చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు మృతి చెందింది.
చిత్తూరు: చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు మృతి చెందింది. పెనుమూరు మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వరదరాజులు భార్య బుధవారం పురిటి నొప్పులు రావటంతో రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లెవరూ ఆమెను పరీక్షించేందుకు రాలేదు. దీంతో నర్సులే ఆమెకు పురుడు పోయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గురువారం ఉదయానికి శిశువు చనిపోయాడు. దీంతో వరదరాజులు కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే తమ చిన్నారి మృతికి కారణమంటూ నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని, న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పారు. దీంతో గంట అనంతరం వారు ఆందోళన విరమించారు. వివాహమైన ఐదేళ్ల తర్వాత ఓ బిడ్డ పుడితే.. ఆ ఆనందం ఒక్కనపూటలేనే ఆవిరై పోయిందని తల్లిదండ్రులు విలిపించడం ఆసుపత్రిలో అందరినీ కలిచివేసింది.