Maharashtra's Omicron tally breached the 100 mark on Friday ముంబై: రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య శుక్రవారం సెంచరీ దాటింది. దేశంలోనే తొలి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని సర్వత్రా చర్చకొనసాగుతోంది. ఐతే మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే శనివారం లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 800 మెట్రిక్ టన్నులకు చేరుకుంటే తప్ప, అప్పటివరకూ లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని మీడియాకు వెల్లడించారు.
మరోవైపు కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ నిర్దిష్ట మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. డిసెంబర్ 24-25 రోజుల్లో విధించిన రాత్రి కర్ఫ్యూ (రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు) విధించింది. అంతేకాకుండ బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
పబ్లిక్ ఫంక్షన్లకు సంబంధించి ఇండోర్ వెడ్డింగ్‌లలోనైతే 100 మంది, ఔట్‌డోర్ వెడ్డింగ్‌లలో 250 కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదు. ఇతర సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాలకు ఇవే సంఖ్యలు వర్తిస్తాయి. రెస్టారెంట్లు, జిమ్‌లు, స్పాలు, సినిమాహాళ్లు, థియేటర్‌లు 50% సామర్థ్యంతో పని చేస్తూనే ఉంటాయి. వీటితోపాటు పలు ఆంక్షలను పరిస్థితిని బట్టి మరింత కఠినతరం చేయడానికి, సడలించడానికి స్థానిక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. కాగా శనివారం ఉదయం నాటికి మహారాష్ట్రలో 12,108 కరోనా క్రియాశీల కేసులు, 110 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
చదవండి: మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం..
Comments
Please login to add a commentAdd a comment