సాక్షి, విశాఖపట్నం : స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో ఈసీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్టు కలెక్టర్ యువరాజ్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3న ఎన్నికలు, 7న కౌంటింగ్ జరగాల్సి ఉంది. కానీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో పప్పల చలపతిరావు, ఎంవీవీఎస్ మూర్తిలకు ఎన్నిక ధ్రువ పత్రాలను ఆర్వో జె.నివాస్ అందజేశారు. దీంతో ఎన్నికల తంతు ముగిసినట్టేనని ప్రకటించిన ఆర్వో కోడ్ ఎత్తివేత విషయమై ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వడంతో రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన జిల్లాల్లో కోడ్‌ను ఎత్తివేసినట్టేనని ప్రకటించారు. ఈ మేరకు నేటి నుంచి పాలనాపరమైన విధుల్లో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పాల్గొంటుందని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల కోడ్ ఎత్తివేత
Published Sun, Jun 21 2015 1:44 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement
Advertisement