సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దేవీపట్నం మండలం మంటూరు దగ్గర గోదావరిలో లాంచీ మునిగింది. సుడిగాలిలో చిక్కుకుని లాంచీ మునిగిపోయింది. ప్రమాద సమయంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. అప్రమత్తమైన 20 మంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో 40మంది గల్లంతయ్యారు. లాంచీలో పెళ్లి బృందం ఉన్నట్లు సమాచారం.
పోలవరం నుంచి కొండమొదలు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. లాంచీ నిర్వహకుడు దేవీపట్నం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లాంచీ లక్ష్మీవెంటేశ్వర సర్వీస్‌కు చెందినదని సమాచారం. ప్రయాణికుల హాహాకారాలు విన్న గిరిజనులు నాటు పడవలో వెళ్లి.. సహాయక చర్యలు చేపడుతున్నారు. మిగతా ప్రయాణికుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే గోదావరి లాంచీలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ అదే ప్రాంతంలో లాంచీ నీటమునగడం ఆందోళన రేపింది.
గోదావరిలో లాంచీ మునక ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందజేయాలని ఆదేశాలిచ్చారు.
గోదావరిలో మరో లాంచీ ప్రమాదం
Published Tue, May 15 2018 6:57 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment