అఫీషియల్‌: జగన్‌ హయాంలో అప్పు రూ.3 లక్షల కోట్లే! | Kutami Prabutvam Caught on Assembly With Jagan Term Debts Lies | Sakshi
Sakshi News home page

అఫీషియల్‌: జగన్‌ హయాంలో అప్పు రూ.3 లక్షల కోట్లే!

Published Fri, Mar 7 2025 12:27 PM | Last Updated on Fri, Mar 7 2025 1:13 PM

Kutami Prabutvam Caught on Assembly With Jagan Term Debts Lies

అమరావతి, సాక్షి: వైఎస్‌ జగన్‌ హయాంలో అప్పులపై చేస్తున్న అసత్య ప్రచారం, చంద్రబాబు కుట్ర.. అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఏకంగా రూ.14 లక్షల కోట్లంటూ ప్రచారం మొదలుపెట్టి.. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ. 5,19,192 కోట్లు మాత్రమేనని ప్రకటించింది. గత రెండు ప్రభుత్వాల అప్పులపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.

2014 జూన్‌ 2 వ తేదీ నుంచి.. అంటే 2014-15 నుంచి  2023-24..  జూన్ 12వ తేదీ దాకా.. అలాగే 2024 డిసెంబర్ 31వ తేదీ దాకా ప్రభుత్వం, ప్రభుత్వ రంగల సంస్థల రుణాల వివరాలు తెలియజేయాలని ‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌, తాటిపర్తి చంద్రశేఖర్‌, ఆకేపాటి అమర్నాథ్‌, మత్స్యరస విశ్వేశ్వరరాజులు ఆర్థిక మంత్రి పయ్యావులను కోరారు.

వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పుల లెక్క ఇది

  • పబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు. 

  • కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు  రూ. 1,05, 355 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తెలిపింది.

  • మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే.

  • అలాగే గత ప్రభుత్వం(వైఎస్సార్‌సీపీ) దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని పేర్కొంది.

అప్పులపై బాబు అబద్ధాలు
చంద్రబాబు ఏపీ ఎన్నికల ప్రచారంలో.. 14 లక్షల కోట్లప్పులు చేశారంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్‌ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్‌ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు.  చివరికి బడ్జెట్‌కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లకు చేరింది. అయితే తాజా ప్రకటనతో ఆ దారుణమైన ప్రచారాలు ఎంత అబద్ధామో తేలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement