దగ్ధమైన ఇంటి వద్ద డాక్టర్ నరేష్‌బాబు, అగ్నిమాపక శాఖ సిబ్బంది
లక్ష్మీపురం(గుంటూరు): అగ్నిప్రమాదంలో గృహోపకరణలు దగ్ధమైన ఘటన స్థానిక స్వామి థియేటర్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం జరిగింది. అగ్నిమాపక శాఖ ఎస్‌ఎఫ్‌వో వినయ్ కథనం ప్రకారం...స్థానిక స్వామి థియేటర్ సమీపంలో ఎన్‌సీసీ అర్బన్ పార్క్ స్క్వేర్ అపార్ట్‌మెంట్‌లో మల్లికా స్పైయిన్ సెంటర్ డాక్టర్ జె.నరేష్‌బాబు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వారందరూ మంగళవారం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన నివాసంలో నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు రేగాయి. గమనించిన చుట్టు పక్కల ప్లాట్ల వారు డాక్టర్ జె.నరేష్‌బాబుకు సమాచారం ఇచ్చారు. ఆయన ఇంటికి వచ్చి తాళాలు తీసేలోపే ఇల్లంతా మంటలు వ్యాపించాయి.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక ఎస్‌ఎఫ్‌వో వినయ్ అగ్నిమాపక వాహనంలో సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో విలువైన గృహోపకరణలు దగ్ధమయ్యాయి. లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగింది. కుటుంబ సభ్యులు కాలిబూడిదైన ఇంటిని చూసి కంటతడిపెట్టారు. అగ్నిప్రమాదం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల లేక దేవుడి ఎదుట పెట్టిన దీపం వల్ల జరిగిందా అనేది తేలాల్సి ఉంది.
డాక్టర్ నరేష్‌బాబుకు చంద్రగిరి ఏసురత్నం పరామర్శ
డాక్టర్ నరేష్‌బాబు నివాసంలో అగ్నిప్రమాదం సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం అక్కడకి చేరుకున్నారు. డాక్టర్ నరేష్‌బాబుతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment