Top Stories
ప్రధాన వార్తలు

వార్ టెన్షన్.. అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..
War Live Updates..అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..భారత్, పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం.భారీగా భద్రతా దళాల మోహరింపు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ.ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసిన అధికారులు.జమ్ము, రాజస్థాన్, పంజాబ్‌లో జనావాసాలపై పాక్ దాడులు.జానీపూర్ నివాస ప్రాంతంలో పాక్ మిస్సైల్ దాడులు. #WATCH | J&K: SDRF, local police, administration, and other agencies are at the spot. They cordoned off the place near Aap Shambhu Temple where a Pakistani strike occurred.As per the SDRF personnel, there has been no casualty. pic.twitter.com/FLLcHEc96X— ANI (@ANI) May 10, 2025పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు.. పాక్ మిలిటరీ పోస్ట్.. టెర్రర్ లాంఛ్‌ప్యాడ్ ధ్వంసంసరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులునియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న దాయాది.ఆ పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీపంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్ క్షిపణి శకలాలు లభ్యంజమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభ్యంపౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులు. #WATCH | A projectile debris in Rajasthan's Barmer as Pakistan started targeting civilian areas. pic.twitter.com/tENtKWlLOa— ANI (@ANI) May 10, 2025 #WATCH | J&K | Splinters and debris of a projectile retrieved from Akhnoor pic.twitter.com/SR3qe3gHbv— ANI (@ANI) May 10, 2025 పాక్‌కు చుక్కలే..పాక్ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.పాక్ డ్రోన్లను, మిస్సైల్స్‌ను కూల్చివేసిన భారత్. #WATCH | Parts of a projectile found in a field in Amritsar, Punjab. pic.twitter.com/bPxXOxWT8n— ANI (@ANI) May 10, 2025#WATCH | Amritsar, Punjab | Debris of a drone were recovered from a field in Muglani Kot village pic.twitter.com/zxmklvX2tL— ANI (@ANI) May 10, 2025 #WATCH | Pakistani Posts and Terrorist Launch Pads from where Tube Launched Drones were also being launched, have been destroyed by the Indian Army positioned near Jammu: Defence Sources(Source - Defence Sources) pic.twitter.com/7j9YVgmxWw— ANI (@ANI) May 10, 2025నేడు భారత సైన్యం మీడియా సమావేశం.నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.ఆపరేషన్ సిందూర్ 2.0పై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్ దాడులు తీవ్రతరం..లాహోర్, ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ దాడులు. మూడు పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున పాక్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు.వీటిల్లో ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న కీలక స్థావరంరెండు పాకిస్థాన్ ఫైటర్ జెట్ల కూల్చివేతశ్రీనగర్ బేస్ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్‌పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలుశనివారం తెల్లవారుజామున 5 గంటలకు వినిపించిన శబ్దాలుశ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుఆకాష్ జెట్‌తో పాక్ క్షిపణులను కూల్చివేసిన భారత్. Pakistan tried to hit the capital of India, New Delhi by it's long range missile Fateh-2But intercepted by Barak-8 missile defence system in Sirsa of Haryana#IndianArmy please ekbar attacking mode me aajao 😡🙏#IndiaPakistanWar #IndianNavyAction pic.twitter.com/x3kd7v87W2— Priyanshu Kumar (@priyanshu__63) May 9, 2025📹VIDEO : Pakistani citizen (lahore) sharing reality of Indo-pak war. exposed Pakistan's failure & pak media lies.India is right on Top. 👍👍 pic.twitter.com/Ff44gptNlc— Vaishnavi (@vaishu_z) May 9, 2025 Lahore, Pakistan is now being targeted by India. Pakistan’s 2nd largest city and one that is fully undisputed.This war is escalating very quickly. pic.twitter.com/6lzojd3DcY— Spencer Hakimian (@SpencerHakimian) May 10, 2025పాకిస్తాన్ డ్రోన్ దాడులకు భారత్ ప్రతీకార దాడులు.పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత. పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలు నిలిపివేత.పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు చేసింది. లాహోర్, రావాల్పిండి, పెషావర్లపై దాడి చేసింది. నూర్ఖాన్, మురీద్, రఫికి ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిన భారత్. డ్రోన్స్, మిస్సైల్స్‌తో పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై దాడి చేసిన భారత్.నూర్ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అటు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు.భారత్ వ్యూహ్మాతక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులను తెగబడింది.జమ్ము,శ్రీనగర్, అమృత్సర్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్.భారత్‌లోని 26 ప్రదేశాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.మిస్సైల్స్ ద్వారా పాక్ దాడులను అడ్డుకున్న భారత్.ఫతా వన్ మిస్సైల్‌ను ధ్వంసం చేసిన భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.#WATCH | Jalandhar, Punjab: Parts of a Pakistan drone recovered after a blast in Kanganiwal village in Rural Jalandhar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ZogqS588tR— ANI (@ANI) May 10, 2025 #WATCH | Loud explosions are being heard in Poonch area of Jammu and Kashmir. (Visuals deferred by unspecified time) pic.twitter.com/VkjzgY8jYc— ANI (@ANI) May 10, 2025టార్గెట్ పఠాన్‌కోట్..పఠాన్‌కోట్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్.రెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్.అన్నిచోట్ల పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత సైన్యం.భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఎయిర్‌బేస్ బంద్.. అన్ని విమానాలను రద్దు చేసిన పాక్.శ్రీనగర్ టార్గెట్‌గా పాకిస్తాన్ ాదాడులు.శ్రీనగర్‌లోని రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు. At least 4 airbases in Pakistan have been targeted by Indian strikes: Sources pic.twitter.com/3ZegA6YmzM— ANI (@ANI) May 10, 2025పాక్ డ్రోన్లు దాడులు.. సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. చీకట్లు పడుతూనే జమ్ము కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది.కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జోద్పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

కరాచీ ఎయిర్‌పోర్టు లాక్డౌన్.. పెట్రోల్ బంక్‌లు బంద్!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా భారత్ దాడుల కారణంగా కరాచీ ఎయిర్‌పోర్టులో లాక్డౌన్ విధించారు. కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణీకుల తరలిస్తున్నట్టు సమాచారం. బ్లాక్ అవుట్ ప్రకటించారు. అలాగే, పాక్ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు.. భారత్ ముప్పెట దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలం మూసివేశారు. అలాగే, భారత్‌తో యుద్ధం కారణంగా పాకిస్తాన్లో కొరత మొదలైంది. తాజాగా ఇస్లామాబాద్‌లో 48 గంటలపాటు పెట్రోల్‌బంక్‌లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ప్రజలు అల్లాడిపోతున్నారు.All PETROL PUMPS in Islamabad SHUTDOWN for 48 hrsPaaijaan tel khatam hogya 😭#IndiaPakistanWar pic.twitter.com/D9hkvnEuQM— Dev Madan Chronicles (@DMC_0001) May 10, 2025 🚨#BREAKING!!! Completely BLACKED OUT, this is the scene at Karachi Airport after Pakistani airspace cleared,RT pic.twitter.com/Vpt8evRQFG— G7 News (@G7NEWSX) May 10, 2025ఇదిలా ఉండగా.. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, మిస్సైల్‌తో పాక్ దాడి చేయడంతో.. భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. పాకిస్తాన్‌లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్‌క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో భారత్ దాడులకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది.Pakistani airspace is reportedly closed again. A friend is stuck at Karachi Airport — complete blackout, no updates. Situation tense pic.twitter.com/tww6jVWSG2— Nasir (@khan_nasir19) May 9, 2025 So now it's in Karachi.. blasts are happening in air..Near old airport..#Pakistan #IndiaPakistanWar #PakistanZindabad pic.twitter.com/3gKbLY9lqn— Sarah Peracha (@sarahperacha) May 10, 2025 ఇక, రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భారత్‌పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. ఇక తాజాగా శనివారం తెల్లవారుజాము నుంచి పాక్ తిరిగి దాడులు చేయడంతో భారత్ తిప్పికొట్టింది. Seems so drones are being hit towards Karachi airport. Hug blasts heard towards Karachi airport. pic.twitter.com/ikFvyMHpsg— Nazim Abbas (@NazimAbbas_1) May 10, 2025 Visuals Coming From Karachi.کراچی Malir airport سے مناظر۔ pic.twitter.com/PgGmfsGY5M— The Awazaar Sain (@adeelzsiddiqui) May 10, 2025

వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత విషయంలో.. కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: జెడ్ ప్లస్ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సీఆర్పీఎఫ్ డీజీ, ఎన్ఎస్జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జెడ్ ప్లస్ భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించే విషయంలో తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర భద్రతా సంస్థలైన సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి వాదనలు విన్నారు. వైఎస్ జగన్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, నిర్దిష్ట ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా వైఎస్ జగన్‌కు ఉన్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపు చేసి జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. జగన్‌కు ఉన్న ప్రాణహానిని, ఆయనపై గతంలో జరిగిన హత్యాయత్నాన్ని పరిగణనలోకి తీసుకుని జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్ జగన్ భద్రతను భారీగా కుదించేశారని, ఇటీవల పలు సందర్భాల్లోనూ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని చెప్పారు. పర్యటనలు, పరామర్శలకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నాగిరెడ్డి వివరించారు. భద్రత విషయంలో వైఎస్ జగన్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు మళ్లీ పిటిషన్ వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు స్పందిస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు.

ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.త్రయోదశి సా.4.59 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: చిత్త రా.2.48 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.9.09 నుండి 10.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: రా.7.46 నుండి 9.33 వరకు, శనిత్రయోదశి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.34, సూర్యాస్తమయం: 6.17. మేషం: శుభకార్యాల ప్రస్తావన. చిన్ననాటి మిత్రుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృషభం: ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.మిథునం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందికరంగా సాగుతాయి.కర్కాటకం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.సింహం: పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.కన్య: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.తుల: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.వృశ్చికం: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు విజయం. శుభవార్తలు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.కుంభం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మీనం: శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

Miss World 2025: అందాల పండగ నేడే షురూ
సాక్షి, హైదరాబాద్: అందాల పండుగకు అంతా సిద్ధమైంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచసుందరి పోటీలు శనివారం ప్రారంభం కాబోతున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్.. తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. పోటీల్లో 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారని భావించగా, ఇప్పటివరకు 111 మంది నగరానికి చేరుకున్నారు. శనివారం మరికొందరు వస్తారని అంచనా వేస్తున్నారు. ‘మిస్ వరల్డ్’కనుసన్నల్లో కార్యక్రమాలు మిస్ వరల్డ్ లిమిటెడ్ కనుసన్నల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం గత రెండు నెలల్లో పలుమార్లు నగరానికి వచ్చి ఇక్కడి పరిస్థితులు, వసతులను పరిశీలించిన మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే, పోటీల నిర్వహణపై సానుకూలంగా స్పందించారు. ఈ నెల 2న తేదీన.. నగరానికి చేరుకున్న ఆమె బృందం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో కార్యాలయాన్ని ప్రారంభించి.. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రారంభ వేడుకలకు సీఎం అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం కొనసాగుతున్నా, పోటీ దారులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పొల్గొనేందుకు నగరానికి చేరుకోవటం విశేషం. పదో తేదీతో ప్రారంభమయ్యే పోటీలు ఈనెల 31 వరకు కొనసాగనున్నాయి. 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో కూడా పాల్గొంటారా, లేదా.. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో జరిగే ఎట్‌హోమ్ వరకే పరిమితమవుతారా అన్నది తేలాల్సి ఉంది. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ (2024) ఫైనల్ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి పోటీలు ఇండియాలోనే జరుగుతుండటం విశేషం. రాష్ట్ర గీతం ఆలాపనతో.. రాష్ట్ర గీతం ఆలాపనతో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా దీన్ని ప్రత్యక్షంగా ఆలపిస్తారు. అనంతరం కాకతీయుల కాలంలో రూపొందిందిన సంప్రదాయ నృత్యరీతి పేరిణి నాట్య ప్రదర్శన ఉంటుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు. దీనికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఫణి నారాయణ స్వరాలు సమకూర్చనున్నారు. పది నిమిషాల పాటు ఈ నృత్య కార్యక్రమం కొనసాగనుంది. కళాకారులు అందరూ కలిసి తమ విన్యాసాలలో భాగంగా నక్షత్రం, సీతాకోకచిలుక, మిస్ వరల్డ్ లోగో ఆకృతులను ప్రదర్శిస్తారు. కళారూపాల ప్రదర్శనతో కంటెస్టెంట్ల పరిచయం ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన సుందరీమణుల పరిచయ కార్యక్రమం ఖండాల వారీగా నిర్వహిస్తారు. ఆ సమయంలో తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత భద్రాచలం గోదావరి పరీవాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత కత్లే శ్రీధర్ బృందం నేతృత్వంలో ఆదిలాబాద్ గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన ఉంటుంది. అప్పుడు మరొక ఖండానికి సంబంధించిన సుందరీమణులు వేదిక పైకి వస్తారు.తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పు వాయిద్య కార్యక్రమాన్ని ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత అందె భాస్కర్ బృందం, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలను స్వప్న బృందం ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కూడా పోటీదారులను పరిచయం చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవి కుమార్ బృందం ఆధ్వర్యంలో ప్రదర్శిస్తారు. ఈ కళారూపాల అన్నింటి మేళవింపుతో ముగింపు ఉంటుంది. సంప్రదాయ స్వాగతానికి మురిసిపోతూ.. ఈనెల మూడో తేదీ మొదలు నిత్యం సుందరీమ ణులు నగరానికి వస్తూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ తిలకం దిద్ది, హారతి ఇస్తూ, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్ నృత్యరీతులు ప్రదర్శిస్తూ.. డప్పు వాయిద్యాలు, బాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాలతో కూడిన బృందాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈకార్యక్రమాలు 24 గంటల పాటు కొనసాగుతున్నాయి. దీనిని విదేశీ అతిథులు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తుండటం గమనార్హం.

ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక
ఆపరేషన్ సిందూర్‌పై పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 'ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కును కూడా కొందరు తప్పుపడుతున్నారని, దానిని యుద్ధ దాహమంటూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆమె అన్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని రష్మిక (Rashmika) కోరారు."ఉగ్రవాదం నుంచి రక్షణ కోసం చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్ధతిచ్చే వారు యుద్ధోన్మాదులు కాదు. వారందరూ దేశ భద్రత, న్యాయం విలువైనవిగా భావించే పౌరులు. మేము శాంతిని కోరుకుంటాం.., అలా అని మాకు తలపెట్టిన హానిని అంగీకరించడానికి సిద్ధంగా ఎంతమాత్రం లేము. రెచ్చగొట్టే దురాక్రమణకు, ఆత్మ రక్షణకు మధ్య లోతైన నైతిక వ్యత్యాసం ఉంది. కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం మా దేశ బాధ్యతే అవుతుంది. అది ఎంతమాత్రం అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే మౌనంగా హానిని అంగీకరించడం కాదు. మాకు జరిగిన అన్యాయాన్ని బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు.. మీకు చేతనైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి. మా దేశ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను పంపుతున్న దేశాన్ని ప్రశ్నించండి.' అని రష్మిక రాసుకొచ్చారు.

పాక్ చెయ్యి వదిలేసిన అమెరికా
గిల్లి కయ్యం పెట్టుకోవటం.. గట్టిగా నాలుగు దెబ్బలు తగిలేసరికి అమెరికా కాళ్లపై పడి కాపాడాలని వేడుకోవటం.. ఆ దేశం వెంటనే రంగంలోకి దిగి భారత్‌కు నచ్చజెప్పి వెనక్కు తగ్గేలా చేయటం.. 1971 నుంచీ పాకిస్తాన్ తీరు ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాకిస్తాన్ దుష్టబుద్ధి అమెరికా పాలకులకు కూడా తెలిసి వచ్చింది. పొరుగుదేశంతో నువ్వు గొడవ పెట్టుకుంటే నిన్ను నేనెందుకు కాపాడాలని అమెరికా నిలదీస్తోంది. ‘భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో దాయాది దేశానికి దిక్కు తోచటం లేదు. కాపాడుతూ వచ్చిన అమెరికా 1971 యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2001లో ఘర్షణ, 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులు.. ఇలా భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న ప్రతిసారీ పాకిస్తాన్ పాలకులు రాత్రికి రాత్రి అమెరికాలో వాలిపోయి కాపాడాలని ఆ దేశ పెద్దలకు మొరపెట్టుకున్నారు. నాడు పాకిస్తాన్ పక్షపాతిగా ఉన్న అమెరికా అడిగిందే తడవుగా రంగంలోకి దిగి భారత్‌తో చర్చలు జరిపి శాంతించేలా చేసేది. 1971 యుద్ధ సమయంలో పాక్‌కు మద్దతుగా ఏకంగా అణ్వాయుధాలు గల విమాన వాహక నౌక యూఎస్ఎస్ఆర్ ఎంటర్ప్రైజ్ నాయకత్వంలో 7వ ఫ్లీట్‌ను బంగాళాఖాతంలో మోహరించింది. 1999లో జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్‌ను ఉగ్రమూకల ముసుగులో పాక్ సైన్యం ఆక్రమించింది. ఆలస్యంగా గుర్తించిన భారత సైన్యం.. భీకర దాడులతో వారిని తరిమికొట్టింది. అంతటితో వదలకూడదని పాక్‌పై సైనిక చర్యకు ప్రణాళిక వేసింది. భారీగా యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సరిహద్దులకు తరలించింది. తన గూఢచారి ఉపగ్రహాల ద్వారా ఈ విషయాన్ని అమెరికా పసిగట్టి పాక్‌కు ఉప్పందించింది. దీంతో భయపడిన నాటి పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్.. అమెరికాకు పరుగు పెట్టి అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సమావేశమయ్యాడు. మొదట కార్గిల్‌ను తాము ఆక్రమించలేదని బుకాయించిన నవాజ్‌షరీఫ్.. క్లింటన్‌తో సమావేశం తర్వాత 1999, జూలై 12న కార్గిల్ నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించటం గమనార్హం. 2001లో పాక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేయటంతో రెండు దేశాలు మరోసారి యుద్ధం ముందు నిలిచాయి. ఆ సమయంలో కూడా పాక్‌ను కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. తన రాయబారిని ఢిల్లీకి పంపి భారత్‌ను శాంతింపజేసింది. ఇలా దౌత్యంతోపాటు ఎప్పటికప్పుడు ఆయుధాలు, అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా సరఫరా చేస్తూ పాకిస్తాన్‌ను అగ్రరాజ్యం కాపాడుతూ వచ్చింది. ఎఫ్–16 సూపర్సోనిక్ యుద్ధ విమానాలను కూడా పాక్‌కు అందించింది. కాలం మారింది.. కథ అడ్డం తిరిగింది చాలాకాలంపాటు ఆత్మరక్షణ విధానాన్నే అవలంబించిన భారత్.. కొంతకాలంగా దూకుడుగా వెళ్తోంది. అంతర్జాతీయ సమాజంలో పేరుప్రతిష్టలు పెంచుకోవటంతోపాటు తెలివైన దౌత్య విధానాలతో కొత్త మిత్రులను సంపాదిస్తోంది. ఈ క్రమంలో భారత్ పట్ల అమెరికా వైఖరిలోనూ స్పష్టమైన మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. జేడీ వాన్స్ ప్రకటనే అందుకు ఉదాహరణ అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణపై ఇటీవల ఆయన ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టమైన ప్రకటన చేశారు. ‘చూడండి.. ఆయుధాలు వదిలేయాలని భారత్‌కుగానీ, పాకిస్తాన్‌కు గానీ మేము చెప్పలేము. ఈ ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కూడా కాదు. దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము మొదటి నుంచీ చెబుతున్నాం. ఈ ఘర్షణ తీవ్రస్థాయి యుద్ధంగా, అణు యుద్ధంగా మారబోదనే నమ్ముతున్నాం’అని వాన్స్ పేర్కొన్నారు. వాన్స్ ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడిన పాక్‌పై.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుదారైన నిక్కీ హేలీ మరో బాంబు వేశారు. పహల్గాంలో సామాన్యులను చంపిన ఉగ్రవాదులను శిక్షించే హక్కు, అధికారం భారత్‌కు ఉన్నాయని ఆమె ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. బాధితురాలిగా నటించొద్దని పాక్‌కు చురకలంటించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

వారం రోజుల విరామం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్‌లకు బ్రేక్ పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్‌ను వెంటనే నిలిపివేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. లీగ్‌ను ‘వారం రోజుల పాటు’ ఆపేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గురువారం ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్‌ను అకస్మాత్తుగా ఆపేసినప్పుడే లీగ్ కొనసాగడంపై సందేహాలు వచ్చాయి.శుక్రవారం దీనిని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు యుద్ధం సాగుతుండగా, మరోవైపు ఐపీఎల్ రూపంలో వినోదం కొనసాగడం సరైంది కాదని బోర్డు భావించింది. ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లతో పాటు లీగ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవారందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ‘ఐపీఎల్ భాగస్వాములందరితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం.ప్రస్తుత స్థితిలో మేం దేశం వెంట ఉన్నాం. ప్రభుత్వానికి, సైన్యానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశాన్ని రక్షిస్తున్న ఆర్మీ ధైర్యసాహసాలకు మేం సెల్యూట్ చేస్తున్నాం. మన దేశంలో క్రికెట్ పట్ల అపరిమిత ప్రేమ ఉందనేది వాస్తవం. అయితే దేశంకంటే, దేశం సార్వభౌమత్వం, భద్రతకంటే ఏదీ ఎక్కువ కాదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. మాకు మద్దతుగా నిలిచిన ఐపీఎల్ భాగస్వాములందరికీ కృతజ్ఞతలు’ అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. లీగ్ కొనసాగించడం, కొత్త తేదీలు, వేదికలపై అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత పరిస్థితులను బట్టి త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా బోర్డు స్పష్టం చేసింది. క్రికెటర్లు స్వస్థలాలకు... ఐపీఎల్ వాయిదాపై ప్రకటన వచ్చిన వెంటనే అన్ని జట్లలోని క్రికెటర్లు తమ సొంత నగరాలకు బయలుదేరేలా ఆయా ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేశాయి. స్వదేశానికి వెళ్లిపోవాలనుకునే విదేశీ క్రికెటర్లకు ఏర్పాట్లపరంగా ‘ప్లేయర్స్ అసోసియేషన్’ సహకరిస్తోంది. గురువారం ధర్మశాలలో మ్యాచ్ రద్దయ్యాక ఢిల్లీ, పంజాబ్ క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ముందుగా బస్సు ద్వారా జలంధర్‌కు తరలించారు. అక్కడి నుంచి వారంతా ప్రత్యేక వందేభారత్ రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. విమర్శల బారిన పడరాదనే... ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో 58 మ్యాచ్‌లు ముగియగా... మరో 12 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. వీటిలో అహ్మదాబాద్‌లో మూడు... లక్నో, బెంగళూరులలో రెండు చొప్పున...హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, జైపూర్లలో ఒక్కో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇవి కాకుండా 4 ప్లే ఆఫ్స్‌లలో రెండేసి మ్యాచ్‌లకు హైదరాబాద్, కోల్‌కతా వేదికగా నిర్వహించాల్సి ఉంది. వాస్తవికంగా చూస్తే సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉన్నా... ఉత్తరాదిలోని కొన్ని నగరాలు మినహా ఈశాన్యం, దక్షిణం వైపు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. బీసీసీఐ స్థాయి, దానికి ఉన్న సాధన సంపత్తిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కేవలం వేదికలు మార్చి చకచకా ఈ 16 మ్యాచ్‌లు నిర్వహించడం ఏమాత్రం సమస్య కాదు. అయితే ఒకవైపు యుద్ధం సాగుతుంటే, మన సైనికులు పోరాడుతుంటే మీకు ఆటలు కావాలా అని సగటు భారతీయుడు ఆగ్రహిస్తున్నాడు. ఇంత సంకట స్థితిలో ఎన్నో విషయాల్లో ప్రభుత్వం నుంచి ఆంక్షలు, హెచ్చరికలు వస్తుండగా ఐపీఎల్ మాత్రం కొనసాగడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. దాంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది. అయితే పూర్తిగా సీజన్‌ను రద్దు చేయకుండా, లేక సుదీర్ఘ సమయం వాయిదా వేయకుండా ‘ఒక వారం వాయిదా’ అంటూ సన్నాయి నొక్కులు చూపిస్తోంది. బహుశా వచ్చే వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని, అప్పుడు మళ్లీ ఆడించవచ్చనే ఆలోచన కనిపిస్తోంది!ప్రత్యామ్నాయ తేదీలు ఏవి?బీసీసీఐ ‘వారం’ విరామం ప్రకటనను బట్టి చూస్తే వెంటనే కొనసాగించాలని భావిస్తున్నట్లుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఐపీఎల్ ముగియాలి. ఇప్పుడు మరో వారం దీనికి జోడిస్తే జూన్ 1న ముగిసేలా కొత్త షెడ్యూల్ ఇవ్వవచ్చు. సరిగ్గా చెప్పాలంటే టోర్నీని ముగించేందుకు బోర్డుకు 10 రోజులు చాలు. ‘డబుల్ హెడర్’లుగా రోజుకు రెండు లీగ్ మ్యాచ్‌ల చొప్పున 6 రోజులు... ప్లే ఆఫ్స్‌కు మరో 4 రోజులు సరిపోతాయి. జూన్ మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది కాబట్టి కష్టమనే చర్చ ఉన్నా... తొలి టెస్టు జూన్ 20న మొదలవుతుంది. ఐపీఎల్లో ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు జూన్ 10 వరకు చేరుకున్నా సమస్య లేదు. ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లు నిర్వహించకుండా ఆగిపోతే ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ఆగస్టు, సెపె్టంబర్ వరకు లీగ్ వెళుతుంది. అయితే ఆగస్టులో భారత జట్టు బంగ్లాదేశ్‌తో వన్డే, టి20 సిరీస్‌లను ఆడనుంది. దీనిని వాయిదా వేసినా ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్, ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే ‘హండ్రెడ్’ టోర్నీలు ఉన్నాయి. ‘హండ్రెడ్’లో సగం జట్లను ఐపీఎల్ యజమానులే కొన్నారు కాబట్టి ఇది అసాధ్యం. సెప్టెంబర్‌లో 19 రోజులు ‘ఆసియా కప్’ టోర్నీకి కేటాయించారు. దీనికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇక్కడ ఆడకపోవడమే కాదు... భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు జరగడం కూడా అసాధ్యమే! కాబట్టి ఈ ఒక్క టోర్నీని రద్దు చేస్తే ఐపీఎల్‌కు కావాల్సిన సమయం లభిస్తుంది.

మహిళా సైనికాధికారుల సేవలను ఉపయోగించుకోవాలి
న్యూఢిల్లీ: షార్ట్ సర్విసు కమిషన్(ఎస్ఎస్సీ)కు సంబంధించిన మహిళా సైనికాధికారులను విధుల నుంచి తప్పించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో వారికి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించకూడదని సూచించింది. ఇలాంటి సమయంలో వారి సేవలు ఉపయోగించుకోవాలని, వారికి అండగా నిలవాలని స్పష్టంచేసింది. తమకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 69 మంది మహిళా సైనికాధికారులకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు క్రమశిక్షణా చర్యల కింద పిటిషనర్లను విధుల నుంచి రిలీవ్ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. ఈ తరుణంలో ఈ పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. శక్తిసామర్థ్యలు కలిగిన మహిళల సేవలను చక్కగా వాడుకోవాలని కేంద్రానికి సూచించింది.

నాది లేటెస్ట్ మోడల్
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ గురించి చర్చ జరుగుతోంది. కానీ అది 2000 సంవత్సరం కంటే ముందున్న మోడల్. ప్రస్తుత తెలంగాణ మోడల్ 2025లో ఉన్న అప్ డేటెడ్ మోడల్. మోదీ మోడల్ వాట్సాప్ యూనివర్సిటీ అయితే, నాది స్కిల్స్ యూనివర్సిటీ. గుజరాత్లో ఉద్యోగాల్లేవు. నేను ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చా. అక్కడ రైతుల రుణమాఫీ లేదు.. నేను రూ.21 వేల కోట్లు మాఫీ చేశా. గుజరాత్లో మద్దతు ధర లేదు. తెలంగాణలో మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నాం. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం.మేం రిజర్వేషన్ల పెంపును సమర్థిస్తాం. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ మోడల్లో మీడియాకు స్వేచ్ఛ లేదు. మా మోడల్లో ఈ స్వేచ్ఛ ఉంది. అందుకే మోదీ మోడల్ అవుట్ డేటెడ్. నాది అప్ టు డేట్ మోడల్. అందుకే తెలంగాణను కేంద్రం అనుసరిస్తోంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం బెంగళూరు వేదికగా జాతీయ దినపత్రిక ది హిందూ నిర్వహించిన ‘ది హిందూ హడిల్’ చర్చాగోష్టిలో ఆయన హైదరాబాద్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ‘ముందుగా ఈ దేశాన్ని రక్షిస్తున్న భారత ఆర్మికి సెల్యూట్ చేస్తున్నా. సైనికులకు సంఘీభావం ప్రకటించే సమయం ఇది..’ అని సీఎం అన్నారు. అనంతరం పలు అంశాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. కులగణన భవిష్యత్ తరాలకు దారి చూపిస్తుంది ‘సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్. దేశంలో లేదా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కులగణన చేపడతామని ప్రజలకు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. మేము చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చేపట్టింది. కులగణన చేయడం మినహా కేంద్రానికి మరో మార్గం లేదు. ఈ కులగణన భవిష్యత్ తరాలకు దారి చూపిస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోంది. ఎస్సీల్లో 59 కులాలున్నాయి.వీటిలో కొన్ని కులాలు విద్య, ఉపాధి రంగాల్లో లబ్ధి పొందుతున్నాయి. కొన్ని వర్గాలకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శనం చేసింది. మేం వెంటనే రంగంలోకి దిగాం. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్ నియమించాం. ఈ కమిషన్ మూడు కేటగిరీల్లో ఎస్సీలను వర్గీకరించాలని చెప్పింది. ఆ సిఫారసుకు అనుగుణంగా ఎస్సీల వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యార్థి దశలోనే కులం సమస్య గుర్తించా ‘గ్రామీణ ప్రాంతం నుంచి వచి్చన నాయకుడిగా సమాజంపై కులం ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు బాగా తెలుసు. విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే ఆ సామాజిక వర్గాలకు చెందిన వారితోనే కలిసి ఉండడం ద్వారా సమాజం వారిని విస్మరిస్తోందని, దూరంగా ఉంచుతోందని గుర్తించా. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కులాల పేరుతో విభజించి చదివించడం మంచిది కాదు. అందుకే నా కేబినెట్ సహచరులకు, అధికారులకు చెప్పా.అన్ని వర్గాల ప్రజలకు మంచి విద్యా సదుపాయాలు కల్పించాలని, మంచి వాతావరణంలో వారికి విద్యాబుద్ధులు నేర్పాలని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులందరినీ కలిపి చదివించాలని వారు సూచించారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మొత్తంగా రూ.25 వేల కోట్ల పెట్టుబడి భవిష్యత్ కోసం పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలను చేపట్టాలి..’ అని రేవంత్ అన్నారు. రైతుల కోసం ఎన్నో చేస్తున్నాం.. ‘సంక్షేమం విషయంలో తెలంగాణ దేశంలోనే మంచి మోడల్. అయితే సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి జరగాలి. సంక్షేమం, అభివృద్ధి కలిసి ముందుకెళ్లాలి. నేను ఈ విధంగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. రుణమాఫీ, పెట్టుబడి సాయం, మద్దతు ధర కోసం రైతులు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. మేం తొలి ఏడాదిలోనే 25.30 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. ప్రతి యేటా రూ.18 వేల కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నాం. 24 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. సోనియాగాంధీ నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తీసుకొచి్చన పథకమిది. ఈ పథకం కింద ఏడాదికి రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ధాన్యానికి మద్దతు ధర, బోనస్ కలిపి క్వింటాల్‌కు రూ.2,800 ఇస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు. నా పోటీ మన దేశ నగరాలతో కాదు.. ‘స్వయం సహాయక సంఘాల (67 లక్షల మంది) మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పించాం. రాష్ట్రంలోని 10 వేల ఆర్టీసీ బస్సుల్లో వెయ్యి బస్సులు మహిళలకు కేటాయించాం. విద్యార్థులు డ్రెస్సులు కుట్టే కాంట్రాక్టు మహిళలకు ఇచ్చాం. యువకుల కోసం యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. దావోస్ వేదికగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో డ్రైపోర్టు, నెట్‌జీరో సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికి భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం చేశాం. నా పోటీ బెంగళూరు, అమరావతి, ముంబై, ఢిల్లీలతో కాదు. న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్లు నా లక్ష్యం..’ అని రేవంత్ పేర్కొన్నారు. వన్ పర్సన్–వన్ పార్టీ విధానం అంగీకరించం ‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు మేం వ్యతిరేకం కాదు. అయితే ముందు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడి నిబంధనలు రూపొందించాలని అడుగుతున్నాం. జనాభా ప్రాతిపదికన ముందుకెళితే దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ కూడా నష్టపోతుంది. మీరు నియోజకవర్గాలను ఎలా పెంచినా మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. లేనిపక్షంలో అది నియోజకవర్గాల పునర్విభజన కాదు. వన్ పర్సన్–వన్ పార్టీ విధానం ఇది. దీన్ని మేం అంగీకరించేది లేదు..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేసిన ఎం.కె.నారాయణన్ చర్చాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసించారు. ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొట్టి చెపుతున్నారంటూ అభినందించారు. ఈ కార్యక్రమానికి హిందూ తెలంగాణ పొలిటికల్ ఎడిటర్ ఆర్.రవికాంత్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఏటీఎంల మూసివేత వదంతులు.. బ్యాంకుల స్పష్టత
నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా...
కరాచీ ఎయిర్‌పోర్టు లాక్డౌన్.. పెట్రోల్ బంక్‌లు బంద్!
ఎల్ఐసీ కొత్త సర్వీసు.. వాట్సాప్ నుంచే..
ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక
నేను పీకే తాలుకా.. తలచుకుంటే లేపేస్తా...!
డ్రాగన్ బ్యూటీకి అదృష్టం.. బిగ్ ఛాన్సులతో బిజీ
వార్ టెన్షన్.. అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..
పంజాబ్‌లో క్షిపణి శకలాలు
జమ్మూకశ్మీర్‌పై కొనసాగుతున్న పాక్ కాల్పులు
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
చల్లని కబురు
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
ఏటీఎంల మూసివేత వదంతులు.. బ్యాంకుల స్పష్టత
నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా...
కరాచీ ఎయిర్‌పోర్టు లాక్డౌన్.. పెట్రోల్ బంక్‌లు బంద్!
ఎల్ఐసీ కొత్త సర్వీసు.. వాట్సాప్ నుంచే..
ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక
నేను పీకే తాలుకా.. తలచుకుంటే లేపేస్తా...!
డ్రాగన్ బ్యూటీకి అదృష్టం.. బిగ్ ఛాన్సులతో బిజీ
వార్ టెన్షన్.. అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్..
పంజాబ్‌లో క్షిపణి శకలాలు
జమ్మూకశ్మీర్‌పై కొనసాగుతున్న పాక్ కాల్పులు
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
చల్లని కబురు
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
Operation Sindoor సలాం, హస్నాబాద్!
సినిమా

కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్
తమిళ హీరో జయం రవి.. భార్య ఆర్తికి గతేడాది విడాకులు ఇచ్చేశాడు. దాదాపు 18 ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. కెన్నీషా అనే సింగర్ తో సదరు హీరో డేటింగ్ చేస్తున్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి పెళ్లి జరగ్గా.. జయం రవి కెన్నీషాతో కలిసి జంటగా వచ్చాడు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) ఉదయం నుంచి జయం రవి-కెన్నీషా కలిసున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఈ టైంలో మాజీ భార్య ఆర్తి చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనని ఇంటి నుంచి తరిమేశారని, జయం రవికి అసలు పిల్లలు బాధ్యత అనేదే లేదని ఆవేదన వ్యక్తం చేసింది.'ఏడాది పాటు మౌనాన్ని కవచంలా మోస్తున్నాను. నా కొడుకులు ప్రశాంతంగా ఉండాలి కాబట్టే ఇవన్నీ భరిస్తున్నాను. నాపై లేనిపోని ఆరోపణలు చాలా చేశావ్. అయినా సరే నేను నోరు మెదపలేదు. ఎందుకంటే నా కొడుకులు.. తల్లిదండ్రులు విడిపోయారనే బాధని అనుభవించకూడదు కాబట్టి. అంతే తప్ప నా దగ్గర నిజం లేదని కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఫొటోలు చూస్తోంది. కానీ మా మధ్యలో జరిగింది వేరు. విడాకుల ప్రక్రియ ఇంకా నడుస్తోంది. నాతో పాటు 18 ఏళ్లు సంసారం చేసిన వ్యక్తి.. ప్రేమ, నమ్మకంతో పాటు ప్రామిస్ చేసిన ప్రతి బాధ్యతని పక్కనబెట్టి నన్ను వదిలి వెళ్లిపోయాడు. నా బాధ్యత అని చెప్పిన ఆ వ్యక్తి.. నాకు ఆర్థికంగా అండగా నిలబడం, మాట సాయం గానీ చేయట్లేదు''ప్రస్తుతం మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. నాతో కలిసి ఇదే ఇంటిని నిర్మించిన సదరు వ్యక్తి.. బ్యాంక్ అధికారులతో కలిసి నేను బయటకు వెళ్లిపోయేలా చేశాడు. నేను డబ్బుల కోసమే ఈ విడాకుల డ్రామా ఆడుతున్నానని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎప్పుడో నా స్వార్థం చూసుకునేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ప్రేమని పంచాను. నమ్మకం చూపించాను. ఇప్పుడదే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది''ప్రేమించినందుకు పశ్చాత్తాపపడట్లేదు గానీ దాన్ని ఓ బలహీనతలా ఉపయోగించుకున్నందుకు బాధపడుతున్నాను. నా కొడుకుల వయసు 10, 14 ఏళ్లు. వాళ్లకు ఇప్పుడు కావాల్సింది భద్రత.. షాక్ కాదు, నిశ్బబ్దం కాదు. ఈ చట్టాల గురించి అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు వాళ్లు. సమాధానం లేని కాల్స్, రద్దయిన మీటింగ్స్.. ఇవన్నీ నాకు తగిలిన గాయాలు. నేను ఈరోజు మాట్లాడేది భార్యగా కాదు. అలా అని స్త్రీకి అన్యాయం చేసిన దానిలా కూడా కాదు. పిల్లల శ్రేయస్సు కోసం ఆలోచించే తల్లిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతాను''నువ్వు ఏమైనా చేయొచ్చు గానీ నిజాన్ని తిరిగి రాయలేవు కదా. తండ్రి అంటే టైటిల్ కాదు అదో బాధ్యత. మా విడాకుల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నా పేరు వెనక రవి అని ఉంటుంది. మీడియా వాళ్లకు చెప్పేదేంటంటే నన్ను మాజీ భార్య అని సంభోదించొద్దు. మేం ఇంకా లీగల్ గా విడాకులు తీసుకోలేదు. ప్రతికారమో మరేదో కాదు,పిల్లల్ని కాపాడే తల్లిగా ఇది నా బాధ్యత. నేను ఏడవను. గట్టిగా అరిచి గోలపెట్టను. కానీ బలంగా నిలబడతా. నిన్ను ఇంకా నాన్న అని పిలుస్తున్న ఇద్దరబ్బాయిల కోసం నేను అస్సలు తగ్గను' అని ఆర్తి రవి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi)

భారత సైన్యానికి హీరో విజయ్ దేవరకొండ విరాళం
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత సైన్యానికి పలువురు విరాళాలు ఇస్తున్నారు. తన వంతు బాధ్యతగా ఇప్పుడు విజయ్ కూడా విరాళం ప్రకటించాడు.(ఇదీ చదవండి: మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే) రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాని భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు విజయ్ దేవరకొండ చెప్పాడు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రమోషన్ అసలు చేస్తారా లేదా? సినిమా విడుదల కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) This year, @TheDeverakonda's birthday is more than a celebration - it’s about giving back.Spot the Deverakonda Birthday Truck in your city and grab a free ice cream!And for the next few weeks, a portion of all #RWDY proceeds will go to the Indian Armed Forces.Jai Hind.… pic.twitter.com/al65L0NWum— Suresh PRO (@SureshPRO_) May 9, 2025

మంచు మనోజ్.. 'కన్నప్ప'తో పోటీ పడట్లేదు
కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. ప్రస్తుతం అంతా సైలెంట్ గా ఉన్నారు. అయితే వివాదం నడుస్తున్న టైంలో కన్నప్ప గురించి మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన సినిమాకు భయపడే విష్ణు 'కన్నప్ప' వాయిదా వేశాడని చెప్పుకొచ్చాడు. అసలు విషయానికొస్తే.. ఏప్రిల్ 25న వస్తుందనుకున్న కన్నప్ప సినిమాని జూన్ 27కి వాయిదా వేశారు. ఇదే టైంలో మంచు మనోజ్ 'భైరవం' కూడా చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. లెక్క ప్రకారం గత డిసెంబరులోనే రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఓటీటీ డీల్ కుదరకపోవడమే, మరేదైనా కారణాలు తెలియదు గానీ రిలీజ్ లేటు చేస్తూ వచ్చారు.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) ఫైనల్ గా ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మే 30న థియేటర్లలోకి వస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే మనోజ్ ఆశపడ్డట్లు ఈసారి అన్న విష్ణు 'కన్నప్ప'తో పోటీ పెట్టుకోలేదు. అదే టైంలో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'కి పోటీగా బరిలో నిలిచారు.మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మినీ మల్టీస్టారర్ కి విజయ్ కనకమేడల దర్శకుడు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితీ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమవుతోంది. తమిళ హిట్ 'గరుడన్'కి రీమేక్ దీన్ని తెరకెక్కించడం విశేషం.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) This summer, get ready for a cinematic experience like no other! We are thrilled to announce that #BHAIRAVAM is hitting the big screens worldwide on May 30th! Prepare for an epic journey filled with action, emotion, and the unbreakable spirit of brotherhood. For me, this release… pic.twitter.com/sJ73HPiGIk— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 9, 2025

మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే
ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. మన సైనికులకు అండగా ఉంటానని మాటిచ్చారు. తన లేటెస్ట్ మూవీ వసూళ్ల నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగం మన సైనికులకు విరాళంగా ఇస్తానని మాటిచ్చారు.(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అల్లు అరవింద్.. గతంతో పోలిస్తే సినిమాలు తీయడం బాగా తగ్గించేశారు. కొన్ని చిన్న చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలా తీసిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. శ్రీ విష్ణు, కేతిక, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది.సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సందర్భంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాను భారత ఆర్మీకి అండగా ఉంటానని, సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతమేర ఆర్థిక సాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈయనలానే మిగతా దర్శక నిర్మాతలు హీరోహీరోయిన్లు కూడా సాయం చేసి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుకుందాం.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)
న్యూస్ పాడ్‌కాస్ట్

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం
క్రీడలు

‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా
న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్ టోర్నమెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్ వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న బెంగళూరు వేదికగా ఈ మీట్ జరగాల్సి ఉండగా... భారత్, పాక్ దాడుల నేపథ్యంలో టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం నీరజ్ చోప్రా వెల్లడించాడు. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ తొలి ఎడిషన్‌ను వాయిదా వేశాం. ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, భాగస్వాముల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే తదుపరి కార్యచరణ వెల్లడిస్తాం. ఈ క్లిష్ట సమయంలో దేశంతో దృఢంగా నిలబడటం చాలా ముఖ్యం. ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో భద్రతా బలగాలు పోరాడుతున్నాయి. మేమంతా వారి వెంటే. జై హింద్’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.

భారత సైన్యానికి సెల్యూట్.. ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము: విరాట్ కోహ్లి
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ద వాతవారణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ రూపంలో భారత్ బదులు తీర్చుకుంది. భారత సైన్యం వరుసగా రెండు రోజుల పాటు పాకిస్తాన్, పాక్తిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేస్తూ వంది మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాకిస్తాన్ ప్రతిదాడులకు కూడా భారత సాయుద బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తమ దేశభక్తి చాటుకున్నారు."ఈ క్లిష్ట సమయాల్లో దేశాన్ని కాపాడుతున్న మన సాయుధ దళాలకు సెల్యూట్. సైన్యం ధైర్యసాహసాలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు" కోహ్లి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కోహ్లి ఈ పోస్ట్ చేసిన గంటలోనే 34 లక్షల మంది లైక్ చేస్తూ ఈ పోస్టును షేర్ చేయడం విశేషం.భారత త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ తీసుకునే ప్రతీ నిర్ణయం మనల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. మన యోధులు మన దేశ గౌరవానికి అండగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండాలి. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా, నమ్మకుండా ఉండాలి. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

పాకిస్తాన్‌కు భారీ షాక్.. పీఎస్ఎల్ నిర్వహణకు యూఏఈ నో?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని భావించిన పాక్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ తగిలింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పీసీబీ అభ్యర్ధను తిరష్కరించినట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ సిద్దంగా లేనట్లు సమాచారం. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని పీసీబీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి."బీసీసీఐతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2021, ఐపీఎల్ ఎడిషన్లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈలోనే ఆడింది. యూఈఏలో చాలా మంది క్రికెట్ అభిమానులు దక్షిణాసియా నుంచే ఉన్నారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పీఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇరు దేశాల మైత్రి దెబ్బతింటుంది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పీఎస్ఎల్ను నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సిద్దంగా లేదని" క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రావాల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరగడంతో పీఎస్ఎల్-2025 సీజన్‌ను పీసీబీ వాయిదా వేసింది.

IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ల డబ్బులు రీఫండ్
పాకిస్తాన్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే కొత్త షెడ్యూల్, వేదికలను ఖారారు చేస్తామని భారత క్రికెట్ బోర్డు తెలిపింది.దీంతో మే 9(శుక్రవారం) నుంచి మ్యాచ్‌లు ఆగిపోనున్నాయి. ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో ఆయా ఫ్రాంచైజీలు అభిమానులకు టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేయడం ప్రారంభించాయి. షెడ్యూల్ ప్రకారం..ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడాల్సింది. కానీ వాయిదా పడడంతో టిక్కెట్ల డబ్బులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేస్తామని వెల్లడించింది. కాగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అర్ధాంతంగా రద్దు అయ్యింది. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహించే అవకాశముంది.
బిజినెస్

వాటా విక్రయానికి యస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ)సహా పలు ప్రయివేట్ రంగ బ్యాంకులు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న యస్ బ్యాంక్‌లో కొంతమేర వాటా విక్రయించనున్నాయి. తద్వారా జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) మొత్తం 20 శాతం వాటా సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకి రూ. 21.50 ధరలో ఇందుకు రూ. 1,483 కోట్లు వెచ్చించనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద లావాదేవీగా ఈ వాటా విక్రయం నమోదుకానున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఎస్ఎంబీసీకి యస్ బ్యాంక్‌లో 13.19 శాతం వాటా ఎస్బీఐ విక్రయించనుంది. డీల్ విలువ రూ. 8,889 కోట్లు. ఈ బాటలో ఇతర బ్యాంకులు యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉమ్మడిగా 6.81 శాతం వాటా అమ్మనున్నాయి. వీటి విలువ రూ. 4,594 కోట్లు. ఫలితంగా యస్ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారుగా ఎస్ఎంబీసీ అవతరించనుంది. 2020 మార్చిలో యస్ బ్యాంక్ పునర్నిర్మాణ పథకంలో భాగంగా 2020 మార్చిలో ఎస్బీఐసహా 7 ప్రయివేట్ రంగ బ్యాంకులు ఇన్వెస్ట్ చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(ఈసీసీబీ) యస్ బ్యాంక్‌లో 13.19 శాతం వాటాకు సమానమైన 413.44 కోట్ల షేర్లను విక్రయించేందుకు అనుమతించినట్లు ఎస్బీఐ పేర్కొంది. యస్ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎస్బీఐ 24 శాతం వాటా కలిగి ఉంది. 13 శాతంపైగా వాటా అమ్మకం ద్వారా రూ. 8,889 కోట్లు అందుకోనుంది. ఇతర బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ 2.75 శాతం, ఐసీఐసీఐ 2.39 శాతం, కొటక్ మహీంద్రా 1.21 శాతం, యాక్సిస్ 1.01 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ 0.92 శాతం, ఫెడరల్ 0.76 శాతం, బంధన్ 0.7 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. తదుపరి దశ వృద్ధికి తాజా లావాదేవీ దోహదపడనున్నట్లు యస్ బ్యాంక్ ఈ సందర్భంగా పేర్కొంది. కాగా.. ఇందుకు ఆర్బీఐ, సీసీఐ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. టాప్–2లో జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థ ఎస్ఎంబీసీ 2 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. తద్వారా జపాన్‌లో రెండో పెద్ద బ్యాంకింగ్ కార్పొరేషన్‌గా నిలుస్తోంది. దేశీయంగా ప్రధాన విదేశీ బ్యాంకులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా సొంత అనుబంధ సంస్థ, డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ.. ఎస్ఎంఎఫ్జీ ఇండియా క్రెడిట్ కంపెనీని నిర్వహిస్తోంది. వాటా చేతులు మారుతున్న వార్తలతో యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 10 శాతం జంప్‌చేసి రూ. 20 వద్ద ముగిసింది.

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్కోట్లకు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. ఆ తరువాత విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది.ఈ సమయంలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే.. రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం.. ఎయిర్ ఇండియా కాంటాక్ట్ సెంటర్లకు కాల్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.#TravelAdvisoryFollowing a notification from aviation authorities on continued closure of multiple airports in India, Air India flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Chandigarh, Bhuj, Jamnagar and Rajkot – are being cancelled till…— Air India (@airindia) May 9, 2025

ఇండిగో కీలక ప్రకటన: 10 నగరాల్లో విమానాల రద్దు
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన 'ఇండిగో' మే 10న రాత్రి 11:59 గంటల వరకు 10 నగరాలకు విమాన సేవలను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రయాణికులు తమ బుకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని, రీషెడ్యూల్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఎయిర్‌లైన్ సూచించింది. రేపు (శనివారం) రాత్రి 11:59 గంటల వరకు శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, రాజ్కోట్లకు విమాన సదుపాయం ఉండదు.విమానాలకు రద్దుకు కారణమేమిటనే విషయాన్ని.. ఎయిర్‌లైన్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ భారతదేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య విమానాలను రద్దు చేసి ఉండొచ్చని సమాచారం. మే 10 తరువాత విమాన సేవలు యధావిధిగా కొనసాగుతాయా?, లేదా మళ్ళీ నిలిపివేస్తారా.. అనే విషయాన్ని ఇండిగో వెల్లడించాల్సి ఉంది.ఇలాంటి పరిస్థితిలో ప్రయాణికులు ఏం చేయాలి?➤అప్డేట్ కోసం కోసం ఇండిగో మెసేజస్ లేదా ఇమెయిల్‌లను చేస్తూ ఉండండి.➤రీషెడ్యూల్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎయిర్‌లైన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ను సందర్శించండి.➤ప్రత్యామ్నాయ ప్రయాణ ఎంపికల కోసం కస్టమర్ సేవను సంప్రదించండి.ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీ➤ఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి.➤75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది.#6ETravelAdvisory: Your safety is paramount. Flights to/from the following cities are cancelled until 2359 hrs on 10th May. We are here to help you travel with ease. Check flight status here https://t.co/ll3K8PwtRV. To rebook or claim a refund, visit https://t.co/51Q3oUe0lP. pic.twitter.com/v5BSdX3dDo— IndiGo (@IndiGo6E) May 9, 2025

భారత్ - పాక్ యుద్ధం: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 79,454.47 వద్ద, నిఫ్టీ 265.80 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 24,008.00 వద్ద నిలిచాయి.ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, మయూర్ యూనికోటర్స్, సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ, ప్లాటినం ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నవకర్ అర్బన్స్ట్రక్చర్, చెంబాండ్ కెమికల్స్, సీపీ క్యాపిటల్, ముత్తూట్ మైక్రోఫిన్, ఏజీఐ ఇన్ఫ్రా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).
ఫ్యామిలీ

స్ట్రీట్ వేర్.. షీక్ స్టైల్.. ఐపీఎల్ క్రికెటర్ @ఐవేర్..
సాక్షి, సిటీబ్యూరో : ఫ్యాషన్ ప్రపంచంలో స్ట్రీట్ వేర్‌కు తనకంటూ ఓ స్టైల్ ఉంది.. ప్రముఖ బ్రాండ్స్ తమదైన శైలిలో వీటిని డిజైన్ చేసి యూత్‌ని ఆకట్టుకుంటుంటాయి.. అదే క్రమంలో ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షీక్ తమ స్ట్రీట్ వేర్‌ను నగరంలో ప్రదర్శించింది. మాదాపూర్‌లోని నోవోటెల్ హోటల్లో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.. ఈ సందర్భంగా బ్రాండ్‌ను సిటీలో లాంచ్ చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅగ్రగామి క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నగరంలో సందడి చేశాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు, షేక్ హ్యాండ్స్ ఇస్తూ వారిని అలరించాడు. నగరంలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోని ఐవేర్ బ్రాండ్ అయిన ఎఓ ఆప్టికల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాండ్ రూపొందించిన సరికొత్త కళ్లజోళ్ల కలెక్షన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండ్ డైరెక్టర్ ప్రియాంక గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి : Operation Sindoor సలాం, హస్నాబాద్!ఇంటర్న్ షిప్‌తో కెరీర్‌కు ఊతం నగరంలోని కేఎల్‌హెచ్ డీమ్డ్ యూనివర్సిటీ, అజీజ్ నగర్ క్యాంపస్, తమ విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలు ( MNఇలు) సహా ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్లేస్మెంట్ ఆఫర్లు పొందారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ తెలిపారు. పలు సంస్థల్లో విద్యార్థులకు ఇంటర్న్íÙప్ ఆధారిత ఉద్యోగాలు లభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కెరీర్‌కు ఎంతో మేలు చేస్తాయని, పెద్ద సంఖ్యలో తమ విద్యార్థులు ఒప్పో వంటి సంస్థల్లో ఇంటర్న్íÙప్ టూ ప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ ద్వారా రూ.19లక్షల ప్యాకేజీ దక్కించు కోనున్నారని వెల్లడించారు. మరికొందరు విద్యార్థులు సీమన్స్ సంస్థ నుంచి నేరుగా ప్లేస్మెంట్ ఆఫర్స్ దక్కించుకున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Rahu Ketu రాహుకేతువుల కథ
భారతీయ సంస్కృతిలో సూర్య, చంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ ఒక కారణం: విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతుంటాడు. రాక్షసులకు సుర మాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. దీనిని దక్షప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకునిఅసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్య చంద్రులు కను సైగలతో విష్ణువుకి తెలియ జేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు.తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో ‘మహాత్మా! అకారణంగా నా కంఠాన్ని తెగగొట్టావు. నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా’అని అడుగుతాడు.రాహువు మాటలు విన్న విష్ణువు మనసు కరుగుతుంది. ‘సరే జరిగిపోయిన దానినే తలచి బాధ పడడం తగదు. అది విధివిధానం. నీకేం కావాలో కోరుకో’ అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు ‘దేవా! సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు’ అంటాడు.ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅందుకు విష్ణువు ‘నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏడాదిలో ఏదైనా ఓ అమావాస్యనాడు సూర్యుడిని, పౌర్ణమినాడు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల వెయ్యి ముక్కలయి చనిపోతావు. సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకు వారికీ శిక్ష చాలు’ అంటాడు.రాహువుకు తల, మొండెం వేర్వేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు. తల కేతువుగా సూర్యుడిని మింగడానికి, మొండెం రాహువుగా చంద్రుని మింగడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ విధంగా సూర్యచంద్రులు రాహుకేతువుల పాల్పడి గ్రహణాలు మొద లయ్యాయని పురాణ కథ. అయితే గ్రహణాలు ఏర్పడడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయన్నది గమనించాలి. – యామిజాల జగదీశ్

మినీ ఆఫ్రికా@ టోలిచౌకీ..!
టోలిచౌకీని ఆనుకుని ఉన్న పారామౌంట్ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తుంది. అధునాతన నివాస గృహాలు ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఈ కాలనీ ప్రస్తుతం సూడాన్, సొమాలియా వాసుల అడ్డాగా పేరుగాంచింది. ఇక్కడ ఉంటున్న వారిలో 90 శాతం మంది మినీ ఆఫ్రీకాకు చెందిన వారే. ప్రశాంత వాతావరణంలో ఉండడంతో పాటు ఫిలింనగర్, జూబ్లీహిల్స్, టోలిచౌకీ చౌరస్తా తదితర ప్రదేశాలకు అత్యంత సమీపంలో ఉన్న పారామౌంట్ కాలనీ ఆఫ్రీకా దేశాలకు చెందిన విద్యార్థులకు అడ్డాగా నిలుస్తోంది. పదేళ్ల క్రితం స్థానికులతో నిండి ఉన్న ఈ కాలనీ నేడు ఆఫ్రికా దేశస్తులతో నిండివుంది. కొత్తగా నిర్మితమవుతున్న భవనాలను సైతం సూడాన్, సొమాలియా దేశాలకు చెందిన విద్యార్థులు అద్దెకు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఇరానీ రెస్టారెంట్లు, చిన్న చిన్న కిరాణా దుకాణాలు మాయమై వాటి స్థానంలో అత్యాధునిక ఆఫ్రికన్ కిచెన్లు వెలిశాయి. ఆఫ్రికన్ తరహా జీవనశైలి.. టీ సెంటర్లలో సైతం అరేబియన్ టీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి షాపులు ఆఫ్రికన్ దేశాల వారికి అవసరమయ్యేవే ఎక్కువగా లభిస్తున్నాయి. రేడీమేడ్ షాపుల్లో సైతం సూడాన్ యువకులు ఇష్టపడి తొడిగే టీషర్ట్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఆఫ్రికన్ దేశాల నుంచి విద్యాబ్యాసం కోసం వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం పలు కారణాలతో ఇక్కడకు వస్తున్నారు. ఒక సూడానీస్‌తో పాటు అదనంగా ఇద్దరు ముగ్గురు వారి కుటుంబ సభ్యులు ఒక్కొ ప్లాట్‌లో ఉంటున్నారు. దీంతో స్థానికులు, వ్యాపారులు సైతం నెమ్మదిగా ఇంగ్లిష్తో పాటు సూడానీస్, సొమాలియా భాషను నేర్చుకుంటున్నారు. (చదవండి: రేపటి నుంచే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ పోటీలు..!)

Miss world 2025: అందరి చూపు.. భాగ్యనగరం వైపు..
ప్రస్తుతం ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపే చూస్తోంది. దాదాపు 120 దేశాలకు పైగా ఆయా దేశ అధికార ప్రతినిథులు, ప్రముఖులు నగరానికి గగనతల ప్రయాణం చేస్తున్నారు. నగర వేదికగా ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతి రోజూ వివిధ దేశాలకు చెందిన సుందరీమణులతో కళకళలాడుతోంది. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనే 109 దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే నగరానికి చేరుకోగా మరికొన్ని దేశాలకు చెందిన వారు శుక్రవారం రానున్నారు. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ ఘన వేదికగా మారిన విషయం విధితమే.. ఇందులో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే ప్రీ ట్రయల్స్‌లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెనా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి తారలు మిస్ వరల్డ్ వేదిక పై ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. అంతేకాకుండా అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా 72వ మిస్ వరల్డ్ పోటీల్లో అభ్యర్థులు పాల్గోనుండడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో వరల్డ్ టాప్ మోడల్స్‌తో పాటు విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, ఆరి్టస్టులు, విభిన్న రంగాలకు చెందిన ఉద్యమకారులు తమ దేశాల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పోటీపడుతుండటం మరో విశేషం. దేశవ్యాప్తంగా డిజిటల్ వెల్కమ్.. పోటీదారులు దాదాపు నెల రోజులపాటు తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు. గతేడాది ముంబయిలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరగగా, ఈ ఏడాది మే 31న హైదరాబాద్, హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది. మిస్ వరల్డ్ పోటీలను వరుసగా రెండేళ్ల పాటు భారత్‌లో నిర్వహించడం తొలిసారి. ఈ అరుదైన గౌరవం దేశానికి మాత్రమే కాదు, తెలంగాణకు కూడా విశ్వవేదికపై విశిష్ట గుర్తింపునిస్తుంది. ఈ విశిష్ట కార్యక్రమానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ వెల్కమ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోటీలను తిలకించడానికి సామాన్యులకు సైతం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో వివిధ నగరాల నుంచి ఫ్యాషన్ ఔత్సాహికులు నగరానికి రావడానికి సన్నద్ధమవుతున్నారు. (చదవండి: Miss World 2025: అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు')
ఫొటోలు


హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)


HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)


ట్రెడిషనల్ + వెస్ట్రన్... లాపతా లేడీ సరికొత్త స్లైల్ (ఫొటోలు)


ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)


హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)


తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)


బర్త్ డే స్పెషల్.. సాయిపల్లవి గురించి ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)


అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)


హైదరాబాద్ : సైన్యానికి సంఘీభావం..సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ (ఫొటోలు)
అంతర్జాతీయం

పాకిస్థాన్‌కు ఆర్థిక సంకెళ్లు?
ఢిల్లీ: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు (IMF) ఆలోచనలో పడింది.. 1.3 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలా ? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో ఐఎంఎఫ్ సమావేశం కానుంది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అప్పు ఇవొద్దని భారత్ కోరుతోంది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అవుట్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయవద్దని భారత డిమాండ్ చేస్తోంది.పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడమనే లక్ష్యంగా ఇండియా పావులు కదుపుతోంది. మరో వైపు, పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాలను కూడా భారత్ సమర్పించిన సంగతి తెలిసిందే.కాగా, ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.

పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచీ అబద్ధాలే..
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాదుల శిబిరా లు, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తేల్చిచెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా ముష్కర మూకలకు పాకిస్తాన్ నిస్సిగ్గుగా మద్దతిస్తోందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు.పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టు క్యాంపులపై జరిగిన దాడికి మతం రంగు పులుముతోందని పాక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పుట్టినప్పటి నుంచి పాకిస్తాన్ అబద్ధాలే చెబుతోందని విమర్శించారు. 1947 నుంచి పాకిస్తాన్ అబద్ధాలు వినడం అందరికీ అలవాటైపోయిందని అన్నారు. విక్రం మిస్రీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడా రు. పాకిస్తాన్ తీరుపై విరుచుకుపడ్డారు.‘‘1947లో పాకిస్తాన్ సైన్యం జమ్మూకశ్మీర్‌పై దాడికి దిగింది. కానీ, ఆ దాడితో సంబంధం లేదంటూ ఐక్యరాజ్యసమితికి అబద్ధాలు చెప్పింది. కేవలం గిజరినులే జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారని నమ్మబలికింది. భారత సైన్యం, ఐరాస బృందం అక్కడికి చేరుకుంటే అసలు సంగతి తెలిసింది. చివరకు చేసేది లేక తమ సైన్యమే జమ్మూకశ్మీర్‌పై దాడి చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించింది.పాకిస్తాన్ అబద్ధాల ప్రయాణం 75 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి ఇది మాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. పహల్గాంపై పాక్ అలాంటి అబద్ధాలే చెబుతోంది. తప్పుడు ప్రచారంతో నమ్మించాలని చూస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. పుట్టుక నుంచే అబద్ధాలు మొదలు పెట్టిన పాకిస్తాన్‌ను నమ్మాల్సిన అవసరం లేదు. మసీదులపై భారత్ సైన్యం దాడి చేయలేదు భారత్‌కు చెందిన 15 సైనిక స్థావరాలపై దాడిచేసేందుకు పాక్ ప్రయత్నించగా భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది. భారత్‌ను ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్ మత ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. ప్రజలను రెచ్చగొట్టడానికి మతంకార్డు వాడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో సిక్కు మతస్తులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేసింది. గురుద్వారాతోపాటు సిక్కు ఇళ్లపై దాడికి దిగింది. ఈ దాడుల్లో 16 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.మసీదులపై భారత సైన్యం దాడి చేసిందంటూ పాక్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఉగ్రవాదుల క్యాంపులే ఇండియన్ ఆర్మీ లక్ష్యం. నిజానికి ఉగ్రవాదులకు మసీదుల్లో ఆశ్రయం కల్పించింది పాకిస్తానే. మసీదులను రక్షణగా వాడుకోవడం నిజం కాదా? ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడం దారుణం. పహల్గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.భారత్‌లో పాక్ ఆటలు సాగవు. ఇక్కడ మతం పేరిట రెచ్చగొట్టాలని చూస్తే ఎవరూ రెచ్చిపోరు. పహల్గాంలో ఉగ్రదాడిని మతాలకు అతీతంగా భారతీయులంతా ఖండించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం–జీలం ప్రాజెక్టును ఇండియా టార్గెట్ చేసిందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. ఈ సాకుతో ఇండియాలోని మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే జరగబోయే పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాలి’’అని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. ఉగ్రవాదులకు అధికారిక అంత్యక్రియలా? ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు.‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.

వైరల్ వీడియో.. ఆపరేషన్ సిందూర్.. ఏడ్చేసిన పాక్ ఎంపీ
ఢిల్లీ: భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతోపాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.‘భగవంతుడా.. మేమంతా నీముందు మోకరిల్లామ్.. దయచేసి ఈ దేశాన్ని కాపాడు’అని ఇక్బాల్ మొరపెట్టుకున్నాడు. ‘మనదేశం ఇప్పుడు ఎంతో వేదనలో ఉంది. ప్రజాప్రతినిధులంతా ఏకమై, ఈ దేశాన్ని కాపాడాలని భగవంతున్ని ప్రార్థిద్దాం’అని సహచర ఎంపీలకు సూచించారు. అధికార పార్టీ ఎంపీనే ఏడ్చేయటం ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Pakistani Parliament Member breaks down inside National Assembly of Pakistan after #OperationSindoor impact. Cries for help to Allah. This is Major Tahir Iqbal, former officer of Pakistan Army, now a Pakistani politician. This is the real mood in Pakistan. pic.twitter.com/Xeg7GzxRx4— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 8, 2025

మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
దుబాయ్: ఎర్ర సముద్రంలోని యూఎస్ఎస్ హారీ ఎస్ ట్రూమన్ విమాన వాహన నౌకపై మోహరించిన మరో ఫైటర్ జెట్ సముద్రంలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. అధునాతన ఎఫ్/ఏ–18 సూపర్ హార్నెట్ రకం విమానం ల్యాండయ్యే క్రమంలో జరిగిన పొరపాటుతో షిప్‌పై నుండే స్టీల్ వైర్ తాళ్లకు హుక్ కాలేదని, ఫలితంగా జారి సముద్ర జలాల్లో పడిపోయిందని ఓ అధికారి చెప్పారు. అందులోని ఇద్దరు పైలట్లను హెలికాప్టర్ సాయంతో రక్షించామని, ఘటనలో వారిద్దరూ గాయపడ్డారని వివరించారు. ఈ జెట్ ఖరీదు రూ.513 కోట్లు. ఇదే షిప్‌పై సరిగ్గా ఇలాంటి విమానమే ఏప్రిల్‌లో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోవడం తెల్సిందే. గతేడాది డిసెంబర్లో అమెరికాకే చెందిన యూఎస్ఎస్ గెట్టిస్బర్గ్ నౌక గైడెడ్ మిస్సైల్ ప్రయోగించి మరో ఎఫ్/ఏ–18ను పొరపాటున కూలి్చవేసింది. ట్రూమన్ విమాన వాహక నౌక ఫిబ్రవరిలో ఈజిప్టులోని పోర్ సయీద్‌లో వాణిజ్య నౌకను ఢీకొట్టింది. ఎర్ర సముద్ర జలాల్లో పశ్చిమ దేశాల వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్న యూఎస్ఎస్ కార్ల్ విన్సన్‌కు తోడుగా అమెరికా ప్రభుత్వం యూఎస్ఎస్ హారీ ట్రూమన్ను ఇక్కడికి పంపించింది.
జాతీయం

పాశుపతాలు
పాక్ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్–400, ఆకాశ్ ఎన్జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. పెచోరా : దశాబ్దాలుగా సేవలు ఇది సోవియట్ కాలంనాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ (ఎస్ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్ ఆధారిత మిసైల్ లాంచర్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. → ఐదు హై ఇంటర్‌సెప్టివ్ యాంటెన్నాలతో కూడిన 4ఆర్90 యత్నాగన్ రాడార్ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్ జామింగ్ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.కాజ్ : మన ఇంద్రజాలం కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (సీఏయూఎస్). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్ డిటెక్షన్, సాఫ్ట్/హార్డ్ కిల్ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్ (ఎలక్ట్రో–ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్ కిల్ (డ్రోన్ల కమ్యూనికేషన్ సిగ్నల్స్ జామింగ్), హార్డ్ కిల్ (నేలకూల్చడం) చేస్తుంది.సమర్: వైమానికాస్త్రం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ (సమర్). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్–1 వ్యవస్థ ఆర్–73ఈ, సమర్–2 ఆర్–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్–73ఈ మిసైళ్ల రేంజ్ 8 కి.మీ. ఆర్–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.ఏడీ గన్స్: లక్ష్యమేదైనా తుత్తునియలే ఎయిర్ డిఫెన్స్ గన్స్. ఎల్–70, షిల్కా తదితరాలు మన ఏడీ వ్యవస్థలో ప్రధానమైనవి. → ఎల్–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బోఫోర్స్ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివాటి ద్వారా ఎల్–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్. షిల్కా అనేది వీటి రష్యన్ నిక్‌నేమ్. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్ ప్రొపెల్డ్ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్ డెస్క్

దాయాది.. మళ్ళీ బరితెగింపు
దాయాది బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్‌పై విరుచుకుపడేందుకు విఫలయత్నం చేసి చావుదెబ్బ తిన్న పాకిస్తాన్.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయతి్నంచింది. శుక్రవారం చీకట్లు పడుతూనే జమ్మూకశీ్మర్ మొదలు రాజస్తాన్ దాకా 26కుపైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఈ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జో«ద్‌పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో శుక్రవారం రాత్రి సమీక్షించారు. న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. చీకట్లు పడుతూనే జమ్మూ కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జో«ద్‌పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాధిపతులు భేటీలో పాల్గొన్నారు. భావి కార్యాచరణపై లోతుగా చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి మిస్రీ, దోవల్‌తో కూడా మోదీ గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమై పరిస్థితిపై చర్చించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సరిహద్దుల వెంబడి పరిస్థితిపై కూలంకషంగా సమీక్ష జరిపారు. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా పూర్తిస్థాయిలో విధుల్లో నియోగించాల్సిందిగా ఆర్మీ చీఫ్‌ను కేంద్రం ఆదేశించింది. శత్రువుకు మర్చిపోలేని రీతిలో బుద్ధి చెప్పాలని సైన్యాన్ని రాజ్‌నాథ్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీ వివేక్ శ్రీవాత్సవ సర్క్యులర్ పంపారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని పలు విమానాశ్రయాల మూసివేతను మే 15 దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి. పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

'పిల్లల చనిపోతున్నారు': కన్నీళ్లు పెట్టుకున్న జమ్మూ & కాశ్మీర్ మాజీ సీఎం
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. పాక్.. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో సరిహద్దులో ఉన్న అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లలు సైతం చనిపోతుండటం ఎంతో బాధాకరమని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి 'మెహబూబా ముఫ్తీ' పేర్కొన్నారు.పాకిస్తాన్ సైనిక చర్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ కాల్పుల్లో పిల్లలు.. మహిళలు మరణిస్తున్నారని అన్నారు. ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ''అప్పటి వరకు ఆడుకుంటున్న కవలలు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయారు''. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? జమ్మూ & కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారు ఎంతకాలం ఈ బాధను అనుభవించాలి?.. తల్లులకు ఎంతకాలం ఈ కడుపుకోత? అని ప్రశ్నిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.పూంచ్, రాజౌరి, జమ్మూ జిల్లాల్లో పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయి. పాక్ కాల్పులకు 16 మంది మరణించారు. ఇందులో ఐదుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ చర్యకు భారత సైన్యం కూడా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రోన్లు & క్షిపణులను ఉపయోగించి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ మరో ప్రయత్నం చేసింది. అయితే వీటన్నింటి కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది.#WATCH | Srinagar, J&K | On India-Pakistan tensions, PDP chief Mehbooba Mufti says, "What is the fault of the children and women that they are getting trapped in this crossfire?... Military action treats symptoms, not the root cause. It never provides a solution or peace. Both… pic.twitter.com/n6lCwYlwuj— ANI (@ANI) May 9, 2025

