
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు(55) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఈనెల 15న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. తొలుత మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. అయితే ఇంకా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతుండంతో మరోసారి కరోనా టెస్టులు నిర్వహించారు. రెండోసారి నిర్వహించిన టెస్టులో సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రికి ఆక్సిజన్ అమర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు.
(కరోనా సోకిందని ఇలా చేసి నిర్థారణ చేసుకోవచ్చు! )