
సాక్షి, గుంటూరు: చెట్టుకు ఉరి వేసుకుని వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమృతలూరు మండలం పాంచాళవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోనుగుంట్ల లక్ష్మీనారాయణ(35), అదే గ్రామానికి చెందిన దివ్య పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు.
దివ్య ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారు జిల్లా పోలీసులను ఆశ్రయించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొద్దికాలంగా భార్య దివ్యను పలు మార్లు హింసించడంతోపాటు ఇటీవల లక్ష్మీనారాయణ హత్యాయత్నం చేయడంతో గ్రామస్తులు రక్షించారు. ఈమేరకు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, తెనాలి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. కేసు కోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో బెయిల్‌పై వచ్చిన లక్ష్మీనారాయణ సోమవారం రాత్రి భార్యతో గొడవ పడినట్టు స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా, గుర్తించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని, మృతుని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ విషయంపై అమృతలూరు ఎస్‌ఐ జి. పాపారావు వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment