ఏలూరు :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 4న జిల్లాకు రానున్నారు. తణుకు మండలం వేల్పూరులో జరిగే జన్మభూమి-మా ఊరు సభకు సీఎం హాజరవుతారు. మధ్యా హ్నం 2గంటలకు తూర్పుగోదావరి నుంచి మన జిల్లాకు వస్తారు. సీఎం పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాకు రావడం ఇది ఎనిమిదోసారి. 20 రోజుల వ్యవధిలోనే సీఎం మళ్లీ జిల్లాకు వస్తున్నారు.
పక్కా ఏర్పాట్లు చేయండి
సీఎం పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి అనుబంధంగా పొలం పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, స్వచ్ఛాంధ్రప్రదేశ్, బడి పిలుస్తోంది అంశాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్‌ను వినూత్న రీతిలో ఏర్పాటు చేయాలన్నారు. వేల్పూరులో 9 ఎకరాల స్థలంలో నిర్మించే హౌసింగ్ ప్రాజెక్టు, విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ చెప్పారు. సభావేదిక, అక్కడి ఏర్పాట్ల బాధ్యతలను కొవ్వూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావుకు, హెలిప్యాడ్ నిర్మా ణం వంటి ఏర్పాట్ల బాధ్యతలను ఆర్ అండ్ బీ ఎస్‌ఈ పి.శ్రీమన్నారాయణకు అప్పగించారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరావు, డ్వామా పీడీ డీవీ రమణారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎ.శ్యామ్‌ప్రసాద్, సీపీవో కె.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీవ్వరి పాల్గొన్నారు.
4న సీఎం చంద్రబాబు రాక
Published Tue, Jun 2 2015 1:48 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM
Advertisement
Advertisement