ఫిరోజుద్దీన్ ఫిరోజ్
కాబుల్ : మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏ దేశాన్ని వదలకుండా ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపుతోంది. చిన్నాపెద్దా లేకుండా మానవాళిపై విరుచుపడుతోంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర ఆరోగ్యమంత్రి కరోనా బారినపడ్డారు. మంత్రి ఫిరోజుద్దీన్ ఫిరోజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయనను క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 215 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3700కి చేరింది. ఇక వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో 100 మంది చనిపోయారు. (కరోనా: మృతుల్లో నల్ల జాతీయులే అధికం)
Comments
Please login to add a commentAdd a comment