
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మణికొండ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకిలో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అయింది.
నగరవ్యాప్తంగా క్యుములోనింబస్‌మేఘాలు కమ్ముకోవడంతో మధ్యాహ్నం నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. అత్యవసర పనులు ఉంటేనే ఇళ్లలో నుంచి బయటికి రావాలని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.
కాగా, గురువారం రాత్రి కురిసిన గాలివానకు నగరంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే ఛాన్సున్నట్లు సమాచారం.