Top Stories
ప్రధాన వార్తలు

వార్ టెన్షన్.. ప్రధాని మోదీతో దోవల్ కీలక భేటీ
War Live Updates..కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న అజిత్ దోవల్. సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్న దోవల్.ఇంతకుముందే త్రివిధ దళాలతో భేటీ అయిన దోవల్. ఢిల్లీ..రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం.ౌసౌత్ బ్లాక్‌లో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.పాకిస్తాన్ దాడులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్యలుఉదయం 10:30 గంటకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం. ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించనున్న అధికారులు.పంజాబ్ భటిండాలో రెడ్ అలర్ట్‌ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ.జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న పాకిస్తాన్ కాల్పులు.రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ.#WATCH | J&K: Parts of a damaged drone found in a field in RS Pura. pic.twitter.com/Y3akkre6pQ— ANI (@ANI) May 10, 2025#WATCH | J&K: A house in the civilian area in Jammu suffered massive damage due to heavy shelling by Pakistan. pic.twitter.com/eqbHYcqB9w— ANI (@ANI) May 10, 2025అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..భారత్, పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం.భారీగా భద్రతా దళాల మోహరింపు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ.ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసిన అధికారులు.జమ్ము, రాజస్థాన్, పంజాబ్‌లో జనావాసాలపై పాక్ దాడులు.జానీపూర్ నివాస ప్రాంతంలో పాక్ మిస్సైల్ దాడులు. #WATCH | J&K: SDRF, local police, administration, and other agencies are at the spot. They cordoned off the place near Aap Shambhu Temple where a Pakistani strike occurred.As per the SDRF personnel, there has been no casualty. pic.twitter.com/FLLcHEc96X— ANI (@ANI) May 10, 2025పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు.. పాక్ మిలిటరీ పోస్ట్.. టెర్రర్ లాంఛ్‌ప్యాడ్ ధ్వంసంసరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులునియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న దాయాది.ఆ పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీపంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్ క్షిపణి శకలాలు లభ్యంజమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభ్యంపౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు. #WATCH | A projectile debris in Rajasthan's Barmer as Pakistan started targeting civilian areas. pic.twitter.com/tENtKWlLOa— ANI (@ANI) May 10, 2025 #WATCH | J&K | Splinters and debris of a projectile retrieved from Akhnoor pic.twitter.com/SR3qe3gHbv— ANI (@ANI) May 10, 2025 పాక్‌కు చుక్కలే..పాక్ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.పాక్ డ్రోన్లను, మిస్సైల్స్‌ను కూల్చివేసిన భారత్. #WATCH | Parts of a projectile found in a field in Amritsar, Punjab. pic.twitter.com/bPxXOxWT8n— ANI (@ANI) May 10, 2025#WATCH | Amritsar, Punjab | Debris of a drone were recovered from a field in Muglani Kot village pic.twitter.com/zxmklvX2tL— ANI (@ANI) May 10, 2025 #WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw— ANI (@ANI) May 10, 2025నేడు భారత సైన్యం మీడియా సమావేశం.నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.ఆపరేషన్ సిందూర్ 2.0పై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్ దాడులు తీవ్రతరం..లాహోర్, ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ దాడులు. మూడు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున పాక్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు.వీటిల్లో ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న కీలక స్థావరంరెండు పాకిస్థాన్ ఫైటర్ జెట్ల కూల్చివేతశ్రీనగర్ బేస్ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్‌పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున 5 గంటలకు వినిపించిన శబ్దాలుశ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుఆకాష్ జెట్‌తో పాక్ క్షిపణులను కూల్చివేసిన భారత్. Pakistan tried to hit the capital of India, New Delhi by it's long range missile Fateh-2But intercepted by Barak-8 missile defence system in Sirsa of Haryana#IndianArmy please ekbar attacking mode me aajao 😡🙏#IndiaPakistanWar #IndianNavyAction pic.twitter.com/x3kd7v87W2— Priyanshu Kumar (@priyanshu__63) May 9, 2025📹VIDEO : Pakistani citizen (lahore) sharing reality of Indo-pak war. exposed Pakistan's failure & pak media lies.India is right on Top. 👍👍 pic.twitter.com/Ff44gptNlc— Vaishnavi (@vaishu_z) May 9, 2025 Lahore, Pakistan is now being targeted by India. Pakistan’s 2nd largest city and one that is fully undisputed.This war is escalating very quickly. pic.twitter.com/6lzojd3DcY— Spencer Hakimian (@SpencerHakimian) May 10, 2025పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు.పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత. పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలు నిలిపివేత.పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు చేసింది. లాహోర్, రావాల్పిండి, పెషావర్లపై దాడి చేసింది. నూర్ఖాన్, మురీద్, రఫికి ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిన భారత్. డ్రోన్స్, మిస్సైల్స్‌తో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసిన భారత్.నూర్ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అటు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు.భారత్ వ్యూహ్మాతక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులను తెగబడింది.జమ్ము,శ్రీనగర్, అమృత్సర్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్.భారత్‌లోని 26 ప్రదేశాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.మిస్సైల్స్ ద్వారా పాక్ దాడులను అడ్డుకున్న భారత్.ఫతా వన్ మిస్సైల్‌ను ధ్వంసం చేసిన భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.#WATCH | Jalandhar, Punjab: Parts of a Pakistan drone recovered after a blast in Kanganiwal village in Rural Jalandhar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ZogqS588tR— ANI (@ANI) May 10, 2025 #WATCH | Loud explosions are being heard in Poonch area of Jammu and Kashmir. (Visuals deferred by unspecified time) pic.twitter.com/VkjzgY8jYc— ANI (@ANI) May 10, 2025టార్గెట్ పఠాన్‌కోట్..పఠాన్‌కోట్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్.రెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్.అన్నిచోట్ల పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత సైన్యం.భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఎయిర్‌బేస్ బంద్.. అన్ని విమానాలను రద్దు చేసిన పాక్.శ్రీనగర్ టార్గెట్‌గా పాకిస్తాన్ ాదాడులు.శ్రీనగర్‌లోని రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు. At least 4 airbases in Pakistan have been targeted by Indian strikes: Sources pic.twitter.com/3ZegA6YmzM— ANI (@ANI) May 10, 2025పాక్ డ్రోన్లు దాడులు.. సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. చీకట్లు పడుతూనే జమ్ము కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది.కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జోద్పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

కరాచీ ఎయిర్‌పోర్టు లాక్డౌన్.. పెట్రోల్ బంక్‌లు బంద్!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా భారత్ దాడుల కారణంగా కరాచీ ఎయిర్‌పోర్టులో లాక్డౌన్ విధించారు. కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణీకుల తరలిస్తున్నట్టు సమాచారం. బ్లాక్ అవుట్ ప్రకటించారు. అలాగే, పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు.. భారత్ ముప్పెట దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలం మూసివేశారు. అలాగే, భారత్‌తో యుద్ధం కారణంగా పాకిస్తాన్లో కొరత మొదలైంది. తాజాగా ఇస్లామాబాద్‌లో 48 గంటలపాటు పెట్రోల్‌బంక్‌లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ప్రజలు అల్లాడిపోతున్నారు.All PETROL PUMPS in Islamabad SHUTDOWN for 48 hrsPaaijaan tel khatam hogya 😭#IndiaPakistanWar pic.twitter.com/D9hkvnEuQM— Dev Madan Chronicles (@DMC_0001) May 10, 2025 🚨#BREAKING!!! Completely BLACKED OUT, this is the scene at Karachi Airport after Pakistani airspace cleared,RT pic.twitter.com/Vpt8evRQFG— G7 News (@G7NEWSX) May 10, 2025ఇదిలా ఉండగా.. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, మిస్సైల్‌తో పాక్ దాడి చేయడంతో.. భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. పాకిస్తాన్‌లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్‌క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో భారత్ దాడులకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది.Pakistani airspace is reportedly closed again. A friend is stuck at Karachi Airport — complete blackout, no updates. Situation tense pic.twitter.com/tww6jVWSG2— Nasir (@khan_nasir19) May 9, 2025 So now it's in Karachi.. blasts are happening in air..Near old airport..#Pakistan #IndiaPakistanWar #PakistanZindabad pic.twitter.com/3gKbLY9lqn— Sarah Peracha (@sarahperacha) May 10, 2025 ఇక, రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భారత్‌పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. ఇక తాజాగా శనివారం తెల్లవారుజాము నుంచి పాక్ తిరిగి దాడులు చేయడంతో భారత్ తిప్పికొట్టింది. Seems so drones are being hit towards Karachi airport. Hug blasts heard towards Karachi airport. pic.twitter.com/ikFvyMHpsg— Nazim Abbas (@NazimAbbas_1) May 10, 2025 Visuals Coming From Karachi.کراچی Malir airport سے مناظر۔ pic.twitter.com/PgGmfsGY5M— The Awazaar Sain (@adeelzsiddiqui) May 10, 2025

ఏటీఎంల మూసివేత వదంతులు.. బ్యాంకుల స్పష్టత
భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఏటీఎంలను మూసివేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖండించాయి. ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో సజావుగానే పని చేస్తున్నాయని, వాటిలో తగినన్ని నగదు నిల్వలు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశాయి. డిజిటల్ సేవలు కూడా సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి.‘మా ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, డిజిటల్ సేవలు అన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి‘ అని ఎస్బీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ధ్రువీకరించుకోకుండా ఏ వార్తలను విశ్వసించొద్దంటూ కస్టమర్లకు సూచించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మొదలైనవి కూడా ఇదే తరహా మెసేజీలను పోస్ట్ చేశాయి.కాగా ఏటీఎంల మూసివేత అంటూ వచ్చిన వార్తా కథనాలను ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తనిఖీ చేసి అవి పూర్తిగా ఫేక్ అని తేల్చేసింది. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్వేర్ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి.

భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
చెన్నై: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న భారత సైన్యాన్ని విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తులను అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. చెంగల్పట్టు జిల్లా కాట్టాన్‌కొళత్తూర్ సమీపంలోని ఓ ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో లోరా అనే మహిళ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆమె.. సోషల్ మీడియా వేదికగా.. పోస్టులు పెట్టారు. ఆపరేషన్ సిందూర్, భారత సైన్యాన్ని విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్‌లో పోస్టులు పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమెను సస్పెండ్ చేస్తూ వర్సిటీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఆమె పోస్టులో.. బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో భారత్.. పాకిస్తాన్లో ఒక పిల్లవాడిని చంపేసింది. ఇద్దరు వ్యక్తులను గాయపరిచింది. మీ స్వంత రక్తదాహం కోసం, ఎన్నికల విన్యాసాల కోసం అమాయక ప్రాణాలను చంపడం ధైర్యం కాదు.. అది న్యాయం కాదు. ఇది పిరికి చర్య! అని ఆమె తన స్టేటస్‌లో రాసుకొచ్చారు. లాక్డౌన్లు, ఆహార కొరత వంటి అనిశ్చితుల గురించి కూడా ఆమె హెచ్చరించారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. Meet Lora S., an Assistant Professor at SRM Institute of Science & Technology.⁰In the wake of Operation Sindoor, she repeatedly posted anti-Army content on her social media.Is this what passes for academic responsibility at @SRM_Univ?She has now been suspended. pic.twitter.com/1pufrM7kSj— Rakesh M (@Fitsanatani) May 8, 2025

భారత్, పాక్ యుద్ధం.. దేశంలో 32 విమానాశ్రయాలు మూసివేత
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం వేళ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) కీలక ప్రకటన చేసింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలోని 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విమానాశ్రయాల వివరాలను వెల్లడించింది.వివరాల ప్రకారం.. ఉత్తర , పశ్చిమ భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో విమాన కార్యక్రమాలు నిలిపిపోయాయి. 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు AAI తెలిపింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం.. మే 8న తొలుత 24 విమానాశ్రయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 32 విమానాశ్రయాల్లో కార్యక్రమాలను నిలిపివేశారు.విమానాశ్రయాలు ఇవే..అమృత్సర్, చండీగఢ్, జైసల్మేర్, జమ్మూ, పటియాలా, పోర్బందర్, పఠాన్‌కోట్, అవంతిపూర్, బటిండా, భుజ్, బికానెర్, హల్వారా, అధమ్‌పూర్, అంబాలా, హిండన్, జామ్‌నగర్, జోధ్‌పూర్, కండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోద్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లుధియానా, ముంద్రా, నలియా, రాజ్‌కోట్ (హిరాసర్), సర్సావా, షిమ్లా, శ్రీనగర్, థోయిస్ , ఉత్తర్లై.ఈ పరిణామాల నేపథ్యంలో, ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ప్రభావిత ప్రాంతాలకు తమ విమానాలను రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్ , రాజ్కోట్లకు వెళ్లే , వచ్చే విమానాలను రద్దు చేసింది. ప్రయాణికులకు పూర్తి వాపసు లేదా ఒకసారి ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇండిగో కూడా NOTAM పరిధిలోకి వచ్చే అనేక నగరాలకు తమ సేవలను నిలిపివేసింది. ప్రయాణికులు తమ విమాన స్థితిని తెలుసుకోవడానికి, రీబుక్ చేసుకోవడానికి లేదా వాపసు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ లింక్‌లను అందుబాటులో ఉంచింది. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో, ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని విమానయాన సంస్థలు సూచించాయి. 🚨 India has shut 32 airports for civilian flight operations till May 15. (DGCA) pic.twitter.com/NHoABXPX6d— Indian Tech & Infra (@IndianTechGuide) May 10, 2025

IPL 2025: ధనాధన్‌గా దూసుకొచ్చారు
14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో కోట్లు కొల్లగొట్టిన బిహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ... బరిలోకి దిగిన మూడో మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీతో తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు! ప్రదాన ఆటగాళ్లంతా విఫలమవుతున్న చోట... నేనున్నానంటూ బాధ్యతలు భూజానికెత్తుకున్న 17 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఆడింది తక్కవ మ్యాచ్‌లే అయినా... చెన్నై భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు!పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు గుబులు పుట్టిస్తుంటే... ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అభిషేక్ పొరెల్ తన నిలకడతో ఆకట్టుకున్నాడు. తాజా ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న అన్క్యాప్డ్ ఓపెనర్లపై కథనం... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ వారం రోజులపాటు వాయిదా పడింది. ఇప్పటి వరకు 58 మ్యాచ్‌లు జరిగాయి. మరో 12 లీగ్ మ్యాచ్‌లు... ఆ తర్వాత 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. వారం రోజుల తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ఐపీఎల్ టోర్నీ ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో స్టార్ ఆటగాళ్లకంటే ఏమాత్రం అంచనాలు లేని యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. హేమాహేమీలతో పోటీపడుతూ... తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ముఖ్యంగా యువ ఓపెనర్ల జోరు ఎక్కువ కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్ రాయల్స్), ఆయుశ్ మాత్రే (చెన్నై సూపర్ కింగ్స్), అభిషేక్ పొరెల్ (ఢిల్లీ క్యాపిటల్స్)... ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ (పంజాబ్ కింగ్స్) ఈ కోవలోకే వస్తారు. టీమిండియా గడప తొక్కాలంటే... ఐపీఎల్లో రాణించడం తప్పనిసరిలా మారిపోయిన ప్రస్తుతం తరుణంలో ఈ సీజన్లో ఈ ఐదుగురు ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరి శైలి ఒక్కో రకం కాగా... అందరి లక్ష్యం భారీగా పరుగులు సాధించడమే. తాజా సీజన్లో అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు) ప్లేయర్లుగా బరిలోకి దిగి పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా విరుచుకుపడుతున్న ఈ యువతరం... భారత క్రికెట్ భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతోంది. ఆహా... ఆయుశ్ ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ మాత్రేకు అనూహ్యంగా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఈ యువ ఓపెనర్‌ను రూ. 30 లక్షలు ఇచ్చి జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే 15 బంతుల్లో 32 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం ఓపెనర్... బెంగళూరుతో మ్యాచ్‌లో 48 బంతుల్లో 94 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకపోవడం... బంతి తన పరిధిలో ఉంటే చాలు విరుచుకుపడటం ఆయుశ్ ప్రధాన అ్రస్తాలు. ఈ సీజన్లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆయుశ్ మెరుపులు పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే సాధారణ ఆటగాళ్లను సైతం మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దగల ధోని సారథ్యంలో మాత్రే భవిష్యత్తులో మరింత రాటుదేలడం ఖాయమే. మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 163 94 181.11అభిషేక్ అదుర్స్ఈ ఏడాది అంచనాలకు మించి రాణిస్తున్న ఆటగాళ్లలో అభిషేక్ పొరెల్ ఒకడు. గతేడాది ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచగా... దాన్ని పొరెల్ నిలబెట్టుకుంటున్నాడు. తాజా సీజన్లో సహచర ఓపెనర్లు నిలకడ కనబర్చలేకపోయినా... పొరెల్ మాత్రం ప్రభావం చూపాడు. 22 ఏళ్ల ఈ ఎడం చేతి వికెట్ కీపర్... కేఎల్ రాహుల్ తర్వాత ప్రస్తుతం ఢిల్లీ జట్టులో రెండో అత్యధిక స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. పేస్‌తో పాటు స్పిన్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగల పొరెల్ నైపుణ్యం అతడిని క్లాస్ ప్లేయర్ల జాబితాలో చేర్చుతుంది. బంతిపై మరీ పగబడినట్లు కాకుండా... సుతారాంగా అతడు కొట్టే షాట్లు క్రీడాభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. బ్యాటింగ్‌లో భళా అనిపించుకుంటున్న పొరెల్... స్ట్రయిక్ రొటేషన్ ప్రాధానత్యను అర్థం చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్న తీరు ముచ్చటేస్తోంది. మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 265 51 149.71వైభవ్ జ్వాలఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాది... తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మూడో మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెటే శ్వాసగా పెరిగిన ఈ బిహార్ ఎడంచేతి వాటం ఓపెనర్... గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన పోరులో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. రెండొందల పైచిలుకు లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవకుండా విరుచుకుపడి టి20ల్లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 94 పరుగుల వద్ద ఉండి కూడా ధైర్యంగా సిక్స్ కొట్టి మూడంకెల స్కోరు అందుకున్న ఈ కుర్రాడు. ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా... అతడిలో ప్రతిభకు కొదవలేదని మాత్రం నిరూపితమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాదిరిగా వైభవ్క కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంచనాల ఒత్తిడి దరి చేరనివ్వకుండా... నిలకడ కొనసాగిస్తే వీరిలో కొందరు ఆటగాళ్లు టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 5 155 101 209.45ఫటాఫట్.. ప్రభ్సిమ్రన్ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేస్తోంది అంటే... దాని ప్రధాన కారణాల్లో ఓపెనింగ్ జోడీ ప్రదర్శన ముఖ్యమైంది. ఒక ఎండ్‌లో ఆర్య అదరగొడుతుంటే... మరో ఎండ్ నుంచి ‘పిట్ట కొంచం కూత ఘనం’లాగా ప్రభ్‌సిమ్రన్ చెలరేగిపోతున్నాడు. ఫలితంగానే చాన్నాళ్ల తర్వాత పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ దిశగా సజావుగా సాగుతోంది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ శిక్షణ, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భయం లేకుండా ఆడుతున్న 24 ఏళ్ల ప్రభ్‌సిమ్రన్ సింగ్... జట్టు నమ్మదగ్గ ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయాడు. లక్నోపై 48 బంతుల్లోనే 91 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్... స్లో పిచ్‌పై కోల్‌కతా స్పిన్నర్లను ఎదుర్కొని 83 పరుగులు చేశాడు. పవర్‌ప్లేను పూర్తిగా వినియోగించుకుంటూ భారీగా పరుగులు రాబడుతున్న ఈ కుడి చేతి వాటం బ్యాటర్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు.మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 487 91 170.87ప్రియాన్ష్ ‘స్పెషల్ టాలెంట్’ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో ‘స్పెషల్ టాలెంట్’ అని ప్రశంసలు అందుకున్న 23 ఏళ్ళ ప్రియాన్ష్ ఆర్య... చెన్నైపై సెంచరీ బాది ప్రకంపనలు సృష్టించాడు. బంతిని నిశితంగా గమనించడంతో పాటు దాని వేగాని ప్రియాన్ష్ ఆర్య..కి అనుగుణంగా షాట్లను ఎంపిక చేసుకొని అప్పటికప్పుడు వాటిని అమలు చేయడంలో ప్రియాన్ష్ దిట్ట. ముల్లాన్‌పూర్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్ష్... ఇన్నింగ్స్‌ను పరిశీలిస్తే ఇది అవగతమవుతుంది.బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేని పిచ్‌పై ఆర్య అదరగొట్టి ఐపీఎల్లో ఐదో వేగవంతమైన శతకం (39 బంతుల్లో) చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన ఈ ఎడం చేతివాటం బ్యాటర్... ఫోర్ల కంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టడంలో సిద్ధహస్తుడు. అభిమానులు ముద్దుగా ‘లెఫ్ట్ హ్యాండ్ సెహ్వాగ్ ’ అని పిలుచుకుంటున్న ఆర్య... ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించడం... పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడుతుండటంతో... మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతోంది.మ్యాచ్‌లు పరుగులు అత్యధిక స్కోరు స్ట్రయిక్ రేట్ 12 417 103 194.85

వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత విషయంలో.. కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: జెడ్ ప్లస్ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సీఆర్పీఎఫ్ డీజీ, ఎన్ఎస్జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జెడ్ ప్లస్ భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించే విషయంలో తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర భద్రతా సంస్థలైన సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి వాదనలు విన్నారు. వైఎస్ జగన్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, నిర్దిష్ట ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా వైఎస్ జగన్‌కు ఉన్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపు చేసి జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. జగన్‌కు ఉన్న ప్రాణహానిని, ఆయనపై గతంలో జరిగిన హత్యాయత్నాన్ని పరిగణనలోకి తీసుకుని జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్ జగన్ భద్రతను భారీగా కుదించేశారని, ఇటీవల పలు సందర్భాల్లోనూ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని చెప్పారు. పర్యటనలు, పరామర్శలకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నాగిరెడ్డి వివరించారు. భద్రత విషయంలో వైఎస్ జగన్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు మళ్లీ పిటిషన్ వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు స్పందిస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు.

ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక
ఆపరేషన్ సిందూర్‌పై పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 'ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కును కూడా కొందరు తప్పుపడుతున్నారని, దానిని యుద్ధ దాహమంటూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆమె అన్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని రష్మిక (Rashmika) కోరారు."ఉగ్రవాదం నుంచి రక్షణ కోసం చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్ధతిచ్చే వారు యుద్ధోన్మాదులు కాదు. వారందరూ దేశ భద్రత, న్యాయం విలువైనవిగా భావించే పౌరులు. మేము శాంతిని కోరుకుంటాం.., అలా అని మాకు తలపెట్టిన హానిని అంగీకరించడానికి సిద్ధంగా ఎంతమాత్రం లేము. రెచ్చగొట్టే దురాక్రమణకు, ఆత్మ రక్షణకు మధ్య లోతైన నైతిక వ్యత్యాసం ఉంది. కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం మా దేశ బాధ్యతే అవుతుంది. అది ఎంతమాత్రం అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే మౌనంగా హానిని అంగీకరించడం కాదు. మాకు జరిగిన అన్యాయాన్ని బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు.. మీకు చేతనైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి. మా దేశ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను పంపుతున్న దేశాన్ని ప్రశ్నించండి.' అని రష్మిక రాసుకొచ్చారు.

Miss World 2025: అందాల పండగ నేడే షురూ
సాక్షి, హైదరాబాద్: అందాల పండుగకు అంతా సిద్ధమైంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచసుందరి పోటీలు శనివారం ప్రారంభం కాబోతున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్.. తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. పోటీల్లో 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారని భావించగా, ఇప్పటివరకు 111 మంది నగరానికి చేరుకున్నారు. శనివారం మరికొందరు వస్తారని అంచనా వేస్తున్నారు. ‘మిస్ వరల్డ్’కనుసన్నల్లో కార్యక్రమాలు మిస్ వరల్డ్ లిమిటెడ్ కనుసన్నల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం గత రెండు నెలల్లో పలుమార్లు నగరానికి వచ్చి ఇక్కడి పరిస్థితులు, వసతులను పరిశీలించిన మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే, పోటీల నిర్వహణపై సానుకూలంగా స్పందించారు. ఈ నెల 2న తేదీన.. నగరానికి చేరుకున్న ఆమె బృందం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో కార్యాలయాన్ని ప్రారంభించి.. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రారంభ వేడుకలకు సీఎం అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్నా, పోటీ దారులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పొల్గొనేందుకు నగరానికి చేరుకోవటం విశేషం. పదో తేదీతో ప్రారంభమయ్యే పోటీలు ఈనెల 31 వరకు కొనసాగనున్నాయి. 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో కూడా పాల్గొంటారా, లేదా.. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే ఎట్‌హోమ్ వరకే పరిమితమవుతారా అన్నది తేలాల్సి ఉంది. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ (2024) ఫైనల్ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి పోటీలు ఇండియాలోనే జరుగుతుండటం విశేషం. రాష్ట్ర గీతం ఆలాపనతో.. రాష్ట్ర గీతం ఆలాపనతో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా దీన్ని ప్రత్యక్షంగా ఆలపిస్తారు. అనంతరం కాకతీయుల కాలంలో రూపొందిందిన సంప్రదాయ నృత్యరీతి పేరిణి నాట్య ప్రదర్శన ఉంటుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. దీనికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఫణి నారాయణ స్వరాలు సమకూర్చనున్నారు. పది నిమిషాల పాటు ఈ నృత్య కార్యక్రమం కొనసాగనుంది. కళాకారులు అందరూ కలిసి తమ విన్యాసాలలో భాగంగా నక్షత్రం, సీతాకోకచిలుక, మిస్ వరల్డ్ లోగో ఆకృతులను ప్రదర్శిస్తారు. కళారూపాల ప్రదర్శనతో కంటెస్టెంట్ల పరిచయం ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమం ఖండాల వారీగా నిర్వహిస్తారు. ఆ సమయంలో తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత భద్రాచలం గోదావరి పరీవాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత కత్లే శ్రీధర్ బృందం నేతృత్వంలో ఆదిలాబాద్ గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన ఉంటుంది. అప్పుడు మరొక ఖండానికి సంబంధించిన సుందరీమణులు వేదిక పైకి వస్తారు.తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పు వాయిద్య కార్యక్రమాన్ని ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత అందె భాస్కర్ బృందం, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలను స్వప్న బృందం ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కూడా పోటీదారులను పరిచయం చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవి కుమార్ బృందం ఆధ్వర్యంలో ప్రదర్శిస్తారు. ఈ కళారూపాల అన్నింటి మేళవింపుతో ముగింపు ఉంటుంది. సంప్రదాయ స్వాగతానికి మురిసిపోతూ.. ఈనెల మూడో తేదీ మొదలు నిత్యం సుందరీమ ణులు నగరానికి వస్తూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ తిలకం దిద్ది, హారతి ఇస్తూ, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్ నృత్యరీతులు ప్రదర్శిస్తూ.. డప్పు వాయిద్యాలు, బాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాలతో కూడిన బృందాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈకార్యక్రమాలు 24 గంటల పాటు కొనసాగుతున్నాయి. దీనిని విదేశీ అతిథులు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తుండటం గమనార్హం.

కాస్మోస్ 482’ కూలిపోయే సమయం వచ్చేసింది..!
నాటి సోవియట్ యూనియన్ 53 ఏళ్ల క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ శనివారం భూమ్మీద కూలబోతోంది. వాస్తవానికి ఇది శుక్ర గ్రహాన్ని పరిశోధించేందుకు సోవియట్ 1972లో ప్రయోగించిన ఓ ల్యాండర్ మాడ్యూల్. సాంకేతిక లోపం కారణంగా ఆ ప్రయోగం విఫలమై గత అర్ధ శతాబ్ద కాలానికి పైబడి ‘కాస్మోస్ 482’ వ్యోమనౌక భూమి దిగువ కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. గుండ్రటి ఆకృతిలో ఉన్న ఈ వ్యోమనౌక బరువు 495 కిలోలు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:46 గంటల సమయంలో అది గంటకు 242 కిలోమీటర్ల వేగంతో భూమిపై కూలుతుందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) అంచనా వేసింది. భూమిపై 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య గల సువిశాల ప్రదేశంలో అటు బ్రిటన్ మొదలుకొని ఇటు ఆస్ట్రేలియా వరకు అది ఎక్కడైనా కూలిపోవచ్చని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, పీడనం పరంగా భూమి వాతావరణంతో పోలిస్తే శుక్ర గ్రహంపై కఠినాతి కఠిన పరిస్థితులు ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని శుక్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగేలా ‘కాస్మోస్ 482’ను ప్రత్యేకంగా డిజైన్ చేసి, టైటానియం ఉష్ణరక్షణ కవచంలో ఉంచి ప్రయోగించారు. అందువల్ల భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పటికీ ఇతర అంతరిక్ష నౌకలు, ఖగోళ వస్తువుల మాదిరిగా ‘కాస్మోస్ 482’ గాలి ఒరిపిడికి మండిపోయి శకలాలుగా రాలిపోదని, ‘ఫిరంగి గుండు’ మాదిరిగా ‘ఒకే ముక్క’గా చెక్కు చెదరకుండా భూమిపై కూలుతుందని భావిస్తున్నారు. ఫలితంగా రోదసి నుంచి భూమిపై కూలిపోయే ఇతర వ్యర్థాలతో పోలిస్తే ఈ స్పేస్ క్రాఫ్ట్ పతనం వల్ల తలెత్తే ప్రమాదం తక్కువేనని అంటున్నారు. శుక్రుడిపై దిగే సమయంలో ‘కాస్మోస్ 482’ వేగాన్ని తగ్గించడానికి పారాచూట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అయితే 50 ఏళ్లకు పైగా నౌక అంతరిక్షంలోనే ఉండిపోయినందున సౌర వికిరణం ప్రభావానికి ఆ పారాచూట్ వ్యవస్థ పాడైపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒమన్ సింధుశాఖ, ఈశాన్య ఆఫ్రికా, బోర్నియో, పశ్చిమార్ధ గోళంలోని ప్రదేశాల్లో వ్యోమనౌక కూలవచ్చని, అయితే భూమిపై సముద్ర ప్రాంతాలతో కూడిన జలావరణమే 70% ఉంది కనుక జనావాస ప్రాంతాల్లో అది కూలే అవకాశాలు స్వల్పమని భావిస్తున్నారు. ఇక అది నేరుగా ఒక వ్యక్తిపై పడే సంభావ్యత వేలు, లక్షల వంతుల్లో ఒక శాతం వంతు మాత్రమే. 1961-1984 మధ్య కాలంలో నాటి సోవియట్ తన ‘వెనెరా మిషన్స్’లో భాగంగా శుక్ర గ్రహంపైకి 29 అంతరిక్ష నౌకలను ప్రయోగించగా 10 వ్యోమనౌకలు శుక్రుడిపై విజయవంతంగా దిగాయి. - జమ్ముల శ్రీకాంత్
కుక్క కరిచిందని.. ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు
Miss World 2025: గ్రాండ్ ఫ్యాషన్ ఫెస్ట్..
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
ఐటీఆర్ దాఖలుకు 5 ప్రధాన అంశాలు
సైఫ్ అలీఖాన్ కత్తిపోటు కేసు.. బెయిల్ వద్దంటూ పోలీసులపై నిందితుడి ఆరోపణలు
స్టాక్ మార్కెట్లో మరో కొత్త ఇండెక్స్
భారత్, పాక్ యుద్ధం.. దేశంలో 32 విమానాశ్రయాలు మూసివేత
ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..
మానవత్వానికి పట్టం.. సేవ కీరీటం..
'ఆపరేషన్ సిందూర్' సినిమా పోస్టర్ విడుదల.. వెనక్కి తగ్గిన రిలయన్స్
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
చల్లని కబురు
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
కుక్క కరిచిందని.. ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు
Miss World 2025: గ్రాండ్ ఫ్యాషన్ ఫెస్ట్..
భారత సైన్యంపై విమర్శలు.. మహిళా ప్రొఫెసర్ సస్పెండ్
ఐటీఆర్ దాఖలుకు 5 ప్రధాన అంశాలు
సైఫ్ అలీఖాన్ కత్తిపోటు కేసు.. బెయిల్ వద్దంటూ పోలీసులపై నిందితుడి ఆరోపణలు
స్టాక్ మార్కెట్లో మరో కొత్త ఇండెక్స్
భారత్, పాక్ యుద్ధం.. దేశంలో 32 విమానాశ్రయాలు మూసివేత
ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..
మానవత్వానికి పట్టం.. సేవ కీరీటం..
'ఆపరేషన్ సిందూర్' సినిమా పోస్టర్ విడుదల.. వెనక్కి తగ్గిన రిలయన్స్
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
చల్లని కబురు
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
సినిమా

సురేఖావాణి బర్త్ డే సెలబ్రేషన్స్.. మంచు లక్ష్మీ న్యూ అవతార్
నటి సురేఖావాణి బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోఫన్నీ వింత పోజుల్లో హాట్ బ్యూటీ కేతిక శర్మహాట్ పోజులతో షాకిచ్చిన మంచు లక్ష్మీహిట్ 3 జ్ఞాపకాలు.. నానితో కోమలి ప్రసాద్బెల్లీ డ్యాన్స్ తో ఆకట్టుకున్న ముమైత్ ఖాన్మత్తెక్కించేలా మారిపోయిన కన్నడ బ్యూటీ శాన్వీపొలిమేర బ్యూటీ కామాక్షి స్విమ్ సూట్ పోజులు View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul)

'సలార్' సంగీత దర్శకుడి పీరియాడిక్ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
కేజీఎఫ్, సలార్ సినిమాలకు సంగీతమందించి గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్.. ఇప్పుడు ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. వీరచంద్రహాస పేరుతో కన్నడలో తెరకెక్కించాడు. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన యక్షగానం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించాడు.అంతరించిపోతున్న యక్షగానం కథతో తీసిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. పీరియాడికల్ సెటప్ అయితే ఉంది గానీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారా లేదా అనేది చూడాలి. ట్రైలర్ చూస్తే సమ్ థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటిస్తారు.వీరచంద్రహాస, తెలుగు ట్రైలర్, రవి బస్రూర్, మూవీ న్యూస్

కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్
తమిళ హీరో జయం రవి.. భార్య ఆర్తికి గతేడాది విడాకులు ఇచ్చేశాడు. దాదాపు 18 ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. కెన్నీషా అనే సింగర్ తో సదరు హీరో డేటింగ్ చేస్తున్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి పెళ్లి జరగ్గా.. జయం రవి కెన్నీషాతో కలిసి జంటగా వచ్చాడు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) ఉదయం నుంచి జయం రవి-కెన్నీషా కలిసున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఈ టైంలో మాజీ భార్య ఆర్తి చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనని ఇంటి నుంచి తరిమేశారని, జయం రవికి అసలు పిల్లలు బాధ్యత అనేదే లేదని ఆవేదన వ్యక్తం చేసింది.'ఏడాది పాటు మౌనాన్ని కవచంలా మోస్తున్నాను. నా కొడుకులు ప్రశాంతంగా ఉండాలి కాబట్టే ఇవన్నీ భరిస్తున్నాను. నాపై లేనిపోని ఆరోపణలు చాలా చేశావ్. అయినా సరే నేను నోరు మెదపలేదు. ఎందుకంటే నా కొడుకులు.. తల్లిదండ్రులు విడిపోయారనే బాధని అనుభవించకూడదు కాబట్టి. అంతే తప్ప నా దగ్గర నిజం లేదని కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఫొటోలు చూస్తోంది. కానీ మా మధ్యలో జరిగింది వేరు. విడాకుల ప్రక్రియ ఇంకా నడుస్తోంది. నాతో పాటు 18 ఏళ్లు సంసారం చేసిన వ్యక్తి.. ప్రేమ, నమ్మకంతో పాటు ప్రామిస్ చేసిన ప్రతి బాధ్యతని పక్కనబెట్టి నన్ను వదిలి వెళ్లిపోయాడు. నా బాధ్యత అని చెప్పిన ఆ వ్యక్తి.. నాకు ఆర్థికంగా అండగా నిలబడం, మాట సాయం గానీ చేయట్లేదు''ప్రస్తుతం మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. నాతో కలిసి ఇదే ఇంటిని నిర్మించిన సదరు వ్యక్తి.. బ్యాంక్ అధికారులతో కలిసి నేను బయటకు వెళ్లిపోయేలా చేశాడు. నేను డబ్బుల కోసమే ఈ విడాకుల డ్రామా ఆడుతున్నానని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎప్పుడో నా స్వార్థం చూసుకునేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ప్రేమని పంచాను. నమ్మకం చూపించాను. ఇప్పుడదే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది''ప్రేమించినందుకు పశ్చాత్తాపపడట్లేదు గానీ దాన్ని ఓ బలహీనతలా ఉపయోగించుకున్నందుకు బాధపడుతున్నాను. నా కొడుకుల వయసు 10, 14 ఏళ్లు. వాళ్లకు ఇప్పుడు కావాల్సింది భద్రత.. షాక్ కాదు, నిశ్బబ్దం కాదు. ఈ చట్టాల గురించి అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు వాళ్లు. సమాధానం లేని కాల్స్, రద్దయిన మీటింగ్స్.. ఇవన్నీ నాకు తగిలిన గాయాలు. నేను ఈరోజు మాట్లాడేది భార్యగా కాదు. అలా అని స్త్రీకి అన్యాయం చేసిన దానిలా కూడా కాదు. పిల్లల శ్రేయస్సు కోసం ఆలోచించే తల్లిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతాను''నువ్వు ఏమైనా చేయొచ్చు గానీ నిజాన్ని తిరిగి రాయలేవు కదా. తండ్రి అంటే టైటిల్ కాదు అదో బాధ్యత. మా విడాకుల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నా పేరు వెనక రవి అని ఉంటుంది. మీడియా వాళ్లకు చెప్పేదేంటంటే నన్ను మాజీ భార్య అని సంభోదించొద్దు. మేం ఇంకా లీగల్ గా విడాకులు తీసుకోలేదు. ప్రతికారమో మరేదో కాదు,పిల్లల్ని కాపాడే తల్లిగా ఇది నా బాధ్యత. నేను ఏడవను. గట్టిగా అరిచి గోలపెట్టను. కానీ బలంగా నిలబడతా. నిన్ను ఇంకా నాన్న అని పిలుస్తున్న ఇద్దరబ్బాయిల కోసం నేను అస్సలు తగ్గను' అని ఆర్తి రవి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)

