విశాఖ జిల్లాలో ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది.
విశాఖపట్టణం(హుకుంపేట): విశాఖ జిల్లాలో ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని హుకుంపేటలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. హుకుంపేట మండలం కొట్నపల్లి సమీపంలోని పాడేరు- అరకు మార్గంలో రోడ్డు లో రాజమండ్రి వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.