సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో మరో 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది. ఈ వైరస్ నుంచి ఇప్పటివరకు 231 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, 31 మంది ప్రాణాలు కోల్పొయారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 835గా ఉంది. కాగా గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దూసుకువెళుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో పదిలక్షల మంది జనాభాకు 418 మందికి టెస్టులు, రాష్ట్రంలో 1, 147 టెస్టులు చేస్తున్నారు. (దూసుకెళ్తున్న ఏపీ)
లాక్‌డౌన్‌తోనే కరోనాకు అడ్డుకట్ట
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజ వేశాయని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులు చాలా వరకు అదుపులోనే ఉన్నాయని ఆయన చెప్పారు. మన దగ్గర కరోనా మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాలు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయని గుర్తు చేస్తూ.. కేవలం లాక్‌డౌన్ ద్వారానే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. (అవును.. మేము కరోనాపై గెలిచాం)
Comments
Please login to add a commentAdd a comment