నేడు పంటల బీమా సొమ్ము 596.36 కోట్లు చెల్లింపు | 596.36 Crore Payment Of Crop Insurance Proceeds By Ap Government | Sakshi
Sakshi News home page

నేడు పంటల బీమా సొమ్ము 596.36 కోట్లు చెల్లింపు

Jun 26 2020 4:32 AM | Updated on Jun 26 2020 8:02 AM

596.36 Crore Payment Of Crop Insurance Proceeds By Ap Government - Sakshi

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. అయితే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే నిరూపించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. గత సర్కారు ఎగనామం పెట్టిన పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించాలని నిర్ణయించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. 2018 రబీ పంటల బీమా కింద గత చంద్రబాబు ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదు. దీంతో రైతులకు చెందాల్సిన 596.36 కోట్ల రూపాయలను బీమా కంపెనీలు చెల్లించలేదు. ఈ విషయాన్ని సమీక్షల ద్వారా తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. వెంటనే కంపెనీలకు బీమా ప్రీమియంను చెల్లించాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఏకంగా 5.94 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది. 

జిల్లాల వారీగా రైతులు లబ్ధి పొందే మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement