వాటి ధ్యాసలో పడి వంటావార్పు నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందులో స్త్రీ, పురుష బేదం ఉండటం లేదు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా చదివిస్తున్నారు. ఈ కారణంగా చదువుకునే సమయంలో వంట నేరి్పంచేందుకు ఉత్సాహం చూపడం లేదు. అయితే ఇప్పటికీ ఒకవైపు చదువుతూనే మరోవైపు వంట నేర్చుకునే అమ్మాయిలు ఉన్నారు. – రామస్వామి, తెలుగువీధి, కర్నూలు మగపిల్లలు నేర్చుకుంటున్నారు యువతులకు వంట దూరమైంది. గతంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల ఉండేది. ఇంటికి వచ్చిన వెంటనే వారు తల్లికి సహాయంగా ఉండేవారు. ఇప్పుడు పొద్దున వారు రెడీ కావడానికే సరిపోతోంది. ఇప్పుడు ఉదయం 7 గంటలకు వెళ్లి రాత్రి 8 గంటలకు వస్తున్నారు. దీంతో పాటు పెద్ద చదువులు చదువుతూ వంటకు దూరం అవుతున్నారు. పెళ్లి ఖాయమైన సమయంలో మాత్రమే వంట నేర్చుకుంటున్నారు. దీంతో ఇప్పుడు మగపిల్లలు కూడా వంట నేర్చుకుంటున్నారు. దీనికితోడు రెడీమేడ్‌గా ఆహారం లభించడం, డబ్బు అధికంగా ఉండటంతో వంటావార్పుకు దూరం అవుతున్నారు. –యాన్నీ ప్రతాప్, చాణిక్యపురికాలని, కర్నూలు -
బస్టాండ్ సమీపంలో వంటవార్పు
-
బిర్యానీ కావాలా బాబూ?
ఆదివారం కావడంతో రొటీన్‌కు భిన్నంగా షూటింగ్ లొకేషన్‌కు కాకుండా వంట గదిలోకి అడుగుపెట్టారు జాన్వీ కపూర్. సుదీర్ఘంగా ఆలోచించి వెజిటబుల్ బిర్యానీ చేయడానికి సిద్ధమయ్యారు. వెంటనే రెసిపీని ఫాలో అవుతూ రెడీ చేసేశారు. సందేహాలు వచ్చినప్పుడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ సహాయం తీసుకున్నారు. జాన్వీ చేసిన ఈ వెజిటబుల్ బిర్యానీని మీరాతో పాటు, ఇషాన్ కట్టర్, షాహిద్‌కపూర్ కూడా రుచి చూశారట. వీరందరూ కలిసి ఆదివారం బ్రంచ్ చేశారు. జాన్వీ చేసిన వెజిటబుల్ బిర్యానీని సోషల్ మీడియాలో షేర్ చేశారు మీరా రాజ్‌పుత్. ‘‘రెడ్ రైస్ వెజిటబుల్ బిర్యానీ చేసిన జాన్వీ కపూర్‌ను మెచ్చుకోవాల్సిందే’’ అని పేర్కొన్నారు మీరా. ఇక జాన్వీ కెరీర్ విషయానికి వస్తే.. ‘గుంజన్ సక్సెనా: ది కార్గిల్‌గాళ్’, ‘రూహి అఫ్జా’ సినిమాలతో పాటు ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఆంథాలజీలో నటిస్తున్నారు. -
మట్టి మూకుడు రొట్టె రుచే వేరు..
సాక్షి, అంబాజీపేట: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరూ ఫిజా.. బగ్గర్లు.. పాస్ట్ ఫుడ్ వైపు చూస్తున్నారు. కాని కోనసీమలో మాత్రం మూకుడు రొట్టె కోసం ప్రియిలు సాయంత్రం సమయంలో మూకుడు రొట్టె కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఉదయం పూట ప్రతీ ఒక్కరూ ఆల్ఫాహారం తీసుకోవడం సర్వసాధరణం. ఇడ్లీ, పూరీ, బజ్జీ, గారె తదితరవి అల్పాహారాలు తీసుకుంటాం. చల్లని సాయంత్రం సమయంలో వేడే వేడి మూకుడు రొట్టె, పైగా మట్టి మూకుడులో సంప్రదాయ ఇంధనంతో తయారు చేసిన మినపరొట్టెను అరటి ఆకులో వేసుకుని తింటూ ఉంటూ ఆరుచికి లొట్టలేసుకుని మరీ తింటున్నారు టిఫిన్ ప్రియులు. వివరాల్లోకి వెళితే అంబాజీపేట మండలం ముక్కామలలో ఒక చిన్న పూరి పాకలో కాల్వగట్టుపై చిన్న హోటల్ ఉంది. అబ్బిరెడ్డి సత్యనారాయణ గత 50 ఏళ్ల నుండి ఈ పూరి పాకలో మినపరొట్టెను సాయంత్రం సమయంలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మట్టి మూకుడులో నిప్పులపై కాల్చిన మినపరొట్టె ఎంత రుచో మాటల్లో చెప్పలేమని రొట్టె ప్రియులు చెబుతున్నారు. పావలా నుండి రూ.15 వరకు గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ హొటల్ మినపరొట్టెకు ఫేమస్. 25 పైజల నుండి నేటు రూ.15 రూపాలయు విక్రయిస్తూనే ఉన్నానని సత్యనారాయణ తెలిపాడు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హొటల్ నిర్వహిస్తానని చెబుతున్నాడు. ప్రతీ రోజు సుమారు 100 నుండి 150 మినప రొట్టెలను విక్రయిస్తానంటున్నాడు. సాంప్రదాయ ఇంధనంతో తయారీ.. మట్టి మూకుడులో మినపరొట్టె తయారీకి సత్యనారాయణ ఇంధనాన్ని మాత్రమే వినియోగిస్తాడు. ఇటుకలపొయ్యిపై కొబ్బరి డొక్కలను ఉపయోగిస్తాడు. మట్టి మూకుడులో మినపపిండి వేసి దానిపై మూత ఉంచి కింద పైన డొక్క నిప్పుల సెగతో రొట్టెను తయారు చేస్తాడు. అరటి ఆకులోనే సరఫరా టిఫన్ ప్లేట్లలో ప్లాస్టిక్ పేపర్, గ్లాసులు కూడా వాడకుండా అరటి ఆకులో టిఫిన్ వేసి సరఫరా చేస్తున్నాడు. 50 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మట్టి మూకుడు, నిప్పుల పొయ్యి తప్ప దేనిపైనా వండలేదని చెబుతున్నాడు. రంపచోడవరం: గిరిజనుల ఆహారంలో ప్రత్యేకమైనది వెదురు కూర. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. వెదురు కోకిం కుసీర్ అని పిలిచే వెదురు కూరను ఇంగ్లిషులో బాంబూ షూట్ అని అంటారు. అడవిలో వెదురు బొంగులు ఏర్పడడానికి ముందు లేత మొక్కలు (వెదురు కొమ్ములు) వస్తాయి. ఆ దశలో అవి భూమిలో నుంచి పైకి రాగానే వాటిని కట్‌చేసి పై పొరను తీసేసి శుభ్రం చేసి గోరువెచ్చని నీటిలో ఉడకబెడతారు. అనంతరం వాటిని సన్నగా తురిమి కారం, మసాలా దినుసులు కలిపి కూరగా వండుతారు. కొంతమంది వాటిని ఎండబెట్టి కొన్నిరోజుల తరువాత కూడా కూరగా వండుకుంటారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజనులు వెదురు కొమ్ములను సేకరించి కొమ్ములుగా లేక సన్నగా తరిగి సంతల్లో విక్రయిస్తున్నారు. వెదురు కొమ్ములతో పచ్చళ్లు కూడా తయారు చేసి పట్టణాల్లోని గిరిజన స్టాల్స్‌లో విక్రయిస్తున్నారు. -
పదార్థాల్లేని వంట
పూర్వం ఒకసారి ఒక ప్రాంతంలో తీవ్ర క్షామం ఏర్పడింది. అంటే వర్షాలు పడక పంటలు ఎండిపోయి, గడ్డి కూడా మొలవని పరిస్థితి అన్నమాట. ఒకాయన అక్కడ వర్షాలు పడేంతవరకు ఎలాగూ పనిదొరకదు కాబట్టి ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవాలనుకున్నాడు. కుటుంబ సభ్యులను తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించారు. పిల్లల్లో చిన్నవాడు ఆకలి అనడంతో ఏదైనా వండుకుని తిని ఆకలి తీరాక ప్రయాణం కొనసాగించాలనుకున్నారు. తల్లి రాళ్లు తెచ్చి పొయ్యి తయారు చేసింది. తండ్రి నీళ్ల కోసం వెళ్లాడు. అబ్బాయి, అమ్మాయి చెట్టు కింద ఉన్న ఎండుపుల్లలు ఏరి నిప్పు రాజేస్తున్నారు. ఈ విధంగా అందరూ తలోపనిలో ఉండటాన్ని చెట్టుపైనుంచి పక్షులు చూస్తున్నాయి. వాటిలో పెద్ద పక్షి మిగిలిన వాటితో ‘‘వీళ్లు చూస్తే ఒట్టి తెలివితక్కువ వాళ్లలా ఉన్నారు. వండుకోవడానికి పదార్థాలేమీ లేకుండానే వంట ప్రయత్నాలు మొదలు పెట్టారు’’ అంటూ నవ్వింది. ఆ మాటలు విన్న పెద్దవాడికి కోపం వచ్చింది. ‘‘ఇప్పటివరకు ఏదైనా దుంపలు తవ్వుకు తీసుకొచ్చి వండుకు తినాలనుకుంటున్నాము. ఇప్పుడు మీరు మమ్మల్ని ఎగతాళి చేశారు కాబట్టి, మిమ్మల్నే పట్టుకుని వండుకుని తింటాం’’ అన్నాడు కోపంగా. ఆ మాటలకు పెద్దపక్షి భయపడింది. ‘‘బాబూ! కుటుంబమంతా కలిసి ఉండటంలోని సంతోషం నీకు తెలుసు కదా. మా పక్షి పరివారాన్ని చంపకండి. అందుకు బదులు మేము మీకు ఒక నిధి చూపిస్తాం వెళ్లి తెచ్చుకోండి. ఈలోగా మీకు ఆకలి తీరేందుకు కొన్ని పళ్లు, దుంపలు చూపిస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి’’ అని బతిమాలింది. అందుకు అందరూ సంతోషంగా అంగీకరించారు. ఆ కష్టకాలంలో వారికి లభించిన నిధితో ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ కథను ఒక గురువు తన శిష్యులకు చెప్పి, ‘‘చూశారా పిల్లలూ! పరిస్థితులను తలచుకుని భయపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. మన ప్రయత్నం చేయాలి. అప్పుడే అన్నీ అనుకూలిస్తాయి. ఆ కుటుంబం పదార్థాలేమీ దొరక్కుండానే వంట మొదలు పెట్టి అలా ఆశావహ దృక్పథంతో ప్రవర్తించింది కాబట్టే వారికి నిధి దొరికిందని గ్రహించండి’’ అని బోధించారు. పిల్లలు అర్థమైందన్నట్టు తలలు పంకించారు. – డి.వి.ఆర్. -
9నెలలకే వీరు తెగదెంపులు చేసుకుందామా అనుకున్నారు!
సంసారం ఉల్లిపాయలాంటిది.ఎన్నో పొరలుంటాయి.ప్రతి పొరలోనూ ఒక కథ ఉంటుంది. పొరలు విప్పుకుంటూ..భార్యాభర్తలు కలిసి జీవించాలి. అలా కాకుండా.. సంసారాన్ని కోసుకుంటే కన్నీళ్లే. రెస్టారెంట్లో పాట లోగొంతుకలో వినిపిస్తూ ఉంది. కిశోర్ పాడుతున్నాడు.‘తుమ్ ఆగయేహో... నూర్ ఆగయా హై’...‘ఇది గుల్జార్ సినిమాలోది అనుకుంటాను’ అన్నాడు వెంకట్ ప్లేట్లో ఉన్న పదార్థాన్ని కొద్దిగా నోట్లో పెట్టుకుంటూ.‘మీకు గుల్జార్ తెలుసా’ అంది అనిత కొంత మెరుపు తెచ్చుకుంటూ.‘పెద్దగా తెలియదు. కాని హిందీ పాటలు వింటాను’‘థాంక్ గాడ్... పాటలు తెలియని అబ్బాయితో పెళ్లి చూపులేమోఅనుకుని కొంచెం భయపడ్డాను’ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసగా చూసుకున్నారు.పెద్దలు కుదిర్చిన పెళ్లిచూపులు అమ్మాయి ఇంట్లో నాలుగురోజుల క్రితమే ముగిశాయి. రెండు మూడుసార్లు కలిశాక ఏ సంగతి చెబుతాం అని ఇద్దరూ అన్నారు. ఇది మొదటి మీటింగ్.‘నాకు పాటలు ఇష్టం. చేనేత వస్త్రాలు ఇష్టం. భూపేన్ హజారికా, కైలాష్ ఖేర్‌ను అభిమానిస్తాను. ఊటీ నైనిటాల్ కంటే మన మదనపల్లి పక్కన ఉన్న హార్స్లీ హిల్సే ఇష్టం’ చెబుతోంది అనిత.‘నాక్కూడా పాటలు ఇష్టమే. కాకపోతే నేను ఎస్.జానకి ఫ్యాన్‌ని. రామ్రాజ్ యాడ్‌లో వెంకటేశ్‌లా కాకపోయినా సింపుల్‌గా ఉండే బట్టలే ఇష్టం.ట్రావెలర్‌ని కాదుగాని లోకల్ కల్చర్, పల్లెటూళ్లు... వీటిలో మీతో ఒక రెండు మూడు రోజులు ఉండమంటే సంతోషంగా ఉంటాను. చిన్న డౌట్?’ ‘అడగండి’‘ఒకవేళ మనకు పెళ్లయితే రాత్రి పది తర్వాత కూడా పాటలు వింటూ కూర్చోరుగా’నవ్వింది. నోట్లో ఉన్న సాంబర్ ఇడ్లీ గొంతులోకి వెళ్లి పొలమారేంత నవ్వు వచ్చింది.వాళ్ల మనసులు పెళ్లికి సిద్ధమయ్యాయి.అంతా కుదిరినట్టే అనుకన్నారు.కాని ఒకటి రెండు ముఖ్యమైన ప్రశ్నలు మర్చిపోయారు. వెంకట్ తల్లిదండ్రులు ఇండిపెండెంట్ స్వభావం ఉన్నవాళ్లు. పైగా ఈ కాలపు ధోరణి తెలిసినవాళ్లు. కొడుకు పెళ్లి కావడంతోటే మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకొనేలా చేసి విడిగా కాపురం పెట్టే ఏర్పాటు చేశారు.ఏడంతస్తుల ఫ్లాట్. టాప్ ఫ్లోర్లో కొత్త జంట. ఇద్దరూ ఆఫీసులకు వెళతారు. ఇద్దరూ ఆఫీసు నుంచి వస్తారు. డిన్నర్ సాధారణంగా బయటే ఉంటుంది. లేదంటే స్విగ్గీ, జొమోటో ఉండనే ఉంది. అతడు ఆమె చేయి పట్టుకుని సోఫాలో పక్కన చేరి టీవీ ఆన్ చేస్తాడు. కబుర్లు నడుస్తాయి. బాగా నవ్వుకుంటారు. నిశ్శబ్దం పాటించాల్సిన సమయంలో కూడా కళ్లు విపరీతంగా మెరుస్తాయి.మంచి జోడి అని ఇద్దరికీ అనిపిస్తూ ఉంది.ఆరునెలలు గడిచే వరకు ఏ జంటకైనా ఇలాగే అనిపిస్తుంది కాబోలు.ఒకరోజు వాట్సప్‌లో హైదరాబాద్ హోటళ్లలో కల్తీ తిండి క్లిప్పింగ్ ఒకటి విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. ‘బయటి తిండి ఇక మానేయాలి’ అన్నాడు వెంకట్.‘అవును... పొట్టంతా ఏదో అవుతోంది’ అంది అనిత.ఆనాటితో వారి అసలైన కాపురం మొదలైంది. ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు. ఇద్దరివీ బాధ్యతాయుతమైన ఉద్యోగాలు. ఇద్దరికీ మంచి జీతం ఉంది. ఇద్దరూ బయటికెళ్తారు. ఇద్దరూ ఇంటికొస్తారు. కాకుంటే చిన్న తేడా. అతడు మగాడు. ఆమె ఆడది.ఆమెకు రాత్రి వచ్చేసరికి ఎనిమిది అయిపోతుంది. అప్పుడు వంట చేయాలి. తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది. తిన్నాక మళ్లీ వంటిల్లు చక్కబెట్టాలి. పదీ పదిన్నర అయిపోతుంది. ఆ తర్వాత నిద్ర పోవాలి.పన్నెండు అయిపోతుంది. కాని తెల్లారి మళ్లీ లేవాలి. బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఆఫీసుకు రెడీ అవ్వాలి. ఒకరోజు, రెండ్రజులు, మూడ్రోజులు... మెల్లగా ఆమెకు ఒకటి అర్థమైంది. ఇది అనంతం. స్త్రీకి అనంతం. దానికి తోడు తనకు వంట సరిగా రాదు. అన్నిసార్లు కుదిరి చావదు. తనకేం జరుగుతున్నదో వెంకట్‌కు పట్టదు.‘వంట చేసే పని మనిషిని పెట్టుకుందామా’ అంది ఒకరోజు.‘అలాగే’ అన్నాడతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.కాని కాపురంలో మూడో మనిషి ప్రమేయం అన్నిసార్లు సుఖంగా ఉండదు. ఆ పని మనిషి ఉదయం ఆరున్నర ఏడుకు వస్తేనే వీరికి ప్రయోజనం. అలా వచ్చే పని మనిషి దొరకదు. పని వచ్చినా వంట సరిగ్గా వచ్చే మనిషి దొరకదు. దొరికినా శుభ్రంగా కనిపించే మనిషి దొరకదు. తెల్లారే లేచి శుభ్రంగా స్నానం చేసి వచ్చే వీలు వారికి ఉండదు. అలాంటి వీలు ఉన్నవాళ్లు పనిమనుషులుగాపని చేయరు. ఇవన్నీ కుదిరినా ఇల్లు అప్పజెప్పాలంటే అనుమానం. ‘ఈ హింస కంటే నేనే హింస పడతాను. నువ్వు కాస్త సహాయం చెయ్’ అంది ఒకరోజు.అప్పటిదాకా వెంకట్లో కోపధారి అయిన ఒక మనిషి ఉంటాడని ఆమెకు తెలియనే తెలియదు. ఆరోజు తెలిసింది.‘ఏం మాట్లాడుతున్నావ్? ఉల్లిపాయలు కోసి అంట్లు తోమమంటావా? నాకు అసహ్యం. ఇంకొక్కసారి ఆ ప్రస్తావన తేకు.కావాలంటే నువ్వు ఉద్యోగం మానెయ్’ అన్నాడు.‘ఏం చేస్తున్నావ్ సుజా.. కాస్త క్యారెట్ తరిగిపెట్టనా’ అనే మగాళ్లు ఉంటారు. కాని ఇతను అలాంటి వాడు కాదు. ‘అయ్యో... మీరు వంటింట్లో ఏంటండి... వెళ్లండి’ అనేఆడవాళ్లు ఉంటారు.అనిత అలాంటి ఇల్లాలు కాదు.ప్రాబ్లమ్ స్టార్టెడ్. తొమ్మిదో నెలకు సాధారణంగా బిడ్డ పుట్టాలి. వీరి పెళ్లయిన తొమ్మిది నెలలకు తెగదెంపులు చేసుకుందామా అని అనుకున్నారు. ఆ సమయంలోనే వెంకట్ తల్లిదండ్రులు కొన్నాళ్లు ఉండిపోదామని కొడుకు దగ్గరకు వచ్చారు. నాలుగు రోజుల్లోనే కొడుకూ కోడలి మధ్య ఏం జరుగుతుందో వారికి అర్థమైంది. దగ్గరి మనుషుల సలహాలు ఒక్కోసారి రుచించవు. బయటి మనుషులు చెప్తే వింటారని ఇద్దరినీ సైకియాట్రిస్ట్ దగ్గరకు కౌన్సిలింగ్‌కు తీసుకొచ్చారు.నేను వారి కంటే ముందు అబ్బాయి తల్లిదండ్రులతో, అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడాలి అంది లేడీ సైకియాట్రిస్ట్.మొదట వెంకట్ తల్లిదండ్రులు వచ్చారు.‘మీ ఇంటి పరిస్థితులు పెంపకం చెప్పండి’ అంది సైకియాట్రిస్ట్.‘ఇద్దరం బాగా చదువుకున్నాం. కాని నేను ఉద్యోగం చేయాలని నా భార్య ఇల్లు చూసుకోవాలని ముందే నిశ్చయించుకున్నాం. నేనెప్పుడూ ఇల్లు పట్టించుకున్నది లేదు. నా భార్య నా పిల్లలకు చిన్న పని చెప్పింది లేదు. వాళ్ల చదువులు, ఫ్రెండ్స్ అలాగే పెరిగారు’ అన్నాడు వెంకట్ తండ్రి.‘ఊ... అందుకే మీలాంటి జీవితమే మీ అబ్బాయి ఆశిస్తున్నాడు’ అంది సైకియాట్రిస్ట్.‘మేము మా అమ్మాయిని యాంబీషియస్గా పెంచాం. ఆడపిల్లంటే వంటలక్క కాదని కెరీర్లో పైకి వెళ్లాలని బాగా చదువుకోవాలని పెద్ద ఉద్యోగం చేయాలని చెప్తూ పెంచాం. మా అమ్మాయి అలాగే పెరిగింది కూడా’ అన్నారు అనిత తల్లిదండ్రులు.‘ఊ... కనుకనే ఇంటి పని ఆమెకు పెద్ద పీడగా మారింది’ అంది లేడీ సైకియాట్రిస్ట్. ఆ తర్వాత డాక్టర్ ఆ కొత్త జంటతో మాట్లాడటం ప్రారంభించింది. వారికి ఒకరినొకరిని అసలైన అర్థంలో పరిచయం చేయడం మొదలెట్టింది. ఇద్దరి ఆకాంక్షల మధ్య ఒక సర్దుబాటు రేఖ గీసి అక్కడి వరకూ వారిని నడిపించింది.‘చూడు వెంకట్... నీకు నీ భార్య సంపాదన హోదా కావాలి గాని ఆమె ఇంటి పనిలో భాగం వద్దంటున్నావు. ఇది ఎంత వరకు భావ్యం? అనిత.. నువ్వు భర్త ద్వారా వచ్చే గౌరవం, సెక్యూరిటీ ఆశిస్తున్నావు గాని మగ స్వభావం అర్థం చేసుకోలేకపోతున్నావు. మీరిద్దరూ బయట పనిలో రాణించాలంటే ఇంటి శ్రమను పంచుకోవాల్సిందే. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. మీ ఇద్దరి మధ్య ఉన్నప్రేమను తరగాల్సిన ఒక ఉల్లిపాయ హరించేయకుండా చూసుకోండి’... అంది డాక్టర్.చెప్పగా చెప్పగా వారి మనసులకు ఎక్కింది.ఆ రోజు లాస్ట్ సెషన్ పూర్తయ్యింది. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ల్యాప్ టాప్‌లో పెద్ద సౌండ్‌తో కిశోర్ పాటలు మొదలయ్యాయి. ‘డిన్నర్‌లోకి విజిటెబుల్ పలావు చేస్తాను’ అంది అనిత.వెంకట్ కూరగాయలతో వంటగదిలో పద్మాసనం వేశాడు.‘తుమ్ ఆగయేహో.. నూర్ ఆగయా హై’.... పాట సరైన పాకంలో పడింది. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
నెం. వన్ కాయ
రాజుల్లో నెం. 1 ఎవరు? ఇంకెవరు రాజారాముడే. అందుకే లంకాధిపు వైరి వంటి రాజు లేనేలేడన్నారు. మరి మహిళామణుల్లో నెం. 1 ఎవరు? మరింకెవరు... పంకజముఖి సీతే! రుచి ‘సింహాసనం’పై కూర్చోబెట్టగల కాయగూర ఏదంటూ అప్పట్లోఓ సార్వత్రిక ఎన్నిక జరిగిందట. దాంట్లో మన వంకాయదే ఏకగ్రీవ ఎంపికట. అందుకే అది కాస్తా నెం. ‘వన్’ కాయ అయ్యింది. మనం తినడానికి వీలుగా ‘వన్’టకమై వచ్చింది. రుచుల ‘బ్రింజాల’ మాయాజాలంలో పడదాం రండి. బేబీ బ్రింజాల్ స్టఫ్డ్ కర్రీ కావలసినవి చిన్న వంకాయలు – పావు కేజీ; ఆవాలు – అర టీ స్పూన్; కొత్తిమీర – కొద్దిగా; నూనె – 3 టేబుల్ స్పూన్లు స్టఫింగ్ కోసం జీడి పప్పులు – 5; వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్; టొమాటో – 1 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్; వేయించిన గసగసాలు – పావు టీ స్పూన్; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూన్; ఉప్పు – తగినంత; వేయించిన ఎండు మిర్చి – 10 తయారీ ∙ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి మధ్యకి నాలుగు భాగాలుగా కట్ చేసి (గుత్తివంకాయ కూరకు తరిగే మాదిరిగా) ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి. స్టఫింగ్ తయారీ ∙స్టఫింగ్ కోసం చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. వంకాయల మధ్యలో తగినంత మిశ్రమం ఉంచాలి. ఇలా అన్ని వంకాయలలో స్టఫ్ చేసి పక్కన ఉంచాలి. స్టౌమీద బాణలిలో నూనె వేసి, కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఇందులో స్టఫ్ చేసిన వంకాయలను వేసి ఒకసారి కలిపి, కొద్దిసేపు మూత ఉంచాలి. వంకాయలు కొద్దిగా మెత్తబడిన తరవాత మూత తీసేసి, గరిటెతో జాగ్రత్తగా కలపాలి. వంకాయలు బాగా ఉడికి, మెత్తబడ్డాక, కొత్తిమీర చల్లి దింపేయాలి. వేడి వేడి అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది. బ్రింజాల్ గ్రిల్డ్ పార్సెల్స్ కావలసినవి: పెద్ద వంకాయలు – 2; మోజరిల్లా చీజ్ – 50 గ్రా.; టొమాటోలు – 4; బచ్చలి ఆకులు – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – కొద్దిగా; సాస్ కోసం ఆలివ్ ఆయిల్ – 4 టేబుల్ స్పూన్లు; వెనిగర్ – ఒక టీ స్పూన్; ఎండబెట్టిన టొమాటో పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూన్; తయారీ వంకాయలను శుభ్రంగా కడిగి తొడిమలు తీసేయాలి. పల్చగా, పొడవుగా, నిలువుగా తరగాలి. (ముక్కలు నల్లబడకుండా ఉప్పు నీళ్లలోకి తరగాలి)ఒక పెద్ద పాత్రలో నీళ్లు, తగినంత ఉప్పు వేసి స్టౌమీద ఉంచి మరిగించాలి. తరిగి ఉంచుకున్న వంకాయ ముక్కలను అందులో వేసి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. నీళ్లను పూర్తిగా ఒంపేసి, ముక్కలను పొడి వస్త్రంలో వేసి తడిపోయేవరకు ఆరబెట్టాలి. రెండు వంకాయ ముక్కలను తీసుకుని ఒకదానికి ఒకటి క్రాస్‌గా ఒక ప్లేట్లో అమర్చాలి. వాటి మధ్యలో టొమాటో చక్రాలు ఉంచి, వాటి మీద ఉప్పు, మిరియాల పొడి, బచ్చలి ఆకులు, కొద్దిగా మోజరిల్లా చీజ్ వేసి, ఆ పైన మళ్లీ బచ్చలి ఆకులు, టొమాటో ముక్క ఉంచాలి. రెండు చివరలను వంకాయతో మడతలు వేసి బ్రింజాల్ పార్సెల్స్‌ను మూసేయాలి. వీటిని ఫ్రిజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచాలి. సాస్ తయారీ ఒక పాత్రలో ఆలివ్ ఆయిల్, వెనిగర్, టొమాటో పేస్టు, నిమ్మరసం వేసి బాగా కలిపాక, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. బ్రింజాల్ పార్సెల్స్‌ను ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి, వాటి నిండా సాస్ వేయాలి. పెనం మీద చీజ్ వేసి కరిగాక, ఈ పార్సెల్స్‌ను ఉంచి, రెండు వైపులా కాల్చి తీసేయాలి. (గ్రిల్ చేసుకునేవారు పది నిమిషాల పాటు గ్రిల్ చేసుకోవాలి) హైదరాబాదీ దమ్ కీ బైగన్ కావలసినవి నూనె – 4 టేబుల్ స్పూన్లు; వంకాయలు – అర కేజీ; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; నూనె – ఒక టేబుల్ స్పూన్ (మసాలా వేయించడానికి) మసాలా పేస్ట్ కోసం కాశ్మీరీ మిర్చి – 8; జీలకర్ర – ఒక టీ స్పూన్; మిరియాలు – ఒక టీ స్పూన్; ఏలకులు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; బిరియానీ ఆకు – ఒక; వెనిగర్ – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయ – 1 (పెద్దది) + 2 (మీడియం సైజువి) ; ఉల్లి తరుగు – ముప్పావు కప్పు; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6 గార్నిషింగ్ కోసం: కొత్తిమీర తరుగు – పావు కప్పు తయారీ ∙వంకాయలను చిన్న సైజు ముక్కలుగా తరగాలి. (చిన్న వంకాయలను వాడుతుంటే గుత్తి వంకాయ మాదిరిగా తరగాలి). ∙స్టౌ మీద బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, వంకాయ ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, తీసి పక్కన ఉంచాలి. ∙మిక్సీలో ముప్పావు కప్పు ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, కాశ్మీరీ ఎండు మిర్చి, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఏలకులు, బిరియానీ ఆకు వేసి మెత్తగా చేయాలి. ఆ తరవాత వెనిగర్, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు జతచేసి మెత్తగా పేస్ట్‌లా చే సి బయటకు తీయాలి. ∙స్టౌమీద బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక, మసాలా ముద్ద వేసి వేయించాలి. పసుపు జత చేసి మసాలా మిశ్రమాన్ని సుమారు పది నిమిషాల పాటు వేయించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక కప్పుడు నీళ్లు పోసి బాగా కలిపాక, తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను జత చేసి, మసాలా ముద్ద పట్టేలా మృదువుగా కలిపి, మూత పెట్టి, ఏడెనిమిది నిమిషాలు ఉడికించి దింపేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. వేడి వేyì అన్నంలోకి రుచిగా ఉంటుంది. వంకాయ కాల్చిన పచ్చడి కావలసినవి గుండ్రంగా, పెద్దగా ఉండే వంకాయ వంకాయ – 1; చింతపండు – 50 గ్రా. (తగినన్ని నీళ్లలో నానబెట్టి, చిక్కగా గుజ్జు తీసుకోవాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్; బెల్లం తురుము – ఒక టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – 2 టేబుల్ స్పూన్లు పోపు కోసం ఎండు మిర్చి – 6; ఆవాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూన్; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టేబుల్ స్పూన్ తయారీ ∙వంకాయను శుభ్రంగా కడిగి, తడి తుడిచి, వంకాయకు నూనె పూసి, స్టౌమీద ఉంచి కాల్చాలి. కాయ మొత్తం కాలి, మెత్తగా అయిన తరవాత దింపేయాలి. చల్లారాక తొక్క తీసి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకుని చేతితో మెత్తగా చేయాలి. ఉప్పు, పసుపు జత చేసి బాగా కలపాలి. స్టౌమీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాక, వంకాయ గుజ్జులో వేసి కలపాలి. చింతపండు రసం, బెల్లం తురుము జత చేసి చేతితో బాగా కలపాలి. టొమాటో తరుగు వేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి మంచిది. వంకాయ మసాలా బోండా కావలసినవి చిన్న వంకాయలు – పావు కేజీ; సెనగపిండి – పావు కేజీ; బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూన్; ధనియాల పొడి – ఒక టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూను; కారం – ఒక టీ స్పూన్; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; నువ్వుల పొడి – ఒక టేబుల్ స్పూన్; పల్లీల పొడి – ఒక టేబుల్ స్పూన్; వంట సోడా – చిటికెడు; కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్; వాము – అర టీ స్పూన్; ఉల్లి తరుగు – ఒక కప్పు; పల్చగా తీసిన చింతపండు పులుసు – 2 కప్పులు తయారీ ∙వంకాయలను శుభ్రంగా కడిగి, గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి నాలుగు చెక్కలుగా చీల్చాలి. అలా అన్ని వంకాయలను తరిగి పక్కన ఉంచాలి. స్టౌ మీద గిన్నెలో ఉప్పు, చింతపండు పులుసు పోసి, అందులో తరిగిన వంకాయలను వేసి ఉడికించాలి. పక్కన స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, తీసేయాలి. అందులో కొబ్బరి తురుము, ధనియాల పొడి, గరం మసాలా, మిరప కారం, కొబ్బరి తురుము, నువ్వుల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు రసంలో ఉడికిన వంకాయలను బయటకు తీసి చల్లారనివ్వాలి. కొబ్బరి తురుము మిశ్రమాన్ని వంకాయలలో స్టఫ్ చేయాలి. ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, వాము, వంట సోడా, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండి మాదిరిగా కలపాలి. స్టౌమీద బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. స్టఫ్ చేసిన వంకాయలను సెనగపిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో బోండాలు వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. నూనెలో వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసి వేడివేడిగా అందించాలి. -
కారం సరిపోయిందా?