భారత సైన్యానికి హీరో విజయ్ దేవరకొండ విరాళం
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత సైన్యానికి పలువురు విరాళాలు ఇస్తున్నారు. తన వంతు బాధ్యతగా ఇప్పుడు విజయ్ కూడా విరాళం ప్రకటించాడు.(ఇదీ చదవండి: మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే) రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాని భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు విజయ్ దేవరకొండ చెప్పాడు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రమోషన్ అసలు చేస్తారా లేదా? సినిమా విడుదల కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) This year, @TheDeverakonda's birthday is more than a celebration - it’s about giving back.Spot the Deverakonda Birthday Truck in your city and grab a free ice cream!And for the next few weeks, a portion of all #RWDY proceeds will go to the Indian Armed Forces.Jai Hind.… pic.twitter.com/al65L0NWum— Suresh PRO (@SureshPRO_) May 9, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం
క్రీడలు

మేమంతా మీ వెంటే...
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం దుశ్చర్యలను తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎదుర్కొంటున్న భారత త్రివిధ దళాలకు క్రీడా దిగ్గజాలు మద్దతు పలికారు. క్రికెట్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా చాంపియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులు దేశ ప్రజల సంరక్షణ కోసం పగలనక... రాత్రనక శ్రమిస్తున్న సాయుధ బలగాల ధైర్యానికి సెల్యూట్ చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న భారత సేనల ధైర్య సాహసాల్ని స్టార్లంతా కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా తామంతా సైన్యం వెంటే అని స్థయిర్యం పెంచారు. దేశ రక్షణే లక్ష్యంగా శ్రమిస్తోన్న భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను చూసి గర్వపడుతున్నా. త్రివిధ దళాలు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఈ పోరాటయోధుల వల్లే భారత్ తలెత్తుకొని నిలబడుతోంది. దేశం కోసం అహరి్నశలు శ్రమించే మీ వెంటే జాతి మొత్తం నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగాలి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని విజ్ఞప్తి. –భారత కెప్టెన్ రోహిత్ శర్మసాయుధ బలగాలకు నా సలామ్. ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా ఎదురునిలిచి దేశాన్ని కాపాడే మన వీరుల ధైర్యసాహసాలకు జేజేలు పలుకుతున్నాం. భారత్ కోసం మీరు, మీ కుటుంబసభ్యులు చేసే త్యాగాలకు మేమంతా రుణపడే ఉంటాం. –విరాట్ కోహ్లి ఉగ్రవాదులను హతమార్చితే మౌనంగా ఉండాల్సిన చోట పాక్ యుద్ధాన్ని ఎంచుకొని తమ వక్రబుద్ధిని మరోమారు చూపింది. దీనికి తగిన గుణపాఠం మా సైన్యం మీకు నేర్పుతుంది. ఆ పాఠమెలా ఉంటుందంటే జీవితంలో మీరెప్పుడు మర్చిపోరు. –వీరేంద్ర సెహ్వాగ్ టెర్రరిజంపై పోరాటం... దేశ రక్షణకోసం మీరు కనబరిచే సాహసాలు మాకెంతో గర్వకారణం. సరిహద్దుల్లో మీరున్నారనే ధైర్యమే దేశాన్ని ధీమాగా నడిపిస్తోంది.–నీరజ్ చోప్రాభారత దళాలు చూపే ధైర్యం, క్రమశిక్షణ, త్యాగాలే దేశానికి బలం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించి మన పతకాన్ని రెపరెపలాడించిన మీ నిస్వార్థసేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. జై హింద్. –పీవీ సింధు

‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా
న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ టోర్నమెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న బెంగళూరు వేదికగా ఈ మీట్ జరగాల్సి ఉండగా... భారత్, పాక్ దాడుల నేపథ్యంలో టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం నీరజ్ చోప్రా వెల్లడించాడు. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ తొలి ఎడిషన్‌ను వాయిదా వేశాం. ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, భాగస్వాముల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే తదుపరి కార్యచరణ వెల్లడిస్తాం. ఈ క్లిష్ట సమయంలో దేశంతో దృఢంగా నిలబడటం చాలా ముఖ్యం. ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో భద్రతా బలగాలు పోరాడుతున్నాయి. మేమంతా వారి వెంటే. జై హింద్’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.

భారత సైన్యానికి సెల్యూట్.. ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము: విరాట్ కోహ్లి
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ద వాతవారణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ రూపంలో భారత్ బదులు తీర్చుకుంది. భారత సైన్యం వరుసగా రెండు రోజుల పాటు పాకిస్తాన్, పాక్తిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేస్తూ వంది మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాకిస్తాన్ ప్రతిదాడులకు కూడా భారత సాయుద బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తమ దేశభక్తి చాటుకున్నారు."ఈ క్లిష్ట సమయాల్లో దేశాన్ని కాపాడుతున్న మన సాయుధ దళాలకు సెల్యూట్. సైన్యం ధైర్యసాహసాలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు" కోహ్లి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కోహ్లి ఈ పోస్ట్ చేసిన గంటలోనే 34 లక్షల మంది లైక్ చేస్తూ ఈ పోస్టును షేర్ చేయడం విశేషం.భారత త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ తీసుకునే ప్రతీ నిర్ణయం మనల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. మన యోధులు మన దేశ గౌరవానికి అండగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండాలి. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా, నమ్మకుండా ఉండాలి. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

పాకిస్తాన్‌కు భారీ షాక్.. పీఎస్ఎల్ నిర్వహణకు యూఏఈ నో?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని భావించిన పాక్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ తగిలింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పీసీబీ అభ్యర్ధను తిరష్కరించినట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ సిద్దంగా లేనట్లు సమాచారం. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని పీసీబీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి."బీసీసీఐతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2021, ఐపీఎల్ ఎడిషన్లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈలోనే ఆడింది. యూఈఏలో చాలా మంది క్రికెట్ అభిమానులు దక్షిణాసియా నుంచే ఉన్నారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పీఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇరు దేశాల మైత్రి దెబ్బతింటుంది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పీఎస్ఎల్ను నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సిద్దంగా లేదని" క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రావాల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరగడంతో పీఎస్ఎల్-2025 సీజన్‌ను పీసీబీ వాయిదా వేసింది.
బిజినెస్

ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.24,269 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించింది. మార్చి నెలలో వచ్చిన పెట్టుబడులు రూ.25,082 కోట్లతో పోల్చి చూస్తే 3 శాతం క్షీణించి రూ.24,269 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ఈక్విటీ మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ పెట్టుబడులు తగ్గడం గమనార్హం. ఏప్రిల్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 3.65 శాతం, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 3.46 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఏప్రిల్ నెలలో వచ్చిన పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. ఈ మేరకు ఏప్రిల్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నెలవారీ పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. అయినప్పటికీ ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 50వ నెలలోనూ నికర సానుకూల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రాక తగ్గడం అన్నది యూఎస్ టారిఫ్‌ల పట్ల అనిశి్చతి, డెట్, హైబ్రిడ్ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వడం కారణమని ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పుంజ్ తెలిపారు. సిప్ పెట్టుబడులు రూ.26,632 కోట్లు ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల కోసం చేసే సిప్ పెట్టుబడులు ఏప్రిల్ నెలలో రూ.26,632 కోట్లుగా ఉన్నాయి. ఒక నెలలో సిప్ గరిష్ట పెట్టుబడులు ఇదే ప్రథమం. మార్చి నెలలో సిప్ పెట్టుబడులు రూ.25,926 కోట్లతో పోల్చి చూస్తే 3 శాతం పెరిగాయి. ఏప్రిల్‌లో కొత్తగా 46.01 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. మార్చిలో కొత్త సిప్ ఖాతాలు 40.18 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 8.38 కోట్లకు చేరాయి. సిప్ నిర్వహణ ఆస్తుల విలువ మార్చి చివరికి రూ.13.35 లక్షల కోట్లుగా ఉంటే, ఏప్రిల్ చివరికి రూ.13.89 లక్షల కోట్లకు పెరిగింది. ‘‘ఏప్రిల్‌లో సిప్ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టం అయిన రూ.26,632 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్‌ను క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాల పొదుపు సాధనంగా ఇన్వెస్టర్లు పరిగణిస్తుండడం వల్లే పెట్టుబడులు ఇలా క్రమంగా పెరుగుతున్నాయి’’అని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. అన్ని మారెŠక్ట్ సైకిల్స్‌లోనూ పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న ప్రాధాన్యం పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతున్నట్టు చెప్పారు. విభాగాల వారీ పెట్టుబడులు → ఏప్రిల్‌లో డెట్ ఫండ్స్‌లోకి మొత్తంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరణతో పోలి్చతే సీన్ రివర్స్ అయింది. → డెట్‌లోని మొత్తం 16 విభాగాలకు గాను 12 రకాల పథకాల్లోకి పెట్టుబడులు సానుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా రూ.1.18 లక్షల కోట్లు లిక్విడ్ ఫండ్స్‌లోకే వచ్చాయి. → మొత్తం మీద అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఏప్రిల్‌లో రూ.2.77 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.1.64 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. → దీంతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల (అన్ని విభాగాలు సహా) విలువ ఏప్రిల్ చివరికి రూ.70 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరికి ఇది రూ.65.74 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ పథకాల్లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.29,303 కోట్లు, జనవరిలో రూ.39,688 కోట్లు, 2024 డిసెంబర్లో రూ.41,156 కోట్ల చొప్పున వచ్చాయి. → ఈక్విటీ విభాగంలో ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అత్యధికంగా రూ.5,542 కోట్ల పెట్టుబడులను ఏప్రిల్‌లో ఆకర్షించాయి. → మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు ఆదరణ కొనసాగింది. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,314 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,000 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,671 కోట్లు వచ్చాయి. మార్చి నెలలో ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.2,479 కోట్లుగా ఉన్నాయి. → హైబ్రిడ్ ఫండ్స్ రూ.14,247 కోట్లను ఆకర్షించాయి. మార్చి నెలలో ఈ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.946 కోట్లను ఉపసంహరించుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలుగోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చిలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.77 కోట్లకు వెనక్కి తీసుకోవడం గమనార్హం. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులు నిలిపివేయడంతోపాటు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది.

స్టార్టప్‌లకు మరింత సాయం
న్యూఢిల్లీ: ‘క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’ (సీజీఎస్) సవరణతో స్టార్టప్‌లకు రుణ వితరణ సులభతరం అవుతుందని.. పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) మరింత ఆర్థిక సాయం లభిస్తుందని, గొప్ప టెక్నాలజీ ఆవిష్కరణకు ఊతం లభిస్తుందని కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) పేర్కొంది. సవరించిన సీజీఎస్ఎస్కు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో ఒక్కో స్టార్టప్‌కు హామీతో కూడిన రుణ వితరణ పరిమితి రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరిగింది. ఇదంతా కూడా హామీలేని రుణమే. ‘‘ఈ పథకం విస్తరణతో స్టార్టప్‌లకు రుణ వితరణ రిస్‌్కలు మరింత తగ్గుతాయి. ఆర్అండ్డీ, ప్రయోగాలు, అత్యాధునిక ఆవిష్కరణలు, సాంకేతికతలను సృష్టించడానికి కావాల్సిన ఆర్థిక మద్దతు లభిస్తుంది’’అని డీపీఐఐటీ ప్రకటించింది. స్టార్టప్‌కు ఇచ్చే రుణాలు రూ.10 కోట్ల వరకు ఉంటే వాటికి ప్రభుత్వ హామీ 85 శాతంగా, అంతకుమించిన రుణాలకు 75 శాతంగా ఉంటుందని తెలిపింది. దేశంలో స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా 2016 జనవరి 16న కేంద్రం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిందే. ఇందులో భాగంగానే 2022 అక్టోబర్ 6న సీజీఎస్ఎస్ పథకాన్ని తీసుకొచి్చంది. స్టార్టప్‌లకు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్బీఎఫ్సీలు మంజూరు చేసే రుణ సదుపాయాలకు నిర్దేశిత మేర ప్రభుత్వం హామీ కల్పించింది. ఈ ఏడాది జనవరి నాటికి 1.61 లక్షల స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించడం గమనార్హం.

స్పెక్ట్రం చార్జీ @ 4 శాతం ఆదాయం
న్యూఢిల్లీ: స్టార్లింక్లాంటి శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) కంపెనీలు అడుగుతున్న దానికంటే అధిక స్థాయిలో స్పెక్ట్రం చార్జీలు విధించేలా కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులు చేసింది. కంపెనీల సవరించిన ఆదాయాల్లో (ఏజీఆర్) 4 శాతాన్ని చార్జీగా నిర్ణయించాలని పేర్కొంది. ప్రతి మెగాహెట్జ్‌కి వార్షికంగా విధించే రూ. 3,500 స్పెక్ట్రం చార్జీకి ఇది అదనంగా ఉంటుంది. ఇక, పట్టణ ప్రాంతాల్లో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సరీ్వసులు అందించే ఆపరేటర్లు, ప్రతి యూజరుపై అదనంగా ఏటా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు మాత్రం అదనంగా చార్జీలేమీ ఉండవు. టెలికం శాఖకు (డాట్) ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. స్పెక్ట్రంను కంపెనీలకు అయిదేళ్ల పాటు కేటాయించాలని, ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించాలని ట్రాయ్ సూచించింది. శాట్‌కామ్ సరీ్వసులు ప్రారంభమైతే టెలికం నెట్‌వర్క్‌లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. శాట్‌కామ్ కంపెనీలు అభ్యరి్ధస్తున్న రేటు కంటే ట్రాయ్ సిఫార్సు చేసిన చార్జీలు గణనీయంగా అధికంగా ఉండటం గమనార్హం. స్పెక్ట్రం చార్జీని ఏజీఆర్‌లో 1 శాతం కన్నా తక్కువగానే ఉంచాలని, అదనంగా చార్జీలేమీ విధించొద్దని ట్రాయ్‌తో సంప్రదింపుల సందర్భంగా స్టార్‌లింక్, అమెజాన్‌కి చెందిన క్విపర్ సిస్టమ్స్ కోరాయి. ఎయిర్టెల్ భాగస్వామిగా ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో ప్లాట్‌ఫామ్స్‌కు ఇప్పటికే శాట్‌కామ్ సేవల లైసెన్సులు లభించాయి. స్టార్‌లింక్ తుది లైసెన్సు తీసుకునే దశలో ఉంది.

అంచనాలు మించిన చైనా ఎగుమతులు
బీజింగ్: అమెరికా భారీ టారిఫ్‌లతో బాదేసినా, ఎగుమతుల పరంగా చైనా తన బలాన్ని చాటుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అంచనాలకు మించి ఎగుమతులు నమోదు చేసింది. ఏప్రిల్ నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 8.1 శాతం వృద్ధితో 315.69 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాకు ఎగుమతులు 21 శాతం తగ్గినప్పటికీ, చైనా ఎగుమతుల్లో సానుకూల వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఏప్రిల్ నెలలో చైనా ఎగుమతులు కేవలం 2 శాతమే పెరగొచ్చన్నది విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇక ఈ ఏడాది మార్చి నెలలో చైనా ఎగుమతుల్లో వృద్ధి 12.4 శాతంతో పోల్చి చూసినప్పుడు ఏప్రిల్‌లో కొంత నిదానించినట్టు తెలుస్తోంది. చైనా దిగుమతులు 0.2 శాతం తగ్గాయి. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా 145 శాతానికి పెంచడం తెలిసిందే. దీనికి ప్రతిగా అమెరికా ఎగుమతి చేసే వాటిపై 125 శాతం టారిఫ్‌లను చైనా అమలు చేస్తోంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో యూఎస్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చలు జరగడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఈ డేటా విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. యూఎస్‌తో తగ్గిన వాణిజ్య మిగులు అమెరికాతో చైనాకి వాణిజ్య మిగులు 2024 ఏప్రిల్ నాటికి 27.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2025 ఏప్రిల్ నాటికి 20.5 బిలియన్ డాలర్లకు తగ్గింది. గడిచిన నాలుగు నెలల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 2.5 శాతం క్షీణించాయి. అదే సమయంలో యూఎస్ నుంచి దిగుమతులు 4.7 శాతం తగ్గాయి. అమెరికాకు ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకోవడం ద్వారా ఏప్రిల్‌లో వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. దక్షిణాసియా దేశాలకు చైనా ఎగుమతులు ఏప్రిల్‌లో 11.5 శాతం పెరిగాయి. లాటిన్ అమెరికాకు 11.5 శాతం, భారత్‌కు విలువ పరంగా 16 శాతం చొప్పున పెరిగాయి. ఆఫ్రికాకు సైతం 15 శాతం, వియత్నాంకు 18 శాతం, థాయిలాండ్‌కు 20 శాతం చొప్పున ఎగిశాయి. చైనా ఎగుమతుల వృద్ధి ఆర్థిక విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఎగుమతుల డేటా ఆశ్చర్యకరంగా ఉందని, తన అంచనా 2–3 శాతం మించి వృద్ధి నమోదైనట్టు సీనియర్ చైనా ఆర్థికవేత్త (ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్) షు టియాంచెన్ తెలిపారు. యూఎస్ టారిఫ్‌ల పూర్తి ప్రభావం డేటాలో ఇంకా ప్రతిఫలించనట్టు ఉందన్నారు. యూరేషియా గ్రూప్‌లో చైనా డైరెక్టర్‌గా ఉన్న డాన్ వాంగ్ సైతం బలమైన ఎగుమలు వృద్ధిని ఊహించలేదన్నారు. చైనా సోలార్ గ్లాస్‌పై యాంటీ డంపింగ్ సుంకాలు అయిదేళ్ల పాటు అమల్లో న్యూఢిల్లీ: చైనా, వియత్నాం నుంచి దిగుమతయ్యే నిర్దిష్ట రకం సోలార్ గ్లాస్‌పై టన్నుకు 570 డాలర్ల నుంచి 664 డాలర్ల వరకు యాంటీ–డంపింగ్ సుంకాలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇవి అయిదేళ్ల పాటు అమల్లో ఉంటాయని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ రెండు దేశాల నుంచి చౌకగా దిగుమతయ్యే ఉత్పత్తుల నుంచి దేశీ తయారీ సంస్థలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సోలార్ ప్యానెల్స్‌లో ఉపయోగించే ఈ తరహా గాజును సోలార్ గ్లాస్, సోలార్ పీవీ గ్లాస్ తదితర పేర్లతో వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో చైనా, వియత్నాం నుంచి ఈ గ్లాస్ దిగుమతులు గణనీయంగా పెరిగినట్లు వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్), దేశీ పరిశ్రమ తరఫున నిర్వహించిన విచారణలో వెల్లడైంది. డీజీటీఆర్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సుంకాల విధింపు నిర్ణయం తీసుకుంది.
ఫ్యామిలీ

'54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో బదులిచ్చింది. దీంతో పాకిస్తాన్ యుద్ధానికి కాలుదువ్వుతూ ..పౌర లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. రాజస్థాన్ నుంచి కశ్మీర్ దాకా సరిహద్దుల వెంబడి పాక్ చేసిన దాడులన్నింటినీ భారత్ పూర్తిస్థాయిలో తిప్పికొట్టింది. అంతేగాదు దాడుల ధాటికి ప్రధాని షహబాజ్ షరీఫ్ బంకర్లో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇరుదేశాల నడుమ తీవ్ర యుద్ధ వాతావరణం తలపిస్తోంది. ఈ నేపథ్యంలో దాయాది దేశం పాక్ గతంలో భారత్‌తో యుద్ధానికి దిగినప్పడు..భారత్ దేశభక్తిని చాటేలా ఎలా ఐక్యతగా వ్యవహరించి చక్కబెట్టిందో తెలుసుకుందామా. ఆ సమయంలో ఉన్న నాటి ప్రధానులు ఎలాంటి నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపించారు తదితర విశేషాలు చూద్దామా..!భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు వినగానే కళ్ల ముందు ఆ నాయకుడి అసామాన్య ధైర్యసాహసాలు కదలాడతాయి. భారతదేశ ప్రయోజనాల కోసం ఉత్తేజకరమైన పదాలతో ఇచ్చే ఉపన్యాసాలు అందర్నీ ప్రభావితం చేసేలా ధైర్యాన్ని నింపుతాయి. ఆయన చాలా డేరింగ్‌గా పోఖ్రాన్-II అణు పరీక్షలకు అధికారం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. దాంతోనే దశాబ్దాలుగా అణ్వాయుధ పరీక్షలపై ఉన్న తాత్కాలిక నిషేధానికి ముగింపు పలికారు. అందువల్లే ఇప్పుడు భారతదేశం అణ్వాయుధ దేశంగా మారింది.నాటి అమెరికా అధ్యక్షుడుకి రహస్య లేఖ..1999 కార్గిల్ యుద్ధం సమయంలో, వాజ్‌పేయి అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు ఒక ‘రహస్య లేఖ’ పంపారు. అయితే క్లింటన్ ఆ సమయంలో జెనీవాలో ఉన్నారు. దాంతో ఆ సందేశాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు శామ్యూల్ ఆర్.శాడీ బెర్గర్ అందుకున్నారు. ఆ లేఖలో వాజ్‌పేయి వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతంలోని భారత స్థావరాలను స్వాధీనం చేసుకున్న దళాలను వెనక్కి తీసుకోకపోతే భారతదేశం పాకిస్తాన్‌పై దాడి చేయాల్సి వస్తుందని వాజ్‌పేయి హెచ్చరించారు. అయితే అందుకు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భారతదేశంపై అణు దాడి చేస్తామని బెదిరింపులకు దిగినట్లు అమెరికా తెలియజేసింది భారత్‌కి. అంతే మాజీ ప్రధాని వాజ్‌పేయి దానికి ఇలా సమాధానం ఇచ్చారు. తాను 25% భారతీయులను కోల్పోవడానికి సిద్ధమే..కానీ పాకిస్తాన్ మరుసటి రోజు సూర్యుడిని చూడదని మీకు హామీ ఇస్తున్నా అని తేల్చి చెప్పారు. ఇక ఆ కార్గిల్ యుద్ధంలో జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లోని పర్వతాలను పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ క్రమంలో ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదులను తరిమికొట్టి భారత్ ఈ యుద్ధంలో గట్టి విజయం సాదించింది. 1999 మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై వరకు జరిగింది.అధికారం లేకపోయినా..1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో, వాజ్‌పేయి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు రాజకీయాలు ముఖ్యం కావని ఘంటాపథంగా చెప్పేవారు. నిజానికి ఆ సమయంలో వాజ్‌పేయి జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ తర్వాత ఆ జనసంఘ కాలక్రమంలో భారతీయ జనతా పార్టీ (BJP)గా, ప్రముఖ ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడూ..ఐక్యతకు పెద్దపీటవేసిన మహోన్నత వ్యక్తి. మొదటి యుద్ధం టైంలో గుండెల్ని తాకే ప్రసంగం..పార్లమెంటులో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగం చూస్తే.. నరనరాల్లోనూ దేశభక్తి ఉప్పొంగిలే..ఉంటుంది. ఆ హిందీ ప్రసంగం అనువాదం.."మనం అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాము. అగ్ని నుంచి బంగారం శుద్ధి చేయబడి బయటకొచ్చినట్లుగా ఈ సమస్య నుంచి బయటపడి గెలుపు మనదే అయ్యేలా చేసుకుందాం. అలాగే మన సరిహద్దులను రక్షించుకుని, పాకిస్తాన్ పాలకులకు మర్చిపోలేని గట్టి గుణపాఠం నేర్పిద్దాం. ఈ రోజు నేను ఏ రాజకీయ పార్టీ తరపున మాట్లాడటానికి సిద్ధంగా లేను. ప్రస్తుతం దేశంలో మనమంతా ఒకే పార్టీ. మన మధ్య ఉన్న రాజకీయ విభేదాలు, చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి.. యావత్ దేశం విజయం వైపు ముందుకు సాగాలి . భుజం-భుజం కలిపి, దశలవారీగా దాడులతో చిత్తుచేసి గట్టి విజయం అందుకుందాం. అంతేగాదు ఈ పోరాటం ఏ త్యాగాలను కోరినా..అందుకు సంసిద్ధంగా ఉందాం." అని ప్రసంగించారు వాజ్‌పేయి. హృదయాలను కదలించే ప్రసంగం ఇప్పటికి చెవుల్లో మారుమ్రెగుతున్నట్లే ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు.(చదవండి: Operation Sindoor: 'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం)

రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!
అనాథ అయితేనేం.. ఒక పెద్ద కుటుంబమే ఆమెకు అండగా నిలబడింది. పెద్దలంతా, ముఖ్యంగా మహిళలంతా పెద్దిదిక్కులా మారి ఆమెకు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు ఇందులోనే భాగంగా హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండేళ్ల వయసులో అనాథలా రైల్వే స్టేషన్లో దొరికిన యువతి పెళ్లివార్త ఇపుడు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. రాంగోపాల్‌పేట్: రెండేళ్ల వయసులో రైల్వే స్టేషన్లో దొరికి పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చింది. నిర్వాహకులే కుటుంబ సభ్యులై అన్నీ చూసుకున్నారు. పాయల్‌కు రెండేళ్ల వయసున్నపుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండగా పోలీసులు హిల్‌స్ట్రీట్ పాఠశాల ఆవరణలోని ఆశ్రయ్ రెయిన్బో హోంకు అప్పగించారు. రెండేళ్ల వయసు నుంచి అక్కడే ఉంటూ డిగ్రీ ఆమె ఇక్కడే పూర్తి చేసింది. ఇదీ చదవండి: Operation Sindoor సలాం, హస్నాబాద్!ఆ తరువాత ఆప్థమాలజీ కోర్సు పూర్తి చేసి ఓ ఆప్టికల్ షాపులో ఉద్యోగం చేస్తుంది. చందానగర్‌కు చెందిన యువకుడిని ఇష్టపడింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులు పెళ్లిచేయాలని నిర్ణయించారు. ఆశ్రమం నిర్వాహకులు గ్రేస్.. కార్పొరేటర్ కొంతం దీపిక మరికొంత మంది దాతల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. బుధవారం రాత్రి ఆశ్రమం ఆవరణలో ఉత్సాహంగా మెహిందీ ఫంక్షన్ నిర్వహించారు. వైభవంగా ఆ మూడు ముళ్ల వేడుకను పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ

స్ట్రీట్ వేర్.. షీక్ స్టైల్.. ఐపీఎల్ క్రికెటర్ @ఐవేర్..
సాక్షి, సిటీబ్యూరో : ఫ్యాషన్ ప్రపంచంలో స్ట్రీట్ వేర్‌కు తనకంటూ ఓ స్టైల్ ఉంది.. ప్రముఖ బ్రాండ్స్ తమదైన శైలిలో వీటిని డిజైన్ చేసి యూత్‌ని ఆకట్టుకుంటుంటాయి.. అదే క్రమంలో ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షీక్ తమ స్ట్రీట్ వేర్‌ను నగరంలో ప్రదర్శించింది. మాదాపూర్‌లోని నోవోటెల్ హోటల్లో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.. ఈ సందర్భంగా బ్రాండ్‌ను సిటీలో లాంచ్ చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅగ్రగామి క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నగరంలో సందడి చేశాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు, షేక్ హ్యాండ్స్ ఇస్తూ వారిని అలరించాడు. నగరంలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోని ఐవేర్ బ్రాండ్ అయిన ఎఓ ఆప్టికల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాండ్ రూపొందించిన సరికొత్త కళ్లజోళ్ల కలెక్షన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండ్ డైరెక్టర్ ప్రియాంక గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి : Operation Sindoor సలాం, హస్నాబాద్!ఇంటర్న్ షిప్‌తో కెరీర్‌కు ఊతం నగరంలోని కేఎల్‌హెచ్ డీమ్డ్ యూనివర్సిటీ, అజీజ్ నగర్ క్యాంపస్, తమ విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలు ( MNఇలు) సహా ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్లేస్మెంట్ ఆఫర్లు పొందారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ తెలిపారు. పలు సంస్థల్లో విద్యార్థులకు ఇంటర్న్íÙప్ ఆధారిత ఉద్యోగాలు లభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కెరీర్‌కు ఎంతో మేలు చేస్తాయని, పెద్ద సంఖ్యలో తమ విద్యార్థులు ఒప్పో వంటి సంస్థల్లో ఇంటర్న్íÙప్ టూ ప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ ద్వారా రూ.19లక్షల ప్యాకేజీ దక్కించు కోనున్నారని వెల్లడించారు. మరికొందరు విద్యార్థులు సీమన్స్ సంస్థ నుంచి నేరుగా ప్లేస్మెంట్ ఆఫర్స్ దక్కించుకున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Rahu Ketu రాహుకేతువుల కథ
భారతీయ సంస్కృతిలో సూర్య, చంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ ఒక కారణం: విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతుంటాడు. రాక్షసులకు సుర మాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. దీనిని దక్షప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకునిఅసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్య చంద్రులు కను సైగలతో విష్ణువుకి తెలియ జేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు.తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో ‘మహాత్మా! అకారణంగా నా కంఠాన్ని తెగగొట్టావు. నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా’అని అడుగుతాడు.రాహువు మాటలు విన్న విష్ణువు మనసు కరుగుతుంది. ‘సరే జరిగిపోయిన దానినే తలచి బాధ పడడం తగదు. అది విధివిధానం. నీకేం కావాలో కోరుకో’ అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు ‘దేవా! సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు’ అంటాడు.ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅందుకు విష్ణువు ‘నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏడాదిలో ఏదైనా ఓ అమావాస్యనాడు సూర్యుడిని, పౌర్ణమినాడు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల వెయ్యి ముక్కలయి చనిపోతావు. సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకు వారికీ శిక్ష చాలు’ అంటాడు.రాహువుకు తల, మొండెం వేర్వేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు. తల కేతువుగా సూర్యుడిని మింగడానికి, మొండెం రాహువుగా చంద్రుని మింగడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ విధంగా సూర్యచంద్రులు రాహుకేతువుల పాల్పడి గ్రహణాలు మొద లయ్యాయని పురాణ కథ. అయితే గ్రహణాలు ఏర్పడడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయన్నది గమనించాలి. – యామిజాల జగదీశ్
ఫొటోలు


‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)


హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)


HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)


ట్రెడిషనల్ + వెస్ట్రన్... లాపతా లేడీ సరికొత్త స్లైల్ (ఫొటోలు)


ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)


హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)


తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)


బర్త్ డే స్పెషల్.. సాయిపల్లవి గురించి ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)
అంతర్జాతీయం

పాకిస్థాన్‌కు ఆర్థిక సంకెళ్లు?
ఢిల్లీ: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు (IMF) ఆలోచనలో పడింది.. 1.3 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలా ? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో ఐఎంఎఫ్ సమావేశం కానుంది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అప్పు ఇవొద్దని భారత్ కోరుతోంది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అవుట్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయవద్దని భారత డిమాండ్ చేస్తోంది.పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడమనే లక్ష్యంగా ఇండియా పావులు కదుపుతోంది. మరో వైపు, పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాలను కూడా భారత్ సమర్పించిన సంగతి తెలిసిందే.కాగా, ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.

పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచీ అబద్ధాలే..
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాదుల శిబిరా లు, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తేల్చిచెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా ముష్కర మూకలకు పాకిస్తాన్ నిస్సిగ్గుగా మద్దతిస్తోందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు.పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టు క్యాంపులపై జరిగిన దాడికి మతం రంగు పులుముతోందని పాక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పుట్టినప్పటి నుంచి పాకిస్తాన్ అబద్ధాలే చెబుతోందని విమర్శించారు. 1947 నుంచి పాకిస్తాన్ అబద్ధాలు వినడం అందరికీ అలవాటైపోయిందని అన్నారు. విక్రం మిస్రీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడా రు. పాకిస్తాన్ తీరుపై విరుచుకుపడ్డారు.‘‘1947లో పాకిస్తాన్ సైన్యం జమ్మూకశ్మీర్‌పై దాడికి దిగింది. కానీ, ఆ దాడితో సంబంధం లేదంటూ ఐక్యరాజ్యసమితికి అబద్ధాలు చెప్పింది. కేవలం గిజరినులే జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారని నమ్మబలికింది. భారత సైన్యం, ఐరాస బృందం అక్కడికి చేరుకుంటే అసలు సంగతి తెలిసింది. చివరకు చేసేది లేక తమ సైన్యమే జమ్మూకశ్మీర్‌పై దాడి చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించింది.పాకిస్తాన్ అబద్ధాల ప్రయాణం 75 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి ఇది మాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. పహల్గాంపై పాక్ అలాంటి అబద్ధాలే చెబుతోంది. తప్పుడు ప్రచారంతో నమ్మించాలని చూస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. పుట్టుక నుంచే అబద్ధాలు మొదలు పెట్టిన పాకిస్తాన్‌ను నమ్మాల్సిన అవసరం లేదు. మసీదులపై భారత్ సైన్యం దాడి చేయలేదు భారత్‌కు చెందిన 15 సైనిక స్థావరాలపై దాడిచేసేందుకు పాక్ ప్రయత్నించగా భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది. భారత్‌ను ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్ మత ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. ప్రజలను రెచ్చగొట్టడానికి మతంకార్డు వాడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో సిక్కు మతస్తులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేసింది. గురుద్వారాతోపాటు సిక్కు ఇళ్లపై దాడికి దిగింది. ఈ దాడుల్లో 16 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.మసీదులపై భారత సైన్యం దాడి చేసిందంటూ పాక్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఉగ్రవాదుల క్యాంపులే ఇండియన్ ఆర్మీ లక్ష్యం. నిజానికి ఉగ్రవాదులకు మసీదుల్లో ఆశ్రయం కల్పించింది పాకిస్తానే. మసీదులను రక్షణగా వాడుకోవడం నిజం కాదా? ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడం దారుణం. పహల్గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.భారత్‌లో పాక్ ఆటలు సాగవు. ఇక్కడ మతం పేరిట రెచ్చగొట్టాలని చూస్తే ఎవరూ రెచ్చిపోరు. పహల్గాంలో ఉగ్రదాడిని మతాలకు అతీతంగా భారతీయులంతా ఖండించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం–జీలం ప్రాజెక్టును ఇండియా టార్గెట్ చేసిందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. ఈ సాకుతో ఇండియాలోని మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే జరగబోయే పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాలి’’అని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. ఉగ్రవాదులకు అధికారిక అంత్యక్రియలా? ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు.‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.

వైరల్ వీడియో.. ఆపరేషన్ సిందూర్.. ఏడ్చేసిన పాక్ ఎంపీ
ఢిల్లీ: భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతోపాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.‘భగవంతుడా.. మేమంతా నీముందు మోకరిల్లామ్.. దయచేసి ఈ దేశాన్ని కాపాడు’అని ఇక్బాల్ మొరపెట్టుకున్నాడు. ‘మనదేశం ఇప్పుడు ఎంతో వేదనలో ఉంది. ప్రజాప్రతినిధులంతా ఏకమై, ఈ దేశాన్ని కాపాడాలని భగవంతున్ని ప్రార్థిద్దాం’అని సహచర ఎంపీలకు సూచించారు. అధికార పార్టీ ఎంపీనే ఏడ్చేయటం ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Pakistani Parliament Member breaks down inside National Assembly of Pakistan after #OperationSindoor impact. Cries for help to Allah. This is Major Tahir Iqbal, former officer of Pakistan Army, now a Pakistani politician. This is the real mood in Pakistan. pic.twitter.com/Xeg7GzxRx4— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 8, 2025

మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
దుబాయ్: ఎర్ర సముద్రంలోని యూఎస్ఎస్ హారీ ఎస్ ట్రూమన్ విమాన వాహన నౌకపై మోహరించిన మరో ఫైటర్ జెట్ సముద్రంలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. అధునాతన ఎఫ్/ఏ–18 సూపర్ హార్నెట్ రకం విమానం ల్యాండయ్యే క్రమంలో జరిగిన పొరపాటుతో షిప్‌పై నుండే స్టీల్ వైర్ తాళ్లకు హుక్ కాలేదని, ఫలితంగా జారి సముద్ర జలాల్లో పడిపోయిందని ఓ అధికారి చెప్పారు. అందులోని ఇద్దరు పైలట్లను హెలికాప్టర్ సాయంతో రక్షించామని, ఘటనలో వారిద్దరూ గాయపడ్డారని వివరించారు. ఈ జెట్ ఖరీదు రూ.513 కోట్లు. ఇదే షిప్‌పై సరిగ్గా ఇలాంటి విమానమే ఏప్రిల్‌లో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోవడం తెల్సిందే. గతేడాది డిసెంబర్లో అమెరికాకే చెందిన యూఎస్ఎస్ గెట్టిస్బర్గ్ నౌక గైడెడ్ మిస్సైల్ ప్రయోగించి మరో ఎఫ్/ఏ–18ను పొరపాటున కూలి్చవేసింది. ట్రూమన్ విమాన వాహక నౌక ఫిబ్రవరిలో ఈజిప్టులోని పోర్ సయీద్‌లో వాణిజ్య నౌకను ఢీకొట్టింది. ఎర్ర సముద్ర జలాల్లో పశ్చిమ దేశాల వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్న యూఎస్ఎస్ కార్ల్ విన్సన్‌కు తోడుగా అమెరికా ప్రభుత్వం యూఎస్ఎస్ హారీ ట్రూమన్ను ఇక్కడికి పంపించింది.
జాతీయం

పిటిషన్ల డ్రాఫ్టింగ్ సూటిగా ఉండాలి
న్యూఢిల్లీ: న్యాయ విచారణలో ప్రక్రియలో సంక్షిప్తంగా, సూటిగా ఉండే పిటిషన్ల అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నొక్కిచెప్పారు. డ్రాఫ్టింగ్ కళపై పట్టు సాధించేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు. పిటిషన్లు స్పష్టంగా సంక్షిప్తంగా ఉండటం లాయర్లేకాదు, జడ్జీలకు కూడా ప్రయోజనకరమని చెప్పారు. ఈ నెల 13వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా శుక్రవారం తనకు సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏవోఆర్ఏ) ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు. 14వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. సీజేఐ జస్టిస్ ఖన్నా తన పదవీ కాలంలో పారదర్శకతను, సమ్మిళితత్వాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. సుప్రీంకోర్టులో ఆడ్వొకేట్స్ ఆన్ రికార్డు ఎంతో కీలకమైన వారని, అత్యున్నత న్యాయస్థానానికే కాదు, దేశంలోని పౌరులందరికీ ప్రతినిధులంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా కొనియాడారు. అయితే, తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్పగలిగే డ్రాఫ్టింగ్ కళపై పట్టు సాధించలేకపోవడం ఇంకా తనకు లోటుగానే అనిపిస్తోందని చెప్పారు. క్లుప్లంగా ఉండే ఫైళ్లను చదవడం కూడా చాలా తేలికని చెప్పారు. ఫైల్ చదివిన తర్వాత ఆకేసుపై సగం వరకు పట్టు దొరుకుతుందని జస్టిస్ ఖన్నా అన్నారు. సీనియర్లపై ఆధారపడకుండా కోర్టుల్లో కేసులను వాదించాలని న్యాయవాదులకు సూచించారు. ‘కక్షి దారులతో మాట్లాడేది మీరు. కక్షిదారులు మాట్లాడేది కూడా మీతోనే. నోట్స్ తయారు చేసేదీ మీరే. ఆ సారాంశాన్ని సీనియర్లకు వివరిస్తారు. కోర్టులో మీరే ఎందుకు వాదించరు?’అని జస్టిస్ ఖన్నా తెలిపారు. సంబంధిత విషయ పరిజ్ఞానం కలిగి ఉండటం లాయర్లకు ఎంతో ముఖ్యమైన విషయమని చెప్పారు. సుప్రీంకోర్టు కాకున్నా, మిగతా కోర్టుల్లో కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ప్రస్తుతం ముఖ్యమైన విధానంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ మీడియేషన్ ట్రెయినింగ్ కోర్సుకు ఎంతో ఆదరణ లభిస్తోందని వివరించారు. దీని వల్ల అమూల్యమైన సమయం ఆదా అవుతుందని తెలిపారు. రిటైరయ్యాక సాయం కావాల్సిన వారు మొహమాటం లేకుండా తన వద్దకు రావచ్చని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు.

ఉద్రిక్తతల వల్ల పాకిస్తాన్‌కే నష్టం
జమ్మూ: సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాకిస్తాన్నే దెబ్బతీస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని పాక్‌కు సూచించారు. లేదంటే వారికి ఎక్కువ నష్టమని హెచ్చరించారు. గురువారం రాత్రి పాకిస్తాన్ చేసిన దాడుల్లో ఒక్క డ్రోన్ కూడా లక్ష్యాన్ని చేరుకోకుండా వేగంగా స్పందించిన సాయుధ దళాలను ఒమర్ ప్రశంసించారు. జమ్మూ, సాంబా జిల్లాల్లోని సహాయ శిబిరాలను, సరిహద్దు రేఖ వెంబడి పాక్ షెల్లింగ్‌లో గాయపడిన వారున్న ఆసుపత్రులను సందర్శించిన సీఎం.. విజయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘1971 యుద్ధం పాక్ చేసిన అత్యంత తీవ్రమైన దాడులివే.. జమ్మూలోని పలు ప్రాంతాలు, అనంత్‌నాగ్‌లోని మందుగుండు సామగ్రి డిపోను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాక్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల పాకిస్తాన్‌కు ఒరిగేదేమీ లేదు. ఆ దేశం విజయం సాధించలేదు. కాబట్టి వారు తుపాకులను పక్కన పెట్టి సాధారణ స్థితిని తీసుకురావడానికి సహకరిస్తే మంచిది. గురువారం రాత్రి తరువాత జరిగిన సంఘటనలు ఉద్రిక్తతను పెంచే ప్రయత్నాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. దీనివల్ల వారే ఎక్కువగా బాధపడతారు’’అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పూంచ్‌లో పరిస్థితి క్లిష్టంగా ఉంది పాక్ షెల్లింగ్ వల్ల పూంచ్ నగరానికి భారీ నష్టం వాటిల్లిందని, పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది అక్కడి వారేనన్నారు. తాను జమ్మూలోని ఆస్పత్రిని సందర్శించానని, గాయాలతో అక్కడ అడ్మిడ్ అయిన వారంతా పూంచ్‌కు చెందిన వారేనని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని శస్త్రచికిత్స కోసం పీజీఐ చండీగఢ్‌కు తరలించామన్నారు. జమ్మూ జిల్లాలోని మిష్రివాలా, నాగ్బానీ, కోట్ భల్వాల్, సాంబాలోని విజయపూర్ పునరావాస శిబిరాలను సందర్శించిన ఆయన నిర్వాసిత కుటుంబాలతో మాట్లాడి, వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శిబిరాల్లో అసౌకర్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆట సామగ్రి కావాలని అడిగిన పిల్లలకు.. తన సొంత వాహనంలో తెచ్చి అప్పగించిన మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు.

పాక్ పనిపట్టాం!
న్యూఢిల్లీ: భారత నగరాలు, పౌర ఆవాసాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పశ్చిమ సరిహద్దుల పొడవునా గురువారం పాక్ మతిలేని దాడులకు దిగిందని కేంద్రం వెల్లడించింది. వాటిని మన బలగాలు పూర్తిగా తిప్పికొట్టినట్టు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ తెలిపారు. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీతో కలిసి వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘భారత సైనిక వ్యవస్థలే లక్ష్యంగా గురువారం రాత్రి పాక్ సైన్యం మన గగనతలంపై పదేపదే దాడులు చేసింది. లేహ్ నుంచి సర్‌క్రీక్ దాకా 36 ప్రాంతాలపై 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించింది. బహుశా నిఘా సమాచార సేకరణ, పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పరీక్షించి చూసుకోవడమే ఈ డ్రోన్ చొరబాట్ల లక్ష్యం. వాటిలో చాలావరకు ఎక్కడివక్కడ కూల్చేశాం. అవి తుర్కియే డ్రోన్లని ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా అంచనాకు వచ్చాం. తర్వాత పాక్ తేలికపాటి యుద్ధ విమానం భటిండా సైనిక స్థావరంపై దాడికి యతి్నంచిగా అడ్డుకుని తిప్పికొట్టాం. అదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుకు, నియంత్రణ రేఖకు ఆవలి నుంచి పాక్ భారీగా కాల్పులకు కూడా తెగబడింది. జమ్మూ కశ్మీర్లో సుందర్, ఉరి, పూంఛ్, మేంధర్, రాజౌరీ, అఖూ్నర్, ఉధంపూర్ ప్రాంతాల్లో భారీ మోర్టార్లు, గన్లతో దాడులు చేసింది. వీటిలో కొందరు సైనికులు మరణించగా పలువురు గాయపడ్డారు. మన ప్రతీకార దాడుల్లో పాక్ తీవ్ర నష్టం చవిచూసింది. 4 పాక్ సైనిక స్థావరాలపై సైన్యం డ్రోన్ దాడులు జరిపింది. వారి ఏడీ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేశాం’’అని వారు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్–400 వ్యవస్థతో పాటు బరాక్–8, ఆకాశ్ మిసైళ్లు తదితరాలను వాడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మతం రంగు పులిమే యత్నం గురుద్వారాపై దాడుల ప్రచారంపై మిస్రీ భారత్ తన సొంత ప్రార్థనా స్థలాలపైనే దాడులు చేసుకుందన్న పాక్ ప్రచారంపై మిస్రీ నిప్పులు చెరిగారు. ‘‘పాక్ ద్వంద్వ వైఖరికి, తప్పుడు ప్రచారానికి ఇది పరాకాష్ట. చివరికి దాడులకు మతం రంగు పులిమే స్థాయికి దిగజారింది’’అంటూ దుయ్యబట్టారు. ‘‘పాక్ సైన్యం అమృత్సర్, పూంఛ్ సమీపంలో నన్కానా సాహిబ్ తదితర గురుద్వారాలు, ఆలయాలపై దాడులకు పాల్పడి పాక్షికంగా ధ్వంసం చేసింది. ఆ నెపాన్ని మనపై వేస్తూ దు్రష్పచారానికి దిగుతోంది. భారత్ తన సొంత ప్రాంతాలపైనే దాడులు చేసుకుందని ఆరోపించే స్థాయికి దిగజారడం పాక్‌కు మాత్రమే సాధ్యం. సొంత ప్రాంతాలపై దాడులు చేసుకుని నెపాన్ని భారత్‌పైకి నెట్టేవారికి ఇలాంటి కుయుక్తులే తోస్తాయి’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘పాక్ కాల్పుల్లో పూంఛ్‌లోని ఓ క్రైస్తవ మిషనరీ స్కూలు వెనక భాగం ధ్వంసమైంది. ఇద్దరు చిన్నారులు మరణించారు. కాల్పుల నేపథ్యంలో స్థానిక క్రైస్తవ నన్స్ తదితరులు బంకర్లలో తలదాచుకుంటున్నారు’’అని చెప్పారు. పౌర విమానాలను కవచం చేసుకునే కుట్ర భారత్ ప్రతిదాడులు చేయకుండా అడ్డుకునేందుకు పాక్ తన సొంత పౌర విమానాలనే కవచంగా చేసుకునే నైచ్యానికి దిగిందని కల్నల్ ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక తెలిపారు. ‘‘పాక్ ఏకపక్ష డ్రోన్ దాడులకు ప్రతిగా వైమానిక దాడులతో భారత్ దీటుగా స్పందిస్తుందని, అది పౌర విమానాలకు తీవ్ర ముప్పని తెలిసి కూడా తమ గగనతలాన్ని మూసేయలేదు. భారత్ సరిహద్దుల వెంబడి తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. పాక్‌లో మాత్రం లాహోర్, కరాచీ తదితర నగరాల నడుమ దేశీయ విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పౌర విమానాలు కూడా పాక్ గగనతలంపై సరిహద్దులకు అతి సమీపంలో ఎగురుతూనే ఉన్నాయి’’అని వివరించారు. ఇందుకు సంబంధించి ఫ్లైట్రాడార్24 డేటాను మీడియా ముందుంచారు. ‘‘అయినా మన వైమానిక దళం అత్యంత జాగరూకతతో వ్యవహరించింది. పౌర విమానాలకు ఎలాంటి నష్టమూ వాటిల్లని రీతిలో అత్యంత కచ్చితత్వంతో పాక్‌పై ప్రతి దాడులు నిర్వహించింది’’అని తెలిపారు.

ప్రతీ దాడికి పక్కా రికార్డు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను బాంబులు, క్షిపణులతో ధ్వంసం చేస్తున్న భారత బలగాలు.. ఆ దాడుల వివరాలను పక్కాగా రికార్డు చేస్తున్నాయని సమాచారం. ఈ నెల 7న పాక్, పీవోకేలోని 9 లక్ష్యాలపై భారత్ దాడి చేసింది. ఆయా స్థావరాలు ఎవరివి? ఏ ఉగ్రవాద సంస్థ వాడుతోంది? ప్రస్తుతం అందులో ఎవరు ఉంటున్నారు? అనే వివరాలను భారత బలగాలు రికార్డు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాడులకు సంబంధించిన వీడియోలను కూడా చిత్రీకరించి భద్రపరిచినట్లు వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు సమాచారం. పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ ఆధారాలను ఉపయోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

నకిలీకి ‘అసలు సీఐ’ తోడు
పీఎం పాలెం (విశాఖపట్నం): మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ ఏసీబీ సీఐ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. నకిలీ ఏసీబీ సీఐ అవతారం ఎత్తిన బలగ సుధాకర్.. ‘సీఐ’గా పనిచేస్తున్న స్వర్ణలతను ‘ఏసీబీ ఎస్పీ’గా పేర్కొంటూ సబ్ రిజిస్ట్రార్ (sub registrar) చక్రపాణిని మభ్యపెట్టాడు. ‘ఏసీబీ దాడుల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే సుధాకర్ కోరినట్లుగా రూ. 5 లక్షలు ఇచ్చేయండి’ అంటూ ఆమె కూడా చక్రపాణికి ఫోన్లో తెలిపారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న సుధాకర్ ఫోన్ నంబరు ఆధారంగా చేసిన దర్యాప్తులో తాజా అంశం బట్టబయలైంది. దీంతో గతంలో వైజాగ్‌లో పనిచేసి ప్రస్తుతం బాపట్ల (Bapatla) రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత ప్రమేయం ఈ కేసులో ఉందని పోలీసులు తేల్చారు. ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్టయిన సుధాకర్‌తోపాటు, సీఐ స్వర్ణలతను రిమాండ్ నిమిత్తం భీమిలి కోర్టుకు తరలించామని స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపారు.అసలేం జరిగింది? బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బలగ సుధాకర్ వచ్చాడు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి, తనను ఏసీబీ సీఐగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో మీ ఆఫీసులో రైడ్ జరగబోతోందని, తనకు 5 లక్షల రూపాయలు ఇస్తే దాడుల ముప్పు నుంచి మిమ్మల్ని కాపాడతానని నమ్మబలికాడు. అతడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పీఎం పాలెం పోలీసులకు చక్రపాణి సమాచారం ఇచ్చారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. చదవండి: అంతుచూసిన అనుమానం.. భర్త చేతిలో భార్య దారుణ హత్య

ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు
సనత్‌నగర్: ఉద్యోగం కోసం వచ్చినన ఓ వ్యక్తి రూ.1.40 లక్షల విలువైన రెండు ఐఫోన్లను చోరీ చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట డీఐ జి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేటలోని ఎఫ్డీఆర్ ఆర్డీ టవర్స్‌లో గల జెప్టో కార్యాలయానికి స్టోర్ ప్యాకర్‌గా పనిచేసేందుకు బాలానగర్‌లోని జింకలవాడకు చెందిన గౌతమ్ అంకిత్‌పాత్ర (24) ఈ నెల 3వ తేదీన వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత స్టోర్‌లో పనిచేసేందుకు అంగీకరించాడు. స్టోర్‌ను ఒకసారి చూసి వస్తానని చెప్పి స్టోర్‌లో కనిపించిన రెండు విలువైన ఐఫోన్లను తీసి దాచుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కార్యాలయానికి రాలేదు. ఆ తర్వాత స్టోర్ ఆడిట్ చేసిన నిర్వాహకులు రెండు ఐఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గౌతమ్ అంకిత్‌పాత్ర సెల్ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు స్టోర్ ఉద్యగి తిలక్‌కుమార్ బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సికింద్రాబాద్: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచి్చన వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ఒడిశా రాష్ట్రం పలపాతి గ్రామానికి చెందిన జడునాథ్ ముర్ము, మల్హో మణి ముర్ము(26) దంపతులు. ఈ నెల 6న సాయంత్రం 8 గంటల సమయంలో భార్యభర్తలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకొని విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలెక్కారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ ఫాం నంబర్ 1లోని గేట్ నంబర్ 5 వద్ద కూర్చున్నారు. టూత్‌పేస్ట్ తీసుకొచ్చేందుకు భర్త జడునాథ్ బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా భార్య మల్హో మణి ఆచూకీ లభించకపోవడంతో జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లో యువకుడి ఆత్మహత్య చిక్కడపల్లి: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌కు వచి్చన గుర్తుతెలియని యువకుడు అక్కడే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన మెట్రో సిబ్బంది 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు
కర్నూలు (సెంట్రల్)/వెల్దుర్తి: కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు హత్య కేసులో 11 మంది నిందితులపై నేరం రుజువైంది. వీరందరికీ జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి జి. కబర్థి గురువారం తీర్పు చెప్పారు. మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డి అనుచరులతో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో పెళ్లికి రెండు వాహనాల్లో బయల్దేరారు. నిందితులు రెండు ట్రాక్టర్లలో వచ్చి నారాయణరెడ్డి కారును ఢీకొట్టి నారాయణరెడ్డిపై దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన సాంబశివుడునూ అంతమొందించారు. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదుచేసి 19 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. నిందితులుగా ఉన్న ప్రస్తుత పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ప్రస్తుత వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మలు హైకోర్టును ఆశ్రయించగా వీరి పేర్లు కేసు నుంచి తొలగించారు. ఏ4గా ఉన్న కోతుల రామాంజనేయులు చనిపోవడంతో మొత్తం 16 మందిపై తుది విచారణ సాగింది. ఇందులో 11 మందికి జీవిత ఖైదు పడగా, ఐదుగురిపై నేరం రుజువు కాలేదు. జీవిత ఖైదు పడిన నిందితులు వీరే.. కురువ రామాంజనేయులు, రామయ్యనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకటరాముడు, గంటల శీను, బీసన్నగారి రామాంజనేయులు(40), బీసన్నగారి రామాంజనేయులు(42), బీసన్నగారి పెద్ద బీసన్నలకు జీవితఖైదు పడింది. చాకలి నారాయణ, కర్రి గిడ్డయ్య, చెరుకులపాడు గోపాల్, చిన్న వెంకటలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బీసన్నగారి పెద్ద బీసన్న వయస్సు ప్రస్తుతం 83 ఏళ్లు. నిందితుడు ఆత్మహత్యా యత్నం.. నిందితుల్లో ఒకరైన రామాంజనేయులును వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తలను వాహనం కిటికీకి కొట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకే.. నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు హత్యకేసులో తమకే ఎందుకు జీవితఖైదు పడిందని, కేఈ శ్యాంబాబుకు ఎందుకు శిక్ష పడలేదని నిందితులు కురువ రామాంజనేయులు, బీసన్నగారి రామాంజనేయులు ప్రశ్నించారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకు పోవాల్సిందేనని, ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మొద్దని.. వారెలాంటి సాయం చేయరని, తమకు తగిన శాస్తి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.చట్టం, కోర్టులపై నమ్మకం పెరిగింది.. నారాయణరెడ్డి సతీమణి,మాజీఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనంతరం.. కర్నూలులోని తన స్వగృహంలో నారాయణరెడ్డి సతీమణి, కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ అంశంపై స్పందించారు. కోర్టు తీర్పుతో, పోలీసులు కేసులో చూపిన తెగువతో తమకు, ప్రజలకు చట్టంపై, కోర్టులపై నమ్మకం పెరుగుతోందన్నారు. తన భర్త నారాయణరెడ్డి బతికుంటే ఎమ్మెల్యే కాలేమన్న భయంతోనే కేఈ శ్యాంబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆమె ఆరోపించారు. నారాయణరెడ్డి హత్య కేసు తీర్పును చూసి ప్రజలు కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. నారాయణరెడ్డి సోదరుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే తన తండ్రిని, తన సోదరుడిని పోగొట్టుకున్నామన్నారు.

మందుపాతర్లు పేల్చిన మావోయిస్టులు
వాజేడు/ఎంజీఎం/సాక్షి, హైదరాబాద్: కర్రిగుట్టలు మరోసారి దద్దరిల్లాయి. ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల పైనున్న పెనుగోలు గ్రామ సమీప నూగూరు అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను మావోయిస్టులు పేల్చేశారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండోలు వడ్ల శ్రీధర్ (జేసీ4973/పీసీ1785), ఎన్.పవన్‌కల్యాణ్ (జేసీ10541/పీసీ) టి.సందీప్ (జేసీ 4638/పీసీ8124) అక్కడికక్కడే మృతి చెందారు. పైడిపల్లికి చెందిన అర్ఎస్ఐ సీహెచ్ రణదీర్ గాయపడ్డారు. మరో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. కాగా మెరుగైన వైద్యం కోసం రణదీర్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. భారీ ఎన్కౌంటర్ మరుసటి రోజే.. కర్రిగుట్టల్లో చేపట్టిన కగార్ ఆపరేషన్ 17 రోజులకు చేరుకుంది. కర్రి గుట్టలను చుట్టు ముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ఎన్కౌంటర్ చోటు చేసుకోగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ కోసం వచ్చే దళాలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని ముందే అమర్చిన మందుపాతరలను రిమోట్ల సహాయంతో పేల్చివేసినట్లు తెలుస్తోంది. 35 – 40 మందితో కూడిన మావోయిస్టుల బృందం (మహిళలు కూడా ఉన్నారు) ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. మృతదేహాలు పరిశీలించిన మంత్రి, డీజీపీ గ్రేహౌండ్స్ కమాండర్ల మృతదేహాలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రే హౌండ్స్ ఏడీజీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, ము లుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ మార్చురీ వద్ద పరిశీలించారు. ఈ ఘటనపై వాజేడు పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 62, 148, 191(1), 191(3), 103, 109 ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్, సెక్షన్ 25(1–బీ)(ఏ), 27 ఏఆర్‌ఎమ్‌ఎస్ యాక్ట్, సెక్షన్ 10, 13 ,18,20, కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కాగా మందుపాతర్ల పేలుడులో మరణించిన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30)కు 9 నెలల క్రితమే వివాహమైనట్లు తెలిసింది. నాలుగు గంటల పాటు పోస్టుమార్టం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరుకున్న పోలీసుల మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం జరిపారు. బుల్లెట్ల గాయాలతోనే జవాన్లు మృతి చెందినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు: డీజీపీ ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఈడీల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులపై దూరంలో మాటేసిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చారని డీజీపీ తెలిపారు. సెర్చ్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా భారీ కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు కాల్పులు ఆపేసి పారిపోయారన్నారు. ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దు: మావోయిస్టులు పోలీసుల వలలోపడి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని మావోయిస్టులు మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు మావోయిస్టు వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట గురువారం ఒక లేఖ విడుదల అయ్యింది. ‘పోలీసు బలగాల కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి కర్రిగుట్టలపై బాంబులు అమర్చాం. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాం. అయినా కొంతమంది ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలకు పోలీసులు మాయ మాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులు ఇస్తూ ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారు. షికారు పేరుతో వారిని కర్రిగుట్టల వైపు పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులు పేలి వారు చనిపోతున్నారు. కాబట్టి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..’అని ఆ లేఖలో పేర్కొన్నారు.
వీడియోలు


India Pakistan War: బోర్డర్ నుంచి లైవ్ అప్డేట్స్


మోదీ సిగ్నల్ ఇస్తే..? పాక్ ని 5 రోజుల్లో లేపేస్తాం: మాజీ జర్నల్


పాక్ దొంగ దెబ్బ.. మిస్సైల్స్ ని గాల్లోనే పేల్చేసిన భారత్


వీర జవాను మురళీ నాయక్ మరణంపై శైలజానాథ్ కామెంట్స్


ఏపీ పోలీసులకు అంబటి రాంబాబు వార్నింగ్


దూసుకొచ్చిన పాక్ బాలిస్టిక్ క్షిపణి.. నిర్వీర్యం చేసిన భారత్


పాకిస్తాన్ నగరాల్లో భారత్ ఎటాక్


తల్లిదండ్రులును ఎదిరించి ఆర్మీలోకి వెళ్ళాడు


వీర జవాన్ మురళి నాయక్ ఇంటికి వైఎస్ జగన్


జేబులో పైసా నహీ... బొచ్చెలో రోటీ నహీ