నెల్లూరు : నెల్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. సిబ్బంది వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని 12 మంది ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.