నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం అబ్దుల్ ఖాదర్ పేరును ఖరారు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించారు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన అబ్దుల్ ఖాదర్ 1994 నుంచి ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొనేవారని, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారని తెలిపారు.