షూటింగ్ లేని సమయాల్లో వేరే పనులేవీ లేకుండా ఖాళీగా ఉంటే స్టార్స్ ఫన్నీగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. కొందరు గొంతు సవరించుకుని పాట పాడతారు. శ్రుతీహాసన్, సోనాక్షి సిన్హా లాంటి వారు పెయింటింగ్‌తో బిజీ అయిపోతారు. ఇంకొందరు పుస్తకంలో తలదూర్చుతారు. మరికొందరు గరిటె పడతారు. సల్మాన్ ఖాన్ మల్టీ టాలెండెడ్. పాడతారు. అలాగే పెయింటింగ్, వంట కూడా చేస్తారు. నిన్న (ఆదివారం) సల్మాన్‌కి బాగా తీరిక చిక్కినట్లుంది. వంట చేసే పనిలో పడ్డారు. సల్మాన్ ఖాన్ వంట చేస్తున్నది ఇక్కడ కాదు.. అబుదాబిలో. ‘భారత్’ సినిమా కోసం అక్కడికి వెళ్లారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. కత్రినా కైఫ్ కథానాయిక. ఇక్కడున్న ఫొటో చూస్తుంటే.. కర్రీలో కారం సరిపోయిందా? అని సల్మాన్ ఆలోచిస్తున్నట్లు ఉంది కదూ. -
ఫార్... ఇన్ కిచెన్
వియత్నాం వంటలోసారిప్రయత్నించి చూస్తారా? థాయ్ వంటకాలకు హాయ్ చెప్పాలని ఉందా? ఇవన్నీ మనవి. అంటే మన ఆసియా ఖండానివి. మరి పొరుగింటి పుల్లకూర రుచి కదా! అందుకే...యూరప్ ఖండపు పొరుగు ఖాద్యాలనూ చూద్దాం. టేస్టీ టేస్టీ ఫ్రెంచు... బోల్డంత నోరూరించు అంటూ... ఇటాలియన్ డిషెస్‌తో నాల్కను మిటకరిస్తూ... లాలాజల వర్షంతో నోరు చిరపుంజీ కాగా దేశదేశాల వంటల్ని మన ఇంట తయారు చేసుకుని... ఆవురావురుమంటూ తిందాం... బ్రేవు బ్రేవుమందాం. సెసేమ్కోటెడ్ స్వీట్ స్టఫ్డ్ పాన్ కేక్స్ (ఫ్రెంచ్) ఫ్రెంచ్ క్విజైన్ డెజర్ట్స్కి బాగా ప్రసిద్ధి. మనం కూడా ఈ రోజు ఇంటి దగ్గరే ఒక డెజర్ట్ తయారుచేసి ఫ్రెంచ్ రుచిని ఇంటి దగ్గరే ఆస్వాదించుదాం. కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – కొద్దిగా; కోడి గుడ్డు – 1; వెనిలా ఎసెన్స్ – కొద్దిగా; పాలు – అర కప్పు; బటర్ – తగినంత; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; తేనె – కొద్దిగా; ఎల్లో బటర్ – కొద్దిగా; వేయించిన నువ్వులు – 25 గ్రా. స్టఫింగ్ కోసం: పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; డ్రై ఫ్రూట్స్ – తగినన్ని (కిస్మిస్, జీడి పప్పు); ఎండు ఖర్జూరాలు – ఆరు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఎల్లో బటర్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒక టే బుల్ స్పూను తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార వేసి బాగా కలిపాక, పిండి మధ్యలో గుంటలాగ చేసి పాలు, గిలకొట్టిన కోడి గుడ్డు, కరిగించిన బటర్ వేసి బాగా కలిపి సుమారు గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక బటర్ వేసి కరిగించాలి ∙కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, ఏలకుల పొడి, ఎండు ఖర్జూరాలు, పంచదార వేసి బాగా కలపాలి ∙మిశ్రమాన్ని తడిపోయేవరకు కలుపుతూ ఉడికించి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా బటర్ వేసి కరిగించాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండి కొద్దిగా తీసుకుని, పాన్ మీద దోసె మాదిరిగా వేసి రెండు వైపులా కాల్చాలి ∙బాగా కాలిన తరవాత స్టఫింగ్ మిశ్రమాన్ని దోసె మధ్యలో ఉంచి కర్రతో జాగ్రత్తగా ఒత్తి, మరోమారు కాల్చాలి ∙తయారయిన పాన్ కేక్‌లను కట్ చేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని, పంచదార పొడి, తేనెలతో అలంకరించి, చివరగా నువ్వులతో గార్నిష్ చేసి అందించాలి. పాడ్ థాయి నూడుల్స్ ఎట్ హోమ్ థాయి క్విజీన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటగా పాడ్ థాయి నూడుల్స్‌ను తలచుకుంటారు. ఈ వంటకాన్ని సులువుగా తయారు చేసుకుందామా. కావలసినవి: నూడుల్స్ – అర కేజీ; ఉల్లి కాడలు – ఒక కట్ట; పుట్ట గొడుగులు / బేబీ కార్న్ – 100 గ్రా. ; వేయించిన పల్లీలు – 100 గ్రా.; పల్లీ నూనె – 100 మి.లీ.; చిక్కుడు గింజలు – కొద్దిగా; వెల్లుల్లి తరుగు – కొద్దిగా; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఉప్పు – తగినంత; పంచదార – టీ స్పూను; సోయా సాస్ – టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; మిరప కారం – అర టీ స్పూను; అజినమోటో – చిటికెడు తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙నీళ్లు మరుగుతుండగా నూడుల్స్ వేసి ఉడికించి దింపేయాలి ∙నీరు ఒంపేసి, నూడుల్స్‌ను ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి ∙ఇవి చల్లారేలోగా పచ్చి మిర్చి, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తురుము, బేబీ కార్న్, పుట్ట గొడుగులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాక, పచ్చికొబ్బరి తురుము మిశ్రమం ముద్దను వేసి మరోమారు బాగా వేయించి, ఉడికించాలి ∙ఉడికించిన నూడుల్స్‌ను జత చేసి మిశ్రమం అంతా నూడుల్స్‌కు పట్టేవరకు కలపాలి ∙ఉప్పు, ఎండు మిర్చి, మిరియాల పొడి, పంచదార, అజినమోటో, సోయా సాస్, ఉల్లి కాడల తరుగు, చిక్కుడు గింజలు, నిమ్మ రసం జత చేసి బాగా కలపాలి ∙చివరగా పల్లీల పొడి వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి. ఇండియన్ హోమ్ మేడ్ పిజ్జా (ఇటాలియన్ ఫ్యూజన్) పిల్లలు ఈ రోజుల్లో సాయంత్రం స్నాక్స్‌లా తినడానికి ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు. ముందుగా మనం ఇటాలియన్ పిజ్జా తయారీ చూద్దాం. ఇంటి దగ్గరే ఈ పిజ్జాలను తయారుచేసుకోవచ్చు. కావలసినవి... బేస్ కోసం: మైదా పిండి – రెండున్నర కప్పులు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; డ్రై ఈస్ట్ – అర టీ స్పూను; రిఫైన్డ్ ఆయిల్ లేదా ఎల్లో బటర్ – ఒక టీ స్పూను; గోరువెచ్చని నీళ్లు – ఒక కప్పు; మైదా పిండి∙– 3 టే బుల్ స్పూన్లు (అద్దడానికి) టాపింగ్ కోసం: మోజరిల్లా చీజ్ – 150 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు (సన్నగా తరగాలి); కొత్తిమీర – అర కప్పు వెజ్ టాపింగ్స్: సన్నగా తరిగిన పుట్ట గొడుగులు – ఒక కప్పు; బేబీ కార్న్ / ఉడికించిన కూరలు / వేయించిన పనీర్ (వీటిలో ఏదో ఒకటి); నాన్ వెజ్ టాపింగ్స్; బోన్ లెస్ చికెన్ (బ్రాయిల్డ్ లేదా గ్రిల్డ్, ఏదైనా నాన్ వెజ్) సాస్ కోసం: టొమాటో తరుగు – 2 కప్పులు (తొక్క తీసేయాలి); ఆలివ్ ఆయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; పంచదార – కొద్దిగా; నల్ల మిరియాల పొడి – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); టొమాటో కెచప్ – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు –50 గ్రా.; ఉల్లి తరుగు – అర కప్పు; కార్న్ ఫ్లోర్ – కొద్దిగా (పావు కప్పు నీళ్లలో కలిపితే కార్న్ స్టార్చ్ తయారవుతుంది) సాస్ తయారీ: స్టౌ వెలిగించి, మంటను మీడియంలో ఉంచి, బాణలి పెట్టాలి. ఉల్లి తరుగు జత చేసి వేయించాలి. వెల్లుల్లి తరుగు, నల్ల మిరియాల పొడి, ఎండు మిర్చి ముక్కలు వేసి బాగా వేయించాక టొమాటో తరుగు, ఉప్పు, పం^è దార వేసి కలపాలి. టొమాటోలు మెత్తగా ఉడికి, నీరంతా పోయేవరకు కలుపుతుండాలి. టొమాటో కెచప్, కార్న్ స్టార్చ్ జత చేసి బాగా కలపాలి. మంట బాగా తగ్గించి, మిశ్రమం మృదువుగా అయ్యేవరకు ఉడికించాలి. (టొమాటలో మరీ పుల్లగా అనిపిస్తే మరి కాస్త పంచదార జత చేస్తే సరి). బేస్ తయారీ: ∙ఒక చిన్న పాత్రలో గోరువెచ్చని నీటికి ఈస్ట్ జత చేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙వేరొక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి ∙‘పిజ్జా మృదువుగా రావాలంటే పిండిని చాలాసేపు చే తితో బాగా అదమాలి) ∙ఈ మిశ్రమానికి ఈస్ట్ నీటిని జత చేసి మరోమారు కలపాలి ∙పిండిని కలుపుతూ మధ్యమధ్యలో ఆగుతూ సుమారు ఐదు నిమిషాల పాటు పిండిని కలపాలి ∙పిండి∙మెత్తగా ఉండాలే కాని, చేతికి అంటుకోకుండా చూసుకోవాలి ∙చేతికి అంటుతుంటే కొద్దిగా మైదా పిండి జత చేయాలి ∙పిండి బాగా కలిపిన తరవాత ఒక టేబుల్ స్పూను నూనె జత చేసి, పిండి సాగేలా అయ్యేవరకు కలపాలి ∙పెద్ద పాత్రకు నూనె పూయాలి ∙మైదా పిండికి కూడా మరి కాస్త నూనె పూసి, పాత్రలో ఉంచి వస్త్రంతో మూసేసి, సుమారు రెండు గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండి రెట్టింపు పరిమాణంలోకి అయ్యాక, పిండిని బయటకు తీసి కొద్దిగా పొడి పిండి జత చేసి మళ్లీ చేతితో బాగా కలిపి, పిండిని రెండు సమాన భాగాలుగా చేసి, సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచేయాలి. నాన్ స్టిక్ పాన్ మీద బేస్ తయారుచేసుకోవాలి: ∙పిండిని చపాతీ కర్రతో ఒత్తి, గుండ్రంగా కట్ చేసుకోవాలి ∙గుండ్రంగా అక్కర్లేని వారు వారికి కావలసిన ఆకారంలో కట్ చేసుకుని, కొద్దిగా పొడి పిండి అద్ది, నూనె పూసిన పిజ్జా పాన్ మీద ఉంచాలి (అంచులు గుండ్రంగా వచ్చేలా కట్ చేసుకోవాలి) ∙గోధుమరంగులోకి వచ్చేవరకు సన్నని మంట మీద ఉంచాలి ∙చివరగా పిజ్జా బేస్‌ను వేరొక ప్లేట్లోకి తీసి, తయారుచేసి ఉంచుకున్న సాస్‌ను పిజ్జా మీద వేసి సమానంగా పరచాలి ∙ముందుగా కట్ చేసి ఉంచుకున్న టాపింగ్స్‌తో అందంగా అలంకరించాలి ∙కొత్తిమీర, చీజ్ తురుము కూడా చల్లాలి ∙ఇప్పుడు పిజ్జాను పాన్ మీద ఉంచి చీజ్ కరిగేవరకు ఉంచి దింపేయాలి ∙ఇలా ఇంటి దగ్గరే పిజ్జా తయారుచేసుకుని అందరూ కలిసి సరదాగా ఆరగించవచ్చు. సతాయ్ హోమ్ స్టైల్ ఇండోనేషియా ఇండోనేషియాలో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. ఈ వంటకాన్ని మనం ఇంటి దగ్గరే తయారుచేసుకుందాం. కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; క్యాప్సికమ్ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; చీజ్ – 100 గ్రా.; చిల్లీ సాస్ – ఒక టీ స్పూను; ఆవాల ముద్ద – అర టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో సాస్ – ఒక టీ స్పూను; బటర్ – ఒక టీ స్పూను; (వెజిటేరియన్లు పుట్ట గొడుగులు, పనీర్, బేబీ కార్న్‌తో తయారుచేసుకోవచ్చు) తయారీ: ∙ఒక పాత్రలో శుభ్రం చేసిన రొయ్యలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి కలపాలి ∙వీటికి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం, ఆవాల ముద్ద, చిల్లీ సాస్, టొమాటో సాస్, కొత్తిమీర జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఇదే విధంగా వెజిటేరియన్లు కూరముక్కలను ఊరబెట్టుకోవాలి. టూత్ పిక్‌లు తీసుకుని ఊరబెట్టిన ఉల్లి పాయ, క్యాప్సికమ్, టొమాటో, రొయ్యలను వరుసగా గుచ్చాలి ∙సమాంతరంగా ఉండే పాన్ తీసుకుని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక బటర్ వేసి కరిగాక, గుచ్చి ఉంచుకున్న పుల్లలను పాన్ మీద ఉంచి బాగా కాల్చాలి ∙చివరగా చీజ్ తురుము వేసి బాగా కలపాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వీటిని వేడివేడిగా తయారుచేసి పెడితే బాగుంటుంది. – డా. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ -
ఫినిషింగ్ టచ్
వంట తయారుచేయడం ఒక కళ అయితే, తయారుచేసిన వంటను కంటికింపుగా అలంకరించడం మరో కళ. రుచిగా వండిన వంటకాన్ని అందంగా అలంకరించి వడ్డిస్తే, ఆ ఆహారాన్ని ఇష్టంతో తింటారు. గార్నిషింగ్ అనేది ‘గార్నిర్’ అనే ఫ్రెంచి పదం నుంచి రూపొందింది. ఈ పదానికి అలంకరించడం అని అర్థం. అలంకరిచండానికి ఉపయోగించే వస్తువులు కూడా తినడానికి అనువుగా ఉండేవాటినే ఉపయోగించాలి. వంటకం మీద కాని, వంటకం చుట్టూ కాని గార్నిషింగ్ చేయడం ప్రధానం. ఇలా చేయడం వల్ల వంటకానికి కొత్త రంగులు, కొత్త అందం సమకూరుతాయి. వంటల పరిభాషలో గార్నిషింగ్ అంటే ‘వంటకాన్ని మరింత అందంగా రుచి చూడటం’ అని అర్థం. పాటించవలసిన మెలకువలు ♦ వంటకంలో ఉపయోగించిన వాటితోనే తయారైన వంటకం మీద గార్నిషింగ్ చేస్తే బాగుంటుంది. అలా చేయడం వల్ల వారు ప్లేట్లో పదార్థాన్ని కొద్దిగా కూడా మిగల్చకుండా గార్నిషింగ్ చేసినది సైతం కలిపి తినేస్తారు. ♦ గార్నిష్ చేయడానికి ముందు కాయగూరలను తప్పనిసరిగా నీళ్లతో శుభ్రం చేయాలి. ♦ గార్నిషింగ్ చేయడం వల్ల వంటకం మరింత అందంగా కనపడాలే కాని, వంటకాన్ని డామినేట్ చేసేలా ఉండకూడదు. ♦ గార్నిషింగ్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్స్ చూసుకోవడం ప్రధానం. ♦ ఎంత అందంగా, జాగ్రత్తగా అలంకరిస్తే, అంత బాగా ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు. గార్నిషింగ్ ఇలా ఉంటే బాగుంటుంది... ♦ సింపుల్‌గా, సహజంగా, తాజాగా ఉండాలి. ♦ వంటకానికి తగినట్టుగా ఉండాలి ♦ మంచి ఫ్లేవర్‌తో ఉండాలి. గార్నిషింగ్‌కి కొన్ని సూచనలు... ♦ అందంగా అలంకరించాలనే శ్రద్ధ ఉండాలి. ♦ టొమాటో సూప్ వంటివి తయారుచేసినప్పుడు, తాజా క్రీమ్‌ను కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా వేసి అలంకరిస్తే బాగుంటుంది. ♦ ఐస్ క్రీమ్స్ మీద క్రంచీ వేఫర్స్, డ్రై నట్స్ తరుగుతో అలంకరిస్తే కంటికి ఇంపుగా ఉంటుంది. ♦ కెబాబ్స్, స్టార్టర్స్లను కీర, క్యారట్, ఉల్లి చక్రాలు, నిమ్మ చెక్కలు, ఉల్లికాడల వంటి కూరలతో అలంకరించాలి. వీటితో కలిపి తినడం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. – డా. బి. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ,ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్) చోలే పనీర్ మసాలా కావలసినవి: కాబూలీ సెనగలు – ఒక కప్పు; బిర్యానీ ఆకు – ఒకటి; దాల్చిన చెక్క – చిన్న ముక్క; నల్ల ఏలకులు – 2; అల్లం ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఎండు ఉసిరిక – మూడు ముక్కలు; చోలే పనీర్ గ్రేవీ కోసం కావలసినవి... ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – ముప్పావు కప్పు; పనీర్ – 150 గ్రా.; పచ్చి మిర్చి – 3; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; కసూరీ మేథీ – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. గార్నిషింగ్ కోసం... కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం – చిన్న ముక్క తయారీ: ♦ కాబూలీ సెనగలను ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి ♦ నానిన సెనగలను మరుసటి రోజు రెండు మూడు సార్లు బాగా కడిగి, తగినన్ని నీళ్లు, ఉప్పు, ఏలకులు, దాల్చిన చెక్క, ఎండు ఉసిరిక, బిర్యానీ ఆకు, అల్లం ముద్ద జత చేసి కుకర్‌లో ఉంచి పది విజిల్స్వ వచ్చేవరకు ఉంచి దింపేయాలి ♦ మూత తీశాక ఎండు ఉసిరిక ముక్కలను వేరు చేయాలి. పనీర్ మసాలా తయారీ: ♦ స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి ♦ అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ♦ టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడేవరకు బాగా కలపాలి ♦ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరప కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలపాలి ♦ ఉడికించిన సెనగలను జత చేసి మరోమారు బాగా కలిపి, పచ్చి మిర్చి తరుగు, ఒక కప్పుడు ఉడికించిన సెగనల నీరు పోసి బాగా కలపాలి ∙ ♦ గ్రేవీ బాగా చిక్కబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ♦ (కొన్ని సెనగలను గరిటెతో మెత్తగా అయ్యేలా చిదిమితే, గ్రేవీ త్వరగా చిక్కబడుతుంది) ♦ పనీర్ ముక్కలు, కసూరీ మేథీ, ఆమ్ చూర్ పొడి వేసి బాగా కలిపి రెండు నిమిషాలపాటు ఉడికించి దింపేయాలి ♦ కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలతో గార్నిష్ చేయాలి ♦ రోటీలు, పూరీలు, పరాఠాలలోకి రుచిగా ఉంటుంది. -
కొమ్ముకూర భలే రుచి
పశ్చిమ గోదావరి, కొయ్యలగూడెం : వర్షాకాలం ప్రారంభం కావడంతోనే గిరిజనులు ఆతృతగా ఎదురుచూసే వంటకం కొమ్ములు (వెదురు) కూర. వెదురు పిడాల నుంచి మొలిచే గెడల చివరి భాగాన్ని కోసి చిన్న ముక్కలుగా తరిగి వెదురు వంటకం తయారు చేస్తారు. ప్రస్తుతం ఏ గిరిజన గ్రామాల్లో చూసినా ప్రతి ఇంటా కొమ్ములు కూర వండుతుంటారు. ముక్కలుగా తరిగిన వెదురుకు శాఖాహారంగా, మాంసంతో కలిపి వండుతారు. అడవుల్లోకి వంట చెరకు కోసం వెళ్లే మహిళలు వస్తూ తప్పనిసరిగా వెదురు కొమ్ములను వెంట తెచ్చుకుంటారు. తంగెళ్లగూడెం, బిల్లిమిల్లి, వంకాబొతప్పగూడెం, కిచ్చప్పగూడెం, మర్రి గూడెం గ్రామాల్లోని మహిళలు ప్రస్తుతం కొమ్ము కూరల వంటకంపైనే దృష్టిసారిస్తున్నారు. రుచిగా ఉండే కొమ్ము కూర శరీరంలోని కొవ్వును వేగంగా తగ్గిస్తుందని వంకా బొతప్పగూడెం మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ పేర్కొన్నారు. కేవలం వర్షాకాలం మూడు నెలల్లో ఇవి విరివిగా లభిస్తాయని తెలిపారు. ఆవు కొమ్ములు మాదిరిగా అడుగున్నర పొడవున వెదురు పిడాల్లో ఇవి మొలుస్తుంటాయని ఆయన చెప్పారు. -
వంట వండేద్దాం..
మన హైదరాబాద్ బిర్యానీలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న వంటకాల్లో శిక్షణనిస్తోంది జూబ్లీహిల్స్‌లోని ‘ది కలినరీ లాంజ్’. అత్యాధునికంగా ఏర్పాటు చేసిన ఈ కిచెన్ థియేటర్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వంటలు నేర్పిస్తున్నారు. కుకింగ్‌పై ఆసక్తి ఉన్నవారు ఇక్కడికొచ్చి గరిట తిప్పడం నేర్చుకుంటున్నారు. హిమాయత్‌నగర్: సిటీకి చెందిన బైలుప్పల గోపీకిషోర్‌కు చెఫ్‌లంటే అమితమైన అభిమానం. కేవలం వంటరూమ్‌కే పరిమితమవుతున్న చెఫ్‌లను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న గోపీ.. ‘ది కలినరీ లాంజ్’ పేరుతో జూబ్లీహిల్స్‌లో కిచెన్ థియేటర్ ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా పేరొందిన దాదాపు 350 మంది చెఫ్‌లను సంప్రదించాడు. వీరందరితో ఓ సమావేశం ఏర్పాటు చేసి.. పిల్లలు, పెద్దలకు వంటలో శిక్షణనివ్వాలని, కొత్త రుచులు పరిచయం చేయాలని కోరాడు. ఈ ఐడియా నచ్చడంతో వారందరూ ఒప్పేసుకున్నారు. 50 మంది మాస్టర్ చెఫ్‌లు, 70 మంది ఎగ్జిక్యూటివ్ చెఫ్‌లు, 230 మంది చెఫ్‌లు ఈ కిచెన్ థియేటర్లో శిక్షణనిస్తున్నారు. ఇక్కడ వంట నేర్చుకోవాలని అనుకుంటే ‘ది కలినరీ లాంజ్’ ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వెబ్సైట్ల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని గోపీ కిషోర్ తెలిపారు. పిల్లలకు ప్రత్యేకం... 7–14 ఏళ్ల వయసున్న పిల్లలకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వంట నేర్పిస్తారు. దీనికి ముందుగా డెమో నిర్వహిస్తారు. డెమో తర్వాత పిల్లలు ఎవరికి వారుగా నచ్చిన వంట చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 300 మంది చిన్నారులు ఇక్కడ శిక్షణ తీసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. గృహిణులు, ఉద్యోగులు, వృద్ధులు సైతం ఇక్కడ వంట నేర్చుకుంటున్నారు. వీరికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శిక్షణనివ్వడంతో పాటు సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఐటీ ఉద్యోగులూ వంటపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. శని, ఆదివారాల్లో వీరు ఇక్కడికొచ్చి వంట నేర్చుకుంటున్నారు. విదేశీయులు సైతం ప్రత్యేక వంటకాల్లో శిక్షణ తీసుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఫీజు ఇలా... పిల్లలకు ఐదు వారాలు బేసిక్స్ నేర్పిస్తారు. ఇందుకుగాను రూ.5 వేలు చెల్లించాలి. అడ్వాన్స్ కోర్సులో బేకింగ్, కుకింగ్ నేర్పిస్తారు. దీనికి రూ.15 వేలు. ఇక పెద్దలకు రూ.2,500, విదేశీయులకు రూ.3 వేలు. దేశంలోనే ఫస్ట్... ఈ తరహా కిచెన్‌ను మన దేశంలో మేమే ప్రారంభించాం. చెఫ్‌లకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేశాను. పల్లె వంటకాలనూ ఇక్కడ పరిచయం చేయనున్నాం. అంతర్జాతీయ చెఫ్‌లతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. – గోపీకిషోర్, ఫౌండర్ -
ఇక ‘కుకింగ్’ సబ్సిడీ..!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సబ్సిడీ స్థానంలో కుకింగ్ సబ్సిడీని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను నీతి ఆయోగ్ పరిశీలిస్తోంది. పైపుల ద్వారా సహజవాయువును వినియోగించేవారు, వంట కోసం బయో ఇంధనాలను వినియోగించే వారికీ సబ్సిడీ ప్రయోజనాలను విస్తరించాలనే ఆలోచనే ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. వంట కోసం వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ ప్రయోజనాలు వర్తించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎల్పీజీ వినియోగదారులకే సబ్సిడీ అందుతున్న విషయం తెలిసిందే. ‘‘వంటకు వినియోగించే అన్ని ఇంధనాలకు సబ్సిడీ వర్తించాలి. ఎందుకంటే కొన్ని పట్టణాల్లో పైపుల ద్వారా సహజ వాయువు సరఫరా జరుగుతోంది. అందుకే సబ్సిడీని వారికి కూడా అందించడమే సరైనది’’ అని కుమార్ పేర్కొన్నారు. సబ్సిడీని కేవలం ఎల్పీజీకే పరిమితం చేయడం అన్నది చౌక ఇంధనాలు, గ్రామీణ ప్రాంతాల్లో బయో ఇంధనాలు, పట్టణాల్లో పీఎన్జీ (పైపుల ద్వారా సహజవాయువు) వినియోగాన్ని నిరుత్సాహపరిచే చర్యగా వస్తున్న అభిప్రాయాల నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కుకింగ్ సబ్సిడీ ప్రతిపాదన ‘నేషనల్ ఎనర్జీ పాలసీ 2030’ ముసాయిదాతో వెల్లడైంది. గత వారమే దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇది కేబినెట్ పరిశీలనకు వెళ్లనుంది. చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణలతో ఎదురయ్యే ప్రభావాన్ని తట్టుకునేందుకు సన్నద్ధమైనట్టు తెలిపారు. స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రైవేటు పెట్టుబడులు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ 7–7.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. ఆమర్థ్యసేన్ క్షేత్ర స్థాయికి వెళ్లి చూడాలి... ప్రముఖ ఆర్థిక వేత్త ఆమర్థ్యసేన్ కొంత కాలం పాటు దేశంలో ఉండి మోదీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలను పరిశీలించాలని రాజీవ్ కుమార్ సూచించారు. మోదీ సర్కారు పనితీరును ఆమర్త్యసేన్ తప్పుబట్టిన నేపథ్యంలో కుమార్ ఇలా స్పందించడం గమనార్హం. ‘‘ప్రొఫెసర్ ఆమర్థ్యసేన్ కొంత సమయాన్ని భారత్‌లో వెచ్చించి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఆ విధమైన ప్రకటనలు చేసే ముందు గడిచిన నాలుగేళ్లలో మోదీ సర్కారు చేపట్టిన పనులను సమీక్షించాలి’’ అని కుమార్ పేర్కొన్నారు. -
వంట చేయడం భలే సరదా
ఖాళీ సమయాల్లో ఒక్కొక్కరికీ ఒక్కో హాబీ ఉంటుంది. కొందరు పుస్తకాలు చదువుతారు. మరికొందరు గార్డెనింగ్ చేస్తారు. మరి హీరోయిన్ కాజల్ ఏం చేస్తారో తెలుసా? వంట చేస్తారట. ఈ విషయం గురించి కాజల్ మాట్లాడుతూ –‘‘నటిగా డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉంటాం. ఇంటికి దూరంగా షూటింగ్ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటే మాత్రం వంట చేస్తాను. రిలాక్స్ అవ్వడానికి వంటని స్ట్రెస్‌బస్టర్‌గా భావిస్తాను. అలాగని మామూలు షెఫ్‌ని కాదు. టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో వాళ్లకు ఫుడ్ ప్రిపేర్ చేయడంలో భలే సరదా ఉంటుంది. నేను చేసే ఆమ్లెట్ అంటే మా ఇంట్లో వాళ్లకు చాలా ఇష్టం. సో.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు వంట చేయడానికి ప్రిఫర్ చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ చిత్రం క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. -
వేడి వేడి రసంలో నుంచి బయటపడ్డ చేప
-
వైరల్: ఆ చేపకు ఇంకా భూమ్మీద నూకలున్నాయి...
బీజింగ్ : కొన్ని సంఘటనలు చూస్తుంటే భూమ్మీద నూకలుంటే ఎవరేం చేయలేరంతే.. అనే సామెత నిజమనిపించక మానదు. చైనాలోని ఓ రెస్టారెంట్లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. రెస్టారెంట్లో వంట వండుతుండగా.. దాదాపు తినడానికి సిద్ధమైన వేడి వేడి రసంలో నుంచి ఓ క్రేఫిష్(ఎండ్రికాయను పోలిన చేప) బయటపడి తన ప్రాణాలను నిలుపుకుంది. మరుగుతున్న రసంలోంచి పాత్రపై భాగానికి చేరుకున్నక్రేఫిష్ అందులోంచి బయటపడ్డానికి తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు అది విజయం సాధించింది. అంత వేడిగా ఉన్న రసంలో నుంచి క్రెఫిష్ బయటపడటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన క్రేఫిష్‌ను రెస్టారెంట్ సిబ్బంది పట్టుకున్నారు. తిరిగి దానిని వండేందుకు సిద్దపడ్డారు. కానీ జూక్ అనే వ్యక్తి దానిని పెంచుకోవడానికి ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వంట పండింది
బీడు భూములు ఆవురావురుమంటుంటే రైతుల కడుపులు సెగలు కక్కవా?!గుండె.. కుంపటి మీద ఉన్నట్లుండదా?!జీవితం.. వంటచెరకులా కాలిపోదా?!కానీ నందిపాడు రైతులు..కడుపు సెగలను, గుండె మంటలనువంటసేద్యంగా మార్చుకున్నారు!పంట పొమ్మంటే వంట రమ్మంది. నీరు లేక పంట ఎండితే మంట మీద వంట పండింది. పదిమందికి పట్టెడన్నం పెట్టే అన్నదాత రైతు. అలాంటి అన్నదాత నేడు ఆకలితో అలమటిస్తున్నాడు! పండించిన పంటలకు ధరలు లేక, పంటసాగుకు నీరులేక ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపుతున్నాడు. ఆ పంటలకు కూడా గిట్టుబాటు లేక ఇక్కట్లు పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవించడం కష్టమని భావించిన నందిపాడు గ్రామంలోని రైతులు చేతిలోని నాగలి వదలలేక, తరతరాలుగా వస్తున్న భూమిని పోగొట్టుకోలేక జీవనం సాగించేందుకు ఇతర మార్గాలను అన్వేషించారు. చివరకు ప్రత్యామ్నాయంగా వంట చేయడంపై దృష్టి సారించారు! అలా ఈ రైతులు జీవనోపాధి కోసం చేస్తున్న వంట పనులు ఇప్పుడు గ్రామంలోని అందరికీ బతుకు బాట వేశాయి. నేడు గ్రామంలో సుమారు 150 మందికి పైగా వంటను తమ వృత్తిగా మార్చుకున్నారు. కృషి, పట్టుదల ఉంటే కష్టాలను గట్టెక్కవచ్చని నిరూపించి ఒక వైపు పొలంలో సాగుచేస్తూనే, మరోవైపు వంటలో ప్రావీణ్యం పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నందిపాడు గ్రామంలోని రైతులు. కడప జిల్లా ఖాజీపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం నందిపాడు. 83 పక్కాగృహాలు ఉన్నాయి. 737 మంది జనాభా. సుమారు 160 ఎకరాల సాగుభూమి ఉంది. అంతా చిన్నకారు రైతులే. కేసీ కాలువ నుంచి నీరు వస్తుంది. అయితే ఈ గ్రామం చివరి ఆయకట్టు అయినందున కాలువకు నీరు సక్రమంగా రాదు. గ్రామ సమీపంలో చెరువు ఉన్నప్పటికీ ఆ చెరువుకు కేసీ కాలువ నీరు వచ్చేందుకు అధికారిక తూము లేదు. భూమాయపల్లె కాలువ నుంచి వచ్చే నీరు ఆ చెరువుకు వస్తుంది. కేసీ కాలువకు నీరు సక్రమంగా అందితే అందరూ వరి సాగుచేస్తారు. లేకపోతే పత్తి పంట వేస్తారు. సాగు నుంచి వంట వైపు వ్యవసాయం రైతుల కన్నీటి కష్టాలు తీర్చడంలేదు, ఏం చేయాలి? అని రైతులు ఆలోచిస్తున్న తరుణంలో అదే గ్రామంలో ఉన్న నారాయణ అనే వ్యాపారి ఉపాధి కోసం వంటమాస్టర్ల దగ్గర సహాయకుడిగా పని చేసేవాడు. అలా తన వెంట ఆయన కొందరు గ్రామస్తులను వంట సహాయకులుగా తీసుకెళ్లాడు. అలా వెళ్లిన వారు ఐదేళ్ల తర్వాత మెల్లగా పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు. వంట మాస్టర్లుగా మారారు! సొంతంగా వివాహాలతోపాటు ఇతర శుభకార్యాలు, డిన్నరు,్ల క్యాటరింగ్ కాంట్రాక్టులు, ఉత్సవాలకు ఒప్పందాలు చేసుకోవడం ప్రారంభించారు. వారి కింద కూడా వంట చేసేందుకు వెళ్లిన వారు కొద్దికాలానికి తిరిగి వంట మాస్టర్లుగా మారారు. ఇలా గ్రామంలో ఇప్పుడు సుమారు నూటాయాభై మంది వంట చేసేందుకు వెళుతున్నారు. వీరిలో ఇరవై మంది వరకు వంటమాస్టర్లు ఉన్నారు. ఒక్కొక్క వంట మాస్టర్ చేతి కింద పదిమంది సహాయకులు ఉంటారు. వంటలు చేయడంతోపాటు భోజనాలు వడ్డించేందుకూ వారు వెళుతుంటారు. అలా గ్రామంలోని వారందరికీ వ్యవసాయంతోపాటు అదనపు ఉపాధి వంట చేయడం వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపింది. విద్యార్థులు సైతం గ్రామంలో ఉన్న విద్యార్థులు కూడా వంట చేయడంలో ప్రావీణ్యం సాధిస్తున్నారు. గ్రామంలో చాలా మంది వంటలకు వెళుతుండటంతో విద్యార్థులు కూడా వారిని అనుసరిస్తున్నారు. వారిలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారు కూడా పెళ్లిళ్లు, ఫంక్షన్లలో వడ్డించేందుకు వెళుతుంటారు. రోజుకు రూ 350 నుంచి 400 సంపాదిస్తున్నారు. వీళ్లలో కూడా వంట మాస్టర్లు అయినవారున్నారు. నందిపాడు వంటలు ‘ఆహా ఏమి రుచి .. తినరా మైమరచి..’ అన్నట్లుగా ఉంటాయి.. నందిపాడు వంట మాస్టర్లు వండిన వంటలు. శాకాహారంలోని అన్ని రకాల వంటలు, అలాగే ఉదయం టిఫిన్‌లో అన్ని రకాలు, మాంసాహార వంటలు కూడా భలే రుచిగా ఉంటాయని సమీప జిల్లాల్లో సైతం పేరు తెచ్చుకున్నారు. గతంలో ఖాజీపేట మండలంలోని వివాహాలకు మాత్రమే పరిమితమైన వారు ఇçప్పుడు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి వంటలు చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ వంటలు చేసినా అక్కడ మన్నన పొందుతున్నారు. ఇలా నందిపాడు గ్రామంలోని వారు వ్యవసాయ వృత్తిని వదలకుండానే, వంట చేస్తూ తాము జీవిస్తూ ఇతరులకు జీవనోపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హెల్పర్‌గా వెళ్లి మాస్టర్ని అయ్యా నాకు ఎకరా 50 సెంట్ల భూమి ఉంది. పంట సాగుచేసినా కుటుంబ ఖర్చులకు సరిపోవడంలేదు. దీంతో 1998 లో వంటమాస్టర్లకు హెల్పర్‌గా వెళ్లాను. ఆరేళ్లు పని నేర్చుకున్న తరువాత 2004 నుంచి నేను వంటలు చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లో కూడా వంటలు చేస్తున్నాం. నాతోపాటు, నా దగ్గర పనిచేస్తున్న చాలామందికి ఉపాధి కలుగుతోంది. – తాటిగొట్ల నాగసేనారెడ్డి, వంటమాస్టర్ చదువుకుంటూనే వంటకు వెళ్లా డిగ్రీ ఇటీవలే పూర్తి చేశాను. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి వంట మాస్టర్లకు సహాయకుడిగా వెళ్లేవాడిని. అలా నాలుగేళ్లు పనిచేశాను. తర్వాత వంటమాస్టర్‌గా మారి, వివాహాలకు, శుభకార్యాలకు వంట చేస్తున్నా. ఇక్కడ నిలదొక్కుకున్నాక మాకున్న ఎకరా భూమితోపాటు మరో 3 ఎకరాలు గుత్తకు తీసుకుని సాగు చేస్తున్నాను. – నాగముని, పట్టభద్రుడు ఫీజుకు, ఖర్చులకు పనికొచ్చింది ఎస్వీ కాలేజీలో ఈకామ్ సెకండియర్ చదువుతున్నాను. ఖాళీ దొరికితే మా గ్రామంలోని వంట మాస్టర్లకు సహాయకునిగా వెళుతున్నాను. అలా వచ్చిన డబ్బుతో నా ఫీజులు నేనే కట్టుకుని, నా ఖర్చులు అన్నీ నేను పెట్టుకుంటున్నాను. ఇలా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాను. మంచి వంటమాస్టర్ కావాలన్నదే నాప్రయత్నం.. – నవనీశ్వర్, విద్యార్థి ధర లేకే దారి మార్చాను నాకున్న 2 ఎకరాల పొలం లో ఇటీవలే పత్తిపంట సాగుచేస్తే ధర లేక పూర్తిగా నష్టపోయాను. అందుకే మా గ్రామంలో వంటలు చేసేవాళ్లతో వెళ్లి, నేనూ వంట చేయడం నేర్చుకున్నాను. ఐదేళ్ల నుంచి వంటమాస్టర్‌గా చేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు పది మంది పనిచేస్తున్నారు. – ఎన్. సుబ్బారెడ్డి, రైతు చదువుతోపాటు పార్ట్ టైమ్‌గా ఖాజీపేట డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. మాగ్రామంలోని వారందరూ వంట మాస్టర్ల కింద పనిచేయడంతోపాటు వడ్డించేందుకు వెళుతుంటారు. నేను కూడా వెళుతున్నాను. పని ఏదైనా సంతోషంగా చేయడం ముఖ్యం. వ్యవసాయం చేస్తూనే, వంట కూడా నేర్చుకున్నాను. – నాగేశ్వర్, విద్యార్థి -
మిస్టర్ సి.. మాస్టర్ చెఫ్
సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసే స్టార్స్ అందుకు భిన్నంగా ఇంట్లో కిచెన్‌లో గరిటె తిప్పితే అది న్యూసే. పైగా రామ్‌చరణ్‌లాంటి స్టార్ అంటే ఏం కుక్ చేశారో తెలుసుకోవాలని ఉంటుంది. అలా అలవోకగా కిచెన్‌లో నిలబడి కుక్ చేస్తున్న ఫొటోలు కూడా చూడాలని కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా.. చరణ్ కుక్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నారనిపిస్తోంది కదూ. బుధవారం ఉదయం వర్కౌట్స్ పూర్తయ్యాక ఇలా చెఫ్‌గా మారిపోయారు రామ్‌చరణ్. ‘‘మిస్టర్ సి (రామ్‌చరణ్ సతీమణి ఉపాసన ఇలానే పిలుస్తారు) మాస్టర్ చెఫ్‌గా మారి మా అందరి కోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు. అది కూడా హెల్దీ బ్రేక్‌ఫాస్ట్’’ అని పేర్కొన్నారు ఉపాసన. మొన్నీ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైట్ విషయం మొత్తం ఉపాసనదే. హెల్దీ ఫుడ్స్ గురించి తనకు బాగా ఐడియా ఉంది’’ అన్నారు. బహుశా శ్రీమతి చెప్పిన ఓ హెల్దీ రెసిపీతో చరణ్ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసి ఉంటారని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ 21నుంచి ఈ చిత్రం షూటింగ్లో రామ్‌చరణ్ పాల్గొననున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందనున్న చిత్రం బడ్జెట్ 300 కోట్లని టాక్. అక్టోబర్ నుంచి ఈ షూటింగ్ స్టార్ట్ కానుంది. అది చవకబారుతనం ‘‘అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబంలాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తాం. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా,సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనంగా ఉంటుంది’’ అని తన ఫేస్బుక్ ఖాతాలోహీరో రామ్‌చరణ్ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’పై జరుగుతున్న వివాదాలను దృష్టిలో పెట్టుకునే చరణ్ ఈ విధంగా స్పందించి ఉంటారని ఊహించవచ్చు. -
శ్రీదేవి గురించి మనకు తెలియని నిజాలు!
ముంబై: ప్రఖ్యాత నటీమణి శ్రీదేవి హఠాన్మరణం యావత్ సినిమా ప్రపంచాన్నే కాదు ప్రేక్షకలోకాన్ని నివ్వెరపరిచింది. అసమాన నటనతో వెండితెరపై చెరగని ముద్ర వేసిన ఆమె అకాల మరణం అందరినీ కదిలించింది. అయితే నటనే కాదు ఇంకా పలు అంశాల్లో ఆమెకు ప్రవేశం ఉందని ప్రముఖ సినీ విమర్శకుడు, చిత్ర పరిశ్రమ నిపుణుడు సుభాష్ కే ఝా వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఫ్యాబులస్ కుక్ శ్రీదేవి వంట బాగా చేస్తుంది. బోనికపూర్‌తో పెళ్లైన తర్వాత ఆయన కోసం వంట నేర్చుకుంది. ఏ పని చేసినా అంకితభావం ప్రదర్శించే శ్రీదేవి కుకింగ్‌ను కూడా అంతే శ్రద్ధగా అలవరచుకుంది. తాను చేసిన వంటలను కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులకు వడ్డించి మురిసిపోయేది. కుంచె పట్టేది శ్రీదేవి మంచి చిత్రకారిణి అన్న విషయం చాలామందికి తెలియదు. షూటింగ్ లేని సమయంలో ఆమె పెయింటింగ్ వేసింది. శ్రీదేవి వేసిన ఓ పెయింటింగ్‌ను లండన్‌లోని క్రిస్టీ సంస్థ వేలం వేసింది. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. జాన్వీ ఫ్యాషన్ టిప్స్ తనిద్దరి కుమార్తెలను ఎంతో ప్రేమించిన శ్రీదేవి వారితో స్నేహితురాలిగా మెలిగేది. పెద్ద కూతురు జాన్వీ నుంచి ఫ్యాషన్ టిప్స్ తెలుసుకునేది. దుబాయ్‌లో శ్రీదేవి చనిపోయినప్పడు జాన్వీ ఆమె ప్రక్కన లేకపోవడం విషాదకరం. ముందే చూస్తా తన పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరపై చూసుకోవాలని శ్రీదేవి ఎంతో ఆరాటపడ్డారు. జాన్వీ హీరోయిన్గా పరిచయం అవుతున్న ‘ధడక్’ సినిమాపై అమితాసక్తి కనబరిచారు. తన కూతురి సినిమాను ముందుగా వీక్షించే వారిలో తాను కూడా ఉండాలని నిర్మాత కరణ్ జోహార్‌తో గట్టిగా చెప్పారు. లక్కీ ఛాన్స్ చాందిని సినిమా హిందీలో శ్రీదేవికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చింది. ఈ సినిమాను శ్రీదేవితో తీయాలని యశ్‌చోప్రా ముందు అనుకోలేదు. కొద్ది సంవత్సరాలకు ముందు రేఖతో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆయన అనుకున్నారు. చివరకు శ్రీదేవికి అవకాశం దక్కడంతో బాలీవుడ్లో ఆమె అగ్రకథానాయికగా అవతరించారు. అప్పుడు కుదరలేదు సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో శ్రీదేవికి మాటల్లో చెప్పలేని అవినాభావ సంబంధం ఉంది. శ్రీదేవి మరణానికి కొద్ది గంటల ముందు ఎందుకో తెలియని అలజడిగా ఉందంటూ అమితాబ్ ట్వీట్ చేయడం గమనార్హం. ‘వీర్ జారా’ సినిమా అమితాబ్, శ్రీదేవి కాంబినేషన్లో తెరకెక్కించాలని యాశ్‌చోప్రా భావించారు. పిల్లల కోసం శ్రీదేవి ఈ అవకాశాన్ని వదులుకున్నారు. -
మధ్యాహ్న భోజనం వండేది విద్యార్థులే ..!
వైఎస్ఆర్ జిల్లా , రాయచోటి రూరల్: స్థానిక మాసాపేట జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులే మధ్యాహ్న భోజన వంటకాలు చేస్తూ కనిపించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు తరగతి గదుల్లో ఉన్న పిల్లలను పిలిపించి, వారి చేతనే కోడి గుడ్లు తెప్పించడం, వాటిని ఉడకబెట్టడంతో పాటు, వంట కాలు తయారు చేసే క్రమంలో భాగంగా పప్పును రుబ్బుతూ కనిపించారు. వంట మనుషులు ఉన్నా కూడా విద్యార్థుల చేత ఇటువంటి పనులు చేయించడం ఏమిటని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. చదువు కోవాల్సిన విద్యార్థులు ఇలా వంట పనులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై హెచ్ఎం మడితాటి నరసింహారెడ్డిని వివరణ కోరగా మేము విద్యార్థులెవరికీ వంట చేయాలని పంపలేదని, ఈ విధంగా విద్యార్థులను ఎవరు పిలిపించారో వెంటనే విచారణ చేసి, వంట ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. -
భలే హోటల్
చింతామణి: కొలిమిపొయ్యి, బొగ్గుల పొయ్యి, కట్టెలపొయ్యి, పొట్టు పొయ్యి... ఇలాంటివి వినడమే తప్ప నేటి తరం చూడడం లేదు. కరెంటు, గ్యాస్, ఇండక్షన్ స్టౌలు వచ్చాక వీటికి కాలం చెల్లిపోయింది. కట్టెలపొయ్యి మీద చేసిన వంట రుచి అద్భుతం, అలాంటి రుచి గ్యాస్ పొయ్యి వంటకు రాదు.. అని పెద్దలు, పల్లెవాసులు చెబుతుంటారు. విషయమేమిటంటే... కొలిమి పొయ్యి మీద కాఫీ, టీ తాగాలనే కోరిక ఉన్నవారికి ఇది శుభవార్త. చింతామణి సమీపంలో ఇలాంటి సౌలభ్యం అందుబాటులో ఉంది. మాజీ డ్రైవర్ ఒకాయన రోడ్డు పక్కన టెంటు వేసుకొని కొలిమి పెట్టి బొగ్గులతో కాఫీ, టీ, టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. తాలుకాలోని శింగనపల్లి క్రాస్ దగ్గర ఈ టెంట్ ఉంది. రుచి, ఆరోగ్యమని మంచి స్పందన శింగనపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. చాలా ఏళ్ల పాటు వ్యాన్, లారీ డ్రైవర్‌గా పనిచేశారు. అయితే కొన్ని నెలల నుండి డ్రైవర్ డ్యూటీలు దొరక్క, జీవనోపాధి కోస రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్‌ను పెట్టారు. రాఘవేంద్ర వినూత్నంగా ఆలోచించి బొగ్గులతో కొలిమి పెట్టి కాఫీ, టీలతో పాటు ఇడ్లీ, దోసె తదితర టిఫిన్లు తయారు చేస్తారు. ఇలాంటి వంట రుచిగాను, ఆరోగ్యంగానూ ఉంటుందని ఎంతోమంది ఈ హోటల్‌ను సందర్శిస్తుంటారు. రాఘవేంద్రకు తోడుగా భార్య విజయలక్ష్మీ ఉంటారు. హోటల్ వ్యాపారం బాగా జరుగుతోందని వారు సంతోషం వ్యక్తంచేశారు. -
కస్టమర్లు ప్రాక్టికల్స్ కోరుకుంటారు..
సాక్షి, సిటీబ్యూరో: అదో సాధారణ బిందె... దాన్నే అతీంద్రియశక్తులున్న రైస్‌పుల్లర్‌గా మోసగాళ్లు చెప్తుంటారు... వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కొందరు ‘కస్టమర్లు’ మాత్రం ‘ప్రాక్టికల్స్’ కోరుకుంటారు... తమ ముందే ఆ బిందె బియ్యాన్ని ఆకర్షించాలని, అప్పుడే ఖరీదు చేస్తామని షరతులు పెడతారు... ఇలాంటి వారిని బుట్టలో వేసుకునేందుకు మోసగాళ్ళు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు... ఈ చీటర్స్ సాధారణ బిందెను ‘రైస్‌పుల్లర్’గా మార్చడానికి ‘కుకింగ్’ చేస్తుంటారు... నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఘరానా గ్యాంగ్ విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అసలు కారణం ఇనుప రజను... రైస్‌పుల్లింగ్ బియ్యాన్ని ఆకర్షించడం అని అర్థం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్ళు అందినకాడికి దండుకుంటుంటారు. సాధారణంగా వీళ్ళు కస్టమర్లకు రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మాత్రమే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న ‘విలువైన పాత్రనూ’ చూసే అవకాశం ఖరీదు చేసుకునే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించమని కోరవచ్చనని ముందే గ్రహించే ఇలాంటి ముఠాలు తమదైన శైలితో అన్నం వండి సిద్ధంగా ఉంచుకుంటారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా ఉండేలా అన్నం వండుతారు. దీన్ని ఎంట బెట్టడం ద్వారా మళ్ళీ బియ్యం మాదిరిగా కనిపించేలా చేస్తారు. ఇలా తయారైన ‘సెకండ్ హ్యాండ్ బియ్యం’లో ఇనుప రజను కూడా ఉంటుంది. మోసగాళ్ళు రైస్‌పుల్లర్‌గా చెప్తున్న పాత్రలో అంతర్భాగంగా అయిస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో తయారైన ‘బియ్యం’ వస్తే అవి దానికి అతుక్కుంటాయి. ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్ళు జనాలను బుట్టలో వేసుకుంటుంటారు. బాధితుడిగా మారి అధ్యయనం కోసం... సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారే అని పోలీసులు చెప్తున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జత కడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన నలుగురిలో మహ్మద్ ఫజలుద్దీన్ అలియాస్ ఫైజల్ ఒకరు. జీడిమెట్లలోని ప్రకాశం పంతులు నగర్‌కు చెందిన ఈ సివిల్ కాంట్రాక్టర్ నాలుగేళ్ళ క్రితం ఇలాంటి ముఠా చేతిలోనే పడి రూ.లక్షల్లో మోసపోయాడు. దీంతో రైస్‌పుల్లర్స్ కోసం అధ్యయనం ప్రారంభించి ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సంచరించాడు. ఈ నేపథ్యంలోనే ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వి.ఆంజనేయులుతో పరిచయమైంది. మాటకారి అయిన అతడితోనే జట్టుకట్టి రైస్ పుల్లింగ్ మోసాలు మొదలుపెట్టాడు. రాహుల్ నగరవాసేనా? ఈ ముఠాకు సహకరించిన వారిలో కోల్‌కతాలో నివసిస్తున్న రాహుల్ హుడా ఒకరు. ఈ గ్యాంగ్ తమ వల్లోపడిన వారితో వారు ఖరీదు చేయబోయే రైస్పుల్లర్లను తనిఖీ చేయించి, సర్టిఫికేషన్ తర్వాతే అందిస్తామని చెప్తుండేవాడు. ఇలా తనిఖీలు చేసే నిపుణుడిగా రాహుల్ నటించాడు. కోల్‌కతాలోని చంద్రారోడ్లో బీటా ట్రేడర్స్ పేరుతో ఓ కార్యాలయం నిర్వహిస్తున్న ఇతగాడు ఈ ముఠా పిలుపు మేరకు రెండుమూడుసార్లు సిటీకి వచ్చాడు. వస్తూ తన వెంట ఇద్దరు ముగ్గురు అనుచరులు, కొన్ని అంతుచిక్కని ఉపకరణాలను తీసుకువచ్చాడు. ఎస్డీ రోడ్లో ఉన్న ఆంజనేయులకు చెందిన కార్యాలయం కేంద్రంగానే ఈ ఉపకరణాలతో ఆయా రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్లు నటిస్తూ, వాటికి సర్టిఫికేషన్ ఇచ్చేవాడు. దీనికోసం బాధితులే ఇతడితో పాటు మందీమార్బలానికి అవసరమైన ఫ్లైట్ టిక్కెట్లు, బస ఖర్చులు భరించేవారు. వీటికి అదనంగా రాహుల్ కొంతమొత్తం ఫీజుగానూ వసూలు చేసేవాడు. గురువారం చిక్కిన గ్యాంగ్ చెప్పిన వివరాల ప్రకారం ఇతగాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తేనని, పేరు మార్చుకుని ఏళ్ళుగా కోల్‌కతాలో నివసిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అరెస్టు చేయడానికి ఓ ప్రత్యేక బృందం త్వరలో అక్కడకి వెళ్ళనుంది. పరువు కోసం ఫిర్యాదులు చేయకుండా... టాస్క్‌ఫోర్స్ అరెస్టు చేసిన ఈ నలుగురి పైనా ప్రస్తుతానికి బోయిన్పల్లి, మహంకాళి ఠాణాల్లోనే కేసులు నమోదై ఉన్నాయి. అయితే వీరి చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. బాధితుల్లో అనేక మంది విద్యాధికులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వానే కావడంతో ఈ విషయం బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. తమకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావిçస్తూ మిన్నకుండిపోతున్నారు. గురువారం చిక్కిన ఆంజనేయులు, ఫజలుద్దీన్, బాబుల్, బాబూరావు చేతిలో నగరానికి చెందిన ఓ పెద్దింటి మహిళ సైతం రూ.10 లక్షల మేర మోసపోయారు. దీంతో ఫిర్యాదు చేయమంటూ పోలీసులు కోరగా.. ఆమె నిరాకరించారు. ఈ నలుగురు నిందితులను శుక్రవారం మహంకాళి పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
వంట జంట
మొగుడ్స్ పెళ్లామ్స్ ముఖాలు చూస్కోడం లేదు. ఎవరి ఫేస్‌లు వాళ్లు చూసుకుంటున్నారు! ఎవరికి వాళ్లు బుక్ అయి పోయారు. ఇప్పుడు కనుక పెళ్లి పుస్తకం అన్న సిరీస్ రాస్తే దాని టైటిలు ఇవాళ్టికి సూట్ అయ్యేలా రాయాల్సి వస్తుంది. ‘పెళ్లి బుక్’ అని. చూస్తున్నారా పైన? యువ జంట. చేసుకుంటోంది హ్యాపీగా వంట. అన్యోన్యంగా, హ్యాపీగా, ఫేస్ టు ఫేస్. మనకూ ఏడ్చింది బతుకు. మనకూ ఏడ్చిందొక ఫేస్ బుక్కు. ఇంట్లో ఉన్నంత సేపూ ఆ ఫేస్‌కే బుక్ అయిపోతున్నాం. అసలు అలాంటి ఫేస్బుక్ ఇచ్చినవాడినీ.. నీ.. నీ... ఏం చేసినా పాపం లేదు. ఇంట్లో జంటలను.. కలిసి వంటలను చేసుకోనివ్వకుండా చేసిన ఫేస్బుక్ క్రియేటరే ఆ పైన కనిపిస్తున్న మహానుభావుడు. మార్క్ జుకర్‌బర్గ్. ఆయన, ఆయన శ్రీమతి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని లవ్ చేసుకుంటూ ఉన్నారు. పెళ్లిలో ప్రేమను వండుతూనే ఉన్నారు. మారండి.. డియర్ కపుల్స్. కలిసి ఉండండి. కలిసి వండండి. -
ఎక్కువ కాలేదు... తక్కువ కాలేదు... ఎవరూ చావలేదు!
ఎక్కువ కాలేదు... తక్కువ కాలేదు! ఏంటది? వంట అండ్ వంటలోకి కావలసిన దినుసులు గట్రా! సమంత వండిన వంటలో ఏదీ ఎక్కువ కాలేదట... ఏదీ తక్కువ కాలేదట! యస్... శనివారం సమంత ఇంట్లో వంట చేశారు. ఎందుకు? అంటే... షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని! ఖాళీగా ఉండడంతో కిచెన్‌లోకి వెళ్లి... కూరగాయలు కట్ చేశారు. స్టవ్ అంటించి, నాన్‌స్టిక్ కడాయిపై నాన్‌వెజ్ కూడా కుక్ చేశారు. ఆ తర్వాత నా వంట తిని ఎవరూ చావలేదని సమంతే చెప్పారు. ‘నో వన్ డైడ్... యస్... స్స్!!’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత పేర్కొన్నారు. షూటింగ్ క్యాన్సిల్ అయితే... ఆ రోజు వంట చేయడమే అని సోషల్ మీడియాలో ఆమె తెలిపారు. పెళ్లికి ముందు నాగచైతన్య వంట చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేసేవారీమె. పెళ్లి తర్వాత తీరిక చిక్కినప్పుడల్లా ముద్దుల శ్రీవారికి సమంతే వంట చేస్తున్నట్టున్నారు. బహుశా... ‘నేను వంట చేశానోచ్’ అని సమంత పబ్లిగ్గా చెప్పుకోవడమూ ఇదే తొలిసారి అనుకుంటా! నా వంట తిని ఎవరూ చావలేదని చెప్పారు గానీ... టేస్ట్ ఎలా ఉందో ఆమె చెప్పలేదు. నెక్ట్స్ టైమ్ సమంత గానీ... చైతన్య గానీ... కలసినప్పుడు అడుగుదాంలెండి!! -
మొక్కవోయి జొన్న
మొక్కజొన్న... కాల్చుకు తిన్నా కాదనదు. వేపుకు తిన్నా వద్దనదు. వండుకు తిన్నా ఒదిగిపోతుంది. పెనం మీద అట్టవుతుంది. నూనెలో గారెవుతుంది. అందుకే... తినే ముందుగా...మొక్కజొన్నకు ఓ మొక్కు మొక్కుదాం. క్రిస్పీ కార్న్ కావలసినవి : మొక్కజొన్న గింజలు – ఒకటిన్నర కప్పు; కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదా – 2 టేబుల్ స్పూన్స్; వరిపిండి – 2 టేబుల్ స్పూన్స్; ఉప్పు – రుచికి సరిపడ; నల్లమిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉల్లిపాయలు – పావు కప్పు; తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్; నూనె – వేయించడానికి సరిపడ. తయారీ ♦ ఒక గిన్నెలోకి మొక్కజొన్న గింజలు, కార్న్‌ఫ్లోర్, మైదా, వరిపిండి, ఉప్పు, మిరియాల పొడి, 1 స్పూన్ నీళ్లు పోసి బాగా కలపాలి. ♦ స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగిన తర్వాత, స్టౌ సిమ్‌లో పెట్టి, ముందుగా కలిపి పెట్టిన మొన్న జొన్న మిశ్రమాన్ని వేసి బాణలిపై మూతపెట్టాలి. ♦ 15 సెకన్లు ఆగి మూత తీసి వేగిన కార్న్‌ను నూనె లేకుండా లేకుండా తీసుకోవాలి. ♦ వేడిగా ఉండగానే కొత్తిమీరతో అలంకరించి వెంటనే సర్వ్ చేయాలి (లేదంటే కార్న్ మెత్తబడతాయి). గ్రిల్డ్ కార్న్ కావలసినవి: తాజా మొక్కజొన్న కండెలు – 4; వెన్న – 4 టేబుల్ స్పూన్స్; మిరియాల పొడి – 1 టీ స్పూన్, చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, నిమ్మకాయలు – 2, చీజ్ – సరిపడ. తయారీ: ♦ ముందుగా మొక్క జొన్న కండెలను తీసుకుని 3 లేదా 4 పొరలు ఉంచి మిగిలినవి తీసివేసి 15 నిమిషాలు చల్లటి నీటిలో నానబెట్టాలి ∙ఒక గిన్నెలో వెన్న, మిరియాల పొడి, చిల్లీ సాస్ వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి ♦ మొక్కజొన్న పొరలను వెనక్కి మడిచి, గ్రిల్‌ను బాగా వేడయ్యాక అన్ని వైపులా బాగా కాలేలా చూసుకోవాలి (గ్రిల్ లేకపోతే స్టౌ వెలిగించి మీడియమ్ మంటపై అన్నివైపులా కాల్చుకోవచ్చు) ♦ కాలిన మొక్కజొన్న కండెలకు ముందుగా తయారు చేసుకున్న వెన్న మిశ్రమాన్ని బ్రష్‌తో అన్నివైపులా రాసి మళ్లీ 2 నిమిషాలు గ్రిల్‌పై కాల్చుకోవాలి ♦ గ్రిల్ చేసిన మొక్కజొన్న కండెలను ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం వెన్న రాసి, తరిగిన కొత్తిమీర, తురిమిన చీజ్ చల్లి, నిమ్మ చెక్కలతో సర్వ్ చేయాలి ♦ (మొక్కజొన్న కండెలను 2 అంగుళాల సైజులో కట్ చేసుకుని టూత్ పిక్‌తో గుచ్చి సర్వ్ చేయొచ్చు). మొక్కజొన్న అట్లు కావలసినవి: మొక్కజొన్న గింజలు – 1 కప్పు, నానపెట్టిన పెసరపప్పు – పావు కప్పు; వరిపిండి – పావు కప్పు; బొంబాయిరవ్వ – అరకప్పు; ఇంగువ – చిటికెడు; అల్లం – అర అంగుళం ముక్క, కరివేపాకు – 1 రెమ్మ; ఉప్పు – రుచికి సరిపడ; తరిగిన ఉల్లిపాయముక్కలు – పావు కప్పు, కొత్తిమీర తరుగు – కొంచెం; నూనె – సరిపడ. తయారీ: ♦ మొక్కజొన్న గింజలు, నానబెట్టిన పెసరపప్పు, అల్లం, కరివేపాకు, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మిక్సీజార్‌లో వేసి మెత్తని పిండిలా పట్టుకోవాలి ♦ ఒక గిన్నెలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని, బొంబాయి రవ్వ, వరిపిండి, ఇంగువ వేసి బాగా కలిపి గంట సేపు నాననివ్వాలి ∙స్టౌ పైన పెనం పెట్టి ఈ పిండిని దోశెలాగ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి, చుట్టూ నూనె వేసి బాగా కాలనివ్వాలి ♦ రుచికరమైన మొక్కజొన్న దోశె రెడీ. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి దేనితో తిన్నా బాగుంటుంది. మొక్కజొన్న మష్రూమ్ కర్రీ కావలసినవి: మొక్కజొన్న గింజలు – కప్పు; సన్నగా తరిగిన మష్రూమ్స్ – కప్పు; తరిగిన ఉల్లిపాయలు – 2 కప్పులు, తరిగిన టమోట – 2 కప్పులు; తరిగిన కాప్సికమ్ – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు, నూనె– 5 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడ; కారం – 2 టీ స్పూన్స్; పసుపు – అర స్పూన్; జీలకర్ర – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్, లవంగాలు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; యాలక్కాయ– 1; ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా – 2 టీ స్పూన్స్. తయారీ: ♦ బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ వేయించుకోవాలి ∙అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, ఉల్లిపాయ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, ధనియాల పొడి వేసి మరికాసేపు వేయించుకోవాలి ♦ టమోటా వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత కాప్సికమ్ వేసి మరో 2 నిమిషాలు వేగనివ్వాలి ♦ ఇప్పుడు మొక్కజొన్న గింజలు, మష్రూమ్స్ వేసి 2 నిమిషాలు వేయించాక కప్పు నీళ్ళు పోసి మూతపెట్టి మీడియమ్ మంటపైన ఉడికనివ్వాలి ∙చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా వడ్డించాలి ♦ అన్నంలోకి, చపాతీకి కూడా బాగుంటుంది. మొక్కజొన్న పాకం గారెలు కావలసినవి: మొక్కజొన్న గింజలు – 2 కప్పులు; వరిపిండి – 1 కప్పు; బొంబాయి రవ్వ – అర కప్పు; తరిగిన బెల్లం – 1 కప్పు, యాలకులు – 3; వంట సోడా – చిటికెడు; నూనె – వేయించడానికి సరిపడ తయారీ: ♦ మొక్కజొన్న గింజలను జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ♦ ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని వరిపిండి, బొంబాయిరవ్వ, వంట సోడా వేసి బాగా కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి ∙స్టౌ పైన మందపాటి గిన్నెలో తరిగిన బెల్లం, కొంచె నీళ్లు పోసి పాకం వచ్చేవరకు తిప్పుతూ ఉండాలి. చివరగా యాలకుల పొడి వేసి మూతపెట్టుకోవాలి ♦ బాణలిలో నూనెపోసి కాగనివ్వాలి ♦ అరచేతిలో నూనె రాసుకుని నిమ్మకాయ సైజులో జొన్నపిండి ముద్దను తీసుకుని గారెలుగా వత్తుకుని, మధ్యలో చిల్లుపెట్టి కాగిన నూనెలో వేసి బంగారం రంగు వచ్చేలా రెండువైపులా వేయించుకోవాలి వేయించుకున్న గారెలుగా వెంటనే బెల్లం పాకంలో వేసి 5 నిమిషాల సేపు నానిన తర్వాత సర్వ్ చేయాలి. -
వంట చేస్తుండగా మంటలు అంటుకుని..
► నాలుగు పూరిల్లు దగ్ధం నెల్లూరు సిటీ: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు పూరింటికి మంటలు అంటుకుని పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లు అగ్నికి ఆహుతైన ఘటన భక్తవత్సలనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. భక్తవత్సల్‌నగర్‌లోని సంగమిత్రా పాఠశాల వెనుకవైపున పలువురు పేదలు పూరిళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. గురువారం ఉదయం ఓ ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మం టలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. దీంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేలోగానే పీ శీనయ్య, పీ అనీల్, వై మధు ఎస్కే గపూర్‌కు చెందిన పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో నాలుగు ఇళ్లలోని టీవీలు, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.2లక్షలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
వంటొచ్చిన మొగుడు
సమ్సారం సంసారంలో సినిమా అదేంటో నేను కిచెన్‌లోకి అడుగు పెడితే చాలు మా ఆవిడ చిరాకుతో కూడుకున్న ప్రేమతో నా మీదకు దూసుకొచ్చేస్తుంది.‘వంటింట్లోకి రావద్దని నాలుగేళ్ళుగా చెప్తున్నా వినరే... ’ కోపంగా ముఖం పెడుతుంది.మా షాదీ అయి ఇప్పటికి నాలుగేళ్ళన్న మాట. ‘ఎందుకు బేగం? నన్ను కిచెన్ చూడనివ్వొద్దని మీ అమ్మ దగ్గర ఒట్టు పెట్టావా ఏంటి?’ అన్నాను.‘అవును... పెట్టాను’ అని కిచెన్‌లో నుంచి తోసినంత పని చేసింది.నాకు చిన్నప్పట్నించి అమ్మతో, అక్కతో వంటల దగ్గర కూర్చోవటం అలవాటు. అలా అలా వంట చెయ్యటం కూడా వచ్చేసింది. ‘నలభీములు నీ రూపంలో జన్మెత్తారేమో... నిన్ను చేసుకునే పిల్ల బాగా సుఖ పడుతుందిరా మనవడా..’ అని మా అమ్మమ్మ చాలాసార్లు అనేది. కానీ నా పెళ్ళానికి మాత్రం నా చేతివంట తినే ప్రాప్తం లేదు. నేను వంట గదిలోకి వచ్చినా వంట చేస్తానన్నా అస్సలు ఒప్పుకోదు. వంట గదిలోకి వచ్చానంటే ఇన్సెక్యూర్ అయిపోతుంది. కాని ఏం చెయ్యను? ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద గొట్టంతో సుయ్యి సుయ్యిమని ఊదుకుంటూ వంట చేసేవాళ్ళం. రోకట్లో అక్క, నేను టమాట తొక్కు, గోంగూర తొక్కులు కమ్మగా నూరేవాళ్ళం. ఆ తర్వాత వంట మాస్టర్ వహీద్ వెంట పెళ్ళిళ్ళకని పేరంటాలకని అసిస్టెంటుగా వెళ్లి అక్కడ చికెన్, మటన్, కద్దూ కి ఖీర్, డబల్ కా మీఠా, దాల్చా, బగార ఖానా, బిర్యానీ... వండటం నేర్చుకున్నాను. చదువు కోసం హైదరాబాదు వచ్చాక బ్యాచిలర్‌గా రూంలో వంట చేస్కొని తినటం వల్ల నా ఎవ్రీ మూమెంట్లో వంట ఒక భాగమైపోయింది. నా ఫ్రెండ్స్ చాలా మంది వంట చెయ్యటం రాక హోటల్లో తిందామనేవాళ్ళు. నేను మాత్రం హోటల్ ఫుడ్డుకి ఫర్లాంగుల దూరముండేవాణ్ణి. పొద్దస్తమానం ఎంత పనున్నా అలిసిపోయినా ఫ్రెష్ అయి వంట చేసి రీఫ్రెష్ అవడం నాకు అలవాటుగా ఉండేది. స్వయంపాక ప్రహసనంలో ఉండగానే చదువైపోయింది. పెళ్ళీడు దాటిపోతోందని అమ్మ పట్టుబట్టి మరీ షాహిన్‌ని వెతికి పెళ్ళి చేసింది.షాహిన్ నా లైఫ్ ఏంజిల్. బట్ నన్ను వంట దగ్గరికి రావొద్దనే విషయంలో రాక్షసి.‘పెళ్ళి కాకముందు మీరు వంట చేశారో వాయినాలు సమర్పించారో నాకనవసరం. నేను మీ ధర్మపత్నిగా మీ జిందగీలోకొచ్చాను. కాబట్టి మీరు నా చేతి వంటే తినాలి. ఒక ఆడదానిగా నాకు మొగుడికి వంట చేసి కొసరి కొసరి వడ్డించాలని వుంటుంది. ముందు భార్య మనసుని అర్థం చేస్కోవడం అలవాటు చేస్కోండి. కాదని ఓవరాక్షన్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు’ ఇలాంటి స్వీట్ వార్నింగులు ఇస్తుంటుంది.అయినా నా వంటబుద్ధి మారదు. ‘చేసిన ప్రాణం వూరుకోదు కదా ? ఇలా ఒకరి ఉత్సుకతకు సంకెళ్ళు వెయ్యటం అన్యాయ్ హై ఔర్ అక్రమం హై’ అని నేనెంత వాదించినా తన మాటే నెగ్గించుకుంటుంది. ‘బయట జాబ్ చేసి ఈ కుటుంబాన్ని పోషిస్తున్నారు కదా. అది సరిపోతుంది. ఇంటికి రాగానే హాయిగా కాలు మీద కాలేస్కొని గులాబ్ జామ్ చేసి పెట్టు, బగార బైంగన్ వండి పెట్టు అని ఆర్డర్లు పాస్ చెయ్యండి హుజూర్. నేను జీ హుజూర్ అని చక్కగా చేస్తా. పతిసేవ చేసుకోనివ్వండి’ అంటుంది. ‘సేమ్ టు యూ’ అనగానే నా వైపు గుర్రుగా చూస్తుంది.‘చెయ్యండి రోజూ వంట మీరే చెయ్యండి. నేనింట్లో తేరగా తినీ కూర్చుని కట్టుకున్న వాడితో నానా చాకిరీ చేయిస్తున్నానని అత్తయ్య, తోడికోడళ్ళ ముందే గాకుండా ఇరుగు పొరుగు వారి ముందు కూడా బద్నామ్ కావాలనే కదా మీ ఉద్దేశ్యం. ఏ జన్మలో ఏం పాపం చేశానో వంటొచ్చే మొగుణ్నిచ్చాడు ఆ పైవాడు. అసలు నాకు పెళ్ళిచూపులప్పుడే అనుమానం వచ్చింది – మీరు మీ హాబీస్‌లో ముందుగా వంట గురించే చెప్పారు. అప్పటికీ స్వరూప అంటూనే వుంది – ‘వంట వచ్చినవాణ్ణి కట్టుకుంటే జీవితమంతా తంటా తప్పదు సుమీ’... అని. తనెంత హెచ్చరించినా అదొక బిత్తిరి మొహంది అనుకొని పిచ్చ లైట్ తీస్కున్నా. కానీ తను చెప్పింది అక్షరాల నిజమే అయ్యింది. మీ అన్నదమ్ముల్ని చూడండి – ఇంటికొచ్చి ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టరు. ఆర్డర్లేసి వాళ్ళ పెళ్ళాలతో ఎలా చేయించుకు తింటున్నారో చూడండి. మీరూ వున్నారు ఎందుకూ? వాళ్ళని చూసి నేర్చుకోండి... మారండి..’తనలా ఫ్రస్టేట్గా ఫీలౌతుంటే నాకు నవ్వాగదు ! నవ్వితే తను మూడ్రోజులు మౌనవ్రతం బూనుతుంది.‘అదేమిటి బేగం... ఆడవాళ్ళు మాత్రమే ఇంటిపని, వంటపని చెయ్యాలని రాజ్యాంగంలో రాసిపెట్టి ఉందా? నాకు 24 అవర్స్ పనుండాలి. నేనేదో చిన్నా చితక రైటర్ని కదా! నాకు వంట గదిలో వంట చేస్తుంటేనే థాట్స్ వస్తాయ్ తెల్సా ?’ ‘అలాగైతే నాకొక జాబ్ చూడండి. నేను జాబ్ చేస్కుంటాను. అప్పుడు మీరు ఇంట్లో వుండి వంట చేద్దురు గానీ...’ ఇంతలో బెడ్రూంలోంచి మా పాప ఇరం ‘క్యావ్’ అని ఏడవటం మొదలు పెట్టింది.ఇద్దరం బెడ్రూంలోకి పరుగు తీశాం.ముందుగా నేనే అందుకున్నా పాపని. కాని తను ఉరిమి చూసింది.‘దానికి పాలు కూడా మీరే ఇవ్వండి సరిపోతుంది’ అంటూ పాపని నా చేతుల్లోంచి లాక్కొన్నంత పని చేసి అటువైపు తిరిగి పాలిస్తోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? దొరికిందిలే సందు అని వంట గది వైపు చటుక్కున జారుకున్నాను. టకటకమని పప్పు కుక్కర్లో వేసి ఉడికిస్తున్నా. అంతలోనే షాహిన్ వచ్చి నన్ను కరిచేట్టు చూసి – ‘ ఛ.. మీరు మారరు ‘ అంది.‘మొగోళ్ళు వంటపనిలో చేయి పెడితే ఇంట్లో బర్కత్ వుంటుందని ఒక హదీస్లో వుందోయ్ ...’‘చాలించండి ఈ సమర్థింపులకేం తక్కువలేదు. నేను వెళ్త...’ అని అక్కడినుండి వెళ్లిపోయింది.‘హమ్మయ్య...’ అనుకుంటూ పచ్చిమిర్చి తొడిమెలు తెంపుతూ ఆలోచనలో పడ్డాను.క్రితంసారి అత్తవారింటికెళ్ళినప్పుడు మామిడి ఆవకాయ పెట్టడానికి నడుం బిగించాను. షాహిన్ వద్దని వారిస్తున్నా లేవకుండా మొండిగా తన మాటను ఇగ్నోర్ చేసి మసాలాలన్నీ దంచి, మామిడి కాయలు నరికేసి జాడీల్లో పెట్టే వరకు ఉడుంపట్టు పట్టాను. ఆ లోపు షాహిన్ ఫ్రెండు వచ్చి నా అవతారాన్ని చూసింది. అది చూసి షాహిన్‌కు పీకల్లోతు కోపం వచ్చింది. మరోవైపు అత్తయ్య నా పని చూసి ముచ్చటపడి మామయ్యని దెప్పి పొడవటం మొదలు పెట్టింది. ‘అల్లుడిలా ఒక్కరోజైనా ఇంటి పని చెయ్యండి..’ అనడంతో మావయ్య నన్ను అదో రకంగా కింది నుండి మీది వరకు చూశాడు.బామ్మర్దులను కూడా వారి భార్యలు నన్ను ఉదాహరణగా చూపించి దెప్పి పొడవటం స్టార్ట్ చేసారు.అత్తవారింటి ఆడవాళ్ళందరి దృష్ఠిలో నేను ఉత్తమ అల్లుణ్ణి.కానీ నా భార్య దృష్ఠిలో నేనెప్పుడూ ఓవరాక్షన్ మొగుణ్ణే. ఈ తగాదా ఎప్పటికైనా తీరుతుందంటారా? సినిమాలో సంసారం నాన్నవంట చూడ్డానికే... తినటానికి కాదు ఆనంద్‌రావు (అక్కినేని నాగేశ్వరరావు), జయలకు(జయసుధ) ఐదుగురు పిల్లలు. వాళ్ల అల్లరితో ఇల్లు సందడిగా ఉంటుంది. ఓ రోజు పిల్లలు స్కూల్ నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొస్తారు. చిన్న పాపకు వచ్చిన మార్కులు చూసి జయ మందలిస్తే రావు పిల్లలకు సపోర్ట్‌గా మాట్లాడతాడు. ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం చేయనంటుంది జయ. ‘నువ్వు చేయకుంటే నేను చేస్తా’నంటాడు రావు. ‘అన్ని పనులూ మీరే చేయండి వంటతో సహా, నేను కూర్చుంటాను’ అంటుంది విసుగ్గా జయ. ‘వంట పెద్ద విద్య అనుకున్నావా? పిల్లలూ రండి.. వంట చేసి మన తడాఖా ఏంటో చూపిద్దాం’... అంటూ పిల్లలతో కిచెన్‌లోకి వెళ్తాడు రావు. వంట చేసి ప్లేట్లలో వడ్డించి పిల్లల్ని తినమంటాడు ఆనంద్‌రావు. కట్ చేస్తే... పిల్లలంతా అమ్మ వద్దకు చేరి ‘ఆకలేస్తోందమ్మా’ అంటారు.‘మీరూ మీ నాన్నగారు కలిసి వంట చేసుకున్నారుగా వెళ్లి తినండి’ అంటుంది జయ. ఇవాళ వంట సరిగ్గా కుదరలేదు అని నసుగుతాడు రావు. ‘నాన్న చేసిన వంట చూడ్డానికే కానీ తినటానికి బాగాలేదమ్మా’ అంటారు పిల్లలు ‘రావుగారిల్లు’ సినిమాలో. ఇలాంటి సంఘటనలు మనిళ్లలోనూ జరగకపోవు. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్:samsaaram2017@gmail.com – హుమాయున్ సంఘీర్ -
వంటంతా ఒకే చోట..!
- 20 కిలోమీటర్లకో పాకశాల ఏర్పాటు యోచన - అక్కడి నుంచే పాఠశాలలకు మధ్యాహ్నభోజనం - జిల్లాలో ఐదు క్లస్టర్లలో అమలుకు సన్నాహాలు రాయవరం (మండపేట) : ‘మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. అన్నంలో పురుగులు ఉంటున్నాయి. మెనూ ప్రకారం గుడ్డు వడ్డించడం లేదు..’ ఇలాంటివే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై వినిపిస్తున్న విమర్శలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అమలు చేస్తున్న ఈ పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులు వివిధ సందర్భాల్లో జిల్లాలో ఏదో ఒక మూల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనంలో మార్పులకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకు ప్రభుత్వం 524339/ప్రోగ్రామ్.1/ఎ1/2017 తేదీ 19–04–2017తో మెమో విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 4,189 ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో దాదాపుగా రోజుకు 2.80 లక్షల మంది మధ్యాహ్న భోజనం తింటున్నారు. జకొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలు వండి సరఫరా చేస్తుండగా, చాలా పాఠశాలల్లో మిడ్డే మీల్ వర్కర్లు వండి వడ్డిస్తున్నారు. ప్రతి క్లస్టర్లో 25 వేల మందికి వంట ఇకపై ప్రతి మూడు, నాలుగు మండలాలకు ఒక భారీ వంటశాల ఏర్పాటు చేసి అక్కడి నుంచి అన్ని పాఠశాలలకూ భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, అమలాపురం, రామచంద్రపురంలలో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి క్లస్టర్లో సుమారు 25 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయనున్నారు. ఉదాహరణకు రామచంద్రపురంలో వంటశాలను ఏర్పాటు చేసి దాని పరిధిలోని 25 వేల మందికి భోజనం తయారు చేసి అక్కడి నుంచి వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ఎప్పుడు తయారైన భోజనం అప్పుడే ప్యాకింగ్ చేసి పంపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు ప్రతి క్లస్టర్‌కు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరమని జిల్లా విద్యాశాఖ గుర్తించింది. అవసరమైన స్థలాలను ఐదు క్లస్టర్లలో గుర్తించాలని కలెక్టర్‌కు విద్యాశాఖ నివేదించింది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాల హెచ్ఎంతో పాటు మండల విద్యాశాఖాధికారి ఒక్కరే పర్యవేక్షిస్తున్నారు. వంటశాలల ఏర్పాటు తర్వాత వాటి సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఫలితంగా డివిజన్, జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మెనూ ప్రకారమే భోజనం.. ప్రభుత్వ ఆలోచన పూర్తి స్థాయిలో అమలైతే నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందనుంది. వంటశాలలు లేవని, వర్షం కురుస్తోందని, బిల్లులు చెల్లించక పోవడంతో భోజనం అందించడం ఇబ్బందిగా మారుతుందనే మాటలు వినిపించే అవకాశం ఉండదు. ప్రతి వారం తప్పనిసరిగా రెండు గుడ్లు అందించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన భోజనం తయారవుతుంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. వర్కర్లకు ప్రత్యామ్నాయమెలా.. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న మహిళలు భారీగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి పాఠశాలలో మిడ్డే మీల్ వర్కర్లు భోజనం తయారు చేసి వారికి వడ్డిస్తున్నారు. జిల్లాలో సుమారు 8 వేల మంది మిడ్డే మీల్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.1,000 గౌరవ వేతనం అందజేస్తున్నారు. నూతన విధానం అమలు జరిగితే వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వంటశాలల్లో భోజనం తయారీతో పాటు ప్యాకింగ్, ఇతర పనుల్లో వీరిని వినియోగించుకోనున్నా..అందరికీ ఉపాధి సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అంచనాలు రూపొందిస్తున్నాం.. ప్రతి 20 కిలోమీటర్లకో వంటశాల ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందిస్తున్నాం. వంట తయారు చేయడానికి అవసరమైన భవనాల నిర్మాణానికి అనువైన స్థలం కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. – ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి -
ఆపిల్ ఓట్స్ స్వీట్
హెల్దీ కుకింగ్ తయారి సమయం: 15 నిమిషాలు కావలసినవి: ఓట్మీల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము – టేబుల్ స్పూన్, యాపిల్ – ఒకటి (చిన్న ముక్కలుగా తరగాలి), దాల్చిన చెక్క పొడి – చిటికెడు, ఉప్పు – చిటికెడు, కిస్మిస్లు – టేబుల్ స్పూన్, నీళ్లు – రెండు కప్పులు తయారి: పాత్రలో నీళ్లు, ఉప్పు, ఓట్స్ వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. బెల్లం తరుము, దాల్చిన చెక్క పొడి, యాపిల్ ముక్కలు వేసి కలిపి, మరో మూడు నిమిషాల పాటు ఉంచాలి. ∙కిస్మిస్లు వేసి దింపేసి వేడివేడిగా అందిస్తే రుచిగా ఉంటుంది. -
స్టఫ్డ్ పొట్లకాయ
హెల్దీకుకింగ్ తయారి సమయం: 30 నిమిషాలు కావలసినవి:పొట్లకాయ – 1(మూడంగుళాల పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి)ఉల్లిపాయ – 1జీలకర్ర – అర టీ స్పూన్ కొత్తిమీర – గార్నిష్‌కి సరిపడా స్టఫ్ కోసం:పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లుగసగసాలు – రెండు టీ స్పూన్లుపచ్చిమిర్చి – అయిదుపచ్చిబఠాణి– పావు కప్పు (ఉడికించాలి)ఉప్పు – సరిపడా(పై పదార్థాలలో కొద్దిగా నీటిని చిలకరించుకుని మిక్సీలో పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి) తయారి:∙ముందుగా పొట్లకాయ ముక్కల్లో స్టఫింగ్ మిశ్రమాన్ని కూరాలి.పాత్రలో నూనె వేడయిన తరవాత జీలకర్ర చిటపటలాడించి పసుపు, ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.కూరిన పొట్లకాయ ముక్కల్ని జత చేసి కలిపి చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించాలి. (ప్లేట్లో కొద్దిగా నీరు పోసి మూత పెడితే అడుగంటకుండా ఆవిరికి త్వరగా ఉడుకుతుంది.) ఇలా 15 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.పొట్లకాయ మెత్తబడగానే దింపి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా అన్నంలోకి వడ్డిస్తే రుచిగా ఉంటుంది. -
వంటకు ‘పెద్ద’ కష్టం !
- పెద్దనోట్ల రద్దుతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కష్టాలు - నగదు నిల్వలు ఉన్నా తీసుకోలేని పరిస్థితి - సరుకుల కొనుగోలుకు అప్పులే దిక్కు కర్నూలు సిటీ: నగదు కష్టాలకు అందరూ అతీతులే అన్నట్లుగా మారింది. పెద్ద నోట్ల మార్పిడితో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న ఏజెన్సీలకు కూడా తాకింది. విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్న వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు ఇవ్వక పోవడంతో పాటు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసేందుకు ఖాతాల్లో నగదు ఉన్నా బ్యాంకుల్లో నగదు కొరతతో తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా చోట్ల ఏజెన్సీలు పెట్టిందే తినాలి అన్నట్లు వ్యవహరిస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1928, ప్రాథమికోన్నత పాఠశాలలు 481, ఉన్నత పాఠశాలలు 448 ఉన్నాయి. నోట్ల రద్దుతో నిర్వాహకులకు కష్టాలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం కింద 2847 వంట ఏజెన్సీలో ఉన్నాయి. నెల రోజులు దాటినా నోట్ల రద్దు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా చోట్ల కూరగాయాలు, నూనె, కోడి గుడ్లు తదితర వస్తువులను అధిక వడ్డీలకు అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు. సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కొంత మంది నోట్ల రద్దును సాకు చూపి మెనూ కూడా పాటించడం లేదు. మరి కొన్న చోట్ల అసలు కోడి గుడ్లు అందించడం మానేశారు. రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం: మంగమ్మ, కోసిగి జడ్పీ హైస్కూల్ ఏజేన్సీ నిర్వాహకురాలు . మా స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు రోజుకు రూ. 1000కి పైగా ఖర్చు అవుతుంది. ఇప్పటికే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మా ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేసేందుకు వెళ్తే పెద్ద పెద్ద క్యూలు ఉంటున్నాయి. రోజు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. వంట చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు సమస్యను పరిష్కరించాలి. అప్పులు చేయాల్సి వస్తుంది: భూలక్ష్మమ్మ, నగరపాలక సంస్థ హైస్కూల్, కర్నూలు రోజుకు 900 మందికిపైగా విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్నాం. సరుకులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తుంది. నోట్ల రద్దు వల్ల కూరగాయలు, కిరాణం దుకాణాల్లో ఇప్పటికే ఖాతా పెట్టాం. నెల రోజులు కావడంతో పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే సరుకులు ఇస్తామంటున్నారు. కోడి గుడ్లు కొనుగోలు చేసేందుకు అధిక వడ్డికి అప్పులు తెచ్చాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా: కె. రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ వంట ఏజెన్సీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. ఇప్పటికే ప్రాథమిక స్కూళ్లకు బిల్లులు విడుదల కావడంతో వారికి డబ్బులున్నా డ్రా చేసుకోలేక పోతున్నారు. వారానికి రూ. 24 మాత్రమే బ్యాంకుల నుంచి తీసుకునే అవకాశం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కష్టాలు పడుతున్నారు. సమస్య త్వరగా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తాం. -
వంట గ్యాస్‌కు నగదు రహిత బదిలీలు
ఎల్పీజీ డీలర్లకు జేసీ సత్యనారాయణ ఆదేశం కాకినాడ సిటీ : గ్యాస్ వినియోగదారుల సౌకర్యార్థం ఎల్పీజీ డీలర్లు విధిగా నగదు రహిత బదిలీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో ఎల్పీజీ డీలర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు సర్క్యులేషన్ లేక మార్కెట్లో కొనుగోళ్లు, అమ్మకాలు తక్కువగా ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత బదిలీలు, స్వైపింగ్, యాప్‌ల డౌన్లోడ్ల ద్వారా నగదు బదిలీలు నిర్వహించడానికి చర్యలు చేపట్టిందని చెప్పారు. జిల్లాలో 13 లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారని, వీరందరికీ ఆధార్, బ్యాంక్ ఖాతా సీడింగ్ జరిగిందన్నారు. వీరందరికీ నగదు రహిత బదిలీ చేయాల్సిన అవసరం ఉందని, దీని వల్ల లబ్ధి ఉంటుందన్నారు. ఈ పోస్ మెషీన్ ద్వారా స్వైపింగ్ ఆంధ్రా బ్యాంక్ బిజిలీ యాప్, స్టేట్‌బ్యాంక్ బడ్డీ, ఎం–పే యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని నెట్ కనెక్టివిటీ ఉంటే వీటిని నిర్వహించుకోవచ్చున్నారు. డెలివరీ బాయస్కు యాప్‌లు, స్వైప్‌లపై అవగాహన కల్పించాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్ ఉంటే దానికి స్వైపింగ్ కనెక్టివిటీ ఇస్తారని, దాన్ని మొబైల్గా ఉపయోగించి నగదు బదిలీ చేయవచ్చన్నారు. యాప్స్ అయితే వినియోగదారులు, డీలర్లు ఇద్దరూ డౌన్లోడ్ చేసుకుంటేనే నగదు రహిత బదిలీకి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ ప్రతినిధులు యాప్‌ల డౌన్లోడ్, స్వైపింగ్లపై డీలర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్ఓ జి.ఉమామహేశ్వరరావు, డీఎం ఎ.కృష్ణారావు, నాబార్డ్ ఏజీఎం ప్రసాద్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు. -
సాక్షి మైత్రి మహిళ.