Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Tiruvuru Municipal Chairman Election Postponed Indefinitely1
తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా

సాక్షి, విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. కోరం లేక ముగించిసనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న, ఈ రోజు టీడీపీ అరాచకం వల్ల ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరగకుండా టీడీపీ గూండాలు అల్లర్లు సృష్టించారు. టీడీపీ గూండాల బీభత్సంతో రెండు రోజులు ఎన్నిక జరగలేదు. వైసీపీ కౌన్సిలర్లు తిరువురు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దాడితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజురుకాలేకపోయారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ఆర్డీవో కే.మాధురి ముగించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యచరణ ఉంటుందని ఆర్డీవో ప్రకటించారు.దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసు వాహనం ఎక్కనివ్వకుండా టీడీపీ టీడీపీ నేత రమేష్ రెడ్డి, టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై కూడా టీడీపీ గూండాల దాడి చేశారు. దేవినేని అవినాష్ , మొండితోక అరుణ్ కుమార్‌లను రెడ్డిగూడెం స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు.

Tdp Conspiracy Politics In Tiruvuru Municipal Chairman Elections2
వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి

👉వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్‌దేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌లు అరెస్ట్‌తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులురెడ్డిగూడెం స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడిదేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌ వాహనాలపై దాడివైఎస్సార్‌సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలుదారికాసి వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలుఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్‌ వద్ద టీడీపీ గూండాల విధ్వంసంసాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, వైసీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్‌సీపీ నేత స్వామిదాస్‌ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.వైఎస్సార్‌సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్‌, స్వామిదాస్‌ అరుణ్‌ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్‌, స్వామిదాస్‌పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్‌ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్‌ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.

Gold and silver rates today on market in Telugu states3
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,100 (22 క్యారెట్స్), రూ.95,020 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 దిగి రూ.87,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 తగ్గి రూ.95,170 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినట్లే వెండి ధరల్లోనూ(Silver Price) మార్పులొచ్చాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే మంగళవారం కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Twist In Telangana Raj Bhavan Hard Disk Theft Case4
తెలంగాణ రాజ్‌భవన్‌ హార్డ్ డిస్క్‌ చోరీ కేసులో ట్విస్ట్

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజ్‌భవన్‌ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్‌ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్‌ల చోరీ కేసులో రెండోసారి చేశారు. ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్‌ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్‌భవన్‌లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్‌ సస్పెండ్ చేశారు.జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది.

IPL 2025: LSG Digvesh Rathi Suspended, Fined Following Verbal Spat With Abhishek Sharma5
IPL 2025: అభిషేక్‌ శర్మతో గొడవ.. దిగ్వేశ్‌ రాఠీపై సస్పెన్షన్‌ వేటు

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మే 19) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మతో గొడవకు దిగినందుకు గానూ లక్నో బౌలర్‌ దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీపై ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చర్యలు తీసుకుంది. రాఠీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధించింది. రాఠీ కవ్వింపులకు ప్రతిగా స్పందించిన అభిషేక్‌ కూడా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోతకు గురయ్యాడు. అభిషేక్‌ ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జమయ్యింది.ABHISHEK vs DIGVESH MOMENT 🤯 pic.twitter.com/oEfs0LWhoe— Johns. (@CricCrazyJohns) May 19, 2025సస్పెన్షన్‌ కారణంగా రాఠీ లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (మే 22న గుజరాత్‌తో) ఆడలేడు. ఈ సీజన్‌లోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల రాఠీ.. సీజన్‌ ప్రారంభం నుంచి చాలా సార్లు ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను ఉల్లంఘించి గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆగ్రహానికి గురయ్యాడు. తాజా ఘటనతో ఈ సీజన్‌లో రాఠీ డీ మెరిట్‌ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఈ కారణంగా అతనిపై ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు పడింది. ఓ సీజన్‌లో మూడు సార్లు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధిస్తారు. రాఠీ ఈ సీజన్‌లో పంజాబ్‌ (1), ముంబైతో (2) జరిగిన మ్యాచ్‌ల్లోనూ కోడ్‌ను ఉల్లంఘించి డిమెరిట్‌ పాయింట్లు మూటగట్టుకున్నాడు.కాగా, దిగ్వేశ్‌ రాఠీ వికెట్‌ తీసిన ప్రతిసారి నోట్‌ బుక్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకోవడం మేనరిజంగా పెట్టుకున్నాడు. ఎవరి వికెట్‌ తీసినా ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్‌ శర్మ వికెట్‌ తీసిన ఆనందంలో ఇదే పని చేశాడు. అయితే ఈసారి రాఠీ నోట్‌ బుక్‌ సెలబ్రేషన్స్‌ కాస్త శృతి మించాయి. అభిషేక్‌తో అతను చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. వికెట్‌ తీశాక వెళ్లు.. వెళ్లు అన్నట్లు సైగ చేశాడు. దీంతో పాటు నోటికి కూడా పని చెప్పాడు. రాఠీ ఇంతలా రియాక్డ్‌ కావడానికి అంతకుముందు అభిషేక్‌ బాదిన బాదుడే కారణం. రవి బిష్ణోయ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో అభిషేక్‌ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఓవర్‌లో బంతినందుకున్న రాఠీ.. అభిషేక్‌ను తొలి బంతికే ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో నోట్‌ బుక్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుని ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. మ్యాచ్‌ అనంతరం రాజీవ్‌ శుక్లా రాజీ కుదుర్చడంతో అభిషేక్‌, రాఠీ కరచాలనం చేసుకుని, కలియతిరగడం కొసమెరుపు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమిపాలైన లక్నో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (65), ఎయిడెన్‌ మార్క్రమ్‌ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్‌ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్‌ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్‌ కిషన్‌ (35), క్లాసెన్‌ (47), కమిందు మెండిస్‌ (32 రిటైర్డ్‌ హర్ట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్‌ వర్మ (5 నాటౌట్‌), నితీశ్‌ రెడ్డి (5 నాటౌట్‌) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్‌ రాఠీ 2, విలియమ్‌ ఓరూర్కీ, శార్దూల్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Rashi khanna Injured In Movie Shooting6
గాయాలతో రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్‌

హీరోయిన్ రాశి ఖన్నా స్వల్పంగా గాయపడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్‌ చేశారు. ఒక సినిమా షూటింగ్‌లో కథ డిమాండ్‌ మేరకు చాలా రిష్క్‌ ఉన్న యాక్షన్‌ సీన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా 'ది సబర్మతి రిపోర్ట్‌'తో మెప్పించిన ఆమె 'ఫర్జీ2' వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ఇందులో భాగంగానే ఆమెకు గాయాలు అయినట్లు సమాచారం.గాయాలతో ఉన్న ఫోటోలు షేర్‌ చేసిన రాశి ఖన్నా ఇలా చెప్పుకొచ్చింది. 'ఒక్కోసారి కథ డిమాండ్‌ చేస్తే గాయలను కూడా లెక్కచేయకూడదు. ఈ క్రమంలో మీ గాయాలు కూడా ఒక్కోసారి మీ శరీరం, మీ శ్వాస మీద ప్రభావం చూపవచ్చు.' అంటూ పోస్ట్‌ చేసింది. షూటింగ్‌లో చిన్నచిన్న గాయాలైనట్లు రాశి ఖన్నా తెలిపింది.కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్‌గా చేయనుంది. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna)

Indian-Origin Girl's Desi Look On Train In Paris Got Million Views7
మెట్రోలో ఇన్‌ఫ్లూయెన్సర్‌ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్‌

భారతీయ సంస్కృతి, ఫ్యాషన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో మన ఫ్యాషన్‌ స్టైల్‌ ఫ్యాషన్‌ ప్రియులనుంచి సామాన్యులదాకా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెట్ గాలా, కేన్స్‌ లాంటి ప్రతిష్టాత్మక వేదికలు, ఐకానిక్ ప్రపంచ వేదికలపై మన భారతీయ నటీమణులు, సెలబ్రిటీలు భారత సంప్రదాయ ఫ్యాషన్‌ శైలిని ప్రదర్శిస్తున్నారు. రెడ్ కార్పెట్ దేశీ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తారలు మాత్రమే కాదు..వివిధ స్థాయిలలో భారతీయ వారసత్వాన్ని ప్రభావితం చేస్తున్న సామాన్యులకు కూడా కొదవేమీ లేదు. తాజా వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఢిల్లీ మెట్రోలో లెహంగాలు, అనార్కలి లేదా చీరలు ధరించి రీల్స్‌ చేసే అమ్మాయిలను చూసి ఉంటారు. కానీ విదేశాల్లో మెట్రోలో చీర లేదా మన సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులను చూడటం చాలా అరుదు. తాజా ప్యారిస్‌లోని మెట్రోలో ఒక లెహంగాలో అందంగా మెరిసిన యువతి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నివ్య సందడి చేస్తోంది. ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!భారతీయ సంతతికి చెందిన ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ నివ్య ప్యారిస్‌లోని స్థానిక రైలులో అందమైన లెహెంగాలో ప్రయాణించడమే కాదు, చక్కటి హావభావాలను ఆకట్టుకుంది. లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న తన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తెగ మురిసి పోతున్నారు. నివ్య బ్రైట్‌ నారింజ రంగు భారీ లెహంగాలో మెరిసింది. క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లెహెంగాకు స్లీవ్‌లెస్ చోలి సెట్‌, ఇతర నగలతో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కూల్‌...కూల్‌గా గాగుల్స్‌ పెట్టుకుని మరింత స్టైల్‌గా కనిపించింది. గత ఏడాది నవంబరులో షేర్‌ చేసిన ఈ వీడియో ఏకంగా 10 లక్షలకు పైగా వ్యూస్‌, వేల కామెంట్లను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by MAKEUP & HAIR ARTIST PARIS (@tanzeela.beauty) యూరప్‌లో భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తూ, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిన నివ్యను నెటిజన్లు ప్రశంసించారు. చాలా అందంగాఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌లోని మెట్రోలో బంగారు నగలతో ప్రయాణిస్తున్నారా? సేఫ్టీ ఫస్ట్‌. ఇవి కాస్ట్యూమ్ ఆభరణాలు అయితే మంచిది. అవి మీ అమ్మగారి ఆభరణాలు కాకూడదని అనుకుంటున్నా అంటూ మరో నెటిజన్‌ వ్యాఖ్యానించారు. ఇదే లెహంగాలో ఆకట్టుకున్న వీడియో కూడా ఆకర్షణీయంగా నిలిచింది. చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు View this post on Instagram A post shared by Nivya | Fashion & Lifestyle (@boho_gram)p>

Chandrababu Naidu Hypocritical Politics with the hopes of the people8
ప్రజల ఆశలతో బాబు కపట రాజకీయం!

