ఏపీలో పెట్టుబడులు సురక్షితం
ఒకాసా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన రాష్ట్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెట్టుబడులు లాభదాయకమని, ఏపీ లో మరింత లాభదాయకంగా, సురక్షితంగా ఉంటాయని ఒకాసా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో సీఎం చెప్పారు. జపాన్‌లో రెండోరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం ఉదయం నుంచే క్యోటోలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం అక్కడి నుంచి ఫ్యూకుయొకో నగరానికి బుల్లెట్ రైలులో వెళ్లారు. బాబు పర్యటన వివరాలను ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం హైదరాబాద్‌లో పత్రికలకు విడుదల చేసింది. ఒకాసా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో, పెనాసోనిక్ కంపెనీని సందర్శించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.
విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పెనసోనిక్ ప్రతినిధులను చంద్రబాబు ఆహ్వానించారు. జపాన్‌లో భారత్ రాయబారి దీపా గోపాలన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జపాన్ కంపెనీలకు ఏపీ అనువైన గమ్యస్థానంగా పేర్కొన్నారు. ఇలావుండగా జపాన్‌లోని ఫార్మా, నైపుణ్యాభివృద్ధి, మౌలికసదుపాయాల కల్పన, కన్సల్టెన్సీ కంపెనీలతో చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఏపీలో పెట్టుబడుల అవకాశాలు, సహజ వనరుల లభ్యతపై బాబు పవర్‌పాయింట్ ప్ర జంటేషన్ ఇచ్చారు. పర్యటనలో మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులున్నారు. కాగా జపాన్‌లో పా రిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంపై సంతోషం వ్యక్తం చేస్తూ బాబు ట్వీటర్‌లో సందేశం పోస్ట్ చేశారు.
విద్యుత్ కొనుగోలుకు ప్రాధాన్యమివ్వండి: సీఎం ఆదేశం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన విద్యుత్ కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళిక రూపొం దించాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌ను ఆదేశించారు. క్యోటో నుంచి పుకువొకాకు బుల్లెట్ ట్రైన్‌లో వెళ్తున్న సమయంలో సీఎం అజయ్ జైన్‌తో ప్రత్యేకంగా విద్యుత్ పరిస్థితిపై సమీక్షించారు. పరిశ్రమ ల ఏర్పాటు వేగంగా జరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు ప్రాధాన్యమివ్వాలని, ముందే కారిడార్‌ను బుక్ చేసుకోవాలని సీఎం సూచించినట్లు ఆజయ్ జైన్ జపాన్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి కి తెలిపారు. గంటకుపైగా జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులు, వి ద్యుత్ పంపిణీ నష్టాల నివారణకు ప్రణాళి కలు రూపొందిస్తున్నామని సీఎంకు తెలిపా రు. హిందూజాతో ఈ నెల 29లోగా పీపీఏ జరుగుతుందని, దీంతో రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి మెరుగవుతుందని వివరించారు.