సాక్షి, హైదరాబాద్: ఇటీవల భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, సహకార బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాల చెల్లింపులో వెసులుబాటు (రీ షెడ్యూల్) సదుపాయం కల్పించనున్నట్లు సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యం, మొక్కజొన్నలను మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రిజిస్ట్రారు, ఆప్కాబ్ ఎండీ తదితర ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలోని నిర్ణయాలను మంత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. వరద బాధిత రైతులకు సకాలంలో కొత్త రుణాలు ఇచ్చేందుకు 3-4 గ్రామాలకు కలిపి ఒక క్రెడిట్ క్యాంపు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. క్రెడిట్ క్యాంపుల్లో రైతులతోపాటు చేనేత, గ్రామీణ చేతి వృత్తుల వారికి కూడా రుణాలిస్తామన్నారు.
వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్
Published Sat, Nov 2 2013 5:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement