Local organizations
-
‘స్థానిక’ రిజర్వేషన్లపై తీర్పు వాయిదా
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28న జారీచేసిన జీఓ 176ను సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై గురువారం సీజే నేతత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. జనాభా లెక్కించాకే రిజర్వేషన్లు.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డితో పాటు మరికొందరు వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని, కాని బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి జనాభాను లెక్కించాలన్నారు. ఇవేమీ చేయకుండానే బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారన్నారు. పంచాయతీరాజ్ శాఖ సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయడం చట్ట విరుద్ధమన్నారు. జనాభా పెరిగినా.. 34 శాతమే రిజర్వేషన్లు అనంతరం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు ఏ సందర్భంలో చెప్పిందో ఆయన ధర్మాసనానికి వివరించారు. తాము బీసీ లెక్కలను తేల్చి వాటి ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశామన్నారు. బీసీ ఓటర్లు 48.13 శాతమని.. అయినప్పటికీ తాము వారికిచ్చింది 34 శాతం రిజర్వేషనేనని చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా పంచాయతీ ఎన్నికలు పెట్టి తీరాలని, లేని పక్షంలో కేంద్ర నిధులు ఆగిపోతాయని ఆయన కోర్టుకు నివేదించారు. -
ప్రత్యేక అధికారులు!
సాక్షి, చెన్నై : స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో సాగిన ఈ భేటీలో ఇందుకు తగ్గ ప్రత్యేక చర్చ సాగింది. అలాగే, కావేరి చర్చ, స్థల రిజిస్ట్రేషన్లు, ఈశాన్య రుతు పవనాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా ముందు జాగ్రత్తలకు సిద్ధం అవుతూ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీ తదుపరి మంత్రులందరూ తమ తమ శాఖల సమీక్షల్లో బిజీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృష్ట్యా, ఆమె పరిధిలో ఉన్న శాఖలన్నీ ఆర్థిక మంత్రి ఓ.పన్నీరు సెల్వం గుప్పెట్లోకి చేరిన విషయం తెలిసిందే. ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు ఇందుకు తగ్గ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సమస్యలు, డిమాండ్లు చుట్టుముట్టి ఉండడంతో వాటిని ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రం సిద్ధం చేసుకొనేందుకు పన్నీరు నిర్ణయించారు. ఇందు కోసం కేబినెట్ భేటీకి పిలుపు నిచ్చారు. బుధవారం సచివాలయంలో పన్నీరు సెల్వం నేతృత్వంలో ప్రప్రథమంగా భేటీ సాగింది. ఇందులో మంత్రులందరూ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, సలహాదారు షీలా బాలకృష్ణన్‌లు కూడా హాజరయ్యారు. ప్రధానంగా స్థానిక ఎన్నికల రద్దు అంశంపై ప్రత్యేక చర్చ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎన్నికల రద్దు స్టే ఎత్తివేతకు కోర్టు నిరాకరించడం, అందుకు తగ్గ పిటిషన్ నాలుగు వారాలకు వాయిదా పడి ఉన్నందున, ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారుల నియామకం అనివార్యమైంది. ప్రస్తుత స్థానిక ప్రతినిధుల పదవీ కాలం ఈనెల 24తో ముగియనుంది. దీనికి సంబంధించి సాగిన చర్చలో ప్రత్యేక అధికారుల నియామకాలకు తగ్గట్టు అత్యవసర చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఇక, రాష్ట్రంలో రగులుతున్న కావేరి రచ్చను చల్లార్చేందుకు తగ్గట్టుగా, కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా ప్రత్యేక కార్యచరణకు నిర్ణయించినట్టు సమాచారం. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీకి పట్టుబడుతూ ప్రతి పక్షాలన్నీ ఉద్యమిస్తున్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణాల దృష్ట్యా కీలక నిర్ణయంతో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు తగ్గ వ్యూహ రచన ఈ భేటిలో సాగింది. అలాగే, ఇంటి స్థలాల విక్రయం కోర్టు ఉత్తర్వుల మేరకు ఆగడంతో అందుకు తగ్గ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషనకు నిర్ణయించి ఉన్నారు. అలాగే, కోర్టు ముందు ఉంచాల్సిన వాదన గురించి సమీక్షించినట్టు తెలిసింది. ఇక, మరి కొద్ది రోజుల్లో ఈశాన్య రుతు పవనాల ప్రవేశంతో వర్షాలు ఆశాజనకంగా ఉండబోతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై సమాలోచించారు. పాలనా పరమైన వ్యవహారాలపై వేగం పెంచేందుకు తగ్గ నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. గంట పాటుగా సాగిన ఈ భేటీ అనంతరం మంత్రులు తమ ఛాంబర్లకు పరుగులు తీశారు. తమ శాఖల పరిధిలో అధికారులతో సమాలోచనల్లో బిజీ కావడం ఆలోచించ దగిన విషయం. అయితే ఇప్పటివరకు సీఎం జయలలిత కేబినెట్ సమావేశం నిర్వహించిన పక్షంలో, ఆ వివరాలను సమాచార శాఖ ప్రకటన రూపంలో విడుదల చేసేది. అయితే, కేబినెట్ వివరాలన్నీ గోప్యంగా ఉంచడం గమనార్హం. రాష్ర్ట ఇన్చార్జ్ గవర్నర్ విద్యా సాగర్ రావుతో చర్చించినానంతరం కాబోలు, బుధవారం సాయంత్రం స్థానిక సంస్థలపై తీసుకున్న నిర్ణయానికి తగ్గ ఉత్తర్వుల్ని ప్రకటించారు. ఈ మేరకు స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించారు. స్థానిక సంస్థల పర్యవేక్షణ ఆయా మండలాల వారిగా ప్రత్యేక అధికారుల ద్వారా సాగనుం ది. ఇలా ఉండగా, మంత్రి వర్గంలో చర్చకు ముందే, ప్రత్యేక అధికారుల ని యామకానికి ప్రత్యేక చట్టం, ఉత్తర్వులు సిద్ధమైనట్టు సమాచారం. తాజా గా ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఈ విషయం తేటతెల్లం అవుతోండడం గమనార్హం. -
‘గౌరవ’ నిరీక్షణ..!
స్వపరిపాలనలోనూ మారని తీరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందని గౌరవ వేతనం సింహభాగం అధికార పార్టీ వాళ్లే డిమాండ్ చేయలేకపోతున్న వైనం 11 నెలలు.. బకాయి రూ.9 కోట్లపైనే.. సాక్షి, మంచిర్యాల : స్థానిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతన కష్టాలు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వాల మాదిరిగానే.. స్వపరిపాలనలోనూ వారికి గౌరవ వేతనాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. పదకొండు నెలల నుంచి గౌరవ వేతనాలందక.. అధికారులను ప్రశ్నించినా ఫలితం లేక.. అటు ప్రభుత్వాన్నీ నిలదీయలేక మదనపడుతున్నారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధులంతా.. అధికార పార్టీకి చెందిన వారే ఉండడంతో అధికారులతో విన్నవించుకోవడమే తప్పా.. ప్రభుత్వాన్ని మాత్రం డిమాండ్ చేయలేకపోతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు మొత్తం 1607 మందికి వేతనాల రూపంలో రూ.9,51,50,000 రావాల్సి ఉంది. గౌరవ వేతనాలు భారీ మొత్తంలో రావాల్సి ఉండడంతో.. ఎప్పుడొస్తాయో...? అసలు వస్తాయో రావో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో అధికారుల్లోనూ స్పష్టత లేదు. లోటు బడ్జెట్ అరకొర గౌరవ వేతనాలతో ఆర్థికంగా చితికిపోతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచి.. సమాజంలో గౌరవం కల్పించేలా గతేడాది మార్చి 13న.. తెలంగాణ ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా వేతనాలు పెంచింది. పెంచిన వేతనాలు.. ఏప్రిల్ నుంచి ఇస్తూ వస్తోంది. దీంతో అప్పట్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రకటన అనంతరం.. వరుసగా ఆరు మాసాలపాటు వారికి గౌరవ వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత వెనక్కితగ్గింది. లోటు బడ్జెట్ కారణంతో వేతనాలు నిలుపుదల చేసింది. 11 మాసాల నుంచి గౌరవ వేతనాలు చేతికి అందకపోవడంతో ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేతనాల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌కు అత్యధికంగా నెలకు రూ.లక్ష చొప్పున 11 నెలలకు రూ.11లక్షలు అందాల్సి ఉంది. ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీకి నెలకు రూ.10 వేల చొప్పున 11 నెలలకు రూ.1.10 లక్షలు.. ఎంపీటీసీ, సర్పంచులకు నెలకు రూ.5 వేల చొప్పున 11 మాసాలకు రూ.55 వేల గౌరవ వేతనాలు అందాల్సి ఉంది. అయితే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు మాత్రం రెండు, మూడు నెలలకోసారి గౌరవ వేతనాలు అందుతున్నాయి. ప్రస్తుతం వేతన బకాయిలు లేవు. కానీ.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలందకపోవడంతో ప్రభుత్వం వివక్ష చూపుతోందనే భావన వారిలో నెలకొంది. వేతనాల పెంపుతో.. ప్రభుత్వంపై ప్రతి నెల రూ.68,30,200 చొప్పున ఏటా రూ.8,19,62,400 భారం పడింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ కార్మికులకు 44 వాతం ఫిట్మెంట్ ఇస్తుండడం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రభుత్వంపై మోయలేని ఆర్థిక భారం పడి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని ఓ ప్రజాప్రతినిధి చెప్పారు. గౌరవం ఇచ్చినట్టే ఇచ్చి.. ఏడాదిన్నర క్రితమే ప్రభుత్వం మాకు గౌరవ వేతనాలు భారీగా పెంచింది. అప్పట్లో అందరం సంబరపడ్డాం. ఇకపై ప్రతినెలా పెంచిన వేతనాలు అందుతాయని భావించాం. కానీ ఆ సంతోషం కొన్నాళ్లకే పరిమితమైంది. ఆరు నెలల వరకు గౌరవ వేతనాలిచ్చిన ప్రభుత్వం తర్వాత మమ్ముల్ని మరిచిపోయింది. 11 నెలల నుంచి గౌరవ వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నం. - అర్కాల హేమలత, ఆవడం సర్పంచ్, నెన్నెల మండలం -
చేతి చమురు వదుల్తోంది..
స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలికి జరగాల్సిన ఎన్నికలకు షెడ్యూల్ ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు మాత్రం ఇప్పటి నుంచే సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోందని లబోదిబోమంటున్నారు. నల్లగొండ జిల్లాలో అయితే ఓ పార్టీ అభ్యర్థి (టికెట్ ఖరారైంది) ఓటర్లుగా ఉన్న ప్రజా ప్రతినిధులకు డబ్బులు కూడా ముట్టజెప్పారు. అయినా జిల్లాలో పర్యటించాలంటేనే ఆయన హడలిపోతున్నారు. ఎన్నికలు వచ్చేదాకా తమ ఖర్చులు భరించాల్సిందే అంటున్నారు ఓటర్లు. పెళ్లిళ్లకు, పండగలకు, ఉత్సవాలకు ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందో... ఎమ్మెల్సీ పదవి లేకున్నా బాగుండేదని సన్నిహితులతో వాపోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేవరకు ఎంత చమురు వదిలించుకోవాల్సి వస్తుందో అంటూ పోటీ చేయాలనుకుంటున్నవారు తెగ బాధపడిపోతున్నారు. -
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జడ్పీటీసీల ఫోరం మండిపాటు 21న జడ్పీ కార్యాలయాల వద్ద నిరసన హైదరాబాద్: స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ జడ్పీటీసీల ఫోరం ఆరోపించింది. హక్కులను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ నిమిత్తం శుక్రవారమిక్కడ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు అభివృద్ధి నిధులు కేటాయించాలని, జడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే విధంగా తగిన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు మాదిరిగానే జడ్పీటీసీలకు ఏటా రూ.25లక్షల సీడీపీ నిధులు, నెలకు రూ.25వేల వాహన అలవెన్స్, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక చాంబర్, ప్రతి జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద ఏటా రూ.10కోట్లు ప్రభుత్వం కేటాయించాలని సమావేశంలో తీర్మానించారన్నారు. జడ్పీటీసీలకు పెంచిన గౌరవ వేతనం ఐదు నెలలుగా అందడంలేదని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా, చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ఫోరం గౌరవాధ్యక్షుడు ఏనుగు జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు తానాజీరావు, అంజయ్య, నారాయణరెడ్డి, అధికార ప్రతినిధి రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్ ఎత్తివేత
సాక్షి, విశాఖపట్నం : స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో ఈసీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్టు కలెక్టర్ యువరాజ్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3న ఎన్నికలు, 7న కౌంటింగ్ జరగాల్సి ఉంది. కానీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో పప్పల చలపతిరావు, ఎంవీవీఎస్ మూర్తిలకు ఎన్నిక ధ్రువ పత్రాలను ఆర్వో జె.నివాస్ అందజేశారు. దీంతో ఎన్నికల తంతు ముగిసినట్టేనని ప్రకటించిన ఆర్వో కోడ్ ఎత్తివేత విషయమై ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వడంతో రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన జిల్లాల్లో కోడ్‌ను ఎత్తివేసినట్టేనని ప్రకటించారు. ఈ మేరకు నేటి నుంచి పాలనాపరమైన విధుల్లో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పాల్గొంటుందని కలెక్టర్ తెలిపారు. -
వీడని సస్పెన్స
- ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న జాప్యం! - ‘బాస్’ దృష్టంతా ‘ఓటుకు నోటు’పైనే! - నేరుగా ప్రకటించినా ఆశ్చర్యం లేదంటున్న నేతలు సాక్షి, విజయవాడ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్న నేతలంతా హైదరాబాద్‌లో మకాం వేసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో రెండు సీట్లకు ఎన్నికలు జరగనుండగా ముగ్గురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో ఎవరికి ఇవ్వాలనే అంశంపై తర్జనభర్జన జరుగుతోంది. ‘బాస్’ దృష్టంతా ఓటుకు నోటుపైనే.. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీబీఐ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరగడంతో ముఖ్యమంత్రి సహా ముఖ్య నేతలంతా ఆ వ్యవహారంలో తలమునకలయ్యారని హైదరాబాద్‌లో మకాం వేసిన పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ఇతర నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని, దీనివల్లే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. శనివారం కర్నూలు, విశాఖపట్నం జిల్లా నేతలతో మాత్రం కొద్దిసేపు మాట్లాడారని తెలిసింది. నామినేషన్లకు ఇంకా మూడు రోజులు వ్యవధి ఉండటంతో ఈ విషయాన్ని పక్కనపెట్టి ఓటుకు నోటు వ్యవహారంపైనే సీఎం బిజిబిజీగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణాజిల్లాకు చెందిన నేతల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేద ని సమాచారం. అయితే, జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటంతో నేరుగా అభ్యర్థులను ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. చివరి నిమిషం వరకు ఆశావహులందరి పేర్లు పరిశీలించి, సీటు ఇవ్వలేని వారితోనూ మాట్లాడిన తరువాత జాబితా ప్రకటించడం ఆనవాయితీ అని, అదేవిధంగా ఈసారీ చేస్తారని ఆ పార్టీ నేతలు పలువురు చెబుతున్నారు. -
కొర్రీ వర్రీ!
