postal ballot
-
మీకు తెలుసా? ఈ దేశాల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెటే ముద్దు
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం కూడా. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్ బ్యాలెట్, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చూద్దాం. 👉ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ పద్దతినే అవలంభిస్తున్నాయి. 👉పిలిఫ్పైన్స్, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్, ఇటలీ, కజకస్థాన్, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.👉భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.👉జర్మనీ, నెదర్లాండ్స్, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉2006లో నెదర్లాండ్స్ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్ చేశాయి. బ్యాలెట్ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 👉సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.👉అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్ లేదంటే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.👉2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.👉ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్ డిజిట్‌లోపు మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 👉భూటాన్, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 👉ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్ బ్యాలెట్ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు. -
ఈవీఎంలలో గోల్మాల్?!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.మొత్తం 543 లోక్‌సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్‌సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.ఒక లోక్‌సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే... ఫలితాల వెల్లడిలో లోక్‌సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్‌సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్‌సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.ఇవీ సందేహాలు.. ⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం? ⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్‌సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు? ⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్ఓట్ల లెక్కింపులో గోల్‌మాల్‌కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. -
ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
-
కూటమితో కుమ్మక్కు!
కూటమి నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారా.. కౌంటింగ్‌కు తమకు అనుకూలమైన అధికారులను వేయించుకున్నారా..? నేడు జరగనున్న ఓట్ల లెక్కింపులో అక్రమాలు.. దౌర్జాన్యాలకు స్కెచ్ వేశారా..? అంటే జిల్లా వాసుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థులు పైచేయి సాధించేందుకు కొందరు అధికారులు అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది. సాక్షి టాస్‌్కఫోర్స్: కౌంటింగ్‌లో అక్రమాలు.. దౌర్జనాలకు కూటమి అభ్యర్థులు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి నేతలు కొందరు అధికారుల సహకారంతో రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు స్వతంత్ర అభ్యర్థులు అడ్డొస్తారని వారికి ఏజెంట్లను కుదించడమే ఇందుకు నిదర్శనం. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ, చిత్తూరు ఎస్వీ సెట్లో నేడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కూటమికి ఓటమి తప్పదని భావించిన అభ్యర్థులు టీడీపీ సానుభూతిపరులైన అధికారుల ద్వారా మరికొందరు అధికారులను రకరకాల ప్రలోభాలతో లోబరుచుకున్నారు. వారందరికీ కౌంటింగ్ కేంద్రంలో డ్యూటీలు వేయించుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారి సహకారంతో కౌంటింగ్ కేంద్రంలో అక్రమాలు, దౌర్జన్యాలకు దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తారుమారు చేసి.. కూటమికి అనుకూలంగా మార్చే కుట్ర అడ్డదారుల్లోనైనా గెలుపొందాలని కూటమి నేతలు అన్ని మార్గాలను ఎంచుకున్నారు. ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపు సమయంలో కూటమి ఏజెంట్లు రచ్చచేసి వైఎస్సార్సీపీ ఏజెంట్ల దృష్టి మరల్చేందుకు పథకం వేసినట్లు తెలిసింది. ఈవీఎంలోని మొత్తం ఓట్ల లెక్కింపు విషయంలో తమకు అనుకూలంగా లెక్కలను తారుమారు చేసేందుకు స్కెచ్ వేసినట్లు సమాచారం. మొత్తంగా నేటి కౌంటింగ్ సమయంలో అడ్డదారులన్నింటినీ ఉపయోగించుకుని పైచేయి సాధించేందుకు కూటమి నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు కౌంటింగ్ కేంద్రంలో అక్రమాలు, దౌర్జనాలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులు, ఓటర్లు కోరుతున్నారు. వీలైనన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లక్ష్యంగా.. అధికారులంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేసిన కూటమి నేతలు.. నేడు జరగనున్న కౌంటింగ్‌లో దాన్ని అవకాశంగా వినియోగించుకోవాలని కుయుక్తులు పన్నుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఈసీ ఆదేశాలను బూచీగా చూపి వీలైనన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూటమి అభ్యర్థికి అనుకూలంగా మలచుకునేందుకు పథకం వేసినట్టు సమాచారం. అందుకు అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లను రెచ్చగొట్టి బయటకు పంపేందుకు స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల విషయంలోనూ ముందే అడ్డుకట్ట వేశారు. టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం అభ్యర్థి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలి్పంచారు. స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వచ్చే సరికి కేవలం 5, 6 మంది ఏజెంట్లను మాత్రమే నియమించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అభ్యర్థే కదా? అన్నీ టేబుల్స్ వద్ద ఏజెంటు ఉండకపోతే ఎలా? అని ప్రశి్నస్తున్నారు. అయినా వారికి ఎన్నికల అధికారి ససేమిరా అన్నట్లు స్వతంత్ర అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలగం కోసం కొత్త ఎత్తుగడ కౌంటింగ్ కేంద్రలో అక్రమాలు, దౌర్జన్యాలకు బలగం ఉండేలా కూటమి అభ్యర్థులు కాంగ్రెస్ ఏజెంట్ ఫామ్స్‌ని కొనుగోలు చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనా ఆ పార్టీ తరుఫున అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్ అభ్యరి్థకి టేబుల్‌కి ఒకరు చొప్పున ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం ఉంది. పేరుకు మాత్రమే పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తమ ఏజెంట్ ఫామ్స్‌ని కూటమి అభ్యర్థులకు విక్రయించి సొమ్ముచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ఏజెంట్ ఫామ్స్‌తో కూటమి నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో కూటమి నేతలకు బలం ఎక్కువ ఉండడంతో అక్రమాలు, దౌర్జన్యాలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బలగంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వీలైనన్ని కూటమి అభ్యర్థి లెక్కలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఏ చిన్న పొరబాటు ఉన్నా.. కూటమి అభ్యర్థి అకౌంట్లో వేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. -
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ బోగస్ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్ నౌ, దైనిక్ భాస్కర్ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్ పూర్తయి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్ తీసుకునే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయపడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్ హాల్ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్లో కౌంటింగ్ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఖచ్చితంగా కౌంట్ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి
సాక్షి, అమరావతి: కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి, హైకోర్టు న్యాయవాది కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఉ.6 గంటలకల్లా ఏజెంట్లు కౌంటింగ్ హాల్ దగ్గర ఉండాలి. ఫారం–17 సీ కాపీని తీసుకెళ్లాలి. ⇒ పోటీలో ఉన్న అభ్యర్థులందరి ప్రతి ఓటు కరెక్టుగా నోట్ చేసుకోవాలి. ఏదైనా తప్పు కన్పిస్తే వెంటనే అక్కడే ఉన్న ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ అనారోగ్యం, ఇతర కారణాలతో బయటకు వచ్చేవారు రిటర్నింగ్ అధికారికి చెప్పి బయటకు రావాలి. ఒకసారి బయటకొస్తే లోపలికి రానివ్వరని గమనించాలి. ⇒ స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్లను కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ⇒ ఏజెంట్లు ప్రతి రౌండ్ తర్వాత షీట్‌పై సంతకం చేసే ముందు మన పార్టీ అభ్యర్థి ఓట్లు మాత్రమే కాకుండా, టీడీపీ–జనసేన–బీజేపీ, ఇతర అభ్యర్థులకు పోలైన ఓట్లను స్పష్టంగా సరిచూసుకోవాలి. తేడా ఉన్నట్లుగా గుర్తిస్తే మరొక మారు కౌంటింగ్ చేయమని కోరాలి. అన్ని సరిపోయినప్పుడే సంతకం చేయాలి. ⇒ కౌంటింగ్ ఏజెంట్లతో అభ్యర్థి టచ్‌లో ఉంటూ అక్కడ ఏదైనా అవాంతరాలు ఎదురైతే, కౌంటింగ్ ఏజెంట్‌తో కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌తో కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. ⇒ ఏదైనా తప్పు జరుగుతోంది అని కౌంటింగ్ కేంద్రంలో గుర్తిస్తే చక్కటి లాజిక్‌తో ఆర్వోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ⇒ రిజెక్ట్ అయిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ మార్జిన్ వచ్చి ఉంటే మళ్లీ పోస్టల్ బ్యాలెట్స్‌ని లెక్కించమని కోరే అధికారం అభ్యర్థికి, కౌంటింగ్ ఏజెంట్‌కి ఉంది. ⇒ పోస్టల్ ఓట్లను సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం ప్రకటిస్తారు. ⇒ కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేవరకు కౌంటింగ్ హాల్లో అభ్యర్థి ఉండాలి. -
ఏపీలో అమ్ముడుపోయిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ లో కొత్త రూల్స్
-
చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారు: సజ్జల
గుంటూరు, సాక్షి: దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నాం వైఎస్సార్సీపీ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు అని సజ్జల అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్ పూర్తై డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దని చెప్పాం’’ అని సజ్జల మీడియాకు వివరించారు.సజ్జల ఇంకా మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల అన్నారు.కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోందిపార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించాంఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పార్టీ నేతలకు చెప్పాం.10:30 గంటలకు సంబరాలకు సిద్ధం కావాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం.పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టు కొట్టేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా?ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాలను తామే ఉల్లంఘించటమేంటి?దేశం అంతా ఒక రూల్, ఏపిలో ఒక రూల్ ఎంటి?పొలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధనలు తీసుకు రావడం ఎంటి?ఏపీలో ఒక్క చోట మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై ప్రత్యేక వెసులు బాటు ఇవ్వడం ఏంటి.?ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు.వ్యవస్థలను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదుఈసీ కోడ్ వచ్చి పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు.నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారు.చంద్రబాబుకు ఉన్న స్వతహాగా ఉన్న తన బుద్ధిని బయట పెట్టుకున్నారు.బీజేపీ జాతీయ వ్యూహాలను ఎపిలో అమలు చేయాలని చూస్తోందివైసిపి బలమైన పార్టీ ఎవర్నీ రెచ్చగొట్టల్సిన అవసరం లేదు.ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతా యుతంగా ఉన్నాం.సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు.హడావుడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబుకు ఫుల్ పిక్చర్ అర్థం అయ్యింది.21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వస్తుంది?నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారు.పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.నార్తులో బీజేపీ పోతుంది.అందుకే సౌత్‌లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది..సౌత్ లో సీట్లు వస్తున్నట్లు బెదిరించి భయపెట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకున్నారు.మేము జనంతో ఉన్నాం జనం మాతో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం.ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా.?చంద్రబాబు అరెస్టు అయితే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదు. -
పోస్టల్ బ్యాలెట్లపై YSRCP న్యాయపోరాటం
-
పోస్టల్ బ్యాలెట్లపై వైఎస్సార్సీపీ పిటిషన్.. తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ, సాక్షి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి దిగింది. అయితే వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఇచ్చిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిటిషన్ వేశారు. రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలన్న ఏపీ సీఈవో మెమోను.. తదనంతరం ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసింది వైఎస్సార్సీపీ. రేపే కౌంటింగ్ కావడంతో.. నేడు త్వరగా విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాది, సుప్రీం ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అలాగే.. దేశం అంతటా ఎన్నికల సంఘం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని వాదించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడంపై వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ, ఈ తరుణంలో తాము ఈసీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.హైకోర్టులో..ఇక వైఎస్సార్సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పోస్టల్‌బ్యాలెట్ ఈసీ మెమోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో ఏపీ సీఈవో నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర ఎన్నికల సంఘం, మెమోలో కొంత పార్ట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతూ డబుల్ గేమ్ ఆడింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ బలమైన వాదనలే వినిపించింది. రాత్రికి రాత్రే మెమో తేవాల్సిన అవసరం ఏముందని, దేశంలో ఎక్కడా లేని రూల్‌ను ఏపీలో తీసుకురావడంలో ఆంతర్యమేంటని వాదించింది. కానీ, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. దీంతో వైఎస్సార్సీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం అనివార్యమైంది. -
YSRCP న్యాయ పోరాటం
-
పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంలో వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, ఢిల్లీ: పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసింది. అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైఎస్సార్సీపీ సవాల్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలన్న వైఎస్సార్సీపీ.. పోస్టల్ బ్యాలెట్‌పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేసింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.కాగా, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారమ్‌పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా, సీల్ లేకపోయినా కూడా వాటిని ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అభ్యంతరాలుంటే వాటిని ప్రస్తావించేందుకు ప్రత్యామ్నాయ వేదికలున్నాయని పేర్కొంది.ఆ ప్రత్యామ్నాయ మార్గాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికలు పూర్తయిన తరువాత ఎన్నికల పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసుకోవాలని వైఎస్సార్ సీపీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ కిరణ్మయి ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని, ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాలే కానీ హైకోర్టును ఆశ్రయించరాదన్న వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలను సవాల్ చేస్తూ ఈపీలు దాఖలు చేయడం ఆచరణ సాధ్యం కాదన్న వైఎస్సార్సీపీ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చిందని, ఇది అన్యాయమన్న వాదనను సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. -
పోస్టల్ బ్యాలెట్లపై భద్రం
సాక్షి, అమరావతి: పెద్ద ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పోలింగ్ శాతం పెరగడం, పోస్టల్ బ్యాలెట్లు 4.97 లక్షలకు పైగా పోల్ అయిన నేపథ్యంలో జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపుల్లో అత్యంత కీలకం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎన్నికల సంఘం చివరి నిమిషంలో నిబంధనలు మార్చినందున లెక్కింపు విషయంలో ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా ఒక ఏజెంట్ పర్యవేక్షించాలని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు, లెక్కింపు విధానంపై ఏజెంట్లు ముందస్తు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.చెల్లనివిగా ఎప్పుడు పరిగణిస్తారంటే?» బ్యాలెట్ పేపరుపై ఓటు ఎవరికి నమోదు కాకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా తిరస్కరిస్తారు.» బ్యాలెట్ పేపరు చిరిగినా, గుర్తు పట్టలేనంతగా మారినా, ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు లేదా ఏదైనా రాసి ఉన్నా తిరస్కరిస్తారు.» నకిలీ బ్యాలెట్ పేపర్లను తిరస్కరిస్తారు.» ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ ఆర్వో పక్కన పెడతారు.» ప్రతీ దశలో చెల్లని ఓట్లను ఆర్వో విడివిడిగా కట్టలు కట్టి ఉంచాలి» ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్వో తిరిగి పరిశీలిస్తారు.» తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్వో, అబ్జర్వర్లు ఒకొక్కటే పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. డిక్లరేషన్ 13 ఏ అత్యంత కీలకం» ఓటరు తన ఓటును కవర్ ‘ఏ’లో పొందుపరచి దానికి డిక్లరేషన్ 13 ఏ జత చేసి ఈ రెండింటినీ కవర్ ‘బీ’లో ఉంచి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తారు.» బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ బీ తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ ‘ఏ’ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.» కవర్ బీ తెరవగానే అందులో ఫారం 13 సీలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ (ఫారం 13 బీ) ఉండే కవర్ ఏ, ఓటరు ఇచ్చిన డిక్లరేషన్ 13 ఏ ఫారం ఉండాలి» ఈ రెండూ విడివిడిగా లేకపోతే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టాలి.» ఆ తర్వాత 13 ఏ డిక్లరేషన్ సరిగా ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి.» ఈ డిక్లరేషన్ ఫారంపై ఓటరు సంతకంతోపాటు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీల్ ఉందో లేదో పరిశీలించాలి.» ఒకవేళ అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, సీల్ లేకపోయినా ఆ ఓటును తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.» అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానం ఉంటే ఏజెంట్లు తమ అభ్యంతరాన్ని ఆర్వోకు తెలియచేయాలి.» ఆర్వో తమ వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారి సంతకంతో సరి పోల్చి ఒకే విధంగా ఉంటే ఆమోదిస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు.» ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం మొదలవుతుంది.» తొలుత కవర్ ఏ ఓపెన్ చేసి అందులోని ఫారం 13 బీ బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేస్తారు.» 13 ఏపై ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్, 13 బీ మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోలాలి.» ఈ రెండు నెంబర్లలో తేడా ఉంటే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలి.» ఏజెంట్లు తమ ఫిర్యాదులు ప్రతీది లిఖిత పూర్వకంగా ఇవ్వాలిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇలా» జూన్ 4 ఓట్ల లెక్కింపు తొలుత పోస్టల్ బ్యాలెట్లతోనే మొదలవుతుంది. ఉదయం 8 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏజెంట్లు ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. కౌటింగ్ కేంద్రంలో మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఒకవైపు ఏడు మరో వైపు ఏడు చొప్పున అమర్చి చుట్టూ కంచె వేస్తారు. ఈ రెండు వరుసల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుల్ ఉంటుంది. ఆర్వో పర్యవేక్షణలోనే మొత్తం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. » పోస్టల్ బ్యాలెట్లలో రెండు రకాలుంటాయి. మిలటరీలో సేవలందించే వారు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోగా 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులు, పోలింగ్ రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులు సాధారణ విధానంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ఓట్ల లెక్కింపు ఒకే రకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసిన వారి క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకుంటారు. » పోస్టల్ బ్యాలెట్లో రెండు రకాల కవర్లు ఏ, బీతో పాటు మూడు రకాల ఫారమ్స్ 13 ఏ, 13 బీ, 13 సీ ఉంటాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు వినియోగించుకున్నారా? లేదా? అనేది పరిశీలించి లెక్కింపు అర్హతను నిర్థారిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇదే అత్యంత ప్రధానమైనది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందా? లేదా? ఎలాంటి సందర్భాల్లో ఏజెంట్లు అభ్యంతరం చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం.. -
ఎల్లుండే ‘లోక్‌సభ’ కౌంటింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10వేల మంది సిబ్బందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. 4న జరిగే లోక్‌సభ ఓట్ల లెక్కింపుతోపాటు 2న జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు, 5న జరిగే ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10 వేల మంది సిబ్బందిని ఎంపిక చేశామని.. ఇందులో 50 శాతం సిబ్బంది రిజర్వ్‌లో ఉంటారని చెప్పారు. ర్యాండమైజేషన్ పద్దతిలో సిబ్బందిని ఎంపిక చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. మూడంచెల భద్రత మధ్య ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ఒక కౌంటింగ్ కేంద్రం ఉంటుందని.. ఒక కేంద్రంలో 24 టేబుల్స్ ఉంటాయని వికాస్‌రాజ్ తెలిపారు. అయితే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 28 టేబుల్స్ అవసరమవడంతో.. రెండు హాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు సహా ఎలాంటి ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. ఇప్పటివరకు 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని.. ఇంకా ఈటీపీబీఎస్ (ఎ ల్రక్టానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం)లు వస్తున్నాయని, కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలలోపు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ లెక్కన పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యపై కౌంటింగ్ రోజే స్పష్టత వస్తుందన్నారు. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 24 రౌండ్లు పడుతుందని.. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లకు సంబంధించి 13 రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు. సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీ ప్యాట్ రసీదులను లెక్కిస్తామని తెలిపారు. 2,414 మంది సూక్ష్మ పరిశీలకులులోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,414 మంది సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లను) నియమించినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఒక్కో టేబుల్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. లెక్కింపు కోసం ఒక టేబుల్‌కు ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు ఉంటారన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వా ల్సి ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ట భద్రత మధ్య తరలిస్తామని.. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారు. ఆ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. ఒకవేళ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చన్నారు. ఎప్పటికప్పుడు పరిశీలకుల అను మతి తర్వాత ఫలితాలు వెల్లడిస్తారని.. కౌంటింగ్ హాల్లో, మీడియా సెంటర్ వద్ద ప్రకటిస్తామని, వెబ్సైట్లోనూ అప్లోడ్ చేస్తా మని తెలిపారు. ఆదివారం జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దుప్పలపల్లిలోని తెలంగాణ వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాం ఆవరణలో జరుగుతుందని వికాస్‌రాజ్ వెల్లడించారు. -
పోస్టల్ బ్యాలెట్ పై నేడు కీలక తీర్పు
-
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
-
Big Question: పోస్టల్ బ్యాలెట్లపై టీడీపీ కుట్రలు
-
ఇది ఈసీ వివక్షే
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు రిజిస్ట్రీని కోరారు. దీంతో రిజిస్ట్రీ ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచింది. దానిని పరిశీలించిన ఆయన హౌస్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీంతో జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ విజయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.దేశ వ్యాప్తంగా కాకుండా ఏపీలో మాత్రమే అమలు చేస్తారా?వైఎస్సార్సీపీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు వివక్షాపూరితమని సింఘ్వీ తెలిపారు. ఈ ఉత్తర్వులు చాలా కొత్తగా ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులను దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు దేశం మొత్తానికి వర్తిస్తాయని, కానీ విస్మయకరంగా తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తింప చేస్తోందని వివరించారు. ఇంత కన్నా అన్యాయం ఏమీ ఉండదన్నారు. తాజా ఉత్తర్వులు ఎన్నికల కమిషన్ స్వీయ నిబంధనలకు విరుద్ధమన్నారు. లేఖలు, సర్కులర్లు, మెమోల ద్వారా చట్టబద్ధ నిబంధనలను మార్చలేరన్నారు. అది పార్లమెంట్ పని అని తెలిపారు. పార్లమెంట్లో ఎలాంటి సవరణ చేయకుండా తాజా ఉత్తర్వులు తీసుకురావడానికి వీల్లేదని, అందువల్ల అవి ఎంత మాత్రం చెల్లుబాటు కావని ఆయన స్పష్టం చేశారు.కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎందుకిలా?రాష్ట్రంలో 5.39 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఇవి సరిపోతాయని సింఘ్వీ అన్నారు. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్స్ 27ఎఫ్, 54ఏ, 13 ఏ లకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు అమల్లోకి తెచ్చిందన్నారు. అటెస్టేటింగ్ అధికారి పేరు, హోదా వివరాలు లేకుండా ఆ పోస్టల్ బ్యాలెట్‌ను ఎవరో ధృవీకరించారో తెలియదని, దీని వల్ల అక్రమాలకు ఆస్కారం ఉంటుందన్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై ఎవరైనా సంతకం చేయవచ్చన్నారు. తప్పుడు, నకిలీ ఓట్లను కూడా ఆమోదించేందుకు తాజా ఉత్తర్వులు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే, ఇప్పుడు కౌంటింగ్‌కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ తాజా ఉత్తర్వుల వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదంగా ఉందని తెలిపారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఇలాంటి ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షికతకు అర్థం లేకుండా చేస్తోందన్నారు. ఏకపక్షంగా జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం ఉంటేనే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదని, అందువల్ల తమ వ్యాజ్యానికి విచారణార్హత ఉందని వివరించారు.పరిధి దాటి వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘంసీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమేనన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘామే చెబుతోందని, అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో మాత్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో తమ ఆందోళనను గానీ, తామిచ్చిన వినతి పత్రాన్ని గానీ ఎన్నికల సంఘం కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హడావుడిగా తాజా ఉత్తర్వులిచ్చిందన్నారు. అతి కొద్ది రోజుల్లో కౌంటింగ్ జరగబోతుండగా, ఇప్పటికిప్పుడు ఈ ఉత్తర్వులను తీసుకు రావాల్సిన అవసరం ఏముందో ఎన్నికల సంఘం చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంఘం చర్యల్లో నిజాయితీ ఉండి ఉంటే, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చి ఉండేదని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికల పిటిషన్లు వేయాలంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాఖలు చేయాల్సి ఉంటుందని, ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తన పరిధి దాటి వ్యవహరించిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, బ్యాలెట్ ఫాంపై పేరు, హోదా వివరాలు, సీలు లేకుంటే ఆ ఓటును తిరస్కరించాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సాగుతున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వీరారెడ్డి తెలిపారు.తాజా ఉత్తర్వులు ఆ ఉద్యోగులకే వర్తింపుకేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకే తమ తాజా ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద అటెస్టేటింగ్ అధికారిని సంబంధిత రిటర్నింగ్ అధికారే నియమిస్తారని.. అందువల్ల డిక్లరేషన్ ఫాంపై ఆ అధికారి సంతకం ఉంటే చాలని చెప్పారు. పేరు, హోదా వివరాలు, సీలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను మొత్తం నిబంధనలకు అనుగుణంగా వీడియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియను సవాలు చేయడానికి వీల్లేదని, ఒకవేళ పిటిషన్లు దాఖలు చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ పరోక్షంగా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నారని, అందువల్ల వారు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాల వ్యవహారంలో ఈపీ దాఖలు చేసుకోవాలన్న వాదన సరైందేనని, అయితే పిటిషనర్ తన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలు పూర్తిగా వేరని వ్యాఖ్యానించింది. ఇదేమీ వ్యక్తిగత కేసు కాదని స్పష్టం చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ వ్యాజ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల నిర్వహణ నిబంధనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు సబబేనన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయాన్ని వెలువరిస్తామంది. -
ఏపీ: ఈసీఐ అకస్మాత్తు నిర్ణయం ఎందుకు?
గుంటూరు, సాక్షి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఎన్నికల సంఘాల తీరుపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తోంది. ఏపీ సీఈవో, సీఈసీ ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌పై వాదనలు శుక్రవారం పూర్తి కాగా, జడ్జి తీర్పును రేపటికి(జూన్ 1 శనివారం) రిజర్వ్ చేశారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది(2023) జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను సడలిస్తూ.. పోస్టల్ బ్యాలెట్ ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు. అయితే ఈ మెమో పై వైఎఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను గురువారం ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. శుక్రవారం ఇరువైపులా వాదనలు జరిగాయి. వాదనలు ముగియడంతో శనివారం సాయంత్రం తీర్పు వెల్లడిస్తామని ఏపీ హైకోర్టు ఇరువర్గాలకు తెలిపింది.వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు.. ఏపీలో 5.39 లక్షల పోస్టల్ ఓట్లు ఉన్నాయిపోస్టల్ బ్యాలెట్‌పై సంతకం చేసి.. స్టాంప వేశాక అధికారి పేరు రాస్తేనే అది చెల్లుబాటు అవుతుందికానీ, పోస్టల్ బ్యాలెట్‌పై కేవలం అధికారి సంతకం ఉంటే సరిపోతుందని.. ఈసీఐ సర్క్యులర్ జారీ చేయడం సరికాదు రూల్ 27 ప్రకారం పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టింగ్ అధికారి పేరు, సంతకం ఉండాలిసదరు పోస్టల్ ఓటర్ తనకు తెలుసు అని, అటెస్టెడ్ అధికారి సర్టిఫై చేయాలిరూల్ 54ఏ ప్రకారం.. డిక్లరేషన్‌పై సంతకం, స్టాంప్ లేకుంటే అధికారి ఆ పోస్టల్ బ్యాలెట్‌ను తిరస్కరించాలి ఈసీఐ ఇచ్చిన సర్క్యులర్ నిబంధనలను తుంగలో తొక్కిందిదీనిపై పోస్టల్ ఓట్లు చెల్లుబాటుపై సందేహాలు లేవనెత్తుతోందిఇన్ని లక్షల పోస్టల్ ఓట్లు ఉన్నప్పుడు కేవలం సంతకం ఉంటే.. ఆ సంతకం సరైనదా? కాదా? అని ఎవరు నిర్ధారిస్తారు? అన్ని రాష్ట్రాల్లో నిబంధనలకు అనుకూలంగా లేకుంటే.. పోస్టల్ ఓట్లు చెల్లుబాటు కావు. కానీ, ఏపీలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి! అటెస్టేషన్ లేకుండా వచ్చిన పోస్టల్ ఓట్లను సైతం లెక్కపెట్టాలని ఈసీఐ అకస్మాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకుంది?రాత్రికి రాత్రి సర్క్యులర్ తీసుకొచ్చి.. అటెస్టెడ్ అధికారి పేరు, అడ్రస్, హోదా అవసరం లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోందిఏపీ సీఈవోను వెనుకేసుకొచ్చిన ఈసీపోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సీఈసీ స్పందించింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. తద్వారా ఏపీ సీఈవో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించినట్లయ్యింది. అయితే దేశం మొత్తం ఒకలా ఉంటే.. ఏపీ వరకు రూల్స్ మార్చేందుకు ఈసీ అనుమతులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కేంద్ర ఎన్నికల సంఘం డబుల్ గేమ్ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా రిటర్నింగ్ అధికారులు గుర్తించాలి. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే కదా అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేస్తారు. :::ఏపీ సీఈవోతో కేంద్ర ఎన్నికల సంఘం ‘‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) 25న ఇచ్చిన మెమోలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాం. 27వ తేదీనాటి మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం’’:::పోస్టల్ బ్యాలెట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం వివరణఒకవైపు ఏపీ సీఈవో తీసుకున్న నిర్ణయం సరైందేనని చెబుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయన రూల్స్ పక్కన పెట్టారన్న సంగతిని మాత్రం పక్కనపెడుతోంది. అలాగే.. మెమోలో కొంత భాగం మాత్రమే వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించి డబుల్ గేమ్ ఆడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. -
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు ?
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై అనుమానాలు
-
CEO జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన CEC
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం ప్రారంభించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని అప్పిరెడ్డి తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.దీంతో న్యాయమూర్తులు జస్టిస్ సత్తిరెడ్డి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్‌ల ధర్మాసనం లంచ్ మోషన్ రూపంలో గురువారం అత్యవసర విచారణకు అంగీకరించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, హోదా వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అడిగిందే తడవుగా, సీఈవో ఆ మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టీడీపీకి అనుకూలంగా వాటిని సడలించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా వివరాలు చేతితో రాయకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలంటూ ఈ నెల 25, 27వ తేదీల్లో మెమోలు జారీ చేశారు. ఈ నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది. కూటమి తప్ప, అన్నీ రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయంపై అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారుతుందని భయపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఏపీలో అమలు సీఈవో ఇచ్చిన సడలింపుల అమలును నిలిపేసి, కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా, నిజమైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రతివాదులుగా చేర్చింది. మధ్యాహ్నం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. దాదాపు రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి.సీఈవో తన పరిధి దాటి మరీ మెమోలు జారీ చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. సీఈవో మెమోల వల్ల వచ్చే నష్టం గురించి ధర్మాసనానికి వివరించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, డిజిగ్నేషన్ వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయని, ఇందుకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉంటే, దానిని తిరస్కరించవచ్చని తెలిపారు.అయితే ఇప్పుడు సీఈవో ఆ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేయడం లేదన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియలో నిష్పాక్షికత కోసమే ఈ వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. నిబంధనలకు తూట్లు పొడిచే అధికారం సీఈవోకు లేదన్నారు. కొన్ని రాజకీయ పారీ్టలకు మేలు చేసేందుకే సీఈవో ఈ మెమో జారీ చేశారని తెలిపారు.పేరు, హోదా, సీలు లేకపోయినా ఆమోదించాలి 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో సీఈవో తమ అభిప్రాయాన్ని కోరారని తెలిపారు. అధికారుల సంతకం విషయంలో ఏదైనా సందేహం ఉన్నా, వెరిఫికేషన్ అవసరం అయినా, ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాలు, పేర్లు, హోదాల వివరాలను తీసుకోవాలంటూ ఈ నెల 25వ తేదీన జారీ చేసిన మెమోలోని రెండో పేరాను ఉపసంహరించుకుంటున్నట్లు అవినాష్ చెప్పారు.ఈ రెండో పేరాకు అనుగుణంగా 27న జారీ చేసిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ఆయన కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలంటూ తాజాగా (30వ తేదీన) ఆదేశాలు జారీ చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.ఈ సమయంలో వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ, 25న ఇచ్చిన మెమోలోని పేరా 2, 27న ఇచ్చిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన విషయాన్ని రికార్డ్ చేయాలని కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి, అవినాష్ చెప్పిన విషయాలను రికార్డ్ చేసింది. అవినాష్ జోక్యం చేసుకుంటూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇది రెగ్యులర్ కేసు కాదని గుర్తు చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
సీఈవో గుప్పెట్లో చట్టం
చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశి్నంచారు.13 ఏ, 13 బి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారని, దానికి గెజిటెడ్ ఆఫీసర్ సరి్టఫికెట్ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచి్చందని ప్రశి్నంచారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తామని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో, ఎన్నికల సంఘంలో ప్రమాణం చేసి, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సీఈవో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. -
కుట్రపూరితం! పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్‌తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్ అధికారి హోదా వివరాలు, సీల్ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటీషన్ వేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘మెమో వెనక్కి అంటే.. తప్పుచేసినట్లేకదా!’
కృష్ణా, సాక్షి: కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ ఎన్నికల సంఘాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పని చేస్తున్నాయన్నారు ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల సంఘం డబుల్ గేమ్‌పై, న్యాయస్థానాల్లో తాజా పరిణామాలపైనా ఆయన స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా నిబంధనలను మీరారు. స్టాంప్ వేయకపోయినా.. డిజిగ్నేషన్ లేకపయినా ఫర్వాలేదని మెమో జారీ చేశారు. చట్టాన్ని మీరి మరి రూల్స్ తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. .. అందుకే మేం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాం. దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. తాను ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఈవో ఎంకే మీనా కోర్టుకు తెలిపారు. మెమో వెనక్కి అంటే.. ఆయన తప్పు చేసినట్లే కదా. ఆ మెమోను ఈసీ సమర్థించడం అన్యాయం. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటుపై కోర్టులో పోరాడుతున్నాం. కచ్ఛితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయస్థానంలో గెలుపు ధర్మానిదే.. .. బీజేపీ ఒత్తిడికి లొంగిపోయే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంగతి ఎప్పటి నుంచో చెబుతున్నాం. టీడీపీ తప్పులపై ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో వార్తలు వస్తే చాలూ.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. టీడీపీపై పొరపాటున కేసులు పెడితే ఆ జిల్లా కలెక్టర్లను, ఆర్వోలను బెదిరిస్తున్నారు. .. వైఎస్సార్సీపీపై సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీలపై కేసులు పెట్టొద్దనే సంకేతాలిస్తున్నారు అని ఆరోపించారాయన. -
జూన్ 4 జడ్జిమెంట్ డే: తొలి, చివరి ఫలితాలపై క్లారిటీ ఇదిగో
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా.. ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాల సమయం పట్టనుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్) ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. ఆపై పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాతే ఈవీఎంల లెక్కింపు ప్రారంభంకానుంది. 11 గంటల కల్లా ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలుండగా.. మధ్యాహ్నానికి తుది ఫలితాలపై ఓ అంచనాకి వచ్చేయొచ్చు. తొలి ఫలితం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇక అల్లూరి జిల్లా రంపచొడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు మాత్రం ఆలస్యంగా వెలువడనున్నాయి. ఈ రెండు చోట్లా 29 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరపనున్నారు. మరోవైపు.. భీమిలి(విశాఖ), పాణ్యం(నంద్యాల) ఫలితాల కోసం రాత్రి వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లో 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు(మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్ చీటీలు) పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. -
ఈసీ డబుల్ గేమ్!
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఎన్నికల సంఘం డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు గురువారం తెలిపింది. ఈ మెమోలపై వైఎస్సార్సీపీ కోర్టుల్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది(2023) జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులే రాజకీయ దుమారం రేపాయి.ఏపీ సీఈవో ఇచ్చిన మెమో సారాంశం..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దు. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు (స్పెసిమెన్) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలి. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు!. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం (స్పెసిమెన్)తో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.వైఎస్సార్సీపీ అభ్యంతరాలు ఏంటంటే..పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా ఈనెల 25న ఓ మెమో, 27న మరో మెమో జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఆర్ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ వాటిల్లో పేర్కొన్నారాయన. అయితే ఈ మెమో పై వైఎఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది కూడా.డబుల్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘంఈలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సీఈసీ ఇవాళ స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికలసంఘానికి ఏం చెప్పిందంటే.. ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా రిటర్నింగ్ అధికారులు గుర్తించాలి. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే కదా అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేస్తారు. అయితే ఈ లోపు కేంద్ర ఎన్నికల సంఘం మరో ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ సీఈవో ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈసీ డబుల్ గేమ్‌తో.. జూన్ 4వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎలా జగరనుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే వైఎస్సార్సీపీ పిటిషన్‌పై కోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. కోర్టు గనుక తీర్పు ఇస్తే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.‘‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) 25న ఇచ్చిన మెమోలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాం. 27వ తేదీనాటి మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం’’:::ఏపీ హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీని సైతం కలిసినా..అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ అంటోంది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీసే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా ఉండేలా నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో మీనా జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఏపీ సీఈవోకు అనుకూలంగా సీఈసీ వ్యవహరిస్తూనే.. మరోవైపు ఆ వివాదాస్పద జీవో వెనక్కి తీసుకోవడం గమనార్హం. -
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్.. కాసేపట్లో విచారణ
-
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్‌షాప్, జూమ్ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సందేహాల నివృత్తికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి ఓటూ విలువైనదేనని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, దానికి సంబంధించి ఆదేశాలు రాగానే తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నందున, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన వారికి విశ్రాంత ఆర్డీవో ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి, శాసన మండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.పోస్టల్ బ్యాలెట్ లెక్కించే విధానం⇒ ఎన్నికల అధికారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట విధిగా పోస్టల్ బ్యాలెట్లని లెక్కించాలి⇒ మొదటి కవరు–బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రెస్సు, ఓటరు సంతకం ఉండాలి. (ఓటరు సంతకం తప్పనిసరికాదు).⇒ మొదటి కవరు–బి (ఫారం – 13సి) తెరిచి చూసినప్పుడు అందులో 13 – ఏ డిక్లరేషన్, ఫారం 13–బి (కవరు – ఏ) విడివిడిగా ఉండాలి. లేకపోతే అది చెల్లుబాబు కాదు. అందులో కవరు – ఏ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమ సంఖ్య నమోదు చేయకపోయినా, నమోదు చేసినట్లయితే అది 13–బి (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్యతో సరిపోలక పోయినా, 13 – ఏ డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి హోదా తెలియజేసే స్టాంప్ లేదా హోదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణించాలి.⇒ 13– ఏ డిక్లరేషన్‌లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13 – బి పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న కవరు(కవరు – ఏ)ను పరిశీలించాలి. 13– ఏ డిక్లరేషన్‌లో పేర్కొన్న బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, 13 – బి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న క్రమసంఖ్య ఒకటి కాకపోయినా, ఓటరు ఎవ్వరికీ ఓటు వేయకపోయినా, ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి వేసినా, బ్యాలెట్ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినా, ఓటరు ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఓటరు తనే ఓటు వేసినట్లుగా గుర్తించినప్పుడు (ఉదాహరణకు ఓటరు పేరు రాసినా, సంతకం చేసినా) దానిని చెల్లని ఓటుగా పరిగణించాలి. ప్రతి బ్యాలెట్ పేపర్లో నమోదు చేసిన అంశాలను పోటీ చేసే అభ్యర్థుల ప్రతినిధిగా ఉన్న ఏజెంట్/అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాలెట్ పేపరు లెక్కించిన తరువాత రిజల్ట్ షీట్ (ఫారం–20)లో నమోదు చేయాలి. -
‘సడలింపు’ని సరిదిద్దండి
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను ఏపీలో సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా ఈనెల 25న జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేసింది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా నిబంధనలను సడలిస్తూ జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా..నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు (స్పెసిమెన్) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం (స్పెసిమెన్)తో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇచ్చారు. గోప్యతకు.. శాంతిభద్రతలకు విఘాతం..ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో స్పెసిమెన్ సంతకంపై రాజకీయ పక్షాల ఏజెంట్ల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఇది చినికిచినికి పెను వివాదంగా మారి శాంతిభద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ నిబంధనలవల్ల ఓటు గోప్యత ఉండదని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో టీడీపీ నేతలు విజ్ఞప్తి చేయగానే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా ఉత్తర్వులు జారీచేయడంపై నివ్వెరపోతున్నారు.నిబంధనల సడలింపుపై న్యాయపోరాటం..ఇదిలా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా జారీచేసిన ఉత్తర్వులపై దుమారం రేగుతోంది. వాటిని సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సముచిత నిర్ణయం తీసుకోని పక్షంలో.. మీనా సడలింపు ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. -
‘సడలింపులు’పై హైకోర్టుకు వెళ్తాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహారశైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు. దేశం అంతటా ఒక రకమైన నిబంధనలు ఉంటే ఏపీలో ఈసీ ప్రత్యేక రూల్స్ చెబుతోంది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ సంతకం లేకుంటే దానిని తిరస్కరించడం నిబంధన. కానీ ఏపీలో మాత్రం గెజిటెడ్ సంతకం లేకపోయినా అనుమతించడంపై సీఈసీకి ఫిర్యాదు చేశామని వైవీ అన్నారు. సీఈసీ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నిబంధనావళి రూపొందించిందంటే అది దేశవ్యాప్తంగా అమలు జరగాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన అంటూ ఏమీ ఉండదు. అలాగే, గత ఎన్నికల్లో లేని నిబంధన.. అదే విధంగా దేశంలో ఎక్కడాలేని నియమం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సడలింపులు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే.. ఈ సడలింపులు టీడీపీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందని స్పష్టంగా తెలిసిపోతోంది కాబట్టి. గత ఎన్నికల్లో లేని సడలింపుల్ని.. పైగా ఇంకెక్కడా లేని మినహాయింపులను ఇక్కడే అమలుచేయడం.. అది కూడా టీడీపీ చెప్పింది చెప్పినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తలూపుతూ చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో ఎన్నికల సంఘం.. టీడీపీ సంఘంలా వ్యవహరిస్తోందని కాక ఇంకేమనాలి?కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా..నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇవ్వడంపై రాజకీయ పక్షాలు నివ్వెరపోతున్నాయి. ఎన్నికల సంఘం పచ్చపాతం మరోసారి బహిర్గతమైందని విమర్శిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా ఇది వివాదాలకు దారితీస్తుందని.. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.మరీ ఇంత ‘పచ్చ’పాతమా?..పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు టీడీపీ నుంచి పలు విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఆయన.. 2023, జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. వాటి ప్రకారం.. డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమలవుతోంది. కానీ.. అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా.. పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాయకపోయినా.. సంతకం ఉంటే చాలు.. దానిపై ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ సడలింపు ఇవ్వడం గమనార్హం.పోస్టల్ బ్యాలెట్ ఆమోదానికి ఇతర నిబంధనలివీ..⇒ పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ ఆఫీసరుగానీ లేదా ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ⇒ బ్యాలెట్ పేపర్ వెనుక సంతకం విషయంలో ఏమైనా సందేహాలొస్తే సీరియల్ నెంబర్ ప్రకారం కౌంటర్ ఫైల్‌ను పరిశీలించి అది నిజమైన బ్యాలెట్ అవునా కాదా అని నిర్థారించుకోవాలి. ఒకవేళ సందేహం ఉంటే వాటిని తిరస్కరించాలి.⇒ ఓటరు కవర్–బీ మీద సంతకంలేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. డిక్లరేషన్ ఫాం–13ఏ ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవికాక.. బ్యాలెట్ పేపర్ ఉండే ఇన్నర్ కవర్ ఫారం–13బీని తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును తిరస్కరించవచ్చు.⇒ కవర్–బీని తెరవగానే, ఓటరు డిక్లరేషన్ ఫారం లేకపోతే, డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ లేదా అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, ఫారం–13ఏ, ఫారం–13బీలో బ్యాలెట్ సీరియల్ నెంబర్లు వేర్వేరుగా ఉంటే బ్యాలెట్ పేపర్ తెరవకుండానే తిరస్కరించొచ్చు.⇒ ఈ విధానం అంతా పూర్తయి బ్యాలెట్ పేపరు తెరిచిన తర్వాత.. ఎవరికీ ఓటు వేయకపోయినా.. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటువేసినా.. అనుమానాస్పద బ్యాలెట్ పేపరుగా గుర్తించినా.. బ్యాలెట్ పేపరు చిరిగిపోయినా.. అది నిజమైన బ్యాలెట్ అని నిర్థారించడానికి అవకాశంలేని సమయంలో.. రిటర్నింగ్ ఆఫీసరు ఇచ్చిన కవర్–బీ లేకపోయినా.. ఓటరు ఎవరో గుర్తించే విధంగా ఏమైనా గుర్తులు, లేక రాతలున్న సందర్భాల్లో తిరస్కరింవచ్చు. -
సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించొద్దు
సాక్షి, అమరావతి: డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంప్ (సీల్) లేదన్న ఏకైక కారణంతో పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. జూన్ 4న రాష్ట్రంలో జరిగే ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను స్పష్టంచేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి పలు విజ్ఞాపనలు వచ్చాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న మీనా జూలై 19, 2023లో కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలను ఉటంకిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీచేశారు. దీని ప్రకారం.. ⇒ డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా తప్పనిసరిగా ఉండాలని, ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ⇒ ఒకవేళ అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం మీద అనుమానమొస్తే ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద రిటర్నింగ్ ఆఫీసర్లు ఏర్పాటుచేసిన అటెస్టింగ్ ఆఫీసర్ల వివరాలతో సరిపోల్చి నిర్ణయం తీసుకోవాలి. ⇒ అదే విధంగా.. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ ఆఫీసరుగానీ లేదా ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ⇒ బ్యాలెట్ పేపర్ వెనుక సంతకం విషయంలో ఏమైనా సందేహాలొస్తే సీరియల్ నెంబర్ ప్రకారం కౌంటర్ ఫాయిల్‌ను పరిశీలించి అది నిజమైన బ్యాలెట్ అవునా కాదా అని నిర్థారించుకోవాలి. ఒకవేళ సందేహం ఉంటే వాటిని తిరస్కరించాలి. ⇒ అలాగే, ఓటరు కవర్–బీ మీద సంతకంలేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. డిక్లరేషన్ ఫాం–13ఏ ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవికాక.. బ్యాలెట్ పేపర్ ఉండే ఇన్నర్ కవర్ ఫారం–13బీనీ తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును తిరస్కరించవచ్చు.. ⇒ కవర్–బీని తెరవగానే, ఓటరు డిక్లరేషన్ ఫారం లేకపోతే, డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ లేదా అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, ఫారం–13ఏ, ఫారం–13బీలో బ్యాలెట్ సీరియల్ నెంబర్లు వేర్వేరుగా ఉంటే బ్యాలెట్ పేపర్ తెరవకుండానే తిరస్కరించొచ్చు. ఈ విధానం అంతా పూర్తయి బ్యాలెట్ పేపరు తెరిచిన తర్వాత ఈ దిగువ పేర్కొన్న సందర్భాల్లో కూడా ఓటును తిరస్కరించొచ్చు. ⇒ ఎవరికి ఓటు వేయకపోతే.. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటువేసినా.. అనుమానా స్పద బ్యాలెట్ పేపరుగా గుర్తించినా.. బ్యాలెట్ పేపరు చిరిగిపోయినా.. అది నిజమైన బ్యాలెట్ అని నిర్థారించడానికి అవకాశంలేని సమయంలో.. రిటర్నింగ్ ఆఫీసరు ఇచ్చిన కవర్–బీ లేకపోతే.. ఓటరు ఎవరో గుర్తించే విధంగా ఏమైనా గుర్తులు, లేక రాతలున్న సందర్భాల్లో తిరస్కరిస్తారు. ఈ విషయాలను రాజకీయ పారీ్టలు, కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కలి్పంచేలా రిటర్నింగు అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మీనా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ మెమో జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్‌ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ పై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది.పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని ఈసీ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సి పై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏ లో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించ వచ్చని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
ఓట్ల లెక్కింపు ఇలా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల తరలింపు మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపర్చారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్ నంబర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్‌తో అవసరం లేదు. కౌంటింగ్ హాల్లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన కంట్రోల్ యూనిట్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్‌గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న (క్లోజ్ రిజల్ట్ క్లియర్–సీఆర్సీ) ఓటింగ్ యంత్రాలతో పాటు మాక్ పోలింగ్ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. -
ట్రెండ్ తెలియాలంటే నిరీక్షించాల్సిందే
సాక్షి, అమరావతి: భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో ఈదఫా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 4న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా తొలి అంచనాల సరళి తెలుసుకునేందుకు నిరీక్షించక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తైన తరువాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నందున చాలా చోట్ల తొలి రౌండ్ ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.2019 ఎన్నికల్లో 2.62 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా ఈసారి 4.97 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లేశారు. 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతోపాటు అత్యవసర సేవల సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, కెమెరా అసిసెంట్లు, ప్రైవేట్ డ్రైవర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలి్పంచారు. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 4.44 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.వీరే కాకుండా తొలిసారిగా రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ విధానం ద్వారా 85 ఏళ్లు దాటిన 13,700 మంది వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటేయగా అత్యవసర సేవలందించే మరో 27,100 మంది కూడా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865, నంద్యాల జిల్లాలో 25,283, వైఎస్ఆర్ కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు అధికంగా నమోదు కావడంతో లెక్కించేందుకు అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే.. ఈవీఎంలతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కవర్ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు అర్హమైనదో కాదో గుర్తించాలి. కవర్ ‘ఏ’తో పాటు ఓటరు డిక్లరేషన్ ఫారం విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు. గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణించరు. ప్రతి ఫెసిలిటేషన్ కేంద్రంలో గెజిటెడ్ అధికారిని అందుబాటులో ఉంచినా చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని సమాచారం.పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటరి్నంగ్ అధికా>రి సీల్, సంతకం లేకుంటే ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. ఇలా పలు అంశాలను పరిశీలించాకే అర్హత పొందిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. 2019 ఎన్నికల్లో 56 వేల పోస్టల్ బ్యాలెట్లు (21.37 శాతం) చెల్లకుండా పోయాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అందువల్ల ఉదయం తొమ్మిదిన్నర పది గంటల తర్వాతే తొలి అంచనాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. -
అందరి కన్నూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే..
సాక్షి, అమరావతి : గతవారం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఈ ఓట్లలో అత్యధికం చెల్లని ఓట్లుగా మిగిలిపోవడంతో ఈసారీ అలాంటి పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఎంతమేర ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో ఏకంగా 56,545 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. అంటే.. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 19.17 శాతం (దాదాపు ఐదో వంతు) ఓట్లు చెల్లనవిగా మిగిలిపోయాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన వివరాల ప్రకారం 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. ఇలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో అత్యధికులు బీఎల్వోలుగానో లేదంటే ఇతర రూపంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. దీంతో 2019 ఎన్నికలంటే దాదాపు 50 శాతం అధిక సంఖ్యలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పెరుగుదల కనిపించింది. అయితే, ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై అందజేసిన వినతిపత్రాలతో ఈసారీ అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లని పరిస్థితే ఉంటుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును చెల్లని ఓటుగా కాకుండా లెక్కింపులోకి తీసుకోవాలంటూ ఆయా పార్టీలు తమ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశాయి. దీంతో నమోదైన 4.44 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి సంతకంతో ఎన్ని నమోదయ్యాయి.. ఎన్నింటిపై సంతకంలేకుండా ఉన్నాయనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. -
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామా
-
పోస్టల్ బ్యాలెట్‌తో 3.03 లక్షల మంది ఓటు
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో మంగళవారం నాటికి 3.03 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని జిల్లాల్లో 3వ తేదీన, మరికొన్ని జిల్లాల్లో 4వ తేదీన హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమయ్యాయి.ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్‌కు 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల మంది పోలీసులు, హోమ్ ఓటింగ్ కేటగిరీ కింద 28 వేల మంది, ఎసెన్షియల్ సర్వీసెస్ కింద 31 వేల మంది ఉన్నారు. మిగిలిన వారిలో సెక్టార్ ఆఫీసర్లు, ఇతరులున్నారు. ఇప్పటివరకు 2.76 లక్షల మంది ఉద్యోగులు, దాదాపు 28 వేల మంది హోమ్ ఓటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీల వారు ఓట్లు వేశారు. కొందరు ఉద్యోగులు పలు రకాల కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోయారు. వారికి ఏ ఆర్వో పరిధిలో ఓటు ఉంటే.. ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలోనే స్పాట్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా మంగళ, బుధవారాల్లో అవకాశాన్ని కల్పించాం. ఈ విషయంపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రెండు రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశాం. కానీ ఈరోజు కూడా కొన్ని సమస్యలు తలెత్తాయని మా దృష్టికి వచ్చింది’ అని చెప్పారు.ప్రలోభాలకు గురైతే కఠిన చర్యలుపోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఉద్యోగులు కొందరు నగదు తీసుకొని ఓటు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది చెడు సంకేతం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేశాం. అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితా పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించాం. అతన్ని వెంటనే సస్పెండ్ చేశాం.విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఇద్దరి నుంచి నగదు సీజ్ చేసి అరెస్టు చేశాం. ఒంగోలులో యూపీఐ విధానం ద్వారా కొందరు ఉద్యోగులకు నగదు పంపించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా దాదాపు 8, 10 మంది ఉద్యోగులను గుర్తించాం’ అని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. కాగా, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పలువురు వీవీఐపీలు పర్యటిస్తున్న నేపథ్యంలో బందోబస్తులో ఉండే పోలీసులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. బందోబస్తులో పాల్గొనే పోలీసులు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. ఇంకా ఎవరైనా పోలీసులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోకపోతే.. ఈ నెల 9న వారికి అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశాం’ అని చెప్పారు. -
ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
నరసరావుపేట రూరల్/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పెనమలూరు: పోలింగ్‌తేదీ సమీపిస్తున్న కొద్దీ ఓటమి తథ్యమనే విషయం తెలుస్తుండటంతో టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను కొల్లగొట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్లంఘించి ప్రలోభాల వలలు విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం కూడా నగదు ఎర వేస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, బెదిరిస్తూ.. ఏదో ఒకరకంగా ఓట్లు వేయించుకోవాలని బరితెగించి వ్యవహరించారు. ప్రశ్నించినవారిపై దాడిచేసి కిడ్నాప్ చేస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్సీపీ వారిపై రాళ్లదాడులకు దిగుతున్నారు. నరసరావుపేటలో ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కిడ్నాప్ నరసరావుపేటలో ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్ల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఓటర్లకు నగదు ఎర చూపారు. దీన్ని సెల్ఫోన్లో చిత్రీకరించిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణరెడ్డి అక్కడున్న పోలీసు అధికారులకు చూపించారు. పోలీసులు.. టీడీపీ నాయకుల ప్రచారానికి అభ్యంతరం తెలిపి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో టీడీపీ వారు సత్యనారాయణరెడ్డిపై దాడిచేసి కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. విషయం తెలిసి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. అక్కడున్న టీడీపీ వారిని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై తెలుగుదేశం వర్గీయులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా, తనపై దాడిచేసి బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మధిర సత్యనారాయణరెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులకు చెందిన ఈ విద్యాసంస్థలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై వైఎస్సార్సీపీ వర్గీయులు కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిస్పాక్షికంగా ఉన్న ఉద్యోగులే లక్ష్యం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ హై సూ్కల్‌కు ఎదురుగా ఉన్న పోలింగ్ కేంద్రం సమీపంలో టీడీపీ నాయకులు పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, బొట్ట రమణ నిస్పాక్షికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా హడావుడి చేశారు. ఓటర్ల వివరాలు నమోదు చేసుకున్న కార్యకర్తలు తర్వాత ఫోన్ పే, గుగూల్ పే వంటి వాటిని ఉపయోగించినట్లు తెలిసింది.ఉద్యోగి ఓటు వేసిన మరో వ్యక్తికృష్ణాజిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన 141 పోలింగ్ కేంద్రంలో పెనమలూరు సచివాలయం–1లో డిజిటల్ అసిస్టెంట్ మట్ట కిషోర్‌బాబు ఓటును గుర్తుతెలియని వారు వేశారు. సోమవారం ఓటేసేందుకు వచ్చిన కిషోర్‌బాబు తన ఓటు అప్పటికే వేసి ఉండటంతో అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు కూడా నిరసన తెలిపి కిషోర్‌కు ఓటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిషోర్‌బాబుకు మంగళవారం 140వ బూత్‌లో ఓటు కల్పిస్తామని ఏఆర్వో వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం హెల్ప్‌డెసు్కలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఎల్.గోవిందరాజులు టీడీపీకి ఓటేయాలని తమకు సూచించారని ఉయ్యూరు ఏజీ ఆండ్ ఎస్జీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు చెప్పారు. దీనిపై వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఏఆర్వోకి ఫిర్యాదు చేశారు. దీంతో గోవిందరాజులును ఎన్నికల విధుల నుంచి తప్పించారు. -
పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి నెట్వర్క్: ఓటమి భయం వెంటాడుతుండటంతో టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు హాజరయ్యే ఉద్యోగులను ప్రలోభపెట్టేలా.. ఎన్నికల నియమావళి యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అకృత్యాలకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసింది.వివిధ ప్రాంతాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాలకు పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాగా.. వారిని సామ, దాన, దండోపాయాలతో లోబర్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే నగదు పంపిణీ చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై పచ్చదండు దాడులకు యత్నించింది. టీడీపీ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసిన వారితో ఉద్యోగులకు ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు. కొన్నిచోట్ల పోలింగ్ అధికారులను, పోలీసులను సైతం బెదిరించారు.విశాఖలో ఇలా..సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఏయూ తెలుగు, ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో చేపట్టారు. పోలింగ్ కేంద్రం ఎదురుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు అనుచరులు హల్చల్ చేశారు. వెలగపూడి అనుచరుడు కాళ్ల శంకర్, టీడీపీ నాయకుడు పోతన్న రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొట్ట వెంకట రమణ అక్కడే ఉండి ప్రత్యక్షంగా టీడీపీకి ప్రచారం చేశారు. వెలగపూడికి చెందిన రెండు ప్రచార వాహనాలు ఏయూ ఇన్‌గేట్, అవుట్ గేట్ మధ్యలో భారీ శబ్ధంతో కూడిన మైక్‌లను పెట్టుకుని అటూఇటూ తిరుగుతూ ప్రచారం చేశారు. కొంతమంది ఓటర్లకు డబ్బులు పంపిణీ, మరికొందరికి గూగుల్‌పే, ఫోన్ పే చేస్తూ ప్రలోభాలకు గురి చేశారు.చిత్తూరులోనూ ఇదే పద్ధతితిరుపతిలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం పేరుతో టీడీపీ నేతలు హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాలకు అత్యంత సమీపంలోనే కొందరు ఓటర్లకు బలవంతంగా నగదు పంపిణీకి యత్నించారు. ఎన్నికల అధికారులను, పోలీసుల హెచ్చరికలను సైతం ఏమాత్రం లెక్కచేయలేదు. ఉద్యోగ సంఘ మాజీ నేతలు కొందరు ప్రలోభాల పర్వానికి సహకరించారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ ప్రచార వాహనాలు యథేచ్ఛగా తిరిగినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు.చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేశారు. పుంగనూరులో ఓటర్లను బెదిరించారు. పూతలపట్టులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. పలమనేరులోని ఓ హోటల్లో ఉద్యోగులకు విందు ఏర్పాటు చేశారు. నగరిలో ఉపాధ్యాయులకు యూనియన్ మాజీ నేతల ద్వారా ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు.పులివెందులలో అధికారికి బెదిరింపువైఎస్సార్ జిల్లా పులివెందులలో పోలింగ్ ట్రైనింగ్ అధికారి సంగం మహేశ్వరరెడ్డిపై టీడీపీ నాయకులు అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి, దర్బార్‌బాషా, అంజుగట్టు రవితేజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఆయనను దుర్భాషలాడుతూ బయటకు నెట్టివేశారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. టీడీపీ నాయకులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగకుండా ఇలాంటి వివాదాలకు పాల్పడుతున్నట్టు అవగతమవుతోంది.బద్వేలులోని జెడ్పీ హైస్కూల్లోని ఫెసిలిటేషన్ సెంటర్‌కు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో తిష్టవేసిన టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీచేశారు. కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు షేక్‌హుస్సేన్ ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కాడు.తిరుపతిలో తాయిలాల ఎరతిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద టీడీపీ, జనసేన అభ్యర్థులు హల్చల్ చేశారు. ముందురోజు రాత్రే కొందరు ఉద్యోగులకు తాయిలాల ఎర చూపారు. శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సెంటర్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ హడావుడి చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన ఆయనను పోలీసు అధికారులు ప్రశ్నించడంతో సుధీర్ మీ అంతు చూస్తా అంటూ బూతు పురాణం అందుకున్నారు.గుంటూరులో తికమకపెట్టేలా..గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగులను తికమకపెట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేతలు పోస్టింగ్‌లు పెట్టారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా.. అధికారుల మధ్య సమన్వయలోపం, అవగాహన రాహిత్యం బట్టబయలయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి కార్యాలయం నుంచి బ్యాలెట్ ఓటింగ్ వద్ద గొడవ జరుగుతోందని, రెచ్చగొట్టే విధంగా మెసేజ్‌లు పెట్టారు. -
పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విద్యావంతులు సైతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3073 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ స్పష్టమైన అధిక్యతను కనబర్చారు. ఆయనకు 1140 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 595 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డికి 961 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలువడం గమనార్హం. కాగా నోటాకు 10మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం 1700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు అత్యధికంగా 718 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 495 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అడే గజేందర్‌కు 371 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది మంది నోటాకు ఓటేయడం గమనార్హం. ఇవి కూడా చదవండి: స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు! -
చాంద్రాయణగుట్ట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అక్బరుద్దీన్ ముందంజ
-
TS: పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ..
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీఆర్ఎస్పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్లో కాంగ్రెస్ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ముందంజ ఉండగా, గజ్వేల్ తొలిరౌండ్లో కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. ఉమ్మడి కరీనగర్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ముందంజలో ఉంది. మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఉండగా, నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సాగుతున్నారు. అశ్వారావుపేట తొలిరౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. చదవండి: ‘ఎగ్జిట్ పోల్స్’ కంటే మిన్నగా.. -
కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజ
-
పోస్టల్ బ్యాలెట్ లో బండి సంజయ్ ముందంజ..
-
మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం..
-
RangaReddy: ఆర్డీవో ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. పోస్టల్ బ్యాలెట్‌కు నో సీల్!
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నవంబర్ 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కి అధికారులు పంపించకపోవడం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవో ఆఫీసు వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించలేదు. దీంతో, ఈ విషయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడ ఉద్రికత్త పరిస్థితి చోటుచేసుకుంది. అనంతరం, పోస్టల్ బ్యాలెట్‌ను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఇక, పోస్టల్ బ్యాలెట్‌ను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన తర్వాతే అధికారులు సీల్ వేశారు. పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్‌కు తాళం లేకపోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆర్డీవోను నిలదీశారు. -
పోస్టల్ బ్యాలెట్ వివాదం.. నోడల్ అధికారి సస్పెన్షన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ వివాదానికి సంబంధించి నోడల్ అధికారిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. బాలాఘాట్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ముందే పోస్టల్ బ్యాలెట్లను తెరిచినందుకు సంబంధించి పోస్టల్ నోడల్ అధికారిని సస్పెండ్ చేసినట్లు మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనుపమ్ రాజన్ మంగళవారం తెలిపారు. సస్పెండ్ అయిన అధికారిని తహసీల్దార్ హిమ్మత్ సింగ్‌గా గుర్తించారు. ‘బాలాఘాట్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్రమబద్ధీకరించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే ఇది జరిగింది. సమయానికి ముందే బ్యాలెట్ బాక్స్ తెరవడంలో విధానపరమైన లోపం సంభవించింది. దీనికి బాధ్యుడైన పోస్టల్ నోడల్ అధికారి సస్పెండ్ చేయడం జరిగింది’ అని ఎన్నికల ప్రధాన అధికారి రాజన్ చెప్పారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను ఓటు వేయడానికి అనుమతించడం లేదన్న రాజకీయ పార్టీల ఆరోపణపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్రంలో సుమారు 3.23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని సీఈవో రాజన్ తెలిపారు. డిసెంబరు 3న రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. -
మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం!
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది కూడా. ఐతే ఈలోపు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్‌ని కొందరూ అధికారులు ఓపెన్ చేసినట్లు కలకలం రేగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బాలఘాట్‌లో పోస్టల్ బ్యాలెట్లు వ్యవహారంలో ట్యాపరింగ్‌కు పాల్పడే అవకాశం ఉందంటూ ఎన్నికాల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇది చాల తీవ్రమైన విషయం అని, బాధ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే తమ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి వివాదాలు జరగకుండా చూసుకోవాలని ట్విట్టర్లో పేర్కొంది కాంగ్రెస్. ఇక ఆ వీడియోలో కొందరూ అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లో పోస్టల్ బ్యాలెట్లను తెరిచినట్లు కనిపించింది. దీంతో కాంగ్రెస్ ఆ జిల్లా కలెక్టరే స్ట్రాంగ్ రూంని ఓపెన్ చేశారని, ఇతర అధికారులు అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్ట్ బ్యాలెట్లు ఓపెన్ చేశారని ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా ఈ వివాదం చెలరేగిన కాసేపటికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు షఫ్ఖత్ ఖాన్ మాట్లాడుతూ..డ్యూటీలో ఉన్న సిబ్బంది ఈ విషయం గురించి మా పార్టీ ప్రతినిధికి సంతృప్తికరమైన రీతిలో సమాధానం ఇవ్వకపోవడం ఈ గందరగోళం ఏర్పడిందని తెలిపారు. అయితే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఈ కన్‌ఫ్యూజ్‌ని క్లియర్ చేసిందని వివరించారు. ఈ వివాదం విషయమై బాలాఘాట్‌లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిని డివిజనల్ కమిషనర్ సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. దీంతో వివాదం సద్దుమణిందింది. ఈ మేరకు స్థానిక మేజిస్ట్రేట్ గోపాల్ సోనీ విలేకరులతో మాట్లాడుతూ.."ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్)ని ఉంచడం, వాటిని 50 బండిల్స్‌గా క్రమబద్ధీకరించడం అనేది సాధారణ ప్రక్రియ. ఈ ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరాల సమక్షంలోనే జరుగుతుందని, అలాగే బయట సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. వాస్తవానికి స్థానిక తహసీల్ కార్యాలయంలోని ఒక గది పోస్టల్ బ్యాలెట్ల కోసం స్ట్రాంగ్ రూమ్‌గా కేటాయించారు. ఇక్కడ బాలాఘాట్ అసెంబ్లీ స్థానాల పోస్టల్ బ్యాలెట్లు తోపాటుఇతర ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పోస్టల్ బ్యాలెట్లను కూడా సీసీటీవీ నిఘాలోనే భద్రపరచడమే జరుగుతుంది. అందువల్ల ప్రతీరోజు అందుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్లు ఇక్కడకు రావడం జరుగతుంది. కాబట్టి తాము ఈ స్ట్రాంగ్ రూమ్‌ని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే తెరవడం జరుతుంది. తదనంతరం ఒక్కొక్క అసెంబ్లీ స్థానాల వారీగా పోస్టల్ బ్యాలెట్లను క్రమబద్ధీకరించడం జరుగుతుందని వివరించారు స్థానిక మెజిస్ట్రేట్. కాగా, నవంబర్ 17న ముగిసిన పోలింగ్‌లో మళ్లీ కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా యత్నిస్తుంది. 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం దక్కించుకున్నప్పటికీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా 20 మందికి పైగా విధేయులైన ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచి ఎలాగైన తన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్‌ని మట్టికరిపించేలా ప్రజలు తమనే గెలిపిస్తారని దీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. निर्वाचन को कलंकित करते बालाघाट कलेक्टर मध्यप्रदेश के बालाघाट जिले के कलेक्टर डॉ. गिरीश मिश्रा ने आज 27 नवंबर को ही स्ट्रांग रूम खुलवाकर बिना अभ्यर्थियों को सूचना दिए डाक मतपत्रों की पेटियां खोल दी है। अंतिम साँसें गिनती शिवराज सरकार और सरकार की अंधभक्ति में लीन कलेक्टर… pic.twitter.com/I1UrKmHK5B — MP Congress (@INCMP) November 27, 2023 (చదవండి: వారిని ప్రజలు పట్టించుకోలేదు.. సీఎం గెహ్లాట్ ధీమా!) -
నేడూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ విధుల్లో నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి తమ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదిస్తే, వారికి మంగళవారం కూడా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించలేదని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సదరు ఉద్యోగి పేరుతో ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ జారీ కాలేదని ధ్రువీకరించుకున్న తర్వాత వారికి పోస్టల్ బ్యాలెట్ అందజేసి, ఓట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటేసేందుకు అనుమతించాలని సీఈఓ తెలిపారు. ఒకవేళ ఉద్యోగి పేరుతో అప్పటికే పోస్టల్ బ్యాలెట్ జారీ అయితే మళ్లీ కొత్త పోస్టల్ బ్యాలెట్ జారీ చేయరాదని స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఏ జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారికి చేరిందో తెలియజేయాలని సూచించారు. ఉద్యోగిని ఎన్నికల విధుల కోసం అదే జిల్లాకు కేటాయించినా, ఇతర జిల్లాకు కేటాయించినా ఈ నిబంధనలను పాటించాలని తెలిపారు. ఉద్యోగులు పోస్టల్ ఓటు వేసేందుకు డ్యూటీ ఆర్డర్ కాపీతో తమ ఓటు ఉన్న నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని కలవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయమై ఉద్యోగ సంఘాలు పలుమార్లు సీఈఓకు విన్నవించాయి. బండి సంజయ్ కూడా ఈసీకి లేఖ రాశారు. -
'పోస్టల్ బ్యాలెట్' మిస్సింగ్.. ఉద్యోగుల్లో కలవరం..!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి అందించే పోస్టల్ బ్యాలెట్ మిస్సింగ్ అవ్వడం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 ద్వారా ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. దీని దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీన ముగిసింది. అయితే పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు 15 మంది కార్యాలయాలకు వెళ్లగా మీ దరఖాస్తులు అందలేదని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయారు. తాము ఇదివరకే దరఖాస్తు చేసుకున్నా ఎందుకు అందలేదని అధికారులను ప్రశ్నించగా, వారినుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమని చెప్పే అధికారులు ఇలా తాము చేసుకున్న దరఖాస్తులను ఇంత నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. ఎన్ని గల్లంతయ్యాయనే సమాచారం కోసం కలెక్టరేట్ పర్యవేక్షకురాలు జాడి స్వాతిని సంప్రదించగా.. ఎలాంటి పోస్టల్ బ్యాలెట్ మిస్ అవ్వలేదని పేర్కొన్నారు. అయితే ఇంకా దరఖాస్తులు అందాల్సి ఉందని, అవి పూర్తిస్థాయిలో వస్తే తప్పా ఎన్ని వచ్చా యి.. ఎన్ని రాలేదనే సమాచారం చెబుతామని పేర్కొనడం గమనార్హం. ఇవి చదవండి: ‘సారూ.. మంచిగ చెప్పిండ్రు..' అందరు మూడు తోవల పోతున్నరు! -
ఆర్వోల నిర్ణయమే అంతిమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేషన్ల పరి శీలనలో రిటర్నింగ్ అధికారు (ఆర్వో)లు తీసుకున్న నిర్ణయాలే అంతిమమని, వాటిపై పునః సమీక్ష జరిపే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం లేదని రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధాన అధికారి (డిప్యూటీ సీఈఓ) సత్యవాణి స్పష్టం చేశారు. కొందరు అభ్యర్థుల విషయంలో ఆర్వోల నిర్ణయాలపై వచ్చిన ఫిర్యాదులను తిరిగి వారికే పంపించినట్టు తెలిపారు. ఆర్వోలకు క్వాజీ జ్యుడీషియల్ అధికారాలుంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను వివరించేందుకు శుక్రవారం ఆమె బీఆర్కేఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 18లోగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, 20 లోగా ఈవీఎంల బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేస్తామన్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం 299 అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతినిచ్చిందని, దీంతో రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655కి పెరిగిందని చెప్పారు. ప్రతి జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దే ఈవీఎంలను నిల్వ చేసే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయని తెలిపారు. పోలింగ్‌లో వినియోగించిన ఈవీఎంలను కేటగిరీ–ఏ, పోలింగ్ సందర్భంగా మొరాయించిన ఈవీఎంలను కేటగిరీ–బీ కింద పరిగణించి ఒకే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తామన్నారు. మాక్‌పోల్‌కి వాడిన ఈవీఎంలను కేటగిరీ–సీ, రిజర్వ్ ఈవీఎంలను కేటగిరీ–డీ కింద పరిగణించి వేర్వేరు స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరుస్తామని వివరించారు. 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వయోజన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించే తేదీలను స్థానిక రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారని సత్యవాణి తెలిపారు. మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను నిర్వహిస్తారన్నారు. పోలింగ్ నవంబర్ 30న జరగనుండగా, దానికి 3 రోజుల ముందులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పాస్‌లు రావడంలో జాప్యం కావడంతో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను జిల్లాల కలెక్టర్లు తిరస్కరించిన అంశంపై పరిశీలన చేస్తామన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ 28,057
సాక్షి, హైదరాబాద్: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మందికి పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వచ్ఛిన ‘ఫారం–12డీ’దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారులు అనుమతించిన పోస్ట ల్ బ్యాలెట్ వివరాలను గురువారం ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం మొత్తం 44,097 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అధికారులు 28,057 మంది అర్హులను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం పరిధిలో 707 దరఖాస్తులు రాగా, వాటన్నిటికీ రిటర్నింగ్ అధికారులు అనుమతిచ్చారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో 706 దరఖాస్తులు రాగా వాటికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 812 దరఖాస్తులకు గాను 757 పోస్టల్ బ్యాలెట్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన 610 దరఖాస్తుల్లో 339 మాత్రమే అంగీకరించారు. అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గ పరిధిలో 19 దరఖాస్తులురాగా, రిటర్నింగ్ అధికారులు అంగీకరించారు. నారాయణపేట్ నియోజకవర్గ పరిధి లో 28 దరఖాస్తులు రాగా, 28 దరఖాస్తులను, వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో 30 దరఖాస్తులకుగాను 26 పోస్ట ల్ బ్యాలెట్లను అనుమతించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో 31 దరఖాస్తులకుగాను 31 పోస్టల్ బ్యాలెట్లు, కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో 34 దరఖాస్తు లు రాగా, వాటన్నిటినీ రిటర్నింగ్ అధికారులు అంగీకరించారు. ఎన్నికల విధులతో సంబంధం లేని 13 రకాల అత్యవసర సేవల్లో నిమగ్నమై ఉండే ఓటర్లకు తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించాలన్న సీఈసీ ఆదేశాల మేరకు వారికీ ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఇచ్ఛినట్టు తెలిసింది. -
మాస్టార్ తిప్పండి
వనం దుర్గాప్రసాద్ : ఉపాధ్యాయ ఓటర్లను సానుకూలంగా మార్చుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఆయా అనుబంధ సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నాయి. పరోక్ష సహకారం అందించాలని కోరుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ నేత హైదరాబాద్‌లో ఓ ఉపాధ్యాయ సంఘం నేతలకు పెద్దఎత్తున విందు ఏర్పాటు చేయడం వివాదమైంది. ఈ విందు సందర్భంగా జిల్లాలవారీగా సంఘ నేతలను పరోక్ష ప్రచారంలోకి దించాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇదే మాదిరి ఇప్పుడు ఇతర పార్టీలూ తమ అనుబంధ సంఘాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఏయే హామీలివ్వాలనే దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. ఇందులో 80 వేల మంది వరకూ ఎన్నికల విధుల్లో ఉంటారు. వీళ్లంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగిస్తారు. ఉపాధ్యాయ కుటుంబాల నుంచి దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటాయి. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలున్నాయి. ఓడీల తాయిలం... ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్లుగా ఆన్ డ్యూటీ కోసం పోరాడుతున్నాయి. గత ఏడాది ఏకంగా 14 సంఘాలకు ప్రభుత్వం ఓడీ ఇచ్చింది. కానీ గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయ్యింది. అప్పట్నుంచీ దీన్ని పొడిగించకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికల సందర్భంగా నేతల వద్ద కూడా ఇదే అంశాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. సంఘాల నేతలకు ఓడీ ఇస్తామన్న భరోసా ఉండాలని అన్ని సంఘాలు పార్టీలను కోరుతున్నాయి. ఓడీ ఇవ్వడం ద్వారా టీచర్ల సంఘ నేతలు విధులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్నికల ముందు కేవలం ఒకేఒక సంఘానికి ఓడీ లభించడం కూడా ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్న ధోరణికి కారణమైంది. ఓడీ ఇచ్చిన సంఘానికి వ్యతిరేకంగా ఓడీ రాని సంఘాలు ఏకమవ్వడాన్ని వివిధ పార్టీలు గుర్తిస్తున్నాయి. వీరిని సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులూ కీలకమే.. దీర్ఘకాలంగా బదిలీలు, పదోన్నతులపై టీచర్లు ఆశలు పెట్టుకున్నారు. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా 317 జీఓ అమలు చేశారు. ఇది కూడా కొంతమంది ఉపాధ్యాయుల్లో అసంతృప్తి కలిగించింది. సాధారణ బదిలీల్లో కొన్ని మార్పులుంటాయని టీచర్లు ఆశించారు. కానీ 2022లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం భావించినా, కోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. దీంతో బదిలీలు, పదోన్నతులపై పార్టీలు స్పష్టత ఇవ్వాలని మెజారిటీ టీచర్లు కోరుతున్నారు. దీన్ని గుర్తించిన పార్టీలు ఆ దిశగా అడుగులేసేందుకు సిద్ధపడుతున్నాయి. వీలైతే ఎన్నికల ప్రచారంలో ఎక్కడో చోట దీన్ని ప్రస్తావించి, టీచర్ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. దీంతో పాటు ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల నియామకంపై కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన వచ్చే అవకాశముంది. విందు, వినోద రాజకీయాలు మాతో వద్దు టీచర్లకయినా వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. ఇదేమీ తప్పుకాదు. కానీ విధి నిర్వహణపై ప్రభావం చూపకూడదు. ఎన్నికలవేళ రాజకీయ పార్టీల విందులు, వినోదాలకు వెళ్లే చిల్లర రాజకీయాలు ఆమోదయోగ్యం కాదు. నాయకులే కాదు..ఓటర్లనూ ఇది ప్రలోభ పెట్టే చర్యగానే చూడాలి. ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడి పవిత్రతను అందరూ కాపాడాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వృత్తి గౌరవమే ముఖ్యం ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వ్యక్తి. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘ నేతలూ గుర్తించాలి. ఓట్ల ప్రలోభాలకు టీచర్లను లక్ష్యంగా చేయొద్దు. ఉపాధ్యాయూలూ దీనికి దూరంగా ఉండాలి. వృత్తి గౌరవాన్ని భంగపరిచే చర్యలకు పాల్పడొద్దు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత సంఘ నేతలకు ఉంది. –సయ్యద్ షౌకత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
తెలంగాణ ఎన్నికలు.. సాయుధ బలగం ఎవరివైపో?
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ సాయుధ బలగాల ఓట్లు కూడా అంతే ముఖ్యంగా అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే సర్విస్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థులు వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఇక ఈ ఎన్నికలలో మెజారిటీ సర్వీస్ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపిస్తారోనన్న చర్చ కూడా సాగుతోంది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో... రాష్ట్రవ్యాప్తంగా 15,406 మంది సర్విస్ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 930 మంది, అత్యల్పంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 98 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. గ్రామీణ నియోజకవర్గాలలో వందల సంఖ్యలో సర్విస్ ఓటర్లు ఉండగా.. అర్బన్ నియోజకవర్గాలలో 10 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండటం గమనార్హం. అత్యల్ప సర్వీస్ ఓటర్లు గ్రేటర్‌లోనే.. హైదరాబాద్‌లో 404 మంది, రంగారెడ్డి జిల్లాలో 592, మేడ్చల్ జిల్లాలో 732 మంది సర్వీస్ ఓటర్లున్నారు. రాష్ట్రంలో అత్యల్ప సర్వీస్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. బహదూర్‌పుర, చార్మినార్, మలక్‌పేటలో ఒక్కో నియోజకవర్గాలలో కేవలం 9 మంది సర్విస్ ఓటర్లు ఉండగా.. సనత్‌నగర్, గోషామహల్ సెగ్మెంట్లలో 10 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. సర్విస్ ఓటర్లు ఎవరంటే.. భారత సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్ పారామిలటరీ దళం, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీఎఫ్, జీఆర్ఈఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగులను సర్విస్ ఓటర్లుగా పరిగణిస్తారు. వీళ్లు పోస్టల్ బ్యాలెట్ లేదా ప్రాక్సీ ఓట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటు ఎలా వేస్తారంటే.. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ఆఫీసర్ సర్విస్ ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ పంపిస్తారు. ఒకవేళ సర్విస్ ఓటరు విదేశాల్లో ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా పంపిస్తారు. ఆ పేపర్ మీద మీకు నచ్ఛిన అభ్యర్థి పేరుకు ఎదురుగా స్పష్టమైన గుర్తును ఉంచితే ఓటు వేసినట్టు. ఒకవేళ వీరు సూచించిన గుర్తు స్పష్టంగా కనిపించకపోయినా, బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేదా ఏదైనా పదాలు రాసినా ఓటు చెల్లదు. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపరుతో పంపిన ‘ఏ’ గుర్తు ఉన్న చిన్న కవర్లో పెట్టి, సీల్ చేసి, రిటర్నింగ్అధికారికి పోస్టులో పంపించాలి. మహిళ సర్విస్ ఓటరైతే.. ఉద్యోగరీత్యా ప్రస్తుతం వేరే చోట నివాసం ఉంటున్నప్పటికీ సర్విస్ ఓటర్లు వారి స్థానిక నియోజకవర్గంలో ఓటు వేయవచ్చు. ఒకవేళ కుటుంబంతో సహా కలిసి పోస్టింగ్ చేస్తున్న ప్రాంతంలోనే నివసిస్తే గనక అక్కడే సాధారణ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకునే కుటుంబ సభ్యుల అర్హత ప్రమాణాలలో ఆసక్తికరమైన అంశం ఒకటుంది. సాధారణంగా సర్విస్ ఓటరు భార్య, కుటుంబ సభ్యులు కూడా సంబంధిత నియోజకవర్గంలో సర్విస్ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఒకవేళ సర్విస్ ఓటరు గనక మహిళ అయితే మాత్రం భర్తకు ఈ నిబంధన వర్తించదు. -
పోస్టల్ బ్యాలెట్‌కు.. ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం!
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ఎ న్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన పోస్టల్ బ్యాలెట్ కు జిల్లాలో స్పందన అంతంతగానే కనిపించింది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటర్ల కు సంబంధించి అందిన దరఖాస్తులను పరిశీలి స్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అధికార యంత్రాంగం తగు ప్రచారం కల్పించకపోవడం, దరఖాస్తు విధానంపై అవగాహన లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నెల 30న నిర్వహించే ఎన్నికల్లో ఆయా వర్గాల వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వినియోగం కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తప్పేలా కనిపించడం లేదు. పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా.. ఓటు వినియోగంపై అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా పోలింగ్ శాతం 70 నుంచి 80శాతానికి మించి దాటడం లేదు. ఓటు వేసేందుకు గాను ఆయా కేంద్రాలకు వచ్చేందుకు వృద్ధులు, వైకల్యంతో దివ్యాంగులు ఎక్కువగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వారితో పాటు అత్యవసరమైన సేవలందించే వైద్యారోగ్య, విద్యుత్, రైల్వే, ఆర్టీసీ, పౌరసరఫరాలు, బీఎస్ఎన్ఎల్, ఫైర్,ఎయిర్‌పోర్టు అధార్టీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్, పీఐబీ, దూరదర్శన్, ఆలిండియారేడియా ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు ఇంటి నుంచే ఓటు వేసేలా సీఈసీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఓటింగ్ శాతం పెంచవచ్చని భావించింది. ఆయా వర్గాలకు దీనిపై అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా తగు ప్రచారం కల్పించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. స్పందన రాలే.. ఈసీ ఆదేశాలు బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగంపై అవగాహన క ల్పించడంలో యంత్రాంగం అంతగా దృష్టిసారించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఫాం–12డీ కోసం కేవలం 727 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకో వాల్సిన వృద్ధులు, దివ్యాంగులుతో పాటు ఈసీ నిర్దేశించిన ఆయా కేటగిరీల వారు వేలల్లో ఉన్నపటికీ దరఖాస్తులు వందల్లో రావడం గమనార్హం. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అఽధికారులు అవగా హన కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవ డం, క్షేత్రస్థాయిలో ఆయావర్గాల వారు పోస్టల్ బ్యా లెట్‌కు దరఖాస్తు చేసుకునేలా చూడాల్సిన బీఎల్వోలు తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటు వినియోగానికి వృద్ధులు, దివ్యాంగులు మరోసారి ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈసీ ఇంటి వద్ద నుంచే ఓటేసే అవకాశం కల్పించిన దాన్ని తెలియజేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లక తప్పని దుస్థితి. ఫలితంగా ఆయా వర్గాలకు ఇబ్బందులు పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి చదవండి: విభిన్న తీర్పు! ప్రస్తుత ఎన్నికల ట్రెండ్‌పై సర్వత్రా ఆరా.. -
పోస్టల్ ఓట్లు ఎక్కువొచ్చాయా? అయితే తేడానే..
మేకల కళ్యాణ్ చక్రవర్తి పోస్టల్ బ్యాలెట్.... ఎన్నికల ప్రక్రియలో చివరి అంకమైన కౌంటింగ్ మొదలు కాగానే వినిపించే ఫలితం ఇదే. రిజల్ట్కు సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్‌కు అద్దం పడతాయని భావించే ఈ పోస్టల్ ఓట్లంటే ప్రతి ఎన్నికల్లోనూ క్రేజే. ఎందుకంటే ఈవీఎంలలో పోలయిన ఓట్లను లెక్కించేందుకు ఓ అర గంట ముందే ఈ ఓట్లను లెక్కిస్తారు. వీటి లెక్క పూర్తి కాగానే పోస్టల్ బ్యాలెట్లో ఫలానా అభ్యర్థి ముందంజ... పోస్టల్ ఓట్లలో వెనుకబడిన ఫలానా అభ్యర్ధి... అంటూ వార్తలు వచ్చేస్తాయి. అయ్యో... మనోడు వెనుకబడ్డాడే... మన అభ్యర్థికి పోస్టల్ ఓట్లు బరాబర్ వచ్చినయ్.. కచ్చితంగా గెలుపు మనదే... అంటూ అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు కూడా పోస్టల్ ఫలితం రాగానే లెక్కలు వేసుకుంటుంటారు. గత ఎన్నికల్లో పొంతన లేకుండా 2018 ఎన్నికల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్‌కు, రిజల్ట్ ట్రెండ్స్‌కు అసలు పొంతనే లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు ఎక్కువగా వచ్చిన 75 మంది ఓడిపోయారు. 42 మంది మాత్రమే గెలిచారు. రెండు చోట్ల మాత్రం గెలిచిన వారికి, ఓడిన వారికి సమానంగా (తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి) ఈ ఓట్లు పోలయ్యాయి. కొన్ని చోట్ల అయితే మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థికి తొలి రెండు స్థానాల్లో ఉన్న వారికంటే ఎక్కువగా పోస్టల్ ఓట్లు రావడం గమనార్హం. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఉద్యోగుల మూడ్‌ను బట్టి ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టమేనని అర్థమవుతోంది. ప్రజల తీర్పు ఓ విధంగా ఉంటే ఎన్నికల విధుల నిర్వహించిన ఉద్యోగులు, సరీ్వస్ ఓటర్లు, ఇతర పోస్టల్ ఓటర్ల అభిప్రాయం మరోవిధంగా ఉందని తేలింది. చదవండి: Rahul Gandhi: విమర్శల బాణం.. ఆత్మీయ రాగం మూడో స్థానానికి ‘మెజారిటీ’ గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులకు కొన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. కల్వకుర్తిలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చల్లావంశీచందర్రెడ్డికి అత్యధికంగా 323 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మద్దతు తెలిపారు. అక్కడ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు 142, రెండో స్థానంలో నిలిచిన ఆచారికి 285 వచ్చాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో గెలుపొందిన జోగురామన్నకు 465 పోస్టల్ ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో వచ్చిన అభ్యర్థి పాయల్‌కు 290 పోస్టల్ ఓట్లు వస్తే మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాతకు ఏకంగా 578 మంది పోస్టల్ ఓట్లేశారు. బాల్కొండలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డికి 124 పోస్టల్ ఓట్లే వచ్చాయి. కానీ, మూడో స్థానంలో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనిల్‌కు ఏకంగా 298 ఓట్లు వస్తే, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కు 175 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. దుబ్బాకలో అందరికంటే మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఉద్యోగుల మెప్పు పొందారు. ఆయనకు 221 పోస్టల్ ఓట్లు వస్తే, గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి 187, రెండో స్థానంలో ఉన్న మద్దులకు 108 ఓట్లు రావడం గమనార్హం. రెండు చోట్ల సమానంగా పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోకెల్లా పోస్టల్ బ్యాలెట్లో విభిన్న తీర్పు పటాన్చెరు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో వచ్చింది. ఇక్కడ గెలిచిన అభ్యర్థులకు, వారి సమీప ప్రత్యర్థులకు సమానంగా పోస్టల్ బ్యాలెట్ పోలైంది. పటాన్ చెరులో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డికి 148, కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌కు 148 ఓట్లు వస్తే, చాంద్రాయణగుట్టలో గెలిచిన ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీకి 30, బీజేపీ అభ్యర్థిని షెహజాదికి 30 పోస్టల్ ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో పోస్టల్ ‘సిత్రాలు’ జరిగిన నియోజకవర్గాలివే.. ►జుక్కల్‌లో రెండో స్థానంలో నిలిచిన సౌదాగర్ గంగారాం (216)కు పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా పోలయ్యాయి. అయితే, ఇక్కడ గెలిచిన అభ్యర్థి హన్మంత్ షిండే (157) పోస్టల్ ఓట్లు వస్తే మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి అరుణతార (178)కు గెలిచిన అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. ►కామారెడ్డిలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్‌కు 206, రెండో స్థానంలో వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి 542, మూడో స్థానంలో వచ్చిన బీజేపీ అభ్యర్థి కె.వి.రమణారెడ్డికి 338 పోస్టల్ ఓట్లు వచ్చాయి. ►నిజామాబాద్ అర్బన్‌లో సమీప ప్రత్యర్థి తాహెర్‌బిన్(కాంగ్రెస్)కు ఏకంగా 713 పోస్టల్ ఓట్లు వస్తే మొదటి స్థానంలో వచ్చిన బిగాల గణేశ్ గుప్తా (బీఆర్ఎస్)కు 499, మూడోస్థానంలో వచి్చన యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ)కు పోటాపోటీగా 489 ఓట్లు వచ్చాయి. ►కరీంనగర్లో అయితే గెలిచిన అభ్యర్థి కంటే సమీప ప్రత్యర్థికి దాదాపు 600 పోస్టల్ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గంగులకు 844, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు 1440 ఓట్లు వస్తే, మూడో స్థానం దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు కూడా గెలిచిన అభ్యర్థితో అటూఇటుగా 826 ఓట్లు వచ్చాయి. ►నారాయణ్‌ఖేడ్‌లో విచిత్రంగా గెలిచిన అభ్యర్థి, మూడో స్థానంలో ఉన్న అభ్యర్థికి చెరిసమానంగా పోస్టల్ ఓట్లు వచ్చాయి. గెలిచిన భూపాల్‌రెడ్డి (బీఆర్ఎస్)కి 306, మూడోస్థానంలో ఉన్న సంజీవరెడ్డికి 306 ఓట్లు వస్తే, రెండో స్థానంలో ఉన్న సురేశ్‌షెట్కార్‌కు కేవలం 244 ఓట్లు మాత్రమే వచ్చాయి. ►పరిగిలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డికి 530కి పోస్టల్ ఓట్లు రాగా, ఆయన చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్‌ఆర్‌కు అంతకంటే రెట్టింపు సంఖ్యలో 1090 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ►డంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)కు 526 పోస్టల్ ఓట్లు రాగా, గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్ఎస్)కు కేవలం 174 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల విధుల్లో ఉన్న వారితో పాటు సాయుధ దళాల్లో పనిచేస్తున్న వారు (సర్వీస్ ఓటర్లు), విదేశాల్లో నివసించే భారతీయ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. ఇక, ప్రత్యేక ఓటర్లు... అంటే పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేసే అవకాశం లేని ఓటర్లు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చు. వీటిని ఈవీఎంల లెక్కింపు కంటే ఓ అర గంట ముందు లెక్కిస్తారు. -
ఇక అత్యవసర సేవల ఉద్యోగులకూ పోస్టల్ బ్యాలెట్
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ రోజు ఎన్నికల వార్తల సేకరణలో ఉండే జర్నలిస్టులతో పాటు ఎన్నికలతో సంబంధం లేని 12 ఇతర అత్యవసర సేవల రంగాల ఉద్యోగులు సైతం ఇకపై పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల శాసనసభ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ఈ సదుపాయం కల్పించబోతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 60(సీ) కింద కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర సేవల రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ స్వభావం రీత్యా ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి దూరంగా ఉండే ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి సైతం ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వీరికే సదుపాయం.. ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది, సర్విసు ఓటర్లు(సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయం ఉండేది. 40 శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్టు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజాగా జర్నలిస్టులతో పాటు ఎన్నికల విధులతో సంబంధం లేని అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు సైతం పోస్టల్ సదుపాయం కలి్పస్తున్నట్టు ప్రకటించింది. నవంబర్ 7లోగా దరఖాస్తు చేసుకోవాలి.. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కానుండగా, నాటి నుంచి 5 రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ..‘ఫారం–12డీ’దరఖాస్తులను స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 7 నాటికి దరఖాస్తులు రిటర్నింగ్ అధికారికి చేరితే ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు. జర్నలిస్టులతో పాటు ఆయా అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి సంబంధిత విభాగాలు నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోడల్ అధికారుల వద్ద ఫారం–12డీ అందుబాటులో ఉంచాలని కోరింది. ఈ కింది జాబితాలోని అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించనున్నారు. ♦ ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా ♦ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ♦ ఇండియన్ రైల్వే ♦ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ♦ దూర్దర్శన్ ♦ ఆల్ ఇండియా రేడియో ♦ విద్యుత్ శాఖ ♦ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ♦ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ♦ పౌర సరఫరాల శాఖ ♦ బీఎస్ఎన్ఎల్ ♦ పోలింగ్ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్ పొందిన మీడియా ప్రతినిధులు ♦ అగ్నిమాపక శాఖ -
ఎన్నారైలు విదేశాల్లోనే ఓటు వేయొచ్చు.. వారి కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్
ప్రవాస భారతీయ (ఎన్నారై) ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్)ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సమాధానమిస్తూ.. 1 జనవరి 2023 నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20A ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 1,15,696 మంది భారతీయ పౌరులు భారతీయ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961ను సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేపట్టిందని న్యాయ మంత్రి కిరణ్ రిజీజు తెలిపారు. ప్రతిపాదన అమలులో ఉన్న లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఈ విషయం చర్చిస్తున్నట్లు చెప్పారు. విదేశీ ఓటర్లు వ్యక్తిగతంగా లేదా ప్రాక్సీ (నామినేటెడ్ ఓటరు) ద్వారా ఓటు వేయడానికి వీలుగా ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు, 2018 పేరుతో భారత ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన బిల్లును ఆగస్టు 9, 2018న లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు న్యాయ మంత్రి తెలిపారు. అయితే 16వ లోక్‌సభ రద్దు కారణంగా ఈ బిల్లు కూడా రద్దయిందని పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజ
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభం
-
పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘము కీలక సిపార్సు
-
బిగ్ అప్డేట్.. పోస్టల్ బ్యాలెట్ రద్దుకు ఈసీ ప్రతిపాదన!
న్యూఢిల్లీ: ఎన్నికల విధుల్లో ఉండి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే, ఈ పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగానికి గురవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. ‘పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగాన్ని తగ్గించేందుకు’ ఈ ప్రతిపాదనను ఈసీ తీసుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు గత వారం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల వినియోగానికి ఎన్నికల నిర్వహణ చట్టం 1961లోని 18వ నిబంధనకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేలు సూచించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సర్వీస్ ఓటర్లు, కస్టడీలో ఉన్నవారు ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేలా ఈ 18వ నిబంధన వీలు కల్పిస్తోంది. జాతీయ స్థాయి ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా 10లక్షలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సుమారు కోటి మంది ఎన్నికల విధుల్లో ఉంటారు. అందులో పోలీసులు, పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల డ్యూటీలో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఎన్నికల విధుల్లోకి వెళ్లేవారికి శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్‌ను అందిస్తారు. వారు అక్కడి నుంచి విధుల్లోకి వెళ్లేలోపు ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లతో ఫెసిలిటేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తారు. కానీ చాలా మంది పోస్టల్ బ్యాలెట్‌ను తమతో తీసుకెళ్తున్నట్లు గుర్తించామని, సుదీర్ఘంగా వారితోనే పోస్టల్ బ్యాలెట్‌ను ఉంచుకోవటం ద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాంటి వాటిని తగ్గించేందుకే ఫెసిలిటేషన్ సెంటర్స్‌లోనే అభ్యర్థుల ముందు ఓటు వినియోగించుకునేలా నిబంధనల్లో మార్పు చేయాలని ఈసీ ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు షాక్.. ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ నో.. -
నేడే 'మా' ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఆరువారాల నుంచి హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు వాడీవేడిగా కొనసాగాయి. హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. మా ఎన్నికలో ఓటు వేసే సభ్యులు తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్ స్కూల్ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ఆయా ప్యానెళ్ల ఏజెంట్లు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతిస్తారు. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత జాబితాలో మరోసారి సభ్యుల పేర్లను తనిఖీ చేస్తారు. అక్కడ ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాతనే ఓటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. -
MAA Elections 2021: ‘మా’ గొడవ మాదే
దాదాపు నాలుగైదు నెలలుగా ఎక్కడ చూసినా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల గురించి జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశాలివి. ‘మా గొడవ మాదే.. మేమంతా ఒక్కటే’ అంటూనే రాజకీయ ఎన్నికలను తలపించే రీతిలో ‘మా’ ఎన్నికల తీరు కనిపిస్తోంది. గత 28 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వివాదాలు, విమర్శలకు తోడు ఒకదశలో అభ్యంతరకర పదజాలంతో దూషణలూ వినిపించాయి. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అంశంపై ఓ రౌండప్.. లోకల్.. నాన్‌లోకల్.. ‘సినిమా బిడ్డలం’ ప్యానల్ అంటూ ప్రకాశ్‌రాజ్, ‘మాకోసం మనమందరం’ అంటూ మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా రెండు పక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఘాటుగా సాగుతున్నాయి. మొదట్లో ‘‘ప్రకాష్‌రాజ్ నాన్‌లోకల్. షూటింగ్లకే సరిగా రాడు. ఇక ‘మా’ సమస్యలు పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది?’’ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే.. ‘‘మూడు దశాబ్దాలుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నాను. తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఎవరూ నన్ను నాన్ లోకల్ అనలేదు. ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ అవుతాను’’ అని ప్రకాశ్‌రాజ్ తన వాదన వినిపించుకున్నారు. ఆయనకు మద్దతుగా నాగబాబు మూడు రోజుల కింద ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే. ఆయన ఉంటే ‘మా’ అసోసియేషన్ బాగుపడుతుంది. మన తెలుగువాళ్లు వేరే భాషల్లో నటించడం లేదా?’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ‘మీకు ఏ సమస్య వచ్చినా నేనిక్కడే ఉంటా.. ఈ ఊళ్లోనే ఉంటా’ అని మంచు విష్ణు ప్రకటించారు. ఆయన తండ్రి మోహన్‌బాబు కూడా.. ‘‘ఈ ఊళ్లోనే ఉండే నా కుమారుడు ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని నేను మాట ఇస్తున్నాను. మీ ఓటును మంచు విష్ణుకు, అతడి పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అని శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మెగా వర్సెస్ మంచు! మోహన్‌బాబు ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును నిలబెట్టాలనుకున్నప్పుడు చిరంజీవిని మద్దతు అడిగారని.. కానీ అప్పటికే ప్రకాశ్‌రాజ్‌కు సపోర్టు చేస్తానని మాటిచ్చానని చిరంజీవి చెప్పారనే వార్తలు వెలువడ్డాయి. దానిపై స్పందించిన మోహన్‌బాబు.. మెగాస్టార్ కుటుంబానికి చెందిన రామ్‌చరణ్, నాగబాబు వంటి వారు ఎన్నికల్లో నిలబడితే తాను మరో ఆలోచన లేకుండా మద్దతు తెలిపేవాడినని పేర్కొన్నారు. ఇలా ‘మా’ ఎన్నికలు ‘మెగా వర్సెస్ మంచు’లా మారాయి. పోస్టల్ బ్యాలెట్ వర్సెస్ ఈవీఎం తాము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వచ్చే అవకాశముందని, పేపర్ బ్యాలెట్ పెట్టాలని మంచు విష్ణు కోరగా.. ఎన్నికల అధికారి పేపర్ బ్యాలెట్‌ను ఆమోదించారు. అయితే విష్ణు 60 మంది సీనియర్ నటులతో తనకు అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించుకున్నారని ప్రకాశ్‌రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ‘మా’ ఎప్పుడు మొదలైంది? తెలుగు సినిమా నటీనటుల సంక్షేమం కోసం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ని 1993లో ఏర్పాటు చేశారు. చిరంజీవి వ్యవస్థాపక అ«ధ్యక్షుడిగా, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి వారు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. అసోసియేషన్ ప్రారంభంలో 150 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు దాదాపు 900 మందికిపైగా ఉన్నారు. పెద్దదిక్కు ఎవరు? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువర్గాల సభ్యులు పరుషంగానే మాటల తూటాలు విసురుకున్నారు. ఈ సందర్భంలో చాలామంది ‘దాసరి నారాయణరావు’ను గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి సామరస్యంగా పరిష్కరించేవారని.. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడం వల్లే ఇంత రచ్చ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాగా.. సినిమా అంటే వినోదం అని.. ఇప్పుడు నటీనటులు ‘మా’ ఎన్నికల రూపంలో బయట వినోదం పంచుతున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇంతా చేసి ‘మా’ ఎన్నిక కాగానే మేమంతా ఒక్కటే అన్నట్టు కలసిపోతారని ఇండస్ట్రీ అంటున్న మాట. చదవండి: MAA Elections 2021: రెండు రోజుల్లో ఎన్నికలు.. ‘మా’కు సీవీఎల్ షాక్ -
సర్కారు ఉద్యోగుల అసమ్మతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార టీఆర్ఎస్ పారీ్టకి వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసి తమ అసమ్మతి తెలియజేస్తున్నారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా, ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకు లభించాయి. ఉద్యోగుల సమస్యల పెండింగ్ వల్లే.. ఎన్నికల విధుల్లో ఉండే ఎన్నికల సిబ్బందితో పాటు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేసే సైనికులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలి్పస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవడంలో వెనకబడిన అధికార టీఆర్ఎస్.. సాధారణ ప్రజానీకం ఈవీఎం/బ్యాలెట్ పేపర్ ద్వారా వేసే ఓట్లను దక్కించుకోవడంలో మాత్రం ముందంజలో ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీఎన్జీవోలు, ఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తితో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవడంలో టీఆర్ఎస్ వెనకబడిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కొత్త పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విడుదలలో తీవ్ర జాప్యం, ఏళ్ల తరబడిగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచకపోవడం, స్పౌజ్ కేటగిరీ కింద బదిలీలు చేపట్టకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చాలాకాలం నుంచి కోరుతున్నాయి. త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ గత మూడేళ్లలో పలుమార్లు హామీనిచి్చనా, నెరవేర్చలేకపోయారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేక భావం ఏర్పడిందని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఓట్ల నుంచి జీహెచ్ఎంసీ వరకు.. ఇక 2018లో జరిగిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో మొత్తం 95,689 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా, అత్యధికంగా కాంగ్రెస్ పారీ్టకి 38,918, టీఆర్ఎస్కు 32,880, బీజేపీకు 9,567 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయగా, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమికి వచ్చిన మొత్తం పోస్టల్ ఓట్ల సంఖ్య 46,651 కావడం గమనార్హం. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తంగా 46.87 శాతం ఓట్లను సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 28.43 శాతం ఓట్లతో 19 సీట్లు, బీజేపీ 6.98 శాతం ఓట్లతో కేవలం ఒకే సీటును గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పోలైన 906 పోస్టల్ ఓట్లలో బీజేపీకు 515 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు కేవలం 218 ఓట్లు మాత్రమే లభించాయి. ఎంఐఎంకు 50, కాంగ్రెస్‌కు 40, ఇతరులకు 20 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత కొన్నేళ్లుగా అసమ్మతి తెలియజేస్తున్నా, ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
బీజేపీ ఆధిక్యం.. రెండో స్థానంలో టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మెజార్టీ డివిజన్లలో టీఆర్ఎస్పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్లో మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు రాబట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40శాతం ఓట్లు చెల్లని ఓట్లుగా కౌంటింగ్ అధికారులు గుర్తించారు. మరోవైపు బ్యాలెట్ పత్రాల లెక్కింపులో టీఆర్ఎస్ పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ వివరాలు.. హిమాయత్‌నగర్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 17, బీజేపీ 10, కాంగ్రెస్ జంగంమెట్ డివిజన్ : ఎంఐఎం 7, బీజేపీ 6 ఉప్పుగూడ డివిజన్ : బీజేపీ 5, ఎంఐఎం 4 చంద్రయాణగుట్ట డివిజన్ : ఎంఐఎం 1, టీఆర్ఎస్ 1 కంచన్‌బాగ్ డివిజన్ : బీజేపీ 2, ఎంఐఎం 1 రియాసత్‌నగర్ డివిజన్ : ఎంఐఎం 3, బీజేపీ 2, టీఆర్ఎస్ 1 లలితాబాగ్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 1 నేరేడ్మెట్ డివిజన్ : టీఆర్ఎస్ 4, బీజేపీ 3, నోటా 1 వినాయక్‌నగర్ డివిజన్ : టీఆర్ఎస్ 3, బీజేపీ 2, కాంగ్రెస్ 1 బన్సీలాల్‌పేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్ఎస్ 2 రాంగోపాల్‌పేట డివిజన్ : టీఆర్ఎస్ 2 బేగంపేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2 మోండామార్కెట్ డివిజన్ : బీజేపీ 9, టీఆర్ఎస్ 1 ఈస్ ఆనంద్‌బాగ్ డివిజన్ : టీఆర్ఎస్ 3, బీజేపీ 3, కాంగ్రెస్ 1 ఫలక్‌నుమా డివిజన్ : ఎంఐఎం 2 నవాబ్‌సాహెబ్‌కుంట డివిజన్ : ఎంఐఎం 3 దూద్‌బౌలి డివిజన్ : ఎంఐఎం 3, టీఆర్ఎస్ 1 రణ్మస్తపురా డివిజన్ : ఎంఐఎం 4 కిషన్‌బాగ్ డివిజన్: ఎంఐఎం 3, టీఆర్ఎస్ 1, బీజేపీ 2 సైదాబాద్ డివిజన్ : బీజేపీ 30, టీఆర్ఎస్ 6 ముసారాంబాగ్ డివిజన్ : టీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 1 ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ : టీఆర్ఎస్ 1 అజంపురా డివిజన్ : ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 1 చామిని డివిజన్: బీజేపీ 2 అడిక్‌మెట్ డివిజన్ (పోస్టల్ బ్యాలెట్) : బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1 రామ్‌నగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 5 మల్కాజ్గిరి డివిజన్ : బీజేపీ 5 బేగంబజార్ డివిజన్ : బీజేపీ 6, టీఆర్ఎస్ 1 నాగోల్ డివిజన్ : బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1 బేగంబజార్ డివిజన్ : బీజేపీ 6, టీఆర్ఎస్ 1 హయత్‌నగర్ డివిజన్ : బీజేపీ 8, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 1 బోయిన్పల్లి డివిజన్ : టీఆర్ఎస్ 8, బీజేపీ 7 హైదర్‌నగర్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1 భారతీనగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 3 గచ్చిబౌలి డివిజన్ : టీఆర్ఎస్ 1, చెల్లనివి 2 వనస్థలిపురం డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2, నోటా 1 చంపాపేట్ డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 శేరిలింగంపల్లి డివిజన్ : టీఆర్ఎస్ 5, బీజేపీ 3 లింగోజీగూడ డివిజన్ : బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 1 హస్తినాపురం డివిజన్ : బీజేపీ 2 పటాన్చెరు డివిజన్ (పోస్టల్ బ్యాలెట్): టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1 కూకట్పల్లి డివిజన్ : బీజేపీ 24, టీఆర్ఎస్ 21, టీడీపీ 2, నోటా 2 సూరారం డివిజన్: టీఆర్ఎస్ 1, బీజేపీ 1, చెల్లనివి 2 గాజులరామారం డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 అల్వాల్ డివిజన్ : బీజేపీ 12, టీఆర్ఎస్ 6, నోటా1, చెల్లనివి 23 జీడిమెట్ల డివిజన్ : బీజేపీ 6, టీఆర్ఎస్ 4, చెల్లనివి 1 సుభాష్‌నగర్ డివిజన్ : టీఆర్ఎస్ 9, బీజేపీ 3 కొండాపూర్ డివిజన్ : బీజేపీ 5 అల్లాపూర్ డివిజన్ : బీజేపీ 3 మూసాపేట్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 2, టీడీపీ 1 ఫతేనగర్ డివిజన్ : టీఆర్ఎస్ 1 కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2 బాలాజీనగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 3 మన్సూరాబాద్ డివిజన్ : బీజేపీ 8, టీఆర్ఎస్ 5 కవాడీగూడ డివిజన్ : బీజేపీ 10, టీఆర్ఎస్ 1, టీడీపీ 1 నాగోల్ డివిజన్ : బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1 కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్ఎస్ 5, బీజేపీ 2 మాదాపూర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 1 మియాపూర్ డివిజన్ : టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1 హఫీజ్‌పేట డివిజన్ : బీజేపీ 4 చందానగర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 1 మూసాపేట డివిజన్ : బీజేపీ 15, టీఆర్ఎస్ 8, టీడీపీ 1 బాలానగర్ డివిజన్ : టీఆర్ఎస్ 5, బీజేపీ 2 జగద్గిరిగుట్ట డివిజన్ : బీజేపీ 1, టీఆర్ఎస్ 1 కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్ఎస్ 20, బీజేపీ 14 మల్కాజ్గిరి డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 1 బీఎన్‌రెడ్డి డివిజన్ : టీఆర్ఎస్ 10, బీజేపీ గాంధీనగర్ డివిజన్ : బీజేపీ 7, టీఆర్ఎస్ 2, నోటా 1 భోలక్‌పూర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్ఎస్ 1 -
విదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉండే భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వర్తింప జేయాలని ఎన్నికల సంఘం(ఈసీ) యోచిస్తోంది. కేంద్రం అనుమతిస్తే.. ప్రస్తుతం సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం(ఈటీపీబీఎస్)ను విదేశాల్లోని అర్హులైన భారతీయ ఓటర్లు కూడా వినియోగించుకునే వీలుం టుంది. ఈ మేరకు ఈసీ నవంబర్ 27వ తేదీన న్యాయశాఖకు లేఖ రాసింది. ఇప్పటికే భద్రతా బలగాలకు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందున విదేశాల్లోని భారతీ యులకు కూడా అందుబాటు లోకి తేగలమనే నమ్మకం ఉందని అందులో తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్– జూన్ నెలల్లో అస్సాం, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సదుపాయాన్ని అమలు చేసేందుకు సాంకేతికంగా, పాలనాపరంగా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. విదేశాల్లో ఉండే అర్హులైన భారతీయ ఓటర్లు ఓటు హక్కు వినియో గించుకునేందుకు స్వదేశానికి రావడం ఖర్చుతో కూడుకున్న వ్యవహా రమని, బదులుగా పోస్టల్ బ్యాలెట్ వెసులు బాటును కల్పించాలం టూ పలు విజ్ఞప్తులు అందాయని వివరించింది. కోవిడ్–19 ప్రోటోకాల్స్ నేపథ్యంలో ఈ సమస్య మరింత సంక్లిష్టమైందని న్యాయశాఖకు తెలిపింది. ఈటీపీబీఎస్ కోసం విదేశాల్లో ఉండే భారతీయులు ముందుగా తాము ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తు న్నట్లు రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలి. అప్పుడే వారికి పోస్టల్ బ్యాలెట్ అందుతుంది. ఓటరు ఆ బ్యాలెట్‌ను డౌన్లోడ్ చేసుకుని ప్రత్యేక ఎన్వలప్లో తన ఓటు నమోదై ఉన్న నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి పంపించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలకు ఆ బ్యాలెట్ చేరుకుంటుంది. లెక్కింపు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే మొదలవుతుంది. -
యూఎస్: భారీగా పోస్టల్ బ్యాలెట్ల వినియోగం
రలీగ్ (అమెరికా): మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో పోస్టల్ ఓట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అధ్యక్ష ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసే రిస్క్‌ను తీసుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో నార్త్ కరోలినాలో శుక్రవారం పోస్టల్ బ్యాలెట్లను పంపడం మొదలైంది. తొలిదశలో 6.18 లక్షల పోస్టల్ బ్యాలెట్లకు అభ్యర్థనలు అందాయి. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే ఇది 16 రెట్లు ఎక్కువ. విస్కాన్సిన్లో కిందటిసారితో పోలిస్తే లక్ష అభ్యర్థనలు ఎక్కువ వచ్చాయి. ఫోర్లిడాలో 2016లో 33.47 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోగా... ఈసారి ఇప్పటికే 42.70 లక్షల అభ్యర్థనలు అందాయి. (చదవండి: అమెరికాలో నవంబర్ కల్లా కోవిడ్ టీకా) ఇక అత్యధికంగా డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారుల నుంచే పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థనలు అందుతుండటం విశేషం. వీరి తర్వాత తటస్థులు దీనిని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. కాగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకతవకలు జరిగే అవకాశం ఉందని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. పోస్టల్ శాఖకు అదనపు నిధుల మంజూరును ట్రంప్ అడ్డుకోవడంతో... భారీగా వచ్చే పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రాలకు చేర్చేందుకు వనరులు ఉండవనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సకాలంలో ఓట్లు లెక్కింపు, ఫలితాల వెల్లడిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి: వర్షంలో తడిస్తే నా జుట్టు పాడవుతుంది: ట్రంప్) చదవండి: అమెరికా ఎన్నికలు; పోస్టల్ పోరు -
అమెరికా ఎన్నికలు; పోస్టల్ పోరు
2016 ఎన్నికల్లో స్వయంగా మెయిల్ ఇన్ విధానంలో ఓటు వేశారు ఈ సారి మెయిల్ ఇన్ అంటే మోసాలకు చిరునామా అంటున్నారు పోస్టల్ బ్యాలెట్‌కి నిధులు ఆపేశారు, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్‌ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? ఈ పద్ధతి ద్వారా అవకతవకలు జరిగే అవకాశం ఉందా ? వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు కోవిడ్–19 చుట్టూ తిరుగుతున్నాయి. 62 లక్షల కేసులు, 2 లక్షలకు చేరువలో మృతులతో అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా భయంతో నవంబర్ 3 నాటి అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ బూత్లకి వెళ్లకుండా మెయిల్ ఇన్ ఓటింగ్ (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ పద్ధతిలో ఎన్నికల అధికారులు రిజిస్టర్డ్ ఓటర్లకు బ్యాలెట్ పేపర్లను అందిస్తారు. సదరు ఓటరు దానిని నింపి తిరిగి అధికారులకి పంపించడం ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికల్లో విదేశీ జోక్యం పెరిగిపోతుందని, రిగ్గింగ్‌కి అవకాశం ఉంటుందని, అక్రమాలతో దేశం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఈసాకుతో ఎన్నికలు వాయిదా వేయాలని చూశారు కానీ కుదరకపోవడంతో పోస్టల్ బ్యాలెట్‌కు అవసరమయ్యే నిధుల విడుదల నిలిపవేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కి అత్యవసరంగా 2,500 కోట్ల డాలర్లు కేటాయించాలంటూ డెమోక్రాట్లు పెట్టిన బిల్లుని కాంగ్రెస్‌లో ట్రంప్ అడ్డుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 24% మంది మెయిల్ ఇన్ ఓట్లు వేస్తే, ఈసారి 64% మంది వరకు ఈ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలున్నాయి. మెయిల్ ఓన్ ఓట్లు పెరిగే కొద్దీ డెమోక్రటిక్ పార్టీ్టకే ప్రయోజనమనే అంచనాలున్నాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో చతికిలబడిపోయి, ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టలేక చేతులెత్తేసిన ట్రంప్ ప్రçస్తుతం ఎన్నికల సర్వేల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కంటే వెనుకబడి ఉన్నారు. అందుకే తన ఓటమికి దారి తీసే ఏ చిన్న అవకాశాన్నయినా గట్టిగా ఎదుర్కోవడానికే ట్రంప్ పోస్టల్ బ్యాలెట్‌ను వ్యతిరేకిస్తున్నారనే విశ్లేషణలున్నాయి. అవకతవకలకు ఆస్కారం లేదు మెయిల్ ఇన్ ఓటింగ్ విధానం ద్వారా అవకతవకలు జరగడానికి ఆస్కారమే లేదని ఎన్నికల విశ్లేషకుడు రిచర్డ్ ఎల్ హసన్ అంటున్నారు. బ్రెన్నన్ సెంటర్ ఫర్ జస్టిస్ 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం మెయిల్ ఇన్ ఓటింగ్‌లో పొరపాట్లకు ఆస్కారం 0.00004% నుంచి 0.00009% మాత్రమే ఉంటుందని తేలింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోస్టల్ ఓటింగ్ తప్పుడు కేసు కేవలం ఒక్కటే నిర్ధారణ అయింది. అయితే, పోస్టల్ బ్యాలెట్‌తో ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. న్యూయార్క్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో సాధారణంగా నమోదయ్యే మెయిల్ ఇన్ ఓట్ల కంటే 10 రెట్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో ఫలితాల వెల్లడికి వారాల సమయం పట్టింది. ప్రతీ అయిదు ఓట్లలో ఒకటి చెల్లుబాటు కావడం లేదని అధికారులంటున్నారు. ఓటు ముద్ర సరిగ్గా వేయకపోవడం, ఓటర్లు సంతకం పెట్టకపోవడం వంటివి జరిగాయని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కి 6 రాష్ట్రాలు సై కరోనా ఉధృతరూపం దాలుస్తున్న నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల దగ్గర జన సందోహా న్ని నివారించడానికి ఇప్పటికే కాలిఫోర్నియా, ఉటా, హవాయి, కొలరాడో, ఒరెగాన్, వాషిం గ్టన్ రాష్ట్రాలు మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే అత్యంత సురక్షితమని సగానికిపైగా రాష్ట్రాలు భావిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు వెయ్యాలంటే కచ్చితమైన కారణం చెప్పాలి. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉంటేనే వీరికి అనుమతి ఉంటుంది. -
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్ బాధితులు, స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి సైతం ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఏడాది చివరిలో బిహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారు బయటకువచ్చి ఓటు వేయడం ద్వారా ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా సీఈసీ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలన సిబ్బంది, పోలీసులు విదేశాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరికొంత మంది సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే వీలుంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 65 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. -
పోస్టల్ బ్యాలెట్ల తిరస్కరణ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ ఉంచే ఎన్వలప్ కవర్ (ఫామ్ 13బీ)పై సీరియల్ నెంబర్ వేయలేదన్న కారణంతో తిరస్కరించిన 9,782 పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచడంతోపాటు ఈ వ్యాజ్యానికి విచారణార్హత ఉందో, లేదో తెలియచేయాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆ బాధ్యత ఎన్నికల అధికారులదే.. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. దీని ప్రకారం.. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సంఘం అధికారులు పిటిషనర్లతో కలిపి మొత్తం 15,289 పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశారని తెలిపారు. ఇదే సమయంలో ఫామ్‌లు 13ఏ, బీ, సీ, డీలు ఇచ్చారని, వీటి ద్వారా పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల సంఘం అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారులు తమకు అందిన పోస్టల్ బ్యాలెట్లలో 9,782 ఓట్లను తిరస్కరించారన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఉంచే ఎన్వలప్ కవర్‌పై సీరియల్ నెంబర్ వేయలేదన్న కారణంతో వీటిని తిరస్కరించారని, వాస్తవానికి ఈ సీరియల్ నెంబర్ వేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదే తప్ప, ఓటర్లది కాదన్నారు. సీరియల్ నెంబర్ వేయని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించాలని ఏ నిబంధన కూడా చెప్పడం లేదన్నారు. అయినా కూడా ఏకంగా 9,782 పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించారని, ఇది ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. అంతేకాకుండా పిటిషనర్ల ఓటు హక్కును సైతం హరించినట్లయిందని తెలిపారు. రిటర్నింగ్ అధికారుల హ్యాండ్ బుక్‌లో కూడా ఈ విషయానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవన్నారు. పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణకు సీరియల్ నెంబర్ వేయకపోవడం ఎంత మాత్రం సహేతుక కారణం కాజాలదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలను తమ ముందుంచడంతోపాటు, ఈ వ్యాజ్యం విచారణార్హత గురించి కూడా తెలియచేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
పోస్టల్ బ్యాలెట్లలో 9700 ఓట్లు రిజెక్ట్ చేశారు
-
బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవడంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన పొరపాట్లు అభ్యర్థుల తలరాతలు మార్చేశాయి. ఈ పొరపాట్లు కొందరికి వరంగా మారగా, మరికొందరికి శాపంగా పరిణమించాయి. కొన్ని కీలక స్థానాల్లో ఫలితాలను తారుమారు చేశాయి. ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా ఉన్న పోస్టల్, సర్వీస్ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఓటమి అంచుల దాకా వెళ్లిన కొందరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉద్యోగులు చేసిన తప్పులతో గండం నుంచి గట్టెక్కారు. ఫలితాలు తారుమారై గెలుపు అంచుల వరకు వచ్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో పలు చోట్ల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించడంలో పోస్టల్, సర్వీస్ ఓట్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలో 3.05 లక్షల పోస్టల్ బ్యాలెట్లు, 60 వేల సర్వీస్ ఓట్లను అధికారులు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉండటం, వాటిని నమోదు చేయడం, ఫారం–12 పూర్తి చేయడంలో తలెత్తిన పొరపాట్లతో వేలాది ఓట్లు చెల్లకుండా పోయాయి. కొన్నిచోట్ల నిబంధనల మేరకు వాటిని సంరక్షించకపోవడం వివాదాస్పదమైంది. పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన అధికారులు బ్యాలెట్ పేపర్ మీద వరుస నంబర్ నమోదు చేయకపోవడం, అదే నంబర్‌ను పోస్టల్ బ్యాలెట్‌ను పంపే కవర్ మీద రాయకపోవడంతో వాటిని కౌంటింగ్‌లో పరిగణనలోకి తీసుకోలేదు. పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోవడంతో చాలామంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఓటమి బారి నుంచి బయటపడగా, గెలవాల్సిన వారు ఓటమి చెందారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలాగే ఓటమి నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళంలో ఇరుపార్టీల మధ్య తీవ్రస్థాయి చర్చ తర్వాత ఎన్నికల నిబంధనల మేరకు చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ప్రకటించారు. దాదాపు 6,653 ఓట్ల తేడాతో రామ్మోహన్ నాయుడు గెలిచారు. ఆ స్థానంలో గెలుపు అంచుల దాకా వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. గుంటూరు స్థానంలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కూడా ఇలాగే బయటపడ్డారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో భారీగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయి. ఫలితంగా 4,205 ఓట్ల తేడాతో గల్లా జయదేవ్ వైఎస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై గెలిచారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాలేదు. భవిష్యత్తులో పోస్టల్ బ్యాలెట్లలో పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ప్రస్తుత నిబంధనలను పూర్తిగా మార్చేయడంతో పాటు ఈవీఎంలలోనే ఈ ఓట్లు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ టీచర్ల ఫెడరేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ఇతర నేతలు కోరారు. -
టీడీపీకి ఉద్యోగుల భారీ షాక్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దూకుడుగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అధికార తెలుగుదేశం పార్టీకి ఊహించినట్టుగానే భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీకి తీవ్రంగా తిరస్కరించారు. దీనికి ప్రతిఫలంగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీకి ఈ లెక్కింపులో గణనీయమైన మెజార్టీ లభిస్తోంది. ఇది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీ విజయానికి శుభ సంకేతమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ ముందంజలో సాగుతూ తొలి ఫలితాల్లోనే ఫ్యాన్ వేగం పుంజుకుంటోంది. పులివెందుల సహా పలు నియోజకవర్గాల్లో జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు చోట్ల పార్టీ గెలుపు గుర్రాలు హవాను చాటుతున్నారు. -
భారీగా పెరిగిన సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో సర్వీస్, పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు భారీగా పోలైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్లతో పోలిస్తే సర్వీస్ ఓట్లు గణనీయంగా తగ్గాయి. రేపు ఉదయం ఏడులోగా కౌంటింగ్ సెంటర్‌కు చేరే సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని అధికారులు తెలిపారు. కాగా రేపే కౌటింగ్ నేపథ్యంలో ఇప్పటివరకు పోలైన సర్వీస్ ఓట్ల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. మే 20 నాటికి జిల్లాల వారీగా పోలైన సర్వీసు ఓట్ల వివరాలు.. శ్రీకాకుళం 8121 విజయనగరం 2564 విశాఖపట్నం 3333 తూర్పు గోదావరి 923 కృష్ణా 457 గుంటూరు 3036 ప్రకాశం 3765 నెల్లూరు 362 కడప 1175 కర్నూలు 1935 అనంతపురం 1676 చిత్తూరు 2185 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలైన సర్వీస్ ఓట్లు 28, 662175 అసెంబ్లీలకు పోలైన మొత్తం సర్వీస్ ఓట్లు 29,53225. పార్లమెంటు నియోజక వర్గాల్లో వచ్చిన ఫారం 12 దరఖాస్తులు 3,17,291 లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో జారీ చేసిన ఓట్లు 3,00,957 ఇప్పటి వరకు లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఆర్వోలకు అందిన పోస్టల్ బ్యాలెట్లు 2,14,937 13 జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నది 3,18,530 మంజూరు చేసింది 3,05,040 మే 20 నాటికి ఆర్వోలకు చేరిన పోస్టల్ బ్యాలెట్లు 2,11,623 -
24 గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్న కొద్దీ అందరిలో పొలిటికల్ ఫీవర్ తారస్థాయికి చేరుకుంది. గత నెల 11వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్‌కు సుదీర్ఘ సమయం ఉండడంతో ఒకరిద్దరు మినహా మిగతా అభ్యర్థులు అందరూ విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంగళవారమే జిల్లాకు చేరుకున్నారు. కౌంటింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుండడంతో ప్రధాన పార్టీల రాజకీయ నేతల సందడి పెరిగింది. హోటళ్లు అన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. గెలుపుపై అభ్యర్థుల ధీమా సార్వత్రిక ఎన్నికల్లో విజేతలు ఎవరు.. పరాజితులు ఎవరు.. ఎవరెవరికి ఎంత మెజారిటీ వస్తుంది.. బాగా మెజారిటీ వచ్చే మండలాలు.. మెజారిటీ తగ్గే మండలాలు.. యువత, మహిళలు, రైతులు ఎవరికి పట్టం కట్టారు.. ఇలాంటి అనేక ప్రశ్నలకు 23వ తేదీ ఉదయం 11 గంటల కల్లా పూర్తి సృష్టత రానుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం స్వీయ అంచనాలు వేసుకొని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 19న చివరి దశ పోలింగ్ ప్రకియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో పార్టీ క్యాడర్లో విశ్వాసం రెట్టించినట్లయింది. నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నారు. చకచకా ఏర్పాట్లు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణంలో, అలాగే తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కలెక్టర్ రెండు రోజులుగా కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించి, రెండు స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ఇక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఒక్కొక్క రాజకీయపార్టీకి 14 చొప్పున కౌంటింగ్ ఏజెంట్ పాస్‌లను జారీ చేస్తున్నారు. దాదాపు ఈప్రక్రియ కూడా 90 శాతం పూర్తయింది. బరిలో 132 మంది అభ్యర్థులు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల నుంచి ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు పోటీ చేశారు. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 107 మంది పోటీ చేశారు. ఇక నెల్లూరు పార్లమెంట్ నుంచి ప్రధాన రాజకీయపార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీతోపాటు వామపక్షాలు, జనసేన ఉమ్మడి అభ్యర్థి, ఇండిపెండెంట్లు మొత్తం కలుపుకొని 13 మంది బరిలో నిలిచారు. అలాగే తిరుపతి పార్లమెంట్ నుంచి 12 మంది బరిలో నిలిచారు. గత నెల 11న జరిగిన సార్వత్రిక పోలింగ్‌లో 23.92 లక్షల మంది ఓటర్లకు గానూ 18.34 లక్షల మంది తమ ఓటు హక్కును జిల్లాలో వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 76.67 శాతం పోలింగ్ నమోదయింది. సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు కలుపుకొని మరి కొంత శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ పర్యాయం వీవీ ప్యాట్ లెక్కింపు కారణంగా ఫలితాల అధికారిక ప్రకటన రాత్రి 9 గంటలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా సన్నద్ధమయ్యాయి. హోటళ్లు హౌస్‌ఫుల్ విదేశీ పర్యటనలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు దాదాపు అందరూ జిల్లాకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి అభ్యర్థులు అందరూ నెల్లూరు నగరంలోనే మకాం వేయనున్నారు. మరోవైపు 23వ తేదీన జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ నెల్లూరు నగరంలోనూ, నగర శివారుల్లోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని నెల్లూరు సిటీ, రూరల్ మినహా మిగిలిన నియోజకవర్గాలకు చెందిన నేతలు, వారి అనుచరగణం ఇప్పటికే నగరంలో మకాం వేశారు. దీంతో నగరంలో హోటళ్లు నిండిపోయాయి. సర్వీసు అపార్ట్మెంట్లు, గౌస్ట్హౌస్లు కూడా పూర్తి బిజీగా మారిపోయాయి. -
48 గంటలే..
43 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉండేది ఎవరో తేలనుంది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన లెక్కింపు 23న జరగనుంది. అదే రోజు ఫలితం వెలువడనుండటంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఎగ్జిల్ పోల్స్ అన్నీ వైఎస్సార్ సీపీ వైపే మొగ్గుచూపగా... కౌంటింగ్ రోజుకోసం అభ్యర్థులు..పార్టీల అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. సాక్షి, అనంతపురం అర్బన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఈనెల 23న జరగనుంది. ఓట్ల లెక్కింపుపై 43 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇందుకోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌కు 1,380 మంది సిబ్బందిని నియమించారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున కౌంటింగ్ నిర్వహించనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ (ఈటీపీబీ) ఓట్లు లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్లను లెక్కిస్తారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఫలితాలను వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపు ఇలా... అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో నిర్వహిస్తారు. అలాగే హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎస్కేయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో జరుగుతుంది. 23వ తేదీ ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఈటీపీబీ (సర్వీస్ ఓట్లు) లెక్కిస్తారు. ఇక ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు చొప్పున రెండు పార్లమెంట్ నియోజవర్గాలకు 196 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 14 టేబుళ్లు చొప్పన 196 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక సూక్ష్మ పరిశీలకుడు చొప్పున. 392 టేబుళ్లకు 1,176 మంది నియమించారు. రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్ల వివరాలను ముందుగా సువిధ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత కలెక్టర్, జేసీ, జేసీ–2, ఎన్నికల కమిషన్, మీడియా సెంటర్‌కు మెయిల్ ద్వారా వివరాలు పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీ లెక్కింపు పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి రెండు పార్లమెంట్ నియోజకర్గాలకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 40 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి లెక్కింపునకు దాదాపు 204 మంది సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపులో ఇతర విధులకు 1,200 మందిని నియమించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా చెక్క బాక్స్‌లు సిద్ధం చేశారు. ఈటీపీబీ లెక్కింపునకు కంప్యూటర్లు, స్కానర్లు ఏర్పాటు చేశారు. బరిలో 186 మంది అభ్యర్థులు అనంతపురం, హిందూపురం పార్లమెంట్, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 186 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 14 మంది, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరి భవితవ్యం 23న తేలనుంది. పోలైన ఓట్లు 26.54 లక్షలు జిల్లాలో మొత్తం 32,39,517 ఓట్లు ఉండగా 26,54,257 ఓట్లు పోలయ్యాయి. 82.22 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇందులో పురుషులు 6,70,501 మంది (82.93 శాతం), మహిళలు 6,49,589 మంది (81.52 శాతం), థర్డ్ జెండర్ 50 మంది (22.89 శాతం) ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
నంద్యాలలొ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందని పోస్టర్ బ్యాలెట్లు
-
రాయదుర్గంలో పోలీసుల నిర్వాకం
-
పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు
-
టీడీపీకి ఓట్లు పడేలా వ్యూహం, వీడియో కలకలం
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఓటర్లను ప్రభావితం చేయడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఏకంగా మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్లను బలవంతంగా టీడీపీకి వేయించినట్లు బయటపడుతోంది. బాధిత మహిళల వీడియో టేపులు ప్రస్తుతం పోలీసుశాఖలో కలకలం రేపుతున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో మొత్తం ముగ్గురు అధికారుల ప్రమేయమున్నా కేవలం ఓ హెడ్ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. టీడీపీకి ఓట్లు పడేలా వ్యూహం పోలీసుశాఖలో మహిళల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల మహిళా పోలీసు వాలంటీర్లను ఎంపిక చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వారి సేవలను కూడా వినియోగించారు. విధుల్లో ఉండటంతో వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. అయితే రాయదుర్గం నియోజకవర్గంలో మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్లన్నీ ఏకపక్షంగా టీడీపీకి పడేలా పోలీసులు వ్యూహం రచించినట్లు తెలిసింది. రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఓబుళపతి అనే హెడ్ కానిస్టేబుల్ అంతా తానై వ్యవహరించిన విషయం బయటపడింది. దీంతో ఇతనిపై రెండురోజుల క్రితం ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు. అతన్ని వీఆర్‌కు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయడమే కాకుండా రూ.లక్షలు ముడుపులు తీసుకొని మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బలవంతంగా టీడీపీకి వేయించారని తెలుస్తోంది. పలువురు బాధిత మహిళా వాలంటీర్లు కూడా ఏం జరిగిందనే అంశంపై వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో టేపులు బయటకు పొక్కడంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఒక్కో వలంటీర్‌కు రూ. వెయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి లక్షల్లో పోలీసు స్టేషన్‌కు ముడుపులు వచ్చాయని, అయితే ఒక్కో మహిళా వలంటీర్‌కు పోస్టల్ బ్యాలెట్ వేయాలని రూ.1000 చొప్పున ఇచ్చినట్లు వీడియో టేపుల్లో పేర్కొన్నారు. కొంతమంది ఎదురు ప్రశ్నించిన వారిని ఉద్యోగాల నుంచి పీకేస్తామని బెదిరించినట్లు వాపోయారు. ఈ వ్యవహారంలో హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు మరో మహిళా కానిస్టేబుల్, ఓ ఎస్ఐ ఉన్నట్లు వీడియో టేపుల్లో బయటపడింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు మరోవైపు గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ హరికృష్ణపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. హరికృష్ణ తోటలో బోర్ను సీజ్ చేయాలంటూ టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు -
లెక్క తేలేదెప్పుడో...!
సాక్షి, కురుపాం: పోస్టల్ బ్యాలెట్ల లెక్క తేలేదెప్పుడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నెల 22 వరకు వేసేందుకు గడువు ఉండడంతో పోస్టల్ బ్యాలెట్‌పైనే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు దృష్టి సారించారు . సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి నెల రోజులు దాటింది. ఏప్రిల్ 11న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. అప్పటికే ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ముందుగానే సిద్ధం చేశారు. అయితే ఏప్రిల్ 11న ఎన్నికల విధులను నిర్వహించేందుకు వెళ్లే ప్రతీ అధికారి వివరాలు సేకరించి వారికి పోస్టల్ బ్యాలెట్లను అందజేశారు. పోలింగ్ ముగిసి లెక్కింపు సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అత్యంత కీలకం కానున్నాయి. ఎన్నికల్లో ప్రతీ ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ ఆ ఓటు దక్కాలన్న ఆలోచనలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్‌పై దృష్టి పెట్టినట్టు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్క ఏమిటోనని తీవ్రంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని పార్టీలకు చెందిన నాయకులు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకే ఎర చూపి ఏకంగా బేర సారాలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 23న జరగనున్న ఎన్నికల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్లనే లెక్కింపుకు అవకాశం ఉండటంతో పాటు ఆ ఓట్లే తమ విజయం వైపు మలుచుకోవాలని అభ్యర్థులు దృష్టి సారించినట్టు తెలిసింది. 1542 పోస్టల్ బ్యాలెట్లు కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఉద్యోగులకు 1542 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వీటిలో ఏప్రిల్ 11న కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటింగ్ ప్రక్రియలో 476 మంది ఉద్యోగులు ఎన్నికల విధులకు వెళ్లే ముందు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా మిగిలిన 1066 మందిలో 50శాతం వరకు కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసి పోస్టల్ బూత్‌లో తమ బ్యాలెట్లను వేయగా మరికొందరు తపాలా శాఖ ద్వారా పోస్టాఫీసుకు వెళ్లి అసెంబ్లీ, పార్లమెంటుకు చెందిన బ్యాలెట్లు వేశారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగటానికి ఈ నెల 22 వరకు సమయం ఉండటంతో ఇంతలోగా పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న ఉద్యోగులపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు దృష్టి పెట్టి పోస్టల్ బ్యాలెట్లను చేజిక్కించుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పోస్టల్ బ్యాలెట్ల లెక్క తేలకుండా పోయిందని చర్చ జరుగుతుంది. -
పో‘స్డల్’ బ్యాలెట్
సాక్షి, కాకినాడ సిటీ: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు అందించిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్నా ఇంకా అనేక బ్యాలెట్లు తిరిగి సంబంధిత అధికారులకు అందలేదు. జిల్లాలో 61,927 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేయగా అధికారులు 59,805 మందికి పోస్టల్ బ్యాలెటుపంపిణీ చేశారు. వీటిలో ఇప్పటి వరకు 36,178 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఇంకా సమయం ఉండడంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెబుతున్నారు. జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తం 28,748 మంది ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్‌ను పంపించారు. వీరి నుంచి తిరిగి మంగళవారం నాటికి 16,517 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ అధికారులకు బ్యాలెట్లు తిరిగి పంపించారు. ఇంకా 12,231 మంది పార్లమెంట్‌కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు అందాల్సి ఉంది. జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 31,057 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పత్రాలు పంపగా వీరిలో 19,661 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి పోస్టల్ బ్యాలెట్‌ను అధికారులకు తిప్పిపంపించారు. ఇంకా 11,396 మంది అభ్యర్థుల నుంచి రావల్సి ఉంది. చాలా మందికి పోస్టల్ బ్యాలెట్ అందలేదని, చెబుతుండగా తమకు దరఖాస్తులు అందించిన వారందరికీ పత్రాలను పంపించామంటున్నారు. ఆరు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నా, జారీ అయిన పోస్టల్ బ్యాలెట్‌ల్లో తిరిగి సగం కూడా ఆర్వోలకు చేరలేదు. ఇంకా సమయం ఉంది కదా కౌంటింగ్‌కు గంట ముందు చేరే విధంగా పంపవచ్చనే ఉద్దేశ్యంతో కొందరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పలు ప్రాంతాల్లో... జిల్లా కేంద్రంలో పని చేసే ఉద్యోగులు, వివిధ ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించారు. వీరికి కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నుంచి 48 గంటల్లో పోస్టల్ బ్యాలెట్ జారీ కావాల్సి ఉంది. పోలింగ్ జరిగి నెల రోజులు కావస్తున్నా ఇంత వరకు అందకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పోస్టాఫీసుకు వెళ్లి ఆరా తీస్తున్నా ఫలితం లేకుండా పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీవే ఎక్కువ... జిల్లాలోని మూడు పార్లమెంట్, 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 59,805 మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ కాగా అసెంబ్లీకి సంబంధించి 16,517 ఓట్లు తిరిగి ఆర్వోలకు వచ్చాయి. పార్లమెంట్‌కు సంబంధించి తక్కువ బ్యాలెట్ ఓట్లు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 16,517 ఓట్ల మాత్రమే వచ్చాయి. ఇంకా ఆరు రోజులు సమయం ఉన్నా వేలాది మంది పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్లను పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా ఓటమి భయంతో టీడీపీ నేతలు, ఉద్యోగుల ఓట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థులు స్వయంగా రంగంలోకి ఉద్యోగులను ప్రలోభ పెడుతున్నట్లు సమాచారం. టీడీపీ నేతలే స్వయంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వివరాలను తీసుకొని, నేరుగా బ్యాలెట్ ఓట్లు తీసుకున్న అభ్యర్థుల వద్దకు వెళ్లి తమకే ఓట్లు వేయాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నేతలు అడ్డు చక్రం వేయడం వల్లనే ఇప్పటికీ వేలాది మందికి పోస్టల్ బ్యాలెట్లు అందలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్లు 59,805 తిరిగి వచ్చినవి 36,178 పార్లమెంట్‌కు వచ్చినవి 16,517 అసెంబ్లీకి వచ్చినవి 19,661 ఇంకా రావల్సినవి 23,627 -
లీకువీరుడు.. దొరికేశాడు..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రభుత్వోద్యోగుల పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా బయటకు వచ్చిన వ్యవహారం మొత్తం.. ఓ తహసీల్దార్ దగ్గరుండి నడిపించాడని తేలింది. పోస్టల్ ఓట్లు కలిగిన ఉద్యోగుల జాబితాను బయటకు ఇవ్వకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జిల్లా అధికారులు చెప్పుకురాగా, అదే ఉద్యోగుల ఫోన్ నెంబర్లను సైతం భీమిలి టీడీపీ అభ్యర్ధి సబ్బం హరికి అందించిన నిర్వాకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ జాబితాను పట్టుకుని సబ్బం హరి ఒకేసారి 500మంది ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రలోభాల వల విసిరారు. ఈ భాగోతంపై సాక్షి పత్రికలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ విచారణకు ఆదేశించారు. డీఆర్వోను విచారణాధికారిగా నియమించారు. సబ్బం హరి మాట్లాడిన ఆడియో టేపులను పరిశీలించిన తర్వాత.. అది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని భావించి.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈలోగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. అనుమానితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల వాట్సాప్ మెసేజ్‌లు, ఈ మెయిల్స్ కూడా చెక్ చేశారు. మొత్తంగా విచారణలో జిల్లాలోని ఓ తహసీల్దార్ ఈ డేటా లీక్‌కు పాల్పడినట్టు తేలింది. మొత్తం ఫోన్ నెంబర్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ కలిగిన ఉద్యోగుల జాబితాను సదరు తహసీల్దార్... సబ్బం హరికి అందించినట్టు తెలిసింది. దీనిపై నిగ్గు తేల్చిన జిల్లా ఉన్నతాధికారులు ఆ తహసీల్దార్‌పై సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తూ ఎలక్షన్ కమిషన్‌కు నివేదించినట్టు తెలిసింది. కలెక్టరేట్ అధికారులకు సంబంధం లేదట వాస్తవానికి కలెక్టరేట్లో పనిచేసే రెవెన్యూ అధికారులపైనే తొలుత సందేహాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం పర్యవేక్షించే సెక్షన్ వర్గాలపైనా అనుమానాలు రేకెత్తాయి. కానీ సమగ్ర విచారణ అనంతరం కలెక్టరేట్ వర్గాలకు సంబంధం లేదని, ఇదంతా ఆ తహసీల్దార్ నిర్వాకమేనని తేలినట్టు తెలుస్తోంది. -
3.05 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు 3,05,040 మందికి, 25 పార్లమెంటు స్థానాలకు 3,01,003 మందికి పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. అసెంబ్లీ స్థానాలకు 3,18,530 మంది, పార్లమెంటు స్థానాలకు 3,17,291 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సరైన పత్రాలు సమర్పించని వారికి పోస్టల్ బ్యాలెట్లు మంజూరు చేయలేదని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారిలో కొంతమంది అసలు దరఖాస్తే చేసుకోలేదని వివరించారు. గురువారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ద్వివేది మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60,250 మంది సర్వీసు ఓటర్లు ఉండగా అందులో సుమారు 58 వేల మందికి ఆన్లైన్లో బ్యాలెట్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల అవకతవకలపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో మంజూరు చేసిన బ్యాలెట్ల వివరాలను ఆయన వెల్లడించారు. అలాగే ఈవీఎంలు, వీవీప్యాట్ల కౌంటింగ్‌పై ఆర్వో, ఏఆర్వోలకు మే 17న విజయవాడలో ఉదయం పది గంటల నుంచి మధ్నాహ్నం రెండు గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిఖిల్ కుమార్ (డైరెక్టర్), మధుసూదన్ గుప్తా (యూఎస్)లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. లెక్కింపులో పాల్గొనే ఉద్యోగులను జిల్లా యూనిట్‌గా మూడుసార్లు ర్యాండమైజేషన్ విధానంలో ఎంపిక చేస్తామన్నారు. లెక్కింపునకు వారం రోజుల ముందు మొదట విడత ర్యాండమైజేషన్, 24 గంటల ముందు నియోజకవర్గ పరిశీలకుల సమక్షంలో రెండో విడత పూర్తి చేస్తామని వివరించారు. కౌంటింగ్ రోజు ఒక గంట ముందు సిబ్బందికి ఏ టేబుల్ కేటాయించామన్నది తెలియజేస్తామన్నారు. ఉదయం 8.30 తర్వాత కేవలం కేంద్ర ఎన్నికల పరిశీలకులు తప్ప ఆర్వోలతో సహా ఎవ్వరి సెల్ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
పోస్టల్ బ్యాలెట్ అవకతవకలను సరిదిద్దండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల జారీలో అవకతవకలను తక్షణం సరిదిద్దాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని వైఎస్సార్సీపీ కోరింది. కొన్నిచోట్ల అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులకు రెండేసి పోస్టల్ బ్యాలెట్లను ఇచ్చారని తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి బుధవారం సచివాలయంలో ద్వివేదిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకపోతే మరికొన్నిచోట్ల ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారని, ఇలాంటి అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 108 మందికి రెండేసి పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారంటూ తిప్పేస్వామి ఆధారాలను సమర్పించారు. దీనిపై రిటర్నింగ్ అధికారిని అడిగితే సమాధానం చెప్పలేదని, తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ద్వివేది ఈ అంశంపై నివేదిక పంపాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సిందే: ఉద్యోగుల సమాఖ్య ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట రామిరెడ్డి డిమాండ్ చేశారు. చివరి క్షణంలో ఎన్నికల బాధ్యతలు చేపట్టిన 40 వేల మందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం తక్షణం స్పందించాలన్నారు. దీనిపై అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. -
పోస్టల్ బ్యాలెట్స్‌పై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పోస్టల్ బ్యాలెట్స్‌లో అవకతవకలపై సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 108 మందికి రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారంటూ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధారాలతో సహా సమర్పించారు. దీనిపై ఆర్వో సమాధానం చెప్పలేదని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ద్వివేది... దీనిపై నివేదిక పంపాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారుతున్నాయి. అందుకే తమ ప్రభుత్వ పనితీరుపట్ల విముఖంగా ఉన్న ఉద్యోగులకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు టీడీపీ పెద్దలు కుట్ర పన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోస్టల్ బ్యాలెట్స్ అవకతవకలపై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య న్యాయపోరాటానికి దిగింది. 40 వేల మంది ఉద్యోగుల ఓటుహక్కును అధికారులు హరించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై విచారణకు హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. సుప్రీం కోర్టును ఆశ్రయించి ఓటుహక్కు సాదిస్తామంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేతలు పేర్కొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు అందని పోస్టల్ బ్యాలెట్లు
-
ఓటెయ్యరని వేటేశారు!
సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలు, అక్రమాలు ఆగడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు అందకుండా టీడీపీ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారు. టీడీపీ సర్కారు పాలనపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారి ఓట్లు తమకు పడే అవకాశమే లేదన్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ముఖ్యులు వచ్చారు. అందుకే ఉద్యోగుల ఓటు హక్కునే కాలరాచే కుతంత్రానికి పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి పోస్టల్ బ్యాలెట్లు అందకుండా చేశారు. కొందరికి బ్యాలెట్ పేపర్లు లేకుండా ఖాళీ కవర్లు పంపించడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 4,48,443 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వారిలో దాదాపు 3,64,249 మంది పోస్టల్ బ్యాలెట్ పొందారు. ఇంకా 84,194 మందికి బ్యాలెట్ పత్రాలు అందలేదు. అంటే వారు ఓటువేసే అవకాశం ఇక దాదాపు లేనట్లే. ఎన్నికల విధుల్లో ప్రైవేట్ సిబ్బంది ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి చాలా రోజుల ముందునుంచే తెలుగుదేశం పార్టీ నేతలు తమ స్కెచ్‌కు పదును పెట్టారు. పోలింగ్ సిబ్బందిగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు బదులు ప్రైవేట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన ఉద్యోగులను నియమించేలా పావులు కదిపారు. తమకు అనుకూలమైన సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. పోలింగ్‌కు 15 రోజుల ముందు ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ల అధ్యాపకులు, ఉపాధ్యాయులు దాదాపు 45 వేల మందిని ఎన్నికల విధుల్లో నియమించారు. వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కూడా కల్పించారు. ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లలో వారితో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం(ఈసీ) అప్రమత్తమైంది. చాలా జిల్లాల్లో ప్రైవేట్ సిబ్బందిని ఎన్నికల విధుల నుంచి తొలగించింది. వారి స్థానంలో ప్రభుత్వ సిబ్బందిని నియమిస్తూ ఏప్రిల్ 8న ఉత్తర్వులు ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని కోరగా, తరువాత ఇస్తామని చెప్పారు. కానీ, వేలాది మందికి ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడం గమనార్హం. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. గెలుపోటముటల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకం ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారుతున్నాయి. అందుకే తమ ప్రభుత్వ పనితీరు పట్ల విముఖంగా ఉన్న ఉద్యోగులకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు టీడీపీ పెద్దలు కుట్ర పన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల రాజ్యాంగ హక్కును కాలరాస్తారా? ‘‘ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లను అందజేయకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. వారి రాజ్యాంగ హక్కును కాలరాయడమే. దీనికంటే అన్యాయం, దారుణం మరొకటి ఉండదు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి, ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్లు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ – మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ అర్హులైన వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందజేయాలి ‘‘పోస్టల్ బ్యాలెట్లు అందజేయకపోతే ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోతారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి, ఓడిపోయే అభ్యర్థికి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువ ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్లే కీలకం అవుతాయి. అర్హులైన ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’ – ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ వేస్తాం.. ‘‘వేలాది మంది ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు చివరి నిమిషంలో పోలింగ్ డ్యూటీ వేశారు. దీనివల్ల వారు పోస్టల్ బ్యాలెట్‌కు దూరమయ్యారు. కలెక్టర్లను అడిగితే ఎన్నికల సంఘం అనుమతిస్తే అవకాశం ఇస్తామంటున్నారు. ఎన్నికల సంఘం అధికారిని సంప్రదిస్తే కలెక్టర్లే చూసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మినహా మాకు మరోమార్గం కనిపించడం లేదు’’ – వెంకట్రామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్ అర్హులందరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలి ‘‘అర్హులైన ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అందరూ ఓటెయ్యాలి, ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి అంటూ ప్రభుత్వం ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం లేకుండా చేయడం దారుణం. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు అందజేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకొనేలా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలి’’ – వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ, ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షులు -
భారత్‌లో ఎన్నికలు; పాకిస్తాన్ నుంచి ఓట్లు!
న్యూఢిల్లీ: మన దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్ నుంచి కొంత మంది ఓటు వేశారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి దాదాపు వందమందిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు. ఓటు వేసిన వారందరూ భారతీయులే. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారంతా ఈ-పోస్టల్ బ్యాలెట్(ఈటీపీబీఎస్)తో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ ఓటర్ విధానంతో భారత సార్వత్రిక ఎన్నికల్లో తమ గళాన్ని వినిపించే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటికే ఐదు విడతల ఎన్నికలు ముగిశాయి. మరో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగాల్సివుంది. ఈనెల 19 నాటికి ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. 23న ఓట్లు లెక్కిస్తారు. ఈటీపీబీఎస్ అంటే... ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీపీబీఎస్)ను సర్వీసు ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులను సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు. సీ-డాక్ రూపొందించిన ఈటీపీబీఎస్ అత్యంత సురక్షితమైందని, రెండంచల్లో భద్రత ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఓటీపీ, పిన్ ద్వారా గోప్యత పాటిస్తారు. స్పష్టమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది కనుక రెండుసార్లు ఓటు పడే అవకాశం(డూప్లికేషన్) ఉండదు. సర్వీసు ఓటర్లతో పాటు ఉంటున్న భాగస్వాములు(భార్య/భర్త), విదేశాల్లో ఉంటున్న రక్షణ శాఖ ఉద్యోగులు దీని ద్వారా ఓటు వేయొచ్చు. తమ నియోజకవర్గానికి వెలుపల ఉన్న సర్వీసు ఓటర్లు ఈటీపీబీఎస్ ద్వారా ఎక్కడినుంచైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి ఈటీపీబీఎస్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓటీపీ కావాలి. ఈ ఫైల్‌ను ఆన్లైన్లో పంపించేందుకు పిన్ తప్పనిసరి. ఎన్నికలకు 16 రోజుల ముందు ఈ-బ్యాలెట్ పంపించాలి. సర్వీసు ఓటరుగా ముందుగా నమోదు చేయించుకుంటేనే దీన్ని వాడగలరు. సర్వీసు ఓటర్లు పంపించిన ఈ-బ్యాలెట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఈఆర్ఓ)కి మాత్రమే కనబడుతోంది. దాన్ని ఆమోదించే, తిరస్కరించే అధికారం ఈఆర్ఓకు మాత్రమే ఉంటుంది. ఈటీపీబీఎస్‌లో ఓటు వేసేదిలా... -
‘పోస్టల్ మాయాజాలం’ పై కొరడా
-
పోస్టల్ బ్యాలెట్ అక్రమాలపై ఈసీ సీరియస్
-
‘పోస్టల్ మాయాజాలం’ పై కొరడా
ఉరవకొండ: నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లో జరిగిన గందరగోళంపై ఈనెల 3న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శోభా స్వరూపారాణి చర్యలు చేపట్టారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆర్‌ఓతో పాటు ఏఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ‘సాక్షి’లో వచ్చిన పోస్టల్ మాయాజాలం కథనం పై విచారణ చేపట్టామన్నారు. అయితే ఇందులో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి ఆంజినేయులు గత నాలుగు నెలల క్రితం మృతి చెందారన్నారు. మృతుడి కుమారుడు వరప్రసాద్ కూడా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. అయితే అధికారులు కుమారుడికి పోస్టల్ బ్యాలెట్ మంజురు చేయాల్సింది పోయి మృతి చెందిన ఆంజినేయులుకు పోస్టల్ బ్యాలెట్ పంపారని తెలిపారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నోడల్ ఆఫీసర్ ఉదయ్‌భాస్కర్‌రాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. 10 మందికి నోటీసులు సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు మంజురు చేసిన పొస్టల్ బ్యాలెట్లలో 30 మంది ఉద్యోగులు రెండేసి బ్యాలెట్ పత్రాలు పొందారని తెలిపారు. ఇందులో 20 మంది వెంటనే బ్యాలెట్ పత్రాలు వెనక్కి తీసుకొచ్చి అప్పగించారన్నారు. ఇంకా 10 మంది ఉద్యోగులు మాత్రం బ్యాలెట్ పత్రాలు వారి వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో 10 మంది ఉద్యోగులకు బ్యాలెట్లు వెనక్కి ఇవ్వాలంటూ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. -
ఉరవకొండలో పోస్టల్ బ్యాలెట్ అక్రమాలు
-
ఎవరు.. డేటా చోరులెవరు?
పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు తెరపైకి వచ్చిన డేటా చౌర్యం వివాదం పెద్ద కలకలమే రేపింది.రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ–గవర్నెన్స్, ఈ–ప్రగతి వ్యవస్థల ద్వారా టీడీపీ నేతలకు చెందిన ఐటీగ్రిడ్, టీడీపీకే చెందిన సేవామిత్ర యాప్‌లలోకి ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన ఒరిజినల్ జాబితాలను, ఆధార్ వివరాలను కూడా చౌర్యం చేశారనీ.. తద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.. దీనిపై కేసులు కూడా విచారణలో ఉన్నాయి..ఇప్పుడు విశాఖలోనూ అటువంటి డేటా చౌర్యమే కలకలం రేపుతోంది. పోస్టల్ బ్యాలెట్ల వినియోగానికి కౌంటింగ్ వరకు అవకాశమున్న నేపథ్యంలో ఆ ఓట్లు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన జాబితాలు, ఫోన్ నెంబర్లు భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరికి చేతిలోకి వెళ్లడం.. వాటి ఆధారంగా ఆయనగారు ఉద్యోగులతో సామూహిక టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ.. ప్రలోభాలకు గురి చేస్తుండటంపై ‘సాక్షి’ ఆడియో వివరాలతో సహా రట్టు చేయడం కలెక్టరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గోప్యంగా ఉంచాల్సిన ఈ జాబితాను చౌర్యం చేసి.. టీడీపీ అభ్యర్థికి అప్పగించిన చోరులెవరన్నది ఇప్పుడుచర్చనీయాంశమైంది.కలెక్టరేట్లో తిష్ట వేసిన టీడీపీకి సన్నిహితుడైన ఓ వివాదాస్పద అధికారి ద్వారా సదరు డేటా గడప దాటిందన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా.. ఈ వ్యవహారంపై విచారణ కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రభుత్వోద్యోగుల పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా బయటకు వచ్చిన వ్యవహారం కలెక్టరేట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. పోస్టల్ ఓట్లు కలిగిన ఉద్యోగుల జాబితాను బయటకు ఇవ్వకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పుకొచ్చిన జిల్లా అధికారులు ఉద్యోగుల ఫోన్ నెంబర్లను సైతం భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరికి అందించిన నిర్వాకం వివాదాస్పదమవుతోంది. ఆ జాబితాను పట్టుకుని సబ్బం హరి ఒకేసారి 500 మంది ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రలోభాల వల వేస్తున్న వైనాన్ని ‘సబ్బం.. ప్రలోభాల పబ్బం’ శీర్షికతో సాక్షి గురువారం బట్టబయలు చేయడంతో.. ఈ అంశం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చకు తెరలేపింది. వాస్తవానికి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి టీడీపీ అభ్యర్ధులందరికీ ప్రభుత్వోద్యోగుల జాబితాలు చేరాయనే ప్రచారం ఉంది. కానీ సబ్బం హరికి మాత్రం జిల్లా రెవెన్యూ వర్గాల నుంచే ఆ జాబితా అందిందనే వాదనలకు బలం చేకూరుతోంది. ఆడియో టేపులు నిశితంగా పరిశీలించి విన్న వారికి ఇదే విషయం స్పష్టమవుతుంది. ఇది టీడీపీ ప్రజాప్రతినిధి బంధువు పనేనా? జిల్లా రెవెన్యూ వ్యవహారాల్లో టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి బంధువు కొన్నేళ్లుగా హల్చల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సదరు అధికారి తహసీల్దార్‌గా ఉన్నప్పుడు భూ కుంభకోణాల్లోనూ ఆయన పేరు మార్మోగిపోయింది. ఆ అధికారి విశాఖ రూరల్ తహసీల్దార్‌గా పని చేసిన కాలంలోనే ఎన్నో భూ రికార్డులు తారుమారయ్యాయి. బదిలీ అయిన తర్వాత కూడా దాదాపు 59 రోజులపాటు డిజిటల్ కీ అప్పగించని నిర్వాకం ఆయనది. రెవెన్యూ రికార్డులు, డిజిటల్ సిగ్నేచర్‌కు సంబంధించి ఈ కంప్యూటర్ కీ ఉంటేనే పని సాధ్యం. కొత్త తహసీల్దార్ వచ్చినా 59 రోజులపాటు కీ అప్పగించకపోవడం వెనక చాలా వ్యవహారాలు నడిచాయన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఇక పెందుర్తి తహసీల్దార్‌గా చేసిన కాలంలో కూడా భూదందాలకు సంబంధించి ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. సదరు అధికారి ఈ ఐదేళ్లలో విశాఖ పరిసర ప్రాంతాల్లోనే.. అదీ కీలకమైన మండలాల్లోనే తహసీల్దార్‌గా పనిచేశారంటే ఆయన హవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న అధికారికి ఎన్నికల సమయంలో కలెక్టరేట్లోని ఓ సెక్షన్‌ను అప్పగించారు. ఓటర్ల జాబితా వ్యవహారాలతో ఆ సెక్షన్‌కు నేరుగా సంబంధం లేనప్పటికీ కలెక్టరేట్లోనే మకాం వేసిన ఆ అధికారి ఎన్నికల విభాగం(పోస్టల్ బ్యాలెట్లు పర్యవేక్షించే) అధికారిపై ఒత్తిడి తెచ్చి జాబితాను తన సామాజికవర్గానికి చెందిన సబ్బం హరికి అందజేశారన్న ఆరోపణలు నేరుగా కలెక్టరేట్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్లు పర్యవేక్షిస్తున్న విభాగాధికారిపై కూడా ఇప్పటికే ఎన్నో ఆరోపణలున్నాయి. ఆ అధికారి గత ఏడేళ్లుగా కలెక్టరేట్లోనే తిష్ట వేసిన నేపథ్యంతో పాటు టీడీపీ నేతలకు కొమ్ముకాస్తారనే ఆరోపణలు ఉన్నాయి. భీమిలి తహసీల్దార్ ఆఫీసు నుంచి కూడా...సమగ్ర విచారణ పోస్టల్ ఉద్యోగుల ఓట్ల జాబితా బయటకు రావడంపై సమగ్ర విచారణకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. గురువారం సాక్షిలో కథనం వచ్చిన దరిమిలా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల జాబితా ఫోన్ నెంబర్లతో సహా బయట పెట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం.. ఈ తప్పుడు పని ఎవరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం సాయంత్రంలోగా నివేదికనివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించానని కలెక్టర్ సాక్షి ప్రతినిధితో చెప్పారు. -
సబ్బం.. ప్రలోభాలతో పబ్బం
-
6న ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్ నంబర్ 94, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్ నంబర్ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 97, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం బూత్ నంబర్ 197లో రీ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. చివరిలోనే వీవీ ప్యాట్ల లెక్కింపు.. ఓట్ల లెక్కింపు సమయంలో వీవీప్యాట్‌లో నమోదైన ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వీవీప్యాట్ల లెక్కింపుపై వివిధ వర్గాల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి వివరణ ఇచ్చింది. కౌంటింగ్ అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత చివరలో నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్లను లాటరీ విధానంలో ఎంపిక చేసి లెక్కిస్తారని, ఈవీఎంలో ఉన్న ఓట్లకు, వీవీప్యాట్‌లో ఉన్న ఓట్లకు తేడా వస్తే.. మరోసారి రీకౌంటింగ్ చేస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈవీఎం, వీవీప్యాట్ల ఓట్లను లెక్కింపు చేస్తారని, ఒకవేళ తేడా వస్తే వీవీప్యాట్‌లో నమోదైన ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారని ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా అప్పటికే ఈవీఎంలో లెక్కించిన ఓట్లను సవరణ చేసి తుది ఫలితాన్ని ప్రకటిస్తారని చెప్పారు. వీవీప్యాట్లను ఎలా లెక్కించాలో ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలను రూపొందించిందని, దీని ప్రకారం బ్యాంకులో క్యాషియర్ కౌంటర్‌కు ఏర్పాటు చేసిన విధంగా మెష్ ఏర్పాటు చేసి ఆర్వో, అబ్జర్వర్ల సమక్షంలో లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఒక వీవీప్యాట్ లెక్కించిన తర్వాతే∙మరో వీవీప్యాట్ లెక్కిస్తారని తర్వాత అధికారికంగా తుది ఫలితం ప్రకటిస్తారని వివరించారు. ఆంక్షల సడలింపునకు ప్రతిపాదన రాలేదు.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనావళిని సడలించాలంటూ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని ద్వివేది స్పష్టం చేశారు. ఆంక్షల సడలింపు కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, ప్రభుత్వం నుంచి అటువంటి ప్రతిపాదన రాగానే తక్షణం పంపిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలన్న విషయం ఎన్నికల నిబంధనావళిలో స్పష్టంగా ఉందని చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన ఈవీంఎలు తడవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్‌ల కిటికీలు, గుమ్మాలు, పైకప్పులను మూడు వరుసల్లో ప్లాస్టిక్ కవర్లతో కప్పినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు, వర్షాలు వచ్చినా దెబ్బతినకుండా ఉండే భవనాలనే స్ట్రాంగ్ రూమ్‌లుగా ఎంపిక చేశామని, అభ్యర్థులు ఈవీఎంల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ద్వివేది స్పష్టం చేశారు. మెజార్టీ తగ్గితే పోస్టల్ బ్యాలెట్ రీకౌంటింగ్ తప్పనిసరి.. ఈసారి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని సవరణలు చేసిందని ద్వివేది తెలిపారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయితే కానీ ఈవీఎంల లెక్కింపు మొదలయ్యేది కాదని, ఈసారి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టడానికి అనుమతిచ్చారని తెలిపారు. అలాగే పోలైన మొత్తం పోస్టల్ బ్యాలెట్ల కంటే అభ్యర్థి మెజార్టీ తక్కువగా ఉంటే రెండోసారి పోస్టల్ బ్యాలెట్లను రీకౌంటింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఉదాహరణకు మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్లు 3,000 ఉంటే అభ్యర్థికి మెజారిటీ 2000 మాత్రమే వస్తే ఎవరి అభ్యర్థనలతో సంబంధం లేకుండానే కచ్చితంగా పోస్టల్ బ్యాలెట్లు రీకౌంటింగ్ చేస్తారన్నారు. -
సబ్బం.. ప్రలోభాలతో పబ్బం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓట్ల కోసం అన్ని అడ్డదారులు తొక్కిన అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోలింగ్ ముగిశాక ఇప్పుడు ప్రభుత్వోద్యోగుల పోస్టల్ ఓట్ల కోసం బరితెగించారు. ఇప్పటికే పలువురు టీడీపీ అభ్యర్థులు ఒక్కో ఉద్యోగి పోస్టల్ ఓటు కొనుగోలుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఎరచూపుతూ వచ్చారు. తాజాగా భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరి ఏకంగా ఒకేసారి 500 మంది ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రలోభాలకు గురిచేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్ బయటపడటం వివాదాస్పదమైంది. ఆ ఆడియోలో ‘భీమిలిలో 3 వేల వరకు పోస్టల్ ఓట్లు ఉన్నాయని లెక్క తేలింది. మీరందరూ ఎన్నికల వేళ బిజీగా ఉన్నారు. మీరు నన్ను వైజాగ్ లేదా భీమిలిలో కలవచ్చు. నలుగురైదుగురుగా వచ్చి కలవండి. అన్నీ మాట్లాడుకుందాం’ అని సబ్బం చెప్పుకొచ్చారు. పోస్టల్ ఓట్లున్న ఉద్యోగుల జాబితా సబ్బం హరికి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ నేతలకు జిల్లా కలెక్టరేట్లోని కొందరు అధికారులు జాబితాను అందించారని తెలిసింది. ఇదే జాబితాను తాము స్వయంగా కలిసి అడిగినా ఇవ్వలేదని, సబ్బం హరికి ఎలా ఇచ్చారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు ప్రశ్నించారు. ఉద్యోగుల పేర్లతో పాటు ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం దారుణమని, ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్ ఓట్ల వివరాలను టీడీపీ అభ్యర్థులందరికీ ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
‘చిత్తూరులో 52 వేల మందికి పోస్టల్ ఓట్లు’
చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా 52 వేల మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు, అలాగే ఆర్మీ సర్వీసులో ఉన్నవారికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. చిత్తూరులో ప్రద్యుమ్న విలేకరులతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 2వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చామని తెలిపారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడం కుదరదని స్పష్టంగా పేర్కొన్నారు. వివిధ శాఖల ద్వారా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్న వారికి ఆయా శాఖాధిపతుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే సౌకర్యం చేపట్టామని అన్నారు. ఓటరు లిస్టులో పొరపాట్లు, అడ్రస్ ట్యాలీ కాకపోవడం వల్ల కొందరికి పోస్టల్ బ్యాలెట్లు మంజూరు కాకపోయి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు చాలా మందికి మంజూరు కాలేదంటూ చిత్తూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
పోస్టల్ బ్యాలెట్ పంపిణీలో అవకతవకలు : దాడి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లాలో పోస్టల్‌బ్యాలెట్ పంపిణీలో అవకతవకంలు జరిగాయని, జిల్లా కలెక్టర్ బాధ్యతారాహిత్యం బయటపడిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి అన్నట్లు వ్యవహరించడం లేదని, 4 వేలకు పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోయారని అన్నారు. ఇతర జిల్లాలకు భిన్నంగా విశాఖ జిల్లా కలెక్టర్ భాస్కర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే కౌంటింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు కలెక్టర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజు వారీగా సమాచారాన్ని అందరికీ ఇవ్వాలని తెలిపారు. కౌంటింగ్‌ను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై టీడీపీ కుట్రలు
అనంతపురం : టీడీపీ కన్ను ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై పడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లక్ష్యంగా టీడీపీ కుట్రలకు తెరలేపింది. కొందరు ప్రభుత్వ అధికారులు టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ఓట్లు కొనేందుకు టీడీపీ నాయకులు లక్షల రూపాయలు వెదజల్లుతున్నారు. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న కొందరు ప్రభుత్వ అధికారులు టీడీపీ మద్ధతుదారులైన ఉద్యోగులకు రెండు ఓట్లు జారీ చేశారు. కదిరి, మడకశిర నియోజకవర్గాల్లో ఈ బాగోతం వెలుగుచూసింది. సుమారు 100 మంది ఉద్యోగులు కదిరిలో రెండుసార్లు ఓట్లు వేశారు. మడకశిరలో 50 మంది ఉద్యోగులకు డబుల్ పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు. ఈ విషయం గమనించిన వైఎస్సార్సీపీ నేతలు సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒక్కో ఉద్యోగికి రెండు ఓట్లు జారీ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, ఆ ఓట్లు చెల్లకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. -
పోస్టల్ బ్యాలెట్‌లోనూ ప్రలోభాలు
పోస్టల్ బ్యాలెట్‌లోనూ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు సామాజికవర్గాల వారీగానే కాకుండా.. ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తివాదులను కోట్లు కుమ్మరించి కొనుగోలు రాజకీయాలు చేసిన నేతలు పోస్టల్ బ్యాలెట్ల కొనుగోలుకు కూడా తెరతీసినట్టు చెబుతున్నారు.ప్రలోభాలకు లొంగని ఉద్యోగులపై అనేక విధాలుగా ఒత్తిడితీసుకువస్తున్నట్లు తెలిసింది. సాక్షి, విశాఖపట్నం: పోస్టల్ బ్యాలెట్ విషయంలో అధికారుల చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతన లేకుండా ఉంది. తొలుత 11 వేల మందికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేశామని చెప్పిన అధికారులు.. ఆ తర్వాత కాదు కాదు 14 వేల మందికి జారీ చేశామని చెప్పుకొచ్చారు. చివరకు ‘సాక్షి’లో వరుస కథనాలు నేపథ్యంలో పార్లమెంటు, అసెంబ్లీల వారీగా జారీచేసిన పోస్టల్ బ్యాలెట్ వివరాలను వెల్లడించారు. అసెంబ్లీ బ్యాలెట్లు అందితే లోక్‌సభ బ్యాలెట్లు, లోక్‌సభ బ్యాలెట్లు అందితే అసెంబ్లీ బ్యాలెట్లు అందకుండా గందరగోళం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు గడువు ఏప్రిల్ 7వ తేదీ అనే విషయాన్ని మాటమాత్రంగానైనా చెప్పలేదని ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బంది చెబుతున్నారు. తామే తెలుసుకుని దరఖాస్తు చేశామని, దరఖాస్తు చేసినా నేటికీ పోస్టల్ బ్యాలెట్ అందలేదని పలువురు పోలింగ్ సిబ్బంది నుంచి మీడియాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దాదాపు 43 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని సాక్షాత్తు జిల్లా ఎన్నికల అధికారే ప్రకటించారు. వారందరికీ నియామక ఉత్తర్వుల సమయంలోనే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. కనీసం శిక్షణ సమయంలో వాటిని అందజేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం ఐదుగంటల్లోగా ఫారం–12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. కొనసాగుతున్న ప్రలోభాలు మరో వైపు పోస్టల్ బ్యాలెట్లు జారీలో కావాలనే జాప్యం జరిగినట్టు అర్ధమవుతోంది. ఏడో తేదీన అందిన దరఖాస్తుల మేరకు పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసినా రెండు మూడు రోజుల్లోనే సిబ్బందికి చేరాలి. కానీ నేటికీ సగం మందికి చేరలేదని చెబుతున్నారు. మరో వైపు పోస్టల్ బ్యాలెట్ విషయంలో అధికార పార్టీకి కొంతమంది అధికారులు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చిరునామాలు, ఫోన్ నెంబర్లతో సహా పోస్టల్ బ్యాలెట్ జారీ చేసిన సిబ్బంది పూర్తి వివరాలు అధికార పార్టీ నేతలకు చేరవేస్తున్నారని తెలిసింది. అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయాలని ఒత్తిళ్లు కూడా తీసుకొస్తున్నట్టుగా సమాచారం. ఓ కీలకాధికారి స్వయంగా ఈ తరహా ప్రచారం కూడా సాగిస్తున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు పోస్టల్ బ్యాలెట్ చేరగానే అధికార పార్టీ నేతలు తమ అనుచరులను వారి ఇళ్లకు, కార్యాలయాలకు పంపించి బేరసారాలు సాగిస్తున్నారు. ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ముట్టజెబుతున్నట్టు తెలిసింది. కొన్ని చోట్ల పేటీఎం, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ ద్వారా ఓట్ల కొనుగోలుకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరికొంతమందికి పదోన్నతులు కల్పిస్తాం.. మీపై ఉన్న కేసులు ఎత్తి వేయిస్తాం అంటూ ఎర వేయడమే కాదు సంబంధిత శాఖల ఉన్నతాధికారుల ద్వారా ఫోన్లు కూడా చేయిస్తున్నట్టు తెలిసింది. అయితే మెజార్టీ ఉద్యోగులు ఈ ప్రలోభాలను తిప్పికొడు తున్నట్టు తెలిసింది. దాదాపు పాతికవేలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉండడంతో సాధ్యమైనన్ని ఓట్లు తమకు అనుకూలంగా తిప్పుకునేందుకు అధికార పార్టీ నేతలు విఫలయత్నాలు చేస్తున్నారు. సిబ్బందికి.. బ్యాలెట్లకు పొంతనలేదు అధికారికంగా 28,451 మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశామని చెబుతున్నారు. అదే స్థాయిలో లోక్‌సభ బ్యాలెట్లు కూడా జారీచేయాల్సి ఉన్నప్పటికీ 27,168 మందికి మాత్రమే లోక్‌సభ బ్యాలెట్లు జారీ చేశారు. నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్యను బట్టి పోలింగ్ సిబ్బంది ఉంటారు కాబట్టి హెచ్చు తగ్గులుండడంలో తప్పులేదు. కానీ మెజార్టీ నియోజకవర్గాల్లో రెండు వేలకు మించి పోస్టల్ బ్యాలెట్లు జారీ కానీ పరిస్థితి నెలకొంది. దాదాపు 15 వేల మందికి పైగా పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్టు ప్రకటించిన ఎన్నికల అధికారులు వారికి జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్లు మాత్రం 4,600 మాత్రమే. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1306 ఆర్టీసీ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు. మరో వైపు 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఫారం–12 అందాయన్న సాకుతో సుమారు 4,500 మందికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేయలేదంటున్నారు. కానీ తామంతా నిర్ణీత గడువులోగానే ఫారం–12 సమర్పించామని, కావాలనే పోస్టల్ బ్యాలెట్లు జారీచేయలేదని కొందరు చెబుతున్నారు. ఇక 8వ తేదీన శిక్షణలో పాల్గొన్న సుమారు 550 మంది ఆశ వర్కర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్లు అందలేదు. ఎన్నికల అధికారులు, సిబ్బంది కోసం సుమారు 400కి పైగా ప్రైవేటు వాహనాలు వినియోగించారు. ఈ వాహనాలపై పనిచేసిన డ్రైవర్లు, క్లీనర్లు సుమారు 800 మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఎంతమంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నదీ చెప్పలేని దుస్థితి నెలకొంది. -
పొస్టల్ బ్యాలెట్ జాప్యంపై కలెక్టర్‌ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
ఎన్నికల్లో దొరికిన నగదును ఏం చేస్తారు?
సాక్షి, ఆళ్లగడ్డ రూరల్: ఎన్నికల్లో అక్రమంగా తరలించే డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకంటారు. రూ.10లక్షల లోపు పట్టుబడిన కేసులను పోలీసులు, ఆపై కేసులను ఐటీ శాఖ విడివిడిగా విచారిస్తాయి. సరైన బిల్లులు, డాక్యుమెంట్లు ఉంటే ఆ నగదను విడిపించుకోవచ్చు. ఎలాంటి బిల్లులు, పత్రాలు చూపని డబ్బును పోలీసులు అక్కడి నుంచి కోర్టుకు, ఆ తర్వాత కేంద్రప్రభుత్వానికి వెళ్తుంది. ఈప్రక్రియకు చాలా సమయం పడుతుంది. బ్లూ ఇంక్ చరిత్ర తెలుసా.. ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత చేతికి పెట్టే బ్లూ ఇంక్‌కు చాలా చరిత్ర ఉంది. 1962 లోక్ సభ ఎన్నికల్లో మొదటిసారి ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. బ్లూ ఇంక్ 15 రోజుల పాటు చెదిరిపోకుండా అలాగే ఉంటుంది. మూడు నెలలైనా కూడా కొందరి వేళ్లపై ఇంకు ఉంటుంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ తయారు చేసే ఈ ఇంకును ఇండియాలోనే కాదు..కెనడా, కాంబోడియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల్లో కూడా ఉపయోగిస్తారు. ఓట్లు.. రకాలు సాధరణ ఓటు: పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం పోస్టల్ ఓటు: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు భద్రతా బలగాలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రాక్సీ ఓటు: మన తరపున ఓటు హక్కును వేరే వాళ్లు వేసేలా అధికారుల నుంచి అనుమతి పొంది ఓటేయడం టెండర్ ఓటు: మన ఓటు వేరేవాళ్లు అక్రమంగా వేసినప్పుడు, అధికారుల అనుమతితో మన ఓటును మనమే మళ్లీ వేయడం. -
అధికార పార్టీ కొత్త ఎత్తులు
సాక్షి, దర్శి(ప్రకాశం): ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది సర్వసాధారణం. కానీ, దర్శి ఎన్నికల అధికారులు మాత్రం టీడీపీ మద్దతుదారులైన ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్కరికి రెండు పోస్టల్ బ్యాలెట్లు ఇస్తున్నారు. ఈ విషయం దర్శి నియోజకవర్గంలో మంగళవారం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో మొత్తం 1,864 పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి. వివిధ రకాల ఎన్నికల డ్యూటీలకు నియమించిన అధికారులకు వాటిని కేటాయించారు. కాగా, ఇతర నియోజకవర్గాల్లో ట్రైనింగ్ తీసుకున్న అధికారులు కొందరు అక్కడే పోస్టల్ బ్యాలెట్లు పొందారు. గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు. ట్రైనింగ్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చిన దాఖలాలే లేవు. నియోజకవర్గం హెడ్‌క్వార్టర్‌లోని ఆర్వో కార్యాలయం నుంచి మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చేవారు. కానీ, ఈసారి మాత్రం ఇక్కడి నుంచి ఇతర నియోజకవర్గాలకు ట్రైనింగ్‌కు వెళ్లిన అధికారులు అక్కడి ట్రైనింగ్ సెంటర్లోనే పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్నారు. కానీ, వారిలో కొంత మందికి మళ్లీ ఇక్కడి ఆర్వో కార్యాలయం నుంచి పోస్టు ద్వారా పోస్టల్ బ్యాలెట్లు పంపినట్లు సమాచారం. ఈ విధంగా ప్రభుత్వ హైస్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ పీఈటీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని ఓ సీనియర్ అసిస్టెంట్, ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్లోని ఓ ఉద్యోగి, మరికొందరు ఇంజినీరింగ్ విభాగం, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు వెళ్లినట్లు సమాచారం. వారు ఇప్పటికే ట్రైనింగ్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్లు పొంది ఉన్నారు. ఈ విధంగా ఒక్కో ఉద్యోగి రెండు పోస్టల్ బ్యాలెట్లు పొందినట్లు తెలిసింది. జిల్లా మొత్తం ఇదే విధంగా జరుగుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం. కాగా, కేవలం అధికార పార్టీ మద్దతుదారులైన ఉద్యోగులకే ఈ విధంగా రెండేసి పోస్టల్ బ్యాలెట్లు అందినట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పటికే బయటకు వచ్చినప్పటికీ ఎన్నికల అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి డబుల్ పోస్టల్ బ్యాలెట్లపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, ఒక్కొక్కరు ఒక పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటేసేలా చూడాలని డిమాండ్ వినిపిస్తోంది. -
ఎన్నికల విధులకు పంపిస్తే ఓటెలా వెయ్యాలి?
సాక్షి, అమరావతి: మమ్మల్ని ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఎన్నికల డ్యూటీకి వేశారు.. మరి ఓటు ఎక్కడ వేయాలి? ఎలా వేయాలి? అని పలువురు ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా ఆశా వర్కర్లు, ఫార్మసిస్ట్‌లు, ఎంపీహెచ్‌ఏలతో పాటు పలువురు మున్సిపల్ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. కనీసం వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారానైనా ఓటు వేసే అవకాశం కల్పించకుండా ఆదేశాలిచ్చారు. దీంతో వేలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ఆశా వర్కర్లే 42 వేల మంది ఉన్నారు. ఇక ఏఎన్ఎంలు, ఎంపీహెచ్‌ఏలే 8 వేల మందిపైనే ఉన్నారు. వీళ్లందరికీ ఎన్నికల విధులకు వెళ్లాలని ఈనెల 8వ తేదీన ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ప్రస్తావనే లేదు. ఈ ఆదేశాలు చూసిన ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐదేళ్లకోసారి తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి అవకాశమొస్తే ఇలా కనీసం పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇవ్వకపోవడం దారుణమని వాపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీ శాఖకు చెందిన కొంతమంది ఉద్యోగులు మంగళవారం విజయవాడ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి నిరసన చేపట్టారు. ఎన్నికల విధులకు వెళ్లడానికి అభ్యంతరం లేదని, తమకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించి తీరాలని పట్టుపడుతున్నారు. ఓటు వేసే అవకాశం కల్పిస్తేనే విధులకు వెళతామని భీష్మించారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధి అరవపాల్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మున్సిపల్ అధికారులను కలిశారు. ఓటు వేసుకోవడానికి వీలు లేకుండా ఎన్నికల విధులకు వేసి, ఇలా చేయడం సరైనది కాదని, పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పించాలని విన్నవించగా ఎన్నికల విధులకు సరిపడా సిబ్బంది లేరని, మీరే వేరొకరిని ఏర్పాటు చేయండి.. అంటూ సమాధానమిస్తున్నారని అరవపాల్ సాక్షితో చెప్పారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇక సాఫ్ట్‌గా
సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికత వినియోగం వైపు మొగ్గుచూపుతోంది. ఓటర్ల సౌకర్యార్థం ఇప్పటికే పలు యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. తాజాగా పోస్టల్ బ్యాలెట్ మంజూరులోనూ మార్పు తీసుకొచ్చారు. ప్రత్యేక వెబ్సైట్ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్–సాఫ్ట్ అనే వెబ్‌సైట్‌ను రూపొందించి, దాని ద్వారానే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ధ్రువ పత్రాలను మంజూరు చేయనున్నారు. వెబ్సైట్లో వివరాల నమోదుకు జిల్లాస్థాయిలో ఒకరిని, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఒక్కొక్కరిని నోడల్ అధికారులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొ నే సిబ్బంది వివరాలను విభాగాల వారీగా సేకరించి పీబీ సాఫ్ట్‌లో నమోదు చేస్తున్నారు. విధులు నిర్వహించే చోటే.. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ఉద్యోగులు విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని మొదటిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అధికారులు జారీ చేసిన ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ)ను ప్రిసైడింగ్ అధికారికి సమర్పించి ఓటు వేయొచ్చు. ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉండేవారికి మాత్రం పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తారు. ధ్రువపత్రాల జారీ ఇలా.. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది ఆయా పార్లమెంట్ నియోజకవర్గం పరిధికి చెందిన వారైతే ఫారం 12(ఏ), ఇతర పార్లమెంట్ నియోజకవర్గం పరిధికి చెందిన వారైతే ఫారం–12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వారి వివరాలను నూతనంగా రూపొందించిన పోస్టల్ బ్యాలెట్ సాఫ్ట్‌లో నమోదు చేస్తారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఇందులో లాగిన్ కావొచ్చు. దరఖాస్తు వివరాలను సరిచూసుకొని ఏఆర్వో ఓకే చేస్తే వెంటనే ఆయా ఉద్యోగులకు ఈడీసీ ధ్రువపత్రాలు జారీ కానున్నాయి. మొదటిసారిగా.. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించే సూక్ష్మ పరిశీలకులతోపాటు వెబ్ కాస్టింగ్ నిర్వహణలో పాల్గొనే విద్యార్థులకు, పోలింగ్ సామగ్రిని రవాణా చేసేందుకు వినియోగించే సిబ్బందికి సైతం పోస్టల్ బ్యాలెట్ సాఫ్ట్ ద్వారా ధ్రువపత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ లో పాల్గొన్న ప్రైవేట్ సిబ్బందితోపాటు వెబ్‌కాస్టింగ్ నిర్వహించిన విద్యార్థులు ఓటు హ క్కును వినియోగించుకోలేకపోయారు. ప్ర స్తుతం నూతనంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం లభించనుంది. -
ఏం చేస్తావ్ రా నువ్వు అంటూ.. మంత్రి బూతుపురాణం
సాక్షి, అనంతపురం : టీడీపీ అరాచకం రోజురోజుకూ పెరిగిపోతోంది. టీడీపీ మంత్రులు చేస్తున్న పనులకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. తాజాగా మంత్రి కాల్వ శ్రీనివాసులు దుర్భాషలాడుతూ కెమెరా కంటికి చిక్కారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద మంత్రి కాల్వ.. ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంతో సాక్షి విలేకరిని దూషించారు. మంత్రి పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలోకి వెళ్తుండగా.. ఫోటో తీసిన జర్నలిస్ట్‌ను ఏం చేస్తావ్రా నువ్వు.. అంటూ అసభ్య పదజాలంతో దుర్భషలాడారు. సంస్కారం లేకుండా విలేకరిని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద మంత్రి కాల్వ హల్చల్
-
పోస్టల్ బ్యాలెట్ వద్ద చింతమనేని మాజీ గన్‌మెన్ హల్చల్
-
పోలింగ్ కేంద్రంలో తిష్టవేసిన పరిటాల సునీత
సాక్షి, అనంతపురం : ఎన్నికల వేళ టీడీపీ ప్రలోభాలకు తెరతీస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు డబ్బు కట్టలతో అడ్డంగా దొరకుతున్నారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాప్తాడులోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోనే తిష్టవేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు తాయిలాలు ఇచ్చేందుకు అక్కడే కూర్చుని ఉన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పరిటాల వర్గీయులు హడావిడి చేస్తున్నా.. అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలింగ్ కేంద్రం వద్ద ఉండకుండా పోలీసులు పంపేస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం.. రాప్తాడు పోస్టల్ బ్యాలెట్స్ కేంద్రం వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఒకే ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటుపై అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతపురం అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరారు. అరకొర ఏర్పాట్లపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నా సూరీ వర్గీయులు ధర్మవరం టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరీ వర్గీయులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సూరీ వర్గీయులు చుట్టుముట్టారు. ఎమ్మెల్యే వరదాపురం తనయుడు నితిన్‌సాయి తన అనుచరులతో వీరంగం సృష్టించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులను బెదిరిస్తున్నారు. వాటిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తూ.. చోద్యం చూస్తున్నారు. -
ఈయన ఎవరో గుర్తు పట్టారా?
-
ఈయన ఎవరో గుర్తు పట్టారా?
సాక్షి, పశ్చిమ గోదావరి: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనదైన శైలిలో రౌడీయిజం ప్రదర్శించడం ఆయనకు అలవాటు. ఇంకా గుర్తుపట్టలేదా.. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అయితే ఆయన ఎందుకు అలా కూర్చున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?. మళ్లీ చింతమనేని ఎం ఘనకార్యం చేశారంటే.. శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం కావడంతో చింతమనేని రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శివారు వట్లూరు సీఆర్ రెడ్డి కళాశాలలో దెందులూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడికి తన అనుచరులతో కలిసి చేరుకున్న చింతమనేని ప్రలోభాలకు తెరతీశారు. టీడీపీ నేతల ప్రలోభాలపై వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో చింతమనేని తన రౌడీయిజం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేతలపై పలువురు టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ శ్రీధర్‌పై చింతమనేని దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరి దాడికి పాల్పడ్డారు. అయితే చింతమనేని చర్యలతో అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసకున్న వైఎస్సార్సీసీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరుగుతున్నప్పుడే చింతమనేని ఈ రకంగా వ్యవహరిస్తే.. ఇంకా ఏప్రిల్ 11వ తేదీన పరిస్థితి ఎంటని ప్రజలు, ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. -
చింతమనేని గన్‌మెన్ హల్చల్
సాక్షి, పశ్చిమగోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే అనుకుంటే అతని గన్మెన్లు కూడా ఏమాత్రం తీసి పోవడం లేదు. ఏలూరులో పోస్ట్‌ల బ్యాలెట్ వద్ద చింతమనేని ప్రభాకర్ మాజీ గన్‌మాన్ లక్ష్మణ్ హల్చల్ చేస్తూ.. ఉద్యోగులను బెదిరించే ప్రయత్నం చేశాడు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఉంచారు. ఈ క్రమంలో లక్ష్మణ్ శుక్రవారం ఉదయం నుంచి యూనిఫామ్‌లోనే కాలేజీ ప్రాంగణం అంతా తిరుగుతూ.. చింతమనేని ప్రభాకర్‌కు ఓటేయ్యాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో లక్ష్మణ్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే లక్ష్మణ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. లక్ష్మణ్ దెందులూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికి.. చింతమనేని సేవలోనే తరిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ కార్యక్రమల్లో పార్టీ కార్యకర్తగా సేవలు కూడా అందిస్తున్నారు. చింతమనేని అండదండలుండటంతో ఉద్యోగానికి హాజరు కానప్పటికి చర్యలు శూన్యం. ఈ క్రమంలో కానిస్టేబుల్‌గా ఉంటూ అధికారులను సైతం పేరు పెట్టి పిలుస్తూ.. వారిని కూడా బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అయితే లక్ష్మణ్ ఎన్ని వేషాలేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
పోలింగ్ సెంటర్ వద్ద బాలయ్య హల్చల్
సాక్షి, అనంతపురం: సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారు. ఇప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన బాలయ్య శుక్రవారం హిందూపురంలో ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ఉద్యోగులతో ఫొటోలు దిగారు. బాలయ్యతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వచ్చారు. అయితే పోలీసులు మాత్రం టీడీపీ నేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. దీనిపై స్పందించిన హిందూపురం రిటర్నింగ్ అధికారి గుణభూషణ్‌రెడ్డి బాలకృష్ణకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు నిరసనగా నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపైన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడులో ఒకే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై ఉద్యోగులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరపురం అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరారు. అరకొర ఏర్పాట్లు చేయడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. చదవండి: బాలకృష్ణకు చేదు అనుభవం -
మంగళగిరి పోస్టల్ బ్యాలెట్ బూత్‌లో టీడీపీ నేతలు
-
అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు
-
గుడివాడలో టీడీపీ నాయకుల బరితెగింపు
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జోరుగా ప్రలోభాలకు తెరదీశారు. గుడివాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు చేస్తూ తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికిపోయారు. గుడివాడ మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్‌ను ఎన్నికల విధుల కోసం ఇతర ప్రాంతాలకు నియమించటంతో వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకులు ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్‌కు రూ.2500 ఇస్తూ కెమెరాకు చిక్కారు. 200 మందికి పైగా మున్సిపల్ ఉద్యోగుల వద్ద నుంచి పోస్టల్ బ్యాలెట్లను తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు. ఆధోనిలోనూ పోస్టల్ ఓట్ల కొనుగోలు మరో వైపు కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ నేతల ప్రలోభాలు ఎక్కువయ్యాయి. కర్నూలు జిల్లా ఆధోని నియోజకవర్గంలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు లాక్కుని దౌర్జన్యంగా టీడీపీ నేతలు ఓట్లేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్సీపీ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాల్సిన అధికార పార్టీ, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఫిర్యాదును కూడా రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడంతో యువనేత జైమనోజ్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. -
ఆధోనిలోనూ పోస్టల్ ఓట్ల కొనుగోలు
-
పోస్టల్ బ్యాలెట్ ఓటంటే..
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చివరి జాబితా సిద్ధం కాగానే జిల్లా ఎన్నికల అధికారి రహస్యంగా పోస్టల్ బ్యాలెట్లు ముద్రిస్తారు. ఈ బ్యాలెట్ పేపర్లు సిద్ధం కాగానే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జిల్లా ఎన్నికల కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలెట్ పేపర్ పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారి ఒక ఏఆర్‌తోపాటు కొందరి సహాయకుల్ని నియమిస్తారు. వీరు పోస్టల్ బ్యాలెట్ల్ని ఉద్యోగులకు పంపిణీ చేస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్లు స్వీకరించేందుకు ఎన్నికల కార్యాలయంలో ఒక డ్రాప్‌బాక్స్ సిద్ధంగా ఉంచుతారు. లేదంటే నేరుగా రిటర్నింగ్ అధికారికి అందజేయవచ్చు. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పోలింగ్ తేదీకన్నా ఒక రోజు ముందు వరకుగానీ ఎన్నికల అధికారులు సూచించిన గడువు లోగా అధికారులకు అందజేయాలి. -
పోస్టల్ ప్రలోభాలు
ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ తెలుగుదేశం పార్టీ కొంతమంది అధికారులతో అడ్డదారులు తొక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. పోస్టల్ బ్యాలెట్లో అధికశాతం ఓట్లు తమకు అనుకూలంగా వచ్చేలా చూడాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తోంది. తాయిలాల ఎరకు తెరతీసింది. తమకు అనుకూలంగా వ్యవహరిస్తే మీకు మంచి భవిష్యత్ ఉంటుందంటూ భరోసా ఇస్తోంది. ఐదేళ్లపాటు అధికారపార్టీతో అంటకాగిన కొంతమంది అధికారులు ‘జీ హుజూర్’ అంటూ తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా పోస్టల్ బ్యాలెట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే టీడీపీ నేతలు ఎకంగా ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్ తమచేతికివ్వాలంటూ తీవ్ర ఒత్తిడిలు తెస్తున్నారు. సాక్షి, ఒంగోలు టౌన్: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై దృష్టిపెట్టిన అధికార పార్టీ నాయకులు తమ ప్రయత్నాలు తీవ్రం చేశారు. దీనిలో భాగంగా జిల్లాలో ఎంతమంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో ఇప్పటికే లెక్కలను సేకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధులను నిర్వర్తించే జాబితాలను దగ్గర పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించే పనిలో కొంతమంది అధికారులు నిమగ్నమయ్యారు. భారీ ఆఫర్లు కొత్త రాష్ట్రంలో రెండోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం అధిష్టానం అన్ని జిల్లాల నాయకత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో జిల్లా స్థాయి నాయకత్వం తమకు అనుకూలంగా ఉంటున్న అధికారులకు ఇప్పటికే రహస్యంగా దిశానిర్ధేశం చేసింది. ఐదేళ్లపాటు తెలుగుదేశం పాలనను తమకు అనుకూలంగా మలచుకున్న కొంతమంది అధికారులు ‘బాబు’పై భక్తిని చాటుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ మంచి అవకాశంగా భావిస్తూ టీడీపీ నాయకులకంటే రెండడుగులు ముందుకు వేస్తుండటం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంతమంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో జాబితా తీసుకొని ఆ ఉద్యోగుల్లో కూడా తెలుగుదేశంకు సానుభూతిపరులుగా ముద్రపడిన వారిద్వారా సహచర ఉద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టల్ బ్యాలెట్‌కు ఐదు నుంచి పదివేల రూపాయల వరకు ఇప్పిస్తామంటూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న ఉద్యోగులకు ఆశ చూపిస్తున్నారు. బెదిరింపులు పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ప్రలోభాలకు లొంగకుండా తటస్థంగా ఉంటూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వాసన ఉన్న ఉద్యోగులు ఎటూ ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తారు కాబట్టి, తటస్థంగా ఉండే వారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగుల వివరాలను సేకరించి వారిని బెదిరింపులకు గురిచేస్తున్న ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశంకు అనుకూలంగా ఓట్లు వేయకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారంటూ ‘పసుపు’రంగు పులుముకున్న సహచర ఉద్యోగులు హెచ్చరికలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. దీంతో ఉద్యోగులు ప్రశాంతంగా ఎన్నికల విధులు నిర్వర్తించే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని పోస్టల్ బ్యాలెట్లను ఏదోఒకరకంగా తెలుగుదేశం ఖాతాలో వేయించేందుకు కొంతమంది అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. రోజులన్నీ ఒకేలా ఉండవని వారి అత్యుత్సాహాన్ని చూసిన అధికారులు, సిబ్బంది వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ప్రత్యేక దృష్టి పెట్టాలి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు తటస్థ అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. ‘పసుపు’మయమైన అధికారులు, ఉద్యోగులను నియంత్రించి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు ప్రశాంతంగా, స్వేచ్ఛగా తమకు నచ్చిన వారికి ఓట్లు వేసుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు, బెదిరింపులకు పోస్టల్ బ్యాలెట్ సరండర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్లను తమకివ్వాలని టీడీపీ నాయకుల ఒత్తిడి కందుకూరు: ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు అధికం అవుతున్నాయి. ప్రజా క్షేత్రంలో ఎన్నిక నెగ్గలేమని తేలాక పలు రకాల ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రధానంగా డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు ఆర్పీలు (రీసోర్స్ పర్సన్స్)కు అధికారులు ఎన్నికల విధులు కేటాయించారు. వీరికి పోస్టల్ బ్యాలెట్లను ఇవ్వనున్నారు. అయితే వారి పోస్టల్ బ్యాలెట్ ఓటును తమకు తెచ్చి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న సమైఖ్య అధ్యక్షురాలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ తరుపున మొత్తం పెత్తనం తీసుకుని డ్వాక్రా మహిళలు, ఆర్పీలపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల పోస్టల్ బ్యాలెట్లను సైతం తమకే తెచ్చి ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై పలువురు ఉద్యోగులు తాము స్వేచ్ఛగా విధులెలా నిర్వహించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమె నిబంధనలకు విరుద్ధంగా డ్వాక్రా మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలు అంతా టీడీపీకే ఓటు వేయాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్న విషయం బహిరంగ రహస్యం. వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్‌ను ఇతరుల చేతికి ఇవ్వడానికి అవకాశం లేదు. ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. వారు తమ ఓటు వేసిన బ్యాలెట్‌ను స్వయంగా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో గాని, లేదా పోస్టు ద్వారా గాని పంపాలి. భారీగా తాయిలాల ఎర కందుకూరు నియోజకవర్గంలో దాదాపు 1900 పోస్టల్ బ్యాలెట్లున్నాయి. వీటిని తమకు వేయించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల స్థానిక పాలటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే మకాం వేసిన టీడీపీ నేతలు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్‌ను చేతికి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్న వారిని గుర్తించి ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించండి ఇలా....
సాక్షి, హన్మకొండ అర్బన్: ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో కీలకం. అందుకే పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని వారి కోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో మాత్రం ఉద్యోగులు అంతగా ఆసక్తి చూపడం లేదని గత అనుభవాలు గుర్తుచేస్తున్నాయి. విధుల్లో ఉండేవారిలో 50 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే.. దాంట్లో కొందరు ఓటు వేసినా సకాలంలో పంపించరు. మరి మరికొందరు పోస్టల్ ఓట్లు తప్పుల తడకలుగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకోరు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం ఆశించిన ఫలితం కానరావడంలేదు. పోస్టల్ బ్యాలెట్ విధానం ఓసారి పరిశీలిద్దాం.... పోస్టల్ బ్యాలెట్ కోసం ఉపయోగించే ఫారాలు.. ఫారం–12: పోస్టల్ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసే పత్రం ఫారం–13ఏ: ఓటరు ధ్రువీకరణ పత్రం ఫారం 13బీ: కవరు లోపలి కవరు పోస్టల్ బ్యాలెట్ పెట్సాల్సిన కవరు. పారం 13సీ– కవరు బీ పైన ఉండే కవరు. రిటర్నింగ్ అధికారికి తిరిగి పంపించాల్సిన కవరు. 13బీ కవరులో పోస్టల్ బ్యాలెట్ , 13ఏ ఓటరు డిక్లేరేషన్ పెట్టాలి. ఫారం–13 డీ ఓటరుకు సూచనలు, సలహాలు పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణ ఎందుకంటే..... ఉద్యోగి డిక్లేరేషన్‌లో సంతకం లేకపోవడం డిక్లేరేషన్‌లో బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ రాయక పోవడం గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ లేకపోవడం ఓటేసిన పోస్టల్ బ్యాలెట్‌ను 13బీ కవరులో పెట్టకపోవడం, సీలు వేయక పోవడం పోస్టల్ బ్యాలెట్, డిక్లరేషన్ ఒకే కవరులో పెట్టడం. బ్యాలెట్లో సంతకం చేయడం, ఓటు రహస్యతను కాపాడక పోవడం ఏ అభ్యర్థికి చెందకుండా పైన లేదా కింద మార్క్ చేయడం వంటి కారణాలు.. పోస్టల్ బ్యాలెట్ పొందడం... పూర్తిచేసి అందజేయడం.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఉత్తర్వులతోపాటు ఫారం–12 అందజేస్తారు. ఫారం 12ను పూర్తిగా నింపి రిటర్నింగ్ అధికారికి ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేసే ఫెసిటిటేషన్ కేంద్రంలో అందజేయాలి. ఉద్యోగికి అదే ఆర్ఓ పరిధిలోని నియోజకవర్గం పరిధిలో ఓటు ఉన్నట్లైతే పోస్టల్ బ్యాలెట్ నేరుగా> లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అందజేస్తారు. ఉద్యోగి ఫారం 12తోపాటు ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ, ఓటరు గుర్తింపు కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీలు జతచేయాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ సమయంలో ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్టల్ బ్యాలెట్ డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులందరూ తమ ఓటుహక్కును వినియోగించుకుని ఫారం–13 కవర్ బీలో మార్క్ చేసిన పోస్టల్ బ్యాలెట్ పొందుపరిచి కవర్‌తో పాటు ధ్రువీకరణ పత్రం 13ఏ గెజిటెడ్ అధికారి సర్టిఫై చేసిన సంతకంతో కవర్ బీ (13సీ) కవర్లో పొందుపరిచి డ్రాప్ బాక్స్‌లో వేయాలి. లేదా ఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయవచ్చు, లేదా ఆర్ఓకు నిర్ధిష్ట సమయంలో చేరే విధంగా పోస్టుద్వారా పంపించవచ్చు. కవర్‌కు ఏవిధమైన పోస్టల్ స్టాంపులు అంటించాల్సిన అవరంలేదు. పోలింగ్‌కు ఏడు రోజులు ముందు వరకు ఫారం 12, సంబంధిత పత్రాలు అందజేసి ఆర్ఓ నుంచి పోస్టల్ బ్యాలెట్ పొందవచ్చు. తీసుకున్న పోస్టల్ బ్యాలెట్ తిరిగి ఆర్ఓకు ఓట్ల లెక్కింపు తేదీ ఉదయం ఆరు గంటల్లోపు చేరే విధంగా అందజేయడానికి అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ తక్కువ వినియోగానికి కారణాలు... ఆర్ఓ వద్ద పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడంపై ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఆసక్తి చూపకపోవడం ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ ఫారం–12 సకాలంలో అందజేయకపోవడం ఫారం పూర్తి చేసే సమయంలో ఓటరు జాబితాలోని వివరాలు సరిగా అందజేయకపోవడం ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి సరైన సమయంలో డ్యూటీ ఆర్డర్లు అందకపోవడం ఫారం–12లో చిరునామా సక్రమంగా ఇవ్వకపోవడం తీసుకున్న బ్యాలెట్ పేపర్‌ను నిర్ణీత సమయంలోగా ఆర్ఓకు పంపక పోవడం శాసనసభ ఎన్నికల్లో అర్బన్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు.. నియోజక వర్గం పోలైన ఓట్లు చెల్లనివి వరంగల్ పశ్చిమ 2293 34 వరంగల్ తూర్పు 1308 43 వర్ధన్నపేట 749 16 మొత్తం 4350 93 -
పోస్టల్ ఓట్లకు నోట్ల గాలం!
సాక్షి, అమరావతి బ్యూరో/మైలవరం : జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఓటర్లను విపరీతమైన ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికార టీడీపీ నేతలు గురిపెట్టారు. ఓటుకు రూ. వేయి, రెండు, మూడు వేలు ఇచ్చయినా పోస్టల్ బ్యాలెట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం మైలవరంలోని డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నాయకులు పైరవీలు చేస్తూ కనిపించడమే ఇందుకు నిదర్శనం. శిక్షణా శిబిరం వద్దే ప్రలోభాల పర్వం రెండు రోజులుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ అధికారులకు, సహాయకులకు ఈవీఎమ్‌లు, వీవీ ప్యాట్ల వినియోగంపై శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 1200 మంది హాజరయ్యారు. వీరు ఈ నెల 11న జరిగే ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారికి ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అందజేశారు. దీంతో వారు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు శిక్షణా కేంద్రం వద్దకు చేరుకుని బ్యాలెట్ బాక్స్ వద్ద ఉండి మరీ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేశారు. తపాలా ఓట్లపై నోట్ల వర్షం.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 వేల మంది ఉద్యోగుల కోసం జిల్లా వ్యాప్తంగా తపాలా బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటు జయాపజయాలను నిర్ణయించేది కావడంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ముందుగానే ప్రలోభాలకు తెర తీశారు. వారం, పది రోజుల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లోని ఉద్యోగుల వివరాలు సేకరించారు. తరువాత బేరాలకు దిగారు. నేరుగా ఉద్యోగులను, లేదా ఉద్యోగుల బృందాలను, సంఘాల నేతలను కలవడం, డబ్బు గుమ్మరించడం చేశారు. ఓటుకు రూ. వేయి నుంచి రూ. 3,000 వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగింది. అలాగే పోలీసుల ఓట్లు తమ పార్టీకి అనుకూలంగా వేయించేలా నియోజకవర్గానికి ఓ డీఎస్పీని నియమించి బ్యాలెట్ పత్రాలు ఆ ఉన్నతాధికారికే ఇవ్వాలని పోలీసులపై ఒత్తిడి చేస్తుండటం తెలిసిందే. రహస్యం కాస్త బహిరంగం రహస్యంగా జరగాల్సిన పోస్టల్ బ్యాలెట్ ఎటువంటి రక్షణ లేకుండా బహిరంగంగా నిర్వహించడంపై ఎన్నికల అధికారులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దగ్గర ఉండి ఆంగన్వాడీ కార్యకర్తలను, ఆశా వర్కర్లను ప్రలోభాలకు గురిచేస్తుండటం పట్ల ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. చివరకు మీడియాకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శిక్షణా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా టీడీపీ నాయకులను బయటకు పంపి చేతులు దులుపుకున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. -
టీడీపీకి ఓటు వేసి.. మాకిచ్చేయండి
సాక్షి, అమరావతి: ఎన్నికల బందోబస్తుకు వెళ్లే పోలీసులు ముందే పోస్టల్ బ్యాలెట్ తమకు అప్పగించాలంటూ పలు జిల్లాల్లో డీఎస్పీలు ఒత్తిళ్లు ప్రారంభించారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న కొందరు పోలీస్ బాస్‌ల దన్నుతో వారు ఇప్పటికే రంగంలోకి దిగారు. రాష్ట్రమంతటా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బందోబస్తుకు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఓట్లు టీడీపీ ఖాతాలో జమ అయ్యేలా పోలీసు బాస్‌లు మౌఖిళ ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల నుంచి పోస్టల్ బ్యాలెట్ విషయంలో పోలీసు అధికారులు దృష్టిపెట్టారు. ఎన్నికల సిబ్బంది ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ తీసుకుని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి వాటిని తమకు అందజేయాలని కోరుతున్నారు. ఇందుకోసం పలువురు డీఎస్పీలు పని గట్టుకుని సీఐ నుంచి కానిస్టేబుల్స్ వరకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో బాహాటంగానే టీడీపీకి ఓటు వేయాలనే ఆదేశాలు ఇవ్వడాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది తప్పు బడుతున్నారు. మా హక్కును కాలరాస్తున్నారు.. ఓటు హక్కు అనేది రాజ్యాంగం ప్రసాదించిన వరమని, మాకు నచ్చిన వారికి స్వేచ్చగా ఓటు వేసుకునే అధికారాన్ని కూడా బాస్‌లు కాలరాస్తున్నారంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసారు. మా పైఅధికారులే ఇలా చెబితే ఎలా అని, అటువంటప్పుడు మా ఓట్లు కూడా వారే వేసుకునే అధికారం తీసుకోవచ్చు కదా అని గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీఐ ప్రశ్నించారు. పోలీసులుగా సమాజంలో మంచి చెడులు చూస్తామని, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు, మాకు మేలు జరుగుతుందో చూసుకుంటామని, అటువంటి దానికి కీలకంగా ఉండే ఓటు హక్కుపై ఉన్నతాధికారులు నిర్భంధం పెడుతున్నారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ఒక హోంగార్డు వాపోయాడు. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారుల తీరు మా స్వేచ్ఛను కూడా హరించేలా ఉందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్ వాపోయాడు. ఇలా అనేక మంది పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రభుత్వ తీరు, బాస్‌ల వ్యవహారశైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై పోలీస్ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను ముందే పసిగట్టిన కొందరు అధికారులు పోస్టల్ బ్యాలెట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసు సంఘాల పేరుతో పలువురు నాయకులు జిల్లాల్లో తిరుగుతూ టీడీపీకి ఓట్లు వేయించేందుకు ఒత్తిడి పెంచారు. మరోవైపు జిల్లాల్లోని పోలీసు అధికారులను ప్రయోగించి వారి వద్ద పనిచేసే దిగువస్థాయి సిబ్బందిపై ఓటు కోసం నిర్భందాలు, ఒత్తిళ్లు, వేధింపులకు దిగడం పట్ల పోలీసు శాఖలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోండిలా..
సాక్షి, తెనాలి : సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండే పోలింగ్ సిబ్బంది, అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి ఇచ్చే నియామకపత్రం (నకలు సహా), ఎలెక్షన్ డ్యూటీ సర్టిఫికెట్తో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న నియోజకవర్గంలోనే ఓటరు అయితే ఎలెక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ కోసం ఫారం–12ఏ, మరో నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తుంటే ఫారం–12లో రిటర్నింగ్ ఆఫీసర్‌కి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న తర్వాత ఎన్నికల విధులకు హాజరుకాలేకపోయినా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓటు వేయాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితా నకలు ప్రతి జిల్లా ఎన్నికల అధికారి వద్ద లభిస్తుంది. వాటిలో మీ వివరాలను సేకరించి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులో రాసుకోవాలి. పోలింగ్ ఏజెంట్లే కీలకం ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌లో అభ్యర్థుల తరఫున పరిశీలన కోసం కూర్చునే ఏజెంట్ల పాత్ర చాలా కీలకమైంది. ఆయా కేంద్రాల్లో బోగస్ ఓట్లు పడుకుండా, ఓటేయడానికి వచ్చే వారిని నిశితంగా చూడాల్సిన బాధ్యత ఏజెంట్లపై ఉంటుంది. ఒక్క ఓటు తేడా వచ్చినా గెలపు సీన్ మారిపోతుంది. ఏజెంట్ల నియామకంలో ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని మార్పులు చేసింది. పోలింగ్ స్టేషన్లో గుర్తింపు పోందిన జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తుంపు పొందిన ఇతర రాష్ట్రాల పార్టీలు తమ ఎన్నికల గుర్తును ఇక్కడ ఉపయోగించడానికి అనుమతి పోందిన వారు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఏజెంట్లకు కుర్చీలు వేస్తారు. ఏజెంట్ తప్పనిసరిగా అదే గ్రామానికి చెందిన వారై ఉండి, ఓటరుగా ఉండాలి. ఫొటో గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ప్రతి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్ ఏజెంట్ , ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్, వైర్లెస్, కార్డ్‌లెస్ ఫోన్లు తీసుకెళ్లకూడాదు. పార్టీ కండువాలు, గుర్తులను ధరించరాదు. ఓట్లు వేయని ఓటర్ల సంఖ్యను సూచించి వెలుపలికి చీటీలను పంపడం నిషేధం. -
ఓటు.. ఐదు రకాలు
సాక్షి, అచ్చంపేట : ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతీ పౌరుడికీ రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది. ఓటు ద్వారానే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అయితే ఓటును ఐదు రకాలుగా విభజించారు. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. టెండర్ ఓటు, సాధారణ ఓటు, సర్వీస్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఓటర్లే. ఎన్నికల సమయంలో వీరు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. వీరు కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు బ్యాలెట్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను తపాలా శాఖ ద్వారా పంపించి ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరికొందరు పోలింగ్ ముందు రోజే ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం పోస్టల్ పోలింగ్‌ను ఏర్పాటు చేసి ఓటు వేయిస్తారు. ఓట్ల లెక్కింపు అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో సందర్భంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే అభ్యర్థుల గెలుపులో కీలకంగా మారుతాయి. టెండరు ఓటు.. ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్న వ్యక్తి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసేటప్పుటికే ఆ వ్యక్తి ఓటును మరొకరు వేసినా.. సదరు వ్యక్తి ఓటు వేయవచ్చు. ఇందుకోసం రిటర్నింగ్ అధికారి వద్ద తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని నిరూపించాలి. పోలింగ్ అధికారి హామీతో ఓటును వినియోగించుకోవచ్చు. దీన్నే టెండరు ఓటు అంటారు. సాధారణ ఓటు.. దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు అన్ని రకాల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కలిగి ఉండాలి. ఇదే సాధారణ ఓటు. 18 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ ఓటు హక్కును పొందేందుకు అర్హులు. ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఆధారాలు చూపిస్తే ఓటుహక్కు కల్పిస్తారు. సర్వీస్ ఓటు.. సైనికుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వీసు ఓటు వేసే అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సైన్యంలో విధులు నిర్వహించే సైనిక ఉద్యోగులు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు. సైన్యంలోని ప్రధాన అధికారి ద్వారా/ తపాలా శాఖ ద్వారా ఓటు పంపించవచ్చు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫరబుల్ ద్వారా కూడా పంపవచ్చు. ప్రవాస భారతీయులకూ.. ఈసారి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆన్లైన్లో ఫారం–6ఏ ద్వారా దరఖాస్తు చేసుకుని తగిన ఆధారాలు చూపించి ఓటు హక్కును పొందవచ్చు. ఓటు హక్కును పొందిన ప్రవాస భారతీయుల ఆసక్తి మేరకు విదేశాల నుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. -
వలంటీర్లు, సహాయకులకూ..పోస్టల్ బ్యాలెట్
సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో మరో ముందడుగు పడింది. విధుల్లో పాల్గొనే అధికారులు, రెగ్యులర్ సిబ్బందికే కాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, డ్రైవర్లు, వలంటీర్లకు.. వెబ్‌కాస్టింగ్, దివ్యాంగ ఓటర్లకు సహాయకులుగా ఉండే వలంటీర్లకు కూడా ఈసారి ‘పోస్టల్ బ్యాలెట్’ సౌకర్యం కల్పిస్తున్నారు. వీరంతా ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు చేయవచ్చు. ఈ విషయాన్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం నిర్వహించిన నోడల్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు అందించే కార్యక్రమం పురోగతిలో ఉందన్నారు. వీరితోపాటు పరోక్షంగా విధుల్లో పాల్గొనే జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు వెబ్ కాస్టింగ్, బీఎల్ఓలకూ ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవాల్సిందిగా ఉద్యోగులందరికీ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నామన్నారు. ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు జరిగే కేంద్రాల వద్దే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్లు అందిస్తున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యానికి సంబంధించి ప్రత్యేక కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేపట్టిన చైతన్య కార్యక్రమాల్లో భాగంగా 1250 చునావ్ పాఠశాలలు నిర్వహించామని, 15 కళాశాలల్లో ఓటరు నమోదు, ఈవీఎంలు, వీవీప్యాట్, సీవిజిల్పై చైతన్యం కల్పించామని వివరించారు. హైదరాబాద్ జిల్లాలో పెన్షన్లు పొందుతున్న 24 వేల మంది దివ్యాంగుల్లో 19,326 మందిని ఓటర్లుగా పేర్లు నమోదు చేయించామన్నారు. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు 126 ఎస్ఎఫ్టీ, ఎస్ఎస్టీ టీమ్‌లతో పాటు మరో 28 బృందాలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. నగరంలో ఇప్పటి దాకా 16 వేలకు పైగా అక్రమ పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడంతో పాటు రూ.3.52 లక్షల విలువైన 1676 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాట్టు వివరించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో 646 కేంద్రాల్లో ర్యాంప్‌ల నిర్మాణం ఏప్రిల్ 2వ తేదీలోగా పూర్తి చేస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఎండ నుంచి ఉపశమనానికి టెంట్లను ఏర్పాటు చేయయడంతోపాటు తాగునీటి సదుపాయం కల్పిస్తామన్నారు. అంతే కాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈనెల 25వ తేదీలోగా అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను సిద్ధం చేసి 26వ తేదీన ఈవీఎంలను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించనున్నట్లు దానకిశోర్ వివరించారు. ఎన్నికల సిబ్బందికి ఈనెల 24వ తేదీలోగా అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు. ఈనెల 26న ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్ చేపట్టి అదేరోజు రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఒక సాధారణ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు హరిచందన, అద్వైత్‌కుమార్ సింగ్, సిక్తా పట్నాయక్, సందీప్‌ఝా, కెనెడీ, విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ ఎస్. శ్రీనివాసరెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు. -
ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు
సాక్షి, కామారెడ్డి అర్బన్: శాసనసభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 11న మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుంది. తొలుత రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతారు. అర గంట వెసులుబాటు తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు కోసం ప్రత్యేకమైన టేబుల్, ఏర్పాట్లు చేస్తారు. సహాయ రిటర్నింగ్ అధికారి సహకారంతో రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ఓటరు నుంచి వచ్చే ప్రతి పోస్టల్ బ్యాలెట్ ప్రతం ఫారం–13బిలో లోపల ఉంచిన కవర్లో ఉంటుంది. ఈ కవర్, ఫారం–13ఎలో ఎలక్టర్ చేసిన డిక్లరేషన్‌తో పాటు మరో పెద్ద కవర్లో ఉంటుంది. ఈ పెద్ద కవర్ ఫారం 13సిలో ఉండి రిటర్నింగ్ అధికారి చిరుమానాపై ఉండాలి. లెక్కింపు ప్రారంభానికి అంటే ఉదయం 8 గంటల తర్వాత వచ్చే ఏ పోస్టల్ బ్యాలెట్ పత్రం కలిగిన ఫారం–13–సి కవర్‌ను రిటర్నింగ్ అధికారి తెరవడు. ఫారం–13–సిలో ఉన్న పైకవర్ మీద నోట్ రాస్తాడు. ఈ కవర్లలోని ఓట్లను లెక్కించడం జరగదు. అలాంటి కవర్లనింటినీ ఓ ప్యాకెట్‌గా చేసి సీలు వేస్తారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు, కవర్లు అన్ని సరిచూసిన తర్వాతే రిటర్నింగ్ అధికారి దాని చెల్లుబాటును నిర్ణయిస్తారు. పోస్టల్ బ్యాలెట్‌పై ఓటు నమోదు కాని పక్షంలో, ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు నమోదు చేసినా, తప్పుడు బ్యాలెట్ పేపర్ ఐనా, బ్యాలెట్ పత్రం పూర్తిగా చిరిగి పోయినా, ఎలక్టర్కు పంపిన కవర్లోదాన్ని తిరిగి పంపకపోయినా, నమోదు చేసిన గర్తు ఏ అభ్యర్థికి ఓటు వేశారో నిర్ధారణ కాకుండా సందేహం కలిగించే విధంగా ఉన్నా, ఓటరును గుర్తించే ఏ గుర్తుకాని, రాతకాని బ్యాలెట్ పత్రం రాసి వుంటే చెల్లని ఓటుగా తిరస్కరిస్తారు. చెల్లని ఓట్లను, ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్లను లెక్కించి ఫారం–20లో ఫలితం నమోదు చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపైనే అభ్యర్థి గెలుపు నిర్ధారితమయ్యే సందర్భంలో రిటర్నింగ్ అధికారి అనివార్యంగా వాటిని మళ్లీ ధ్రువీకరణ జరిపి ప్రతి అభ్యర్థి పక్షాన లెక్కింపబడిన ఓట్లను మరోసారి పరిశీలించి సంఖ్య సరిపోయిందా లేదా ఫలితానికి తుది రూపం ఇస్తారు. మళ్లీ లెక్కింపు జరిగినప్పుడు రహస్య భగ్నం కాని విధంగా మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తారు. దాని సీడీ, క్యాసెట్‌ను భద్రపరుస్తారు. -
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ
సాక్షి , వరంగల్: రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులు దృష్టి సారించారు. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రచారంలో హడావుడిగా గడుపుతున్న అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఓ కన్నేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు శుక్రవారం వరకు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు.. ఉద్యోగులను తమ దారికి తెచ్చుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు మొదలెట్టారు. మరోవైపు వంద శాతం పోలింగ్ లక్ష్యంగా చర్యలు చేపడుతున్న ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగి తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది. కాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం గెలుపును ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. దీంతో వారిని రాజకీయ పార్టీలు అనుకూలంగా మలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలో ఉద్యోగులకు అనుకూలంగా ఉండే తాయిలాలను ప్రకటిస్తూ మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాయి. 17,820 మంది ఉద్యోగులు.. ఉమ్మడి జిల్లాలో 17,820 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరూ ఖజానా శాఖ పరిధిలో వేతనాలు పొందేవారే. వీరు కాకుండా ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్, సింగరేణి ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరందరికీ జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం’ (సీపీఎస్)ను రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొంత కాలంగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుకూలంగా తమవంతు సహకారం చేస్తామని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అలాగే పీఆర్సీ, మధ్యంతర భృతిపై కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు. దీంతో పాటు ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. తమ డిమాండ్లకు అనుకూలంగా ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో ప్రకటించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. అన్ని పార్టీల నాయకులు సీపీఎస్ విషయమై సానుకూలంగా స్పంది స్తామని సంకేతాలు ఇవ్వడంతో అసలు ఉద్యోగులు ఏ పార్టీని నమ్మి ఓట్లు వేస్తారో తెలియని ప రిస్థితి నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించే విధంగా ఏ పార్టీ మేనిఫెస్టో ఉంటుందో వారి వైపే ఉద్యోగులు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నెల 30తో గడువు పూర్తి.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పిస్తే సమయానికి వారి చేతికి పత్రాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి పోస్టల్ బ్యాలెట్ కోసం 9,995 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక నియోజకవర్గంలోని సిబ్బంది అదే అసెంబ్లీ పరిధిలో పోలింగ్ విధులు నిర్వర్తిస్తే పోస్టల్ బ్యాలెట్ అప్పుడే ఇస్తామని, ఇతర నియోజకవర్గంలో పోలింగ్ బాధ్యతలు ఉంటే పోస్ట్ ద్వారా లేదా ఆర్వోకు డ్యూటీ ఆర్డర్ కాపీతో పాటు పోస్టల్ బ్యాలెట్‌ను పంపిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇందుకు ఎన్నికల సిబ్బంది డ్యూటీ ఆర్డర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది శుక్రవారంలోపు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోకుంటే ఓటు వినియోగించుకోవడం కష్టమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థుల ఆశలు.. గత ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటున్నందున ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నట్లు తెలు స్తోంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఓటు హక్కు వినియోగానికి అవకాశం దొరకడం లేదని సమాచారం. ఓటు వినియోగించుకున్న సిబ్బంది సైతం పోస్టల్ బ్యాలెట్‌పై అనుమానాస్పదంగా మార్క్ చేయడంతో కొన్ని ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ పోలింగ్ శాతం పె ంపుపై దృష్టి సారించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా మారే అవకాశం లేకపోలే దు. రాజకీయ పార్టీలు.. ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ వారిని మచ్చిక చేసుకునే పనిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. -
ఉద్యోగులపై దృష్టి
మంచిర్యాలటౌన్: డిసెంబర్ 7వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు వారి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజలకు ఏమి చేస్తారనే దానిపై ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా చర్యలను చేపట్టింది. ప్రతి ఉద్యోగి ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ అధికారులు పోస్టల్ బ్యాలెట్‌పై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఉద్యోగుల ఓట్లు సైతం తమకు అనుకూలంగా పడేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ మేనిఫెస్టోల్లో వారికి అనుకూల తాయిలాలు ప్రకటించి, ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు 3,896 మంది ఉండగా, ఇతర ఉద్యోగస్తులు మరో 2,600 మంది వరకు ఉన్నారు. ఇందులో టీచర్లు, ఎన్జీవోలు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, రెవెన్యూ, పోలీసులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్). దీనిని రద్దు చేయాలంటూ ఉద్యోగులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందుకు అన్ని ప్రధాన పార్టీలు సానుకూలంగా స్పందించాయి. అలాగే పీఆర్సీ, మధ్యంతర భృతిపై కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ఉపాధ్యాయులైతే ఉమ్మడి సర్వీసు రూల్స్ రావడం లేదని అంటుండగా, ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తాము కోరుతున్న డిమాండ్లకు అనుకూలంగానే మేనిఫెస్టోలను ప్రకటించాలని ఆయా ఉద్యోగ సంఘాలు ప్రధాన పార్టీలను కోరుతున్నా, ఇప్పటికీ అధికారికంగా ఏ పార్టీ పూర్తిస్థాయిలో వారి మేనిఫెస్టోలను ప్రకటించలేదు. అన్ని పార్టీలు అనుకూలమే.. ఉద్యోగుల సమస్యలు, వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అన్ని ప్రధాన పార్టీలు అనుకూలంగా ఉన్నట్లుగానే ప్రకటిస్తున్నాయి. రిటైర్మెంట్ వయస్సు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, మంచి పీఆర్సీ, మధ్యంతర భృతి ఇస్తామని, సీపీఎస్‌ను రద్దు చేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు బహిరంగ సభల్లో, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసినప్పుడు ప్రకటిస్తున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ అధినేతలు సైతం సీపీఎస్ రద్దుతో పాటు రిటైర్మెంట్ వయస్సును పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో ఉద్యోగులు ఏ పార్టీని నమ్ముతారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఉద్యోగుల డిమాండ్లను పరిష్కారిస్తామని ప్రకటిస్తే, ఉద్యోగులు అటువైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోస్టల్ బ్యాలెట్‌కు 30 వరకు అవకాశం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్లను అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు 3,896 మంది ఉండగా, వీరికి ఎన్నికల ఉత్తర్వులతో పాటు పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు ఫారం 12లను అందించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం కలెక్టరేట్‌కు 1,449 మంది ఫారం 12లను అందించారు. ఇంకా ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులకు మరో 409 మంది ఉద్యోగులు ఫారం 12లను అందించారు. మిగిలిన వారు ఈ నెల 30వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను తీసుకోనున్నారు. ఎన్నికల విధుల్లో లేని ఉద్యోగులతో పాటు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే ఉద్యోగులపై అన్ని పార్టీల నేతలు దృష్టి సారించారు. ప్రతీ ఉద్యోగి ఓటుహక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ భారతి హోళీకేరి ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
పోస్టల్‌పై నిరాసక్తి !
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పై ఉద్యోగులు, సిబ్బంది ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఓటు వినియోగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటూ ఎంతో కీలకం. దీనిని గుర్తించిన ఎన్నికల సంఘం.. ఎలక్షన్ విధుల్లో పాలుపంచుకుంటున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోంది. అయితే, ఉద్యోగులు, సిబ్బంది పెద్దగా ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. విధుల్లో పాల్గొన్న వారిలో 73.82 శాతం మంది పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరిసారిగా 2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానంలో పోలైన ఓట్ల తీరును చూస్తే ఈ విష యం స్పష్టమవుతోంది. 2014లో ప్రస్తుతం కొత్త రంగారెడ్డి పరిధిలోకి వచ్చే ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 35 వేల మందికిపైగా అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఇందులో 9,165 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. అంటే మొత్తం ఓట్లలో కేవలం 26.18 శాతం మందే ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఓటేసినా చెల్లడం లేదు.. అధికారులు, ఉద్యోగులు కొందరు బాధ్యతాయుతంగా ఓటేసినా.. పలు తప్పిదాల వల్ల కొన్ని సందర్భాల్లో అవి చెల్లుబాటు కావడం లేదు. ఇలా పనికిరాకుండా పోతున్న ఓట్ల శా తం కూడా గణనీయంగానే ఉండడం కలవరానికి గురిచేస్తోంది. విద్యావంతులు కూడా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటేయలేకపోవడంపై పలువురు ఉన్నతాధికారులు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ విధానంపై పలుమార్లు అవగాహన కల్పించినా పూర్తిస్థాయిలో మార్పు రాకపోవడానికి కారణం నిర్లక్ష్యమేనని విశ్లేషిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ జె.రాజేశ్వర్‌రెడ్డి గత ఎన్నికల్లో జిల్లా పరిధిలో 34.06 శాతం ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 9,165 మంది ఉద్యోగులు, సిబ్బంది ఓటు వేయగా.. ఇందులో 6,043 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. మరో 3,122 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పూర్తిసా ్థయిలో ఓటు వినియోగించుకోకపోవడానికి, ఒకవేళ ఓటేసినా అవి చెల్లుబాటు కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్ జె.రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ సమస్యలను అధిగమిస్తే వినియోగించుకున్న ఓటు నూరుశాతం చెల్లు బాటు అవుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆసక్తి లేకపోవడానికి కారణాలు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఈఆర్ఓ) దగ్గరి నుంచి పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకోకపోవడం. ఎన్నికల విధి నిర్వహణ ఉత్తర్వుల కాపీతోపాటు ఫారం–12 సకాలంలో అందించకపోవడం. ఓటర్ల జాబితాలో ఉన్నట్లుగా తన ఓటుకు సంబంధించిన పార్ట్, సీరియల్ నంబర్ వివరాలను తప్పుగా నమోదు చేయడం. ఎన్నికల విధుల్లో పనిచేసే వారికి సకాలంలో డ్యూటీ ఆర్డర్స్ అందకపోవడం. ఫారం–12లో తప్పుడు చిరునామా పేర్కొనడం. తీసుకున్న బ్యాలెట్ పేపర్రు నిర్ణీత సమయంలోగా ఆర్ఓకు అందజేకపోవడం. తిరస్కరణకు గల కారణాలు డిక్లరేషన్‌పై సంతకం చేయకపోవడం. బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ రాయకపోవడం. గెజిటెడ్ ఆఫీసర్‌తో ధ్రువీకరించకపోవడం. ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్‌ను 13బి కవరులో పెట్టకపోవడం. పోస్టల్ బ్యాలెట్, డిక్లరేషన్‌ను ఒకే కవరులో పెట్టడం. పోస్టల్ బ్యాలెట్లో సంతకం లేకపోవడం (గోప్యత లేకపోవడం). ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు మార్క్ చేయడం. ఏ అభ్యర్థికీ మార్క్ చేయకపోవడం. కొన్ని సందర్భాల్లో ఏ అభ్యర్థికీ ఓటు వేశారో తెలియకుండా పైన.. కింద మార్క్ చేయడం. -
‘పోస్టల్’కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, నల్లగొండ : అసెంబ్లీ సాధారణ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఇతర ప్రైవేట్ వ్యక్తులకు, సర్వీస్ ఓటర్లకు, జైలులో ఉంటూ శిక్ష ఖరారుకాని, శిక్ష అనుభవిస్తున్న వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. జిల్లా ఎన్నికల సంఘం కూడా ఈ మేరకు జిల్లాలోని ఆయా వర్గాలను గుర్తించింది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికకు సంబంధించి జిల్లాలో సుమారు 16వేల మంది ఎలక్షన్ విధులు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా అధికారులతోపాటు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, సెక్టోరల్ అధికారులు, పోలీస్, మైక్రో అబ్జర్వర్స్, డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లతోపాటు అద్దె వాహనాల డ్రైవర్లు, ప్రైవేట్ సిబ్బంది ఉన్నారు. వీరందరికీ పోస్టల్లో ఓటు వేసే అవకాశం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 16వేల మందికి పోస్టల్‌బ్యాలెట్‌లో ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 12వేల దరఖాస్తుల పంపిణీ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఫారం 12(పోస్టల్‌బ్యాలెట్ దరఖాస్తు)ను దాదాపు 12వేల మందికి ఇప్పటికే పంపిణీచేశారు. తిరిగి 6వేల దరఖాస్తులు అందాయి. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఉద్యోగులంతా ఎల్బీనగర్లో ఉన్నారు. వారు అక్కడే పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకున్నారు. వరంగల్ జైలులో ఉన్న ఆరుగురికి పోస్టల్ ఓటు అవకాశం.. జిల్లాకు చెందిన వారు వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న, ఇంకా శిక్ష ఖరారు కాని ట్రయల్‌లో ఉన్న ఆరుగురికి జిల్లా ఎన్నికల అధికారులు ఓటు హక్కును కల్పించారు. ఇప్పటికే సంబంధిత పై అధికారుల నుంచి వారికి పోస్టల్‌బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆదేశాలు అం దాయి. వీరిలో ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితులు మాణ్, బారితోపాటు నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ ప్రాంతాలకు ఒక్కొక్కరు ఉన్నారు. 360మంది సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ పంపిణీ: జిల్లాకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి ఈసారి ఎన్నికల సంఘం ట్రాన్స్మిషన్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్‌ను పంపించారు. వారు అక్కడ బ్యాలెట్‌ను డౌన్లోడ్ చేసుకొని ఓటు వేసి తిరిగి పోస్టల్లో సీల్డ్ కవర్లో ఓటును పంపించాల్సి ఉంది. రుతీరావు, శ్రవ పోలింగ్ అధికారులు, సిబ్బందికి సెకండ్ ట్రైనింగ్‌లోనే ఓటు వేసే అవకాశం: ఈనెల 28, 29 తేదీల్లో పోలింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి నియోజకవర్గాల్లో రెండో విడత ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఆ రోజు వారికి ఫారం 12 ఇవ్వడంతోపాటు పోస్టల్ బ్యాలెట్‌ను కూడా అందించనున్నారు. అక్కడ ట్రైనింగ్ సెంటర్లోనే ఒక బాక్స్ ఏర్పాటు చేసి అక్కడే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. అదేరోజు ఓటువేసి బాక్స్‌లో వేసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎవరైనా ఉద్యోగులు నేరుగా కూడా వారు ఓటు వేసి ఆ బాక్స్‌లో వేసే అవకాశం ఉంది. కౌంటింగ్‌కు ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలెట్‌ను తిరిగి పంపాలి ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకొని కౌం టింగ్ నాటి వరకు అందించాల్సి ఉంది. పోస్ట్ ద్వారా కానీ, నేరుగా వచ్చి ఆయా నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో కూడా వేయవచ్చు. ఇప్పటికే ఫారం 12పంపిణీ చేశాం.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సంబంధించి ఇప్పటికే 12వేల దరఖాస్తులను అందించాం. అందులో 6వేల వరకు తిరిగి అందించారు. ఈ సారి ఎన్నికల అధికారులు, సిబ్బందితో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఇతర ప్రైవేట్ సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాం. జిల్లాకు సంబంధించి వరంగల్ జైలులో ఉన్న ఆరుగురికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నాం. అదే విధంగా జిల్లాకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్సుల్లో, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నవారికి సర్వీస్ ఓటర్ల కింద ఇప్పటికే ఆన్లైన్ ద్వారా పంపించాం. తిరిగి వారు పోస్టుల్లో ఓటు వేసి పంపిస్తారు. – నోడల్ అధికారి సంగీత లక్ష్మి -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించండి ఇలా..
సాక్షి, హన్మకొండ అర్బన్: ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. అందుకే పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ వారి కోసం ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో మాత్రం ఉద్యోగులు అంతగా ఆసక్తి చూపడం లేదు. 50 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న దాంట్లో కొందరు ఓటు వేసి సకాలంలో పంపించరు. మరికొన్ని తప్పుల తడకలుగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకోరు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఎన్ని ప్రయత్రాలు చేసినా మారుమూల పల్లెల్లో పోలింగ్ శాతం, ఓటర్ల నమోదు శాతం పెంచగలుగుతున్నారు గానీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం ఆశించిన ఫలితం కానరావడంలేదని గత ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్లే నిరూపిస్తున్నాయి. ఈ సారి కాస్త ఉద్యోగసంఘాలు కూడా ఓ అడుగు ముదుకేసి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని, ఫారం–12 పొందడానికి గడువు పొడగించాలని కోరుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ విధానం ఓసారి పరిశీలిద్దాం.... పోస్టల్ బ్యాలెట్ కోసం ఉపయోగించే ఫారాలు.. ఫారం–12: పోస్టల్ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసే పత్రం ఫారం–13ఏ: ఓటరు ధృవీకరణ పత్రం ఫారం 13బీ: కవరు ఏ లోపలి కవరు పోస్టల్ బ్యాలెట్ పెట్టాల్సిన కవరు. పారం 13సీ– కవరు బీ పైన ఉండే కవరు. రిటర్నింగ్ అధికారి తిరిగి పంపించాల్సిన కవరు... దీనిలో 13బీ కవరులో పోస్టల్ బ్యాలెట్ , 13ఏ ఓటరు డిక్లరేషన్ పెట్టాలి. ఫారం–13 డీ ఓటరుకు సూచనలు, సలహాలు పోస్టల్ బ్యాలెట్ పొందడం... పూర్తి చేసి అందజేయడం ... ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఉత్తర్వులతోపాటు ఫారం–12 అందజేస్తారు. ఫారం 12ను పూర్తిగా నింపి రిటర్నింగ్ అధికారికి ఎన్నికల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటుచేసే ఫెసిటిటేషన్ కేంద్రంలో అందజేయాలి. ఉద్యోగి అదే ఆర్ఓ పరిధిలోని నియోజకవర్గం పరిధిలో ఓటు ఉన్నట్లైతే పోస్టల్ బ్యాలెట్ నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందజేస్తారు. ఉద్యోగి ఫారం 12తో పాటు ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ, ఓటరు గుర్తింపు కార్డు, ఉద్యోగి గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీలు జతచేయాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో రెండో విడత శిక్షణ సమయంలో ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోస్టల్ బ్యాలెట్ డ్రాప్ బ్యాక్స్ ఏర్పాటుచేస్తారు. పోస్టల్ బ్యాలెట్ పొందిన ఉద్యోగులందరూ తమ ఓటుహక్కును వినియోగించుకుని ఫారం–13 కవర్ బీలో మార్క్‌చేసిన పోస్టల్ బ్యాలెట్ పొందుపరిచి కవర్‌తోపాటు ధృవీకరణ పత్రం 13ఏ గెజిటెడ్ అధికారి సర్టిఫై చేసిన సంతకంతో కవర్ బీ (13సీ) కవర్లో పొందుపరిచి డ్రాప్ బ్యాక్స్‌లో వేయాలి. లేదా ఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బాక్స్‌లో వేయొచ్చు. లేదా ఆర్ఓకు నిర్ధిష్ట సమయంలో చేరేవిధంగా పోస్ట్‌ద్వారా పంపించొచ్చు. కవర్‌కు పోస్టల్ స్టాంపులు అంటించాల్సిన అవరంలేదు.. పోలింగ్‌కు ఏడు రోజులు ముందు వరకు ఫారం 12, సంబంధిత పత్రాలు అందజేసి ఆర్ఓనుంచి పోస్టల్ బ్యాలెట్ పొందవచ్చు. తీసుకున్న పోస్టల్ బ్యాలెట్ తిరిగి ఆర్ఓకు ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11వ తేదీ ఉదయం ఆరు గంటల్లోపు చేరే విధంగా అందజేయడానికి అవకాశం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ తక్కువ వినియోగానికి కారణాలు... ఆర్ఓ వద్ద పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడంపై ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఆసక్తి చూపకపోవడం ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ ఫారం–12తో సకాలంలో అందజేయకపోవడం ఫారం పూర్తిచేసే సమయంలో ఓటరు జాబితాలోని వివరాలు సరిగా అందజేయకపోవడం ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి సరైన సమయంలో డ్యూటీ ఆర్డర్లు అందకపోవడం ఫారం–12లో చిరునామా సక్రమంగా ఇవ్వకపోవడం తీసుకున్న బ్యాలెట్ పేపర్‌ను నిర్ణీత సమయంలోగా ఆర్ఓకు పంపకపోవడం వంటివి... పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణ ఎందుకంటే..... ఉద్యోగి డిక్లరేషన్‌లో సంతకం లేకపోవడం డిక్లరేషన్‌లో బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ రాయకపోవడం గెజిటెడ్ అధికారి ధృవీకరణ లేకపోవడం ఓటేసిన పోస్టల్ బ్యాలెట్‌ను 13బీ కవరులో పెట్టకపోవడం, సీలు వేయకపోవడం పోస్టల్ బ్యాలెట్, డిక్లరేషన్ ఒకే కవరులో పెట్టడం. బ్యాలెట్లో సంతకం చేయడం, ఓటు రహస్యతను కాపాడకపోవడం ఏ అభ్యర్థికి చెందకుండా పైన లేదా కింద మార్క్ చేయడం వంటి కారణాలు -
పోస్టల్ బ్యాలెట్ ఇలా ...
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తప్పని సరిగా ఓటు వేయాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల రోజు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగి, పోస్టల్ బ్యాలెట్æద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకోసం ఫారం –12 ద్వారా రిటర్నింగ్ అధికారికి అభ్యర్థన పత్రం రాయాలి. జిల్లా ఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్ అధికారి నిర్ధారణ పత్రంతో పాటు ఫారం–12 అందజేస్తారు. ఇది పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వేయడానికి సరిపోతుంది. ఫారం–12 నింపి దానితో పాటు పోలింగ్ విధులకు నియమిస్తున్నట్లు ఇచ్చిన డబ్లుకేట్ ఆర్డర్ కాపీని జత పరచి రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. ఇది పోలింగ్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన కేంద్రంలో కూడా అందజేయవచ్చు. పోలింగ్ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను ఇచ్చిన తరువాత వారు ఓటు వేసి దానిని శిక్షణ తరుగతుల్లోనే జమచేసి వీలు రిటర్నింగ్ అధికారికి కల్పిస్తారు. దీని వల్ల పోస్టులో పంపాల్సిన అవసరం ఉండదు. మహిళ ఉద్యోగులు తాము పని చేస్తున్న నియోజక వర్గంలోనే పోస్టు అవుతారు. ఇలాంటి సందర్భంలో వారికి ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తారు. అప్పుడు వారు ఎన్నికల విధులు నిర్వహించ వలసి ఉంటుందో అక్కడ ఓటు వేయవచ్చు.చివరి క్షణాల్లో ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్(ఈడీసీ)ఫోస్టింగ్ రద్దు ఆయితే వారు ఎక్కడ డ్యూటీ చేస్తారో అక్కడ ఓటు వేయవచ్చు. అయితే వారికి ఓటు ఉండాలి. -
మొదలైన పోస్టల్ పోరు
జోగిపేట(అందోల్): ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు అభ్యర్థుల గెలపోటములపై ప్రభావం చూపుతాయి. సాధారణ ఓట్ల ఆవశ్యకతపై ప్రచారం నిర్వహించిన ఎన్నికల విభాగం ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లపై దృష్టి సారించింది. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ సారి ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్న ప్రతీ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకునేందుకు ఎన్నికల విభాగం కార్యాచరణ ప్రారంభించింది. ఎన్నికల్లో ఓటు ముందు వేసేది ఉద్యోగులే.. అసెంబ్లీ పోలింగ్ డిసెంబర్ 7న నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ముందుగా ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. పోస్టల్ ద్వారా తమ ఓటును ఉద్యోగులు ముందుగానే పంపుతారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లనే మొదట లెక్కిస్తారు. గతంలో పదుల తేడాలో గెలుపోటములు ఉన్న పరిస్థితుల్లోనే పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేవారు. కానీ ఉద్యోగుల ఓటు విలువ పెరగడం తదితర కారణాలతో కొన్నేళ్లుగా పోస్టల్ బ్యాలెట్లనే ముందుగా లెక్కించే ప్రక్రియ చేపడుతున్నారు. దరఖాస్తు నమూనాలో ఓటరు జాబితాలోని ఎపిక్ ఐడీ నంబరు, పార్ట్, సీరియల్ నంబర్లను వేసి ఇంటి చిరునామా రాసి అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. డిసెంబరు 7 నాటి పోలింగ్ నిర్వహణలో విధులు నిర్వహించే ప్రతీ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్లను వినియోగించే అవకాశం ఉంటుంది. ఉద్యోగికి కేటాయించిన ఎన్నికల విధుల పత్రాన్ని జతచేసి పోస్టల్ బ్యాలెట్‌ను ఇస్తారు. దీనికి ప్రతి నియోజకవర్గంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేలా ప్రత్యేకంగా అధికారులను నియమించారు. గత 2009, 2014 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్న ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఓటరు చైతన్యం కార్యక్రమాల మాదిరిగా పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై కూడా చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సద్వినియోగం చేసుకోవాలి.. పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ కోసం ఇప్పటి వరకు 367 దరఖాస్తులు స్వీకరించగా 179 బ్యాలెట్లను పంపించాం. ఈ నెల 25న పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు గడువు ముగుస్తుంది. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి. –విక్రంరెడ్డి, రిటర్నింగ్ అధికారి పెరిగిన పోస్టల్ ప్రాధాన్యం పటాన్చెరు టౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతీ ఉద్యోగి తన ఓట హక్కును వినియోగించుకునేందుకు గాను పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. ఈ నెల 25 వరకు పోస్టల్ బ్యాలెట్ స్వీకరించేందుకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఓటర్ ఐడీ గుర్తింపు కార్డుతో.... ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఫాం–12ను కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దీనికి ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీ, ఓటర్ ఐడీ పత్రాలను జతపర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల విధులో పాల్గొనే వారికి వీటిని అందించారు. ఇలా అందించిన వారి ఇంటికి పోస్టల్ బ్యాలెట్ వెళ్తుంది. లేదా ట్రేనింగ్కి వచ్చిన సమయంలో పోస్టల్ బ్యాలెట్ అందిస్తారు. ఓటు ఇలా వేయాలి..... పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగి ఇంటి అడ్రస్‌కు వస్తుంది. అందులో బ్లూ, పింక్, ఎల్లో కలర్లతో కూడిన మూడు కవర్లు ఉంటాయి. వీటితో పాటు ఫాం–13 ఏ, బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. ఫాం–13 ఏలో పోస్టల్ బ్యాలెట్ నంబరు రాసి సంతకం చేసిన అవసరమైన ఒక చోట గెజిటెడ్ సంతకాలు చేసి బ్లూ కవర్లో పెట్టాలి. బ్యాలెట్ పేపర్లో ఏ అభ్యర్ధికి ఓటు వేయాలనే విషయంలో అభ్యర్థి పేరు వద్ద టిక్ పెట్టి ఆ బ్యాలెట్‌ను పింక్ కవర్లో ఉంచాలి. పై రెండు కవర్లను ఎల్లో కవర్లో పెట్టి సీల్ చేయాలి. పటాన్చెరు టౌన్: పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను పరిశీలిస్తున్న తహసీల్దార్ -
ఒక్క ఓటుతో విజయం !
బొమ్మనహళ్లి : ఇద్దరికి సరిసమానంగా ఓట్లు వచ్చాయి... అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటు ఒకరిని విజేతగా నిలిపింది. వివరాలు... ఉడిపి జిల్లా సాలిగ్రామ పట్టణ పంచాయతీ 4వ వార్డుకు బీజేపీ తరఫున కరుణాకర్, కాంగ్రెస్ తరఫున పునీత్ పూజరి బరిలో ఉన్నారు. సోమవారం జరిగిన కౌంటింగ్‌లో ఇద్దరికి సరిసమానంగా 245 ఓట్లు వచ్చాయి. అధికారులు మూడు పర్యాయాలు ఓట్లను లెక్కించినా తేడా రాలేదు. ఇంతలో ఈ వార్డుకు ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉన్నట్లు గుర్తించిన అధికారి, పోస్టల్ బ్యాలెట్‌ను తీయగా అది కూడా పునీత్‌కే ఓటు వేశారు. దీంతో పునీత్‌ను విజేతగా ప్రకటించారు. ఒక్క ఓటుతో పరాజయమైన బీజేపీ అభ్యర్థి కరుణాకర్‌లో నిరాశ నెలకొంది. ఒక్క ఓటుతో విజయం సాధించిన పునీత్‌ను పలువురు అభినందించారు. -
‘నయా’వంచకుడు
►ఫేస్బుక్ నుంచి నెంబర్లు... వాట్సాప్‌లో గ్రూప్ ►మహిళలను టార్గెట్ చేసుకుని అశ్లీల సాహిత్యం పోస్ట్ ►దర్యాప్తు చేపట్టిన ఎస్సైకే బెదిరింపులు, ఫేస్బుక్ హ్యాక్ ►నిందితుడి అరెస్టు సిటీబ్యూరో: అతడి పేరు మణిరత్నం... వృత్తి వ్యవసాయ కూలీ, ప్రవృత్తి మాత్రం వాట్సాప్ వేధింపులు... బాధితుల జాబితాలో అనేక మంది మహిళలు/యువతులతో పాటు ఓ ఎస్సై కూడా ఉన్నారు. డీసీపీ అవినాష్ మహంతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరుకు చెందిన ఉప్పులూరి మణిరత్నం పదో తరగతి వరకు చదివాడు. అక్కడే వ్యవసాయ కూలీగా పని చేస్తున్న ఇతగాడికి ఓ స్మార్ట్‌ఫోన్ ఉంది. కొన్ని రోజుల క్రితం ‘ఆల్ ఫ్రీ’ సర్వీసు కనెక్షన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తన ఫోన్లో ఎడాపెడా ఇంటర్నెట్ వాడేస్తున్న మణిరత్నం ఫేస్‌బుక్‌పై దృష్టి పెట్టాడు. అందులో మహిళలు/యువతులకు చెందిన పేజీల్లోకి వెళ్లి, వారి ఫోన్ నెంబర్లు సేకరించేవాడు. ఆ నెంబర్ల ఆధారంగా వాట్సాప్‌లో సదరు యువతులు/ మహిళలతో చాటింగ్స్ ప్రారంభించేవాడు. కొన్నిసార్లు శృతిమించిన సంభాషణలు చేసేవాడు. ఎదుటి వారి ప్రమేయం లేకుండానే వాట్సాప్‌లో ఓ గ్రూప్ క్రియేట్ చేసిన మణిరత్నం దానికి ‘రోమాంటిక్ థాట్స్ షేరింగ్’ అనే పేరు పెట్టాడు. ఈ గ్రూప్ ద్వారా అభ్యంతరకర/అశ్లీల పోస్టులు, ఫొటోలు షేర్ చేయడంతో పాటు సభ్యులుగా ఉన్న వారి వ్యక్తిగత వివరాలు, ఫొటోలు తదితరాలు అడుగుతూ వేధించాడు. దాదాపు 300 మంది యువతులు/మహిళలు అతడి భారిన పడ్డారు. వీరిలో కొందరు ‘హాక్ ఐ’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును షీ–టీమ్స్‌కు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై ఎం.శోభన్‌బాబు ప్రాథమికంగా నిందితుడు వినియోగించిన నెంబర్‌కు ఫోన్ చేసి అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదు. దీంతో నిందితుడి నెంబర్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపాడు. తనకు సందేశం వచ్చిన నెంబర్‌ను ట్రూకాలర్‌లో తనిఖీ చేసిన మణిరత్నం అది పోలీసు విభాగంలో పని చేసే శోభన్‌కు చెందినదిగా గుర్తించాడు. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు ఎస్సైకే బెదిరింపు సందేశాలు పంపడంతో పాటు అతడి ఫేస్బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేశాడు. ఎస్సైతో చాటింగ్స్ చేసే సందర్భంలో నిందితుడు కొన్ని వ్యక్తిగత అంశాలు ప్రస్తావించడంతో శోభన్‌బాబు సైబర్‌క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ బి.చాంద్ బాష సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. శివబాలాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు... సిటీ నటుడు శివబాలాజీ సైతం సైబర్ బాధితుడిగా మారారు. దీంతో ఆయన శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. శివబాలాజీ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయినట్లు గురువారం తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఆ సందర్బంలో మరో నటుడు అలీ తదితరులతో దిగిన సెల్ఫీలను అప్లోడ్ చేశారు. ఈ పోస్ట్‌పై ‘వాసు సీహెచ్’ ఐడీతో ఉన్న వ్యక్తి అసభ్యపదజాలంతో కామెంట్ చేశాడు. శివబాలాజీ మందలించినప్పటికీ స్పందన లేకపోవడంతో శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే పైచేయి
వరంగల్: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నాలుగు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడడం గమనార్హం. మొత్తం 500 మందికి పోస్టల్ బ్యాలెట్స్ పంపించారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి ఫలితం వచ్చే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. -
ఎన్నారైలకు ‘పోస్టల్ బ్యాలెట్’!
సూత్రప్రాయంగా అంగీకరించామని సుప్రీంకు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించాలన్న ఎన్నికల సంఘం(ఈసీ) సిఫారసుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కేంద్రప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ సిఫారసు అమలుకు సంబంధిత చట్టానికి సవరణలు చేయాల్సి ఉందని, న్యాయ శాఖ ఆ పనిలోనే ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ పీఎల్ నరసింహ కోర్టుకు విన్నవించారు. ఎన్నారైలకు ఓటుహక్కు అవసరమేనని, ఆ సిఫారసును ఆమోదించాలని సూత్రప్రాయంగానైనా నిర్ణయం తీసుకున్నందున అమలు విషయంలో తీసుకున్న తదుపరి చర్యల గురించి తెలపాలని, ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రీల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది. ఎన్నారైలకు ఈ బ్యాలెట్, ప్రాతినిధ్య ఓటు విధానాల ద్వారా ఓటుహక్కు కల్పించాలన్న ఈసీ సిఫారసులపై స్పందించాలంటూ గత నవంబర్ 14న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఉప కమిషనర్ వినోద్ జుట్షి నేతృత్వంలోని 12 మంది సభ్యుల కమిటీ రూపొందించిన నివేదికలో ఎన్నారైల ఓటుహక్కుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సిఫారసు చేసింది. -
రుణ సమీకరణకు నవభారత్, అవంతి కసరత్తు
ఫాస్ట్ ట్రాక్... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీరేట్లు తగ్గడమే కాని పెరిగే అవకాశం లేదన్న స్పష్టమైన సంకేతాలకు తోడు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్న నమ్మకంతో రాష్ట్ర కంపెనీలు విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందుకు కావల్సిన నిధులను రుణాల రూపంలో సేకరించడానికి వాటాదారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. ఫెర్రోఅల్లాయిస్, విద్యుత్ ఉత్పాదక రంగంలో ఉన్న నవభారత్ వెంచర్స్ రుణాల రూపంలో రూ.3,000 కోట్లు సమీకరించాలని తాజాగా నిర్ణయించింది. ఇందుకోసం వాటాదారుల అనుమతి కోసం పోస్టల్ బ్యాలెట్, ఈ-వోటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. 2012లోనే నవభారత్ వెంచర్స్ గరిష్టంగా రూ.10,000 కోట్లు సమీకరించడానికి బోర్డు అనుమతి మంజూరు చేసినప్పటికీ కొత్త కంపెనీల చట్టం ఇంత మొత్తం సమీకరించడానికి అంగీకరించకపోవడంతో రూ.3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఇదే బాటలో చేపలకు ఆహారాన్ని ఉత్పత్తి చేసే అవంతి ఫీడ్స్ కూడా వ్యాపార విస్తరణ కార్యకలాపాల కోసం రూ.500 కోట్లు సమీకరించనుంది. అదే విధంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసును విశాఖపట్నానికి కూడా మారుస్తోంది. ఈ రెండు నిర్ణయాలపై ఆమోదాన్ని కోరుతూ కంపెనీ వాటాదారుల అనుమతి కోరుతోంది. జూన్ 28న ప్రారంభమయ్యే పోస్ట్ బ్యాలెట్/ఈ వోటింగ్ జూలై 8తో ముగుస్తుంది. -
మంగళగిరిలో టీడీపీ రాస్తారోకో
మంగళగిరి రూరల్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై విచారణ చేపట్టాలని కోరుతూ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గంజి చిరంజీవి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ సెంటర్లోని గౌతమబుద్ధారోడ్పై ఆదివారం రాస్తారోకో చేశారు. తొలుత నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి మాట్లాడుతూ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు సంబంధించి మొత్తం 14 ఓట్ల తేడా వుందని తాము గుర్తించి, శనివారం రాత్రి లెక్కింపు కేంద్రమైన ఆచార్య నాగార్జునయూనివర్సిటీకి వెళ్లి ఆర్వో ఝాన్సీలక్ష్మిని కలసి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. రాస్తారోకోలో టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, ఆరుద్ర అంకవరప్రసాద్, గుత్తికొండ ధనుంజయరావు, సంకా బాలాజీగుప్తా, వల్లూరి సూరిబాబు, కోనంకి శ్రీనివాసరావు, అవ్వారు కృష్ణ, బీజేపీ నాయకులు జగ్గారపు రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
జగనాభిమానం
ఎప్పటిలాగే జిల్లా జనం వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ జగన్‌పై అభిమానం చూపారు. సీమాంధ్రలోని 13జిల్లాలలో ఎక్కడా లేని విధంగా 10 అసెంబ్లీ స్థానాల్లో 9 మందిఎమ్మెల్యేలను తిరుగులేని మెజార్టీతో గెలిపించి..వైఎస్ కుటుంబంపై తమది చెరగని ప్రేమ అని చాటిచెప్పారు. వైఎస్సార్సీపీ గెలుపుతో ఆపార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోవడంతో ఢీలాపడ్డారు. ప్రజలతీర్పును శిరసావహించి, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని విజయానంతరం ప్రకటించారు. కార్యకర్తలకు కష్టనష్టాల్లోఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు. సాక్షి, కడప: సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ శుక్రవారం నిర్వహించారు. కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన అన్ని అసెంబ్లీస్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కడప పార్లమెంట్ పరిధిలోని అన్నిస్థానాలు వైఎస్సార్సీపీకి క్లీన్‌స్వీప్ అయ్యాయి. రాజంపేట పార్లమెంట్‌లోని రాజంపేట స్థానంలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు. తక్కిన రాయచోటి, రైల్వేకోడూరు స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పదేళ్లపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో ఒక్కస్థానంలో కూడా విజయం సాధించకపోగా ఎక్కడా మెజార్టీని కూడా దక్కించుకోలేదు. కొత్తగా ఆవిర్భవించిన జై సమైక్యాంధ్రపార్టీతో పాటు ఆమ్ఆద్మీ, బీఎస్పీ, ఎన్సీపీలాంటి జాతీయపార్టీలకు కూడా మెజార్టీ దక్కలేదు. రెండుపార్లమెంట్లు వైఎస్సార్సీపీకే: కడప, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయం సాధించారు. రాజంపేట స్థానానికి కేంద్ర మాజీమంత్రులు సాయిప్రతాప్ కాంగ్రెస్ తరఫున, బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి బరిలో నిలిచారు. మిధున్‌రెడ్డి చేతిలో ఇద్దరూ ఓడిపోయారు. కడప టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఆర్. శ్రీనివాసులరెడ్డి(వాసు)పై 1,93,365 ఓట్ల తేడాతో వైఎస్ అవినాష్‌రెడ్డి గెలుపొందారు. అలాగే పురందేశ్వరిపై 1.75లక్షల ఓట్లతో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయం సాధించారు. వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన అవినాష్‌కే మరోసారి కడప ఎంపీ స్థానాన్ని ప్రజలు కట్టబెట్టారు. మాజీమంత్రి పెద్దిరామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. యువనేతలైన వీరిరువురు తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. జిల్లాలో నుంచి ఆరు కొత్త ముఖాలు అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు తొలిసారి ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టనున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు కమలాపురం, ప్రొద్దుటూరు, కడప, బద్వేలు ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచారు. వీరంతా ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించడం విశేషం. అలాగే రాజంపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడా మల్లికార్జునరెడ్డి కూడా అసెంబ్లీ గడపను తొలిసారి తొక్కనున్నారు. హ్యాట్రిక్ వీరులు...హ్యాట్రిక్ ఓటములు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ‘హ్యాట్రిక్’ సాధించారు. 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా ఆది విజయం సాధించారు. 2009, 2011 ఉప ఎన్నిక లతో పాటు ప్రస్తుతంశ్రీకాంత్, కొరముట్ల గెలుపొంది ‘హ్యాట్రిక్’ జాబితో చేరారు. అలాగే కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి వరుసగా మూడుసార్లు ఓడిపోయి ‘హాట్రిక్’ ఓటమిని మూటగట్టుకున్నారు. అలాగే మాజీ మంత్రి పీ రామసుబ్బారెడ్డి కూడా 2004,2009, 2014లో ఓడిపోయి ‘హ్యాట్రిక్’ జాబితో చేరారు. పెద్దాయన గెలిచారు...‘పుట్టా’ ట్రిక్కులు ఓడిపోయాయి జిల్లాలో మైదుకూరు అసెంబ్లీస్థానంపై జిల్లా వాసులు ప్రత్యేక దృష్టి సారించారు. పుట్టా సుధాకర్‌యాదవ్ నియోజకవర్గంలో ధనప్రవాహం పారించారు. ఓటుకు వెయ్యిరూపాయల డబ్బు, ముక్కుపుడకలు పంపిణీ చేశారు. మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సహకారం తీసుకున్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం ‘పెద్దాయన’గా పిలువబడే రఘురామునికే పట్టం కట్టారు. పుట్టా సొంత పంచాయితీ పలుగురాళ్లపల్లె, డీఎల్ స్వగ్రామం సుంకేసులలో కూడా రఘురామునికే మెజార్టీ వచ్చింది. వైఎస్ జగన్‌కు భారీ మెజార్టీ: ఎప్పటిలాగే పులివెందుల ప్రజానీకం వైఎస్ కుటుంబానికి మరోసారి పట్టం కట్టారు. తొలిసారి అసెంబ్లీబరిలో నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 75,243 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కడప పార్లమెంట్‌కు 14మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఏ అభ్యర్థి ఇష్టం లేదని నోటాకు పోలైన ఓట్లు: 6058. సమీరాకు...230 ఓట్లు: జిల్లాలో తొలిసారి అసెంబ్లీబరిలో సమీరా (హిజ్రా) పోటీకి దిగారు. జమ్మలమడుగు నియోజకవర్గం బరిలో సమీరా ఆమ్ఆద్మీపార్టీ తరఫున బరిలోకి దిగారు. ఈమెకు 230 ఓట్లు పోలయ్యాయి. -
ముందు పోస్టల్, ఆ తర్వాత ఈవీఎంలు
హైదరాబాద్ : ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొనటంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ ముగియగానే ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓ రౌండ్ ఫలితం పది నిమిషాల్లోనే వెల్లడి కానుంది. ప్రతి రౌండ్లో ర్యాండమ్‌గా రెండు టేబుళ్ల లెక్కింపును సరిచూసిన తర్వాత ఓట్ల వివరాలను షీట్లో నమోదు చేస్తారు. ఈ ఏడాది కొత్త విధానం ‘పాడు’ (ప్రింట్ అండ్ ఆక్జలరీ యూనిట్), కంట్రోల్ యూనిట్ ద్వారా ఫలితాలను వెల్లడిస్తారు. -
ఫలితాలు ఇలా...
జిల్లాలోని రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో ఉన్న ఓట్లను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్లపై లెక్కిస్తారు. మొత్తం 18 నుంచి 20 రౌండ్లలో లెక్కింపు పూర్త వుతుంది. మధ్యాహ్నం 3గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్ జరిగే ప్రదేశాలు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం : భారత ప్రభుత్వ ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), గొల్లగూడ, నల్లగొండ భువనగిరి : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, దుప్పలపల్లి, నల్లగొండ. ఎవరో ఆ అదృష్టవంతులు : నల్లగొండ పార్లమెంట్ : 9మంది అభ్యర్థులు భువనగిరి పార్లమెంట్ : 13మంది అభ్యర్థులు 12 నియోజకవర్గాల్లో : 161మంది అభ్యర్థులు కౌంటింగ్ జరిగే స్థానాల సంఖ్య నల్లగొండ పార్లమెంట్ పరిధి : 7 అసెంబ్లీ నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంట్ పరిధి : 5 అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలోని రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు ఏప్రిల్ 30వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు చిన్నాచితకా పార్టీలు, స్వతంత్రులతో కలిపి మొత్తం 19 రాజకీయపార్టీలకు చెందిన 161 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎలాగైనా గెలుపొందాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరాహోరీగా నిర్వహించారు. కాగా కోదాడ, మునుగోడు నియోజకవర్గాల్లో మాత్రం 17 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి 9 మంది, భువనగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన 13 మంది అభ్యర్థులు భవితవ్యం మరి కొద్ది గంటల్లో తేలనుంది. కౌంటింగ్ ఏర్పాట్లు.. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ నిర్వహణకు గాను జిల్లాలోని ఒక్కో నియోజక వర్గానికి 24 టేబుళ్ల చొప్పున అధికారులు ఏర్పాటు చేశారు. దీంట్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం 12, ఎంపీ అభ్యర్థుల కోసం 12 టేబుళ్లు ఉంటాయి. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్ ఉంటారు. మొత్తం ఓట్ల లెక్కింపు కోసం 288 టేబుళ్లు, ఇక ఓట్లను లెక్కించడానికి గాను 1152 మంది సిబ్బందిని అధికారులు నియమించారు. భారీ బందోబస్తు... కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. సాధారణ పోలీసులతో పాటు, ప్రత్యేక పోలీస్ విభాగాల సిబ్బందిని కూడా నియమించారు. అదనపు ఎస్పీ, డీఎస్పీలు 5, సీఐలు 28, ఎస్ఐలు 79, ఏఎస్ఐలు 194, కానిస్టేబుళ్లు 482, హోంగార్డులు 306 మందిని నియమించారు. వీరితో పాటు అదనంగా పారా మిలటరీ బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి శనివారం ఉదయం 10గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. అదే విధంగా ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత అభ్యర్థులు ఎలాంటి గెలుపు సంబరాలు నిర్వహించడానికి అనుమతిలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు వీటి పై నిషేధం విధించారు. -
లబ్.. డబ్..
నేడే ప్రజా తీర్పు.. జనం పట్టం కట్టేదెవరికో..?! అభ్యర్థుల గుండెల్లో గుబులు క్షణక్షణం పెరుగుతున్న ఉత్కంఠ సాక్షి, సిటీబ్యూరో: ఉదయం 6.30: స్ట్రాంగ్‌రూమ్ తాళాలు తెరుస్తారు ఉదయం 8.00: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉదయం 8 .30: ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు షురూ మధ్యాహ్నం 3.00: మొత్తం ఫలితాల వెల్లడి క్షణక్షణం ఉత్కంఠ.. అభ్యర్థుల్లో టెన్షన్.. మరికొద్ది గంటల్లో నే‘తల’రాతలు మారనున్నాయి. వివిధ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఫలితాల సరళిపై ఇప్పటికే చర్చలు.. పందేలు నడుస్తుండగా, శుక్రవారం వెల్లడయ్యే తుది ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, వామపక్షాల వంటి ప్రధాన పార్టీలతో పాటు ఆమ్ఆద్మీ పార్టీ బరిలో నిలవగా, గ్రేటర్‌లోని 81,42,027 మంది ఓటర్లు ఏ పార్టీ నుంచి ఎవరిని గెలిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ పరిధిలో 511 మంది అసెంబ్లీ అభ్యర్థుల, 91 మంది లోక్‌సభ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. కౌంటింగ్‌కు సర్వ సన్నాహాలు ఓట్ల లె క్కింపునకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. హైదరాబాద్ పార్లమెంట్ ఫలితాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, సికింద్రాబాద్ పార్లమెంట్ ఫలితం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో వెల్లడిస్తారు. హైదరాబాద్ జిల్లాలోని సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల పార్లమెంట్ ఓట్లను మాత్రం వేరే గదిలో లెక్కిస్తారు. మిగతా 12 నియోజకవర్గాల్లో అసెంబ్లీ.. పార్లమెంట్ ఓట్లను ఒకే హాల్లో టేబుల్‌కు చెరో వైపు లెక్కిస్తారు. ఈసారి ప్రజాతీర్పు కోరనున్న ప్రముఖుల్లో వి.హనుమంతరావు, దానం నాగేందర్, ఎం.ముఖేశ్‌గౌడ్, అక్బరుద్దీన్ ఒవైసీ, తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, ముఠా గోపాల్, డి.సుధీర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బిక్షపతియాదవ్, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, జయసుధ, బద్దం బాల్‌రెడ్డి, విజయారెడ్డి, జాఫర్‌హుస్సేన్, మల్రెడ్డి రంగారెడ్డి, జి.సాయన్న, అహ్మద్ పాషాఖాద్రి, మోజంఖాన్, అహ్మద్ బ లాల తదితరులున్నారు. పార్లమెంట్ బరిలో తలపడ్డ వారిలో బండారు దత్తాత్రేయ, అసదుద్దీన్ ఒవైసీ, భగవంతరావు పవార్, అంజన్‌కుమార్‌యాదవ్, భీంసేన్, సయ్యద్ సాజిద్‌అలీ, ఛాయారతన్, సర్వే సత్యనారాయణ, దినేశ్‌రెడ్డి, జయప్రకాశ్‌నారాయణ, డా.నాగేశ్వర్, మల్లారెడ్డి, లుబ్నా సర్వత్ తదితరులున్నారు. ఓట్ల లెక్కింపు విశేషాలు.. అధికారులు, మీడియా ప్రతినిధులు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా 15 నియోజకవర్గాల కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు కౌంటింగ్ కేంద్రంలోకి సంబంధిత అధికారుల వాహనాలను మాత్రమే.. అదీ పరిమితంగా అనుమతిస్తారు పోలింగ్స్టేషన్లు, కౌంటింగ్ టేబుళ్లు, లెక్కించాల్సిన రౌండ్ల సంఖ్యను బట్టి ఫలితానికి దాదాపు 4 నుంచి 7 గంటలు పడుతుందని అంచనా చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం తొలుత వెల్లడవుతుందని భావిస్తున్నారు. ఇక్కడ 179 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 13 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ఒక్కో రౌండ్‌కు 20 నిమిషాల వంతున మధ్యాహ్నం 12.30 కల్లా కౌంటింగ్ పూర్తికాగలదని అంచనా యాకుత్‌పురా ఫలితానికి ఎక్కువ సమయం పడుతుందని భావిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, టేబుళ్ల ఆధారంగా 21 రౌండ్ల కౌంటింగ్‌కు ఏడు గంటల సమయం పడుతుందని అంచనా ప్రతి రౌండ్లో వచ్చిన ఓట్ల వివరాలను సదరు టేబుల్ వద్ద ప్రదర్శించడంతో పాటు లెక్కింపు కేంద్రం ఆవరణలోని వారికి వినిపించేలా మైకు ద్వారా తెలియజేస్తారు. హాలు ఆవరణలోనూ ప్రొజెక్టర్ లేదా బోర్డుపై వివరాలు వెల్లడిస్తారు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాక ఎన్నికల కోడ్ ముగుస్తుంది పింటర్ కమ్ ఆగ్జిలరీ డిస్ప్లే యూనిట్ (పాడు) ద్వారా ఈవీఎంలలోని ఓట్ల వివరాల ప్రింట్‌ను పొందవచ్చు. అవసరమనుకుంటే ప్రింట్తీస్తారు. ఈవీఎంల్లో సాంకేతిక సమస్య తలెత్తినా ‘పాడు’ ద్వారా ఓట్లను తెలుసుకోవచ్చు ఉదయం 8.30లోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాని పక్షంలో వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్దకు పంపిస్తారు. వాటినలా ఉంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. విధి.. విధానాలిలా... ఒక్కో కౌంటింగ్ టేబుల్ వద్ద ముగ్గురు వంతున (గెజిటెడ్ అధికారి అయిన కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, కేంద్రం నుంచి వచ్చిన మైకో అబ్జర్వర్) 1266 మంది, ఇతరత్రా అధికారులు, సిబ్బంది వెరసి మరో 600 మంది, రిజ ర్వులో 200 మంది.. మొత్తం 2 వేల మందికి పైగా కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక అబ్జర్వర్ ఉంటారు. ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించడంతో పాటు ప్రతి రౌండ్ ఫలితంపై ఆయన సంతకం చేస్తారు. ఆపై రిటర్నింగ్అధికారి సంతకం చేస్తారు. ఫలితాల అనంతరం రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, ఊరేగింపులు నిషేధం కౌంటింగ్ విధుల్లో పాల్గొనే ముస్లిం సిబ్బం దికి నమాజ్‌కు కొంతసేపు అవకాశమిస్తారు రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించాక.. ఒక్కసారి బయటకు వెళ్తే కనుక తిరిగి రానివ్వరు అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఉంటాయి. అధికారులు, పార్టీల ఏజెంట్లు వేర్వేరు మార్గాల ద్వారా కౌంటింగ్ హాల్లోకి వెళ్లాలి కౌంటింగ్ కేంద్రాల్లోకి ఆహార పదార్థాలను అనుమతించరు. లెక్కింపు కేంద్రాల హాల్ల ఆవరణలో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తారు. -
రేపే కౌంటింగ్
- ఉదయం 8 .30 నుంచి ఓట్ల లెక్కింపు - కంట్రోల్ రూమ్ ద్వారా కౌంటింగ్ వీక్షణం - మధ్యాహ్నం 3 గంట ల కల్లా ఫలితాలు - కేంద్రంలోకి వాహనాలకు అనుమతి నిల్ - జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో : ఎన్నికల ప్రక్రియలో తుది ఘట్టం.. కౌంటింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు తెరవేసే కీలకమైన కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు సకల ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలి పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లయిన ముఖేశ్‌కుమార్ మీనా, ఇ. శ్రీధర్‌లతో కలసి బుధవారం ఆయన జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సం బంధించిన ఓట్ల లెక్కింపు 18 హాళ్లలో జరుగుతుందన్నారు. సనత్‌నగర్, సికింద్రాబాద్, కం టోన్మెంట్ నియోజకవర్గాల అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపు వేర్వేరు హాళ్లలో జరుగుతాయన్నారు. మిగతా నియోజకవర్గాలవి రెండు నియోజకవర్గాల లెక్కింపు ఒకే హాల్లో జరుగుతాయన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ ఫలితం కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, సికింద్రాబాద్ పార్లమెంట్ ఫలితం యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల్లో వెల్లడిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తి ఫలితాలు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్ల కనుగుణంగా 12 నుంచి 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏర్పాటు చేస్తున్న టేబుళ్లు.. లెక్కింపు జరిగే రౌండ్ల ఆధారంగా జిల్లా పరిధిలో చార్మినార్ అసెంబ్లీ ఫలితం తొలుత.. యాకుత్‌పురా అసెంబ్లీ ఫలితం చివర వెలువడే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చార్మినార్ ఫలితం వెలువడేం దుకు దాదాపు నాలుగున్నర గంటల సమయం పట్టవచ్చనే అంచ నా ఉందన్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెలువడగలవని అంచనా వేస్తున్నామన్నారు. వివాదాల్లేకుండా సూపర్ చెక్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసే టేబుళ్లు కాక మరో రెండు టేబుళ్లు అదనంగా ఏర్పాటు చేసి.. అక్కడ ఈవీఎంలను ర్యాండమ్‌గా చెక్ చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు హెల్పర్ ఉంటారన్నారు. ఓట్ల లెక్కిం పులో ఎలాంటి వివాదానికి తావులేకుండా మైక్రో అబ్జర్వర్లు, అబ్జర్వర్లు సూపర్ చెక్ చేస్తారన్నారు. ఏైదె నా ఈవీఎంలో సమస్యలు తలెత్తితే దాన్ని మాత్రం పక్కనపెట్టి కౌంటింగ్‌కు ఆటంకం లేకుండా మిగతా ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారన్నారు. వెయ్యిమంది కౌంటింగ్ సూపర్వైజ ర్లు.. మరో వెయ్యిమంది అసిస్టెంట్లు, కేంద్రం నుంచి వచ్చిన 500 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. కంట్రోల్‌రూమ్ ద్వారా.. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల ఫలితాలు ఒకేచోటు నుంచి తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్రూ మ్ పనిచేస్తుందన్నారు. వెబ్‌క్యామ్‌ల ద్వారా ఆయా కౌంటింగ్ కేం ద్రాల్లోని దృశ్యాలను కంట్రోల్‌రూమ్ నుంచి వీక్షించవచ్చన్నారు. సమస్యలు తలెత్తితే.. ఈవీఎంలలో ఏదైనా సమస్యల తలెత్తితే సదరు ఈవీఎంలలోని ఓట్లను ‘ప్రింటర్ కమ్ ఆగ్జిలరీ డిస్ప్లే యూనిట్ (పాడు)’ నుంచి తెలుసుకోవచ్చునన్నారు. అవసరమైతే రౌండ్ల వారీ ఓట్ల వివరాల ప్రింట్‌ను పొందవచ్చునని చెప్పారు. ఏదైనా ఈవీఎంలో సమస్యలు తలెత్తినప్పుడు.. సదరు ఈవీఎంలోని ఓట్ల లెక్కింపుపైనే ఎవరు విజేతలో తెలిసే (ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్ల తేడా స్వల్పంగా మాత్రమే ఉన్నప్పుడు) పరిస్థితి ఉంటే.. ఎన్నికల సంఘానికి విషయాన్ని తెలియజేసి.. దాని ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఒక ఈవీఎంలోని ఓట్లు గెలుపోటములను నిర్దేశించే పరిస్థితి లేనప్పుడు ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పారు. ఈవీఎంలలో సాంకేతితక సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఇద్దరు ఈసీఐఎల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు. రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లున్నాయని చెప్పారు. పరిమిత సంఖ్యలో అధికారుల వాహనాలు తప్ప కౌంటింగ్ కేంద్రాల్లోకి ఇతరుల వాహనాలు అనుమతించరని స్పష్టం చేశారు. మీడియాకు రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు తెలిపేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 6.30 గంటలకు స్ట్రాంగ్‌రూమ్‌లు తెరుస్తారని.. రాజకీయపార్టీల ఏజెంట్లు 6 గంటలకల్లా అక్కడకు చేరుకోవాలని సూచించారు. ప్రతి రౌండ్లో వచ్చిన ఓట్ల వివరాలను సదరు టేబుల్ వద్ద ప్రదర్శిండంతోపాటు మైకు ద్వారా తెలియజేస్తారన్నారు. హాలు ఆవరణలో కూడా బోర్డుపై వివరాలు వెల్లడిస్తారన్నారు. నిర్వహణ వ్యయం ఇలా.. ఎన్నికల నిర్వహణకోసం ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ద్వారా రూ. 17 కోట్లు మంజూరు కాగా, మరో రూ. 6 కోట్ల కావాల్సిందిగా కోరామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అందరికీ రిటర్నింగ్ అధికారుల ద్వారా వేతనాలందజేస్తామని తెలిపారు. ఈనెల 28 వరకు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలను ప్రకటించాక ఎన్నికల సంఘం కోడ్‌ను ఎత్తివేస్తుందని ముఖేశ్‌కుమార్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
240 టేబుళ్లలో ‘సార్వత్రిక’ లెక్కింపు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల లెక్కింపు 240 టేబుళ్లలో నిర్వహిస్తామని కలెక్టర్ అహ్మద్‌బాబు తెలిపారు. మరో 14 టేబుళ్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సారి ఓట్ల లెక్కింపులో ప్రతీ టేబుల్‌కు ఒక ప్రింటింగ్ కమ్ యాక్సిలరీ డిస్ప్లే యూనిట్‌ను (పాడు) ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానం గురించి కలెక్టర్ రాజకీయ ప్రతినిధులకు తెలియజేశారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవ ర్గాల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 20 కౌంటింగ్ హాళ్లలో జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి 11,228, పది అసెంబ్లీ స్థానాలకు 15,028 వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లాలో జరిగే ఓట్ల లెక్కింపును ఎనిమిది మంది పరిశీలకులు పర్యవేక్షిస్తారన్నారు. జిల్లాకు కొత్తగా కౌంటింగ్ పరిశీలకులు శివ్కాన్ ద్వివేది, ప్రమోద్‌కుమార్, ఓంప్రకాష్ పాటస్కర్, రాకేశ్‌కుమార్ వచ్చారని తెలిపారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారని వివరించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపర్‌ను లెక్కించేం దుకు కూడా ముగ్గురు అధికారుల చొప్పున నియమించామన్నారు. సరిపడా కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. ఇప్పటి వరకు కొంత మంది ఏజెంట్లను నియమించుకున్నారని తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ముథోల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో (బాలుర)లో జరుగుతుందన్నారు. బోథ్, నిర్మల్, ఖానాపూర్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలికల)లో జరుగుతుందన్నారు.