విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త అత్యాచారం
ప్రత్తిపాడు: తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఘోరం చోటుచేసుకుంది. జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తల అగడాలు మరీ పరిగిపోతున్నాయి. కాకినాడకి చెందిన ఓ మహిళపై టీడీపీ నేత లైంగిక దాడికి పాల్పడి 24 గంటలు కూడా కాకముందే జిల్లాలో ఇటువంటి ఘటన మరొకటి చోటుచేసుకోవడం నిజంగా దురదృష్టకరం. జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిపై టీడీపీకి చెందిన ఓ కార్యకర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులు, బంధువులకు తెలిపింది. దీంతో ఆగ్రహించిన బాధితురాలి బంధువులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్తపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.