పాలకొల్లు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మోటర్ సైకిల్‌పై ముగ్గురు వ్యక్తులు పాలకొల్లు నుంచి భీమవరం వైపు వెళుతూ సిమెంట్ లారీని ఢీకొన్నారు.
ఈ ప్రమాదంలో నక్కా చైతన్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మట్టపర్తి లక్ష్మీకుమారి (40), మట్టపర్తి యశ్వంత్‌కుమార్ (17)లకు స్వల్ప గాయాలు కాగా వారిని పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలు
Published Sun, Feb 21 2016 1:58 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement