
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను మోసం చేసిందని, స్వామిజీ, పీఠాధిపతులను అవమానించిన ప్రభుత్వం ఇదేనంటూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ మండిపడ్డారు. అన్ని వర్గాలను దగా చేస్తోందీ ప్రభుత్వమని విమర్శించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి వైఎస్సార్‌సీపీ సముచిత స్థానం కల్పించిందన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్‌కు వెయ్యి కోట్ల నిధలు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐవైఆర్ కృష్ణారావు, రమణ దీక్షితులను ఎలా అవమానపాలు చేశారో అందరికీ తెలుసన్నారు.
అర్చకులకు 65ఏళ్ల సర్వీస్, వంశపారపర్యంగా అర్చకత్వపు హక్కు కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చిందని ప్రధాన కార్యదర్శి కోడూరి సతీష్ శర్మ అన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్ నిధులను కూడా టీడీపీ పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. ఏపిలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా తమకు టీడీపీ ఇవ్వలేదన్నారు. విజయవాడలో బ్రాహ్మణసామాజిక వర్గానికి చెందిన వైద్యుడిపై బొండా ఉమా దౌర్జన్యం చేశారన్నారు.