Guntur Crime News
-
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి.సుహొసినిగా గుర్తించారు. చదవండి:ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి -
ఉద్యోగం పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు.. 40 మందికి టోకరా
పెదకాకాని: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసగించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు మోసపోయారు. బాధితుల కథనం.. గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలోని కంతేరు అడ్డరోడ్డులో ఉన్న ఐజేఎం అపార్ట్‌మెంట్స్‌లో విజయవాడ ట్రెజరీ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దావులూరి మాల్యాద్రి నివాసం ఉంటున్నాడు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వికలాంగ పిల్లలకు విద్యాబోధన చేస్తున్న మాత జయప్రకాష్‌రెడ్డికి దావులూరి మాల్యాద్రి పరిచయం అయ్యాడు. డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు మధ్యవర్తిగా లాజర్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు.. జయప్రకాష్‌రెడ్డి కాకినాడ జిల్లా, కాజులూరు మండలం, దుగ్గుదూరు గ్రామం కావడంతో ఆయన పరిచయం ఉన్న మరో ఏడుగురితో కలసి మొత్తం ఎనిమిది మంది లాజర్‌ను కలిశారు. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల అవుతుందని ముందుగా అడ్వాన్స్ లక్ష చొప్పున చెల్లించాలని లాజర్ చెప్పడంతో 8 లక్షలు చెల్లించారు. ఎక్కువ మందిని చూసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని చెప్పడంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్న మరో 32 మందిని పరిచయం చేశారు. 40 మంది నుంచి ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించారు. వారి వద్ద నుంచి దావులూరి మాల్యాద్రి, లాజరు అతడి భార్య అరుణ వసూలు చేశారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం రాకపోగా అదిగో ఇదిగో వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. గట్టిగా నిలదీయడంతో అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకూ షూరిటీగా నోట్లు, 100 స్టాంప్ పేపరుపైనా దావులూరి మాల్యాద్రి సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అనంతరం కొంతకాలానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మీకు ఉద్యోగాలు ఇప్పించం, చేతనైంది చేసుకోండి అంటూ దుర్భాషలాడాడు. అలానే ఉద్యోగానికి నగదు చెల్లించిన వారిలో ఒకరైన ఎం.రాజేష్ బావ బి. వెంకటేశ్వరరావు(కానిస్టేబుల్) నిన్ను నమ్మి డబ్బులు చెల్లించాం, నీ చెక్ ఇవ్వాలని మాత జయప్రకాష్‌రెడ్డి ఇంటిపైకి వచ్చి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే ఆశపడి 40 మంది అభ్యర్థులు ఒక్కొక్కరూ రూ.3 లక్షల చొప్పున చెల్లించి మోసపోయామని, మాకు మా కుటుంబసభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని, మోసపోయిన నగదు ఇప్పించాలని బాధితులు పెదకాకాని పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
చెరసాలలోకి మృగాలు.. ఏపీ అధికారిణిపై హైకోర్టు ప్రశంసలు
ఇంకా పూర్తిగా ఊహ కూడా తెలియని వయస్సు.. సరదాగా తోటి స్నేహితులతో హాయిగా ఆడుకుంటూ కాలం గడపాల్సిన చిన్నారిని 12 ఏళ్ల ప్రాయంలోనే మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించారు ఆ కిరాతకులు.. అంగట్లో వస్తువులా ఒకరి తర్వాత ఒకరు ఆ బాలిక విక్రయానికి తెగబడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తిప్పుతూ వ్యభిచారం చేయించారు. ఈ వేధింపులు తాళలేక నరరూప రాక్షసుల నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. కేసును సీరియస్‌గా తీసుకున్న అప్పటి డీఎస్పీ, ప్రస్తుత అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.సుప్రజ ఈ చిన్నారికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో అపర కాళికలా మారారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేసులో ఎంత పెద్దవారు ఉన్నా పోలీసులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పది నెలల కాలంలో 79 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఒక్కొక్కరికి 90 రోజుల నుంచి 120 రోజులపాటు రిమాండ్ విధించేలా చర్యలు చేపట్టారు. దీనిపై సుమారు 500 పేజీల ఛార్జ్ షీట్‌ను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. నిందితులందరికీ శిక్ష పడటం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరును హైకోర్టు సైతం ప్రశంసించింది. ఆదిశక్తిలా ఉరికిన ఏఎస్పీ సుప్రజ వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుల నుంచి తప్పించుకున్న బాలిక మేడికొండూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారి తనను తీసుకువెళ్లిన ప్రాంతాలన్నీ చెప్పినా అప్పటి స్టేషన్ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ కేసును అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ, ప్రస్తుత గుంటూరు జిల్లా ఏఎస్పీ కె.సుప్రజకు ఉన్నతాధికారులు విచారణ బాధ్యతలు అప్పగించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె చిన్నారితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసు మూలాల్లోకి వెళ్లారు. ఆదిశక్తి అవతారంలా ముందుకురికారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి, బాలిక చెప్పిన ప్రాంతాలన్నింటిలోనూ నిఘా ఏర్పాటు చేసి వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజ చేతే విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశించటంతోపాటు, కేసు ఛేదనలో ప్రతిభ చాటిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఒక కేసు.. 80 మంది దోషులు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసుస్టేషన్ పరిధిలో గత ఏడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలిక తల్లికి కోవిడ్ వచ్చి ఆస్పత్రిలో ఉన్న తరుణంలో తండ్రితో స్వర్ణ అనే మహిళ పరిచయం చేసుకుని బాలికను తనతో పంపిస్తే ఆమె బాగోగులు చూసుకుంటానని మాయమాటలు చెప్పింది. ఆ తర్వాత ఆమె మరొకరికి బాలికను విక్రయించింది. ఇలా బాలికను ఒకరి తర్వాత మరొకరు విక్రయిస్తూ చేతులు మార్చారు. వ్యభిచార కూపంలోకి దింపారు. తెలంగాణ, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్, కాకినాడ, నెల్లూరు, తణుకు, రాజమండ్రి ప్రాంతాల్లో సుమారు 47 మంది వ్యభిచార గృహాల నిర్వాహకుల చేతుల్లో ఆ పసిమొగ్గ వాడిపోయింది. ఆఖరికి రాజస్థాన్–పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న ఒక వ్యక్తి వద్ద నుంచి తప్పించుకున్న పాప ఎలాగో మేడికొండూరు చేరి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో 80 మంది నిందితులుగా తేలారు. ఇప్పటికే 79 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు మాత్రం లండన్‌లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీస్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అతను ఎప్పుడు ఇండియాకి వచ్చినా అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. న్యాయంతో కొంత ఉపశమనం సమాజంలో కొందరు మానవమృగాల్లా వ్యవహరిస్తున్నారు. చిన్నారులపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఇది ఎంతో బాధాకరం. వికృత చేష్టలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. కిరాతకులకు శిక్షలు వేయించినప్పుడు బాధిత చిన్నారులకు కొంతైనా న్యాయం చేయగలిగామన్న సంతోషం కలుగుతుంది. మేడికొండూరు కేసులోనూ సుమారు 10 నెలలు కష్టపడి చార్జిïÙటు దాఖలు చేశాం. ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడేలా చూస్తాం. – కె.సుప్రజ అడిషనల్ ఎస్పీ, గుంటూరు జిల్లా పసిపాపలకు న్యాయం చేసి.. సుప్రజ ఈస్ట్ డీఎస్పీగా పనిచేసిన సమయంలో కొత్తపేటలో ఐదేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితులు నేపాల్‌లో ఉంటే వారిని రప్పించి అరెస్టు చేయడంతోపాటు ప్రధాన నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. లాలాపేటలో రెండేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వ్యక్తి లైంగికదాడికి పాల్పడినప్పుడు కూడా విచారణ చేపట్టి అతనికి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు. -
చిన్నారి ఉసురు తీసింది.. కుక్కలు, కోతులా? హత్యా?
సాక్షి, తాడేపల్లి (మంగళగిరి): తాడేపల్లి మండల పరిధిలోని మెల్లెంపూడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అదృశ్యమైన బాలుడు తమ ఇంటికి 200 మీటర్ల దూరంలో పంట పొలాల్లో ఉన్న కందకంలో మృతి చెందినట్లు స్థానికులు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు గుర్తించారు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం... మెల్లెంపూడి ఎస్టీ కాలనీలో నివాసం ఉండే కుర్ర భగవానియా నాయక్, అమల దంపతుల రెండో కుమారుడు భార్గవ తేజ (6). ఆదివారం సాయంత్రం నుంచి తమ కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండే నాగేశ్వరరావు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా కందకంలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కందకంలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. బహుశా కుక్కలు కానీ, కోతులు కానీ వెంటపడటంతో కందకంలో పడి ఉంటాడని, అక్కడ బాలుడిని అవి గాయపరిచి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అనుమానాలు ఈ ఘటనపై కుటుంబసభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే బాలుడిని దారుణంగా కొట్టి చంపి ఉంటారని పేర్కొంటున్నారు. ఇంటికి 200 మీటర్ల దూరంలో కుక్కలు గాని, కోతులు గాని దాడి చేస్తే తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అవే దాడిచేసి ఉంటే కుడి కాలు విరిగి, ఎముక బయటకు వచ్చేంత పరిస్థితి ఉంటుందా? చెయ్యి ఎందుకు విరుగుతుంది? కందకంలో పడినంత మాత్రాన అంత పెద్ద దెబ్బలు తగులుతాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నార్త్‌జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి రూరల్ సీఐ అంకమ్మరావు, ఎస్సై వినోద్‌కుమార్ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. గుంటూరు నుంచి డాగ్ స్క్వాడ్‌ను, వేలిముద్రల నిపుణులను పిలిపించి దర్యాప్తు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా? మండల పరిధిలోని వడ్డేశ్వరంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న అదృశ్యమైన బండి అఖిల్ (8), మెల్లెంపూడిలో మృతిచెందిన భార్గవతేజ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు కుటుంబాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. అందులో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. వడ్డేశ్వరం బాలుడి తల్లి, మెల్లెంపూడి బాలుడి తండ్రి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు యూనివర్సిటీలో కలిసి పనిచేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రెండు ఘటనలూ ఒకే విధంగా ఉండటంతో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు.. మనస్తాపంతో! పీహెచ్డీ చేసి.. కళ్లు కాంపౌండ్‌లో ‘మత్తు’ -
దారుణం: తల్లిని కడతేర్చిన కసాయి కూతురు
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): కన్నతల్లిని కుమార్తె హత్య చేసిన ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల కథనం మేరకు... ఏటీ అగ్రహారం జీరో లైనులో నివసించే పూతాబత్తిని భూలక్ష్మి (58)కి కుమారుడు నాగరాజు, కుమార్తె దాసరి అలియాస్ భవనం రమాదేవి ఉన్నారు. ఆరేళ్ల కుమారుడు రాహుల్‌రెడ్డితో కలిసి రమాదేవి తల్లి వద్దే ఉంటోంది. వ్యసనాలకు బానిసగా మారిన రమాదేవి కుమారుడిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో 25వ తేదీ రాత్రి రమాదేవి బయటకు వెళ్లడంతో కుమారుడు రాహుల్ ఆహారం తీసుకోకుండా ఏడుస్తుండటంతో తల్లి భూలక్ష్మి కుమార్తెకు ఫోన్ చేసి ఇంటి రావాలని చెప్పింది. ఇంటికి వచ్చిన తరువాత తల్లీకుమార్తెల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమాదేవి తల్లి భూలక్ష్మి గొంతు నులుముతుండగా నాగరాజు గమనించి, అడ్డుకుని, విడిపించాడు. అనంతరం తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ భూలక్ష్మి మృతిచెందింది. నాగరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తరగతి గదిలో టీచర్‌పై హత్యాయత్నం భార్య కాపురానికి రావడంలేదని.. అత్తను చంపేశాడు -
‘మమ్మల్ని క్షమించండి. విడిపోయి బతకలేం’
సాక్షి, సత్తెనపల్లి: ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి పట్టణంలోని స్వామి వివేకానంద నగర్లో సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బోండాట ప్రదీప్తి (17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన దేవళ్ల కిరణ్‌కుమార్ అలియాస్ సాయి కిరణ్‌కుమార్ (21) తాపీ పనులు చేస్తుంటాడు. గతంలో ఇద్దరి ఇళ్లూ దగ్గరగా ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఐదు నెలల క్రితం పెద్దలకు తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు మందలించారు. మూడు నెలల క్రితం పట్టణ పోలీసు స్టేషన్లో యువతి తల్లి అరుణ ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్‌ను రాజమండ్రికి పంపారు. ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ప్రదీప్తి ఇంటి నుంచి బయటకు రాగా, కిరణ్‌కుమార్ రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇదరూ కలిసి వివాహం చేసుకుని స్వామి వివేకానంద నగర్‌లోని చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘అమ్మ, నాన్న, అత్త, మామయ్య మమ్మల్ని క్షమించండి. మేము విడిపోయి బతకలేము.. అందుకే చచ్చి పోతున్నాం.. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు... అందుకే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా చచ్చిపోతున్నాం.. మమ్మల్ని క్షమించండి’... అంటూ డి.సాయికిరణ్కుమార్, డి.ప్రదీప్తి పేర్లతో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ నరసింహారావు, ముప్పాళ్ల ఎస్సై నజీర్ బేగ్‌లు సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: మహిళ మృతి
సాక్షి, కాకుమాను: వివాహతేర సంబంధం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎస్.సుందర్ రాజన్ తెలిపిన వివరాల మేరకు... జిల్లాలోని యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్ల సునీత (28) అనే మహిళకు కొంత కాలం క్రితం కానీషా అనే వ్యక్తితో వివాహమైంది. యడ్లపాడుకే చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తితో సునీతకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారి బంధం కొనసాగించేందుకు వీలు లేకపోవటంతో ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కాకుమాను శివారులోకి వెళ్లి ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని వేణుగోపాల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి సునీత మృతి చెందగా వేణుగోపాల్ అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. సునీతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు. వేణుగోపాల్‌ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చస్తున్నారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో మరదలిపై బావ దాడి చేయడంతో, మరదలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. జరిగిన ఈ ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిశేషు అనే వ్యక్తి పెన్షన్ డబ్బులు విషయంలో పెద్దకొడుకు శివశంకర్ తనకు కావాలని అడుగుతుండగా, తండ్రి మాత్రం చిన్న కొడుక్కు ఇస్తానని చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న శివశంకర్ ఇదంతా మరదలే చేస్తుందని భావించి జొన్నా గీతాసురేఖపై అసభ్యంగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన గీతా సురేఖ ఇంట్లో ఉన్న గ్లైసిల్ మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది గమనించిన మామ బాధితురాలిని ఆసుపత్రికి తరలించాడు. జరిగిన ఈ ఘటనపై గీతాసురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. -
దారుణం: ప్రియుడిని చంపి శవాన్ని ఇంట్లోనే..
సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడిని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఉదంతం చెరుకుపల్లిలో వెలుగు చూసింది. వివరాలు.. గుంటూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటూ శిరీష అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చి రూ. 15 లక్షలు భరణం ఇచ్చేందుకు చిరంజీవి తన మెడికల్ షాపును విక్రయించాడు. ఆ డబ్బు మీద ఆశతో శిరీష చిరంజీవిని చంపాలని నిర్ణయించుకుంది. అయితే శిరీషకు మరోకరితో కూడా వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతడితో కలిసి చిరంజీవిని చంపేందుకు శిరీష పథకం రచించింది. అనుకున్నట్టుగానే ప్రియుడితో కలిసి చిరంజీవిని హతమార్చి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. మృతుడు తండ్రి సుబ్బారావు ఫిర్యాదుతో విషయం వెలుగులో వచ్చింది. చిరంజీవి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీషతో పాటు ఆమె ప్రియుడు భానుప్రకాష్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భర్తను ఇంట్లో పూడ్చి.. ప్రియునితో సహజీవనం
చెరుకుపల్లి(రేపల్లె): మండల కేంద్రమైన చెరుకుపల్లిలో వ్యక్తి అదృశ్యమైన కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. మూడు నెలలుగా తన కుమారుడు బల్లేపల్లి చిరంజీవి కనిపించటం లేదని మండల కేంద్రమైన చెరుకుపల్లికి చెందిన బల్లేపల్లి సుబ్బారావు వారం రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణలో చిరంజీవి భార్య కొల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి అక్కడ సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు ఆమెను విచారించగా నిర్ఘాంత పోయే విషయాలు వెలుగుచూసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడు నెలల క్రితం ప్రియునితో కలిసి భర్తను హత్య చేసి చెరుకుపల్లిలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పూడ్చి వేశారని తెలుస్తోంది. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి కొల్లూరు గ్రామానికి వెళ్లి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. చిరంజీవిని హతమార్చటంలో సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిరంజీవికి రెండో భార్య చిరంజీవి మొదటి భార్యతో వివాదం రావటంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సమయంలోనే ఇంటూరుకు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. చిరంజీవికి కొల్లూరులో మెడికల్ షాపు ఉండేది. ఆ సమయంలో కొల్లూరుకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చిరంజీవికి స్నేహితుడిగా ఉన్న వ్యక్తితో అతని భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ఇటీవల స్థలం అమ్మగా రూ.20 లక్షలు వచ్చాయని, వాటిని ఇంట్లో భద్రపరచగా, అదే రోజు ప్రియునితో కలిసి చిరంజీవిని హత్య చేసి ఆ సొమ్ముతో కొల్లూరు వెళ్లిపోయి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసులో పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. భయాందోళన చెందుతున్న గ్రామస్తులు చిరంజీవిని పాతిపెట్టారని భావిస్తున్న ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తుండటంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవటంపై స్థానికులు కలవరపడుతున్నారు. త్వరలో వివరాలు వెల్లడిస్తాం దీనిపై రేపల్లె రూరల్ సీఐ బి. శ్రీనివాసరావును వివరణ కోరగా వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసును మరింత వేగవంతం చేసి దర్యాప్తు చేపడుతున్నామని, నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
లాడ్జి అండర్‌గ్రౌండ్‌లో పేకాట శిబిరంపై దాడి
గుంటూరు ఈస్ట్ : అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని అరండల్‌పేట పోలీసులు ఛేదించారు. అమరావతి మెయిన్‌రోడ్డులోని ఓ లాడ్జిలో రెండో అంతస్థులోని బాత్రూము పక్కన గోడకు రధ్రం పెట్టి సెల్లార్లోకి మెట్లు ఏర్పాటు చేసుకుని బయటి వ్యక్తులు ఎవరు లోపలికి వచ్చినా కనిపెట్టలేని విధంగా జూద గృహం నిర్వహిస్తుండడాన్ని పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..అమరావతి రోడ్డు మెయిన్‌రోడ్డులోని డీలక్స్ లాడ్జిలో అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కస్టమర్లు ఎవరూ లేకపోయినా పలువురు లాడ్జిలోకి వెళ్లి రావడం చుట్టుపక్కల వారికి అనుమానం కలిగించింది. స్థానికులు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సీరియస్‌గా తీసుకుని పలువురు సీఐలను బృందగా ఏర్పాటు చేసి బుధవారం దాడి చేయించారు. లోపలకు వెళ్లిన పోలీసులకు పేకాట ఎక్కడ ఆడుతుంది తెలియలేదు. ఉన్నతాధికారులకు పేకాట నిర్వహణ సమాచారం పక్కాగా ఉండడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు లాడ్జిలోని వ్యక్తులను తమదైన శైలిలో విచారించారు. దీంతో సిబ్బంది అండర్‌గ్రౌండ్‌కు ఏర్పాటు చేసిన రహస్య ద్వారం చూపించారు. రెండో ఫ్లోర్లో బాత్రూము పక్కన చిన్న సందు పెట్టి అండర్‌గ్రౌండ్‌లో కింద హాలు ఏర్పాటు చేశారు. అండర్‌గ్రౌండ్‌లో 16 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. కొందరు పారిపోయే ప్రయత్నం చేశారు. ముఖ్య నిర్వాహకుడు ముదనం పేరయ్య ముందుగానే పరారయ్యాడు. మిగిలిన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిలో లాడ్జి యజమాని ఉండటం గమనార్హం. వారి వద్ద నుంచి పోలీసులు రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
యువతిని వేధిస్తున్న అధ్యాపకుడి అరెస్టు
గుంటూరు ఈస్ట్: యువతిని వేధిస్తున్న ఘటనలో ఓ అధ్యాపకుడిని అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వివాహితుడైన ఆ అధ్యాపకుడు ప్రేమ పేరుతో గతంలో యువతిని మోసం చేసి, అరెస్టయ్యాడు. బెయిల్‌పై వచ్చి తిరిగి వేధిస్తుండడంతో పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. అరండల్‌పేట ఎస్ఐ ఎస్.రవీంద్ర కథనం మేరకు.. స్తంభాలగరువు ఎల్ఐసీ కాలనీ ఒకటో లైనుకు చెందిన చిలికా శ్రీనివాసరావు బ్రాడీపేటలో ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండేవాడు. అతడికి గతంలోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఓ బీఈడీ కళాశాలలో చదువుతున్న ఓ యువతి శ్రీనివాసరావు వద్ద ఇంగ్లిష్ కోచింగ్ తీసుకునేది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను శ్రీనివాసరావు ప్రేమపేరుతో నమ్మించి నిశ్చితార్థం చేసుకుని రూ.2 లక్షలు తీసుకున్నాడు. అనంతరం తాను వివాహితుడినని చెప్పి పెళ్లికి నిరాకరించాడు. యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు తిరిగి యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి పుట్టిన రోజునాడు కేకులు కోసి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం, పెళ్లి చేసుకోవాలని వత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె తల్లిని దుర్భాషలాడాడు. యువతికి వివాహం కాకుండా చేస్తానని బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో శ్రీనివాసరావును పోలీసులు సోమవారం మరోసారి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
‘ఐయామ్ 420’‘ప్రేమ’ వల వేసి..
గుంటూరు ఈస్ట్: ఇంజనీరింగ్ విద్యార్థిని నగ్న చిత్రాలను ‘ఐయామ్ 420’ పేరుతో ఇన్‌స్ట్ర్రాగామ్‌లో అప్లోడ్ చేసి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసిన ఘటనలో మరో ఏడుగురు నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులైన వరుణ్, కౌశిక్‌లను జూన్ 27వ తేదీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా ఆధారాలు సేకరించి మిగిలిన నిందితుల్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సోమవారం వెల్లడించారు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసు: ఏడుగురు అరెస్ట్) ‘ప్రేమ’ వల వేసి.. ♦ ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వరుణ్ అనే విద్యార్థి ప్రేమ పేరుతో వలవేసి తన సహ విద్యార్థినిని వంచించాడు. ఆమె నగ్న వీడియో చిత్రీకరించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతోపాటు తోటి విద్యార్థులకు ఫార్వార్డ్ చేశాడు. ♦ రెండో నిందితుడైన కౌశిక్ ద్వారా ఆ విద్యార్థిని నగ్న చిత్రాలు భాస్కర్, అతని ద్వారా ధనుంజయరెడ్డి, అతని నుంచి మణికంఠ, తులసీకృష్ణ, వారి నుంచి కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్ అనే విద్యార్థులకు చేరాయి. ♦ వీరిలో మణికంఠ, ధనుంజయరెడ్డి వాటిని ఆ యువతికి పంపి.. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. మిగిలిన ఐదుగురికి ఇదే విషయం చెప్పడంతో వాళ్లు కూడా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ♦ వారిలో మణికంఠ అనే విద్యార్థి‘ఐయామ్ 420’ అనే పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఆ యువతికి చెందిన నగ్న చిత్రాలను ఆమెకే పంపి చాటింగ్ చేశాడు. ♦ ఆమెను బ్లాక్మెయిల్ చేసి రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలు అతడి బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపాల్సిందిగా కోరగా.. నిందితులు దొరికిపోతామన్న భయంతో అకౌంట్ నంబర్ పంపకుండా మిన్నకుండిపోయారు. ♦ ఆ యువత ధైర్యం చేసి తనను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పక్కా సాంకేతిక ఆధారాలతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి ల్యాప్‌టాప్, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ♦ ఫేక్ అకౌంట్‌ను ఛేదించడం, సాంకేతిక ఆధారాలను సేకరించడంలో అర్బన్ టెక్నికల్ అనాలసిస్ టీమ్ ఇన్చార్జి విశ్వనాథరెడ్డి, సాంకేతిక సిబ్బంది విశేష కృషి చేశారని ఎస్పీ చెప్పారు. ♦ నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని ఎస్పీ తెలిపారు. ♦ దీనివల్ల వారిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించేందుకు కృషి చేసిన దిశ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ, ఎస్ఐలు కోటయ్య, బాజీ బాబులను ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. -
కస్టోడియనే సూత్రధారి
సాక్షి, గుంటూరు: ఈ నెల 9న గుంటూరు అమరావతి రోడ్డులోని నగరాలు సమీపంలో సెంట్రల్ బ్యాంకు ఏటీఎంలో నగదు నింపే వాహనంలో రూ.39 లక్షలు చోరీ కేసు మిస్టరీ వీడింది. ఏటీఎంలో నగదు నింపే కస్టోడియన్ నాగేంద్రబాబే చోరీకి ప్రధాన సూత్రధారిగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రెండు బైక్‌లు, నాలుగు సెల్ఫోన్లు, రూ.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అర్బన్ సమావేశ మందిరంలో ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రైటర్స్ సేఫ్ గార్డు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రవీణ్, సొల్లా వెంకట నాగేంద్రబాబు కస్టోడియన్లుగా, భోజారావు గన్‌మెన్‌గా, ఉల్లం తిరుపతిరావు ఏటీఎంకు డబ్బు నింపే వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తిరుపతిరావు తాను ప్రయాణించిన దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్టు ట్రావెలింగ్ అలవెన్స్ పొందుతూ ఉండేవాడు. ఈ ట్రావెలింగ్ అలవెన్స్ అనుమతికి కస్టోడియన్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. తప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్‌పై నాగేంద్రబాబు సంతకం పెట్టడాన్ని ప్రవీణ్ వ్యతిరేకించాడు. దీంతో నాగేంద్రబాబు, తిరుపతిరావు, భోజారావు ప్రవీణ్‌తో గొడవపడ్డారు. ప్రవీణ్‌ను ఇబ్బంది పెట్టాలని... భేదాభిప్రాయాల నేపథ్యంలో ప్రవీణ్‌ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అతను డ్యూటీలో ఉన్న సమయంలో వ్యాన్‌లో ఉన్న డబ్బు కాజేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా నాగేంద్ర తన స్వగ్రామమైన మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రాజబోయిన వెంకట నాగశివ, కంపసాటి గంగాధర్‌లను భోజారావు, తిరుపతిరావులకు పరిచయం చేశాడు. పథకం ప్రకారం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు నగదుతో ఉన్న వాహనం నగరాలులోని సెంట్రల్ బ్యాంకు వద్ద రోడ్డుపై నిలిపి డ్రైవర్ తిరుపతిరావు తనకు సొంత పని ఉందని ప్రవీణ్‌ను బ్యాంకులోకి తీసుకువెళ్లాడు. ఈ సమయంలో నాగ వెంకటసాయి, గంగాధర్ వ్యాన్‌లోని రూ.39 లక్షల నగదుతో ఉన్న బాక్స్‌ను చోరీ చేసి బైక్‌పై నవులూరుకు వెళ్లారు. 250 సీసీ కెమెరాలు పరిశీలించగా... చోరీ ఘటనపై రెండు ప్రత్యేక బృందాలను ఎస్పీ అప్పట్లో ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అర్బన్ జిల్లాలోని 250 సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రాథమికంగా నిందితులను గుర్తించిన అనంతరం, టెక్నికల్ ఆధారాలు సేకరించి నిర్ధారించారు. చోరీ జరిగిన అనంతరం నిందితులు వెళ్లిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా వారు వేసుకున్న దుస్తులు, వాడిన బైక్‌ను గుర్తించారు. ఈ ఆధారాల వల్ల నిందితులు ఎవరో గుర్తించడం కుదరకపోవడంతో, నిందితులు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై విచారణ సాగించారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు వెరిఫై చేయగా నవులూరు ప్రాంతంలో నిందితులు ప్రారంభమైనట్టు గుర్తించి, చోరీ అనంతరం కూడా వాళ్లు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో నిర్ధారణ అవడంతో ఆ కోణంలో కేసు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా గుర్తించిన నిందితుల కాల్‌డేటా పరిశీలించగా వీళ్లు తిరుపతిరావు స్నేహితులని గుర్తించిన పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించగా విషయాన్ని చోరీ వివరాలు వెల్లడించినట్టు సమాచారం. కేసును ఛేదించిన సిబ్బందికిఅభినందనలు కేసును త్వరగా ఛేదించి, 100 శాతం రికవరీ చేసిన నల్లపాడు పోలీసులను, సీసీఎస్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. సీఐ కె.వీరాస్వామి, ఎస్ఐలు విశ్వనాథ్, రవీంద్ర, అమరవర్థన్, ఇతర సిబ్బందికి క్యాష్ రివార్డు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ గంగాధరం, సీసీఎస్ ఏఎస్పీ మనోహర్, డీఎస్పీలు కమలాకర్, ప్రకాశ్, బాలసుందరరావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
వేల్పూరు(శావల్యాపురం): రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడెం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పారా నరేంద్ర(30) స్వగ్రామంలో ఉన్న తన కూతురు జన్మదిన వేడుకల నిమిత్తం హైదరాబాద్ నుంచి బైక్‌పై వచ్చాడు. ఈ క్రమంలో కూతురు మొదట సంవత్సరం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, తిరిగి మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. మార్గమధ్యంలో మిర్యాలగూడెం జాతీయరహదారిపై ప్రమాదశాత్తు బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే నరేంద్ర మృత్యువాత పడ్డాడు. మృతుడి తల్లిదండ్రులు,బంధువులు, గ్రామస్తులు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మిర్యాలగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అరగంటలో కిడ్నాప్ కేసు ఛేదన
తాడేపల్లిరూరల్(మంగళగిరి): యువకుడు కిడ్నాప్‌కు గురైన కేసును పోలీసులు అరగంటలో ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా నిడమానూరు గ్రామానికి చెందిన తడపతినేని శేఖర్ అనే యువకుడు తన లారీలో ఇసుక అక్రమంగా తోలుతూ పట్టుబడ్డాడు. అధికారులు లారీని సీజ్ చేసి అపరాధ రుసుం విధించారు. ఆ మొత్తం చెల్లించేందుకు శేఖర్ నిడమానూరు గ్రామంలో ఒక కారును రెండు నెలల క్రితం అద్దెకు తీసుకుని దాన్ని తాడేపల్లిలోని రౌడీషీటర్ తొత్తుక శివకుమార్‌కు తాకట్టు పెట్టి రూ.లక్ష తీసుకున్నాడు. కారు యజమాని పలుమార్లు శేఖర్‌ను ప్రశ్నించగా తాడేపల్లిలోని ప్రాతూరు కరకట్ట వెంట ఉందని చెప్పడంతో రెండో తాళం తీసుకొని కారును తీసుకువెళ్లాడు. విజయవాడలో బంధీ... దీంతో రౌడీషీటర్ శివకుమార్ శేఖర్‌కు ఫోన్ చేసి విజయవాడకు పిలిపించి బంధించాడు. శివకుమార్‌తో పాటు అతని సోదరులైన రౌడీషీటర్లు తొత్తుక రాంబాబు, తొత్తుక సాయి, మరో రౌడీషీటర్ సతీష్ శేఖర్‌ను చిత్రహింసలు పెట్టారు. ఆ కారులో తెలంగాణ నుంచి రూ.2.50 లక్షల విలువైన మద్యాన్ని తీసుకొచ్చామని, ఖర్చులతో కలిపి మొత్తం రూ.5 లక్షలు కట్టాలంటూ బలవంతంగా పత్రాలపై సంతకం చేయించారు. అనంతరం శేఖర్ తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి, నీ కొడుకు రూ.5 లక్షలు ఇవ్వాలి, తెచ్చి ఇవ్వకపోతే చంపేసి కృష్ణానదిలో పూడుస్తామంటూ బెదిరించారు. వెంకట్రావు డబ్బులు తీసుకుని తాడేపల్లి వచ్చి అనుమానంతో తాడేపల్లి సీఐ అంకమ్మరావును ఆశ్రయించాడు. సెల్ సిగ్నల్ ద్వారా సీఐ కిడ్నాపర్లు శేఖర్‌ను ఉంచిన స్థలాన్ని కనుగొని అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం తరలింపు వెలుగులోకి... రౌడీషీటర్ శివకుమార్ అతని అనుచరులు తాకట్టు పెట్టుకున్న కారులో తెలంగాణ నుంచి మద్యం తరలిస్తూ తమ జేబులు నింపుకొన్నారు. చివరకు కిడ్నాప్ డ్రామాతో వీరి అక్రమ మద్యం వ్యాపారం బయటపడింది. పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిప్పంటుకుని ఇద్దరు చిన్నారుల మృతి
బొల్లాపల్లి (వినుకొండ): ప్రమాదవశాత్తూ మంటలంటుకుని ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు మరణించిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం గ్రామానికి చెందిన మూఢావతు బాలునాయక్‌కు ఉదయ్‌కుమార్ నాయక్, సాంబశివరావు నాయక్, రామారావు నాయక్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు వివాహాలు చేసుకుని పక్కపక్క ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిందిలా.. ⇔ బుధవారం సాయంత్రం సాంబశివరావు నాయక్ 30 లీటర్ల పెట్రోలు క్యాను నుంచి ఐదు లీటర్లను మరో క్యానులోకి వంచుతుండగా సమీపంలో కట్టెల పొయ్యి నుంచి నిప్పులు రేగి పెట్రోలుకు అంటుకున్నాయి. ⇔ అక్కడే ఆడుకుంటున్న ఉదయ్‌కుమార్ కుమార్తె కృపాబాయి(3)కి మంటలు అంటుకునిఅక్కడికక్కడే మృతి చెందింది. ⇔ సాంబశివరావు నాయక్ కుమారుడు సియోన్ నాయక్ (ఏడాది)కు కూడా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ⇔ సియోన్ నాయక్‌ను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతిచెందాడు. గాయపడ్డ మరో ఇద్దరుప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఉన్న సాంబశివరావు నాయక్ భార్య లక్ష్మీబాయి, రామారావు నాయక్ భార్య మల్లేశ్వరి బాయి స్వల్పంగా గాయపడ్డారు. కళ్ల ముందే మంటలంటుకుని తమ బిడ్డలు కాలిపోతున్నా కాపాడుకోలేకపోయామని ఉదయ్ కుమార్, ఆయన భార్య ఇస్త్రీ బాయి బోరున విలపించారు. వినుకొండ రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు, బండ్లమోటు ఎస్ఐ జి.అనిల్‌కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదాలు
-
క్షణికావేశం.. విషాదంతం
రెంటచింతల(మాచర్ల): క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. మున్నంగి నర్సింహారెడ్డి, దుర్గాభవాని దంపతులు మండల కేంద్రమైన రెంటచింతల గంధంవారి బజారు సమీపంలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు వారిని రెంటచింతల ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. భార్య దుర్గాభవాని (38) చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త నర్సింహారెడ్డి పరిస్థితి విషమించడంతో వెంటనే నర్సరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నర్సింహా రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజలికి వివాహమైంది. చిన్న కుమార్తె స్రవంతి స్థానిక వైఆర్ఎస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మృతురాలు దుర్గాభవాని తల్లి బిక్కిరెడ్డి విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
వివాహ వేళ.. విషాద గీతిక
వివాహ మహోత్సవాన గుండెల్లో మూటకట్టుకుని వచ్చిన ఆనంద క్షణాలు రెప్పపాటులో ఆర్తనాదాలుగా మారాయి.. పెళ్లింట ఆకట్టుకున్న వివిధ వర్ణాల కట్టూబొట్టులు నెత్తుటి చెమ్మలో తడిచి ఎర్రటి రంగు పులుముకున్నాయి. బంధుమిత్రుల మధ్య సాగిన యోగక్షేమాల ముచ్చట్లు మూడు గంటలు కూడా గడవకముందే విషాదాంతమయ్యాయి. ట్రాక్టర్ వేగంతో పోటీ పడుతూ కలవరపెట్టిన కుదుపులు.. ఐదు కుటుంబాలను అంతులేని ఆవేదనతో కుదిపేశాయి. గురువారం చుండూరు మండలం చినపరిమి– కూచిపూడి మధ్య పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వీరిలో మేమూ వస్తామంటూ మారాం చేసి మరీ ట్రాక్టర్ ఎక్కిన ఇద్దరు చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా చితిపైకి చేరాయి. కళ్లెదుటే మాంసం ముద్దలుగా మారిన బిడ్డను చూసి.. తల్లిదండ్రుల కన్నపేగులు తీరని శోకంతో కమిలిపోయాయి. ఉదయాన్నే రయ్యిమంటూ సంబరంగా పొలిమేర గట్టు దాటిన పెళ్లి ట్రాక్టర్.. మధ్యాహ్నం వేళకు తన ముంగిటే చావు కేక పెట్టడంతో చినపరిమి గుండెలు వేదనతో ముక్కలయ్యాయి. తెనాలిరూరల్: వివాహ వేడుకకు వెళ్లిన వారి ఇంట విషాదం చోటుచేసుకుంది. చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్ నగర్‌కు చెందిన యువతికి తెనాలి పట్టణ చినరావూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. తెనాలిలో గురువారం వివాహం జరిగింది. వేడుకకు యువతి స్వగ్రామం నుంచి ట్రాక్టర్‌పై 50 మంది తెనాలి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని అదే ట్రాక్టరులో స్వగ్రామానికి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా.. చినపరిమి శివారులోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించే క్రమంలో ట్రాక్టరు ట్రక్కు రోడ్డు పక్కన కాల్వలోకి బోల్తా పడింది. దీంతో ఉన్నం పద్మ(35), గోరోజిన్నం అన్నమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గుత్తికొండ శ్యామ్ (13) మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో దగ్గుబాటి హర్షవర్దన్(9), కట్టుపల్లి నిఖిల్(7) వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గోళ్ల నాగరాజమ్మ (34) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. గాయపడిన గుత్తికొండ శ్యామ్, టీ రమాదేవి, సౌజన్య, నాగలక్ష్మి, డీ వెంకటేశ్వర్లు, సంకీర్తన, ప్రకాశరావు, అద్భుత్, ఎస్తేర్‌రాణి, సుబ్బారావులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో శ్యామ్‌ను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. మిన్నంటిన హాహాకారాలు.. ఘటనా స్థలం బాధితుల హాహాకారాలతో మిన్నంటింది. మృతి చెందిన పద్మ, అన్నమ్మ మృతదేహాలను తెనాలి వైద్యశాలకు తరలించారు. అడుతూ పాడుతూ ఉన్న తమ ముద్దుల చిన్నారులు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు వేదనకు అంతులేకుండా ఉంది. వైద్యశాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృత్యు కౌగిలిలో అమ్మమ్మ, మనవడు.. చినపరిమికి చెందిన అన్నమ్మ తన కుమార్తె ఏసుమరియమ్మను నగరం మండలం కల్లిపాలేనికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. వీరికి కుమార్తె, నిఖిల్ సంతానం. నాలుగు రోజుల క్రితం నిఖిల్ తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆమెతో కలసి వివాహానికి వెళ్లాడు. తోటి పిల్లలతో అక్కడ ఆడుకుంటూ సందడి చేశాడు. తిరుగు ప్రయాణంలో అమ్మమ్మ వెంటే ట్రాక్టరులో కూర్చున్నాడు. బిడ్డకు ఎండ తగలకుండా అన్నమ్మ చీర కొంగును కప్పి రక్షణ కల్పిస్తూ వచ్చింది. అంతలోనే ప్రమాదం జరగడంతో అన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన నిఖిల్ తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దగ్గుబాటి మురళి, నాగలక్ష్మిలకు ఇద్దరు మగ పిల్లలు. వ్యవసాయ కూలీలైన వీరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నవాడైన హర్షవర్దన్ నాలుగో తరగతి చదువుతున్నాడు. చలాకీగా ఉండే వాడు. ట్రాక్టరు ప్రమాదంలో చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల వేదన అంతులేకుండాపోయింది. ఎమ్మెల్యే మేరుగ పరామర్శ.. ప్రమాదం గురించి తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున తెనాలి వైద్యశాలకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వేగంగా మలుపు తిప్పడంతోనే ప్రమాదం: సౌజన్య, క్షతగాత్రురాలు గ్రామంలో బస్టాప్‌కు సమీపంలో మలుపు వద్ద వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగింది. ఎదురుగా మోటారుసైకిల్ వేగంగా వచ్చి ట్రాక్టర్‌కు తగిలింది. ఇంజిన్ మీద కూర్చున్న వారు దూకేశారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో అందులో ఉన్న మాకు గాయాలయ్యాయి. పరిమితికి మించిప్రయాణం ప్రమాద సమయంలో ట్రాక్టరు ట్రాలీలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో యజమాని ట్రాక్టర్ శ్రీనివాసరావు ట్రాక్టర్ నడుపుతున్నాడు. ట్రాక్టర్లో సుమారు 40 మంది ఉండటంతో మలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి బొల్తా కొట్టిందని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడికి తెనాలి డీఎస్పీ కే శ్రీలక్ష్మి సిబ్బందితో చేరుకున్నారు. చుండూరు సీఐ బీ నరసింహారావు, ఎస్ఐలు రాజేష్, జీ పాపారావు, ఇతర సిబ్బంది, స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. -
నాయనమ్మ హత్య
పట్నంబజారు(గుంటూరు): ఆస్తి కోసం నాయనమ్మను మనవడు హత్య చేసిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక శ్రీనివాసరావుపేటలో ఆకుల యలమంద, అతని భార్య పద్మావతి, తల్లి సామ్రాజ్యం, నానమ్మ సుశీల (70) నివసిస్తున్నారు. ఆస్తి తన పేరున రాయాలని సుశీలను యలమంద గొడవ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఆరో తేదీ రాత్రి 2.30 గంటల సమయంలో సుశీలను చీరతో ఉరి బిగిస్తుండగా ఆమె కేకలు వేసింది. ఇంటి పక్కన ఉండే నరసింహ కుటుంబ సభ్యులు వచ్చి చూడటంతో యలమంద పరారయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సుశీల మృతి చెందింది. ఆస్తి రాయలేదనే కోపంతో వృద్ధురాలిని మనవడే హత్య చేసినట్లు నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రాయల్ ఎన్ఫీల్డ్ రూ.75 వేలకే..
తాడేపల్లిరూరల్: పట్టణ పరిధిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్ఎక్స్ యాప్‌ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు... మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా తాను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని చెప్పాడు. ఇక్కడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయిందని, అందుకే రూ.2 లక్షల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని నమ్మబలికాడు. మొదట గూగుల్‌పే ద్వారా రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత ద్విచక్రవాహనం విలువ రూ.89 వేలు ఇస్తే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు సార్లు గూగుల్‌పేలో చెల్లించాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపిస్తానని చెప్పి వారం అవుతున్నా పంపించలేదని, ఆర్మీ అతను ఓఎల్ఎక్స్లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్‌క్రైమ్ విభాగానికి కేసు అప్పగించారు. -
కాటేసిన కాసుల వల
గుంటూరు:భర్తకు దూరమై ఒంటరిగా బతుకుతున్న ఆ మహిళ తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. కానీ ఆ తల్లి ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించవని నిర్ధారించుకుంది. అప్పుల బాధలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలి ఉచ్చులో పడింది. తాను పుండైనప్పటికీ కుమారుడికి పండంటి జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షించింది. కాసుల కోసం చీకటి గదిలో కన్నీటిని దిగమింగింది. కానీ ఆ చిల్లర డబ్బుల కోసం తానే చితిపైకి చేరుతుందని ఊహించలేకపోయింది. డబ్బులు అడిగిన నేరానికి నమ్మకంగా వ్యభిచారవృత్తిలోకి దించిన మహిళ, ఆమె భర్త, మరో వ్యక్తి కలిసి ఆమెను మట్టుబెట్టారు. కొడుకును ఉన్నతంగా చూసుకోకుండానే కాటికి పంపించారు. హతమార్చిందిలా ... విశ్వసనీయ సమాచారం ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన ఓ వివాహిత మూడేళ్ల క్రితం భర్తతో ఏర్పడిన వివాదాలతో ఎనిమిదేళ్ల కుమారుడితో కలసి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయినా కుమారుడ్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. ఏ పని చేసినా కుటుంబం గడవడానికే సరిపోవడం లేదు. ఈ క్రమంలో నరసరావుపేటలో వ్యభిచార గృహ ఓ నిర్వాహకురాలు పరిచయమైంది. ఆమె వద్దకు వెళ్లగా మూడు రోజులపాటు నరసరావుపేటలోనే ఉంచింది. ముందుగా ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని సదరు మహిళ కోరింది. వ్యభిచార నిర్వాహకురాలు చెప్పినంత డబ్బులు చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిర్వహకురాలి భర్త కూడా వివాహితను దుర్భాషలాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వివాహిత హెచ్చరించింది. పోలీసుల వద్దకు వెళితే సమస్య వస్తుందని నిర్వాహకురాలు భయపడింది. దీంతో ఆమెను మట్టుబెట్టాలని పథకం రచించారు. ఈ ఏడాది జనవరి రెండో వారంలో డబ్బు ఇస్తామని నమ్మించి వివాహితను నరసరావుపేట పిలిపించారు. పార్టీ చేసుకుందామని నమ్మించి వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త, ఓ విటుడు, వివాహితను గుత్తికొండ పరిసర ప్రాంతంలోని సాగర్ కాలువ వద్దకు తీసుకెళ్లారు. కాలువ గట్టున అందరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వివాహితను నిర్ధాక్షిణ్యంగా వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త కాలువలోకి నెట్టేశారు. వివాహిత మృతి చెంది నీటిలో కొట్టుకుపోయిందని నిర్ధారించుకున్న అనంతరం అక్కడ నుంచి వెళ్లారు. గతంలోను ఇదే తరహాలో.. సుమారు పదేళ్ల కిరతం చిలకలూరిపేటలో వ్యభిచార వృత్తి నిర్వహించడానికి వచ్చిన ఓ యువతిని సదరు నిర్వాహకురాలు హత్య చేసినట్టు గుర్తించారు. చిలకలూరిపేట రూరల్ స్టేషన్లో ఈమెపై హత్య కేసు నమోదైనట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. వెలుగు చూసిందిలా... తమ కుమార్తె నరసరావుపేటకు వచ్చి ఆచూకీ లేకుండా పోయిందని జనవరి 21న మృతురాలి తల్లి, బంధువులు నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే నకరికల్లు వద్ద గుంటూరు బ్రాంచ్ కెనాల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని అక్కడ పోలీసులు గుర్తించారు. దీంతో మిస్సింగ్ మిస్టరీ వీడింది. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు కూపీ లాగారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. వివాహితను తామే హతమార్చినట్లు వారు అంగీకరించారు. -
పండుగ రోజు విషాదం.. బావ, బావమరిది మృతి
పిడుగురాళ్ల రూరల్ (గురజాల): భోగి పండుగ రోజు సరదాగా ఈతకు వెళ్లిన బావ, బావ మరుదులు కాలువలో మునిగి మృతిచెందారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన వేణుగోపాల్ (22) చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. వేణుగోపాల్ మేనత్త కుమారుడు అనిల్ (18) పెదగార్లపాడులో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం భోగి పండుగ నాడు బావ, బావమరిది ఇద్దరూ కలసి తంగెడ మేజర్ కాలువలో ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ గల్లంతయ్యారు. వారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బంధువులు వచ్చి చూడగా బట్టలు, చెప్పులు కాలువ ఒడ్డున కనిపించాయి. దీంతో ప్రమాదం జరిగి ఉంటుందని ఆందోళనకు గురై.. గాలింపు చేపట్టగా, రెండు గంటల తర్వాత విగతజీవులుగా కనిపించారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్య
గుంటూరు ఈస్ట్: ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే యువతితో వివాహానికి సిద్ధమవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్హెచ్ఓ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువతి ఎంబీఏ పూర్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లా కె.సముద్రం మండలానికి చెందిన ఓ యువకుడు గుంటూరు నగరంలోని ఓ ఫార్మసీ కళాశాలలో నాలుగు సంవత్సరాల క్రితం బీఫార్మసీ చదువుతూ ప్రతి ఆదివారం యువతి ఇంటి సమీపంలోని చర్చికి వచ్చేవాడు. ఇద్దరి మధ్య నెలకొన్న స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తి అయిన తరువాత యువకుడు దుబాయ్‌లో ఉద్యోగంలో చేరాడు. ఇద్దరు ఫోన్లో తరచూ మాట్లాడుకుంటూ తమ ప్రేమను కొనసాగించారు. యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులను తీసుకుని డిసెంబరు 26వ తేదీ యువకుడి ఇంటికి వెళ్లింది. యువకుడి తల్లిదండ్రులతో వివాహ విషయం ప్రస్తావించారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువకుడి తల్లిదండ్రులు వివాహం విషయం కొంతకాలం తరువాత చర్చిద్దామని చెప్పి పంపించారు. యువకుడు తన సెల్లో ప్రియురాలి నంబరు బ్లాక్ చేశాడు. అయితే ఆ యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయమైందని సమాచారం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో యువతి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి సెల్ నంబరు ప్రియుడు బ్లాక్ చేయడంతో సూసైడ్ మెసేజ్ అతని ఫ్రెండ్ ఫోన్‌కు పంపింది. తన ప్రియుడు లేని జీవితాన్ని తాను ఊహించలేనని పేర్కొంది. మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనని, ఆ కారణంగా తల్లిదండ్రులకు తాను భారమవుతానని భావించానని రాసింది. వచ్చే జన్మలోనైనా నీవు నాకు దక్కుతావా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని చూడడానికి కూడా నువ్వు రావులే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది. పెళ్లి కానుకగా తాను కొన్న వాచీని స్వీకరించాలని అభ్యర్థిచింది. మెసేజ్ చేరిన కొంతసేపటికే తాను ప్రాణాలను విడుస్తున్నట్లు, తనను రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని తెలిపింది. -
కాల్‌మనీ కేసులో ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు
గుంటూరు ఈస్ట్: కాల్‌మనీ కేసులో గురుశిష్యులను అరెస్టు చేసిన పోలీసులు, ఇద్దరిపై రౌడీషీట్లు సైతం తెరిచారు. నిందితులపై గతంలో 9 కేసులు ఉన్నా టీడీపీ అండదండలతో రెచ్చిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదలకు సంబంధించి పాత నేరస్తుల చరిత్రను పరిగణనలోకి తీసుకున్న అర్బన్ ఎస్పీ పి.హెచ్డి.రామకృష్ణ వారి ఆగడాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాల్‌మనీ వ్యాపారులు ఇద్దరినీ లాలాపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లాలాపేట పోలీస్టేషన్లో ఈస్ట్ డీఎస్పీ కె.సుప్రజ, ఎస్హెచ్ఓలు ఫిరోజ్, రాజశేఖరరెడ్డి, సురేష్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు. వారి కథనం మేరకు.. గుంటూరు విద్యానగర్ ఒకటో లైను ఎక్స్టెన్షన్కు చెందిన ఇమడాబత్తిని కల్యాణచక్రవర్తి అలియాస్ పప్పుల నాని లాలాపేట పరిధిలోని హజార్ వారి వీధిలో తొలుత పప్పుల వ్యాపారం చేశాడు. అనంతరం 25 ఏళ్లుగా మీటర్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. నెహ్రూనగర్ 4వ లైనుకు చెందిన మాజేటి శేఖర్ తొలి నుంచి పప్పుల నానికి అనుచరుడిగా ఉంటు న్నాడు. పప్పుల నాని మీటర్ వడ్డీ, వంద రోజుల వడ్డీ, రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బాకీ చెల్లించని వారిని తన కార్యాలయానికి పిలిపించి బంధించి కొట్టి చెక్కులు, ప్రామిసరీ నోట్లపై అధిక మొత్తం రాయించి సంతకాలు చేయించుకుని పంపేవాడు. కొందరి వద్ద ఖాళీ నోట్లు, చెక్‌లపై సంతకాలు చేయించుకునేవాడు. కార్యాలయానికి రాని వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేసేవాడు. బాకీ వసూలు చేసే క్రమంలో వంటరిగా జీవించే మహిళలతో నాని, శేఖర్ అసభ్యంగా ప్రవర్తించారు. కొందరిని తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. ఓ మహిళపై లైంగికదాడికి యత్నించడంతో కొత్తపేట స్టేషన్లో శేఖర్‌పై ఇటీవల కేసు నమోదైంది. పప్పుల నానికి ఉన్న పలుకుబడి కారణంగా అతని బారినపడిన మహిళలు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. వడ్డీ కోసం గురుశిష్యులు పెట్టే వేధింపులను తట్టుకోలేక గతంలో కొంతమంది ధైర్యం చేసి ఆధారాలతో ఎస్పీలకు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో పలు పోలీస్స్టేషన్లలో పప్పుల నానిపై ఆరు, శేఖర్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. వీరు రిమాండ్‌కు వెళ్లినా వారి అనుచరులు యథావిధిగా కార్యకలాపాలను కొనసాగించేవారు. పప్పులనాని వద్ద గత మార్చి, ఏప్రిల్ నెలల్లో నెహ్రూనగర్ పదో లైనుకుచెందిన ఏలే దుర్గాప్రసాద్, అతని తండ్రి కొండయ్య మీటరు వడ్డీకి ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.2 లక్షలు తీసుకున్నారు. రోజుకు రూ.5 వేల చొప్పున 50 రోజులు చెల్లించిన అనంతరం, చెల్లింపులు నమోదు చేసిన పుస్తకాన్ని తండ్రీకొడుకుల నుంచి నాని, శేఖర్ లాక్కున్నారు. వడ్డీకి వడ్డీ వేసి ఎక్కువ మొత్తం డిమాండు చేశారు. మొదట ఇచ్చిన ప్రామిసరీ నోట్లు పోయాయంటూ, డిసెంబర్ 28వ తేదీ తండ్రీకొడుకులను నాని, శేఖర్ తమ కార్యాలయంలోబంధించి ఆరు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని వదిలిపెట్టారు. బాధితులు పోలీస్ స్పందన కార్యక్రమంలోలో ఫిర్యాదు చేయడంతో అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ స్పందించారు. నిందితుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టుచేసి రూ.30,32,900 నగదు, 9 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 10 ఖాళీ బ్యాంకు చెక్‌లు, రోజువారి, మీటర్ వడ్డీ లెక్కల పుస్తకాలు స్వాధీనం చేసుకునిరిమాండుకు తరలించారు. రౌడీ ఆగడాలకు అంతేలేదు పప్పుల నాని, శేఖర్ రాజకీయంగా, పోలీసుల వద్ద పలుకుబడి సంపాదించి హోల్‌సేల్ కిరాణా, ఇతర వ్యాపారులపై జులుం ప్రదర్శించే వారు. పప్పుల నాని తన దౌర్జన్య కార్యకాలాపాల కోసం వివిధ కాలనీలకు చెందిన వ్యక్తులు, యువకులను అనుచరులుగా పెట్టుకున్నాడు. ఆ అనుచరులు కిరాణా, ఫ్యాన్సీ, జ్యూస్ షాపులు, చికెన్ షాపులు, తోపుడు బండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండానే తమకు కావాల్సినవి తీసుకెళ్లేవారు. గురుశిష్యులు ఇద్దరు గతంలో ఫోర్జరీ దస్తావేజులు పుట్టించి మోసగించేవారు. నిందితుల రోజువారీ వసూళ్లు రూ.80 వేలు. పోలీసులు వారి కార్యాలయంపై దాడి చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదుకు సంబంధించి వడ్డీకి తీసుకున్న వారి పేరుతో చీటీలు రాసి రబ్బరు బ్యాండులు వేసిన కట్టలులభించడం గమనార్హం. -
ఏం పాపం చేశానని..
మాచవరం: ఆ కన్నతల్లికి ఏం కష్టం వచ్చిందో...ఒక్క రోజు పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లింది. భూమ్మీదకు వచ్చి 24 గంటలు కూడా గడవకుండానే ఓ ఆడ బిడ్డకు నూరేళ్లు నిండాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఒక రోజు పసికందును ఖాళీ స్థలంలో వదిలివెళ్లగా, ఆ పసికందు ఏడుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. వివరాలిలా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మాచవరం మండలంలోని చెన్నాయిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...చెన్నాయిపాలెంలో బాణావత్తు దత్తునాయక్ ఇంటికి వెనుక ఖాళీ స్థలంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కేవల ఒక్క రోజు వయస్సు ఉన్న ఆడ శిశువును వదిలేసి వెళ్లారు. ఆ పసికందు ఏడుపులు విని దారినపోయే వారు గుర్తించారు. ఆ పసికందు ఎక్కడి నుంచి వచ్చింది. గ్రామంలో ఒక రోజు క్రితం ఎవరు ప్రసవించారు ఆని ఆరా తీయగా సమాచారం లభించలేదు. దీంతో ఎక్కడ నుంచో తీసుకుని వచ్చి ఈ ప్రదేశంలో వదిలేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్తులు మాచవరం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా, పసికందుకు వైద్యం అందించేందుకు మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆ ఆడపిల్ల గురువారం కన్నుమూసింది. పసికందు దొరికిన సంఘటనా స్థలాన్ని ఎస్ఐ లక్ష్మీనారాయణరెడ్డి పరిశీలించారు. సీడీపీవో శ్రీవల్లి, సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి శిశుమరణాలు తమ పరిధిలోకి వస్తాయని, మృతి చెందిన పాపను తమకు అప్పగించాలని వారు కోరారు. మాచవరం ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే విడదల రజని
యడ్లపాడు: నిలిపి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు గాయపడిన సంఘటన యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని చిన కోండ్రుపాడు గ్రామానికి చెందిన తమ్మలూరి నాగరాజు నాదెండ్ల మండలం గణపవరంలోని పశువుల ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి యడ్లపాడులో చర్చికి వెళ్లాడు. అనంతరం భార్య యశోద, కుమారుడు రాణా, కుమార్తె దివ్యలను గణపవరంలోని అత్తగారింటి వద్ద దింపేందుకు బైక్‌పై బయలుదేరాడు. తిమ్మాపురం చేపలచెరువు సమీపంలో పంక్చర్ కావడంతో తమిళనాడుకు చెందిన లాంగ్‌ట్రాలీ లారీ హైవేపై నిలిపి ఉంది. బైక్‌పై వస్తున్న నాగరాజుకు వెనుక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగాడు. అంతలో బైక్ ట్రాలీలారీని ఢీకొట్టింది. దీంతో బైక్ ట్రాలీ కిందకు దూరి ఇరుక్కుపోయింది. బైక్ ముందు ఆయిల్ ట్యాంక్‌పై కూర్చున్న నాగరాజు కుమారుడి ఎడమకన్నుకు తీవ్ర గాయమైంది. బైక్‌పై ఉన్న నలుగురు హైవేపై చెల్లాచెదురుగా పడిపోయారు. నాగరాజు తలకు, భార్య కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి బాలిక కన్నీరుమున్నీరుగా విలపించసాగింది. స్థానికులు పరుగున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూశారేఉ. ఎస్ఐ నాగేశ్వరరావు ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే విడదల రజని ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు గుంటూరు నుంచి వస్తున్న ఎమ్మెల్యే విడదల రజని హైవేపై జనాన్ని చూసి ప్రమాదం జరిగిందని గ్రహించి కారు దిగారు. బాధితులను పరామర్శించి అంబులెన్స్‌లో గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. అక్కడ నుంచే జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి సత్వర వైద్యం అందించాలని సూచించారు. కొద్దిసేపటి తర్వాత నాగరాజు మెడకు సర్జరీ చేస్తున్నామని, అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయని, బాబు కన్ను పరిస్థితి మాత్రం చెప్పలేమని వైద్యులు ఎమ్మెల్యేకు వివరించారు. -
అంతులేని విషాదం
గుంటూరు, తాడికొండ: రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి. నాలుగు మెతుకులు సంపాదించడానికి పిల్లలను కూడా వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే సారి ముగ్గుర్ని బలిగొని ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన తాడికొండ మండలం లాం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ సెల్‌ఫోన్ వెనక్కి ఇద్దామనుకొనే ప్రయత్నంలో ఒంటి చేతితో వాహనం నడపడం, అతివేగంతో వెళ్లడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు మృతితోపాటు మరో ఐదురుగు గాయాలపాలయ్యారు. వ్యవసాయ కూలీలుగా పనిచేసే వీరందరిదీ ఒక్కో గాథ. పాఠశాలకు సెలవు కావడంతో కుమారుడిని వెంట బెట్టుకొని పనికి వెళదామని ఆటోలో మోతడక నర్సరీలలో పని చేసేందుకు బయలుదేరిన షేక్ దరియాబీ కుమారుడు దరియావలి (12) ప్రమాదంలో ఛాతి, పొట్టలో బలమైన గాయం కావడంతో అసుపత్రికి చేరుకొనేలోపుగా మరణించాడు. మరో కుటుంబానికి చెందిన మృతురాలు రాయపూడి భారతి(28) 2వ తరగతి చదువుతున్న ఏడు సంవత్సరాల కుమారుడు సంతోష్‌ను వెంటబెట్టుకొని వెళుతుండగా తలకు బలమైన గాయం కావడంతో అమె ఆసుపత్రికి చేరుకొనేలోగా ప్రాణాలొదిలింది. కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరో మృతురాలు మాతంగి నాగేంద్రమ్మ (52) అనే మహిళ తీవ్ర గాయాలతో జీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. ఈమె కోడలు ఎస్తేరు రాణికీ తీవ్రంగా గాయాలు కావడంతో ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో చికిత్స పొందుతుండగా ఇంటివద్ద ఎత్తుకొనేందుకు ఎవరూ లేరని వెంట తీసుకెళ్లిన 2 సంవత్సరాల కుమారుడు చిన్నారి అరుణ్ తేజ్ కూడా ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్తేరు రాణి చెల్లలు కూడా ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. మృతురాలు నాగేంద్రమ్మకి నలుగురు కుమారులు. సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన ఈమె వ్యవసాయ పనుల నిమిత్తం 7 సంవత్సరాల నుంచి చిన్న కుమారుడు వద్దే ఉండి కూలి పనులకు వెళుతోంది. ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో నిర్జీవంగా పడి ఉన్న తీరు అందరినీ కలచివేసింది. ఘటనకు కారణమైన ఆటో డ్రైవర్‌ది నిడుముక్కల గ్రామం కాగా ప్రమాదం జరిగిన వెంటనే ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. కలెక్టర్ పరామర్శ గుంటూరు ఈస్ట్: లాం సంమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల బంధువులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మంగళవారం పరామర్శించారు. -
బ్యాట్‌తో కొట్టి తలకు ప్లాస్టిక్ కవరు చుట్టి హత్య
నరసరావుపేటరూరల్: భార్యభర్తల మధ్య చోటు చేసుకున్న స్వల్పవివాదం భార్య హత్యకు దారితీసింది. పురపాలక సంఘం పరిధిలోని బరంపేట కాసు బ్రహ్మనంద ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షేక్ హయతున్నీసా(35) తన భర్త ముస్తఫా చేతిలో దారుణ హత్యకు గురైంది. క్రికెట్ బ్యాట్‌తో తలపై దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... నగరం మండలం చినమట్లపూడి గ్రామానికి చెందిన షేక్ హయతున్నీసాకు తన సమీప బంధువైన నిజాంపట్నానికి చెందిన ముస్తఫాతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమా రుడు ఉన్నాడు. ఆరు నెలల కిందట ఉద్యోగ బదిలీలలో భాగంగా హయతున్నీసా నరసరావుపేటకు వచ్చి సత్తెనపల్లి రోడ్డులోని సాయినగర్ 4వ లైన్‌లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. భర్త ముస్తఫాకు ఉద్యోగం లేకపోవడంతో గతంలో ఇన్నోవా వాహనాన్ని బాడుగులకు నడిపే నిమిత్తం కొనుగోలు చేసింది. అయితే ఇందులో ముస్తఫాకు నష్టాలు వచ్చా యి. తర్వాత రూ.2లక్షల పెట్టుబడితో వస్త్ర వ్యాపారం మొదలుపెట్టించింది. ఈ వ్యాపారంలోను నష్టాలు రావడంతో భార్యభర్తల మధ్య వివాదం మొదలైంది. తనకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే హయతున్నీసా కుటుంబానికి దూరంగా బదిలీ చేయించుకుందని ముస్తఫా భావించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కిందట నుంచి హయతున్నీసా నరసరావుపేటలో నివాసం ఉంటున్నప్పటికీ ముస్తఫా మాత్రం ఇక్కడకు రాలేదు. నెల రోజుల కిందట పెద్దమనుషులు ఇరువురి మధ్య రాజీ చేశారు. అప్పటి నుంచి ఇరువురు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దంపతులు ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ముస్తఫా ఆవేశంతో అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో భార్య హయతున్నీసా తలపై దాడి చేశాడు. తలకు తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం ఆమె తలకు ప్లాస్టిక్ కవరు చుట్టి హత్యకు పాల్పడ్డాడు. ముస్తఫా తన కుమారుడు రజాను తీసు కుని పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. క్లూస్ టీమ్ రప్పించి ఆధారా లు సేకరించారు. డీఎస్పీ వీరారెడ్డి, సీఐలు బిలాలుద్దిన్, కృష్ణయ్య, అచ్చయ్య, ఎస్ఐలు బ్రహ్మం, నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
హత్యలు.. భూదందాలు.. సెటిల్మెంట్లు !
గుంటూరు, మంగళగిరి: టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన హత్యలు, భూ దందాలు, సెటిల్మెంట్ల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేసిన దురాగతాలు అన్నీఇన్నీ కావు. రోజుకొక ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా జంట హత్యల కేసులో నిందితుడిగా టీడీపీ మండల అధ్యక్షుడు చావలి ఉల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2017 లో ఒక మహిళను హత్య చేసిన ఘటనతో పాటు ఆ హత్యకు సహకరించిన మరొకరిని హత్య చేయించిన వ్యవహారంలో నిందితులకు తోడ్పాటునందించారు. ఈ కేసులో ఉల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు హత్యలు వెలుగులోకి రాకుండా చూసేందుకు అçప్పుడు డీఎస్పీగా పనిచేసిన అధికారికి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ ఐదు సంవత్సరాల కాలంలో అధిక కాలం నార్త్‌జోన్ డీఎస్పీగా పనిచేసిన అధికారి టీడీపీ నాయకులు చేసిన హత్యలతో పాటు భూదందాలకు సహకరించి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించారని టీడీపీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీ నేతల దుర్మార్గ చర్యలకు నియోజకవర్గంలో అనేక మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. టీడీపీ నాయకుల అరాచకాలకు అప్పడు పనిచేసిన నార్త్ సబ్ డివిజన్ పోలీసు అధికారితో పాటు ఇతర పోలీసులు పూర్తిగా సహకరించి తమ స్వామి భక్తిని చాటుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. వరుసగా టీడీపీ నేతల అరెస్టులు... భూ దందాలలో తమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఆ పార్టీకి చెందిన నాయకుడు తాడిబోయిన ఉమాయాదవ్‌ను హత్య చేయించిన కేసులో టీడీపీ నాయకుడు ఏనుగ కిషోర్‌తో పాటు మండల అధ్యక్షుడు కుమారుడు, మండల టీడీపీ యూత్ నాయకుడు చావలి మురళితో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు హత్య కేసులో ఉండడం సంచలనం కలిగించింది. అది మరువక ముందే టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి భూదందా కేసులో ఇరుక్కుని కోర్టు మెట్లెక్కి బెయిల్‌పై బయటకు రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పలు భూవివాదాల కేసులలో టీడీపీ నాయకుల పేర్లు బయటకు వస్తుండగా రాజీమార్గం పట్టి కేసుల వరకు రాకుండా చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. తాజాగా జంట హత్యల కేసులో ఉల్లయ్యను అరెస్టు చేయడం కలకలం రేపింది. మరింత మంది టీడీపీ నేతల అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎంతో మంది బాధితులు ధైర్యం చేసి బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను వివరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
కొడుకును కిడ్నాప్ చేసి.. ఆపై భార్యకు ఫోన్ చేసి
సాక్షి, గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. డబ్బుల కోసం కన్న తండ్రే తన ఆరేళ్ల కొడుకును కిడ్నాప్ చేసిన ఘటన అమరారెడ్డి నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. తాడేపల్లి అమరారెడ్డి నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రావు డబ్బుల కోసం తన స్నేహితులు శామ్యూల్, అబ్రహంతో కలిసి కొడుకు పార్థసారధి కిడ్నాప్‌కు పథకం రచించాడు. అనుకున్నట్లుగానే బుధవారం మాధ్యాహ్నం 2. 30 గంటలకు బాలుడిని స్కూల్ నుంచి కిడ్నాప్ చేశాడు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భార్యకు ఫోన్ చేసి రూ. 5 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద గుంటూరు కాలువలో ఇంటర్మీడియట్ విద్యార్థి బి. విద్యాసాగర్(17) గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివీ.. తాడేపల్లి డొల్లాస్ నగర్‌కు చెందిన విద్యాసాగర్ ఆదివారం స్నేహితుతడు జగదీష్ పుట్టిన రోజు కావడంతో మరో ఏడుగురు స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ చినకాకానిలోని గుంటూరు కాలువ వద్దకు సరదాగా వెళ్లాడు. అక్కడ విద్యాసాగర్ ఫోటోలు కోసం కాలువలోకి దిగగా లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుడు అరుణ్ ప్రమాదంలో చిక్కుకోగా.. అక్కడే ఉన్న అయ్యప్ప మూలధారుల్లో ఒకరు వెంటనే కాలువలోకి దూకి అతడిని కాపాడారు. విద్యాసాగర్ గల్లంతు కావడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రివేళ విద్యార్థి కోసం గాలిస్తున్నారు. -
హోంగార్డు కొట్టాడని.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు : నలుగురు చూస్తుండగా కొడుతూ, పోలీస్ స్టేషన్‌కి ఈడ్చుకెళ్లారనే బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మాచర్ల మండలం రాయవరంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మాచర్ల పీఎస్‌లో పనిచేసే హోంగార్డు రాజేశ్, ఆటో డ్రైవర్ శ్రీనుతో ఉన్న వ్యక్తిగత గొడవలతో అతిగా ప్రవర్తిస్తూ, అతనిపై చెప్పులతో దాడి చేశాడు. అలాగే బజారులో కొట్టుకుంటూ స్టేషన్‌కి తీసుకెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. -
దీప్తి.. కార్పొరేషన్‌నూ వదల్లేదు
సాక్షి, గుంటూరు : నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని ఘరానా మోసాలకు పాల్పడిన మామిళ్ళపల్లి దీప్తి చేతివాటం ప్రదర్శించడంలో తనదైన ముద్ర వేసుకుంది. సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని, సివిల్ వివాదాలు పరిష్కరిస్తానని చెప్పి అమాయకుల నుంచి రూ.70 లక్షలకు పైగా దోచుకొని బాధితుల ఫిర్యాదుతో పరారైన విషయం తెలిసిందే. ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గుంటూరు కార్పొరేషన్లో ఆనందలహరి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ హయాంలో మంత్రి సాయంతో కాంట్రాక్ట్‌ను కొట్టేసింది. ఆనందలహరి నిర్వహణ కోసం.. 2017లో అప్పటికే దీప్తికి మాజీ మంత్రితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దానిని అడ్డుగా పెట్టుకొని గుంటూరు కార్పొరేషన్ అధికారులకు తరచూ ఫోన్ చేయించి వారిని దారికి తెచ్చుకుంది. ఈ క్రమంలో గుంటూరులో ప్రతి ఆదివారం ఆనందలహరి పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో దీప్తి తన స్వచ్ఛంద సంస్థకు అర్హత లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకుంది. అదే సమయంలో మరో సంస్థ నిర్వాహకులు కూడా దరఖాస్తు చేశారు. వెంటనే కాంట్రాక్ట్ తనకే ఇవ్వాలంటూ దరఖాస్తు మంజూరు చేసే అధికారిని సైతం మభ్యపెట్టి సదరు మాజీ మంత్రితో కార్పొరేషన్ రికమండ్ చేయించి కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రతి వారం కార్యక్రమం నిర్వహణకు కార్పొరేషన్ రూ.60 వేల చొప్పున చెల్లుస్తుంది. నిబంధనల ప్రకారం కార్యక్రమం కొనసాగించకుండా రూ.20 వేలలోపు ఖర్చుతో మమ అనిపించింది. దీంతో నగరంలో కార్యక్రమం నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికే ఏడాదిపాటు కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీకేష్ లఠ్కర్ ఇదంతా దోపిడీ అని తేల్చి బిల్లులు నిలుపుదల చేశారు. మళ్లీ బిల్లుల చెల్లింపుల కోసం... అప్పట్లో పర్యవేక్షణాధికారిగా పని చేసి అనంతరం బదిలీపై వెళ్లిన అధికారి మళ్లీ బదిలీపై ఇక్కడకే వచ్చారు. దీంతో దీప్తి, ఆమె స్నేహితులు సదరు అధికారి వద్దకు వెళ్లి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అందుకు కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బిల్లు పెండింగ్‌లో ఉంది. మంగళగిరి మాయ‘లేడీ’ ఉలికిపాటు మంగళగిరిలో మరో కలాడీ లేడీ బాగోతం అంటూ సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనం టీడీపీ నాయకులను ఉలిక్కిపాటుకు గురి చేసింది. విజలెన్స్ అధికారులు సైతం బాధితుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. తెనాలిలోని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పని చేసిన కిలాడీ లేడీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. మాజీ హోంమంత్రి చినరాజప్పతో తనకు పరిచయాలు ఉన్నాయని పలువురిని నమ్మించింది. సేల్స్ మేనేజర్‌గా పని చేసిన సమయంలో తనతో పని చేసిన సహ ఉద్వోగులకు ఔట్ సోర్సింగ్ ఉద్వోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసింది. తాజాగా సాక్షి దినపత్రికలో కథనం రావడంతో కిలాడీ లేడీ ఉదయం నుంచి బాధితులకు ఫోన్ చేసి తాను విదేశాలలో ఉన్నానని, వారంలో వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలుకుతోంది. దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయవద్దంటూ బతిమాలుతున్నట్లు సమాచారం. కొందరు బాధితులు వెంటనే తాము ఇచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని, లేదంటే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. చదవండి: నకిలీ ఐడీ కార్డుతో దీప్తీ బురిడీ.. -
నకిలీ ఐడీ కార్డుతో దీప్తీ బురిడీ..
సాక్షి, గుంటూరు : విలాసవంతమైన జీవితం గడిపేందుకు రకరకాల మోసాలకు పాల్పడిన మామిళ్లపల్లి దీప్తి ఉదంతాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నానంటూ నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తానని, స్థలాలు, పొలాల సమస్యలు పరిష్కరిస్తానంటూ మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కిలాడీ లేడీగా మారి మాయమాటలు చెప్పడం, అందుకు అవసరమైన నకిలీలను సృష్టించుకొని ఘరానా మోసాలకు పాల్పడింది. ఆమె చేసిన మోసాల్లో మరొకటి బయటపడింది. ఏకంగా ప్రభుత్వ చిహ్నంతో నకిలీ ఐడీ కార్డును తయారు చేసుకుందంటే ఆమె నేర స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. సీసీఎల్ఏ పీఏ పేరులో నకిలీ కార్డు మొదట్లో ఆమె కారును సచివాలయంలోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించక పోవడంతో అందుకోసం ముందుగా మాజీ మంత్రులతో కలసి వెళుతూ పరిచయాలు పెంచుకుంది. అక్కడ ఏఏ విభాగాల్లో ఎవరు ఉంటారో తెలుసుకొని రాకపోకలు కొనసాగించడం ప్రారంభించింది. అనతి కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే స్థాయికి చేరింది. అప్పటి నుంచి తనకు తాను గుర్తింపు తెచ్చుకునేందుకు సీఎంవోలో పీఏ నంటూ పరిచయాలు చేసుకోవడం ప్రారంభించింది. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది ఐడీ కార్డు చూపాలని కోరితే ఇంటి వద్ద మరచిపోయానని చెప్పి కాలం గడిపింది. ఇక ఇలాగైతే కష్టమని భావించి రెవెన్యూ శాఖ పరిధిలోని ‘ఛీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్’ (సీసీఎల్ఏ)లో పీఏగా పనిచేస్తున్నట్లు ఏకంగా ఐడీ కార్డు సృష్టించుకుంది. కార్డును చూపుతూ మోసాలకు పాల్పడింది. సెటిల్మెంట్లకు తెరతీసి.. ఖరీదైన కారులో తిరుగుతూ కారుపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్ వేసుకొని సెటిల్మెంట్లకు తెరతీసింది. అప్పట్లో పోలీస్ అధికారులతో పరిచయాలను అడ్డుపెట్టుకోవడంతో పాటు ఆమె సామాజిక వర్గానికి చెందిన అధికారులు కూడా ఉండటం కలసి వచ్చిన అంశంగా మారింది. స్థల, పొలాల వివాదాలను పరిష్కరించాలంటూ పోలీసుల వద్దకు వెళ్లడం.. అవసరమైతే మాజీ మంత్రితో ఫోన్ చేసి ఏకపక్షంగా కూడా సెటిల్మెంట్లు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే గుంటూరు అర్బన్‌లో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరి నుంచి రూ. 9 లక్షలు తీసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, బాధితులు మాత్రం వివరాలను తెలియచేసేందుకు సాహసించడం లేదంటే వారిని ఎంతగా భయపెట్టి ఉంటారో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చదవండి : (మోసాల్లో దిట్ట దీప్తి) ఫోన్ స్విచ్చాఫ్ దీప్తి హైదరాబాద్‌కు మకాం మార్చడంతో స్నేహితుల ద్వారా కేసు నమోదు విషయం తెలుసుకోవడంతో ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అవసరమైన సందర్బాలలో ఆన్‌చేస్తూ మాట్లాడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాధితులు కూడా పలుమార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని సమాచారం. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే.. ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీస్ బాస్ స్పందించి కిలాడీ లేడీ ఆట కట్టించేందుకు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వెలుగులోకి మరో కిలాడీ లేడీ బాగోతం! మంగళగిరి: టీడీపీ మహిళా నాయకురాలు మామిళ్లపల్లి దీప్తిపై కథనాలు ఓ పక్క ఆ పార్టీ నాయకుల్లో గుబులు పుట్టిస్తుండగా, మరో పక్క అంతకు మించిన మరో కిలాడీ లేడీ ఉదంతం మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. గత రెండు రోజులుగా పట్టణంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పట్టణానికి చెందిన టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శిగా పని చేస్తున్న ఓ మహిళ నేరుగా అప్పటి హోంమంత్రి చినరాజప్పతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లతో పాటు డీజీపీని సైతం నేరుగా కలిసేది. నాయకులు, ఉన్నతాధికారుల పరిచయాలనే పెట్టుబడిగా పెట్టి సామాన్యులతో పాటు పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ సుమారు రూ.5కోట్లు వసూలు చేసినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పట్టణంలో నివసిస్తున్న ఆమె గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. దీంతో బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మాజీ హోంమంత్రి చినరాజప్ప, చినబాబు లోకేష్, డీజీపీల పేర్లు చెప్పి వసూలు చేసినట్లు పార్టీ నాయకులు చెబుతుండడం గమనార్హం. బాధితులు ఒక్కొక్కరు ఇళ్లకు వస్తుండటంతో గుట్టు బయటకు రాకుండా కొందరు నేతలు ఆమె విదేశాలలో ఉందని, రెండు మూడు రోజుల్లో వస్తుందని వచ్చిన వెంటనే తామే ఇప్పిస్తామని, కేసులు పెడితే ఏమీ చేయలేరంటూ బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అనుచరుడు ఆమెకు అండగా నిలుస్తూ బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. బాధితుల్లో కొందరి వివరాలు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన యువ నేత ఉద్యోగాల కోసం రూ. 14లక్షలు, తెనాలికి చెందిన యువకుడు రూ.6 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యాపారి ఇసుక కాంట్రాక్టు కోసం రూ.60 లక్షలు, నారాయణ కళాశాలలో క్యాంటీన్ కోసం మరో యువకుడు రూ.6లక్షలు, మరో ఇద్దరు యువకులు ఉద్యోగాల కోసం రూ.10లక్షలు చెల్లించినట్లు ఇప్పటికే బయటపడ్డారు. దీనికితోడు గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉద్యోగాలు, కాంట్రాక్టుల పేరుతో రూ. 5కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసిందని టీడీపీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో విదేశాల నుంచి వస్తుందని ఇంట్లోని వారు చెబుతుండడంతో బాధితులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. చదవండి : (కి'లేడీ' కోసం గాలింపు !) -
ఖాళీ చెక్కు ఇచ్చి బురిడీ!
సాక్షి, గుంటూరు: ఖరీదైన కారులో విలాసవంతంగా తిరుగుతూ నిరుద్యోగులు, అమాయకులను నమ్మించి ఘరానా మోసాలకు పాల్పడిన మామిళ్లపల్లి దీప్తి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాను సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నానంటూ ఇప్పటికే రూ.70 లక్షలను వివిధ రకాల ఉద్యోగాలు, సమస్యలు పరిష్కరిస్తానంటూ కాజేసిన విషయం తెలి సిందే. ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలతో బాధితులు బయటకు వస్తున్నారు. వారిని నమ్మించి మోసం చేసిన విషయాలను ఏకరువు పెడుతున్నారు. నిందితురాలిని పోలీసులు వీలైనంత త్వరగా అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బాబాయి పేరుతో కారు... ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయి హైదరాబాదులో ఉంటున్న దీప్తి బాబాయి మామిళ్లపల్లి కృష్ణ ప్రసాద్ పేరుతో ఉన్న మారుతీ డిజైర్ కారును ఉపయోగిస్తుంది. కారుపై రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అని రాసుకొని దర్జాగా తిరిగింది. టీడీపీ హయాంలో ఎవరూ కారును నిలుపుదల చేసి కారు నంబరు విషయం అడిగే సాహసం చేయలేక పోయారు. గుంటూరులోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న కారణంగా కారుకు గుంటూరులోని ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంది. అయితే వారిలో ఓ డ్రైవర్‌కు గత నెలలో జీతం ఇవ్వకపోవడంతో మానేశాడు. ఇదిలా ఉంటే గుంటూరులోని ఓ బాధితుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకున్న సమయంలో ఖాళీ చెక్కుపై ఎంత డబ్బు అనే వివరాలు రాయకపోగా, ఆమె సంతకం కూడా లేకుండా ఇచ్చేసిందంటే బాధితుడిని ఎలా మోసం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇదేంటి సంతకం లేదని బాధితుడు అడిగితే సంతకంతో పనేముంది నీకు హామీగా ఇస్తున్నానని నమ్మబలికిందని వాపోతున్నాడు. రంగంలోకి దిగిన పచ్చ సీఐ.. ఈ నేపథ్యంలో దీప్తి మోసాల గురించి వస్తున్న కథనాలతో ఆందోళనకు గురైన కొందరు బాధితులు కాకుమాను మండలంలోని మోసకారి గ్రామమైన బోడపాలెం వెళ్లి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న దీప్తి టీడీపీ నాయకులతో మంతనాలు చేసినట్లు తెలిసింది. వారి సూచనల మేరకు పచ్చ రంగు పులుముకున్న ఓ సీఐ రంగంలోకి దిగి దీప్తి గ్రామానికి ఎందుకు వెళ్లి విచారించారంటూ బాధితులకు ఫోన్ చేసి హెచ్చరించారు. ఇకపై అటువెళితే సహించేది లేదని, ఏదైనా ఉంటే దీప్తి పైనే ఫిర్యాదు చేసుకోవాలని ఆదేశించారు. నిందితురాలికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ముందుగా నిలుపుదల చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. (చదవండి: కిలాడీ లేడీ దీప్తీ) -
కిలాడీ లేడీ దీప్తి
సాక్షి, గుంటూరు: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అమాయకులను మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తాననీ, ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న పనులు చక్క పెడతానని ఘరానా మోసాలకు పాల్పడిన కిలాడీ లేడీ మామిళ్లపల్లి దీప్తి బాధితులు ఒక్కక్కరిగా బయటకు వస్తున్నారు. ఆమె సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానని నమ్మించి మోసం చేసినట్లు వెల్లడిస్తున్నారు. ఈ కిలాడీ లేడీ గురించి గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. కిలాడీ లేడీ గురించి సాక్షి జరిపిన విచారణలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమాయకుల నుంచి దాదాపు రూ.70 లక్షలకుపైగా దీప్తి నమ్మించి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. బయటకు వస్తున్న బాధితులు... రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా గ్రామ, సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిని కూడా దీప్తి క్యాష్ చేసుకుంది. సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురికి నమ్మబలికింది. ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన ఓ యువకుడికి సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పింది. దీంతో ఆ యువకుడు అప్పు చేసి రూ 1.50 లక్షలు ఇచ్చానని సాక్షి ఎదుట వాపోయాడు. వైజాగ్‌కు చెందిన వ్యక్తికి గురుకుల సంక్షేమ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. అందుకు రూ.15 లక్షలు కావాలని అడిగితే.. ఆయన ఇల్లు అమ్ముకొని వచ్చిన రూ.5 లక్షలు తెచ్చి ఇచ్చాడు. మాచర్లకు చెందిన నాయక్ అనే వ్యక్తికి విధ్యుత్ సబ్ స్టేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఏడాది క్రితం రూ.4.50 లక్షలు వసూలు చేసింది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన బాధితుడు, గుంటూరుకు చెందిన మన్నవ వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు, పొలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షలు, కడప జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షలు, నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి నుంచి రూ.10 లక్షల చొప్పున తీసుకున్నట్లు తెలిసింది. దాదాపుగా ఇప్పటి వరకు రూ.70 లక్షలకుపైగా నమ్మించి డబ్బు కాజేసిందని ప్రచారం జరుగుతోంది. గుంటూరు నుంచి హైదరాబాద్ దీప్తిపై ఫిర్యాదులు అందుతుండటంతో ముందు జాగ్రత్త పడింది. గుంటూరు నుంచి స్నేహితుల సహకారంతో హైదరాబాద్ చేరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దీప్తి తనపై వచ్చిన ఫిర్యాదుల నుంచి బయట పడేయాలని టీడీపీ నాయకులకు ఫోన్ చేసి కోరుతున్నట్లు సమాచారం. బాధితులు మాత్రం మోసకారి ఎక్కడ ఉన్నా ఆమెను అరెస్టు చేయడంతోపాటు ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేలా పాస్‌పోర్టు సీజ్ చేయాలని కోరుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు తెలియజేయడం సాధ్యం కాదని అంటున్నారు. ఏది ఏమైనా కిలాడీ లేడీని అరెస్టు చేసి మరొకరు ఇలాంటి మోసాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. (చదవండి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఏనంటూ..) -
వాగు మింగేసింది
సాక్షి, నాదెండ్ల(గుంటూరు) : మండలంలోని సంక్రాంతిపాడు వద్ద నక్కవాగులో గల్లంతైన యువ రైతు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. సంక్రాంతిపాడు గ్రామానికి చెందిన ప్రత్తి సాంబశివరావు కుమారుడు శ్రీకాంత్ (29) రెండేళ్ల క్రితం గుంటూరు సమీపంలోని బుడంపాడు గ్రామానికి చెందిన స్వప్నతో వివాహమైంది. అరెకరం సొంత భూమికి తోడు మరి కొంత కౌలుకు తీసుకుని తండ్రితో కలిసి పంటలు సాగు చేస్తున్నాడు. గురువారం ఉదయం తండ్రితో కలిసి బ్రిడ్జి మీదుగా పొలానికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటేందుకు ప్రయత్నించాడు. వాగు ఉధృతికి అదుపుతప్పి పడిపోయాడు. అదే సమయంలో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న రైతులు చూసి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. నాదెండ్ల ఇన్చార్జి తహసీల్దార్ నాంచారయ్య, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఎస్ఐ చెన్నకేశవులు, అగ్నిమాపక దళ అధికారి చంద్రమౌళి సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను తెప్పించారు. ఈలోగా రైతులే శ్రీకాంత్ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలతోనే ప్రమాదాలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా ఇసుక, మట్టి తవ్వకాలు జరిపారు. నక్కవాగులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వటంతో గుంతలు ఏర్పడ్డాయి. వాగు ఉధృతి కారణంగా శ్రీకాంత్ ఈ గుంతల్లో పడి మృతి చెందాడు. గల్లంతైన బాలిక మృత్యుఒడికి.. సత్తెనపల్లి: మండలంలోని పాకాలపాడు వాగులో గల్లంతైన విద్యార్థిని పెరవల్లి భువనేశ్వరి (11) మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని గురువారం రెంటపాళ్ళ వద్ద వాగులో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు గుర్తించారు. చందవరం గ్రామానికి చెందిన బాలిక ఐదో తరగతి చదువుతోంది. అమ్మమ్మ పార్వతితోపాటు దుస్తులు శుభ్రం చేసేందుకు పాకాలపాడులోని శివాలయం వెనుక ఉన్న వాగుకు బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్లింది. కాలు జారి వాగులో పడి కొట్టుకుపోయింది. బాలిక మృతితో అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటన పలువురిని కలిచివేసింది. మృతదేహాన్ని అధికారులు పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. -
ప్రియుడితో బంధం భర్తకు చెప్తాడనే భయంతో..
సాక్షి, రాజుపాలెం(సత్తెనపల్లి): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తొమ్మిదేళ్ల కన్న కొడుకుని ప్రియుడితో కలసి కిరాతకంగా హత్య చేసిన తల్లి ఉదంతం ఇది. తొమ్మిది నెలల తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన షేక్ జాన్వలి, సైదాబీ దంపతులకు కుమారుడు విజ్వాన్ (9), ఓ కుమార్తె ఉన్నారు. జాన్వలి కరెంటు పనులు చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. దీనిని ఆసరాగా తీసుకున్న భార్య సైదాబీ అదే గ్రామానికి చెందిన అవివాహితుడు వడ్లమాను శ్రీకాంత్‌రెడ్డితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రోజూ శ్రీకాంత్‌రెడ్డి సైదాబీ ఇంటికి వచ్చి వెళుతున్నాడు. ఇది గమనించిన కుమారుడు తల్లిని మన ఇంటికి అతను ఎందుకు వస్తున్నాడని ప్రశ్నించాడు. విషయాన్ని నాన్నకు చెబుతానని అన్నాడు. దీంతో భయపడిన జాన్‌బీ తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి పన్నాగం పన్నింది. పథకం ప్రకారమే హత్య... తల్లి, ప్రియుడు కలసి విజ్వాన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 2018 డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం ఇంటి ముందు ఆడుకునే విజ్వాన్‌ను శ్రీకాంత్‌రెడ్డి మీ అమ్మ నిన్ను తీసుకురమ్మన్నదని బైకుపై ఎక్కించుకొని బీరవల్లిపాయ అడవి సమీపంలోకి చేరాడు. అప్పటికే అక్కడ సైదాబీ వేచి ఉంది. ద్విచక్ర వాహనంపై సైదాబీని కూడా ఎక్కించుకుని దట్టమైన బీరవల్లిపాయ కొండల సమీపంలోకి తీసుకెళ్లారు. విజ్వాన్‌ను తల్లి రెండు కాళ్లు పట్టుకోగా ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డి బాలుడి తలపై అతి కిరాతకంగా రాయితో కొట్టి చంపారు. తరువాత మృతదేహాన్ని ఇద్దరూ కలసి ఈడ్చుకుంటూ గుట్టల్లోకి విసిరి పడేశారు. ఆ తరువాత వారిద్దరూ ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయారు. ఫోన్‌కాల్ లిస్టు ఆధారంగా... ఇటీవల రూరల్ ఎస్పీ జయలక్ష్మి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించడంతో సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల రూరల్ సీఐ ఎం.రత్తయ్య, ఎస్ఐలు అనంతకృష్ణ, రాజశేఖర్‌బాబు, ట్రైనింగ్ ఎస్ఐ వెంకటరవి దర్యాప్తును ముమ్మరం చేశారు. తల్లి సైదాబీ ఫోన్‌కాల్ లిస్టు ఆధారంగా ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డి ప్రమేయం ఉందని భావించారు. తల్లిని, ప్రియుడు శ్రీకాంత్‌రెడ్డిని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారే బాలుడిని హత్య చేశారని తేల్చారు. దీంతో నిందితులిద్దరినీ గురువారం సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు. చదవండి : అత్తారింటికి వెళ్తే.. మర్మాంగాన్ని కోసేశారు -
వచ్చీరాని వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
వారు కేవలం ఫస్ట్ ఎయిడ్... అంటే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయడానికి అర్హులు. కాని వారు ఎంఎస్ సర్జన్ల మాదిరిగా ఆపరేషన్లు కూడా చేసి పారేస్తుంటారు. కమీషన్ల కోసం ఇబ్బడిముబ్బడిగా నోటికొచ్చిన మందులు, యాంటీబయాటిక్స్ రాసి పారేస్తుంటారు. అవి వాడిన రోగులకు కొత్తరోగాలు, రావడం, కిడ్నీలు ఫెయిలవడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. వీరిపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో గ్రామీణుల ప్రాణాలతో వీరు చెలగాటమాడుతున్నారు. సాక్షి, గుంటూరు మెడికల్ : పట్టుమని పదో తరగతి కూడా చదవరు... అయినా పల్లెటూరులో పెద్ద డాక్టర్‌గా చెలామణి అవుతుంటారు...చిన్న గదిలోనే పెద్ద ఆస్పత్రి మాదిరిగా సెలైన్లు పెట్టడం, మందులు పెట్టి అమ్మటం, గాయాలకు కుట్లు వేయటం చేస్తూ అను‘మతి’ లేని వైద్యంతో గ్రామీణుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. గ్రామంలోనే ఉండటంతో గ్రామీణుల ఆర్థిక స్థితిగతులపై అవగాహన కల్గి ఏదైనా రోగం వచ్చినప్పుడు వారిని వైద్యం పేరుతో దోచేస్తున్నారు. వారిపై పర్యవేక్షణ ఎవరు చేయాలనే దానిపై వైద్యాధికారుల్లో స్పష్టత లేకపోవటంతో ఇష్టానుసారంగా వైద్యం చేస్తూ ఒక రోగంతో వెళ్లిన వారికి ఇతర రోగాలు సోకే విధంగా వైద్యం అందిస్తున్నారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు... ఆర్ఎంపీల వైద్యంతో ముఖం నల్లగా మారి కంటిచూపు పోయిందని ఫిరంగిపురానికి చెందిన కేసనపల్లి కుమారి 2017 మే నెలలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు జ్వరం రావటంతో గ్రామంలోని ముగ్గురు ఆర్ఎంపీల వద్ద వైద్యసేవలను పొందింది. వారు ఇచ్చిన మందులను మింగటం వల్లే తన ముఖం నల్లగా మాడిపోవటంతో పాటుగా కంటిచూపు కూడా పోయిందని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. గర్భం ధరించిన ఓ మహిళకు 2018లో అమరావతిలో ఓ ఆర్ఎంపీ అబార్షన్ చేయటం, తీవ్ర రక్తస్రావమై సదరు మహిళ ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి రాకుండా రాజీపడే కేసులు చాలా ఉంటాయి. కేవలం ఫస్ట్ ఎయిడ్ చేసే అర్హత మాత్రమే ఉన్న కొంతమంది ఆర్ఎంపీలు, పీఎంపీలు స్పెషాలిటీ పీజీ చేసిన వైద్యులు కూడా చేయని ఆపరేషన్లు, వైద్యాన్ని చేస్తూ గ్రామీణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జ్వరాల సీజన్లో అప్రమత్తంగా లేకపోతే... నేడు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జ్వరాల కేసులు నమోదవుతూ ఉన్నాయి. జ్వరాలతో పాటుగా అప్పుడప్పుడు డయేరియా కేసులు కూడా నమోదువుతున్నాయి. గ్రామీణ రోగులకు ఆర్ఎంపీలు అందుబాటులో ఉండటంతో జ్వరపీడితులు వెంటనే వారిని ఆశ్రయిస్తున్నారు. కొంతమంది గ్రామీణ వైద్యులు జ్వరపీడితులను ప్లేట్లెట్స్ తగ్గాయంటూ భయపెట్టి పట్టణాల్లో ఆస్పత్రుల్లో చేర్పించి ఆర్థికంగా గుల్ల చేస్తున్నారు. పట్టణాల్లోని ఆస్పత్రుల్లో రోగిని చేర్పించినందుకు రోగికి లక్ష రూపాయలు బిల్లు అయితే అందులో రూ.30,000 నుంచి రూ.40,000 ఆర్ఎంపీ, పీఎంపీలకు పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు కమీషన్‌గా ఇస్తున్నారు. కొన్ని పట్టణాల్లో కేవలం ఆర్ఎంపీలు, పీఎంపీలు పంపించే రోగులపైనే ఆధారపడి ప్రైవేటు ఆస్పత్రులు నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏ రోగికి ఎంత వరకు బిల్లు వేయవచ్చనే విషయాన్ని ఆర్ఎంపీలు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు తెలియజేస్తారు. అందుకు ప్రతిఫలంగా ఆస్పత్రుల నిర్వాహకులు నెలకోమారు, లేదా మూడు నెలలకు ఒకసారి ఆర్ఎంపీలకు సమావేశాలు ఏర్పాటు చేసి విందు భోజనాలతో పాటుగా భారీగా బహుమతులు, కమీషన్లు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారు. వైద్యాధికారులు ఈ సీజన్లో ప్రైవేటు వైద్యులపై, ఆర్ఎంపీలు తప్పుడు ప్రాక్టీస్‌లపై ఓ కన్ను వేసి ఉంచకపోతే రోగులు బలైపోయే ప్రమాదం లేకపోలేదు. కొంతమందికే అనుమతి... జిల్లాలో సుమారు 4,000 మంది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్(ఆర్ఎంపి), ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్(పీఎంపీ) వైద్యసేవలు అందిస్తున్నారు. కనీస అర్హతలు లేకుండా వీరు ఇష్టానుసారంగా వైద్యం చేసి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉండటంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్ఎంపీ, పీఎంపీలకు ఏడాదిపాటు శిక్షణ కోర్సు ఏర్పాటుచేశారు. ఆ కోర్సు పూర్తిచేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 1,400 మంది మాత్రమే 2008–09లో శిక్షణ పొందారు. వైఎస్సార్ మరణంతో ఆ శిక్షణ కార్యక్రమం ఆగిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఆర్ఎంపీలకు ప్రాక్టీస్ చేసుకునేందుకు ఇచ్చిన జీఓ వివాదాస్పదమై ఐఎంఏ వైద్యులు కోర్టులో కేసు వేశారు. శిక్షణ పొందకుండా ప్రాక్టీస్ చేసేవారిపై, అత్యాశతో పెద్ద డాక్టర్ల మాదిరిగా ఫస్ట్‌ఎయిడ్ కాకుండా ఇతర వైద్యసేవలు అందించేవారిపై, మందులు రాసే అర్హత లేకున్నా మందులు రాస్తూ షాపు కూడా నిర్వహిస్తున్న వారిపై, బయో మెడికల్ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడే పడేసి అంటువ్యాధులు ప్రబలే విధంగా ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎంపీలపై వైద్యాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి గ్రామీణ వైద్యులు కొంత మంది రోగి తమ వద్దకు వెళ్లగానే డైక్లోఫినాక్, జెంటామైసిన్, ఎమికాసిన్ లాంటి నొప్పి నివారణ ఇంజెక్షన్లు, మాత్రలు ఇస్తున్నారు. బీపీ, షుగర్ బాధితులకు అధిక మొత్తంలో నొప్పి నివారణ మాత్రలు, ఇంజెక్షన్లు ఇవ్వటం ద్వారా వారికి కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇలాంటి బాధితులు మా వద్దకు చికిత్స కోసం తరచుగా వస్తున్నారు. కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలు వారం నుంచి పదిరోజులు వాడితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ చింతా రామకృష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు -
ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య
సాక్షి, గుంటూరు : మాచర్లలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆదిలక్ష్మి అనే మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను చంపించింది. ఇందుకోసం తన చెల్లెలి కుమారుడి సహాయం తీసుకుంది. తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని డంపింగ్ యార్డులో పడేసింది. ఈ ఘటనను విచారించిన పోలీసులు భార్య పాత్రను నిర్ధారించారు. ఆదిలక్ష్మిని, ఆమె ప్రియుడు కరీముల్లాను అదుపులోకి తీసుకున్నారు. -
బాలికపై అత్యాచారయత్నం
సాక్షి, గుంటూరు(వినుకొండ) : బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో మంళవారం చోటు చేసుకుంది. వినుకొండ టౌన్ సీఐ చినమల్లయ్య వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేమారెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం యత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కన వాళ్లు వచ్చారు. అంతలోకి నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త మందలించాడని ఆత్మహత్య
సాక్షి, తెనాలి, (గుటూరు): భర్త మందలించాడని భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన కలవకొల్లు రంగా ఇంటికి మాంసం తీసుకువెళ్లాడు. మధ్యాహ్నమయినా వంట పూర్తికాకపోవడంతో, పిల్లలకు పెట్టలేదంటూ భార్య లక్ష్మి(26)ని రంగా మందలించాడు. «భర్త బయటకు వెళ్లగానే, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న లక్ష్మి తల్లి, పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు కిందికి దించి తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. హెడ్‌కానిస్టేబుల్ బొత్తలపూడి శ్యామ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎదురు ప్రశ్నిస్తే.. మరింత చితకబాదుతున్నాడు..!
సాక్షి, మేడికొండూరు (గుంటూరు): సినిమాల్లో హీరో ఎస్సై వేషం వేసి రౌడీలను ఎక్కడ పడితే అక్కడ చితకబాదినట్లు ఉంది ఎస్సై వినోద్‌కుమార్ తీరు. యువకులు, వృద్ధులు, మందుబాబులను ఎక్కడ పడితే అక్కడ లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై కొట్టిన తరువాత ఆయన దాడిలో గాయపడిన వారు బయటకి చెప్పుకోలేక మిన్నుకుండి పోతున్నారు. ఇటీవల మేడికొండూరు ఈద్గా సమీపంలో ఇద్దరు రైతులను పొలంలో కొట్టడం చర్చనీయాంశమైంది. పేరేచర్ల కూడలిలో మంగళవారం రాత్రి కేసులు రాస్తున్న నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్రవాహంపై వస్తుండగా వారి వాహనాన్ని ఎస్సై ఆపారు. వారు తమకు తెలిసిన వారికి ఫోన్ చేస్తామని చెప్పటం, కేసు రాసుకోమని అనటంతో చిర్రెత్తిన ఎస్సై ఒక యువకుడి చెంప చెళ్లు మనిపించాడు. రెండు సార్లు యువకుడిని కొట్టాడు. ఏదైనా ఉంటే చెప్పాలి లేక కేసులు రాయాలని బాధితులు అంటున్నారు. అంతేకానీ ఇష్టానుసారం దాడి చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం దుకాణాల వద్దకు వెళ్లి పది గంటలు కాక మునుపే మందుబాబులపై తన ప్రతాపం చూపిస్తూ ఎక్కడ పడితే అక్కడ లాఠీతో దాడి చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని మరింత చితకబాదుతున్నారు. వీరికి తగలరాని చోట తగిలి ఎదైనా ప్రాణానికి ముప్పు వాటిల్లితే పరిíస్థ్ధితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అర్బన్ సౌత్ డీఎస్పీ కమలాకర్‌ను వివరణ కోరగా ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. ఇంతకమునుపు మేడికొండూరు ఠాణాలో పనిచేసిన ఎవరూ ఇలాంటి క్రూరత్వం ప్రదర్శించలేదని చెబుతున్నారు. చదవండి: వివాదాస్పదంగా తాడికొండ ఎస్ఐ వైఖరి -
మురుగు కాల్వలో పసికందు మృతదేహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు రోడ్డు మురుగు కాల్వలో పసికందు మృతదేహం లభ్యమైన ఘటన మరువక ముందే ఆ ప్రాంతానికి సమీపంలో మరో పసికందు మృతదేహం మురుగు కాల్వలో కనిపించటం కలకలం రేపింది. పల్నాడు రోడ్డు పాత చెక్‌పోస్టు వీధిలోని ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు సమాచారాన్ని వన్‌టౌన్ పోలీసులకు అందించారు. దీంతో ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సైడుకాల్వలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. నెలలు నిండని శిశువుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 20 రోజుల క్రితం పల్నాడు బస్టాండ్ ఎస్‌కేఆర్‌బీఆర్ కళాశాల ఎదుట ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సమీపంలోని ప్రైవేటు వైద్యశాలల్లో అబార్షన్ చేసి శిశువును కాల్వలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన మరువక ముందే మురుగు కాల్వలో మరో పసికందు ప్రత్యక్షమవ్వటం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
వివాదాస్పదంగా తాడికొండ ఎస్ఐ వైఖరి
సాక్షి, తాడికొండ: తాడికొండ ఎస్సై రాజశేఖర్ వైఖరి నానాటికీ వివాదాస్పదంగా మారుతోంది. గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులకు ఎస్సై తొత్తుగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. పోలీసులు ఏ ఒక్క పక్షానికి కొమ్ముకాయకూడదన్న కనీస ధర్మాన్ని విస్మరించి పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలా ఎస్సై వ్యవహరిస్తున్నారనే విమర్శలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకులు, శ్రేణులు తప్పులు చేసి ఠాణాకు వచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయనకు టీడీపీపై ఉన్న ప్రేమానురాగాలు పరాకాష్టకు చేరాయి. కంతేరు గ్రామంలో మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారంలో టీడీపీ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నల్లమట్టిని తరలిస్తున్న ట్రాక్టరు డ్రైవర్లు, ప్రైవేటు వెంచర్ నిర్వాహకుడిని బంధించి వారితో వైఎస్సార్ సీపీ నాయకులే మట్టి తరలించమని చెప్పారని చెప్పించేందుకు తీవ్రంగా యత్నించారు. ఇందులో భాగంగా కంతేరు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి వీడియోలు తీస్తూ బెదిరించిన వ్యవహారం బయటకు రావడంతో తాడికొండ వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తియ్యగూర బ్రహ్మారెడ్డి ఎస్ఐ రాజశేఖర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును ఎస్సై పక్కన పడేశారు. అక్కడితో ఆగకుండా టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కేసు నమోదు చేయడం గమనించాల్సిన విషయం. గతంలోనూ ఇదే పరిస్థితి.. ఎస్సై రాజశేఖర్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలోనూ వాస్తవాలు పక్కనపెట్టి కేసులు నమోదు చేసి వైఎస్సార్ సీపీ నాయకులను వేధింపులకు గురిచేశాడు. 2018 జనవరిలో వైఎస్సార్ సీపీ నాయకుడిపై సోషల్ మీడియా కేసు బనాయించి కనీసం స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. బండారుపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు టపాసులు కాల్చుతూ రాకెట్‌కు చంద్రబాబు నరకాసురుడు అని రాసి పైకి ఎగరేశారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ కార్యకర్త గుంటుపల్లి రాంబాబుపై టీడీపీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఓ వ్యక్తితో నామమాత్రపు ఫిర్యాదు ఇప్పించి అక్రమంగా అరెస్టు చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా రిమాండ్‌కు తరలించారు. కానీ నాడు సంబంధిత వీడియోలో కేసు నమోదు చేసిన వ్యక్తులు కానీ టపాసులు కాల్చిన చిన్నారులు కానీ కనిపించలేదు. కేవలం కేసు నమోదు చేసిన వ్యక్తి ఫేస్బుక్లో ఆ వీడియోను షేర్ చేశాడనే నెపంతో అక్రమ కేసు బనాయించడం విశేషం. ఘటనపై స్పందించిన నాటి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర హెనీక్రిస్టినా, సురేష్ కుమార్ దంపతులు రాత్రి 12 గంటల వరకు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైటాయించి నిరసన తెలియజేసినా కనీసం స్పందించిన దాఖలా లేదు. నేడు అందుకు విరుద్ధం.. నాడు రాంబాబు తప్పు లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసిన ఎస్సై నేడు టీడీపీ నాయకులు మట్టి తరలింపు వ్యవహారంలో ట్రాక్టర్ డ్రైవర్లు, వెంచర్ యజమానిని వేధిస్తూ పక్కా ఆధారాలతో దొరికినా వారిపై కేసు నమోదు చేయడం లేదు. ఇది ఎస్సై ఏకపక్ష ధోరణికి ప్రత్యేక్ష నిదర్శనంగా నిలుస్తోంది. చదవండి: వివాదాస్పదంగా ఎస్ఐ వినోద్ వ్యవహారశైలి -
వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!
సాక్షి, చిలకలూరిపేట: పెంపుడు కుమార్తెను వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రిని పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అర్బన్ సీఐ వి.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరులో నివాసం ఉండే ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మిట్టనోసుల ప్రభుదాసు ఎలియాస్ వీరారావు ఒక కుమార్తెను పెంచుకున్నాడు. ఆమె చేత 13 సంవత్సరాల వయస్సు నుంచే బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆమెకు వివాహం జరిగాక కూడా వ్యభిచారం చేయిస్తుండటంతో భర్త వదలివేశాడు. దీంతో ఆమె చిలకలూరిపేట పట్టణంలో తన కుమార్తెతో కలసి జీవనం కొనసాగిస్తోంది. ఇది తెలిసి వీరారావు తిరిగి ఆమెను వ్యభిచారం చేయాల్సిందిగా కొట్టి గాయపరచటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!
సాక్షి, తెనాలి: వృద్ధాప్యంలో ఉన్న తమను ఆదరించకపోగా, ఆస్తి కోసం వేధిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతూ తప్పుడు కేసుతో పోలీస్ స్టేషన్లో నిర్బంధానికి గురిచేసిన కోడలు నుంచి తమకు రక్షణ కల్పించాలని కొల్లిపర మండల గ్రామం శిరిపురానికి చెందిన డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు అధికారులను వేడుకున్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో అర్జీనిచ్చారు. తెనాలి ఆర్డీవో ఎ.శ్యామ్‌సుందర్ అర్జీలను స్వీకరించారు. అర్జీలో విక్టోరియమ్మ పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. తాడిగిరిపాడులో నివసిస్తున్న డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు కోడలు భాగ్యలక్ష్మి వేధింపులను తట్టుకోలేక శిరిపురం చేరుకున్నారు. అక్కడే కూలిపనులు చేసుకుంటూ మూడు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి పూరిల్లు వేసుకుని నివసిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత కొడుకు గోపాలరావు, కోడలు భాగ్యలక్ష్మి కూడా శిరిపురం వచ్చారు. తల్లిదండ్రులు ఉండే స్థలంలోనే మరో ఇల్లు వేసుకుని వేరుకాపురం ఉంటున్నారు. వీరి మంచీచెడూ చూడటం లేదు. కోడలు పేరిట తాడిగిరిపాడులో ఇందిరమ్మ ఇల్లు ఉంది. అయితే తల్లిదండ్రులు ఉంటున్న నివాస స్థలాన్ని కూడా కోడలు పేరుతో రాసివ్వమంటూ కొడుకు గోపాలరావు ఒత్తిడి చేస్తున్నాడు. బతికున్నంతకాలమైనా స్థలాన్ని తమ అధీనంలోనే ఉంచమని వేడుతున్నా వినలేదు. హృద్రోగంతో బాధపడుతున్న మామ, అత్త విక్టోరియమ్మను ఆస్తి కోసం కోడలు విచక్షణారహితంగా కొట్టింది. అప్పటికీ స్థలం ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో కొల్లిపర పోలీస్‌స్టేషనులో తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు 23వ తేదీ సాయంత్రం 5 గంటల్నుంచి అర్ధరాత్రి వరకు వృద్ధ దంపతులను నిర్బంధించారు. కొల్లిపర పోలీసులు కూడా కోడలుకే మద్దతునిస్తూ, స్టాంపు పత్రాలపై సంతకం చేయమని ఒత్తిడి తెచ్చారు. నివసిస్తున్న స్థలం మినహా మరే ఆధారం లేని తమను రోడ్డుకీడ్చారని, గతిలేని స్థితిలో అదే ఊరిలో ఉంటున్న అల్లుడి ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని వృద్ధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడలి వల్ల తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించి, తమ ఇంటిలో తాము ఉండేలా న్యాయం చేయాలని విక్టోరియమ్మ భర్తతో సహా ఆర్డీవోను వేడుకుంది. మనుమలను దూరం చేశారు.. వృద్ధాప్యంలో ఒంటరి జీవితం నరకప్రాయమని, కనీసం చనిపోయేంతవరకైనా తనతో కోడలు, మనుమ సంతానం కలిసుండేలా ఆదేశించాలని పట్టణ సుల్తానాబాద్‌కు చెందిన వృద్ధురాలు ధనావత్ పట్నీబాయి (70) ‘స్పందన’లో ఆర్డీవోను కలిసి అర్జీనిచ్చారు. భర్త మరణంతో తాను సుల్తానాబాద్‌లోని సొంతంటిలో పెద్దకొడుకు కుటుంబంతో కలసి ఉంటున్నట్టు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడైన తన పెద్ద కొడుకు మునినాయక్ గత మే నెల 27న ఆటోప్రమాదంలో మరణించాడని, ఉమ్మడి కుటుంబం అయినా కొడుకు చనిపోయాక ఫ్యామిలీ సర్టిఫికెట్లో తన పేరు లేకుండా చేశారని పట్నీబాయి చెప్పారు. ఆధార్‌లో మార్పులు చేయించుకు వస్తానంటూ కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లినట్టు తెలిపారు. ఇప్పుడేమో ‘నేను రాను...మీతో నాకు అవసరం లేదు’ అంటోందని చెప్పారు. ఎవరూ లేకపోవటంతో పెళ్లివయసుకొచ్చిన చిన్న కుమార్తెతో ఉంటున్నానని, ఆమె వివాహం తర్వాత మళ్లీ ఒంటరినవుతానని ఆవేదనగా అన్నారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు వయసు కలిగిన ముగ్గురు మనుమ సంతానంతో సహా కోడలు తన ఇంటి వద్ద ఉండేలా చూడాలంటూ ఆర్డీవోను అభ్యర్థించారు. – ధనావత్ పట్నీబాయి -
ఒక్కో టీవీఎస్‌కు.. ఒక్కో సంవత్సరం జైలు శిక్ష
సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు) : అతనో ఘరానా దొంగ. చూడటానికి దివ్యాంగుడే అయినప్పటికీ అతని కన్ను పడితే మాత్రం టీవీఎస్ మాయమే. అలాంటి మాయల మరాఠీని ప్రత్తిపాడు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒక్కో కేసుకు ఒక్కో ఏడాది చొప్పున ఎనిమిది కేసులకు ఎనిమిది సంవత్సరాల పాటు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రత్తిపాడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీవీఎస్‌లు వరుస చోరీలకు గురవుతూ వస్తున్నాయి. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్న అప్పటి ఎస్ఐ ఏ.బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన సంగేపు అర్జునరావు (40)ను పట్టుకున్నారు. అతని నుంచి సుమారు ఇరవైవరకు టీవీఎస్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముద్దాయిపై 379 ఐపీసీ సెక్షన్ కింద 76/19, 81/19, 82/19, 83/19, 84/19, 85/19, 87/19, 89/19 మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. వాటిలో ఈనెల 20వ తేదీన రెండు కేసుల్లో, 21వ తేదీన 3 కేసుల్లో, 22న 3 కేసుల్లో శిక్షలు విధిస్తూ ఆరవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.అరుణ తీర్పు ఇచ్చారు. ఒక్కో కేసుకు ఒక్కో ఏడాది చొప్పున ఎనిమిది కేసుల్లో ఎనిమిది సంవత్సరాలు శిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ప్రత్తిపాడు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
వ్యసనాలకు బానిసలై జైలుపాలైన విద్యార్థులు
సాక్షి, గుంటూరు : విద్యార్థి కిడ్నాప్‌కు విఫలయత్నం చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజనల్ ఆఫీసర్ ఎస్.ఎం.నజీముద్దీన్, కొత్తపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎస్.వి.రాజశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన సానిమల్లికార్జున గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బ్రాడీపేటలోని బీసీ హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీన ఉదయం 3 గంటల సమయంలో మాచర్ల నుంచి వస్తున్న తన రూమ్మెట్ సాంబశివరావును తీసుకొచ్చేందుకు ఆర్టీసీ బస్టాండ్‌కు తన సైకిల్‌పై మూడు వంతెనల బ్రిడ్జి కింద నుంచి నెహ్రూనగర్ రైల్వే ట్రాక్ పక్కగా రామిరెడ్డితోట ప్రధాన రహదారిపై వెళుతున్నాడు. పోలేరమ్మ ఆలయం వద్దకు వచ్చేసరికి నలుగురు యువకులు కారును అడ్డుపెట్టి మల్లికార్జునను బలవంతంగా కారులో ఎక్కించారు. వారి వద్ద ఉన్న పిస్టల్ చూపించి తాము పోలీసులమని, నీలాంటివాళ్ల వల్ల రాత్రి వేళల్లో విధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బెదిరించారు. అయితే సదరు విద్యార్థి నుంచి సెల్‌ఫోన్, ఐడీ కార్డు లాక్కున్నారు. ఆ తర్వాత అక్కడ కారు ఎక్కించుకుని బస్టాండ్ పరిసర ప్రాంతంలోని గాయత్రి హోటల్లో వద్దకు వెళ్లారు. అక్కడ రక్షక్ వాహనాన్ని చూసిన నలుగురు కారు వదిలేసి తలో దిక్కు పారిపోయారు. అనంతరం మల్లికార్జున రక్షక్ ఇన్చార్జి షేక్ యూనస్బేగ్కు సమాచారం చెప్పగా, పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే కారును, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కూడా విద్యార్థులే.. కొత్తపేట ఎస్హెచ్ఓ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రంగంలో దిగిన బృందం నలుగురిని ఈనెల 18వ తేదీన మణిపురం బ్రిడ్జి పక్కన సింగ్ ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో కిడ్నాప్‌కు పాల్పడినట్లు అంగీకరించారు. పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన వెనిగండ్ల చైతన్యకృష్ణ, రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామానికి చెందిన వడ్లమూడి నాగబాబు, కాకుమాను మండలం కొండుపాటూరు గ్రామానికి చెందిన పూనం మనోజ్, వినుకొండ మండలం పిట్టంబండ గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావును అరెస్టు చేశారు. నిందితులు ఆయా కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులే. అయితే ఎస్వీఎన్కాలనీలో ఒక రూము అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలాజీ నగర్లో నివాసం ఉండే మద్దుకూరి రామబ్రహ్మం వద్ద నుంచి చైతన్యకృష్ణ సొంత పనుల నిమిత్తం కారు కావాలని తీసుకున్నాడు. దీంతోపాటు, మరో స్నేహితుడు అభిరామ్ అమెరికా వెళుతూ తన ఇంట్లో అప్పగించమని ఇచ్చిన పిస్టల్‌ను దగ్గరపెట్టుకుని అమాయకుల్ని బెదిరించి డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈనెల 14వ తేదీన ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడు ఉపయోగించిన పిస్టల్ సామర్థ్యం, పనిచేసే తీరు తదితర అంశాలు తెలుసుకునేందుకు దాన్ని ల్యాబ్‌కు పంపనున్నారు. అలాగే వెనిగళ్ల చైతన్య కృష్ణ మరికొద్దిరోజుల్లో విదేశాలకు వెళ్లనున్నారు. ఈక్రమంలో అతని పాస్‌పోర్టు కూడా సీజ్ చేశారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఏఎస్సై ఆంథోని, హెడ్‌కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. వీరికి రివార్డుల కోసం సిఫార్సులు చేస్తున్నట్లు తెలిపారు. -
కోడెల తనయుడు శివరామకృష్ణకు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, గుంటూరు: టీఆర్ లేకుండా సుమారు 800 బైక్‌లు విక్రయించిన వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణకు ఉచ్చు బిగుస్తోంది. రవాణా శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీఆర్ లేకుండా బైక్‌లు విక్రయించిన 138 మంది వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లో బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా 800 బైక్‌లను కోడెల శివరామ్ విక్రయించాడు. ఈ వ్యవహారంలో ఇటీవల గౌతమ్ షోరూమ్‌ను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. టీఆర్, లైఫ్ ట్యాక్స్‌ల పేరుతో వినియోగదారుల నుంచి ఒక్కో బైక్‌కు రూ.8–10 వేల వరకూ కోడెల శివరామ్ వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేశాడు. రూ.కోటి మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు. వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు.. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా డెలివరీ చేసిన బైక్‌ల వివరాలను ఇన్వాయిస్లోని చిరునామాల ఆధారంగా గుర్తించారు. రవాణా శాఖ అధికారులు స్వయంగా బైక్‌లు కొనుగోలు చేసిన ఇళ్లకు వెళ్లి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 138 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇప్పటి వరకూ రవాణా శాఖ అధికారులకు స్టేట్మెంట్లు ఇచ్చిన వినియోగదారులందరూ బైక్ కొనుగోలు సమయంలో తమకు టీఆర్ ఇవ్వలేదని, లైఫ్ ట్యాక్స్, టీఆర్ ఫీజుల పేరుతో రూ. 8–10 వేల వరకూ వసూలు చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి స్టేట్మెంట్ సేకరించిన అధికారులు స్టేట్మెంట్లను రవాణా శాఖ కమిషనర్‌కు నివేధించారు. విచారణ రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. విచారణ అనంతరం శివరామ్‌పై క్రిమినల్ కేసులు నమోదుచేస్తారు. బైక్‌లు స్వాధీనం చేసుకున్న ఫైనాన్స్ కంపెనీలు.. టీఆర్ లేకుండా గౌతమ్ షోరూమ్ యాజమాన్యం 800 బైక్‌లు విక్రయించింది. వీటిలో చాలా వరకూ బైక్‌లను వినియోగదారులు ఫైనాన్స్ రూపంలో కొనుగోలు చేశారు. టీఆర్ జనరేట్ కాకపోవడంతో వినియోగదారులు కిస్తీ (ఇన్స్టాల్మెంట్స్) చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ కంపెనీలు బైక్‌లను స్వాధీనం చేసుకున్నాయి. టీఆర్ జనరేట్ కాకపోవడంతో ఆ బైక్‌లు రిజిస్ట్రేషన్ అవ్వక వేరొకరికి బైక్‌లు విక్రయించడానికి వీల్లేక ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రికవరీ చేసిన బైక్‌లన్నింటినీ ఫైనాన్స్ కంపెనీలు తమ గోడౌన్స్‌లో ఉంచుకున్నాయి. టీఆర్ లేని వాహనాలను నడపడం నేరం తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) లేని వాహనాలను నడపడం నేరం. రవాణా శాఖ అధికారులు తనిఖీల్లో టీఆర్ లేనట్టు గుర్తిస్తే ఎంవీఐ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి భారీ అపరాద రుసుం విధించి వాహనం సీజ్ చేస్తారు. అదే విధంగా టీఆర్ లేని వాహనం ఢీ కొని ఎవరైన గాయాలపాలైన, మృతి చెందిన వాహనదారునిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. దురదృష్టవశాత్తు వాహనదారుడు మృతి చెందితే ఇన్సూరెన్స్ వంటి ఇతర స్కీమ్‌లు వర్తించవు. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా బైక్‌లు విక్రయించినవారు బైక్‌లను రోడ్డుపై తిప్పడానికి వీల్లేదు. – మీరా ప్రసాద్, డీటీసీ గుంటూరు -
రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం
సాక్షి, గురజాల: పురిటినొప్పులతో బాధపడుతూ రెండేళ్ల కిందట గురజాలలోని శ్రీకాంత్ నర్సింగ్ హోంలో తల్లీబిడ్డ మృతి చెందారు. మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డకు అప్పట్లో సరైన వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందువల్లే తల్లీబిడ్డ మృతి చెందారని ఇటీవల రాష్ట్ర మానవహక్కుల కమిషన్, ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేశారు. మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి శ్యామ్ రెండో కుమార్తె మాచర్ల శిరీషా రెండోసారి గర్భం దాల్చడంతో 2017 మే నెల 26వ తేదీన గురజాల శ్రీకాంత్ నర్సింగ్ హోంలో చేర్పించారు. వైద్యం చేసే క్రమంలో తల్లీ బిడ్డ మృతి చెందారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబసభ్యులు మృతదేహాలను మాడుగుల శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. అప్పట్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం 10 రోజుల నుంచి మృతురాలి కుటుంబీకులు మాచర్ల శిరీషా, ఆమెకు పుట్టిన బిడ్డ మరణంపై అనుమానం ఉందని ఫిర్యాదులు చేశారు. దీంతో సీఐ ఓ.దుర్గాప్రసాద్, తహసీల్దార్ షేక్ గౌస్‌బుడేసాహేబ్ సమక్షంలో బుధవారం గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ శివకామేశ్వరావు తల్లీబిడ్డ ఖననం చేసిన చోటు తవ్వకాలు చేపట్టి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వివరాలను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలకృష్ణ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, మృతురాలి బంధువులు పాల్గొన్నారు. -
పచ్చని కాపురాల్లో చిచ్చు!
సాక్షి, గుంటూరు: వివాహేతర సంబంధాల కారణంగా కొందరు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కారణం ఏదైనా తీసుకునే నిర్ణయాలతో పచ్చని కాపురాల్లో అంధకారం నింపుకుంటున్నారు. వివాహేతర సంబంధాలను నెరుపుతూ ఆపై భార్య లేదా భర్తను అడ్డు తొలగించుకునేందుకు హత్యలకు సైతం వెనుకాడటం లేదంటే మానవత్వం వారిలో ఎంతగా దిగజారి పోయిందో అర్థం చేసుకోవచ్చు. అభం శుభం తెలియని చిన్నారులు చేయని తప్పుకు జీవిత కాలం తల్లిదండ్రులు లేక శిక్షను అనుభవిస్తున్నారు. పెద్దలు చెప్పిన మాటలు పెడచెవిన పెడుతున్న కొంతమంది వారి జీవితాలను చేజేతులా అంధకారం చేసుకోవడంతో పాటుగా జైలు పాలవుతున్నారు. సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు పరిశీలిస్తే... జిల్లాలో ఇటీవల జరిగిన పలు ఘటనలను పరిశీలిస్తే అసలు మానవ సంబంధాలు ఉన్నాయా... మంటగలిసిపోయాయా.. అనే అనుమానం కలగకమానదు. గడచిన వారం రోజుల వ్యవధిలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే... ఇటీవల దుగ్గిరాలలోని చెన్నకేశవనగర్‌కు చెందిన సీహెచ్ వెంకట పద్మావతి (35) భర్తతో విడిపోయి కుమారుడితో కలసి ఉంటుంది. పెనుమాలి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డితో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఆమె ప్రవర్తన పై అనుమానం రావడంతో సుబ్బారెడ్డి ఈ నెల 10న బలవంతంగా ఆమెతో సల్ఫస్ మాత్రలు మింగించి హతమార్చాడు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అంకె ఏడుకొండలు భార్యతో తోటి గొర్రెల కాపరి పి.నాగయ్య వివాహతేర సంబంధం కొనసాగిస్తున్నాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా ఏడుకొండలను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని సమీప అటవీ ప్రాంతంలో తల మొండం వేరు చేసి పాశవికంగా హతమార్చాడు. పిడుగురాళ్ళ పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మీసాల మధు సమీపంలోని మరో యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని భావించి యువతి తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఈ నెల 9న దారుణంగా హతమార్చి రైల్వే ట్రాక్ పక్కన పడేశారని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా చివరకు బాధితులు, నిందితుల కుటుంబాల్లోని చిన్నారులు తల్లిదండ్రులకు దూరం కావాల్సి రావడం విచారకరం. జీవితాలను అంధకారం చేసుకోవద్దు కొద్దిపాటి మనస్పర్ధలు కారణంగా నిండు జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. సమస్యలు ఉంటే ఇరు కుటుంబాల్లోని పెద్దల సమక్షంలో కూర్చొని పరిష్కరించుకోవాలి. అవగాహన లేకుండా అహంభావాలకు వెళ్లి పుట్టిన పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయవద్దు. వారిని అమ్మానాన్నాల ప్రేమ నుంచి దూరం చేయవద్దు. వివాహేతర సంబంధాలను పెట్టుకొని ఇద్దరు జీవితాలను నాశనం చేసుకోవద్దు. సమస్యలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయండి. చట్ట పరిధిలో న్యాయం చేస్తాం. - పీహెచ్డీ రామకృష్ణ, అర్బన్ ఎస్పీ యువత అప్రమత్తంగా ఉండాలి పెళ్లి అనే పవిత్ర బంధానికి ఇద్దరూ విలువ ఇవ్వాలి. ఇద్దరూ ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. అర్థం చేసుకోవడంలో ఏర్పడే తేడాల కారణంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరం. విచక్షణ కోల్పోతే జీవితం నాశనం కావడంతో పాటుగా విలువలు కోల్పోయి సమాజంలో జీవించాల్సి ఉంటుంది. జన్మనిచ్చిన పిల్లల భవిష్యత్‌ను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా యువత మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. - ఆర్.జయలక్ష్మి, రూరల్ ఎస్పీ -
గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు
సాక్షి, వేల్పూరు: గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన ఘటన మండలంలోని వేల్పూరులో గల రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆలయ పూజారి ఆమంచి రవికుమార్ ఫిర్యాదు మేరకు పురావస్తుశాఖ కన్జర్వేటివ్ అసిస్టెంట్ వెంకటయ్య, అచ్చంపేట ఎస్ఐ పి.పట్టాభిరామయ్య శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో వేయిపడగల నాగేంద్రస్వామి రాతి విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగం కింద ఉండే పాణపట్టాన్ని పూర్తిగా కూల్చేసి భూమిలో మూడు అడుగుల లోతులో గొయ్యి తీశారు. స్వామివారి ఎదురుగా ఉండే నందీశ్వరుని రాతి విగ్రహాన్ని దిమ్మెపై నుంచి కింద పడేసి, ఆ ప్రదేశంలో లోతైన గొయ్యి తీసి నిధుల కోసం అన్వేషించిన ఆనవాళ్లు కనిపించాయి. దేవాలయ పరిసరాల్లో అక్కడక్కడే గుప్త నిధుల కోసం పరిశీలించిన దాఖలాలున్నాయి. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒకే సారి 101 శివాలయాలను నిర్మించి అందులో ఒకే సమయంలో 101 శివలింగాలను ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. వాటిలో రామలింగేశ్వరస్వామి ఆలయం ఒకటిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహాల ప్రతిష్టా సమయంలో విగ్రహాల కింద బంగారు నిధులు భూస్థాపితం చేసినట్లు వదంతులు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో కూడా పలు మార్లు ఇదే దేవాలయంలో తవ్వకాలు జరగడంతో దేవాలయ ప్రాంగణం మొత్తాన్ని పురావస్తుశాఖ స్వాధీనం చేసుకుని ఆవరణ చుట్టా ఇనుప తీగతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అనుమతులు లేకుండా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లడం గానీ, పరిసరాల్లో సంచరించడంగానీ నేరంగా అక్కడక్కడా బోర్డులు ఉంచారు. ఇది జరిగి సుమారు 15 సంవత్సరాల పైనే అయింది. తిరిగి ఇన్నేళ్లకు అక్రమార్కుల కళ్లు ఆలయంపై పడటం, ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించి భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే దేవతల విగ్రహాలను కూల్చడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు అచ్చంపేట ఎస్.ఐ పి.పట్టాభిరామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కొత్తదారుల్లో కేటుగాళ్లు!
సాక్షి, తుళ్లూరు: వైష్ణవికి ఓ కొత్త నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ‘వైష్ణవి గారు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.30 వేలు షాపింగ్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అవతలి వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురైంది. తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని ఆమె అనడంతో చెక్ చేస్తానంటూ సదరు వ్యక్తి క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, పిన్ నంబర్లు అడిగాడు. అసలే కంగారులో ఉండడం, ఫోన్ చేసిన అపరిచితుడు పేరుతో సంబోధించడంతో ఆమె వివరాలు చెప్పేసింది. ‘సారీ.. ఆ షాపింగ్ మీ క్రెడిట్ కార్డు నుంచి జరగలేదు’ అంటూ అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. సీన్ కట్ చేస్తే.. ఆ వివరాలు వినియోగించి ‘ఫోన్ కాలర్’ ఆన్లైన్ ద్వారా రూ.50 వేలు వైష్ణవి ఖాతా నుంచి మాయం చేశాడు. ఇది వైష్ణవి ఒక్కరి సమస్యేకాదు. సైబర్ నేరగాళ్లు వల విసురుతూ అందులో చిక్కుకున్న వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు స్మార్ట్ఫోన్లు వినియోగించేవారికి కొన్ని సూచనలు చేశాయి. ఫోన్లలో మనం వాడే 42 యాప్‌లు దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని గుర్తించాయి. సైబర్ నేరగాళ్లు ఉచితమంటూ ప్రచారం చేసే యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోగానే ఆయా మొబైల్ యాజమానుల వ్యక్తిగత రహస్యాలను గుప్పిటపట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో 4.2 కోట్ల మొబైల్ యాప్‌లు ఉన్నాయని, ఇందులో కేవలం నాలుగైదు శాతం మాత్రమే సురక్షితమని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి పట్టణాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడి గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. మాటలతో మభ్యపెడుతూ.. ఈ మధ్య కాలంలో పరిచయం లేని వ్యక్తుల నుంచి స్త్రీల గొంతుతో అష్టలక్ష్మి యంత్రమని, ఇన్సూరెన్స్ పాలసీపై బోనస్ వచ్చిందని, వడ్డీలేని రుణాలు పేరుతో రకరకాలుగా ఫోన్‌కాల్స్ పెరిగిపోయాయి. వారు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెబుతారు. దీంతో వారు ఆయా బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినవారే అని నమ్మేసి వారి వలలో పడిన తరువాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ప్రారంభించి అందిన కాడికి దోచుకుంటారు. ఎప్పటికప్పుడు ఏటీఎం పిన్ మారిస్తే మంచిది పిన్ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్ నంబర్ మారిస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. చాలా మంది తమ పిన్ నంబర్‌ను మర్చిపోతారేమోననే ఉద్దేశంతో పిన్ నంబర్ రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్‌వర్డ్‌ని భద్రంగా దాచుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే సరి.. క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. ప్రతి కార్డుకు వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ నంబర్ ఉంటుంది. దీనిని గుర్తుంచుకుని కార్డుపై చెరిపేయాలి. క్రెడిట్ కార్డులను చాలాకాలం వినియోగించకుండా ఉంటే బ్యాంకు అధికారులకు తెలియజేసి తాత్కాలికంగా మూసివేయాలి. ఆన్లైన్ ద్వారా వ్యవహారాలు సాగించేటట్లయితే సైట్ అడ్రస్ జీటీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. కార్డులను పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించాలి. మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగినప్పుడు ఆ సమాచారం ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా మీకు వచ్చేలా చేసుకోండి. ఎగ్జిబిషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌లో గిఫ్ట్‌కూపన్లు, లక్కీడిప్స్, ఓచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్ నంబర్ ఈ–మెయిల్ ఐడీలు గుడ్డిగా రాయకూడదు. స్మిషింగ్ వైరస్ స్మార్ట్ఫోన్ల ప్లాట్ ఫాంను ఆధారంగా చేసుకుని ఇటీవల స్మిషింగ్ వైరస్ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్ అని చెబుతూ.. అదనపు సదుపాయాలు కావాలంటే ఎస్ అని, వద్దనుకుంటే నో అని టైప్ చేసి పంపాలని అందులో ఉంటుంది. అయితే ఏది నొక్కినా సైబర్ నేరగాళ్లు పంపే వైరస్ మీ సెల్ఫోన్లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్ ద్వారా నిర్వహించే బ్యాకింగ్, క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. సాధారణంగా ‘5000’ వంటి నంబర్లతో వారి ఫేక్ మెయిల్ ఐడీ నుంచి జనరేట్ చేసి ఓ లింక్‌ని కూడా పంపుతారు. లింక్ ఓపెన్ చేయకుండా ఉండడమే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఉత్తమమైన మార్గం. -
లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య
సాక్షి, గుంటూరు(మాడుగుల) : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత మహిళ గనిపల్లి మరియకుమారి (24) మంగళవారం అర్ధ రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడుగుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి అన్నారావు తన అక్క కూతురైన మరియకుమారిని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. బడ్డీకొట్టు నడుపుతూ, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గనిపల్లి దిలీప్‌లెవి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా దిలీప్‌లెవి తన సెల్ ఫోన్‌ను పిల్లలతో మరియకుమారి వద్దకు పంపించి ఆమెతో మాట్లాడాలంటూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లినా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దిలీప్‌లెవి గతంలో రెండు మొబైల్స్‌ను పంపించగా మరియకుమారి భర్త అన్నారావు తీసుకొని గొడవపడ్డారు. మంగళవారం సాయంత్రం మరో మొబైల్‌ఫోన్ పిల్లలతో పంపించగా గమనించిన భర్త తీసుకొని ఆమె తల్లి, తమ్ముడికి విషయం తెలిపాడు. తమ్ముడు దారివేముల సునీల్ అక్కను మందలించగా తనకు ఏ పాపం తెలియదని, దిలీప్‌లెవి తనను చాలా కాలంగా వేధిస్తున్నాడని బోరున విలపించింది. అనంతరం మనస్తాపానికి గురైన మరియకుమారి అర్ధరాత్రి సమయంలో భర్త నిద్రపోతుండగా ఇంట్లో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున నిద్రలేచిన భర్తకు భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలికి తొమ్మిదేళ్ల మానసిక దివ్యాంగుడైన కుమారుడు అశోక్, పదేళ్ల ప్రమీళ, మూడేళ్ల లతిక, 14 నెలల రుషి ఉన్నారు. అమ్మా...లే అంటూ పిల్లలు దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కాం!
సాక్షి, గుంటూరు: బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కామ్ బయటపడింది. దాదాపు రూ. 52 లక్షల నిధులను ఆసుపత్రి సూపరింటెండ్ ఆశీర్వాదం స్వాహా చేసినట్టు ఆడిట్లో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆశీర్వాదంతో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. దీంతో ఈ ముగ్గురిపై ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్ కేసు పెట్టారు. కాగా, ఆశీర్వాదం ఇటీవలే బదిలీపై వైజాగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. -
ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..
సాక్షి, గుంటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానన్నాడు.. మూడు ముళ్లు కట్టి.. ఏడడుగులు వేసిన బంధాన్ని కాటికి పంపాడు.. భార్యను అతి కిరాతకంగా హతమార్చిన కేసులో భర్తకు జీవిత ఖైదు (బతికున్నంత కాలం) శిక్షను విధిస్తూ... ఆరో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కట్టా కాళిదాసు కథనం మేరకు.. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన మహంకాళి నాగమల్లేశ్వరరావు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మను (25) ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగమల్లేశ్వరరావు భవన నిర్మాణ కార్మికుడిగా ఉండగా వెంకటేశ్వరమ్మ ఇళ్లల్లో పనులు చేస్తుండేది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వివాహం అనంతరం కొద్ది కాలంగా వెంకటేశ్వరమ్మపై భర్త నాగమల్లేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. భార్యను చీటికి, మాటికి కొడుతూ ఉండటంతో వెంకటేశ్వరమ్మ తల్లి వెంకాయమ్మ పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టి సఖ్యత చేసింది. దీంతో భార్యాభర్తలు మార్టూరు వెళ్లి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడకు వెళ్లినప్పటికీ నాగమల్లేశ్వరరావు ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో వెంకటేశ్వరమ్మ తన ఇద్దరు పిల్లలతో మంగళగిరిలోని గండాలయ్యపేటలో నివాసం ఉంటూ ఇంటి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. 2013 ఆగస్టు 24న ఆమె నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చిన నాగమల్లేశ్వరరావు భార్యతో ఘర్షణకు దిగడంతో చుట్టుపక్కలవారు, ఇంటి యజమాని మందలించి పంపించారు. మరుసటి రోజు 25వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో వెంకటేశ్వరమ్మ గదిలో నుంచి బయటకు వచ్చి తన కుమార్తెను బాత్రూముకు తీసుకెళుతున్న క్రమంలో తనతోపాటు కత్తి తెచ్చుకున్న నాగమల్లేశ్వరరావు వెంకటేశ్వరమ్మను విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న అన్న, తల్లి, ఇంటి యజమాని బయటకు వచ్చే సమయంలో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. దీంతో వెంకటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్యపై మృతురాలి సోదరుడు సాంబయ్య మంగళగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ ఆర్.సురేష్‌బాబు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడంతో, కోర్టు మాని టరింగ్ సెల్ ఏఎస్సై గాజుల శివప్రసాద్, టౌన్ పోలీసు స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ పాలపర్తి నరేంద్ర చొరవ చూపారు. కోర్టులో నాగమల్లేశ్వరరావుపై కేసు రుజువు కావడంతో న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ నిందితుడికి జీవించి ఉన్నంతకాలం జీవిత ఖైదు, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
రౌడీషీటర్ కారసాని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో సంచలనం రేకెత్తించిన కాంగ్రెస్ నేత, రౌడీషీటర్ కారసాని శ్రీనివాసరావు హత్య కేసులో ప్రధాన నిందితులైన నల్లపాటి శివయ్య, కత్తి బ్రహ్మారెడ్డిలకు జీవిత ఖైదుతోపాటు, రూ. 4 వేల జరిమానా విధిస్తూ గురువారం గుంటూరులోని ఆరో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ సంచలన తీర్పు ఇచ్చారు. మిగిలిన నిందితులను నిర్దోషులుగా వదిలేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరు గ్రామానికి చెందిన కారసాని శ్రీనివాసరావు తండ్రి వెంకటరత్నం నాయుడు గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన యేటిగడ్డ హనిమిరెడ్డి అనుచరుల చేతిలో 1990లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో హనిమిరెడ్డి అనుచరుడుగా ఉన్న నల్లపాటి అంకమ్మరావు ప్రధాన నిందితుడు. తన తండ్రిని హత మార్చారని పగపెంచుకున్న వెంకటరత్నం కుమారుడు కారసాని శ్రీనివాసరావు పథకం ప్రకారం గుంటూరులోని హరిహరమహల్ థియేటర్ సమీపంలో 1992లో హనిమిరెడ్డిని హత్య చేశాడు. మరో మూడేళ్ళ తరువాత నల్లపాటి అంకమ్మరావును కూడా కారసాని వర్గీయులు ఇమాంవలీతో పాటు మరో ఆరుగురు కలిసి హత్య చేశారు. దీంతో అంకమ్మరావు సోదరుడు నల్లపాటి శివయ్య కారసాని శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు. తన సోదరుడు అంకమ్మరావును దారుణంగా హతమార్చాడని, ఎలాగైనా కారసాని శ్రీనివాసరావును కూడా హతమార్చాలని పథకం రచించాడు. ముందుగా శ్రీనివాసరావుతో పాటు తన సోదరుడిని హతమార్చిన ఇద్దరు నిందితులను 2000 సంవత్సరంలో హతమార్చాడు. ఈ కేసులో శివయ్యకు జీవిత ఖైదు విధించగా, శిక్ష అనుభవించి 2007 అక్టోబరు 1న సెంట్రల్ జైలు నుంచి విడుదలై గుంటూరు చేరుకున్నాడు. అప్పటికే కారసాని కాంగ్రెస్ నేతగా పలు పదవులు నిర్వహిస్తున్నారు. పెదపలకలూరు, గుంటూరులోని కొరిటెపాడు కేంద్రాలుగా చేసుకుని తన అనుచరులతో కలిసి కార్యకలాపాలు సాగిస్తుండేవాడు. అతనిపై అప్పటికే 40 కేసులు నమోదు కావడంతోపాటు అరండల్‌పేట పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. పక్కా ప్రణాళికతో హత్య... తన సోదరుడు హత్యకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న నల్లపాటి జైలు శిక్ష అనంతరం బయటకు వచ్చి వర్గాన్నికూడకట్టే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయిలో హత్యకు రూపకల్పన చేసి పలుమార్లు కారసాని సంచరిస్తున్న ప్రాంతాలు, వెళ్తున్న ఊర్లు వివరాలును ఆరా తీశారు. గుంటూరు నుంచి ఆయా ప్రాంతాలకు వెళుతున్న క్రమంలో కూడా కారసానిని హతమార్చేందుకు రూరల్ ప్రాంతాలకు వెళిన సందర్భాలున్నాయి. అయితే కారసాని పక్కన అనుచరులు, ప్రజలు అధికంగా ఉండటంతో ప్లాన్ విఫలమైంది. ఎలాగైనా కారసానిని హతమార్చాలని శివయ్య గుంటూరు నగరంలోనే ప్లాన్ మార్చారు. అనుచరులతో పాటు బాంబులు, కత్తులు, వేట కొడవళ్లను సిద్ధం చేసుకుని శ్రీనివాసరావు కదలికలపై అనుచరులతో రెక్కీ ప్రారంభించాడు. సుమారు రెండు నెలల రెక్కీ అనంతరం 2008 మార్చి 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిసెంటర్‌లో ఉన్నాడని తెలియడంతో తోటి అనుచరులైన కత్తి బ్రహ్మారెడ్డి, కలుగూరి నాగరాజు, దోమల చిన యాకోబులతో కలిసి బయల్దేరాడు. శ్రీనివాసరావు లీలామహాల్ సెంటర్లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉండగా, తన పక్కన ఉన్న వారితో కలిసి కారసాని టీ తాగేందుకు పక్కనే ఉన్న అమన్ టీస్టాల్ వద్దకు వెళ్లారు. శ్రీనివాసరావు కోసం కాపు కాచి ఉన్న ప్రత్యర్థులు బాంబులు విసిరి వెంటాడి వేట కొడవళ్లతో దారుణంగా నరకడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. శివయ్య, బ్రహ్మారెడ్డిలతోపాటు, మరో 11 మందిని నిందితులుగా చూపుతూ అప్పటి కొత్తపేట సీఐ, ప్రస్తుతం సత్తెనపల్లి డీఎస్పీ ఆర్.విజయభాస్కర్‌రెడ్డి అప్పట్లో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ కొంత మేర జరిగిన తరువాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని మృతుడి బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడంతో కేసు విచారణ నిలిచిపోయింది. ఆరో అదనపు కోర్టు ఏపీపీగా నియమితులైన కట్టా కాళిదాసును నియమించడంతో మృతుడి బంధువులు స్పెషల్ పీపీ డిమాండ్‌ను విరమించుకున్నారు. ఏపీపీ ప్రాసిక్యూషన్ తరుపున సాక్షులను ప్రవేశపెట్టి ప్రాసిక్యూషన్ పూర్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నల్లపాటి శివయ్య, కత్తి బ్రహ్మారెడ్డిలను దోషులుగా తేలడంతో జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
'బ్లాక్' బిజినెస్!
సాక్షి, గుంటూరు: లాలాపేటకు చెందిన శ్రీనివాస్ పోస్టులో వచ్చిన గిఫ్ట్ స్క్రాచ్ కార్డు నిజమని నమ్మి బ్యాంకు అకౌంట్లో రూ.40 వేలు వేసి మోసపోయాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి మిత్రులను సంప్రదిస్తే ఫలితం సున్నా అని తెలుసుకుని ఫిర్యాదు చేయడం మానుకున్నాడు. ఇలా ఎందరో సైబర్ నేరగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. బ్లాక్ బిజినెస్ ఈ పేరు సామాన్య ప్రజలకు కొత్తేమో కాని పోలీసులకు సుపరిచితమే. బ్లాక్ టికెట్..బ్లాక్ మార్కెట్...బ్లాక్ మనీ.. తరహాలోనే సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి సంపాదించిన ధనాన్ని బ్లాక్ బిజినెస్ రూపంలో వెనుకేసుకుంటున్నారు. దీనితో సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు కష్టగా మారింది. ఒకవేళ సైబర్ నేరగాళ్లు దొరికినా నేరస్తులు చేస్తున్న బ్లాక్ బిజినెస్ కారణంగా పోలీసులకు వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేయడం కష్టమవుతుంది. ఫలితంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సామాన్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. వివిధ మార్గాలలో వివరాల సేకరణ దేశంలో స్థిరపడిన నల్లజాతీయులు బ్లాక్ బిజినెస్‌కు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లలో అత్యధికులు ఆఫ్రికా దేశానికి చెందినవారే ఉంటున్నారు. వీరు ఆన్లైన్ మోసాలను ఈ–మెయిల్ మీద ఎస్ఎంఎస్, వాట్సప్ మెసేజ్, ఫోన్ కాల్‌తో ప్రారంభిస్తారు. మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు అనేక మార్గాల ద్వారా సేకరిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా లక్ష ఫోన్ నెంబర్లు ఈ మెయిల్ ద్వారా రూ. 30 వేలకు విక్రయించే వెబ్సైట్లు ఉన్నట్లు సమాచారం. వీటి ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా పక్కా పథకం వేస్తున్నారు. ఖాతాలకు బదులు వాలెట్ల వినియోగం ఈ నైజీరియన్లు స్కీమ్‌లు, పన్నులు, పెట్టుబడులంటూ బాధితుల నుంచి సొమ్ము స్వాహా చేయడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. ఒకప్పుడు కేవలం బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయించుకునే వీళ్లు ఇటీవల కాలంలో వివిధ రకాలైన వాలెట్లను వాడుతున్నారు. వీటిని నైజీరియన్లు నేరుగా తెరిస్తే కేసు నమోదైనప్పుడు పోలీసులకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముంబై, బెంగుళూరు, ఢిల్లీలతో పాటు ఈశాన్య రాష్ట్రాలోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలు, వాలెట్లు తెరిచి, వారి వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీల్లో కమీషన్ ఇస్తారు. ఈ రకంగా కమీషన్ తీసుకుని తమ ఖాతాలు, వ్యాలెట్లను అప్పగించే వారిని సాంకేతిక పరిభాషలో మనీమ్యూల్స్ అంటారు. ఇలా చేయడం ద్వారా ఖాతాలు, వ్యాలెట్లు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య...ఏజెంట్లకు, నైజీరియన్లకు మధ్య ఏలాంటి లింకు లేకపోవడంతో సూత్రధారులు దొరకడం కష్టమవుతుంది. వస్త్రాలు.. వస్తువులు సైబర్ మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును నగదు రూపంలో నైజీరియా తదితర ఆఫ్రికా దేశాలకు పంపడం ఇబ్బదికరం. అలాగని ఇక్కడే ఏ రూపంలో ఉంచిన పోలీసులు వీరు చిక్కినప్పుడు ఆ మొత్తాన్ని, వస్తువులను రికవరీ చేస్తారు. దీంతో మోసగాళ్లు బాధితుల నుంచి స్వాహా చేసిన సొమ్మును వస్తు, వస్త్ర రూపంలోకి మార్చేస్తున్నారు. వీటిని ఎగుమతుల పేరుతో తమ దేశానికి తరలిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ముఠాలో కొందరిని బిజినెస్ వీసాపై భారత్‌కు తీసుకువస్తారు. బాధితుల నుంచి కాజేసిన దాంట్లో కొంత సొమ్ము సైబర్ నేరగాళ్లు తమ వద్ద ఉంచుకుని, మిగిలినదాంతో హోల్‌సేల్‌గా వస్త్రాలు, ఎగుమతికి ఇబ్బంది లేని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని బిజినెస్ వీసాపై వచ్చిన వారికి అప్పగించడం ద్వారా కన్సైన్మెంట్ రూపంలో ఆయా ఆఫ్రికా దేశాలకు పంపిస్తున్నారు. ఆ దేశాలలో వస్త్రాలు, వస్తువులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగానే సైబర్ నేరాలలో నగదు రికవరీ చేయడం అసాధ్యంగా మారుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రజలు అప్పమత్తంగా ఉండటం తప్ప మరొక మార్గం లేదు. అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాల్లో నిందితుల నుంచి రికవరీ చేయడం కష్టంగా మారింది. మోసపోయిన వారు 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే కొంత వరకు ఉపయోగం. నగదు ఆన్లైన్లో బదిలీ చేసినా, వ్యాలెట్లలోకి ట్రాన్స్ఫర్ చేసినా అది క్లియర్ కావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. నేరగాళ్లు ఏటీఎం ద్వారా నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఒకే సారి విత్ర్డ్రా చేయలేరు. వెంటనే బ్యాంకును సంప్రదించడం ద్వారా విత్‌డ్రా కాకుండా ఆపి రికవరీ చేయవచ్చు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలి. –నజీముద్దీన్, ఈస్ట్ డీఎస్పీ -
ఆమెతో వివాహేతర సంబంధం కోసం ఇద్దరి ఘర్షణ!
సాక్షి, చిలకలూరిపేట: వివాహిత మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకొన్న ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది. మండలంలోని మురికిపూడి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ భర్తను వదలి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ఆ మహిళతో ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన ఒక యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాబావలి (29) మురికిపూడిలో బిస్మిల్లా చికెన్ సెంటర్ పేరుతో మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం ఇదే మహిళతో బాబావలికి కూడా పరిచయం ఏర్పడింది. ఇతనితో కూడా ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై బాబావలికి, వేమవరం గ్రామానికి చెందిన వ్యక్తికి తెలిసి గత కొద్ది రోజులుగా ఘర్షణ పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల కిందట ఇద్దరూ మద్యం తాగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబావలిని అడ్డు తొలగించుకోవాలని వేమవరం గ్రామానికి చెందిన వ్యక్తి నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మంగళవారం రాత్రి జాతీయ రహదారి సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో బాబావలితో కలిసి అతిగా మద్యం తాగారు. బాబావలి స్వగ్రామమైన పోలూరుకు వెళ్లకుండా మురికిపూడిలోని మాంసం దుకాణానికి చేరుకుని షట్టర్ వేసుకుని నిద్రించాడు. అదే సమయంలో వేమవరం యువకుడు మహిళ ఇంటికి వెళ్లి బాబావలితో సంబంధం వదులుకోవాలని హెచ్చరించాడు. తన మాట వినని పక్షంలో బాబావలిని హత్యచేస్తానని మహిళను బెదిరించాడు. అనంతరం మద్యం మత్తులోనే చికిన్ దుకాణానికి చేరుకొని షట్టర్ పైకి లాగి మద్యం మత్తులో నిద్రిస్తున్న బాబావలిని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి దారుణంగా హత్య చేశాడు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలు గడిచినా దుకాణం తీయలేదని బాబావలి బంధువులు షట్టర్ తీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ జి.అనీల్‌కుమార్, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రేమ పేరుతో వంచించాడు..
సాక్షి, గుంటూరు: ‘హాయ్ అంటూ ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. మొదట స్నేహంగా.. ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.. పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ముందే పెళ్లయిందని తెలిసి నిలదీస్తే కుటుంబ సభ్యులతో కలసి నాపై దాడి చేశారు’ అంటూ కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ఓ వివాహిత సోమవారం స్పందన కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఏఎస్పీ ఎస్.వరదరాజుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన రావిపాటి వీరయ్య అలియాస్ వినయ్ ఫేస్బుక్లో ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. ఆపై ఆమెతో స్నేహంగా ఉంటూ ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఓ రోజు హడావుడిగా ఆమెను తిరుపతి తీసుకెళ్లి వివాహం చేసుకొని ఇంటికి తీసుకువెళ్లాడు. భర్త మరో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న వినయ్ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వినయ్‌కు ముందుగా వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం ఉన్నారని తెలుసుకుంది. నమ్మించి తనను మోసం చేశావంటూ దీనిపై వినయ్‌ను నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతున్న క్రమంలో అత్తమామలు కల్పించుకొని వివాహితపై దాడికి యత్నించారు. జరిగిన మోసాన్ని గుర్తించిన వివాహిత నేరుగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోకపోవడంతో న్యాయం చేయాలని బాధితురాలు ఏఎస్పీని వేడుకుంది. -
మత్తులో కత్తులతో వీరంగం!
సాక్షి, తాడేపల్లి(మంగళగిరి): పట్టణ పరిధిలోని నులకపేట ప్రాంతంలో స్థానికేతరులు కొంతమంది మద్యంతో పాటు వివిధ రకాల మత్తు పదార్థాలు తీసుకుని, స్థానికంగా నివసించే మహిళలు, విద్యార్థులను ఇబ్బందులకు గురిజేస్తున్నారు. స్థానికులు శనివారం రాత్రి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తులు చూపించి పరారయ్యారు. ఎవరిదారిన వారు వెళ్లిన అనంతరం తిరిగి మరలా ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి వచ్చి కొంతమందిని నిద్రలేపి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మొదట యువకులు కత్తులు తీసుకొని నులకపేట వీధుల్లో వీరంగం వేయడంతో, స్థానికులు అడ్డుకున్నారు. వారు వేసుకొచ్చిన ద్విచక్రవాహనాన్ని, ఆటోను అక్కడే వదిలి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టిన ఆటోను అక్కడ నుంచి తీసుకెళ్లారు. తిరిగి మరలా అదే వాహనంలో వచ్చి స్థానికంగా నివసించే వారిని భయభ్రాంతులకు గురిచేయడంతో, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మత్తులో ఉండి ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా అక్కడే వదిలివెళ్లారు. ఆ వాహనాన్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ వాహనానికి లైట్లు, వెనుక ముందు నంబరు ప్లేటు లేకపోవడం మరో ఎత్తు. ఈ వాహనంతో రాత్రి సమయంలో పెద్దపెద్ద శబ్దాలు చేసుకుంటూ మసీదు దగ్గర ఉన్న ఉర్దూ పాఠశాలలో కూర్చుని గంజాయి తాగి, వచ్చిపోయే ఆడవారిని, విద్యార్థినులను ఏడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే యువకులు మసీదులో ప్రార్థన జరుగుతున్నప్పుడు ద్విచక్ర వాహనానికి సైలెన్సర్ తీసేసి, హడావుడి చేయడంతో, ముస్లిం పెద్దలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పట్లో జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి, నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పరిచారు. మరలా బయటకు వచ్చిన తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న యువకులు మరలా అదే తరహాలో రోడ్లమీద తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. మత్తులో గొడవ పడిన నలుగురు యువకులు పరారీలో ఉండటంతో వారి ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఒంటరి మహిలళే వారి టార్గెట్!
సాక్షి, గుంటూరు: ఒంటరిగా రోడ్డుపై నిలిచి ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఆటోలో ప్రయాణికుల మాదిరిగా ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశాలకు తీసుకెళ్లి దోపిడీ, లైంగికదాడికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు, అతడికి సహకరించిన మరో ముగ్గురు ముఠా సభ్యులను కూడా గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసు స్టేషన్లో ఏఎస్పీ ఎస్.రాఘవ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సత్తెనపల్లికి చెందిన పల్లపు రమేష్, అతడి భార్య దుర్గ, స్నేహితులు తన్నీరు గోపి, నూర్‌బాషా ఖాశింలు ముఠాగా ఏర్పడ్డారు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. అందుకు ఆటోను ఎంచుకుని డ్రైవర్‌గా రమేష్, మిగిలిన ముగ్గురు ప్రయాణికుల్లా రోడ్డుపై వెళుతున్న ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఆటోలో ఎక్కించుకునేవారు. ఈ నెల 2వ తేదీన అమరావతి మండలం 14వ మైలుకు చెందిన ఓ మహిళ నిడుముక్కల గ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తున్న సమయంలో ఆటో ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, బంగారం చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, గురువారం నలుగురు నిందితులు గుంటూరులోని పూలమార్కెట్ సెంటర్లో బంగారం విక్రయించేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించడంతో వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు పల్లపు రమేష్‌పై సత్తెనపల్లి, తెనాలి, గుంటూరు అర్బన్ పరిధిలోని నల్లపాడు పోలీసు స్టేషన్లో మొత్తం 12 కేసులు నమోదయ్యాయని ఏఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకోవాడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీలక్ష్మి, సీఐలు శేషగిరిరావు, మల్లికార్జునరావు, వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మోసం: వయస్సు తప్పుగా చెప్పి పెళ్లి!
సాక్షి, తెనాలి: వయస్సు తప్పుగా చెప్పి మోసం చేసి ఓ యువకుడు తనను వివాహం చేసుకున్నాడని సఫియా అనే యువతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన సఫియాకు తన స్నేహితుల ద్వారా గురజాలకు చెందిన షేక మహమ్మద్ హసన్ పరిచయమయ్యాడు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లు. ఈ నేపథ్యంలో గత డిసెంబరులో వివాహం చేసుకున్నారు. మహమ్మద్ హసన్ తనను పెళ్లి చేసుకునే సందర్భంలో అతని వయసు 22గా చెప్పాడని, అయితే వయసు 19గా తెలిసిందని సఫియా తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ టి. అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. సఫియా, ఆమె కుటుంబసభ్యులు తనను మోసం చేసి, మభ్య పెట్టి వివాహం జరిపించారంటూ మహ్మద్ హసన్ గతంలోనే గురజాల పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అక్కడ ఇప్పటికే కేసు కేసు నమోదైంది. -
ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేసిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ డీఎస్పీతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదైంది. పట్టాభీపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతికి చెందిన బొమ్మనబోయిన ఇంద్రాణి ప్రస్తుతం విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త నాగేంద్రనాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ఆమె గృహిణిగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పీజీ చదివి ఖాళీగా ఉంటున్న ఆమెకు వరుసకు మామయ్య అయిన తెల్లగడ్డల సత్యనారాయణ తనకు పరిచయం ఉన్న సెంట్రల్ ఇంటిలిజెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న కొరడా నాగశ్రీనివాసరావు ద్వారా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రూప్–2 కేడర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ. 15 లక్షలు ఒకసారి, పలుమార్లు ఖర్చుల నిమిత్తం రూ. 8 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్న క్రమంలో డీఎస్పీ నాగశ్రీనివాసరావు ఇటువంటి పనులు చేస్తుంటాడని, డబ్బులు తీసుకుని మోసం చేస్తుంటాడని సమాచారం తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు తన భర్తకు పరిచయం ఉన్న పాలకొల్లు రాజేశ్వరరావుకు తక్కువ వడ్డీకు డబ్బులు ఇప్పిస్తామని నమ్మబలికి పర్సంటేజీ కింద రూ. 9 లక్షలు, ఖర్చుల నిమిత్తం రూ. 14వేలు తీసుకున్నారని ఆరోపించారు. అతనికి సంబంధించి చెక్కులు కూడా ఇచ్చారని, అయితే అవి చెల్లకపోగా, ఉద్యోగం, రుణం కూడా రాలేదని, తమను మోసం చేసిన డీఎస్పీ నాగశ్రీనివాసరావుతో పాటు, తెల్లగడ్డల సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నీళ్లనుకుని లైజాల్ తాగి...
సాక్షి, తెనాలి: నీళ్లనుకుని లైజాల్ (యాసిడ్) తాగి మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన జంపాని అక్కమ్మ (50) పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో, తెనాలి మండలం అంగలకుదురులోని చెల్లి వెంకటేశ్వరమ్మ వద్ద ఉంటోంది. మానసిక రుగ్మతతో బాధపడే ఆమె ఇళ్లలో పనులకు వెళ్తుంటుంది. ఒంట్లో నలతగా ఉండడంతో రెండు రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. తాగునీరనుకుని ఫ్లోర్‌ను కడిగేందుకు వాడే లైజాల్‌ను తాగింది. వాంతులు చేసుకుంటుండడంతో కుటుంబసభ్యులు గమనించారు. తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..
సాక్షి, యనమదల (ప్రత్తిపాడు): సర్వే అంటూ ఇంటి తలుపుతట్టాడు.. బీమా అంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు.. ముఖంపై పౌడర్ చల్లి బంగారు నగలతో ఉడాయించాడు.. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోనికి వెళితే.. యనమదల గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్వరికి ముగ్గురు సంతా నం. అందరికీ వివాహాలు చేసింది, నాలుగేళ్ల కిందట భర్త చనిపోవడంతో యనమదలలో ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం ఉదయం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పిలిచాడు. మీకు పింఛన్ వస్తుందా? రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నాయా? పొలం ఎంత ఉంది? ఆదాయమెంత? అంటూ మాటలు కలిపాడు. మీకు భర్త లేడు కదా..మీకు ఇన్సూరెన్స్ డబ్బులు రూ.16 లక్షలు వస్తాయి, ముందస్తుగా డిపాజిట్‌గా రూ.లక్షా ఇరవై ఐదు వేలు చెల్లించాలని చెప్పాడు. ఇప్పటికప్పుడు డబ్బులు కట్టలేని పక్షంలో మీ దగ్గర బంగారం ఉంటే ష్యూరిటీ కింద ఇవ్వండి, ఫొటో తీసుకుని మీ బంగారం మీకు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. దీంతో మల్లేశ్వరి ఇంట్లోకి వెళ్లి బీరువాలో నాలుగు సవర్ల చంద్రహారం, గొలుసు తెచ్చి ఆగంతకుడికి ఇచ్చింది. ఫొటోలకని మరో రూ.వెయ్యి కూడా ఇచ్చింది. అంతే ఆగంతకుడు మల్లేశ్వరి ముఖంపై పౌడర్ చల్లాడు. దీంతో ఆమె మగతకు గురైంది. తేరుకుని చూసేలోపలే ఆగంతకుడు బైక్‌పై పారిపోయాడు. ఆ వ్యక్తి ఆనవాళ్లను బాధితురాలు పోలీసులకు తెలిపింది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్ ఆత్మహత్య!
సాక్షి, గుంటూరు: చెట్టుకు ఉరి వేసుకుని వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమృతలూరు మండలం పాంచాళవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోనుగుంట్ల లక్ష్మీనారాయణ(35), అదే గ్రామానికి చెందిన దివ్య పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. దివ్య ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారు జిల్లా పోలీసులను ఆశ్రయించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొద్దికాలంగా భార్య దివ్యను పలు మార్లు హింసించడంతోపాటు ఇటీవల లక్ష్మీనారాయణ హత్యాయత్నం చేయడంతో గ్రామస్తులు రక్షించారు. ఈమేరకు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, తెనాలి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. కేసు కోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో బెయిల్‌పై వచ్చిన లక్ష్మీనారాయణ సోమవారం రాత్రి భార్యతో గొడవ పడినట్టు స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా, గుర్తించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని, మృతుని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ విషయంపై అమృతలూరు ఎస్ఐ జి. పాపారావు వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదన్నారు. -
బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): ఆర్టీసీ బస్సులో మహిళ చేతివాటం ప్రదర్శించిన ఘటన మంగళవారం జరిగింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఆర్టీసీ బస్ కండక్టర్ కేబీ పరమానందం తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల డిపోకు చెందిన బస్సు మంగళవారం చేబ్రోలు చేరుకుంది. కండక్టర్ పరమానందం పక్కనే ఓ మహిళ నిలబడి ఉంది. చేబ్రోలు నుంచి నారాకోడూరు వరకు వచ్చే లోపల కొన్ని టిక్కెట్లు కొట్టిన ఆయన చిల్లర కోసం నగదు తీసుకుని ప్రయాణికులకు ఇచ్చారు. నారాకోడూరు నుంచి బస్సు బయలుదేరిన తర్వాత మరికొంత మంది ఎక్కటంతో టిక్కెట్లు ఇచ్చి బ్యాగును తెరవటంతో నగదు కనిపించలేదు. ఉలిక్కిపడ్డ కండక్టర్ పరమానందం ప్రయాణికులను నగదు విషయం అడిగారు. ఎవరిలోనూ స్పందనలేదు. అయితే ఒక మహిళ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో కండక్టర్, డ్రైవర్లు నిలదీశారు. ఈ క్రమంలో ఆమె చీరలో నుంచి నగదు కిందపడటాన్ని గమనించి, మహిళ తీసిందని నిర్ధారణకు వచ్చారు. నేరుగా బస్సును స్టేషన్‌కు తీసుకెళ్లారు. సదరు మహిళను విచారించిన పాతగుంటూరు పీఎస్ ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఆమె పేరు మరియమ్మ అని చెబుతోందని, అయితే అదీ కూడా సరైన పేరు అయి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సదరు మహిళను సీసీఎస్ పోలీసులకు అప్ప గించారు. కేసు చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సదరు మహిళ నుంచి కండక్టర్ రూ.17,400 స్వాధీనం చేసుకున్నారు. -
భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం..!
సాక్షి, తెనాలి: తాళి కట్టిన భర్త, చావు...చావు...అంటూ నిత్యం భౌతిక హింసకు పాల్పడటం, అడ్డుకోవాల్సిన అత్తమామలు ప్రోత్సహించటంతో మనస్తాపానికి లోనైన మహిళ, అందరి కళ్లెదుటే పురుగుమందు తాగి అత్తింటివారి ఆకాంక్షను నెరవేర్చాలని ప్రయత్నించింది. అయితే కోడలు మరణిస్తే, పోలీసు కేసవుతుందని భయపడినవారు హుటాహుటిని వైద్యశాలకు తరలించటంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన తనను వరకట్నం కోసం వేధించి, హింసిస్తూ, పురుగుమందు తాగి చావమంటూ పదేపదే రెచ్చగొడుతూ చావుకు దగ్గర దాకా వెళ్లేలా చేసిన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను వేడుతోంది. స్థానికంగా ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆమె పేరు సునీత. చేబ్రోలు మండలం శేకూరుపాలెం గ్రామం. తండ్రి ఆర్టీసీ డ్రైవరు. తల్లి గృహిణి. ముగ్గురు సంతానంలో చివరి కుమార్తె సునీతను, మండల కేంద్రమైన దుగ్గిరాలకు చెందిన బండి కిశోర్‌కు ఇచ్చి 2017 ఆగస్టులో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.4.5 లక్షల నగదు, అల్లుడుకి వాచి, ఉంగరం ఇచ్చారు. దుగ్గిరాల మండలంలోని చిలువూరులో విద్యుత్ సబ్‌స్టేషనులో కాంట్రాక్టు పద్ధతిపై ఆపరేటరుగా పనిచేస్తుండే కిశోర్, సునీతల కాపురం తొలి నెలరోజులు సజావుగానే సాగింది. తర్వాత నుంచి వేధింపుల పర్వం ఆరంభమైంది. భార్య అనాకారి అయింది. తెచ్చిన కట్నం కంటికి ఆనలేదు. అందంగా లేవు...కట్నం హీనంగా తెచ్చావ్...ఇంటి సామానులు ఏవీ తేలేదు..అంటూ భర్త సణగటం మొదలుపెట్టాడని సునీత చెప్పారు. ఆ విధంగా సూటిపోటి మాటలతో మొదలైన వేధింపుల్లో భాగంగా, ఫోను వాడొద్దని షరతు పెట్టారు. తల్లిదండ్రులతో సహా పుట్టింటి తరఫు నుంచి ఎవరూ ఇంటికి రాకూడదని ఆంక్షలు విధించారు. తర్వాతర్వాత చీటికిమాటికి కొట్టటం ఆరంభించినట్టు సునీత కంటనీరు పెట్టారు. కారణం ఏమీ ఉండదు...బంధువులు ఎవరైనా వచ్చివెళ్లారన్న సాకు చాలు భర్తకు...వరసగా రెండురోజులు అకారణంగా హింసించటం అలవాటు చేసుకున్నాడని ఆరోపించారు. ఇలా హింసాపర్వ కాపురంలో 8 నెలల కిందట వారికి బాబు కలిగాడు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ, ఇప్పటివరకు అత్తమామలు బాబును ఒక్కసారి కూడా కనీసం దగ్గరకు తీసుకోలేదని సునీత చెప్పారు. తనపై హింసను అడ్డుకోలేదన్నారు. అన్నయ్య వచ్చి వెళ్లాడని.. ఈ నేపథ్యంలో గత నెలలో విశాఖపట్నంలో ఉండే అన్నయ్య వచ్చి చెల్లిని, మేనల్లుడిని పలకరించి వెళ్లాడు. సునీత భర్త కిశోర్‌కు గత శనివారం ఈ విషయం మరోసారి గుర్తొచ్చింది. ‘మీ అన్న ఎందుకొచ్చాడు? నువ్వెందుకు రానిచ్చావు?’ అంటూ బాదటం మొదలుపెట్టాడట! సమీప గృహాల్లోని ఎవరో? సునీత తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఫోనులో తెలియపరిచారు. తల్లడిల్లిపోతూ దుగ్గిరాల వెళ్లిన సునీత తండ్రిని పట్టుకుని ‘మా ఇంటికెందుకు వచ్చారు? నేను రావద్దంటున్నా మీరెందుకు వస్తున్నారు’అని అల్లుడే స్వయంగా గద్దించటంతో, కూతురుని ఓదార్చాలని వచ్చిన ఆ తండ్రి మనసు రాయిచేసుకుని తిరిగివెళ్లిపోయాడు. అది కూడా నేరమైందా ఇంటికి... చావు, చావు అంటూ భర్త మళ్లీ మళ్లీ కొట్టటమే కాకుండా, ఎనిమిది నెలల పసికందును ఎత్తి పడేయటంతో బతుకుపై విరక్తి చెందిన సునీత, ఇంట్లోనే ఉన్న కలుపు నివారణ మందు ‘గ్లైసిల్’ తాగేసింది. ఆ బాధతో యాతన పడుతున్న ఆమెను చూసి ‘యాక్టింగ్’ అని ఎగతాళి చేశారంట! అనుమానించిన మామ, ‘ఆస్పత్రికి తీసుకెళ్లండ్రా...చస్తే కేసవుతుంది...!’ అని హెచ్చరించటంతో తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అక్కడే కోలుకుంటోంది. విచారించటానికి వచ్చిన పోలీసులకు భర్త చేసిన దారుణాలను ఏకరువు పెట్టి, కేసు నమోదుచేసి, న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు చెప్పారు. -
పోలీసునంటూ షాపులో దౌర్జన్యం
సాక్షి, గుంటూరు: సెల్ టెంపర్ గ్లాసు వేయించుకుని, డబ్బులు అడిగిన షాపు యజమానిని ‘నేను పోలీస్’ అంటూ కొట్టి షాపులోని కొన్ని సామాన్లు ఎత్తుకుపోయిన ఓ వ్యక్తిపె బాధితుడు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పంగడిగుంటలో నివసించే వెనిగళ్ల కిరణ్ మహిళా కళాశాల రోడ్డులో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మహ్మద్ అబ్దుల్ సిరాజ్ అనే వ్యక్తి షాపునకు వచ్చి సెల్ ఫోన్ పై టెంపర్ గ్లాసు వేయమన్నాడు. గ్లాసు సెల్‌ఫోన్‌కు బిగించుకున్న అనంతరం డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నాడు. కిరణ్ అతనిని డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు అబ్దుల్ సిరాజ్ తాను కానిస్టేబుల్‌ను అని చెప్పి డబ్బులు ఇవ్వనన్నాడు. కిరణ్ అదేమిటని ప్రశ్నించడంతో ఇరువురికి గొడవ జరిగింది. కిరణ్‌పై అబ్దుల్ సిరాజ్ చేయిచేసుకుని షాపులోని సెల్ సామగ్రి కొన్నింటిని తీసి తన బండిలో పెట్టుకుని వాహనం నడుపుకుంటూ వెళ్లి పోయాడు. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న కిరణ్ వెళ్లిపోతున్న అబ్దుల్ సిరాజ్‌ను వెనుక నుంచి సెల్‌ఫోన్‌తో ఫొటో తీశాడు. దీనిపై కిరణ్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిరాజ్ బాగా మద్యం తాగి ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మదరసాలో కీచకపర్వం
సాక్షి, దాచేపల్లి: మదరసాలో చదువుకునేందుకు వచ్చిన బాలికపై మదరసా నిర్వాహకుడు కన్నేశాడు. బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలోని చాపలగడ్డ మదరసాలో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకొచ్చింది. విషయం తెలుసుకున్న ముస్లిం మతపెద్దలు, నాయకులు మదరసా వద్ద ఆందోళనకు దిగారు. స్థానికులు, ముస్లిం నేతల కథనం ప్రకారం.. ఆలిం కోర్సు చదివేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది బాలికలు మదరసాలో చేరారు. షేక్ ముఫ్తీ అబ్దుల్ సత్తార్ దీనిని పర్యవేక్షిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. మదరసాలోని 17 ఏళ్ల బాలికపై ఆయన కన్నేసి.. కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి బాలిక, సత్తార్ కలిసి ఉండటాన్ని మిగతా విద్యార్థినులు గమనించి నిలదీశారు. ఈ విషయం ముస్లిం మతపెద్దలు, నాయకుల దృష్టికెళ్లడంతో వారంతా శుక్రవారం మదరసా వద్దకు వచ్చి అబ్దుల్ సత్తార్, అతని కుటుంబ సభ్యులను నిలదీశారు. వారం కిందటే తాను బాలికను వివాహం చేసుకున్నట్లు అబ్దుల్ సత్తార్ చెప్పాడు. మత సంప్రదాయాలకు విరుద్ధంగా, మైనార్టీ కూడా తీరని బాలికను ఎలా వివాహం చేసుకున్నావంటూ వారు నిలదీయటంతో అక్కడ నుంచి ఉడాయించాడు. పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఈ విషయంపై ముస్లిం మతపెద్దలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. మదరసా ఖాళీ చేయాలని డిమాండ్ చేయడంతో అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తల్లిదండ్రులను పిలిపించి మదరసా నుంచి పిల్లలను పంపించారు. అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులను బయటకు పంపేలా.. మదరసా నిర్వహణకు సహకారం అందించే ముస్లింలతో పాటు మతపెద్దలు తీర్మానం చేశారు. గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ కోటేశ్వరరావు కూడా మదరసాను సందర్శించి జరిగిన వ్యవహారం గురించి ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో బాధిత బాలిక వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అబ్దుల్ సత్తార్ తనను బెదిరించి లైంగిక దాడి చేసి.. బలవంతంగా వివాహం చేసుకున్నాడని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘కోడెల కాటు’ బాధితులెందరో!
సాక్షి, గుంటూరు: ప్రతి పనికీ ఓ రేటు కట్టి కే–ట్యాక్స్ పేరుతో ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. అధికారం అండతో ఆ కుటుంబం సాగించిన దుర్మార్గాలు, దౌర్జన్యాలను ఎదురించే పరిస్థితి లేక అప్పట్లో వారంతా మిన్నకుండిపోయారు. వారిలో కొందరు ఇన్నాళ్లకు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తాము మోసపోయిన విషయాన్ని ధైర్యంగా చెప్పకోలేని బాధితులు ఇంకా అనేకమంది ఉన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేతిలో దోపిడీకి గురైన పలువురు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కొందరు, అపార్టుమెంట్ నిర్మాణాల సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఇంకొందరు బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 18 కేసులు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై ఇప్పటివరకూ 18 కేసులు నమోదయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్, రైల్వే, మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమ నుంచి సొమ్ములు తీసుకున్నారని నిరుద్యోగులు, తమ పొలాలు, భూములను కబ్జా చేశారని రైతులు, భూ యజమానులు, తమ నుంచి కే–ట్యాక్స్‌లు వసూలు చేశారని బిల్డర్లు, మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు కోడెల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేశారు. కోడెల కుమారుడి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ నరసరావుపేటకు చెందిన కేబుల్ ఆపరేటర్ ఎనుగంటి వెంకట కృష్ణారావు పోలీసులను ఆశ్రయించారంటే ఆ కుటుంబం అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసి కోడెల కుటుంబం అరాచకాలపై విచారణ జరిపిస్తే మరికొందరు బాధితులు బయటకు వస్తారని చెబుతున్నారు. సత్తెనపల్లిలో నమోదైన ఓ కేసులో బాధితుడి నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి రాజీ చేసుకోగా.. ఇంకా 17 కేసులు ఆ కుటుంబంపై ఉన్నాయి. -
గొడ్డలితో యువకుడి వీరంగం
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట మీద ఆవారాగా తిరిగే యువకుడు ఓ మహిళను చంపుతానంటూ గొడ్డలి పట్టుకొని శుక్రవారం రాత్రి వీరంగం వేశాడు. ఆమె 100కు డయల్ చేయడంతో, సమాచారం అందుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఘటన స్థలానికి వెళ్లారు. యువకుడు ఆయన పైకి గొడ్డలి విసిరేసి, అనంతరం దాడి చేశాడు. ఘటనపై కానిస్టేబుల్‌తో పాటు, సదరు మహిళ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గిరిజాల సునీత ఎన్టీఆర్ కరకట్ట మీద నివాసం ఉంటోంది. కుటుంబ పోషణ నిమిత్తం దగ్గరలో ఉన్న అక్వేరియం షాపులో పని చేస్తోంది. దాని కింద నాగపోగు దయానందరాజు నివాసం ఉంటున్నాడు. సునీత భార్యకు తన మీద ఏదో చెప్పిందనే వంకతో చంపుతానంటూ గోల గోల చేస్తూ, ఇంట్లో నుంచి గొడ్డలి తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. సునీత అక్కడ నుంచి పారిపోయి బకింగ్ హామ్ కెనాల్ వద్ద ఉన్న ముళ్లపొదల్లో దాక్కొని 100కు డయల్ చేసింది. ఉన్నతాధికారులు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడ దగ్గరలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యం.వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి వెళ్లారు. ద్విచక్ర వాహనం పార్కింగ్ చేస్తుండగానే, దయానంద రాజు చేతిలో ఉన్న గొడ్డలిని ఆయన పైకి విసిరేశాడు. అనంతరం పరిగెత్తుకుంటూ వచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్ది రోడ్డు మీద ఉన్న ఓ పైప్‌తో దాడి చేశాడు. హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడని తెలియడంతో పోలీస్‌స్టేషన్ నుంచి ఘటన స్థలానికి నలుగురు పోలీసులు వెళ్లగా, వారిపై కూడా దురుసుగా ప్రయత్నించాడు. తనను కొడితే మిమ్మల్నేం చేయాలో తెలుసంటూ రోడ్డుపై పడుకున్నాడు. కానిస్టేబుల్స్ బలవంతంగా జీపులో ఎక్కించి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా, స్టేషన్ దగ్గర సైతం వీరంగం వేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో కూడా దయానందరాజు పక్క ఇంటి వారిపై దాడిచేసి, తండ్రి, కూతుళ్లను రాడ్డుతో తల పగలగొట్టాడు. దయానందరాజు ఎన్టీఆర్ కరకట్ట మీద రెండున్నర సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఆరుగురిపై దాడికి పాల్పడ్డాడు. అయినా ఒక్క కేసే నమోదవ్వడం విశేషం. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య
సాక్షి, కొల్లూరు: ఉరేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్లూరు శివారు గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న కొల్లూరి ఉదయలక్ష్మికి (28) గతంలో వివాహమైంది. భర్తతో విభేదాలు తలెత్తడంతో గాంధీనగర్‌లో కొల్లూరుకే చెందిన లారీ డ్రైవర్ యార్లగడ్డ నవీన్ కుమార్‌తో సహజీవనం చేస్తోంది. తాజాగా నవీన్‌కుమార్‌తో వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుంది. అదే సమయానికి వచ్చిన నవీన్‌కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వైద్యశాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరి మహిళలే అతని టార్గెట్
సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని నమ్మకంగా ఆటోలో ఎక్కించుకొని నిర్జన ప్రదేశంలో వారిని దోచుకోవడంతో పాటు అత్యాచారాలకు పాల్పడుతున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని రూరల్ జిల్లా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లాలో ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డారు అనే వివరాలను సేకరిస్తున్నారు. నేరాలకు పాల్పడుతుందిలా... సత్తెనపల్లి రూరల్ మండలం నందిగం గ్రామానికి చెందిన రమేష్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. మహిళల్ని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అతని భార్య దుర్గ, స్నేహితులు పట్టి ఖాశీం, గోపీలతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. రాత్రిపూట సత్తెనపల్లి నుంచి సమీప గ్రామాలకు వెళ్లేందుకు వేచిఉన్న మహిళల్ని ఎంపిక చేసుకుంటారు. ఆమె వద్ద బంగారం వస్తువులు ఉన్నట్లయితే ఇక ఆటోలో ఎక్కించుకునేందుకు వారి పథకం అమలు చేస్తారు. ఆటోను రమేష్ నడుపుతూ అందులో ప్రయాణికుల మాదిరిగా దుర్గ, ఖాశీంలు ఎక్కి కూర్చుం టారు. నుంచున్న ఆమె చెప్పిన గ్రామానికి తమ ఆటో వెళుతుందని నమ్మించి ఎక్కించుకుంటారు. కొద్ది దూరం వెళ్లాక గోపీ కూడా ఆటు వైపు వెళుతున్నట్లుగా ఆటోలో ఎక్కుతాడు. తర్వాత గ్రామ శివారుకు తీసుకువెళ్లి నిర్జన ప్రదేశంలో ఆటోను నిలిపి మూకుమ్మడిగా మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం,డబ్బు దోచుకుంటారు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అమరావతి నుంచి ఆటోలో గుంటూరుకు వస్తున్న నలుగురు నిందితులు ఈనెల 2వ తేదీ రాత్రి 14వ మైలు వద్ద వేచిఉన్న ఓ మహిళను నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. తాడికొండ అడ్డరోడ్డు సమీపంలోని నిర్జన ప్రాంతంలో ఆటోను నిలిపి ఆమె వద్ద ఉన్న 4 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.400 లాక్కొని, రమేష్ దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మహిళ సమీపంలోని ఓ మిల్లు వద్దకు పరుగులు తీయడంతో వారు ఆటోలో పరారయ్యారు. ఈ మేరకు తాడికొండ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో రమేష్ రాజధానిలో ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే అర్బన్, రూరల్ ఎస్పీలు సీరియస్‌గా పరిగణించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీఎస్ పోలీసులతో కలసి మొత్తం ఏడు ప్రత్యేక బృందాల్ని కేటాయించారు. ఈ క్రమంలో ఈనెల 10న రమేష్, మరో ఇద్దరు యువకులు సత్తెనపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిలో రమేష్ మినహా మిగిలిన ఇద్దరి ప్రమేయం లేదని తేలడంతో వారిని విచారించి వదిలేసినట్లు తెలిసింది. భర్తకు దోపిడీలు, అత్యాచారాల్లో సహకరిస్తున్న దుర్గ, మిగిలిన ఇద్దరు స్నేహితుల కోసం గాలిస్తున్నారు. రమేష్‌ను పోలీసులు వారిదైన శైలిలో విచారిస్తున్నారు. విచారణలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు తెలిసింది. ఇలాంటి నేరాలకు ఎప్పటి నుంచి పాల్పడుతున్నారు ? ఫిర్యాదులు చేసేందుకు ధైర్యం చేయలేని మహిళలను ఎంతమందిని అత్యాచారం చేశారు ? జిల్లాలో ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడ్డారు? అనే అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం. -
కారు పంక్చర్..చూస్తే రూ.కోటి విలువ గల..
సాక్షి, యడ్లపాడు(గుంటూరు) : కారులో తరలిస్తున్న 242 కిలోల గంజాయి నిల్వల్ని స్థానికుల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మండల కేంద్రమైన యడ్లపాడులో శుక్రవారం జరిగింది. తెల్లవారుజాము సుమారు 5.30 గంటల మధ్యలో కారు టైరు పగలడంతో గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ బ్రిక్స్ తయారీ ప్రాంగణంలో దానిని గుర్తుతెలియని వ్యక్తులు నిలిపారు. ఆ కారును గమనించిన బ్రిక్స్ కంపెనీ కార్మికులు ఆ వాహనాన్ని అక్కడి నుంచి తీయాలని, తమ ట్రాక్టర్ వస్తుందని చెప్పారు. అయితే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ బ్యాగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అనుమానం వచ్చిన కార్మికులు వారిని కొద్దిదూరం వెంబడించారు. బోయపాలెం మెయిన్ సెంటర్‌వైపు వెళ్లిన ఇద్దరు కనిపించలేదు. దీంతో అనుమానంతో కారులో పరిశీలించగా ప్యాక్ చేసిన గంజాయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. యడ్లపాడు ఎస్ఐ జె.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించారు. గంజాయి నిల్వలు కనిపించడంతో క్రేన్‌ను తెప్పించి కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎక్సైజ్ సీఐ బి.లత, ఎస్ఐలు ఎస్ఐ జె.శ్రీనివాస్, షరీఫ్ కారులోని గంజాయ్ ప్యాకెట్లను బయటకు తీయించారు. 121 ప్యాకెట్లలో గంజాయి కారులోని వెనుక సీటు, కింద, వెనుక డిక్కీభాగంగా మొత్తం 121 ప్యాకెట్లలో ఉన్న 242 కిలోల గంజాయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కారు రాజమండ్రి నుంచి చైన్నె వైపు వెళ్తోందని పోలీసులు భావిస్తున్నారు. తమ పరిధిలో స్థానికుల ద్వారా పట్టుబడిన కారును మంగళగిరి పోలీసులు వెంబడించారని, అంతేకాకుండా వారు గంజాయి నిల్వలున్న మరోకారుతో పాటు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దీంతో తాము స్టేషన్‌కు తరలించిన కారు, గంజాయి నిల్వల్ని మంగళగిరి పోలీసులకే అప్పగిస్తున్నామని ఎస్ఐ జె.శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. కారుటైర్ పగలడంతో పట్టుబడ్డారు... గుంటూరు వైపు నుంచి హైవే పోలీసులు వెంబడిస్తున్న క్రమంలో దారి తప్పించి 16వ నంబర్ జాతీయ రహదారిలోకి ప్రవేశించిన గంజాయి లోడు కారు విశ్వనగర్ నగర్ వద్ద పోలీసుల తనిఖీలను గమనించి సర్వీసురోడ్డులోకి దిగి నేరుగా అదేమార్గంలో వెళ్లకుండా అండర్‌పాస్ వంతెన కిందగా అవతలి వైపు రోడ్డులోకి వెళ్లారు. బోయపాలెం దాటి వంకాయలపాడు క్వారీ రోడ్డు సమీపంలో సర్వీసు రోడ్డుపై కంకరరాళ్లు ఎక్కువగా ఉండటంతో కారు ముందు టైర్ పగిలింది. కారుటైరుకు పంక్చర్ వేయించుకోవడానికి తిరిగి వంకాయలపాడు అండర్‌పాస్ వంతెన కిందుగా బోయపాలెం వైపు వెనక్కు తిప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గ్రామం ప్రారంభంలోనే ఉన్న బ్రిక్స్ కంపెనీ లోనికి పోనిచ్చారు. బ్రిక్స్ లోడింగ్‌కు వచ్చే ట్రాక్టర్లకు అడ్డొస్తుందన్న భావనతో కారును పక్కకు పెట్టాలని కార్మికులు గట్టిగా చెప్పడంతో భయపడ్డ కారులోని వ్యక్తులు తమ బ్యాగుల్ని తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గంజాయి ముఠా హల్చల్ మంగళగిరి : గంజాయి ముఠా దాష్టీకానికి తెగబడింది. విశాఖ మన్యం నుంచి చెన్నైకు శుక్రవారం ఉదయం కారులో గంజాయి తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన రెవెన్యూ, పోలీసు అధికారులు ముఠాను పట్టుకునేందుకు మండలంలోని కాజ టోల్గేట్ వద్ద మాటు వేశారు. వాహనం టోల్గేట్ వద్దకు రాగా అధికారులు తనిఖీ చేసేందుకు యత్నిస్తుండగా.. డ్రైవర్ వేగంగా వెళ్లి టోల్గేట్ వద్ద అడ్డుగా ఉంచిన ఇనుప కడ్డీని ఢీకొట్టి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గుంటూరు, చిలకలూరిపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యడ్లపాడు వద్ద వాహనాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనానికి పైలెట్‌గా ఉన్న మరో ముఠా కారును కాజ టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు నిందితుల్ని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు.. మహిళలపై దాడి
పిడుగురాళ్ల (గురజాల)/రావికమతం (చోడవరం): రాష్ట్రంలో టీడీపీ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎంత సంయమనంతో వ్యవహరిస్తున్నప్పటికీ టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం చేçస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లా, పిడుగురాళ్లలో వైఎస్సార్సీపీకి చెందిన మహిళలపై కత్తులతో దాడికి యత్నించారు. విశాఖ జిల్లా చోడవరంలో ఆరు ఎకరాల్లో జీడితోటలు ధ్వంసం చేశారు. వీటిపై కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల పట్టణ శివారులోని జగ్జీవన్‌రామ్ కాలనీలో గత ఎనిమిదేళ్ల నుంచి పలువురు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు నివసిస్తున్నారు. ఇదే కాలనీలో ఉండే దొప్పలపూడి సిరి, తాడేపల్లి నాగేశ్వరరావు, చల్లా రామకృష్ణలతో పాటు మరికొందరు టీడీపీ నాయకులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకుంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. మేము చెప్పిందే జరగాలంటూ దౌర్జన్యాలు చేసేవారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాలనీకి చెందిన మహిళా కార్యకర్తలు కొంగని ప్రశాంతి, దుర్గంపూడి సైదమ్మ, కొమ్మరి ప్రమీల తదితరులు ఒక బృందంగా ఏర్పడి స్థానిక ఎమ్మెలేకాసు మహేష్‌రెడ్డిని కలసి తమ సమస్యలను వివరించారు. వెంటనే స్పందించిన ఆయన మంచి నీటి కోసం నాలుగు బోర్లు వేయించారు. వందకు పైగా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మరో ప్రధాన సమస్య అయిన రోడ్డును త్వరలో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ కాలనీలో టీడీపీకి చెందిన తాము పెత్తనం చేయాల్సింది పోయి మహిళలైన మీరు పెత్తనం చేయడం ఏమిటంటూ టీడీపీ నాయకులు బుధవారం అర్ధరాత్రి కత్తులతో దాడులు చేసేందుకు పన్నాగం పన్నారు. దీన్ని గమనించిన కొంగని ప్రశాంతి సీఐకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. పోలీసు వాహనం అక్కడి చేరుకునేలోపు టీడీపీ నాయకులంతా పారిపోయారు. పోలీసులు సమయానికి రాకపోతే తమను కత్తులతో పొడిచి చంపేవారని సీఐకు మహిళలంతా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ సురేంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అల్లరి మూకల పట్ల చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ధైర్యం చెప్పారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ప్రశాంతి తెలిపారు. రాత్రికి రాత్రి జీడి తోట ధ్వంసం విశాఖ జిల్లా చినపాచిల గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన పోలవరపు ఈశ్వరరావు కౌలుకు చేస్తున్న ఆరెకరాల భూమిలో మూడేళ్ల వయస్సుగల జీడి తోటను బుధవారం రాత్రి టీడీపీ నేతలు సమూలంగా పీకి పారేశారు. దీంతో బాధిత రైతు కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని టీడీపీ నాయకుడు తన భార్యకు, బంధువులకు ఒంటరి మహిళల కింద పెన్షన్ పొందుతుండటంపై గత నెలలో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అక్కసుతో వైఎస్సార్సీపీ కార్యకర్త సత్యారావుపై గత నెలలో దాడిచేసి గాయపరిచారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ కోమటి శంకర్రావు, నాయుడు పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు అన్నంత పని చేయించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో రైతు ఈశ్వరరావు పేర్కొన్నారు. రాళ్లు రప్పలుతో ఉన్న బీడు భూమిలో రెక్కలు ముక్కలు చేసుకుని జీడితోటను సాగు చేస్తున్నామని, ఇప్పుడు ఒక్క రాత్రిలో ధ్వంసం చేశారని, తమ జీవనాధారం పోయిందని వాపోయారు. -
రెండు నెలల్లో 70 గేదెలు మాయం
సాక్షి, అచ్చంపేట(గుంటూరు) : గేదెలను అపహరిస్తున్న దొంగలను మండలంలోని పుట్లగూడెం గ్రామస్తులు పట్టుకుని బుధవారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రెండు మూడు నెలలుగా మండలంలో గేదెల దొంగతనాలు ఎక్కువయ్యాయి. రాత్రి సమయాలలో ఇళ్ల ముందు కట్టేసిన గేదెలను, పగటి పూట పొలాలు వెళ్లిన గేదెలు, ఆవులను కొంతమంది దొంగలించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. పుట్లగూడానికి చెందిన సుమారు 15 గేదెలు గత రెండు నెలలకాలంలో మాయమయ్యాయి. రెండు మూడు రోజులుగా గ్రామస్తులు దొంగలను పట్టుకోవాలన్న తపనతో కాపుకాసి రాత్రి గస్తీ తిరిగారు. మంగళవారం రాత్రి మినీలారీలో 4 గేదేలు తరలించడం చూసిన గ్రామస్తులు వారిని వెంబడించి చల్లగరిగ వద్ద అటకాయించారు. అవి అపహరించబడిన గేదెలుగా గుర్తించి అచ్చంపేట ఎస్ఐకి సమాచారం అందచేశారు. ఎస్ఐ తన సిబ్బంది సహాయంతో లారీని, గేదెలను, నిందితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండు నెలల కాలంలో సుమారు 70కి పైగా గేదెలు అచ్చంపేట పరిసర గ్రామాల్లో చోరీకి గురయ్యాయి. అచ్చంపేట రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మరమెల ప్రసాదరావు, మార్టూరి నరసింహస్వామి, చిట్టేటి జాన్సీ అనే వారు తమ గేదెలు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పట్టాభిరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా.. నాన్న చంపేస్తాడు.. వెళ్లిపోదాంపద!
సాక్షి, గుంటూరు, విజయవాడ : ప్రేమించి పెళ్లాడిన భర్త ఆరేళ్ల తర్వాత వదిలేసి మరొక యువతితో సహజీవనం చేస్తున్న వ్యవహారాన్ని భార్య వెలుగులోకి తీసుకొచ్చిన ఘటన తాడేపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. భర్త మరో యువతితో సహజీవనం చేస్తూ, తాడేపల్లి పట్టణ పరిధిలోని గౌతమి అపార్టుమెంట్లో అద్దెకుంటున్న ఇంటివద్ద తన కూతురితో కలిసి రెండు గంటల పాటు ధర్నా చేసింది. బాధిత యువతి చెప్పిన వివరాల ప్రకారం... విజయవాడలో నివసించే సూరపనేని చైతన్య, సరితకు 6 సంవత్సరాల కిందట పరిచయమయ్యాడు. పరిచయమైన నెలరోజులకే వివాహం చేసుకుంటానంటూ వెంటబడి, తన తల్లి శైలజతో ఇంటికొచ్చి పెద్దలను ఒప్పించి, 13–08–2013న వివాహం చేసుకున్నాడు. అనంతరం ఓ పాప పుట్టగానే కట్నం డబ్బులతో పాటు ఒంటిమీద ఉన్న బంగారాన్ని సైతం వ్యాపారం పెట్టాలని తీసుకొని ఉడాయించాడని సరిత కన్నీరుమున్నీరుగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. నెల రోజుల క్రితం విజయవాడలో ఓ అమ్మాయితో కనిపిస్తే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టామని, నా పక్కన ఎటువంటి అమ్మాయి లేదని బుకాయించాడని, తిరిగి మరలా తాడేపల్లి బైపాస్‌రోడ్డులోని గౌతమి అపార్ట్మెంట్లో వేరే అమ్మాయితో నివాసం ఉంటున్నాడని తెలిసి, ఇక్కడకొచ్చి చూడగా ఇక్కడే ఉన్నాడని తెలిపింది. ఇంట్లో నుంచి బయటకు రమ్మంటే రావడంలేదంటూ సరిత తెలియచేసింది. విషయం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నా నిర్వహిస్తున్న సరితను విరమించి, పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరగా, ముందు ఇంట్లో ఉన్న చైతన్యను, సహజీవనం చేస్తున్న మహిళను బయటకు తీసుకురావాలంటూ డిమాండ్ చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా చైతన్యను అరెస్టు చేస్తేనే ఇక్కడ నుంచి కదులుతానంటూ భీష్మించుకుకూర్చోడంతో పోలీసులు చేసేదేం లేక సూరపనేని చైతన్యను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ సమయంలో సరిత ఇట్లాంటి మోసగాడ్ని చెప్పులతో కొడితే తప్ప బుద్ధిరాదని, కోటి రూపాయల కట్నం తీసుకొని, ఒక కూతుర్ని కన్నతర్వాత ఇద్దరి జీవితాలను నాశనం చేసాడని, చెప్పు తీసుకొని చైతన్య వెంట పడింది. పోలీసులు ఆమె ప్రయత్నాన్ని నిలువరించారు. అమ్మా... నాన్న చంపేస్తాడు... వెళ్లిపోదాంపద... సరితతోపాటు ధర్నా చేస్తున్న ఆరేళ్ల పాప అమ్మా, నాన్న చంపేస్తాడు. మనం ఇక్కడ నుంచి పారిపోదాంపద. నాన్న ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నాడు. నాకు కనిపించాడు. నాకు వేలు చూపిస్తున్నాడు. అంతకుముందు కొట్టినట్టు నిన్ను, నన్ను ఇద్దర్నీ కొడతాడు. నువ్వు ఏడుస్తుంటే అందరూ మన వంకే చూస్తున్నారు. అలా నువ్వు ఏడవకు. మనిద్దరం వేరే ఉందాం పద అంటూ కూతురు తల్లిని పట్టుకొని బతిమిలాడుతుంది. తల్లి సరిత కూతురితో దిగిన ఫొటోలను మీడియా వారికి చూపిస్తుంటే, ఆ ఫొటోలు చూపించవద్దంటూ ఆ పాప మారాం చేసింది. చివరకు తండ్రి రాకను గమనించిన ఆ చిన్నారి తల్లిని విడిచిపెట్టి పరుగులు తీస్తూ కారెక్కి కూర్చుంది. అక్కడున్న వారందరూ పాప భయాన్ని చూసి ఒక్కసారిగా ఆందోళన చెందారు. చిన్న పాపను ఏ విధంగా హింసించాడో దీన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది. -
చిన్నారిని చిదిమేసిన ట్రాక్టర్
సాక్షి, తెనాలిరూరల్: అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారుల్లో ఒకరిని మృత్యువు రూపంలో పొంచి ఉన్న ట్రాక్టర్ కబళించింది. ఇంజిన్ స్టార్ట్ అయి, ట్రాక్టర్ ముందుకు కదులుతుండడంతో ఆందోళనకు గురైన బాలుడు కేకలు వేస్తుండగా, ఆ బాలుడిని రక్షించేందుకు వచ్చిన వారిలో ఓ తల్లి, తన బిడ్డ ట్రాక్టర్ చక్రాల కింద నలిగిపోయి ఉండడం చూసి నిర్ఘాంతపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఏకైక కుమారుడి పార్థివదేహాన్ని తన పొత్తిళ్లల్లోకి తీసుకుని బోరుమని విలపించింది. మూడేళ్ల బాలుడు ఇంజిన్ స్టార్ట్ చేయగా, 18 నెలల బాలుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. తెనాలి పట్టణం చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన కందుకూరి సులోచన తన భర్త రోశయ్యతో మనస్పర్థల కారణంగా విడిపోయి, 18 నెలల కుమారురు పవన్‌తో సహా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తన స్నేహితురాలయిన అమరావతి ప్లాట్స్‌కు చెందిన తిరుపతమ్మ క్యాటరింగ్ పనులకు వెళుతుండడంతో, జీవనోపాధి కోసం సులోచనా కూడా వెళుతోంది. వారం రోజులుగా అమరావతి ప్లాట్స్‌లో స్నేహితురాలి వద్దే కుమారుడితో కలసి ఉంటోంది. పవన్, స్థానికంగా ఉన్న కొంత మంది చిన్నారులు అక్కడికి సమీపంలోని ఖాళీ స్థలంలో రోజూ ఆడుకుంటుండేవారు. ఈ క్రమంలోనే సోమవారం అందరూ కలసి ఖాళీ స్థలంలోని ఇసుక గుట్టల వద్ద ఆడుకుంటున్నారు. పవన్‌తో పాటు లోకేష్ అన్న పేరు గల ఇద్దరు చిన్నారులూ అక్కడ నిలిపి ఉన్న ట్రాక్టర్ వద్ద ఆడుకుంటున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ఓ బాలుడు(పేరు లోకేష్) ట్రాక్టర్‌పైకి ఎక్కి డ్రైవరు సీటులో కూర్చున్నాడు. తాళాలు వాహనానికే ఉండడంతో తెలిసీ తెలియక తిప్పాడు. వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయి, ట్రాక్టర్ ముందుకు కదులుతుండగా, ఆందోళనకు గురైన లోకేష్ కేకలు వేస్తుండడంతో అక్కడికి సమీపంలోని ఇళ్లలో ఉన్న వారు పరుగు పరుగున ట్రాక్టర్ వద్దకు చేరుకున్నారు. సులోచనా అక్కడకు వెళ్లి, కదులుతున్న ట్రాక్టరుపై ఉన్న లోకేష్‌ను దించేందుకు ప్రయత్నించింది. వాహనం ముందుకు వెళ్లాక చూడగా, దాని కిందే తన ఏకైక కుమారుడు నలిగిపోయి ఉండడంతో షాక్‌కు గురైంది. బిడ్డ మృతదేహాన్ని పొత్తిళ్లలోకి తీసుకుని గుండలవిసేలా కన్నీరు పెట్టింది. భర్తతో విభేదాల వల్ల విడిగా ఉంటున్నా, బిడ్డే తనకు సర్వస్వం అనుకుని, వాడి ఆలనా పాలనాకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పనులకూ వెళుతోంది. అలాంటిది ఆ కుమారుడే మృత్యు ఒడిలోకి వెళ్లడంతో తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తోంది. సమాచారమందుకున్న త్రీ టౌన్ సీఐ బి.హరికృష్ణ ఘనాస్థలాన్ని పరిశీలించారు. విరాలు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ట్రాక్టరును నిర్లక్ష్యంగా ఉంచిన యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సరైన ఉద్యోగం లేదని ఆత్మహత్య
పట్నంబజారు(గుంటూరు): మంచి ఉద్యోగం లేదని ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. కొత్తపేట పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... రైలుపేటలోని ప్రతాపగిరి వారి వీధిలో నివాసం ఉండే తిరుమలశెట్టి అనిల్‌కుమార్ (37) లక్ష్మీపురంలోని విజేత సూపర్ మార్కెట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య చంద్రకళ, ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే తనను చిన్ననాటి నుంచి సరిగా పెంచలేదని, అందుకే చాలీచాలని చిన్నపాటి ఉద్యోగంలో బతుకు వెళ్లదీయాల్సివస్తోందంటూ మనోవేదన చెందుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారాడు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి వచ్చిన అనిల్‌కుమార్ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బెడ్రూములోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయితే మద్యం తాగి ఉన్న అతను నిద్రిస్తున్నాడని కుటుంబ సభ్యులు భావించారు. తెల్లవారి లేచి చూసే సరికి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించగా కొత్తపేట ఎస్‌హెచ్‌వో మధుసూదనరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఐ హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీలకు పాల్పడుతున్న కారు డ్రైవర్ అరెస్టు
గుంటూరు, తెనాలి రూరల్ : గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు కార్లు, 60 గ్రాముల బంగారు ఆభరణాలు, ఎల్ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. స్థానిక టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఆర్.ఎస్. కిశోర్‌కుమార్ చోరీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. యడ్లపాడు మండలం ఉప్పరపాలేనికి చెందిన డేరంగుల కోటేశ్వరరావు కారు డ్రైవర్ పని చేస్తుంటాడు. మార్చి 2న కారు రిపేరు చేయాలంటూ తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న షెడ్డు వద్దకు రాగా, రూ. 25వేలు అవుతుందని మెకానిక్ చెప్పాడు. కారుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టే బదులు గంగానమ్మపేట ఉమ్మారెడ్డి కాంప్లెక్సులోని షెడ్డులో మరో కారు అమ్మకానికి ఉందని మెకానిక్ చెప్పాడు. దీంతో కోటేశ్వరరావు అక్కడకు వెళ్లి ట్రయల్ వేస్తానంటూ కారుతో ఉడాయించేశాడు. తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ♦ ఏప్రిల్ 11న నర్సరావుపేటలోని పల్నాడు సెంటరులో కొనుగోలు చేసిన టీవీని తీసుకెళ్లేందుకు నలుగురు వ్యక్తులు వాహనం కోసం వేచి ఉండగా, బాడుగకు వస్తానంటూ వారితో బేరమాడి, ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక కారు ఇంజిన్ ఆపివేసి, తోయాలంటూ చెప్పాడు. వారు దిగి తోస్తుండగా, స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నకరికల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ♦ అదే నెల 29న నర్సారావుపేట నుంచి ఒంగోలులోని వివాహానికి వెళ్లేందుకు ఇద్దరు పిల్లలతో నలుగురు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండగా, వారిని బాడుగకు ఒప్పించి, ఎక్కించుకున్నాడు. వివాహానికి సంబంధించి ఆభరణాలు తీసుకెళుతున్నారని వారి మాటల ద్వారా కోటేశ్వరరావు తెలుసుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక కారు ఇంజిన్ ఆపివేసి, తోయాలంటూ వారికి చెప్పాడు. దిగి తోస్తుండగా, కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. దీనిపై ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెనాలిలో కారుతో ఉడాయించిన ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడు కోటేశ్వరరావు అని నిర్ధారించుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేటలోని బరంపేటలో అతను ఉంటున్న అద్దె ఇంట్లో తనిఖీ చేయగా, బంగారు ఆభరణాలు, ఎల్ఈడీ టీవీ, ఒక కారు లభించాయి. నిందితుడి సమాచారం మేరకు తెనాలిలో వదిలి వెళ్లిన కారు, మరో కారునూ స్వాధీనపర్చుకున్నారు. రూరల్ ఎస్పీ కార్యాలయంలో పోలీసు శాఖకు చెందిన ఐటీ కోర్ విభాగం అందించిన సాంకేతిక సహాయంతో నిందితుడి ఆచూకీ గుర్తించినట్టు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ గన్నవరపు అంజయ్య, పీఎస్ఐ శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో కీలక మలుపు
గుంటూరు, పేరేచర్ల(ఫిరంగిపురం) : ఫిరంగిపురం ఎస్టీ కాలనీలో ఆదివారం కలకలం రేపిన మహిళ హత్య కేసులో పోలీసులు ఆమె తల్లి మంగమ్మతో పాటు ప్రియుడు శివయ్యను పలు ధపాలుగా విచారించారు. తొలుత తానే చంపానని ఒప్పుకొన్న మంగమ్మ.. ఆ తరువాత పోలీసుల విచారణలో పలు వాస్తవాలు బయటపెట్టింది. వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉండటంతో పాటు ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకొన్న తల్లి ప్రియుడు తోకల శివయ్యతో కలసి ఆదివారం ఉదయమే హతమార్చింది. తొలుత చిన్న రోకలి బండతో మోది ఆ తరువాత శివయ్య సాయంతో పని కానిచ్చిట్లు పోలీసు విచారణలో బయటపెట్టింది. ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ఘటనను గోప్యంగా ఉంది ఆ తరువాత మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా చేద్దామని అనుకొన్నారు. ఈలోపే విషయం స్థానికులకు తెలిసి పోలీసుల దాకా వెళ్లడంతో ఇద్దరు కటకటాల పాలయ్యారు. కన్న కూతురిని హతమార్చిన తల్లి మంగమ్మ, ఆమెకు సహకరించిన శివయ్యను త్వరలో రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కలుగులో క్రికెట్ బు‘కీ’లు..!
సాక్షి, గుంటూరు:క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ బుకీల ఆట కట్టించి మరికొందరు ఈ వ్యసనానికి బలికాకుండా చూడాలనే ఉద్దేశంతో గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేట కొనసాగిస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన కీలక క్రికెట్ బుకీలంతా సెల్ఫోన్లు పక్కన పడేసి గత వారం రోజులుగా కుటుంబ సభ్యులతో సైతం సంబంధాలు లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, కారంపూడి, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన క్రికెట్ బుకీలంతా వైజాగ్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకుంటూ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నరసరావుపేట, గుంటూరుకు చెందిన పలువురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకుని వీరి నుంచి బుకీల సమాచారంతో పాటు, వీరికి సహకరిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను సైతం వారి నుంచి సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో కీలక క్రికెట్ బుకీలంతా టీడీపీ నేతల అండతో పోలీసుల కంటపడకుండా కలుగులోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న కొందరు కీలక బుకీలు మాత్రం పోలీసులు తమ జోలికి రాకుండా కొందరు టీడీపీ ముఖ్యనేతలు, పోలీసు అధికారులకు సైతం భారీ మొత్తంలో ఆఫర్లు పెడుతున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, డెల్టా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి సైతం క్రికెట్ బుకీలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ బుకీల కోసం టాస్క్‌ఫోర్స్ బృందాల గాలింపు జిల్లాలో రూరల్ ఎస్పీ ఎస్.వి. రాజశేఖర్‌బాబు ఇద్దరు సీఐలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి క్రికెట్‌బుకీల కోసం వేట కొనసాగిస్తున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు, చిలకలూరిపేట, పిడుగురాళ్ళ తదితర ప్రాంతాలకు చెందిన మరికొందరు కీలక బుకీలంతా రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. సెల్ఫోన్లు ఉంటే టెక్నాలజీ ద్వారా, ఎక్కడ పోలీసులు తమ ఆచూకీ తెలుసుకుంటారోననే భయంతో వాటిని సైతం పక్కన పడేసి కుటుంబం సభ్యులతో సైతం మాట్లాడకుండా వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిని నమ్మాలో తెలియని ఎస్పీలు కొందరు పోలీసు అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బుకీల కోసం వేట సాగిస్తున్నారు. ఇవి కొంతమేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న ఇంటి దొంగలపై రూరల్ ఎస్పీ సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలిసింది. క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకుని బెట్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు, సిబ్బంది పనిపట్టేందుకు రూరల్ ఎస్పీ సంకల్పించారు. జిల్లాలో క్రికెట్ బెట్టర్ల నుంచి నెలవారి మామూళ్లు తీసుకుంటున్న పోలీసు అధికారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు క్రికెట్ బుకీల నుంచి భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్న అవినీతి పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి క్రికెట్ బుకీల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ వారికి సహకరిస్తున్న పోలీసు అధికారులు టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటుతో వణికిపోతున్నారు. ఇప్పటికే గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో గుట్కా మాఫియా నుంచి డబ్బులు వసూలు చేసిన పోలీసు అధికారులపై రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు చర్యలకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సైతం అవినీతి పోలీసు అధికారులపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఎవరిపై వేటు పడుతుందోననే భయాందోళనలో కొందరు పోలీసు అధికారులు ఉన్నారు. తమకు మామూళ్లు ఇచ్చిన క్రికెట్ బుకీలను అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలంటూ సదరు పోలీసు అధికారులే సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. -
కిలాడీ బామ్మ
గుంటూరు, తెనాలిరూరల్: ఆ బామ్మ వయసు 71 ఏళ్లు. ఆలయంలో ఉంటే అందరూ హరే రామ హరే కృష్ణ అంటూ భజనలు చేస్తుందనుకుంటారు. జాగ్రత్త దొంగలుంటారు అని హెచ్చరిస్తుంటే ఎంతటి పెద్దరికమని ముచ్చట పడతారు. అలా అని ఆ బామ్మను దగ్గరకు రానిచ్చారో.. ఒంటి మీద నగలుపోయి ఘొల్లుమంటారు. వామ్మో బామ్మ.. అంటూ గగ్గోలు పెడతారు.. ఇలా ప్రజలను బురిడీ కొట్టించి నగలు కొట్టేస్తున్న కిలాడీ బామ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధ మహిళలే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఆమె నుంచి రూ. 2.10 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు. తెనాలి టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఆర్ఎస్ కిషోర్‌కుమార్ ఈ కిలాడి బామ్మగురించి వివరించారు. సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీకి చెందిన జవంగుల సరోజిని(71) తెనాలిలో నివసిస్తున్న తన కొడుకు వద్దకు వచ్చి పోతుండేది. మార్చిలో వచ్చిన ఆమెకు అదే నెల 13వ తేదీన పట్టణ నందులపేటలోని వినాయకుడి గుడి ధ్వజ స్తంభ ప్రతిష్ట జరుగుతుందని తెలిసింది. 13వ తేదీ ఉదయం గుడికి వెళ్లి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వీరిలో వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. రద్దీగా ఉండడంతో ‘చోరులతో జాగ్రత్తగా ఉండాల’ంటూ మహిళలతో మాటలు కలిపింది. చీర కొంగులు కప్పుకోవాలంటూ తానే స్వయంగా కప్పింది. ఈ క్రమంలో పట్టణ మోదుకూరి వారి వీధికి చెందిన కొత్తపల్లి అన్నపూర్ణ(65), నందులపేటకే చెందిన పొందూరి సుగుణకుమారి(63)ల మెడలలోని బంగారు నానుతాడులను అపహరించింది. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కెమెరాల్లో కనపడకుండా నేరాలు.. సరోజిని నేరాలకు పాల్పడిన తీరు గురించి తెలుసుక్ను పోలీసులు నివ్వెరపోయారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నా, వాటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ గొలుసులు అపహరించింది. బాధితులు ఫిర్యాదుతో ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు ఎవరూ ఫుటేజ్లలో కనబడలేదు. సీసీ కెమెరాలను గుర్తించి, వాటిలో పడకుండా జాగత్తపడింది. ఎటువంటి ఆధారం లేకుండా పోయిందనుకుని పోలీసుల దర్యాప్తు వేగం తగ్గించారు. అంతలోనే, ధ్వజ స్తంభ మహోత్సవాన్ని స్థానికులు సెల్ఫోన్లు, కెమెరాలతో వీడియో తీశారని తెలుసుకున్నారు. వాటిని తెప్పించి పరిశీలించి నిందితురాలిగా అనుమానం ఉన్న వృద్ధురాలి ఫోటో తీయించగలిగారు. ఈమెపైనే బాధితులూ అనుమానం వ్యక్తం చేశారు. ఇక నిందితురాలు ఈమేనని నిర్ధారించుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. తెనాలి రజకచెరువు వద్ద శనివారం ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకుందని, ఆమె వద్ద నుంచి మొత్తం 72 గ్రాముల రెండు బంగారు నానుతాడులను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. నిందితురాలు గతంలో విజయవాడలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్టు తెలిసింది. సమావేశంలో ఎస్ఐ గన్నవరపు అంజయ్య, సిబ్బంది ఉన్నారు. -
దొంగలు బాబోయ్...దొంగలు..
సాక్షి, గుంటూరు: జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు హడలిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని రాత్రి వేళల్లో దొంగలు తమ పనిని చక్కబెట్టుకుంటున్నారు. గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 రోజుల వ్యవధిలో వరుస దొంగతనాలు జరగడంతో పోలీసులు సైతం రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ముఖ్యంగా జిల్లాలోని సత్తెనపల్లిలో వారం వ్యవధిలో ఎనిమిది చోట్ల దొంగతనాలు జరగడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రాత్రి గస్తీలు సక్రమంగా జరగకపోవడం వల్లే కొన్ని ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా రూరల్, అర్బన్ ఎస్పీలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)ను వినియోగించుకోవాలని పలు మార్లు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రజల్లో దీనిపై అవగాహన లేకపోవడంతో దీన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఊర్లకు వెళ్లి వచ్చేసరికి తమ విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు తెలుసుకుని లబోదిబో మంటున్నారు. జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలు మామూలు దొంగల పనా, లేక అంతర్రాష్ట్ర దొంగల ముఠా జిల్లాలో తిరుగుతుందా అనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు తెలిసింది. జిల్లాలో జరుగుతున్న దొంగతనాల తీరును పరిశీలిస్తే ఒక్కోటి ఒక్కో రకంగా ఉంది. దీంతో ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి శివారు గ్రామమైన వెన్నాదేవిలో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై దాడిచేసి దోచుకున్న సంఘటనపై పోలీసులు దృష్టి సారించారు. ఇద్దరు యువకులు ఈ నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. నిందితులిద్దరూ సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామానికి చెందిన వారని, కొంతకాలంగా సత్తెనపల్లిలో నివసిస్తున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. నేరం జరిగిన తరువాత పరిణామాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం వేట ప్రారంభించారు. ఈ కేసు కొలిక్కి రాకముందే సత్తెనపల్లి పట్టణంలో బుధవారం రాత్రి రెండు గృహాల్లో చోరీలు జరగటం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. పట్టణంలోని వివేకానందనగర్‌లో నివసిస్తున్న పండ్ల వ్యాపారి కుంభా బుల్లయ్య బుధవారం రాత్రి డాబాపై నిద్రిస్తుండగా, గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20వేలు నగదు అపహరించుకు పోయారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో మున్నియ్య కిందకు రాగా, అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉండటం, బీరువా తలుపులు తీసి ఉండటంతో చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే సమీపంలోని బీబీనగర్‌లో ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ అబ్దుల్ రఫీ బెడ్రూములో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 50వేలు నగదు అపహరించి ఇంటి వెనుక నుంచి దుండగులు పరారయ్యారు. సత్తెనపల్లిలో వారం వ్యవధిలో ఎనిమిది దొంగతనాలు జరగడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. గుంటూరు నగరంలో సైతం నెల వ్యవధిలో పలు చోరీ ఘటనలు జరగడంతో పోలీసులు రాత్రి గస్తీని పటిష్టం చేశారు. బుచ్చయ్యతోటలో గత నెల 22వ తేదీన ఓ గృహంలో రూ.2.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించారు. దొంగతనాలు జరిగిన గృహాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టంను ఉపయోగించుకోలేదని తెలుస్తోంది. ఎల్‌హెచ్‌ఎంఎస్ ఉపయోగించుకుని ఉంటే దొంగతనం జరగకుండా నివారించడంతోపాటు, వారిని పట్టుకునే అవకాశం ఉండేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై ప్రజల్లో ఇంకా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లే దీన్ని ఎవరూ వినియోగించడం లేదన్నది వాస్తవం. -
వివాహేతర సంబంధం కోసం వ్యక్తి వీరంగం
వినుకొండటౌన్: వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలంటూ వివాహిత ఇంటివద్ద వ్యక్తి హల్చల్ చేసిన సంఘటన పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన తాటిపాక పెద్దిరాజుకు పట్టణంలోని మార్కాపురం రోడ్డులో నివాసం ఉంటున్న వివాహితతో నాలుగు ఏళ్లక్రితం వివాహేతర సంబంధం ఉండేది. పెద్దిరాజు నాలుగేళ్లక్రితం గుంటూరులో ప్రయివేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగా వివాహిత భర్తతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారి పెద్దిరాజును మూడేళ్లపాటు ఇంట్లో ఉంచుకున్నారు. ఆ క్రమంలో పెద్దిరాజుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గత ఏడాది వారు ఇరువురు ఇంటి నుంచి వెళ్లిపోయి కేరళలో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న భర్త తనకు చిన్న పిల్లలు ఉన్నారని బంధువులతో మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురానికి తీసుకువచ్చారు. గుంటూరులో నివాసం ఉంటే మరలా పెద్దిరాజు నుంచి ఇబ్బందులు వస్తాయని గమనించిన వారు కాపురాన్ని వినుకొండకు మార్చారు. పెద్దిరాజు మరలా వారిని వెతుక్కుంటూ వివాహిత ఇంటికి చేరి వీరంగం సృష్టించాడు. దీంతో వివాహిత, భర్తతోకలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కాగా బాత్రూమ్కంటూ వెళ్లి గోడదూకి పెద్దిరాజు పారిపోయే ప్రయత్నం చేశాడు. -
పేద విద్యార్థినులను వ్యభిచారకూపంలోకి..
ఓ ప్రైవేటు సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పని చేసేందుకు ఓ యువతి పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చింది. ఇక్కడ ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. వచ్చే జీతంలో ఖర్చులు పోగా నామమాత్రంగానే చేతిలో మిగులుతోంది. ఆ డబ్బును కూడా ఇంటికే పంపించేది. ఇక చేతిలో ఖర్చులకు చిల్లిగవ్వ ఉండటం లేదు. అదే హాస్టల్లో ఉంటున్న తోటి యువతి ఆమెను ఎలాగైనా తన మాదిరిగానే పడుపు వృత్తిలోకి దించాలని నిర్ణయించుకుంది. తన దగ్గర ఖరీదైన సెల్‌ఫోన్, బట్టలు, చేతి నిండా డబ్బును చూపుతూ ప్రలోభ పెట్టింది. ‘నీవు కూడా ఎంతకాలం డబ్బుకు ఇబ్బందులు పడతావు... నేను చెప్పినట్లు వింటే కోరినంత డబ్బు వస్తుం’దంటూ ఆశ పెట్టడంతో సదరు యువతి కొద్ది రోజులకు సరేనంది. ఉద్యోగం మానేసి ఆమెతో కలసి వ్యభిచార కూపంలోకి దిగింది. జీవితాన్ని నాశనం చేసుకుంది. గుంటూరు: అనుమతులు ఉండవు.. నిబంధనలు అసలే పట్టవు.. రక్షణ చర్యలు ఏమాత్రం తీసుకోరు.. ధనార్జనే వారి ధ్యేయం.. ఇందుకోసం విద్యార్థినుల జీవితాలు నాశనమైనా వారికి చీమకుట్టినట్లైనా ఉండదు.. నెలవారీ మామూళ్లతో అధికారులు, పోలీసుల్ని మేనేజ్ చేస్తూ కొందరు యథేచ్ఛగా లేడీస్ హాస్టళ్లను కొనసాగిస్తున్నారు. రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరుకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు నుంచి వచ్చిన విద్యార్థినులు, ఉద్యోగాలు కోసం వచ్చే యువతులు లేడీస్ హాస్టళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ముఖ్యంగా డిగ్రీ, ఇంజినీరింగ్, బీఫార్మసీ వంటి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థినులు ఆయా కళాశాలల్లో వసతి లేకపోవడంతో ప్రైవేటు హాస్టళ్లను వెతుక్కోవాల్సి వస్తోంది. కొన్ని కళాశాలల్లో సౌకర్యం ఉన్నప్పటికీ భోజనం బాగోలేదనో, వసతులు సక్రమంగా లేవనే కారణాలతో అధిక శాతం మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వాటి నిర్వాహకులు సైతం విద్యార్థినుల్ని ఆకర్షించేలా అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని అందులో వారికి అన్ని వసతులు కల్పిస్తున్నారు. అనుమతులు లేకుండా పలుచోట్ల ఏర్పాటు జిల్లావ్యాప్తంగా 300కు పైగా లేడీస్ హాస్టల్స్ కొనసాగుతున్నాయి. వీటిలో అధికంగా గుంటూరు అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో ఉన్నాయి. లేడీస్ హాస్టల్ నిర్వహించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదరు అధికారులు హాస్టల్ ఏర్పాటు చేసే భవనాలను పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించి ఆయన ఆదేశాల మేరకు అనుమతివ్వాలి. లేడీస్ హాస్టళ్లు కావడంతో అనుమతి ఇచ్చే సమయంలో బిల్డింగ్ చుట్టూ ప్రహరీ గోడ ఉందా.. సరైన రక్షణా చర్యలు చేపట్టారా? అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే, ప్రస్తుతం లేడీస్ హాస్టళ్ల నిర్వాహకులు అనుమతులు లేకుండానే వీటిని నడుపుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఆమ్యామ్యాలు స్వీకరించి మిన్నకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రక్షణ కరువు పట్టణాలతోపాటు ఊరికి దూరంగా ఉన్న లేడీస్ హాస్టళ్లలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. అపార్టుమెంట్లలో కింద, పైన వ్యాపార సముదాయాలకు అద్దెకిచ్చి మధ్యలో లేడీస్ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. విజయవాడలోని లేడీస్ హాస్టల్లో అయేషామీరా హత్య ఉదంతం, తెనాలి హాస్టల్లోకి సైకో ప్రవేశించి దారుణాలకు పాల్పడిన సంఘటనలతోపాటు బయటకు పొక్కని సంఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ నిర్వాహకులకు చీమకుట్టి నట్లైనా ఉండటం లేదు. అక్కడ విద్యార్థినులకు ఏం జరిగినా బయటకు పొక్కడానికి వీల్లేదు. అదేమంటే బయటకు తెలిస్తే ‘మీపరువే పోతుంది.. మీ తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మాన్పించి ఇంటికి తీసుకెళ్తా’రంటూ విద్యార్థినులను భయపెడుతున్నారు. విద్యార్థినుల రక్షణ గురించి పర్యవేక్షించాల్సిన అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రం హడావిడి చేస్తూ చేతులు దులుపుకుంటున్న పోలీసులు, అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి వీటిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలు బేఖాతర్ లేడీస్ హాస్టళ్లను మహిళలు మాత్రమే నిర్వహించాలి. కళాశాల విద్యార్థినులకు ఏర్పాటు చేసిన చోట్ల బయట మహిళలకు వసతి కల్పించకూడదు. విద్యార్థినుల్ని చేర్చుకునే సమయంలో కూడా వారు చదివే కళాశాల యాజమాన్యం లేఖ ఇవ్వాలి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఉద్యోగాల సాకుతో వచ్చే కొందరు ఆకతాయి మహిళలకు సైతం వసతి కల్పిస్తున్నారు. వీరు నిరుపేద విద్యార్థినులకు డబ్బు, బట్టలు, సెల్‌ఫోన్ వంటి వాటిని ఇచ్చి ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరికి హాస్టల్ నిర్వాహకులు సైతం సహకరిస్తూ రాత్రి వేళల్లో యువకులను హాస్టల్లోకి అనుమతిస్తూ విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక దృష్టి సారిస్తాం హాస్టల్స్ నిర్వహణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులను ఆప్రమత్తం చేస్తాం. ఇప్పటికే ఆయా హాస్టల్స్‌పై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం. - సీహెచ్. విజయారావు, అర్బన్ ఎస్పీ ఎంతటి వారైనా ఉపేక్షించం నిబంధనలకు విరుద్ధంగా లేడీస్ హాస్టల్స్‌ను నిర్వహిస్తే సహించేది లేదు. ఇప్పటికే శక్తి బృందాలు వారి పరిధిలో కొనసాగుతున్న హాస్టల్స్‌కు వెళ్లి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా నిర్భయంగా తెలియచేయవచ్చు. వ్యభిచారాన్ని ప్రోత్సహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోం. – ఎస్.వి. రాజశేఖరబాబు, రూరల్ ఎస్పీ -
ఎస్ఐ దౌర్జన్యం
గుంటూరు, తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డు మీద ఆడుకుంటున్న ఓ బాలుడిని ఢీకొట్టాడు. అయితే బాలుడితో సంబంధం లేని వ్యక్తులు ఆ యువకుడిపై దాడి చేసి చితకబాదగా, అనంతరం ఆ యువకుడి స్నేహితులు వారిని చితకబాదారు. అయితే యువకుడి స్నేహితులు కొట్టిన వారు మున్సిపల్ శానిటరీ ఉద్యోగులు కావడంతో, మున్సిపల్ కార్యాలయం నుంచి కార్మిక వర్గాలు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఆ యువకుడిని స్టేషన్‌కు పిలిపించి, విచక్షణా రహితంగా కొట్టి, తలను గోడకేసి బాదడంతో యువకుడి తల పగిలి మూడు కుట్లు పడ్డ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఎస్.కె.మస్తాన్ తెలిపిన వివరాల ప్రకారం... నులకపేటలో ఈ నెల 15న మస్తాన్ ద్విచక్రవాహనంపై వెళ్తూ పొరపాటున రోడ్డుపై ఓ బాలుడిని ఢీకొన్నాడు. వారి తల్లిదండ్రులతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఆటో మాట్లాడుతుండగా, అక్కడే పనిచేస్తున్న కొంతమంది మున్సిపల్ కార్మికులు అతనిపై దురుసుగా ప్రవర్తించారు. మస్తాన్‌కు మున్సిపల్ కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగి మున్సిపల్ కార్మికులు అతనిపై దాడి చేశారు. ఈ విషయం తెలిసి మస్తాన్ స్నేహితులు వచ్చి మున్సిపల్ కార్మికులను కొట్టారు. దీంతో మున్సిపల్ కార్మికులు సోమవారం సాయంత్రం మస్తాన్, అతని స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాడేపల్లి ఎస్ఐ మస్తాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెల్టుతో అరచేతులపై కొట్టారు. మంగళవారం ఉదయం మళ్లీ పిలిపించి, కింద కూర్చోబెట్టి ఒకరు కాళ్లను నొక్కి పట్టుకుని కర్రతో బాదారు. అంతటితో ఆగకుండా ఎస్ఐ జుట్టు పట్టుకొని తలను గోడకేసి బాదారు. దాంతో తనకు తలపై మూడు కుట్లు పడ్డాయని బాధితుడు మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తన బంధువులు వెళ్లి ఎస్ఐను ప్రశ్నించగా మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పినట్లు మస్తాన్ బంధువులు తెలిపారు. -
నెక్కల్లు ఘటనలో మరో మహిళ మృతి
గుంటూరు, తుళ్లూరు(తాడికొండ): నెక్కల్లు గ్రామంలో ఈ నెల 5న జరిగిన ఘటనలో మరో మహిళ మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టీడీపీ నేతల దాడిలో గాయపడిన బీసీలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయడానికి వెళుతుండగా, టీడీపీ నేతల వెంటపడి కారుతో తొక్కించిన ఘటనలో మరో మహిళ పసుపులేటి వీరకుమారి(35) సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇళ్ల మధ్య ఉన్న ఇంటి స్థలాల విషయంలో చెలరేగిన వివాదంలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు అలూరి బ్రహ్మయ్య, ఆయన కుమారులు కలసి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. కారుతో తొక్కించిన ఘటనలో పసుపులేటి మహాలక్ష్మి(65) అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైం అప్పటినుంచి చికిత్స పొందుతున్న వీరకుమారి సోమవారం మరణించింది. పసుపులేటి కాటరాలు, పసుపులేటి బ్రహ్మయ్య, పసుపులేటి బాపయ్య, పసుపులేటి శిరీష, పసుపులేటి పిచ్చయ్య, వెంకటలక్ష్మిలకు కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అమ్మలేని అనాథలుగా చిన్నారులు మృతురాలు వీరకుమారికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారు 9వ తరగతి, 8వ తరగతి చదువుతున్నారు. భర్త పసుపులేటి బాపయ్య కూడా ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. దంపతులిద్దరూ కూలి పనులకు వెళుతూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. తల్లి మృతి చెందడంతో చిన్నారులిద్దరూ తల్లి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు పిల్లల రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తల్లి మృతదేహం వద్ద ఇద్దరు చిన్నారులు.. ‘అమ్మా... లే అమ్మా అంటూ.. విలపిస్తున్న తీరు అక్కడికి చేరుకున్న వారి హృదయాలను కదిలించింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బీసీ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలి ఇద్దరు మహిళల మరణానికి కారణమైన నిందితులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి. న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న బీసీలపై టీడీపీ నేతలు మానవత్వం మరచి కారుతో తొక్కించడం రాక్షస చర్య. పోలీసులు కేసును పక్కదోవ పట్టించకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. దుర్ఘటనలో మృతి చెందిన, గాయపడిన బీసీ కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్సీపీ వారికి అండగా ఉంటుంది.–ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి -
జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌లు
సాక్షి, గుంటూరు: ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మధ్యతరగతి కటుంబాలను మాత్రం రోడ్డు పాలు చేస్తోంది. క్రికెట్ బుకీల మాయ మాటలు నమ్మి సాధారణ, మధ్యతరగతి యువకులు, విద్యార్థులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతుంటే, కొందరు పోలీసులకు పట్టుబడి జైలు పాలవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం మంది హోటళ్లలో పని చేసే వారు, కూలీ పనులు, చిరు వ్యాపారులే ఉన్నారు. వీరంతా క్రికెట్ బెట్టింగ్ బుకీల మాయ మాటలు నమ్మి పందేలు కాస్తూ సర్వం కోల్పోయారు. ఎవరిని కదిలించినా బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల పాలయ్యాం అని చెప్పేవారే. మ్యాచ్ ఏదైన పందేం కాసేది ఏవైపైనా, ఎన్ని పందేలు కట్టినా ఓడిపోయేది మాత్రం బెట్టింగ్ రాయుళ్లే ఈ విషయం తెలుసుకోలేని మధ్య తరగతి, సాధారణ ప్రజలు అప్పులపాలై, పోలీసులకు పట్టుబడి జైళ్లకు వెళ్తున్నారు. బెట్టింగ్‌ల్లో సర్వం కోల్పోయి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం జిల్లాలో అనేకం ఉన్నాయి. అయినప్పటికీ బెట్టింగ్ రాయుళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. జోరుగా బెట్టింగ్‌లు.. ప్రస్తుతం ఐపీఎల్ 2019 నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భారీ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. పోలీసులు సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మల్లగుల్లాలు పడుతుంటే, బెట్టింగ్ రాయుళ్లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలకు పోలీస్ శాఖలో కొందరి సహాయం ఉండటంతో వారు రెచ్చిపోతున్నారు. బుకీల నుంచి పలువురు పోలీస్ అధికారులకు మామూళ్లు సైతం ముడుతున్నాయి. టీడీపీ కీలక నేతల అండదండలతో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాలు మాఫియాగా ఏర్పడ్డాయి. ఈ మాఫియాలోని బుకీలు అమాయకులను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. అమాయకులు మాత్రం సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. బుకీల మోసం ఇలా.. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ టాస్ నుంచి మ్యాచ్ గెలుపు, ఓటముల వరకు బెట్టింగ్‌లు నడుస్తుంటాయి. అయితే బెట్టింగ్ రాయుళ్లందరూ టీవీల్లో, ఆన్లైన్ లైవ్‌లో చూస్తూ ఫండర్లు పందేలు కాస్తుంటారు. ఈ బెట్టింగ్‌లు బుకీలు నిర్వహిస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో ఉండే ప్రధాన క్రికెట్ బూకీలు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కమీషన్ల మీద వారిని నియమించుకుంటారు. దీని కోసం ఓ ప్రత్యేక ఫోన్‌లైన్ సెటప్ చేసుకుని, వాటి ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్‌లో చోటు చేసుకునే అంశాల మీద పందెం «ధరలను నిర్ణయిస్తూ ఫండర్లను ఆకర్షిస్తుంటారు. ఇందులో టాస్ ఎవరు గెలుస్తారు.. సెషన్స్ ప్రతి ఐదు ఓవర్లలో స్కోరు ఎంత వరకు వస్తుంది, బాల్ టూ బాల్, తర్వాత బాల్లో వికెట్ పడుతుందా, సిక్స్ కొడతారా అంటూ బుకీలు వారికి అనుగుణంగా ధరలు పెంచుతుంటారు. ఈ విషయం తెలియని పందెం రాయుళ్లు టీవీల్లో మ్యాచ్‌లు తిలకిస్తూ ఊహించని బెట్టింగ్‌లు కడుతుంటారు. అయితే 90 శాతం బెట్టింగ్ ఫలితాలు ఫండర్ల ఊహకు భిన్నంగా ఉంటాయి. అబ్బ జస్ట్ మిస్ నెక్టŠస్ టైం కచ్చితంగా గెలుస్తాం.. అంటూ డబ్బు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు. బుకీలందరూ తెలుగు తమ్ముళ్లే రాజధాని ప్రాంతంలో అమాయక ప్రజలను క్రికెట్ బెట్టింగ్‌ల పేరుతో మోసం చేస్తున్న వారిలో తెలుగు తమ్ముళ్లే అధికంగా ఉండటం గమనార్హం. గత ఐపీఎల్ సీజన్లో పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్ బెట్టింగ్ నిర్వహిస్తూ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అదే సీజన్లో చిలకలూరిపేటలో పట్టుబడిన బుకీలు తన్నీరు వెంకటేశ్వర్లు, గొట్టిపాడు సదాశివరావు, కామినేని ప్రధీప్ కుమార్ టీడీపీకి చెందిన వారు కావడం గమనార్హం. కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్, పెదకూరపాడు తాజా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులు బెట్టింగ్‌లు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తెగబడి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఘటన జిల్లా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే మిగిలేది విషాదమే క్రికెట్ బెట్టింగ్‌ల ద్వారా వచ్చే డబ్బుతో స్వల్ప కాలం మాత్రమే ఆనందం ఉంటుంది. ఆ తర్వతా దుఖఃమే మిగులుతుంది. బుకీల మాయ మాటలు నమ్మి ఎవరూ బెట్టింగ్‌లలో డబ్బులు పెట్టి నష్టపోవద్దు. కష్టాలు కొనితెచ్చుకోవద్దు. ఎక్కువ శాతం మధ్య తరగతి, సాధారణ యువకులు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ బుకీలు మోసం చేస్తుంటారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెంట్టింగ్లపై ప్రత్యేక నిఘా ఉంచాం. బెట్టింగ్‌లకు పాల్పడి అరెస్టు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.విజయారావు, అర్బన్ ఎస్పీ -
మతం ఆ ప్రేమజంటను చంపేసింది..
