మదిరె గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు త్యాగరాజు (55) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు.
ఆదోని రూరల్, న్యూస్‌లైన్: మదిరె గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు త్యాగరాజు (55) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతిరోజూ పాల్గొన్నాడు. ఉద్యమ వార్తలు టీవీలో ఎక్కువగా చూసేవాడు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై తరచుగా పిల్లలతో చర్చించేవాడు. ఈ క్రమంలో బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య పుల్లమ్మ, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. త్యాగరాజు మృతి పట్ల రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రజనీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, గ్రామసేవకుల సంఘం నాయకులు, సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.