నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌లో జరిగిన గందరగోళంపై ఈనెల 3న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శోభా స్వరూపారాణి చర్యలు చేపట్టారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆర్‌ఓతో పాటు ఏఆర్‌ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ‘సాక్షి’లో వచ్చిన పోస్టల్ మాయాజాలం కథనం పై విచారణ చేపట్టామన్నారు.