
లక్ష్మి మృతదేహం
సాక్షి, తెనాలి, (గుటూరు): భర్త మందలించాడని భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన కలవకొల్లు రంగా ఇంటికి మాంసం తీసుకువెళ్లాడు. మధ్యాహ్నమయినా వంట పూర్తికాకపోవడంతో, పిల్లలకు పెట్టలేదంటూ భార్య లక్ష్మి(26)ని రంగా మందలించాడు. «భర్త బయటకు వెళ్లగానే, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న లక్ష్మి తల్లి, పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు కిందికి దించి తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. హెడ్‌కానిస్టేబుల్ బొత్తలపూడి శ్యామ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.