కర్లపాలెం (బాపట్ల): గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెంలో మైనర్ ప్రేమజంట గురువారం తుంగభద్ర డ్రెయిన్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏట్రవారిపాలెంకి చెందిన అక్కల స్వామిరెడ్డి కుమారుడు తిరుపతిరెడ్డి (18), అదే గ్రామానికి చెందిన షేక్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రిజ్వానా (16) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రిజ్వానా ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసింది. బుధవారం గ్రామం నుంచి వెళ్లిపోయిన ప్రేమికులు గురువారం గ్రామ సమీపంలోని తుంగభద్ర డ్రెయిన్ వద్దకు చేరుకున్నారు. తాము ప్రేమించుకున్నామని, ఒకర్ని విడిచి ఒకరం ఉండలేమని, ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంటున్నామని కుటుంబీకులకు ఫోన్‌లోతెలిపారు. కుటుంబీకులు వారున్న చోటికి వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి బైక్, సెల్‌ఫోన్, రిజ్వానా చున్నీ, తుంగభద్ర కట్టపై ఉన్నాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ గజ ఈతగాళ్లతో డ్రెయిన్‌లో వెతికించగా మృతదేహాలు లభ్యమయ్యాయి. -
యువతి చున్నీతో ఉరివేసుకున్న యువకుడు
చీపురుపల్లి: తను ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహం నిశ్చయం కావడం, దాన్ని రద్దు చేసుకోమని ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె అంగీకరించకుండా తనను మరచిపోవాలని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆ యువతి చున్నీతోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెరకముడిదాం మండలం భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్ (17), అదే మండలంలోని శ్యామాయవలస గ్రామానికి చెందిన ఓ యువతి చీపురుపల్లిలోని ఓ కంప్యూటర్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అక్కడ దాదాపు ఆరు నెలల క్రితం వారికి పరిచయం ఏర్పడింది. దాన్ని ప్రేమగా మార్చాలని ప్రవీణ్ ప్రయత్నించాడు. అయితే ఆ యువతి కంటే ప్రవీణ్ ఏడాది చిన్నవాడు కావడంతో ఆమె అంగీకరించలేదు. అయినప్పటికీ వెంట పడి ఎట్టి పరిస్థితుల్లో తన ప్రేమను అంగీకరించాలని కోరాడు. ఇంతలో ఆ యువతికి ఇంట్లో పెద్దలు వివాహం కుదిర్చారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ ఆ పెళ్లి రద్దు చేసుకోవాలని కోరుతున్నా ఆమె పట్టించుకోలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేస్తూ వచ్చింది. శుక్రవారం చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మాట్లాడుకుందాం రమ్మని ప్రవీణ్ ఆ యువతిని పిలిచాడు. ఆమె వెళ్లేసరికి ప్రవీణ్ అక్కడ లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని వెనుదిరిగింది. ఆ తరువాత వచ్చిన ప్రవీణ్ తాను వచ్చానని రమ్మని ఫోన్‌చేసి పిలిచాడు. ఆమె వెళ్లగా పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని మరోసారి కోరాడు. ఆమె ససేమిరా అంటూ నచ్చజెప్పింది. మనస్తాపం చెందిన ఆ యువకుడు కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని అక్కడే కూర్చోమని, ఎండగా ఉంది చున్నీ ఇవ్వాలని అడిగాడు. చాలా సేపటి తరువాత ఫోన్ చేసి ‘ఇదే ఆఖరి మాట గుడ్‌బై’ అని ఫోన్ పెట్టేశాడు. ఆ యువతి పరుగులు తీసి వెళ్లగా అక్కడ ఓ చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జ్యోతి కుటుంబంలో మరో విషాదం
గుంటూరు, తాడేపల్లి రూరల్(మంగళగిరి): తన కుమార్తెను దారుణంగా హత్యచేశారన్న బాధను జీర్ణించుకోలేక అనారోగ్యం పాలైన తండ్రి గోవిందయ్య చికిత్స పొందుతూ మరణించాడు. ఫిబ్రవరి 15 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. బిడ్డ హత్యను తట్టుకోలేకే తండ్రి కూడా మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మూకుమ్మడిగా హత్యకేసులో నిందితుడి ఇంటిపై దాడి చేసిన ఘటన తాడేపల్లి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. రాజధాని ప్రాంతంలో ఫిబ్రవరి 11వ తేదీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అంగడి జ్యోతి తండ్రి జ్యోతి మరణాన్ని జీర్ణించుకోలేక ఆమె తండ్రి గోవిందయ్య అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు గత నెల 15న ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. (పెళ్లి ప్రస్తావన రాగానే చంపేశాడు) శ్రీను బంధువులపై దాడి బుధవారం సీతానగరంలోని జ్యోతి ఇంటి నుంచి గోవిందయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. గోవిందయ్య, జ్యోతి మధ్య అనుబంధాన్ని బంధువులు చర్చించుకున్నారు. అంత్యక్రియలు పూర్తిచేసి తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఉన్న చుంచు శ్రీను ఇంటిని చూసిన బంధువులు జ్యోతి, గోవిందయ్యల మృతికి కారణమైన వాడి ఇల్లు ఇదేనంటూ ఆ ఇంటి తాళాలు పగలగొట్టి, తలుపులు విరగ్గొట్టి దాడికి పాల్పడి, ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న చుంచు శ్రీను బాబాయి లక్ష్మీనారాయణ, పిన్ని, నాయనమ్మపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని స్థానికులు చూసి 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో జ్యోతి బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. చుంచు శ్రీను బంధువులు సైతం పోలీసులకు 100 ద్వారా ఫిర్యాదు చేశారు కానీ, పోలీస్‌స్టేషన్‌లో రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు చేయలేదు. (కేసు ముగించే కుట్ర ) -
తాతను హతమార్చిన మనవడు
గుంటూరు, చిలకలూరిపేట: ఆస్తి తన పేర రాయలేదని తాతను మనవడు కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చిన సంఘటన బుధవారం చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో జరిగింది. చిలకలూరిపేట రూరల్ సీఐ విజయచంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కావూరు గ్రామానికి చెందిన కందుల కోటయ్య(63), సీతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడు ఆదినారాయణ గుంటూరులో నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమార్తె వెంకట రమణమ్మ, చిన కుమార్తె సుజాతను కావూరు గ్రామంలోనే ఇచ్చి వివాహాలు జరిపించాడు. కన్నీంటిపర్యంతమైన కుటుంబ సభ్యులు పెద్ద కుమార్తె వెంకటరమణమ్మ నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి పెద్ద అల్లుడు పెడవల్లి కోటయ్య, అతని కుమారుడు నాగేశ్వరరావుతో కలిసి అల్లుడు ఇంట్లోనే మృతుడు కందుల కోటయ్య, సీతమ్మ దంపతులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్న కందుల కోటయ్యను ఆస్తి తన పేరున రాయాల్సిందిగా మనవడు పెడవల్లి నాగేశ్వరరావు కోరుతూ వచ్చాడు. స్థిరాస్తి బదలాయింపు విషయంలో ఇరు కుటుంబాల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం కూడా తాత, మనవడి మధ్య వివాదం జరిగింది. కోపోద్రికుడైన నాగేశ్వరరావు మంచంపై పడుకొని ఉన్న తాతపై కత్తితో మెడ, తలభాగంలో విచక్షణారహితంగా పొడవటంతో కోటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడి భౌతికాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ ఎస్.విజయచంద్ర, ఎస్ఐ జి.అనీల్‌కుమార్‌లు కావూరు గ్రామానికి వెళ్లి శవ పంచనామా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేశ్వరరావు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
20 ఏళ్లు చిన్నదైనా కన్నేసి.. కడతేర్చాడు
గుంటూరు, తెనాలిరూరల్: సంచలనం సృష్టించిన బిట్రా శ్రీజ్యోతి దారుణ హత్యకేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని కోర్టుకు తరలించేముందు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మరీదు శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివశిస్తున్న మృతురాలు శ్రీజ్యోతి కుటుంబానికి సన్నిహితుడైన నేతికుంట్ల సత్యనారాయణ (40) కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. అతను శ్రీజ్యోతిని వివాహం చేసుకోవాలని భావించాడు. రెండు సార్లు ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించగా, వారు వారించారు. గత నెల 21వ తేదీన వివాహ సంబంధం మాట్లాడుకునేందుకు ఏలూరు వెళ్లిన యువతి తల్లిదండ్రులకు వరుడు నచ్చడంతో, సంబంధం దాదాపు ఖరారైనట్టేనని తండ్రి సుధాకర్ తనకు మిత్రుడైన సత్యనారాయణకు చెప్పాడు. తాను వివాహం చేసుకుందామనుకున్న యువతి తనకు దక్కకుండా పోతుందని కక్ష కట్టిన సత్యనారాయణ.. శ్రీజ్యోతి ఇంటికి వెళ్లి.. ఒంటరిగా ఉన్న ఆమెపై చాకుతో దాడి చేశాడు. గొంతులో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. కాగా, నిందితుడు వేద టాకీస్ పక్క సందులోని అతని మామయ్య ఇంట్లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. సత్యనారాయణను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. -
మృగాడి దాష్టీకానికి ఆరిన మరో ‘జ్యోతి’
తన కుమారుడి వయసున్న యువతి నిండు ప్రాణాలను ఆ మానవ మృగం బలి తీసుకుంది. ఆమెకు పెళ్లి కుదరడాన్ని తట్టుకోలేకపోయింది. తనకు దక్కని ఆమె ఎవరికీ దక్కకూడదన్న అక్కసుతో గొంతునులిమి, పీక కోసి హతమార్చింది. పెళ్లి సంబంధం కోసం ఏలూరు వెళ్లిన తల్లిదండ్రులు తమ బిడ్డ హత్యకుగురైందని తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. తెనాలి రూరల్: గుంటూరు జిల్లాలోని రాజధాని పరిధిలో ప్రేమికుడి వెంట వెళ్లిన నేరానికి ప్రాణాలు కోల్పోయిన జ్యోతి హత్య కేసులో వాస్తవాలు ఇంకా వెలుగు చూడక ముందే.. తెనాలిలో ఓ మృగాడి ఘాతుకానికి మరో ‘జ్యోతి’ కొడిగట్టింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ యువతిని గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఆ మానవ మృగం..నేరుగా పోలీసుస్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే..పట్టణానికి చెందిన బిట్రా సుధాకర్, దుర్గాభవాని దంపతులు పట్టణ ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివసిస్తున్నారు. వస్త్ర దుకాణాల్లో పనిచేసే వీరికి కుమారుడు ప్రవీణ్ అలియాస్ నాని, కుమార్తె శ్రీజ్యోతి (20) ఉన్నారు. ప్రవీణ్ ఆటోనగర్‌లో స్టీలు కంపెనీలో పనిచేస్తుండగా, పదోతరగతి వరకు చదివిన శ్రీజ్యోతి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు పెళ్లిసంబంధం మాట్లాడేందుకని సుధాకర్ దంపతులు గురువారం తెల్లవారుజామునే ఏలూరు బయలుదేరి వెళ్లారు. ప్రవీణ్ ఆటోనగర్ వెళ్లాడు. శ్రీజ్యోతి తండ్రి సుధాకర్‌ది స్వస్థలం భట్టిప్రోలు. అదే ఊరికి చెందిన నేతికుంట్ల సత్యనారాయణ(42)తో స్నేహం కుదిరింది. తన కొడుకుతోపాటు అదే ఈడు వాళ్లయిన సుధాకర్ పిల్లలనూ సత్యనారాయణ ఆడిస్తుండేవాడు. ఏడెనిమిదేళ్ల క్రితం వ్యాపారంలో నష్టపోయిన సుధాకర్ ఉపాధి కోసం తెనాలికి వచ్చేసి సాలిపేటలో అద్దెకు ఉంటున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు సత్యనారాయణ కూడా కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చి రైస్‌కాలనీలో నివసించసాగాడు. కుటుంబ వివాదాల కారణంగా సత్యనారాయణ ఒంటరిగా జీవిస్తున్నాడు. కుటుంబ స్నేహితుడిగా అన్ని అవసరాలకు సుధాకర్ కుటుబానికి ఆసరాగా ఉంటూ వచ్చాడు. అయితే తన కుమారుడి వయస్సున్న శ్రీజ్యోతిపై కన్నేసిన సత్యనారాయణ ఆమెను వివాహం చేసుకుంటానని ఎవరి చేతనో తల్లిదండ్రులను అడిగించాడు. ఎందుకలా అడిగారని సుధాకర్ దంపతులు అతడిని నిలదీయగా..‘నేనెందుకు అన్నాను..చిన్నపిల్లకదా..సరదాగా అన్నాను’ అంటూ సత్యనారాయణ మాట దాటేశాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషనుకు వచ్చిన మృతురాలి తలిదండ్రులు బిట్రా సుధాకర్, దుర్గాభవాని ఆ తర్వా త కొద్దిరోజులకే ‘శ్రీజ్యోతికి పెళ్లి చేయండి..అవసరమైతే ఎంతో కొంత డబ్బు సర్దుబాటు చేస్తాను’ అంటూ హామీనిచ్చాడు. అతని మాటలు నమ్మిన శ్రీజ్యోతి తల్లిదండ్రులు ఏలూరులో చూసిన పెళ్లి సంబంధం దాదాపు ఖరారైనట్టేనని ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సత్యనారాయణకు ఫోనులో చెప్పారు. దీంతో ఆమె తనకు దక్కదని భావించిన సత్యనారాయణ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీజ్యోతిని హత్య చేసి పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. నిర్ఘాంతపోయిన పోలీసులు..అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లాంపేటలోని సుధాకర్ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో శ్రీజ్యోతి మృతదేహం కనిపించింది. గొంతు నులిమి కూరగాయలు కోసుకునే కత్తితో పీక కోసినట్టు గమనించారు. నిందితుడిని పోలీస్‌స్టేషనుకు తరలించి..ఏలూరు వెళ్లిన తలిదండ్రులకు వన్‌టౌన్ సీఐ మరీదు శ్రీనివాసరావు సమాచారం అందించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న ఆ దంపతులు, విగత జీవురాలై పడి ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు చెప్పారు. -
శవ రాజకీయం
గుంటూరు: ఇంటి పెద్ద మృతి చెంది కొండంత దుఃఖంలో కూరుకుపోయిన కౌలు రైతు కుటుంబ సభ్యులను ఓదార్చాల్సిన పాలకులు, టీడీపీ నాయకులు, పోలీసులు మానవత్వం మరచి ప్రవర్తించారు. సీఎం సభ నేపథ్యంలో పోలీసులదౌర్జన్యం కారణంగా రైతు మృతిచెందిన ఘటనను పక్కదారి పట్టించేందుకు సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారు. విషాదం నెలకొన్న కౌలు రైతు ఇంట శవ రాజకీయాలు చేస్తున్నారు. రూ.3 లక్షలు తీసుకుని వదిలేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు అప్పుల బాధతోనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటూ అసత్య ప్రచారం సాగిస్తున్నారు. పోలీసులు కొట్టినందునే కౌలు రైతు కోటేశ్వరరావు చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తుండగా రూరల్ ఎస్పీ మాత్రం ఖండించారు. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతును తమ సిబ్బందే ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ కౌలు రైతును పోలీసులు భుజాలపై తీసుకెళ్తున్నట్లు ఉన్న వీడియోను విడుదల చేశారు. అయితే ఘటన జరిగిన అనంతర పరిణామాలు మాత్రం పోలీసులనే దోషులుగా చూపుతున్నాయి. సీఎం సభా ప్రాంగణం వద్ద జిల్లా వైద్యాధికారి, హెలీప్యాడ్ వద్ద అంబులెన్సులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండగా పోలీసులు ఎందుకు తరలించాల్సి వచ్చింది? సీఎం చంద్రబాబు సైతం పోలీసుల వల్లనో, మరే కారణంగానో అవమానంగా భావించి కౌలు రైతు చనిపోయాడంటూ ఎందుకు ప్రసంగించారు? పోలీసుల తప్పు లేనప్పుడు రాజీపడాలంటూ ఉన్నతాధికారులు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నేత విడదల రజనిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? కోటేశ్వరరావుకు తోడుగా వెళ్లిన పున్నారావు పోలీసు వాహనంలో ఎందుకు ఉన్నాడు? అతని సెల్‌ఫోన్‌ను ఓ సీఐ తన వద్ద ఎందుకు ఉంచుకున్నాడు? పోస్టుమార్టం వద్ద టీడీపీ నాయకులు ఎందుకు హల్చల్ చేశారు? అన్న ప్రశ్నలకు జవాబిచ్చేదెవరు? -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
గుంటూరు: గతంలో మాదిరిగా కమ్యూనికేటర్ బాక్స్ లేకుండా కొద్ది మందితో మాత్రమే రహస్యంగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న నలుగురిని స్థానిక పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు సంయుక్తంగా దాడులు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. మంగళగిరికి చెందిన వ్యక్తి ఈనెల 15న మంగళగిరిలో క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్, మంగళగిరి పోలీసులను అప్రమత్తం చేశారు. మంగళగిరికి చెందిన సబ్బుకీ ఎం.నరేష్, ఫండర్స్ ఎం.శ్రీకాంత్, ఆర్ వెంకటేశ్వరరావు, పి.నాగార్జున సోమవారం పార్క్ రోడ్డులో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు అంగీకరించడంతో వారి వద్ద ఉన్న రూ.5.60 లక్షల నగదు, 6 సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్న అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి వారికి క్యాష్ రివార్డు అందచేస్తామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీలు వైటీ నాయుడు, బి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గణేష్‌ది ముమ్మూటికి హత్యే..
గుంటూరు ఈస్ట్: తమ కుమారుడిది ఆత్మహత్య కాదని హత్యేనని, నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని మేకల గణేష్ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, నాగమల్లేశ్వరి డిమాండ్ చేశారు. వడ్లమూడి సమీపంలోని రైలు పట్టాల వద్ద అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన బీటెక్ విద్యార్థి గణేష్ తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు జీజీహెచ్ మార్చురి వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఫిరంగిపురం ఎర్రగుంట్లపాడులో తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. తమ మూడో కుమారుడు గణేష్ శుక్రవారం మధ్యాహ్నం మిత్రుడైన రవి కళాశాల నుంచి బయటకు తీసుకువెళ్లాడన్నారు. గణేష్ క్లాసులకు హాజరుకాకపోవడంతో కళాశాల యాజమాన్యం కూడా సెల్ ద్వారా మెసేజ్ పంపిందన్నారు. అయితే, శనివారం గణేష్ మృతదేహం వడ్లమూడి సమీపంలోని రైలుపట్టాలపై ఉన్న విషయం తమకు పోలీసులు తెలిపారన్నారు. తమ కుమారుడిని తీసుకువెళ్లిన రవిని పట్టుకు పోలీసులకు అప్పగించామని చెప్పారు. తనతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, అంతా కలసి మద్యం తాగినట్లు ఒప్పుకున్నాడని వివరించారు. గణేష్ అస్థిపంజరం బొమ్మ చుట్టూ పుర్రెల బొమ్మలు పెట్టిన పోస్టింగ్‌ను గణేష్ సెల్‌కు రవి శనివారం పంపించాడని చెప్పారు. ఘటనా స్థలం సమీపంలో కర్రలకు రక్తం మరకలు ఉన్నాయని, దీన్ని బట్టి తన కుమారుడిది హత్యేనని ఆరోపించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నవ్యాంధ్ర స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి, బీసీ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు కర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ గణేష్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ,సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని డిమాండు చేశారు. పోలీసులు ఇప్పటికైనా గణేష్ మృతికి కారణాలను తల్లిదండ్రులకు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. -
ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యం
గుంటూరు: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు సవాలుగా మారిన ఘరానా దొంగను అర్బన్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ సీహెచ్. విజయారావు వివరాలు వెల్లడించారు. చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన యువకుడు పోతినేని గోపి ఆరో తరగతి వరకు చదివాడు. తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారి పేకాట, మద్యం, కోడి పందాలకు అలవాటు పడ్డాడు. అప్పులపాలై వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌లు చేయాలని నిశ్చయించుకొని ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. నంబరు ప్లేటును తొలగించి ముఖానికి ఖర్చీఫ్ కట్టుకొని హెల్మెట్ ధరించి..శుభకార్యాలకు, దేవాలయాలకు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్‌కు పాల్పడి ద్విచక్ర వాహనంపై పరారవుతుంటాడు. ఈ తరహాలో తెనాలి, పొన్నూరు, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో గడచిన ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు 25 చైన్ శ్నాచింగ్లకు పాల్పడ్డాడు. పట్టుపడిందిలా... అర్బన్ జిల్లా పరిధిలో మొత్తం 22 చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో స్థానిక పోలీసులు, సీసీఎస్ పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమేరా పుటేజీల్ని పరిశీలించినా నిందితుడి ఆచూకీని గుర్తించలేక పోయారు. ఈ క్రమంలో అర్బన్ జిల్లా పరిధిలో మరింత నిఘాను పెంచారు. ఈనెల 12న తెనాలి వైపు నుంచి మంగళగిరి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు ఆనవాళ్లను ప్రత్యేక టీంలో ఉన్న కానిస్టేబుళ్లు ఏ.నాగాంజనేయులు, కిరణ్‌కుమార్ గుర్తించారు. వెంటనే మంగళగిరి, సీసీఎస్ సీఐలను అప్రమత్తం చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు మంగళగిరి వైపు వస్తున్న యువకుడిని పెద్దవడ్లపూడి గ్రామ సమీపంలోని కోకోకోలా కంపెనీ ఎదురుగా చూసి అదుపులోకి తీసుకొనేందుకు యత్నించారు. అప్పటికే పోలీసుల్ని గుర్తించిన యువకుడు పరారయ్యేందుకు విఫలయత్నం చేసి దొరికి పోయాడు. వారిదైన శైలిలో విచారించగా నేరాలకు పాల్పడినట్లు అంగీకరించడంతో రూ. 31 లక్షల విలువ చేసే 1.37కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది పనితీరు అభినందనీయం విధి నిర్వహణలో ప్రతిభను చూపి పోలీసులకు సవాలుగా మారిన నేరస్తుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న కానిస్టేబుళ్లు నాగాంజనేయులు, కిరణ్‌కుమార్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి క్యాష్ రివార్డులు అందచేశారు. సీఐలు రవిబాబు, అబ్దుల్ కరీం, సురేష్‌బాబు, సిబ్బందిని అభినందించి వారికి కూడా క్యాష్ రివార్డులు అందచేస్తామని ఎస్పీ వివరించారు. ధైర్యసాహసాలను ప్రదర్శించి నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు వైటీ నాయుడు, బి.లక్ష్మీనారాయణ, ఎస్.రాఘవ పాల్గొన్నారు. మూడు రోజుల్లో నిందితుల అరెస్టు మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం సమీపంలో ఈనెల 11న రాత్రి సమయంలో చోటు చేసుకున్న ఘటనలో అంగడి జ్యోతి మృతి చెందడం విచారకరమని ఎస్పీ తెలిపారు. నిర్జీవ ప్రదేశం, వీధిలైట్లు లేని కారణంగా మరింత నిఘాను పెట్టలేక పోయామని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సీఆర్డీఏకు లేఖ రాస్తున్నామని చెప్పారు. యువతిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు లేవన్నారు. సాంకేతిక పరంగా విచారణ కొనసాగుతుందన్నారు. తెలిసిన వ్యక్తులే దుర్ఘటనకు కారణమై ఉంచవచ్చని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. మరో మూడు రోజుల్లో నిందితుల్ని అరెస్టు చేసి మీడియా ఎదుట ఉంచుతామని వివరించారు. -
నమ్మించి వంచించాడు
ఓ ప్రబుద్ధుడు తనను నమ్మించి వంచించాడంటూ పెదనందిపాడుకు చెందిన ఓ యువతి సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అనేక సార్లు లైంగిక దాడి చేసి.. ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని హతమార్చుతానని బెదిరించాడని వాపోయింది. ఇప్పుడు గర్భం దాల్చాక పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. గుంటూరు: ‘ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాల్లో లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే నాతోపాటు నా కుటుంబాన్ని హత మారుస్తానని బెదిరించాడు. గర్భిణిని చేశాక పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడు’ అంటూ ఓ యువతి సోమవారం గుంటూరులో జరిగిన పోలీస్ గ్రీవెన్స్‌లో క్రైమ్స్ ఏఎస్పీ ఎం వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. పెదనందిపాడుకు చెందిన యువతి ఇంటర్ చదువుతూ మధ్యలోనే ఆపేసి ఇంటి వద్దే ఉంటోంది. ఆమె ఇంటి సమీపంలోనే నివసించే దేవరకొండ గోపి.. ఆ యువతి ఒంటరిగా ఉండటాన్ని గుర్తించి లైంగిక దాడి చేశాడు. ఆపై జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే స్టువర్టుపురంలోని తన బంధువుల ద్వారా యువతిని, ఆమె కుటుంబాన్ని హతమారుస్తానని హెచ్చరించాడు. ఏమీతోచని పరిస్థితుల్లో ఆ యువతి మౌనంగా ఉండిపోయింది. కొద్ది రోజులకు యువతిని మళ్లీ అతని ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువతి గర్భిణి అయ్యింది. ఈ విషయం ఇద్దరి ఇళ్లలో తెలిసింది. చీరాలకు చెందిన తమ బంధువుల అమ్మాయితో వివాహం చేసేందుకు గోపి తల్లిదండ్రలు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన బాధిత యువతి గోపిని నిలదీస్తే పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. అతనికి, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి తమ ఇద్దరికీ వివాహం జరిపించాలని ఆ యువతి ఏఎస్పీని కోరింది. దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
అమృతలూరులో యువకుడి దారుణ హత్య
గుంటూరు, అమృతలూరు(వేమూరు): మండల కేంద్రమైన అమృతలూరులో గురువారం దారుణం జరి గింది. అమృతలూరుకు చెందిన కొమ్మెర్ల శేఖర్‌బాబు (42)పై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానికులు వచ్చి వెంటనే తెనాలి వైద్యశాలకు,ఆ వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. సేకరించిన వివరాల ప్రకారం... అమృతలూరుకు చెందిన కొమ్మెర్ల శేఖర్‌బాబుకు, పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రుకు చెందిన మారి విశాలాక్షితో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విశాలాక్షి పొన్నూరులో ఉంటూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. శేఖర్‌బాబు పొన్నూరులోనే పెయింట్ పనులకు వెళుతుంటాడు. వారం రోజుల క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. పొన్నూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో శేఖర్‌బాబు తల్లి వద్దకు అమృతలూరు వచ్చాడు. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం తెల్లవారు జామున సుమారు 2 గంటల సమయంలో మట్టి గోడను పగలగొట్టి దుండగులు లోనికి ప్రవేశించి నిద్రిస్తున్న శేఖర్‌బాబుపై గుర్తు తెలియని వ్యక్తి ఇనుప వస్తువుతో తలపై మోదడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చప్పుడుకు తల్లి కేకలు వేయగా దుండగుడు పరారయ్యాడు. నీకేమైనా నాకు సంబంధం లేదు... భార్యాభర్తలకు వివాదం జరిగిన నేపథ్యంలో భార్య విశాలాక్షి భర్త శేఖర్‌బాబుకు ఫోన్ చేసి నువ్వు నన్ను అంతటి పరాభవం చేశావు. నీకేమైనా జరిగినా నాకు సంబంధం లేదని చెప్పినట్టు స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో ఇంతటి ఘోరం జరగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వచ్చిన దుండగులు ఎవరు.. భార్య తాలూకూ వ్యక్తులా... లేక పెయింట్ పనులు చేస్తూ ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు రెండు బృందాలుగా విచారిస్తున్నారని చుండూరు సీఐ బి.రమేష్‌బాబు తెలిపారు. ఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ... ఘటనా స్థలిని తెనాలి డీఎస్పీ ఎం.స్నేహిత, చుండూరు సీఐ బి. రమేష్‌బాబు, ఎస్ఐ వి.బాలకృష్ణ పరిశీలించి ఆధారాలను సేకరించారు. పలు వస్తుసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించాలని ఆదేశించారు. మృతుడి తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. బాలకృష్ణ కేసు నమోదు చేశారు.శేఖర్‌బాబు మృతదేహానికి చుండూరు సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో, వీఆర్వో అనిల్ సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం అమృతలూరుకు తరలించారు. -
చనిపోతున్నానని దిబాకర్ ఫోన్‌కు మమత మెసేజ్..
గుంటూరు, పేరేచర్ల(తాడికొండ): అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన 22 రోజుల తరువాత ఆలస్యంగా వెలుగు చూసింది. మండల కేంద్రమైన మేడికొండూరులో ఈ ఉదంతం జరిగింది. యువతి సోదరి, తండ్రి ఒడిశా నుంచి వచ్చి తమ కుమార్తె చనిపోయిందంటున్నారని, దర్యాప్తు చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా అచోం గ్రామానికి చెందిన మమతాసేత్ ఆమె సోదరి నమితాసేత్, తండ్రి బసంత్‌కుమార్‌ను మేడికొండూరు మండల పరిథిలోని భీమనేనివారిపాలెం సమీపంలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో అదే రాష్ట్రానికి చెందిన గుత్తేదారు దిబాకర్ పనికి కుదిర్చాడు. మూడు సంవత్సరాల క్రితం నమితాకు వివాహం నిశ్చయమవటంతో వారు ముగ్గురూ ఒడిశాకు వెళ్లి పోయారు. అనంతరం మమతాసేత్ మాత్రం మళ్లీ మిల్లులో పనికి తిరిగి వచ్చింది. మొదటి నుంచి ఆమెతో చనువుగా ఉంటున్న దిబాకర్ మమతను తాను సొంతంగా పెట్టిన కిరాణా దుకాణంలో ఉంచి, ఇద్దరూ కలసి ఒకే గదిలో ఉండేవారు. దిబాకర్‌కు సామర్లకోటలో కూడా లేబర్ కాంట్రాక్టు ఉండటంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుండేవాడు. పోలీసుల విచారణలో వెలుగు చూసిన నిజాలు మమతాసేత్ జనవరి 15న అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. మమత అక్క, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మేడికొండూరు ఎస్ఐ సీహెచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మిల్లు దగ్గరకి వెళ్లి సహచర కూలీలు, మమత ఉండే గది పక్కన ఉన్న గుత్తేదారు దిబాకర్ తమ్ముడిని విచారించారు. విచారణలో దిబాకర్ తమ్ముడు మాట్లాడుతూ జనవరి 15 రాత్రి మమత ఎంత సేపటికి గదిలో నుంచి బయటికి రాక పోయేసరికి తాళాలు పగలకొట్టి చూశానని మమత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొందని తెలిపాడు. ఏంచేయాలో తెలియక తాను సామర్లకోటలో ఉన్న తన అన్న దిబాకర్‌కు ఫోన్లో సమాచారం అందించగా, మరో ఇద్దరితో కలసి దగ్గరలో ఉన్న శ్మశానవాటికలో ఖననం చేయమని చెప్పడంతో అలాగే చేశామని పోలీసులకు వివరించాడు. తాను చనిపోతున్నానని మమత దిబాకర్ ఫోన్‌కు మెసేజ్ కూడా పంపించిందని తెలపటంతో పోలీసులు దిబాకర్ కోసం వెతుకుతున్నారు. మమతా సేత్‌ను ఖననం చేసిన ప్రదేశాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. -
మహిళ విషయమై గొడవ.. యువకుడి హత్య
యువతి విషయమై జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన పిడుగురాళ్లలో సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. పట్టణానికి చెందిన మోరె గోపి(22)ని పదునైన ఆయుధాలతో హత్య చేసిన నిందితులు, మృతదేహాన్ని పట్టణంలోని రైల్వేట్రాక్‌పై పడేశారు. గుంటూరు పట్టణంలో వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఇక్కుర్తి శ్రీహరి (26)ని అతని స్నేహితుడి బంధువులు నిర్బంధించి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు , పిడుగురాళ్ల: యువకుడి దారుణ హత్య పిడుగురాళ్లలో సోమవారం సంచలనం సృష్టించింది. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ప్రజాశక్తి నగర్‌లోని మోరె గోపి(22) డ్రైవర్‌గా పనిచేస్తుం టాడు. ఆదివారం రాత్రి గోపి తన స్నేహితులతో కలసి మద్యం తాగి, ఓ మహిళ విషయమై గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. ఆ తర్వాత అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే గోపి కూడా తన ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఊరికి వెళతానంటూ గోపి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అయితే గోపి ద్విచక్రవాహనం అతని సోదరుడి వద్ద ఉంది. మద్యం తాగి ఉన్న గోపికి వాహనం ఇస్తే ప్రమాదమనే ఉద్దేశంతో సోదరుడు వాహనం ఇవ్వలేదు. చివరకు గోపి తన స్నేహితుడు శ్యామ్ ద్విచక్రవాహనాన్ని తీసుకుని ఊరికి వెళతానని ఇంట్లో చెప్పి బయలుదేరి వెళ్లాడు. అయితే తెల్లవారేసరికి రైల్వేబ్రిడ్జి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై గోపి శవమై కనిపించాడు. ఈ సమాచారం తెలుసుకున్న గోపి తల్లిదండ్రులు రమణమ్మ, వెంకటేశ్వర్లు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. రోడ్డుపై ఉన్న ద్విచక్రవాహనంపై రక్తపు మరకలు ఉండటంతో పాటు వాహనం ముందు భాగం ధ్వంసమైంది. అక్కడి నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న రైల్వేట్రాక్ మధ్యలో గోపి మృతదేహం పడి ఉంది. కాళ్లకు దెబ్బలతో పాటు తల రెండు భాగాలుగా చీలిపోయింది. ఏదో బలమైన ఆయుధంతో బలంగా కొట్టడం వల్ల తల చీలిపోయిందని, ఇది ప్రమాదం కాదని బంధువులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓవర్ బ్రిడ్జి కింద హత్య చేసి తర్వాత ప్రమాదంగా సృష్టించేందుకు రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పట్టణ సీఐ వీరేంద్రబాబు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గుంటూరు నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. డాగ్ స్క్వాడ్ ట్రాక్ వద్ద నుంచి పట్టణంలోని సుగాలితండా వద్దకు వచ్చి నిలిచిపోయాయి. దీంతో డాగ్‌స్క్వాడ్ అందించిన క్లూస్‌తో కేసు పురోగతి సాధించిందని, ఇది హత్యేనని సీఐ తెలిపారు. హత్యకు సంబంధించిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ వీరేంద్రబాబు తెలిపారు. మృతుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
స్నేహితుడి తమ్ముడు,బంధువుల ఘాతుకం
గుంటూరు ఈస్ట్: స్నేహితుడి బంధువులు అక్రమంగా నిర్బంధించి, కొట్టడంతో అస్వస్థతకు గురైన యువకుడు మృతిచెందిన ఉదంతం ఇది. పాతగుంటూరు ఎస్హెచ్ఓ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరు బాలాజీ నగర్ 8వ లైనులో నివసించే ఇక్కుర్తి శ్రీహరి (26) మణి హోటల్ సెంటర్లో శ్రీ మహాలక్ష్మి పెయింటింగ్స్ షాపు నిర్వహిస్తున్నారు. బర్జర్ పెయింట్ డీలర్‌గా వ్యవహరిస్తున్నారు. పొత్తూరి వారి తోటలో అదే ప్రాంతానికి చెందిన షేక్ హబీబ్ న్యూ ఎస్ఈ పెయింట్స్ షాపు నిర్వహిస్తూ ఏషియన్ పెయింట్స్ డీలర్‌గా ఉన్నారు. వీరిద్దరూ ఏడాది కాలంగా స్నేహంగా ఉంటూ రెండు కంపెనీల పెయింట్లను తమ అవసరాల మేరకు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. హబీబ్ గత నెల 25వ తేదీన 3 నెలలపాటు ఉండే విధంగా ఇండోనేషియా వెళ్తూ శ్రీహరికి ఏషియన్ పెయింట్స్ సరుకు అప్పచెప్పారు. సరుకు విక్రయించడం వలన వచ్చే కమీషన్‌ను అతనే డ్రా చేసేందుకు అనుగుణంగా రూ.70 వేలు చెక్కు రూపంలో ఇచ్చారు. హబీబ్ ఇండోనేషియా వెళ్లిన అనంతరం ఈ విషయం తెలుసుకున్న అతని తమ్ముడు జాబీబ్, బావ ఫిరోజ్ శ్రీహరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేందుకు పథకం వేశారు. పథకం ప్రకారం ఈ నెల ఒకటో తేదీ గుంటూరు వారి తోటలోని ఓ ఇంట్లోకి శ్రీహరిని రప్పించారు. జాబీబ్, ఫిరోజ్‌లతో పాటు వారి స్నేహితులైన ఆర్ఎస్ఐగా పనిచేసే మహ్మద్ మస్తాన్, ఓ పత్రికా విలేకరి (సాక్షి కాదు) అని చెప్పుకున్న షేక్ రహంతుల్లా కలిసి శ్రీహరిని బంధించి తీవ్రంగా కొట్టారు. శ్రీహరి సెల్లో నుంచి అతని అన్న సుధీర్‌కు ఫోన్ చేసి హబీబ్ ఇచ్చిన ఏషియన్ పెయింట్స్ స్టాకు మొత్తం వెనక్కి తెప్పించారు. సుధీర్ స్టాకు తెచ్చేలోపు శ్రీహరిని బెదిరించి 8 చెక్కులు, రెండు ప్రామిసరీ నోట్లు తీసుకున్నారు. అనంతరం అర్థరాత్రి సమయంలో శ్రీహరిని వదిలిపెట్టారు. వారికి భయపడిన అన్నదమ్ములిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బంధువులతో జరిగిన విషయం చెప్పి, ధైర్యం తెచ్చుకుని 3వ తేదీ రాత్రి పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్హెచ్ఓ శ్రీనివాసరావుకు జరిగిందంతా చెప్పి ఫిర్యాదు చేశారు. అనంతరం కొద్దిసేపటికే శ్రీహరి పోలీస్‌స్టేషన్‌లోనే తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ తప్పాడు. అతని వెంట ఉన్న బంధువులు శ్రీహరిని జీజీహెచ్‌కు తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీహరికి ఇంకా వివాహం కాలేదు. తండ్రి గతంలోనే మృతి చెందాడు. తమ కుమారుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని తల్లి వెంకటేశ్వరమ్మ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
బ్యాంక్ అధికారిపై గృహ హింస కేసు
గుంటూరు, తెనాలి: స్థానిక ఐడీబీఏ శాఖలో అసిస్టెంటు మేనేజరుగా పనిచేస్తున్న కరేటి శ్రీనివాస్, అతడి తలిదండ్రులు, సోదరిపై హైదరాబాద్‌లో గృహహింస కేసు (డీవీసీ నెం.56/2019) నమోదైంది. రాజేంద్రనగర్‌లోని 14వ మేజిస్ట్రేటు కోర్టులో శ్రీనివాస్, తల్లిదండ్రులు కరేటి ఉషారాణి, రామనాథ్, సోదరి అనితపై ఈనెల ఒకటో తేదీన కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఆదివారం తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ పాండురంగపేటకు చెందిన కరేటి శ్రీనివాస్‌కు, హైదరాబాద్‌లోని శివమౌనిక యాదవ్‌కు 2012 డిసెంబరులో వివాహమైంది. తెనాలిలోనే జరిగిన ఈ పెళ్లికి ముందుగానే కట్నం కింద నగదు, చెక్కులు, ఇతర ఆస్తుల్ని తీసుకున్నారు. మరో ఆర్నె ల్లకు భార్య దగ్గర మరో రూ.8 లక్షల్ని శ్రీనివాస్ తీసుకున్నాడు. ఇంత కట్నం తీసుకున్నా, ఇంకా డబ్బులు తెమ్మంటూ వేధింపులు ఆరంభించారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు ఉషారాణి, కరేటి రామనా«థ్, సోదరి అనిత కూడా ఇందుకు సహకరించినట్టుగా బాధిత శివమౌనిక యాదవ్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషనులో 2017లో ఫిర్యాదు చేశారు. దీనిపై అక్కడి పోలీసులు 498–ఎ ఐపీసీ 3,4 డీపీఏ కింద కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్టు చేశారు. గతేడాది పోలీసులు ఈ కేసులో చార్జిషీటును సమర్పించారు. శ్రీనివాస్, అతడి తండ్రి అధిక రేటుతో వడ్డీ వ్యాపారం చేస్తుంటారని, బాకీదారైన ఒక స్కూలు టీచరును ఇదే విషయమై దూషించగా, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చార్జిషీటులో పొందుపరిచారు. వరకట్న వేధింపుల కేసు విచారణ దశలో ఉండగా, తాజాగా హైదరాబాద్ కోర్టులో గృహహింస కేసు నమోదైంది. -
బెడ్లు ఖాళీ లేవు..!
గుంటూరు ఈస్ట్: పాక్షికంగా పక్షవాతం వచ్చిన మహిళను జీజీహెచ్ అత్యవసర విభాగంలో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోకపోవడంతో ఆమె వార్డు వెలుపల తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. అదే సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండటంతో వైద్య సిబ్బంది ఆమెను హడావుడిగా అత్యవసర విభాగంలోకి తరలించారు. వివరాల్లోకి వెళితే గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన వి.ఏసురత్నం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య కళావతి 3 నెలలుగా పాక్షిక పక్షవాతంతో అనారోగ్యానికి గురికాగా, ఆమెకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించాడు.అయితే అక్కడ వేసే బిల్లులు భరించలేక శుక్రవారం మధ్యాహ్నం జీజీహెచ్ అత్యవసర విభాగానికి తీసుకువచ్చాడు. అత్యవసర విభాంగలో వైద్యులు కళావతికి పరీక్షలు చేయించి మందులు రాసి ఇచ్చారు. ఇన్‌పేషెంట్‌గా చేర్చుకునేందుకు బెడ్లు ఖాళీ లేవని నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక ఏసురత్నం భార్యను తీసుకుని వార్డు వెలుపలకు వచ్చాడు. తమ వెంట వచ్చిన బంధువును కళావతి వద్ద తోడుగా ఉంచి ఆటో తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఆ సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉండటంతో పోలీసులు ఆటోను లోపలకు అనుమతించలేదు. చేసేదేమీ లేక ఏసురత్నం తిరిగి భార్య వద్దకు రాగా, కళావతి ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురై అదుపు తప్పి కింద పడిపోయింది. స్పీకర్ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండటంతో వైద్య సిబ్బంది హడావుడిగా కళావతిని అత్యవసర విభాగంలోకి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇన్‌పేషెంట్‌గా చేర్చుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఏసురత్నం కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. -
బహిర్భూమికి వెళ్లిన చిన్నారిపై..
ముక్కుపచ్చలారని పసికందులను ముచ్చటగా లాలించాల్సిన వారు.. రాబందుల్లా మారి పొడుచుకుతింటున్నారు. చాకెట్ల ఆశ చూపి మభ్యపెడుతున్న రాక్షసులు.. చిన్నారులపై రక్కసి మూకల్లా ఎగబడుతున్నారు. కమ్మని కథలు చెప్పి ఆడించాల్సిన తాతయ్యలు.. కామాంధులుగా మారి కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మద్యం మత్తులో మదమెక్కిన ఆకతాయిలు.. కళ్లెం తెగిన ఆంబోతుల్లా విచక్షణ మరిచి చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. ఆటపాటలతో నవ్వించాల్సిన వారే.. తమ శరీరాలతో వికృత ఆటలాడుతుంటే.. ఏం జరుగుతుందో తెలియక, అంతులేని బాధను తట్టుకోలేక లైంగిక దాడి బాధితులు విలవిలలాడుతున్నారు. కామాంధుల పశు వాంఛకు బలవుతున్న ఎందరో బాలికలు.. అమ్మో.. మృగాళ్లంటూ బిక్కుబిక్కుమంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రెంటచింతల మండలం తుమృకోటలో మంగళవారం రాత్రి ఏడేళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై నిరసనలు మిన్నంటాయి. సాక్షి, గుంటూరు:మానవ మృగాలు రెచ్చిపోయి అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై పడుతున్నారు. మద్యం మత్తులో ఒకరు.. పర్వర్షన్కు గురై మరికొందరు కామాంధులుగా మారి చిన్నారుల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులకు మాయమాటలు చెప్పి ఏమారుస్తూ కుత్సితమైన కామవాంఛలు తీర్చుకుంటున్నారు. తాత, బాబాయ్, సోదరుడు, మామయ్య, బావ వరుసలు అయ్యే వారితో పాటు, ఇళ్ల పక్కన నివాసం ఉంటూ నమ్మకంగా చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మృగాళ్లు చిన్నారుల తల్లిదండ్రులను శోకసంద్రంలోకి నెడుతున్నారు. నొప్పిగా ఉంది నన్ను వదిలేయ్ తాతా... ప్లీజ్ మామయ్య... భరించలేకపోతున్నానంటూ ఆ చిన్నారులు రోదించినా... పాషాణం లాంటి ఆ మానవ మృగాల మనస్సులు ఏమాత్రం చలించడం లేదు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న ఇటువంటి ఘటనలతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ చిన్నారులను ఆడుకునేందుకు బయటకు పంపేందుకు కూడా హడలిపోతున్నారు. మైనర్ బాలికలు, మహిళల రక్షణ కోసం పోలీసులు సబల, జ్వాల వంటి కార్యక్రమాలు పెట్టినా మైనర్ బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. చిన్నారులపై జరుగుతున్న వరుస ఘటనలు ఎలా అడ్డుకోవాలో తెలియక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. 10 నెలల్లో 20కు పైగా ఘటనలు జిల్లాలో పది నెలల వ్యవధిలో 20 మందికిపైగా చిన్నారులపై మృగాళ్లు లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు తప్ప, బాధిత కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. దాచేపల్లి ఘటనలో ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో శాంతి భద్రతల సమస్యతోపాటు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే కారణంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నిందితుడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడానికి కూడా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలే కారణంగా చెప్పవచ్చు. జిల్లాలో జరిగిన పలు సంఘటనలు పరిశీలిస్తే.. జిల్లాలోని మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 35 ఏళ్ల వయస్సు ఉన్న కేతావత్ బాలునాయక్ అనే మృగాడు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన 2018 మార్చి 22వ తేదీన జరిగింది. మానవ మృగం దాడికి తట్టుకోలేక తీవ్ర రక్తస్రావంతో ఆచిన్నారి లోకాన్నే వదిలేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. బెల్లంకొండ పోలీసుస్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న మూగ, చెవుడు బాలికపై 30 ఏళ్ల వయస్సు ఉన్న షేక్ ఘన్సైదా అనే కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన గత ఏడాది ఏప్రిల్ 20న జరిగింది. కొల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఏడేళ్ల వయస్సు చిన్నారిపై 25 ఏళ్ల వయస్సు ఉన్న జొన్నకూటి గోపి అనే మృగాడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నరసరావుపేట పట్టణంలోని బీసీ కాలనీలో ఏడేళ్ల వయస్సు ఉన్న చిన్నారిపై ఇంటి పక్కనే నివశించే షేక్ మౌలాలి అనే 55 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీన జరిగింది. పిట్టలవానిపాలెం మండలం చందోలు పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల వయస్సు ఉన్న చిన్నారిపై 20 ఏళ్ల వయస్సు ఉన్న చెట్టుపల్లి ప్రవీణ్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీన చోటు చేసుకుంది. దాచేపల్లి పట్టణంలో తొమ్మిదేళ్ళ బాలికపై అన్నం సుబ్బయ్య అనే 55 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన 2018 మే 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించడంతోపాటు, దీనిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా స్పందించి రోడ్లపై భారీ ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. నిందితుడు సైతం భయంతో ఉరివేసుకుని మృతిచెందాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడేవారికి భూమి మీద అదే చివరి రోజు అవుతుందంటూ హెచ్చరికలు కూడా చేశారు. అయితే ఆయన హెచ్చరించిన రెండు రోజులకే చుండూరు మండలం మోదుకూరులో ఏడేళ్ల వయస్సు ఉన్న చిన్నారిపై 25 ఏళ్ల వయస్సు ఉన్న మృగాడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో జిల్లాలో తీవ్ర అలజడి రేగింది. ఆ తరువాత పాతగుంటూరులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన యువకుడిని తమకు అప్పగించాలంటూ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి విధ్వంసానికి పాల్పడిన సంఘటన అందరికీ తెలిసిందే. చిన్నారిపై కిరాతకంగా... ఈ దుర్ఘటనలు మరువకముందే రెంటచింతల మండలం తుమృకోట గ్రామంలో ఏడేళ్ల మైనర్ బాలిక మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లడాన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన మిర్యాల జయరాం(27) పుల్గా మద్యం తాగి బాలిక నోరు మూసి సమీపంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేకలు వేస్తున్న బాలికను అత్యంత కిరాతకంగా రాయితో దవడపై కొట్టగా రెండు పళ్లు ఊడిపడ్డాయి. తమ కుమార్తె ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి బాలిక తల్లి బాలిక కోసం వెతుకుతుండగా రాత్రి 9.45 గంటల సమయంలో బాలిక తీవ్ర రక్త స్రావంతో ఏడ్చుకుంటూ ఒళ్లంతా గాయాలతో ఇంటికి వచ్చి జరిగిన సంఘటనను వివరించింది. ఆడపిల్లను కనడమే పాపమా..? ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు వారికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆటోలో పిల్లలను బడికి పంపాలన్నా, ఇంటి బయట ఆడుకునేందుకు పంపాలన్నా, బంధువుల ఇళ్లల్లో వదిలి వెళ్లాలన్నా.. భయపడాల్సిన దుస్థితి దాపురించింది. చిన్న, పెద్ద, బంధువులు, స్నేహితులు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క మగాడిని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆడపిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆడపిల్ల అర్థరాత్రి ఒంటరిగా తిరగడం మాట అటుంచి, పట్టపగలు ఇంటి బయటకు వెళ్లేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితులు తలెత్తడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
సతీ వియోగం భరించలేక..
వారికి పెళ్లయి దశాబ్దంన్నర అయ్యింది. ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. సంతానం లేకపోయినా అన్యోన్యంగా ఉంటూ పలువురి మన్ననలు చూరగొన్నారు. ఆమె తనకన్నా వయస్సులో ఐదేళ్లు పెద్దదైనా కళ్లల్లో పెట్టుకుని చూసుకునేవాడు. జీవితం సాఫీగా సాగుతోందనుకున్న సమయంలో విధి వక్రించింది. భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు అన్నీ తానై సేవలందించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్ర అనారోగ్యానికి గురై భార్య కన్నుమూసింది. ఆమె లేని ఈ లోకంలో తాను మాత్రం ఎందుకంటూ తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో చోటు చేసుకుంది. అమరావతి, రామవరప్పాడు (గన్నవరం): రామవరప్పాడు గోళికృష్ణయ్య వీధిలో గొట్టిపాటి నాగమురళీకృష్ణ (45) ప్రశాంతి (50) దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రశాంతి తల్లితండ్రులు కృష్ణలంకలో ఉంటారు. మురళీకృష్ణ తల్లిదండ్రులు మచిలీపట్నంలో ఉంటున్నారు. వీరికి వివాహం అయిన తర్వాత గ్రామంలోనే ఉంటున్న ప్రశాంతి అక్కకు చెందిన భవనంలోని ఓ పోర్షన్లో కాపురం పెట్టారు. మురళీకృష్ణ మహానాడు రోడ్డులోని ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంతి కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైంది. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో అప్పటి నుంచి భార్యను కంటికిరెప్పలా చూసుకుంటూ సేవలందించాడు. ఉద్యోగానికి వెళ్తూనే భార్యకు అన్ని సమకూర్చేవాడు. కాలక్రమేణా వ్యాధి ముదిరి లివర్‌కు సోకింది. దీంతో నిత్యం ఏసీ గదిలోనే భార్యను ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి బాత్రూమ్కు వెళ్లి ప్రశాంతి అనుకోకుండా మూడుసార్లు కింద పడిపోయింది. దీంతో ఆమెను తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ప్రశాంతి మంచంపైనే తుది శ్వాస విడిచింది. ఇది గమనించిన భర్త తీవ్ర మనోవేధనకు గురై హాల్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 11 గంటలు దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పక్క పోర్షన్ నివాసితులు తలుపులు బద్దలు కొట్టి చూడగా భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ అంకినేని ప్రసాద్, పటమట ఎస్ఐ సత్యసుధాకర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మురళీకృష్ణ మృతదేహం వద్ద లభ్యమైన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనపరుకున్నారు. బంధువులు, స్నేహితులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అన్యోన్యతకు మారుపేరుగా... మురళీకృష్ణ, ప్రశాంతి ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఒక్క చిన్న గొడవ కూడా జరిగిన దాఖలాలు లేవని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. మురళీకృష్ణ చలాకీగా అందరిని నవ్విస్తూ ఉండేవాడని సన్నిహితులు, తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతరమయ్యారు. ఇంట్లో భార్య ఒంరిగా ఉంటుందని, సమయానికి ఇంటికి వచ్చేసి ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడని చెబుతున్నారు. భార్య అనారోగ్యానికి గురైన నాటి నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లడం, సమయానికి మందులు ఇవ్వడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం వంటివి చేసేవాడని పక్క నివాసితులు తెలిపారు. వీరి మృతదేహాలను చూసిన చుట్టుపక్కల వాళ్లు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. భార్యలేని జీవితాన్ని ఊహించుకోలేకే... భార్యలేని జీవితాన్ని ఊహించుకోలేకే తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు మురళీకృష్ణ సూసైడ్ నోట్లో వివరించాడు. కొన్ని మాసాలుగా ప్రశాంతికి ఆరోగ్యం బాగోవడం లేదని, ఆమెను కాపాడుకోవడానికి ఎంతగానో శ్రమపడ్డానని రాశాడు. బ్యాంక్‌లో కుదవ పెట్టిన బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల వివరాలను కూడా సూసైడ్ నోట్లో వివరంగా రాశాడు. -
వరుసకు చెల్లెలు అయిన మహిళ ఫొటోను..
గుంటూరు, పిడుగురాళ్లటౌన్: పట్టణానికి చెందిన తాడేపల్లి సందీప్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ వీరేంద్రబాబు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ పట్టణానికి చెందిన తాడేపల్లి సందీప్‌కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తన తండ్రితో పాటు వ్యాపారం చేస్తున్నాడు. 2017 డిసెంబర్ నెలలో ఓ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్‌ను ఏర్పాటు చేసుకుని అప్పటినుంచి పట్టణంలోని వరుసకు చెల్లెలు అయిన ఓ మహిళ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్‌చేసి ఆమెకు అసభ్యకరమైన సందేశాలను పంపిస్తున్నాడు. ఈ క్రమంలో మహిళ, ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్డీపీఓ ఆదేశాల మేరకు సీఐ వీరేంద్రబాబు, ఎస్ఐ టీపీ నారాయణస్వామి, సిబ్బంది శాస్త్రీయ పరిశోధన ద్వారా కేసును దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో గురువారం పిడుగురాళ్ల బస్టాండ్‌లో సందీప్‌ను అరెస్ట్‌చేశారు. నిందితుడిని శుక్రవారం కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
దోపిడీ, చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
గుంటూరు:వ్యసనాలకు బానిసలుగా మారి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు, ఇంటి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు యువకులను అర్బన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఏఎస్పీ ఎస్.రాఘవ వివరాలు వెల్లడించారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌కు చెందిన పెండ్ర ముత్తయ్య పందుల పెంపకం చేస్తూ జీవిస్తుంటాడు. పేకాట, కోడి పందేలు, మద్యానికి బానిసగా మారాడు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో శ్రీనివాసరావు పేటకు చెందిన స్నేహితుడు బండి శేషుతో కలసి దోపిడీలకు పాల్పడడం ప్రారంభించారు. రోడ్ల వెంట చిరు వ్యాపారాలు చేసుకునే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, వారికి మాయమాటలు చెప్పి వారిని నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి కొట్టి భయపెట్టి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు దోపిడీ చేసి పరారవుతుంటారు. ఈ తరహాలో గత నెల 28 వ తేదీ నుంచి ఈనెల 21 వ తేదీ వరకు అర్బన్ జిల్లా పరిధిలోని ఆరు దోపిడీలు, ఓ ఇంటి దొంగతనానికి పాల్పడ్డారు. వరుసగా జరుగుతున్న దోపిడీలపై కేసులు నమోదవుతుండటంతో సీసీఎస్ పోలీసులు, అర్బన్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు మంగళవారం మంగళగిరి ఫ్లైఓవర్ వద్ద ఉన్నట్టు సమాచారం అందడంతో చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, దోపిడీ,దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద ఉన్న 42 గ్రాముల బంగా>రు ఆభరణాలు, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో ప్రతిభను కనపరిచిన అధికారులు, సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్స్ చేశారు. నిందితులపై సస్పెక్ట్ షీట్లు ప్రారంభించామని ఏఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐలు రవిబాబు, అబ్దుల్ కరీం, ఎస్ఐ భార్గవ్, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని.. దారుణం
-
చోరీకి వచ్చి మహిళపై హత్యాయత్నం
గుంటూరు, పేరేచర్ల(ఫిరంగిపురం): మద్యానికి బానిసై చేతిలో డబ్బులు లేక దొంగతానికి పూనుకొన్నాడు. పక్కా స్కెచ్ వేసి తన ఇంటి పక్క ఇంటిలో జొరబడి ముసుగు వేసుకొని గుంటనక్కలా నక్కి మహిళ బయటకు రాగానే ఆమె కళ్లలో కారం కొట్టి ఆపై కర్రతో తలపై మోదాడు. తీవ్ర రక్త స్రావం అవుతున్న ఆమె మృతి చెందలేదని తెలుసుకొని గ్యాస్ సిలండర్‌కు ఉన్న పైపు తీసి ఆమె శరీర భాగాలపై కాల్చి చేతికున్న నాలుగు గాజులు లాక్కుని ఉడాయించాడు. తేరుకొన్న మహిళ స్థానికులను కేక వేయడంతో వారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎన్నడూ ఊహించని ఈ ఘటనతో ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంటిలో నక్కిన దుండగుడు ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం... తొర్లికొండ బాబూరావు వేములూరిపాడులో అద్దె ఇంట్లో ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తన ఇంటి పక్కనే నివాసముంటున్న తాటి శివకుమారికి భర్త లేకపోవటం, కొడుకులు ఇద్దరు విదేశాల్లో ఉండటంతో ఒంటరిగా నివసిస్తుందని తెలుసుకొని ఆమె ఇంట్లో దొంగతనం చేయటానికి అదునుగా భావించాడు. ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో గోడ దూకి దుప్పటి కప్పుకొని శివకుమారి ఇంటి ముందు నక్కాడు. ఆమె కాలకృత్యాలు తీర్చుకోవటానికి బయటకు రాగానే నిందితుడు తన వెంట తెచ్చుకొన్న కారం ఆమె కళ్లలో కొట్టి వెంటనే కర్రతో తలపై మోదాడు. ఆమె తలకు బలంగా దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావం అవడంతో చనిపోలేదని తెలుసుకొని వంట గదిలోకి ఆమెను ఈడ్చుకొని వెళ్లి అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ పైపు తీసి దానిని వెలిగించి ఆమె శరీర భాగాలను కాల్చడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమె చేతికున్న నాలుగు బంగారు గాజులను లాక్కొని పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన శివకుమారి స్థానికులకు ఘటన విషయం చెప్పటంతో 108లో గుంటూరు సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడింది బాబూరావే అని బాధితురాలు పోలీసులకు స్పష్టంగా చెప్పటంతో అతని కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ విషయం తెలుసుకొన్న నర్సరావుపేట డీఎస్పీ డి.రవివర్మ, గుంటూరు రూరల్ సీసీయస్ డీఎస్పీ వై.రవికృష్ణకుమార్ సిబ్బందితో కలసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లను, బంధువులను పిలిపించి ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీశారు. విదేశాల్లో ఉన్న బాధితురాలి కొడుకులతో మాట్లాడారు. నిందితుడు పరారవడంతో నిందితుడి తల్లి, కుమారుడును అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు తాటి శివకుమారిపై దాడి చేసి అనంతరం ఆమె చేతి గాజులతో ఉడాయించిన బాబూరావును రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు రూరల్ సీసీయస్ పోలీసులు గంటల వ్యవధిలోని పట్టుకొని అదుపులోకి తీసుకొన్నారు. సీసీయస్ డీఎస్పీ వై.రవికృష్ణ కుమార్, నర్సరావుపేట రూరల్ సీఐ బీసీహెచ్ చినమల్లయ్య ఆదివారం ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుడిని గుంటూరు పూలమార్కెట్ సెంటర్ వద్ద గాజులు విక్రయిస్తుండగా పట్టుకొన్నట్లు తెలిపారు. నిందితుడు నుంచి నాలుగు గాజులు రికవరీ చేశామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. -
ఆలయాల్లో చోరీలకు పాల్పడే దొంగల ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: అర్థరాత్రి సమయాల్లో దేవాలయాల్లో దేవుని హుండీలను పగులగొట్టి దొంగతనం చేసే ముఠాను గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ అరెస్ట్‌చేసి శుక్రవారం కోర్టుకు అప్పగించారు. చోరీలకు పాల్పడిన వారి వద్దనుంచి రూ.10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర శివారుల్లో ఆలయాల్లో చోరీలు అధికమయ్యాయన్న సమాచారం మేరకు అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాలమేరకు సీసీఎస్ అడిషనల్ ఎస్పీ ఎస్.రాఘవ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ అబ్దుల్ కరీం నేతృత్వంలో టీంలుగా ఏర్పడి విచారించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మండలంలోని అడవితక్కెళ్ళపాడు గ్రామంలోగల నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నగరంలోని పాతగుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన షేక్ ఖాజా అలియాస్ అమ్మూ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులకోసం గతంలో నగరంలోని లాలాపేట, పాతగుంటూరు, నల్లపాడు, పెదకాకాని తదితర చోట్ల చోరీలకు పాల్పడి పోలీసులకు దొరికి, అనేకసార్లు విజయవాడలోని జువైనల్ హోంలో శిక్ష అనుభవించాడు. జైలునుంచి విడుదలైన అనంతరం పాతగుంటూరులో అతని ఇంటివద్ద క్యాటరింగ్ పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో క్యాటరింగ్ పనుల్లో ఆతనికి తోడుగా వచ్చిన పాతగుంటూరు యానాదికాలనీకి చెందిన షేక్ జాఫర్అలి, షేక్ అస్గర్ పరిచయమయ్యారు. దీంతో గతంలో తాను చేసిన చోరీలను గురించి ఖాజీ వారిద్దరికీ తెలిపాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించవచ్చని చెప్పి రాత్రి సమయాల్లో చోరీలకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి ఈనెల 10న మండలంలోని చౌడవరం గ్రామంలో గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో తలుపులు పగులగొట్టి హుండీలోని రూ.5 వేల నగదును అపహరించారు. అదే రోజు అదే గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో హుండీని పగులగొట్టి అందులోని రూ.5 వేల నగదును అపహరించుకుపోయారు. మండలంలోని వెంగళాయపాలెం, నల్లపాడు, హౌసింగ్‌బోర్డు తదితర ప్రాంతాల్లో పలు ఆలయాల్లో చోరీలకు ప్రయత్నం చేయగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయటంతో పారిపోయారు. ఆలయ అర్చకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయాల్లోని సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల వివరాలను సేకరించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా చేసిన చోరీలను ఒప్పుకున్నారు. దీంతో నిందితులు ముగ్గురిని కోర్టుకు అప్పగించనున్నట్టు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకోవటంలో చొరవ చూపిన సీసీఎస్ సీఐ అబ్దుల్ కరీం, సురేష్‌బాబు, నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐ బాబూరావు, సిబ్బంది సాయికుమార్, గురవయ్య, రమేష్‌బాబు, సాగర్‌బాబు, వీరాంజనేయులు, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు తదితరులను అర్బన్ ఎస్పీ అభినందించారని తెలిపారు. -
కారులో తరలిస్తున్న 100 కేజీల గంజాయి స్వాధీనం
గుంటూరు, చిల్లకల్లు (జగ్గయ్యపేట) : కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలోని గౌరవరం గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీ 37 ఏవై 3333 కారులో అక్రమంగా గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు చిల్లకల్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీఐ జయకుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ చిరంజీవి సిబ్బందితో జీఎంఆర్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న కారు టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చింది. అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను గమనించి వారి కారును సమీపంలోని గౌరవరం గ్రామానికి మళ్లించారు. అది గమనించిన పోలీసులు ఆ కారును వెంబడించారు. గ్రామం సమీపంలోని యూకల్లిప్టస్ (జామాయిల్) తోట వద్ద కారును వదిలి అందులోని వారు పరారయ్యారు. దాంతో పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో 100 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురికి జీవితఖైదు
గుంటూరు లీగల్/పట్నంబజారు(గుంటూరు): బాలుడిని కిడ్నాప్ చేసి, ఆపై అడిగినంత డబ్బులు ఇవ్వలేదని దారుణంగా హతమార్చిన కేసులో ముగ్గురు వ్యక్తులకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ నాల్గో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎ.లక్ష్మి గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నక్కా శారదామణి కథనం ప్రకారం... ఏటీ అగ్రహారం జీరో లైనులో నివాసం ఉంటున్న నన్నం జయకుమారి, నాగరాజుల ఏకైక సంతానం యదీద్యరాజు (12) ఏటీఅగ్రహారం 8వ లైనులో శాంతన్ స్కూల్లో 6వ తరగతికి చదువుతున్నాడు. కారంపూడి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ముద్దాయి ఇరుగుల వీర వెంకట నాగ మణికంఠ అలియాస్ మణికంఠ అదే పాఠశాలలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్నాడు. మణికంఠ ముప్పాళ్ల మండలం బొల్లాపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి గోపితో పరిచయం పెట్టుకుని అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇరువురు వ్యక్తులను కిడ్నాప్ చేయాలని ప్రణాళిక వేసి విఫలం అయ్యారు. 2016, ఏప్రిల్ 14వ తేదీన కిడ్నాప్.. ఈ క్రమంలో మణికంఠ పనిచేస్తున్న పాఠశాలలోనే ఎవరినైనా విద్యార్థిని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో రామిశెట్టి గోపి చింతపల్లి గ్రామానికి చెందిన వేల్పుల పిచ్చయ్యను కలుపుకుని ముగ్గురు ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలో శాంతన్ స్కూల్లో 6వ తరగతి విద్యార్థి యదీద్యరాజును కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో 2016, ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం పిల్లలు ఆటలు ముగించుకుని, తదుపరి ట్యూషన్ కూడా ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో మణికంఠ దారిలో కలిసి ఆరోజు తన పుట్టినరోజు అని నమ్మించి కేక్ కట్ చేయాలని యదీదిత్యరాజును ద్విచక్రవాహనంపై గోపితో కలిసి హౌసింగ్‌బోర్డు కాలనీలో తాను నివాసం ఉండే రూముకు తీసుకెళ్లారు. అక్కడ వీరితో పిచ్చయ్య కలిశాడు. యదీద్యరాజు దగ్గర అతని తల్లి ఫోన్ నంబరు తెలుసుకున్న మణికంఠ ఆమెను కలిసి మీ అబ్బాయిని కిడ్నాప్ చేశామని, రూ.15 లక్షలు ఇస్తే వదిలి పెడతామని డిమాండ్ చేశారు. 16వ తేదీ సాయంత్రం లోపు ఇవ్వకపోతే అబ్బాయిని చంపుతామని రాత్రి 9.30 గంటల సమయంలో ఫోన్ చేశారు. ముందు విషయం నమ్మక అబ్బాయి కోసం స్కూల్ వద్దకు వెళ్లి వాకబు చేయగా, అక్కడ వారు పిల్లాడి ఇంటికి బయల్దేరి వెళ్లినట్లు తెలుసుకున్నారు. యదీద్యరాజుకు కూల్‌డ్రింక్స్‌తో మత్తు బిళ్లలు కలిపి ఇవ్వడంతో స్పృహ కోల్పోయాడు. ఈ విషయమై 15వ తేదీ యదీద్యరాజు తల్లి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితుల సూచనల మేరకు కిడ్నాపర్లు ఫోన్ చేసినప్పుడు వారి మాటలు రికార్డు చేయాలని సూచించారు. 15వ తేదీ కిడ్నాపర్లు ఫోన్ చేయగా, రూ. 15 లక్షలు ఇవ్వలేమని రూ. లక్ష ఇస్తామని చెప్పడంతో వారు కుదరదని చెప్పడంతో చివరకు రూ.2 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం మొత్తం జయకుమారి ఫోన్లో రికార్డు చేసింది. గుంటూరు రైల్వే స్టేషన్‌లోని మాచర్ల ట్రెయిన్లో చివరి పెట్టెలో రూ. 2 లక్షలతో ప్రయాణించాలని కిడ్నాపర్లు కోరగా, విజయకుమారి సోదరుడు రాజు రూ. 2 లక్షలు తీసుకుని ట్రెయిన్లో నుంచి వారు కోరిన చోట నగదు వేశారు. ట్రెయిన్లో గోపి ప్రయాణిస్తూ పోలీసు వారు కూడా మఫ్టీలో ఉన్నారని తెలుసుకుని ట్రెయిన్ నుంచి దూకి వెళ్లిపోయాడు. దీంతో ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి యదీద్యరాజును కిడ్నాపర్లు కిరాతకంగా హత్య చేసి ఫిరంగిపురం మండలం 113 త్యాళ్లూరు పొలాల్లోని బావిలో పడేశారు. బావిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పొలం యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఎం.హైమారావు, కరీముల్లాలు కేసు దర్యాప్తు చేయగా, సీఐ సీతారామయ్య కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో 44 మంది సాక్షులు ఉండటంతో లైజన్ ఆఫీసర్ శివప్రసాద్, ఘన్సైద్, ఎం.డి.రఫీ, కోర్టు కానిస్టేబుల్, చంద్రశేఖరరెడ్డి, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో చొరవ చూపారు. నిందితులపై నేరం రుజువు కావడంతో పైమేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఉరి తీసిన తప్పులేదు చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా చంపారయ్యా. ఆఖరికి డబ్బులు కూడా ఇచ్చా. అవి తీసుకుని కూడా దుర్మార్గంగా వ్యవహరించి నా బిడ్డను పొట్టన బెట్టుకున్నారయ్యా. ఇటువంటి కిరాతకులను ఉరి తీసిన తప్పులేదు. నా బిడ్డ కిడ్నాప్ విషయంలో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన డీఎస్పీ కేజీవీ సరిత, సీఐ హైమారావుకు రుణపడి ఉంటాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ఇదో గుణపాఠం కావాలి. –జయకుమారి, యదిత్యరాజు తల్లి -
ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు కిడ్నాప్ డ్రామా
గుంటూరు, తాడేపల్లిరూరల్: నవ్యాంధ్ర రాజధానిలో దళారులు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. రాజధాని ప్రాంతమైన తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో మహేష్ నివసిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పిచ్చికందుల గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీనివాసరావు కొన్నేళ్ల క్రితం విజయవాడ వచ్చి గ్రానైట్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. రాజధాని ప్రాంతంలో 5 సెంట్ల స్థలం కావాలని కోరడంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మహేష్ స్థలాన్ని చూపించారు. మహేష్ సర్వే నబరు 172/2లో ఉన్న తన 5 సెంట్ల భూమిని రూ.40లక్షలకు అమ్ముతున్నట్లు 2017 సెప్టెంబరు నెలలో రూ.5లక్షలు ఇచ్చి అగ్రిమెంటు రాయించుకున్నారు. అదే నెలలో మరో రూ.6 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని, చెల్లించాల్సిన మిగతా సొమ్ముకు చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత కొత్తపల్లి శ్రీనివాసరావు ఫోన్ తీయకపోవడంతో పలుసార్లు విజయవాడ షాపునకు వెళ్లినా సమాధానం చెప్పలేదని బాధితుడు మహేష్ తెలియజేశాడు. మంగళవారం తాడేపల్లి బైపాస్‌రోడ్డులో కొత్తపల్లి శ్రీనివాసరావు కనిపించడంతో అడ్డుకొని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం పద అని మాట్లాడగా కాళ్లూగడ్డాలు పట్టుకొని రాయపూడిలో పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుందామని తీసుకెళ్లాడని, అనంతరం స్థలం కొనుగోలు చేసిన శ్రీనివాసరావు తన సహచరులకు ఫోన్ చేసి, మహేష్ కిడ్నాప్ చేశాడని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడని మహేష్ తెలిపారు. పోలీసులు తనకు ఫోన్ చేశారని, వెంటనే శ్రీనివాసరావును పోలీస్‌స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చానని, కిడ్నాప్ చేస్తే పెద్ద మనుషులతో కలిసి ఎందుకు మాట్లాడతామంటూ ప్రశ్నించినా, పోలీసులు చెప్పింది వినకుండా అతను చెప్పిన అందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
రెండు చోట్ల చైన్ స్నాచింగ్
గుంటూరు ఈస్ట్: రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో కొద్ది నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులు తెంచుకుని పోయిన ఘటన గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో కలకలం రేపింది. సేకరించిన సమాచారం మేరకు... లాలాపేట పరిధిలోని చలమయ్య కళాశాల రోడ్డులో మిట్టపల్లి రాజశేఖర్ భార్య రాణి మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో నడిచి వెళుతుంది. ఓ అగంతకుడు తలకు హెల్మెట్ పెట్టుకుని ద్విచక్రవాహనంపై వచ్చి రాణి మెడలోని ఎనిమిది సవర్ల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. చైన్‌కు ఉన్న రాకెట్ మాత్రమే కిందపడింది. 20 నిమిషాల తేడాతో అదేగంతకుడు పాతగుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని బూరెల వారివీధిలో నడిచి వెళుతున్న పాదర్తి ఎస్.ఎన్.మూర్తి భార్య సుగుణ మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. ఒకే వ్యక్తి రెండు చైన్‌స్నాచింగ్‌లు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రెండు చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్నారు. ఈస్ట్, వెస్ట్ పరిధిలోని అన్ని స్టేషన్ల సీఐలు, స్పెషల్ బ్రాంచ్‌ల పోలీసులు సంఘటనా స్థలాలకు వెళ్లి విచారణ మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు పలు బృందాలను నిందితుడిని పట్టుకునేందుకు నియమించారు. -
పథకం ప్రకారమే తండ్రీ కొడుకుల హత్య
గుంటూరు: తండ్రీ కొడుకులను పథకం ప్రకారం హతమార్చిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సి.హెచ్.విజయారావు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం చంపాపేట గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్య, అతని కుమారుడు సురేష్ పొక్లయినర్‌ను రెండు నెలల క్రితం సచివాలయం నుంచి నూతనంగా నిర్మిస్తున్న సీడ్‌యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులకు తీసుకొచ్చారు. పొక్లయినర్ ఆపరేటర్‌గా జార్ఖండ్ రాష్ట్రంలోని కర్ఖేలా జిల్లా సుర్తాద్ గ్రామానికి చెందిన నాగేశ్వరకుమార్ బోక్తా అలియాస్ నరేష్‌ను, అతనికి అసిస్టెంట్లుగా అదే రాష్ట్రంలోని చాత్రా తాలూకా డెహురి గ్రామానికి చెందిన డెహురి అరవింద్ గంజు అలియాస్ చుల్హాన్, మరో మైనర్‌బాలుడిని నియమించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు చేస్తున్న క్రమంలో పొక్లయినర్లోని డీజిల్‌ను ముగ్గురూ కలిసి దొంగిలించి పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన శ్రీను, ధనుంజయ, అమర్బాబులకు విక్రయించారు. విషయం పొక్లయినర్ యజమానులకు తెలియడంతో గత నెలలో వారు ముగ్గురిని లక్ష్మయ్య పనుల నుంచి తొలగించి, వారి స్థానంలో బీహార్ రాష్ట్రానికి చెందిన మరో ఆపరేటర్‌ను నియమించుకున్నాడు. తమను ఉద్దేశపూర్వకంగా పని నుంచి తొలగించారని పొక్లయినర్ యజమానులైన లక్ష్మయ్య, అతని కుమారుడు సురేష్‌లపై వారు కక్ష కట్టారు. ఈ క్రమంలో గతనెల 14వ తేదీ రాత్రి సమయంలో పొక్లయినర్ వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో తండ్రీ కొడుకులను హతమార్చి సమీపంలోనే పది అడుగుల లోతు గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. తండ్రీ కొడుకుల వద్ద ఉన్న రూ.14వేల నగదు, సెల్ఫోన్లు తీసుకున్నారు. పొక్లయినర్లో ఉన్న 90 లీటర్ల డీజిల్‌ను కూడా దొంగిలించి, విక్రయించుకుని హైదరాబాద్ పరారయ్యారు. అక్కడ వారి స్నేహితుడు ప్రతాప్‌కు సెల్ఫోన్లు అప్పగించి వారి స్వగ్రామానికి వెళ్లారు. ఇదిలా ఉంటే 14వ తేదీ ఇంటికి వస్తామని చెప్పిన తండ్రీ కొడుకులు రాకపోవడంతో అదేనెల 19వ తేదీన లక్ష్మయ్య భార్య కాలమ్మ, కుమారులు మంగళగిరి వచ్చి విచారించారు. ఆచూకీ తెలియకపోవడంతో మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పొక్లయినర్ నిలిపిన సమీపంలో అనుమానం రావడంతో తవ్వి చూడగా తండ్రీ కొడుకుల మృతదేహాలు లభించాయి. నిందితులు ముగ్గురూ శుక్రవారం పనుల కోసం మళ్లీ రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచామని ఎస్పీ వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులకు వస్తున్న ఇతర రాష్ట్రాల కూలీల వివరాలు సేకరిస్తున్నామని వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు వై.టి.నాయుడు, లక్ష్మీనారాయణ, డీఎస్పీ రామకృష్ణ, సీఐలు బాలాజీ, రవిబాబు పాల్గొన్నారు. -
ప్రేమ విఫలమై బాలుడి ఆత్మహత్యాయత్నం
గుంటూరు, వినుకొండటౌన్: పాఠశాలలు, కళాశాలల్లో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రేమికుల ఆత్మహత్యాయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మసీదు మాన్యంలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలుడు, మైనర్ బాలికను ప్రేమించాడు. సెల్ఫోన్లో పరిచయమైన వారు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆనోటా ఈనోటా ఆ విషయం పెద్దల దృషికి చేరింది. ఇద్దరూ మైనర్లు కావడంతో కొంతకాలం వేచి ఉన్న తర్వాత వివాహం చేస్తామని పెద్దలు నచ్చచెప్పినట్లు తెలిసింది. దీనికి నిరాకరించిన ప్రేమికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు, ప్రేమికుని బంధువులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని బంధువులు తెలిపారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
గుంటూరు, పామర్రు: మంచులో ప్రయాణం ప్రాణాల మీదకొస్తోంది. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు. పామర్రు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. గాయాలతో బయటపడ్డారు. పోలీసులు అందించిన వివరాలు.. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో లారీ చల్లపల్లి నుంచి పామర్రుకు వస్తోంది. స్థానిక కోటి జగపతి ఎస్టేట్స్ వద్దకు రాగానే విపరీతమైన మంచుతో దారి కనిపించక అదుపు తప్పింది. విజయవాడ నుంచి అవనిగడ్డ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుని ఎదురుగా బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుకు కుడివైపు కూర్చున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ బెల్లంకొండ చలపతి తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ బస్ డ్రైవర్ నాగేశ్వరరావు, కండక్టర్ నారాయణలతో పాటు ప్రయాణికులు రమేష్, రాజేశ్వరి గాయపడ్డారు. క్షత గాత్రులను 108లో గుడివాడ ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనలో లారీలో ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఉండటం కారణంగానే భారీ పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పీ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిలాడీ దంపతులు
గుంటూరు: పథకం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ గుట్టుచప్పుడు కాకుండా వారు నివాసం ఉంటున్న బజారులోని నివాసాల్లో చోరీలు చేస్తుండటాన్ని పసిగట్టిన అర్బన్ సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా భర్తను అదుపులోకి తీసుకోగా భార్య విషయం తెలుసుకొని పరారైంది. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. పాత గుంటూరులోని బాలాజీ నగర్ 9వ లైనులో పాలెం రాజేష్, అతని భార్య వెంకటేశ్వరమ్మ నివాసం ఉంటున్నారు. తాపీ పనులకు వెళ్లే రాజేష్ వ్యసనాలకు బానిసై అదే బజారులో భార్యను కాపలాగా ఉంచి ఇళ్లలో చోరీలు చేయడం ప్రారంభించాడు. 2016లో ఓ ఇంట్లో చోరీ చేసి పోలీసులకు ఇప్పటివరకు పట్టుబడలేదు. అదే నమ్మకంతో ఈనెల 20న మరో ఇంట్లో చోరీ చేశాడు. చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు రాజేష్‌ను అనుమానించి, అతన్ని ఓ కంట కనిపెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం లాలాపేట పూలమార్కెట్ సెంటర్లో చోరీ చేసిన వస్తువులతో ఉండగా, గుర్తించి చాక చక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దఉన్న రూ.12 లక్షల విలువచేసే 400 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వరమ్మ ఇంటికి తాళం వేసి పరారైంది. భార్యతో కలసి చోరీలకు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించినట్టు ఎస్పీ వివరించారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న సీసీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించి ఎస్పీ క్యాష్ రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీలు వైటీ నాయుడు, ఎస్.రాఘవ, డీఎస్పీ డి.ప్రసాదు, సీఐలు ఎస్.శ్రీనివాసరావు, సీహెచ్‌వీబీ సుబ్రమణ్యం, షేక్ అబ్దుల్ కరీం, ఎస్ఐ అమీర్, ఏఎస్ఐ ఎ.కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పొగమంచు
గుంటూరు, కంచికచర్ల (నందిగామ) : పొగమంచు దట్టంగా వ్యాపించడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, 11 మంది గాయాలపాలైన ఘటన కంచికచర్లలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. హైద్రాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన 9 ఈవెంట్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన 12మంది కాకినాడలో జరిగే ఓ ఫంక్షన్లో క్యాటరింగ్ చేసేందుకు కారులో హైద్రాబాద్ నుంచి రాత్రి 2.30గంటలకు బయలుదేరారు. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఖాళీ సమయాల్లో క్యాటరింగ్ పనులకు వెళ్తుంటారు. వీరు ప్రయాణించే కారు కంచికచర్ల కంచలమ్మ చెరువు కట్టపైకి రాగానే ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, ఆ తర్వాత అదే రూట్లో ముందున్న రోడ్డు రోలర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. అయితే తెల్లవారుజాము కావటంతో రోడ్డుపై దట్టంగా పొగమంచు అలుముకుని ఉంది. దీంతో ముందు వెళ్తున్న వాహనాలు సక్రమంగా కనిపించకపోవటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తటకంటి గణేష్ (25) అనే వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. అతనికి రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్యతో సహా క్యాటరింగ్ పనులకు వెళ్తున్నాడు. ఈ ప్రమాదంలో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. భర్త గణేష్ మృతదేహాన్ని చూసి ఉమామహేశ్వరి బోరున విలపించింది. కారులో ఉన్న డ్రైవర్‌తోపాటు మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో అద్దరపు నాగరాజు, తడకంటి ఉమామహేశ్వరి, అద్దరపు లక్ష్మి, జూపూడి భార్గవి, కే పూజ, గర్రె మహేష్, గర్రె సంధ్య, వాంకుడోత్ సంగీత, కోడూరు మధుసూదనరెడ్డి, కొలిమి మహేష్, మహ్మద్ అజీమ్ ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కంచికచర్ల 108 అంబులెన్స్ వాహన సిబ్బంది, నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ దాడి చంద్రశేఖర్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అంతేకాకుండా కారు డ్రైవర్ కూడా నిద్రమత్తులోకి జారుకున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. -
కాటేసిన పొగమంచు
గుంటూరు, దాచేపల్లి : క్రిస్మస్ పండుగను ఆనందంతో జరుపుకున్న ఓ కుటుంబాన్ని పొగమంచు కాటేసింది. క్రిస్మస్ పండుగకు కుమారుడు, కుమార్తెకు కావాల్సిన దుస్తులు..ఇతర వస్తువులను తాత, తండ్రి కలిసి కొన్నారు. పండుగ సందర్భంగా చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మను పలకరించేందుకు తండ్రి, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి బయలు దేరారు. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుతామని అనుకుంటున్న సమయంలో మృత్యువు పొగమంచు రూపంలో వచ్చి కాటేసింది. దాచేపల్లి గ్రామ సమీపంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై భవ్య పెట్రోల్ బంక్ ఎదురుగా బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెనాలికి చెందిన బేతపూడి పరంజ్యోతి(60), బేతపూడి బిపిన్‌చంద్(34) అక్కడికక్కడే మృతిచెందగా బిపిన్‌చంద్ భార్య చైతన్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. దాచేపల్లి ఎస్ఐ షేక్ మహ్మద్ రఫీ కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన బేతపూడి పరంజ్యోతి దంపతులు, వారి కుమారుడు బిపిన్‌చంద్, చైతన్య దంపతులు, బిపిన్ చంద్ కుమారుడు, కుమార్తె అర్నాల్డ్, ఏంజిలిన్తో కలిసి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. బిపిన్‌చంద్ ట్రావెల్స్ సర్వీస్‌ను నడుపుతున్నాడు. క్రిస్మస్ వేడుకలను ముగించుకుని తెనాలిలో అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మను పలకరించేందుకు బిపిన్‌చంద్ భార్య, పిల్లలు, తండ్రి పరంజ్యోతితో కలిసి ఏపీ09 ఎజెడ్ 7703 నంబర్ కారులో బయలు దేరారు. మార్గమధ్యంలో దాచేపల్లిలో ఆగి టీ తాగారు. అనంతరం బిపిన్‌చంద్ కారు నడుపుతూ తెనాలికి బయలు దేరారు. పొగమంచు బాగా కురుస్తుండటం వలన రోడ్డు సక్రమంగా కన్పించలేదు. ఈ క్రమంలో భవ్య పెట్రోల్‌బంక్ ఎదురుగా ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు బలంగా ఢీకొట్టింది. కంటైనర్ లారీ వెనుకభాగంలో ఉన్న టైర్ల వరకు కారు దూసుకుపోవటంతో టాప్ లేచి నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న బిపిన్‌చంద్, ముందు సీట్లో కుర్చున్న పరంజ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వెనుక సీట్లో కుర్చోన్న బిపిన్ చంద్ భార్య చైతన్య తీవ్రంగా గాయపడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయి మృతిచెందిన బిపిన్‌చంద్, పరంజ్యోతిల మృతదేహాలను ఎంతో శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన చైతన్యను హైవే అంబులెన్స్ వాహనం ద్వారా పిడుగురాళ్లకు తరలించారు. మృత్యుంజయులు రోడ్డు ప్రమాదంలో బిపిన్‌చంద్ కుమారుడు అర్నాల్డ్, కుమార్తె ఏంజిలిన్ మృత్యుంజయులుగా బయటపడ్డారు. కారు వెనుక సీట్లో తల్లి చైతన్య పక్కనే కూర్చున్న వీరు స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నారు. లారీని కారు ఢీకొట్టిన వెంటనే కారు వెనుకడోర్లు తెరుచుకొని వీరు కిందపడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. కళ్లముందు మృతిచెందిన తాత, తండ్రి మృతదేహల వద్ద అర్నాల్డ్, ఏంజిలిన్లు భోరున విలపించారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించారు. -
కారుచీకటిలో నెత్తుటి ధారలు
చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరమైన కుమార్తెను అన్నీ తానై పెంచింది. ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసింది. తన చిట్టితల్లి.. తల్లి కాబోతోందని తెలిసి మురిసిపోయింది. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు జీవించు తల్లీ అంటూ సీమంతం వేడుకలో తన బిడ్డను పెద్దలు దీవించడంతో ఉప్పొంగిపోయింది. మంగళవారం మంచిది కాదని బిడ్డను తీసుకుని సోమవారం అర్ధరాత్రి కారులో ఇంటికి ప్రయాణమైంది. ఆ కారే మృత్యుశకటమై తల్లీకూతుళ్ల ప్రాణాలను బలిగొంది. కడుపులో శిశువు ప్రాణం తల్లితో పాటే అనంతవాయువుల్లో కలిసిపోయింది. యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న ప్రమాదం ఆరుగురిని బలిగొంది. ఓ చిన్నారిని అనాథను చేసింది. మరొకరికి భార్యాబిడ్డలను దూరం చేసింది. మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. యడ్లపాడు: మండలంలోని తిమ్మాపురం 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అ«ర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృత్యువాత పడ్డారు. ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరికీ గాయాలై చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం జరిగిందిలా... వేజర్ల జయశ్రీ (19), తల్లి అనసూయ(40), బంధువు సుంకర రమాదేవి (37), రమాదేవి కుమార్తె రమ్య (18), కుమారుడు శ్రీకాంత్ (21), అతని మిత్రుడు ఫ్రాన్సిస్ సుమారు రాత్రి 11.45 గంటల సమయంలో తిమ్మాపురం నుంచి కారులో గుంటూరు సమీపంలోని గోరంట్లకు బయలు దేరారు. తిమ్మాపురం జాతీయ రహదారిపై ప్రసూన వంశీకృష్ణ మిల్లు సమీపంలో రాగానే శావల్యాపురంలో వ్యవసాయ పనులు ముగించుకుని మాగాణి దమ్ము చక్రాల లోడుతో ముందు వెళ్తున్న ట్రాలీ ట్రాక్టర్‌ను కారు వెనగ్గా ఢీకొట్టింది. సుమారు 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న గర్భిణి జయశ్రీ, ఆమె తల్లి అనసూర్య అక్కడికక్కడే మృతి చెందారు. వారి పక్కనే ఉన్న సుంకర రమాదేవి, రమ్య, డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్, ఫ్రాన్సిస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు గుంటూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. అర్ధరాత్రి ఆర్తనాదాలు... హైవేపై ఒక్కసారిగా వాహనాలు ఢీ కొన్న శబ్దం రావడం, గాయపడిన వారు ఆర్తనాదాలు చేయడంతో సమీప మిల్లుల్లోని కార్మికులు, తిమ్మాపురం ఎస్సీకాలనీ లూథరన్ చర్చి వద్ద క్రిస్మస్ వేడుకల్లో ఉన్న స్థానికులు పరుగున వచ్చారు. క్షతగాత్రులను కాపాడేందుకు పోలీసులతోపాటు చిమ్మ చీకట్లలోనే సెల్‌ఫోన్ లైట్లు వేసుకుని శ్రమించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండ చూశారు. గాయాలైన వారందరనీ గుంటూరు, చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు గ్రామాల్లో విషాదం.. జయశ్రీ అత్తిల్లు యడవల్లి, పుట్టిల్లు గోరంట్ల. ఫ్రాన్సిస్ స్వగ్రామమైన మేడికొండూరు మండలంలోని గుండ్లపాలెం గ్రామాల్లో క్రిస్మస్ పండుగ రోజున తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణాలు.. ప్రమాదం జరిగిన వెంటనే యడ్లపాడు ఎస్ఐ జే శ్రీనివాస్, సీఐ ఎస్ విజయచంద్ర చేరుకుని బాధితుల్ని ఆసుపత్రికి తరలించే విషయంలో అప్రమత్తం కాగా, ఇన్చార్జి డీఎస్సీ కాలేషావలి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.అతివేగం..విపరీతమైన మంచు, ట్రాలీ వెనుకరేడియం స్టిక్కరు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పెళ్లయిన ఆరు నెలలకే.. చిలకలూరిపేట యడవల్లి గ్రామానికి చెందిన వేజర్ల వెంకట్రావు, రామాంజమ్మ దంపతుల కుమారుడైన నాగరాజుకు, గుంటూరు రూరల్ మండలానికి చెందిన తంగెళ్ల శ్రీనివాసరావు, అనసూయ కుమార్తె జయశ్రీ (19)కి ఈ ఏడాది ఆగస్టులో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. జయశ్రీ మూడు నెలలుగా పుట్టింటిలోనే ఉంటుంది. సీమంతం నిమిత్తం సోమవారం అత్తగారింటి రావడంతో భార్యాభర్తలు ఎన్నొ ఊసులు చెప్పుకుంటూ ఆనందంగా కనిపించారు. నిండు నూరేళ్లు జీవించాలని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటూ తల్లిదండ్రులు, అత్తమామాలు, బంధుమిత్రులు దంపతుల్ని అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబంలో కొన్ని గంటల్లోనే విషాదం అలుముకుంది. తల్లీబిడ్డలు కానరాని లోకాలకు.. నా ఆటోలో తీసుకెళ్లినా బతికేవారయ్యా అంటూ సుంకర రమాదేవి భర్త ఆటోడ్రైవర్ పూర్ణచంద్రరరావు కన్నీరు మున్నీరయ్యారు. రాత్రి గోరంట్ల నుంచి ఆటోలో వెళ్లిన వారు సీమంతం జరిగిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లవద్దని అక్కడి బంధువులు చెప్పారన్నారు. అర్ధరాత్రి పోలీసుల నుంచి ఫోన్ రావడంతో గుండెలు జారిపోయాయయ్యా అంటూ రోదించారు. అబ్బాయి శ్రీకాంత్ కారు డ్రైవర్, అమ్మాయి రమ్య గోరంట్ల సెయింట్ ఆన్స్‌లో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. భార్యాబిడ్డలను కోల్పోయిన ఆయన గుండెలు బాదుకుంటున్నాడు. పండుగ నాడు మృత్యువు ఒడిలోకి.. గుంటూరు ఈస్ట్: సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాల్సిన ఇంటిలో తీరని విషాదం అలుముకుంది. రోడ్డు ప్రమాదంలో ఇంట్లోని చిన్న కుమారుడు దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మేడికొండూరు మండలం గుల్లపాలెంకు చెందిన కొటికల ఫ్రాన్సిస్ తండ్రి గతంలోనే మృతి చెందారు. తల్లి సమాధానం కూలి పనుల కోసం ఇటీవల హైదరాబాద్ వెళ్ళింది. ఫ్రాన్సిస్ స్నేహితుడితో కారులో వెళ్లి దుర్మరణం పాలయ్యాడు. అన్న మల్లేశ్వరరావు, తల్లి సమాధానం గుంటూరు మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ట్రాక్టర్‌పై ఉన్న వారికీ గాయాలు ట్రాక్టర్ వెనక ట్రాలీని కారు ఢీకొనడంతో ట్రాలీ పల్టీలు కొడుతూ దూరంగా వెళ్లి పడింది. కారు సుమారు 50 మీటర్లు వరకు బలంగా తోసుకుంటూ వెళ్లడంతో కారు ముందు భాగం, టాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ట్రాక్టర్, ట్రాలీ కూడా దెబ్బతిన్నాయి. ట్రాక్టర్‌పై ఉన్న కొల్లిపర మండలం క్రాప గామానికి చెందిన బోసి హనుమంతరావు, కలపల రమేష్‌లకు గాయాలయ్యాయి. వీరిని చిలకలూరిపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. -
తండ్రీకొడుకుల మృతదేహాలు వెలికితీత
గుంటూరు, మంగళగిరి: రాజధాని పరిధిలో హత్యకు గురైన తండ్రీకొడుకుల మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. మండలంలోని రాజధాని పరిధిలోని కురగల్లు– నీరుకొండ గ్రామాల మధ్య ఈ–14 రోడ్డులో పోలీసులు పొక్లెయిన్లతో తవ్వకాలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మేలవాయికి తరలించారు. మేలవాయికి చెందిన వేముల లక్ష్మయ్య, సురేష్ పొక్లెయిన్ డ్రైవర్ల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. శనివారం మృతదేహాలను వెలికితీయడానికి సమయం చాలక ఆదివారం ఉదయం ఏఎస్సీ లక్ష్మీనారాయణ, నార్త్‌జోన్ డీఎస్పీ జీ రామకృష్ణ, రూరల్ సీఐ బాలాజి, ఎస్ఐ వీరనాయక్‌లు సిబ్బందితోపాటు గుంటూరు డాక్టర్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒడ్డుకు చేర్చిన మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల అదుపులో నిందితుడు! జంట హత్యలలో ప్రధాన ముద్దాయి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తండ్రీకుమారులు వేముల లక్ష్మయ్య, సురేష్‌లు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ నరేష్ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ హత్య కేసులో మరెవరైనా ఉన్నారా ?ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ప్లాస్టిక్ కవర్లో మృతదేహం
తాడేపల్లిరూరల్(మంగళగిరి): మృత దేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేసిన ఘటన తాడేపల్లి మండల పరిధిలోని రాధారంగా నగర్లో బుధవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు తాడేపల్లి సీఐ బ్రహ్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని కవర్ చుట్టి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. అనంతరం నార్త్‌జోన్ డీఎస్పీ రామకృష్ణకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ నుంచి కిందపడి చనిపోయి ఉండవచ్చా.. లారీ తొక్కి ఉండవచ్చా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు లారీ క్లీనర్ అయి ఉంటాడని, 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చన్నారు. ఎటువంటి ఆధారాలు లభించ లేదు. మృతుడి ఒంటిపై సిమెంటు రంగు ప్యాంటు, నల్ల బన్నీను, మెడలో అయ్యప్పస్వాములు ధరించే నల్లని వస్త్రం ఉంది. చనిపోయింది లారీ క్లీనర్ అయితే నేల బురదగా ఉండగా, లారీ కింద ఎందుకు పడుకుంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ప్లాస్టిక్ సంచులు కప్పుకొని పడుకుంటే లారీ తొక్కి వెళ్లిందా?.. ఆ సంచుల్లో మృతదేహాన్ని చుట్టి అక్కడ పడవేస్తే, గుర్తు తెలియని వాహనం తొక్కివెళ్లిందా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మోటారు సైకిల్ దొంగల అరెస్టు
గుంటూరు: వ్యసనాలకు బానిసలుగా మారి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీసీఎస్ ఏఎస్పీ రాఘవ తన కార్యాలయంలో సోమవారం విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకా రం... గుంటూరులోని హనుమయ్యనగర్‌కు చెం దిన ముత్తుకూరి సాయిరామ్ తాళం వేసి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేసిన కేసుల్లో గతంలో విజయవాడలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా డు. క్యాటరింగ్ పనులకు వెళుతున్న క్రమంలో అక్కడ గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్ళపాడుకు చెందిన షేక్ అల్లాభక్షు పరిచయం కావడంతో అతనితో పాటు కలసి ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. గత నెల 8న అల్లా భక్షును పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో సాయిరామ్ తప్పించుకొని పరారయ్యాడు. ఈ క్రమంలో గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన లంజేపల్లి షడ్రక్ అలియాస్ రవితో కలసి సాయిరామ్ ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇద్దరు నిందితులు ద్విచక్రవాహనంపై అరండల్‌పేట ఫైఓవర్ వద్ద వేచి ఉన్నారు. వారు పోలీసులను గమనించి పరారవుతుండగా సీసీఎస్ పోలీసులు ఇద్దరినీ వెంటాడి అదుపులోకి తీసుకొని, వారి దైనశైలిలో విచారించారు. చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. రూ.5 లక్షల విలువ చేసే బుల్లెట్‌తో పాటు ఐదు యాక్టివాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీతో పాటు డీఎస్పీ డి.ప్రసాదు, సీఐ లు సీహెచ్‌వీబీ సుబ్రహ్మణ్యం, ఆర్.సురేష్‌బాబు, ఎస్సైలు కిషోర్, మహేంద్ర పాల్గొన్నారు. -
మృత్యుంజయురాలు
గుంటూరు, యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీకొని సైకిల్‌తో పాటు బస్సు కిందకు వెళ్లిపోయిన బాలిక క్షేమంగా బయటపడి మృత్యుంజయురాలు అనిపించుకున్న వైనం నాదెండ్ల మండలం గణపవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని రాజీవ్‌గాంధీ కాలనీకు చెందిన జిన్నింగ్‌మిల్లులో ఫిట్టర్‌గా పనిచేసే వంకరబోయిన వెంకటేశ్వరరావు కుమార్తె పూజిత స్థానిక కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. నిత్యం సైకిల్‌పై 16వ నంబర్ జాతీయ రహదారిని దాటి పాఠశాలకు వెళ్లి వస్తుంది. రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్లేందుకు హైవే రహదారిని దాటుతుండగా అదే సమయంలో గుంటూరు వైపు నుంచి ఒంగోలు వెళ్తున్న ఒంగోలు డిపో ఆర్టీసీ బస్సు విద్యార్థిని సైకిల్‌ను ఢీకొంది. దీంతో సైకిల్‌తో పాటు పూజిత కూడా బస్సు కిందకు వెళ్లిపోయింది. తమ కళ్లెదుటే క్షణాల్లో జరిగిన ఈ సంఘటనకు స్థానికులు హతాశులయ్యారు. హైవే సమీపంలో ఉన్నవారంతా టెన్షన్‌తో కేకలు వేస్తూ పరుగుపరుగున రహదారిపైకి వచ్చారు. ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి వాహనాన్ని నిలిపివేశాడు. బస్సులోని ప్రయాణికులు సైతం కంగారుగా కిందకు దిగి గమనించారు. అయితే ప్రమాదంలో సైకిల్‌పై బస్సు ముందు టైరు ఎక్కడంతో సైకిల్ పూర్తిగా దెబ్బతింది. విద్యార్థిని పూజిత మాత్రం బస్సు రెండు టైర్ల మధ్య ఖాళీలో పడటంతో ప్రాణాపాయం లేకుండా స్వల్పగాయాలతో బయటపడింది. దీంతో అక్కడ చేరిన స్థానికులంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. హైవేపై ధర్నా నిర్వహించిన స్థానికులు పూజితను ఢీకొన్న ఆర్టీసీ బస్సును ముందుకు పోనివ్వకుండా అడ్డుకుని, విద్యార్థినికి కొత్త సైకిల్ ఇప్పించి ఆసుపత్రి ఖర్చులను భరించి న్యాయం చేయాలంటూ విద్యార్థిని తండ్రి వెంకటేశ్వరరావుతో పాటు స్థానికులు కొందరు హైవేపై ధర్నా నిర్వహించారు. బస్సు డ్రైవర్ మాత్రం తన తప్పేమీ లేదని, హైవేపై వస్తున్న క్రమంలో విద్యార్థిని అడ్డుగా రావడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పడంతో స్థానికులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కల్పించుకుని అటు ట్రాఫిక్‌కు, ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సును పక్కకు పెట్టించారు. బస్సులోని ప్రయాణికులను మరోబస్సులోకి ఎక్కించి పంపించేశారు. స్థానికులకు సర్దిచెప్పి వివాదాన్ని సద్దుమణిగించారు. ప్రమాదాల నిర్మూలనకు వంతెన ఏర్పాటు చేయాలి నిత్యం కాలనీ ప్రజలు నూలుమిల్లులకు, విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలంటే హైవేను దాటాల్సిందే. దీంతో నడకదారిగా మారిన ఈ ప్రాంతంలో గతంలోనూ అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు లైటింగ్, సూచికలు, కరపత్రాలు పంపి అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో హైవేను దాటేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిగాని, అండర్‌పాస్ వంతెనగాని ఏర్పాటు చేసి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
గుంటూరు, తెనాలిరూరల్: మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడిపై మరో ప్రియుడు కత్తితో హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతను ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఆలూరు త్రివేణి భర్తతో విడిపోయి, మల్లెపాడు పరిధిలోని ద్వారకానగర్‌కు చెందిన తాడిబోయిన గోపి అలియాస్ గాలి గోపితో కొంతకాలం సహజీవనం చేసింది. అనంతరం అతనితో విడిపోయి సుమారు ఏడాదిగా సాలిపేటకు చెందిన వెండి వస్తువుల తయారీ కార్మికుడు సూరేపల్లి శ్రీనివాసరావు అలియాస్ వాసుతో సహజీవనం చేస్తోంది. ద్వారకానగర్‌లోనే గది అద్దెకు తీసుకుని నివసిస్తోంది. అవివాహితుడైన వాసు అప్పుడప్పుడు ఆమె వద్దకు వచ్చి వెళుతుండే వాడు. గోపితో పరిచయాన్ని ఇటీవలి కాలంలో తిరిగి కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి త్రివేణి వద్దకు వెళ్లిన శ్రీనివాసరావు, త్రివేణి నడవడిక గురించి ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. త్రివేణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో శ్రీనివాసరావు తన స్నేహితుడు జిలానిని తోడుకు పిలిపించుకుని ఇద్దరూ కలసి త్రివేణి ఇంట్లో పడుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వీరు ఉన్న ఇంటికి వచ్చిన గోపి కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తలకు, ఎడమ బుగ్గపై తీవ్ర గాయాలయ్యాయి. మధ్యలో అడ్డుకోబోయిన జిలాని ఎడమ చేతి వేలికి గాయమైంది. శ్రీనివాసరావును ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సమాచారమందుకున్న డీఎస్పీ మందపల్లి స్నేహిత, త్రీ టౌన్ ఎస్ఐ బొడ్డు అశోక్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రివేణితో ఘర్షణ పడ్డాడన్న కారణంగానే వాసుపై గోపి హత్యాయత్నం చేశాడని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
ప్రేమోన్మాది వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా ఆ మృగాడు వదలలేదు. ఇంటికి వచ్చి హత్యాయత్నానికి తెగబడ్డాడు. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గాయపడిన యువతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ప్రేమోన్మాది పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఈస్ట్: వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా వెంటాడి మరీ హత్యాయత్నానికి తెగబడ్డాడు ఓ ఉన్మాది. ప్రేమ ముసుగులో ఉన్మాదిగా మారి యువతిని కత్తితో పొడిచి తర్వాత తనను తాను గాయపరుచున్నాడు. గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ యువతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. జొన్నలగడ్డలో నివసించే పుప్పాల సాంబయ్య, సామ్రాజ్యం దంపతుల మూడో కుమార్తె దివ్య డిగ్రీ పూర్తి చేసింది. గుంటూరు అరండల్‌పేటలోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా కొన్ని నెలలు పనిచేసింది. అదే సమయంలో మాచర్లకు చెందిన బాలాజీనాయక్ అనే యువకుడు దివ్య వద్ద అసిస్టెంట్ సేల్స్ ప్రమోటర్‌గా పనిచేశాడు. తనను ప్రేమించమంటూ వెంట పడ్డాడు. అతని వేధింపులకు భయపడిన దివ్య ఉద్యోగం మానేసి కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం దివ్య ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో బాలాజీ నాయక్ ఆమె వద్దకు వచ్చాడు. తనను ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దివ్య నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె పొట్టలో పొడిచాడు. మళ్లీ పొడిచే ప్రయత్నం చేయగా దివ్య పెద్దగా కేకలు వేస్తూ చేతులు అడ్డం పెట్టడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దివ్య తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోవడంతో.. ఇంట్లో ఉన్న కుక్కర్ మూతతో బాలాజీనాయక్ తనను తాను తలపై కొట్టుకుని గాయపరుచుకున్నాడు. అలజడికి అక్కడికి చేరుకున్న స్థానికులు వారిద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. దివ్య ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నా, ప్రాణాపాయం లేదని తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
ఆ కేసులు ఖాకీలకు సవాలే!
గుంటూరు, తెనాలిరూరల్:పోలీసులకు ఆ కేసులు సవాలుగా మారాయి. నేరాలు చేసిన నిందితులు ఖాకీలకు సవాలు విసిరారు. చిన్న ఆధారమైనా లేకపోవడంతో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతుల హత్య, దోపిడీ కేసులో రెండున్నరేళ్లయినా నిందితులకు సంబంధించి చిన్న ఆధారమైనా లేదు. బంగారు వ్యాపారులను మోసగించి పశ్చిమ బెంగాల్ పరారైన వ్యక్తిని పట్టుకోవడంలో కూడా తాత్సారమే. బంగారు నగను తాకట్టు పెట్టుకుని నగదు తీసుకుని, త్వరలోనే విడిపించి ఇస్తానంటూ విశ్రాంత ఎంపీడీవోను మోసగించిన కేసులోనూ న్యాయం జరుగలేదంటూ బాధితుడు అర్జీల మీద అర్జీలు పెడుతున్నారు. సబ్ డివిజన్లో జరిగిన నేరాలకు సంబంధించిన ఈ కేసులు పోలీసులకు సవాలుగా మారాయి. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేని కేసు ఒకటి, అసలు నిందితులకు సంబంధించిన ఆధారమేదీ దొరకనిది మరొకటి, 420 కేసులోనూ న్యాయం జరగక పోలీసు ఉన్నతాధికారులకు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటున్న కేసు మరొకటి. వివరాలిలా ఉన్నాయి. ♦ తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బలభద్రుని వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మలపై 2016 మే నెల 29వ తేదీన గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మరుసటి రోజు గుర్తించిన కుటుంబసభ్యులు బాధితులిద్దరిని గుంటూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా, అదే ఏడాది జూన్ 15వ తేదీన భార్య మృతి చెందగా, 25వ తేదీన భర్త మరణించాడు. నాగరత్నమ్మ మెడలో ఉన్న బంగారు తాడు, చేతి గాజులు, చెవి పోగులు, ఇతర ఆభరణాలు, కొంత నగదు అపహరణకు గురయ్యాయని మృతుల కుటుంబసభ్యులు అప్పట్లో పోలీసులకు తెలిపారు. ఘటన జరిగి రెండున్నరేళ్లయినా ఈ కేసులో ఇప్పటికీ పురోగతి లేదు. ఎవరు చేశారన్న దానిపై పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. దంపతుల్లో ఒక్కరైనా కోలుకుని ఘటనకు సంబంధించిన సమాచారం అందిస్తారని భావించినా అదీ జరగలేదు. పోలీసులు రెండు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు చేశారు. తాలూకా పోలీసు అధికారులు స్టేషనుకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ కేసును ఛేదించిన అనంతరం స్టేషన్‌కు రావాలని అప్పట్లో రూరల్ ఎస్పీ నారాయణ్‌నాయక్ ఇక్కడి సిబ్బందిని ఆదేశించారు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టినా, ఇప్పటికీ కేసు కొలిక్కి రాలేదు. ♦ జాడేది ‘భాయ్’... పట్టణానికి చెందిన ఓ బంగారు ఆభరణాల తయారీ కేంద్రం నిర్వాహకుడు సుమారు నాలుగు కిలోల బంగారంతో ఉడాయించాడు. బంగారు ఆభరణాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన తెనాలిలో ‘భాయ్’ అని పిలుచుకునే వ్యక్తి సుమారు 15 ఏళ్లుగా ఆభరణాల తయారీ కేంద్రాన్ని నిర్వహించాడు. తెనాలితో పాటు ముంబయి నగరంలోనూ ఇతని కార్యకలాపాలు ఉండేవి. వ్యాపారుల నుంచి ఆర్డర్ తీసుకుని అందుకు తగ్గట్టు ఆభరణాలు తయారు చేయించి ఇచ్చేవాడు. సాధారణంగా వ్యాపారుల నుంచి ముందుగానే ముడి బంగారాన్ని తీసుకుని ఆభరణాలను తయారు చేస్తారు. అయితే 15 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా ఉంటున్న ‘భాయ్’కి ముడి బంగారం ఇవ్వకుండానే ఆర్డర్ ఇస్తే ఆభరణాలను తయారు చేసిచ్చి అనంతరం బంగారాన్ని తీసుకునేవాడు. ఆభరణాల తయారీతో పాటు ‘బంగారు’ చీటీ పాటలు నిర్వహిస్తుండేవాడు. నెలకు 40, 50, 100 గ్రాములుగా చీటీలు నిర్వహిస్తుండే వాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ సమ్‌నాథ్ మహతి అలియాస్ బడా భాయ్ 2015 నవంబరులో తెనాలి నుంచి హఠాత్తుగా జెండా పీకేశాడు. ఇతని కోసం పోలీసులు బెంగళూరు, పశ్చిమ బెంగాల్ వెళ్లి విచారించారు. బడా భాయ్ స్వగ్రామం, అతని కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాల్లో విచారణకు వెళ్లగా, అక్కడి స్థానికులు బడాభాయ్‌కు మద్దతుగా తెనాలి పోలీసులను ముప్పతిప్పలు పెట్టడంతో చేసేది లేక వెనుదిరిగారు. బడా భాయ్‌కు సంబంధించి వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 420 కేసులోనూ... పట్టణానికి చెందిన విశ్రాంత ఎంపీడీవో షేక్ మొహిద్దీన్‌కు తన ఇంటి వద్ద అద్దెకు నివసించే చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన గడ్డిపాటి నాగప్రసాద్ పరిచయమయ్యాడు. పట్టణంలోని బోస్‌రోడ్డులో షేర్ బ్రోకర్‌గా పనిచేసే అతడు అత్యవసరంగా డబ్బు అవసరమైందని, సర్దుబాటు చేస్తే త్వరలోనే తిరిగిచ్చేస్తానని చెప్పి, మొహిద్దీన్ కుటుంబానికి చెందిన 78 గ్రాముల బంగారు హారాన్ని తీసుకువెళ్లాడు. కుదువపెట్టి పెద్దమొత్తంలో నగదు తీసుకుని, పట్టణం నుంచి బిచాణా ఎత్తేశాడు. దీనిపై బాధితుడు 2017 సెప్టెంబర్‌లో పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన మోసంపై 420 కేసు పెట్టాడు. 14 నెలలైనా ఈ కేసులో కూడా నిందితుని ఆచూకీ లేదు. కేసును పోలీసులు నీరుగార్చారంటూ బాధితుడు వాపోతున్నారు. వృద్ధ దంపతుల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం నందివెలుగు వృద్ధదంపతుల దోపిడీ, హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఇప్పటికీ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నాం. నిందితులను వదిలే ప్రసక్తి లేదు. బంగారంతో ఉడాయించిన కేసుల్లో బాధితులు ముందుకు వస్తే న్యాయం జరిగేలా చూస్తాం.–మందపల్లి స్నేహిత, డీఎస్పీ, తెనాలి -
ఫొటోలతో కాపురం కూలుస్తానంటున్నాడు..!
‘తెలిసీ తెలియక పెళ్లికాక ముందు నకరి కల్లు మండలానికి చెందిన బేగ్ అమీర్‌బాషాతో స్నేహం చేశా. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని నాతో ఫొటోలు దిగాడు. వాటిని నా భర్తకు చూపించి కాపురం కూలుస్తానంటూ బెదిరిస్తున్నాడు.. అలా జరగకూడదంటే వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకుని నా కాపురం నిలబెట్టండి’ అంటూ ప్రకాశం జిల్లాకు చెందిన వివాహిత సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎస్పీ తక్షణం ఆ మృగాడిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐని ఆదేశించారు. గుంటూరు: ‘‘స్నేహాన్ని అడ్డుగా పెట్టుకొని నాతో ఫొటోలు దిగాడు. వాటిని ఇప్పుడు చూపిస్తూ అతనితో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. లేకుంటే ఫొటోలను నీ భర్తకు చూపుతానని బెదిరిస్తున్నాడు’’ అంటూ ప్రకాశం జిల్లాకు చెందిన వివాహిత సోమవారం రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబును కలసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి మాటల్లో... నకరికల్లు మండలం చల్లగుళ్ల అడ్డరోడ్డుకు చెందిన బేగ్ అమీర్‌బాషాతో పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరం కలసి ఫొటోలు దిగాం. ఫోన్లో మాట్లాడుకున్నాం. ఈ ఏడాది మే నెలలో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తితో నా వివాహం జరిగింది. అయితే అప్పటి నుంచి అతనితో దిగిన ఫొటోలు చూపించి, శారీరక సంబంధం పెట్టుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాడు. నేను అందుకు అంగీకరించకపోవడంతో అతని వద్ద ఉన్న ఫొటోలు, ఫోన్ రికార్డింగ్‌లను నాభర్తకు పంపుతానని, వాటిని అందరికీ తెలియ చేసి నీకాపురం కుప్పకూల్చుతానని హెచ్చరిస్తున్నాడు. తెలిసీ తెలియక అతనితో స్నేహం చేసిన పాపానికి నిత్యం మానసిక వేదనకు గురవుతున్నాను. ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యాను. అతని వద్ద ఉన్న ఆధారాలను మొత్తం నాకు అప్పగించి నాకు మనశ్శాంతిని చేకూర్చండి అంటూ వేడుకుంది. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే సదరు యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించాలని నకరికల్లు ఎస్ఐను ఆదేశించారు. ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని వివాహితకు ఎస్పీ ధైర్యం చెప్పారు. -
ఆర్టీసీ కండక్టర్ అనుమానాస్పద మృతి
పట్నంబజారు(గుంటూరు): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం ఎస్ఐ గోపు శివకృష్ణారెడ్డి, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు నగరంలోని రెడ్డి కళాశాల సమీపంలోని మల్లారెడ్డినగర్‌లో నివాసం ఉండే మాదల అరుణ (34)ను సాంబశివరావు అనే వ్యక్తికి ఇచ్చి 2006లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే వివామమైన తొలినాళ్లలో జీఎంసీలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేసిన సాంబశివరావు గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నాడు. పెళ్లయిన కొద్ది నెలలకే అరుణకు ఆర్టీసీలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. సాంబశివరావుకు ఉద్యోగం లేకపోవటం, మద్యానికి బానిసగా మారటంతో కుటుంబ పోషణ భారం అరుణపై పడింది. కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ..కుటుంబాన్ని లాక్కువచ్చేది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచుగా వివాదాలు జరుగుతుండేవని బంధువులు చెబుతున్నారు. సాంబశివరావు నిత్యం అరుణను అనుమానించేవాడని, మద్యం తాగి వచ్చి ఆమెను అనేకమార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. నిత్యం ఆమెను ఉద్యోగం మానేయాలని వేధిస్తుండేవాడని తెలిపారు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ సుమారుగా పదిరోజుల క్రితం ఏటీ అగ్రహారంలో ఉన్న సొంత నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. విధులకు వెళ్లవద్దంటూ..గుర్తింపు కార్డులు కూడా తగలబెట్టడంతో, గత వారం రోజులుగా మృతురాలు ఉద్యోగానికి కూడా వెళ్లటంలేదని తెలిసింది. ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య వివాదం జరగటంతో, సాంబశివరావు ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి రాత్రి 8.30 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయారు. తాను చనిపోతానంటూ తిరిగి రాత్రి ఒంటిగంట సమయంలో తిరిగి పిల్లలతో కలిసి ఇంటికి వచ్చారు. తిరిగి ఉదయం లేచి బయటకు వెళ్లి వచ్చిన సాంబశివరావు అరుణ మృతి చెంది ఉండటాన్ని గమనించారు. దీంతో విషయాన్ని బంధువులు, పోలీసులకు తెలియజేశారు. మృతిపై ఎన్నో అనుమానాలు... ఘటనాస్థలంలో అరుణ ఆత్మహత్యకు పాల్పడిన దాఖలాలు ఏ మాత్రం కనపడటం లేదని, ఎలా మృతి చెందిందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఇంటికి వెళ్లిన సాంబశివరావు అప్పుడు భార్య అరుణ బాగానే ఉన్నట్టు పోలీసులకు చెబుతున్నాడు. సాంబశివరావు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఏమైనా ఘటన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భర్త సాంబశివరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి సోదరుడు తోట రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షిర్డీ సాయిబాబా ఆలయంలో దొంగతనం
గుంటూరు, చిలకలూరిపేటరూరల్: అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయం తాళాలు పగులకొట్టి ఆలయంలో చోరీ చేశారు. ఈ సంఘటన మండలంలోని దండమూడి గ్రామ ప్రవేశంలో ఉన్న షిర్డీ సాయిబాబా దేవాలయంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆలయ ట్రస్టీ బుర్రా వీరాస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ అండ్ బీ రహదారి సమీపంలో ఉన్న సాయిబాబా, దుర్గాదేవి ఆలయ ప్రధాన గేట్లు తాళాలు ధ్వంసం చేసి ఆలయంలోని హుండీని పగులకొట్టి అందులోని రూ.5,000 నగదు, సీసీ కెమారాల బాక్స్, టీవీలను చోరీ చేసినట్టు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ ఎస్.విజయ చంద్ర, ఎస్ఐ పి.ఉదయ్‌బాబు శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం బృందం వేలిముద్రలను నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్ ఆలయం వద్ద నుంచి మానుకొండవారిపాలెం వెళ్లింది. అక్కడి నుంచి వేలూరు మీదుగా చిలకలూరిపేటకు చేరింది. ఈ మేరకు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు. -
అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
గుంటూరు,పెనమలూరు: పెళ్లి జరిగి ఐదునెలలు కాకముందే వివాహిత అత్తింటి వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పెదపులిపాక గ్రామానికి చెందిన మట్టా బ్యూలా అలియాస్ అనుషా (20) గత జూన్ 28వ తేదీన ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన మట్టా శ్రీనివాస్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి సందరగా కట్నకానుకలు ఇచ్చారు. వీరు కొండపల్లిలో కాపురం ఉంటున్నారు. భార్యభర్తలు ఆటోనగర్‌లో పని చేస్తున్నారు. అయితే పెళ్లి జరిగిన కొద్దిరోజులకే బ్యూలాకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఇచ్చిన కట్నం చాలలేదని అత్తమామలు ఇబ్బంది పెడుతుండగా, బ్యూలా పై లేనిపోని అనుమానాలతో భర్త వేధించసాగాడు. దీంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా సోమవారం రాత్రి బ్యూలా తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనను అత్తింటి వారు వేధిస్తున్నారని, తనను పుట్టింటికి తీసుకు వెళ్లాలని కోరింది. దీంతో బ్యూలా తండ్రి దేవరపల్లి శేష య్య బ్యూలాను మంగళవారం కొండపల్లి నుంచి పెదపులిపాకకు తీసుకు వచ్చాడు. కాగా మధ్యహ్నం బ్యూలా నిద్రపోతానని బెడ్రూమ్లోకి వెళ్లి పడుకుంది. సాయంత్రం అయినా బ్యూలా లేవలేదని ఆమె గదిలోకి వెళ్లి కుటుంబ సభ్యులు చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉంది.అత్తింటి వారిపై కేసుకాగా ఈ ఘటన పై బ్యూలా తండ్రి దేవరపల్లి శేషయ్య ఫిర్యాదు మేరకు బ్యూలా భర్త శ్రీనివాస్, అత్త నిర్మల, మామ లాజర్ పై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. -
బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
లక్ష్మీపురం(గుంటూరు): ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో బంధువులను పరామర్శించి పెదకాకాని శివాలయానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులను ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో బస్సు టైర్ కింద మహిళ పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు నగరంలో కాకాని రోడ్డులో ఉన్న బెస్ట్‌ప్రైస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ సీఐ పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రూరల్ మండలం ఓబులునాయుడుపాలెంకు చెందిన ఏమినేని సాంబశివరావు మిర్చి యార్డులో ముఠా కూలీగా జీవనం సాగిస్తుంటారు. భార్య శివపార్వతి. వీరికి ఇద్దరు కుమారులు గణేష్, సాయికుమార్ చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తున్నారు. శివపార్వతి తల్లి సింహాద్రి నాగేశ్వరమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో చికిత్స పొందుతూ ఐసీయూలో ఉన్నారు. సాంబశివరావు, శివపార్వతి గురువారం సాయంత్రం ఓబులునాయుడుపాలెం నుంచి గుంటూరు వచ్చి ఆసుపత్రిలో తల్లి నాగేశ్వరమ్మను పరామర్శించి తిరిగి రాత్రి ఓబులునాయుడుపాలెం వెళ్లారు. శుక్రవారం ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెదకాకాని దేవాలయంలో దీపారాధన చేసేందుకు ద్విచక్రవాహనంపై దంపతులిద్దరూ బయల్దేరారు. గుంటూరు బెస్ట్ ప్రైస్ వద్దకు చేరుకునే సరికి యామినీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆటోను తప్పించే యత్నంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న సాంబశివరావు, శివపార్వతి కిందపడ్డారు. శివపార్వతి (50) తలభాగం బస్సు వెనుక టైర్ కింద పడటంతో నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త సాంబశివరావుకు తీవ్రగాయాలయ్యాయి. సాంబశివరావును ఆసుపత్రికి తరలించడం కోసం స్థానికులు 108కు ఫోన్ చేయగా, ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది.. అంటూ 108 సిబ్బంది కాలయాపన చేయడంతో ఆటోలో సాంబశివరావును జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఈస్ట్ ట్రాఫిక్ సీఐ పూర్ణచంద్రరావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతురాలు శివపార్వతి పెద్ద కుమారుడికి ఇటీవల నిశ్చితార్థం అయింది. 2019 ఫిబ్రవరి 9వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు శివపార్వతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కడుపుకోత
బాబూ నా బిడ్డ రోడ్డుపై పడిపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. కాస్త ఆపండయ్యా అంటూ అప్పటికే చనిపోయిన కొడుకు కోసం వచ్చేపోయే వాహనాలను ఆపుతున్న ఆ తల్లిని చూసిన ప్రతి హృదయం శోక సంద్రమైంది. వడివడిగా బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మా టాటా అంటూ ఉదయాన్నే బయలుదేరిన బిడ్డ.. సాయంత్రం శవమై ఇంటికి చేరడంతో అ తల్లిదండ్రుల కడుపుకోత కన్నీటి చెలమలయ్యింది. తాడేపల్లి మండలం చిర్రావూరులో మంగళవారం స్కూల్ బస్ చక్రాల కింద పడి ఆరేళ్ల చిన్నారి ప్రాణం చితికిపోయింది. రోజూ తానెక్కే బస్సే మృత్యువై మింగేసింది. ఒక్కగానొక్క కొడుకు దూరమైన ఆ తల్లిదండ్రులకు తీరని గుండెకోత మిగిల్చింది. గుంటూరు, తాడేపల్లిరూరల్: సాయంత్రం స్కూల్ నుంచి తమ ఏకైక గారాల పట్టీ వస్తాడని ఆ తల్లి వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. కుమారుడి రాక కోసం రోడ్డుపైనే నిలబడిపోయింది. ఇంతలోనే కనుచూపు మేరలో ఓ విషాదం. స్కూల్ బస్సు కింద బాలుడి పడ్డాడ్డన్న చేదు వార్త. అది తన బిడ్డ కాకూడదని ఆతల్లి మనసులో అనుకుంటూ బస్సువైపు పరుగు తీసింది. అది తన బిడ్డనే అని తెలియగానే ఆ తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన బిడ్డను కాపాడాలంటూ అడ్డువచ్చిన ప్రతి ఆటోను ఆపి మరీ వేడుకుంది. కానీ అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. విషయం చుట్టుపక్కల వారు తెలిపినా ఆ తల్లి మాత్రం ఆ మాటలను పట్టించుకోవడం లేదు. తన బిడ్డను బ్రతికించాలని గుండెలవిసేలా ఆ భగవంతుడికి మొర పెట్టుకుంది. ఈ హృదయ విదారక ఘటన చిర్రావూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... చిర్రావూరు గ్రామంలో నివసించే నారంశెట్టి భిక్షాలు అలియాస్ ముసలయ్య, సుజాతకు ఏకైక కుమారుడైన హర్ష (6) నూతక్కిలోని ఆదిత్య పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు పాఠశాలకు బస్సులో వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా బస్సు విద్యార్థులను దించేందుకు ఆగింది. హర్ష అందరికంటే మొదట బస్సు దిగి తోటి విద్యార్థులు దిగిన తరువాత మళ్లీ బస్సులోకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో హర్ష అదుపుతప్పి బస్సు వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుమారుడి కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్న తల్లికి స్థానికులు విషయం తెలపడంతో ఆమె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
లక్ష్మీపురం(గుంటూరు): అగ్నిప్రమాదంలో గృహోపకరణలు దగ్ధమైన ఘటన స్థానిక స్వామి థియేటర్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం జరిగింది. అగ్నిమాపక శాఖ ఎస్ఎఫ్వో వినయ్ కథనం ప్రకారం...స్థానిక స్వామి థియేటర్ సమీపంలో ఎన్సీసీ అర్బన్ పార్క్ స్క్వేర్ అపార్ట్మెంట్లో మల్లికా స్పైయిన్ సెంటర్ డాక్టర్ జె.నరేష్‌బాబు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వారందరూ మంగళవారం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన నివాసంలో నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు రేగాయి. గమనించిన చుట్టు పక్కల ప్లాట్ల వారు డాక్టర్ జె.నరేష్‌బాబుకు సమాచారం ఇచ్చారు. ఆయన ఇంటికి వచ్చి తాళాలు తీసేలోపే ఇల్లంతా మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక ఎస్ఎఫ్వో వినయ్ అగ్నిమాపక వాహనంలో సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో విలువైన గృహోపకరణలు దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగింది. కుటుంబ సభ్యులు కాలిబూడిదైన ఇంటిని చూసి కంటతడిపెట్టారు. అగ్నిప్రమాదం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల లేక దేవుడి ఎదుట పెట్టిన దీపం వల్ల జరిగిందా అనేది తేలాల్సి ఉంది. డాక్టర్ నరేష్‌బాబుకు చంద్రగిరి ఏసురత్నం పరామర్శ డాక్టర్ నరేష్‌బాబు నివాసంలో అగ్నిప్రమాదం సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం అక్కడకి చేరుకున్నారు. డాక్టర్ నరేష్‌బాబుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
నవ దంపతుల ఆత్మహత్య
గుంటూరు, ముసునూరు (నూజివీడు): తాగుబోతు భర్త ప్రవర్తనకు విసిగిపోయిన భార్య ఆత్మహత్యకు పాల్పడగా, భార్య మృతితో కేసులకు భయపడి భర్త ఉరి వేసుకుని చనిపోయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కేవీజీవీ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాట్రేనిపాడు శివారు రాజీవ్‌నగర్‌కు చెందిన మేశపాము శివరామకృష్ణ (32), అతని భార్య నాగమల్లేశ్వరి ఆదివారం ఉదయం చనిపోయి ఉన్నట్లుగా తండ్రి కృపావరం గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మేశపాము కృపావరం కుమారుడు శివరామకృష్ణకు కొండపర్వ గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరితో 3 నెలల క్రితం వివాహం జరిగింది. వీరిరువురికి గతంలో వేర్వేరుగా వివాహాలు జరిగాయి. ఆ సంబంధాల్లో అతనికి పాప, ఆమెకు బాబు ఉన్నారు. ఇటీవలే వీరిరువురికి వివాహం జరిగింది. పెయింటర్‌గా పని చేస్తున్న శివరామకృష్ణ తాగి వచ్చి గొడవ చేస్తూ ఉండటంతో ఆమెకు అతనిపై విసుగు కలిగింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఉంగుటూరు మండలం పొట్టిపాడులో ఉంటున్న అతని తమ్ముడు కిషోర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా ఇదే విధంగా గొడవలు జరుగుతుండడంతో ఆమె గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను పొట్టిపాడు, వీరవల్లి, హనుమాన్ జంక్షన్లలోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చినఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో మృతదేహాన్ని ఆటోలో కాట్రేనిపాడులోని ఇంటికి తీసుకు వచ్చారు. భార్య మృతి చెందగా, భయభ్రాంతుడైన శివరామకృష్ణ పురుగు మందు సేవించి, తర్వాత ఉరి వేసుకుని మృతి చెందాడు. నూజివీడు సీఐ మేదర రామ్‌కుమార్ మృతదేహాలను పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాలను నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తహసీల్దార్ కేబీ సీతారామ్ పంచనామా నిర్వహించారు. నవ దంపతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే విషయం మండలాన్ని ఉలిక్కిపడేలా చేసింది. -
ఆటోను ఢీకొన్న కారు
గుంటూరు, పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : మండల పరిధి లోని జాతీయ రహదారిపై నవాబుపేట క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చందర్లపాడుకు చెంది న ఏడుగురు మహిళలు ఆటోలో నల్గొండ జిల్లా మేళ్లచెర్వు గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లా రు. తిరుగు ప్రయాణంలో నవాబుపేట క్రాస్ రోడ్స్ వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డు మార్జిన్ బ్యారికేడ్‌పైకి ఆటో దూసుకెళ్లింది. దానిలో ప్రయాణిస్తున్న కస్తాల చిననాగమ్మ, వేల్పుల రాణి, గజ్జల కుమారి, మార్కపూడి మరియమ్మ, కస్తాల నాగమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న బాపులపాడుకు చెందిన ముగ్గురికి గాయాలవలేదు.క్షతగాత్రులను 108 వాహనంలో నంది గామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ అవి నాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జనతా గ్యారేజీ ఘటనలో 23 మందిపై కేసు
గుంటూరు, తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో జనతా గ్యారేజీ పేరుతో కత్తి పట్టుకుని హల్చల్ చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌తో పాటు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసినట్టు తాడేపల్లి పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గాజుల సాయి సురేష్ తనపై దాడి కేసులో ప్రదీప్‌తో పాటు గ్రామంలో ఒకే ఇంటి పేరు ఉన్న 23మంది యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారందరిపై కేసు నమోదు చేశారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ గొడవలు ఎటుపోయి, ఎటు వస్తాయోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జనతాగ్యారేజీ గ్రూపు సభ్యులకు కౌన్సెలింగ్ ఉండవల్లిలో జనతాగ్యారేజీ పేరుతో ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసి, ఎటువంటి సమస్యలున్నా మాకు చెప్పండి మేం పరిష్కరిస్తాం అంటూ చెబుతూ అరాచకాలు సృష్టిస్తూ, రోడ్డుమీద కత్తి పట్టుకొని తిరిగిన ప్రదీప్, అతని అనుచరులకు నార్త్‌జోన్ డీఎస్పీ జి.రామకృష్ణ బుధ, గురువారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి ఎవరైనా జనతాగ్యారేజీ లాంటి గ్రూపుల్లో సభ్యులుగా చేరితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 25 మంది సభ్యులున్న ఈ గ్రూపులో ఒకరో, ఇద్దరో తప్ప మిగతావారందరూ ఏమీ తెలియని అమాయకులు కావడంతో, మొదటి తప్పుగా వారికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా ఇలాంటి గ్రూపులు ఏర్పాటుచేసి, అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తీగలాగితే కదిలిన అవినీతి డొంక
గుంటూరు రూరల్: వ్యభిచార గృహాల నిర్వాహకులను బెదిరించడంతో పాటు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి భారీస్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డ్, గతంలో ఓ న్యూస్ చానల్ (సాక్షికాదు) లో పని చేసిన కెమేరామన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను బెదిరించి నగదు వసూలుకు పాల్పడిన ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఊహించని నిజాలు బయటపడ్డాయి. నగరంలోని నగరాలు ప్రాంతానికి చెందిన మల్లేశ్వరి వ్యభిచార గృహం నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డ్, గతంలో న్యూస్ చానల్లో పనిచేన కెమేరామన్లు ఆమెను బెదిరించి నగదు వసూలు చేశారు. నెలానెలా మూమూళ్లు ఇస్తే ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. ఏఆర్ కానిస్టేబుల్ బెదిరింపులు ఈ క్రమంలో రెండు రోజుల కిందట 6వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ మల్లేశ్వరి వద్దకు వెళ్లి రూ. 20 వేలను బెదిరించి వసూలు చేశాడు. దీంతో ఆమె గతంలో తనకు హామీ ఇచ్చిన హోంగార్డు, కెమేరామన్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని చెప్పింది. దీంతో ఇద్దరు కలసి ఏఆర్ కానిస్టేబుల్‌పై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఊహించని నిజాలు బయట పడ్డాయి. కెమేరామన్, హోంగార్డులే బెదిరిపులకు పాల్పడుతూ వసూళ్లు చేస్తుంటారని తెలిసింది. దీంతో వారినీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా బాగోతం బయటపడింది. పలు స్టేషన్లలో కేసుల నమోదు గతంలోనూ హోంగార్డు, మాజీ కెమేరామన్ ఇదే విధంగా వసూళ్లకు పాల్పడ్డ ఘటనల్లో నగరంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కెమేరామన్ గతంలో పాత గుంటూరుకు చెందిన ఒక మహిళను బెదిరించి నగదు వసూలు చేశాడు. దీంతో ఆమె జిల్లా ఎస్పీని సంప్రదించగా పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. నగరంలోని ఈస్ట్, వెస్ట్ పరిధిలో మరో రెండు పోలీస్స్టేషన్లలో ఇద్దరిపై కేసులు నమోదైనట్లు సమాచారం. అయినా, వారిలో మార్పు రాలేదు. నగరంలోని పలు వ్యభిచార గృహాల నిర్వాహకుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. గతంలో నగరంపాలెంలో ఓ పత్రికా విలేకరి ఇదే విధంగా వ్యభిచారం నిర్వాహకురాలిని బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడిన ఘటనలో ప్రస్తుతం అదుపులోఉన్న కెమేరామన్ హస్తం ఉన్నట్లు సమాచారం. బెందిరింపులే ప్రవృత్తిగా హోంగార్డు అండతో నగరంలోని నగర శివారుల్లోని వ్యభిచార గృహాల్లో లక్షలాది రూపాయలు వసూళ్లు చేశాడని సమాచారం. బెదిరింపులకు పాల్పడేది ఇలా... ముందుగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారి ఆచూకీ తెలుసుకుని అది ఏస్టేషన్ పరిధిలోకి వస్తుందో చూస్తారు. అనంతరం ఆ స్టేషన్‌కు వెళ్లి అక్కడ వారికి అనుకూలమైన కానిస్టేబుల్‌ను ఎంచుకుని అతని సహాయంతో హోంగార్డ్, కెమేరామన్లు వారిని బెదిరిస్తారు. ఒకవేళ కానిస్టేబుల్ వారికి అనుకూలించకపోతే అతనిపై లేనిపోని ఆరోపణలు చూపి అతనిని బెదిరించి వారి వైపునకు మలుచుకుంటారు. దీంతో చేసేదిలేక కానిస్టేబుల్స్ సైతం వారు చెప్పినట్లు ఆడుతుంటారని సమాచారం. ఈ క్రమంలో వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి వచ్చే నగదును అందరూ పంచుకునేవారని తెలిసింది. ఈ విధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి లక్షల్లో నగదును వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. నిందితుల అరెస్టు ఎట్టకేలకు నల్లపాడు పోలీస్‌స్టేషన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలిసింది. అయితే, వీరితో పాటు వ్యభిచార గృహాల నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తేగానీ ఇటువంటి అరాచక శక్తులకు అడ్డుకట్ట పడదు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
గుంటూరు, కాకుమాను: పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల్ని వదిలి వెళ్లలేక మనస్తాపంతో కానిస్టేబుల్ మల్లీశ్వరి ఆత్మహత్యతో కాకుమానులో విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల్లో పెళ్లి ఉందనగా.. హఠాత్తుగా కూతురు మరణించడంతో ఎనుముల శంకరరావు, కోటేశ్వరమ్మ దంపతులు తట్టుకోలేక పోతున్నారు. శంకరరావు గ్రామంలో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూనే ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశాడు. మూడో కుమార్తె మల్లీశ్వరి 2013లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికై చిలకలూరిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తోంది.కుమారుడు బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం తండ్రి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇటీవల మల్లీశ్వరికి ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన వ్యక్తితో వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. అప్పటి నుంచి ఆమె ప్రతిరోజు మనోవేదనకు గురవుతోంది. తను వివాహం చేసుకొని వెళ్లిపోతే వృద్ధులైన తల్లిదండ్రులు ఏమైపోతారో ...ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్న తన తమ్ముని పరిస్థితి ఎలా ఉంటుందోదని ఆమె తీవ్ర మనస్తాపం చెందుతోంది. ఒక వేళ వివాహం చేసుకున్న వ్యక్తి తాను ఎంతో ఆశతో, లక్ష్యంతో సాధించుకున్న పోలీస్ ఉద్యోగం వదిలేయమంటాడో అనే ఆలోచనలతో ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఎలుకల మందు తిని అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం శుక్రవారం విజయవాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు విగతిజీవిగా మారి పాడె ఎక్కడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరుల్ని కంట తడి పెట్టించింది. కలెక్టర్ చేతుల మీదుగా సబల అవార్డు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల చేపట్టిన సబల కార్యక్రమంలో మల్లీశ్వరి చురుగ్గా పాల్గొంది. జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి జిల్లాలో తొలి సబల అవార్డును అందుకుంది. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు మల్లీశ్వరి భౌతికకాయానికి పోలీస్ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్ఐ డి.మార్కండేయలు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఘనంగా నివాళులు అర్పించారు. పలువురు పోలీసులు అధికారుల నివాళులు నర్సరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు, తెనాలి డీఎస్పీ స్నేహిత, సీఐ సుభాషిణి, జిల్లా పోలీస్ యూనియన్ నాయకులు చందు పూర్ణచంద్రరావు, బుట్టా ప్రసాద్, పొన్నూరు, నర్సరావుపేట సీఐలు తిరుమలరావు, శోభన్‌బాబు, ఎస్ఐలు అంజయ్య, రామాంజనేయులు, ఉదయ్‌బాబులు మల్లీశ్వరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
ఆశ వర్కర్ దారుణ హత్య
గుంటూరు , సత్తెనపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆశ వర్కర్ దారుణ హత్యకు గురైన సంఘటన సత్తెనపల్లి మండలం పెదమక్కెనలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... సత్తెనపల్లి మండలం పెదమక్కెన గ్రామానికి చెందిన గడిపర్తి వెంకటరమణ (40), కోటేశ్వరరావులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడు డిగ్రీ, చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నారు. వెంకటరమణ ఆశ వర్కర్‌గా పని చేస్తుండగా కోటేశ్వరరావు కూలి పనులకు వెళ్లేవాడు. మూడేళ్ల క్రితం కోటేశ్వరరావుకు పక్షవాతం రావడంతో కుటుంబ బాధ్యతలన్నీ వెంకటరమణ తన భుజాన వేసుకుంది. ఈ క్రమంలో పొలం పనులు కూడా ఆమే చూస్తోంది. జమా ఖర్చులు లెక్కలు చెప్పడం లేదని భర్త కోటేశ్వరరావు కొంత కోపంగా ఉన్నాడు. రెండు రోజులగా వీరి భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది. గురువారం ఇంట్లో ఉన్న వెంకటరమణ నిర్జీవంగా పడి ఉంది. ఆమె తల నుంచి రక్తస్రావం కావడం, దగ్గర్లో బాడిశకు రక్తం ఉండడంతో వెంకటరమణను భర్త కోటేశ్వరరావు హతమార్చి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సత్తెనపల్లి డీఎస్పీ వీ కాలేషావలి, రూరల్ సీఐ ఎం వీరయ్య, రూరల్ ఎస్ఐ మీర్జానజీర్ బేగ్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి కత్తి విజయమ్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక అమ్మకాల్లో నిబంధనలు బేఖాతరు
గుంటూరు, రేపల్లె: ఆఖరి అవకాశం తవ్వుకో... దాచుకో... నినాదాన్ని అనుసరిస్తూ టీడీపీ నాయకులు దోపిడీలకు తెగబడుతునే ఉన్నారు. అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వదులుకోకుండా సొమ్ము వసూలులో బరి తెగింపు కొనసాగుతోంది. టీడీపీ నాయకులు తమ పంథాను యధావిధిగా కొనసాగిస్తున్న తమ అక్రమ దందాపై నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెనుమూడి ఇసుక రేవులో టీడీపీ నాయకుల అక్రమ దందా పంథా మార్చారు. ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన టీడీపీ నాయకుల బరితెగింపు కథనానికి అధికారులు స్పందించి డ్రెడ్జర్లను నిలుపుదల చేయించారు. దీంతో టీడీపీ నాయకులు పడవల ద్వారా మ్యాన్యువల్ తరలిస్తున్న ఇసుకకు రేటు పెంచి తమ అక్రమ దందాను తెరతీశారు. యూనిట్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.400 వసూలు చేయాల్సి ఉండగా మంగళవారం వరకు రూ.600 వసూలు చేసిన టీడీపీ నాయకులు బుధవారం నుంచి రూ.700లకు పెంచి మరింత బరి తెగించారు. ప్రతి రోజు సుమారు 200 ట్రాక్టర్లలో ఇసుకను లోడు చేస్తున్న పరిస్థితులు నెలకొనటంతో భారీ వసూలుకు రంగం సిద్ధం చేశారు. రోజుకు అక్రమ సంపాదన రూ.60 వేలు ఒక్క మత్స్యకార్మికుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. గత ఆగస్టు 2017 నుంచి జూన్ 2018 వరకు సుమారు రూ.50 కోట్లు ఇసుక రీచ్‌లో సంపాదించిన టీడీపీ నాయకులు తిరిగి కార్మికులకు అందించిన అవకాశా>న్ని తమ అక్రమ సంపాదనకు మలుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుకకు గిరాకీ నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్ గృహకల్ప, ప్రైవేటు వ్యక్తులు ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇతర ప్రాంతాలకు పెనుమూడి ఇసుక రీచ్ నుంచి తరలిస్తున్నారు. దీంతో ఇసుకకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇసుక రుచి మరిగిన టీడీపీ నాయకులు అక్రమ దందాకు తెరతీసి రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆందోళనలో కార్మికులు మత్స్యసంపద గణనీయంగా తగ్గిపోతుండటంతో మత్స్యకారులు పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు తమ సమస్యలను విన్నవించారు. దీనికి కలెక్టర్ స్పందించి ఇసుక తరలింపు చేసుకునేందుకు మత్స్యకార్మికులకు అనుమతినిచ్చారు. టీడీపీ నాయకులు అవకాశంగా మలుచుకుంటూ తమ పొట్టకొట్టడం ఏమిటని మత్స్యకార్మికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇసుక తరలిస్తే రూ.400 కార్మికులకు ఇచ్చి అదనంగా రూ.300లు దండుకుంటున్నారని ఇదేమని ప్రశ్నిస్తే ఇసుక రేవు మూయించి వేస్తామని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇసుక రేవు వద్ద టీడీపీ నాయకుల అక్రమాలకు అడ్డుకట్ట వేసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం పెనుమూడి ఇసుక రేవులో మత్స్యకార్మికులు మ్యాన్యువల్‌గా ఇసుకను తరలించుకునేందుకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రెడ్జర్లను ఏర్పాటు చేయకుండా అధికారుల పర్యవేక్షణ నిర్వహిస్తున్నాం. కార్మికులు తరలించే ఇసుకకు యూనిట్‌కు రూ.400 మాత్రమే వసూలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూలు చేస్తున్న అంశం నా దృష్టికి రాలేదు. అదనపు వసూలుపై కూడా అధికారుల పర్యవేక్షణ నిర్వహిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.–ఎస్వీ రమణకుమారి, తహసీల్దార్, రేపల్లె -
నెపం వేశారు.. ప్రాణం తీశారు!
గుంటూరు, మంగళగిరి: నెపం వేశారు..అవమానించారు.. చిత్రహింసలు పెట్టారు.. ఇవన్నీ భరించలేని యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ... ఎందుకు చేసుకుంటున్నాడో వివరంగా సెల్ఫీ వీడియో తీసి మరీ మృతి చెందాడు. పోయిన బంగారం దొరికింది.. నెపం వేసిన వారు బాగానే ఉన్నారు.. ఆ నెపం భరించలేక మృతి చెందిన యువకుడి ప్రాణాలు తిరిగివస్తాయా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి పట్టణం రత్నాల చెరువులో ముసిరాజు గోపి(22) అనే యువకుడు తాను చేయని నేరాన్ని తనపై మోపి, పోలీసులు హింసకు గురిచేశారన్న అవమానంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గోపి సెల్ఫీ వీడియోపై ఎలాంటి విచారణ చేయని పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసి బుధవారం ఉదయం హడావుడిగా మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అతని కుటుంబసభ్యులపై ఒత్తిడి తెచ్చి ఆగమేఘాలపై అంత్యక్రియలు చేయించారు. అదే రోజు రాత్రి గోపి తల్లి లక్ష్మి మాట్లాడుతూ అధికార పార్టీ నేత ఒత్తిడి కారణంగానే తమను పోలీసులు వేధించారని, పోలీసుల వేధింపులతో పాటు కాలనీలో అవమానం తట్టుకోలేక తన కుమారుడు మృతి చెందాడని తెలిపింది. గోపి మృతికి కారణమైన సెల్ఫీవీడియో బయటకు రావడం, తల్లి అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడంతో కలవరపడిన టీడీపీ నేతలు, పోలీసు అధికారులు రాత్రంతా గోపి కుటుంబసభ్యులను బెదిరించి రూ.8 లక్షలకు సెటిల్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు చోరీకి గురైన బంగారు నగలు లభ్యమయ్యాయి. ఈ విషయమై సీఐ హరికృష్ణను వివరణ కోరగా కేసుతో గోపికి ఎలాంటి సంబంధం లేదని, తాము గోపిని చిత్రహింసలు పెట్టలేదన్నారు. తొందరపాటు చర్యతోనే గోపి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్నారు. గోపి మృతిచెందడంతో ఆందోళనలో ఉన్న తల్లి లక్ష్మిని కొందరు రెచ్చగొట్టడం కారణంగానే పోలీసులపై ఆరోపణలు చేసినట్టు ఆమె బుధవారం చెప్పిందన్నారు. గోపి మృతి విషయంలో ఎలాంటి సెటిల్మెంట్ జరగలేదని, చట్టప్రకారమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గోపి మృతదేహం వద్ద బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నాయకులు నివాళులర్పించారు.