health minister
-
అమెరికా ఆరోగ్య మంత్రిగా... వ్యాక్సిన్ల వ్యతిరేకి
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’’ అని తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీలక నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయ కుటుంబం కెనెడీ ఉన్నత రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీకి తమ్ముడు. అమెరికాకు అటార్నీ జనరల్‌గా పని చేశారు. ఈసారి డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం అధ్యక్షుడు జో బైడెన్‌తో కెనెడీ పోటీ పడ్డారు. తర్వాత స్వతంత్ర అభ్యరి్థగా బరిలో నిలిచారు. తాను గెలిస్తే ఆరోగ్య విధాన పర్యవేక్షణను అప్పగిస్తానని ట్రంప్ హామీ ఇవ్వడంతో ఆయనకు మద్దతుగా పోటీ నుంచి తప్పుతకున్నారు. అనంతరం ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎన్నికల చివరి దశలో ట్రంప్ కోసం కెనెడీ ముమ్మరంగా ప్రచారం కూడా చేశారు. వ్యాక్సిన్లకు ఫక్తు వ్యతిరేకి ప్రపంచంలోనే ప్రముఖ వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుల్లో కెనెడీ ఒకరు. ఆటిజం తదితర ఆరోగ్య సమస్యలకు టీకాలు కారణమవుతాయన్నది ఆయన వాదన. వ్యాక్సిన్ అస్సలు సురక్షితం కావని, ప్రభావవంతమైనవీ కావని తానిప్పటికీ నమ్ముతున్నానని చెబుతారు. పిల్లలకు టీకాలను సూచించే సీడీసీ మార్గదర్శకాలను వ్యతిరేకించాలని 2021లో ప్రజలకు పిలుపునిచ్చారు. టీకాలకు వ్యతిరేకంగా ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే స్థాపించారు. అది టీకా సంస్థలతో పాటు వాటికి మద్దతిచ్చే పలు వార్తా సంస్థలపై కూడా కోర్టుల్లో పోరాడుతోంది. ప్రముఖ న్యాయవాది అయిన కెనెడీ పురుగుమందులు, ఫార్మా కంపెనీలపై కేసుల్లో స్వయంగా వాదిస్తుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్, కలుపు మందుల వాడకానికి కూడా ఆయన ఫక్తు వ్యతిరేకి. అమెరికాలో ఆహార పరిశ్రమపై చిరకాలంగా పెత్తనం చలాయిస్తున్న భారీ వాణిజ్య కమతాలు, దాణా పరిశ్రమలను బాగా విమర్శిస్తుంటారు. దశాబ్దాలుగా దేశమంతటా నమ్మకమైన అనుచరగణాన్ని నిర్మించుకున్నారు. ఆహార పదార్థాల విషయంలో కఠిన నిబంధనలు విధించాలన్నది కెనెడీ వైఖరి. అమెరికాలో ఆహారాన్ని ఆరోగ్యకరంగా మారుస్తానని, ఈ విషయంలో యూరప్ తరహా నిబంధనలు తెస్తానని చెబుతున్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించి పలు విభాగాల ఉద్యోగుల నేపథ్యాన్ని లోతుగా పరిశీలిస్తామని కూడా ప్రకటించారు. ఫార్మా తదితర కంపెనీల్లో చేసిన నేపథ్యమున్న వారిని ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. వ్యాక్సిన్ పరిశోధనలను పర్యవేక్షించే వందలాది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పడం కలకలం రేపింది. వివాదాస్పదుడు కూడా పలు వివాదాల్లో కూడా కెనెడీ పతాక శీర్షికలకెక్కారు. ఎలుగుబంటి కళేబరాన్ని న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో పడేసి అది బైక్ ఢీకొని చనిపోయినట్టు చిత్రీకరించారు. దాన్ని ఆయనే కారుతో గుద్ది చంపారంటారు. బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచి్చన ఓ తిమింగలం తలను కత్తిరించి కారుకు కట్టి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తే వెల్లడించింది. దాంతో కెనెడీ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. తీవ్ర ఆందోళనలు కెనెడీ నియామకం ప్రజారోగ్య నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారులను మహమ్మారుల బారినుంచి కాపాడే టీకాలకు వ్యతిరేకంగా ఉద్యమించే వ్యక్తి చేతుల్లో ప్రజల ఆరోగ్యాన్ని బలి పెడుతున్నారంటూ వారంతా మండిపడుతున్నారు. ఆరోగ్య మంత్రి పదవికి అవసరమైన ఒక్క అర్హత కూడా ఆయనకు లేదని అమెరికాలోని ప్రఖ్యాత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ లురీ అన్నారు. ఆ పదవికి ఆయన పూర్తిగా అనర్హుడంటూ సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ మండీ కోహెన్ ధ్వజమెత్తారు. ‘‘ఆరోగ్యం విషయంలో అమెరికన్లు మళ్లీ తిరోగమన బాటను కోరుకోవడం లేదు. పిల్లలు, పెద్దలు ఆరోగ్య సమస్యల బారిన పడటం, ప్రాణాలు కోల్పోవడం వంటివి చూడాలనుకోవడం లేదు’’ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అంతర్గత వ్యవహారాల మంత్రిగా డౌగ్ బర్గమ్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా నార్త్ డకోటా గవర్నర్ డౌగ్ బర్గమ్‌ను ట్రంప్ ఎంచుకున్నారు. నిజానికి ఆ యన ట్రంప్ రన్నింగ్‌మేట్ అవుతారని తొలుత అంతా భావించారు. 67 ఏళ్ల బర్గం రెండోసారి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. తొలుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో కూడా కొనసాగారు. తర్వాత తప్పుకుని ట్రంప్‌కు మద్దతుగా ముమ్మరంగా ప్రచా రం చేశారు. పూర్వాశ్రమంలో సాఫ్ట్వేర్ దిగ్గజమైన ఆయన అనంతరం ట్రంప్ మాదిరిగానే రియల్టీ వ్యాపారంలో కూడా రాణించారు. ‘హష్ మనీ’ లాయర్‌కు అందలం తన హష్ మనీ కేసును వాదిస్తున్న న్యాయ బృందం సారథి టాడ్ బ్లాంచ్‌ను దేశ డిప్యూటీ అటార్నీ జనరల్‌గా ట్రంప్ ఎంపిక చేశారు. న్యాయ శాఖలో ఇది రెండో అత్యున్నత పదవి. అటార్నీ జనరల్‌గా మాట్ గేట్జ్ ఆయన ఇప్పటికే ఎంచుకోవడం తెలిసిందే. కాంగ్రెస్ మాజీ సభ్యుడు డగ్ కొలిన్స్‌ను వెటరన్స్ వ్యవహారాల మంత్రిగా ట్రంప్ ఎంచుకున్నారు. -
సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తీరు సిగ్గు చేటు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి,అమరావతి : ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శాసన మండలి చర్చలో ‘డయేరియాపై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు సంభవించాయి’అని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.శాసన మండలి సమావేశాల సందర్భంగా డయేరియా మరణాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘‘సభలో డయేరియాపై ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం బాధాకరం. మృతులపై ఎంతటి అభిమానం ఉందో మంత్రి నిర్లక్ష్య సమాధానమే చెబుతోంది.మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 30 ఏళ్లలో గుర్లలో ఎన్నడూ డయేరియా మరణాలు సంభవించలేదు. సెప్టెంబర్ 20న మొదటి కేసు నమోదైంది. అక్టోబర్ 12వ తేదీ నాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 19న వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేసే వరకు ప్రభుత్వంలో చలనం రాలేదు.చదవండి: డయేరియా మరణాలపై నవ్వుతూ హేళనగా మాట్లాడిన ఏపీ మంత్రి 20 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. పక్క జిల్లాలో కేజీహెచ్ ఉంది. కానీ స్కూల్ బల్లలపై వైద్యం అందించారు. స్కూల్ బల్లలపై డయేరియా బాధితులకు వైద్యం అందించినందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. మృతుల సంఖ్యను తగ్గించడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. డయేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఒక్కో డయేరియా బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ వెళ్లే వరకూ జిల్లా ఇంఛార్జి మంత్రి వంగలపూడి అనిత..ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వెళ్లలేదు. మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మంత్రి సత్యకుమార్ సమాధానంపై ఎమ్మెల్సీ బోత్స ఫైర్
-
డయేరియా మరణాలపై నవ్వుతూ మాట్లాడిన ఏపీ మంత్రి
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. డయేరియా మరణాలపై చర్చ సందర్భంగా ఆయన నవ్వుతూ.. మండలి సభ్యులను హేళన చేసేలా మాట్లాడారు. డయేరియా మరణాలపై శాసనమండలి చర్చలో భాగంగా తొలుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మాట్లాడే క్రమంలో మంత్రి సత్యకుమార్ నోరు జారారు. ‘‘డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15 ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు వచ్చాయి’’ అని చిరునవ్వుతో మాట్లాడారాయన.వెంటనే బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యత గా వ్యవహరించాలి’’ అని అన్నారాయన. అనంతరం.. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్సీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. -
TN: ఎయిర్ షో మరణాలకు కారణం అదే: మంత్రి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం(అక్టోబర్6) జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందడంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం స్పందించారు.ఎయిర్‌షోలో మరణాలు ప్రభుత్వ నిర్వహణ లోపం,తొక్కిసలాట వల్ల కాదని డీ హైడ్రేషన్ వల్లే సంభవించాయని చెప్పారు.అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన వందల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. షో కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అడిగనదాని కంటే ఎక్కువ ఏర్పాట్లే చేశామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వారు 100 బెడ్లు సిద్ధంగా ఉంచాలని కోరారని, తాము 4 వేల బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. బీచ్‌లో జరిగిన ఐఏఎఫ్ ఎయిర్‌షోకు భారీగా జనం హాజరవడంతో తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందడంతో పాటు చాలా మందికి గాయాలయ్యాయి.ఇదీ చదవండి: చుక్కలు చూపించిన ఎయిర్‌షో -
వైద్యరంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం మరింత బాధ్యతాయుతంగా వైద్యసేవలు అందించాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్లో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ రెండో శాఖను ఆదివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం, ఇతర చర్మ సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయని... వాటన్నింటికీ సమగ్రంగా వైద్యసేవలు అందించడానికి వీలుగా ఒకేచోట అన్నిరకాల వైద్యం చేసేందుకు ఈ ప్రాంతంలో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. డాక్టర్ సృశాంత్ లాంటి యువకులు ఈ రంగంలో అత్యాధునిక పద్ధతులు పాటిస్తూ ప్రజలకు తమవంతు సేవలు అందించాలని సూచించారు. ఈ దిశగా డాక్టర్ సృశాంత్, ఆయన బృందం మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ సృశాంత్ ముక్కా మాట్లాడుతూ, “ఇప్పటికే కోకాపేటలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్న మేము.. ఇప్పుడు నగరవాసులకు కూడా సేవలందించేందుకు వీలుగా జూబ్లీహిల్స్‌లో సువిశాల ప్రాంగణంలో ఆస్పత్రిని ఏర్పాటుచేశాం. ఇక్కడ కేవలం ఒక్కరే కాకుండా.. అన్నిరకాల చర్మ, శరీర, జుట్టు సమస్యలకు సంబంధించిన వైద్యులు, మహిళా వైద్యులు, కాస్మెటాలజిస్టులు, డెర్మటాలజిస్టులు కూడా అందుబాటులో ఉంటారు. అందువల్ల సాధారణ చర్మసంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి సోరియాసిస్ లాంటి తీవ్ర సమస్యల వరకు.. అలాగే జుట్టు రాలడం, పూర్తిగా ఊడిపోవడండ లాంటి తీవ్రమైన ఇబ్బందుల వరకు అన్నింటికీ చికిత్సలు అందిస్తాం. అలాగే కాస్మెటిక్ చికిత్సలు కూడా ఇక్కడ అందించగలం. శరీరంలోని గుప్తభాగాలకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నా.. వాటికి సైతం సమర్థవంతంగా చికిత్సలు చేయగల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.గతంలో 50-60 ఏళ్లు దాటిన తర్వాతే జుట్టు రాలడం, ఊడిపోవడం, బట్టతల ఏర్పడటం లాంటి సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడవి 18-20 ఏళ్ల వయసులో కూడా వస్తున్నాయి. దీనివల్ల చాలామంది యువతీ యువకులు ఇబ్బంది పడుతూ కాలేజీలకు వెళ్లడం కూడా మానుకుంటున్నారు. ఇలాంటివారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి చికిత్సలు చేసి, వారిలో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపడం, వారిని మళ్లీ కాలేజీకి పంపడం లాంటివి చేస్తున్నాం. ఇక్కడ మా ఆస్పత్రిలో పీడియాట్రిక్ డెర్మటాలజీ నుంచి.. అంటే పదేళ్ల వయసు వారికి వచ్చే సమస్యల నుంచి మొదలుపెట్టి జేరియాట్రిక్ సమస్యలు.. అంటే వయోవృద్ధులకు వచ్చే చర్మ సంబంధిత, ఇతర సమస్యల వరకు అన్నింటికీ చికిత్సలు అందించడానికి అంతర్జాతీయ స్థాయి పరికరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సంబంధించి వ్యక్తిగతీకరించిన చికిత్సలు అందించడం ఇక్కడ మా ప్రత్యేకత.చర్మ సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. డెంగ్యూ, చికున్ గన్యా లాంటివాటిలో కూడా చర్మసమస్యలు కొన్ని వస్తాయి. రోజూ తడిలో పనిచేసే గృహిణులకు కాళ్ల వద్ద ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఇలాంటివాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు చర్మవైద్యులకు చూపించుకుని దానికి తగి చికిత్స తీసుకోవాలి. మొటిమలకు కూడా ఏవి పడితే ఆ క్రీములు వాడటం కాకుండా.. సరైన చికిత్స చేయించుకోవాలి” అని తెలిపారు. -
కేరళలో నిఫా వైరస్ కలకలం.. బాలుడు మృతి
కేరళ: కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు ఆదివారం మరణించాడు. ఆదివారం ఉదయం బాలుడికి గుండెపోటు వచి్చందని, అతడిని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, 11.30 గంటలకు మృతి చెందాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాలుడు చికిత్స పొందుతున్న కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. అయితే 246 మంది బాలుడితో కాంటాక్ట్ అయ్యారని, వారిలో 63 మంది హై–రిస్క్ కేటగిరీ కింద ఉన్నారని తెలిపింది. నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినచర్యలు
సాక్షి, హైదరాబాద్: ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవ హరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో అనేక హోటళ్లలో నాసిరకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడటంతో దానిపై మంత్రి ఆరా తీశారు. మంగళవారం సచివాలయంలో అధి కారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాపారవేత్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని, హోటల్ యాజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రతి 6 నెలలకు వర్క్‌షాపు నిర్వహణ, అవగాహన సద స్సు నిర్వహిస్తామని, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ డాక్టర్ శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి, ఇండియన్ రెస్టారెంట్స్ అసోసియేష న్ ప్రెసిడెంట్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటన
-
కేరళలో కోవిడ్ వేరియంట్
పత్తనంతిట్ట: కేరళలో కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసు బయటపడింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఆదివారం ప్రకటించారు. అయితే, దీనితో ఎలాంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు. ‘కొన్ని నెలల క్రితం సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ సందర్భంగా ఈ సబ్ వేరియంట్‌ను గుర్తించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ కొత్త వేరియెంట్లను గుర్తించారు. తాజాగా, జేఎన్.1 ఉప వేరియెంట్ తిరువనంతపురం కరకుళంలో బయటపడింది. దీనితో కంగారు పడాల్సిన పనిలేదు’అని మంత్రి అన్నారు. అయితే, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్ )సాధారణ పరీక్షల్లో భాగంగా ఒక శాంపిల్‌లో ఈ వేరియంట్‌ను నవంబర్ 18న గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి పేర్కొంది. 79 ఏళ్ల బాధిత మహిళ ఇన్ప్లూయెంజా వంటి తేలికపాటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారని వివరించింది. -
కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు
కోవిడ్‌కి గురైనవారు చాలామంది గుండె సంబంధిత సమస్యల బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా గుండెపై ప్రభావం చూపిస్తుందా?. కరోనా వచ్చినవారంతా జాగ్రత్తగా ఉండాల్సిదేనా?. ఆరోగ్య మంత్రి సైతం కరోనా ఇన్ఫెక్షన్కి గురైన అలాంటివి చేయొద్దంటూ హెచ్చరించడంతో ఒక్కసారిగా మళ్లీ కరోనా గుబులు పోలేదా అని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఈనేపథ్యంలోనే ఈ కథనం!. వివరాల్లోకెళ్తే..ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కరోనా బారిన పడినవారు గుండెపోటు రాకుండా ఉండాలంటే అతిగా శ్రమించటం, భారీగా వ్యాయమాలు వంటివి చేయటం మానుకోవాలని సూచించారు. ఇటీవల గుజరాత్ నవరాత్రి వేడుకల సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ సుమారు 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. పైగా మృతుల్లో 13 ఏళ్ల బాలుడు అతి పిన్న వయస్కుడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యమంత్రి ఈ విధంగా ప్రజలకు సూచనలిచ్చారు. దీంతో ఒక్కసారి కరోనా భయాలు ప్రజల్లో వెల్లువెత్తాయి. అంతేగాదు మాండవియా ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం తీవ్ర కరోనాతో బాధపడినవారు గుండెపోటుకి గురికాకుడదంటే కనీసం ఒక ఏడాది లేదా రెండేళ్ల పాటు అతిగా వ్యాయామాలు, వంటి జోలికి పోకూడదని చెబుతోందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. #WATCH | Bhavnagar, Gujarat: On heart attack cases during the Garba festival, Union Health Minister Mansukh Mandaviya says, "ICMR has done a detailed study recently. The study says that those who have had severe covid and enough amount of time has not passed, should avoid… pic.twitter.com/qswGbAHevV — ANI (@ANI) October 30, 2023 కరోనా వల్ల గుండె సమస్యలు వస్తాయా..? కరోనా అనేది శ్వాసకోస లేదా ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించినదే అయినప్పటికీ గుండెపై ప్రభావం చూపుతుంది. గుండె కణాజాలనికి సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మొదలవుతుంది సమస్య. ఈ వైరస్ ఊపిరితిత్తులలోని గాలి సంచులను ద్రవంతో నింపుతుంది. ఫలితంగా కొద్ది ఆక్సిజన్ మాత్రమే రక్తప్రవాహంలో ఉంటుంది. దీంతో శరీరంలోకి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల గుండె కణాజాలానికి శాశ్వత నష్టం లేదా తాత్కాలిక నష్టం ఏర్పడుతుంది. కొన్ని కేసుల్లో కరోనా వైరస్ నేరుగా గుండె కండరాల కణజాలానికి సోకి దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్లు సిరలు, ధమనులు అంతర్గత ఉపరితలాలను కూడా ప్రభావితం చేస్తాయి. దీంతో రక్తానాళాల్లో వాపు లేదా నష్టం ఏర్పడి రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఫలితం శరీరంలో ఇతర భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా జరగదు. శరీరం ఒత్తిడికి గురవ్వడం వల్ల కూడా.. వైరల్ ఇన్షెక్షన్లు కారణంగా శరీరం ఒత్తిడికి లోనై కాలోకోలమైన్లు అనే రసాయాలను విడుదల చేస్తుంది. ఇది గుండె పనితీరుకు ఆటంక కలిగించి గుండె సమస్యలు ఉత్ఫన్నమయ్యేలా చేస్తుంది. గుండె ఆరోగ్యం ఉండాలంటే.. వ్యాయామాలను అతిగా కాకుండా శరీరానికి తగినంతగా చేయాలి పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి తగినంత కంటి నిండా నిద్రపోవాలి ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి ధుమపానం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ విధమైన ఆరోగ్యకరమైన అలవాట్లు కరోనా వైరస్‌ను జయించేలా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో గుండె సమస్యలను రాకుండా నిరోధించడంలో సహాయ పడుతాయి. (చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!) -
క్యాన్సర్‌కు సంబంధించి భారత్ ఎన్ని మందులు ఫ్రీగా ఇస్తోందంటే..
క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్‌గా వచ్చి ఒక్కసారిగా మనిషిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే భయానక వ్యాధి అనే చెప్పాలి. ఇంతవరకు డబ్బున్న వాళ్లకు, చెడువ్యసనాలు ఉన్నవాళ్లకు మాత్రమే వచ్చేది ఈ వ్యాధి. ఇప్పుడు ఇది కూడా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందర్నీ అటాక్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తోంది. చాలావరకు కొన్ని క్యాన్సర్లను దశాల రీత్యా మందులతోనే నయం చేయొచ్చు. కానీ కొన్నింటికి కీమో థెరఫీ వంటి చికిత్సలు మరికొన్నింటికి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సల ద్వారా నయం చేస్తారు వైద్యులు. ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాధికి సంబంధించి వైద్యం మాత్రమే గాక మెడిసిన్ సైతం అత్యంత ఖరీదే. అలాంటి మందులను సైతం భారత్ ఫ్రీగా ఇస్తోంది. ఎన్ని రకాల మందులను ఉచితంగా ఇస్తుంది ఆరోగ్య సంరక్షణలో భారత్ తీసుకుంటున్న చర్యలు గురించే ఈ కథనం.! భారత్ క్యాన్సర్‌కి సంబంధించి సుమారు 90 మందులలో 42 మందులను ఫ్రీగానే రోగులకు అందిస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సంజీవని: యునైటెడ్ ఎగైనెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో చెప్పారు. ఆరోగ్యానికే పెద్ద పీట వేస్తూ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు పెంచామననారు. ఆరోగ్యం ఎప్పుడూ రాజీకీయ అంశం కాదని అదొక గొప్ప సేవ అని చెప్పారు. కాలక్రమేణ వ్యాధుల తీరు మారుతోంది. దీనిపై సమగ్ర దృక్పథం కలిగి ఉండటం చాలా ముఖ్యం అని నొక్కి చెప్పారు మాండవీయ. అంతేగాదు భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధిలోకి విలీనం చేసిందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రజల ఆరోగ్యమే అత్యంత కీలక పాత్ర అని చెప్పారు. అందువల్లే ప్రభుత్వం ఆరోగ్య సేవలు పేద, బలహీన వర్గాల ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించిందన్నారు. కోవిడ్ 19 తర్వాత భారత్ ఎన్నో సవాళ్లను ప్రజలందరి సమిష్టి భాగస్వామ్యంతో అధిగమించింది. అలాగే మాండవియా తాను ప్రారంభించిన సంజీవని ఫౌండేషన్ గురించి కూడా వివరించారు. ఇది నిశబ్దంగా కబళించే క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, వ్యాధికి సంబంధించిన భయాలను పోగొట్టడం తదితర అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. అలాగే ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తూ వారిక తగిన సలహాలు సూచనలు ఇస్తున్న 'ఆశా బెహన్' సామాజకి కార్యకర్తల పాత్ర చాలా గొప్పదని అన్నారు. అంతేగాదు క్యాన్సర్ సంరక్షణలో భారత విధానం గురించి కూడా విపులీకరించారు. జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో పేద రోగులకు ఫీజులు మినహాయింపు ఇవ్వడమేగాక లాభప్రేక్షలేని ధరల్లోనే మందులను అందిస్తున్నామని అన్నారు. అనివార్య కారణాల వల్ల భారత్ కొంతమేర ఆరోగ్య సంరక్షణను తక్కువ ధరలోనే అందిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైన ధరల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా దృష్టిసారించనున్నట్లు తెలిపారు ఆరోగ్య మంత్రి మాండవీయ. (చదవండి: గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు! చిట్టి గుండె ఘోష..) -
మహిళలూ.. ఇది సరైన పద్ధతి కాదు.. రష్యా మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహిళలు పిల్లలను కనడం కంటే విద్య, భవిష్యత్తుపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇది సరైన పద్దతి కాదంటూ రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలో మృతుల సంఖ్య కంటే జననాల సంఖ్య తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆ దేశ దిగువ సభలోని ప్లీనరీ సమావేశంలో మురాష్కో మాట్లాడారు. మహిళలు చదువుకోవాలి, ఉన్నతోద్యోగం సాధించాలి, ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలనే మనస్తత్వం సమాజంలో బాగా నాటుకుపోయిందన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మహిళలు పిల్లల్ని కనడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆలస్యంగా పిల్లలను కనడం అనేక అనర్థాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. చదవండి: పుతిన్‌ను అరెస్టు చేస్తే.. రష్యాతో యుద్దం తప్పదు: సౌతాఫ్రికా అధ్యక్షుడు లేటుగా సంతానం కోసం ప్రయత్నించడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్న మంత్రి.. ఈ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గర్భస్రావాల కోసం వాడే ఔషధాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, వాటిని నియంత్రించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. -
ప్రజలకు వైద్యం అందించడంలో ఏపీనే నం.1.. కేంద్రం ప్రశంసలు
డెహ్రడూన్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందువరుసలో ఉందని కేంద్రప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రడూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర సమాఖ్య 15వ కాన్ఫరెన్స్‌ను స్వాస్థ్య చింతన్ శివిర్ పేరుతో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ, వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర సహాయ మంత్రులు భారతీప్రవీణ్ పవార్, ఎస్పీ సింగ్ భాగేలా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌దామీ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్త, 15 రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు. ఏపీ తరపున మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న వైద్య విధానరాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వైద్య విధానాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజంటేషన్లో ఏపీ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాగున్నాయని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా అక్కడి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని చెప్పింది. చదవండి: వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలి: సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేలకు పైగా ఆస్పత్రులు అత్యద్భుతం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఏకంగా రెండువేలకుపైగా ఆస్పత్రులు అనుసంధానమై ఉన్నాయని, దేశంలోనే ఈ స్థాయిలో ఆస్పత్రుల్లో ఉచిత వైద్య పథకాలు ఎక్కడా అమలవడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రజంటేషన్ సందర్భంగా తెలిపారు. ఏపీ ఆరోగ్యశ్రీ అమలు విషయంలో చురుగ్గా ఉండటం వల్ల ఆయుష్మాన్ భారత్ పథకం కూడా చాలా ఎక్కువ ఆస్పత్రుల్లో అమలవుతోందన్నారు. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతున్నదని చెప్పారు. ఏపీలో ఈ స్థాయిలో ఎలా సాధ్యమైందో మిగిలిన రాష్ట్రాలు పరిశీలస్తే బాగుంటుందని సూచన చేశారు. ఏపీ మొత్తం జనాభా 5 కోట్ల వరకు ఉంటే.. వీరిలో ఏకంగా 80 శాతం మందికి దాదాపు నాలుగున్నర కోట్ల మందికి అబా ఐడీలను ఏపీ ప్రభుత్వం జారీ చేయగలిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం చూపుతున్న చొరవను మిగిలిన రాష్ట్రాలు కూడా గుర్తించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విధానాలపై కేంద్ర ప్రభుత్వ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాష్ట్ర చొరవకు కేంద్ర సహకారం కూడా మరింతగా తోడైతే పేదలకు మేలు జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ పాల్గొన్నారు. -
మహిళతో మంత్రి వీడియో చాట్.. బీజేపీ రాజీనామా డిమాండ్
జార్ఖండ్ హెల్త్ మినిస్టర్ ఓ మహిళతో చేసిన వీడియో చాట్ పెను దుమారం రేపుతోంది. ఇదే అదనుగా బీజేపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా ఓ మహిళతో చేసిన వీడియో చాట్ తీవ్ర కలకలం సృష్టించింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడికి దిగింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ వీడియో కాంగ్రెస్ ఒరిజినాల్టిని బట్టబయలు చేసిందని విమర్శించారు.అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేయో కూడా ఈ అసభ్యకరమైన వీడియోపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ఆయన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గంలోని సభ్యుడు కాబట్టి ఆ వీడియో క్లిప్ నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నారు. దీనిపై దర్యాప్తు చేసేలా సీఎం ఆదేశించాలని పట్టుబట్టారు షాదేయో. ఆ మంత్రికి సంబంధించిన వీడియో వాస్తవమని తేలితే వెంటనే అతను మంత్రి పదవి నుంచి వైదొలగాలన్నారు. ఈ వ్యాఖ్యలపై సదరు ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా స్పందిస్తూ.. తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమే ఆ వీడియో క్లిప్ అంటూ మండిపడ్డారు. అదంతా ఫేక్ అని, అది ఎడిట్ చేసిన వీడియో అని వివరణ ఇచ్చారు. దీనిపై తాను ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు కూడా చెప్పారు. ఎవరో కావలనే ఉద్దేశపూర్వకంగానే ఆ ఎడిట్ చేసిన ఫేక్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారని, దీని వెనుకు ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్ నేత బన్నా గుప్తా అన్నారు. (చదవండి: యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు..వివాదాస్పదంగా సామూహిక వివాహ పథకం..) -
'జన ఔషధి దుకాణాల్లో తక్కువ ధరకే 1,759 రకాల మందులు'
సాక్షి, గుంటూరు: జనరిక్ మందులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వైద్య ఆరోగ్య విభాగానికి చెందిన వారంతా ఈ విషయంపై చొరవచూపాలని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సూచించారు. మంగళగిరిలోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో ప్రభుత్వం అధికారికంగా జనఔషధి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని కంపెనీలు మార్కెటింగ్, పర్సంటేజీల ఆశచూపుతూ మందులను అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తుంటాయని, వీరి మాయలో ఎవరూ పడకూడదని కోరారు. మందుల చీటిలపై రోగానికి సంబంధించిన ఔషధం పేరే రాయలని పేర్కొన్నారు. జన ఔషధి దుకాణాల్లో అత్యంత చౌక ధరకే మందులు దొరుకుతాయని తెలిపారు. నేరుగా కంపెనీ నుంచి వచ్చిన ఔషధాన్ని ప్రజలకు అందజేస్తారని చెప్పారు. చాలా చౌకగా, అత్యంత నాణ్యమైన మందులు జన ఔషధి దుకాణాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. రోగులంతా ఈ దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ అధికారులదేనని చెప్పారు. జగనన్న లక్ష్యాలు నెరవేర్చాలి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమున్నత లక్ష్యంతో పనిచేస్తున్నారని విడదల రజిని తెలిపారు. పేదలందరికి అత్యంత సులువుగా, వేగంగా నాణ్యమైన వైద్యం పూర్తి ఉచితంగా అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య శాలలన్నింటినీ నాడు-నేడు కార్యక్రమం కింద పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందజేస్తున్నామన్నారు. జగనన్న లక్ష్యాలు, ప్రభుత్వ సంకల్పం నెరవేర్చేలా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలు నడిచేలా చూడాలన్నారు. ఎవరైనా కంపెనీల పేర్లతో మందుల చీటిలు రాస్తున్నా, వాటిని ఏ మందుల దుకాణాలైనా ప్రోత్సహిస్తున్నా చర్యలకు వెనుకాడొద్దన్నారు. అప్పుడే జన ఔషధి దివాస్ కార్యక్రమాల లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. జన ఔషధి దుకాణాల్లో 1,759 రకాల మందులు జన ఔషధి దుకాణాల్లో ఏకంగా 1,759 రకాల మందులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. 280 సర్జికల్ డివైజెస్ కూడా దొరుకుతాయని చెప్పారు. ఇవన్నీ అత్యంత తక్కువ ధరకే లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ దుకాణాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని, వీరంతా ఔషధి దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు, డ్రగ్ విభాగం అధికారులదేనని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 145 జనఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్యను మరింతగా పెంచబోతున్నామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ శాఖ డీజీ రవిశంకర్ నారాయణన్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, నిర్మల కళాశాల అధ్యక్షురాలు మరియా సుందరి, కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. -
వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక..!
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల కన్పిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్-19 జాగ్రత్తలపై ప్రజలను అలర్ట్ చేసింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్లు పైడినవారు, పిల్లలు, గర్భణీలు గుంపుల్లో తిరగకూడదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ హెచ్చరించారు. వీరు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఆస్పత్రుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది మొత్తం కచ్చితంగా మాస్కులు ధరించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అయితే కరోనా పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఏమీ లేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా నిపుణుల కమిటీతో సమావేశమై పరిస్థితిపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. వేసవికాలం సమీపించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్‌పైనా సమీక్షించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలు రోజుకు రూ.2-3 లీటర్ల నీటిని తీసుకొని హైడ్రేట్‌గా ఉండాలని సూచించారు. నీటితో పాటు మజ్జిక, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలన్నారు. భారత్‌లో కరోనా కేసులు తగ్గి చాలా రోజులవుతున్నప్పటికీ ఈ మధ్య మళ్లీ కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పిస్తోంది. మార్చి 5న 281 మంది, మార్చి 4న 324 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్) కేసులు వెలుగుచూస్తున్నాయి. అనేక మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తఫ్లూ కరోనా లాంటిది కాకపోయినప్పటికీ జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కర్ణాటక ఆరోగ్యమంత్రి కూడా కరోనా విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చదవండి: కొత్త ఫ్లూ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్ -
‘మహిళా దినోత్సవం’ తెలంగాణ ప్రభుత్వం నూతన కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు బిఆర్కే భవన్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం "ఆరోగ్య మహిళ" కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8న ప్రారంభించే అరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం సీఎం సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందని, మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలకి ఈ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తం 1200 లకు విస్తరించాలని ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. 8 వైద్య సేవలు 1, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు 2, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్.. 3, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు. 4, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు. 5, మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు. 6, నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు. 7. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు. 8. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి,సీఎం ఓఎస్డీ గంగాధర్, డైరెక్టర్ పిఆర్ హన్మంత రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బిల్‌గేట్స్‌తో సమావేశం వండర్ఫుల్! కోవిడ్ నిర్వహణపై ప్రశంసల జల్లు!
భారతదేశ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ దేశా రాజధానిలోని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. అంతేగాదు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వార్‌రూమ్‌ని సైతం సందర్శించారు బిల్‌గేట్స్. వాస్తవానికి దీన్ని కోవిడ్ సమయంలో నేషనల్ పబ్లిక్ హెల్త్ అబ్జర్వేటరీ పేరుతో వార్ రూమ్‌ని రూపొందించారు. మన్సుఖ్తో జరిగిన సమావేశంలో బిల్‌గేట్స్ కోవిడ్ నిర్వహణ, టీకా డ్రైవ్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వంటి డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలుసుకుని ప్రశంసించారు. అలాగే ఆ సమావేశంలో బారత్ జీ20 ఆరోగ్య ప్రాధాన్యతలు, పీఎం భారతీయ జనౌషధి పరియోజన ఈ సంజీవని గురించి కూడా ఆరోగ్య మంత్రి మన్సుఖ్ బిల్‌గేట్స్‌తో చర్చించారు. ఈ మేరకు ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా ట్విట్టర్ వేదికగా బిల్‌గేట్స్‌తో జరిగిన సమావేశం వండర్ఫుల్ అంటూ ఈవిషయాన్ని వెల్లడించారు. కాగా, బిల్‌గేట్స్ గతవారం తన బ్లాగ్‌లో భారత పర్యటన గురించి తెలియజేశారు. బ్లాగులో ఆయన..నేను వచ్చేవారం భారతదేశానికి వెళ్తున్నాను. చాల ఏళ్లుగా అక్కడ చాలా సమయం గడిపినప్పటికీ..మరుగదొడ్లను తనిఖీ చేయడం నుంచి భారతదేశంలోని పేద, వెనుకబడిన కులాలు నివశించే గ్రామాన్ని సందర్శించడం వరకు ప్రతిదీ చేస్తున్నాను. కోవిడ్‌కి ముందు నుంచి కూడా భారత్‌ని సందర్శించ లేకపోయాను. అక్కడ ఎంత వరకు పురోగతి సాధించిందో తెలుసుకునేంతం వరకు వేచి ఉండలేను అని రాసుకొచ్చారు. అలాగే భారతదేశాన్ని కొనయాడారు. భారతదేశం భవిష్యత్తుపై మంచి ఆశను కలిగిస్తుందన్నారు. ప్రపంచం పలు సంక్షోభాలతో అతలాకుతలం అయిపోతున్నప్పటికీ.. భారత్ మాత్రం ఎంత పెద్ద సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలదని నిరూపించిందన్నారు. (చదవండి: చైనాపై ఒత్తిడి తెచ్చేలా..రంగం సిద్ధం చేస్తున్న అమెరికా!) -
క్యాన్సర్ నివారణలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుంది
సాక్షి, గుంటూరు: రాబోయే పదేళ్లలో.. క్యాన్సర్ నివారణకుగానూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఏపీ బడ్జెట్లో.. రూ.400 కోట్లను క్యాన్సర్ నివారణకు కేటాయించారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంద కుదుర్చుకుంది. కర్నూల్లో రూ.120 కోట్లతో కేన్సర్ యూనిట్ ఏర్పాటు జరుగుతోంది. అలాగే విశాఖ కేజీహెచ్‌లో రూ.60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం అని ఆమె తెలిపారు. 2030 నాటికి క్యాన్సర్ నివారణలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్ కు గురవుతున్నారన్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిందని మంత్రి విడదల రజని ఈ సందర్భంగా తెలిపారు. -
Naba Kisore Das: ఒడిశా మంత్రి హత్య.. ఉద్దేశపూర్వకంగానే గురి!
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ హత్యవెనుక గల కారణాలపై రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి బ్రజరాజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్(ఇన్చార్జి) ప్రద్యుమ్న స్వొయి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇందులో ఘటనా క్రమంతో నిందితుల వివరాలు పేర్కొన్నారు. ఏఎస్ఐ గోపాల్‌కృష్ణ దాస్ హతమార్చాలనే స్పష్టమైన ఉద్దేశంతోనే మంత్రిపై కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా నమోదు చేశారు. ‘ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ గాంధీ చౌక్‌లోని లిఫ్ట్ అండ్ షిఫ్ట్ బిల్డింగ్‌లో బ్రజరాజ్ నగర్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు విచ్చేశారు. వేదిక సమీపంలో ఆగిన కారు ముందు వైపు సిబ్బంది తలుపు తెరిచిన తర్వాత కిందికి దిగారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం మోహరించిన ఏఎస్ఐ గోపాల్ కృష్ణదాస్ వెనువెంటనే తలుపు వద్దకు వచ్చి, చంపాలనే స్పష్టమైన ఉద్దేశంతో మంత్రిని లక్ష్యంగా చేసుకుని చాలా సమీపం నుంచి తన సర్వీస్ రివాల్వర్‌తో గురిపెట్టి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు మంత్రి ఛాతికి తగలడంతో ఆయన కింద పడిపోయార’ని పేర్కొన్నారు. ఐఐసీ వేలికి గాయం.. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన బ్రజరాజ్ నగర్ ఐఐసీ, రాంపూర్ పోలీస్ అవుట్‌పోస్ట్ కానిస్టేబుల్ కేసీ ప్రధాన్‌తో కలిసి నిందితుడు గోపాల్‌దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి తప్పించుకునేందుకు నిందితుడు 9 ఎంఎం పిస్టల్ నుంచి మరో రెండు రౌండ్ల బుల్లెట్లను కాల్చాడు. దీంతో బ్రజరాజ్ నగర్ ఐఐసీ ప్రద్యుమ్న త్రుటిలో తప్పించుకోగా, వేలికి గాయం తగిలింది. ఈ పరిస్థితుల్లో కాళీనగర్కు చెందిన జీబన్లాల్ నాయక్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. కొంత పెనుగులాట తరువాత నిందితుడి నుంచి ఎట్టకేలకు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలతో దాఖలైన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 307, ఆయుధ చట్టంలోని 27(1) కింద కేసు నమోదు చేశారు. 50కి పైగా ప్రశ్నలు.. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన క్రైమ్ బ్రాంచ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఏడీజీ) అరుణ్ బొత్రా నిందిత ఏఎస్ఐ గోపాల్ కృష్ణదాస్ ఆదివారం ఘటనా స్థలంలో పట్టుబడినట్లు తెలిపారు. మంత్రి నవకిషోర్ దాస్‌పై తుపాకీతో పేల్చడం వెనక పరిస్థితులను స్పష్టం చేసే దిశలో దర్యాప్తుకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాల్పుల ఘటనపై తదుపరి విచారణ కోసం నిందితుడికి ఏడు రోజుల రిమాండ్ నిమిత్తం కోర్టుకు అభ్యరి్థంచనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. సుందర్‌గఢ్ పోలీసు బ్యారక్‌లో నిర్బంధించి నిందిత ఏఎస్ఐ గోపాల్‌దాస్‌ను నిరవధికంగా 2 గంటల పాటు ప్రశ్నించారు. 50కి పైగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అయితే ఆయన ఏం మాట్లా డారు? ఏం సమాధానం చెప్పాడు? ఎందుకు చంపాడనే విషయాలేవీ తెలియరాలేదు. అరుణ్ బొత్రా సైతం మీడియా ఎదుట పెదవి దాటకుండా జాగ్రత్త వహించారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ.. మంత్రి నవకిషోర్ దాస్ హత్య ఘనను హైకోర్టు న్యాయ మూర్తితో విచారణ జరిపించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాసింది. మంత్రి నవకిషోర్ దాస్ హత్యా ఘటనపై విచారణకు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తిని పేర్కొవాలని సోమవారం రాసిన లేఖలో అభ్యర్థించింది. ఝార్సుగుడ మున్సిపాలిటీ లో మంత్రి చివరి ప్రసంగం నన్ను మాత్రం వదులుతారా? ఆరోగ్యమంత్రి నవకిషోర్ దాస్ మరణానికి కొద్ది సమయం ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి ప్రసంగంతో ఆయన జీవన ప్రస్థానం ముగిసింది. ఝార్సుగుడ మున్సిపాలిటీ ఒకటో నంబరు వార్డు కిసాన్పాడులో మైక్రో యాక్టివిటీ సెంటర్ ప్రాంగణంలో కొత్త భవనం ప్రారంభోత్సవంలో చివరి సారిగా ప్రసంగించారు. ఈ సమావేశంలో మంత్రి అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘ప్రతి చోటా ఆదరించే వారు ఉంటారు.. కించపరిచే వారూ.. ఉంటారు. రాముడు–రావణుడు, కృష్ణుడు–కంసుడు ఈ కోవకు చెందిన వార’ని ఉదహరించారు. ‘సీతారాములను కించపరచకుండా వదలని ప్రజానీకం మధ్య మనుగడ కొనసాగిస్తున్న నన్ను మాత్రం ధూషించకుండా వదులుతారా?’ అని చమత్కరించి సభలో నవ్వులు కురిపించారు. ఈ కార్యక్రమం హాజరయ్యే ముందు తుపాకీ తూటాతో కుప్పకూలి అనంత విషాదం మిగిల్చారు. శని శింగనాపూర్ శనిదేవుని మందిరంలో మంత్రి నవకిషోర్ దాస్ పూజలు(ఫైల్) కలిసిరాని పూజ! త్రివేణి అమావాస్య సందర్భంగా మహారాష్ట్ర శని శింగనాపూర్‌లో ఉన్న శనిదేవుని మందిరంలో మంత్రి కిషోర్‌దాస్ బంగారు కలశం విరాళంగా అందజేసి ఇటీవల వార్తలకెక్కారు. రూ.కోటి విలువైన 700 గ్రాముల బంగారం, 5కిలోల వెండితో చేసిన కలశాన్ని ఆలయానికి సమరి్పంచారు. అయితే ఈ కలశం విలువ కేవలం రూ.10 లక్షలు మాత్రమేనని మంత్రి ప్రకటించారు. ఈ కలశం ఆవ నూనెతో శని భగవానునికి అభిషేకించేందుకు వినియోగించేందుకు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర, ఝార్సుగుడ ప్రజలను సంతోషంగా ఉంచాలని శని దేవుడిని ప్రార్థించానన్నారు. గోపాల్ కృష్ణదాస్, ఏఎస్ఐ విధుల నుంచి తొలగింపు.. ఆరోగ్యశాఖ మంత్రి కిషోర్ దాస్ హత్యకేసులో నిందితుడు సహాయ సబ్ ఇస్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఎస్ఐ) గోపాల్‌కృష్ణ దాస్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విధుల నుంచి తొలగిస్తునట్లు ఝార్సుగుడ జిల్లా ఎస్పీ రాహుల్‌జైన్ సోమవారం ప్రకటించారు. నిందితుడు బ్రజరాజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ ఛక్ అవుట్‌పోస్టు సిబ్బందిగా పేర్కొన్నారు. భారత రాజ్యంగం ఆర్టికల్ 311 ప్రకారం సరీ్వసులో ఉన్న నిందితునికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 30నుంచి అమలైనట్లు పరిగణిస్తామన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి చివరి చూపు.. దివంగత మంత్రి నవకిషోర్ దాస్ స్థానిక యూనిట్–5 అధికారిక నివాస ప్రాంగణంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ ప్రొఫెసర్ గణేష్‌లాల్ అంతిమ దర్శనం చేసుకుని పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. ఈ ప్రాంగణంలో దాస్‌కు ఒడిశా పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ప్రదానం చేశారు. అతున్ సవ్యసాచి నాయక్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఉషాదేవి, న్యాయశాఖ మంత్రి జగన్నాథ్ సరకా, విద్యుత్‌శాఖ మంత్రి ప్రతాప్ కేశరీదేవ్, జల వనరులశాఖ మంత్రి టుకుని సాహు, ఎక్సైజ్‌శాఖ మంత్రి అశ్వినీకుమార్ పాత్రొ, నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ప్రీతిరంజన్ ఘొడై, జౌళీ, హస్తకళల శాఖమంత్రి రీతా సాహు, పాఠశాలలు, సామూహిక విద్యాశాఖ మంత్రి సమీర్‌రంజన్ దాస్ ఈ ప్రాంగణంలో దివంగత మంత్రికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆరోగ్యశాఖ మంత్రి నవకిషోర్ దాస్ మరణం దురదృష్టకరమని వీరంతా విచారం వ్యక్తం చేసి, ఆయన కుటుంబీకుల పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
విషాదం: కాల్పుల్లో గాయపడిన మంత్రి నబ కిషోర్ దాస్ మృతి
సాక్షి, భువనేశ్వర్: ఒడిషాలో విషాదం నెలకొంది. కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య శాఖ మంత్రి నబ కిషోర్ దాస్ మృతిచెందారు. కాల్పుల తర్వాత భువనేశ్వర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం విషమించి కిషోర్‌దాస్ తుదిశ్వాస విడిచారు. కాగా, ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని గాంధీచౌక్ వద్ద నబ కిషోర్ దాస్‌పై ఏఎస్ఐ గోపాల్ దాస్ కాల్పలు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. ఈ ఘటనలో మంత్రితో పాటూ మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఇక, ఇప్పటికే గోపాల్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏ కారణంతో మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు జరిపాడనేది తెలియాల్సి ఉంది. మంత్రి నబ కిషోర్ దాస్ కి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతికరమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మంత్రిపై కాల్పులు జరపడంతో బిజూ జనతాదళ్ కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. తమ నాయకుడిపై కాల్పులు జరిగిన నిందితుడిని తమకి అప్పగించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
Odisha: మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు.. ఛాతీలో దిగిన బుల్లెట్లు..
భువనేశ్వర్: ఒడిశా ఆరోగ్య మంత్రి నబ కిశోర్ దాస్‌పై ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. ఝార్‌సుగుద జిల్లా బ్రజ్రాజ్నగర్లోని గాంధీ స్క్వేర్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కారులో నుంచి దిగగానే పోలీసు తుపాకీ తీసి నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో కిశోర్ దాస్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అధికారులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్ఐ పేరు గోపాల్ దాస్ అని ఉన్నతాధికారులు వెల్లడించారు. అతను యూనిఫాంలోనే ఉన్నాడని పేర్కొన్నారు. తన సొంత తుపాకీతోనే కాల్పులు జరిపినట్లు చెప్పారు. అయితే మంత్రిపై ఏఎస్ఐ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మంత్రికి పోలీస్ ఎస్కార్ట్ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం చూస్తుంటే భద్రతా వైఫల్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చదవండి: కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించాం.. 'మన్‌కీ బాత్'లో మోదీ -
‘ఆరోగ్య మంత్రి నేను.. తగ్గేదేలే!’ కాంగ్రెస్‌కు మాండవియా కౌంటర్
న్యూఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో మార్గదర్శకాలు పాటించాలని, లేదంటే యాత్రను ఆపాలని కోరుతూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన లేఖపై రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేశాయి. యాత్రను ఆపాలని చేస్తున్న రాజకీయ కుట్రగా పేర్కొన్నాయి. తాజాగా కాంగ్రెస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవియా. భారత్ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌ను కోరుతూ లేఖ రాయడం రాజకీయం కాదని నొక్కి చెప్పారు. ‘ఇది ఏ మాత్రం రాజకీయ కాదు. నేను ఆరోగ్య మంత్రిని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోవిడ్ నియమాలను అనుసరించాల్సిన అవసరం, ఆ ప్రక్రియలోని పురోగతిని నేను ఎల్లప్పుడూ పర్యవేక్షించాలి. కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముగ్గురు ఎంపీలు నాకు లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న తర్వాత హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు వంటి కాంగ్రెస్ నేతలు కరోనా బారినపడ్డారు.’ అని పేర్కొన్నారు ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. అంతకు ముందు కేంద్ర మంత్రి లేఖపై మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రను ఆపేందుకు కరోనాను ఒక సాకుగా చూపుతున్నారని, అది బీజేపీ కొత్త పన్నాగమని విమర్శించారు. మరోవైపు.. యాత్రను అడ్డుకునేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తెచ్చారని విమర్శించారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. ప్రస్తుతం కేంద్రం లేఖపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదీ చదవండి: చైనా పరిస్థితి ఒక హెచ్చరిక.. కరోనాపై లోక్‌సభలో ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన -
‘కరోనా ఒక సాకు’.. కేంద్రం లేఖపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్
చండీగఢ్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించలేకపోతే భారత్ జోడో యాత్రను నిలిపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాయటంపై షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అది భారత్ జోడో యాత్రను ఆపేందుకు చూపిస్తున్న ఒక సాకుగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తీసుకొచ్చారని కాంగ్రెస్ ప్రచార విభాగం ఇంఛార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆయన మాటలతో ఏకీభవించారు రాహుల్ గాంధీ. హరియాణాలోని నుహ్ ప్రాంతంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈ యాత్ర కశ్మీర్ వరకు కొనసాగుతుంది. ఇది వారి(బీజేపీ) కొత్త పన్నాగం, కరోనా వస్తోంది యాత్రను ఆపేయండీ అంటూ నాకు లేఖ రాశారు. ఇవన్నీ యాత్రను ఆపేందుకు చూపుతోన్న సాకులు మాత్రమే. వారు ఈ దేశం బలం, నిజానికి భయపడుతున్నారు.’ అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు పాటించకుంటే జోడో యాత్ర నిలిపి వేయాలని ఆదేశం -
కేరళలో ‘మీజిల్స్’ పంజా.. 160 మంది చిన్నారులకు వైరస్
తిరువనంతపురం: చిన్నారులకు సోకే మీజిల్స్ వ్యాధి దేశంలో మరో రాష్ట్రానికి పాకింది. ఇప్పటికే మహారాష్ట్రలో వందల కేసులు నమోదు కాగా.. తాజాగా కేరళలోనూ భారీగా కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటి వరకు 160 మంది పిల్లలకు వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులోనూ మలప్పురమ్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించకపోవటం ఊరట కలిగిస్తోందని తెలిపింది. మీజిల్స్ వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో మీజిల్స్ వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. మలప్పురమ్‌లో పర్యటన అనంతరం ఆరోగ్య శాఖ కార్యదర్సితో నిపుణులు భేటీ కానున్నారు. మరోవైపు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి మీనా జార్జ్. అయితే, తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ‘మలప్పురమ్‌లో మీజిల్స్ వైరస్‌ను గుర్తించిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశాం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో భేటీలో జయపురపైనా సమీక్షించాం. ప్రజల భాగస్వామ్యంతో వైరస్‌పై పోరాడేందుకు ప్రజాహిత చర్యలు తీసుకుంటున్నాం. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టాం.’ అని ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. జిల్లాలో అవసరమైన ఎంఆర్ వ్యాక్సిన్, విటమిన్ ఏ సిరప్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇదీ చదవండి: మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్‌తో చిన్నారులు మృతి -
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ త్వరలో పూర్తి
గజ్వేల్: ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు. సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ సత్వర చెల్లింపులు, హెల్త్ కార్డుల అంశంపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాశాఖ ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకునే గుజరాత్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో ఉపాధ్యాయుల వేతనం చాలా ఎక్కువని గుర్తుచేశారు. మరోవైపు పక్క రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు సమస్యలపై కొట్లాడితే నిర్బంధిస్తున్నారని, అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదని పేర్కొన్నారు. తమది ఉద్యోగ, ఉపాధ్యాయ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్నారు. పెరిగిన తలసరి ఆదాయం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో తలసరి ఆదాయం భారీగా పెరిగిందని, 2014కు ముందు 1.24 లక్షలుగా ఉంటే ప్రస్తుతం అది 2.70 లక్షలకు చేరుకుందని మంత్రి హరీశ్ చెప్పారు. దేశ తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువగా 1.48 లక్షలు ఉందని తెలిపారు. తెలంగాణ ఎదుగుదలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం సాచివేత ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ ఏడాది బోరుబావులకు మీటర్లు పెట్టనందుకు రూ. 6 వేల కోట్లు, ఎఫ్ఆర్బీఎం కింద రావాల్సిన రూ. 15 వేల కోట్లు కలుపుకొని మొత్తంగా రూ. 21 వేల కోట్లను ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం తెలంగాణకు నిలిపేసిందని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 800 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 2,950కి పెంచామన్నారు. వచ్చే ఏడాది మరో 9 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శశిధరశర్మ, వెంకటరాజం, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మొదటి ఏఎన్ఎం ఖాళీ పోస్టుల భర్తీకి నెలారెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రెండో ఏఎన్ఎం మహాసభల్లో మంత్రి మాట్లాడారు. అన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, రాబోయే రోజుల్లో కీమో, రెడియో థెరపీ కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్ఎంలది కీలక పాత్ర అని కొనియాడారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నట్లు చాలా మందికి తెలియదని, అలాంటివారిని గుర్తించి ముందుగా చికిత్స అందిస్తే దీర్ఘకాలిక రోగాలు రావని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, ఫలితంగా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖానాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరగగా, ఇప్పుడు అవి 67 శాతానికి పెరిగాయని మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ మూడోస్థానం దక్కించుకుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు చివరి స్థానంలో ఉందని, డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజినే తప్ప దాని వల్ల పేదలకు ఎలాంటి లాభం లేదని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం అవుతుందని తెలిపారు. జనవరి వరకు అన్ని జిల్లాల్లో టి–డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏఎన్ఎం పరిధిలో వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటట్టు చూడాలన్నారు. మొదటి ఏఎన్ఎం పోస్టుల ఖాళీల భర్తీలో కరోనా తర్వాత వెయిటేజీ ఇస్తున్నామని, ఏడాదికి 2 మార్కుల చొప్పున కలుపుతున్నామని చెప్పారు. టీవీవీపీలో 228 ఉద్యోగాలు ఇస్తే, 200 పోస్టులు ఏఎన్‌ఎంలకే వచ్చాయన్నారు. పూర్తిస్థాయిలో వయో పరిమితి సడలింపు ఇచ్చామని హరీశ్ తెలిపారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
‘ఉద్దానం సమస్య ఇప్పటిది కాదు’
సాక్షి, అమరావతి: ఉద్దానం సమస్య ఇప్పటిది కాదని, గత ప్రభుత్వం ఉద్దానాన్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్దానంలో పరిస్థితిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రజిని. ‘ఉద్దానం బాధితుల కోసం చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే ఈనాడు పని చేస్తోంది. చంద్రబాబును రామోజీరావు ఏరోజూ ఎందుకు ప్రశ్నించలేదు? సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేయడమే ఎల్లోమీడియా పని.. ఉద్దానం బాధితుల కోసం చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదు. ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు అండగా నిలిచింది సీఎం జగనే. ఉద్దానం బాధితులకు రూ.10వేలు పెన్షన్ అందిస్తున్నాం. బాధితులకు రెగ్యులర్‌గా డయాలసిస్ చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకే హాస్పిటల్ నిర్మాణం.’ అని వెల్లడించారు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఇదీ చదవండి: టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలి: గృహనిర్మాణ సమీక్షలో సీఎం జగన్ -
సీఎం జగన్ ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు : మంత్రి విడదల రజిని
-
రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ
సీనియర్ నటి జయకుమారిని(70) తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ ఆదివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో ఐటెం సాంగ్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది నటి జయకుమారి. ఆ పాటలకు అప్పట్లో అధిక పారితోషికం వస్తుండడంతో తాను శృంగార తారగా మారానని జయ కుమారి ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. 400 పైగా చిత్రాల్లో నటించారు. అయినా ఈమెకు సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు రూ. 750కు అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆమె 2 కిడ్నీలు దెబ్బతినడంతో వైద్యం కోసం స్థానిక కీల్పాక్కంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఎం.సుబ్రమణియన్ ఆదివారం ఆమెను పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశించారు. ఆమెకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం, సొంత ఇంటిని ఏర్పాటు చేసే విషయమై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రతిష్టాత్మక ‘మెగసెసె’ అవార్డు తిరస్కరించిన మాజీ మంత్రి!
సాక్షి, తిరువనంతపురం: ప్రతిష్టాత్మక ‘రామన్ మెగసెసె’ అవార్డును తిరస్కరించారు కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ. అవార్డు అందుకోవటంపై పార్టీతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అవార్డు కమిటీ నుంచి తనకు లేఖ అందిందని, ఆ గౌరవాన్ని వదులుకోవాలని పార్టీ సమష్టిగా నిర్ణయించినట్లు సీపీఎం నేత తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రిగా అందించిన సేవలకుగానూ, ముఖ్యంగా రాష్ట్రంలో నిఫా వైరస్, కోవిడ్-19 వైరస్ విజృంభించిన సమయంలో ఆమె కృషికి గానూ.. 64వ మెగసెసె అవార్డుకు ఎంపిక చేసింది కమిటీ. ‘నేను సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యురాలిని. దీనిపై మా పార్టీ నాయకత్వంతో చర్చించాను. అవార్డును తీసుకోకూడదని అంతా కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకున్నాం. అది పెద్ద అవార్డు. అయితే, అది ఒక ఎన్జీఓ అందిస్తోంది. సాధారణంగా వారు కమ్యూనిస్టుల ప్రిన్సిపుల్స్‌ను వ్యతిరేకిస్తారు. నా పేరును పరిగణనలోకి తీసుకున్నందుకు నేను ఆ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపాను. నా నిర్ణయాన్ని వారికి తెలియజేశాను.’ అని వెల్లడించారు మాజీ మంత్రి శైలజ. ఇది మొత్తం రాష్ట్రానికి జరిగిన గౌరవాన్ని నిరాకరిస్తున్నట్లుగా చూడకూడదని చెప్పారు. రాజకీయ నేతలకు గతంలో మెగసెసే అవార్డు ఇవ్వలేదన్నారు. ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మహిళకు రెప్పపాటులో తప్పిన ప్రమాదం! -
గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి
పోర్చుగల్‌లోని లిస్బన్లో ప్రధాన ఆస్పత్రి శాంటా మారియాలో నియోనాటాలజీ సేవలు లేవు. దీంతో మరొక ఆస్పత్రికి అంబులెన్స్‌లో గర్భిణిని తరలిస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన పోర్చుగల్ ఆరోగ్యమంత్రి మార్టా టెమిడో రాజీనామ చేసే పరిస్థితికి దారితీసింది. అత్యవసర ప్రసూతి ఆస్పత్రులను తాత్కలికంగా మూసివేయాలని ఆమె తీసుకున్న నిర్ణయమే రాజీనామ చేసేవరకు తీసుకువచ్చింది. వాస్తవానికి గత వేసవి సెలవుల్లో పలు ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో వారంతాల్లో ఉండే అ్యతవసర ప్రసూతి సేవలను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ప్రతిపక్షాలు, మున్సిపాలిటీలు గర్భిణులు ఎమర్జెన్సీ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లలేరని, ఇది అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ దుమ్మెత్తిపోశాయి. సిబ్బంది కొరత కారణంగా గత్యంతరం లేని స్థితిలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. టెమిడో 2018లో ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అంతేకాదు కోవిడ్-19కి వ్యతిరేకంగా విజయవంతమైన వ్యాక్సిన్ ప్రచారాన్ని నిర్వహించింది కూడా. అత్యంత ప్రజాదరణ పొందిన మంత్రుల్లో ఆమె ఒకరు. ఐతే ఆమె ప్రసూతి వైద్యానికి సంబంధించిన విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం తోపాటు తాజాగా సదరు గర్భిణి మహిళ కూడా చనిపోవడం ప్రతిపక్షాల విమర్శలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ మేరకు టెమిడో ఆరోగ్య మంత్రిత్వ శాఖ్య ప్రకటనలో తాను ఇక పదవిలో కొనసాగే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదని, అందువల్ల తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణియించుకున్నట్లు వెల్లడించింది. ఐతే దీన్ని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియాఓ కోస్టా.. టెమిడో రాజీనామను ఆమోదించడమే కాకుండా ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యావాదాలు కూడా తెలిపారు. (చదవండి: వాషింగ్టన్లో కాల్పులు కలకలం...ఇద్దరికి గాయాలు) -
విషాదం: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి
Assamese Actor Kishor Das Dies At Age 30 After Battle With Cancer: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అస్సామీ నటుడు కిశోర్ దాస్ శనివారం (జులై 2) కన్నుమూశారు. 30 ఏళ్ల కిశోర్ దాస్ కేన్సర్‌తో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఈ ఏడాది మార్చి నుంచి చెన్నై ఆస్పత్రిలో కేన్సర్ చికిత్స పొందుతున్న కిశోర్ దాస్‌కు కరోనా సోకినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. కేన్సర్‌తో పోరాడుతున్న అతనికి కరోనా సోకడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కిశోర్ దాస్ అంత్యక్రియలను చెన్నైలోనే నిర్వహించనున్నారు. కొవిడ్-19 ప్రొటోకాల్ కారణంగా అతని మృతదేహాన్ని అస్సాంలోని కామ్రూప్లో ఉన్న స్వస్థలానికి పంపించట్లేదు. అస్సామీ వినోద పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో కిశోర్ దాస్ ఒకరు. బంధున్, బిధాత, నేదేఖ ఫాగున్ వంటి తదితర అనేక పాపులర్ టీవీ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. సీరియల్స్‌లోనే కాకుండా 300కుపైగా మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించి సంగీత ప్రియులకు అభిమాన నటుడిగా మారాడు. 'తురుట్ తురుట్' సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. కిశోర్ చివరిసారిగా జూన్ 24న విడుదలైన 'దాదా తుమీ డస్తో బోర్' చిత్రంలో నటించాడు. కిశోర్ దాస్ 2019లో క్యాండిడ్ యంగ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందాడు. చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! కిశోర్ మృతితో అస్సామీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కిశోర్ అకాల మరణంపై అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి కేశబ్ మహంత ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా 'తీరని లోటు' అంటూ నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు Deeply saddened by the news of young Assamese actor, model and dancer Kishore Das' demise. He lost the battle to Cancer after giving a tough fight. My condolences to the bereaved family. May his soul rest in eternal peace. Om Shanti! pic.twitter.com/CIG1x3FJ6f — Keshab Mahanta (@keshab_mahanta) July 2, 2022 Deeply Saddened to hear about the death of Kishor Das, a very popular actor from Assam. The untimely demise of the actor of such talent is a huge loss to the cultural arena. I extend my deepest condolences to his bereaved family and fans. May his soul rest in Peace. Om shanti! pic.twitter.com/BvoMqejfQ3 — Ajanta Neog (@AjantaNeog) July 2, 2022 -
కేరళ మంత్రి మీద ‘అశ్లీల వీడియో’కు ప్రయత్నం.. అరెస్ట్
కొచ్చి: కేరళలో సంచలనాలకు నెలవైన క్రైమ్ నందకుమార్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సహ ఉద్యోగిణిని లైంగికంగా వేధించడంతో పాటు కులం పేరుతో దుర్భాషలాడిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అంతేకాదు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేరిట నకిలీ అశ్లీల వీడియోను తయారు చేయాలనుకున్న అతని ప్రయత్నం గుట్టు వీడిందిలా.. కేరళలో క్రైమ్ మాగ్జైన్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా టీపీ నందకుమార్ ఎంత పాపులర్ అయ్యాడో.. వివాదాలతోనూ అంతే వార్తల్లోకి ఎక్కాడు. క్రైమ్ వార్తల మీద సంచలనాత్మక కథనాలతో పాటు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరిట ఇబ్బందికరమైన కంటెంట్‌ను ఇస్తుంటాడు. తాజాగా సహ ఉద్యోగిణిని వేధించిన కేసులో కొచ్చి పోలీసులు.. కాలూర్‌లో అతన్ని అరెస్ట్ చేశారు. క్రైమ్ మ్యాగ్జైన్ చీఫ్ ఎడిటర్ అయిన టీపీ నందకుమార్.. తన దగ్గర పనిచేసిన ఓ ఉద్యోగిణి లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు డబ్బు ఆశ చూపి తనను నీలిచిత్రంలో నటించాలని ఒత్తిడి చేశాడని భాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి Veena Georgeలా ఉన్నావని, నీలిచిత్రంలో నటించమని, ఆ వీడియో ద్వారా మంత్రిని బద్నాం చేయొచ్చని నందకుమార్ ప్లాన్ వేసినట్లు ఆమె తెలిపింది. ఒకవేళ నీలిచిత్రంలో గనుక నటించకపోతే.. తనపై మార్ఫింగ్ కంటెంట్ చేసి ఇంటర్నెట్లో వదులుతానని బెదిరించాడని, అయినా ఒప్పుకోకపోవడంతో కులం పేరుతో దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గర మంత్రి నగ్న వీడియోలు ఉన్నాయంటూ నందకుమార్ గతంలోనే ఓ కథనం ప్రచురించాడు. ఈ నేపథ్యంలోనే తనపై అశ్లీల వీడియోలో నటించాలని బెదిరించాడని ఆమె మీడియాకు వివరించింది. ఇక బాధితురాలితో పాటు ప్రస్తుతం క్రైమ్ మ్యాగ్జైన్లో పని చేస్తున్న మరికొందరు ఉద్యోగులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేయడం గమనార్హం. దీంతో నందకుమార్‌పై ఐపీసీలోని సెక్షన్లతో పాటు ఎస్సీఎస్టీ యాక్ట్, ఐటీ యాక్ట్‌ల కింద కేసులు పెట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. నందకుమార్, మంత్రి వీణా జార్జ్‌ను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమె మీద ఫేస్బుక్, యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడంతో కొక్కనాడ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తాజా పరిణామంతో తీరుమార్చుకోని నందకుమార్‌ను కఠినంగా శిక్షించాలని, అలాగే క్రైమ్ మ్యాగ్జైన్ను మూసేయాలంటూ పలువురు నెటిజన్స్ కోరుతుండడం గమనార్హం. -
నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యం: మంత్రి విడదల రజిని
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అత్యంత సులువుగా, పూర్తిగా ఉచితంగా అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో గురువారం మంత్రి విడదల రజిని ఎన్హెచ్ఎం విభాగం ఉన్నతాధికారులు, కమిషనర్ నివాస్‌తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్.. వైద్య ఆరోగ్యశాఖ విషయంలో ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. చదవండి: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి ప్రజలందరికీ ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు జగనన్న ఏ మాత్రం వెనుకాడటంలేదని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మెడికల్ కళాశాలల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం, ఆధునికీకరణ, వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ఏకంగా 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. 40 వేలకుపైగా నియామకాలు చేపట్టామని వెల్లడించారు. పూర్తి ఉచితంగా అన్ని రోగాలకు వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ సేవలు ప్రజలకు మరింత మెరుగ్గా, నాణ్యంగా, ఉచితంగా అందాలంటే అధికారుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని చెప్పారు. నిర్లక్ష్యం వీడితే చాలు తాను ఈ మూడేళ్లలో పలు ఆస్పత్రులు సందర్శించానని అన్ని చోట్లా మంచినీటి కొరత, అపరిశుభ్రత, నిర్వహణలో లోపాలు, టాయిలెట్లు సరిగా లేకపోవడం.. లాంటివి గమనిస్తూనే ఉన్నానని తెలిపారు. ఇవన్న చాలా చిన్న చిన్న సమస్యలని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇవి పెద్దవిగా కనిపిస్తున్నాయని చెప్పారు. సరైన సమయంలో స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోతుందని, అధికారులు చిత్తశుద్ధితో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వారందరి సంక్షేమం గురించి కూడా మనం ఆలోచించాలని చెప్పారు. వారందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అందున్నాయో లేదో చూడాలన్నారు. ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లాలని, ఏ ఒక్కరికి, ఎక్కడ సమస్య ఎదురైనట్లు గుర్తించినా.. సదరు ఏజెన్సీలపై చర్యలకు వెనుకాడొద్దని చెప్పారు. ఏఎన్ఎంలు, ఇతర ఫీల్డ్ సిబ్బంది బయోమెట్రిక్ విధానం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా పదే పదే తన దృష్టికి తీసుకొస్తున్నారని, వారి అభ్యర్థనలోనూ న్యాయం ఉందని, ప్రత్యామ్యాయ పద్ధతులను ఆలోచించాలని ఆదేశించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఎన్హెచ్ఎం లక్ష్యాలు ఏమున్నాయి.. వాటిని ఎంతవరకు రీచ్ అయ్యాం.. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక సంవత్సరంలో మనం ఎలా లక్ష్యాలను చేరుకోవాలి అనే విషయాలపై అందరికీ అవగాహన ఉండాలని చెప్పారు. ఆ మేరకు పనిచేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్‌హచ్‌ఎం నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలేదని, మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఆ నిధులు మురిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయని, ఏ ఆస్పత్రిలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్హెచ్ఎం నిధులను అంతా సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఏ ప్రభుత్వాలకూ సాధ్యం కానంతగా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంటే.. ఇప్పటికీ కొన్ని పీహెచ్‌సీల్లో మందులు బయటకు రాస్తున్నారని ఈ పరిస్థితి మారాలని చెప్పారు. ఎక్కడా, ఎప్పుడూ టెస్టులుగాని, మందులుగాని బయటకు రాయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆస్పత్రులకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, అయినా సరే కొన్ని ఆస్పత్రుల్లో మెటీరియల్ కొరత కనిపిస్తోందని చెప్పారు. ఎలుకలు, దోమలు ఆస్పత్రుల్లో ఎందుకు ఉంటున్నాయని, ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి ఈ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చూడండి రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చొరవ చూపాలని మంత్రి తెలిపారు. ప్రతి పీహెచ్సీలో నెలకు కనీసం 10 కాన్పులైనా జరిగేలా కచ్చితంగా ప్రయత్నించాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో కాన్పులు జరగకపోవడం వల్ల టీచింగ్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నోటిఫికేషన్ విడుదల చేయాలని వివరించారు. ఏపీ ఎం ఎస్ ఐడీసీ ద్వారా కొనుగోలు చేస్తున్న పరికరాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నాణ్యతను పరిశీలించే టెక్నికల్ టీమ్‌లో సంబంధిత వైద్యులు కూడా ఉండేలా చూడాలని సూచించారు. కావాల్సినన్ని ఆస్పత్రులు నిర్మిస్తున్నాం, కావాల్సినంత సిబ్బందిని నియమిస్తున్నాం, కోట్లాది రూపాయలతో పరికరాలు కొనుగోలు చేస్తున్నాం.. అయినా సరే కొన్నిచోట్ల టెస్టులు బయటకు రాస్తున్నారు.. ఈ పరిస్థితి మారాలని మంత్రి తెలిపారు. ల్యాబ్‌లలో ఉన్న వైద్య పరికరాల మెయింటినెన్స్‌కు సంబంధించి కాలిబ్రేషన్ సక్రమంగా జరుగుతోందా..? లేదా అని ప్రశ్నించారు. క్వాలిటీ ఎజ్యూరెన్స్ స్కీమ్ కింద కాలిబ్రేషన్ చేయాలని ఇది సక్రమంగానే చేస్తున్నారా అని అడిగారు. వైద్య విభాగంలో ప్రతి ఒక్కటి పారదర్శకంగా జరగాల్సిందేనని స్పష్టంచేశారు. పరికరాల నిర్వహణకు కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తోందని, సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు, వైద్య శాఖలో ప్రొఫెనల్ ఐడీలు, ? ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, ప్రభుత్వ ఆస్పత్రుల మ్యాపింగ్ లాంటి వన్నీ గడువులోగా పూర్తికావాలని చెప్పారు. ప్రభుత్వ ఆశయాలకు, జగనన్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు. -
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి ఈడీ ఝలక్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఝలక్ ఇచ్చింది. సోమవారం ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. సమాచారం ప్రకారం.. కలకత్తా సంబంధించిన సంస్థల ద్వారా హవాలా లావాదేవీలు నిర్వహించారని ఆయనపై ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖతో పాటు పిడబ్ల్యూడీ, విద్యుత్ శాఖలను మంత్రి సత్యేందర్ జైన్ పర్యవేక్షిస్తున్నారు. -
అవినీతి ఆరోపణలు.. పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. మంత్రి అరెస్ట్
చండీగఢ్: పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింఘ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ల కోసం సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. అంతేగాక తాను చేసిన తప్పులను సింఘ్లా ఒప్పుకున్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై తమవద్ద సమాచారం ఉందని, వాటిపై విచారణ చేయిస్తామని సీఎం చెప్పారు. ఇక ఆరోగ్యశాఖమంత్రిపై కేసు నమోదు చేయాలని పంజాబ్ పోలీసులను ఆదేశించారు. మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన సీఎం కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పదవి నుంచి తొలగించిన వెంటనే ఏసీబీ అధికారులు మంత్రిని అరెస్ట్ చేశారు. చదవండి: టార్గెట్ @ 2024.. సోనియా మరో సంచలన నిర్ణయం अरविंद केजरीवाल के "भ्रष्टाचार विरोधी मॉडल" के तहत AAP सरकार की बड़ी कार्रवाई 🔹CM @BhagwantMann ने स्वास्थ्य मंत्री विजय सिंगला को किया बर्ख़ास्त 🔹अधिकारियों से ठेके पर 1 पर्सेंट कमीशन की मांग का लगा था आरोप 🔹AAP सरकार भ्रष्टाचार मुक्त भारत बनाने के लिए वचनबद्ध है pic.twitter.com/5HkaTU2Cxm — AAP (@AamAadmiParty) May 24, 2022 -
Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్ ఇది
హైదరాబాద్: ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన ఓ వైద్యుడిపై నేరుగా వెళ్లి మరీ చర్యలు తీసుకున్నారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ లంచం డిమాండ్ చేస్తున్నారని కొందరు బాధితులు మంత్రి హరీష్‌రావుకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీలకు వెళ్లిన ఆయన.. వివరాలు తెలుసుకుని సదరు డాక్టర్‌పై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని సిబ్బంది హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రి అంతా పరిశీలించి.. పేషెంట్లతో మాట్లాడారు. మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce — Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022 -
సీఎం జగన్ లాంటి నాయకుడు ఈ దేశంలోనే లేడు: విడదల రజిని
-
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
-
వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు
సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. బీసీలకు సీఎం జగన్.. ఎవ్వరు ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారని, బీసీలు ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని విడదల రజిని అన్నారు. చదవండి: ఉంగరం దొంగలు మీరేనా? రాజకీయ నేపథ్యం: హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. చిలకలూరిపేటకు చెందిన కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. యూఎస్ఏలోని కాలిఫోర్నియాలో ప్రాసెస్ వీవర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
ఆరోగ్యయజ్ఞంలో దివ్యౌషధమవుతా: మంత్రి విడదల రజిని
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శప్రదేశ్‌గా మార్చారు. ఆయన నాకు ఓ గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన చేపట్టిన ఆరోగ్యయజ్ఞంలో భాగస్వామిని చేశారు. ఆ మహాయజ్ఞంలో దివ్య ఔషధమవుతా. నిరంతరం జన శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తా. ఇక నా జన్మ ధన్యమైనట్టేనని భావిస్తున్నా. సీఎం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విడదల రజిని ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. చదవండి: హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత జీవితాంతం రుణపడి ఉంటా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. రాజకీయాల్లో బీసీలు, ముఖ్యంగా మహిళలకు జగనన్న ఎంతో గొప్ప అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పడానికి నేనే పెద్ద ఉదాహరణ. నేను ఒక సాధారణ బీసీ మహిళను. చిలకలూరిపేటలాంటి నియోజకవర్గంలో నాలాంటి వారు పోటీ చేయడాన్ని ఎవరూ ఊహించరు. అలాంటిది జగనన్న నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చి బరిలో నిలిపి గెలిచేలా చేశారు. నా గెలుపు ఒక చరిత్ర. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గం ఆవిర్భవించాక ఇప్పటివరకు బీసీ సామాజికవర్గానికి చెందినవారు ఒక్కరు కూడా గెలవలేదు. చిన్న వయసులోనే ఉత్తమ అవకాశాలు ప్రజలకు సేవ చేద్దామనే ఆకాంక్షతో చిన్నవయసులోనే రాజకీయాల్లోకి వచ్చాను. నా భర్త కుమారస్వామి, ఇతర కుటుంబసభ్యులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. జగనన్న ఎంతో నమ్మకం ఉంచి టికెట్టు ఇచ్చారు. కేవలం ఆయన చరిష్మాతోనే గెలిచాను. నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. జగనన్న వల్లే నేను ఈ రోజు ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొందగలిగాను. ఆ తర్వాత మూడేళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించగలిగాను. ఇవన్నీ కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయ వల్లే సాధ్యమయ్యాయి. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నేను కచ్చితంగా నిలబెట్టుకుంటాను. వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు ఎంత కీలకమైనదో నాకు తెలుసు. జగనన్న నాపై ఎంత పెద్ద బాధ్యత ఉంచారో నాకు తెలుసు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా, జగనన్న ఆశయాలు సాధించేలా కృషి చేస్తాను. జింఖానా కో–ఆర్డినేటర్లు, సభ్యులతో మాట్లాడతా ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైద్యులకు గుంటూరు మెడికల్ కళాశాల నిలయం. ఉమ్మడి రాష్ట్రంలోనే గుంటూరు మెడికల్ కళాశాలకు ఎంతో పేరు ఉంది. ఇక్కడ చదువుకున్న వారిలో సుమారు 2వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తర అమెరికాలో స్థిరపడి బాగా పేరు, ప్రతిష్టలు సంపాదించారు. ఇప్పుడు వీరంతా గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. వారి సంపాదనలో కొంత ఆస్పత్రి అభివృద్ధికి వెచ్చించడం హర్షించాల్సిన విషయం. వీరంతా జింఖానా పేరుతో అసోసియేషన్ స్థాపించి, రాష్ట్రం గర్వించేలా పనిచేస్తున్నారు. నేను అతి త్వరలోనే వీరితో సమావేశమై గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆగిపోయిన మాతా శిశుసంరక్షణ కేంద్రం పనులు పూర్తయ్యేలా చూస్తాను. ఇది పూర్తయితే హైదరాబాద్‌లో ఒక నీలోఫర్ ఆస్పత్రి, తిరుపతిలో ఒక రుయా ఆస్పత్రి కంటే మెరుగైన సేవలు గుంటూరులోనే అందేటట్లు చేయొచ్చు. ఈ ఆస్పత్రిలో గుండె మార్పిడి, కిడ్నీ మారి్పడి ఆపరేషన్లు తిరిగి ప్రారంభమయ్యేలా కృషి చేస్తా. పల్నాడులో అత్యాధునిక ఆస్పత్రులు పల్నాడు గ్రామాల్లో ప్రజలకు అత్యవసర వైద్యం అవసరమైతే గతంలో గుంటూరు రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. పిడుగురాళ్ల సమీపంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నరసరావుపేట జిల్లా వైద్యశాలను అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ రోజు నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి రోగానికీ వైద్యం అందుతోంది. చిలకలూరిపేటలో కూడా వంద పడకల ఆస్పత్రి నిర్మాణం త్వరలోనే పూర్తి కాబోతోంది. బాపట్లలోనూ మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాధాన్య అంశాలే. అందుకే అంటున్నాను.. జగనన్న నాపై పెద్ద బాధ్యతనే ఉంచారు. మా నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టేలా నేను పనిచేస్తాను. ప్రజారోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్తా. సేవల్లో దేశానికే ‘ఆదర్శ’ప్రదేశ్ మా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో సమూల మార్పులు తీసుకొస్తోంది. ఎన్నో సంస్కరణలు చేపడుతోంది. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం సత్వరమే అందేలా ఎంత చేయాలో అంత చేస్తోంది. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి జగనన్న వైద్య ఆరోగ్యశాఖ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిరంతరం తపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే ప్రజలకు మేలైన వైద్యం అందుతోంది. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటా. వైద్య, ఆరోగ్య శాఖలో మునుపెన్నడూ లేనంతగా 39వేల పోస్టులు భర్తీ చేయబోతున్నాం. 16 మెడికల్ కళాశాలలు కడుతున్నాం. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు ఆధునికీకరిస్తున్నాం. ప్రతి గ్రామానికీ హెల్త్ క్లినిక్‌లు తీసుకొస్తున్నాం. కోవిడ్ సమయంలో మన ప్రభుత్వం ప్రజలకు అందించిన ఉచిత వైద్య సేవలు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. -
హృదయ విదారకం..కూతురి శవాన్ని భుజాన వేసుకుని కాలినడకతో...
ఛత్తీస్‌గఢ్: మనం ఇంతవరకు ఎన్నో హృదయ విదారక ఘటనలు చూశాం. ఒక్కోసారి కొన్ని ఘటనలు మనసున మెలి పెడుతున్నంత బాధను మిగిలిస్తే, మరికొన్ని మనం వారిని ఆదుకునే స్థితిలో ఉన్నా అవకాశం దొరకదు. అచ్చం అలాంటి ఘటనే చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఛత్తీస్‌గఢ్‌లోని లఖన్‌పూర్‌లో ఆమదాల గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ అనారోగ్యంతో ఉన్న తన కుమార్తె సురేఖను తెల్లవారుజామున లఖన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అయితే ఆ అమ్మాయికి ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో వైద్యులు ఆమెకు తక్షణ చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. అయితే ఆమె గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోందని ఆమె తల్లిదండ్రులు తెలిపారని డాక్టర్ వినోద్ బార్గవ్ అన్నారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపే ఆమె తండ్రి మృతదేహాన్ని భుజాన వేసుకుని కాలినడకన సుమారు 10 కి.మీ దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లిపోయాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్ తెగ వైరల్ అవ్వడంతో ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ విచారణకు ఆదేశించారు. అంతేకాదు ఈ విషయంపై విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌ను కోరారు కూడా. డ్యూటీలో ఉన్న ఆరోగ్య సిబ్బంది వాహనం కోసం వేచి ఉండేలా కుటుంబాన్ని ఒప్పించి ఉండాలి అలాంటివి జరగకుండా చూసుకోవాలి అని మంత్రి అన్నారు. Surguja: Chhattisgarh Health Min TS Singh Deo orders probe after video of a man carrying body of his daughter on his shoulders went viral Concerned health official from Lakhanpur should have made the father understand to wait for hearse instead of letting him go, Deo said(25.3) pic.twitter.com/aN5li1PsCm — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 26, 2022 (చదవండి: అతను అలా ఉండటం వల్లే...మంత్రి పదవి దక్కింది) -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వివరించిన మంత్రి
Lata Mangeshkar Health Is Improving Says Maharashtra Health Minister: ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 92 ఏళ్ల లతా స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ముబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆమె హెల్త్ గురించి అప్డేట్ ఇచ్చారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. లతా మంగేష్కర్ ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం జల్నాలో విలేకర్లతో సమావేశమై ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. 'లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆమె కుటుంబ సభ్యులతో చర్చించాను. అలాగే ఆసుపత్రి అధికార ప్రతినిధి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్ యాజామాన్యాన్ని కోరాను.' అని మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. ఇదీ చదవండి: లతాజీ గొంతు బావుండదు.. -
'థర్డ్‌వేవ్ ప్రారంభమైంది.. పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని నిర్ణయించాం'
జల్నా (ముంబై): కరోనా మహమ్మారి మూడవ వేవ్ ప్రారంభమైందని, ఇది జనవరి చివరి నాటి కి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సోమ వారం అన్నారు. జల్నాలో సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడు తూ, ప్రజలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘జాన్ హై తో జహాన్హై’ అన్న సామెతను అందరూ దృష్టి లో పెట్టుకోవాలని ఆయన సూచించారు. చదవండి: (ఇదే కొనసాగితే లాక్డౌన్ అమలు చేయక తప్పదు!) పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని నిర్ణయించామని, ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు మద్దతునివ్వాలని ఆయన కోరారు. మహమ్మారి తీవ్రత గు రించి సోమవారం వర్చువల్ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా చర్చించినట్టు తోపే చెప్పారు. కరోనా సంసిద్ధతలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లకు మరమ్మతులు చేస్తున్నామని, 60 ఏళ్లు దాటిన వారికి, వైద్య, ఆరోగ్య సిబ్బందికి బూస్టర్ డోస్‌లను వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు. 15–18 సంవత్సరాల మధ్య పిల్లలకు త్వరలోనే టీకాలు వేయడం పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 వేల ఆక్సిజన్ పడకల్లో నాలుగు శాతం మాత్రమే ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయని చెప్పారు. 14 రోజుల క్వారంటైన్ వ్యవధిని కూడా ఏడు రోజులకు కుదించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఒమిక్రాన్ కేసుల జోరు.. భారత్‌లో మూడో వేవ్, ఢిల్లీలో ఐదో వేవ్: ఆరోగ్య మంత్రి
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌గా మార్పు చెంది మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ మూడవేవ్ ప్రారంభం కాగా.. ఢిల్లీలో ఐదో వేవ్ మొదలైందని ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. బుధవారం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10వేలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి చేరిందన్నారు. మరోవైపు ఢిల్లీలో.. గడిచిన 24 గంటల్లో 5వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటికే 2శాతం బెడ్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రైవేటు హాస్పిటల్స్‌లో 40శాతం పడకలు కరోనా రోగుల కోసం రిజర్వ్ చేయాలని ఆదేశాలు జారీచేసినట్టు మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. మంగళవారం కోవిడ్ -19 నిర్ధారణ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి గురించి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది, అయితే పూర్తి కోలుకునేంత వరకు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని తెలిపారు. కేసుల పెరుగుదల ప్రారంభమైతే, అదే స్థాయిలో ఆక్సిజన్ డిమాండ్ అవసరముంటుందని వాటిని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని జైన్ చెప్పారు. గతంలో 50,000-55,000 పరీక్షలు జరిగేవని, అయితే ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 70,000-90,000 పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభమైన ప్రయాణికుల కష్టాలు కరోనా ఆంక్షల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. 100శాతం సామర్థ్యంతో సేవలందించేందుకు మెట్రో, బస్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. పలు మెట్రో స్టేషన్ల వద్ద భారీగా జనం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మెట్రోల్లో కేవలం కూర్చుని ప్రయాణించేందుకే అనుమతి ఉంది. దీంతో సీట్ల సంఖ్యను మించి ఒక్కరిని కూడా రైల్లోకి భద్రతా సిబ్బంది అనమతి ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు తమ వంతు కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి -
థర్డ్‌వేవ్ వచ్చేసినట్లే.. హెల్త్ మినిస్టర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): ప్రజలు ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అదే జరుగుతోంది. ఆరోగ్యమంత్రి మాటలే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటును గమనిస్తే థర్డ్ వేవ్ వచ్చినట్లు ఖరారైందని ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ అన్నారు. గత ఆరు నెలల నుంచి పాజిటివ్ రేటు 0.1 శాతం కూడా లేదని, ప్రస్తుతం 1.06 శాతానికి పెరిగిందని, అంటే మూడో దశ ఆరంభమైనట్లు అర్థమని తెలిపారు. మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమిక్రాన్ రోజు రోజుకు పెరుగుతోంది, సోమవారం ఒకే రోజు 1.06 శాతానికి చేరింది, బెంగళూరులో అధికంగా సోకితులు ఉన్నారని చెప్పారు. బెంగళూరులో మైక్రో కంటైన్మెంట్లు? బెంగళూరులో కేసులు వచ్చినచోట మైక్రో కంటోన్మెంట్ జోన్ చేయడంపై సీఎంతో చర్చించనున్నట్లు తెలిపారు. బెంగళూరు ఇప్పటికే రెడ్ జోన్లో ఉండగా, కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల బతుకులను యథాస్థితికి తెచ్చేలా కరోనాను నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారిందని వాపోయారు. బెంగళూరుకు అధికంగా విదేశీయులు వస్తున్నారు. అందుచేత వైరస్ అతి వేగంగా విస్తరిస్తోందన్నారు. జనవరి 15 తరువాత మూడో అల రావచ్చని అనుకుంటే అంతకంటే ముందుగానే వచ్చేసిందని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌నేతలు మేకెదాటు పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. -
భారీగా నమోదవుతున్న కేసులు.. ఢిల్లీలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి
Omicron Community Spread In Delhi సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి జరుగుతోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేనివారు కొత్త వేరియంట్ బారినపడుతున్నారని ఆయన తెలిపారు. తాజా జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ప్రకారం పాజిటివ్ శాంపిల్స్‌లో 46శాతం ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు మంత్రి వెల్లడించారు. అయితే కేసులు గణనీయంగా పెరుగుతున్నా వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని సత్యేంద్ర జైన్ తెలిపారు. ఇదిలాఉండగా... 320 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ దేశంలో రెండో స్థానంలో ఉంది. 450 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఆంక్షలపై ఆగ్రహం మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అమలుచేస్తున్న ఆంక్షలపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహ్రాలీ-బదర్‌పుర్ రోడ్డు రోడ్డును దిగ్బంధించడమే కాకుండా.. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కి చెందిన బస్సులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టారు. ఎల్లో అలర్ట్ అమల్లో ఉన్నందున 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ బస్సులు సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్ల వద్దే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు ఆగ్రహానికి లోనయ్యారు. బస్సులపై దాడులు చేశారు. (చదవండి: ‘మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63) -
ఓమిక్రాన్ పై రాష్ట్రాలు అలెర్ట్ గా ఉండాలి
-
లాక్‌డౌన్‌పై ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు
Maharashtra's Omicron tally breached the 100 mark on Friday ముంబై: రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య శుక్రవారం సెంచరీ దాటింది. దేశంలోనే తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశం ఉందని సర్వత్రా చర్చకొనసాగుతోంది. ఐతే మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే శనివారం లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 800 మెట్రిక్ టన్నులకు చేరుకుంటే తప్ప, అప్పటివరకూ లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని మీడియాకు వెల్లడించారు. మరోవైపు కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ నిర్దిష్ట మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. డిసెంబర్ 24-25 రోజుల్లో విధించిన రాత్రి కర్ఫ్యూ (రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు) విధించింది. అంతేకాకుండ బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. పబ్లిక్ ఫంక్షన్లకు సంబంధించి ఇండోర్ వెడ్డింగ్లలోనైతే 100 మంది, ఔట్‌డోర్ వెడ్డింగ్‌లలో 250 కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదు. ఇతర సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాలకు ఇవే సంఖ్యలు వర్తిస్తాయి. రెస్టారెంట్లు, జిమ్‌లు, స్పాలు, సినిమాహాళ్లు, థియేటర్లు 50% సామర్థ్యంతో పని చేస్తూనే ఉంటాయి. వీటితోపాటు పలు ఆంక్షలను పరిస్థితిని బట్టి మరింత కఠినతరం చేయడానికి, సడలించడానికి స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. కాగా శనివారం ఉదయం నాటికి మహారాష్ట్రలో 12,108 కరోనా క్రియాశీల కేసులు, 110 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. చదవండి: మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం.. -
రోడ్డు ప్రమాదానికి గురైన ఆరోగ్యశాఖ మంత్రి .. ఆసుపత్రికి తరలింపు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పౌరిలోని థాలిసైన్ పట్ట్టణం నుంచి డెహ్రాడూన్‌కు తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈఘటనలో మంత్రికి స్వల్పగాయలవ్వగా, ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: ఇండియాలో అత్యధిక రెంట్ వచ్చేది ఎక్కడో తెలుసా? కాగా మంత్రి తన సిబ్బందితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుది. ఘటనా స్థలంలో తీసిన పై ఫోటోలో.. ప్రమాదం జరిగిన తర్వాత ఒక కారు బోల్తా పడగా, మరొకటి దాని పక్కనే ఆగి ఉన్నట్లు కనిపిస్తోంది. చదవండి: షాకింగ్: బార్లో సీక్రెట్ రూమ్.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు.. -
కన్నపేగు పోరాటం.. ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని..
కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఈ సోమవారం నాడు చోటు చేసుకుంది. అధికార యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా విధుల్లో నిమగ్నమై ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమం యథావిధిగా నడుస్తోంది. మీడియా అటెన్షన్ కూడా ఈ విషయం మీదనే కేంద్రీకృతమై ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు అది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటం. కన్నపేగు చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైంది. పోలీసులు బిడ్డను వెతికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక అనుపమ చేతిలో పెట్టడమే తరువాయి. బిడ్డను చూపించండి! ఆదివారం నాటి రాత్రి పోలీసులు బిడ్డతో కేరళ రాజధాని తిరువనంతపురం చేరారు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశం మేరకు డీఎన్ఏ పరీక్ష కోసం సోమవారం నాడు బిడ్డ నుంచి నమూనా సేకరించారు. డీఎన్ఏ పరీక్ష తమ కళ్ల ముందే జరగాలని అనుపమ పట్టుపట్టింది. తన బిడ్డ నమూనాలను మార్చివేయరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించింది అనుపమ. ఒక్కసారి బిడ్డను కళ్లారా చూస్తానని ప్రాధేయపడింది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో అంతా సవ్యంగా జరుగుతుందనే నమ్మకం కలగడం లేదని ఆమె పడుతున్న ఆవేదన, ఆందోళన అందరికీ అర్థమవుతోంది. నమూనా సేకరణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు చెబుతూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. అనుపమ, ఆమె ప్రేమికుడు, బిడ్డ నమూనాలు స్థానిక రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చేరినట్లు ఆ రాష్ట్రంలోని కౌముది మీడియా తెలిపింది. నమూనాలు సరిపోలినట్లు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత న్యాయపరమైన నిబంధనలు పూర్తి చేసి బిడ్డకు అనుపమకు ఇస్తారు. అప్పటివరకు బిడ్డను జిల్లా చైల్డ్ ప్రొటెషన్ ఆఫీసర్ సంరక్షణలో ఉంచుతారు. ఆ బిడ్డ ఈ బిడ్డేనా! జరుగుతున్న పరిణామాలు అనుపమకు సంతోషాన్నిస్తున్నట్లే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా చెప్తోంది. అలాగే పోలీసులు తీసుకువచ్చిన బిడ్డ అనుపమకు పుట్టిన బిడ్డ అనడానికి తార్కికపరమైన ఆధారాలు అందుతున్నాయి. బిడ్డ మాయమైన తర్వాత ఒకటి– రెండు రోజుల తేడాలో ఆ రాష్ట్రంలో అమ్మ తొట్టిల్ (ఉయ్యాల) పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉయ్యాలలోకి ఇద్దరు బిడ్డలు వచ్చారు. వారిలో ఒక బిడ్డకు గత నెలలో పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. ఓ బిడ్డను దత్తత ఇచ్చినట్లు తెలిసింది. ఆ బిడ్డ కోసం గాలించి ఆదివారం నాడు విజయవంతంగా ఛేదించారు. కన్నపేగు పోరాటం వృథా కాదని, ఆ బిడ్డ అనుపమ బిడ్డే అయి ఉండాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది. అనుపమ ఒడికి చేరే క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఇదీ జరిగింది! అనుపమ గత ఏడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లయింది. ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి. అనుపమ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి స్వయానా కూతురినే మోసం చేశాడు. ఆమె కన్నబిడ్డను ఆమె నుంచి వేరు చేశాడు. ‘బిడ్డను రహస్య ప్రదేశంలో సంరక్షిస్తున్నట్లు’ కొద్ది నెలల పాటు ఆమెను మభ్యపెట్టాడు. తాను మోసపోయానని తెలిసిన తర్వాత ఆమె ఇంటి నుంచి పారిపోయి, ప్రేమికుడితో కలసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజాప్రతినిధి కూడా కావడంతో పోలీసులు మొదట్లో ఆమె కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి మీనమేషాలు లెక్కపెట్టారు. ఆమె పోలీసులు, శిశు సంక్షేమశాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలిసి తన బిడ్డను తనకు ఇప్పించమని వేడుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థించింది. అనుపమ తండ్రి చేసిన ఘోరం రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారి తీసింది. మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 18వ తేదీన వెలువడిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన పోలీసులు బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువెళ్లారు. బిడ్డ రాష్ట్రానికి చేరిన వార్త సోమవారంనాడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. -
సకాలంలో ఆసుపత్రులకు రావాలి : మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యు లు సకాలంలో హాజరు కావాలని, నిర్ణీత సమయం వరకు ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య మంత్రిగా నియమితులైన ఆయన.. బుధవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సకాలంలో వైద్యులు రాకపోవడం, వచ్చినా నిర్ణీత సమయం వరకు ఉండకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో కరోనా కేసులు ఏ స్థాయిలో నమోదవుతు న్నాయి? థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వస్తే అందుకు తీసుకునే చర్యల గురించి మంత్రి హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారని ఓ అధి కారి తెలిపారు. రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలోనే ఉందని, కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని అధికారులు వివరించారు. థర్డ్‌వేవ్ వచ్చి నా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలోని 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో జాతీయ వైద్య కమిషనర్‌కు దరఖాస్తు చేసినట్లు మంత్రికి వివరించారు. ఆరోగ్యశ్రీ, టీవీవీపీలపై ఆరా... కీలకమైన ఆరోగ్యశ్రీకి ఇన్నాళ్లుగా పూర్తిస్థాయి సీఈవో లేకపోవడంపై ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ ఇన్చార్జి సీఈవోగా కొనసాగడం వల్ల రోజువారీ ఆరోగ్యశ్రీ కార్యకలాపాలకు అవాంతరాలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై అడిగి తెలుసుకున్నారని సమాచారం. కాగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)కు కూడా పూర్తిస్థాయి కమిషనర్ లేరు. వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి దీనికి ఇన్చార్జిగా ఉన్నారు. దీనిపైనా మంత్రి దృష్టి సారించినట్లు సమాచారం. కాగా, వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులపైనా అడిగి తెలుసుకున్నారని సమాచారం. ‘సమస్యలు పరిష్కరించండి’ వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు హరీశ్‌రావును కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావును తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెంట్రల్ లీగల్ అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (డీహెచ్ విభాగం) అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, గాంధీ మెడికల్ కాలేజీ కార్యదర్శి డాక్టర్ అజ్మీరా రంగా, ఉస్మానియా యూనిట్ ప్రతినిధి డాక్టర్ శేఖర్, డాక్టర్ వినోద్, డాక్టర్ రవి తమ సమస్యలు విన్నవించారు. -
‘ఈతరం స్త్రీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు’
బెంగళూరు: మనది పురుషాధిక్య సమాజం. ఇక్కడ చాలా మంది మగవారు మహిళ అంటే కేవలం ఇంటికే.. అందునా వంటింటికే పరిమితం కావాలని భావిస్తారు. వారికంటూ సొంత ఆలోచనలు, ఆశలు, కోరికలు ఉండకూడదని భావిస్తారు. ఇక సందర్భం దొరికిన ప్రతి సారి మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. వీరిలో సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేదు. స్త్రీ అనగానే వారి నాలుకలు మడతపడతాయి.. మర్యాద వెనక్కి వెళ్తుంది. మహిళలను ఎంత తక్కువ చేసి మాట్లాడితే.. వారికి అంత సంతృప్తి కలుగుతుంది. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్. ఈతరం ఆధునిక భారతీయ మహిళ ఒంటరిగా జీవించాలని ఆశిస్తుంది.. పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు.. ఇది మంచి పరిణామం కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శల పాలవుతున్నారు. ఆ వివరాలు.. ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోలాజికల్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి డాక్టర్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి. ఏంటంటే మన దేశ ఆధునిక మహిళ ఒంటరిగా ఉండాలని ఆశిస్తుంది. వివాహబంధానికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కనడానికి ఆమె ఇష్టపడటం లేదు. పిల్లల కోసం సరోగసి విధానాన్ని ఎంచుకుంటున్నారు. మన ఆలోచనలో వచ్చిన ఈ మార్పు మంచిది కాదు’’ అంటూ ఇష్టారీతిగా మాట్లాడారు. (చదవండి: ‘మగాళ్లకు, మీకు తేడా ఏంటి.. పెళ్లి ఎలా అవుతుంది’) అంతేకాక ‘‘ప్రస్తుతం మనం విదేశీ సంస్కృతిని అవలంబించడానికి ఉత్సహం చూపుతున్నాం. దానిలో భాగంగా తల్లిదండ్రులను మనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇది చాలా దురదృష్టకరం’’ అన్నారు. ఆడవారి గురించి మంత్రి సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏ వేదిక మీద ఉన్నారు.. ఏ కార్యక్రమానికి హాజరయ్యారు.. ఏం మాట్లాడుతున్నారు. ముందు మీ మానసిక ఆరోగ్యం బాగుందా లేదా చెక్ చేసుకొండి అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్ #WATCH | ...Today we don't want our parents to live with us. A lot of modern women in India want to stay single. Even if they get married, don't want to give birth. Paradigm shift in our thinking,it's not good: Karnataka Health Min on World Mental Health Day,at NIMHANS, Bengaluru pic.twitter.com/LkX7Ab7Sks — ANI (@ANI) October 10, 2021 -
క్షయరోగుల్లో యువతే అత్యధికం!
న్యూఢిల్లీ: దేశంలో క్షయ రోగం బారిన పడుతున్నవారిలో అత్యధికులు 15–45ఏళ్లలోపువారేనని ఆరోగ్య మంత్రి మాండవీయ చెప్పారు. దేశంలో నమోదవుతున్న టీబీ కేసుల్లో 65 శాతం ఈ వయసు గ్రూపులోనివారేనని తెలిపారు. టీబీ కేసుల్లో 58 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదవుతున్నాయని, దీనివల్ల పలు కుటుంబాలు కుంగుబాటుకు గురవుతున్నాయని తెలిపారు. టీబీపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సంబంధించిన వివరాలను ఆయన పార్లమెంట్ సభ్యులకు వివరించారు. ప్రతి ఎంపీ ఈ విషయంపై తమ నియోజకవర్గ ప్రజలకు అవగాహన కలి్పంచాలని కోరారు. 15–45 సంవత్సరాల మధ్య వయసు్కలంటే ఉత్పాదకత అధికంగా ఉండే వయసని, సరిగ్గా ఈ వయసులో టీబీ బారిన పడడం అటు వారికి, ఇటు దేశానికి నష్టదాయకమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వేళ టీబీని అడ్డుకోవడం కష్టసాధ్యంగా మారుతోందని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ చెప్పారు. -
25 జిల్లాల్లో లాక్డౌన్ సడలింపులు
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే కరోనా రోగుల సంఖ్య సరాసరి కంటే తక్కువ ఉన్న 25 జిల్లాల్లో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు మంత్రి రాజేశ్ టోపే వెల్లడించారు. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ నియమాలు సడలించే విషయంపై గురువారం చర్చించినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా లెవల్–3 ఉన్న జిల్లాలో వ్యాపారులు తమ షాపులు ఆదివారం పూర్తిగా మూసివేయగా, శనివారం సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు టోపే వెల్లడించారు. ఇదివరకు శని, ఆదివారాలు షాపులు మూసి ఉండేవి. కరోనా ప్రభావిత 11 జిల్లాలను లెవల్–3లో ఉంచనున్నారు. ఇందులో పశ్చిమ మహారాష్ట్రలోని సాతారా, సాంగ్లీ, పుణే, షోలాపూర్, కోల్హాపూర్ ఇలా ఐదు జిల్లాలున్నాయి. అదేవిధంగా కొంకణ్ రీజియన్‌లోని నాలుగు జిల్లాలు, మరాఠ్వాడలోని బీడ్, ఉత్తర మహారాష్ట్రలో అహ్మద్‌నగర్ జిల్లాలున్నాయి. ఈ 11 జిల్లాలు మినహా మిగతా 25 జిల్లాలో నిబంధనలు త్వరలో ఎత్తివేస్తామన్నారు. ఇక సామాన్యులకు లోకల్ రైళ్లలో అనుమతించే విషయంపై మాట్లాడుతూ గురువారం జరిగిన చర్చల్లో వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతించాలని ఇప్పటికే సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రైల్వే అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని టోపే అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య విభాగం, కరోనా టాస్క్ ఫోర్స్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన నివేదిక ఆమోదం కోసం ముఖ్యమంత్రికి పంపించనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం లభించగానే అమలుకు రంగం సిద్ధం చేస్తామన్నారు. ఒకట్రెండు రోజుల్లో అమోదం లభిస్తుండవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. -
ప్రభుత్వ స్పందనపై ఆరోగ్యశాఖ మంత్రి అసంతృప్తి.. అసెంబ్లీ నుంచి వాకౌట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తనపై సొంత పార్టీ కాంగ్రెస్ ఎంఎల్ఏ చేసిన ఆరోపణలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదంటూ అసెంబ్లీ నుంచి ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్‌దేవ్ వాకౌట్ చేశారు. తనపై ఎంఎల్ఏ బృహస్పత్ సింగ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వ స్పందన పరిమితంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసి, సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడింది. సొంత ప్రభుత్వ సమాధానంపై ఒక మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం ఎక్కడా జరగలేదని ఎద్దేవా చేసింది. ఎంఎల్ఏ చేసిన ఆరోపణలపై అసెంబ్లీ కమిటీతో విచారణ జరపాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తూ సభను స్తంభింపజేశారు. దీంతో సభ వాయిదా పడింది. తన కాన్వాయ్‌పై దాడి జరిగిందని, దీని వెనుక సింగ్ దేవ్ హస్తం ఉందని ఆదివారం ఎమ్మెల్యే బృహస్పత్ ఆరోపించారు. తన ప్రాణాలకు మంత్రి సింగ్‌దేవ్ నుంచి ముప్పుందన్నారు. అయితే వీటిని సింగ్‌దేవ్ కొట్టిపారేశారు. తనేంటో ప్రజలకు తెలుసన్నారు. హోంమంత్రి ప్రకటన మంగళవారం ఈ అంశంపై హోంమంత్రి తామరధ్వజ్ సాహు చేసిన ప్రకటనపై బీజేపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తనకు ఈ అంశంపై ఎలాంటి ఫిర్యాదు అందనందున ఎంఎల్ఏను కానీ, మంత్రిని కానీ దీనిపై మాట్లాడమని ఆదేశించలేనని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ గందరగోళం నడుమ సింగ్‌దేవ్ హఠాత్తుగా లేచి ‘‘జరిగింది చాలు! నేనూ మనిషినే, నా ఇమేజ్ గురించి అందరికీ తెలుసు’’ అని అన్నారు. స్పీకర్ సూచన మేరకు సీఎం తనను పిలిపించి మాట్లాడారని, ఇంత జరిగినా తిరిగి సభలో ప్రభుత్వ స్పందన చాలా పరిమితంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇచ్చేవరకు నేను సభకు హాజరు అవలేను. అప్పటివరకు సభా కార్యకలాపాల్లో పాల్గొనే అర్హత నాకు లేదని భావిస్తున్నాను.’’ అని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. దీనిపై మీడియాతో మాట్లాడేందుకు ఆయన విముఖత చూపారు. సింగ్ చర్యతో సభలో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగడంతో పదినిమిషాలు సభను వాయిదా వేశారు. తిరిగి సభ ఆరంభమవగానే బీజేపీ సభ్యులు ఈ అంశంపై ఆందోళనను కొనసాగించారు. ఇది సభా మర్యాదకు చెందిన అంశమని, అందువల్ల ఆరోపణలపై హౌస్ ప్యానెల్ విచారణ జరపాలని మాజీ సీఎం రమణ్ సింగ్ పట్టుబట్టారు. ఇదే సమయంలో సింగ్‌దేవ్ తిరిగి అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. తన సహచరులు ఫోన్ చేసి పరిస్థితి వివరించడంతో తిరిగి వచ్చినట్లు ఆయన మీడియాకు చెప్పారు. అనంతరం సీఎం ఛాంబర్‌కు వెళ్లి పరిస్థితిపై చర్చించారు. -
నెలకు 3 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్లు అవసరం
ముంబై: మహారాష్ట్రకు నెలకు 3 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్లు అవసరమని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సోమవారం పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజుకు 15 లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం కలిగి ఉన్నామని ఆయన తెలిపారు. అయితే టీకాల కొరత కారణంగా రోజుకు రెండు నుంచి మూడు లక్షల మందికి మాత్రమే టీకాలు వేస్తున్నామన్నారు. మూడు రోజుల క్రితం ఏడు లక్షల కరోనా వ్యాక్సిన్లు వచ్చాయని, ఈ రోజు (సోమవారం)తో స్టాక్ అయిపోయిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 3,65,25,990 కోట్ల వ్యాక్సిన్లు వచ్చాయని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల వ్యాక్సిన్లను కొనుగోలు చేసిందని మంత్రి అన్నారు. వ్యాక్సిన్లను సక్రమంగా సరఫరా చేస్తే.. అర్హులకు టీకాలు వేసే లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేయవచ్చిని ఆయన అన్నారు. ఇక ఆదివారం మహారాష్ట్రలో కొత్తగా 8,535 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 61,57,799కు చేరుకోగా.. గడిచిన 24 గంటల్లో 156 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1,25,878కు చేరుకున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
బ్రిటన్ : ముద్దు పెట్టాడు ... మంత్రి పదవి పోయింది
-
పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్
కరోనా టైం.. అందులో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నవేళ. సోయి మరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు ఓ మంత్రి. ఆ మంత్రి రొమాంటిక్ యాంగిల్ఫొటోలు మీడియా ద్వారా జనాల్లోకి లీక్ అయ్యాయి. ఇంకేం ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. రాజకీయ విమర్శలు చుట్టు ముట్టాయి. చివరికి యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్ హాంకాక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లండన్: ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్ హాంకాక్ యవ్వారం.. వారం నుంచి యూకే రాజకీయాలను కుదేలు చేస్తోంది. వివాహితుడైన హాంకాక్.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలు కొనసాగించాడు. ఆమెను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్ రాసలీలలు’ పేరుతో ది సన్ టాబ్లాయిడ్ ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. ఇంకేం విమర్శలు మొదలయ్యాయి. ఈ బంధం ఏనాటిదో.. కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్ వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్.. 2000 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది. ఎట్టకేలకు రాజీనామా కరోనా టైంలో మాస్క్‌లు లేకుండా తిరగొద్దని హాంకాక్ విస్తృతంగా ప్రచారం చేశాడు. పైగా భావోద్వేగంగా ఉపన్యాసాలు దంచాడు. అలాంటి వ్యక్తే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ మేరకు శనివారం ప్రధాని బోరిస్ జాన్సన్‌కు, మాట్ హాంకాక్‌కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. నేనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించా.. అందుకే రాజీనామా చేస్తున్నా అని తెలిపాడు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్కాక్ రాజీనామాను ఆమోదించిన బోరిస్.. అప్పటిదాకా ఆయన అందించిన సేవలను కొనియాడాడు. చదవండి: పార్లమెంట్లో పొంగుతున్న బీర్లు -
వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే ఏమిటి?, భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
న్యూఢిల్లీ : వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ప్రక్రియను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్ వ్యతిరేకించారు. మరికొద్దిరోజుల్లో జీ7 సమ్మిట్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీ 7 సమ్మిట్ కు సంబంధించి ఆయా దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హర్షవర్దన్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను వ్యతిరేకిస్తున్నట్లు హర్ష వర్ధన్ ప్రకటించారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఇవ్వడం దేశాలపట్ల వివక్షత చూపినట్లే అవుతుందన్నారు. దీంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలకు కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాక్సినేషన్ తక్కువగా ఉండడం, సంబంధిత సమస్యలను పరిష్కరించడం, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల సరఫరా మరియు పంపిణీలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని హర్షవర్దన్ అన్నారు.ఇక వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అమలు అంటే దేశాల పట్ల వివక్షత చూపినట్లేనని, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతికూలంగా ఉంటుందనే విషయాన్ని భారత్ స్పష్టం చేస్తోందని చెప్పారు. వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అంటే కోవిడ్-19 నేపథ్యంలో ఆయా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పని సరిగా వ్యాక్సిన్ పాస్ పోర్ట్ కలిగి ఉండాలి. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారు సంబంధింత వివరాల్ని అధికారిక పాస్ పోర్ట్ వెబ్ సైట్లలో నమోదు చేసుకోవాలి. అలా ఎవరైతే పాస్ పోర్ట్ వెబ్ సైట్లో నమోదు చేసుకుంటారో వారికి ఆయా దేశాల పాస్ పోర్ట్ అధికారులు వ్యాక్సిన్ డీటెయిల్స్ తో సర్టిఫికెట్స్ ను అందిస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటేనే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. దీన్నే ఇప్పుడు భారత్ వ్యతిరేకిస్తుంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి ఇజ్రాయెల్ దేశం ఈ వ్యాక్సినేషన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరి దగ్గర ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఉంటే వాళ్లు మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఉండే వెసలు బాటు కల్పించింది. ఇజ్రాయెల్ బాటలో మరికొన్నిదేశాలు ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చాయి. చదవండి : లాక్డౌన్ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు -
Kerala: అన్నీ కొత్త ముఖాలే.. శైలజ టీచర్‌కు నో ఛాన్స్!
తిరువనంతపురం: కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రెండో దశ కోవిడ్ భారత్‌ను మరింతగా దెబ్బకొట్టింది. అయితే, కరోనా తొలి దశలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి అదుపుతప్పింది. అయితే కోవిడ్ పోరులో కేరళ మాత్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కేరళ సమర్ధంగా ఎదుర్కోవడంలో అప్పటి కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ (64) కృషి చేశారు. ఆమె పనితీరుపట్ల ఎందరో ప్రశంసలు కురిపించారు. ఈక్రమంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వం ఆరోగ్య మంత్రిగా కేకే శైలజకే పగ్గాలు అప్పగిస్తుందని అందరూ భావించారు. ప్రస్తుత కేబినెట్లో ఆమెకు మొండి చేయే ఎదురవనుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కేకే శైలజ కన్నూర్ జిల్లాలోని మత్తనూర్ నియోజకవర్గం నుంచి 60 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కోవిడ్ మొదటి దశలో వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవడంలో శైలజా టీచర్ "రాక్‌స్టార్" ఆరోగ్య మంత్రిగా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా నిఫా వైరస్ సంక్షోభ కాలంలో కూడా ఆమె పనితీరుకు ప్రశంసలు దక్కాయి. గత ఏడాది సెప్టెంబరులో, యూకేకు చెందిన ప్రాస్పెక్ట్ మ్యాగజైన్ ఆమెను "టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్ 2020" గా కూడా ఎంపిక చేసింది. మరోవైపు ప్రస్తుత మంత్రివర్గంలో పినరయి విజయన్ తప్ప మిగతా అందరూ కొత్త వారేనని సమాచారం. ఆయన అల్లుడు పీఏ మహ్మద్ రియాస్, పార్టీ కార్యదర్శి ఏ విజయరాఘవన్ భార్య ఆర్.బిందు కూడా కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కించుకోనున్నట్టు తెలిసింది. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకుడు ఎన్ఎం పియర్సన్ స్పందిస్తూ... "పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కూడా ఓ కారణం. ఒక వేళ జట్టు మొత్తాన్ని మార్చితే... అది కెప్టెన్‌కు కూడా వర్తింపజేయాలి’’ అంటూ చురకలంటించారు. (చదవండి: Kerala: 20న విజయన్ ప్రమాణస్వీకారం) -
మహారాష్ట్రలో 52 మందిని బలిగొన్న బ్లాక్ ఫంగస్
ముంబై: కరోనా వైరస్ బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ ముప్పు భయపెడుతోంది. అరుదుగా వచ్చే ఈ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) ప్రమాదకరమైనదేనని, బాధితులు చూపు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలో బ్లాక్ ఫంగర్ కారణంగా ఇప్పటిదాకా 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న లేదా కోలుకుంటున్నవారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, ముక్కు మూసుకుపోవడం, పాక్షికంగా చూపు కోల్పోవడం వంటివి ఈ ఫంగస్ లక్షణాలు. మహారాష్ట్రలో మ్యూకోర్మైకోసిస్ వల్ల మరణించిన 52 మంది కరోనా నుంచి కోలుకున్నవారే కావడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్య శాఖ తొలిసారిగా బ్లాక్ ఫంగస్ మృతుల జాబితాను బయటపెట్టింది. రాష్ట్రంలో 1,500 దాకా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు యాంఫోటెరిసిన్–బి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. మహారాష్ట్రలో ఈ ఫంగస్ వల్ల 8 మంది చూపు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. రికవరీలు 2 కోట్లకు పైనే.. 24 గంటల్లో 3,43,144 పాజిటివ్ కేసులు ఒక్కరోజులో మృతుల సంఖ్య 4వేలు దేశంలో రికవరీ రేటు 83.5% నమోదు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మార్పు కనిపిస్తున్నప్పటికీ, మరణాల్లో మాత్రం తగ్గుదల నమోదు కావట్లేదు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24 గంటల్లో 3,43,144 మందికి కరోనా వైరస్ సోకింది. ఇందులో 10 రాష్ట్రాల వాటా 72.37%గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2,40,46,809కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 42,582 కొత్త కేసులు రాగా, కేరళలో 39,955, కర్ణాటకలో 35,297 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో 24 గంటల్లో 4వేల మంది వైరస్‌తో మృత్యువాతపడగా మొత్తం మృతుల సంఖ్య 2,62,317కు చేరుకుంది. మరణాల రేటు 1.09%గా ఉంది. ఇందులో 10 రాష్టాలకు చెందినవారే 72.70% మంది ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 850 మంది, కర్ణాటకలో 344 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య శుక్రవారం 2,00,79,599కు పెరిగింది. దీంతో దేశంలో కరోనా రికవరీలు 83.50%గా ఉన్నాయి. దేశంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 37,04,893కు తగ్గింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 15.41%గా ఉంది. గత 24 గంటల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య నికరంగా 5,632 తగ్గింది. మరోవైపు దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటివరకు ప్రజలకు అందించిన డోస్‌ల సంఖ్య 18 కోట్లకు చేరువైంది. కేరళలో 23 వరకూ లాక్డౌన్ కేరళ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16వరకూ విధించిన లాక్‌డౌన్‌ను 23వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, కేరళలో విధించిన లాక్డౌన్ ప్రభావం ఇంకా కనిపించట్లేదు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య తగ్గట్లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం వెల్లడించారు. తిరువనంతపురం, ఎర్నాకులం, త్రిచూర్, మలప్పురంలో ట్రిపుల్ లాక్డౌన్ ప్రకటించారు. అలాగే, దేశంలోని మరో 17 రాష్ట్రాల్లో పూర్తి లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మిజోరం, గోవా, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. -
Break The Chain: లాక్‌డౌన్‌పై ఉత్కంఠ!
సాక్షి, ముంబై: బ్రేక్ ద చైన్‌లో భాగంగా గత నెల 14వ తేదీన అమలు చేసిన లాక్డౌన్ గడువు ఈ నెల 15వ తేదీ ఉదయం ఏడు గంటలతో ముగుస్తుంది. ఆ తరువాత లాక్డౌన్ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అలాగే కొనసాగిస్తుందా? లేక ఎత్తివేస్తుందా? ఏమైనా సడలింపులుంటాయా? ఇలా అనేక సందేహాలు ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కాగా ముంబైలో విధించిన లాక్డౌన్ ఆంక్షలు సత్ఫలితాలనిచ్చాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ముంబైకర్లలో కొంత ఆశలు చిగురించాయి. షాపులు, లోకల్ రైలు, ఇతర రవాణ వ్యవస్థలో సడలింపులిస్తే బాగుంటుందని ముంబైకర్లు ఆశతో ఉన్నారు. చివరకు శనివారం ఈ సందేహాలపై ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే స్పందించారు. ప్రస్తుతం ముంబైలో కరోనా వైరస్ చాలా శాతం వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ రాష్ట్రంలోని అనేక జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. అక్కడ బీతావహ వాతావరణం ఉండటంతో జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉందన్నారు. ఫలితంగా కొన్ని జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినం చేయాల్సి వచ్చిందని వివరించారు. దీన్ని బట్టి ముంబైతోపాటు రాష్ట్రంలో లాక్డౌన్ ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. తగ్గని పాజిటివ్ రేటు రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజుకు సుమారు 60–65 వేల వరకు నమోదైతున్నాయి. పాజిటివ్ రేటు ఇంతవరకు తగ్గుముఖం పట్టలేదు. కాగా రాష్ట్రంలోని 36 జిల్లాలో కేవలం 12 జిల్లాలో పాజిటివ్ రేటు మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కొన్ని జిల్లాల్లో స్థిరంగా ఉండగా మరికొన్ని జిల్లాల్లో పెరుగుతోంది. కానీ మృతుల సంఖ్య అనుకున్నంత మేర తగ్గడం లేదన్నారు. రాష్ట్రంలో శుక్రవారం 54,022 కరోనా కేçసులు నమోదయ్యాయి. 37,386 రోగులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రం లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,54,788 ఉండగా శుక్రవారం ఒక్కరోజే 898 మంది కరోనాకు బలయ్యారు. ఇందులో అత్యధిక మృతులు నాసిక్ జిల్లా కు చెందిన వారున్నారని రాజేశ్ టోపే అన్నారు. అయితే లాక్డౌన్ ఎత్తివేయాలా? లేక అలాగే కొనసాగించాలనే దానిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని రాజేశ్ టోపే స్పష్టం చేశారు. చదవండి: (180 జిల్లాల్లో కనిపించని వైరస్ జాడ) -
వైద్య సిబ్బందిపై ఈటల ఆసక్తికర ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల తాను ఆరోగ్య మంత్రిగా పని చేసిన కాలంలో తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ, శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అన్నారు ఈటల. అంతేకాక ‘‘గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ అంటూ ఈటల ట్వీట్ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ,శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ANM లు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నాను. — Eatala Rajender (@Eatala_Rajender) May 1, 2021 చదవండి: ఏ శాఖ లేకున్నా ప్రజలకు సేవ చేస్తాను: ఈటల -
Etela Rajender: వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ఈటల తొలగింపు
-
ఈటలకు భారీ షాక్.. వైద్యారోగ్య శాఖ నుంచి తొలగింపు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈటల తమ భూములు కబ్జా చేశాడని రైతులు ఫిర్యాదు చేయడంతో సీఎం కేసీఆర్ తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై హై స్పీడ్‌లో దర్యాప్తు కొనసాగుతుంది. ఈక్రమంలో ఈటలకు మరో భారీ షాక్ తగిలింది. ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈటల ఏ శాఖ లేని మంత్రిగా ఉండనున్నారు. ఈటల మంత్రి పదవులను తనకు బదిలీ చేయాలంటూ కేసీఆర్ చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు. ఈటల అసైన్డ్ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ హరీష్ తెలిపారు. ఈటలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి.. రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు శనివారం ఉదయం నుంచి విచారణ ప్రారంభించారు. వివాదాస్పద అసైన్డ్ భూములను పరిశీలించిన కలెక్టర్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పౌల్ట్రీ ఫామ్ కోసం రోడ్డు, హ్యాచరీ కోసం షెడ్లు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. చదవండి: ఈటలపై భూకబ్జా ఆరోపణలు: వివరాలు వెల్లడించిన కలెక్టర్ -
కరోనాపై ఏపీ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది
-
15 నెలలు..15 ఏళ్లుగా గడిచాయి...ఇక నావల్ల కాదు
బెర్లిన్: అధిక పనితో బాగా అలసి పోయా నంటూ ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రుడాల్ఫ్ అన్సోబెర్ (60) మంగళవారం పదవికి రాజీనామా చేశారు. పనిభారం ఎక్కువై ఆరోగ్యం దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే విశ్రాంతి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరించారని, అందువల్ల రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పదవీ కాలంలో ఉన్న 15 నెలలు.. 15 ఏళ్లుగా గడిచాయని పేర్కొన్నారు. కరోనా వచ్చిననాటి నుంచి ప్రభుత్వం తరఫున సూచనలు/సమాచారం అందించేందుకు రుడాల్ఫ్ తీవ్రంగా శ్రమించారు. కాగా జనవరి 2020 నుండి రుడాల్ఫ్ ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. రుడాల్స్ రాజీనామాపై ఆస్ట్రియా చాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ ట్విటర్ ద్వారా స్పందించించారు. ఆరోగ్య మంత్రి మొదటినుంచీ బాధ్యతతో వ్యవహరించిన ఆయన కరోనా మహమ్మారిపై పోరులో భాగాంగా గత 16 నెలలుగా దేశం కోసం ఎంతో త్యాగం చేశారని ప్రశంసించారు. -
85 రోజుల్లో 10,12,84,282 డోసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ చెప్పారు. దేశంలో కేవలం 85 రోజుల్లో 10 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో భారత్ చేరిందన్నారు. 10 కోట్ల డోసులు ఇవ్వడానికి యూకేలో 89 రోజులు, చైనాలో 102 రోజులు పట్టిందని గుర్తుచేశారు. ఇండియాలో ప్రస్తుతం రోజువారీగా సగటున 38,93,288 డోసులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల వరకూ దేశంలో 10,12,84,282 డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. -
మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరత
ముంబై: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యతోపాటుటీకాల కొరత పెరిగిపోతోందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ టోపే ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల డోసుల టీకాలు మాత్రమే ఉన్నాయని, అవి మూడు రోజులకు మాత్రమే సరిపోతాయన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులో లేక చాలా చోట్ల టీకా కేంద్రాలను మూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘గతంలో రోజుకి 4 లక్షల మందికి టీకా ఇచ్చేవాళ్లం. రోజుకి ఆరు లక్షల డోసులు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం రోజుకి 5 లక్షల మందికి టీకా ఇస్తున్నాం. కానీ టీకాల నిల్వ రోజుకీ తగ్గుతోంది’ అని వివరించారు. మహారాష్ట్రలో కరోనా విస్తృతి దారుణంగా ఉందని, మరణాల సంఖ్య కూడా 50 వేలు దాటిందని తెలిపారు. అందువల్ల, మహారాష్ట్రకు అధిక మొత్తంలో టీకాలను పంపించేందుకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కరోనా సోకుతున్న వారిలో 20–40 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నందున, వారికి కూడా టీకా అందించేలా ఏర్పాట్లు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు. టీకాల కొరత విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్ వెల్లడించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి 1.06 కోట్ల డోసుల వ్యాక్సిన్ రాగా, 88 లక్షల డోసులను పౌరులకు ఇచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైన మహారాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీకాల కొరత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. సరిపోను టీకాలు లేవంటూ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల కొరత వాదన అర్థం లేనిదన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, క్వారంటైన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అసలు దృష్టి పెట్టడం లేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు -
లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని, లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటికే లక్షయాభైవేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల పరిధిలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామాల్లోని పీహెచ్సీ( PHC) స్థాయి వరకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని గాంధీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. 11 వేల బెడ్స్ని ఆక్సిజన్ బెడ్స్‌గా మళ్లీ పునరుద్ధరించామని చెప్పారు. అత్యవసర సమయంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. ఆరోగ్య శాఖలో ఇప్పటికే అన్ని విభాగాల్లోని అధికారులు సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నారని అన్నారు. కరోనాతో సహజీవనం తప్పదని పేర్కొన్నారు. ప్రజలు కూడా వారి వంతుగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. చదవండి: ఢిల్లీ నైట్ కర్ఫ్యూ: ఎవరికి సడలింపు..? -
కరోనా ఉధృతి: ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూ వణుకు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో కరోనా ఉధృతి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. మరోవైపు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో వ్యాక్సిన్లు అయిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం 14 లక్షల వ్యాక్సిన్ మోతాదులు ఉన్నాయని, ఇవి రాబోయే మూడు రోజులకు సరిపోతాయని వెల్లడించారు. దీనిపై కేంద్రానికి సమాచారం అందించామని, వారానికి 40 లక్షల టీకాలు కావాలని కేంద్రాన్ని కోరామని మంత్రి తెలిపారు. (అంబానీ కుమారుడు సంచలన వ్యాఖ్యలు) కేంద్రం మాకు టీకాలు ఇవ్వడం లేదని చెప్పలేం గానీ, వ్యాక్సిన్ల పంపిణీ వేగం నెమ్మదిగా ఉందని వ్యాఖ్యానించారు. చాలా వ్యాక్సిన్ కేంద్రాలలో తగినంత వ్యాక్సిన్లు లేవు. వ్యాక్సిన్లు లేక ప్రజలను తిరిగి పంపించాల్సి వస్తోందన్నారు. 20-40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి తప్పనిసరిగా ప్రాధాన్యతపై టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని రాజేష్ తోపే తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని, ఏడు టన్నులకు పైగా ఆక్సిజన్ వినియోగిస్తున్నామని ఆరోగ్య మంత్రి చెప్పారు. దీంతోపాటు సమీప రాష్ట్రాల నుండి ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరామనీ, అవసరమైతే, ఆక్సిజన్‌ను ఉపయోగించే పరిశ్రమలను మూసివేస్తాం కాని వైద్య ఆక్సిజన్ సరఫరాను ప్రభావితం కానివ్వమని టోప్ ప్రకటించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు దాదాపు 82 లక్షల మందికి టీకాలు వేయగా, మహారాష్ట్రకు 1.06 కోట్ల మోతాదు లభించిందని, అందులో 88 లక్షల మోతాదులను వాడగా, వృధా మూడు శాతం వద్ద ఉందని మంగళవారం ఒక అధికారిక ప్రకటలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో మంగళవారం రోజు 55,469 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,13,354 కు, మరణాలు 56,330 కు చేరుకున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ముంబైలో కొత్తగా 10,040 కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. -
‘‘బీపీ, షుగర్ ఉన్నాయి.. ప్లీజ్ నన్ను గెలిపించండి’’
సాక్షి, చెన్నై: ఆరోగ్యశాఖను తన భుజస్కంధాలపై మోస్తున్న మంత్రే తనకు ఉన్న బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలను గుర్తు చేస్తూ ప్రచారంలో పడడం సర్వత్రా విస్మయంలోకి నెట్టింది. పుదుకోట్టై జిల్లా నుంచి విరాళిమలై నుంచి విజయభాస్కర్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య మంత్రిగా అత్యధిక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి విజయభాస్కర్. కరోనా కాలంలో ఆయన సేవలు ప్రశంస నీయం. తాజాగా అదే విరాళిమలై నుంచి మళ్లీ పోటీలో విజయభాస్కర్ ఉన్నారు. అయితే, సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఆయన తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు విస్మయానికి దారి తీసింది. తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయని, తనను ఆదరించాలన్నట్టు ఆయన ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు వేసే వాళ్లు పెరిగారు. దీంతో గురువారం విజయభాస్కర్ ఓ మీడియాతో మాట్లాడుతూ, వివరణ ఇచ్చుకున్నారు. తానేమీ సెంటిమెంట్‌తో ఓట్ల కోసం పాకులాడడం లేదన్నారు. వాస్తవిక జీవితంలో తనకు ఉన్న సమస్యలను గుర్తు చేయడంలో తప్పులేదన్నారు. ఈ నియోజకవర్గంలో తాను అడగాల్సిన అవసరం లేదని, తన ముఖం కనిపిస్తే చాలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు ఎక్కువేనని పేర్కొన్నారు. తాను ఏ మేరకు సేవల్ని అందించానో వివరిస్తూ ఓ చోట చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్టు పేర్కొన్నారు. వాస్తవిక జీవితంలో వి శ్రాంతి లేకుండా సేవల్ని అందించానని, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ చోట బీపీ, షుగర్ గురించి మాట్లాడనే గానీ, ఇందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఈ ప్రచారం పుణ్యమా అని ఆరోగ్యమంత్రి అనారోగ్య మంత్రయ్యాడంటూ వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడం గమనార్హం. చదవండి: ఓటుకు నోటు ఇవ్వలేను.. మీరే నాకివ్వండి -
లాక్డౌన్ ఆలోచనే లేదు
సాక్షి, కర్ణాటక : కరోనా కట్టడికి లాక్డౌన్, సెమిలాక్‌డౌన్ విధించే యోచన లేదని ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ లాక్డౌన్, సెమిలాక్‌డౌన్ అన్ని ఊహాగానాలే, ప్రజలు ఇటువంటి వార్తలను నమ్మరాదన్నారు. కోవిడ్ సెంటర్లను ఈ వారంలో ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, మాస్కు ధరించకపోతే రూ.250 జరిమానా విధిస్తామని మంత్రి తెలిపారు. కోవిడ్ నిబంధనల్ని తప్పక పాటించాలన్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో ఎక్కువమంది చేరకుండా చూస్తామని, అక్కడ పర్యవేక్షణకు మార్షల్స్‌ను నియమిస్తామని తెలిపారు. -
వ్యాక్సిన్ అందరికీ అక్కర్లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: దేశంలోగానీ, ప్రపంచంలోగానీ ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని అది సైంటిఫిక్ పద్ధతి కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. వైరస్ తన పంథాను మార్చుకుంటున్న కొద్దీ, దాన్ని బట్టి మన ప్రాధాన్యతలను మార్చుకోవాలని లోక్‌సభలో క్వశ్చన్ అవర్ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహా మేరకు ఆరోగ్య రంగం, ఫ్రంట్‌లైన్ వర్కర్ల రంగం, వృద్ధులు, 45 సంవత్సరాలు దాటి వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవాలి.. కాంగ్రెస్ ఎంపీ రవీత్‌సింగ్ బిట్టు ప్రశ్నిస్తూ.. కోవిడ్ –19 వల్ల ప్రజల భయపడుతున్నారని, అది భవిష్యత్తులో వారికి హాని చేస్తుందా అని ప్రశ్నించారు.. దానికి హర్షవర్ధన్ సమాధానమిచ్చారు. పోలియో, చికెన్ పాక్స్ వంటి వ్యాధులపై మనం విజయం సాధించామని, అందుకు కారణం వ్యాక్సినేషన్ అని చెప్పారు. త్వరలోనే భారత్ నుంచి మరికొన్ని కోవిడ్ వ్యాక్సిన్లు వస్తాయని వాటితో పాటే ప్రీ–ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. అందరికీ రక్తం అందింది.. తలసేమియాపై పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానమిస్తూ.. తలసేమియా రోగులకు తరచుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుందని అన్నారు. కరోనాతో దేశం అతలాకుతలమైన సమయంలో కూడా ఏ ఒక్క తలసేమియా రోగికి రక్తం అందని పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే.. ఏడాదిలోనే 75 వైద్య కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 30 వేల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇదంతా కోవిడ్ విజృంభించి సమయంలోనే జరిగిందన్నారు. ఆరేళ్లలో 24 వేల కొత్త పీజీ మెడికల్ సీట్లను సృష్టించినట్లు వెల్లడించారు. 39,726 కొత్త కరోనా కేసులు.. దేశంలో గత 24 గంటల్లో 39,726 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 154 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,370కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,10,83,679కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,71,282గా ఉంది. -
ఇక 24 గంటలూ ప్రజలకు కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ను దేశవ్యాప్తంగా మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 24 గంటలూ ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి వెల్లడించారు. ప్రజలు వారికి అనుకూలమైన సమయాల్లో వచ్చి వ్యాక్సిన్ తీసుకునేందు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో టీకా వేయడానికి ఉన్న సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. అదే విధంగా ప్రజలకు కోవిడ్ టీకాలు వేయడానికి ప్రైవేట్ ఆస్పత్రులు కూడా అన్నివేళల్లో అందుబాటులో ఉంటాయిని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లో పాల్గొన్న అన్ని ఆస్పత్రులు కోవిన్ యాప్, వెబ్సైట్ ద్వారా అనుసంధానం చేయబడినట్లు తెలిపారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిన్ పోర్టల్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టీకా అందుబాటులో ఉంటుందని నిబంధన ఏమి లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యం కోరుకున్న సమయంలో ప్రజలకు టీకాలు అందించే అనుమతి ఉందని తెలిపారు. చదవండి: ఈ రోజు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న దిగ్గజాలు -
మంత్రి విశ్రాంతి ప్రకటన.. ప్రజలు కన్నీటి పర్యంతం
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉద్వేగానికి లోనయ్యారు. తాను విశ్రాంతి తీసుకోదలచినట్టు ఆయన చేసిన ప్రకటనతో యానం వాసులు కన్నీటి పర్యంతం అయ్యారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు. యానం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు అందరికి సుపరిచితులే. కాంగ్రెస్‌కు చెందిన ఈ నేత 25 ఏళ్లుగా యానం ప్రజలతో మమేకం అయ్యారు. వరస విజయాలతో దూసుకొచ్చిన ఆయన యానం ప్రజల కోసం పదవిని సైతం త్యాగం చేయడానికి సిద్ధమని చాటారు. ఆ దిశగా ఇటీవల తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదన్న ప్రకటన వెలువడింది. ఇందుకు తగ్గట్టుగా ఆదివారం యానం అయ్యన్నగర్లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన మల్లాడి కృష్ణారావును రాజకీయాల్లో ఉండాల్సిందే, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని ప్రజలు కన్నీటి పర్యంతంతో విజ్ఞప్తి చేయడం విశేషం. ప్రజలు, మద్దతుదారులు కన్నీటిపర్యంతంతో విజ్ఞప్తి చేయడంతో ఉద్వేగానికి లోనైన మల్లాడి రుమాలతో పలుమార్లు చెమరిన కళ్లను తడుచుకోవాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుతూ తాను నిర్ణయం తీసుకున్నానని, తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎవరూ రారని స్పష్టం చేశారు. తనకు విశ్రాంతి కావాలని, దయ చేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మనలో ఒకర్ని ఎంపిక చేసి, పుదుచ్చేరి అసెంబ్లీకి పంపుదామని పిలుపునిచ్చారు. ఆ ఒకరు ఎవరో ప్రజలు చెప్పాలని, యానం అభివృద్ధిని కాంక్షించే ఆ వ్యక్తికి సంపూర్ణ మద్దతుఇద్దామన్నారు. తాను ఎక్కడికి వెళ్లనని, ఇక్కడే ఉంటానని ప్రజలకు నచ్చచెప్పారు. -
కరోనా కాటుకు మరో ఎమ్మెల్యే మృతి
మహారాష్ట్ర: కరోనా బారిన పడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భారత్ భాల్కే మరణించారు. పుణేలోని రబీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ‘పందర్పూర్- మంగళ్వేదా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బల్కే మరణం ఆ నియోజక వర్గ ప్రజలకు తీరని లోటని, అంకిత భావాలున్న నాయకుడు భాల్కే అని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టుగా’ ట్వీట్ చేశారు. (మళ్లీ లాక్డౌన్ ఉండకపోవచ్చు..) -
మళ్లీ లాక్డౌన్ ఉండకపోవచ్చు..
సాక్షి, ముంబై: రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాకపోవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న మాట వాస్తవమేనని, కరోనా చైన్‌ను తెంపేందుకు లాక్డౌన్ పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ విధిస్తే ఆర్థికంగా నష్టం వాటిళ్లుతుందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనాకు టీకా ఎప్పుడు వస్తుందనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. టీకా వచ్చినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదు.. మనమందరం అప్రమత్తంగా ఉంటూనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై మనం విజయం సాధించాలని, నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆంక్షలను కఠినతరం చేస్తామని చెప్పారు. చదవండి: (స్టీరింగ్ నా చేతిలోనే ఉంది..) (సేన సర్కార్ @ 365) -
సెకండ్ వేవ్ ఉంది.. లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోలేదు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ విషయంపై నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేవన్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతో ప్రజలందరు ప్రభుత్వం సూచించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ('మళ్లీ లాక్డౌన్ విధించే అంశంపై నిర్ణయం తీసుకుంటాం') సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని, అనవసరంగా రద్దీగా ఉండే మార్కెట్ల వంటి ప్రదేశాల్లో తిరిగి ఇంకా రద్దీని పెంచవద్దని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే ప్రభుత్వం కచ్చితంగా కొన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి త్వరంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. దేశంలోని ఢిల్లీ, గోవా, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలో కూడా దీపావళి తర్వాత స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!) -
లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలి: మంత్రి ఆదేశం
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: అల్పపీడనం ప్రభావంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వర్షాల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవిన్యూ శాఖ పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ఇతర శాఖలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలు కారణంగా అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్న ప్రాంతంలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అనవసరంగా బైటికి రావద్దని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లోతట్టు ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా తమ్మిలేరుకు వరద ఉధృతి పెరిగింది. అక్కడ 5000 క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏలూరు తమ్మిలేరుకు ఇరు వైపుల ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరులోని లోతట్టు ప్రాంతంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టండి అని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 6:30 నుంచి 7: 30 మధ్య కాకినాడకు అతి సమీపంలో వాయుగుండం తీరం దాటిందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. ఈ కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదవండి: భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు -
మూడు రెట్లు పెరిగిన కోవిడ్-19 పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ రాజధానిలో కరోనా పరీక్షలు ముమ్మరం చేశామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. పరీక్షల సామర్ధ్యాన్ని మూడు రెట్లు పెంచి రోజుకు 60,000 పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కోవిడ్-19 కేసులను అరికట్టేందుకు వ్యూహాత్మకంగా పరీక్షల సామర్ధ్యాన్ని పెంచామని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో వైరస్ కేసుల సంఖ్య రెట్టింపయ్యే సమయం 50 రోజులకు పెరిగిందని కోవిడ్-19 నుంచి ఇటీవల కోలుకున్న మంత్రి సత్యేంద్ర జైన్ వివరించారు. చదవండి : వైరల్: చీరకట్టులో అదిరిపోయే డాన్స్.. ఢిల్లీలో కరోనా వైరస్ రెండో విడత వ్యాప్తి ఊపందుకుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్న క్రమంలో కరోనా పరీక్షలను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది. ఇక ఢిల్లీలో కరోనా మరణాలు తగ్గాయని, మరణాల పదిరోజుల సగటు 0.94 శాతమని మంత్రి తెలిపారు. మొత్తంగా మరణాల రేటు 1.94 శాతంగా నమోదైందని చెప్పారు. ఏడు రోజుల సగటు ఆధారంగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.5 శాతమని వివరించారు. -
నెలకు రూ.2.25 లక్షల ప్యాకేజీ ప్రకటించినా..
ముంబై: వైద్యులకు నెలకు 2 లక్షల 25వేల రూపాయిల ప్యాకేజీని ప్రకటించినప్పటికి పూణేలో వైద్యుల కొరత అలాగే ఉందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సాసూన్ జనరల్ ఆస్పత్రి సీనియర్ వైద్యులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి రాజేష్ తోపే మీడియాతో మాట్లాడుతూ.. పూణెకు 213 మంది వైద్యుల అవసరం ఉందని, నెలకు 2 లక్షల 25 వేల ప్యాకేజీని అందిస్తున్నప్పటికీ ఎలాంటి దరఖాస్తులు అందడం లేదన్నారు. దీంతో వెంటనే తాజా నియామక ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. పూణేలో ఆస్పత్రుల్లో ప్రధానంగా పడకల సమస్య ఉందని తోపే తెలిపారు. రెండు రోజులు పూణెలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తామని, అలాగే ట్రస్ట్ ఆసుపత్రుల యజమానులతో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేగాక భారీ సామర్థ్యం ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా సమవేశం నిర్వహించి, ఆక్సిజన్ ప్లాంట్లను కూడా సందర్శిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో కూడా వెంటనే ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచేందుకు వైద్యులను, ఐసీయులో పడకల సామర్థ్యంతో పాటు టెలి ఐసీయు సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుతం సాసూన్ జనరల్ ఆస్పత్రుల్లో 450 పడకలు ఉన్నాయి. వాటి సంఖ్యను 850కి పెంచబోతున్నాం. ప్రొఫెసర్లు, ఇతర వైద్యులతో సహా మొత్తం 607 మంది వైద్యులు ఉన్నప్పటికి కరోనా నేపథ్యంలో గరిష్ట సంఖ్యలోనే వైద్యులను నియమించే ప్రయత్నం చేస్తున్నాం’ అని ఆయన అన్నారు. -
బ్రిటిష్ పత్రికలో భారతీయత
సమాజానికి చేసే మంచి పనులు ప్రపంచమంతా పర్యటిస్తూనే ఉంటాయి. ఆ మంచితనానికి జేజేలు పలుకుతూనే ఉంటాయి. కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజను ‘టాప్ థింకర్ 2020’గా యుకె ప్రతిష్టాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఎంపిక చేసింది. కరోనా కాలంలో ఆమె చేసిన కృషి కారణంగా ఈ అరుదైన గౌరవం లభించింది. బ్రిటిష్ మ్యాగజైన్ ‘ప్రాస్పెక్ట్’ పత్రికలో తత్వవేత్తలు, మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలను ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసింది. పాఠకులు, నిపుణులు, సంపాదకుల బృందం అభిప్రాయం ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా అర్డెర్న్ ప్రాస్పెక్ట్ జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. కరోనా కాలంలో రాష్ట్రంలో తగిన చర్యలు తీసుకున్న శైలాజ పేరు 50వ స్థానంలో చేరింది. పత్రిక ప్రకారం ఈ జాబితాను ఖరారు చేయడానికి 20,000 కి పైగా ఓట్లు పోలయ్యాయి. ఈ జాబితాలో కెకె శైలజ మాత్రమే భారతీయ మహిళ. శైలజను ప్రశంసిస్తూ ‘2018 సంవత్సరంలో కూడా కేరళలో వ్యాపించిన నిపా వైరసును శైలజ స్థిరంగా ఎదుర్కొంది‘ అని పత్రిక తెలిపింది. టీచర్ నుంచి రాజకీయాల్లోకి.. రాజకీయాల్లో చేరడానికి ముందు శైలజ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. ఏడేళ్లు సైన్స్ టీచర్‌గా విధులను నిర్వర్తించిన శైలజ టీచర్ 2004 నుంచి పూర్తిగా రాజకీయాల్లో ఉంది. అందరూ ఆమెను అభిమానంగా ఇప్పటికీ ’శైలాజ టీచర్’ అనే పిలుస్తుంటారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలోనే కాదు తను ఎంచుకున్న రాజకీయ జీవితాన్ని సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ మంచి పొలిటీషియన్ అనే పేరును సంపాదించుకుంటున్నారు. కరోనాను అరికట్టడానికి శైలజ చేసిన ప్రయత్నాలు అన్నింటా ప్రశంసలు అందుకున్నాయి. ప్రతిష్టాత్మక బ్రిటిష్ వార్తాపత్రిక ’ది గార్డియన్’ కూడా కరోనా కాలంలో శైలాజ చేసిన కృషిని ప్రశంసించింది. కోవిడ్–19 మహమ్మారి సమయంలో సరిహద్దులలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను గౌరవించే కార్యక్రమంలో తన ప్రసంగాన్ని వినిపించడానికి ఐక్యరాజ్యసమితి శైలజను ఆహ్వానించింది. ప్రాస్పెక్ట్ పత్రిక న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా అర్డెర్న్‌ను రెండవ స్థానంలో నిలపడానికి కారణం కరోనా ప్రచారంలో సామాన్య ప్రజలకు ఆమె మద్దతుగా నిలవడం. మహమ్మారిని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాలలో ఆమె కృషి. ఆ తర్వాత ప్రాస్పెక్ట్ జాబితాలో ఫ్రెంచ్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి వీనర్ ఎస్తేర్ డఫ్లో ఉన్నారు. పలుసార్లు బుకర్ ప్రైజ్ అందుకున్న హిల్లరీ మాంటిల్, పర్యావరణవేత్త డేవిడ్ అటెన్‌బరో పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రాస్పెక్ట్ జాబితాలో పురుషుల కంటే మహిళల పేర్లు ఎక్కువ ఉన్నాయి. ఈ జాబితాలో 26 మంది మహిళల పేర్లు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. -
‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు
-
‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు
పుదుచ్చేరి: ఎవరి బాధ్యతను వారు విస్మరించినపుడు వేరొకరి చేత ఆ బాధ్యతను గుర్తు చేయించుకోవలసిన దుస్థితి వస్తుంది. గుర్తు చేసినా వాళ్లు ఆ బాధ్యతను చేతుల్లోకి తీసుకోక పోతుంటే?! మల్లాది కృష్ణారావు గారు ఏం చేశారో చూడండి. ఆయన మన తెలుగువారు. పుదుచ్చేరిలో కీలకమైన వ్యక్తిగా పెద్ద స్థానంలో ఉన్నారు. శనివారం ఆయన ఇన్స్పెక్షన్కి వెళ్లారు. కోవిడ్ ఇన్స్పెక్షన్. ఎక్కడంటే.. ‘ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’లో. పేషెంట్లను పలకరించారు. ఏ పడక దగ్గరకు వెళ్లినా ఒకటే కంప్లయింట్. ‘టాయిలెట్స్ శుభ్రంగా ఉండటం లేదు సర్’ అని. ఆసుపత్రి అధికారులను పిలిపించడం, వాళ్లు పరుగున రావడం ఏం లేదు. వాళ్లు ఆయన పక్కన లేకుంటే కదా! ‘ఏమిటిది?’ అన్నట్లు వాళ్ల వైపు చూశారు కృష్ణారావు. (శశికళకు షాక్ ఇచ్చిన ఐటీ?) ఆ వెంటనే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. చట్టం అంటే.. చీపురు, నీళ్ల బకెట్, క్లీనింగ్ లిక్విడ్స్! నేరుగా అక్కడి ఒక టాయిలెట్ గదికి వెళ్లి క్లీన్ చెయ్యడం మొదలు పెట్టారు!! ‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు. ఎవరి పని వారు చెయ్యకపోతుంటే ‘ఎందుకు చెయ్యరు?’ అని నిలదీసి చేయించడం ఒక పద్దతి. అయితే ఎంత నిలదీసినా కదలని ఉచ్ఛస్థితి లోకి వచ్చేసిన వాళ్లు ఉంటారు. వాళ్ల చేత ఐక్యరాజ్యసమితి కూడా పని చేయించలేదు. ఇక కృష్ణారావు గారెంత? ఆఫ్టాల్ర్ ఆరోగ్యశాఖ మంత్రి. శుభ్రతే దైవం అంటారు. వృత్తిని దైవంలా భావించని వారి కారణంగానే దైవానికి భూమి మీద శుభ్రమైన చోటు లేకుండా పోతోంది. (మహిళ మంటల్లో కాలుతున్నా పట్టించుకోకుండా..) -
జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా
రాంచీ : కరోనాకు సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నాగుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. అయితే గుప్తాకు అంతకుముందు కాబినెట్ సమావేశంలో పాల్గొనడంతో మిగతా మంత్రులకు సైతం కరోనా భయం పట్టుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్ గుప్తా పక్కనే కూర్చున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా గుప్తాకు కరోనా లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యంగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారని ఆరోపించారు. గుప్తా అవలంభించిన నిర్లక్ష్య ధోరణి వల్ల మిగతా మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సి వచ్చిందని విమర్శించారు. ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా అని తేలడంతో వెంటనే ఆయనతో పాటు హాజరైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ క్వారంటైన్‌కి వెళ్లారు. ఇక మరో నాయకుడు ఏజేఎస్‌యూ పార్టీ అధ్యక్షుడు సుదేష్ మహతోకు కూడా కరోనా సోకింంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి ఖశ్చితమైన నిబంధనలు పాటించాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. (ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా) -
జ్వరం వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు : ఈటల
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యాదికారులతో చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ యూనివర్సిటీ వి సి కరుణాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్సరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన మంత్రి.. జ్వరం వచ్చిన వారందరిని వీలైనంత త్వరగా గుర్తించి పరీక్షలు చేయాలని సూచించారు. దీని ద్వారా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినా ప్రాణనష్టం జరగకుండా కాపాడొచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే మసూచి, సార్స్ వంటి అనేక రకాల వైరస్‌లను ఎదుర్కొన్నామని, ప్రస్తుతం కరోనా వస్తే చావే అన్న భయాన్ని అధిగమించామన్నారు. వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి చాలా శ్రమిస్తున్నారని, ఊపిరితిత్తులు , శ్వాసకోస సంబంధిత సమస్యలు ఉన్నవారికే కరోనా ఎక్కువ ప్రమాదకరంగా మారిందన్నారు. అయితే ప్రతీ ఒక్కరూ విధిగా భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటిస్తే కరోనా దరిచేరకుండా ఉండొచ్చని తెలిపారు. రాష్ర్టంలో రాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చాక టెస్టింగ్ కెపాసిటీ పెరిగిందిని మంత్రి ఈటల పేర్కొన్నారు. (ఉస్మానియా పాత భవనానికి సీల్ ) -
‘అందుకే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో దాదాపు 30 రోజులు పోరాడిన తర్వాత విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ దేశ రాజధానిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌కు మెరుగైన చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాస్మా థెరఫీ చికిత్సకు ఇచ్చిన అనుమతి గడువుతీరడంతో తాను ప్రైవేట్ ఆస్పత్రికి మారాల్సివచ్చిందని ఆయన వెల్లడించారు. తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు ఒకరోజు ముందు తాను మామగారిని కోల్పోవడంతో తమ కుటుంబం భయాందోళనకు గురైందని చెప్పారు. తొలుత తాను చేరిన రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏ ప్రైవేట్ ఆస్పత్రి కంటే మెరుగైదని స్పష్టం చేశారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు తనకు ప్లాస్మా థెరఫీ ఇవ్వాలని నిర్ణయించారని, అందుకు ఆ ఆస్పత్రికి అనుమతి లేదని, ఎన్జేపీ అనుమతి కూడా గడువుతీరడంతో అనుమతి కోసం వేచిచూడాలని తాను భావించానన్నారు. కుటుంబ సభ్యులు, వైద్యుల ఒత్తిడితో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాల్సివచ్చిందని చెప్పుకొచ్చారు. పదిరోజుల తర్వాత ఆ ఆస్పత్రులకు ప్లాస్మా థెరఫీ అందించేందుకు అనుమతి లభించిందని తెలిపారు. నాలుగు రోజుల కిందటి వరకూ తాను ప్రతిరోజూ ఆక్సిజన్ తీసుకున్నానని..కొద్దిరోజుల పాటు ఆక్సిజన్ లేకుండా ఉండగలగడంతో విధులు నిర్వహించేందుకు తనను వైద్యులు అనుమతించారని మంత్రి జైన్ తెలిపారు. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను జూన్ 17న రాజీవ్ గాంధీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి ఆక్సిజన్‌ను అందించారు. ప్లాస్మా థెరఫీ నిర్వహించిన అనంతరం మంత్రి జైన్ ఆరోగ్యం మెరుగుపడింది. చదవండి : తిరిగి విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్యమంత్రి -
‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’
బెంగళూరు : కరోనా నుంచి ఆ దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడని కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల 100 శాతంగా ఉందని, వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం నిబంధనలు పాటించాలని తెలిపారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మనమందరం అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ సభ్యులు, ప్రతిపక్షం, ధనవంతులు, పేదవారు, పోలీసులు, వైద్యులు అంటూ వైరస్ వివక్ష చూపదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొన్నారు. (10 రోజుల చికిత్సకు రూ.9.09 లక్షలు) అయితే ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నయన్న ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. కర్ణాటక ప్రభుత్వం కొవిడ్-19పై అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని.. మంత్రుల నిర్లక్ష్యం వల్లనో, లేక అధికారులు, మంత్రుల మధ్య సమన్వయలోపం వల్లనో జరగడం లేదన్నారు. అలాగే దేవుడు మాత్రమే మనల్ని కరోనా నుండి రక్షించగలడని పేర్కొన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షం విరుచుకుపడుతోంది. దేవుడే కాపాడాలని మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసమర్థకు నిదర్శమని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పేర్కొన్నారు. వైరస్‌ను పరిష్కరించలేకపోతే ఇలాంటి ప్రభుత్వం తమకు అవసరమా అని నిలదీశారు. (ఇతనికి అవేమి పట్టవు.. ఏకంగా 163 సార్లు) అయితే విమర్శలపై స్పందించిన శ్రీరాములు అనంతరం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజల సహకారంతోపాటు దేవుడు దయ కూడా మనకు కావాలని తాను చెప్పినట్లు వెల్లడించారు. తన మాటలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చిత్రీకరించి ప్రసారం చేశాయని బుధవారం రాత్రి వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో 47,253 మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 928 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 2.75 లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు 1.51 లక్షలు, ఢిల్లీ 1.16 లక్షల కేసులతో మూడో స్థానంలో ఉంది. (మంత్రి భార్య, కుమారుడికి పాజిటివ్) -
ప్లాస్మా థెరఫీతో కోలుకున్న మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో బాధపడుతూ ఢిల్లీలోని సాకేత్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మెరుగైంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న జైన్ చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయనను సోమవారం జనరల్ వార్డుకు తరలిస్తారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన కోలుకోవడంతో 24 గంటలు పరిశీలనలో ఉంచి జ్వరం, శ్వాస ఇబ్బందులు మళ్లీ తలెత్తకుంటే జనరల్ వార్డుకు తరలిస్తామని వెల్లడించాయి. కరోనా పాజిటివ్‌తో రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన జైన్ ఆరోగ్యం విషమించడంతో ఆయనను మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. జైన్‌కు ప్లాస్మా థెరఫీ ఇవ్వడంతో కోలుకున్నారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ట్వీటీ చేశారు. చదవండి : కీలక దశలో వ్యాక్సిన్ పరీక్ష -
ఆమె బిరుదు ‘కోవిడ్ రాణి’
తిరువనంతపురం: గల్ఫ్ దేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి రావాలని ఆశిస్తున్న ప్రవాసులకు కరోనా రహిత ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరి చేస్తూ.. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రవాసుల పట్ల ప్రభుత్వానికి దయ లేదంటూ కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ విమర్శించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజను ‘కోవిడ్ రాణి’ అంటూ ఎగతాళి చేశారు. అంతేకాక ఆమె ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. ఆమెకు రికార్డులు, పురస్కారాల మీద ఉన్న ప్రేమ జనాల ఆరోగ్యం గురించి లేదన్నారు. కేరళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఒక రోజు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరోగ్య మంత్రి కేకే శైలజ గతంలో ‘నిపా రాజకుమారి’ టైటిల్ పొందారు.. ఇప్పుడు ‘కోవిడ్ రాణి’ బిరుదు కోసం ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు. గత మూడు నెలల్లో కరోనా కారణంగా గల్ఫ్‌లో 200 మందికి పైగా ప్రవాసులు మరణించారు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని రామచంద్రన్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘విదేశాల్లో ఉన్న మా ప్రజలు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య గురించి భయపడుతోంది. కేరళ అభివృద్ధి కోసం పాటుపడిన పేద ప్రవాసులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం వారి గురించి మొసలి కన్నీరు కారుస్తుంది’ అన్నారు. అయితే కేరళ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దాంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను స్త్రీలను అవమానించలేదని.. కేవలం ప్రభుత్వాన్ని, విధులు సరిగ్గా నిర్వహించిన మంత్రిని మాత్రమే విమర్శించానని తెలిపారు. -
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు(55) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఈనెల 15న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. తొలుత మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. అయితే ఇంకా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతుండంతో మరోసారి కరోనా టెస్టులు నిర్వహించారు. రెండోసారి నిర్వహించిన టెస్టులో సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రికి ఆక్సిజన్ అమర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. (కరోనా సోకిందని ఇలా చేసి నిర్థారణ చేసుకోవచ్చు! ) -
‘చిత్తూరు ఘటన సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’
సాక్షి, ప్రకాశం: చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఘటనను సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రతీ సచివాలయం పరిధిలో ఓ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. మారు మూల వైద్యశాలలను కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగం భ్రష్టు పట్టిందని మండిపడ్డారు. వైద్యశాలలకు, మెడికల్ కళాశాలలకు కావాల్సిన అన్నీ మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సిన వైద్య ఏర్పాట్లకు అన్నీ ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆళ్ల నాని పేర్కొన్నారు. -
కరోనాపై విచారణకు భారత్ ఓకే
న్యూఢిల్లీ/జెనీవా: కరోనా వైరస్ పుట్టుకపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న ప్రపంచదేశాల డిమాండ్‌కు భారత్ మద్దతిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వహించిన వర్చువల్ సదస్సులో దాదాపు 120 దేశాలు ఒక తీర్మానం చేస్తూ వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ప్రపంచదేశాల తీరుతెన్నులను సమీక్షించాలని నిర్ణయించాయి. ప్రపంచ ఆరోగ్య సదస్సు(డబ్ల్యూహెచ్ఏ) పేరుతో సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సమావేశంలో కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అదనపు నిధులను ఎలా సమీకరించాలన్న అంశంపైనా చర్చ జరగనుంది. కరోనా పుట్టుకకు చైనానే కారణమని, జరిగిన నష్టానికి పరిహారం కోరతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ల నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యమేర్పడింది. నిన్నమొన్నటివరకూ విచారణకు ససేమిరా అన్న చైనా.. తాజాగా కాస్త మెత్తబడటంతోపాటు కరోనాపై పోరుకు రెండేళ్లలో రూ.15 వేల కోట్లిస్తాననడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సదస్సు(డబ్ల్యూహెచ్ఏ) సోమవారం 27 యూరోపియన్ దేశాలు చైనా పేరు ప్రస్తావించకుండా వైరస్ పుట్టుకపై విచారణ జరగాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అన్నిదేశాల ప్రాతినిధ్యంతో శాస్త్రీయమైన విచారణ జరగాలని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు మేలైన పద్ధతులు అందుబాటులోకి వస్తాయని తీర్మానంలో ప్రతిపాదించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌లపై ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు. భారత్‌తోపాటు ఆఫ్రికా ఖండంలోని 50 దేశాలు, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, కెనడా, ఖతార్, రష్యా, యూకే, ఐర్లాండ్ తదితర దేశాలు ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి. తీర్మానానికి మద్దతిచ్చిన దేశాల జాబితాలో అమెరికా లేదు. భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డబ్ల్యూహెచ్ఓ సదస్సులో పాల్గొన్నారు. అన్ని వివరాలూ ఇచ్చాం: జిన్‌పింగ్ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చామని, కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా నియంత్రించేందుకు దాదాపు రూ.15 వేల కోట్లిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ డబ్ల్యూహెచ్ఓ సదస్సులో ప్రకటించారు. విపత్తును ఎదుర్కొనేందుకు రెండేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. కరోనాపై ప్రపంచం స్పందించిన తీరుపై సమగ్ర దర్యాప్తునకూ చైనా మద్దతిస్తుందన్నారు. ఈ విచారణ అనేది శాస్త్రీయపద్ధతిలో జరగాలన్నారు. ఈయూ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఝావ్ బీజింగ్‌లో చెప్పారు. భవిష్యత్తులో కరోనా వంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండటం ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ పుట్టకతోపాటు ఈ అంశంపై ప్రపంచదేశాల స్పందనపై వీలైనంత తొందరగా స్వతంత్ర విచారణ చేపడతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రేయేసస్ స్పష్టం చేశారు. -
కరోనా విజృంభణ: ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా
బ్రెసిలియా : కరోనా కాలంలోనూ బ్రెజిల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంటే మరోవైపు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి నెల్సన్ టీచ్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. మంత్రిత్వ బాధ్యతలు చేపట్టి నెల గడవక ముందే ఆయన రాజీనామ చేయడం గమనార్హం. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీచ్పై అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే నెల్సన్ తన మంత్రి పదవికి రాజీనామ చేశారు. కరోనా నివారణ చర్యల్లో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారోతో విభేధించి రాజీనామా చేసిన రెండవ బ్రెజిలియన్ ఆరోగ్య మంత్రి నెల్సన్ టీచ్ కావడం గమనార్హం. ఇప్పటికే కరోనా నివారణ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్న మాజీ మంత్రి లూయూజ్ హెన్నిక్ మండెట్టాను అధ్యక్షుడు బొల్సొనారో తొలగించగా.. ఆయన స్థానంలో ఏప్రిల్ 17న టీచ్ బాధ్యతలు చేపట్టారు. (కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్) దీనిపై నెల్సన్ మాట్లాడుతూ.. 'జీవితం అనేది ఎన్నో ఎంపికల సమూహం. హోదాను చూసి ఈ పదవిలోకి రాలేదు. దేశానికి, ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలని ఈ రంగంలోకి వచ్చాను. కరోనా వైరస్ కట్టడికి నా వంతుగా అనేక ప్రయత్నాలు చేశారు'. అని తెలిపారు. అయితే తన రాజీనామకు దేశ అధ్యక్షుడు మాత్రం కారణం కాదని వెల్లడించలేదు. కానీ దేశంలో జరుగుతున్న పరిస్థితులను, వాస్తవాలను అంగికరించని బొల్సొనారో నిర్ణయంతో అసంతృప్తి చెందినట్లు తెలిపారు. బ్రెజిల్లో ప్రస్తుతం మరింత కేసులు పెరగనున్నట్లు, అయితే కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రజలను హెచ్చరించారు. (ఏపీలో 2205కు చేరిన కరోనా కేసులు ) ఇక బ్రెజిల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు జర్మనీ, ఫ్రాన్స్‌ను దాటాయి. అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. శుక్రవారం ఒక్కరోజు 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 15 వేలకు చేరాయి. 80 వేల మంది చికిత్స నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. (జౌరియా ప్రమాదానికి కారణం వారే: మాయావతి ) -
'ఆ రెండు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయాల్సిందే'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణలోని వైద్య సిబ్బందితో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రుల సుపరింటెండెంట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ అధికారులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రతీ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఇన్ప్లూయెంజా లక్షణాలు(జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి), ఊపిరితిత్తుల న్యుమెనియా వంటి రెండు లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని మంత్రి వైద్య సిబ్బందిని కోరారు. అనంతరం కరోనాకు సంబంధించి గ్రామాల్లో, పట్టణాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ పలువురు ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగీతా రాణా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, టిఎస్‌ఐఎండిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడీ, ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. (మరో ఆరుగురికి పాజిటివ్) -
ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
కాబుల్ : మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏ దేశాన్ని వదలకుండా ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపుతోంది. చిన్నాపెద్దా లేకుండా మానవాళిపై విరుచుపడుతోంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర ఆరోగ్యమంత్రి కరోనా బారినపడ్డారు. మంత్రి ఫిరోజుద్దీన్ ఫిరోజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయనను క్వారెంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 215 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3700కి చేరింది. ఇక వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో 100 మంది చనిపోయారు. (కరోనా: మృతుల్లో నల్ల జాతీయులే అధికం) -
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. గడిచిన ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. అలాగే 47 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు వెలుగుచూడలేదని, గత 21 రోజుల్లోనూ 39 జిల్లాలో కరోనా కేసులు నమోదుకాలేదని వెల్లడించారు. ఇక గడిచిన 28 రోజుల్లో దేశ వ్యాప్తంగా 17 జిల్లాల్లో కేసులేమీ వెల్లడికాలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో హర్షవర్థన్ వివరాలను వెల్లడించారు. వైరస్ కట్టడికి దేశ వ్యాప్తింగా విధించిన లాక్డౌన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. (కరోనా.. 24 గంటల్లో 62 మంది మృతి) మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా ఉందని, దీనిపై స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1543 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29435కి చేరిందన్నారు. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. (ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు) -
సామాజిక దూరాన్ని...
-
మూడేళ్ల చిన్నారికీ కోవిడ్
న్యూఢిల్లీ: కేరళలో మూడేళ్ల చిన్నారి సహా నలుగురికి తాజాగా కరోనా వైరస్ సోకడంతో ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 44కు చేరింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూలలో ఒక్కో కేసు నమోదు కాగా.. ఇటీవల ఇటలీ నుంచి తిరిగి వచ్చిన మూడేళ్ల చిన్నారి వ్యాధి బారిన పడినట్లు ఆర్యోగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూయార్క్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికీ కోవిడ్ సోకింది. జమ్మూలో కోవిడ్ బారిన పడ్డ వ్యక్తి ఇరాన్‌కు వెళ్లినట్లు తెలిసిందని, ఉత్తర ప్రదేశ్ బాధితుడు కరోనా వైరస్ సోకిన ఆరుగురితో ఆగ్రాలో సన్నిహితంగా గడిపారని ఆరోగ్య శాఖ తన ప్రకటనలో వివరించింది. మరోవైపు రాజధాని ఢిల్లీలో మరో కేసు నమోదైన నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌లతో ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘వైరస్ నియంత్రణపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపిస్తున్నాం’అని మంత్రి తెలిపారు. 8255 విమానాల్లోని 8.74 లక్షల అంతర్జాతీయ ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. కేరళలోని కోచీలో వైరస్ బారిన పడ్డ మూడేళ్ల చిన్నారి రెండు రోజుల క్రితమే తల్లిదండ్రులతో కలిసి ఇటలీ నుంచి వచ్చింది. వైరస్ భయాందోళనలు ఎలా ఉన్నా కేరళలో మంగళవారం నాటి ఆటుక్కళ పొంగలలో లక్షలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం గమనార్హం. కర్ణాటకలో మొదటి కోవిడ్ కేసు వెలుగుచూసింది. అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన 40ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగికి కోవిడ్ సోకిందని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. మార్చి 1న భార్య, కుమార్తెతో న్యూయార్క్ నుంచి బెంగళూరుకు ఆ ఉద్యోగి వచ్చారు. -
వారంలోపు అరికట్టాలి : మంత్రి నాని ఆదేశాలు
సాక్షి, శ్రీకాకుళం : రాష్ట్రంలో వారం రోజుల్లో కల్తీ ఆహార పదార్ధాల విక్రయాలను నిరోధించాలని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో శెనగపిండికి బదులు కేసరి పప్పు పిండిని విక్రయిస్తున్నట్టు సమాచారమందడంతో మంత్రి సీరియస్ అయ్యారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో కేసరి పప్పు విక్రయిస్తుండగా, అది తింటే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఐపీఎం డైరెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
సాక్షి, తిరుపతి: పేదల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్లో వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఎం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు మంత్రి. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యేలు, భూమన కరుణాకర్‌రెడ్డి, రోజా పాల్గొన్నారు. -
'పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తాం'
సాక్షి, తిరుపతి : పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిని శనివారం మంత్రుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా రోగులను పరామర్శించిన మంత్రులు వారికి అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక వసతుల ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. రుయా ఆసుపత్రి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళతామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, ఆదిమూలపు సురేశ్, ఇతర ఉన్నతాదికారులు పాల్గొన్నారు. -
మంత్రి పదవి భిక్ష కాదు
సాక్షి, కరీంనగర్ : ‘మంత్రి పదవి నాకు ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదు.. మంత్రి పదవి కోసం కులం పేరుతో కొట్లాడలేదు.. తెలంగాణ కోసం చేసిన ఉద్యమమే నన్ను మంత్రిని చేసింది’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో గురువారం జరిగిన టీఆర్ఎస్ సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. మంత్రి పదవిపై గత కొన్ని రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన పరోక్షంగా స్పందించారు. పదవిని అడుక్కునేవాళ్లం కాదని, అడుక్కునేవాళ్లు ఎవరో తొందరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాకపోవచ్చునని.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని పేర్కొన్నారు. సొంతంగా ఎదగలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, బయట జరుగుతున్న చిల్లర రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ వ్యవహారంపై సభలో ఘాటుగా స్పందించిన ఆయన.. అనంతరం తన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశం కావడంతో గురువారం రాత్రి వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన ప్రసంగాన్ని వక్రీకరించడం సరికాదని, తాను గులాబీ సైనికుడినేనని, తమ నాయకుడు సీఎం కేసీఆరేనని స్పష్టంచేశారు. అంతకుముందు సభలో ఈటల ఏమన్నారంటే... నేనానాడే పారిశ్రామికవేత్తను.. ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైనప్పుడు ఆ ఉద్యమానికి పారిశ్రామికవేత్తగా నన్ను సాయం చేయమని ఓ నాయకుడు కోరినప్పుడు పార్టీ పరిచయమైంది. ఆ కాలంలోనే నా గురించి పెద్ద పారిశ్రామికవేత్తనని పత్రికలు రాసినయి. హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఈటల రాజేందర్ అంటే తెలియని వారు ఉండరనుకుంట. అప్పటి ఉద్యమ రోజుల్లోనే పది లక్షల కోళ్ల ఫారాలను నడుపుతున్నా. 50 లక్షల కోళ్ల ఫాంలను నడిపే సత్తా ఉన్నవాడిని. 2003లో నేను టీఆర్ఎస్లో చేరి పనిచేస్తున్న క్రమంలో అప్పటి ఉద్యమ నేత అయిన సీఎం కేసీఆర్ నన్ను మీది ఎక్కడయ్యా అని అడిగితే కమలాపూర్ అని చెప్పిన. ఆ సందర్భంలో గిక్కడ ఏముందయ్యా.. నీకు గట్టుకు కట్టెలు మోసినట్లు అని చెప్పి.. నీకు డబ్బు, మంచి పేరు ఉంది. నువ్వు అక్కడికి వెళ్లు అని కమలాపూర్ పొమ్మన్నడు. అప్పుడు కమలాపూర్ నాకు పెద్దగా పరిచయం లేదు సార్.. నేను ఈటల మల్లయ్య కొడుకు గానో, ఈటల సమ్మయ్య తమ్ముని గానో, ఈటల భద్రయ్య అన్నగానో చెప్పుకోవాలె తప్ప అక్కడ నాకు చరిత్ర లేదు సార్ అని చెప్పిన. అప్పుడు సీఎం కేసీఆర్ నువ్వు పో.. నీకు మంచిగ ఉంటుందని చెబితే కమలాపూర్‌లో అడుగు పెట్టిన. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన బిడ్డగా నన్ను ఆరుసార్లు గెలిపించి నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలిచారు. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసినం అనామక మనిషిగా వచ్చిం ఈ గడ్డ మీద ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుచుడు అనేది ఓ చరిత్ర. నా తండ్రి రాజకీయాల్లో లేడు. నాకు నేనుగా నిలబడ్డా. ఒక్క హుజూరాబాదే కాదు.. నేను ఆదిలాబాద్‌కు పోయినా పదిమంది వచ్చి ఫొటో దిగి పోతరు. నేను మహబూబ్‌నగర్ పోయినా, వ్యాన్లలో వచ్చి పదిమంది ఫొటో దిగి పోతరు. లక్షల మందితో తెలంగాణ గడ్డపై ఉద్యమం చేసిన బిడ్డలం. ఒక పత్రిక రాస్తది.. ఈయనకు మంత్రి పదవే రాకపోతుండే.. కుల సమీకరణలు కలిసొచ్చాయని. కొడుకా గుర్తుపెట్టుకో.. కులంతోటి కొట్లాట పెట్టలే. ఈ మంత్రి పదవే ముఖ్యమా? కులంతో వచ్చినవాడిని కాదు నేను. ఈటల రాజేందర్ అనేవాడు తెలంగాణ ఉద్యమం మూడున్నర కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ బావుటా. ఆ బావుటా ఎగరేసిన తెలంగాణ బిడ్డను. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడినం. దొంగలెవరో, ద్రోహులెవరో త్వరలోనే తెలుస్తది. ద్రోహులు పదేపదే మోసం చేయలేరు. న్యాయం, ధర్మం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆనాడు జైళ్లలో, పీడీ యాక్టులు పెట్టాలె అని ముఠాలు కట్టిన్రు. నన్ను చంపాలె అని రెక్కీలు నిర్వహించినప్పుడు.. సంపుతవా నా కొడకా! అని ఛాలెంజ్ చేసిన తెలంగాణ బిడ్డను నేను. ఈటల రాజేందర్ తెలంగాణ విముక్తి పోరాటం వల్ల గెలిచాడు తప్ప.. నాకు నేనుగా గెలవలేదు అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌కు చెప్పిన. ఇవాళ పైసల గురించి మాట్లాడుతున్నారు. నాకు ఆనాడే పైసలున్నయ్. నా సొంతంగా కోళ్ల ఫారాలతో వ్యాపారాలు చేసుకొని సంపాదించిన పైసలు. నా 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవ్వల దగ్గరి నుంచైనా ఐదువేలు లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచే వైదొలుగుతా. నేను ఇల్లు కట్టుకుంటే ఇంత కక్షా? ఇల్లు కట్టుకున్న భూమి కూడా ఇప్పుడు కొన్నది కాదు. అడుక్కునేవాళ్లు ఎవరో తెలుస్తది.. చెప్పాలంటే 10 గంటలు చెప్తా. ఒక్కోరోజు 4 జిల్లాల్లో 20 సభల్లో లక్షల మందితో ఇంటరాక్ట్ అయి ఉద్యమాన్ని నడిపిన వాళ్లం మేం. ఈ గులాబీ జెండాకు ఓనర్లం మేం. అడుక్కుని వచ్చిన వాళ్లం కాదు మేం. బతుకచ్చినోళ్లం కాదు మేం. అడుక్కునేవాళ్లెవరో రేపు తెలుస్తది. అధికారం అనేది శాశ్వతం కాకపోవచ్చు.. కానీ ధర్మం, న్యాయం శాశ్వతంగా ఉంటుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప.. నాయకులు కాదనే సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కుసంస్కారం ఉన్న, ఎదగలేని, సొంతంగా తిరగలేని నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలి. ధర్మం నుంచి అలాంటి నాయకులు తప్పించుకోలేరు. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదు. చిల్లరమల్లర వార్తలకు భయపడను.. నేను గెలవగలిగే సత్తా ఉన్నోడిని.. అమ్ముడుపోకుండా ఉన్నోడిని నా భుజాలమీద మోసే ప్రయత్నం చేస్తా. ఈ బాధ.. ఇదంతా కూడా నానోటి నుంచే కాదు.. ఎన్నడో ఒకనాడు తప్పకుండా బయటకొస్తాయ్. ఎవడు పోయి ద్రోహి అయ్యాడో.. ఎవడు హీరో అయ్యాడో అనేది ఆ రోజు తెలుస్తదన్న ఆశతో బతికేవాడిని. ఈటల రాజేందర్ వెలిగే దీపమే తప్ప.. తెలంగాణ గడ్డమీద ఆత్మగౌరవంతో బతికేవాడే తప్ప.. ఈ చిల్లరమల్లర వారితో, వార్తలతో భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నా’అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తలతో అవమానించొద్దు హుజూరాబాద్ సభలో తాను చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించడంతో మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఈ విషయంపై కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న వార్తల గురించి వివరణ ఇస్తూ గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హుజురాబాద్‌లో కాంగ్రెస్ నాయకుడు కాసిపేట శ్రీనివాస్ చేరిక సందర్భంగా నేను చేసిన ప్రసంగాన్ని కొన్ని వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలోని కొన్ని వర్గాలు వక్రీకరించడం సరికాదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది. నేను పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు గులాబీ సైనికుడినే. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే. ఇటీవల కొన్ని పత్రికలతో పాటు, సామాజిక మాధ్యమాల్లో మా పార్టీ అంటే గిట్టనివాళ్లు, నా ఎదుగుదలను ఓర్వలేనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నన్ను ఒక కులానికి ప్రతినిధిగా, డబ్బులకు ఆశపడే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ సభలో చిల్లరవార్తలు వద్దని చెప్పాను. తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికే నేను పది లక్షల కోళ్ల ఫారానికి యజమానినని చెప్పాను. కమలాపుర్ (ప్రస్తుత హుజురాబాద్) నియోజకవర్గానికి నన్ను పంపించి, ఇక్కడ పోటీ చేయించి గెలిపించింది మా నాయకుడు కేసీఆర్ అని చెప్పడంతో పాటు.. మేము గులాబీ సైనికులమని, రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి రాలేదని వివరణ ఇచ్చాను. నేను పార్టీలో, ఉద్యమంలో చేరేనాటికే పారిశ్రామికవేత్తను అనే విషయాన్ని కూడా స్పష్టం చేశాను. ఓ పార్టీ నాయకుడు ఇటీవల పత్రికలో వచ్చిన కథనంపై స్పందించాలని వేదికపై కోరడంతో ఆ పత్రికపై నేను చేసిన కామెంట్లలో రంధ్రాన్వేషణ చేయడం సరికాదు. ఉద్యమ సమయంలో పార్టీ మారాలని వివిధ రకాల ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోలేదు. తెలంగాణ ఉద్యమ పుణ్యానే నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం ఆపడంతో పాటు, సోషల్ మీడియా కూడా నా ప్రసంగ పాఠాన్ని పూర్తిగా విని సంయమనం పాటించాలి’అని మంత్రి ఈటల పేర్కొన్నారు. -
ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషిచేస్తా
సాక్షి, ఖైరతాబాద్ : ముదిరాజ్‌ల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మంత్రి ఈటల పేర్కొన్నారు. మనకెందుకులే అనుకునే స్థాయి నుంచి ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే స్థాయికి ముదిరాజ్‌లు ఎదిగా రన్నారు. ముదిరాజ్‌ల అభ్యున్నతికి కృషి చేసిన కోర్వి కృష్ణస్వామి 126వ జయంతి సందర్భంగా శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిర్వహిం చారు. ఈ సభకు హాజరైన మంత్రి ఈటల మాట్లాడుతూ.. ఉద్యమ బాధ్యతలు నిర్వహిస్తూనే ముదిరాజ్‌ల కోసం కృషి చేశానని తెలిపారు. జాతి సమస్యలు పరిష్కరించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని కలవగా.. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముదిరాజ్‌ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ‘నాకు పాలిచ్చి పెంచిన తల్లి ముదిరాజ్. వారికి అన్ని వేళలా అండగా ఉంటాను’అని ఆయన హామీ ఇచ్చారన్నారు. అన్నట్లుగానే ముదిరాజ్‌ల అభ్యు న్నతి కోసం చేప పిల్లల పంపిణీ, భవనాల ఏర్పాట్లు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఈటల ఉద్యమ నేతగా, సీఎం కేసీఆర్‌కు కుడిభుజంగా ఎదిగారన్నారు. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎంపీ బండప్రకాశ్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో పర్యటించి ముదిరాజ్‌ల అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. -
మళ్లీ ‘ఆరోగ్యశ్రీ’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించాయి. బకాయిల విడుదలకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. మంగళవారం రాత్రి సచివాలయంలో మంత్రి ఈటలతో తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం (తన్హా) ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. నిధుల విడుదలకు మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నామని డాక్టర్లు ప్రకటించారు. దీంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. చర్చల అనంతరం ఈటల మాట్లాడుతూ ఇకపై ప్రతి నెలా ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. సాధ్యమైన మేర బకాయిలు ఎక్కువగా లేకుండా చూస్తామన్నారు. గతంలో లాగా కాకుండా ఎప్పటికప్పుడు హాస్పిటళ్ల యాజమాన్యాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో హాస్పిటళ్లకు ఉన్న ఎంవోయూ వందల పేజీలతో గందరగోళంగా ఉందని, దీన్ని సరళీకరించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామన్నారు. వైద్య సేవల ప్యాకేజీలను కూడా సమీక్షిస్తామన్నారు. అటు ఆసుపత్రులకు, ఇటు రోగులకు ఇబ్బందులు లేకుండా ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైన పథకం అన్నారు. ఆయుష్మాన్‌తో రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలకే వైద్యం అందే అవకాశముందని, తాము 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నామని తన్హా ప్రెసిడెంట్ డాక్టర్ రాకేశ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒప్పందంలోని లొసుగులే సమస్యలకు దారి తీస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ వద్దు, ఆరోగ్యశ్రీ ముద్దు అని ఈ సందర్భంగా రాకేశ్ వ్యాఖ్యానించారు. బుధవారం నుంచి ప్రజలకు యథావిధిగా సేవలందిస్తామని తెలిపారు. ఇక పై తన్హా గౌరవ అధ్యక్షునిగా మంత్రి ఈటల ఉంటారని ఆయన ప్రకటించారు. ఐదు రోజులుగా రోగుల ఇక్కట్లు... ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌కు సంబంధించి బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఈ నెల 16 నుంచి తన్హా హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. అదేరోజు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ బకాయిల లెక్క తేలకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. సుమారు రూ. 1,200 కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు తన్హా పేర్కొనగా బకాయిలు రూ. 600 కోట్లేనని ఆరోగ్యశ్రీ అధికారులు చెప్పడంతో చర్చలు అర్ధంతరంగానే ముగిశాయి. ఈ ప్రతిష్టంభన కారణంగా గత ఐదు రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం నుంచి సోమవారం వరకూ ఐదు రోజులపాటు సమ్మె కొనసాగింది. వేల మంది రోగులు ఇబ్బంది పడ్డారు. -
డాక్టర్‌పై చేయిచేసుకుంటే పదేళ్ల జైలు!
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులు, ఆరోగ్య నిపుణులపై దాడి చేసే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలు కల్పించే ముసాయిదా బిల్లును రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. వైద్యులు, వైద్యసేవా నిపుణులను తీవ్రంగా గాయపరిచిన వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా, అదేవిధంగా, ఆస్పత్రిపై దాడి చేసి నష్టం కలిగించిన వారికి ఆరు నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.50వేల నుంచి 5లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరిచామన్నారు. త్వరలోనే దీనిపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామన్నారు. దీని తర్వాత బిల్లును కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళుతుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో వైద్యులపై దాడికి నిరసనగా జూన్‌లో దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. -
‘మెడికల్’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. ‘నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉంది. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలుశిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉంది. ఇప్పటివరకు అలాంటివారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేది’ అని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన మూడేళ్లలో నెక్ట్స్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)ను నిర్వహించడం ప్రారంభిస్తామన్నారు. ఎన్ఎంసీలో రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న ఎంపీల విమర్శలపై స్పందిస్తూ.. మొత్తం 25 మంది సభ్యుల్లో 11 మంది రాష్ట్రాల ప్రతినిధులేనన్నారు. నెక్ట్స్గ్ పరీక్షను మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షగా, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల(సీహెచ్‌పీ) వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్‌ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్య అభ్యసించని 3.5 లక్షలమంది నాన్ మెడికల్ సిబ్బందికి ఆధునిక వైద్యం అందించే వైద్యులుగా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వ్యతిరేకించారు. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది. ► కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ► కొత్త కమిషన్‌లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్ఆర్డీ శాఖలే సిఫారసు చేస్తాయి. ► ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్‌కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు. ► ఎన్ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి. ► ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు. ► కమిషన్ చైర్మన్‌ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే. ► ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది. ► వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్‌తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. ► దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు. -
ఆరోగ్య మంత్రి మాటలు అమలయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాల కింద దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలను ఓ ప్రజా ఉద్యమంగా ఏర్పాటు చేస్తాం. ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కింద పది కోట్ల మంది పేదలకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెస్తాం’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ జూన్ 3న తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హామీ ఇచ్చారు. అది సాధ్యం కావాలంటే ప్రతి పదివేల మంది జనాభాకు 20 మంది డాక్టర్ల చొప్పున మొత్తం 44.5 శాతం మంది వైద్య సిబ్బంది ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి పదివేల మంది జనాభాకు పది మంది డాక్టర్ల చొప్పున మొత్తం 22.8 శాతం వైద్య సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం దేశంలో 22.8 శాతం వైద్య సిబ్బంది కూడా లేరు. ‘బీఎంజె ఓపెన్’ మెడికల్ జర్నల్ లెక్కల వరకు నేడు దేశంలో ప్రతి పదివేల మంది జనాభాకు 5.9 శాతం డాక్టర్లను కలుపుకొని మొత్తం వైద్య సిబ్బంది (నర్సులు, ఆయాలు, బాయ్‌లు) 20.6 శాతం మంది ఉన్నారు. 2011–12 ఆర్థిక సంవత్సరంలో ఈ వైద్య సిబ్బంది 19 శాతం ఉండగా, కార్పొరేట్ సంస్థలు పలు వైద్య, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటికీ వైద్య సిబ్బంది సంఖ్య ఒకటిన్నర శాతం పెరిగింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్‌లు, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థల నుంచి సేకరించిన వివరాల ద్వారా ఈ లెక్కలు తెలిశాయి. దాదాపు 52 దేశాల్లో వైద్య సదుపాయాలు సరిగ్గా లేవని తెలియడంతో 2006లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి పదివేల మందికి కనీసం 22.8 శాతం వైద్య సిబ్బంది ఉండాలంటూ మార్గదర్శకాలను సూచించింది. 2016లో వాటిని సవరించింది. ఈ దేశంలోనైనా వైద్య సేవలను విశ్వవ్యాప్తం చేయాలన్నా వైద్య సిబ్బంది 44.5 శాతం ఉండాలని నిర్ధారించింది. దీన్ని సాధించాలంటే దేశ బడ్జెట్‌ను మొత్తం ఒక్క వైద్య రంగానికే కేటాయించాల్సి రావచ్చు. అది అసాధ్యం కనుక, కేంద్ర ఆరోగ్య మంత్రి హామీని అమలు చేయడం కూడా అసాధ్యమే. -
ఈబీసీలకు 4,800 ఎంబీబీఎస్ సీట్లు
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడిన వారి కోసం ఈ సంవత్సరం 4,800 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినట్లు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. గడిచిన రెండేళ్లలో మెడికల్ కాలేజీల్లో 24,698 గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయన్నారు. 2019–20లోనే 10,565 గ్రాడ్యుయేట్, 2,153 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయన్నారు. దేశంలో 75 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు, ఇన్స్టిట్యూట్లలో సీట్లు పెంచడానికి కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పారు. ఎంబీబీఎస్ కోర్సుకు అనుమతి వచ్చిన మూడేళ్లలో పీజీ కోర్సును ప్రారంభించడం తప్పనిసరి చేశామన్నారు. జిల్లా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర పథకం కింద కొత్త కాలేజీలు.. 2014 జనవరిలో ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకం కింద 82 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద 60 శాతం నిధులను కేంద్రం, 40 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే, 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు సమకూర్చుతాయి. మొదటి దశలో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 జిల్లా ఆస్పత్రులను గుర్తించి ఆమోదించామని హర్షవర్ధన్ తెలిపారు. ఒక్కో వైద్య కళాశాల స్థాపనకు రూ.189 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తం వైద్య కళాశాలల కోసం రూ.7,507 కోట్లను ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేశామని చెప్పారు. రెండో దశలో 8రాష్ట్రాల్లోని 24 కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి చెప్పారు. -
యువతకు ఉపాధి కల్పిస్తాం: మంత్రి ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన స్థితిగతులు మెరుగుపరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఆళ్ల నాని తెలిపారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించడమే కాకుండా వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది యువకులు మంత్రిని కలిసి తమ జీవనోపాధికి ఉద్యోగాన్ని కల్పించాలని కోరగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టపరుస్తున్నారని, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున వలం టీర్ల ఉద్యోగాలు కల్పిస్తున్నారని, యువత వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపాధి సౌకర్యాలు కూడా కల్పిస్తుందని ఆయన చెప్పారు. వివిధ వృత్తుల్లో స్థిరపడటానికి ఆధునిక సాంకేతిక శిక్షణ కూడా యువతకు అం దించి వారి వృత్తుల్లో నాణ్యత ప్రమాణాలు పెంచుతామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందినప్పుడే తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయగలుగుతారని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యాబోధన అందించడానికి విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో యువత చదువుకునేలా ఆర్థిక ప్రోత్సాహం కూడా ప్రభుత్వం కల్పిస్తుందని.. ప్రతిఒక్కరూ తమ పిల్లలను చదివించడానికే ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప తాత్కాలిక ప్రయోజనాల కోసం షాపుల్లోనో, ఇతర సంస్థల్లో పనిచేయించవద్దని సూచించారు. సమాజంలో ఆర్థిక ప్రగతి సాధించాలంటే ప్రతిఒక్కరూ విద్యావంతులు కావాలని ప్రతి కుటుంబానికి ఆరోగ్యం కల్పించే విధంగా ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎక్కడైనా ప్రమాదం జరిగిన గర్భిణికి వైద్య సేవలు అందించడానికి అవసరమైన వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నెరుసు చిరంజీవి, ఎన్. సుధీర్‌బాబు, అంబికా రాజా, మధ్యాహ్నపు బలరాం, ఎస్ఎంఆర్ పెదబాబు పాల్గొన్నారు. నర్సుల సమస్యలు పరిష్కరిస్తాం రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న నర్సుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని చెప్పారు. నర్సుల అసోసియేషన్ నాయకులు మంత్రి నానిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందచేశారు. దీనిపై డిప్యూటీ సీఎం నాని స్పందిస్తూ నర్సులు అంకితభావంతో పనిచేయాలని ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలే తప్ప వారిపై విసుగు, కోపం చూపించకూడదని వచ్చిన ప్రతిఒక్కరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తే సగం వ్యాధి నయమైనట్లేనని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న ఆసుపత్రులలో వై ద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని నివేదిక రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి అన్ని ప్రభుత్వాసుపత్రులను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చ ర్యలు తీసుకుంటున్నామని సిబ్బంది కూడా కష్టపడి పనిచేస్తే ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రభుత్వపరంగా వైద్యరంగంలో సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి ఎంతో చొరవ చూపుతున్నారని ఇందుకు నిదర్శనమే ఆశావర్కర్ల వేతనాల పెంపు అని మంత్రి అన్నారు. ప్రభుత్వాసుపత్రులలోనే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసిందని, ఈ ఉద్యోగులకు కూడా ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చడానికి సీఎం జగన్మోహన్రెడ్డి సారథ్యంలో సైనికుల్లా పనిచేయడానికి ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని, అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించి మళ్లీ ప్రజాభిమానాన్ని చూరగొంటామని మంత్రి నాని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిరిశాల వరప్రసాద్, మధ్యాహ్నపు బలరాం, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నెరుసు చిరంజీవి, ఎన్.సుధీర్‌బాబు పాల్గొన్నారు. -
రైతును రాజు చేయడమే మా లక్ష్యం
సాక్షి, కరీంనగర్ : కేసీఆర్ కల 'రైతును రాజును చేయడమేమని, స్థానిక 6 మండలాల రైతులు రాజులు కాబోతున్నారని' వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు భూములు నష్ట పోకుండా కాలువలు, తూముల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టారని ఈటెల పేర్కొన్నారు. ఈ కాలువల ఏర్పాటు ద్వారా చొప్పదండీ, రామడుగు, గంగాధర, మల్యాల, పెగడపల్లి, ధర్మారం మండలాల రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు.మండలాల్లో రూ.271కోట్లతో 4 ప్రధాన కాలువలు, తూములు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత 24 సంవత్సరాలుగా ఈ ఆరు మండలాలకు చెందిన ప్రజలు చెరువులో చుక్క నీటిని చూడలేదని తెలిపారు. ఈ కాల్వల నిర్మాణం ద్వారా 31వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. దీంతో రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరబోతుందని ఈటెల స్పష్టం చేశారు. -
కేంద్రం ఆదేశాలు : శారిడాన్‌పై నిషేధం
న్యూడిల్లీ : ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) డ్రగ్స్ విషయంలో ఫార్మా కంపెనీలకు, ప్రభుత్వాలకు సాగుతున్న వివాదం మరింత ముదిరింది. 328 రకాల ఎఫ్డీసీ డ్రగ్స్‌ను వెంటనే తయారు చేయడం, విక్రయించడం ఆపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. సారిడాన్‌తో పాటు చర్మ వ్యాధులకు వాడే పాన్ డెర్మ్, ఆల్కెం ల్యాబోరేటరీస్‌కు చెందిన టాక్సిమ్ ఏజెడ్, మెక్లోడ్స్ ఫార్మా పండెమ్ ప్లస్ క్రీమ్‌లను కూడా ప్రభుత్వం నిషేధించింది. వీటితో పాటు మొత్తం 328 ఎఫ్డీసీ మందులను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. వీటి తయారీని, అమ్మకాలను, పంపిణీని తక్షణం నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. వివిధ కంపెనీలు దాదాపు 6000 బ్రాండ్లతో ఈ ఔషధాలను అమ్ముతున్నారు. ప్రభుత్వ చర్యతో ఈ బ్రాండ్ల అమ్మకాలన్నీ ఆగిపోనున్నాయి. రూ.2000 కోట్ల నుంచి రూ.2500 కోట్ల వరకు వీటి మార్కెట్ సైజు ఉంటుంది. 2016లో మార్చి 10న కేంద్ర ప్రభుత్వం 349 ఎఫ్‌డీసీలను నిషేధించింది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 చట్టంలోని సెక్షన్ 26A ప్రకారం వాటిపై నిషేధం విధించింది. ఐతే కేంద్రం నిర్ణయాన్ని ఫార్మా కంపెనీలు పలు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీంతో గత ఏడాది డిసెంబరులో ఈ ఔషధాల విషయాన్ని పరిశీలించాల్సిందిగా డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ (డీట్యాబ్)ను సుప్రీంకోర్టు కోరింది. ఆ మేరకు పరిశీలన జరిపిన కమిటీ ..వాటిలో 328 ఎఫ్డీసీ ఔషధాలు హానికరమని నివేదిక ఇచ్చింది. వాటిపై నిషేధించడం విధించడం సరేనని తేల్చింది. ఇవి వాడటం వల్ల ప్రజల ఆరోగ్యానికి మరింత నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఎఫ్‌డీసీల తయారీని, విక్రయాలను, పంపిణీని నిరోధించడం అవసరం అని డీట్యాబ్ ఓ ప్రకటన విడుదల చేసింది. -
చెన్నై: గుట్కా స్కాంపై ఆరా తీస్తున్న సీబీఐ
-
గుట్కా స్కాం: మంత్రి, డీజీపీకి సీబీఐ భారీ షాక్
చెన్నై: తమిళనాడులో గుట్కా స్కాంకు సంబంధించి సీబీఐ భారీ సోదాలు నిర్వహించింది. గుట్కా కుంభకోణంలో విచారణలో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలోని 40ప్రాంతాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులు దాడులు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి విజయబాస్కర్, డీజీపి టికె రాజేంద్రన్‌తోపాటు మాజీ పోలీసు కమిషనర్ జార్జ్, ఇతర పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లలో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది. బుధవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన దాడులు సంచలనంగా మారాయి. కోట్లాది రూపాయల గుట్కా కుంభకోణంలో రాష్ట్ర మంత్రి, రాష్ట్ర పోలీసు అధికారులతోపాటు ఇతర ప్రభుత్వ అధికారులకు లంచాలు ముట్టాయన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ భారీ ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మాధవరావు అనే వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ, రహస్య నోటు ఆధారంగా విచారణ చేపట్టాల్సిందిగా డీఎంకే ఎమ్మెల్యే జే అన్బజగన్ దాఖలు చేసారు. దీంతో మద్రాస్ హైకోర్టు ఏప్రిల్‌లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. కాగా 2017జులైలో రూ.250 కోట్ల గుట్కా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డీఎంకే ఎమ్మెల్యే జే అన్బజగన్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు రావడంతో ఐటీ శాఖ కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసం పొయెస్‌గార్డెన్‌లోని వీకే శశికళ గదిలో గుట్కా కుంభకోణానికి సంబంధించిన రహస్య నోటు తమ తనిఖీల్లో దొరికిందని ఇటీవల ఐటీ శాఖ తెలిపింది. ఐటీ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ సూయిజ్ బాబు వర్గీస్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. 2017 నవంబర్‌లో పొయెస్ గార్డెన్‌లోని శశికళ నివాసం ఉన్న గదులను తనిఖీ చేసినప్పుడు ఈ నోటు దొరికిందన్నారు. 2016 ఆగస్టు 11న గుట్కా కుంభకోణంలో జప్తు చేసిన వస్తువులు, పత్రాలకు సంబంధించిన రహస్యనోట్ కూడా అప్పటి సీఎంకు పంపినట్లు అందులో ఉంని తెలిపారు. 2016 సెప్టెంబర్ రెండో తేదీన నాటి డీజీపీ సంతకం చేసి, అప్పటి సీఎం జయలలితకు పంపినట్లు ఉన్నదని పేర్కొన్నారు. 2016 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 16 వరకు ఆరోగ్యశాఖ మంత్రికి రూ.56 లక్షల ముడుపులు చెల్లించారని, మంత్రి, పోలీస్ కమిషనర్లకు ముడుపులు చెల్లించినట్లు డైరీలో రాసుకున్న వివరాలు ఉన్నాయని పేర్కొనడం సంచలనం రేపింది. -
‘నేనొక మంత్రిని.. పిలిస్తే రావా?’
మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ను టార్గెట్ చేసిన మంత్రి.. ఆమెపై మరోసారి ప్రతీకారం తీర్చుకున్నారు. తన మీటింగ్‌కు గైర్హారయ్యారన్న కోపంతో ఆమెను మరోసారి బదిలీ చేయించారు. హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఛండీగఢ్: ఈ నెల 30వ తేదీన మంత్రి అనిల్ విజ్ నేతృత్వంలో పానిపట్‌లో ఓ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బందోబస్తు కల్పించాల్సిందిగా పానిపట్ ఎస్పీ సంగీత కాలియాకు మంత్రి కార్యాలయం నుంచి లేఖ అందింది. అయితే ఆమె మాత్రం ఆ ఆదేశాలను పాటించలేదు.. గైర్హాజరయ్యారు. దీంతో రగిలిపోయిన అనిల్ ఆమెను బదిలీ చేయించాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను గురుగ్రామ్‌లోని భోండ్సిలోని రిజర్స్ బెటాలియన్‌కు కమాండంట్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగీత అసంతృప్తి వెల్లగక్కటంతో.. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల సంఘం ఆమె బాసటగా నిలిచింది. మంత్రి తీరు, అప్రాధాన్యం ఉన్న పోస్టుకు ఆమెను బదిలీ చేయటాన్ని ఖండిస్తూ సీఎంవోకు ఓ లేఖ రాసింది. అయితే అధికారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ‘ఆమెను ప్రత్యేకంగా ఏం బదిలీ చేయలేదని, రాష్ట్రంలో మరికొందరు ఐపీఎస్లతోపాటే ఆమె బదిలీ జరిగిందని’ చెబుతున్నారు. కాగా, మూడేళ్ల క్రితం సంగీత ఫతేబాద్ ఎస్పీగా ఉన్న సమయంలో ఇదే అనిల్ విజ్ ఆమెను బదిలీ చేయించారు. ఓ సమావేశంలో ప్రతిపక్షాల నినాదాలతో గందరగోళం నెలకొనగా, తన ఆదేశాలను పాటించలేదన్న కోపంతో ఊగిపోయిన అనిల్.. తర్వాత సంగీతను ట్రాన్స్ఫర్ చేయించారు. అప్పట్లో ఆ వీడియో వైరల్‌గా అయ్యింది కూడా. -
ఇది ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం : పవన్
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం కన్నా దౌర్భాగ్యం మరేదీ లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 24 గంటల్లో రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిని నియమించకపోతే నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు. బుధవారం స్థానిక టికేఆర్ కల్యాణ మండపంలో ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల కిడ్నీ వ్యాధి బాధితుల కుటుంబ సభ్యులను పవన్ కలుసుకున్నారు. వారి సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారి సమస్యలపై 48 గంటల్లో ప్రభుత్వం స్పందించాలని కోరారు. వ్యాధి మూలలను కనుగొనేందుకు కిడ్నీ సమస్యలపై కమిటీ ఏర్పాటు చేయకపోయినా బస్సు యాత్రను ఆపి మరీ దీక్షకు దిగుతానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి లేదన్నారు. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలి
జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టిన తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని.. అదే తరహాలో తెలంగాణ నుం డి శాశ్వతంగా ఆ పార్టీని తరిమేస్తేనే అభివృద్ధి ఉరకలేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో రూ.1.25 కోట్లతో నిర్మించిన రైతుబజార్‌ను శుక్రవారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు నేడు పనిలేక బస్సు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తు న్న ఘనత తమకే దక్కుతుందని.. ఏటా సంక్షేమ పథకాల కోసం రూ.40వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామని చెప్పారు. అభివృద్ధికి సంబందించి ప్రజల్లో చర్చ జరగాలని, గత పాలన.. టీఆర్ఎస్ పాలనను పోల్చిచూడాల ని కోరారు. కాగా, రోడ్ల వెంట ఇబ్బంది పడకుండా చిరువ్యాపారుల కోసం రైతు బజార్ ఏర్పాటుచేశామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కూరగాయలు కొనుగోలు చేసి తన సతీమణి శ్వేతకు అందజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం బాదేపల్లి మార్కెట్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి లాంఛనంగా ప్రారంబించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. జడ్చర్ల మార్కెట్ చైర్పర్సన్ శోభ, జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీలు లక్ష్మి, దీప, వైస్ చైర్మన్ శ్రీశైలం, డీఎంఓ భాస్కరయ్య, డైరెక్టర్లు గోవర్దన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, జగన్, డీసీఓ అరుణ, ఏడీఏ నిర్మల, సింగిల్ విండో వైస్‌చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్యతో పాటు రమేశ్‌రెడ్డి, ఇమ్ము పాల్గొన్నారు. మద్దతు ధర కోసమే మిడ్జిల్(జడ్చర్ల): రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తూ నష్టపోకుండా ఉండడమే కోసమే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సింగిల్ విండో కార్యాలయం వద్ద కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకొస్తే ఏ గ్రేడ్ క్వింటాకు రూ.1,590, బీ గ్రేడ్‌కు రూ.1,550 చెల్లిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హైమావతి, ఎంపీపీ దీప, తహసీల్దార్ పాండునాయక్, వైస్ ఎంపీపీ సుదర్శన్, సింగిల్ విండో చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు బోయిన్పల్లి శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి నారణ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిరినాయక్, నాయకులు బాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కాడయ్య, వెంకట్, కృష్ణ, సరోజ, ఆచారి, దేవరాజు పాల్గొన్నారు. -
మహిళా జర్నలిస్ట్ పై మంత్రి వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఆరోగ్యమంత్రి సి.విజయభాస్కర్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గురువారం నిర్వహించిన సమావేశానికి హాజరైన విజయభాస్కర్ బయటికొస్తుండగా.. భేటీలో తీసుకున్న నిర్ణయాల విషయమై ఓ మహిళా జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించారు. దీంతో ప్రశ్నల్ని తప్పించుకునేందుకు ‘మేడమ్ మీరు కళ్లద్దాల్లో చాలా అందంగా ఉన్నారు’ అని విజయభాస్కర్ వ్యాఖ్యానించారు. తానెప్పుడూ కళ్లద్దాలు ధరిస్తానన్న ఆమె సమావేశంలో పార్టీ నిర్ణయాలపై మళ్లీ మంత్రిని ప్రశ్నించింది. దీంతో విజయభాస్కర్ ‘మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు’ అని జవాబిచ్చారు. సమావేశం విషయమై పార్టీ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తుందనీ, దీనిపై అన్నాడీఎంకే సీనియర్ నేతలు మాట్లాడతారని స్పష్టం చేశారు. అయినా ఆ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నలు అడగటం మానకపోవడంతో ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అని మంత్రి మరోసారి చెప్పారు. తన వ్యాఖ్యలపై తీవ్రదుమారం చెలరేగడంతో విజయభాస్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రశ్నల్ని తప్పించుకునే క్రమంలోనే తానలా అన్నట్లు చెప్పారు. వ్యాఖ్యలు ఆమెను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానన్నారు. -
ఐసీయూ అలంకారప్రాయం..
ఉట్నూర్(ఖానాపూర్) : ఏజెన్సీ గిరిజనులకు అత్యవసర వైద్యం అంద ని ద్రాక్షగానే మిగిలింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు లక్ష్మారెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి గత నెల 21న ఉట్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అట్ట హాసంగా ప్రారంభిం చిన ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని ఆశపడ్డ ఏజెన్సీవాసులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా ఐసీయూ, డయాలసిస్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిన ఏంబీబీఎస్లను నియమించినట్లు తెలిసింది. గిరిజనులకు వైద్య సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వైద్య సేవలు అందించే వైద్యాధికారులపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా అత్యధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ఐసీయూలో ఎంబీబీఎస్‌లే దిక్కు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సదుపాయాలు మరింత చెరువ చేసేందుకు ప్రభుత్వం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా ఏప్రిల్‌లో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యునిట్)ను రూ. 22 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసింది. ఐసీయూలో విధులు నిర్వహించేందుకు యూనిట్ హెడ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(అనస్థీషియా), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (జనరల్ మెడిసిన్), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (పాల్మనరీ మెడిసిన్)లను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఒక్కొక్కరి చొప్పున ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలాజీ టెక్నీషీయన్, వెంటిలేటర్ టెక్నీషియన్, ఎనిమిది మంది ఎమ్ఎన్వో, ఏఫ్ఎన్వోలు, మూగ్గురు సెక్యూరిటీ గార్డులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేలా చర్యలు చేపట్టింది. ఐసీయూ కేంద్రంలో సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యం, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టం ఏర్పాటు చేశారు. పది పడకల సామర్థ్యం గల యూనిట్ ఆస్పత్రి పర్యవేక్షకుడికి సంబంధం లేకుండా పూర్తిగా స్వయం ప్రతిపత్తి యూనిట్లుగా ఇన్చార్జీల పర్యవేక్షణలో ఉండేలా జాతీయ ఆరోగ్య మిషన్ చర్యలు చేపట్టింది. అయితే ఉట్నూర్ ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నతాధికారుల సూచనలతో ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యాధికారులను ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేలా నియమించినట్లు ఆస్పత్రి సుపరింటెండెంట్ పేర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవలు ప్రత్యేక వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహణ సాగితే మేలు జరుగుతుంది తప్ప ఎంబీబీఎస్ వైద్యులు నిర్వహణ కొనసాగిస్తే ప్రయోజనం ఉండదని గిరిజనులు వాపోతున్నారు. నెప్రాలజీ లేక.. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తశుద్ధి కోసం ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది. ఒకేసారి ఐదుగురు బాధితులకు రక్తశుద్ధి చేసేలా ఐదు డయాలసిస్ యునిట్లు ఏర్పాటు చేసి కేంద్రం నిర్వహణ బాధ్యతలను ‘డీమెడ్’ అనే సంస్థకు అప్పగించింది. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ఇద్దరు టెక్నికల్ అధికారులు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు ఉన్నప్పటికీ డయాలసిస్ సమయంలో బాధితులను అన్ని విధాలా పర్యవేక్షించే అతి ముఖ్యమైన వైద్యాధికారి నెప్రాలజిస్ట్ లేక పోవడంతో కేంద్రం అలంకారప్రాయంగా మారింది. కీడ్నీ బాధితులకు డయాలసిస్ చేసేటప్పుడు అత్యవసరంగా రక్తం అవసరం పడుతుంది. కానీ సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఎప్పుడో మూలకు పడింది. కొత్తగా నిర్మిస్తున్న భవనంలో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నా అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బాధితులకు ఎలా డయాలసిస్ నిర్వహిస్తారో అధికారులకే తెలియాలి. ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వైద్యం అందించాలని ఏజెన్సీ గిరిజనులు కోరుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో సేవలు.. సీహెచ్‌సీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాక ఉన్నతాధికారులు ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యులను ఐసీయూలో విధులు నిర్వహించేందుకు నియమించింది. అయితే వీరికి త్వరలో విడతల వారీగా ఐసీయూలో విధుల నిర్వహణపై శిక్షణ నిర్వహించనున్నారు. కేంద్రం నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే ఐసీయూ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహణ కోసం త్వరలో నెప్రాలజిస్ట్ను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. – వేణుగోపాల్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ ఉట్నూర్ -
‘తెలంగాణలో బస్తీ దవాఖానాలు’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను విస్తరిస్తామని వైద్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. మొట్టమొదట హైదరాబాద్ లో 50 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తామని, ఈనెలలో పాతబస్తీలో 4 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని చెప్పారు. బస్తీ దవాఖానాల కోసం డాక్టర్ల నియామకం చేపడతామని, కొత్తగా 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆహార భద్రతకు సంబంధించి కీలక అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. ఇక నుంచి హోటళ్లు, ఆహార పరిశ్రమలకు గ్రేడింగ్ ఇస్తామని.. స్టార్ హోటళ్లతరహాలో వర్గీకరిస్తామని చెప్పారు. సిద్ధిపేట-మహబూబ్‌నగర్, నల్గొండ-సూర్యాపేటలో జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని జేపీ నడ్డాను కోరినట్టు వెల్లడించారు. బీబీ నగర్ ఎయిమ్స్, జిల్లా ఆస్పత్రులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. -
విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు
-
విడ్డూరం: మంత్రి ఇంట్లోకి వర్షపు నీరు
లక్నో: ప్రభుత్వ ఏజెన్సీల పనితీరు ఎంత దారుణంగా ఉంటుందో చూస్కోండంటూ ఏకంగా ఓ మంత్రే తన ఇంట్లో వర్షపు నీరు లీకేజీ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి సిధార్థ్ నాథ్ సింగ్ ఇంట్లో పై కప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. వెంటనే తన ట్విట్టర్ లో ఆయన ఆ వీడియోను పోస్ట్ చేశారు. ‘మంత్రుల బంగళాలో ఎంత దయనీయమైన స్థితి ఉందో చూడండి. ప్రభుత్వ ఏజెన్సీలపైనే ఇంకా ఆధారపడి ఉన్నాం. మెరుగైన సదుపాయాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ సిధార్థ్ ఓ సందేశం ఉంచారు. గత ప్రభుత్వ(అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ) నిర్లక్ష్యం ఇదేనంటూ మంత్రి సిధార్థ్ విమర్శించారు. వంట గదిలో పై కప్పు నుంచి నీరు కారుతుండటం, కింద ఐదు బకెట్లలో వాన నీటిని పడుతుండటం వీడియోలో చూడొచ్చు. -
ఖాళీగా కాళోజీ వర్సిటీ
మొదలుకాని పూర్తిస్థాయి పాలన - ఖాళీలను భర్తీ చేయని యంత్రాంగం - 82 పోస్టులు మంజూరు.. - ఖాళీగా 61 పోస్టులు - పట్టించుకోని వైద్య ఆరోగ్య మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఏర్పాటైన కాళోజీ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా వర్సిటీలో పూర్తిస్థాయి పరిపాలన సాగట్లేదు. గతంలో రాష్ట్రంలోని సగం సీట్లనే వర్సిటీ భర్తీ చేసేది. గతంతో పోల్చితే వర్సిటీపై పనిభారం పెరుగుతోంది. నీట్ పరీక్ష నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లోని సీట్లన్నింటినీ కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలోనే భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులతో ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ నిర్వహణకు అవసరమైన పోస్టులను ప్రభు త్వం మంజూరు చేసినా.. భర్తీ చేయడంపై దృష్టి పెట్టట్లేదు. వర్సిటీ ఉన్నతాధికారులు సైతం పోస్టుల భర్తీ విషయాన్ని పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో వైద్య విద్య నిర్వహణలో కీలకమైన వర్సిటీపై ఆ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి సమీక్షించ కపోవడం వల్లే పోస్టుల భర్తీ ప్రక్రియను ఎవరూ పట్టించు కోవట్లేదనే అభిప్రాయముం ది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వైద్య విద్య నిర్వహణ చూసేది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో 2014 సెప్టెంబర్ 26న కాళోజీ ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక వైస్ చాన్సలర్‌ను, రిజిస్ట్రార్ నియమించింది. వర్సిటీ నిర్వహణకు అవసరమై 82 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 22 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ గతేడాది జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమ తిచ్చి ఏడాదిన్నర గడిచినా వర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవట్లేదు. వైద్య శాఖలో, ఇతర వర్సిటీల్లో పని చేస్తున్న 21 మందిని డిప్యూటేషన్ పద్ధతిలో నియమిం చారు. దీంతో 61 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మిగతా ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఇటీవలే రెండు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేశారు. ఒకే ఏజెన్సీకి ఈ కాంట్రాక్టు అప్పగించాల్సి ఉండగా.. మంత్రి పేషీలోని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి మేరకు 2 సంస్థలకు అప్పగించినట్లు తెలి సింది. ప్రస్తుత ఏడాది వైద్య విద్య కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయ్యేలోపు ఈ ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. -
ఏపీఎంఎస్ఐడీసీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆటోనగర్‌లో దీనిని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులకు మౌలిక వసతుల కల్పనలో ఏపీఎంఎస్ఐడీసీ కీలక పాత్ర వహిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్ది అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. రూ.128 కోట్లతో రాష్ట్రంలోని 250 ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పించడంతో పాటు ప్రతి ఆసుపత్రిలోను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులలో వైద్యుల కొరతను అధిగమించేందుకు త్వరలో 828 మంది డాక్టర్లను నియమిస్తున్నామని తెలిపారు. 301 మందిని ఏపీపీఎస్సీ ద్వారా తీసుకుంటున్నామని, మరో 527 మంది డాక్టర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుని ప్రతి ఆసుపత్రిలో డాక్టర్లను నియమిస్తామని వివరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వైద్యపరంగా ఎంతో నష్టపోయామన్నారు. అన్ని భవనాలను హైదరాబాద్‌లోనే వదిలేయాల్సి వస్తోందని తెలిపారు. హైదరాబాద్ ఎలా మెడికల్ హబ్‌గా ఉందో రాబోయేకాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు రాజధాని అమరావతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా చేస్తామని చెప్పారు. -
‘ఏ సమస్య వచ్చినా ఆర్‌ఎంవోలదే బాధ్యత’
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఎక్కడ సమస్య వచ్చినా ఆర్‌ఎంవోలదే బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. బుధవారం ఆయన గాంధీ దవాఖానను సందర్శించి, రెండు గంటలపాటు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు. విధులను నిర్లక్ష్యం చేయటంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోనట్లుగా తేలిన ఆర్ఎంవో, డిప్యూటీ సివిల్ సర్జన్ సరస్వతిని డీఎంఈకి సరెండర్ చేయాలని ఆదేశించారు. ఇంకా...నెల రోజుల్లో ఇక్కడ 65 పడకల ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి అధునాతన యంత్ర పరికరాలతో మరో ల్యాబ్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గాంధీలో ప్రస్తుతం 100 బెడ్లు ఉండగా 2వేల ఇన్ పేషెంట్లకు చికిత్స అందుతోందని వివరించారు. ఇకపై వైద్యులకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 157 పీజీ సీట్లు తెలంగాణకు ఇవ్వడం గొప్ప ఘనత అని చెప్పుకోవచ్చునన్నారు. గాంధీలో కొందరు బయటి వ్యక్తులు పెత్తనం చేస్తున్నారని, ప్రమేయాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు. నర్సుల భర్తీకి ఈ వారంలో నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు. సాయి ప్రవళిక మృతిపై ఆయన మాట్లాడుతూ.. పాప బతకదని వైద్యులు ముందే డిక్లేర్ చేశారని, కావాలనే ఆ ఘటనఽను ఇష్యూ చేశారు. మీడియాను కొంత మంది పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఽఈ కార్యక్రమంలో డీఎంఈ రమణి, గాంధీ వైద్యశాల ప్రిన్సిపాల్, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ మంజుల తదితరులు పాల్గొన్నారు. -
కిమ్ సోదరుడు ఎన్నినిమిషాల్లో చనిపోయాడంటే..
కౌలాలంపూర్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు అత్యంత వేగంగా ప్రాణాలు కోల్పోయాడని మలేషియా ప్రభుత్వం తెలిపింది. విష ప్రయోగం కారణంగా సంభవించిన కిమ్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ మరణంపై ఆదివారం మలేషియా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన చేస్తూ సరిగ్గా 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో నామ్ మృత్యువాత పడ్డారని చెప్పారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఈ నెల(ఫిబ్రవరి) 13న నామ్‌పై ఇద్దరు మహిళలు విషప్రయోగం చేయడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయారు. శుక్రవారం ఆయన పోస్టుమార్టం వివరాల్లో మలేషియాలో నిషేధించిన పవర్ఫుల్ కెమికల్ విషపదార్థం వీఎక్స్ నెర్వ్‌ను దాడి చేసినవాళ్లు ఉపయోగించడం వల్లనామ్ చనిపోయారని తెలిసింది. అసలు నామ్‌కు మలేషియా పోస్టుమార్టం చేయడమేమిటని ఉత్తర కొరియా మండిపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం ఆ రెండు దేశాల మధ్య కొంత వైరుధ్యాలు తీసుకొస్తున్న నేపథ్యంలో నామ్‌పై దాడి, వైద్యం, చావు, పోస్టుమార్టం, ఇలా ప్రతి విషయంలో స్పష్టతను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నామ్ మృతిపై అనుమానాలు తొలిగేలా అక్కడి ఆరోగ్యశాఖమంత్రి సుబ్రహ్మణ్యం సదాశివం ఓ ప్రకటన విడుదల చేశారు. మోతాదుకు మించిన వీఎక్స్ విషయం ఇవ్వడం వల్లే నేరుగా అతడి గుండెపై ప్రభావం చూపి అనంతరం ఊపరితిత్తులు ఇలా శరీరంలోని ప్రధాన భాగాలపై తదనంతరం మొత్తం శరీరంపై ప్రభావం చూపి మృత్యువాత పడేలా చేసిందని అన్నారు. పది మిల్లిగ్రామ్ల వీఎక్స్ నెర్వ్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. మొత్త నాడీ వ్యవస్థనే ఈ విషం ఒక్కసారిగా కుప్పకూల్చగలదని అన్నారు. -
ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని నందికొట్కూరు రోడ్డులో ఆదివారం ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆసుపత్రిలోని ఓటీ కాంప్లెక్స్, సర్జికల్ ఆంకాలజి బ్లాక్, ఎంఐసీయూ, డిజిటల్ మామోగ్రఫి, కన్సల్టేషన్ రూమ్స్, రేడియేషన్ ఆంకాలజి బ్లాక్, మెడికల్ ఆంకాలజి వార్డు, సిటీ స్కాన్, బ్రాచీథెరపీ, లైనియర్ యాక్సిలేటర్‌ను రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ప్రారంభించారు. ప్రైవేటు ఆసుపత్రులతోనూ అభివృద్ధి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూనే మరోవైపు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రోత్సాహిస్తుందన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ త్వరలో రూ.120కోట్లతో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభం కాబోతుందని చెప్పారు. మెరుగైన క్యాన్సర్ చికిత్స కోసం గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ వెళ్లేవారని, ఇప్పుడు కర్నూలులోనే ఆ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరం మెడికల్ హబ్‌గా మారబోతుందన్నారు. ఒమెగా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మోహనవంశీ మాట్లాడుతూ రాయలసీమలో మొట్టమొదటిసారిగా అత్యున్నత శ్రేణి క్యాన్సర్ చికిత్సను తాము అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ వై. వెంకటరామిరెడ్డి, డాక్టర్ బి. రవీంద్రబాబు, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషి
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 94 లక్షల మంది పిల్లలకు నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి తెలిపారు. చిన్నారుల్లో శారీరక బలహీనతను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడు తున్నట్లు వెల్లడించారు. గురువారం ఇక్కడ అంబర్‌పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నులిపురుగుల నివారణ మందుబిళ్లలను అందించారు. నులిపురుగుల నివారణపై అవ గాహన పోస్టర్లను, క్యాలెండర్లను ఎమ్మె ల్యే కిషన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ లలితా కుమారితో కలసి మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ త్వరలో ఆర్బీఎస్కె (రాష్ట్రీయ బాల వికాస కార్యక్రమం)తో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిం చారు. పుట్టుకతో వచ్చే వ్యాధులను విద్యా ర్థుల జనన ధ్రువీకరణపత్రం ఆధారంగా గుర్తించి బాలల వికాసానికి కృషి చేస్తామ న్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మోడ్రన్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో ప్రా«థమిక ఆరోగ్యకేంద్రం స్థాయిని బట్టి డయాగ్నోస్టిక్ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తామన్నారు. నిలో ఫర్, గాంధీ ఆస్పత్రుల ఘటనలపై మంత్రిని ప్రశ్నించగా పరిశీలిస్తామన్నారు. నేడు నివారణ మాత్రల పంపిణీ నులిపురుగుల నివారణ కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారందరికీ ఈ మాత్రలను అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో పంపిణీ చేసేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. -
ఆ సెలైన్‌లో పురుగుల్లేవ్: మంత్రి
హైదరాబాద్: చిన్నారి ప్రవళిక మృతిని వివాదాస్పదం చేయడం సరికాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రవళికది సహజమరణమే అని, వారి కుటుంబసభ్యులను తామెవరం బెదిరించలేదన్నారు. సెలైన్ బాటిల్లో పురుగు ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని, చిన్నారి తండ్రి కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. నీలోఫర్‌లో బాలింతల మృతిపై సైతం లక్ష్మారెడ్డి స్పందించారు. బాలింతల మృతి వాస్తవమే అన్న ఆయన.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనారోగ్యంతో రెండు నెలల కిందట గాంధీ అసుపత్రిలో చేరిన జనగాం జిల్లాకు చెందిన సాయి ప్రవళిక అనే చిన్నారి మంగళవారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. చిన్నారికి ఎక్కించిన సెలైన్‌లో పురుగులున్నాయన్న ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు స్పందించారు. -
డయాబెటిస్‌పై ప్రజలకు అవగాహన పెంచాలి
–ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కర్నూలు(హాస్పిటల్):డయాబెటిస్ వ్యాధి రాకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజి విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ డయాబెటిస్ డేను పురస్కరించుకుని సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి మార్నింగ్ వాక్‌ను మంత్రి కామినేని ప్రారంభించారు. కళాశాల నుంచి రాజవిహార్, కిడ్స్‌వరల్డ్, పాత కంట్రోల్‌రూమ్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు మార్నింగ్ వాక్ సాగింది. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ చాలా మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు తెలియదన్నారు. పరీక్షలు చేయించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలని వైద్యులకు సూచించారు. సరైన రీతిలో వ్యాయామం చేస్తే ఈ వ్యాధిని కొంత వరకు నియంత్రించవచ్చని తెలిపారు. చక్కెర వ్యాధి రాకుండా ముందుజాగ్రత్తల్లో భాగంగా రాష్ట్ర మహిళా చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో రాజ్యసభ్య సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామ్‌ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ప్రభాకరరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హెల్త్‌క్లబ్‌లో మంత్రి కామినేని శ్రీనివాస్ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హెల్త్‌క్లబ్‌ను మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా క్లబ్లో ఏర్పాటు చేసిన జిమ్‌లోని పరికరాలను పరిశీలించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ జీఎస్ రామ్‌ప్రసాద్‌తో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి హెల్త్‌క్లబ్ ఎక్కడా లేదని, ఇలాంటి క్లబ్‌లను రాష్ట్రంలో అన్ని చోట్లా ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడుకు సూచిస్తానన్నారు. -
క్యాన్సర్‌వార్డు నిర్మాణానికి రూ. 120 కోట్లు
పెద్దాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కామినేని –ఏపీఎంఎస్ఐడిసి ఈఈ బదిలీకి సిఫారసు కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాన్సర్‌వార్డు నిర్మాణానికి రూ. 120 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. సోమవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా పెద్దాసుపత్రిని తనిఖీ చేశారు. ముందుగా ఆయన ఆసుపత్రిలోని ఓపీ టికెట్ కౌంటర్ విభాగాలను పరిశీలించారు. రోగులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా అవసరమైనన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడ నుంచి సూపర్‌స్పెషాలిటీ విభాగాలను పరిశీలించారు. మధ్యలో పాత సర్జికల్ వార్డులు శిథిలావస్థలో కనిపించడం, పైపులైన్ పనులు జరుగుతుండటాన్ని ఆయన గమనించారు. పనులపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్వహణ పనుల కోసం రూ.3.5కోట్లు విడుదల చేస్తే ఇప్పటికీ పనులు పూర్తికాలేదంటూ మండిపడ్డారు. పాతభవనాలన్నీ కూలగొట్టాలని చెప్పినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ఎక్కడంటూ ఆరా తీశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ శాఖ ఎండీతో ఫోన్లో మాట్లాడారు. మీ అధికారుల పనితీరు ఏం బాగాలేదని, మీరే వచ్చి ఒకసారి పనులు పరిశీలించాలని చెప్పారు. వెంటనే ఈఈ ఉమాశంకర్‌ను రీకాల్ చేసి మారుమూల ప్రాంతానికి బదిలీ చేయాలంటూ ఫోన్లో ఆదేశించారు. అనంతరం ఆయన సూపర్‌స్పెషాలిటీ విభాగాలను సందర్శించారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేజ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు తదితరులు ఉన్నారు. -
కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం
– మంత్రి కామినేని శ్రీనివాస రావు నూనెపల్లె: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఆసుపత్రిలో నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస రావు మాట్లాడుతూ ఖరీదైన కార్పొరేట్ డయాలసిస్ కేంద్రాన్ని నంద్యాల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 28 రకాల ఖరీదైన పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గర్భిణుల కోసం 102 కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. తల్లి, బిడ్డ సంరక్షణ మొదలు కాన్పులు చేసే వరకు తమదే బాధ్యత అన్నారు. నూతనంగా 108 వాహనాలను కొనుగోలు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్బన్‌హెల్త్ సెంటర్లను పటిష్ట పరుస్తున్నామన్నారు. అపోలో ఆధ్వర్యంలో వీటి నిర్వహణ చేపట్టి క్షేత్రస్థాయి నుంచే పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నంద్యాల ఆసుపత్రిలో సిబ్బంది కొరతను త్వరలోనే తీరుస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఏపీ వైద్య విధాన పరిషత్ జాయింట్ డైరెక్టర్ జయచంద్రారెడ్డి, డీఎంఅడ్‌హెచ్‌ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, బీజేపీ నాయకులు ఇంటి ఆదినారాయణ, సూర్యనారాయణ రెడ్డి, డీసీహెచ్ డాక్టర్ రామకృష్ణరావు, సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. కాగా ఆసుపత్రిలో అభివృద్ధి పనులు చేపట్టాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రుడు, ఏపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగనవీన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. -
మంత్రి సీరియస్: నలుగురు వైద్యులపై వేటు
-
మంత్రి సీరియస్: నలుగురు వైద్యులపై వేటు
గుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి... పసికందు మృతి చెందడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన నలుగురు వైద్యులను సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు రూరల్ మండల పరిధిలోని దాసరిపాలెంకి చెందిన జగన్నాథం నాగబాబు ఆటోడ్రైవర్. అతని భార్య భవానికి పురుటి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా ఉదయం 7.20 గంటలకు మగబిడ్డ పుట్టాడు. అరగంట తర్వాత బిడ్డ చనిపోయాడంటూ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా డెత్ సర్టిఫికేట్‌తో సహా వారి చేతిలో పెట్టారు. దీంతో వారు కన్నీరుమున్నీరు అవుతూ బిడ్డ మృతదేహాన్ని తీసుకుని... ఆటోలో ఇంటికి పయనమైయ్యారు. ఇంతలో పసికందులో కదలిక వచ్చింది. ఆ విషయాన్ని గుర్తించి... మళ్లీ ఆసుపత్రికి తీసుకుచ్చారు. దీంతో నాలుక్కరుచుకున్న వైద్యులు హడావుడిగా శిశువును ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు.అయితే ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పసికందు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆరోగ్య మంత్రి అడ్రస్ లేరు గానీ..
ఒకవైపు దేశ రాజధానిలో చికన్ గున్యా, డెంగ్యూ లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే జనం వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాత్రం.. వచ్చే ఏడాది గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారాలు చూసేందుకు అక్కడకు వెళ్లిపోయారు. ఇప్పటివరకు చికన్ గున్యాతో నలుగురు, డెంగ్యూ.. మలేరియాలతో మరో పది మంది మరణించారు. ఆస్పత్రులన్నీ పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఇక గొంతుకు శస్త్రచికిత్స చేయించుకోడానికి బెంగళూరు వెళ్లిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా.. ఇది తమ బాధ్యత కాదని చెబుతున్నారు. తమకు కనీసం ఒక పెన్ను కొనే అధికారం కూడా లేదని, ఏమైనా కావాలంటే లెఫ్టినెంట్ గవర్నర్‌ని లేదా ప్రధానమంత్రిని అడగాలని అన్నారు. ఢిల్లీ విషయంలో నజీబ్ జంగే అన్ని అధికారాలూ అనుభవిస్తున్నారని ట్వీట్ చేశారు. ఆరోగ్యమంత్రి నగరంలో లేకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా లేరని, ఆయన అమెరికా వెళ్లారని అంటున్నారు. అయితే.. ముఖ్యమంత్రి నగరంలో లేనప్పుడు ఆ బాధ్యతలు చూడాల్సిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఏం చేస్తున్నారా అని ఆరాతీస్తే.. ఆయన ఏదో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫిన్లాండ్ వెళ్లారు. ఢిల్లీలో ఉన్న ఏకైక మంత్రి కపిల్ మిశ్రాను దీని గురించి అడిగితే.. అది కార్పొరేషన్ బాధ్యత అని, మేయర్ నగరంలో లేరని అన్నారు. ఫాగింగ్ చేసి దోమలను నివారించాల్సింది కార్పొరేషనే అని చెప్పారు. CM n min left wid no power now, even to buy a pen. LG n PM enjoy all powers wrt Del. LG abroad.Question them for Del https://t.co/t8ygcZmo1P — Arvind Kejriwal (@ArvindKejriwal) 13 September 2016 -
ఒకే కుటుంబంలో ఇద్దరిని మింగిన డిఫ్తీరియా
– వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం కర్నూలు(హాస్పిటల్): ‘అయ్యా నా పెద్దకుమారుడు వారం క్రితమే ఇదే రోగంతో చచ్చిపోయాడు. ఇప్పుడు అదే రోగం నా చిన్నకుమారున్నీ పట్టుకుంది. ఈ ఆసుపత్రిలో చూస్తే డాక్టర్లు మందులు లేవంటున్నారు. అప్పులు చేసి ముంబయి నుంచి రూ.18వేలు పెట్టి మందులు తెప్పించినాము. నా బిడ్డను ఎలాగైనా బతికించండయ్యా...’ అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఓ పేద కుటుంబం మొరపెట్టుకుంది. వారి మాటలు చెవికెక్కించుకోకుండానే మంత్రి అక్కడ నుంచి వెళ్లిపోయారు. పేద కుటుంబం తెచ్చుకున్న ఖరీదైన మందులను సైతం వెంటనే వాడకుండా వైద్యులు తాత్సారం చేశారు. ఫలితంగా ఆ పేద కుటుంబం రెండో కుమారున్ని కూడా పోగొట్టుకుంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన ఎంగన్న, నాగలక్ష్మమ్మల పెద్ద కుమారుడు శివయ్య రెండు వారాల క్రితం డిఫ్తీరియాతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరి చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయాడు. ఇదే వ్యాధి వారి చిన్న కుమారుడు శివరాముడుకు కూడా సోకింది. అతన్ని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం మళ్లీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకొచ్చారు. ఖరీదైన మందులు వాడితే గానీ రోగం తగ్గదని, ఆ మందులు ఇక్కడ లేవని డాక్టర్లు చెప్పడంతో వారి గుండెపగిలిగింది. ఊళ్లో అప్పులు చేసి డాక్టర్లు చెప్పిన మేరకు మందులను ముంబయి నుంచి ఆఘమేఘాలపై తెప్పించారు. అప్పటికే వారు బాలుని ఆరోగ్యం కోసం రూ.30వేల దాకా ఖర్చు చేశారు. పెద్దకుమారుని కోసం మరో రూ.10వేలు ఖర్చు పెట్టారు. ఇదే తరుణంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ నెల 11న ఆసుపత్రిని తనిఖీ చేశారు. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న బాలుడు శివరాముడును చూసి అతనికున్న వ్యాధి గురించి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా బాలుని తల్లిదండ్రులు మంత్రితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అలాగా.. అనే నిట్టూర్పుతో మంత్రి సరిపెట్టారు. బాలుని ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెట్టండన్న భరోసాను అధికారులకు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత అంత ఖరీదైన మందులు ఎవరు కొనమన్నారంటూ శివరాముడు తల్లిదండ్రులను వైద్యులు నిలదీశారు. డాక్టర్లు చెప్పినందుకే కొన్నామని చెప్పినా పట్టించుకోలేదు. పైగా తెచ్చిన మందులను సైతం కొన్నాళ్ల పాటు వాడకుండా పెట్టేశారనే విమర్శలు ఉన్నాయి. ఈలోగా బాలుని ఆరోగ్య పరిస్థితి వికటించి మంగళవారం మతి చెందాడు. మంత్రి, అధికారులు స్పందించి ఉంటే తమ కుమారుడు దక్కేవాడని, మాయదారి రోగానికి తమ ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నామని బాలుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా డిప్తీరియా వ్యాధి లక్షణాలతో గత సంవత్సరం 47 మంది, ఈ యేడాది 15 మంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందారు. వీరి గళ్లను పరీక్షించిన కర్నూలు మెడికల్ కాలేజి మైక్రోబయాలజి ల్యాబ్ అధికారులు ఏ ఒక్కరికీ డిఫ్తీరియా సోకలేదని నివేదిక అందజేశారు. అయితే చిన్నారులు ఎందుకు చనిపోతున్నారో మాత్రం చెప్పలేకపోతున్నారు. -
24 గంటలు వైద్య సేవల కోసం స్పెషల్ యాప్
-
108 ఉద్యోగుల వేతనాల పెంపు
♦ సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆరోగ్య మంత్రికి సీఎం ఆదేశం ♦ త్వరలోనే ఉద్యోగులు, అధికారులతో చర్చలు సాక్షి, హైదరాబాద్: ‘108’ ఉద్యోగుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని... ఉద్యోగులు, అధికారులతో మాట్లాడి వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అందించే 108 అంబులెన్స్‌లను, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించే 104 వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా పోలీస్, వైద్యశాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వైద్య శాఖపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇటీవల సీఎంతో ముఖాముఖిలో వరంగల్ జిల్లాకు చెందిన 108 ఉద్యోగి రమేశ్ ప్రస్తావించిన అంశాలపై చర్చించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 108 అంబులెన్స్ సేవల మెరుగుదలకు, విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి లక్ష జనాభాకు ఒక 108 చొప్పున 312 వాహనాలుండేవన్నారు. తాము 75 వేల జనాభాకు ఒకటి చొప్పున 108 ఉండాలని నిర్ణయించామని, ఫలితంగా 169 అంబులెన్స్‌లు పెరిగాయని చెప్పారు. వీటిలో 145 వాహనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, మిగతావి కొద్ది రోజుల్లోనే సేవలందిస్తాయని సీఎం పేర్కొన్నారు. ఇక ప్రధాన రహదారుల వెంట ప్రమాదాలతో అపార ప్రాణనష్టం జరుగుతోందని... దీన్ని నివారించడానికి పోలీసులు, వైద్య శాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంట ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని, కావాల్సిన వైద్య పరికరాలన్నీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రహదారుల వెంట పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లుఉండాలని, ట్రామా సెంటర్లు ఆన్లైన్ హెల్త్‌కేర్ సేవలను ఉపయోగించుకునే ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామీణ డాక్టర్లకు నగదు ప్రోత్సాహకం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి, అక్కడ పనిచేస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహకం అందించే ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు సమీప పట్టణంలో ఉండే వెసులుబాటు కల్పించాలని, అదే సమయంలో డాక్టర్లు కచ్చితంగా సమయ పాలన పాటించి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. నాలుగు పెద్దాసుపత్రులకు స్థలాన్వేషణ హైదరాబాద్‌లో 4 పెద్దాసుపత్రులు నిర్మించాలని నిర్ణయించినందున వెంటనే స్థలాల గుర్తింపు జరగాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఇప్పటికే గుర్తించిన కొన్ని స్థలాల వివరాలను సీఎంకు మంత్రి లక్ష్మారెడ్డి అందజేశారు. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మరోసారి చర్చించి అనువైన స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని వాటి ఫలితం పేదలకు అందేలా పనిచేయాలని సూచించారు. -
భారత్‌లో 21.17 లక్షల హెచ్ఐవీ రోగులు
న్యూఢిల్లీ : భారత్‌లో హెచ్ఐవీ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ప్రస్తుతం 21.17 లక్షల మంది హెచ్ఐవీ రోగులతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో మంత్రి నడ్డా మాట్లాడుతూ... 68 లక్షల మంది హెచ్ఐవీ రోగులతో దక్షిణాఫ్రికా మొదటి స్థానం ఆక్రమించగా... 34 లక్షలతో నైజీరియా రెండో స్థానంలో నిలిచిందన్నారు. అయితే దేశంలో కొత్త హెచ్ఐవీ కేసుల నమోదు సంఖ్య తగ్గిందన్నారు. ఈ కేసుల సంఖ్య తగ్గించడం ఈ ప్రభుత్వానికి ఓ చాలెంజ్ అని జె.పి.నడ్డా అభిప్రాయపడ్డారు. -
వైద్య పరికరాల కొనుగోలుకు రూ. 16 కోట్లు
ప్రభుత్వ ఆస్పత్రిలో అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ. 16 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన ఆయన ఐసీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన డయగ్నస్టిక్ ల్యాబరేటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రులలో అధునాతన పరికరాలు కొనుగోలు చేస్తామని అందుకోసం తక్షణం రూ. 16 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
క్యాట్ ఫినిష్
అక్రమంగా క్యాట్ ఫిఫ్ సాగు చెలరేగిపోతున్న తెలుగు తమ్ముళ్లు కోట్లు సంపాదిస్తున్న వేస్ట్ఫుడ్ మాఫియా వైద్య శాఖ మంత్రి ఇలాకాలో {పజారోగ్యానికి ముప్పు కొల్లేరు కేంద్రంగా నిషిద్ధ క్యాట్‌ఫిష్ మాఫియా చెలరేగిపోతోంది. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగు చేసేస్తున్నారు. ఈ చేపల్ని తింటే ఒళ్లు గుల్లవడం ఖాయమని తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం క్యాట్‌ఫిష్ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతోంది. కొల్లేరు అభయారణ్యంలో మడుగులు ఏర్పాటుచేసి మరీ ఈ సాగు చేపట్టారు. వీటికి కోళ్ల వ్యర్థాలు, మిగిలిపోయిన అన్నం, కూరలను మేతగా వేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలా వ్యర్థాల రవాణా ద్వారా ప్రతి నెలా రూ.150 కోట్ల టర్నోవర్ సాగిస్తున్నారు. సాక్షాత్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇలాకాలోనే ఇంత దారుణం జరుగుతున్నా ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం. కైకలూరు : కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్ సాగు అధికార పార్టీ నేతల అండతో జోరుగా జరుగుతోంది. టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జిల్లా హద్దుల్లోని కొల్లేరు ప్రాంతం నుంచి రోజూ 10 టన్నుల క్యాట్‌ఫిష్‌ను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇక్కడ కేజీ రూ.30కి కొనుగోలు చేసి అక్కడి మార్కెట్లో రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఏటి చేపలుగా చెప్పి వీటిని ఇతర రాష్ట్రాల్లోని మత్స్యప్రియులకు అంటగడుతున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం.. కేంద్ర ప్రభుత్వం 2007లో క్యాట్‌ఫిష్ పెంపకంపై నిషేధం విధించింది. ఆఫ్రికాకు చెందిన ఈ చేప కోడిఈకలు, పేగులు వంటి వ్యర్థాలను మేతగా తింటుంది. ఇవికాక నిల్వఉన్న అన్నం, కూరల్ని కూడా ఆహారంగా తీసుకుంటుంది. వీటన్నింటినీ నిత్యం రవాణా చేసే మాఫియా జిల్లాతోపాటు సమీప పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది. ఈ వేస్ట్ఫుడ్ మాఫియా నెలకు రూ.150 కోట్ల ఆదాయం పొందుతోంది. మనోడే వదిలేయండి.. కొల్లేరు అభయారణ్యంలో జీవో నంబరు 120 ప్రకారం చేపల సాగు నిషేధం. అలాంటిది ఏకంగా ప్రాణహాని చేసే క్యాష్ఫిష్నే సాగు చేస్తున్నారు. కొవ్వాడలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక, నుచ్చిమల్లి, శృంగవరప్పాడు, పెంచికలమర్రు గ్రామాల్లో రహస్యంగా క్యాట్‌ఫిష్ సాగు జరుగుతోంది. కొల్లేరులో మడుగులు ఏర్పాటు చేసి వీటికి మేతలు వేస్తున్నారు. అధికారులు దాడులు చేస్తే అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. మనోడే వదిలేయండని సిఫారసు చేయడంతో అధికారులు రెండు, మూడు కేసులకే పరిమితమవుతున్నారు. క్యాట్‌ఫిష్ సాగు చట్ట విరుద్ధం కేంద్ర ప్రభుత్వం క్యాట్‌ఫిష్ సాగును నిషేధించింది. పోలీసు, రెవె న్యూ, మత్స్యశాఖ అధికారుల బృందం సాగుదారులపై కేసులు నమోదు చేసే విధంగా చట్టం రూపొందించారు. ఆక్వాసాగులో మేతల ధరలు పెరగడంతో కొందరు క్యాట్‌ఫిష్ సాగు వైపు చూస్తున్నారు. క్యాట్‌ఫిష్ చేపల ఉత్పత్తులు పెరిగితే ఆ ప్రభావం పెంపకం చేపలపై పడుతుంది. -పి.సురేష్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, మచిలీపట్నం. -
‘భాస్కరుడి’కి అమ్మ అభయం
చెన్నై : ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌కు సీఎం జయలలిత అభయహస్తం ఇచ్చారు. ఇంటెలిజెన్స్ విచారణ మంత్రికి అనుకూలంగా రావడంతో పదవీ గండం తప్పినట్టు అయింది. కులచిచ్చుతో వీరంగం సృష్టించే వాళ్లకు చెక్ పెట్టే రీతిలో మంత్రికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లకు అమ్మ ఉద్వాసన పలకడం అన్నాడీఎంకే వర్గాలకు షాక్ ఇచ్చినట్టు అయింది. అన్నాడీఎంకే సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తరచూ మంత్రివర్గంలో మార్పులు జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం మంది మంత్రులపై వచ్చిన పలు రకాల ఆరోపణలు, ఫిర్యాదులే కారణంగా చెప్పవచ్చు. ఏ మంత్రిపైన అయినా సరే చిన్న పాటి ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే చాలు తక్షణం జయలలిత స్పందించడం జరుగుతోంది. మంత్రిపై ఫిర్యాదులు వచ్చినా, ఆయనకు వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు వచ్చినా, అన్నాడీఎంకే కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చినా, ఆయా జిల్లాల్లోని నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కినా ఆ మంత్రి పదవి ఊడినట్టే. మరోచాన్స్ అంటూ లేని రీతిలో పదవులు ఊడుతూ వస్తున్నాయి. కొందర్ని క్షమించి మళ్లీ ఆహ్వానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా జయలలిత నమ్మిన బంట్లు, పలువురు ముఖ్య, కీలక నాయకుల పదవులు ఊడిన సందర్భాలు అనేకం. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మంత్రికి వ్యతిరేకంగా కొన్ని జిల్లాల్లో ఏకంగా కుల వివాదాలతో చిచ్చు రగిలినా చివరకు పదవీ గండం నుంచి ఆ మంత్రి తప్పించుకోవడం గమనార్హం. ఆరోగ్య మంత్రి విజయ్‌కు ఉద్వాసన పలికిన తర్వాత ఆ శాఖకు పుదుకోట్టై జిల్లా విరాళి మలై ఎమ్మెల్యే విజయ భాస్కర్‌కు అప్పగించారు. స్వతహాగా వైద్యుడు కావడంతో విజయ భాస్కర్ ఆరోగ్య శాఖ మీద పూర్తి పట్టు సాధించారని చెప్పవచ్చు. రెండేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత నెల సొంత జిల్లా పుదుకోట్టైలో మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే బయలుదేరింది. తమను కులం పేరుతో దూషించారంటూ కరంబక్కుడి పంచాయతీ యూనియన్ మాజీ కార్యదర్శి చొక్కలింగం, ఆయన భార్య, ఆ యూనియన్ అధ్యక్షురాలు గంగయ్యమ్మాల్ ఆరోపించడం వివాదాస్పదమైంది. ముత్తయ్యార్ సామాజిక వర్గం ఏకం కావడంతో మంత్రికి వ్యతిరేకంగా ఉద్యమం బయలుదేరింది. పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, మదురైలోని ఆ సామాజిక వర్గం ఏకమై మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పు అనివార్యం అన్న ప్రశ్న బయలుదేరింది. సమగ్ర విచారణకు ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దించినట్టు సమాచారం. ఈ విచారణలో రాజకీయ లాభం కోసం కులచిచ్చును తెర మీదకు తెచ్చారని, దీని వెనుక డీఎంకే హస్తం ఉందని తేలింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన అమ్మ పార్టీలో కుల చిచ్చు, వివాదాలకు చెక్ పెట్టే రీతిలో ఆగమేఘాలపై చొక్కలింగం, గంగయ్యమ్మాల్కు ఉద్వాసన పలికారు. ఆ ఇద్దర్నీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడంతో ఆ సామాజికవర్గానికి చెందిన ఇతర నేతల్లో గుబులు బయలు దేరింది. చివరకు పదవి గండం నుంచి విజయ భాస్కర్ తప్పించుకుని అమ్మ అభయం పొందారు. ఇక ముత్తయ్యార్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే రీతిలో డీఎంకే ఎంపి కనిమొళి పావులు కదపడం గమనార్హం. ఆ ఇద్దర్నీ తమ వైపునకు తిప్పుకుని ఆ సామాజిక వర్గం మద్దతు కూడగట్టుకునే రీతిలో ప్రయత్నాలు సాగించే పనిలో పడ్డట్టు సమాచారం. -
ఆరోగ్య మంత్రిగా సినీనటి రమ్య
బెంగళూరు: కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రిగా కన్నడ నటి రమ్యను తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. రాష్ట్ర పార్టీలో పెరిగిపోతున్న కుమ్ములాటలను పరిష్కరించేందుకు రాష్ట్ర కేబినెట్‌ను పునర్వవ్యస్థీకరించాలని సిద్ధరామయ్య గత కొంతకాలంగా భావిస్తున్నారు. ఈ దిశగా కసరత్తు చేయడంలో భాగంగానే ఆయన ఇప్పుడు ఢిల్లీలో మకాం వేశారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రిగా పార్టీలో పలు విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ప్రముఖ సినీ నటుడు అంబరీష్‌ను తొలగించి, ఆ స్థానంలో రమ్యను తీసుకోవాలని సిద్ధరామయ్యకు పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ఎం కృష్ణ ప్రతిపాదించినట్టు తెల్సింది. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అంబరీష్ ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతినడంతో గత ఏడాది ఆయన్ను సింగపూర్‌కు తరలించి వైద్య సేవలు అందించారు. అందుకైన కోటిన్నర రూపాయల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. అప్పటి నుంచి ఆయనను పదవి నుంచి తప్పించాల్సిందిగా పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి పెరిగింది. ఇటీవలి కాలంలో అంబరీష్‌ను కూడా సిద్ధరామయ్య బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. 15వ లోక్‌సభకు మాంధ్య నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సినీనటి రమ్య గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమెకు రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల్లో దేనీలోనూ సభ్యత్వం లేదు. మంత్రివర్గంలోకి తీసుకున్నాక, ఆమెకు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని కట్టబెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
అదితి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి
విశాఖపట్నం: డ్రైనేజిలో పడి ప్రాణాలు కోల్పోయిన అదితి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. డీఎన్ఏ పరీక్ష అవసరం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. వాళ్లు కోరితే మాత్రం డీఎన్ఏ పరీక్ష చేస్తామని కేజీహెచ్ ఇంఛార్జ్ ఉదయ్ కుమార్ అంతకుముందు చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ అదితి పోస్టుమార్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేజీహెచ్ ఇంఛార్జ్‌తో మాట్లాడారు. పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించాలని ఆదేశించారు. డ్రైనేజిలో పడిపోయిన అదితి ఎలాగైనా సజీవంగా తిరిగిరావాలని అందరూ కోరుకున్నారు. ఆమె ఆచూకీ కోసం జీవీఎంసీ, పోలీసు, నేవీ సిబ్బంది ఎనిమిది రోజులపాటు అహరహం గాలించారు. కానీ, ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయిన ప్రాంతం నుంచి 40 కి.మీ. దూరంలో అదితి మృతదేహం కనిపించింది. అల్పపీడనం ప్రభావంతో ఈశాన్యగాలులు బలంగా వీయడం వల్ల పాప శరీరం భోగాపురం తీరం వరకూ నీటిలో కొట్టుకుపోయి ఉంటుందని నిపుణులు చెప్పారు. -
ఆసుపత్రిలో కామినేని తనిఖీలు: వైద్యుడు సస్పెండ్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రితోపాటు మెడికల్ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓ వైద్యుడ్ని మంత్రి అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. అలాగే ఆసుపత్రిలో వైద్యులు సరైన సమయానికి విధులకు హాజరుకాకపోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ను రిలీవ్ చేస్తున్నట్లు మంత్రి కామినేని ప్రకటించారు. -
ఆన్లైన్లో ఫార్మసిస్టుల లెసైన్స్‌లు
హైదరాబాద్ : ఫార్మసిస్టులు లెసైన్స్‌ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి చెప్పారు. స్థానిక ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నూతన వెబ్‌సైట్‌ను, సేల్స్ లెసైన్స్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకూ ఫార్మసిస్టులు మందులషాపు తదితర వ్యాపారాల నిర్వహణ అనుమతి కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, ఇకపై వారు ఎలాంటి కష్టాలూ పడకుండా అనుమతి ప్రక్రియను సులభతరం చేస్తున్నామని చెప్పారు. ఫార్మసిస్టులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ కార్యాలయానికి పంపొచ్చని, వారి దరఖాస్తులను పరిశీలించి అనుమతి రాగానే ఆన్లైన్ ద్వారానే తెలియజేస్తామని చెప్పారు. అనుమతి వచ్చిన తర్వాత లెసైన్స్ పొందడానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుందని, వాటి పరిశీలన అనంతరం అధికారులు లెసైన్స్ మంజూరు చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు డెరైక్టర్ అకున్ సబర్వాల్, డిప్యూటీ డెరైక్టర్ అమృతరావు, పలువురు అసిస్టెంట్ డెరైక్టర్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.