‘‘ప్రజలకు మరీ ఆశ ఉండకూడదు. దురాశ పనికిరాదు’’ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరచూ చేసే వ్యాఖ్య ఇది. ఈమధ్య సోషల్‌ మీడియాలోనూ ఆయన వాడిన ఈ డైలాగులు ఎక్కవగా కనిపిస్తున్నాయి. ఆయన చెప్పింది వాస్తవమే. ఎందుకంటారా? బాబు, పవన్‌కళ్యాణ్‌ లాంటి వాళ్లు ఇచ్చినమాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మడం ప్రజల అత్యాశే కదా! ఈ దురాశతోనే ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించింది! పాపం.. పై పై వాగ్ధానాలు చేసిన వాళ్లు ఎవరు? వారి ట్రాక్‌ రికార్డు ఏమిటి అన్నది కూడా గుర్తుపెట్టుకోకుండా ప్రజలు అతిగా ఆశపడ్డారు. టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలోని ‘ఆడ బిడ్డ నిధి’కి కూడా బాబు అండ్‌ కో మంగళం పాడేసినట్లేనన్న వార్తలు చూసిన తరువాత ప్రజలను ఇంత గొప్పగా మోసం చేయవచ్చా? అని అనిపించక మానదు. ప్రజలను దురాశా పరులుగా చిత్రీకరించి నిందించవచ్చు కానీ.. ఆ ఆశ పెట్టిన వారి తప్పు మాత్రం ఏమీ లేదన్నచందంగా ఉందీ వ్యవహారం. ప్రజలను ఇంత బాహాటంగా మోసం చేసినందుకు ఇతర దేశాల్లో ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు కానీ.. ఇలాంటి వారు.. ప్రజల ఆగ్రహాన్ని, ఛీత్కారాలనైతే తప్పకుండా చూస్తారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో నేతల వైఖరి నమ్మి మోసపోయిన వారిదే తప్పన్నట్టుగా ఉండటం. అయ్యో ఈ నేతలు ప్రజలను పిచ్చోళ్లుగా చూస్తున్నారే అన్న ఆవేదన కలుగుతుంది. నిజాయితీ లేని నేతలు అధికారంలోకి వచ్చి, చెప్పినవి చేయకపోగా, వారినే బెదిరిస్తున్న తీరు, విషయాలను పక్కదారి పట్టిస్తున్న తీరులపై పెద్ద పరిశోధనే చేయవచ్చు. ఆశపెట్టి ఏమార్చడం.. ఆ తరువాత ప్రజలనే నిందించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. సుమారు రూ.లక్ష కోట్ల రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న హామీతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత ఏం చేశారో అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే ఆయన ‘‘ఆశకు హద్దు ఉండాలి’’ అని రైతులను ఉద్దేశించి నేరుగానే అన్నారు. తాజాగా 2024 ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకూ రూ.1500 చొప్పున నెల నెల ఇస్తానని! ఈ పథకానికి ఆడబిడ్డ నిధి పేరూ పెట్టారు. ప్రతి ఒక్కరికీ ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఊదరగొట్టడంతో మహిళలు చాలామంది ఆశపడ్డారు. ఓట్లేశారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు అప్పట్లో ‘‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’’ అంటూ ప్రచారం చేయడమూ మనం చూశాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సైతం.. ‘‘ఒకరుంటే రూ.15 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు..ఇంకా పిల్లలను కనండి..వారి బాధ్యత మాది’’ అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాది పూర్తి అయిపోయింది.. తల్లికి వందనం లేదు. విద్యార్ధులకు సుమారు రూ.13 వేలు ఎగవేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఇస్తామని అంటున్నారు. ఏమవుతుందో తెలియదు! ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత రవాణా సౌకర్యం అన్న హామీని కూడా అటకెక్కించేశారు. అమలు చేసి ఉంటే ఏపీ మహిళలకు ఏడాదికి రూ మూడు వేల కోట్ల వరకూ మిగిలేది! ఈ లెక్క కూడా ఎల్లోమీడియాదే. ఆగస్టు పదిహేను నుంచి ఈ స్కీము అమలు చేస్తామని చంద్రబాబు ఈమధ్య కర్నూలులో ప్రకటించారు. అంటే మరో మూడు నెలలు ఈ స్కీమ్ ఉండదు. దీనిని కూడా లెక్కలోకి తీసుకుంటే మహిళలు మరో రూ.వెయ్యి కోట్లు నష్టపోయినట్లు! ఇదే సభలో చంద్రబాబు ఆడబిడ్డ నిధి స్కీము లేనట్లే తేల్చారని వార్త వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ చూస్తే మరీ ఇంత పచ్చి పాపమా అనిపిస్తుంది. తాను అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు మోసపూరితమని ఆయనకు తెలుసు. తాను ఆ వాగ్దానాలు ఎందుకు చేసింది.. ఎందుకు అమలు చేయలేకపోతున్నది నిజాయితీగా వివరించడం మానేసి, మరో కొత్త అబద్దాన్ని సృష్టించారు. అదేమిటంటే తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఏపీలో పేదలు బాగానే సంపాదిస్తున్నట్లు చంద్రబాబే తేల్చేశారు! అందువల్ల వారికి ఆ స్కీమ్ అవసరం లేదని, 2029నాటికి పేదరికం లేకుండా చేసేస్తామని, అప్పటికీ పేదలు ఉంటే పీ-4 కింద దాతలకు అప్పగిస్తామని అన్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక పేదలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు, వ్యాపారాలు లేక వ్యాపారస్తులు అల్లాడుతుంటే పేదలంతా బాగా సంపాదించుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి ఓటు వేసినందుకు తమకు బాగానే శాస్తి అయిందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఆడబిడ్డ నిధి స్కీము రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలకు ఉపయోగపడేది! ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్లకుపైగా అవసరమని లెక్క. ఇంత మొత్తం ఎలా సాధ్యమని అప్పట్లో ప్రశ్నించిన వారికి బాబు ఇచ్చిన సమాధానం తాను సంపద సృష్టించగలనూ అని! ఇప్పుడేమో సంపద వచ్చేసిందని చెబుతుంటే బిత్తరపోవడం తప్ప ప్రజలు చేయగలిగేది ఏముంటుంది! ఒకరకంగా చెప్పాలంటే ఈవీఎంల మాయాజాలం సంగతి పక్కనబెడితే అనేక నియోజకవర్గాలలో తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి వాగ్దానాలు గేమ్ చేంజర్ గా మారి కూటమిని అధికారంలోకి తెచ్చాయి. ఇప్పుడేమో చేతులెత్తేసి పేదల జీవితాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. వాగ్దానాల గురించి చెప్పకుండా, చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని, ఓర్వకల్‌లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని, బుద్దుడి సలహాలు పాటించండని కధలు చెబుతున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. చెత్త ఎత్తడానికి పనివారు వస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నిస్తే లేదు..లేదు..అని ఎక్కువ మంది చేతులెత్తారు. దాంతో చెత్త గురించి ఆయన చెబుతున్న కబుర్లలో డొల్లతనం బయటపడింది. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు పెడతామని, లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తామని, ఉద్యానవన పంటలను 18 లక్షల హెక్టార్ల నుంచి 36 లక్షల హెక్టార్లు చేస్తామని, ఇలా ఏవేవో సంబంధం లేని మాటలతో ప్రసంగం చేశారు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కూడా దబాయించి మరీ చెప్పారు. నవ్వుకుని ఊండిపోవడం అక్కడి ప్రజల వంతైంది. చివరికి బుద్దుడు, ఆయన శిష్యుడి కథ అంటూ చంద్రబాబు ప్రజలకు ఒక స్టోరీ చెప్పారు. దాని ప్రకారం శిష్యుడి కోరిక మేరకు బుద్దుడు కొత్త వస్త్రాలు ఇప్పించారట. ఆ తర్వాత కొద్ది రోజులకు బుద్దుడు పిలిచి పాత వస్త్రాలు ఏమి చేశావని అడిగాడట. వాటితో చిరిగిపోయిన బొంతలో పెట్టి కుట్టుకున్నానని శిష్యుడు చెప్పాడట. మరీ చినిగిపోయిన బొంతలోని వస్త్రాలు ఏమి చేశావు అని బుద్దుడు అడిగాడట. వాటిని కిటికీ తెరలు చేశానని జవాబు ఇచ్చారు.మరి అప్పటికే ఉన్న కిటీకి తెరలు ఏమి చేశావని అడిగితే గది తుడవడానికి వాడుతున్నానని, ఆ వస్త్రాన్ని మసిబట్టగా వాడుతున్నానని, అప్పటిదాకా ఉన్న మసిబట్ట దారాలను కొవ్వొత్తిలో వాడే వత్తులకు వినియోగిస్తున్నానని శిష్యుడు చెప్పారట. ప్రతి వస్తువుకూ ఒక ఉపయోగం ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు ఈ కథ చెప్పినా, విన్న వారికి మాత్రం చివరికి ఏపీ పరిస్థితి ఇలా మారిందన్నమాట అని అనుకున్నారనుకోవాలి. ఒక పక్క అమరావతిలో ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ తదితర భవనాలు ఉన్నా, అవి పనికి రావంటూ లక్ష కోట్లు వ్యయం చేస్తూ గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రజలు మాత్రం ఈ ఆధునిక యుగంలో చినిగిన వస్త్రాలు సైతం వాడుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దుడు, శిష్యుడు కథ వర్తించదా అంటే ఏమి చెబుతాం. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు అన్న సూత్రం చంద్రబాబు వంటివారిని చూసే వచ్చిందనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

