విశాఖ జిల్లా చోడవరంలో అక్రమంగా తరలిస్తున్న 179 కిలోల గంజాయిని స్పెషల్ బ్రాంచి పోలీసులు పట్టుకున్నారు.
చోడవరం(విశాఖపట్నం): విశాఖ జిల్లా చోడవరంలో అక్రమంగా తరలిస్తున్న 179 కిలోల గంజాయిని స్పెషల్ బ్రాంచి పోలీసులు పట్టుకున్నారు. పాడేరు నుంచి లారీలో గంజాయి తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు గురువారం ఉదయం తనిఖీలు చేపట్టారు. దీంతో అనుమానిత లారీ పట్టుబడింది. రూ.15 లక్షల విలువైన 179 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న ఆరుగురిలో ఇద్దరు పరారయ్యారు. మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.