ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాద రావు, మధుసూదనాచారి సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాద రావు, మధుసూదనాచారి సమావేశమయ్యారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు, ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలు రెండూ ఒకేసారి భేటీ అయితే తలెత్తే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.