ఎయిర్పోర్టులో 2 గంటలు నిలిచిన విమానం | air India flight service 2 hours late in gannavaram airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్టులో 2 గంటలు నిలిచిన విమానం

Published Sun, Aug 9 2015 7:38 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

air India flight service 2 hours late in gannavaram airport

గన్నవరం: న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం సాంకేతిక లోపం కారణంగా ఆదివారం సుమారు రెండు గంటల పాటు కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎయిరిండియాకు చెందిన ఎయిర్‌బస్ ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఉదయం 8.25 గంటలకు ఇక్కడకు చేరుకుని తిరిగి 9 గంటలకు బయలుదేరి వెళ్తుంది.

ఆదివారం షెడ్యూల్ ప్రకారం ఇక్కడకు చేరుకున్న విమానం 101 మంది ప్రయాణికులతో తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్లు విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులను తిరిగి టెర్మినల్‌కు తరలించిన అనంతరం విమానానికి మరమ్మతులు చేపట్టారు. 10.55 గంటలకు ఆ విమానం ప్రయాణికులతో ఢిల్లీ బయలుదేరి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement