
ఆరోగ్య మంత్రి అడ్రస్ లేరు గానీ..
ఒకవైపు దేశ రాజధానిలో చికన్ గున్యా, డెంగ్యూ లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే జనం వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాత్రం.. గోవా వెళ్లిపోయారు.
ఒకవైపు దేశ రాజధానిలో చికన్ గున్యా, డెంగ్యూ లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే జనం వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాత్రం.. వచ్చే ఏడాది గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారాలు చూసేందుకు అక్కడకు వెళ్లిపోయారు. ఇప్పటివరకు చికన్ గున్యాతో నలుగురు, డెంగ్యూ.. మలేరియాలతో మరో పది మంది మరణించారు. ఆస్పత్రులన్నీ పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి.
ఇక గొంతుకు శస్త్రచికిత్స చేయించుకోడానికి బెంగళూరు వెళ్లిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా.. ఇది తమ బాధ్యత కాదని చెబుతున్నారు. తమకు కనీసం ఒక పెన్ను కొనే అధికారం కూడా లేదని, ఏమైనా కావాలంటే లెఫ్టినెంట్ గవర్నర్‌ని లేదా ప్రధానమంత్రిని అడగాలని అన్నారు. ఢిల్లీ విషయంలో నజీబ్ జంగే అన్ని అధికారాలూ అనుభవిస్తున్నారని ట్వీట్ చేశారు. ఆరోగ్యమంత్రి నగరంలో లేకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా లేరని, ఆయన అమెరికా వెళ్లారని అంటున్నారు. అయితే.. ముఖ్యమంత్రి నగరంలో లేనప్పుడు ఆ బాధ్యతలు చూడాల్సిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఏం చేస్తున్నారా అని ఆరాతీస్తే.. ఆయన ఏదో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫిన్లాండ్ వెళ్లారు. ఢిల్లీలో ఉన్న ఏకైక మంత్రి కపిల్ మిశ్రాను దీని గురించి అడిగితే.. అది కార్పొరేషన్ బాధ్యత అని, మేయర్ నగరంలో లేరని అన్నారు. ఫాగింగ్ చేసి దోమలను నివారించాల్సింది కార్పొరేషనే అని చెప్పారు.
CM n min left wid no power now, even to buy a pen. LG n PM enjoy all powers wrt Del. LG abroad.Question them for Del https://t.co/t8ygcZmo1P
— Arvind Kejriwal (@ArvindKejriwal) 13 September 2016