
ఎగిసిన నిరసన సెగలు
విజయనగరం కంటోన్మెంట్: సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు రోడ్డెక్కాయి. నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తున్నందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపుపై విరుచుకుపడ్డాయి. వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టాయి. జిల్లా కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులంతా కలెక్టరేట్‌కు చేరుకుని పోర్టికో ఎదుట బైఠాయించారు. మీడియా స్వేచ్ఛను హరించడం దారుణమన్నారు.
అక్కడి నుంచి ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు బంగ్లాకు చేరుకుని వినతిపత్రాన్ని అందజేశారు. వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు ఎస్.మల్లికార్జున రావు, వేదుల సత్యనారాయణ, పి.ఎస్.ఎస్.వి.ప్రసాద్, జె.ఆదినారాయణ, ఎం.ఎం.ఎల్.నాయుడు, రాజు ప్రయాగల, కె.అప్పారావు, పి.నాగరాజు, ఎల్.నరసింగరావు, వై.ఎస్.పంతులు తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలిలో గాంధీ విగ్రహం విలేకర్లు నిరసన చేపట్టారు. జల్లు వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కందుల శ్రీనివాసరావు, రంపా రాజమోహన్, వేణుగోపాల రావు, చుక్క జగన్మోహన రావు, ఎలక్ట్రానిక్‌మీడియా ప్రతినిధులు రమేష్, బాబ్జీ తదితరులు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు.
సాలూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారిని సీఐ జి.రామకృష్ణ, ఎస్సై టి.రామకృష్ణ అడ్డుకున్నారు. అక్కడి నుం చి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధర్నా నిర్వహిం చారు. సాలూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, సెక్రెటరీ జీటీ నాయుడుల ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ కృష్ణం రాజుకు వినతిపత్రం అందజేశారు.
కురుపాంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో మౌన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కె.చంద్రమౌళి తదితరుల ఆధ్వర్యంలో ఆర్‌ఐ రమేష్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు మౌనదీక్ష చేపట్టారు. గుమ్మలక్ష్మీపురంలో ఆర్‌ఐ కు వినతిపత్రం ఇచ్చారు.
కొత్తవలసలోప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సాక్షి ప్రసారాల నిలిపివేతపై నిర సన చేపట్టారు. స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టి, వినతి పత్రాన్ని అందజేశారు.
నెల్లిమర్లలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులంతా నిరసన చేపట్టారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో హెచ్‌సి అప్పారావుకు ఆల్తిశ్రీనివాసరావు వినతిపత్రాన్ని అందించారు. భోగాపురంలో ఏపీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంపాన రవివర్మ ఆధ్వర్యంలో భోగాపురం ప్రెస్ క్లబ్, పూసపాటి రేగ, డెంకాడ మండలాలకు చెందిన విలేక ర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కె.లకా్ష్మరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
గజపతినగరంలో ఎస్.వెంకట రమణ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్సై వరప్రసాద్ వచ్చి వారించడంతో పాత్రికేయులంతా కాసేపు ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. గంట్యాడ మండలంలో సుంకరి లెనిన్ ఆధ్వర్యంలో విలేకర్లంతా తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి, తహసీల్దార్ డి బాపిరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు.
పార్వతీపురంలో జర్నలిస్టుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, పార్టీ నాయకులు గర్భాపు ఉదయభాను, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పి.రంజిత్ కుమార్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు శ్రీనివాసరావు, నాగు, రామారావు, పూడి శంకర్రావు, నవీన్, వంగల దాలినాయుడు తదితరుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. సీతానగరంలో నిరసన చేపట్టారు.