దేశంలో మొట్టమొదటి అమెరికా వర్సిటీ క్యాంపస్
న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటిసారిగా అమెరికా యూనివర్సిటీ ఒకటి క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. షికాగోలోని ఇలినాయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. ముంబైలో ఏర్పాటయ్యే ఈ క్యాంపస్ 2026 నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ వంటి డిమాండున్న విభాగాల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించనుంది.షికాగో యూనివర్సిటీ క్యాంపస్‌లో మాదిరిగానే విద్యాపరంగా కఠినమైన, అనుభవ పూర్వక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉండే పాఠ్యాంశాలను బోధిస్తామని ఇలినాయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ రాజ్ ఎచంబడి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక చేసే బోధనాసిబ్బంది, ఇలినాయీ టెక్ (Illinois Tech) అమెరికా క్యాంపస్‌ల నుంచి విజిటింగ్ ప్రొఫెసర్లు కూడా ఉంటారన్నారు. కాగా, యూకేకు చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీ (southampton university) ఈ ఏడాదిలోనే భారత్‌లో క్యాంపస్ (Campus) ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్, వొల్లొన్గాంగ్ వర్సిటీలు ఇప్పటికే గుజరాత్లో పనిచేస్తున్నాయి. సైన్యానికి పార్లమెంటరీ కమిటీల అభినందనలున్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌తోపాటు పీవోకేలో ఉగ్ర లక్ష్యాలపై దాడులు చేపట్టిన మన బలగాలను పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్(పీఏసీ) అభినందనలు తెలిపింది. 2025–26కు గాను కొత్తగా ఏర్పాటైన కమిటీ మొట్టమొదటి భేటీ ఈ మేరకు గురువారం ఒక తీర్మానం ఆమోదించినట్లు కమిటీ చైర్ పర్సన్ కేసీ వేణుగోపాల్ చెప్పారు. పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఇదేవిధమైన తీర్మానాన్ని ఆమోదించింది. చదవండి: కల్నల్ సోఫియా ఖురేషీని చూసి కూడానా..
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు
సనత్‌నగర్: ఉద్యోగం కోసం వచ్చినన ఓ వ్యక్తి రూ.1.40 లక్షల విలువైన రెండు ఐఫోన్లను చోరీ చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట డీఐ జి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేటలోని ఎఫ్డీఆర్ ఆర్డీ టవర్స్‌లో గల జెప్టో కార్యాలయానికి స్టోర్ ప్యాకర్‌గా పనిచేసేందుకు బాలానగర్‌లోని జింకలవాడకు చెందిన గౌతమ్ అంకిత్‌పాత్ర (24) ఈ నెల 3వ తేదీన వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత స్టోర్‌లో పనిచేసేందుకు అంగీకరించాడు. స్టోర్‌ను ఒకసారి చూసి వస్తానని చెప్పి స్టోర్‌లో కనిపించిన రెండు విలువైన ఐఫోన్లను తీసి దాచుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కార్యాలయానికి రాలేదు. ఆ తర్వాత స్టోర్ ఆడిట్ చేసిన నిర్వాహకులు రెండు ఐఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గౌతమ్ అంకిత్‌పాత్ర సెల్ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు స్టోర్ ఉద్యగి తిలక్‌కుమార్ బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సికింద్రాబాద్: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచి్చన వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ఒడిశా రాష్ట్రం పలపాతి గ్రామానికి చెందిన జడునాథ్ ముర్ము, మల్హో మణి ముర్ము(26) దంపతులు. ఈ నెల 6న సాయంత్రం 8 గంటల సమయంలో భార్యభర్తలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకొని విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలెక్కారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ ఫాం నంబర్ 1లోని గేట్ నంబర్ 5 వద్ద కూర్చున్నారు. టూత్‌పేస్ట్ తీసుకొచ్చేందుకు భర్త జడునాథ్ బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా భార్య మల్హో మణి ఆచూకీ లభించకపోవడంతో జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లో యువకుడి ఆత్మహత్య చిక్కడపల్లి: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌కు వచి్చన గుర్తుతెలియని యువకుడు అక్కడే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన మెట్రో సిబ్బంది 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు
కర్నూలు (సెంట్రల్)/వెల్దుర్తి: కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు హత్య కేసులో 11 మంది నిందితులపై నేరం రుజువైంది. వీరందరికీ జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి జి. కబర్థి గురువారం తీర్పు చెప్పారు. మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డి అనుచరులతో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో పెళ్లికి రెండు వాహనాల్లో బయల్దేరారు. నిందితులు రెండు ట్రాక్టర్లలో వచ్చి నారాయణరెడ్డి కారును ఢీకొట్టి నారాయణరెడ్డిపై దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన సాంబశివుడునూ అంతమొందించారు. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదుచేసి 19 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. నిందితులుగా ఉన్న ప్రస్తుత పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ప్రస్తుత వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మలు హైకోర్టును ఆశ్రయించగా వీరి పేర్లు కేసు నుంచి తొలగించారు. ఏ4గా ఉన్న కోతుల రామాంజనేయులు చనిపోవడంతో మొత్తం 16 మందిపై తుది విచారణ సాగింది. ఇందులో 11 మందికి జీవిత ఖైదు పడగా, ఐదుగురిపై నేరం రుజువు కాలేదు. జీవిత ఖైదు పడిన నిందితులు వీరే.. కురువ రామాంజనేయులు, రామయ్యనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకటరాముడు, గంటల శీను, బీసన్నగారి రామాంజనేయులు(40), బీసన్నగారి రామాంజనేయులు(42), బీసన్నగారి పెద్ద బీసన్నలకు జీవితఖైదు పడింది. చాకలి నారాయణ, కర్రి గిడ్డయ్య, చెరుకులపాడు గోపాల్, చిన్న వెంకటలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బీసన్నగారి పెద్ద బీసన్న వయస్సు ప్రస్తుతం 83 ఏళ్లు. నిందితుడు ఆత్మహత్యా యత్నం.. నిందితుల్లో ఒకరైన రామాంజనేయులును వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తలను వాహనం కిటికీకి కొట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకే.. నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు హత్యకేసులో తమకే ఎందుకు జీవితఖైదు పడిందని, కేఈ శ్యాంబాబుకు ఎందుకు శిక్ష పడలేదని నిందితులు కురువ రామాంజనేయులు, బీసన్నగారి రామాంజనేయులు ప్రశ్నించారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకు పోవాల్సిందేనని, ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మొద్దని.. వారెలాంటి సాయం చేయరని, తమకు తగిన శాస్తి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.చట్టం, కోర్టులపై నమ్మకం పెరిగింది.. నారాయణరెడ్డి సతీమణి,మాజీఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనంతరం.. కర్నూలులోని తన స్వగృహంలో నారాయణరెడ్డి సతీమణి, కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ అంశంపై స్పందించారు. కోర్టు తీర్పుతో, పోలీసులు కేసులో చూపిన తెగువతో తమకు, ప్రజలకు చట్టంపై, కోర్టులపై నమ్మకం పెరుగుతోందన్నారు. తన భర్త నారాయణరెడ్డి బతికుంటే ఎమ్మెల్యే కాలేమన్న భయంతోనే కేఈ శ్యాంబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆమె ఆరోపించారు. నారాయణరెడ్డి హత్య కేసు తీర్పును చూసి ప్రజలు కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. నారాయణరెడ్డి సోదరుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే తన తండ్రిని, తన సోదరుడిని పోగొట్టుకున్నామన్నారు.

మందుపాతర్లు పేల్చిన మావోయిస్టులు
వాజేడు/ఎంజీఎం/సాక్షి, హైదరాబాద్: కర్రిగుట్టలు మరోసారి దద్దరిల్లాయి. ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల పైనున్న పెనుగోలు గ్రామ సమీప నూగూరు అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను మావోయిస్టులు పేల్చేశారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండోలు వడ్ల శ్రీధర్ (జేసీ4973/పీసీ1785), ఎన్.పవన్‌కల్యాణ్ (జేసీ10541/పీసీ) టి.సందీప్ (జేసీ 4638/పీసీ8124) అక్కడికక్కడే మృతి చెందారు. పైడిపల్లికి చెందిన అర్ఎస్ఐ సీహెచ్ రణదీర్ గాయపడ్డారు. మరో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. కాగా మెరుగైన వైద్యం కోసం రణదీర్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. భారీ ఎన్కౌంటర్ మరుసటి రోజే.. కర్రిగుట్టల్లో చేపట్టిన కగార్ ఆపరేషన్ 17 రోజులకు చేరుకుంది. కర్రి గుట్టలను చుట్టు ముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ఎన్కౌంటర్ చోటు చేసుకోగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ కోసం వచ్చే దళాలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని ముందే అమర్చిన మందుపాతరలను రిమోట్ల సహాయంతో పేల్చివేసినట్లు తెలుస్తోంది. 35 – 40 మందితో కూడిన మావోయిస్టుల బృందం (మహిళలు కూడా ఉన్నారు) ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. మృతదేహాలు పరిశీలించిన మంత్రి, డీజీపీ గ్రేహౌండ్స్ కమాండర్ల మృతదేహాలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రే హౌండ్స్ ఏడీజీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, ము లుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ మార్చురీ వద్ద పరిశీలించారు. ఈ ఘటనపై వాజేడు పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 62, 148, 191(1), 191(3), 103, 109 ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్, సెక్షన్ 25(1–బీ)(ఏ), 27 ఏఆర్‌ఎమ్‌ఎస్ యాక్ట్, సెక్షన్ 10, 13 ,18,20, కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కాగా మందుపాతర్ల పేలుడులో మరణించిన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30)కు 9 నెలల క్రితమే వివాహమైనట్లు తెలిసింది. నాలుగు గంటల పాటు పోస్టుమార్టం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరుకున్న పోలీసుల మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం జరిపారు. బుల్లెట్ల గాయాలతోనే జవాన్లు మృతి చెందినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు: డీజీపీ ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఈడీల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులపై దూరంలో మాటేసిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చారని డీజీపీ తెలిపారు. సెర్చ్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా భారీ కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు కాల్పులు ఆపేసి పారిపోయారన్నారు. ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దు: మావోయిస్టులు పోలీసుల వలలోపడి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని మావోయిస్టులు మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు మావోయిస్టు వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట గురువారం ఒక లేఖ విడుదల అయ్యింది. ‘పోలీసు బలగాల కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి కర్రిగుట్టలపై బాంబులు అమర్చాం. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాం. అయినా కొంతమంది ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలకు పోలీసులు మాయ మాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులు ఇస్తూ ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారు. షికారు పేరుతో వారిని కర్రిగుట్టల వైపు పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులు పేలి వారు చనిపోతున్నారు. కాబట్టి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..’అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఏడేళ్ల ప్రేమ అంతలోనే .. ! పాపం ఆ యువకుడు..
జమ్మికుంట(కరీంనగర్): ఇటీవల యువతలో ఒకరిని ప్రేమించడం, మరొకరిని పెళ్లాడటం కామన్‌గా మారిపోయింది. అయితే కొందరు దీన్ని జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతుండటమే బాధకరం. అలాంటి దారుణ ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకెళ్తే..కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇటీవలే వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఇది తెలిసి మనస్తాపం చెందిన ఎల్లేష్ సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా ఆ వీడియోలో తన ఫోన్లో ఆమెకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని..యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని కోరాడు. అలాగే తనను ఇంతలా మోసం చేసిన ఆ యువతి కుటుంబంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడ్డ యువకుడు7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ… pic.twitter.com/lx0DPxyUEd— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025
వీడియోలు


పాకిస్తాన్ నగరాల్లో భారత్ ఎటాక్


తల్లిదండ్రులును ఎదిరించి ఆర్మీలోకి వెళ్ళాడు


వీర జవాన్ మురళి నాయక్ ఇంటికి వైఎస్ జగన్


జేబులో పైసా నహీ... బొచ్చెలో రోటీ నహీ


ఉగ్రవాదులతో సహవాసం.. భారత్ దెబ్బకు కళ్లు తేలేసిన పాక్


36 నగరాలపై రెచ్చగొట్టేల 400 డ్రోన్లతో పాక్ దాడి


దేశవ్యాప్తంగా హై అలర్ట్


పాక్ దాడుల వెనుక టర్కీ, చైనా హస్తం..


పాక్.. ప్రపంచాన్ని మోసం చేసే కుట్ర


Army Jawan: తల్లిదండ్రులును ఎదిరించి ఆర్మీలోకి వెళ్ళాడు