ఆర్మూర్‌కు చెందిన దామోదర్ వీఆర్‌ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం పట్టణంలోని ఆన్‌లైన్ సెంటర్‌కు వెళ్లా డు.
ఆర్మూర్, న్యూస్‌లైన్ : ఆర్మూర్‌కు చెందిన దామోదర్ వీఆర్‌ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం పట్టణంలోని ఆన్‌లైన్ సెంటర్‌కు వెళ్లా డు. అతడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవ్యక్తి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్, బీసీ అభ్యర్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 150 ఫీజు చెల్లించాల్సి ఉంటుం ది. వికలాంగులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దామోదర్ ఆన్‌లైన్ సెంటర్‌లో దరఖా స్తు చేయగా ఫీజు రూ. 300 చెల్లించాలని ఫాం లో రావడంతో నిరుత్తరుడయ్యాడు.
కమిషన్ కింద రూ. 50 చెల్లించాలని ఆన్‌లైన్ నిర్వాహకు డు సూచించడంతో చేసేదేమీలేక అతడు రూ.350 చెల్లించాడు. ఎస్సీ అభ్యర్థులకు రూ. 150 మాత్రమే తీసుకోవాలని, కానీ దరఖాస్తు ఫాం లో వచ్చిన ధర చెల్లించాల్సిందేనని ఆన్‌లైన్ నిర్వాహకుడు పేర్కొనడంతో అదనపు చార్జీ చెల్లించాల్సి వచ్చిందని దామోదర్ ‘న్యూస్‌లైన్’ తో ఆవేదన వ్యక్తం చేశారు. తన మిత్రుడు విశాల్ కుమార్ నాలుగు రోజుల క్రితం ఇదే ఆన్‌లైన్ సెంటర్‌లో ఎస్సీ కోటాలో దరఖాస్తు చేసుకోగా రూ. 150 తో పాటు ఆన్‌లైన్ సెంటర్ చార్జి రూ. 50 మాత్రమే తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తుకు తమ ఖాతాలోంచి రూ. 300 కట్ అవుతోందని ఆన్‌లైన్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. అందుకే తాము రూ.300 తీసుకుంటున్నామన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి, ఎస్సీ అభ్యర్థులనుంచి అధికంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని దామోదర్ కోరారు.