
సాక్షి, కొల్లూరు: ఉరేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్లూరు శివారు గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న కొల్లూరి ఉదయలక్ష్మికి (28) గతంలో వివాహమైంది. భర్తతో విభేదాలు తలెత్తడంతో గాంధీనగర్‌లో కొల్లూరుకే చెందిన లారీ డ్రైవర్ యార్లగడ్డ నవీన్ కుమార్‌తో సహజీవనం చేస్తోంది. తాజాగా నవీన్‌కుమార్‌తో వివాదం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుంది. అదే సమయానికి వచ్చిన నవీన్‌కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వైద్యశాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.