కార్పొరేషన్ గ్రాంట్‌కు ఏలికల మెలిక పాత బకాయిలు వసూలుచేస్తేనే నిధులు రూ. 22.19 కోట్లు రావాల్సింది ప్రభుత్వాల నుంచే అయోమయంలో అధికారులు విజయవాడ సెంట్రల్ : స్థానిక సంస్థలు తామిచ్చే నిధులపై ఆధారపడకూడద ని పదేపదే చెబుతున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఆస్తి పన్ను నూరు శాతం వసూలుచేయడంతోపాటు పాత బకాయిలు రాబట్టనట్లయితే గ్రాంట్‌ను నిలిపివేస్తామంటూ తాజాగా జీవో జారీ చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.74.60 కోట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.55 లక్షలు వసూలైంది. మిగిలిన రూ. 19.60 కోట్లను ఈ నెలాఖరులోగా వసూలుచేయాల్సి ఉంది. ఏటా 90 నుంచి 95 శాతం మేర పన్నులు వసూలవుతున్నాయి. కాబట్టి ఆస్తి పన్ను డిమాండ్ లక్ష్యాన్ని చేరుకుంటారనడంలో ఎలాంటి అనుమానం లేదు. వచ్చిన చిక్కల్లా మొండి బకాయిలతోనే. మొహం చాటేసిన మంత్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 22.19 కోట్ల మేర ఆస్తి పన్ను రావాల్సి ఉంది. 1995 నుంచి బకాయిలు పేరుకుపోయాయి. వీటిని రాబట్టేందుకు మేయర్ కోనేరు శ్రీధర్ రాష్ట్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే చూద్దామన్న వారు ఆచరణలో రిక్తహస్తం చూపారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి రూ.8 కోట్ల 19 లక్షల 56 వేల 740 రావాల్సి ఉంది. 2001 నుంచి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. సేవలు, సర్దుబాటు విషయమై గతంలో కార్పొరేషన్, రైల్వే అధికారుల మధ్య చర్చలు జరిగాయి. 50 శాతం చెల్లించాల్సిందిగా కార్పొరేషన్ కోరగా, 30 శాతానికి మించి చెల్లించలేమని రైల్వే అధికారులు పేచీకి దిగారు. ఇలాంటి మొండి సమస్యలు కార్పొరేషన్‌ను పట్టిపీడిస్తుంటే గ్రాంటు ఆపేస్తాననడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సర్కార్ బకాయిల మాటేమిటి? రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే నగరపాలక సంస్థ పరిధిలో 22 శాఖలకు సంబంధించి 189 అసెస్మెంట్ల నుంచి రూ.13 కోట్ల 67 లక్షల 97 వేల 493 వసూలుకావాల్సి ఉంది. ఏటా కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు అందిస్తున్న ఆస్తి పన్ను డిమాండ్‌ను ఆయా శాఖలు బుట్టదాఖలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ స్పందన అంతంతమాత్రమే. వివిధ కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారమైతే మరో రూ.8 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎరి యర్స్ వసూలైతేనే గ్రాంట్ ఇస్తామని ప్రభుత్వం మెలిక పెట్టడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. స్పెషల్‌డ్రైవ్.. దీర్ఘకాల పన్ను బకాయిలు ఉన్న గృహాలు, వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. బకాయిదారుల జాబితాను కార్పొరేషన్ వెబ్సైట్లో ఉంచిన అధికారులు గురువారం నుంచి ప్రత్యక్ష దాడులకు దిగారు. సర్కిల్-2 పరిధిలో ఎప్పట్నుంచో బకాయిలున్న గృహా లకు నీటి కనెక్షన్లు తొలగించారు. పూర్ణానందంపేటలో నాలుగేళ్లుగా పన్ను చెల్లించని గృహాన్ని, గవర్నర్‌పేటలోని వ్యాపార సం స్థను సీజ్ చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో రూ.10,93,216 వసూలు చేసినట్లు ఏసీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. -
సీనరేజీ ఎగనామం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆయా మండలాల పరిధుల్లో ఇసుక, మట్టి, తదితర ఖనిజ నిక్షేపాల తవ్వకాలపై వసూలు చేస్తున్న రాయల్టీలోంచి మండల, జిల్లా పరిషత్‌లకు చెల్లించాల్సిన 25శాతం సీనరేజీపై ప్రభుత్వం దాగుడుమూతలాడుతోంది. గత ఐదేళ్లలో జిల్లాకు సీనరేజీ రూపంలో రూ.51.10 కోట్లు ఇవ్వాల్సివుండగా, ఇప్పటివరకు కేవలం రూ.16.30 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంట్లో జిల్లా పరిషత్‌కు రూ.5.68 కోట్లు, మండల పరిషత్‌లకు 10.62 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. స్థానిక సంస్థల పరిపుష్టికి దోహదపడే ఈ నిధులను విడుదల చేసే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అట్టిపెట్టుకున్న నిధులను విడుదల చేయాలని కోరుతూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా సాయపడే సీనరేజీని బదలాయించాలని ఆమె కోరారు. రూ.200 కోట్లు.. నగర శివార్లను కలుపుతూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) 162 కిలోమీటర్ల పొడవునా ఔటర్‌రింగ్ రోడ్డును నిర్మించింది. ప్రతిష్టాత్మకంగా అత్యున్నత ప్రమాణాలతో రూపకల్పన చేసిన ఈ మార్గం నిర్మాణానికి మట్టి, ఇసుక, కంకరను జిల్లా నుంచి వినియోగించుకున్నారు. దీంతో ఈ క్రమంలోనే దాదాపు రూ.255 కోట్ల మేర సీనరేజీని కాంట్రాక్టు సంస్థల నుంచి హెచ్ఎండీఏ వ సూలు చేసింది. అయితే, ఈ నిధులను స్థానిక సంస్థలకు బదలాయించకుండా మొండికేసింది. రింగ్‌రోడ్డు పక్క ప్రాంతాల్లో అడ్డగోలుగా మట్టిని తీయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై జిల్లా ప్రణాళిక సంఘం కమిటీ సమావేశంలో నిలదీశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఈ అంశంపై ఆందోళన ప్రకటించడంతో దిగివచ్చిన సర్కా రు.. రూ.55 కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్మును మాత్రం ఇప్పటి కీ మంజూరు చేయకపోవడం గమనార్హం. రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు రాయల్టీని కట్టినా.. ప్రభుత్వం మాత్రం సీనరేజీ రూపంలో స్థానిక సంస్థలకు బదలాయించాల్సిన నిధుల విషయంలో దిగిరాకపోవడం గమనార్హం. -
పైరవీల జోరు
సాక్షి, మంచిర్యాల : తాజాగా జరిగిన పరిషత్, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం తదుపరి ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. గెలిచిన నాయకులు ఏర్పడబోయే ప్రభుత్వంలో ప్రముఖ పదవులపై కన్నేస్తే.. ఓడిన నేతలు తమకు పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. దీంతోపాటు టీఆర్ఎస్ అగ్రనాయకత్వం పలువురితో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కారు జోరు స్పష్టంగా కొనసాగింది. పెద్ద ఎత్తున కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను భారీ మెజార్టీతో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌన్సిలర్లుగా గెలిచిన వారు మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠం కోసం ఇప్పటికే క్యాంపులో ఉన్నారు. దీంతోపాటు పెద్దల అనుగ్రహం కావాలని పార్టీ అగ్రనాయకత్వంను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని ఇటీవల జరిగిన టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం రోజు, ఆ మరుసటి రోజు పార్టీ ముఖ్యులు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లను కలిశారు. ఇదే రీతిలో జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్ స్థానాలపై కన్నేసిన నాయకులు తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. క్యాంపు రాజకీయాలకు తోడు తమకు ఆశీస్సులు అందించాలని నేతలకు విన్నవించుకుంటున్నారు. మీకు అండగా పార్టీ ఉంది.. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన వారిని టీఆర్ఎస్ అగ్రనాయకత్వం సముదాయించే పనిలో పడింది. సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను టీఆర్ఎస్ ముఖ్యులు ప్రత్యేకంగా పిలిపించినట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ ఆయనతో మాట్లాడినట్లు తెలంగాణభవన్ వర్గాలు పేర్కొన్నా యి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక న్యాయం చేస్తాం. నామినేటెడ్ పదవుల విషయంలో మీ పేరు మొదటి ప్రాధాన ్యంలో ఉంటుంది అని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ కూడా భరోసా ఇచ్చినట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. మాకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు.. జిల్లా నుంచి రెండు, మూడో దఫా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మంత్రిపదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మంత్రిమండలిలో బెర్తు ఖాయమని వారు విశ్వసిస్తున్నారు. ఈ మేరకు పలువురు హైదరాబాద్‌లోనే ఉండి లాబీయింగ్ నడుపుతున్నారు. ఇదిలా ఉంటే భవిష్యత్తులో భర్తీ అయ్యే నామినేటెడ్ పదవుల కోసం కర్చీప్ వేసుకునేందుకు పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటి నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్, డెరైక్టర్ వంటి పదవుల కోసం పైరవీలు మొదలెట్టారు. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో రద్దయిన నామినేటెడ్ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమ వంతుగా ముందస్తు ప్రయత్నం చేసుకుంటున్నారు. -
సీటు కోసం హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో తెలుగుదేశం నాయకుల పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఉన్న నాయకులకు సీట్లు ఇవ్వడానికి అధిష్టానం ఆసక్తి చూపకపోవడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. మార్కాపురం సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మళ్లీ సీటు కోసం చంద్రబాబు నాయుడు నివాసం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఆయనకు స్పష్టమైన హామీ లభించడం లేదు. చంద్రబాబు నాయుడు స్వంత పార్టీ నాయకులను పూర్తిగా నమ్మడం లేదని ఆపార్టీకి చెందిన నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసినా కందుల నారాయణరెడ్డి అభ్యర్థిత్వంపై చంద్రబాబు నాయుడు ఆసక్తి కనబరచడం లేదని తెలిసింది. కందులను వదించుకోవడానికి మార్కాపురం సీటును బీసీకి కేటాయిస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసారి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న కందుల నారాయణ రెడ్డికి స్పష్టమైన హామీ లభించకపోయినా, త్వరలో తనకు సీటు కేటాయిస్తారని చెప్పుకుంటున్నారు. అయితే ఆ స్థానాన్ని బీసీ నాయకుడు యిమ్మడి కాశీనాథ్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం తెలుగుదేశంలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాయకుడు కావడంతో, ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు కోటరీలోని ఒక వర్గం ఆశిస్తోంది. దీంతో పాటు కాశీనాథ్ స్థానిక బీసీ సంఘాలకు నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకు జిల్లా నేత కరణం బలరాం ఆశీస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కందులకు నియోజకవర్గంలో మంచి పేరు లేదని కరణం బలరాం వర్గం భావిస్తోంది. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కందుల నియోజకవర్గానికి చేసింది శూన్యమని, పార్టీని కూడా బలోపేతం చేసుకోలేకపోయాడని దీంతో ప్రజల్లో ఆయనకు మంచి పేరు లేదని చంద్రబాబుకు నూరిపోసినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలను కూడా దూరంగా పెడుతూ వచ్చారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే జిల్లాలో ఏకైక తెలుగుదేశం ఎమ్మెల్యేగా పార్టీ పరువు కాపాడిన నాయకుడు కందుల నారాయణరెడ్డి అని, ఆయనకు సీటు ఇవ్వకపోతే ప్రజల్లో పార్టీ పట్ల దురభిప్రాయం ఏర్పడుతుందని అంటున్నారు. మార్కాపురంలో ైవె ఎస్సార్ కాంగ్రెసు అభ్యర్థులను ఎదుర్కొనే నాయకుడి కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. -
పార్టీలకు యూనియన్ల ఝులక్
శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : సింగరేణి పరిధి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మునిసిప ల్, సార్వత్రిక ఎన్నికల్లో గని కార్మికుల ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థుల ను గెలిపించుకోవాలంటే పార్టీలు యూనియన్లపైనే ఆధారపడాలి. ఓటర్లను ప్రభావితం చేయడంలో కార్మిక సంఘాల పాత్ర ఎంతో ఉంటుంది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు వాటి అనుబంధ కార్మిక సంఘాల నేతలు ఏమాత్రం సహకరించడం లేదు. ఎన్నికల ప్రచారానికి ఆయా సంఘాల నేతలు దూరంగా ఉంటున్నా రు. దీంతో అభ్యర్థులు ఆందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా సింగరేణిలో అతిపెద్ద డివిజన్ అయిన శ్రీరాంపూర్‌లో ఈ పరిస్థితి నెలకొంది. టీబీజీకేఎస్‌లో గ్రూపుల తలనొప్పి సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)లో నెలకొన్న అంతర్గత నాయకత్వ సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ మద్దతిచ్చిన మల్లయ్య వర్గం ఓడిపోవడం, పార్టీకి సంబం ధం లేదన్న రాజిరెడ్డివర్గం గెలుపొందింది. తరువాత క్రమంలో రాజిరెడ్డి వర్గం కూడా టీఆర్ఎస్ అధ్యక్షుడిని కలిసి పార్టీకి టచ్‌లో ఉండటం తో మల్లయ్య శిబిరంలో ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఈ రెండు గ్రూపులను సమన్వయం చేయడం స్థానిక పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ఏ వర్గం నేతలు కూడా పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనడం లేదు. మల్లయ్య వర్గం మద్దతు తీసుకుంటే రాజిరెడ్డి వర్గం వ్యతిరేకం అవుతుంది. రాజిరెడ్డి వర్గం మద్దతు తీసుకుందామంటే మల్లయ్య వర్గం నుంచి సహకారం ఉండదు.. ఎటోచ్చి కొంప మునుగుతుందనే ఆందోళన పార్టీ నేతల మెదళ్లను తొలుస్తోంది. ఇదిలా ఉంటే మంచిర్యాల మండలంలో టీఆర్ఎస్, సీపీఐ పొత్తు ఉంది. మొత్తం 31 స్థానాలు ఉంటే అందులో కోల్‌బెల్ట్‌లో ఆరు స్థానాలను సీపీఐకి ఇచ్చారు. ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకోసం టీబీజీకేఎస్ నేతలు ప్రచారం చేయకున్నా ఏఐటీయూసీ నేతలు అక్కడక్కడా ప్రచారం చేయడం గమనార్హం. ఐఎన్టీయూసీలోనూ అదే పరిస్థితి సింగరేణిలో ఒకప్పుడు ఐఎన్టీయూసీ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఐఎన్టీయూసీ అనే విధంగా ఉండేది. ఏడాదిన్నర కాలంగా పార్టీకి, యూనియన్‌కు మధ్య సమన్వయం లోపించిం ది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి కాంగ్రెస్‌కు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు ప్రకటన చేయడంతో పార్టీకి, యూనియన్‌కు మధ్య వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఐఎన్టీయూసీ శ్రే ణులు ప్రేంసాగర్‌రావుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నా రు. అంతే కాకుండా కోల్‌బెల్ట్‌లో తాము సూచించిన వారికి టికెట్ ఇవ్వలేదని డివిజన్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఆ కోపాన్ని కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా చూపుతూ అభ్యర్థులకు సహకరించడం లేదు. దీంతో ఎన్నికల్లో ప్రత్యర్థులకు లాభం చేకూరుతుందని పార్టీ శ్రేణులు ఆందోళ న చెందుతున్నాయి.