'చుండూరు' కేసులో దోషులకు శిక్ష రద్దు
హైదరాబాద్: 1991 నాటి చుండూరు దళితుల ఊచకోత కేసులో దోషులకు ఊరట లభించింది. వారికి కింది కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు రద్దు చేసింది. చుండూరులో సంబరాలు చేసుకోకుండా చూడాలని గుంటూరు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలు తరలించాలని సూచించింది.
చుండూరులో దళితుల ఊచకోతపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ, అలాగే 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ 2007లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ అటు బాధితులు, ఇటు శిక్ష పడిన నిందితులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.