YSRCP Leaders Complaint To Election Commissioner Over Tiruvuru Municipal Chairman Election9
టీడీపీ గూండాల దౌర్జన్యం.. ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆ పార్టీ ప్రతినిధి బృందం మండిపడింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పండుల రవీంద్రబాబు, వ‌రుదు క‌ళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్య నాయకులు విజయవాడలో మరోసారి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి జరిగిన దౌర్జన్యానికి సంబంధించి ఫిర్యాదు చేశారు.కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు బేఖాతరు చేయని వైనంపై ఆధారాలతో సహా కమిషనర్‌కు వివరించారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించకపోగా, దాడికి పాల్పడిన కూటమి నేతలకు అండగా నిలుస్తూ, వైఎస్సార్‌సీపీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేసిన వైనాన్ని కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. అనంతరం విజయవాడలో మీడియాతో పార్టీ నేతలు మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే..పోలీసులే చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు: ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణిఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలిచ్చినా అవి క్షేత్ర‌స్థాయిలో అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. పోలీసులే ఎస్ఈసీ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమ‌ల‌వుతుందా అనే అనుమానం క‌లుగుతోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థ‌ల్లో వైఎస్సార్సీపీకి పూర్తి బ‌లం ఉన్నా, అధికార బ‌లంతో అడ్డ‌దారిలో నెగ్గాల‌ని చూస్తున్నారు. తిరువూరు మున్సిపాలిటీ చైర్మ‌న్ ఎన్నిక విష‌యంలో టీడీపీ అనుస‌రిస్తున్న విధానాలు, పోలీసులు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డంపై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్నిని కలిసి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆమె హామీ ఇచ్చారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉందని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు. రాష్ట్రాన్ని బీహార్‌లా మార్చేశారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌న్న త‌లంపుతో ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను తుంగ‌లో తొక్కి అధికార టీడీపీ నాయ‌కులు అరాచ‌కాలు సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా రాజ్యాంగాన్ని, చ‌ట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ నాయ‌కుల‌కు వంత పాడుతున్నారు. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన కౌన్సిల‌ర్ల‌కు స్వేచ్ఛ‌గా ఓటేసుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చిందంటే రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌తలు ఎంత‌గా దిగ‌జారిపోయాయో అర్థం చేసుకోవ‌చ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస్ రౌడీ మూక‌ల్ని వెంటేసుకొచ్చి 144 సెక్ష‌న్ ను ఉల్లంఘించి హంగామా చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి స‌హ‌క‌రించారు.ఎన్నిక సక్ర‌మంగా జ‌రిగేలా చూసుకోవాల్సిన పోలీసులే మా కౌన్సిల‌ర్ల మెడ‌లో ఉన్న వైయ‌స్సార్సీపీ కండువాల‌ను లాగి ప‌డేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ల‌డం చూసి ప్ర‌జ‌లంతా చీద‌రించుకుంటున్నారు. తిరువూరులో పోలీసులే ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కూట‌మి పాల‌న‌లో ఆంధ్ర రాష్ట్రం బీహార్ క‌న్నా దారుణంగా త‌యార‌వుతోంది. ఇలాంటి సంస్కృతి భావిత‌రాల‌కు మంచిది కాద‌ని గుర్తుంచుకోవాలి. అధికార పార్టీ అరాచ‌కాల‌ను ప్ర‌జాస్వామ్య వాదులంతా ఖండించాలి.కోర్టులు, ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలను పట్టించుకోరా?: మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుచ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ప‌చ్చ చొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓటేసేందుకు వెడుతున్న కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన పోలీసులు, తిరువూరు వ‌స్తేనే భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని మాట‌మార్చారు. చ‌ట్ట‌ప‌రంగా న‌డుచుకోవాల్సిందిపోయి అధికార పార్టీ నాయ‌కుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌న్నా, కోర్టుల‌న్నా గౌర‌వం కానీ భ‌యం కానీ క‌నిపించ‌డం లేదు. నిన్న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఇచ్చిన ఆర్డ‌ర్‌ను పోలీసులు పాటించ‌డం లేద‌ని ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. పోలీసులు, క‌లెక్ట‌ర్‌తో మాట్లాడతాన‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంట‌ల‌కు తిరువూరులో ఎన్నిక‌కు హాజ‌రుకావాల్సి ఉంటే, విజ‌య‌వాడ నుంచి వ‌స్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిల‌ర్ల‌ను మార్గమధ్యలో ఎందుకు ఆపేయాల్సి వ‌చ్చిందో పోలీసులే స‌మాధానం చెప్పాలి. మున్సిపాలిటీలో కేవ‌లం ముగ్గురు స‌భ్యుల బ‌లం మాత్ర‌మే ఉన్న టీడీపీ, చైర్మ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవ‌డానికి అడ్డ‌దారులు తొక్కింది. పోలీసుల అండ‌తో ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస్ గూండాలతో వ‌చ్చి మా కౌన్సిల‌ర్లపై దాడికి పాల్ప‌డ్డాడు. పోలీసులే బ‌ల‌వంతంగా న‌లుగురు వైఎస్సార్సీపీ కౌన్సిల‌ర్ల‌ను కిడ్నాప్ చేసి తీసుళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్పించారు.ఈరోజు కూడా అదే విధంగా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పోలీసులు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌ను సైతం ఉల్లంఘిస్తున్నారు. పోలీసుల వ్య‌వ‌హార‌శైలిపై ఈ రోజు ఉద‌యం వైయ‌స్సార్సీపీ కోర్టును ఆశ్ర‌యించింది. కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశించినా పోలీసులు ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సాక్షాత్తు కోర్టు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ 30 నిమిషాల్లో పూర్తి వివ‌రాల‌తో రిపోర్టు ఇవ్వాల‌ని ఆదేశించింది. అధికారం చేతుల్లో ఉంది క‌దా అని దౌర్జ‌న్యం చేసి మున్సిప‌ల్ చైర్మ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని చూస్తున్నారు. వీరి ఆట‌లు ఎంతోకాలం సాగ‌వు. తిరువూరు మున్సిపాలిటీ హాల్ వ‌ర‌కు కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

Gaza Amid big Warning from UK France canada to Israel10
గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్‌, కెనడా హెచ్చరిక

టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్‌ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్‌ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.ఖతార్‌లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇన్‌ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement