
రాజకీయాల్లోకి రావాలని ఉంది
పూసపాటిరేగ : రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఉందని సినీనటుడు శరత్ బాబు అన్నారు. నిన్న ఆయన శ్రీకాకుళం వెళ్తూ విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ప్రజలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి రాబోయే ఎన్నికల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలన్నారు.
విశాఖ ఎంపీ స్థానానికి బయటి వ్యక్తులు పోటీచేస్తే ఓడించాలని శరత్ బాబు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థిగా తాను విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు సహకారంతో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఆయనతో పాటు డైరెక్టర్ తిలక్, పర్యావరణ శాస్త్రవేత్త కమల్ కోయలాడా తదితరులు ఉన్నారు.