సాక్షి, అమరావతి: ఏపీ డీజీపీ నియామకంపై సందిగ్ధత వీడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తోసుపుచ్చింది. ఏడుగురు అధికారులతో రాష్ట్రం పంపిన జాబితాను వెనక్కి పంపింది. అంతేకాకుండా ఆరునెలల లోపు రిటైర్డ్ అయ్యే వారిని పేర్లను తొలగించి తదుపరి జాబితా పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బిన్నభిప్రాయాలు రావడంతో ఢిల్లీలో బుధవారం జరగాల్సిన యూపీఎస్సీ కమిటీ సమావేశం వాయిదా పడింది.
దాదాపు 16 నెలలుగా ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా సాంబశివరావు వ్యవహరిస్తున్నారు. ఆయన డిసెంబర్ నెలాఖరులో సాంబశివరావు పదవీ విరమణ చేయనున్నారు. అయితే సాంబశివరావు కొనసాగింపునకే సీఎం చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం డీజీపీ రేస్‌లో ఠాకూర్, కౌముదిలు ఉన్నారు. అయితే కౌముది ఏపీ డీజీపీగా వచ్చేందకు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సాంబశివరావు కాలం పొడిగింపు లేకుంటే ఠాకూర్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment