కుల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు కమిషన్‌ | AP Government Forms A Commission For Solving Some Caste Certificates Issues | Sakshi
Sakshi News home page

కుల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు కమిషన్‌

Published Thu, Sep 5 2019 1:11 PM | Last Updated on Thu, Sep 5 2019 1:19 PM

AP Government Forms A Commission For Solving Some Caste Certificates Issues - Sakshi

సాక్షి, అమరావతి : పలు కులాల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జేసీ శర్మకు ఈ కమిషన్‌ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం సాంఘీక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బేడ, బుడగ జంగం కులాలను ఎస్సీ కేటగిరీలో చేర్చే అంశంపై, బోగస్‌ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లాలోని బెంతో, ఒరియా కులాలకు ఎస్టీ సర్టిఫికేట్‌ ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని, ఇతర కులాలవారు ఎస్సీ, ఎస్టీ తప్పుడు ధ్రువపత్రాలు పొందకుండా సూచనలు చేయాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement