కరోనా కాటుకు మరో ఎమ్మెల్యే మృతి | NCP MLA Bharat Bhalke Dies Due To Post-Covid Complications | Sakshi
Sakshi News home page

కరోనా కాటుకు మరో ఎమ్మెల్యే మృతి

Published Sat, Nov 28 2020 11:13 AM | Last Updated on Sat, Nov 28 2020 11:26 AM

NCP MLA Bharat Bhalke Dies Due To Post-Covid Complications - Sakshi

మహారాష్ట్ర: కరోనా బారిన పడి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే మరణించారు. పుణేలోని రబీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్న ఆయన శనివారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ తోపే ‘పందర్‌పూర్‌- మంగళ్వేదా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బల్కే మరణం ఆ నియోజక వర్గ ప్రజలకు తీరని లోటని, అంకిత భావాలున్న నాయకుడు భాల్కే అని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టుగా’ ట్వీట్‌ చేశారు.  (మళ్లీ లాక్‌డౌన్‌ ఉండకపోవచ్చు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement