
వ్రస్తాలకు కళాకారుల సృజన
నగరంలో కుటీర పరిశ్రమగా ఉపాధి అవకాశాలు
కార్చోబీ అల్లికలతో మహిళలకు చేతినిండా పని సూట్లు,
చీరలకు జిగేల్‌మనే మెరుపులు
పెళ్లి చీరలు, ఫ్యాషన్, పంజాబీ సూట్స్, ఫ్యాన్సీ, మహిళల సూట్స్‌కు జిగేల్‌మనిపించేలా చేసే వర్క్‌నే కార్చోబీ వర్క్ అంటారు. నగరంలోని పలువురు మహిళలు దశాబ్దాలుగా ఈ కళనే ఉపాధిగా ఎంచుకుని జీవిస్తున్నారు. ఇలాంటి వర్క్ చేసేవారిని కార్చోబీ కళాకారులు అంటారు. వీరు వివిధ రకాల వ్రస్తాలకు జిగేల్ మనిపించే రీతిలో అల్లికలు, డిజైన్లను అద్దుతారు. – గోల్కొండ
వ్రస్తాలకు కళాకారుల సృజన నగరంలో కుటీర పరిశ్రమగా ఉపాధి అవకాశాలు కార్చోబీ అల్లికలతో మహిళలకు చేతినిండా పని సూట్లు, చీరలకు జిగేల్‌మనే మెరుపులు తగ్గుతున్న ఆదాయం.. ప్రస్తుతం నగరంలో కార్చోబీ పని చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఈ పనిని చేయించుకునే వ్యాపారులు కారి్మకులకు ఇచ్చే కూలిని తగ్గిస్తున్నారు. గతంలో ఒక్కో కార్చోబీ కార్మికుడు ఒక చీరపై పనిచేస్తే కనీసం రెండు వేలు సంపాదించేవాడు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య పెరుగుదలతో చీరకు రూ.వెయ్యి కూడా లభించడంలేదని చెబుతున్నారు. పోటీ పెరుగుతుండడంతో, మెషీన్‌లతో డిజైన్స్ వేయించడం లాంటివి అందుబాటులోకి రావడంతో తమ ఉపాధికి గండిపడుతోందని గత 30 ఏళ్లుగా కార్చోబీ పనిచేస్తున్న అఫ్జల్ చెబుతున్నాడు.
తగ్గుతున్న ఆదాయం..
ప్రస్తుతం నగరంలో కార్చోబీ పని చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఈ పనిని చేయించుకునే వ్యాపారులు కారి్మకులకు ఇచ్చే కూలిని తగ్గిస్తున్నారు. గతంలో ఒక్కో కార్చోబీ కార్మికుడు ఒక చీరపై పనిచేస్తే కనీసం రెండు వేలు సంపాదించేవాడు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య పెరుగుదలతో చీరకు రూ.వెయ్యి కూడా లభించడంలేదని చెబుతున్నారు. పోటీ పెరుగుతుండడంతో, మెషీన్‌లతో డిజైన్స్ వేయించడం లాంటివి అందుబాటులోకి రావడంతో తమ ఉపాధికి గండిపడుతోందని గత 30 ఏళ్లుగా కార్చోబీ పనిచేస్తున్న అఫ్జల్ చెబుతున్నాడు.
గిట్టుబాటు ధరతో సరి..
వస్త్ర వ్యాపారులు నేరుగా పని ఇస్తుండడంతో గిట్టుబాటు ధర వస్తుందని, గతంలో కార్చోబీ పనిలో దళారులదే ఇష్టారాజ్యంగా ఉండేదని, ఇచ్చిందే తీసుకోవాలన్నట్లు ఉండేదని, అయితే ప్రస్తుతం ఒక్కో కార్మికుడు హాఫ్ శారీకి రూ.1500, చీర కొంగుకు వెయ్యి లభిస్తున్నాయి అని చెబుతున్నారు. అదే ఫ్యాన్సీ సూట్ అయితే ఫుల్ సూట్‌కు రూ.2వేలు, త్రీపీస్ సూట్‌కు మూడు వేలు లభిస్తున్నాయి. ఇక కార్చోబీ పనికి అవసరమయ్యే చంకీలు, దారాలు, ఇతర వస్తువులను వ్యాపారులే సరఫరా చేస్తారు. షోరూమ్‌లలో, షోకేజీలలో జిగేల్ మనిపించే సూట్లు, చీరల అందం వెనుక కార్చోబీ కళాకారుల పనితనం అద్భుతమైందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.